Showing posts with label 204. Show all posts
Showing posts with label 204. Show all posts

Friday, April 4, 2014

సంక్రాంతి - విప్లవ - సందేశం శాస్త్రీయ దృక్పథం - (కీలకాంశాలు)

యోచనాశీలురైన మిత్రులారా! శాస్త్రీయ దృక్పథాన్ని గురించి ఎవరికి వాళ్ళుగా, వారి వారి అవగాహనలను గమనించుకుంటూ ఇతరత్రా లభించిన సమాచారాన్ని కలుపుకుని 5 పేజీలకు (ఎ4) తగ్గకుండా వ్యాసాలు రాసుకురావాలని నవంబర్‌ 22 రాజమండ్రి సమావేశంలో నిర్ణయించుకున్నాం. అలసత్వం వల్లగానీ, పనులవత్తిడి వల్లగానీ, విషయ క్లిష్టత వల్లగానీ డిశంబర్‌ 22 నాటి సమావేశానికి చాలామంది ఆ పని పూర్తి చేసుకురాలేదు. పసల భీమన్నగారు, పేరిలింగంగారూ, కెమెరా విజయ్‌ కుమార్‌ గారు మాత్రం కొంతవరకు రాసుకొచ్చారు. భీమన్నగారి వ్యాసం 'శాస్త్రీయదృక్పథం' అన్నదానికి పరిమితం కాక, అనేకాంశాలపై ప్రసంగంలా ఉందనీ, విజయ్‌కుమార్‌ గారి రచనలో శాస్త్రీయ దృక్పథానికి చెందిన కీలకాంశాల జాబితా మాత్రమే ఉందనీ విచారణలో అనుకున్నాము. అటు తరువాత శాస్త్రీయ దృక్పథంతో ముడిపడి ఉన్న అనేకాంశాలపై విచారణ సాగించి, పై సమావేశం నాటికైనా అందరమూ శాస్త్రీయ దృక్పథాన్ని గురించి తగినంతగా రాసుకువద్దాం అని తీర్మానించుకున్నాం. నేనూ ఆనాటికే వ్యాసం తయారు చేద్దాం అనుకున్నాను మొదట. అటు తరవాత, నూతన సంవత్సరం రాబోతోందికనుకనూ, జనవరి (సంక్రాంతి) ప్రత్యేక సంచికగా వివేకపథాన్ని తీసుకువద్దామనిపించడం వల్లనూ, శాస్త్రీయ దృక్పథాన్ని అర్ధం చేసుకోడానికి మార్గదర్శకాలుగా (కరదీపికగా) ఉండే రీతిలో కొన్ని ముఖ్యాంశాల పట్టిక వరకైనా పాఠకుల ముందుకు తేవడం ప్రయోజనకరంగా ఉంటుందనిపించడం వల్లనూ ఇదిగో వ్యాసం ఇలా మీ ముందుకొచ్చింది.

శాస్త్రీయ దృక్పథం (ప్రధానాంశాల పట్టిక - సంక్షిప్తవివరణ)

1. ఏదైనా ఒక విషయాన్ని గమనించాలన్నా, దానిని వివరించాలన్నా, ముందా విషయ క్షేత్రాన్ని గమనించి గిరిగీసుకోవాలి. దీనినే పారిభాషికంగా క్షేత్రదర్శనం చేయడం అంటారు. అధికరణము, ప్రకరణము అన్న పదాలూ దీనిని సూచించేటివే. ఎంపిక చేసుకున్న అంశము అని వాటి అర్థం.

2. కనుకనే శాస్త్రీయ దృక్పథం అన్న విషయం ఏ క్షేత్రానికి సంబంధించిందో ముందుగా తెల్చుకుని దాని పరిధిని నిర్ణయించుకోవాల్సి వస్తోంది. ఈ పని చేయకుంటే, అవసరమైన విషయాలు తగినంతగా చెప్పుకోలేకపోవడమో, అనవసరమైన విషయాలు అంటే ఈ క్షేత్రంలోనివి కాని విషయాలు చెప్పుకోవడమో జరిగే అవకాశం ఏర్పడుతుంది.

3. దీనిని గురించి వివరించే వారితోపాటు, వినే, పరిశీలించే వారికి కూడా ఈ వివరం తెలిసుండాలి. విచారణ పద్దతికి సంబంధించి ప్రకరణ భంగం చేయకుండడం, ప్రకరణ భంగం జరక్కుండా చూసుకోవడం, జరిగిందోలేదో చూసే పద్దతి తెలిసుండడం చాలా చాలా అవసరం. పారిభాషికంగా దీనిని 'లక్షణ పరీక్ష' అనంటారు. అందులో మూడు భాగాలుంటాయి. ప్రకటించిన దానిలో (అది ప్రసంగం కావచ్చు, రచన కావచ్చు)

'అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవము' అన్న మూడు దోషాలున్నాయా లేవా? అన్నది పట్టిచూడడం దీని పని.

ఎ) అతివ్యాప్తి :- చెపుతానన్న విషయాన్ని విడచి ఇతరేతరాల గురించీ చెపుతుంటే అతని వ్యక్తీకరణలో అతివ్యాప్తి దోషం - అక్కరలేని విషయాల గురించి చెప్పడం - అన్నదోషం ఉందంటాము.

బి) అవ్యాప్తి :- చెప్పవలసిన విషయాన్నంతటినీ చెప్పకుండా ముగిస్తే, ఆ వ్యక్తీకరణలో అసంపూర్ణత - అవ్యాప్తి - అనే దోషం ఉందంటాము.

సి) అసంభవం :- ఇది మరీ ఘోరమైనది. చెపుతానన్న, చెప్పాల్సి ఉన్న దాన్ని విడిచి - అస్సలు పట్టించుకోకుండా - వేరు వేరు విషయాల గురించి వివరిస్తుండడం అంటే అతడు చెపుతున్న దానిలో చెప్పాల్సిందేమీ లేకుండడం.

గమనిక :- ఈ మూటిలో ఏది జరిగినా జరగాల్సింది జరగలేదనేకదా! అందులో అతి వ్యాప్తి, అసంభవాల్లో ప్రకరణ భంగం జరుగుతుంది. అవ్యాప్తిలో సమగ్రత - సరిపడినంత - ఉండదు. ఇంత వరకు మీకు స్పష్టంగా అర్థమైతేనే మీరు ఏమేమి చెప్పాలో, ఏమేమి చెప్పనక్కరలేదో, ఏమి చెప్పకూడదో నన్న స్పష్టతరాదు. అలాగే ఎదుటి వారు చెప్పిన దానిలోని దోషాదోషాలు చూడడమూకుదరదు. కనుకనే ఏ విషయ ప్రతిపాదనకైనా, విచారణకైనా అధికరణాన్ని దాని క్షేత్రాన్ని (పరిధిని - విస్త్రృతిని) నిర్థారించుకోవడం అత్యంతకీలకమవుతోంది. ఇది నిజమోకాదో తేల్చుకోండి.

క మరైతే, ఇప్పుడు మనం విచారించుకుందామనుకున్న 'శాస్త్రీయ దృక్పథం' అన్నదాని క్షేత్రమేది?

1. ఇది జ్ఞాన భాగానికి చెందింది. దృక్పథాలు తలలో - మనస్సులో - ఏర్పడే భావరూపాలు.

2. కలిగిన ప్రతిజ్ఞానాన్ని దృక్పథం అనము, అలాగే ఏర్పడ్డ ప్రతి అభిప్రాయాన్ని దృక్పథం అనము. ఒక థలో ఏర్పరచుకున్న కొన్ని అభిప్రాయాలనే దృక్పథాలు అనంటాము.

3. జ్ఞానక్షేత్రంలో ఒక క్రమమూ, వివిధ థలూ ఉంటాయి. వాటి గురించిన అవగాహన ఉంటే గాని, శాస్త్రీయ దృక్పథం యొక్క క్షేత్రాన్ని ఖచ్చితంగా దర్శించడం కుదరదు. కొద్దిగా ఆ వివరాలు చెపుతాను జాగ్రత్తగా గమనించండి.

జ్ఞానక్షేత్రం - వివిధ అంశాలు

1. విడివిడి అంశాలకు చెందిన అనుభూతులు :- ఆయా జ్ఞానేంద్రియాల ద్వారా వేటి కవిగా మనకు తెలియబడే వాటిని అనుభూతులు అనంటాము. జ్ఞానం పుట్టుక అన్నది జరిగే ఆరంభథ ఇది.

2. భావనలు :- కలిగిన అనుభూతులు స్మృతి కేంద్రంలో నిల్వ ఉండేదీ, గుర్తుకు చేసుకుంటే గుర్తు కొచ్చేది ఏమిటో వాటినే 'భావన'లు అంటారు. ఉదా : చింతపండు నోట్లో వేసుకున్నాం. నాలుకలోని రసనాడుల ద్వారా మెదడుకు చేరిన సమాచారం మనకు ఒక అనుభూతిని కలిగించింది. అది భాష ఏర్పడ్డాక వారి వారి భాషా సంకేతాల రూపంలోగానీ, భాష రాక (లేక) ముందు యథాతధముద్రల రూపంలోగాని స్మృతికేంద్రంలో నిక్షిప్తం అవుతుంది. నిలిచి ఉంటుంది. అవెప్పుడైనా వాటంతటవిగానీ, మనం గుర్తుచేసుకోవాలనుకున్నప్పుడు గానీ, దానిని గుర్తుకు తెచ్చే బాహ్య పరిస్థితులెదురైనప్పుడు గానీ గుర్తుకు వస్తుంటుంది. అలా ఏది స్మృతిలో ఉండి, స్మరణ రూపంలో గుర్తుకు వస్తుందో ఒక్కసారి మీ మీ అనుభవాలను గుర్తుచేసుకోండి. చింతపండుకు సంబంధించి నాలుక ద్వారా అందిన సమాచారం మీలో ఏ అనుభూతిని కలిగించిందో, అది గుర్తొచ్చింది కదూ! దానినే 'భావన' అనంటారు. అనుభూతుల తాలూకు నిల్వ ఉండేది, గుర్తుకొచ్చేది ఏదో దానిని 'భావన' అంటాము.

3. అభిప్రాయాలు :- (భావములు) :- అనుభూతి జ్ఞానరూపమే, భావనా జ్ఞానరూపమే, అభిప్రాయ మన్నదీ జ్ఞానరూపమే అయినా ఆ మూటికీ తేడా ఉంది. ఇవి ఒక క్రమంలో ఒక దాని ఆధారంతో మరొకటి ఏర్పడుతుంటాయి. ఏదేని ఒక విషయానికి సంబంధించి పలు అనుభవాలు, పలుమార్లుగా కలిగితే వాటన్నంటి క్రోడీకరణ రూపంగా మెదడు (మనస్సు) ఏర్పరచుకునే భావాలను అభిప్రాయాలంటాము. ఇవి వివిధంగా ఏర్పడుతుంటాయి.

ఉదా : 1. చింతపండుతిన్నాము = ఒక అనుభూతి కలిగింది. భాషలో 'పులుపు' అన్న పదం వాడామాఅనుభూతికి గుర్తుగా. ఇప్పుడు 'పులుపు' అనగానే ఏది గుర్తుకొస్తోందో దానిని 'పులుపు' అన్న భావన అన్నాము. అవునా? కాదా?

గమనిక : మిత్రులారా! దృక్పథం అన్న దాని దగ్గరకు రావడానికిగాను గమనించాల్సిన అంశాల్ని పట్టి చూస్తున్నాం. ఇక్కడేమాత్రం తొందరపడినా, అశ్రద్దగా ఉన్నా క్షేత్ర నిర్ణయం చేయడంలో పొరపాటు జరిగిపోతుంది. అలా జరగడమంటే ఏమిటో తెలుస్తొందా. అది విచారణ ప్రక్రియలో - మార్గంలో - తొలి అడుగే తప్పుబడడమన్నమాట. కనుక దానితో బాటు నేను చెపుతున్న క్రమం కూడా అలాగే ఉందో లేదోనూ పరికించండి.

క మళ్ళీ ముందుకు సాగుదాం. అలా చింతపండును పలుమార్లు తిన్నాం. 'పులుపు' అనుభూతి ప్రతిసారీ దానికదిగా మళ్ళీ మళ్ళీ కలుగుతూనే వచ్చింది. దానితో బాటు ఇప్పుడు 'చింతపండు పుల్లగా ఉంటుంది' అన్న భావము ఏర్పడుతుంది. అదిగో ''అలా చింతపండు పుల్లగా ఉంటుంది.' అన్న రూపంలోని జ్ఞానాన్నే 'అభిప్రాయము' అనంటాము. ఈ క్రమంలో అనేకసార్లు తిన్న చింతపండు రుచి ఒకేలాగ ఉందనిపించవచ్చు. కొద్దిపాటి తేడాలున్నట్లూ గమనింపుకు రావచ్చు. మొత్తమ్మీద పులుపుగా ఉంటుందన్న అభిప్రాయమే ఉన్నా, నిజంగా అనేకమార్లు తిన్న వివిధ చింతపండు రుచిలో తరతమ భేదాలు గనక నీగమనింపులోకి వస్తే. ఆ అనుభూతాల సాధారణ రూపంగా, చింతపండు పులుపుల్లోనూ తేడాలుంటాయి. (ఉండొచ్చుకాదు) అన్న అభిప్రాయం ఏర్పడుతుంది.

గమనిక : ఇదంతా ప్రత్యక్ష ప్రమాణం ద్వారా జరిగే ప్రక్రియే - జ్ఞానసాధకాలుగ అంగీకరించవలసిన మరో రెండు ప్రక్రియలున్నాయి. వాటిని అనుమాన, శబ్ద ప్రమాణములంటారు. ఈ రెండు ప్రమాణాల ద్వారా క్రొత్త 'అనుభూతులు' ఏర్పడవుగానీ, ఉన్న అనుభూతులతో ముడిపెట్టిగానీ, ఏర్పడి ఉన్న అభిప్రాయాలతో ముడిపెట్టుకునిగానీ, మరికొన్ని అభిప్రాయాలు ఏర్పడుతుంటాయి.

ఉదా : వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టీ ఆయా విషయాలపై (అవి మన అనుభూతిలో లేనివైనా) మనలో అభిప్రాయాలు ఏర్పడుతుంటాయి. ఇది మీ అనుభవంలో ఉందో లేదోనూ చూసుకోండి. యముడున్నాడు స్వర్గనరకాలున్నాయి. రంభా వూర్వశులున్నారు. అలాంటి వాళ్ళెవరూలేరు. సమసమాజం వస్తుంది. లాంటి అభిప్రాయాలన్నీ అలా ఏర్పడేటివే, ఏర్పడినవే. ఊహలాధారంగా (అనుమాన ప్రమాణాదారంగా) నూ అలాంటి అభిప్రాయాలు ఏర్పడే వీలుందో లేదో ఆలోచించండి.

దృక్పథాలు :- ఇవీ అభిప్రాయాల రూపంలో ఉండేవే అయినా, అభిప్రాయాలన్నీ దృక్పథాలు అనడానికి సరిపోవు. నిజానికి దృక్పథాలు ఏర్పడ్డ అభిప్రాయాలాధారంగా - మన ఇష్టాయిష్టాలు (స్వభావం), సాంఘికీకరణ ద్వారా మనలో విలువలుగా ఏర్పడి ఉన్న అభిప్రాయాలు కలగలిసిన మనం అంటే మన మూర్తిమత్వం (వ్యక్తిత్వం) ఆయా విషయాలు, వ్యక్తులపై ఏర్పరచుకునే వాటిని దృక్పథాలు అనంటారు. ఆయా అభిప్రాయాలననుసరించి వాటికాధారంగా ఉన్న విషయాలను మనం చూస్తున్న తీరును 'ధృక్పథం' అంటారు. వాటి విషయంలో ఎలా మెలగాలనుకుంటున్నామో దానిని మానసిక వైఖరి అనంటాము. వాటిని చూస్తున్న తీరును 'దృక్పథం' అనుకోగా, వాటిపట్ల ఎలా ఉండాలనుకుంటున్నామో దానిని ఆ దృక్పథం పునాదిగా- నేపథ్యంగా - ఏర్పడ్డ వైఖరి అనంటున్నాము.

