Showing posts with label Philosophy. Show all posts
Showing posts with label Philosophy. Show all posts

Tuesday, September 1, 2015

దేశభక్తి - ఒక పరిశీలన


యోచనాశీలురైన పాఠక మిత్రులారా!
ముందుగా ఒక్కమాట! మనస్ఫూర్తిగా, మాట, చేతను కలుపుకొని, భారత దేశము నా మాతృభూమి, నేను భారతీయుణ్ణి, భారతీయులందరూ నా సహోదరులే అన్న రీతిని కనపరచగలవా? నిజంగా నీవిక్కడికి చేరిఉంటే, ఆ స్థాయికి చేరిన నీకుగాని, ఎవరికి గానీ దేశభక్తిని గురించి పెద్దగా చెప్పవలసిందేమీ ఉండదు. భావన చెప్పిన చొప్పిన, ఎంతెంతగా నడవగలమో చూసుకుంటూ, మరింతగా నడవడానికై ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ సాగుతుండడమే చేయవలసిందిగా ఉంటుంది.
మన ప్రస్తుత ప్రధాన విచారణీయాంశమైన 'మత ప్రచారాలు - మత మార్పిడులు - ముంచుకొస్తున్న మహోపద్రవం' అన్నదానికి సంబంధించిన ధారావాహిక వ్యాసపరంపరలో భాగంగానే, అద్దంకి రంజిత్‌ ఓఫిర్‌గారి, హైందవ క్రైస్తవాన్నీ, అలాి మరికొన్ని రచనలను శాస్త్రీయ విశ్లేషణకు లోనుచేయను మొదలెట్టుకున్నాం.
'హైందవ క్రైస్తవం' అన్న పుస్తకాన్ని ప్రచురించి, ప్రచారంలోకి తెచ్చిన ఓఫిర్‌గారు, అంతితో ఆగకుండా, ఈ పుస్తకములో తప్పులున్నాయని భారతదేశంలోని ఎవరు నిరూపించినా, హిందూధర్మ సంస్థలు తేల్చినా తాను హిందువునవుతానని ఛాలెంజ్‌ రూపంలో య్యూట్యూబ్‌ ద్వారా ఒక బహిరంగ ప్రకటన విడుదలచేశారు. ఆ పుస్తకంలో ఉన్నది సరైందేనని తాను నిరూపిస్తే, ఇతరులు తనవెంట క్రైస్తవంలో ప్రయాణించాల్సి ఉంటుందనీ అందులోనే ప్రకించారు. దానిపై నేను ఆ సవాలును స్వీకరిస్తున్నట్లు, ఎప్పుడు, ఎక్కడ విచారణకు కూర్చుందామో చెప్పమని రిజిష్టరు లేఖలు రెండు వ్రాశాను. ఆ క్రమంలో భాగంగా మరికొందరు ఆయన పుస్తకంతో విభేధిస్తున్నవారు, ఆయనకు ప్రతి సవాలుచేస్తూ చర్చకు ఆహ్వానించినట్లు మాకు తెలియపర్చారు.
నిజానికాయన, నిరంతర సత్యాన్వేషినని ఆ పుస్తకంలో ప్రకించినదాన్ని బ్టిగాని, అంత ధీమాగా, ఒకింత సాహసమేననక తప్పని రూపంలో చేసిన ఛాలెంజి ప్రకటన రీతినిబ్టిగానీ, మా ప్రతి సవాలు లేఖ అందిన వెంటనే ఆధునిక సాంకేతిక విజ్ఞానం అందుబాటులో ఉందికనుక, ఆ నిమిషంలో ఫోన్‌చేసి గాని, ఎస్‌ఎమ్‌ఎస్‌ చేసిగాని, ఎప్పుడోఎందుకు ఇప్పుడే ఇదిగో సిద్ధంగా ఉన్నాను. మీరెక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు నేను చర్చకు సిద్ధం అని స్పందించి ఉండాల్సింది. కానీ ఏ కారణాల వల్లనో రెండునెలలు దాినా ఆయననుండి సమాధానం (కబురు) రాలేదింతవరకు. ఇది రాస్తున్నది 30-9-2015వ తేదీన. ఆయనగారి హైందవ క్రైస్తవం పుస్తకాన్ని మరోసారి చదువుతూ ముగింపుకొచ్చిన సందర్భంలో అట్టచివర పేజీలోని నాలుగు మాటలు మళ్ళా కంటబడ్డాయి. రంజిత్‌ ఓఫిర్‌గారి గురించి వ్రాయబడ్డ సమాచారం ఉంది అందులో. ఆ చిన్న రచనాభాగంలో..
1. దేశభక్తి, దైవభక్తి సమపాళ్ళలో మేళవించిన కుటుంబంలో ప్టుారని
2. భారతీయ వేదాంత సారాన్ని నరనరాన జీర్ణించుకొని ఉన్నారని
3. 6 సం||ల పసిప్రాయంలోనే రామాయణాన్ని చదివి జీర్ణించుకున్నారని
4. 12 సం||లు వచ్చేనాికి మహాభారతం, భాగవతం, మొదలైన సనాతన గ్రంథాలెన్నో చదివి జీర్ణించుకున్నారని
5. ఆయనగారితో ప్రస్తుత ధర్మోపదేశకులెవ్వరినీ పోల్చలేమని
6. గుండెలనిండా సాిమనిషిపట్ల ప్రేమ, దేశంపట్ల భక్తి నింపుకుని ఉన్నారని
7. 30 సం||ల తపస్సుకు ఫలితంగా దేవుడాయనకు సత్యాన్ని (అద్భుత సత్యాన్ని) ప్రకటపరిచాడని
8. ఆ సత్యాన్ని ఈ గ్రంథం ద్వారా మొదట భారత ప్రజలకు ఆపై ప్రపంచంలోని సత్యాన్వేషకులందరకు అందిస్తున్నారని
9. ఈ పుస్తకంలోని సమాచారం నేరుగా పైనుండి, సత్యలోకం నుండి వచ్చిందని
10. ఇందులో ఉన్న సమాచారం, ఈ భూమిమీదున్న ఏ పుస్తకంలోనూ లేదనీ
11. దీనిని వినమ్రులై చదివితే, పరాత్పరుడు చదివినవారితో మ్లాడి తన సత్యాన్ని  మనకు తెలియజేస్తాడని ప్రకింపజేశారు.
ఓ నిజానికీ 11 అంశాలను, అవి సరైనవేనని ఆయన రుజువుపర్చాల్సి ఉంది.
దేశభక్తి
ఈమాట దేశముపైన భక్తి, అనిగాని, దేశమును గురించి భక్తి అనిగాని విగ్రహం చేయాలి. దేశము +భక్తి అన్న రెండు పదాల సమాసమిది. ఆ రెండు మాటలగురించి వివరించుకుంటేగాని అవగాహనలో స్పష్టతరాదు.
భక్తి :- సాత్వస్మిన్‌ పరమప్రేమరూపా భక్తిః! అని భక్తికి నిర్వచనం. అంటే దీనియందు పరమప్రేమ - మిక్కిలి ఇష్టము లేదా శ్రేష్టమైన, మరిదేనినీ పోల్చడానికి వీల్లేనంత ఇష్టము (రాగము)- కలిగి ఉండడము అని.
ప్రపంచంలో ఉన్న విలువైన వాిని, ఇష్టమైన వాిని లేదా ఇష్టపడదగ్గ వాిని అన్నింనీ ఎదుటప్టిె ఏదోఒక్కదానిని మాత్రమే ఎంచుకోమని చెప్పినప్పుడు అన్నింనీ విడచి ఏ ఒక్కదానిని మాత్రమే స్వీకరిస్తామో అది మనకు మిక్కిలి ఇష్టము అని అర్థం. ఆస్తిక సాహిత్యం నుండి ప్టుిన పదం కనుక, దీనిని ప్రధానంగా దేవునికి వర్తింపజేస్తూ వాడడం వాడుకలో ఉంది. 'ఫలాని దేవుని భక్తుడు' అని సాధారణ ప్రయోగం ఉంది. గురుభక్తి, ఫలాని నాయకునియందు భక్తి, ఆరాధనాభావం, అన్నమాటలూ వాడుకలో ఉన్నయ్‌. ఇవన్నీ, వాివాి విషయంలో అమితమైన ఇష్టము అన్న అర్థంలో వాడుతున్న మాటలే.
అమితమైన ఇష్టమన్నదీనిని, దేశానికి వర్తింపజేస్తే  ఏర్పడే అన్వయరూపం ఏమి? ఎలాగుంటుంది?
దేశమంటే ఏమి? ఒక నిర్దేశిత ప్రాదేశికపు ఎల్లల మధ్యనున్న ప్రకృతి సంపద, దానికి హక్కుదారులుగా నున్న జనులు, వారందరినీ క్టిఉంచగల నడిపించగల కట్టడి అంటే ఒప్పందము, అన్న మూినీ కలిపితే దేశమవుతుంది. సాధారణ జనం - మామూలుగా - దేశమంటే ఈ నేల అనో, ఒకింత అవగాహన పెరిగితే, దేశమంటే మ్టికాదు, మనుషులనో అనడం (కద్దు) జరుగుతుంటుంది. నిజానికి దేశమంటే (మ్టి) ప్రకృతి సంపదేననికాని, అదికాదు మనుషులేనని గాని, అనుకునే రెండు భావనలు అవాస్తవాలు కావుగాని, పాక్షికమైనవి. దేశానికి మనం చెప్పుకోవలసిన పూర్ణరూపాలు కావవి. ఈ మరోరకంగా చెప్పుకుంటే ఈ విషయం మరింత స్పష్టంగా అర్థమవుతుంది.

సమాజమంటే ఏమి?

నిర్థిష్ట ప్రాదేశికపు ఎల్లల మధ్య ఉంటూ ఒక ఒప్పందానికి లోనయి జీవిస్తున్న జనసమూహాన్ని సమాజమాంము. ఈనాడు భూమిపైనున్న సమాజాలన్నీ ఆయా దేశాల పేర్లతోనే గుర్తింపబడుతున్నయ్‌. అందులోని ప్రతివ్యక్తీ ఆ దేశీయునిగనే గుర్తింపబడడం, నమోదుచేయబడడం జరుగుతోంది. ఆ దేశ పౌరులు అంారు వారిని. పౌరసత్వం కలిగి ఉండడం అంటే, ఆదేశంలోని జనాలమధ్య, వారేర్పరచుకున్న ఒప్పందానికి లోనై, హక్కులు, విధులు, బాధ్యతలు - కర్తవ్యాలుగా స్వీకరించి జీవించడానికి సమష్టి ఆమోదం పొందిఉండడం అని అర్థం.
ఆ దేశ పౌరుడన్నా, ఆదేశస్తుడన్నా, ఆ జాతీయుడన్నా, ఆ సామాజికుడన్నా ఈ సందర్భంలో ఒకటే అర్థం. (సమాజం అన్నదానికి అందరికీ వర్తించే ఒక కట్టుబాటు+ మొత్తం దేశంలోని జనం అన్నదే కాకుండా, ఒక కట్టుబాటుకు లోనై జీవిస్తున్న చిన్న సమూహాలు అనికూడా అర్థం వస్తుంది. కాని దాని విస్తృతార్థంలో సమాజమన్నదానికి దేశం అన్న అర్థమే సరైంది. మిగిలిన రూపాలన్నీ ఉప సమాజాలే అవుతాయి. కుల సంఘాలు, మత సంఘాలు, ప్రాంతీయ సంఘాలు లాివన్నీ ఈ ఉపసమాజాల క్రిందికి వస్తాయి. ఇలాివన్నీ మనం పైనచెప్పుకున్న దేశంలో భాగాలవుతాయి. ఈ ఉప సమాజాలలో వాిలో వాికి అంతర్గతంగా ఉన్న కట్టుబాట్లన్నీ, దేశం అనడానికి పెట్టుకున్న కట్టుబాటుకు లోబడి ఉంాయి. దేశపు కట్టుబాటును - ఒప్పందాన్ని - అతిక్రమించి గాని, కాదంటూ గాని ఈ ఉపసమాజాలేవీ ఉండడానికి వీలులేదు. ఆ ప్రధాన ఒప్పందాన్ని 'రాజ్యాంగం' అనాంరు. కనుక భారత రాజ్యాంగానికి లోబడి, భారత రాజ్యాంగం నిర్దేశిస్తున్న సరిహద్దుల మధ్య నివశిస్తున్న  వారినే భారతదేశస్తులాంరు. అంటే భారత దేశంగా గుర్తిస్తున్న ప్రదేశము, భారత రాజ్యాంగము - దానికి లోబడి జీవిస్తున్న జనము- కలసి భారతదేశమవుతుంది. దేశాన్ని గురించి ఈరకంగా అర్థం చేసుకుంటేనే అది శాస్త్రీయ - సరైన - అవగాహన అవుతుంది. ఇంతకు ఏమాత్రం తగ్గినా, అది 'దేశభక్తి' అనే పదబంధంలోని దేశమన్న మాటకు సరైన అర్థం కాకుండా పోతుంది. కనుక దేశమంటే ఏమని చెప్పుకోవడం సరైందవుతుందని తేలినట్లు?
సూత్రము : భూమిపై ఒక నిర్థిష్ట ప్రదేశము, అందలి సంపద, అందుండే జనులు, వారినొక కట్టగా నిలిపి, నడిపిస్తుండే ఒప్పందము. ఇదే దేశమంటే. ముప్పిరిగొన్న ఈ మూితో కూడిన ఒక్కినే దేశమనుకుంటే, మరి దేశభక్తంటే ఏమవుతుంది?
ఈ మూిపట్ల, మిగతావేికంటెనూ అధికతమైన ప్రేమకలిగి ఉండడాన్నే దేశభక్తి అనాంరు. 'మిగతా వాికంటే' అన్నమాట ఈ వ్యాసానికంతికీ కేంద్రబిందువు అయిఉంది. ఆ 'మిగతావి' అంటే ఏమిో, వాి వివిధ రూపాలు ఈ దేశంలో ఎలా ఉనికిలో ఉంటున్నాయో స్పష్టంగా తెలిసి ఉండకపోతే, దేశభక్తికి సరైన అర్థం చెప్పుకోలేము. సరైన అన్వయాన్నీ చేయలేము. ఒక వ్యక్తి దేశభక్తుడో కాదో నిర్ణయించడమూ కష్టమవుతుంది.
మనపెద్దవాళ్ళు సమాజాన్ని 3 ప్రధాన విభాగాలుగా విడదీసి వివరించే పనిచేశారు. సాంఘికం, ఆర్థికం, రాజకీయం అన్నవే ఆ మూడు క్షేత్రాలు.
సాంఘికం : క్రింద వివాహం, కుటుంబం, కులం, మతం, ప్రాంతం అన్నవి ఉప భాగాలు కాగా మొత్తం దేశం పెద్దదైన ఒకి అవుతుంది. అందులో ఏదైనా దానిలో భాగమే. ఎన్నికలిసైనా అందులో భాగాలే అవుతాయి. (సహజసిద్దాలు, మానవకృతాలు ఉంాయి ఇందులో)
ఆర్థికం : ఆయా అవసరాలు తీర్చేవి, వాటన్నిం విషయంలో వ్యక్తుల మధ్య ఇచ్చిపుచ్చుకొనే రూపమైన నియమనిబంధనలు అన్నీ కలిపి ఈ భాగం క్రిందకు వస్తాయి.
రాజకీయం : ఆ ఒప్పందం ద్వారా ఏర్పరచుకున్న లక్ష్యాలను సాధించుకోడానికి ఏర్పరచుకున్న పాలనా వ్యవస్థనంతినీ కలిపి రాజకీయం అనంటున్నాం. అంటే మొత్తం దేశాన్ని రాజ్యం అనాంము. దానిని నిలిపి ఉంచుకోడానికీ, నడిపించుకోడానికీ ఏర్పరచుకున్న ఒప్పందాన్ని రాజ్యాంగం అనాంము. ఆ ఒప్పందాన్ననుసరించి ఆ రాజ్యాన్ని కొనసాగించుకోడానికి ఏర్పరచుకున్న పాలనా విభాగాన్ని రూపొందించుకోడానికీ, కొనసాగించుకోడానికీ, అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోడానికీ ఏర్పరచుకున్న విభాగాన్ని రాజకీయం అనాంము.
ప్రస్తుత మన రాజ్యాంగ లక్ష్యం 'పౌరుల మధ్య సమానత్వ సాధన' అన్నదే. భారత రాజ్యాంగంలోని ప్రస్తావన - ప్రియాంబుల్‌ - అన్న భాగం మనమేర్పరచుకున్న లక్ష్యాలను, దానిని సాధించుకోడానికి ఎంచుకున్న వ్యవస్థ సాధారణ రూపాన్ని గురించి నిర్థిష్టంగా ప్రకిస్తోంది.
మనది,  సర్వసత్తాకమైన సమాజం - దేశం. అంటే మన దేశంపై, బయటవారి పెత్తనం ఏ రూపంలోనూ లేదు. అలాగే లోపలున్న ఎవరో కొందరి పెత్తనమూ దీనిపై ఉండదు. ఉండరాదు. అందుకోసమే మనం ప్రజాస్వామ్యాన్ని మన లక్ష్యాలకు తగిన వ్యవస్థగా ఎంచుకున్నాం. దీని సాధారణ రూపం ప్రజలందరూ ఈ మొత్తానికి సమానంగా యాజమాన్యపు భాగస్వాములు అన్నదే. మన రాజ్యాంగ నిర్మాతలు, మొత్తం సమాజాన్ని 3గా విభజించి, ఆ మూడు కోణాలలోనూ సమానత్వం సాధించుకొమ్మని ఉపదేవించారు. పైన చెప్పుకున్న సాంఘిక, ఆర్థిక, రాజకీయాలన్నవే ఆ మూడూ. అంటే, సాంఘిక సమానత్వం, ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం అన్నవి సాధించుకోవాలనుకుంటున్నామన్న మాట. దీనినే పారిభాషికంగా సాంఘిక, ఆర్థిక, రాజకీయ ప్రజాస్వామ్య సాధన అనాంరు.
మానవుని స్వభావాన్ననుసరించి స్వేచ్చ = స్వీయ ఇచ్చ = తనకున్న ఇష్టం, నెరవేరాలన్నది, నెరవేరుతూ ఉండాలన్నది  మిగిలిన అన్నింకంటే ముఖ్యమైన ఆకాంక్ష్యగా ఉంటుంది. సుఖశాంతులుండాలి. దుఃఖము, అశాంతి ఉండకూడదు అన్నదీ స్వేచ్ఛయొక్క వినియోగ రూపం. స్వఇచ్చ నెరవేర్పు అన్నది ఒంటరి జీవితంలో పూర్ణరూపంలో సాధ్యపడదు అన్న అవగాహన కలిగాక, స్వేచ్చా పరిపూర్తి అన్నది ప్రకృతితోనూ, సాి ప్రాణులతోనూ సహజీవనం చేయడం ద్వారా మాత్రమే ఏర్పడుతుంది అన్న అవగాహన కలిగాకనే మనిషి సహజీవనానికీ, అందుకు అవసరమైన సర్దుబాటుకు సిద్ధమైనాడు. పుచ్చుకోవడమొక్కదానిపైనే దృష్టిపెడితే కథ నడవదన్నది అనుభవం నుండి గ్రహించాక ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా మాత్రమే పూర్తిగా కాకున్నా, క్రమానుగతంగా ఎక్కువలో ఎక్కువ సుఖశాంతులనందుకోవచ్చని, తక్కువలో తక్కువ స్థాయికి దుఃఖాన్ని, అశాంతిని నియంత్రించవచ్చని తేల్చుకుని అందుకు అవసరమైన ఒక ఒడంబడికకు సిద్ధమైనాడు. దాంతో ప్రకృతిని, సాివారిని కాపాడుకుంటుంటేనే అవి తనకు ఉపయోగపడుతూ సుఖశాంతులకు కారకాలు కాగలుతాయని తెలిసి ఆ రకంగా ప్రవర్తించడానికి సిద్ధమైనాడు. ఇక్కడికిదంతా సంఘజీవితం ఏర్పడడానికి, సంఘజీవులుగా కొనసాగడానికి పూర్వరంగంగా ఉన్నదే. ఈ థవరకు మానవుని దృష్టంతా స్వార్థప్రయోజనాల నెరవేర్పు నుద్దేశించిందే. ఇక్కడివరకు ఆయా వస్తువులు, విషయాలు, వ్యక్తులపట్ల అవసరాలు తీర్చేవి, తీర్చనివి అన్న దృష్టినుండి ఏర్పడిన ఇష్టాఇష్టాలేగాని, ప్రేమ - ప్రతిఫలాకాంక్షలేని ఇష్టం అన్నది ప్రవేశించనే లేదు. ప్రేమకు తొలిరూపు, సహజరూపు, తల్లీబిడ్డా విషయంలో కనబరిచే వైఖరేననవచ్చు. అక్కడ బిడ్డ తనకేదో ఇస్తుందనిగానీ, తన అవసరం తీర్చుతుందని గానీ అనుకొని బిడ్డను ఇష్టపడదు తల్లి. కనుకనే మాతృప్రేమనే సహజ ప్రేమ - సహజాత ప్రేమగా చెబుతారు విజ్ఞులు.

ప్రేమంటే?!....