ఉదా :- రాముడు అమాయకుడు అన్న అభిప్రాయం ఏర్పడింది నీలో. అది అనేకసార్లు అతణ్ణి ఆయా విషయాలలో అతడు ప్రవర్తిస్తున్న తీరును అనుభవరూపంలో గమనించడం ద్వారా ఏర్పడింది. (అభిప్రాయాలు అలాగేగదూ ఏర్పడతాయనుకున్నాం) దీనిని గమనించిన ఇరువురి వ్యక్తులకు అతని పై రెండు రకాల అభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఒకరేమో అతడు మంచివాడు అన్న దృష్టిని ఏర్పరచుకున్నాడు, మరొకడు అతడు అసమర్థుడు అన్న నిర్ణయానికి వచ్చాడు. (ఇలా జరిగే వీలుందా లేదా?)

ఎ) ఇందులో ఒకడు మంచివాడు, బలవంతుడూ, ఇతరులకు సాయం చేసే స్వభావం కలవాడనుకోండి. ఇప్పుడతడు అమాయకుడు అసమర్థుడు అని తాననుకుంటున్న వాని విషయంలో ఏదైనా సాయం చేద్దాం అనుకుంటుంటాడు. ఇందులో అతడు అమాయకుడైన అసమర్థుడన్నది దృక్పథం క్రిందికి వస్తుంది. అతనికేదైనా సాయం చేద్దాం అన్నది ఆ దృక్పథం ఆధారంగా ఏర్పడ్డ మానసిక వైఖరి అవుతుంది. దృక్పథమూ ఒక మానసికవైఖరేనన్నది గుర్తుంచుకోవాలి.

బి) అదే మరి ఆ బలహీనుడైన వ్యక్తి మోసగాడనుకోండి. అతడు చెడ్డవాడు బలహీనుడు అన్న అవగాహనకలిగింది ఈ మంచి బలవంతుడికి. అతనిపై ప్రతికూల దృష్టి ఏర్పరచుకున్నాడు. దానిని దృక్పథం అనాలి. అతణ్ణి పోలీసులు పట్టుకుంటే మేలు అనిగానీ, అతని మోసాలకు ఎవరూ చిక్కకుండా ఉంటే బాగుంటుంది అనిగాని, అవకాశముంటే అతణ్ణి పట్టుకుందాం, పట్టిద్దాం అనిగానీ, అతడి గురించి నలుగురికీ తెలియచేద్దాం అనిపిస్తుంటే అది అతని పట్ల ఏర్పడ్డ దృక్పథాన్నుండి మనస్సు ఏమి చేయాలనుకుంటుందో, ఏమి జరగాలనుకుంటుందో అది అతని మానసిక వైఖరి అనంటాం.

గమనిక :- ఈ థలోని అభిప్రాయాలలో దేనిని దృక్పథం అనాలి. దీనిని మానసిక వైఖరి అనాలి అన్న దానిని ప్రతి సందర్భంలోనూ విడగొట్టి చూపడం ఒకింత క్లిష్టమైనదవు తోంది. అయినా ఒక సాధారణ సూత్రంగా; అతణ్ణి గురించి ఏమనుకుంటున్నావన్నది దృక్పథంగానూ, అతని విషయంలో ఎలా ఉండాలనుకుంటున్నావన్నది మానసిక వైఖరిగానూ చెప్పుకోవచ్చు. మన మన వ్యక్తిత్వాలననుసరించి ఒకే విషయంపై వివిధ దృక్పథాలు ఏర్పరచుకోవచ్చు. ఏర్పడవచ్చు.

శాస్త్రీయ దృక్పథం

1. దృక్పథమంటే ఆయా వ్యక్తుల్ని, విషయాలను చూస్తున్నతీరు అని చెప్పుకున్నాంకదూ! అవి అభిప్రాయాల రూపంలోనే ఉంటాయి. అనుభూతులనుండి పుట్టిన భావనలు, వాటి ఆధారంగా ఏర్పడ్డ అభిప్రాయాలు (భావములు) అన్నవాటి ఆధారంగా వాటిని మనం చూస్తున్న తీరును దృక్పథం అంటాము. దృక్పథాలూ ఈ క్రమాన్ననుసరించి మూడో థలో ఏర్పడేటివి. ఇక దృక్పథాలననుసరించి, వాటి విషయంలో ఎలా ఉండాలనుకుంటున్నామన్నది 4వ థ అభిప్రాయము అవుతుంది. ఎవరైనా దృక్పథాన్ని మానసిక వైఖరిని ఒకే విభాగం క్రింద చెప్పుకున్నా ఖచ్చితంగా కాదనాల్సినంత అవసరమేమీ లేదు.

క మనం వాటి వాటిని చూస్తున్న తీరే. వాటిపట్ల ఎలా ఉండాలో నన్న భావానికీ దారితీస్తుంటుంది. మీమీ అనుభవాల్లో ఇది ఇలాగే ఉందో లేదో జాగ్రత్తగా పరిశీలించి తేల్చుకోండి.

క మానవ జీవితం మొత్తం జ్ఞానము - దానిననుసరించి సాగే పనులు అన్న రూపంలోనే ఉంటుంది. జ్ఞానమన్నదానిని వివేకము - ఇష్టాయిష్టాలు అన్న రెండుగా విడగొట్టి చూసుకుంటే జీవితావగాహనలో మరింత స్పష్టత ఏర్పడుతుంది.

క మన జ్ఞాన పరిధిలోకి చేరిన ఆయా విషయాలు, వ్యక్తుల పట్ల మనం ఏర్పరచుకునే దృక్పథాల వల్ల, వారిని వాటిని మనం చూస్తున్న తీరువల్ల ఏర్పడే మన పనులవలన సమాజానికి, ప్రకృతికి మేలు జరగడానికీ, కీడు జరగడానికీ కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఉన్నదున్నట్లు తెలుసుకోడానికీ, కార్యాచరణకు సంబంధించి సరైన నిర్ణయాలకు రావడానికీ అవసరమైన చూపునే సరైన చూపు అనంటారు. సరైన చూపు అన్నా శాస్త్రీయ దృక్పథం (వైజ్ఞానిక దృక్పథం) అన్నా ఒక్కటే.

దృష్టుల్లో రకాలు

1) ప్రధానంగా దీనిని రెండుగా విభజించుకోవచ్చు. పాక్షిక దృష్టి - నిస్పాక్షిక దృష్టి అనందాంవాటిని

2) పాక్షిక దృష్టిలో మళ్ళా రెండు భాగాలుంటాయి. ఒకటి అనుకూల దృష్టి రెండు ప్రతికూల దృష్టి

3) నిస్పాక్షిక దృష్టి అన్న దానిని బహుముఖాలుగా విభజించి చూసుకోవచ్చు. నిజానికీ మాటకు అనుకూల, ప్రతికూల దృష్టులు లేకుండా అని అర్ధం. దాని అన్వయరూపాలు మాత్రం అనేకం.

ఎ) సత్యాసత్యాలు గమనించాల్సిన, స్వీకరించాల్సిన సందర్భంలో నిస్పాక్షిక దృష్టి కలిగి ఉండడమంటే సత్యపక్షాన్ని స్వీకరించడానికీ, అసత్యపక్షాన్ని విసర్జించడానికీ సిద్దంగా ఉండాలన్న దృష్టి కలిగిఉండడం.

బి) అలాగే ధర్మాధర్మాలు నిర్ణయించాల్సిన, స్వీకరించాల్సిన సందర్భంలో నిస్పాక్షిక దృష్టి కలిగి ఉండడమంటే ధర్మపక్షాన్ని స్వీకరించడానికీ, అధర్మ పక్షాన్ని విసర్జించడానికీ సిద్దపడాలి అన్న దృష్టి కలిగి ఉండడమని.

4) నిస్పాక్షిక దృష్టి కలిగి ఉండాలంటే ఇరుపక్షాలకు చెందిన వ్యక్తులలో ఎవరి పక్షం సరైనదో నిర్ణయించాల్సి వస్తే ఆ ఇరుపక్షాలను తన - పర అన్న దృష్టితోగాని, శతృమిత్ర దృష్టితోగాని, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అన్న దృష్టితో గానీ, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అన్న దృష్టితోగానీ, ఆశాభయాల దృష్టితోగానీ, కీడు మేలు అన్న దృష్టితోగాని గతంలో అతనేమిటి అని గాని ఇలా ఆపక్షాలతో ముడిపడిన ఎట్టి వ్యత్యాసాలను పెట్టుకోకుండా విషయాన్ని విషయంగా చూడాలి అన్న దృష్టి కలిగి ఉండడాన్ని నిస్పాక్షిక దృష్టి అనంటారు.

5) ఈ నిస్పాక్షిక దృష్టి అంటే ఏ పక్షంవైపుకూ మొగ్గకుండడం అన్న దానికి విపరీతార్థమూ తీయవచ్చు. నిర్లిప్తంగా ఉండడం, తటస్తునిగా ఉండడం, ఉదాసీనంగా ఉండడం లాటివీ ఏ పక్షాన్నీ వహించకపోవడం క్రిందికే వస్తాయికదా! అని అపార్థాన్ని గుంజవచ్చు. కానీ మన సందర్భం అదికాదు. ఈ శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచుకోమని చెప్పడానికి వెనక ఏ ప్రయోజనాకాంక్ష ఉంది? అన్నది చూస్తే, వ్యక్తిని సరైన ప్రవర్తనకు దారి తీయించే సరైన అవగాహనకు, నిర్ణయాలు చేసుకోడానికీ తగిన సమర్థుణ్ణి చేయడానికిఉద్దేశించింది అని తెలుస్తుంది.

6. పాజిటివ్‌ ధింకింగ్‌, (పాజిటివ్‌ యాటి ట్యుడ్‌) అన్నమాట వ్యక్తిత్వ నిర్మాణ బోధనలో ప్రముఖంగా వినబడుతోంది. అంతా మన మంచికే అన్న సామెత ఉంది చూడండి. అది పాజిటివ్‌ థింకింగ్‌కి పరాకాష్ట. అలాంటివి కథల్లో బాగుంటాయి కాని వాస్తవ జీవితానికి పనికిరావు. అయితే దానిని ఆ అర్థంలో కాకుండా ప్రతికూల పరిస్థితులు - వైఫల్యాలు వచ్చినప్పుడూ, నీరసపడకుండా, నిష్క్రీయా పరుడవుకాకుండా, ఆత్మస్థైర్యంతో, ఆశావహ దృక్పథంతో ఉండడం అన్న అర్థంలో తీసుకుంటే అది మేలు కలిగించవచ్చు.

ఒక్కమాట! ఆశావహదృక్పథం, ఆత్మస్థైర్యం వారి వారి వాస్తవ సామర్థ్యాలకు అనుగుణంగా లేకుండా, అతి అయ్యిందనుకోండి. అది చాలా నష్టాన్ని కలిగిస్తుంది. దానినే ఆత్మాథిక్యతా భావం, (సుపీరియారిటీ కాంప్లెక్సు) అంటారు. మనం ఏర్పరచుకునే దృక్పథాలు (చూసే చూపు) వివేక జనితమైందిగా, సరైన అవగాహన పునాదిగా ఏర్పడింది లేదా ఏర్పరచుకున్నదిగా ఉండాలి.

ఇష్టాయిష్టాలు : స్వభావజనితమైన ఇష్టాయిష్టాలు, వివేక చోదితమైన ఇష్టాయిష్టాలు అన్న రెండుగా ఇష్టాయిష్టాలను విభజించుకుంటే, స్వభావజనితమైన ఇష్టా ఇష్టాలను వివేకపు నియంత్రణలో ఉంచుకోవడం అవసరం, మంచిది అన్న దృస్టికి రావడంఅన్నిటికంటే కీలకమైంది. ఉత్తమమైంది అవుతుంది. ఒక రకంగా సరైన చూపు (శాస్త్రీయ లేదా వైజ్ఞానిక) దృక్పథం అంటే ఇదేనని చెప్పుకోవచ్చు.

మరోమాట! ఆశావహదృక్పథం అన్నదానికి వ్యతిరేక దృష్టిని, నిరాశావహదృక్పథం, ప్రతికూల చింతన నెగెటివ్‌ థింకింగ్‌ లేదా నెగెటివ్‌ యాటిట్యూడ్‌ అనంటున్నారు. ఇది ఆత్మన్యూనతా భావానికి దారితీస్తుంది. దానినే శాస్త్రీయంగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సు అంటున్నాము. సరైన దృష్టి కొన్నిసార్లు, అప్పటి వాస్తవ పరిస్థితుల్ని బట్టి ఆ పని అసాధ్యమనో, మన వల్ల కాదు అనో ఆలోచింపజేయవచ్చు. అదిగాని తగినంతగా కాక, అతి అయితే, అప్పుడు ఆత్మన్యూనతా భావం ఏర్పడుతుంది. విషయం అర్థమవుతోందా మిత్రులారా! మానవుడి ప్రవర్తనను శాసిస్తున్న మానసిక క్షేత్రానికి చెందిన అతికీలకాంశాలను విచారించుకుంటూ వస్తున్నాం. మనసు బెట్టి పట్టుకుని, వంటబట్టించుకోవలసిన విషయాలివి. తెలుసుకుని ఊరుకునే విషయాలు కావివి. వంటబట్టించుకుని అలవరచుకోవలసిన అభ్యాసిక విద్యల కోవకు చెందిన విషయాలివి. మళ్ళీ మళ్ళీ చెపుతున్నాననుకోకండి. మళ్ళీ మళ్ళీనే కాదు, మళ్ళా మళ్ళా కూడా అనుకుంటుండాల్సిన విషయాలు.

నీవెంతో అంతగా నీగురించి నీకు అంచనా ఉండాలి. అది సరైందిగా ఉండాలి. అంటే వాస్తవాన్నే చూపించేదిగా ఉండాలి. ఆ అవగాహనాధారంగా నిన్ను నీవు, ఇతరాన్ని నీవు ఎలా చూసుకోవడం సరైందవుతోందో అన్న దానిని చెప్పేదే ఈ దృక్పథం క్రిందికి వచ్చేదంతా.

తత్వశాస్త్రంలో అత్యంత మౌలికమైన భావన వకటుంది. వర్తమానంలో ఉండు అని బి ఇన్‌ ప్రెసెంట్‌ (ఔలి రిదీ చీజీలిరీలిదీశి) భగవద్గీతలోనూ ఈ అర్దాన్నిచే (భావాన్ని సూచించే) సూత్రమొకటుంది.

అశోచ్చా నన్వశో చస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే!

గతాసూన్‌ అగతా సూంచ నా- ను శోచంతి పరడితాః!

ఒక వంక విచారించదగని వాటి గురించి విచారిస్తున్నావు. మరోవంక మాటలు మాత్రం పండితులు - విజ్ఞులు, ప్రజ్ఞావంతులు - చెప్పేవిగా ఉంటున్నాయి. పండితులు ఆచరణలో గతాన్ని గురించిగానీ, భవిష్యత్తును గురించిగానీ ఆందోళన చెందరు అంటే గడచిపోయిన వాటిని గురించీ, ఇంకారాని వాటిని గురించిగానీ ఆలోచిస్తూ కూర్చోరు. వర్తమానంలో జీవిస్తూంటారు. అన్నది సూత్రార్థం సరైన దృక్పథం ఉన్నవారి వైఖరిని (ప్రవర్తనారీతిని) సూచించే మరొక సూక్తీ బహుళప్రాచుర్యంలో ఉంది.

వినదగు నెవ్వరు చెప్పిన, వినినంతనె వేగపడక వివరింపదగున్‌,

కని కల్ల నిజము లెరిగిన మనుజుడెపో ధన్యతముడు మహిలో సుమతీ!

వినడం, విచారించడం, స్వీకరించడం అన్న విషయంలో విజ్ఞుల ఈ రకమైన ప్రవర్తన వెనక పనిచేస్తుండేది సరైన దృష్టి కోణమే. ఈ మానసిక వైఖరికి సంబంధించిందే మరో మాట ఉంది.

యుక్తి యుక్త ముపాధేయం వచనం బాలకాదపి

అన్యతృణమివ త్యాజ్య మప్యుక్తం పద్మజన్మనా!!

సబబైన మాట (యుక్తి సహజమైనమాట) పిల్లవాడు చెప్పినా స్వీకరించదగిందే అవుతుంది. అలాకానిమాట సరైన ఆధారం లేని మాట బ్రహ్మ చెప్పినా (ఎంతవారు చెప్పినా) గడ్డిపరక పారేసినట్లు పారేయాలి. ఈ సూక్తిలో ఎవరు చెప్పారన్నదాన్ని బట్టి విషయానికి విలువరాదు, విలువనివ్వనూరాదు. ఏమి చెప్పారో, అదేపాటి తూగుతుందో అన్నదాన్ని బట్టే విలువివ్వడం సరైనరీతి. అలానే ప్రవర్తిస్తానని నిర్ణయించుకోవడం అతని సరైన మానసిక వైఖరి అవుతుంది. అలా ప్రవర్తించడమే సరైనది అన్న దృష్టి కలిగి ఉండడాన్ని సరైన దృక్ఫథం కలిగి ఉండడమనే అంటాము. ఆధునిక హేతువాద థోరణికి చెందిన సంస్థ హేతువాద దృష్టి ఎలా ఉండాలన్న దానిపై ఒక నిర్వచనాన్ని విడుదల చేసింది. అందులోనూ మనకు - ఈ సందర్భానికి వర్తించే భావన ఉంది.

హేతువాదం : యోగ్యమైన ఆధారాలతో కూడి చేసే యోచన సర్వోన్నతమైనదని నిర్నిబద్దంగా అంగీకరిస్తుంది. యోగ్యమైన ఆధారాలు లేని గ్రంథాల, వ్యక్తుల మాటలను ప్రామాణికమైనవిగ స్వీకరించదు. వాటి ప్రభావం నుండి విడిగా ఉంటుంది. అంటూ హేతువాది మానసిక వైఖరి ఎలా ఉండాలో, నిర్వచించింది. వ్యక్తులుగానీ, గ్రంథాలుగానీ ప్రామాణికంకారాదు అన్న భావన సరైన దృక్పథంలో భాగమే.

ఇదే విషయాన్ని కాళిదాసు స్పష్టంగా గమనించి సూటిగా ప్రస్తావించాడు కూడా.

పురాణ మిత్యేవ నసాధుసర్వం -

పాతదంతా బంగారమే (ఓల్డ్‌ ఈస్‌ గోల్డ్‌) ఆనిర్వచనం - ఈ మధ్య వచ్చిందంతా గతమంతా ఘనం కాదు అనుకునే సాంపదాయకుల పోకడ సరైన దృష్టి నుండి ఏర్పడిందికాదని చెపుతుందీ సూక్తి. ఒక విషయానికి అదెంత ప్రాచీనం అన్నదాన్నిబట్టి గానీ, అదెంత ఆధునికం అన్నదానిబట్టిగానీ విలువల నాపాదించడం సరైందికాదు. విలువలు ఏర్పడవు కూడా. అది ప్రాచీనమైన (సనాతనమైన) దైనా, ఆధునికమైనదైనా, అదేపాటిదో నిర్ణయించడం, సరైన పరీక్ష జరిపే చేయాల్సి ఉంటుందన్న వైఖరి - దృష్టి - వివేక పథకులకుంటుందన్నది కవి హృదయం.

క ప్రసిద్ది చెందిన ఆధునిక తాత్వికులలో ఒకడైన జిడ్డు కృష్ణమూర్తి, గురువుల, శాస్త్రాల బంధం నుండి బైటపడి అనుభవాలను పరిశీలించి చూసుకుంటూ జీవితాన్ని మలచుకోవలన్న సుభాషణం వెనకా సరైన దృక్పథపు ఛాయలున్నాయి.

మిత్రులారా! వివరించుకుంటూ పోతే చాలా పెద్దదవుతుంది వ్యాసం. అందుకిది సందర్భంకాదు. పైగా శాస్త్రీయ దృక్పథాన్ని గురించి ఎవరికి వారుగా ఆలోచించుకుని, స్వంత ప్రయత్నంతో వ్యాసం తయారు చేసుకురావాలనుకున్నాం కూడాను. కనుక, చివరికేలాగ మా అందరివీ కలిపి చూసుకుని, నా దగ్గర మిగిలి ఉన్న వాటినీ చేర్చి చూసుకుని, వీలైనంత సమగ్రంగా ఉండేలా ఒక చిన్న పుస్తకాన్ని తీసుకురానున్నాం కనుక, చెప్పాల్సింది కొంతమిగుల్చుతాను. శాస్త్రీయ దృక్పథం ఊపిరంతా స్వతంత్రాలోచనాశీలత; తులనాత్మకబుద్ది అన్న రెండూ అవసరమన్న అవగాహన, దగ్గరే ఉంది. మిగిలిన ఉండాల్సినవన్నీ ఈ రెంటి మూలంగా, ఆధారంగా, జతపడేటివే. సమకూడేటివే. అందుకనే, శాస్త్రీయ దృక్పథం అలవడేందుకు వీలుగా ఎవరికి వారుగా స్వంతంగా ఆలోచించుకుని, సమాచారం సేకరించి, దానిలో ఏది ఎంత సమంజసంగా ఉందోనూ చూసుకుని రమ్మంటున్నాను.

విషయాలు తెలుసుకునేప్పుడెలా ఉండాలి. ఆచరణకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడెలా ఉండాలి. అన్న రెండంశాలలో వ్యక్తి - సమాజము - ప్రకృతి అన్న మూడుగా ఉన్న దాన్ని గురించి తెలుసుకునేటప్పుడు - దానితో వ్యవహరించే తీరు గురించి నిర్ణయించేందుకు ముందు నీవు వ్యక్తి - ఎటువంటి దృష్టి కలిగి ఉండాలి అన్న దాన్ని గురించిన విచారణే ఇక్కడ చేయాల్సింది మీ ఆలోచనకు పదును పెట్టగల, వత్తాసునివ్వగల కొన్ని వివరాలను మీ ముందుంచాను. వాటినీ ఉపయోగించుకుని వ్యాసం తయారు చేయండి.

ముఖ్యగమనిక : ఏ వ్యక్తిలోనైనా ఆయా విషయాలను అతనిదైన చేసే కోణం ఉంటూ ఉంటుంది. దానికీతని 1) అవగాహన స్థాయి 2) వ్యక్తిత్వంలో చోటు చేసుకుని ఉన్న విలువల స్థాయి 3) స్వభావంలోని ఉద్రేకాల స్థాయి కలసి కారణాలవుతుంటాయి. దృక్పథం (చూస్తున్నతీరు) ఆ జీవితం, అన్ని విషయాలతోటీ ముడిపడి ఉంటుంది. కనుక దృక్పథం పాత్ర చాలా విస్త్రృతమైనదవుతోంది. విశేషరూపాలు లెక్కకు మిక్కిలిగా ఉంటాయి కనుక, కొన్ని సాధారణ రూపాలుగా వాటిని వర్గీకరించి అర్థం చేసుకుంటే బాగుంటుంది.

1. శాస్త్రీయ దృక్పథం కలవాడు జ్ఞానాన్ని ఆర్జించే సందర్భంలో ఎలాటి దృష్టి కలిగిఉంటాడు?

క వీటినీ, ఇలాటి మరికొన్నింటినీ, ఆయా సందర్భాలనూ ఉదహరించుకుంటూ వివరణాత్మకంగా పరిశీలించే, 'శాస్త్రీయదృక్పథం' (సరైన చూపు) అన్న శీర్షికాంశానికో చక్కని రూపు వస్తుంది.

క సరైన చూపున్నవాడు స్వీయజీవితం విషయంలో ఎలాటి వైఖరి కలిగి ఉంటాడు, సామాజిక సంబంధాల విషయంలో, ప్రకృతి సంబంధంగా ఎలాటివైఖరి కలిగి ఉంటాడు అన్నదీ శాస్త్రీయ దృక్ఫథపు అన్వయానికి పనికివస్తుంది.

క ఒక్కో అంశాన్ని తీసుకుని ఆ విషయంలో సరైన చూపంటేఏమిటి? అది ఉన్నవాడు ఎలా ప్రవర్తిస్తుంటాడు. అది లేనివాని వైఖరి ఎలా ఉంటుంది. పరిశీలిస్తూ పోతుంటే, ఈ విషయంలో లోతైన అవగాహన కలుగుతూ ఉంటుంది.

యోచనాశీలురైన మిత్రులారా! ఈ విషయం ప్రతివ్యక్తికీ, ఆజీవితం ప్రయోజనాన్ని, మేలును కలిగించగలిగిందిగా ఉంది. కనుక ఎవరికి వారుగా దీనిని గురించి తగినంత అవగాహన కలిగించుకునే యత్నం చేయండి. ఎక్కడైనా ఒక్క విషయంపైనే అనేకాభిప్రాయాలూ, విరుద్ధభిప్రాయాలు కూడా చోటు చేసుకున్నాయంటే అక్కడే ఈ 'సరైన చూపు' అన్నదాంట్లో లోపాలు, దోషాలు చోటు చేసుకుని ఉన్నాయనే.

సరైన జ్ఞానాన్నార్జించడానికీ, కలిగింది సరైన జ్ఞానమేనోకాదో నిర్ణయించుకోడానికీ, వ్యక్తిపరమైన విదానపరమైన రెండు క్షేత్రాలలోనూ దోషాలు, లోపాలు లేకుండా చూసుకోవాలి. అందులో వ్యక్తిపరంగా లోపాలు, దోషాలు లేకుండా ఉండాన్నే శాస్త్రీయ దృక్పథం అనీ, విధానపరమైన దోషాలు లేకుండా ఉండడాన్నే శాస్త్రీయ పద్దతి అనంటారు. మరింత లోతుగా మరోసారి చెప్పుకుందాం. ఉంటాను సెలవ్‌.

సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక ఉద్యమ సమాచారం

సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక రాష్ట్ర కార్యవర్గ సమావేశం 2013 మార్చి 16వ తేదీన కృష్ణాజిల్లా విజయవాడ, కానూరులోని నాగార్జున హాస్పటల్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌ నందు శ్రీ పుట్టా సురేంద్రబాబు అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశంలో డా|| వి.బ్రహ్మారెడ్డి, జంపా క్రిష్ణకిషోర్‌, తోటకూర కృష్ణమూర్తిరాజు, పి.వేణుగోపాల్‌రెడ్డి, కోట ప్రసాద శివరావు, చెర్కూరి వెంకట్రామయ్య, ఎం.మాధవి, ఎం. శ్రీనివాసరావు, యర్రంశెట్టి జగన్‌మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

సమావేశ నిర్ణయాలు.

1. జిల్లా బాధ్యుల నియామకం : రాష్ట్రంలోని 13 జిల్లాలకు సంబంధించిన నూతన బాధ్యులను ఎంపికచేసి ఆయా జిల్లాల బాధ్యతలను వారికి అప్పగించారు. అన్ని జిల్లాల్లో ఏప్రిల్‌ 15వ తేదీలోగా కమిటీల బాధ్యులను ఎంపికచేసుకోవాలి. అడ్‌హాక్‌ కమిటీలు ఏర్పరచినచో ఆయా కమిటీల బాధ్యులు నెలలోగా శాశ్వత కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి.

2. అన్ని జిల్లాల పాత కమిటీలు రద్దు : ఇప్పటివరకు కొనసాగుతున్న పాత జిల్లా కమిటీలన్నీ మార్చి 31 నాటికి రద్దుచేయటం జరిగింది.

వివిధ జిల్లాలకు రాష్ట్ర కమిటీ తరపున బాధ్యులుగా ఉన్న వారి వివరాలు :

వ.నెం. జిల్లా బాధ్యుల పేర్లు

1. కృష్ణా, పశ్చిమ గోదావరి కోట ప్రసాద శివరావు తోటకూర కృష్ణమూర్తి రాజు

2. గుంటూరు, ప్రకాశం యర్రంశెట్టి జగన్‌మోహన్‌రావు ఎం. మాధవి

3. ఆదిలాబాద్‌ (ఈస్ట్‌ & వెస్ట్‌), పి. వేణుగోపాల్‌రెడ్డి

హైదరాబాద్‌ టౌన్‌, నెల్లూరు

4. నల్గొండ, రంగారెడ్డి పుట్టా సురేంద్రబాబు

5. ఖమ్మం చెర్కూరి వెంకట్రామయ్య

6. కర్నూలు, అనంతపురం డా|| వి. బ్రహ్మారెడ్డి

సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక రాష్ట్ర మహాసభ మే 4,5 తేదీలలో ప్రకాశం జిల్లా ఒంగోలులో జరపాలని నిర్ణయించటం జరిగింది. మే 4వ తేదీన అన్ని జిల్లా అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులు మరియు ముఖ్య బాధ్యులతో నిర్మాణ విషయాలపై చర్చ జరుగుతుంది. మే 5వ తేదీన రాష్ట్ర మహాసభ ప్రతినిధుల సభ జరుగుతుంది.

సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక జిల్లా కమిటీ సమావేశాలు మరియు మండల కమిటీల నిర్మాణాలు వివిధ జిల్లాల్లో జరిగాయి. శాశ్వత కమిటీ నిర్మాణము జరగని చోట అడ్‌హాక్‌ కమిటీలు వెయ్యటం జరిగింది. జిల్లా శాశ్వత కమిటీ నిర్మాణమునకు ఆ జిల్లాలోని కనీసం రెండు రెవిన్యూ డివిజన్ల నుండి 5 మండలాల్లో శాశ్వత కమిటీలు ఏర్పడి ఉండాలి. జిల్లా కమిటీలో అధ్యకక్షుడు, కార్యదర్శి, కోశాధికారి ఉంటారు. ఆ జిల్లాల లోని ఒక్కొక్క మండలం నుండి ఒక్కొక్కరు జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఉండే అవకాశం ఉంది. జిల్లా కమిటీల బాధ్యులు మరియు మండల కమిటీ బాధ్యులు తప్పనిసరిగా ప్రాథమిక శిక్షణ పూర్తిచేసుకొని ఉండాలి. అలా పూర్తిచేసుకోని వారు బాధ్యతలు తీసుకున్న 3 నెలల్లోగా ప్రాథమిక శిక్షణ పూర్తిచేసుకోవాలి. అలానే జిల్లా బాధ్యులు నెలలో కనీసము 4 రోజులు మండల పర్యటన తదితర కార్యక్రమాలు చూడటానికి వెచ్చించవలసి ఉంటుంది. మండల శాశ్వత కమిటీ ఏర్పడాలంటే ఆ మండలంలోని కనీసం మూడు గ్రామాల ప్రాతినిధ్యంతో 15 మందికి తక్కువ కాకుండా సభ్యత్వం పొంది ఉండాలి. అందులో ఒక మహిళా ప్రాతినిధ్యం ఉండితీరాలి. మండల బాధ్యులు నెలలో కనీసం రెండు రోజులు గ్రామాల పర్యటన, తదుపరి కార్యక్రమాలు చూడటానికి సమయం ఇవ్వగలవారై ఉండాలి. ఈ విధానంలో జిల్లాకమిటీలు ఏర్పాటుచేసుకున్న జిల్లాలు, ఆయా వివరాలు ఈ క్రింద ఇవ్వబడినవి.

జిల్లా తేది నిర్వహించిన వారు

1. ఆదిలాబాద్‌ (తూ) 17.3.2013 పి.వేణుగోపాలరెడ్డి, సిహెచ్‌. వెంకట్రామయ్య 2. రంగారెడ్డి 07.3.2013 పుట్టా సురేంద్రబాబు, రాజేంద్రప్రసాద్‌ (ఎంవిఎఫ్‌)

3. ప్రకాశం 23.3.2013 పుట్టా సురేంద్రబాబు, ముప్పనేని వెంకటేశ్వర్లు (లోక్‌సత్తా)

4. నల్గొండ 30.3.2013 పుట్టా సురేంద్రబాబు, సునీల్‌ (ఎంవిఎఫ్‌)

5. గుంటూరు 31.3.2013 జంపా క్రిష్ణకిషోర్‌, ఎం.మాధవి, టి.వి.భాస్కర్‌

6. పశ్చిమగోదావరి 31.3.2013 తోటకూర కృష్ణమూర్తిరాజు, కోటప్రసాద శివరావు

7. ఆదిలాబాద్‌ (ప) 30.3.2013 పి.వేణుగోపాలరెడ్డి, సిహెచ్‌. వెంకట్రామయ్య

గమనిక : సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక ప్రాథమిక శిక్షణా తరగతులు ఏప్రియల్‌ 6,7,8 తేదీలలో దోరకుంటలో జరుగుతాయి. దీనికి పైన పేర్కొన్న జిల్లా కమిటీల నుండి 30 మంది వరకు హాజరవుతున్నారు. ఔత్సాహికులు హాజరుకావాలనుకునే వారు ముందుగా తెలియపర్చగలరు.

Wednesday, January 1, 2014

స్పందన - ప్రతిస్పందన

మిత్రులు శ్రీ సురేంద్రబాబుగారికి,

నమస్కారములు!

''ముగిసిన - ముగించిన పెంచలయ్యగారి జీవన యానం'' 203 వివేకపథములో చదివాను.