ప్రతిఫలం కోరని ఇష్టం - అంతేకాదు, దానికై తనను, తన అవసరాలను ప్టించుకోనంత ఇష్టం. దాని యోగక్షేమాలకై తనను తగ్గించుకొనేందుకు, తాను ఖర్చయ్యేందుకు సిద్ధపడేంత ఇష్టం, అందుకై శక్తి ఉన్నంతలో కష్టాలను, దుఃఖాన్ని, అశాంతినీ ఇచ్చేవాిని, భరించేందుకు సిద్ధపడేలా చేసే ఇష్టం. అర్థమవుతోందా మిత్రులారా! అదిగో ఆ క్షేత్రంలో వాడాల్సిన పదం 'ప్రేమ' అన్నది. అంతకు తగ్గిన ఏ ఇష్టాల విషయంలోనూ 'ప్రేమ' అన్న పదం వాడకూడదు.
ఇక భక్తంటే అటువిం ప్రేమకు పరాకాష్టస్థితన్నమాట. అంటే హద్దుల్లేని ప్రేమ. మరి దేనితోనూ పోల్చడానికి వీల్లేనంత ప్రేమ. ఇష్టమైన వాిలో దేనిని గానీ, అన్నింనైనా వదులుకోడానికి సిద్ధపడగలంత ప్రేమ. అదిగో దానినాంరు 'భక్తి' అని. అవసరాల కోసం దేవుడి వెంటపడేదాన్ని దైవభక్తి అనకూడదు. ఎటువిం స్వార్థ ప్రయోజనాల దృష్టి ఏర్పడి ఉన్నా వాికొరకు దేవుణ్ణి ఎంతగా ప్రార్థించినా, దేవుడి వెంటపడినా దానిని 'భక్తి' అనకూడదు. ఒక భయం కారణంగానో, ఒక ఆశ కారణంగానో దేవుణ్ని ఆశ్రయించడాన్ని 'భక్తి' అనకూడదు. 'లేనా - దేనా' ప్రక్రియ నడుస్తుంన్నంత కాలం 'నీకిదిస్తాను, నాకదివ్వు' అంటూ ఎన్ని మొత్తుకోళ్ళు, ఎంత పెద్దఎత్తున, ఎంతకాలం చేసినా దానిని 'భక్తి' అనకూడదు. ఇచ్చిపుచ్చుకున్నా, పుచ్చుకొని ఇచ్చినా, ఇచ్చిపుచ్చుకొనే సంబంధం ఉన్నంతవరకు ఉండాలని కోరుకుంటున్నంత వరకు దానిని వ్యాపారమనే అనితీరాలి. వ్యాపార స్వభావం ఉన్నంతవరకు అి్టదానిని దేనినీ భక్తి అననే కూడదు. అర్థమవుతోందా మిత్రులారా.
దైవభక్తి
భక్తిలో వ్యాపారం ఉండదు. స్వప్రయోజనాకాంక్ష ఉండదు. అి్టది ఉన్నంతకాలం దానిని 'భక్తి' అనకూడదు. ఇదర్థమైతేగాని, 'దైవభక్తి'కి అన్వయం చెప్పుకోవడం గానీ, దైవభక్తి ఉందా లేదా అతనిలోనన్నది పరీక్షించడం గాని కుదరదు.
ఉదా : ఒకవ్యక్తి స్వర్గం రావాలనో, నరకం రాకూడదనో దైవాన్ని ప్రార్థించడం (స్తుతించడం - వేడుకోవడం) చేస్తున్నాడనుకోండి. దానిని దైవభక్తి అనకూడదు. దేవుడు ఉన్నాడని నమ్మడం వేరు, దేవుణ్ని అమితంగా ఇష్టపడడం వేరు. ఉన్నాడనుకున్న వాళ్ళతోనే వ్యాపారమైనా చేసేది. కనుక దేవుడున్నాడని ఎంత గ్టిగా నమ్మినా దానిని దైవభక్తి అనకూడదు. ఒక్కమాట చెప్పనా? బైబిలు, ఖురానుల ప్రాతిపదికల్లోనే 'భక్తి' అనేది లేదు. ఆ రెండు ధోరణులు దేవుణ్ణి బండగా నమ్మడం తప్పనిసరి అంాయి. నమ్మకుంటే ఈ లోకంలోనూ, పైలోకంలోనూ శిక్షలు (నరకం) తప్పదాంయి. ఎన్ని మంచి పనులు చేసినా, నమ్మడం అన్నది లేకుంటే అవన్నీ నీకు నరకాన్ని తప్పించలేవు. స్వర్గాన్ని ఇప్పించలేవు అని అంాయి. కనుకనే ఆ రెండు థోరణులననుసరించేవారి దృష్టంతా నరకాన్నెలా తప్పించుకోవాలి? స్వర్గాన్నెలా ప్రాప్తించుకోవాలన్న దగ్గరే ఉంటుంది. ఆయా గ్రంథాలు చెప్పే మాటలలో స్వర్గం రాదని గానీ, నరకం పోదని గానీ అనుమానం వచ్చినా, అడిగిందిస్తాడో లేదోనన్న అనుమానం  వచ్చినా, ఆ థోరణిలోని దేవుణ్ని కాదని మరోథోరణిలోకి జారిపోవడం - చేరిపోవడం - చేస్తుాంరు ఆ రకమంతా. ఆయా గ్రంథాలు ఎలా నడవమంటే అలా నడవడానికి సిద్ధపడేదీ. ఆ క్రమంలో ఎవరినైనా చంపడానికి సిద్ధపడేదీ, స్వర్గ నరక సంబంధమైన ప్రతిఫలాల కొరకు మాత్రమే. ఆ ధోరణుల దేవుళ్ళున్నూ వారికి స్వర్గం ఇవ్వడం కొరకే, తనకోసం వారి ప్రాణాలనూ కొన్నామని విస్పష్టంగా ప్రకించారు. ఆయన ప్రయోజనం ఆయనది. వీరి ప్రయోజనం వీరిది. కనుక బైబిల్‌, ఖురాన్‌ సంప్రదాయాల ప్రాతిపదికల్లోనే 'భక్తి'కి తావులేదు. అంతా వ్యాపారపు గొడవే.
'నన్ను ప్రార్థించండి, నేను చెప్పిన పనులు చేయండి. ఇతరులను ప్రార్థించకండి. వారు చెప్పిన పనులు చేయకండి. మీకిష్టమున్నా, లేకున్నా ఈ మార్గంలోనే నడవండి. ఇతర మార్గాల నడవకండి. ఈ రిెంకీ మీకు తగిన ప్రతిఫలం ఉంటుంది'. అన్నదే ఆ ఇద్దరి దేవుళ్ళ ప్రతిపాదన. నాయీ మాటలు సత్యాలు కాదనిపిస్తే ఆ రెండు గ్రంథాలను దగ్గరెట్టుకొని చూద్దాం రండి.
ఒక్క భారతీయ ఆస్తిక సంప్రదాయంలోనే ఈ స్వర్గ నరకాల గొడవతో పాటు ఈలోక బోగాలు వద్దు, స్వర్గలోక భోగాలు వద్దు. 'ఇహాముత్ర ఫలభోగ విరాగం'; అన్న మూడో పంథాను గురించిన ప్రస్తావన ఉంది. ప్రతిఫలాకాంక్షలేని త్యాగభావన ఉంది.
ఆవేశంలో చేసే త్యాగాలు, అవగాహనతో చేసే త్యాగాలు అని త్యాగరూపాలు రెండు. అందులోనూ అవగాహనతో చేసే త్యాగరూపం దగ్గరే 'భక్తి' నిర్వచనానికి తగిన లక్షణం ఉంటుంది. ప్రపంచంలోని - విశ్వంలోని - సమస్తాన్ని ఒకప్రక్కనుంచి, దేవుణ్ని ఒకప్రక్కనుంచి రిెంలో ఏదోఒకదాన్నే కోరుకోమన్నప్పుడు దేవుడు చాలు అని సుస్థిరంగా, నిస్సందేహంగా ఎటువిం ఊగిసలాట లేకుండా, క్షణం కూడా ఆలోచించకుండా నిర్ణయించుకోగలిగినవాణ్ణే దేవునియందు అమితమైన ఇష్టం - భక్తి - కలిగినవాడనాలి. ఇంతకు ఏమాత్రం తగ్గినా దానిని భక్తి అనిమాత్రం అనకూడదు. అతణ్ణి భక్తుడనీ అనకూడదు.
భక్తి పేరున జరుగుతున్న వ్యాపారం
ఇప్పుడు ఆస్తిక లోకంలో జరుగుతున్నదంతా వ్యాపారమే. ఇందులో 'భక్తి' అనడానికి తగిన అంశాలు దాదాపు లేవనే అనవచ్చు. అందులోనూ మంచి వ్యాపారం అనదగ్గ భాగమూ కొద్దిగానే ఉంోంది. దేవుని పేరున చేసినదెంతో అంతకు తగిన ఫలితం వస్తే చాలని స్థిరంగా నిర్ణయించుకొని, దేవుడా! చేసినదానికి సరిపడా ఇవ్వు చాలు అనగలిగి, అంతకంటే అధికం పుచ్చుకోడానికి అంగీకరించని వారి వ్యాపారమే మంచి వ్యాపారం అవుతుంది. వీలైనంత తక్కువిచ్చి, వీలైనంత ఎక్కువ రావాలనుకొనే, పుచ్చుకొనే వ్యాపారం, అది వ్యాపారంగానూ తప్పుడు వ్యాపారమే. ఇది వ్యాపారపు సాధారణ సూత్రం. మారకం సమాన విలువల మధ్య జరిగితేనే, మారకం ధర్మబద్దంగా - న్యాయసమ్మతంగా - నీతిమంతంగా జరిగిందనగలం అన్నది అర్థశాస్త్ర ప్రాతిపదికలో ఒకి.
బైబిలు పాత నిబంధన, ఖురాను అన్నవి రెండూ దైవమార్గంలో ధన, మన, ప్రాణాలనిచ్చి స్వర్గ ప్రవేశానికి అనుమతి పొందండనే చెబుతున్నాయి. ఒకీ అరా మాటలు నాకంటే అధికంగా ప్రేమించదగినవాడు నీకుండకూడదు. అలా ఉంటే నీకిక స్వర్గానికి చెల్లుచీనే ఇవ్వబడుతుందని, రెండు గ్రంథాలలోని దేవుళ్ళు స్పష్టంగా ప్రకించారు. ఇక్కడుండగా ఆయన్ను ఇష్టపడడం నిజంగా ఆయనంటే ప్రేమ ఉండడం కాదు. ఇష్టపడకుంటే స్వర్గం రాదు, సరికదా, నరకం వస్తుంది కూడా అన్నదే. ఇంతకూ వీళ్ళంతగా స్వర్గాన్నెందుకు కోరుకుంటున్నారు? ఆ దేవుళ్ళిద్దరూ స్వర్గాన్నంతగా ఆశచూపించి తమకు లొంగి ఉండేట్లు ఎందుకు చూచుకుంటున్నారు?
మీలో యోచనాశీలత ఉంటే గింటే, బైబులు, ఖురానుల స్వర్గాల సమాచారాన్ని ఆ గ్రంథాల నుండే స్వీకరించుదాం రండి. మీలో ఆ పనికి సిద్ధపడేవారుంటే మండలి అందుకు సిద్ధంగా ఉంది. ఆ పనికి మరో సమయాన్ని కేయించుకుందాం. ఒక్కమాట! ఇప్పికీ నా దృష్టికందినంతలో బ్రతుకుల్లో ఆత్మనియంత్రణ అవసరాన్ని గుర్తించిన వివేకులు అంగీకరించరానివే ఆ రెండు స్వర్గాలూ. ఇది సందర్భం కాదుగాని, నిజానికి హిందూ ఆస్తిక సాహిత్యం - ఖురాను సాహిత్యం - లోని స్వర్గమూ బుద్ధిమంతులంగీకరించకూడనిదే. ఇదీ గుర్తుంచుకోండి.
ఓ ఏదో కావాలనుకొని దానికోసమై ఏ దేవుణ్ణిగాని, దేవతలను గాని, దయ్యాలను ప్రార్థించడం గాని, వారికి నచ్చే తృప్తికలిగే పనులు చెయ్యడం గానీ 'భక్తి' క్రిందికి రానేరావు. అవన్నీ వ్యాపార సంబంధమైన పనులే.
దేశభక్తి
దేశభక్తంటే తెగతెలిసినోరిమల్లే, చాలా మ్లాడేశారు రంజిత్‌ ఓఫిర్‌ గారు. దాందేముంది! అది ఇట్టే పాించేయగలంత చిన్న విషయమన్నట్లుందాయన ప్రలాపం. ఆయనగారి కుటుంబమే దైవభక్తి, దేశభక్తి సమపాళ్ళలో మేళవించిన్టిదని మొదల్టెాడా పరిచయకర్త ఎవరోగాని, ఓఫిర్‌ గారిని గురించిన హైందవ క్రైస్తవం అట్ట చివరి పేజీలోని - పరిచయ వాక్యాలను. ఆ కొద్దిపాి పరిచయ వాక్యాలలోనే ఓఫిర్‌ గారిలో పలు అసాధారణ గుణ, క్రియా సామర్ధ్యాలున్నట్లు రాసేశారు. ఆయనే రాశారో, ఈయనే రాపించుకున్నారో గాని ఓఫిర్‌గారు వాిని ప్రచురించడాన్ని బ్టి ఆ మాటలాయనగారికి అంగీకారమైనవే ననుకోవలసి వస్తోంది. అదలాఉంచి దేశభక్తి గురించి ఏమంటున్నారో చూడండి.
1. పేజీ 34 - మనలో దేశభక్తి ఉంటే విధిగా వేదభక్తి ఉండాలి. ఉంటుంది.
2. పేజీ 49 - బైబిలు మ్లేచ్చుల మతం, ఆ గ్రంథములో ఏముంటే మాకెందుకు? మనకు వేదంలోనే అన్నీ వ్రాయబడి ఉన్నాయి, అలాటప్పుడు ఆ అంటరాని వాళ్ళ మతగ్రంథం మనకెందుకు?.... బైబిలు సంగతి మాకు చెప్పకండి! అంటూ హడావిడిగా కళ్ళూ చెవులూ మూసుకోవడం ఈ మధ్య దేశములో దేశభక్తిగా చలామణి అవుతోంది.
గమనిక : ఇంత విరుద్ధమైన మాటలు, అందులోనూ కొన్ని ఎకసెక్కపు మాటలు మ్లాడడాన్ని బ్టి చూస్తే ఆయనలో దేశభక్తి లేకపోగా విదేశీయానురక్తి బాగానే ఉందనిపిస్తోంది. మ్లేచ్చుల్నీ, అటునుండి దిగుమతైన బైబులును అంగీకరింపక పోవడమే దేశభక్తి లేనట్లన్నంతగా పేట్రేగిపోయారాయన. బైబిలును వినం అనడమే కుసంస్కారమనేంతకు తెగబడ్డారు కూడానూ. ఇంతకూ 'బైబిలు మేము వినం, అది మాకక్కరలేదు' అనడమే దేశభక్తి అని ఎవరన్నారో, ఎవరనుకుంటున్నారో చెప్పకపోగా, అది అస్పృశ్యుల మతగ్రంథమని ఎవరో అంటున్నట్లు రెచ్చగొట్టే మాటలూ మ్లాడి, ఇక్కడి వాళ్ళ మధ్య చిచ్చుపెట్టే దుర్మార్గపు పనికీ ఒడిగ్టారాయన. ఇన్ననీ దేశభక్తి, దైవభక్తి కూడా గుండెలనిండా తెగనిండి పొంగిపొర్లిపోతున్నదని చెప్పుకోడానికి వెనుకాడకపోడాన్నేమనుకోవాలి?
ఈ నాలుగు ముక్కల్ని బ్టీ...
1. ఆయనకు భక్తంటే ఏమిో అర్థం కాలేదని
2. దైవభక్తంటే ఏమిో తెలియనే తెలియదని, ఆయనలో అది లేనేలేదని
3. వేదభక్తి లేదని, ఆ మాటలు అమాయకపు మంద ముంద్టెి, వారిలో కొందరినైనా బైబిలు భక్తుల్ని చేయాలన్న దుగ్ద మాత్రం చాలాఉందనీ తేటతెల్లమయ్యింది.
అయ్యా ఓఫిర్‌జీ! రిెం మీద భక్తి ఉండడం అసాధ్యం. ఏ ఒక్కదానిపైనైనా భక్తి - అపరిమిత ప్రేమ - ఉందంటే ఇక దేనిమీదా దానితో సమానమైన ప్రేమలేదనే అర్థం. ఎలా ఏ రెండూ ప్రథమ స్థానాన్నాక్రమించలేవో. దేనిని గానీ 'ఒకవది' అన్నామంటే మరేదీఒకటవది కాజాలదనీ ఎలా నిర్ణయించవచ్చో, అలాగే దేనిపైగానీ 'భక్తి' అంటే అన్నింకంటే మిక్కిలి ఎక్కువ ప్రేమ ఉన్నదన్నామంటేనే, మరిక దేనిపైనా అంతి ప్రేమ లేదని అంటున్నామనే.
ఉదా : దేవుణ్ణి - దేశాన్ని ఒక దగ్గర్టిె దేనిపైన ఎక్కువ ప్రేమ నీకని అడిగితే రిెంపైనానూ, అని అననే కూడదు. ఏదో ఒకదానినెంచుకొంటే మిగిలింది రెండవ స్థానంలోకి పడిపోయినట్లే మన ప్రస్తుత సందర్భానికీ ఈ సూత్రాన్ని అన్వయిస్తే 1. మీకు వేదాల మీద కంటే బైబిలు మీదే ఎక్కువ ఇష్టం. ఈ దేశస్తుల పైన కంటే మ్లేచ్చులపైనే అనురాగమధికం. ఈ దేశంలోని ఆసేతు సీతానగంలోని ఆయా స్థలాలకంటే యిజ్రాయేలు, బెత్లెహాం లంటేనే మక్కువ. ఈ వాస్తవాలు మీరెంతగా వేదాభిమానిననే ముసుగు చాటున కప్పెడదామనుకున్నా సందుల్లోనుంచి తొంగిచూస్తేనే వున్నయ్‌.
మనమిప్పుడు చదువుకుంటున్న, నేర్చుకుంటున్న, వాడుకుంటున్నవన్నీ వేదాలలోనుండి తెచ్చుకున్నవేనా? మ్లేచ్చుల నుండి తెచ్చుకున్నవా? న్యాయంగా ఆలోచించండి! న్యాయంగా మ్లాడండి అనడంలోనే మీ దేశభక్తి, మీ వేదభక్తి ఏపాిదో కళ్ళకు క్టినట్లు అర్ధమైంది. ఇంతలేసి మాటలు వెనకాముందూ చూసుకోకుండా రాసి ప్రచురించేసిన మీకు అి్ట ఆధునిక విద్యలేమైనా బైబిలు నుండి పుట్టుకొచ్చాయా? అని వెనుదిరిగి చూచుకోవాలని అనిపించలేదన్నమాట! చీికి మాికి మిమ్ము పలకరిస్తూ ఆయా సత్యాలను ప్రత్యక్షపరిచే ఆ యేసుకైనా ఇది కనపడలేదా?
అదలా వుంచి దేశభక్తికీ, వేదభక్తికీ, వీి అవసరం ఏమొచ్చిందో, బైబిలును వినడానికీ, వినకపోవడానికీ, దేశభక్తి ఉండడానికీ, లేకపోవడానికీ సంబంధమేమిో విశదపరిస్తే తెలుసుకొనేందుకు యత్నిస్తాను.
అత్యంత ప్రాచీన సాహిత్యమైన వేదంలో చెప్పబడ్డ విషయాలు అన్నీగాని, కొన్నిగాని అనంతర కాలంలో వచ్చిన గ్రంథాలలో కనపడితే, అవన్నీ వేదము నుండే వాిని సంగ్రహించినట్లుగానీ, వేదంలో వున్నవాినే ఆ తరువాతి వారు గమనించినట్లు గానీ అర్థం చేసుకోవాలి. ఏమాత్రం ఇంగితం పనిచేస్తున్నా వేదం దగ్గరకొచ్చేయాలి. వేదంలో లేనివేవైనా తరువాత వచ్చిన వాిలో ఉన్నప్పుడే వాినాశ్రయించాలి. వివేకవంతులలోనేగాక, సామాన్య ఇంగితం వున్నవారిలోనూ ఇది నిర్వివాదాంశం. అలా కనీస ఇంగితాన్ని కనబరచకుండా వేదంలోనివే బైబిలు లోనూ వున్నాయి. అదీ 100 శాతం సమానంగా వున్నాయి అనంటూనే వేదాన్ని విడచి బైబిలు దగ్గరకు రమ్మనడాన్నేమనుకోవాలి? ఇదంతా కూడా దేశభక్తేనంటే ఒప్పేసుకోవాలన్న మాట. మ్లేచ్ఛుభక్తి, బైబిలు భక్తి, యేసుభక్తే ఇక్కడ దేశభక్తన్నమాట మీ ఉద్దేశ్యంలో!?! ఇదంతా చూస్తుంటే భర్తుృహరి సుభాషితాల్లోని ఒక పద్యసారం గుర్తొస్తోంది.
తెలివి యెకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి చరించితిన్‌ తొల్లి, ఇపుడుజ్వలమతుల సన్నిధి నించుక బోధశాలినై తెలియనివాడనైతి హతమయ్యె నితాంత గర్వముల్‌.
ఆ పద్యములోని వ్యక్తి, అనంతరమైనా తన స్థితి నెరిగి గర్వాంధత్వాన్ని వదిలించుకున్నాడు. మరి మీ పరిస్థితేమిో...?
గమనిక : దేశభక్తి గురించి రాయడం మొదల్టెాక ఇక్కడికొచ్చేటప్పికి మీ మాటలు గుర్తుకు రావడంతో కలం ఇలా సాగింది. మీ విషయమై ఇంకా మ్లాడాల్సే ఉన్నా శీర్షికాంశం ప్రధానం కావడంతో దీన్నిక్కడికాపి, ప్రధాన విషయంలోకి వస్తున్నాను. మీరు కావాలనుకుంటే, సిద్ధపడితే మీ విషయాలు మళ్ళా మ్లాడుకోవడానికి నేను సిద్ధమే.
దేశభక్తి
1. భక్తంటే ఏదో ఒకదానియందు అమితమైన - శ్రేష్టమైన - అంటే మరోదానితో పోల్చడానికి వీల్లేనంత ప్రేమ అని ఆ పదం నిర్వచనం చెప్పుకున్నాం గుర్తుంది కదూ!
2. దేశమంటే ఎ) నిశ్చిత సరిహద్దులలోపు వున్న ప్రకృతి సంపదంతానూ, బి) అందులో నివశిస్తున్న ప్రజలందరున్నూ, సి) వారినందరినీ నిలిపి, కలిపి, నడిపించే ఒప్పందమున్నూ కలసిన రూపం అని నిర్వచించుకున్నాం. ఇప్పుడు దేశభక్తంటే ఈమూిపైనా, ఈమూడూ కూడిఉన్న మొత్తంపైనా అమితప్రేమ కలిగిఉండడమని అర్థం. కొన్ని ఉదాహరణల ద్వారా దేశభక్తిని వివరించుకుందాం.
ఉదా : 1. మనిషి తనను తాను బాగా - అతిగా - ప్రేమించుకుంటుండాడు. అనుకోకుండా దేశభద్రతకు ప్రమాదం వచ్చిందనుకుందాం. తనను కాపాడుకోడానికి దేశాన్ని ప్టించుకోకపోవడం, దేశాన్ని కాపాడడానికి తాను మరణించడానికీ, కనీసం కష్టాలు పడడానికీ సిద్ధం కావడం. ఇందులో ఏది దేశభక్తి క్రిందకు వస్తుంది.
2. తన కుటుంబ శ్రేయస్సు - దేశ శ్రేయస్సులన్న వాిలో ఒకి వదులుకోవాల్సిన పరిస్థితి దాపురిస్తే ఏ వైఖరిని అవలంభించిన వానిని దేశభక్తిగలవాడనగలం.
3. తన కులానికి ప్రాధాన్యతనివ్వాలా? దేశానికి ప్రాధాన్యత నివ్వాలా? ఏదో ఒకి ఎంచుకోవలసి వస్తే ఎి్ట నిర్ణయం తీసుకున్నవాణ్ణి దేశభక్తుడనగలం.
4. తన మతానికి - మత గ్రంథానికి; దేశ సమగ్రతకు - రాజ్యాంగానికి, దేనికి ప్రధమగణ్యతనిస్తే దేశభక్తి క్రిందకు వస్తుంది. మత గ్రంథం చెబుతున్న దానికి - రాజ్యాంగం చెబుతున్న దానికీ తేడావచ్చి, ఏదో ఒక్కదానినే అనుసరించవలసిన విపత్కర పరిస్థితి వస్తే దేశభక్తుడు దేనిని అనుసరించడానికి సిద్ధపడతాడు? (పడాలి?)
5. మత గ్రంథాలు చూపుతున్న ఆరాధనా స్థానాలు - దేశము, అన్నవాిలో దేనిపై మీ ప్రేమ అధికంగా ఉంటే నీకు దేశభక్తి ఉందనడం కుదురుతుంది? ఏదోఒకదాన్ని విడవవలసి వస్తే, దేశం కోసం నీ ఆరాధనా స్థానాన్ని విడుస్తావా? దానికోసం దేశాన్ని విడుస్తావా? దేశభక్తుడేమిచేస్తాడా సందర్భంలో.
6. నీ దేవుడు చెప్పిందానికి - రాజ్యాంగం చెబుతున్న దానికి తేడావస్తే నీవు దేనివెంట నడుస్తావు.
గమనిక : యోచనాశీలురైన మిత్రులారా ! మన రాజ్యాంగం కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, లింగాన్ని బ్టి వ్యక్తుల మధ్య వివక్ష చూపరాదోంంది. ఈ నేలపైకి పరాయివాళ్ళెవరు దండెత్తివచ్చినా, దీనికోసమై పోరాడడానికి, దీనిని రక్షించుకోడానికి ప్రతి వ్యక్తీ సర్వదా సన్నద్దుడై ఉండాలోంంది రాజ్యాంగం. సమానాభివృద్ధి, సమగ్రాభివృద్ధి సాధనకై, సోదర భావంతో సమైక్యంగా, అఖండంగా కొనసాగమనోంంది రాజ్యాంగం.
1. ఈనేల కోసం, 2. ఈ దేశ ప్రజల కోసం, 3. ఈ రాజ్యాంగపు అమలు కోసం, వీికి అడ్డుపడే వేినైనా వదులుకోవడానికి, ఈ మూినీ అమితంగా ఇష్టపడడానికి సిద్ధమై ఉండడమే దేశభక్తి కలిగి ఉండడమంటే.
నీకంటే, నీ కుటుంబం కంటే, నీ కులం కంటే, నీ మతం కంటే, అది చూపించే స్వర్గం కంటే, నీ ప్రాంతం కంటే, నీ పార్టీకంటే దేశమంటే నీకు అధికతమ ప్రేమ ఉండడాన్నే దేశభక్తి అని అంారు. ఈ దేశంలో ఉన్న ఏ మత గ్రంథంపైన ప్రేమ లేకున్నా దేశభక్తి ఉండడానికేమీ అభ్యంతరం ఉండదు. మొత్తం మొత్తం మత గ్రంథాల్ని ప్రక్కకు ప్టిెనా, దేశభక్తికేమీ ఆటంకం ఉండదు.
అదేమరి! ఈ రాజ్యాంగాన్ని ప్రేమించకున్నా
ఈ దేశాన్ని ప్రేమించకున్నా
ఈ ప్రజలందర్నీ సమానంగా ఇష్టపడకున్నా
నీ దేశభక్తి ఇంకా అరకొరగానే ఉందన్నట్లు అదింకా చక్కజేసుకోవలసిందిగానే ఉన్నట్లు
ముఖ్య గమనిక : ఇక్కడి వరకు వ్రాసేటప్పికి ఒక మిత్రుడు నన్ను కలవాలని ఇంికొచ్చాడు. ఏమి రాస్తున్నావని అడిగాడు. ఈ వ్యాసాన్నిచ్చి చదవమన్నాను. చదివి ఒకమాటడగనా  అన్నాడు. అడగమన్నాను. ఇంతకూ నీవు దేశభక్తుడవేనా? అనడిగాడు.
అడగవలసిన ప్రశ్నే అడిగాడనుకొని, కొద్దిసేపు నన్నునేను పరిశీలించుకునే పనిచేశాను. సమాధానంగా ఏమిచెబితే నిజం చెప్పినట్లవుతుందో స్పష్టంగా గోచరించింది.
మిత్రమా! నాకు దేశభక్తంటే ఏమిో స్పష్టంగా తెలుసు. దేశభక్తుడనడానికి తగినవానిగా నన్ను నేను రూపొందించుకొనే ప్రయత్నంలో ఉన్నాను. సాధన సరైన దిశలోనే సాగుతూ వస్తోంది. చాలావరకు పరిమిత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలకే ప్రధమస్థానం మానసికంగా ఇవ్వగలుగుతున్నాననిపిస్తోంది. ఆచరణలో మాత్రం కొన్ని లోటుపాట్లు కనిపిస్తున్నాయి.,ముఖ్యంగా కులం, మతం, ప్రాంతం, వర్గం అన్న వాికి ప్రాధాన్యతనివ్వకుండా దేశం అన్న దృష్టితో ఉండగలుగుతున్నాను. కానీ నిక్కచ్చిగా సందర్భం ఎదురుపడితే అన్ని విషయాలలో దేశానికి, సమష్టికి, రాజ్యాంగానికి పెద్దపీట వేయగలనా? లేదా? అన్నది పరీక్షించి చూసుకోని విషయంగానే ఉందిప్పికీ. దేశభక్తి సాధనలో ఉన్నానన్నది మాత్రం నిజం.
మానవ హననానికి దారులుతీయగల మతమార్పిడులు - 4
యోచనాశీలురైన మిత్రులారా !
ఈ శీర్షికాంశాలను శ్రద్ధగా ప్టిచూస్తున్న వారికీ, ఈ చర్చలో నేరుగా పాల్గొంటున్న వారికీ కూడా రాత రూపంలో, జరిగిన, జరగనున్న విషయాలు అందుబాటులో ఉంచాలన్నదే నా ఉద్దేశము. గత సంచికలో అంటే వివేకపథం 218 - 20వ పేజీలో, ఈ వేదికకు - 'వాస్తవాల వెలికితీత' అన్న పేరెట్టుకుందాం అనన్నాను. ప్రధాన శీర్షికగా మొదట ఆరంభించిన దానినే ఉంచితే బాగుంటుందనిపించటంతో ఈ సంచికలో ఈ వ్యాసానికి ఆపేరే ప్టోను. ధారావాహికగా - ఆక్రమంలో - ఇది నాల్గవది. మనయత్నమంతా 'వాస్తవాల వెలికితీత' కు సంబంధించినదేనన్నదీ వాస్తవమే. ఆ దృష్టినుండే ఈ వ్యాస పరంపరను పరిశీలిస్తుండండి. ఈ విషయాలపై క్రమంగా జరుగుతుండే చర్చలలోనూ అభిలాష, తపన, శ్రద్ధ ఉన్నవాళ్ళు పాల్గొనండి. అయితే వినడానికో, చూడడానికో గాక, ఎంపిక చేసుకున్న విషయాలపై తగినంత అధ్యయనం చేసుకొని రాగలిగిన వాళ్ళకే ప్రవేశం ఉండుందిందులోనన్నది గమనించండి.
ముందనుకున్న ప్రకారం 18, 19 తేదీలలో చర్చలో పాల్గొనడానికి రావలసిన వాళ్ళంతా చేరారు. రెండు రోజులు జరిగిన చర్చ వివరాలను సంగ్రహంగా మాత్రమే ఇక్కడ పొందుపరుస్తున్నాను. చర్చనంతా వీడియో రికార్డు చేశాము కనుక మొత్తాన్ని యథాతధంగా పరిశీలించగోరిన వారా'సిడి'లను తీసుకొని చూడండి.
18వ తేదీ - బైబిలు ఆది కాండంలోని విషయాల శాస్త్రీయతేపాిది? అన్నది చర్చనీయాంశం
ఓ మనష్షే గారు ప్రధాన వక్తగా, ప్రతిపాదకునిగా ఉన్నారు. వేథాస్త్రాలెరిగిన వారే ఎరుగరు సృష్టిరహస్యం అంటూ మొదల్టెారాయన. ఆయనగారి జీవనయానంలో అనేకులు తారసపడటం, అనేక ప్రశ్నలు ఎదురవడం - రకరకాల ఆలోచనాథోరణుల గుండా ప్రయాణిస్తూ కడకు క్రైస్తవునిగా మారి స్థిరపడటం జరిగిందన్నారు. క్రైస్తవునిగా సాగుతున్న థలోనే, బైబిలు మొది 12 అధ్యాయాలు కల్పితాలని ఒకరనగా, వాి నిజానిజాలు తెలుసుకోవాలని పరిశోధన మొదల్టెాను. ఆ పరిశోధనాంశాలనే 'ఆదియందు' అన్న పుస్తకంలో వ్రాశాను.