మీరు చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా సూటిగా ప్రస్తావించారు. పెంచలయ్యగారితో సన్నిహితంగా 19 సంవత్సరాలు, అప్పుడప్పుడు కలస్తూ మరొక 9 సం||లుగా తాత్విక పరిశోధన సాగిందని, ఆయన పరిచయం సత్యాన్వేషణకు ప్రధానమైన మలుపుకు దారి తీసిందని అన్నారు. ఆయనతోటి సంపర్కం వల్ల అత్యధిక ప్రయోజనం పొందిన వారిలో ''నా పేరు ఒకటవ స్థానంలోనో లేదా రెండవ స్థానంలో ఉంటుందన్నారు.''

నిస్సంశయంగా ప్రథమ స్థానం మీదే. అన్వేషణ పరంగా మీరు పడ్డ శ్రమ, మీరు వెచ్చించిన కాలము మరెవ్వరూ పెట్టులేదన్నది వాస్తవము.

అయినా అంత దీర్ఘకాల సాహచర్యంతో ఏకాభిప్రాయము పొసగలేదని, అందుకు కారణము పెంచలయ్యగారి ఏకపక్ష వాదనా విధానమని వివరించారు. విడిపోక తప్పలేదన్నారు.

సత్యజ్ఞాన సంఘ భవిష్యత్తు విషయమై సందేహాలు వెలిబుచ్చారు. సంస్థలు, సంస్ధల పేర్లు కాలగతిలో మరుగున పడవచ్చు, మాసిపోవచ్చు సంస్థాపకుల భావాలు సమాజ శ్రేయస్సుకుపకరించగలవైనట్లైతే తాత్విక ప్రపంచములో వాటి స్థానము ఎప్పుడూ చెరిగిపోదు.

అందుకు మీరు సాగిస్తున్న నిర్విరామ కార్యక్రమమే తార్కాణం. మీలాగా మరెందరో మిత్రులు తమ జీవితాల్లో పెంచలయ్యగారి కారణంగా తాము పొందిన పెనుమలుపే వారికి వెలుగు బాటైందని నిర్ద్వందంగా ప్రకటించారు.

తాత్విక పరిశోధనలో జరిపే పరస్పర సంభాషణలు కొంతవరకే సాగుతాయి. ఆ తరువాత వాగ్వివాదాలకు అవకాశముండదు. ఉండేదల్లా ''పరిశీలన - విచారణ - నిర్థారణ అదీ స్వతంత్రంగా!'' సత్యజ్ఞాన సంఘ దృక్పథమిది. దానికి కట్టుబడే సంఘ కార్యము రూపుదిద్దుకుంటుంది.

మిత్రులు కొందరు పెంచలయ్యగారి స్యుృత్యర్థము ఒక స్మారక ప్రతిని వెలువరించాలని కోరుచున్నారు. మీకభ్యంతరము లేకుంటే మీ వ్యాసాన్ని యధాతధంగా అందులో ప్రచురించగలము. మీ అభిప్రాయాన్ని పత్రికాముఖంగా వ్యక్తపరచగలరని ఆశిస్తున్నాము.

వందనములతో - కృష్ణారావు

ప్రతిస్పందన : ముగిసిన - ముగించిన పెంచలయ్యగారి జీవనయానం గురించి 204 వివేకపథంలో కూడ మరింత సమాచారం రాగలదు. కనుక మీకు అవసరమైనంత వరకు ఈ రెండు మాసపత్రికలలో ప్రచురించిన దానిని పెంచలయ్యగారి స్మారక ప్రతిలో ముద్రించుకోడానికి మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదని పత్రికాముఖంగా తెలియపర్చుచున్నాము.

గౌరవ్‌ లేఖాంశాలు

203 సంచిక చదివి గౌరవ్‌ ఫోను చేశాడు. నారెండవ లేఖ ముద్రంచాల్సింది కనీసం అందులోని నా విజ్ఞప్తి భాగాన్నేౖనా ముద్రించండి అని ఇదిగో ఆ విజ్ఞప్తి:- అది వివేకపథం పాఠకులనుద్దేశించి వ్రాశాడతడు.

''అని వార్యకారణాల వల్ల వివేకపథంలో కొనసాగుతున్న హేతువాదం గురించిన చర్చలో పాలుపంచుకోడానికి వీలుకావట్లేదు. నా భావాలకి కట్టుబడినంతలో వాటిపై విస్పష్టమైన వివరణ ఇచ్చే యత్నం వీలైనపుడు చేస్తాను. పాఠకులు అన్యధా భావించకుండా నా నిజాయితీని శంకించకుండా ఉండడానికి, నా సమస్య - దాని కారణాలు ఈసరికే సత్యాన్వేషణ మండలికి వివరంగా తెలిపాను. అనుమానాలున్న వారు సురేంద్ర గార్ని సంప్రదించగలరు. అదే లేఖలో 202లో రాజేంద్రప్రసాద్‌గారు లేవనెత్తిన సందేహంపై ఇలా స్పందించాడు గౌరవ్‌ 

మిత్రులు రాజేంద్రప్రసాద్‌గారికి, మీ స్పందన చూశాను నా అభిప్రాయాలు అర్థంకాకపోయినా, లేఖ చివరిలోని గమనిక (అన్యాపదేశంగా ఉన్నా సరే) అర్థమైనందుకు సంతోషం. లేఖ నేరుగా సురేంద్రబాబుగారికే రాయెచ్చుగదా? అనే మీ ప్రశ్నకు జవాబు :- ఉత్తరాయడమేం? సరాసరి దాన్ని ముఖాముఖిగానే అందించాను. ప్రత్యేకంగా వ్యక్తుల పేర్లు ఉటంకిచడం నేను సభ్యతగా భావించనందుకే సురేంద్రగారి పేరు రాయలేదు. రెండో విషయం, నిజానికది నా వ్యాసం లేఖకాదు హేతువాది పత్రికలో సైతం యధాతధంగా అది అచ్చైంది. అందుకనే ఎవరిపేరూ అందులో వ్రాయలేదు. అందులోనే కాదు రావిపూడి వెంకటాద్రిగారి రాడికల్‌ హ్యూమనిజాన్ని విమర్శించిన నా ఇతరరచనలు (1) సాంఘికతత్వం విప్లవ మార్గం 2) ఒక నాస్తికుడినామం 3) అస్థిత్వం - అరాచకత్వం 4) ప్రజాస్వామ్య ప్రస్థానం మొదలగువాటిల్లో కూడా పేర్లు పేర్కోలేదు. సమకాలికంగా జీవిస్తున్న వారిపై విమర్శ చేసేటప్పుడు సగటు విలువను పాటించడం అలా అలవాటు చేసుకున్నాను.

ప్ర.స్పం : యోచనాశీలుడవైన గౌరవ్‌కు, 201లో ప్రచురించిన నీ లేఖపై నా స్పందన కూడా అక్కడే ప్రచురించాను. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్‌ గారు అడిగింది నీ గమనిక వాక్యం గురించి కదా! అది ఇలా గుంది చూడు.

''ఈ మధ్య రాష్ట్రంలో హేతువాదానికి సిద్దాంతాన్ని, ప్రామాణిక గ్రంథాన్ని రూపొందించడానికి యత్నిస్తున్న కొన్ని సంఘాలకు స్పష్టత చేకూర్చే ఉద్దేశంతోనే ఇది వ్రాయడమైనది'' దీనిపై అన్యాపదేశంగా చెప్పడమెందుకు నేరుగానే చెప్పవచ్చుకదా అని అన్నారాయన. నిజంగా అది అన్యాపదేశంగానే కాదు. అట్టి వారికి కనువిప్పు కలిగించేందుకు ఇంకాస్తకటువుగా చెప్పితే, బుద్ది చెప్పేందుకే ఇది రాస్తున్నాను అన్న అర్థాన్నీ ఇస్తొంది. నిజానికి ఆ నీలేఖలో హేతువాదం సిద్దాంత మెందుకు కాదో, హేతువాదమంటే ఏమో చెప్పనేలేదు. ఆ నీలేఖ సంగ్రహాన్ని రెండంశాలుగా విడకొట్టి, ఇంకా ఏమేమి అభిప్రాయాలున్నాయో దానిలో మీరూ తెల్చండని 201లోనే పాఠకులకూ సూచించాను.

దీనిపై ఇప్పుడు విమర్శ చేయబోవడం లేదనీ, అతడు విచారణకు సిద్దపడితే విచారణను మొదలెట్టుకోవచ్చిననీ చెప్పాను. ఆ లేఖ తప్పు మార్గం పట్టిన మనల్ని - ముఖ్యంగా నన్ను - సరిచేయడానికి ఉద్దేశించినట్లుగా ఉందనీ అక్కడే వ్రాశాను. అటు తరువాత రెండు మూడు సార్లు మనం ముఖాముఖి కలసి మాట్టాడుకున్నప్పుడు చెప్పాను. నీ భావాల పరిశీలనకు సిద్దపడమని. కానీ దానికి నీవంత ప్రాధాన్యత నిచ్చినట్లు అనిపించకపోవడంతో 203లో ఆ విషయాన్నే ప్రస్తావించాను. ఇప్పటికైనా నీవు వెళ్ళడించిన భావాలపై విచారణకు సిద్దం కావడం ఉచితం. 

నీరెండో లేఖలో ప్రస్తుతం తీరు బాటు లేదనీ వీలైనప్పుడు వివరణలు ఇస్తాననీ నీ నిజాయితీని శంకించవద్దనీ వ్రాశావు. ఒక్కమాట! నీ మొదటి లేఖ ఏమీ సరళంగానూలేదు. చూసిచూడనట్లు వదిలేయాల్సిందిగానూ లేదు. అందులో అవగాహనాలోపంతో కూడిన భావాలతోపాటు, మేము మందినెత్తిన ఏదో బండ పెట్టబోతున్నట్లు ఆరోపణ చేశావు. అలాగే, హేతవాదం పై తగినంత సాహిత్యం లేదని కొందరంటున్నది నిజంకాదు. దీనిపై చాలా సాహిత్యం ఉందనీ వ్రాశావు. ఇదీ నన్ను ఉద్దేశించి వ్రాసిందే. హేతువాదానికి ప్రామాణిక గ్రంధాన్ని చేకూర్చడానికివేమైనా మత గ్రంథమా అంటూ ఎద్దేవా చేశావు. ఇదంతా అన్యాపదేశమే కనకనే రాజేంద్రప్రసాద్‌గారు నేరుగానే ప్రస్తావించవచ్చుకదా అన్నారు. దానికీ, నీవు, ప్రస్తావించడమేమిటి? నేరుగా సురేంద్రగారికే లేఖ ఇచ్చానన్నావు. ఆయనడిగిందేమిటి? నీవు చెప్పిందేమిటి? లేఖ చదివే పాఠకులకు సూటిగా అర్థమయ్యేలా రాసుండాల్సింది అని కదా ఆయనన్నది. లేఖ సురేంద్రకిచ్చానంటావేమిటి? లేఖ అర్థం కావలసింది పాఠకులకు కదా! ఇదీ అర్థం కాలేదన్న మాట నీకు! నాకేం భయంలేదు. ఆయనకు నేరుగానే లేఖ ఇచ్చాను అన్నది ఆయన ప్రశ్నకు నీ జవాబన్నమాట! బాగుంది.

రావిపూడి వెంకటాద్రిగారి రాడికల్‌ హ్యూమనిజాన్ని విమర్శించిన నా ఇతర రచనలంటూ నీవు చెప్పిన పుస్తకాలను ఒకింత జాగ్రత్తగానే చదివాను. అందులో రాడికల్‌ హ్యూమనిజం పై విమర్శ ఎక్కడుందో చూపిస్తే మళ్ళా చూస్తాను. ఆ పుస్తకాలూ, ఈ లేఖలూ చూశాక, తెలియనివన్నీ దిట్టతనాన తప్పులటంచు... అన్న తెనాలి రామలింగని మాటలు గుర్తుకొచ్చాయి. విమర్శంటే ఏమిటో నీ కిప్పటికీ సరిగా తెలియదన్నది ఒక నిజం. మనం కలసి మాట్లాడుకున్నప్పుడూ, నీ భావాలలోనూ, నీ భాషలో కూడా చాలా ఉండగూడనితనముంది. వాటిని సరిచేసుకునే పని మొదలెట్టమని సూచించానుకూడా. కానీ నీవవేమీ గట్టిగా పట్టించుకున్నట్లులేదు.

ఒక్కమాట! పత్రికలో నీలేఖ వేసి, దానిపై నిశితమైన విమర్శ చేయాలంటే ఆ లేఖవరకే 10, 15 పేజీల స్థలం అవసరమవుతుంది. అందుకు 3000 రూపాయలపైనే ఖర్చవుతుంది. కనుకనే కలసి కూర్చుని మాట్లాడుకుందామని అన్నాను. ఇప్పటికైనా నీవు ప్రకటించిన భావాలపై పరిశీలనకు సిద్దపడడం మేలు, అవసరం కూడా.

మరొక్కమాట! వెంకటాద్రి గారు హేతువాదం సిద్దాంతంకాదన్న దృష్టికీ, నీవు హేతువాదానికి సిద్దాంతాన్ని తయారు చేయడం మంచిదికాదు అన్న దృష్టికీ చాలా తేడా ఉంది. ఆయన సిద్దాంతాలుండడమే తప్పని అనడంలేదు. సిద్దాంతాలు ఉంటాయనీ, ఉండాలనీ, క్రొత్తక్రొత్త సిద్దాంతాలు వస్తుంటాయనీ, వస్తుండాలనీ అంగీకరిచే వైఖరి కలిగున్నాయడాన రాడికల్‌ హ్యూమనిజానికి సిద్దాంతం ఉందని అంగీకరిస్తారుకదా వాళ్ళంతా. అలాగే వివిధ శాస్త్రాలన్నీ సిద్దాంతాలు కలిగి ఉంటాయనీ అంగీకరిస్తారు కదా వాళ్ళు. ఇకపోతే హేతువాదిలో ఆ నీ మొదటి లేఖ ముందూ వెనకా చూసుకోకుండా విందుకు ప్రచురించారో, రెండోలేఖ ఎందుకు ప్రచురణకు నోచుకోలేదో. మొదటి లేఖలోని భావాలవరకైనా నాతోటి వాళ్ళు ఏకీభవిస్తారో లేదో 'హేతువాది' సంపాదకులే చెప్పాలి.

నా అభిప్రాయం ప్రకారం ఆ నీమొదటి లేఖ నుండి నీ అభిప్రాయాలుగ నేను వెళ్ళడించినవన్నీ, నీ అవగాహనలో లోపాన్నీ, నీ ఆరోపణల్లో దోషాన్ని తెలిపేటివే. కానీ నీవు వాటినేమీ పట్టించుకున్నట్లుగాలేదు. తాత్వికస్థాయిలో విచారణలు చేసే పత్రికలతో చర్చ మొదలెట్టడమంటే, అది చాలా వ్యయ ప్రయాసలతో కూడి ఉంటుంది పత్రికల వాళ్ళకి. అప్పుడైనా ఇరుపక్షాలూ పాఠకులూ శ్రద్దగా పట్టించుకుంటేనే దానికి అంతో ఇంతో ఫలితముంటుంది. రాసిందేదో రాసేసి, వీలున్నప్పుడు వివరణలిస్తాను అని నీవు అనకూడదు. నిజానికాపోకడ ఎవరూ పోకూడనిది. 

ఎవరినుద్దేశించి విమర్శచేస్తున్నామో, రాస్తున్నామో వారిపేరును పేర్కొనకపోవడం సగటు విలువను పాటించడం కాదు సరికదా! అది కనీస పద్దతినైనా పాటించకపోవడం కూడా అవుతుంది. ఇప్పటికైనా నీవూ హేతువాదం సిద్దాంతం కాదంటున్న వాళ్ళు ముందుగా, హేతువాదమంటే ఏమిటి? సిద్దాంతమంటే ఏమిటి? హేతువాదం అన్న పేరుక్రింద ఏమి భావాలుంటాయి? చెప్పి హేతువాదం సిద్దాంతమెందుకు కాదో నిర్ధారించండి. నీవరకైనా ఆపని చేయగలవేమో చూడు. ఇక హేతువాదంపై విస్తృతమైన సాహిత్యం తెలుగులోనే ఉందన్నావు. ఆ వివరాలివ్వు. నా అవగాహన ప్రకారం హేతువాదాన్ని శాస్త్రీయంగా వివరించే ఒక్క గ్రంథమూ తెలుగులో లేదు. అలా అనుకునేకదా నేను ఆ పనికి సమష్టిగా పూనుకుందామని పిలుపు నిచ్చింది. ఇక నీ మొదటి లేఖలోని ఒకటిరెండంశాలు విశ్లేషిస్తాను పరిశీలించు.