ఓ పాత నిబంధన మొది '5' పుస్తకాలు మోషే రాసినవన్నది సాంప్రదాయం. దీనినే తౌరాతు లేదా ధర్మశాస్త్రం అనాంరు. సృష్టిజరిగాక కొన్ని వందల సంవత్సరముల తరువాతి వాడయిన మోషేకి సృష్టి ఎలా జరిగిందన్న విషయాలు ఎలా తెలిసుాంయన్నది ఒక ముఖ్యమైన ప్రశ్నగా ఉంది. దానిపై మనష్షేగారు : మోషే దేవుణ్ణి అడిగి ఉండాలి. దేవుడు అతనికి తెలియపరచి ఉండాలి. అంటూ తనదైన శైలిలో ఒక సమాధానం చెప్పారు. ఆ మాటంటూనే వారు ఆదికాండంలోని సృష్టిక్రమంలో ఉన్న 6 రోజుల విషయంలో ఒక క్రొత్తతరహా ప్రతిపాదన చేశారు.
ఓ నిజానికి సృష్టి ఎప్పుడు జరిగిందో, ఎంతకాలం జరిగిందో మనకు తెలియదు. ఆది కాండం 1,వ అధ్యాయంలోని ఆరు దినాలు దేవుడు సృష్టించిన కాలాన్ని తెలిపేవి కావు. అవి మోషే వివరాలు తెలుసుకొని రాసిన కాలానికి చెందినవి. అన్నదే ఆ ప్రకటన. ఆ రకమైన వివరణ ఆయన గారెందుకు చేశారో, దానిని శాస్త్రీయమైన ప్రతిపాదనగా ఆయనగారెలా నిర్ధారిస్తారో చూడాల్సి ఉంది.
ఓ మాటల సందర్భంలో మనష్షేగారు ఆధునిక, భౌతిక, విజ్ఞానశాస్త్ర ప్రస్తావన చేశారు. విశ్వావిర్భవాన్ని గురించి రెండు థియరీలు వున్నాయి. 1. స్టడీ స్ట్‌ే థియరీ (యధాస్థితి వాదం), 2. వ్యాకోచ సిద్ధాంతం అంటూనే జీవపరిణామ సిద్ధాంతం స్టడీస్ట్‌ే థియరీ క్రిందకి వస్తుందన్నారు.
ఓ 'థియరీ' అంటే వాస్తవం కాదని, అదింకా ప్రయోగాత్మకంగా  నిర్ధారించవలసిందిగానే ఉంటుందనీ, ప్రయోగాలు పూర్తయ్యాక దానిని 'లా' అంారని థియరీ అనరని అన్నారు.
ఓ ఐన్‌స్టీన్‌ రిలేివిీ థియరీ ద్వారా పదార్థం నశిస్తుందని రుజువైందనీ రాశారాయన పుస్తకంలో.
ఓ యురేనియం అర్థాయుష్షు 10 లక్షల సంవత్సరాలనీ, అంతకాలానికైనా అందులో 1/637వ వంతు మాత్రమే సీసంగా మారుతుందని అన్నారు.
ఓ మనకు దగ్గరి నక్షత్రం 3 1/2 కాంతి సంవత్సరాల దూరంలో ఉందన్నారు.
ఓ సృష్టి జరిగి 2,000 కోట్ల సంవత్సరాలయ్యిందోంంది సైన్స్‌ అనీ అన్నారు.
ఓ బైబిలు ప్రకారం సృష్టి జరిగి క్రీ.పూ. 4004 సంవత్సరములని చాలామంది అనుకుంటుాంరు. అది సరికాదు. నిజానికి బైబిలు సృష్టి ఎప్పుడు జరిగిందో చెప్పదు. అది సైన్స్‌ గ్రంథమూ కాదు. చరిత్రా కాదు. సృష్టి విషయం మనకు అర్థం కాలేదనాల్సిందే కాని తప్పనకూడదన్నది నా అభిప్రాయం.
ఓ మోషే ఆదామునుండి 14, 15 శతాబ్దాలకు చెందిన వాడు. అంటే క్రీ.పూ.2500 సంవత్సరముల నాివాడు.
సురేంద్ర : - నిజానికీ విషయాలన్నీ ఒక్కోదాన్ని తీసుకొని విచారించాల్సి ఉంది. నా అవగాహన ప్రకారం ఆయన వెల్లడించిన అభిప్రాయాలలో కొన్నిదోషాలున్నాయి.
ఉదాహరణకు : 1. పరిణామ సిద్థాంతం స్టడీస్ట్‌ే థియరీ క్రిందికి రావడమేమి?
2. సాపేక్ష సిద్ధాంతం పదార్థం నశిస్తుందని నిరూపించడమేమి?
3. సృష్టి జరిగి 2000 కోట్ల సంవత్సరములని సైన్స్‌లో ఎక్కడుంది?
4. బైబిలు సృష్టిక్రమంలోని 6 రోజులు మోషే రచనా కాలాన్ని తెలుపుతాయనడమేమి?
5. దేవునికి బహుళ వ్యక్తిత్వాలుండడం, దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదన్న యోహాను సువార్తను చెపుతూనే దేవుడు యెహోవా వ్యక్తిగా ప్రత్యక్షమైనాడు అబ్రహాముకు అనడమేమి?
ఓ బైబిలు మూల భాషలోని కొన్ని పదాలకు అనువాదంలో లోపం జరిగింది. అలాిం సందర్భాలలో మూలంలో ఏమని ఉందో చూడాల్సి ఉంటుంది అంటూ మధ్యాహ్నం ప్రసంగం ప్రారంభించారు మనష్షేగారు. వారికి వత్తాసుగా జగదీష్‌, శ్రీధర్‌, తిమోతి........ వగైరాలు మ్లాడుతూ వచ్చారు. వారంతా క్రైస్తవ ప్రచారకులుగా జీవితాన్ని కొనసాగిస్తున్న వారే.
సృజించెను అన్న మాటకు, చేసెను, నిర్మించెను, ఆయను అన్నమాటలకూ చాలా తేడా ఉంది. సృజించెను అన్న మాటకు మాత్రమే శూన్యమునుండి ప్టుించెను అన్న అర్థము వస్తుంది. మిగిలిన వాికి, ఉన్నదానినే అలా మార్చాడన్న అర్థం వస్తుంది. ఆదికాండంలోని మొది వచనాలలోని  భూమి శూన్యముగను, నిరాకారముగను ఉండెను అన్నప్పుడు మూలభాషలో 'ఆయను' అన్న అర్థాన్నిచ్చే పదముంది. యెషయా గ్రంథంలోని 45 : 18 వచనంలో, నిరాకారముగ నుండునట్లు ఆయన దానిని సృజింపలేదు. నివాసస్థలమగునట్లుగా దానిని సృజించెను. అని ఉందిగనుక దేవుడు ఆకారంతోనే దాన్ని సృష్టించాడు గాని, అది అనంతరం నిరాకారంగా అయ్యింది.
సురేంద్ర :- ఒక గ్రంథంలో విరుద్ధాభిప్రాయాలున్నాయని గానీ, లేవని గానీ నిర్ణయించాలంటే ఆ గ్రంథం ఏదేని ఒక విషయంపై ఏ విధంగా -  రకరకాలుగా - చెప్పిందో లేదో చూడడమన్నదొక్కటే పద్ధతి. నాకు తెలిసి బైబిలులో అలాిం వాక్యాలు అనేకం ఉన్నాయి. అలాి వాిని భిన్నాభిప్రాయాలుగా స్వీకరించాలే గాని, దానికిది అర్థం, దీనికది అర్థం అంటూ విపరీత అన్వయాలు చేయనే కూడదు. ఉన్నదోషాల్ని చూడనొల్లనివారూ, కప్పిపుచ్చాలనుకునే వారూ మాత్రమే సాగదీసే పనో, మడచి దోపే పనో చేస్తూ వైరుద్ధ్యాలు లేవని చూపడానికి నానాయాతన పడుతుాంరు. పైగా అలాి సందర్భాలలో, ఎదుటవాళ్ళకాగ్రంథం అర్థం కాలేదనేందుకూ, తనకు మాత్రమే అర్థమైందనేందుకూ అడ్డగోలుగా మ్లాడటం మొదలెడతారు.
ఒక గ్రంథంలో దోషాలున్నాయా? లేదా? అన్నది నిర్ణయించుకోడానికి అనుసరించాల్సిన భాషాపరమైన సాధారణ నియమాలను ప్టించుకోకపోవడమే ఆ రకం వారంతా చేస్తుండే తప్పు. అదే పొరపాటు ఈ సమావేశంలో పాల్గొన్న బైబిలు పక్షంవాళ్ళు చేశారనిపించింది నావరకు నాకు.
గమనిక : ఇదొకింత సాహసంతో కూడిన ప్రకటనే అయినా, దీనిపై విచారణకు, నా మాటసరైందేననడానికి తగిన ఆధారాలు చూపే బాధ్యతవహించడానికీ నేను సిద్ధంగా వున్నాను. అందుకు మీరెవరైనా సిద్ధంకావచ్చు. బైబిలు, సృష్టి విషయంలో రెండు రకాలుగా మ్లాడుతోంది అన్నది భాష ప్రకారంగా చూస్తే నిర్వివాదాంశం. అది బైబిలును నెత్తికెత్తుకున్న వాళ్ళకూ అర్థమవుతూనే ఉందికనుకనే, దానర్థం అదికాదు, ఇది అంటూ వివరణలివ్వడం మొదల్టెారు. అసలు సమస్యను సజావుగా పరిష్కరించకుండగనే, ఎవరిష్టమొచ్చిన సమాధానాలు వాళ్ళు చెప్పుకుంటూ తమదే సరైన వివరణలంటూ చెప్పుకుపోతున్నారు.
వాళ్ళెంత ప్రమాదకర -డోలాయమాన - పరిస్థితిని జనింపజేశారో - సృష్టించారో - చెప్పినా!? వాళ్ళందరి ఈ వివరాల పర్యవసానం, ఇంతకూ బైబులు ఏమిచెబుతోందన్నది ఇంకా తేల్చుకోవలసిందిగానే ఉందన్న దగ్గరకు చేర్చింది పరిస్థితిని. వాళ్ళందరి పోకడలను క్రోడీకరిస్తే, బైబిలు ప్రవచకులూ! ముందు మీరంతా ఒకదగ్గరకు చేరి, ఇంతకూ బైబిలు ఏమిచెబుతోందో తేల్యుకోండి. ఆ తేలినదాన్నే అందరూ ఒక్కటై లోకానికందించండి.
ఈ సందర్భంలో మరొక్క మా చెప్పుకోవాలి. బైబిలును - ఏ ముందస్తు అభిప్రాయాలు పెట్టుకోకుండా తగినంత భాషాపరిజ్ఞానం ఉండి, శ్రద్ధగా చదివేవాళ్ళకు ఏమర్థమవుతుందో, అది మాత్రం చెప్పడంలేదు మీరందరిలో ఎవరున్నూ. ఇదొక్కటే చాలు మీలో ఎవరూ ఉన్నదున్నట్లు చూడడానికీ, చెప్పడానికీ సిద్ధంగాలేరని, ఎవరి రంగు బక్కెట్టు వాళ్ళు పుచ్చుకొని, ఆ ఉన్నదానిపై ఎవరి రంగు వాళ్ళు పులుముతున్నారనడానికి. కనుక ఇప్పికైనా ఆ రంగులు, కుంచెలు, పులుముళ్ళూ వదిలి, ఉన్నదున్నట్లుగా గమనించడానికీ, మ్లాడడానికీ సత్యాన్వేషణ తత్పరతతో సిద్ధంకండి. ఇంతచెప్పినా దీనిని తలకింంచుకోగూడదనుకుంటే. పైన నేనన్నట్లు, అందరూ కలసి కూర్చొని బైబిలు ఇదిగో ఇదే చెబుతోంది అని ఒకేఒక్క అభిప్రాయాన్నైనా ప్రకించండి. ఈ రిెంలో ఏదో ఒకదానికి సిద్ధపడకుంటే, అది మీలో నిజాయితీలేనితనాన్నే ప్టిస్తుంది.
బైబిలులో ఆధునిక, భౌతిక విజ్ఞానాన్ని వెదకబూనడం దానికదే ఒక తెలివితక్కువ పని. నిజానికి ఇది బైబిలు పక్షీయులకొక్కరికి మాత్రమే వర్తించే విషయం కాదు. ఖురాను, వేదములే కాక, ప్రాచీనమైన ఏ తాత్విక సాహిత్యంలోనూ ఆధునిక భౌతిక విజ్ఞానాన్ని వెతకబూనడం సరైంది కాదు. సాంఖ్యంలో గానీ, వైశేషికంలో గానీ అణువిజ్ఞానమో, ప్రకృతి విజ్ఞానమో ఈనాి వైజ్ఞానులకు తెలిసినంతా ఉందనడం అవివేకమూ, అదరగండం గూడా. పంచభూతాలు, వాి సూక్ష్మరూపాలు (తన్మాత్రలు లేదా పరమాణువులు అనన్నారు వాిని) గురించిన ప్రస్తావనలే ఆ రచనల్లో ఉన్నాయి. అయితే ఒక్క విషయాన్నంగీకరించాలి మనం. ఆనాి మేథావుల్లో కొందరు ప్రకృతి పరిశోధకులు, పదార్థ పరిశోధకులూ ఉన్నారు. వారు అప్పికున్న అవకాశాలను బ్టి వాిని గురించి పరిశోధనలు చేశారు. వారారంభించిన మార్గంలోనే ప్రయాణించి క్రమక్రమంగా ఆధునిక విజ్ఞాన శాస్త్రం మరింత మరింతగా సమాచారాన్ని సేకరించుకుంటూ ఇప్పికీథకు చేరింది.
విజ్ఞానశాస్త్ర పరిణామక్రమాన్ని చారిత్రక దృష్టితో చూస్తే, ఎందరో మేథావులు గవేషణా ప్రవృత్తిలో ఈ స్థూల విశ్వాన్ని, సూక్ష్మప్రపంచాన్ని గురించి కూడా వెదుకులాడుతూ, అనేక విషయాలను గమనిస్తూ ఆ క్రమంలో చోటుచేసుకున్న మానవ తప్పిదాలను సరిచేసుకుంటూ వచ్చినట్లు తేలుతుంది. ఆ క్రమాలన్నీ ఆరంభించిన ఆద్యులుగా వారిని గమనించుకుంటూ, గౌరవించుకుంటూనే ఆనాి వారి అవగాహనల్లో దొర్లిన దోషాలను వదిలించుకుంటూ ముందుకు సాగడమే వైజ్ఞానిక విధానానికి సంబంధించిన సాంప్రదాయం. ఈ సాంప్రదాయాలన్నీ అందిపుచ్చుకోలేని మతావేశపరులే, ఆనాి రచనల్లోని దోషాలను వదులుకోలేకపోవడమే గాక, ఈనాి పరిశోధనాంశాలను ఏదోఒక నెపాన ఆనాి వాికి అంటగట్టేందుకూ తెగబడుతుాంరు. ఈరకం వారిలో రెండు రకాల దోషాలున్నాయి. ఒకి వైజ్ఞానిక పంథాలోని విధివిధానాలు తెలియనితనం కాగా, రెండోది మానసిక నిజాయితీ లేనితనం. ఈ రిెంలోనూ రెండోదే మరింత ప్రమాదకరం.
బైబిలు సృష్టిక్రమానికి చెందిన వివరాలివిగో ఇలావున్నాయి
1. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి శూన్యముగాను, నిరాకారముగాను ఉండెను.
గమనిక : ఈ 'ఉండెను' అన్నమాట మూలానికి సరైన అనువాదం కాదనీ 'ఆయెను' అన్న అర్థాన్నిచ్చే పదం ఉంది మూలంలోనేనని మనష్షేగారన్నారు. ఈ మాట మరికొందరు బైబిలు వివరణకర్తలూ అంటున్నదే.
2. ఈ ఆదికాండములోని సృష్టి నిజానికి మొది సృష్టికాదని రెండో సృష్టి అని కొందరంటున్నారీనాడు. అందుకు ఆధారంగా ఆదికాండములో నుండి 1:26 :- దేవుడు - మన స్వరూపమందు మన పోలికచొప్పున నరులను చేయుదము అన్న వాక్యములోని మన స్వరూపమందు... చేయుదుము. అన్న మాటలు అక్కడ దేవునితోపాటు ఇంకెవరో ఉన్నట్లు అర్థాన్నిస్తున్నయ్‌ కదా అని, అధ్యాయం 3:22 :- ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకనివిం వాడాయెను, అన్న మా ఈ సృష్టికి పూర్వమే దేవునితోపాింకెవరో ఉన్నట్లు తెలుపుతున్నయ్‌ కదా అనంటున్నారు. వీికి బలాన్నిచ్చేవిగా యషయా 14:13 నుండి 18 వరకున్న వచనాలను ఉట్టంకిస్తున్నారు. తేజో నక్షత్రమా! వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి?... వగైరా మాటలన్నీ పరలోకములోని, ప్రథమ సృష్టిలోని లూసీఫర్‌ - సాతాను - కలదను వివరాలేనని అంటున్నారు. ఈ సందర్భంలో ఆ రకమైన వివరణలిచ్చేవారందరికీ నా ప్రశ్నలివే.
1. 'ఆదియందు' ఇన్‌ద బిగినింగ్‌ అన్న దానికి, రెండవ సృష్టి ఆరంభించునప్పుడు మొదిగా అన్న అర్థం ఎందుకు చెబుతున్నారు?
2. 'ఉండెను' అన్నా 'ఆయెను' అన్నా మా ప్రశ్న 'శూన్యముగా, నిరాకారముగా' అంటే ఏమిటన్నదే గాని, ఆయన అలా వాిని శూన్యంగా, నిరాకారంగా సృష్టించాడా? అవే అలా అయ్యాయా? అన్నది కాదు. ఆయన సృష్టించినప్పుడు కానీ, అటు తరువాత అవెందువల్ల గాని, అయినప్పుడు గాని, భూమి శూన్యంగా, నిరాకారంగా ఉండడమంటే ఏమిటన్నదే.
గమనిక : ఈ సందర్భాన్ని వివరిస్తూ మనష్షేగారు చాలా మ్లాడేశారు. పరలోకంలో లూసీఫర్‌కు - దేవునికీ గొప్ప యుద్ధం జరిగిందనీ, అందులో బాంబుల ప్రయోగాలూ జరిగాయనీ, కడకు దేవుడు లూసీఫర్‌ను, అతని సైన్యాన్ని భూమిపైకి పడేశాడనీ, ఆ సందర్భంలో భూమిపై అగ్నిపడి భూమి తగలబడిపోయి నిరాకారంగా, శూన్యంగా అయ్యిందనీ అనేశారాయన. ఆయన ఈ మాటలు, తట్టే మోయలేనివాడు బండినెత్తికెత్తుకున్న చందానికి నెట్టేశాయి ఆయన్ను. పరిశోధనలూ చేశానంటున్న మనష్షేగారు, తాను ప్రకించిన అభిప్రాయాలన్నింకీ సరైన ఆధారాలు చూపాల్సే ఉంటుందన్న శాస్త్రీయ పద్ధతిని కాదనరనే అనుకుాంను.
1. భూమిపై నిప్పులు పడడమేమిో, దానివల్ల భూమి తగలబడి నిరాకారంగా మారడమేమిో ఆయనే తేల్చాలి.
2. పదార్థం నశిస్తుందని ఆధునిక విజ్ఞాన శాస్త్రం - సాపేక్ష సిద్ధాంతం - రుజువుచేసిందన్నారు. దానినీ ఆయనే తేల్చాలి. ఇకపోతే బైబిలు ఆదికాండం 1వ అధ్యాయం - మరియు రెండవ అధ్యాయాలలో రెండు రకాల సృష్టి క్రమాల వివరాలున్నాయి. వాిలో ఏదో ఒకి సత్యమయ్యేందుకు గానీ, రెండూ తప్పులై, అసలు నిజం మరోటయ్యేందుకు గానీ ఆస్కారముందేగాని, రెండూ సత్యాలేననడానికి అవకాశమే లేదు. అయినా, ఆయన, ఆయన వెంటవచ్చినవారూ, ఆ పక్షాన్ని స్వీకరించిన వారూ కూడా వాిలో తప్పుప్టాల్సిందేమీ లేదన్నట్లు మ్లాడబోయారు. అక్కడితో ఆగక ఆధునిక భౌతిక విజ్ఞానశాస్త్రంలో కన్ఫూజన్‌ ఎంతో ఉందంటూ నిర్ణయించేశారు. ఆ సందర్భంలో అలానా! ఏదీ, అలాిది ఒక్కి చూపండి అని నేను ప్రశ్నించగా శ్రీధర్‌గారొక ఉదాహరణ చెప్పారు. అందులో కన్‌ఫూజన్‌ ఏముంది? మీరు అర్థం చేసుకోవడంలో కన్ఫూజనే గానీ అనన్నాను. దీనిని మరింత పరిశీలించాలి. ఇలా రాసుకుంటూ పోవాలంటే, ఈ పత్రిక పరిమాణాన్ని బాగా పెంచాల్సి ఉంటుంది. కనుక మీ మెదడుకు మేతగా ఉండే రెండు మూడు ప్రశ్నలు వేసి ఇప్పికాగుతాను.
1. యోహాను సువార్తలోని, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియెద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను - అన్న మాటలలో వాక్కంటే శబ్దమనీ, శబ్దమంటే సౌండ్‌ ఎనర్జీ అని వివరణిచ్చారు మనష్షేగారు. ఈ విషయాన్నీ వారు రుజువుచేయాల్సి ఉంది.
2. అగాధ జలములపైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను అన్న అనువాదంలోని 'అల్లాడుట' దగ్గర 'పొదుగుట' అని అనాలి. కోడిగ్రుడ్లను పొదిగినట్లు, దేవుని ఆత్మ జలములపై పొదుగుచున్నది అని వివరించారు. అదేమిోనూ ఆ పక్షంవారే వివరించి నిరూపించాలి.
3. దేవుడు అని మీరంటున్నది, ఎలోహిమ్‌ గురించా, యావే గురించా, యెహోవా గురించా, జహోవా గురించా? దేవుడు, దేవతలు, ఒక్కడైన ముగ్గురు, ముగ్గురైన ఒక్కడు, ఒకటవ సృష్టి, సృష్టికర్త, రెండవ సృష్టి, సృష్టికర్త, ఇలా గడబిడగా ఉన్న దాన్నంతినీ చక్కబరచి అదంతా సరిగనే ఉందని తేల్చాలి.
4. ఏ మత సిద్ధాంతం ఇప్పి వరకు శాస్త్రీయ విచారణకు లోనుచేయబడలేదని నేననగా, బైబిలుపై అలాి విచారణ జరిగిందన్నారు ఆ పక్షం వాళ్ళు. ఆ ఆధారాలు చూపాల్సి ఉంది వాళ్ళు.
ఖురాన్‌
ముందనుకున్న ప్రకారం ది.19-9-2015న పరిశీలనాంశాలు మూడు.
1. పూర్వ గ్రంథాల విషయంలో ఖురాన్‌ - ఇస్లాం - వైఖరి.
2. అవిస్వాసుల పట్ల ఇస్లాం వైఖరి ఎన్నిరకాలుగా ఉంది? అవిస్వాసుల్ని వధించమని ఉందా లేదా ?
3. ఒకసారి ఇస్లాం స్వీకరించి, అటుతర్వాత ఇస్లాంను విడచిన వారిపట్ల ఇస్లాం వైఖరిేం?
ఆరంభంలో ముస్తాక్‌ అహ్మద్‌ గారు, ఒక గంటసేపు పూర్వ గ్రంథాలను ఖురాన్‌ దృవీకరిస్తున్నదనీ, ఖురాన్‌తో సమంగా ప్రమాణమని అంటుందనీ, ఇంకా చెప్పాలంటే, తనకంటే వాికే అధిక విలువని ఇస్తున్నదనీ చెప్పారు. అలా పూర్వ గ్రంథాలను విశ్వసించని వారు అవిస్వాసుల క్రిందికే వస్తారని చెప్పారు. ఖురాన్‌లో పేర్కొన్న 3 గ్రంథాలే కాక, ప్రతి జాతి దగ్గరకు పంపబడ్డ గ్రంథాలనూ అంగీకరించాలని అంటుందనీ చెప్పారు. ఈ ప్రసంగాంశాలనన్నింనీ ఆయన ఒక ప్రసంగ పాఠంగా చిన్న పుస్తక రూపంలో తయారుచేసి సభికులందరకూ ఇచ్చారు. ఈ పద్ధతి బాగుందనీ, మలి సమావేశాలలో ప్రతిపాదించదలచుకున్న వారందరూ వారివారి భావాలను ఇలానే రాతమూలకంగా సభకు - సదస్సులకు - అందజేయాలని అనుకున్నాం.
సురేంద్ర :- ఆ ప్రసంగాంశాలపై సరిపడినంత చర్చ జరగలేదు. బైబిలు పక్షంనుండి వచ్చినవారు మాత్రం సూిగా ఒకి రెండు ప్రశ్నలు వేశారు. ఒకి, ముందు వచ్చిన గ్రంథాలను, చివర వచ్చిన గ్రంథం దృవీకరించటమేమిటండీ, అది సరికాదు కదా! మొదట వచ్చింది దైవ గ్రంథమే అయితే తరువాతవి దానికి సరిపోతున్నాయో లేదో చూసుకోవడమే సరైందవుతుంది కదా!.
2. ఆయా మత గ్రంథాలలో ఉన్నదాన్నంతినీ మీరు - ముస్లింలు - అంగీకరిస్తారా? ఖురాన్‌లో ఉన్నంతవరకా? మొత్తాన్నంగీకరిస్తానంటే ఖురానెందుకు? అంగీకరించనంటే ఖురాన్నెందుకు అంగీకరించాలి? ఈ ప్రశ్నలపై సరిపడినంతగా చర్చ జరగలేదు. సంతృప్తికరంగా సమాధానమూ రాలేదు. ఒక థలోనైతే, భారత దేశానికి పంపబడ్డ ప్రవక్తలెవరన్నదీ, వారు తెచ్చిన గ్రంథాలేమిటన్నదీ మీరు గమనించారా? అని సూిగా అడిగిన ప్రశ్నలకు ముస్తాక్‌ గారు కొద్దిగా ఆలోచించుకొనే, గమనించాము, రాముడు, కృష్ణుడు, అర్జునుడు అని, వేదము, భగవద్గీత, కొన్ని ఉపనిషత్తులు అని సమాధానం చెప్పారు. వీటన్నింపైనా విచారణ సాగాల్సి ఉంది.
ఇక రెండో విషయానికొస్తే, బైబిలు పక్షాన్నుండి, పీటర్‌, శామ్యూల్‌ అన్న సోదరులిరువురూ కలసి ఖురాన్‌ పక్షం వారిని ప్రశ్నించడం ఆరంభించారు. ఇస్లాం అవిస్వాసుల పట్ల మూడు రకాల పరిస్థితులననుసరించి ఎలా ప్రవర్తించాలో చెబుతోందనీ, వాడుకలో వాిని దారుల్‌ హరబ్‌, దారుల్‌ హమన్‌, దారుల్‌ ఇస్లామ్‌ అంారనీ వారనగా, ముస్తాక్‌ గారు, ఫజులూర్‌ రహమాన్‌ గారు అి్ట మాటలు గ్రంథాల్లో ఎక్కడున్నాయో చూపమన్నారు.
సూిగా అి్ట మాటలు గ్రంధాలలో లేకున్నా ఆయుతులు, హదీసుల్ని పరిశీలిస్తుంటే ప్రవక్త మూడు రకాల పరిస్థితుల్లో ముస్లిం ఎలా ఎలా నడుచుకోవాలో చెప్పినట్లు ఆధారాలు దొరుకుతాయి అనన్నారు వారు.
ఓ  అటు తరువాత అవిస్వాసుల పట్ల, అవిస్వాసుల్ని చంపేయమన్న ఒక్క వాక్యం కూడా నాకు దొరకలేదని ఫజులూర్‌ రహమాన్‌ గారు అన్నారు.
దానిపై ఒక్కికాదు, చాలా ఉన్నయ్‌, అవిస్వాసుల్ని చంపండన్న వాక్యాలంటూ, పీటర్‌ ముందుగా 9:5 ఆయుతులను ఉట్టంకించారు. ఇదిగో ఆ ఖురాన్‌ ఆదేశం.
''నిషిద్ధ మాసాలు గడచిపోగానే, ముష్రిక్కులను (ముష్రిక్‌ అంటే దేవుడికి సాి కల్పించేవాడు, బహుదేవతారాధకుడు అన్న అర్థాలున్నాయి. ఇది క్రైస్తవులకు - అనేక దైవారాధకులకు వర్తిస్తుంది). ఎక్కడ కనపడితే అక్కడ చంపండి. వారిని నిర్భంధించండి. వారిని ముట్టడించండి. ప్రతి మాటువద్ద వారికొరకు పొంచి ఉండండి''....
దీని విషయమై ముస్తాక్‌ అహ్మద్‌ మరియు ఫజులూర్‌ రహమాన్‌ గారు, వీి విషయమై మరింత పరిశీలించుకొని రావడానికి కొంత సమయమివ్వండి. పై మాసానికి సిద్ధపడి మా పక్షాన్ని వ్రాతరూపంలోనూ సిద్ధంచేసుకొని వస్తాం అన్నారు. సంధానకర్తగా ఉన్ననేను అలాగే చేయండి. ఈ వేదిక నియమాలలో పరిశీలించుకు రావడానికి, మరింతమంది తెలిసిన వాళ్ళూ కలసి చర్చలో పాల్గొనడానికీ అవకాశం ఉంది. కనుక వచ్చే సమావేశానికి మరింతగా అధ్యయనం చేసుకొని రండి అననన్నాను.
బైబిలు పక్షం వాళ్ళకు నాయీ మాటలు ఒకింత అసహనం కలిగించినా, ఎంతో సంయమనంతో ప్రవర్తించి అలాగే కానీండనన్నారు వాళ్ళునూ. ఇంకేమైనా ఆయుతులు, హదీసులూ ఉంటే వాి వివరాలూ మీరడగదలుచుకున్న ప్రశ్నలూ ఇవ్వగలిగితే ఇవ్వండిప్పుడే అనన్నారు ఖురాన్‌ పక్షం వారు.
పీటర్‌ సోదరులు ఇవిగో మరికొన్ని ఆయుతుల వివరాలంటూ 9:11, 12, 14, 15, 17 :111, 8:39, 2:191, 17:16, 25:52, 9:29 అంటూ మరికొన్ని వివరాలిచ్చారు.
మలి సమావేశం వివరాలు :
నవంబర్‌ 6,7 తేదీలలో దోరకుంటలోనే కలవాలి. 6వ తేదీ బైబిలు పైనా, 7వ తేదీ ఖురాన్‌పైనా చర్చ జరగాలి. చర్చనీయాంశం - అవిస్వాసులు, అన్యజనుల పట్ల, ఆ రెండు గ్రంథాలు (యోహోవా, అల్లా) ఎలా ప్రవర్తిమంటున్నాయి?
సమావేశానికి ఉదయం 9 గం.ల లోపు చేరాల్సి ఉంటుంది. ఊరికే వినడానికి గాక, చదువుకొని పాల్గొనడానికి సిద్ధమైన వారే రావాలి. చర్చనీయాంశం ఒకింత ఒత్తిడిని, ఆవేశాన్ని కలిగించగలిగిందవడంతో 'వాస్తవాల వెలికితీత' అన్న వేదిక లక్ష్యానికి అనుగుణంగా, సంయమనంతో ఉండండి.
మ్లాడే స్వేచ్ఛ అందరికీ సమానంగా ఉంటుంది. అయితే తాను మ్లాడిన దానికి ఆధారాలు చూపడం తప్పనిసరి నియమంగా ఉంటుంది.
గమనిక : బైబిలు, ఖురానులు మాకు బాగా తెలుసును అనుకుంటున్నవాళ్ళెవరైనా పై చర్చనీయాంశానికి పరిమితమై ఈ వేదికలో పాల్గొనవచ్చు. వేదికలో పాల్గొనదలచిన వారు ముందుగా వారి వివరాలు మాకందించాల్సి ఉంటుంది.
సత్యాన్వేషణలో... మీ  సురేంద్ర.