1) హేతువాదం సిద్దాంతం కాదు ఎందుకంటే, సమాజహితం కోసం ప్రతిపాదింపబడిన భావాలన్నీ ప్రామాణికమైన సిద్దాంతాలు కానవసరంలేదు. ఇది నీలేఖలోని మొదటి వాక్యాం ఇందులో నీవు లేవనెత్తిన అంశమేమిటి? చెప్పినదేమిటి? హేతువాదం ఎందుకు సిద్దాంత కాదో అన్నది గదా చెపుతానన్నావు. ఎందుకది సిద్దాంతం కాదో చెప్పావా? సమాజహితం కోరే భావాలన్నీ సిద్దాంతాలు కావలసిన అవసరంలేదు కనుక అది సిద్దాంతం కాదన్నావు. అదేం సమాధానం?! చెప్పాల్సిన దానికి సమాధానం చెప్పనేలేదన్న నిజం ఎప్పటికి గుర్తిస్తావు?

2) ఇక నీ రెండో వాక్యం ఎంత గందరగోళంగా ఉందో చూడు ! ''అలా కాకుండా ఆయా కాలమానాలకు అనుగుణంగా, సామాజిక పరిస్థితుల్ని వ్యవస్థ స్వరూపంతో బేరీజు వేసుకునే ప్రగతిగాముకులు తమ అభిప్రాయాలతో వారు సరైనవి అనుకున్న భావాలను అనుసంధానించుకుని ముందుకు సాగిపోతారు. అంతమాత్రంతో వారి నిజాయితీని అనుమానించడం మనలోని నైచ్యానికి ప్రతీక అవుతుందేమోగాని ఔన్నత్యానికి కాదు ఏమిటీ వాక్యాలకర్థం? సందర్భమేమిటి? అంతటి నైత్యానికి వడగట్టిందేవరు? అలా చేయకూడదని ఎవరికి సూచిస్తున్నట్లు? ఇంతకూ ''హేతువాదం సిద్దాంతం ఎందుకు కాదు'' అన్న శీర్షికతో మొదలైన రచనలో ఈ మాటల అవసరం ఏమిటి? సామాజిక పరిస్థితుల్ని వ్యవస్థ స్వరూపంతో బేరీజు వేసుకోవడమేమిటి? తమ అభిప్రాయాలతో వారు సరైనవి అనుకున్న భావాలను అనుసంధానించడమేమిటి? అంతమాత్రం చేత వారినిజాయితీని శంకిచడమేమిటి? ఏమీటీ సంవిధానం? అర్థమవుతోందా పాఠకుకునికి? ఎంత మందికి వక్త హృదయం అర్థమైయ్యేవీలుంది?

గమనిక : నీ రెండు లేఖల మొత్తాన్ని కలిసి చూసినా హేతువాదమంటే ఏమిటో, అదెందుకు సిద్దాంతకాదోనన్న వివరం మాత్రం దొరకదు. కనుక ఏమి చెపుతానని లేఖ మొదలెట్టావో అది చెప్పకుండానే ఆ లేఖ పూర్తి చేశావన్నమాట! మళ్ళా సందోర్భిచితం కానివి చెప్పుకోకుండా ఉచితంగా స్పందిస్తావనే ఆశిస్తాను.


ముగిసిన - ముగించిన పెంచలయ్యగారి జీవనయానం - 2


సత్యాన్వేషణ మండలి, సత్యజ్ఞాన సంఘము అన్న రెంటిని గురించి తెలిసి ఉన్న, ఆ రెండు సంస్థలతోనూ సన్నిహితంగా మెలగిన; రెంటిలో ఒక సంఘంలోపలి వారుగా ఉంటూ రెండో దానినీ గమనిస్తూ ఉన్న, రెంటికీ వేరుగా ఉంటూ రెంటితోనూ సంబంధాలు కొనసాగిస్తూ ఉన్న మిత్రుల్నీ, పరిచయస్తులనూ; పెంచలయ్య గారూ నేనూ కలసి సిద్దాంత చర్చలు చేసిన ఆయా ధోరణులకు చెందిన పండితులనూ; ఇక ముందు సత్యజ్ఞాన సంఘం ఏమికానుంది? ఏమి చేయనుంది? ఏమి చేద్దాము? అన్న అంశాలపై ఆలోచించాలనుకుంటున్న ఆ సంస్థ ఆంతరంగికుల మనుకుంటున్న వారినీ, ఇతరత్రా ఉన్న తాత్విక క్షేత్రాలలోని వివిధ స్థాయిలలో ఉన్న చింతకుల్నీ కూడా మనస్సులో పెట్టుకుని ఈ వ్యాసం వ్రాశాను.

క పెంచలయ్య గారి గురించి మాట్లాడుకునేముందు ఆద్యంతం గుర్తుంచుకోవలసిన విషయమొకటుంది. ఆయన సిద్దాంతమేమిటో తెలుసుకోదలిస్తే అది అయ్యేపని కాదు. అందువల్ల నీ కొరిగేదీ ఏమీలేదు. అలాకాక నీ సిద్దాంతాన్ని నిర్థిష్టంగా ప్రకటించి, దాని బలాబలాలను నిర్థారించుకోదలిస్తే మాత్రం చాలా ప్రయోజనం చేకూరుతుంది. నీ ఆలోచనకు పదును పెట్టుకోదలిస్తే మాత్రం ఆకురాయిలా ఉపయోగపడతారాయన. గత పాతికేండ్లుగా నేను జాగ్రత్తగా గమనిస్తూ వచ్చిందీ అంశాన్నే లబ్దపొందిందీ కూడా దీనిని చక్కగా వాడుకునే.

మూడు పుస్తకాలు (1) నేను (2) జ్ఞాన విద్యా శాస్త్రము - తర్కశాస్త్రము (3) సత్య జ్ఞానము - ఉపనిషత్తుల సారము - వ్రాశారాయన. వాటిలోని ఆయన పోకడంతా, ఇద మిద్దంగా తనదేమిటో చెప్పకుండా, చెపుతానని ఆరంభించిన అంశాలపై వారేమన్నారు, వీరే మన్నారు, వాటిపై తన పరిశీలనేమిటి? అన్నది విస్తారంగా చెప్పుకుంటూ పోయారాయన. దాంతో పెంచలయ్యగారేమిటన్నది స్పష్టాస్పష్టంగా తయారై; ఆయనగారు ఎన్ని శాస్త్రాలు చదివారు !? అని ఆశ్చర్యపోయేందుకూ, ఆయన చాలా తెలిసిన వారు అన్న భావనను పాఠకుల్లో కలిగించేందుకూ ఉపయోగపడిందది.

దీన్నంతటినీ నిశితంగా పరిశీలిస్తే, బహుశాస్త్రకోవిధునిగా నలుగురిలో నిలిచిపోవాలన్న వాంచ అంతర్లీనంగా ఆయనలో బలంగానే ఉందనిపిస్తోంది. దాదాపు 450, 500 పేజీల ఆ రచనల్లో ఆయనివిగా చెప్పుకోడానికి వీలైన అభిప్రాయాలను ఏరి కూర్చితే అవన్నీ 15, 20 పేజీలకు మించి ఉండవు. (అంతకూ ఉండకపోవచ్చునేమో)

క ఒక యాభై ఏండ్లుగా ఎందరు ఎన్ని విధాలుగా అడిగినా, వత్తిడి చేసినా తెరపకుండా బిగించి పట్టిన గుప్పెటిని, చివరి నాళ్ళలో ఎవరూ అడగకుండగనే విప్పి చూపించారాయన. తనది చెప్పేదికాదనీ, చెప్పినా అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలున్నవారు తనకెవరూ కానరాలేదనీ అంటూ వచ్చిన ఆయనే, కడకు ఏమనుకున్నారో ఏమోగానీ చాలా పేలవమైన ప్రతిపాదన చేసి, దానిని పరీక్షకివ్వకుండానే జీవితాన్ని ముగించారు. ఇక ముందది, వారితో సన్నిహితంగా మెలగిన, సాన్నిహిత్యం ఉందనుకుంటున్న, అంటున్న వారి వివరాలు, వ్యాఖ్యానాలు, విమర్శల ద్వారా ఎన్ని రకాలుగా తీరబోతోందో నన్న ఆలోచన, ఆందోళనకూడా నాకున్నాయి.

క ఈ పుస్తకాల ద్వారా ఆయనవిగా గమనించదగిన 15,20 అంశాలను పేర్కొని కొద్దిపాటి విశ్లేషణ చేస్తాను. అవసరమైతే భవిష్యత్తులో కొద్దికాలం వివేక పథంలో వారి రచనలపై పరిశీలనాత్మక వ్యాసాలు (ఇతరులూ చర్చలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తూ) వ్రాస్తాను.

ఎ. అంతిమంగా ఆయన తనవిగా సూటిగా పేర్కొన్న సిద్దాంతాలు ఐదు.

1. దేవుడున్నాడు 2. అతడు ప్రత్యక్షంగా తెలియబడతాడు 3. ఆత్మను - నేనును - తెలిసిన వానికి దేవుడు తెలుస్తాడు. 4. అన్వీక్షికీ (ఆత్మ) విద్య మరియు లక్షణ ప్రమాణ విద్య (తర్కవిద్య) వలన ఆత్మ మరియు దేవుడు తెలుస్తాయి. 5) దేవుని తెలిసికొనదలచిన వానికి సత్యజ్ఞాన సంఘము తోడ్పడుతుంది. 

విచారణ :- ముందుగా 5వ అంశాన్ని గురించి ప్రస్తావిస్తాను. పెంచలయ్యగారు నాకు పరిచయమైన క్రొత్తలో స.జ్ఞా. సంఘంలో ముఖ్యులుగా 5, 6 గురు గుర్తింపబడేవారు. వారిలో ఎన్‌. కృష్ణారావుగారు, చెంచుకృష్ణయ్యగారు, గపూర్‌ గారు, శేషగిరిరావుగారు నాకు బాగా తెలిసినవారు. ఆ తరవాత పెంచలయ్యగారిపై విపరీతమైన అభిమానం పెట్టుకుని ఉండేవారు కొందరున్నారు. వారిలో సుబ్బన్నగారు, పుల్లయ్యగారు, చంద్రమోహన్‌ నాకు దగ్గరగా తెలిసినవారు. ఆయనపై గురుభావాన్ని పెట్టుకుని ఉన్న మరో 10 మంది దాకా నాకు తెలుసు. వీరంతా సత్యజ్ఞానసంఘం లోపలి వారే ఆ సంఘంలోపలివారుగాకాక ఆయనతో తగినంత దగ్గరగా మెలగినవారు కె. శ్రీనివాసులుగారు సోంప్రకాష్‌గారు మనోహర్‌హింద్‌, అనంతరకాలంలో అంటే నేనూ పెంచలయ్యగారూ కలసి సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న సందర్భంలో పరిచయమై ఆయనతో సన్నిహితంగా మెలగినవారు, ముఖ్యంగా నారాయణ శెట్టి, సంజీవరాయడు, వెంకటేశ్వరరెడ్డి, ఆనందకుమార్‌లు వీరు కాక సత్యాన్వేషణ మండలికి చెందిన ప్రసాదు, విజయమ్మ, పద్మమ్మగారూ, వారి అక్కచెల్లెళ్ళు ఆయనతో సన్నిహితంగానే మెలిగారు. నాకు తెలిసినంతలో ఆయనతో తాత్విక గోష్ఠులు నిర్వహించినవారు వీరే. నాకు తెలియని మరికొందరూ ఆయనతో సంభాషించినవారు ఉండవచ్చు.

ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే, ఆయన చనిపోయాక, ఇప్పుడు నేను సత్యజ్ఞాన సంఘ ప్రతినిధిని అని చెప్పుకోడానికి మనస్పూర్తిగా సిద్దపడేదెవరు? ఎందరు? అన్నది నిర్ధారించుకోడానికే. నాకు తెలిసి ఒక్క ఎన్‌. కృష్ణారావు గారు తప్ప (గఫూర్‌గారి సంగతి నాకు తెలియదు) ఇతరులంతా ఆయనతో రకరకాలుగా విభేదిస్తూ వచ్చారు. కొందరైతే ఆయనకు, ఆ సంఘానికీ దూరమయ్యారు కూడా. మరలాటపుడు, ''దేవుని తెలిసికొనదలచినవారికి సత్యజ్ఞాన సంఘం తోడ్పడుతుంది'' అన్న మాటకు ఈనాడు ఆచరణ రూపం ఎలా ఉంటుంది? మొన్నటికి మొన్న వారి సంస్మరణ సభలో ఎన్‌. కృష్ణారావుగారు కూడా 'దేవుని విషయమై ఈ రకమైన ప్రకటన చేయకండని పెంచలయ్యగారికి సూచించినట్లు చెప్పారు. కనుకనే, ఇక ముందు సత్యజ్ఞాన సంఘం ఉంటుందా? అంటే ఎవరు సభ్యులుగా, మార్గదర్శకులుగా అది ఉంటుంది? ఉంటుందనుకుంటే, అందులో ఉన్న వారెవరుగానీ, ఈ పై '5' అంశాలనూ అంగీకరిస్తూ వాటికి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తారా? వీటిని ప్రక్కన పెట్టి జీవితానికి సంబంధించిన ఇతరేతరాంశాలపై చర్చలు, పరిశీలనలు చేసుకుంటూ సాగుతుంటారా? అన్నది ఆ సంస్థకు చెందినంతలో ఇప్పటకి ముందున్న ముందు తెల్సుకోవలసిన అంశం అవుతోంది.

మొన్న సంస్మరణ సభలోనే, పెంచలయ్యగారితో సన్నిహితంగా మెలగినవారిలోని ఇరువురు (1) మనోహర్‌ (2) సోంప్రకాష్‌ గార్లు, దేవుడు మాకూ తెలుసు,నని ప్రకటించారు. సోంప్రకాష్‌గారైతే దేవుని తెలిసికొనాలన్న తపన ఉన్న వారికి తామ తోడ్పడగలమనీ అన్నారు. మనోహర్‌ ఈ మాటనలేదుగానీ, ప్రమాణాలకు సంబంధించినంతలో, ప్రత్యక్ష ప్రమాణము, శబ్ద ప్రమాణముల విషయంలో పెంచలయ్యగారికీ, తనకు ఏకాభిప్రాయం ఉందనీ, అనుమాన ప్రమాణం విషయంలోనే ఒకింత విభేదం ఉందనీ అన్నాడు. ఈ సందర్భంలో పెంచలయ్యగారన్న ఒక మాటను గుర్తు చేసుకోవాల్సి ఉంది.

క ''దేవుని చూసిన వాని స్థితి ఎట్లుండునో దేవుని చూసిన వానికి తెలియును. ఇతరులకు తెలియదు.''

దేవుని చూశాను అన్న పెంచలయ్యగారు లేరు. దేవుని చూశామంటున్న మరో ఇద్దరు మన ముందుకొచ్చారు. పెంచలయ్యగారితో సన్నిహితంగా మెలగిన వారిలో ఎవరి గురించీ పెంచలయ్య గారు, ఇతడూ దేవుని చూసిన వాడేనని ప్రకటించనేలేదు. లేదా ప్రకటించినట్లు నా దృష్టికి రాలేదు. అలా అన్న దాఖలాలున్నాయేమోనూ తెలియదు. అంటే దేవుని చూశాననుకుంటున్న ఆయనకు దేవుని చూసిన వారుగా తన వాళ్ళలో ఎవరూ కనపడలేదన్నమాట.

క నాకు తెలిసినంతలో, పెంచలయ్యగారి పోకడను దగ్గరగా చూసి, అనుసరిస్తున్నది ఎన్‌.కె. ఒక్కడే. అడిగి తెలుసుకోవలసిందేమీలేదు. ఆలోచించీ, అవలోకించి తెలుసుకోవలసిందే దీనిని అన్నదే పెంచలయ్యగారిప్పటి వరకు అనుసరించిన పోకడ. పెంచలయ్యగారితో ముడిపడిఉన్న అంశాల వరకు ఆ పోకడను 100% ఆచరించిన వాళ్ళలో నేనూ ఒకణ్ణి. ఇక నా మొత్తం విధానంలో, చెప్పి తెలుపగలవీ, చూపి తెలపాల్సినవీ, తెలపగలవీ, చూసే తెలుసుకోవలసినవీ అన్న వివిధ రీతులకు చెందిన విషయాలున్నాయి. అదలా ఉంచినా మూడు ప్రమాణాలను అంగీకరించే వారెవరైనా మూడు రకాల జ్ఞానాలు కలుగుతున్నాయని చెప్పకనే చెప్పినట్లు. సైద్దాంతిక భాషలో చెప్పుకుంటే ఇది అధికరణ సిద్దాంతాల కోవకు చెందిన ప్రతిపాదన అవుతుంది. ''యత్సిద్దౌ అన్య ప్రకరణ సిద్దిః సఃఅధికరణ సిద్దాంతః!'' ఏది సిద్దిస్తే దానితో పాటు మరొకటీ సిద్దిస్తుందో అది అధికరణ సిద్దాంతమని సూత్రార్థం. మూడు రకాల ప్రమాణాలున్నాయన్నది సిద్దిస్తే మూడు రకాల జ్ఞానాలున్నాయనీ సిద్దించినట్లే. ప్రతి ప్రమాణం ద్వారా కలిగే జ్ఞానంలోనూ ఏదో ఒక తెలియని తనాన్న పోగొట్టడం అన్నది జరగాలన్నది నియమం. కనుక శబ్దాను మానప్రమాణాల ద్వారానూ ఏదో ఒక తెలియని తనం పోయి ఆ మేరకు జ్ఞానం కలుగుతునే ఉంటుంది.

పెంచలయ్యగారు 1) జ్ఞాన విద్యా శాస్త్రం (2) ఉపనిషత్తుల సారం అన్న రెండు రచనల్లోనూ, అక్కరలేనంతగా వారేమన్నారు? వీరేమన్నారు? వారన్న దానిని పరిశీలిస్తే ఏమనిపిస్తున్నది? అంటూ 450 పేజీలపైగా రచన చేశారు. అందులో వారి సొంతభావాలుగా ఎంచుకోడానికి తగినవాటిని ఏరి కూర్చితే అవన్నీ కలిపి 10, 15 పేజీలకంటే మించవు. ఈ రెండు పుస్తకాలను ఒకింత పట్టుబట్టి జాగ్రత్తగా చదివినా, ఇంతకూ ప్రమాణాల గురించి ఏమి చెప్పినట్లు? పదార్థాల మాటేమిటి? పెంచలయ్యగారున్నాడంటున్న దేవుని నిర్వచనమేమిటి? ఆయనకు చెందిన మరిన్ని వివరాలేమిటి? లాటి వేవీ పఠితకు స్పష్టంగా ఎదురుపడవు. మసక మసకగా, ఊహా మాత్రంగా అదీ బహుశా ఇది ఆయన భావమైయుండవచ్చు. అది ఆయన దైయ్యుండవచ్చుననిపిస్తుందంతే. 4, 5 అంశాల వరకు ఇది తప్పు, అది విరుద్దము, ఇది నియమము లాటి పదాలు వాడిన వాక్యాల వరకు, ఓహో ! ఈ విషయంలో ఆయన ఇలా అనుకుంటున్నారన్న మాట అని అనిపిస్తుంది. వెరసి పెంచలయ్యగారేమిటన్నది స్పష్టాస్పష్టంగా తయారై, అబ్బో! ఆయనగారెన్ని శాస్త్రాలు చదివారు!? అని ఆశ్చర్యపోయేందుకూ, ఆయన చాలా తెలిసిన వారు అన్న భావన పాఠకుల్లో నెలకొనేందుకు ఉపయోగపడిందది.

దీన్నంతటినీ నిశితంగా పరిశీలిస్తే, మామూలుగా ఒక పట్టాన అంతుబట్టని ఆయన అంతరంగంలో, బహుశాస్త్రకోవిదునిగా లోకంలో (నలుగురిలో) నిలిచిపోవాలన్న ప్రగాఢవాంచా అంతర్లీనంగా బలంగానే ఉన్నట్లు లేదా ఉండి ఉండాలన్నట్లు తలపింపజేస్తోంది. ఒక వంక బ్రహ్మ విద్యా శాస్త్రము, జ్ఞానవిద్యా శాస్త్రము, తర్కశాస్త్రములన్న పేర్లు న్యాయవైశేషికాలకే వర్తిస్తాయంటూనే, ఆ రెండు గ్రంథాలలో చాలా తేలనివీ, తేల్చుకోవలసినవి, సరికానివిగా తేలినవీ చాలా ఉన్నాయ్‌ అని తన పరిశీలన క్రింద ఆయన తేల్చారు. మరలాటప్పుడైనా, తాను సరైనవిగా తలంచుతున్న వాటిని ఇద్దమిద్దంగా, మరివేటితోనూ కలగాపులగం కానీకుండా విడిగా నిర్థారించి చూపవద్దా?

క లక్షణ ప్రమాణ విద్యలకు సంబంధించి, ఆయన దగ్గరున్న చట్రానికీ, నా అవగాహనకూ ఎంతో కొంత వ్యత్యాసం ఉందనే అనిపించింది, కొన్నిచోట్ల ఆయన వెళ్ళడించిన అభిప్రాయాలనుబట్టి. ఆ విషయమై ఆయన రచనలనుండి ఆయనవేనని నిర్ణయించడానికి వీలున్న వాటినన్నింటినీ వేరుచేసి, ఆ పైన వాటిని విచారణకు, విమర్శకులోనుచేసే పని నిధానంగా చేస్తాను. నాకాశ్రమంతా లేకుండా, పెంచలయ్యగారి ప్రమాణాలు, పదార్థాలకు నేను ప్రతినిధిగా ఉండగలను అనగలవారుంటే, వారితో ఈ విషయాలపై చర్చావేదికను ఏర్పాటు చేస్తాను. మరింత విపుల చర్చకు ఇది సందర్భం కాదు గనుక తార్కిక క్షేత్రానికి సంబంధించినంతలో ఇప్పటికాగుతాను.

పెంచలయ్యగారి తాత్వికావగాహన

ఈ రెండు పుస్తకాలలో ఆయన చూచాయగా తెలియజేస్తూ వచ్చిన దానిని బట్టి, ఆయన ఆస్థికపక్షానికి చెందిన వాడేననీ, అధ్వైతంవైపు మొగ్గిఉన్నారని అనిపించింది నా వరకు నాకు. అంతేగాక; ఆయన అనేక సందర్భాలలో (1) శివానందను; పూర్ణానందను, చంథ్రేఖరేంద్రను, జిల్లెళ్ళమూడి అనసూయమ్మను, రమణ మహర్షిని గురించి ఉదాత్తంగా మాట్లాడుతుండేవారు. దానిని బట్టీ నాకీ ఆలోచన కలిగింది. అయినా నిజమేమిటన్నది నిర్థారించేందుకు వీలులేని పరిస్థితి. 

ఒకింత విడ్డూరమనిపించేలా; గతయాభై ఏండ్లుగా ఎందరు, ఎన్ని విధాలుగా అడిగినా, వత్తిడి చేసినా తెరవకుండా బిగించి ఉంచిన గుప్పెడిని, చివరి నాళ్ళలో ఎవరూ అడగకుండగనే విప్పి చూపించారాయన. తనది చెప్పేది కాదనీ, చెప్పినా అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలున్నవారు తనకెవరూ ఎదురుపడలేదనీ (కానరాలేదనీ) అంటూ వచ్చిన ఆయనే కడకు ఏమనుకున్నారో ఏమోగాని, చాలా పేలవమైన ప్రతిపాదన చేసి దానిని పరీక్షకిచ్చి, నిలబెట్టకుండగనే జీవితాన్ని ముగించారు. ఇక ముందిది, వారితో సన్నిహితంగా మెలగిన, సాన్నిహిత్యం ఉందనుకుంటున్న, ఉందనంటున్న రకరకాల వారి, విరణలు, వ్యాఖ్యానాలు, విమర్శల రూపంలో ఎన్నెన్ని రకాలుగా తీరబోతోందో నన్న ఆలోచనా, ఆందోళన కూడా నాకున్నాయి.

(1) ఉపనిషత్తులు ఏకోన్ముఖంగా లేవన్నది వాటిని ఏమాత్రం శ్రద్దగా చూసిన వారికైనా ఎదురుపడే వాస్తవం.

(2) దేవుణ్ణెరిగిన వాడే దేవుణ్ణెరిగిన వాణ్ణి గుర్తించగలడు అన్న ప్రకటన అనవసరమైన గందరగోళానికి విత్తనాలు వేసింది.

(3) ఉనికి, ప్రేరణ, కోర్కె, కావాలి, వద్దు, స్వతంత్రము, అస్వతంత్రము, పరాధీనత, స్వాధీనత, స్వేచ్చ, భౌతికము, అభౌతికము, అవినాభావ సంబంధము, సుఖము, దుఃఖము, ఆనందము, చేతనము, చైతన్యము అన్న పదాలకూ, ఇలాటివే మరి కొన్నింటికీ ఆయనవైన నిర్వచనాలు బైటపడితే గాని ఆయన అవగాహనలోని లోపాలోపాలు నిర్థారించడం కుదరదు. ఆయన రచనల్లో నుండి వాటిని వెదికిపట్టుకునే పని చేయాలి. లేదా ఆయన చెప్పగా వ్రాసుకున్న వారుండి, వారువాటిని బైటపెడితేనూ సరిపోతుంది. లేకుంటే మనకున్న ఒకే ఒకదారి భాషా నియమాలకు లోబడి, వాటి బాగోగుల్ని తెచ్చుకోవడమే.

ఇప్పటికి చివరగా ఒక్కమాట చెప్పుకుంటే ఈ వ్యాసానికి తగినంత సందర్భోచితి సిద్దించదు. అందుకే ఒక్కమాట!

ఆయన గారి ఆత్మీయులకు ఆయన పోవడం ఒక విషాదం కాగా, భావాల పరంగా కొంత గందరగోళాన్ని విడిచిపోవడం మరో విషాదం. భవిష్యత్తులో, ఆయన వదలివెళ్ళిన ఈ గందరగోళాన్ని ఆధారం చేసుకుని, ఆయన్ని ఆపోశనం పట్టేశాం అనేవాళ్ళు పుట్టుకొస్తే, ఆయన పేరు చెప్పుకుంటూ, తమ భావాలను మందినెత్తిన- అదీ విచారణకు సిద్దంకాకుండా- పెట్టేవాళ్ళు పుట్టుకొస్తే, అదీ విజ్ఞులపాలిట మరో విషాదం. ఇదంతా కాదని, స్వతంత్రలోచనాశీలురకు వరిపిడిరాయిలాటి ఆయన పోకడను సజావుగా సమాజం ముందుకు తెచ్చి, చింతకులకు అందించగలిగితే అదెంతో గొప్ప ప్రసాదం కాగలుగుతుంది.

తర్క విద్య బ్రతుకు ప్రయాణానికి నిరంతరం అవసరమై ఉందనీ, అది కేవలం ఆస్థి, నాస్థిల క్షేత్రానికి సంబంధించిందికానే కాదని అనుకుంటున్న వాణ్ణి నేను. కనుక దానికి ఏ పేరు పెట్టుకున్నా మేధో సామర్థ్యాలను పెంచగల, నిశితదృష్టి నివ్వగల, సక్రమంగా ఆలోచించడాన్ని అలవరచగల తర్క విద్యను - సాంప్రదాయంగా అందులోకి చొరబడిపోగుపడి ఉన్న పనికిరాని భాగాన్ని (చెత్తను) వదిలించుకుని - సమాజానికి అందించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ దిశగా జరిగే ఏ ప్రయత్నాలలోనైనా స.మం శక్తివంచన లేకుండా పాలుపంచుకుంటుంది. అలాంటి యత్నాలు ఆరంభించుకోడానికి సంధాన కర్తగా బాధ్యత వహించమన్నా సిద్ధంగా ఉంటుంది. సక్రమాలోచనా నియమాల శాస్త్రం తర్కశాస్త్రం, అన్న దాని అసలైన అర్థాన్ని అంగీకరిస్తూ. కనుకనే అది ప్రతి మనిషి నిత్య జీవితావసరమనీ, ఆరకంగా అది సామాజికావసరమనీ భావిస్తూ, ఆ అవసరం తీర్చేదిశగా కదులుదాంరండని ఆహ్వానిస్తూ, నా ఆలోచనా సరళికి ఒక థలో పెనుమార్పుకు కారకులైన పెంచలయ్యగారిని గుర్తు చేసుకుంటూ.

సత్యాన్వేషణలో..... మీ సురేంద్ర.


హేతువాద పునరుజ్జీవన యత్నాలు - 6

ఈ శీర్షికాంశాన్ని శ్రద్దగా పరిశీలిస్తున్న యోచనాశీలురైన మిత్రులారా! హేతువాద పునరుజ్జీవన యత్నాల పేరిట కృషి (విచారణ) ఆరంభమైన నాటి నుండి కొంతమందిమి ప్రతినెలా ఈ విషయంపైనే సమావేశాలు జరుపుకుంటూ వస్తున్నాము. అటు ఆ సమావేశాలలోనూ పాల్గొంటున్నవారిలో ఆ వివరాలను వివేకపథం ద్వారా గమనిస్తున్న పాఠకులలోనూ హేతువాదం సిద్దాంతకాదు, అదోక మెధడాలజీ (ఆలోచనావిధానము) అన్న దృష్టి కలిగిన వారే అధికంగా ఉన్నారు. నేనూ, నాతోబాటు అతికొద్ది మంది మాత్రం హేతువాద మన్నదీ ఒక సామాజిక స్పృహగలిగిన సిద్దాంతమేనంటూ వస్తున్నాము. ఈ మొత్తాన్ని పరిశీలిస్తున్న వారిలో ఒకరిద్దరు అది సిద్దాంతమైతేనేమి, కాకుంటే నేమి? అదేమటో తెలుసుకుని ఆచరణలో పెట్టుకుంటే చాలాదా? అన్న అభిప్రాయాన్నీ వెళ్ళడించారు.

ఇక్కడ మన మందరం గమనించాల్సిన అంశమొకటుంది. హేతువాదం సిద్దాంతమని గానీ, సిద్దాంతం కాదని గానీ ఎవరూ ప్రస్తావించకుండా ఉండుంటే, ఎవరిమటుకు వారు వారి వారి జీవితాలలో హేతుబద్దంగానో, అహేతుకంగానో ఆలోచించుకుంటూ సాగిపోతుంటే, భావజాల క్షేత్రంలో ఇది ఉండకూడదు, ఇది ఉండాలిలాటి మాటలూ, రాతలూ, తదనుగుణ్యయత్నాలూ, వాదోపవాదాలూ పొడచూపకుండా ఉండుంటే, ఈమూడో పక్షం వాళ్ళన్నట్లు సాగిపోతుంటే సరిపోతుంది. కానీ పరిస్థితులలా లేవు. సహస్రాబ్దాల కాలంగా కలిగిన అనుభవాలు, లభించిన ఆధారాలననురించి ఆలోచించి చేసుకున్న ఊహలు కలిసి ఏర్పడ్డ వాదాలు, వాదనలు వెరసి రకరకాల సిద్దాంత, రాద్దాంతాలు కొనసాగుతూ వస్తున్నై. మానవ జీవితం కూడా, ఏర్పడ్డ అనుబవాలలోనూ, చేసుకున్న ఊహలలోనూ, వినడం, చదవడం ద్వారా అందిన సమాచారంలోనూ సరిచూసుకుని, సరిచేసుకోవలసిన అంశాలుండడాన్ని చవిచూడడంతో, ఆయా విషయాల (భావాల) సబబు, బేససబుల్ని జాగ్రత్తగా పరిశీలించి నిర్థారించుకోవడం అని వార్యమైంది. అదిగో ఆ అనివార్యతనుండి పుట్టుకొచ్చినవే సత్యాన్వేషణ, అందుకవసరమైన శాస్త్రీయ విచారణ పద్దతి శాస్త్రీయ దృక్పథం అన్నవికూడా.

ఉనికిలో ఉన్న భావాలనన్నింటినీ - సిద్దాంతాలనన్నింటినీ - నిర్థాక్షిణ్యంగా విమర్శించు; విమర్శకు ఏదీ అతీతం కాదు. విమర్శించడానికి సిద్దపడనివాడు, విమర్శను ఆహ్వానించనివాడు హేతువాది అనడానికి తగడు, లాంటి మాటలన్నీ విషయ విచారణ యొక్క అవసరాన్ని, ప్రయోజనాన్ని సూచించేటివే. అయితే అలా విచారణను ఆరంభించాలంటే ముందుగా విచారణకులోను చేయాల్సిన అభిప్రాయాన్ని నిర్థిష్టరూపంలో ఎంపిక చేయాల్సి ఉంటుంది. తార్కిక భాషలో దానినే ప్రతిపాదన, ప్రతిజ్ఞ లేదా విచారణీయాంశము అనంటారు. ఆపై దానిని సంశయించాల్సి ఉంటుంది. ఎందుకంటే సంశయించక విచారించడం కుదరదు కనుక. అట్టి వాటినన్నింటిని అభ్యుపగమ సిద్దాంతాలంటారు సిద్దాంతం తెలిసినవారు.