Wednesday, December 1, 2010

తత్వచింతన ప్రత్యేక సంచిక


యోచనాశీలురైన పాఠక మిత్రులారా! సమాజ హితైషులారా!

మంచి సమాజం అంతిమ లక్ష్యంగా (ఆదర్శంగా) మెరుగైన సమాజం ... లక్ష్యంగా రాబోయే పదేండ్లు పాటు కాలం విధిగా కలసి గట్టి కృషి చేయాలన్న ఆలోచన ఉద్యమ క్షేత్రాలలో రెండు మూడు థాబ్ధాలుగా పని చేస్తున్న కొంత మందిలో చోటు చేసుకుంది. అందులోని కొందరిలో అది మరింతగా దృఢపడి ఆ దిశగా ఆరంభయత్నాలూ మొదలెట్టించింది. ఆ లక్ష్యాల కొరకు మనం....

1. ఎందుకు పని చేయాలి అన్న దగ్గర మాలో ఎటువంటి సందిగ్దం లేదు సరికదా స్పష్టమైన రీతిలో ఏకాభిప్రాయం ఉంది.


2. ఇక ఏమి చేయాలి? ఎలా చేయాలి? అన్న దగ్గర ఇప్పటికి ఎవరి ఆలోచనలు వారికున్నాయి. అయితే, కలసి పని చేయాలంటే, ఇక్కడ ఏకాభిప్రాయం అవసరం (తప్పనిసరి) కనుక, ఏకాభిప్రాయ సాధన కొరకుగా కొంత కృసి చేద్దామనుకున్నాము. అందుకై, ముందుగా ఎవరి ఆలోచనలను వారి ప్రతిపాదన రూపంగా వ్రాసుకొచ్చి, ఒక్కోదానిని ఉమ్మడి పరిశీలనకకు పెట్టి, ఆ పరిశీలన నుండి అందరి అంగీకరించగల ఒక భావజాలాన్ని (సిద్దాంతము. ఆచరణ అన్న రెండు భాగాలుగల భావజాలాన్ని) ఆవిష్కరించుకుందాం అనుకున్నాము. అదిగో, ఆ పనిలో నా వంతు భాగంగా నా పక్షాన్న మీ ముందు ఉంచుతున్నాను.