ఏ ప్రతిపాదనైనా ఏదో ఒక విషయానికి సంబంధించిందై ఉంటుంది. ఎవరో ఒకరిగానీ, ఒక సమూహం అంగీకరించేదిగానీ అయ్యుంటుంది. అలాంటి ప్రతిపాదనలనే వాదాలు అనంటారు. ఒక నిర్థిష్ట రూపాన్ని సంతరించుకుని ఉన్న ప్రతి ప్రతిపాదనా సిద్దాంత మనడానికి తగిందే అవుతుంది. తంత్రాధికరణాభ్యుపగమ సంస్థితిః సిద్దాంతః ఒక ధోరణికి చెందిన నిశ్చితాభిప్రాయం సిద్దాంతమని సూత్రార్థం.

ఉదా :- దేవుడున్నాడు 2. దేవుడులేడు 3. విశ్వము నియమబద్దము 4. పదార్థము సృష్టింపబడదు, నాశనం కాదు. 5 ప్రతి కార్యానికీ కారణముంటుంది 6. హేతుమంతుడు అవశ్యం నీతివంతుడవుతాడు ఇది రాడికల్‌ హ్యూమనిజం సిద్దాంతం 7.పెట్టుబడిదారీ ఆర్థిక విధానంలో దోపిడీ అనివార్యము 8. వారసత్వపు ఆస్థిహక్కు ఆర్థిక సమానత్వ సాధనకు అవరోధకము 9. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నది. 10. భూమి చుట్టూ సూర్యచంద్రాది గ్రహ నక్షత్రాలు తిరుగుతున్నాయి. 11. పరమాణు గర్భంలోని ఎలక్ట్రాను వేగాన్ని అది ఉన్న స్థానాన్ని ఏకకాలంలో ఖచ్చితంగా నిర్ణయించడం సాధ్యం కావడం లేదు.

మిత్రులారా! ఇలా ఎన్ని ప్రతిపాదనలైనా చెప్పుకుంటూ పోవచ్చు. నా వరకు నేను హేతువాదం పై విచారణ నారంభించినప్పటి నుండి హేతువాదమన్నది, సామాజిక స్పృహకలిగిన, తాత్విక స్థాయి కలిగిన, సక్రమాలోచన అవసరాన్నీ అది ఉన్నప్పుడు, లేనప్పుడు, వ్యక్తి జీవితంలో సమాజ స్థితి గతులలో వచ్చే తేడాపాడాలను, వివరించే భావజాల సంపుటేనంటూ వస్తున్నాను. ముందిది సరైనదోకాదో నిర్థారించుకోండి. వచ్చిన ఇబ్బందేమిటంటే ఈనాడు ఒక రచననుకానీ, ఒక అభిప్రాయాన్ని గానీ ఎలా విచారించాలో (పరిశీలించాలో లేదా పరీక్షించాలో) నన్న అంశాన్ని ముఖ్యమైనదిగాగానీ, కీలకమైనదిగాగాని తలంచకపోవడం జరుగుతోంది ఎక్కువలో ఎక్కువ మందిలో, ఎక్కువలో ఎక్కువసార్లు. హేతువాదం క్రిందకు అనేక విషయాలపై తనదైన రీతిలో ప్రకటింపబడ్డ అనేక అభిప్రాయాలు చేరి ఉంటాయా? లేదా? చేరి ఉన్నాయా? లేదా?

1) హేతువాదం హేతువంటే ఏమిటో వివరిస్తుందా? లేదా? వివరించాలాలేదా? అన్నది అన్ని ప్రశ్నలకూ వర్తిస్తుంది.

2) హేతువాదం హేతుత్వమంటే ఏమిటో చెపుతుందాలేదా?

3) హేతువాదం సహేతుకాలోచన, అహేతుకాలోచన అంటే ఏమిటో వివరిస్తుందాలేదా?

4) అహేతుకాలోచన వల్ల జరిగే అనర్థాలు, సహేతుకాలోచన వల్ల జరిగే ప్రయోజనాలు వివరిస్తుందా? లేదా?

5) జ్ఞానమంటే ఏమిటో, విజ్ఞానమంటే ఏమిటో, ఊహాత్మక నిర్ణయాలకు, ప్రయోగాత్మక నిర్ణయాలకు ఉన్న తేడా ఏమిటో వివరిస్తుందా లేదా?

6. నమ్మకాలు, మూఢనమ్మకాల గురించి వివరించి మూఢనమ్మకాల్ని వదులుకోమంటుందాలేదా?

7. మనుషుల మధ్య సామరస్య పూర్వక సంబంధాలు కొనసాగుతూ ఉండాలని అంటుందాలేదా?

8. హేతువాద తాత్విక ధోరణి వ్యక్తుల, గ్రంధాల ప్రామాణికతను తృణీకరిస్తుందా లేదా?

9. విజ్ఞాన శాస్త్ర సమాచారం ఆధారంగనే ఊహాత్మక నిర్ణయాలు చేస్తుండాలని చెపుతుందాలేదా?

10. హేతువాదానికి సామాజిక స్పృహ ఉంటుందా? ఉండదా?

11. వ్యక్తులందరూ సుఖశాంతులతో ఉండాలని, మంచి సమాజం ఏర్పడాలని లక్షిస్తుందా లేదా?

12. మనిషి ఎటువంటి ఆలోచనా విధానాన్ని కలిగి ఉండాలో ప్రస్తావిస్తుందా లేదా?

13. తప్పు జ్ఞానాన్ని వదిలించుకోవలసిన అవసరాన్ని, ఒప్పుజ్ఞానాన్నార్జించాల్సిన అవసరాన్ని నొక్కి చెపుతుందా లేదా?

14. సమాజాన్ని ప్రభావితం చేస్తున్న వివిధ తాత్విక ధోరణుల్ని తనదైన రీతిలో విచారించి, విమర్శిస్తుందాలేదా!

15. హేతువాద ఉద్యమం యొక్క లక్ష్యమేమిటో చెప్పగలరా? ఆ లక్ష్యాన్ని చేరుకోడానికి అది రూపొందించుకున్న కార్యాచరణ ప్రణాళికేమిటో చెప్పగలరా? ఈ వివరాలు చెప్పాల్సిన అవసరముందాలేదా?

మిత్రులారా! ఇలాంటివే మరికొన్ని అంశాలకు చెందిన ప్రశ్నలనూ లేవనెత్తవచ్చు. వీటన్నింటికీ హేతువాదం తనదైన రీతిలో అవునంటూ సమాధానాలు చెపుతుంది. హేతువాదం మ్మీద అంతో ఇంతో అవగాహనున్నవారు ఎవరు గానీ వీటిని గాని వీటిలో కొన్నింటినిగానీ, మరికొన్నింటిని కలుపుకునిగానీ ప్రస్తావించకుండా ఉండలేరు. కనుకనే హేతువాదమనేది వ్యక్తినీ, సమాజాన్ని సక్రమంగా నిలిపి ఉంచాలన్న ఉద్దేశం కలిగిన మంచి సమాజం రావాలనుకునే సామాజిక తాత్విక ధోరణి అని చెప్పాను.

ఒక ముఖ్య విషయం చెప్పనా? హేతువాదం సిద్దాంతం కాదంటున్న వాళ్ళు గాని, సిద్దాంత మేనంటున్న వాళ్ళు గానీ, మొట్టమొదట ఆ రెండు పదాలకు నిర్వచనాలు (తమవైన అర్దాలు) చెప్పి, అదెలా సరైనవో నిర్ధారించాలి. ఆ పనిని చేయకుండా ఎంతెంత మాట్లాడినా అదంతా, ఆదిలోనే దారితప్పిన ప్రయాణం వంటిదే అవుతుంది. చెప్పుకోడానికి ఒకింత విచారకరమే అయినా, నేనుతప్ప ఆ పని చేసినవారు, ఆంధ్రప్రాంతంలో లేరు. రంగనాయకమ్మ గారు మాత్రం హేతువాద సిద్దాంతం అన్న ప్రయోగం చేశారు. అయితే ఆమె దానిని నాస్తికత్వమేనని అన్నారు. 1899లో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన బ్రిటీష్‌ రేషనలిస్టు ప్రెస్‌ అసోసియేషన్‌ వారు హేతువాదం అన్న మాటను ఇలా నిర్వచించారు.

ష్ట్రబిశిరిళిదీబిజిరిరీళీ ళీబిగిలీలి ఖిరితీరిదీలిఖి బిరీ శినీలి ళీలిదీశిబిజి బిశిశిరిశితిఖిలి గీనీరిబీనీ తిదీజీలిరీలిజీఖీలిఖి లీగి బిబీబీలిచీశిరీ శినీలి రీతిచీజీలిళీబిబీగి ళితీ జీలిబిరీళిదీ బిదీఖి బిరిళీరీ బిశి బిరీశిబిలీజిరిరీనీరిదీవీ బి రీగిరీశిలిళీ ళితీ చీనీరిజిళిరీళిచీనీగి బిదీఖి లిశినీరిబీరీ ఖీలిజీలితీరిబిలీజిలి లీగి లినిచీలిజీరిబిదీబీలి బిదీఖి రిదీఖిలిచీలిదీఖిలిదీశి ళితీ బిజిజి బిజీలీరిశిజీబిజీగి బిరీరీతిళీచీశిరిళిదీరీ ళిజీ బితిశినీళిజీరిశిగి.

హేతువాదాన్ని ఇలా నిర్వచించుకోవచ్చు. అన్ని రకాల శబ్ద ప్రమాణాల (అంటే గ్రంధాల వ్యక్తుల) ప్రామాణికతను తృణీకరిస్తూ, స్వతంత్రంగా, అనుభవం ద్వారా సరిచూసుకోదగిన, నైతికతతో ముడిపడిన తాత్వక విధానాన్ని (వ్యవస్థను) స్థిరపరచుకునే క్రమంలో హేతువు యొక్క సర్వాధిక్యతను అంగీకరించే మానసిక వైఖరినే హేతువాద మంటాము.

వివరణ : పై నిర్వచనంలో కొన్ని కీలకమైన పదాలున్నాయి. తిదీజీలిరీలిబిజీఖీలిఖిజిగ్ష్మి రీతిచీజీలిళీబిబీగి ళితీ జీలిరీళిద్ష్మీ బిరిళీరీ బిశి బిరీశిబిలీజిరిరీనీరిదీవీ బి రీగిరీశిలిళీ ళితీ చీనీరిజిళిరీళిచీనీగి ఞ లిశినీరిబీరీ, రిదీఖిలిచీలిదీఖిలిదీశి ళితీ బిజిజి బిజీలిలీరిశిజీబిజీగి బిరీరీతిళీచీశిరిళిదీరీ, బితిశినీళిజీరిశిగి.

1) జుజీలీరిశిజీబిజీగి బిరీరీతిళీచీశిరిళిదీరీ అంటే అర్థమేమిటి? ఒక వ్యక్తి వెళ్ళడించిన అభిప్రాయాలు లేదా అహేతుక నిర్ణయాలు

2) బితిశినీళిజీరిశిగి అంటే గ్రంధాన్ని వ్యక్తిని ప్రామాణికంగా ఎత్తుకోవడం, స్వీకరించడం, ఇక ఇండిపెండెంట్‌ ఆఫ్‌ ఆల్‌ ఆర్బిట్రరీ ఎజంషన్సు అన్న వాక్యాన్ని ఇలా అన్వయించుకోవాలి. ఈ మానసిక వైఖరి అహేతుకవూహల నుండీ, వ్యక్తుల గ్రంధాలపై ప్రామాణిక దృష్టి కలిగి ఉండడం అన్నదాని నుండి ఇండిపెండెంటుగా అంటే విడివిడి లేదా స్వతంత్ర పొంది లేదా వాటిని విడిచి పెట్టి ఉంటుంది.

వెంకటాద్రిగారి, గుమ్మా వీరన్న గారి రచనలలో 'హేతువాదం ఒక వాదం కాదు' అన్నమాటలున్నాయి. భాషాపరంగా ఇది సరైన ప్రయోగం కాదనిపించడంలేదా. ఆవాదం వాదం కాదు అనకూడదు కదా! నాకు తెలిసినంతలో యాదాలాపంగా వాడేసిన పదం, మరల మరల వాడుతూరావడం వల్ల స్ధిరపడిన మాట అది. అలా ఏమీకాదు, సుస్పష్టంగా కావాలనే ఆ పదాన్ని వాడాము అనే ఇప్పటికీ వారనేట్లయితే సిద్దాంతమంటే ఏమిటో నిర్వచించి, హేతువాదమంటే ఏమిటోనూ నిర్వచించి, ఇది సిద్దాంత నిర్వచనం క్రిందికి ఎందుకురాదోనూ తేల్చాలి. వారి విషయమలాఉంచి, ఈ విచారణలో పాల్గొనేవారిలో హేతువాదం సిద్దాంతంకాదు అనదలచుకున్నరోవారు విధిగా హేతువాదమంటే ఏమిటో, సిద్దాంతమంటే ఏమిటో నిర్ణయించి, ఆపై అది దీని క్రిందికి చేరదు అని నిర్ధారించాలి. వెంకటాద్రి గారు హేతువాద మన్నదొక మెధడాలజీ అనీ అన్నారు అంటే ఏమని?

ఈ విచారణ ఒక కొలిక్కి రావాలంటే; కీలకమైన కొన్న పదాలకు ఖచ్చితమైన అర్థాలు - నిర్వచనాలు - చెప్పుకుని తీరాలి. ఎన్నిసార్లు నేనీ విషయాన్ని నొక్కి చెపుతున్నా, ఎవరూ దానిని పట్టించుకోడమేలేదు. వచ్చిన ఇబ్బందంతా ఇక్కడే ఉంది. హేతువన్న పదంతో కలిపి చెప్పే మాటలన్నంటికీ - పదాలకన్నింటికీ - వాటి వాటి అర్థాలను స్పష్టంగా చెప్పుకోకుండా, చర్చలో పాల్గొనే వారంతా వాటికి ఒకే అర్థాలను అంగీకరించుకోకుండా విచారణ సజావుగ సాగనే సాగదు. కనుక అట్టి పదాలను ఎంచుకుని, వాటికి నిర్వచనాలను స్థిరపరచుకోవాల్సిందే. నిజానికి హేతువాద మన్నది ఒక ఆలోచనా విధానము అన్నప్పుడు కూడా దాని అర్థం చెప్పినట్లు కాలేదు. ఏ రకమైన ఆలోచనా విధానమో కూడా చెపితేనే ఆ మేరకైనా అర్థం చెప్పినట్లు వారు ఆ పదానికి ఆ రకంగా అర్థం చెప్పలేదుగానీ, హేతువాదమూ ఒక వాదమేననడానికి అవసరమైన భావజాలాన్నెంతటినో హేతువాదం పేరున ప్రకటిస్తూనే వచ్చారు. మరొక్కమాట! ఎలా వివిధ విషయాలకు సంబంధించిన వివిధ సిద్దాంతాలుంటాయో, ఉండవచ్చునో, అలాగే ఆయా విధానాలన్నిటి పైనా సిద్దాంతాలుండవచ్చు. ఉంటాయి. కొన్ని ఉదాహరణలిస్తాను పరిశీలించండి.

1) సామ్యవాదం (సోషలిజం) అన్నది సమాజంలో ఆర్ధికాంశాలకు సంబంధించి అనుసరించాల్సిన విధానమే. 'సామ్యవాద ఆర్థిక విధానం' అన్నమాట మనకందరికీ తెలిసున్నదే. అయినా దానిని సిద్దాంతమనే అంటున్నాముకదా! ఇంకా సరిగా చెప్పాలంటే 'సోషలిజం' అన్న అంశంపైనే అనేకులు ప్రతిపాదించిన అనేక సిద్దాంతాలూ ఉండవచ్చు.

2) ప్రజాస్వామ్యం అన్నదీ ఒక పాలనా విధానమే. అయినా అదీ సిద్దాంతంగానే చెప్పబడుతోంది. ఇంకా సరిగా చెప్పాలంటే 'ప్రజాస్వామ్యం' అన్న అంశంపై అనేకులు ప్రకటించిన సిద్దాంతాలూ ఉంటాయి.