వివేక చతురులైన మీరు దీనిని రాగద్వేష రహితంగా విచారించి దీని బాగోగులను సమీక్షించండి. వీలైన మార్పులూ, చేర్పులు (దోషాలు, లోపాలు) ఉన్నాయనిపిస్తే నాకు అందజేయండి. బాగుందనిపిస్తే, ఈ ఉద్యమ కార్యంలో భాగస్వాములు కండి.


1. ఇప్పటికి మాకున్న సమానభావాలు :

1. ఉత్తమ సమాజమనగా, అందరికీ విద్య, ఉపాది, భద్రతలతో పాటు, అధికారంలోనూ, సంపదలోనూ యోగ్యమైన భాగస్వామ్యం ఉన్న సమాజమని.


2. ఉత్తమ సమాజ మనగా సమస్యలులేని సమాజం. అందులో తెచ్చిపెట్టుకున్న సమస్యలు ఉండవు. అలా ఉన్నవాటిని పరిష్కరించుకుంటూ ఉంటుంది. వచ్చిపడే వాటిని ఎదుర్కొడానికి సంసిద్ధంగా ఉంటుంది.


3. ఇట్టి ఉత్తమ సమాజ సాధనలో, తెచ్చిపెట్టుకున్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత నివ్వడం జరుగుతుంటుంది.


గమనిక :- పై నిర్వచనాన్ని మేమందరం అంగీకరించి, ఆ లక్ష్యాన్ని సాధించుకునే దిశగా, రాజ్యాంగ పరిధికి లోబడి, కనీసం రాబోయే పది సంవత్సరాల కాలం పాటు చేయగల, చేయదగిన కార్యక్రమాన్ని నిర్ణయించుకోడానికి సిద్దమయ్యాము. అందుకే ఎవరికి వారంగా ఆలోచించుకుని రావలసిన అంశాలన్ని యిలా వ్రాసుకున్నాం.


2. 1. సమాజంలోని ఉండకూడని తనానికంతటికీ మూల సమస్య ఉన్న దగ్గదేమిటి?


2. దానివల్ల సమాజానికి జరుగుతున్న కష్ట, నష్టాలేమిటి?


3. ఆ సమస్యనుత్పన్నం చేస్తున్న కారణం (కారణాలు) ఏమిటి?


4. ఆ సమస్యా పరిస్కారానికి మీరు బాపిస్తున్న నివారణోనాయం ఏమిటి?


5. ఆ సమస్య పరిష్కారమైతే ఒకనాడే ప్రయోజనాలు ఏర్పడేపరిస్థితులు ఏమిటి?


అన్న వాటికి సంబంధించి ఎవరి పక్షాన్న వారం వ్రాసుకొచ్చి పరిశీలించుదాం అనుకున్నాం. అందులో నా పక్షాన్న మా మిత్ర బృందానికేగాక, యోచనా పరులైన మీ విచారణకు పెడదాం అనిపించడంలో ఈ వ్యాసం ఈ విధంగా మీ ముందుకొచ్చింది. మెరుగైన పైరసమాజ నిర్మాణానికి అవసరమైన అవగాహన భాగము - కార్యాచరణ భాగము కూడా కలిసి ఉన్న ఈ వ్యాసం నా దృష్టిలో చాలా విలువైనది, కీలకమైనది కూడా. కనుక దీనిని మామూలు వ్యాసంగా కాక, ఒక సిద్దాంత వ్యాసంగా పరిగణించి, కూలంకుషంగా పరిశీలించి మీ మీ విమర్శలను పంపండి.



ఉపోద్ఘాతం :-


1. సామాజిక సమస్యలన్నింటికీ కారణం అటు వ్యవస్ధలోగాని ఇటు వ్యక్తులలో గానీ దోషాల, లోపాలు ఉండడమే.


2. వ్యవస్ధలో ఉండకూడని తనానికి కారణం, ప్రధాన ఒప్పందం (మనకు సంబంధించి నంతలో భారత రాజ్యాంగమే ఒప్పందం) లోనే దోషాలో, లోపాలో ఉండడం.


3. వ్యవస్ధ నిర్వహణ భాగాలలో పని చేస్తుంటే వారిలోని అవగాహనా లోపం వల్లగాని, వ్యక్తిత్వాలలోని బలహీనతల వల్లగాని, వారి వారి విధి నిర్వహణలో దోషాలు, లోపాలు ఉండడం.

3. 1. పౌరబాధ్యత :- వీటన్నింటికితోడు, ఈ వ్యవహారమంతా ఎవరి యోగక్షేమాల కొరకు రూపొందించుకున్నామో ఆ ప్రజల (పౌరులు) అవగాహనా రహితులు, చైతన్య రహితులునై, స్వార్ధప్రయోజనాలకు పరిమితులై, వివిధ ధోరణుల నేతలకు ఉపకరణాలుగా మారి ఉండడం జరుగుతోంది.

అయితే ఇదంతా ఎందుకు జరుగుతున్నట్లు?


గమనిక :- నాకు తెలిసినంతలో ఈ ప్రశ్నే అన్నింటికంటే పెద్ద ప్రశ్న. దీనికి సమాధానం రాబట్టడమే ఈ వ్యాసపు ముఖ్య లక్ష్యాలలో ఒకటిగా ఉంది. అయినా సూత్రప్రాయంగా నా సమాధానం ఇదిగో,


వ్యక్తులలో దోషాలు, లోపాలు ఉండడానికి కారణాలు.


1. వివేకానికంటే ఇష్టాఇష్టాలకే పెద్దపీట వేసే మానవస్వభావం.


2. అట్టి స్వభావాన్ని నియంత్రించడానికి తగిన విద్యగాని, శిక్షణగానీ, అనుకూల పరిస్థితులు గానీ తగినంతగా లేకుండడం.

3. ఇష్టా ఇష్టాలకు అనుగుణ్యంగా ఉండే బలాన్నిచ్చే విద్య, శిక్షణ, పరిస్థితులే ఎక్కువగా ఉండడం.

4. మరోవంక పట్టుబట్టి సమాజంలోని వివిధ ధోరణుల నేతలు, ప్రచారకులు, ప్రజలలో రకరకాల విశ్వాసాలను ఒప్పించి వారిని వేరు వేరు సమూహాలుగా విడదీయడం.

సూత్రీకరణ :- పై వివరాలన్నీ (1) అటు జ్ఞానభాగంలోనో (2) ఇటు ఆచరణ భాగంలోనో దోషాలు, లోపాలు ఉంటేనే ఇదంతా జరుగుతుంటుంది. అని నిర్ధారిస్తున్నాయి. ఇందులో (1) ఆశయధర్మాలు (ఎయిము) & ఆబ్జెక్ట్సు; (2) నియమనిబంధనలు (నియమాలు - వినిమయాలు) (రూల్సు) & రెగ్యులేషన్స్‌) అన్నవి సిద్ధాంత (జ్ఞాన) భాగం క్రిందికి వస్తాయి.

(1) వ్యవస్ధ నిర్వహణ భాగంలోని ఉద్యోగులు, (2) పౌరులు, ఆచరణ భాగంలోకి వస్తారు.

3. మెరుగైన పైర సమాజం ఆకృతి దాల్చాలంటే;

1. ఒప్పందపు ఉద్దేశభాగంలో; ప్రజలంతా ఒక్కటే, అందరికీ సమానావకాశాలుండాలి. అందరూ అభివృద్ధి చెందాలి, కృత్రిమ అసమానతలుండరాదు, అసమానాభివృద్ధికి దారితీసే పరిస్థితులుండరాదు. సమానాభివృద్ధి, సమాన భాగస్వామ్యము అన్న వాటికి అనుకూలమైన వాతావరణం ఉండాలి. అనివార్యంగా చోటు చేసుకుంటుంటే అసమానతలను తగ్గిస్తుండడానికే, వీలైతే తొలగించుకోడానికీ అవసరమైన విధి విధానాలూ వ్యవస్థలో ఉండాలి అని చెపుతూ, అందుకుతగిన మార్గ దర్శకాలు కూడా చోటు చేసుకుని ఉండాలి.


2. వ్యవస్ధకు సంబంధించినంతలో (ఎ) ఆయా పాత్రలు పోషించేవారికి ఉండవలసిన అర్హతలు (బి) వారి విధులు (సి) విధులు నిర్వర్తించడానికి తగిన అధికారాలు ఉంటాయి.

3. వ్యక్తులకు (పౌరునిగా) వారికి హక్కులు - విధులూ ఉంటాయి.

గమనిక :- రెండు విభాగాలలోని వారూ హక్కులను - విధులను అతిక్రమించకుడదు.

మెలగవలసిదంటూ బాధ్యతను గురించీ చెప్పబడుతుంది. మెరుగైన పౌర సమాజంలోని పౌరులు అఒప్పందాన్నతిక్రమించకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తుంటారు. మిత్రులారా! ఈ రెండు విభాగాలలోని దోషాలు, లోపాలే సమాజంలోని దోషాలు లోపాలకు (సమస్యలకు, ఉండగూడనివి ఉండడానికి) కారణాలుతుంటాయి. ఇంత వరకు చెప్పుకున్నదంతా వాస్తవమో కాదో (యద్ధార్ధమో కాదో) నిర్ణయించండి. ఇక్కడి వరకు మన మంతా ఏకాభిప్రాయానికి రాగలిగితే గాని, ఆపై చేయాల్సిన విచారణ .... సాగదు. ఈ విషయానికి సంబంధించినంతలో, పూర్వ నిశ్చితాభిప్రాయాలతో కూడిన రాగద్వేషాలను ప్రక్కన బెట్టకుంటే విచారణ నిస్పాక్షకంగా చేయలేము.

ప్రధాన ప్రతిపాదన

పైన ఉపోద్ఘాతంలో చెప్పుకున్న దాన్ననుసరించి ఇప్పుడున్న సామాజిక అస్తవ్యస్ధతలకు రాజ్యాంగం కారణమా? అని చూస్తే కాదని అనిపిస్తుంది.

అలాగే రాజ్యాంగాన్ని తు.చ తప్పకుండ అమలు చేయగలిగితే ఇంతకంటే మెరుగైన సమాజం రూపొందుతుందా? లేదా? అనంటే, ఖచ్ఛితంగా రూపొందుతుంది. అనిపిస్తోంది. అనిపిస్తోంది అనేకంటే, అనకతప్పదు అనడం మరింత సబబు. ఎలాగంటే

మన భారత - రాజ్యాంగంలో

1. ఉద్ధేశస్ధానంలో; అంటే 'అవతా..క' లేదా 'ప్రస్తావన' లేదా 'పీఠిక' అన్న భాగంలో


భారతదేశ ప్రజలమగు మేము, ఈ దేశమును, సార్వభౌమ్య, సామ్యవాద లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగ ఏర్పరచుకొనుటకు తీర్మానించుకుని ఇందలి పౌరులందరకూ,

సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయమును,

భావప్రకటన, విశ్వాసము, మత విశ్వాసము ఆరాధనల పరమైన స్వేచ్ఛను


అంతస్తులోనూ, అవకాశములలోనూ సమానత్వమును


ప్రతి వ్యక్తికీ గౌరవమును, జాతి ఐక్యత, అఖండతలను చేకూర్చు సోదర భావమును పెంపొందిచునట్లు (నెలకొనునట్లు) ప్రతి ఒక్కరమూ చేయుదమని సత్య నిష్ఠా పూర్వకంగా తీర్మానించుకుని 1949 సంవత్సరము నవంబరు 26వ దినమున రాజ్యాంగ సభయందు అది శాసనముగా అంగీకరించి, మాకు మేము ఇచ్చుకున్నాము అని వ్రాసుకున్నాం. భారత రాజ్యాంగం పేరున పిలువబడుతున్న మనందరిదైన ఈ ఒప్పందాన్ని అతిక్రమించమని, అనుసరిస్తూ, అనుసరింపజేస్తామని ప్రతిజ్ఞ చేయడం ప్రతి పౌరుని ప్రప్రథమ కర్తవ్యం.


మిత్రులారా! ఒక సమూహపు అవసరాలు మరియు దాని అభివృద్ధికి సంబంధించి వారి మధ్య నున్న ఒప్పందపు లక్ష్యంగా, ఇంతకంటే మెరగైన ఆకాంక్షను పెట్టగలమేమో ఆలోచించి చూడండి. అలాంటిది మీ ఆలోచనకు అయితే మాకు తెలియజేయండి. ఈ సందర్భంలో గుర్తుంచుకోవలసిన ఒక తాత్విక సూత్రీకరణను చూడండి.

సూత్రం :- ఆచరణ సాధ్యం కాని ఉత్తమ భావనకంటే, ఆచరణ సాధ్యమైన మధ్యమస్ధాయి భావన, వినియోగానికి తెచ్చుకునే సందర్భంలో ఉత్తమమైనదవుతుంది. లేదా ప్రధమగణ్యం అవుతుంది.


రాజ్యాంగాన్ని గురించి సరైన అవగాహన కలిగించుకోడానికి వీలుగా ఉండే ఒకటిరెండు విజ్ఞులు అభిప్రాయాలను ఉట్టంవేస్తాను, వాటినీచేకొని రాజ్యాంగాన్ని చూడండి.

1. మనం రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అంటే, రాజకీయ, ఆర్ధిక, సాంఘిక పరమైన ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచుకున్నాం. అని అంబేద్కర్‌ అన్నారు.


2. సమానత్వ, సౌబ్రాతృత్వములతో సమన్వయమైన రాజకీయ, ఆర్థిక, సాంఘిక ప్రజాస్వామ్య ఉద్దేశాలను కలగలపడం తన స్వప్పంగా గాంధీజీ భావించారు.

3. రాజ్యాంగంలో అవతారిక చాలా విలువైన భాగం. అది మన రాజ్యాంగపు ఆత్మ అనవచ్చు. రాజ్యాంగ విలువలను మదింపు వేయడంలో అవతారికే గీటురాయి. అది రాజ్యాంగానికి తాళం వంటిది. రాజ్యాంగంలోని అధికరణాలన్ని అవతారిక అనే గీటు రాయితో నిర్ధారింపబడి ఉంటాయి. అందుచేత రాజ్యాంగంలోని నిబంధనలన్నింటిని అవతారిక అనే గీటురాయిని ఉపయోగించే పరీక్షించాల్సి ఉంటుంది. ఆ విధంగనే రాజ్యాంగంలోని నిబంధనలు మంచివా? కావా? అను విషయాన్ని నిర్ధారించాలి. అలా డాకూర్‌ దానే బార్గవ నవంబర్‌ 18 1949న రాజ్యాంగ నిర్మాణ శాసనసభలో పేర్కొన్నారు.


4. అవతారిక ప్రకారం రాజ్యాంగాధికారం ప్రజల నుండి సంక్రమించిందే (అంటే వ్యవస్ధలోని ఎవరికి గాని ప్రతికారం ప్రజలంగీకారంతో సంక్రమించిందేనన్న మాట) నని సుప్రీంకోర్టు ప్రకటించింది.


గమనిక :- ఇలా మన రాజ్యాంగాన్ని గురించి ఎందరో విజ్ఞులు వెలిబుచ్చిన అభిప్రాయాలు లెక్కకుమించినివిగా ఉన్నాయి. వారన్నారనిగాని, అంత మంది ఉన్నారని గాని గాక, వాటి స్వరూప, స్వభావాలలోనే ఆ విశాల, విజ్ఞత చోటు చేసుకుని ఉందనే, నేను దానిని, మెరుగైన పౌరుసమాజస్ధాపనకు సరిపోతుందని చెపుతున్నాను. మీరూ అవతారికను ఒక్కసారి సావధానంగా పట్టిచూడండి.


ఆజీరిగిబిళీలీజిలి


ఇలి, ఊనీలి చీలిళిచీజిలి ళితీ |దీఖిరిబి నీబిఖీరిదీవీ రీళిజిలిళీదీజిగి జీలిరీళిజిలి.. శిళి బీళిదీరీశిరిశితిశిలి |దీఖిరిబి రిదీశిళిచీ బి రీళిఖీలిజీలిరివీదీ, రీళిబీరిబిజిరిరీశి, రీలిబీతిజిబిజీ, ఖిలిదీళిజీజీబిశిరిబీ, జీలిచీతిలీజిరిబీ బిదీఖి శిళి రీలిబీతిజీలి శిళి బిజిజి తిరీ బీరిశిరిచిలిదీరీ.


శీతిరీశిరిబీలి, జిరిలీలిజీశిగి, లివితిబిజిరిశిగి, తీజీబిశిలిజీదీరిశిగి


సమాజానికి రాజ్యాంగ బద్దంగనే ఎంతో చేయగలమని నేనంటున్నానంటే, మన రాజ్యాంగం సర్వ సమగ్రమైనది, సర్వ సంపూర్ణమైనది అని నేనంటున్నట్లు కాదు. నా దృష్టిలో మన రాజ్యాంగం చాల వరకు మెరగైనదే, అంతేకాక దాని బలమంతా, దేశ కాలానుగుణ్యంగా అవసరమైన మార్పులు, చేర్పూలు చేసుకోవచ్చుననీ, అయితే ఆ మార్పులేవీ రాజ్యాంగ హృదయమైన అవతారిక స్వభావానికి ప్రతికూలంగా కాక, అనుకూలంగా మాత్రమే ఉండేలా చూసుకోవాలనీ ఆదేశించడంలో ఉంది. ఆ సూత్రీకరణను పొందుపరచడంలో రాజ్యాంగ నిర్మాణ సభ ఎంతో శాస్త్రీయ దృక్పధాన్ని, పరిణితి చెందిన విజ్ఞతను చూపింది. అంతటి విజ్ఞతను ప్రదర్శించిన వారందరికీ కృతజ్ఞతా సూచకంగా అభినందనలు తెలుపుకోవడం మనందరిపై నున్న కనీస బాధ్యత.


కనుక మన రాజ్యాంగం మెరుగైన పౌర సమాజ స్థాపనకు తగిందిగానూ, క్రమాభివృద్ధిగా ఉత్తమ సమాజామన్న ఆ ధర్మానికి చేరువైయ్యేందుకు చాల వరకు దిశా నిర్ధేశం చేయగలిగిందిగానూ ఉందంటున్నాను. దీన్నంతటినీ దృష్టిలో పెట్టుకునే ప్రస్తుత సామాజక అస్తవ్యస్థతలకు ఒప్పందంలోని అంశాలు కారణం కాదని, ఒక రకమైన వ్యక్తులలోని ప్రవర్తనే కారణమని చెపుతున్నాను.

సూత్రం :- సామాజిక సమస్యలన్నింటికీ ఒకరకమైన మనిషే వ్యక్తి కారణం అవుతున్నాడు. కనుక మరోరకమైన వ్యక్తే మనిషే పరిష్కారానికి కారణం కాగలుగుతాడు.


ప్రస్తుత సమాజం - ఒక పరిశీలన

1.ఈనాటి సమాజంలో ఉండకూడని పరిస్థితులు :- సాంఘిక, ఆర్ధిక, రాజకీయ క్షేత్రాలలో వ్యక్తులమధ్య విపరీతమైన అసమానతలున్నాయి.

2. ఎందువల్ల ఉన్నాయి? అంటే సమస్య ఏమిటి?

జ. రాజ్యాంగం నిర్ధేశిస్తున్న రీతిలో, స్థాయిలో వ్యవస్ధలోని ఆయా స్ధానాలలో ఉన్న వ్యక్తులుగానీ, ప్రజలుగానీ ప్రవర్తించకపోవడమేగాక, తద్విరుద్దంగా ప్రవర్తిస్తూండడమే

3. సమస్యకు కారణం ఏమిటి?

జ. వ్యక్తికి, రాజ్యాంగానికి సంబంధించిన, మరియు సహజన్యాయ సూత్రాలకు సంబంధించిన అవగాహన లేకపోవడం, ఆ అవగాహన ప్రాతిపదికగా వ్యక్తిత్వాలను రూపొందించే విద్యగాని, శిక్షణగాని, అనుకూల పరిస్థితులుగాని లేకపోవడంమే తద్వతిరేకంగా ఉండడమే అస్సలు కారణం.


గమనిక :- అంటే, భారత రాజ్యాంగం ఆశించిన రీతిలో మసలుకోగల అవగాహన, వ్యక్తిత్వము, అనుకూల వాతావరణం లేకపోవడం, తద్వతిరేకంగా మసలుకోడానికి తగిన అవగాహన, మూర్తి....., అనుకూలపరిస్థితులు ఉండడం వల్లనే వ్యక్తులు రాజ్యాంగ విరుద్దంగా ప్రవర్తిస్తున్నారు.


మండలి తాత్విక సూత్రీకరణ


జీవితాన్ని సక్రమంగా అర్ధం చేసుకుని, ఆ అవగాహన చూపిన బాటలో నడవటానికి సాధన చేస్తూ, ఇతరులకూ ఆ అవగాహన కలిగించేందుకు, తదనుగుణ్యంగా జీవించేలా సాధన చేయమని వత్తిడి చేస్తూ, అందుకవసరమైన వాతావరణాన్ని ఏర్పరచుకుంటూ సాగుతుండాలి. ఇంతకంటే వ్యక్తి జీవించగల సవ్యమైన జీవితం మరోటి లేదు.


1. జీవితాన్ని సక్రమంగా అర్ధం చేసుకోవడమంటే ఏమిటి?


వ్యక్తి :- సమాజము-ప్రకృతి, వాటి మధ్య ఉన్న సంబంధాలు, అందులో ఉండకూడనివి ఏమిటో, అవెందుకున్నాయో, వాటిని తొలగించుకోవడం ఎలానో, అలాగే ఉండవలసిన వేమిటో అందులో లేనివేమిటో అవి ఎందుకు లేవో తెలుసుకుని, వాటిని తెచ్చుకోవడమెలాగోనూ, తెలుసుకుని ఆ వెలుగులో తదనుగుణంగా ఉండగూడని వాటిని పోగొట్టుకోడానికి, మరల రాకుండా చూసుకోడానికి, అలాగే ఉండవలసిన వటిని తెచ్చుకోడానికి, మరల పోకుండా చూసుకోడానికి, తగిన యత్నం తాను చేస్తూ, ఇతరుల చేత చేయించడానికి యత్నిస్తూండడము సరైనదన్నది తెలుసుకుని ఉండడం.


వ్యక్తికి సమాజము ప్రకృతి అన్న రెంటి సంబంధంలో ఇచ్చి పుచ్చుకోడమే జరుగుతుంటుంది. కనుక ఇంటికి ఇవ్వవలసింది ఇవ్వవలసినంతాఇస్తుండడం, ఇవ్వకూడనిది ఇవ్వకుండడంతోపాటు వాటి నుండి తాను పుచ్చుకోవలసింది పుచ్చుకోవలసినంతే పుచ్చుకుంటుండడం, పుచ్చుకోకూడదనిది పుచ్చుకోకుండడం అన్న విధానం ప్రతి ఒక్కరు ఆచరణలో పెడుతుంటూ సమాజంలో మానవకృత సమస్యలంటూ ఏమి పుట్టవు.

ఇదంతా ఒప్పుజ్ఞానము (సత్యం) పునాదిగా, విహితకర్మ - ధర్మాచరణ - చేయడం ద్వారానే సాధ్యపడుతుంది. కనుక సంఘ జీవితాన్ని గురించి వ్యక్తులకు తగినంత అవగాహన కలిగించడం, దానికనుగుణ్యంగా ప్రవర్తించే వ్యక్తిత్వాలను శిక్షణ ద్వారా నిర్మాణం చేయడం, అలాగే అనుసరించేందుకు తగిన అనుకూల వాతావరణాన్ని సృష్టించుకోవడం. ఇదే ఇదే ముమ్మాటికీ ఇదే సామాజిక సమస్యలన్నింటికీ సరైన శాశ్వతమైన పరిష్కారం.


వ్యక్తి బ్రతుకవసరాలు సహజాకాంక్షలన్న దగ్గర '5' ఉన్నాయి.


(1) ఉండాలని ఉంది. (2) హాయిగా ఉండాలనుంది (3) ఎదగాలనుంది(4) గుర్తింపు పొందాలని ఉంది (5) ఈ నాలుగూ జరుగుతున్నట్లు తెలుస్తూ ఉండాలనుంది.


ఇదిగో వీటికోసమే మనిషి బ్రతుకకుతున్నాడు. ఇవి రావలసిన రీతిలో, రావలసినంతా సరళంగా వస్తుంటే సుఖశాంతులను పొందుతూ తృప్తిగా జీవిస్తున్నాడు. లేకుంటే అసంతృప్తితో, అశాంతితో బ్రతుకుతున్నాడు. ఇంకా ప్రతికూలత ఉంటే దుఃఖంతో అశాంతితో బ్రతుకుతూ వీటిని తొలగించుకోడానికీ, పై వాటిని సాధించుకోడానికీ శ్రమిస్తుంటాడు. ఇదే జీవితం.


ఏ మనిషైనా చేస్తుండే పని, ఇది మానవ జీవితంలో అనివార్యంగా జరిగే సహజ ప్రక్రియ దీనిని కక్షుణ్ణంగా పరిశీలించి అర్ధం చేసుకున్నవారు, పరిశీలించని వారూ ఇరువురూ వీటి కోసమే శ్రమిస్తుంటారు. అయితే వీటి గురించి తగినంత అవగాహన (వివేకబలం) ఉన్న వారికీ అది లేని వారికీ ఇచ్చుపుచ్చుకునే సంబంధాల నెరవేర్చుటలో చాలా వ్యత్యాసం ఉంటుంది. వివేక బలం ఉన్న వారు ఇచ్చిపుచ్చుకునే ప్రక్రియలో సమతూకం పాటించేందుకు సిద్ధపడి యత్నిస్తుండగా, అది లేని వారు ఇచ్చుపుచ్చుకుని విషయంలో తగినంత ఇవ్వడానికి ఇష్టపడక, అందినంత పుచ్చుకోడానికి ఇష్టపడుతూ పరిస్ధితిలో అసమతూకం ఏర్పరడానికి, సమతూకం దెబ్బతినడానికి కారణమవుతుంటాడు.


సూత్రం :- నిజానికి వ్యక్తిలోని ఈ వైఖరి అతని స్వభావంలో ఉన్నది. ఎదగాలనుంది ఉన్న అకాంక్ష నెరవేరాలంటే ఉన్న దానిలో తరిగేది తక్కువగానూ, చేరేది ఎక్కువగానూ ఉంటుండాలి. అప్పుడే ఎదుగుదల అన్నది సాధ్యపడుతుంది. అయితే వివేకరహితుడు (అవగాహన లేనివాడు) వైయక్తిక ఎదుగుదల వరకే దృష్టి పెట్టుకుని ఉంటారు. వివేక సమిష్టి ఎదుగుదలలో భాగంగా తన ఎదుగుదలను అంగీకరించి, ఆ మేరకు వైయక్తిక ఎదుగుదలకు పరిమితిని విధించుకోడానికి సిద్ధపడగలుగుతారు.


కనుక వ్యక్తులలో సమిష్టి భావన లేకపోవడం, కొరవడి ఉండడం అన్నదే అన్ని సమస్యలకూ మూలకారణం అవుతోంది. ఆ భావన దానంతటన అది రాదు. వ్యక్తిని సంఘజీవిగా రూపొందించడానికి తగిన విద్య, శిక్షణ జరిపి, అలాగే మసలుకోడానికి తగిన వాతావరణాన్ని ఏర్పరచుకోవాల్సి ఉంది. పరిష్కారం ఇదొక్కటే, దీనిని సాధించుకోడానికి, సామాజకంగా అమలు అయ్యేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందిచుకుని దాని ప్రకారం నడకసాగించడమే మనం చేయవలసింది.


అయితే చేయవలసిన కార్యం చేయవలసి ఉన్నంత పెద్దఎత్తున, అంటే సమాజం మొత్తానికీ వర్తించేలా చేయాలంటే పాలన నిర్వహణ భాగాలతో కూడిన వ్యవస్ధలోనికే దానిని ప్రవేశపెట్టగలగాలి. మరి ఆ పని జరగాలంటే పాలన నిర్వహణ భాగాలలోనికి సమర్ధులైన యోగ్యులు ప్రవేశించాలి. ఒక వంక ప్రతి ఒక్కరూ ఇచ్చిపుచ్చుకునే విషయంలో సమతూకాన్న పాటించేలా పర్యవేక్షిస్తూ, మరో వంక సంఘజీవిగా తయారయ్యేందుకవసరమైన విద్య గ..... సాగుతుండి మెరుగైన సమాజం ఏర్పడడానికి ఇంతకంటే వేరైనదారిగాని, మెరుగైన దారి కాని లేనేలేదు. కథంతా మనిషిని సంఘజీవిగా మలచడమెలా? అన్న దగ్గరే ఉంది.


మండలి తాత్విక సూత్రీకరణ :-


సూత్రం :- నేను సక్రమంగా మనగలగాలంటే నాదిని సక్రమంగా మన గలిగేలా చూసుకోవాలి.


నాది ఎప్పుడైతే ఆరోగ్యంగా, బలంగా కొనసాగగలుగుతుంటుందో అప్పుడు మాత్రమే నేను ఉండగలంత కాలం ఆరోగ్యంగా బలంగా కొనసాగగలుగుతాను. వ్యక్తికి సమాజమూ ప్రకృతి యీవే సహజ సంబంధంతో నాది అన దగ్గరే కనుకనే వ్యక్తి సమాజాన్ని, ప్రకృతిని కాపాడుకోవాలని వివేకం నిర్భందంగా చెపుతోంది.


సంపద ఒక దగ్గర పోగుపడడానికీ, మరొక దగ్గర చేరకుండడానికీ అవకాశం ఉన్నంత కాలం వ్యవస్ధలో అస్థవ్యస్ధతలు అనివార్యంగా ఏర్పడుతుంటాయి. కనుక వ్యవస్ధ నిర్మాణంలోనే అలా పోగుపరకుండడానికి అవసరమైన విధి విధానాలుండాలి. మరోవంక ఏ కారణం వల్ల గాని అలా జరిగితే వాటిని సక్రమపరచేందుకవసరమైన నిర్మాణము ఉండాలి. అనివార్యంగా ఏర్పడే అసమతుల్యతను సరిచేసుకునేందుకు నిర్ణీత అవధుల ప్రకారం సమం చేసుకునే నిరంతరాయప్రక్రియ అమలవుతే ఉండాలి. పరిష్కార రూపంలో బలంగా చోటు చేసుకుని ఉండాల్సిన ప్రధానాంశం ఇదే. దీనిని తెలిపే సూత్రం ఒకటుంది.


సూత్రం :- చేయని వానికి ఫలితం అందకూడదు. రాకూడదు, చేసిన వానికి చేసినంతా, చేసినంతే ఫలితం వస్తుండాలి. ప్రతి వారూ పని చేయాలి. ఎవరూ అతిగా చేయకూడదు.


ఈ సూత్రాన్ని ఈ వక్క సూత్రాన్ని ఆచరణలోకి తెగలిగితే అసమానతలన్న క్రమంగా కనుమరుగౌతాయి. మెరుగైన పౌరసమాజ స్థాపనకకు ఇంతకంటే సరళమైన దారిలేదు.


1. వారసత్వపు ఆస్థిహక్కు రద్దు చేయాలి. అన్ని అరిష్టాలకూ మూలం అదే.


గమనిక :- వ్యక్తిగత ఆస్థిహక్కున రద్దు చేయరాదు. అది మరణ పర్యాంతం వ్యక్తికి ఉండాలి.


2. సోమరులను సంఘ బహిష్కుృతులను చేయాలి. లేదా తన్నపని చేయించాలి.


3. అతిశ్రమ, అవసరపు శ్రమ చేయకుండా కట్టడి చేయగలగాలి.


పనిచేయకపోవడం, అతిగా పనిచేయడం అన్న రెండు శిక్షార్హమైన నేరాలుగా పరిగణింపబడాలి.


4. వ్యవస్ధలోని ఇచ్చుపుచ్చుకునే సంబంధాలన్న ఈలోకానికి పరిమితమైనవిగనే ఉండాలి.


అంటే పుట్టుకకు పూర్వంలోగాని, చనిపోయిన పిదపతోగాని వ్యవస్ధ విధి విధానాలకు సంబంధం ఉండకూడదు.


5. 'ఉత్పత్తి- పంపిణీ, నిల్వ' అన్నవి సమాజ గతి సక్రమంగా ఉండేందుకు, క్రమాభివృద్ధినందేందుకు అనువుగా మాత్రమే జరుగుతుండాలి.


గమనిక :- ఏ నిర్ణీత కాలంలోనూ ప్రజలంతా ఇలాగే ప్రవర్తిస్తుండే అవకాశం లేదు. కారణం సమాజం ఎప్పుడూ మూడు తరాలతో కూడి ఉండడం, ఒక తరం పని విరమణ థలో, మరో తరం ఇంకా పని ఆరంభం పని (పనికి సిద్దం చేయబడుతున్న 3 థలో ఉండడమే అందుకు కారణం కనుక వ్యక్తుల లానే ప్రవర్తిస్తుండేలా నిరంతర కార్యచరణ, పర్యవేక్షణలన్న రెండిపట్లా ఏమరపాటు లేక జాగరూకతలో వ్యవహరిస్తుండడం నిరంతరం జరుగుతుండాలి. ఎవరికొరకు రాజ్యాంగమో, దేనికొరకు రాజ్యాంగమో ఆ పౌరుల నిరంతర క్రమాభివృద్ధి విషయంలో ఆ పౌరులుగాని సరైన అవగాహన సంసిద్ధుల క్రియాశీలత లేనివారైతే ఇక అ సమాజపు స్థితి, గతి కూడా సవ్యంగా ఉండదు. అవగాహనా పరులు, చైతన్యవంతులు ఐన పౌరులే సామాజిక సమస్యలను పరిష్కరించుకోడానికి, మరల మరల తలెత్తకుండా జాగ్రత్త పడడానికీ శక్తి వంతులు. కనుక అట్టి బాధ్యతాయుతమైన పౌరుల్ని రూపొందించుకోడం దగ్గరే సామాజిక సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం ఉంది.


అయితే ఆ స్ధితి చాలా దీర్ఘకాలం పాటు నిరంతరాయంగా చేసుకుంటు పోతేగాని సిద్దించదు. ఈ లోపు ఆ పనికి ఉపబలకంగా (దోహదకారిగా) ఉండే మరికొన్ని పనులు చేయవలసి ఉంది. అట్టి వాటిని గురించి కొంత వివరించుకుందాం.

మన రాజ్యాంగం బాగనే ఉందనుకున్నాం కదా! మంది ఎందుకమలవ్వడం లేదు? అమలయ్యేదెలా? సమాన వ్యవస్ధలోని, సమాజగతి నిర్ధేశిక, నియంత్రణ స్థానాలలో యోగ్యులు, సమర్ధులూ లేకపోవడం వల్లనే, రాజ్యాంగం ఎంతగా బాగున్నా అవి అములుకు నోచుకోవడం లేదా. కనుక అట్టి నియంత్రణ స్ధానాలలోనికి సరైన వ్యక్తులు ప్రవేశం జరగాలి.


ఇంతకూ మీరనే ఆ నియంత్రణ స్థానాలేమిటి?


సమా :- (1) శాసన విభాగం (ప్రజాప్రతినిధులు) (2) పాలన నిర్వహణ విభాగం (ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగము) (3) న్యాయం భాగం (4) ఈ మూడికీ భౌతిక (క్రియా) శక్తిగా ఉండే రక్షకబలు విభాగం (లా & ఆర్డర్‌ విభాగం) అన్న నాలుగూ ప్రధాన నియంత్రణ స్థానాలవుతాయి. రాజ్యాంగమూ ఈ విషయాన్ని స్పష్టంగా చెపుతోంది.


వివరణ : - పై మూటిలోనూ ప్రజాప్రతినిధుల విభాగం మరింతలేదా అత్యంత ప్రభావవంతమైన నియంత్రణస్ధానంగా ఉంది. ఎందుకంటే ఆ ప్రజాప్రతినిధులే ఇటు శాసన నిర్మాణ భాగంలోనూ, అటు ప్రభుత్వంగాను ఏర్పడుతూ, నిర్వహణభాగాన్ని న్యాయభాగంలోనూ, అటు ప్రభుత్వంగానూ ఏర్పడుతూ, నిర్వహణ భాగాన్ని నాయ్యవిభాగాన్ని, పోలీసు వ్యవసనూ ఏర్పరచుకోవడంలో కీలక పాత్రను, అటుపై వాటి నియంత్రణ విషయంలో కీలక పాత్రను, పోషించగలుగుతున్నారు. ఈ ప్రధాన విభాగాన్ని మనం రాజకీయ క్షేత్రం అంటున్నాం.

కనుక రాజకీయ క్షేత్రంలోనికి, రాజ్యాంగం అభిలషిసస్తున్న రకం వ్యక్తులు ప్రవేశించగలిగితే, సామాజిక సమస్యల పరిష్కారం దిశగా సరైన (ఆరోగ్యవంతమైన, బలమైన) నడక ఆరంభమైనట్లే. ఈ ప్రజాప్రతినిధుల సముదాయం మన రాజ్యాంగం ప్రకారం (1) పార్లమెంటు (2) శాసనసభ, (3) పంచాయితీలు (మున్సిపాలిటీ) అన్న విభాగాలుగా విభజితమై ఉంది. కనుకనే ప్రజాప్రతినిధులను ఎంచుకునే ఎన్నికల ప్రక్రియ మన దేశంలో మూడంచలుగ ఉంటోంది. రాజకీయాలతో ముడిపడి ఉన్న ఈ మూడు విభాగాలలోనికి రాజ్యాంగ బద్దులై దానిని స్కయాంత్మకం చేయగల వ్యక్తులు ప్రవేశించడం వారున్న పౌరులకు జవాబుదారుగా ఉండడం ఆచరణలోనే రావాలి. ఈ పని సక్రమంగా అమలవుతుండాలంటే ప్రజల వద్దకు పాలన, ప్రజలు ముందుకు పాలన రావాలి. అందుకొరకకే రాజ్యాంగం ఎన్నికలతో సరిపెట్టుకోక, అధికార వికేంద్రీకరణకకు పెద్దపీట వేచింది. స్థానిక ప్రభుత్వాలు ఏర్పడి, అవి ప్రజలకు జవాబు దారిగా ఉంటు ఇప్పుడే రాజ్యాంగం ఆశించిన సమాజం ఏర్పడే వీలుంటుంది. మన రాజ్యాంగం ప్రకారం.

నిర్ణయాధికారం, పర్యవేక్షణధికారం ప్రజలదే. మిగిలిన యంత్రాంగమంతా నిర్వహణాధికారానికి పరిమితమయ్యేదే. మంది సక్రమంగా అమలవ్వాలంటే గ్రామసభలు, వార్డుసభలు పూర్తి స్థాయిలో జరుగుతుండాలి. అందువలన పాల్గొనే పౌరులు అవగాహనాపరులు, రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించనివారు అయ్యిండాలి. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రజాప్రతినిధులనెవ్వరినైనా వారు సక్రమంగా ప్రవర్తించనపుడు వారిని వెనక్కి పిలిచే హక్కు ప్రజలకుండాలి.


ముఖ్య గమనిక :- ఇప్పటికి నాకు తెలిసి మన రాజ్యాంగంలో రింగులోపాలున్నాయి.


(1) ఆర్థిక సమానత్వానికి అడ్డుగనిలుస్తున్న వారసత్వపు ఆస్థి హక్కు ఉండడం.

(2) ఎన్నికైన ప్రజాప్రతినిధుల్ని తప్పజేసినప్పుడు దింపేసే హక్కు లేకపోడం

ఈ రెంటినీ సవరించకోగలిగితే ఇప్పుడున్న అస్తవ్యస్ధతాలలో ఎక్కువలో ఎక్కువ భాగం ఇట్టే సనైపోతుంది. ఈ రెండు సూత్రాలు అటు ఆర్థిక ప్రజాస్వామ్యానికి ఇటు రాజకీయ ప్రజాస్వామ్యానికీ అవరోధకాలుగ .......

వాటిని రాజ్యాంగ సవరణల ద్వారా సరి చేసుకోవాలంటే, అంతటి విశాలత, సమదృష్టి ఉన్న వ్యక్తులు రాజకీయ క్షేత్రాలలోఓ 3 పెద్ద ఎత్తున ప్రవేహించాలి. శాసన విభాగంలోనికి ఇట్టి వారిని ప్రవేశపెట్టడమెలాగనేదే ఈ థలో మనముందున్న అస్సలు ప్రశ్న.థల వారీ కార్యాచరణ ప్రణాళిక


కార్యక్రమం మూడు విభాగాలుగా ఉండాలి

(1) ప్రజల్ని అవగాహన పరులను, చైతన్య వంతులనుగా తయారు చేయడం

(2) వ్యవస్ధలోని నియంత్రణ స్థానాలలోనికి సంశికక్షుతులైన సామాజిక స్పృహకల వ్యక్తిని పంపడం.

(3) ప్రజలకు - నియంత్రణ స్థానాలకు, ఉద్యమ వేదికకు మధ్య బలమైన మిత్ర సంబంధాలను నెలకొల్పడం.

అందుకుగాను అధ్యయన శిక్షణ తరగతుల్ని పెద్ద ఎత్తున దీర్ఘకాలం కొనసాగించాల్సి ఉంది. ఉద్యమ కారుల శిక్షణ, పౌరశిక్షణ; నియంత్రణ స్థానాలలోనికి వెళ్ళే వారికి శిక్షణ ఇదే ఇప్పుడు చేయాల్సిన ముందుపని రాష్ట్రాన్ని కార్యక్షేత్రంగా తీసుకుని ఈ పనిని పెద్ద ఎత్తున నిర్వహించాలి.

ఎందుకంటే సాధారణ పౌరులు వారంతట వారుగా అందుకు సిద్ధం కారు. ఎందుకంటే వారంతా వివిధ ధోరణులకు చెందిన నేతల వశంలో ఉండి పరతంత్రులుగా ఉన్నారు. వారి మెంటాల్టీ, ఇటువైపు దృష్టి సారించేలా చేయడానికి పెద్ద యత్నమే చేయవలసి ఉంటుంది. నిజానికి పౌరులను అవగాహనాపరులుగా, జాతీయవాదులుగా, సమిష్టి ప్రయోజనాలకు లోబడి ప్రవర్తించగలిగే వారిలా తీర్చిదిద్దవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. అయితే అక్కడాపని జరగనప్పుడల్లా, సమాజంలోని విజ్ఞులు పూనుకొని ప్రజల్ని, ప్రభుత్వాలని కూడా చక్కదిద్దే పనిచేయవలసి ఉంటుంది. పట్టిచూస్తే చరిత్రలో అలా జరిగిన దాఖలాలు కనిపిస్తాయి. ప్రస్తుతం సమాజం కోసం ఏదోఒకటి చేద్దామనుకుంటున్న మనలాంటి వారి ముందుందా బాధ్యత.


ఉద్యమ సారధ్యం వహించాలనుకొంటుండే వాళ్ళు మరికొన్ని విషయాలను తెలుసుకొనితీరాలి.


వ్యక్తుల ఆలోచనా స్థాయిలు మూడురకాలుగా ఉంటాయి.


1. స్వతంత్ర ఆలోచనాశీలురు

2. అనులోచనాశీలురు

3. అనుసరణశీలురు.

ప్రతి వ్యక్తిలోనూ ఈ మూడు వైఖరులు ఉండేలీలుంటుంది. కానీొక్కొక్కరిలో ఒక్కవైఖరి ప్రమలంగా ఉండి వారు ఆ వైఖరికి చెందిన వారుగా చెప్పుకొంటూ ఉంటారు.

1వ రకం వారికి, విషయాన్ని చెప్పి మీకేమనిపిస్తుంది ? అనడిగితే విషయాన్ని విపులీకరించగలుగుతారు. నిర్ణయాన్ని ప్రకటించగలుగుతారు. అవసరమైన మేర వెనుదిరిగి చూసుకొని సరిచేసుకోగలుగుతారు.
2వ రకం వారికి విషయాన్ని చూపిస్తూ, అవసరమైనపుడల్లా కదిలిస్తూ కొంతవరకు వివరాలందిస్తూంటే గ్రహించగలుగుతారు. గ్రహించినంతమేర భావాన్ని స్వంతంచేసుకుంటూ సాగుతుంటారు.
3వ రకం వారు విడమరచి చెప్పి చూపిస్తుంటే అంతవరకు గ్రహిస్తూ, చెప్పింది చేస్తూ, చెపుతూ ఉన్నంతవరకు చేసుకుంటూ సాగుతుంటారు. వారికి నడిపేవారి అవసరం ఎప్పుడూ ఉంటుంది.
గమనిక : 1వ రకం వారిని స్వతంత్ర ఆలోచనాశీలురనీ, 2వ రకం వారిని అనులోచనాశీలురని, 3వ రకం వారిని అనుసరణశీలురని అంటాం. మన ఉద్యమయత్నాలలో ఈ మూడు రకాల వారికి తగిన శిక్షణ, కార్యాచరణ ప్రణాళిక ఉండాలి.
దీనిలో శిక్షకులకు శిక్షణ నిర్వహించేవారు, శిక్షకులు, శిక్షితులు అనంన సముదాయాలు ఏర్పడుతుంటాయి. ఈ మూడు రకాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనులు చేస్తూనే ప్రజలకు అవగాహన కలిగించే పని చేస్తుంటారు.

ఇందులో శిక్షకులకు శిక్షణనిచ్చేవారు ప్రధాన శిక్షణాలయంలో ఉంటారు. శిక్షకులు మొదట జిల్లా శిక్షణాలయాలలో, అనంతరం మండల శిక్షణాలయాలలో శిక్షకులుగా ఉంటారు. అక్కడ శిక్షితులు రాష్ట్రమంతటా ఉద్యమ భావజాల వ్యాప్తిలో పనిచేస్తుంటారు. వీరందరూ సాధారణార్ధంలో ఉద్యమకారులే అనబడతారు. అభ్యుదయ శక్తులు సంఘటితం కానంతవరకు అసాంఘిక శక్తులు ఛలాయించుతూనే ఉంటాయన్నది చరిత్రలో చర్వితచరణంగా జరుగుతూ వచ్చిన వాస్తవం. దానినే ధర్మాధర్మ శక్తుల పేరన తాత్విక సాహిత్యంలో ప్రస్తావించారు. కనుక ఇప్పుడు మనం ఆరంభించి నిరంతరాయంగా కొనసాగిస్తూరావల్సిన పని అభ్యుదయ శక్తుల్ని సంఘటితపరచి, అసాంఘిక శక్తులపై పోరాటానికి వారిని సన్నద్ధం చేయటమే. ఆ పని విషయంలో చెయ్యాల్సిన కర్తవ్యాల్ని తెలిపే ఒక సూత్రం ఉంది.

సూత్రం : వెదుకు, గమనించు, సవిూకరించు, సంఘటితపరుచు, పోరాడు.

మనం ఉద్యమకార్యంలో ఎవరెవరం ఏయే పనుల్లో ఉంటున్నా అందరూ చేస్తుండాల్సిన సాధారణ కార్యం, మనకు పనికివచ్చే వ్యక్తుల్ని వెదుకుతుండటమే.

ఈ వెదికే పని వివిధ థలుగా ఉంటుంది. ముందుగా ఈ పనిని వయోజనులనుండి మొదలుపెట్టాలి. వయోజనులన్న దాని క్రిందకు యువకులు, మధ్యవయస్కులు, పెద్దతరం వారు వస్తారు.

గమనిక : వయోజనులన్న పదం వయసొచ్చిన వాళ్ళు అన్న అర్ధాన్నిస్తూ, పిల్లలు కాని వారిని సూచించేందుకు వాడబడింది. యోజనాపరులు జీవితాన్ని


1. బాల్యం, కౌమారం, యవ్వనం, వార్థక్యం అన్నవిభాగాలుగాను


2. బాలురు, యువకులు, మధ్యవయస్కులు, వృద్ధులు అన్న రూపంలోనూ విభజించారు.


మన ప్రస్తుతాంశానికి సంబంధించినంతలో మన వెదుకులాట ప్రధానంగా యువకులు, మధ్యవయస్కులకు చెందివుంది. అనుభవజ్ఞులై ఆరోగ్యంగా వున్న పెద్దలూ ఉద్యమాలకు అవసరపడే ఉంటారు.

మలి థలో మాత్రం భావితరాన్ని నిర్మించుకునేందుకు వీలుగా కౌమారథలోని వారిపై ప్రధానంగా దృష్టిపెట్టి పనిచేయాల్సి ఉంటుంది.

అవగాహనా సౌలభ్యం కొరకు ఆ నాలుగు రకాల వారిని వయస్సులను బట్టి ఇలా నిర్ణయించుకుందాం. కుమారులు : 12 నుండి 18 లోపు, యువకులు : 18 నుండి 30 వరకు, మధ్యవయస్కులు : 30 నుండి 50 వరకు. ఆపై వారిని పెద్దతరం అనందాం.

మతం - మన వైఖరి

మత సాహిత్యంలో మానవతా విలువలు, మానవ విలువలు అన్న వాటిని గురించి తగినంతగనే చెప్పబడి వున్నా, మానవత్వానికి, మానవీయ విలువలకు పెద్దపీట వేసిన ఎదిగిన మనుషులెందరో మతాన్నంటిపెట్టుకొని అన్ని మతాలలోనూ కనబడుతూనే ఉన్నా, చరిత్రలో మతం నిర్వహించిన పాత్ర మాత్రం, మానవులంతా ఒక్కటే, మానవులందరూ యోగక్షేమాలను సమానంగా పొందవలసిందే అనదగిన వారు అంగీకరించదగిందిగా గాని, అనుసరించదగిందిగా గానీ లేదు. మానవేతిహాసంలో మతాల పేరన జరిగినంత మారణకాండ మరేకారణంగానూ జరగలేదు.

ప్రజాస్వామ్యానికి పట్టం కడుతూ సాగుతున్న ఈనాటి ప్రపంచ మానవ సమాజంలో కూడా మతాలు, మానవీయ విలువలు, ఈ లోకంలో పరస్పరం ప్రవర్తించాల్సిన రీతి రివాజుల కంటే దైవ సంబంధమైన, పరలోక సంబంధమైన విశ్వాసాల కేంద్రికతకు ప్రాధాన్యతనిస్తూ మానవుల్ని వివిధ సమూహాలుగా విడదీస్తున్నాయి. వ్యక్తులలో మమ - పర అన్న దృష్టిని గట్టిగా పాదుకొల్పుతున్నాయి.

ఎవరికివారు, తమ గ్రంధం చెబుతున్న దైవం, పరలోకం, మరణానంతర జీవితం అన్నవే సరైనవంటూ - సత్యాలంటూ, తదితరులవన్నీ అసత్యాలు, అవాస్తవాలంటూ నిర్ద్వందంగా ప్రకటిస్తూ, ప్రచారం చేస్తున్నారు. ఇది నిజమో కాదో వారినడిగి చూడండి. లేదా ఆ మత గ్రంధాన్ని తరచి చూడండి.

గమనిక : ఆయా కాలాలలో మనసున్న, మానవత్వమున్న మనుషులెందరో వ్యక్తులలో మత భావాలను పోగొట్టలేక, మత సామరస్యమన్నా ఏర్పడితే మేలనుకుని, అందుకై నిబద్ధతతో ఎంతో కృషిచేశారు. అట్టి వారి కృషి మొత్తం మొత్తంగా వృధాఅయ్యిందనలేము గాని, జరిగిన, జరుగుతున్న దాన్నంతటినీ సమీక్షిస్తే ఆ యత్నాలన్నీ విఫలమయ్యాయని గాని చెప్పక తప్పదు. కానీ ఈ నాడున్న మతసామరస్య వాదులు చరిత్రను యధాతధంగా పరిగణలోనికి తీసుకోకుండా, వర్తమానంలో అన్ని మతాల వారు కలసి జీవిస్తుండడాన్ని చూపెడుతూ, మత సామరస్యం సాధ్యమేననడానికి ఈ ప్రత్యక్ష సాక్ష్యం సరిపోవడం లేదా అని వాదిస్తుంటారు. ఈ విషయంలో సత్యా సత్యాలేమిటన్నది నిర్ధారించుకోవాలంటే అందుకు లోతైన విచారణ చేయాల్సి ఉంది. ఆ పని మరొకసారి ప్రత్యేకించి చేద్దాం. మన విచారణకు సిద్ధపడి, సత్యాలని తేలిన వాటిని స్వీకరిద్దాం. అసత్యాలని తేలిన వాటిని విడిచిపెడదాం. అలాగే ధర్మాలని తేలిన వాటిని స్వీకరిద్దాం. అధర్మాలని తేలిన వాటిని విడిచిపెడదాం. సత్యాసత్యాలుగనో, ధర్మాధర్మాలుగనో తేలని వాటిని తేలనివిగా అంగీకరిద్దాం. కాలం చెల్లిన వాటిని అట్టివిగనే అంగీకరిద్దాం 'అన్న షరతులకు అంగీకరించిన వాళ్ళలో సత్యాసత్య విచారణ చేయడానికి సత్యాన్వేషణ మండలి సిద్దంగా ఉంది. మండలికి సంబంధించినంతవరకు ఈ నియమం, ఆస్తిక ధోరణిగల వారికుగాక, ఆస్తిరేతర ధోరణి గలవారికి కూడా వర్తిస్తుంది.


ప్రస్తుతాంశానికి సంబంధించినంతలో మెరుగైన పౌర సమాజ స్థాపనకై రాజ్యాంగం అంగీకరించిన పరిధిలో ఉద్యమించడమే సరైందని నేను భావిస్తున్నాను. అంటే దేశ పౌరులందరి మధ్యనున్న సామాజిక సండంధాలు, వ్యవస్థ నియమ నిబంధనలు అన్న ఈ లోకానికి పరిమితమైనవిగనే ఉండాలన్న సూత్రాన్నే ఆచరించడం సరైందని నేను భావిస్తున్నాను.

ఒకే మతాన్ని ఆచరణలో స్థాపించడం గాని, వివిధ మతస్తుల మధ్య మతాల ప్రామాణికతనంగీకరిస్తూ సామరస్యాన్ని నెలకొల్పటంగాని అసాధ్యమని తలుస్తున్నాను. లౌకిక రాజ్యాంగపు విధి నిషేధాలను బలంగా అమలు చేయడం ద్వారా మాత్రమే వివిధ మతస్తుల మధ్యన సహనాన్ని, సర్దుబాటు వైఖరిని నెలకొనేలా చేయవచ్చునని భావిస్తున్నాను. క్రమంగా మత విశ్వాసాల కంటే, 1. మానవీయ విలువలు, 2. శాస్త్రీయ విజ్ఞానము అన్న వాటికి ప్రాధాన్యతనిచ్చే విద్యాబోధన చేస్తూ రావడం ద్వారా మానవుల మధ్య సహజీవనాన్ని, సహకార ధోరణిని పాదుకొల్పవచ్చని భావిస్తున్నాను. మత గ్రంధాల పట్టు సడలకుండా ఆ సమూహాల మధ్య సామరస్యం కుదరనే కుదరదు.

గొప్ప విడ్డూరమేమంటే ఈనాడు ప్రధాన మతస్తులందరూ తమది మతం కాదని, ధర్మమని, అంటే సర్వ మానవాళికి, ఎల్ల కాలాలకు వర్తించే ఒక సమగ్ర జీవన విధానమనే మాట్లాడుతున్నారు. వారి మాటలనంగీకరిస్తే ఇక మతమన్నదే లేదనవలసివస్తుంది. ఇక అప్పుడు మనం మాట్లాడుకోవలసింది ధర్మయంటే ఏమిటి ? ఏ గ్రూపు చెబుతున్నది ధర్మమనడానికి తగి ఉంది అన్న అంవంపైనే. వాదన కొరకు అలాగేననుకున్నా మరిలాంటప్పుడు మన రాజ్యాంగాన్నేమిచేద్దామన్న మరింత పెద్ద ప్రశ్న వచ్చి కూర్చుంటుంది. కనుక నేననేదేమంటే మతాల గొడవలా వుంచి, రాజ్యాంగానికి లోబడి జీవిస్తారో లేదో నిక్కచ్చిగా కనుక్కోవడమొక్కటే సరైన విధానం అవుతుంది. అలాగే విజ్ఞాన శాస్త్ర రీత్యా తేలిన వాటిని తేలినవిగా స్వీకరిస్తారో లేదోనూ అడిగి తేల్యుకోవాలి.


మెరుగైన పౌర సమాజపు ఏర్పాటు విషయంలో ఇప్పుడు అనుసరించదగిన ఉత్తమ మార్గం ఇప్పటికి ఇంతకంటే మరోటి లేదు.

ఇది చదివి మీరేమిటో నిర్ణయించుకోండి. ఉచితంగా సంపందించండి.


సత్యాన్వేషణలో,

విూ, సురేంద్ర.













స.హ. ప్రచార ఐక్య వేదిక మరియు అపార్టు సంయుక్త నిర్వహణలో




జరిగిన శిక్షణా తరగతుల విశేషాలు




సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక, ఆంధ్రప్రదేశ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (అపార్డు) వారి సంయుక్త నిర్వహణలో రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌లోని అపార్డు సంస్ధలో నవంబర్‌ 18 నుండి 22 వరకు, 12 జిల్లాల నుండి వచ్చిన 30 మందికి శిక్షణా తరగతులు నిర్వహించబడినాయి. శిక్షణ గరపటానికి స.హ. ప్రచార ఐక్య వేదిక నుండి బాలగంగాధర్‌, పుట్టా సురేంద్రబాబు, రాకేస్‌రెడ్డి గార్లు, అపార్డు నుండి కుమార్‌ రాజా, మున్‌వార్‌, సుమమాలిని గార్లు పాల్గొన్నారు. ఆ వివరాన్ని సంక్షిప్తంగా అందిస్తున్నాము.




మొదటి రోజు శిక్షకులకు ప్రేరణ కలిగించే విషయాలు తెలియజేయబడుతూ మంచి ఉపన్యాసకుడు కావాలంటే వ్యక్తిపరమైన విషయాలలో తీసుకోవలసిన జాగ్రత్తలు అలానే విషయ పరంగా తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు ఆరంబ సంబోధన గురించి శిక్షణ ఇవ్వబడింది. వివరాలలోకి వెళితే




వ్యక్తి పరమైన (ఆత్మాశ్రయ) విషయాలు




ఎ) సుస్వరం :- మంచి కంఠం కలిగి ఉండడం. పూర్వం నుండి సుస్వరం కొరకు సాధనలు ఉన్నాయి.




బి) స్వరస్ధాయి :- శ్రోతలు చెవులు రిక్కించి వినడమో, అప్పుడప్పుడు చెవులు మూసుకోనడమో చేస్తున్నారంటే ఆ వక్తి స్వరస్ధాయి సరిగా లేదని అర్ధము. శ్రోతలు హాయిగా వినగలగడమే స్వరస్ధాయి సరిగా వుందనడానికి ఒక గుర్తు.




సి) సుృటత్వం :- శబ్దాన్ని సరిగా ఉచ్చరించగలగడమే సుృటత్వం అంటే దీర్ఘాలు దగ్గర దీర్ఘాలు, పొల్లులు దగ్గర పొల్లులు, వత్తులు దగ్గర వత్తులు ఇవ్వగలగటమని అర్ధం. దీని వలన విషయం సులభంగా అర్థమౌతూ వుంటుంది. అలానే వక్త బాగా మాట్లాడినాడని శ్రోతలకు అనిపిస్తుంటుంది.




డి) స్పష్టత :- వక్త ప్రసంగంలో వాక్యానికి, వాక్యానికి మరియు పదానికి పదానికి మధ్య కూర్పుకు ఇచ్చే సమయాన్ని బట్టి స్పతష్ట వుంటుంది. కొందరు అతి వేగులుంటారు వీరు మాట్లాడుతుంటే వాక్యాలు మీద వాక్యాలు మరియు పదము మీద పదాలు పడిపోతుంటాయి. ఇందులో కొంతమంది అక్షరాలు కూడా మింగుతుంటారు. వేరొక వర్గము అతి నిదానులు. కూర్పుకు ఇచ్చే సమయము అతి ఎక్కువ వీరి ప్రసంగాన్ని అర్దము చేసుకోవడమూ కష్టమే. కనుక అతి వేగము, అతి నెమ్మదిగాక ప్రతి అక్షరాన్ని స్పష్టంగా తగినంత స్వరస్ధాయిలో ఉచ్చరించడాన్నే స్పష్టత అంటాము.




విషయ పరంగా తీసుకోవలసిన జాగ్రత్తలు :-




ఎ) ప్రకరణ భంగం చేయరాదు :- ప్రసంగించాల్సిన విషయం కాక అన్య విషయాలలోకి వెళ్ళి ప్రస్తావించటమే ప్రకరణ భంగం కలిగించడమంటే. దీనికి ఒక ప్రధాన కారణము ప్రస్తావించే విషయంలో స్పష్టమైన, లోతైన అవగాహన లేకపోవడం. మరొక కారణం ప్రస్తావించే విషయం కంటే వేరొక విషయం పై ఇష్టముండడము. ఉదాహరణకు గమనించితే రాజకీయ నాయకులలో కొందరు ఏ సందర్బము ఏ విషయముమాట్లాడమన్నా వాటితో పాటు తమ పార్టీ గురించి గొప్పలు చెప్పుకొంటూ గెలిపించమంటుంటారు. సందర్భం కాకపోయినా ఇది ప్రకరణ భంగమని తెలిసినా వారి ఇష్టము అలా నడిపిస్తుంటుంది. ఇంకొక కారణం తాను ప్రసంగీకునిగా పేరు పొందాలన్న ఆకాంక్ష, మరొక కారణం చెప్పాల్సిన విషయానికి వివరణ ఇస్తూ తనకు తెలియకుండగనే తను ప్రకరణభంగం చేస్తూ వుండడం. పై విషయాలన్నీ గమనించుకొని వక్తలు ప్రకరణ భంగం కలగకుండా జాగ్రత్త వహించాలి.




బి) సమయస్పూర్తి :- శ్రోతలను బట్టి తన ప్రసంగ సమయాన్ని ఎలా మార్చుకోవాలో అలా మార్చుకోగలిగిన వక్తకు సమయస్పూర్తి వున్నట్లు. ఇలా చేయగలగాలంటే వక్తకు భాష పై పట్టుండడమే కాకుండా ప్రసంగాంశంను క్లుప్తీకరణ చేసే సామర్ధ్యాము, వివరణాత్మకంగా చెప్పగలిగే శక్తి కలిగుండాలి. దీనితో పాటు విస్త్రృత సమాచారం ఉన్నవారై వుంటే అతిభాషణం, అల్పభాసణం చేయకుండా మితభాషణం చేయగలవారై ఉంటారు. మితభాసణం అంటే చెప్పవలసిన విషయం, కంటే ఒక పదము ఎక్కువగాని ఒక పదము తక్కువగాని లేకుండా చెప్పగలగడం. పై విషయాలన్నీ అభ్యసించి సాధించుకోవలసి వుంది.




తరువాత భారత రాజ్యాంగము- కనీస అవగాహ నావశ్యకతను వివరించి, రాజ్యాంగాలులోని కొన్ని ముఖ్యమైన అంశాలు శిక్షణ నివ్వడం జరిగింది. వివరాలు క్లుప్తంగా




భారత రాజ్యాంగము రాజ్యాంగ నిర్మాణ సభచే 1949 నవంబర్‌ 26వ తేదిన అంగీకరింపబడింది. 1950 జనవరి 26వ తేది నుండి అమలులోకి వచ్చింది. కనుకనే ఆ రోజు రిపబ్లిక్‌ డే జరుపుకొంటున్నాము. తొలుత ఇది 22 విభాగాలతో 9 షెడ్యూళ్ళతో 395 అధికరణలతో ఏర్పడి అనంతరం రాజ్యాంగ సవరణల పేరున జరిగిన మార్పులు, చేర్పులతో 26 విభాగాలు 12 షెడ్యూళ్ళు 444 అధికరణలతో పరిణమించింది.




అవతారిక, ప్రస్తావన అన్న పేరున ఉన్న భాగం రాజ్యాంగం మొత్తానికి ఆత్మవంటిది. రాజ్యాంగ సూత్రీకరణలను వ్యాఖ్యానించడం గాని, అన్వయించడం గాని ఈ ప్రస్తావన స్వరూప స్వభావాలకు లోబడే చేయాల్సి వుంటుంది. అంటే ఈ ప్రస్తావనే గీటురాయి అని అర్ధము.




రాజ్యాంగము 3వ విభాగాలు అధికారణలు 13 నుండి 35 వరకు పౌరహక్కులకు సంబంధించిన సూత్రకరణలున్నాయి. ఆర్టికల్‌ 19(1) ప్రకారం ప్రాథమిక హక్కులు '6' వున్నాయి. అవి వాక్కు మరియు భావ ప్రకటనా స్వాతంత్య్రాలహక్కు, ఆయుధాలు ధరింపకుండా శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు, సంస్ధలను, సంఘాలను ఏర్పరుచుకొనే హక్కు, భారత దేశ మంతటా సంచరించచే హక్కు, దేశములో ఎక్కడైనా నివశించే, స్థిర నివాశమేర్పరుచుకొనే హక్కు, ఇష్టమైన వృత్తిని, పనిని, వ్యాపారాలు చేసికొనే హక్కు.




అలానే ఆర్టికల్‌ 19(2) ద్వారా ఆ హక్కులకు పరిమితులు చెప్పబడ్డాయి. దేశ సార్వభౌమత్వాన్ని అఖండతకు, దేశభద్రతను, విదేశాలతోడి సంబంధాలకు, ప్రజాశాంతి భద్రతలను సభ్యత మరియు నైతికతలను చెడగొట్టే మరియు కోర్టు ధిక్కారణను, పరువు నస్టాన్ని, నేరాలను ప్రోత్సహించే అంశాలపై ఆ హక్కులకు పరిమితులు విధింపబడ్డాయి.




ఆర్టికల్‌ 14 ద్వారా చట్టము ముందు అందరూ సమానులేననే హక్కు, ఆర్టికల్‌ 15 ద్వారా మత, జాతి, కుల, లింగ, జన్మస్ధానములను బట్టి వివక్షత చూడడం నిషిద్దం ఆర్టికల్‌ 16 ద్వారా ప్రభుత్వ ఉద్యోగ, వసతుల విషయంలో సమానావకాశాలు పొందే హక్కు ఆర్టికల్‌ 17 ద్వారా అస్పృశ్యత నిషేదం.




ఆర్టికల్‌ 32 ద్వారా ప్రాథమిక హక్కులు పొందడానికి ఆటంకాలు ఏర్పడితే రక్షణ పొందటానికి హామీ ఇవ్వబడింది.




రాజ్యాంగము 4వ భాగంలో ఆదేశిక సూత్రాలున్నాయి. ఆర్టికల్‌ 5167లో ప్రాథమిక విధుల గురించి 10 సూత్రీకరణలున్నాయి. అవి రాజ్యాంగమునకు బద్దుడై ఉండుట, దాని ఆదర్శాలను, సంస్ధలను, జాతీయ పతాకలను, జాతీయగీతమును గౌరవించుట, స్వాతంత్య్ర పోరాటానికి స్పూర్తినిచ్చిన ఆదర్శాలనూతగొని వ్యవహరించుట, దేశ సార్వభౌమత్వాన్ని ఐక్యతను, అఖంతను సమర్ధించుట మరియు కాపాడుట, దేశ రక్షణకై సిద్ధపడి వుండుట, ప్రజల మధ్య మత, ప్రాంత, భాష, వర్గ విభేదాలు ఏర్పరచేలా ప్రవర్తించకుండుట, భారతీయ సంస్కృతిని మరియు సంప్రదాయాలను గౌరవించుట, రక్షించుట, పర్యావరణాన్ని, అడవులను, నదులను సరస్సులను అడవి జంతువులతో సహా ప్రకృతిని కాపాడి అభివృద్ధి పరచుట, అలానే సమస్ధకులాల యెడ జీవకారుణ్యాలు కలిగి వుండుట, శాస్త్రీయ దృక్పధాన్ని, హేతుదృష్టిని, మానవత దృష్టిని అలవరచుకొనుట, హింసను విడనాడుట, ప్రజల ఆస్తిని సంరక్షించుట, విద్వంసకార్యాలు నిరోధించుట, వ్యక్తిత్వ శక్తి సామర్ధ్యాలను పెంపొందించుకొనుట, సమిష్టి కృషి ద్వారా అన్ని రంగాల అభివృద్ధి కై కృషి చేయుట 14 సంవత్సరాల లోపు వయసు గల బాలబాలికలకు విద్యాభ్యాసం చేయు అవకాశం కలిగించుట.




మనది సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర వ్యవస్ధ. ఇంతకు ముందు వున్న ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్ధకు 1976లో చేసుకొన్న 42వ రాజ్యాంగ సవరణననుసరించి సామ్యవాద లౌకిక పద..... అవతతారికలో చేర్చడం జరిగింది.




సామ్యవాదం - సోషలిజం-సమాజవాదం అంటే ప్రకృతి సంపద దానినను సరించి సమాజం స్పష్టించుకొన్న సంపద మొత్తం సమాజం మొత్తానిది. దానిపై ఏ..............




కొద్ది మందికో గుత్తాధిపత్యం ఉండరాదు. వ్యక్తిగత ఆస్తికి పరిమితుల్ని, సమస్త సంపదపైనా నియంత్రాణాధికారం సమిష్టిదేనని, వ్యక్లు విషయంలో పనిని బట్టి, పనిచేసిన వారే ఫలితం చేయనివారికి చేయనిదానికి ఫలితం అందరాదు అన్న దృష్టిని కలిగి వుంటుంది.




లౌకికం అంటే పార లౌకికం కాదని అర్ధము. ఈ లోక విషయాలను మాత్రమే పరిమితమై వ్యవహరిస్తుండుట అని అర్ధము. పరలోకానికి సంబందించిన మత విషయాలలో తటస్ధలుగా వుండటం. తానుగ మనత మతవ్యతిరేక సంబంధ కార్యకలాపాలలో ప్రవేశించకుండాలనే, మతానుమాయులకు మత పరమైన కార్యకలాపాలు చేసుకొనే స్వేచ్చనిచ్చింది. లౌకిక రాజ్యం అంటే మత ప్రమేయంలేని రాజ్యమని అర్ధం.




ప్రజాస్వామ్యం అంటే ప్రజలేస్వాములు, యజమానులు, లేకసొంతదారులు అని అర్ధం. ప్రజల కొరకు ప్రజల ద్వారా ప్రజలే పరిపాలించుకొనే విధానం ప్రజాస్వామ్యం అమలవ్వడమంటే కేంద్ర ప్రభుత్వం దాని నిర్వహణాధికార యంత్రాంగం పార్లమెంట్‌కు జవాబుదారిగనూ, రాష్ట్ర ప్రభుత్వాలు, దాని నిర్వహణాధికార యంత్రాంగం శాసన సభకు జవాడుదారిగానూ, జిల్లా, మండల, గ్రామ, మున్సిపాలిటీ ప్రభుత్వాలు వార్డు ప్రతినిధులకు, నేరుగా ప్రజా సభకు జవాబుదారిగా వుండడమని అర్ధం. మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. ఇది సక్రమంగా అమలవ్యాలంటే ప్రతినిధుల ఎంపిక సరిగా జరగాలి. దానికి ఎన్నికలు దోషరహితంగా, లోపరహితంగా జరగాలి. ప్రజాస్వామ్యానికి ఊపరి నిర్ణయాధికారం ప్రజలది నిర్వహనాధికారం మాత్రమే ప్రభుత్వానిది అయి వుండాలి. ఇది అమలవ్వాలంటే అధికార వికేంద్రీకరణ జరిగితీరాలి. ఆర్ధిక వనరులు ఏ ప్రాంతానికాప్రాంతానికే న్యాయబద్దమైన వాటా కేటాయింపులు జరగాలి. దాని కొరకు స్ధానిక ప్రభుత్వాలకు పూర్తిస్ధాయిలో అధికారాల బదలాయింపు జరగాలి. దీనిని 73,74 రాజ్యాంగ సవరణుల చట్టం అమలు పరచడం అంటున్నాము. కళ్ళ ముందు పాలన, పాలనలో పర్యవేక్షణ, ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యం అన్నవి అమలు కావాలంటే గ్రామసభలు, వార్డు సభలు పూర్తి స్థాయిలో క్రీయావంతంగా పనిచేయగలగాలి.




ప్రజాస్వామ్యం సాంఘిక, ఆర్ధిక, రాజకీయ, సమానత్వాన్ని అంగీకరిస్తుంది. అని ఆ సెషన్‌ ముగించారు.




ఆ తరువాత సమాచార హక్కు చట్టము 2005 పూర్వాపరాలు, ఆచట్టలులోని ముఖ్యమైన సెక్షన్లు తెలియపరుస్తూ గ్రామ ప్రజల వరకు ఎలా తీసుకెళ్ళ గలమో వివరించడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళితే.




మనకు స్వాతంత్య్రము వచ్చి యింత కాలమైనా చాలా చట్టాలు బ్రిటిష్‌ కాలము నాటివే ఉపయోగించుకొంటున్నాము. ఉదాహరణకు 1860 సంవత్సరములోని ఇండియన్‌ పీనల్‌ కోడ్‌, 1861 సంవత్సరములోని పోలీసు వ్యవస్ధ 1894 సంవత్సరములోని జైయిల్‌ చట్టం 1900 సం||లోని ఖైదీల చట్టం అలానే 1986లోని వినియోగదారుల చట్టాలు.




మనకు 2005 లో వచ్చిన స.హ. చట్టం 1776 సం||లో స్వీటన్‌లో వచ్చింది. అడిగిన వెంటనే సమాచారము ఇవ్వాలన్న చట్టము వుంది. కనుకనే అవినీతి తక్కువ వున్న దేశాలలో స్వీటన్‌ మొదటిదైయున్నది. 1996లో అమెరికాలో ఈ చట్టాలుఏర్పడింది.




శ్రీమతి అరుణారాయ్‌, అన్నా హజారై లాంటి వారి కృషి వలన మనకు 2005లో ఈ చట్టాలు వచ్చింది. మిగిలిన చట్టాలకు ఈ చట్టానికి మౌలికమైన తేడా ఒకటి వుంది. మిగిలిన చట్టాలన్నీ ప్రభుత్వాధికారులు అమలు చేస్తే (ఇంప్లిమెంట్‌ చేస్తే) మనలు అమలు పరచాల్సి వుంటుంది. అలా అమలు పరచలేకపోతే జరిమానాలు మనకు పడుతుంటాయి. కాని ఇది ప్రజల చట్టాలు. ప్రజలు అమలుచేస్తే (ఇంప్లిమెంట్‌ చేస్తే) ప్రభుత్వ అధికారులు అమలు పరచాల్సి వుంటుంది. అలా అమలు పరచలేని అధికారులకు జరిమానాలు విధింపబడతాయి.




ప్రజలకు ఈ అధికారం ఎలా వచ్చింది అనుకొంటే ప్రజలే తమ ఓటు హక్కు ద్వారా అధికారులను, టాక్సులు, వ్యాట్లఉ మొ||లగు వాటి చెల్లింపుల ద్వారా ఆర్ధిక వనరులను ప్రభుత్వాలకు ఏర్పాటు చేస్తున్నారు గనుక ప్రజలకు అట్టి ప్రభుత్వాల సమాచారం.. హక్కు ఏర్పడిందనవొచ్చు. ఈ చట్టాలు యొక్క ప్రధానొద్ధేశాలు పరిపాలనలో పారదర్శకత, అధికారులకు జవాబుదారితనలు పెంచి తద్వారా అవినీతిని తగ్గించటానికి ఏర్పడింది. ఈ చట్టాలు ఎవరి గురించి చేయబడిందో ఆ ప్రజలకు ఆ చట్టాన్ని గురించి అవగాహన కలిగించే బాధ్యత మన స్వచ్చంద సంస్ధలపై వుంది. గనుక ముందుగా మన మంతా ఆ చట్టాన్ని పరిచయం చేసుకొందాం.




సమాచార హక్కు చట్టం 2005 అక్టోబరు 12వ తేదీ నుండి అములులోకి వచ్చింది. ఈ చట్టలులోని సెక్షన్లు 2,3,4,6,7,8,9,18,19,20 గురించి ఈ చట్టాన్ని ప్రజలలోకి తీసికొని వెళ్ళి బాద్యులు తప్పని సరిగా తెల్చుకొని వుండాల్సి వుంటుంది.




సమాచారము పొందగోరు వారు సమాచారము అంటే ఏమి చట్టములో వుందో అదే అడగాలిగాని, సలహాలు ఇవ్వడాలు, ప్రశ్నలు వేయడాలు చేయరాదు. కనుక సమాచారము అంటే సెక్షన్‌ 2 (ఎఫ్‌) ప్రకారం రికార్డులు, పత్రాలు, మెమోలు, ఇ-మెయిల్స్‌, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్క్యులర్లు, ఉత్తర్వులు, లాగ్‌బుక్స్‌, కాంట్రాక్టులు, నివేదికలు, పేపర్లు, శాంపిళ్ళు, మోడల్స్‌, డేటాసహ ఎలక్ట్రానిక్‌ రూపంతోపాటు ఏరూపంలోనైనా ఉన్న సమాచారం. అమలులో వున్న మరే చట్టం ప్రకారమైనా ప్రభుత్వ యంత్రాంగం సంపాదించదగిన ఏ ప్రయివేటు సంస్ధకకు సంబంధించిన సమాచారమయినా ఈ చట్టం ప్రకారం సమాచారమే.




సెక్షన్‌ 2 (3) ప్రకారాలు సమాచార హక్కు అనగా ఏ అధికార యంత్రాంగం నియంత్రణ క్రింద ఉన్న సమాచారాన్నయినా ఈ చట్టం క్రింద పొందగలిగే హక్కు (1) పనులనూ, పత్రాలనూ, రికార్డులనూ తనికీ చేసే హక్కు (2) రికార్డులతో ఉన్న సమాచారాన్నిఅంతా రాసుకోవడం. వాటినకలు, సర్టిఫైడ్‌ కాపీలు తీసుకోవడం (3) సమాచార సంపత్తి, సర్టిఫైడ్‌ శాంపిళ్ళు తీసుకోవడం (4) డిస్కెట్లు, ఫ్లాపీలు, టేపులు, వీడియో కాసెట్లు రూపంలో లేక మరే విధమైన ఎలక్ట్రానిక్‌ రూపంలో ఉన్న సమాచారాన్ని పొందడం.




సెక్షన్‌ 3 ప్రకారం ఈ చట్టంలోని నిబంధనలకు లోబడి పౌరులలోనికి సమాచారాన్ని పొందే హక్కు ఉంటుందని తెలియజేయగా సెక్షన్‌ 4 (1) (ఎ) మరియు (బి)లు ప్రకారం సమాచార హక్కు అమలయ్యేందుకు వీలుగా తమ రికార్డులను పట్టికలు, పద సూచికలతో సక్రమంగా దేశ వ్యాప్తిత నెట్‌వర్క్‌లో ఎక్కించేందుకు చర్యలు తీసుకోవాలని మరియు పౌరులు అడగకుండగనే 17 అంశాలకు చెందిన సమాచారాలు ప్రజలకు అర్ధమయ్యే రీతిలో ఆ అధికార యంత్రాంగానికి సంబంధించిన వివరాలు, విధుల, దాని అధికారుల, ఉద్యోగులకున్న అధికారాలు, విధులు, కార్యనిర్వహణలో పాటించే సూత్రాలు, ఉద్యోగులు పొందే నెలవారి వేతనాలు, సబ్సిడి పధకాల అమలు .. వాటికి కేటాయించిన నిధులు, లబ్ధిదారుల వివరాలు, అలానే అన్ని ప్రణాళికలు, ప్రతిపాదిత వ్యయాలు, జరిపిన చెల్లింపులు, వివిధ ఏజెన్సీలకు కేటాయించిన బడ్జెట్‌ వివరాలు, పౌనసమాచార అధికారుల పేర్లు, హోదాలు, ఇతర వివరాలు మొదలగు సమాచారాన్ని పౌరులకు అందుబాటులో వుంచాలి.




సెక్షన్‌ 6 ప్రకారాలు దరఖాస్తు చేసుకునే వివరాలు అందివ్వబడినాయి. దరఖాస్తును ఇంగ్లీషు, హిందీ లేక స్ధానిక అధికార భాసలో రాత పూర్వకంగా లేక ఎలక్ట్రానిక్‌ రూపంలో నిర్గతరుసులతో పాటు పౌర సమాచార అధికారికి గాని సహాయ పౌరసమాచార అధికారి ... సహాయాన్నంత అందించాలి. సమాచారం కొరుతున్న దరఖాస్తుదారు అందుకు గల కారణం ఏమిటో వివరించాల్సిన అవసరం లేదు. కబురు పంపటానికి అడ్రసు మాత్రమే ఇవ్వాలి.




సెక్షన్‌ 7లో పౌర సమాచార అధికారి విధులు చెప్పబడ్డాయి. దరఖాస్తు అందిన 30 రోజులలోపు వీలైనంత త్వరగా సమాచారాన్ని అందించాలి. లేకపోతే ఆ దరఖాస్తును తిరస్కరించినట్లు వచ్చి ఒక వ్యక్తి ప్రాణానికి గాని, స్వేచ్చను గాని సంబందించిన అభ్యధ్దన అయితే అది అందిన 48 గంటలలోనే అందచేయాలి. లేకుంటే సెక్షన్‌ 8 లేక 9 ప్రకారం తిరస్కరిస్తున్నట్లు తెలియజేయాలి. 30 రోజుల తరువాత పొందే సమాచారానికి ఆ సమాచారానికి అయ్యే రుసులు కట్ట కుండగనే ఉచితాలుగా పొందవచ్చు. అభ్యర్ధన తిరస్కరిస్తే దానికి కారణాలను, ఆ తిరస్కరణపై అప్పీలు చేసుకొనేందుకు ఉన్న కాలపరిమితి, అప్పీలు విచారించి అధికారి వివరాలు దరఖాస్తుదారునికి తెలియజెప్పాలి.




సెక్షన్‌ 8 ప్రకారాలు కొన్ని సమాచారులను పౌరులకు అందిచాల్సిన బాధ్యత లేదు. అవి భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతలపై ప్రతికూల ప్రచారం చూపించే సమాచారం, దేశభద్రత వ్యూహాత్మక, వైఖ్ఞానిక, ఆర్ధిక ప్రయోజనాలపై, విదేశాలతో సంబంధాలపై ప్రతికూల ప్రభావం కలిగించే సమాచారం, నేరాన్ని ప్రేరేపించే సమాచారం. న్యాయస్థానం ప్రకటించ కుడదన్న సమాచారం, పార్లమెంట్‌, శాసన సభ హక్కులను ఉల్లంఘించే సమాచారం. వాణిజ్యపరమైన గోప్యత, వ్యాపార రహస్యాలు, మేదా సంపత్తికి సంబంధించిన సమాచారం విశాల ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సమర్ధాధికారి భావించిన పక్షంలో మాత్రమే వెల్లడిచేయవచ్చు. విదేశీ ప్రభుత్వం నుంచి విశ్వాస బద్దంగా అందిన సమాచారం సమాచర వెల్లడి వల్ల ఏ వ్యక్తి ప్రాణానికైనా, భౌతిక భద్రతకైనా హాని కలిగే సమాచారం వాటిని ఇవ్వాల్సిన బాధ్యత లేదా అలానే సెక్షన్‌ 9 ప్రకారం ఒక వ్యక్తికి సంబంధించిన కాపిరైట్‌ ఉల్లంఘన జరిగే పక్షంలో అలాంటి సమాచారం ఇవ్వవల్సిన బాధ్యత లేదు.




సెక్షన్‌ 19, 20 ల ప్రకారం దరఖాస్తుదారు 30 రోజుల లోపు సమాచారం పొందకపోయినా, పొందిన సమాచారముతో అసంతృప్తి చెందినా అపికేట్‌ అధారిటీకి 30 రోజులలోపు అప్పీలు చేసుకోవచ్చును. అప్పీలేట్‌ అధారిటీ నుండి కూడా తగు స్పందన లేకుంటే 90 రోజులలోపు సమాచార కమీషనకు రెండవ, అప్పీలు చేసికోవచ్చును. ఆ సమాచర కమీషన్‌ నిర్ధేశించిన కాలపరిమితి లోపు సమాచారం అందించలేదని భావించినా, దురుద్ధేంతో తిరస్కరించినట్లు భావించినా, తెలిసికూడా తప్పుడు, అసంపూర్తి, తప్పుదావ పట్టించే సమాచారం అందించారని ఎంచినా కోరిన సమాచారాన్ని ద్వంసం చేసారని భావించినా మరే విధంగా సమాచారం అందకుండా అడ్డుపడ్డారని భావించినా, దరఖాస్తును స్వీకరించేంత వరకు లేక సమాచారం అందించేంత వరకు రోజుకు రు. 250/- చో||న జరిమానా ఆ పౌర సమాచార అధికారికి విధించవచ్చు. మొత్తం మీద ఆ జరిమానా రు. 25, 000/- మీర కూడదు.




చివరిగా అపార్టు కమీషనర్‌ గారైన శ్రీ చంద్రమౌళి గారు తమ అమూల్య సందేశాన్ని ఆహుతులకు అందించారు. క్లుప్తంగా వివరాలలోకి వెళితే చట్టాలు చేయడం ఎంత సులభమో అవి అమలు పరచడం అంత కష్టమన్నారు. చట్టాలు ఎవరు చేస్తున్నారో వాటిని అడ్డంకొనేది వారే కన్న నగ్నసత్యాన్ని బైట పెట్టారు. చట్టాలు ఎంతటి గొప్పవైనా అమలు పరిచే విధానంలో అడ్డంకుల వల్ల ఆ చట్టాలు పుస్తకాలకే పరిమితమైనాయన్నారు. కాని ఇప్పుడు వచ్చిన గొప్ప చట్టాలు ఆర్‌టిఐ మరియు ఆర్‌టిఎఫ్‌ అమలులోకి తీసుకురాగలిగితే సమాజం మంచి ఫలితాలు చవిచూస్తుందన్నారు. ఈ ఆర్‌టిఐ వచ్చినాక తప్పు చేయటానిక జంకుతున్నారన్నారు. తప్పు చేసినవారు ఎప్పటికో కప్పటికి ఆ తప్పును ఓప్పుకోక తప్పని పరిస్థితి ఈ చట్టం వలన ఏర్పడిందని, తప్పులు బయటపడతాయి గనుక తప్పులు చేయకూడదన్న న్యాయానికి అధికారులను ఈ చట్టం తెచ్చిందన్నారు. బీదరికం, అవినీతి అతి తక్కువైన నార్వే, స్వీడన్‌ దేశాలలోని పారదర్శకత మన భారతదేశాలలో రావాలి వస్తుందంటూ ముగించారు.




గమనిక :- స.హ. ప్రచార ఐక్యవేదిక, అపార్టు వారి సంయుక్త నిర్వహణనలో జరిగే ద్వితీయ శిక్షణా తరగతులు 2011 డిసెంబరు 19నుండి 23 వరకు రాజేంద్రనగర్‌లో జరుగుతాయి. ముందుగా తెలియపరచిన జిల్లా బాద్యులు తమ తమ జిల్లాల నుండి ఇద్దరు చో||న హాజరు అయ్యేలా చూడడంతో పాటు ఆ శిక్షణకు వచ్చే ముందు మీదగ్గరున్న (శిక్షణాలయంలో ఇవ్వబడిన సమాచారం (నోట్సు))ను వారికి అందజేసి తగినంత అద్యయనంతో హాజరు అయ్యేటట్లు చూడగలరు.




గమనిక :- సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక తూర్పుగోదావరి జిల్లా కమిటి సన్నాహక సమావేశాలు కాకినాడలో ది. 13-11-10న, విశాఖ జిల్లా కమిటి సన్నాహక సమావేశాలు ది. 14-11-10న, విజయనగరం జిల్లా కమిటి సన్నాహక సమావేశాలు ది. 27-11-10న మరియు శ్రీకాకుళం జిల్లా కమిటి సన్నాహక సమావేశాలు ది. 28-11-10న జరిగాయి.




గమనిక :- జనవరి 30, 31న జరుపుకోబోవు సమాచార హక్కు ప్రచార ఐక్య వేదిక ప్రధమ వార్షికోత్సవ సమావేశాలకకు మిత్రులు, మిత్రసంస్ధలు తమ పరిచయంలోని క్రొత్త వ్యక్తులను, సంస్ధలను కలుపుకొని రావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.