3) నీతి అన్న అంశాన్ని తీసుకుంటే నైతికత అన్నదొక మానసిక వైఖరి అని తేలుతుంది. అయితే నీతంటే ఏమిటి అన్న దానిపై అనేక సిద్దాంతాలు (నీతంటే ఇదీ అన్న ప్రతిపాదనలు) ఉన్నాయి.

4. సమాజ శాస్త్రంలో, సమాజమంటే ఏమిటన్న దానిపై, పలువురు పలురకాలుగా నిర్వచించారు. వాటన్నింటినీ సోషల్‌ సైన్స్‌స్‌లో వివిధ సిద్దాంతాలుగనే పేర్కొంటున్నారు.

5) వివిధ మతస్తులూ ఎవరికి వారు తమదొక జీవన విధానమనే పేర్కొంటున్నారు. నిజానికి వారి, వారిది జీవన విధానమే కదా! అయినా వాటన్నింటినీ సిద్దాంతాలనే అంటున్నాము.

6) సైన్సులో ఒక్కో విషయంపైనా ఒక్కో శాస్త్రజ్ఞుడు చేసిన ప్రతిపాదనలనూ సిద్దాంతాలనే అంటారు.

హైపోధిసిస్‌ అంటే ఊహాత్మక సిద్దాంతం అనే కదా.

మిత్రులారా! ఇలా జ్ఞాన భాగానికి చెందిన ఏ శాఖా గ్రంథాలను చూసినా, వివిధ సిద్దాంతాలు ఎదురుపడతాయి. అందులో మెధడాలజీకి చెందిన సిద్దాంతాలూ ఉంటాయి. అలాగే మనోవిజ్ఞాన శాస్త్ర క్షేత్రంలోకి వెళ్ళి చూస్తే మానవస్వభావం అన్న అంశంపైనా అనేకులు ప్రతిపాదించిన అనేక సిద్దాంతాలు కనపడతాయి.

ఏ వాదమైనా ఏదో ఒక అంశంపై ఏదో ఒక అభిప్రాయ ప్రకటన (ప్రతిపాదన) రూపంలోనే ఉంటుంది. అట్టివాటి నన్నింటినీ సిద్దాంతాలనే అంటారు. ఇంతగా ఆధారాలతో సహా వివరిస్తున్నా వీటనింటినీ పట్టించుకోకుండానే, తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళన్నట్లు యధాపూర్వం, అంటే ఈ వివరాలు చూడక ముందున్నట్లే పాతభావాన్నే పట్టుకు కూచుంటానంటే ఎవరం చేయగలిగిందీ ఏమీ ఉండదు.

'నికార్సయిన హేతువాదికి ఏ వ్యక్తీ, గ్రంథమూ ప్రామాణికం కాదు, కారాదు అన్న సూత్రాన్ని అంగీకరించుకునే ఉన్నాంగనుక, మీరు ఎవరికి వారుగా సిద్దాంతమంటే ఏమిటి అన్న విషయంలో తమ పక్షాన్ని (సిద్దాంతాన్ని) ప్రకటించి, అది సరైందేనని నిరూపించే బాధ్యత వహించండి. అది అన్ని రకాలుగా మేలవుతుంది.

ఈ విషయంలో స్పష్టతరావాలంటే ఇదిగో ఈ పదాలకు అర్థాలు - నిర్వచనాలు - నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. హేతువు, హేతుత్వము, హేతుమంతుడు, అహేతుకము, సహేతుకము, కారణము, ఆలోచన, హేతుబద్దాలోచన, ఆధారసహితాలోచన, తర్కము, హేతువాదము, హేతువాది, వాదము, వాదన, దృక్పథము, మానసిక వైఖరి, నమ్మకాలు, మూఢనమ్మకాలు, సిద్దాంతము, వివిధ సిద్దాంతాలు, ఆలోచనా విధానము, జీవన విధానము సత్యము, వాస్తవము అసత్యము, అబద్దము, జ్ఞానము, విజ్ఞానము, అజ్ఞానము, వ్యవస్థ, వ్యవస్థీకృతము, వ్యవస్థీకృతజ్ఞానము

మళ్ళీ మరోమారు! ఎన్నిసార్లు ఎంతగా చెప్పినా అస్సలు విషయాన్ని పట్టించుకోకుండా, ఏదో ఒకటి మాట్లాడేస్తుంటారు ఎక్కువలో ఎక్కువమందికది అలవాటుగానూ మారిపోయింది. ఇప్పటికైనా మించిపోయిందిలేదు.

హేతువాదమన్నది తాత్విక స్థాయి కలిగిన సామాజిక దృక్పథాన్ని తెలిపే సిద్దాంతమంటూ నేనిచ్చిన వివరాలలోని దోషమేమిటో నిర్థారించనైనా నిర్థారించండి. లేదా మీ పక్షంగా, సిద్దాంతమంటే ఏమిటో, హేతువాదమంటే ఏమిటో చెప్పి హేతువాదం ఎందుకు సిద్దాంతం కాదో అన్నదైనా నిర్ధారించండి. భావ విప్లవం రావాలంటూ నినదించే మనం - ఎవరైనా- లోపసహితమైన భావాలను వదులుకోడానికీ, సరిచేసుకోడానికీ, సరైన భావాలను చేర్చుకోడానికీ నిరంతరం సంసిద్దంగా ఉండాలి. ఎలాటి భేషజాలూ పొరపొచ్చాలు లేకుండా మంచి భావాలను స్వీకరిస్తుండాలి. నూతన సంవత్సరం, సంక్రాంతి (సరైన మార్పు) దిశగా అడుగులు వేద్దాంరండంటూ ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

విజ్ఞాన క్షేత్రాలలో అజ్ఞానులు - 1

యోచనాశీలురైన పాఠకమిత్రులారా! అనంతపురం నుండి బి.వి.రాధాకృష్ణమూర్తిగారు, రెండు పుస్తకాలు పంపి, వాటిని సమీక్షించవలసిందిగానూ, సమాజానికి మేలు కలిగేలా స్పందించవలసిందిగానూ ఒక సూచన చేశారు. ఆ పుస్తకాలు 1) డా|| బి.వి. పట్టాభిరామ్‌ ఎం.ఎ.పి.హెచ్‌.డి వ్రాసిన, ''మహిమాన్వితమూర్తి శ్రీ సత్యసాయిబాబా'' అన్నదికాగా (2) ఇందూ ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్దాంత ఆదికర్త, శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోదానందయోగీశ్వర్లు, అన్న పేరుతో చలామణి అవుతున్నాయన వ్రాసిన 'హేతువాదము - ప్రతివాదము' అన్నదై ఉంది.

ఆ రెండు రచనలూ ప్రజలను ఆలోచింపజేసేవిగాగానీ, స్వతంత్రాలోచనాశీలతను, విచారణ పద్దతిని బలపరచేవిగాగానీ లేకపోవడమే గాక, అంధానుసరణను రేకెత్తించేవిగనూ ఉండడంతో కొద్దిమంది ముందుకైనా వాటి గురించి తెలియజేయడం వివేకవంతమవుతుందనిపించడంతో నూతన సం||ర ఆరంభ సంచికలో ఆ రెంటిపై వ్యాసాలు ఇలా వచ్చిచేరాయి. ముందుగా మెజీషియన్‌ పట్టాభిరాం గారి రచనను ఒకింత పట్టిచూద్దాం.

(1) బి.వి. పట్టాభిరాం గారు మెజీషియన్‌గానూ, మహిమలు, మంత్రాలు అబద్దం అంటూ ప్రచారం చేసిన వ్యక్తిగానూ, వ్యక్త్త్తిత్వ నిర్మాణం, వికాసం తరగతులనూ, మనో విశ్లేషకునిగానూ వృత్తిని చేసుకుంటూ ప్రసిద్దులయ్యారు. తత్వశాస్త్రంలో ఎమ్‌.ఎ, మనస్తత్వ శాస్త్రంలో మరో ఎమ్‌.ఎ. పట్టాను పొంది, దేనిపైనో పి.హెచ్‌.డి కూడా పూర్తి చేసినట్లు తెలుపుతున్నాయి వారి మాటలు. ఆశ్చర్యమేమంటే మ్యాజిక్కు, మనోవైజ్ఞానిక శాస్త్రము, తత్వశాస్త్రము అన్నమూడూ అభౌతిక శక్తుల, మహిమల ఊసులేని ఒక రకంగా ప్రజలలో నెలకొని ఉన్న అలాటి భావనలు అపోహలనో, మానసిక వైకల్యం నుండి పట్టుకొచ్చేవనో చెప్పేటివే. వాటిని చదివాక చాలాకాలం అలానే ఉన్నట్లూ, సాయిబాబాలాంటి వారినీ విమర్శించేవాణ్ణి లాంటి మాటల ద్వారా ఆయనే చెప్పుకున్నారు.

(2) వారి తండ్రిగారు - ఆయన ఆధ్యాత్మిక జిజ్ఞాసవు పరోపకారి, వెంకటేశ్వరుని భక్తుడు. ప్రముఖ ఇంజనీరు, సంశయాత్మడుగా పుట్టపర్తి వెళ్ళి, అమాంతంగా బాబా భక్తుడై అక్కడే స్థిరపడిపోయారు అంటూ వ్రాశారు.

3) అలా వాళ్ళ తండ్రి బాబాభక్తుడై పోవడం వల్ల తన అభిప్రాయాల్ని సహేతుకంగా పునఃపరిశీలన చేయాలనిపించిందట.

4) అక్కడి నుండి వీరిలో జిజ్ఞాస ప్రారంభమైందట. ఎందరో భక్తుల్నేగాక, నాస్తికుల్ని, రేషనలిస్టుల్ని కలిశారట.

వారిని మీరు బాబాను కలిశారా? అనడిగారట! వారెవ్వరూ బాబాను కలవలేదు. అక్కడా, ఇక్కడా విన్నవాటిని బట్టే అలా విమర్శించడానికి, దుర్భాషలాడడానికి సిద్దపడ్డారు. ఆ రకంగా వారి విమర్శ నన్ను బాబాను చూడడానికి ప్రేరేపించింది. బాబాను చూశాక నా అజ్ఞానం బైటపడింది. బాబా మహిమాన్వితుడని అర్ధమైంది.

విశ్లేషణ : ''మనస్సులోని మాట'' అన్న పేరుతో ఆ పుస్తకంలోని ముందుమాటలివి. ఈ మాటలన్నింటిలో 'చూడకుండగనే దుర్భాషలాడారు.' అన్న ఒక ముక్క తప్ప మిగిలిన దంతా, ఆలోచనా రహితంగా సత్ససాయిబాబాను సాధారణ ప్రజలనెత్తికెత్తడానికి, వారిని తానెరిగిన మనోవిజ్ఞాన శాస్త్రపు సూత్రాలననుసరించి ప్రభావితం చేయడానికి ఒక ఎత్తుగడగా పనికి వచ్చేదిగనే ఉంది. ఒక్కముక్కలో చెప్పాలంటే ఈ రచనంతా పట్టాభిరామ్‌లో శాస్త్రీయ దృక్పథంలేదనీ శాస్త్రీయ పద్దతి అమలుపరచలేదని నిర్ణయించడానికి రుజువుగా ఉంది. అంత మాత్రమైతే పరవాలేదు. తాను చదివిన, నేర్చిన విద్యల్ని బ్రతుకుదెరవుకే గాక, అధిక సంపాదనకూ మార్గంగా చేసుకుని, ప్రసిద్ధి పొంది ఇప్పుడు పేరును ఇలాంటి అశాస్త్రీయ భావాలను మందినెత్తికెక్కించడానికి పూనుకోవడమే విచారకరమూ, విచారణీయము కూడా. ఈ రచనను ఈ విధంగా తీసుకురావడానికి సత్యసాయి కంపెనీ నుండి ఎంత ముట్టిందో ఈయనకూ - వారికీ మాత్రమే తెలిసుండే విషయం. తనకే తెలియని విషయాలలో, ఇంతటి అవైజ్ఞానికాంశాలను, సరైనవేనంటూ ప్రజలనెత్తికెక్కించబూనినందుకు ఏమి చేయాలతణ్ణి?

ఏ మాత్రం సామాజిక స్పృహగానీ, నిజాయితీగానీ, తానన్న మాటలు సరైనవేనని నిరూపించే బాధ్యత తనపైనే ఉంటుందన్న సామాజిక కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు సిద్దపడేతనంగానీ ఉంటే ఈ పుస్తకంపైనే ఒక చర్చా వేదికను ఏర్పాటు చేస్తాము. సిద్దపడగలరేమో చూడాలి. నా హేతుబుద్దికి ఈ రకం వ్యాపారులు స్పందించరనే అనిపిస్తోంది. దేవుని విషయమై ఆయనకున్న అజ్ఞానాన్ని, ఆయన రచనల్లో ఉన్న అసమంజసతను తెలిపే నాలుగైదు అంశాల్ని ప్రస్తావిస్తాను. మొత్తం పుస్తకాన్ని కూడ విశ్లేషించడం సాధ్యపడదు కనుక. విషయ సూచిలో 1వ అంశం 'బాబా భగవంతుడా?' అన్నదిగా ఉంది. దాని క్రింద ఆరు పేజీలు వ్రాశారాయన అందులో

(1) దేవుడంటే ఏమిటో చెప్పలేదు. ఆయన రాతల్ని బట్టి చూస్తే ఏమతధోరణికి చెందిన దేవుణ్ణి గురించీ తగినంతగా ఆయనకు తెలీదని తెలుతోంది.

2) బాబా భగవంతుడనో, కాదనో ఏదీ తేల్చలేదు. అలాగని తేలని, తెల్పలేని విషయమన్న నిర్ణయాన్ని ప్రకటించారా అంటే ఆ పని చేయలేదు. ఎ) బాబావి మ్యాజిక్కులు కావన్నారు. బి) బాబా దగ్గరకు అజ్ఞానం, అహంకారంతో వెళ్ళిన తనకు, అక్కడకు వెళ్ళాక కళ్ళు తెరుచుకున్నాయని అన్నారు. అంటే అన్యాపదేశంగా, డొంకతిరుగుడుగా సత్యశాయికి మహిమలున్నాయని మనకు అనిపించేలా ఎత్తుగడ ఉందందులో మ్యాజిక్కు, సూత్రాలు, మనోవిజ్ఞాన శాస్త్ర సూత్రాలు వంటబట్టి వృత్తిగా చేసుకున్నాయనగదా! నిజాన్ని కప్పిపెట్టి లేనిది ఉన్నట్లు, కానిది అవునన్నట్లు చూపే విద్యకలవాడుకదా. అక్కడికది చాలదన్నట్లు; ఒకవేళ ఆయన చేస్తున్నది మ్యాజిక్కేననుకున్నా, లోకంలో ఎందరు మెజీషియన్లు బాబా చేసిన సేవాకార్యక్రమాలు చేస్తున్నారు? అంటూ ఒక కుంటిప్రశ్న లేవనెత్తి సామాన్యులు ఆ రకంగా బాబా గొప్ప వాడని అనుకునేలా పన్నాగం పన్నారు.

ఇక్కడ మన ముందున్న ప్రశ్న 1) బాబా భగవంతుడా? అతను చూపుతున్నది అభౌతికశక్తికి రుజువులా అన్నది మాత్రమే. మన పట్టాభిరామ్‌ గారు, ఆ విషయాన్ని అతిచాకచక్యంగా మరుగున పెట్టేసి, బాబా మామూలు మనిషికాదని భ్రమపడేలా సీను క్రియేట్‌చేశారు. అది అతనిలోని మతిసెబ్బరితనం, నిజాయితీ లేనితనం, అలా బాబా మామూలోడు కాదు అని అనిపించేలా తన పరపతిని చూసి ప్రచారం చేయడానికి ఎంత ప్రతిఫలం, ఏ రూపంలో పట్టాభిగారికి ముట్టిందనేది ఆయన బయటపెడితే తప్ప మనకు పట్టుబడని విషయం.

(2) పుట్టపర్తి సందర్శన

ఇది 1970 ప్రాంతాల జరిగిన విషయం. పట్టాభిగారికి కాలు విరిగింది. డాక్టర్లు నడుందాకాకట్లు వేశారు. రెండు నెలలాగి చూస్తే కట్టుకట్టుకోలా. మళ్ళా కట్టుకట్టాల్సిందేనని, ఈ సారి గుండెలదాకా కట్టువేశారు. ఈ సమయంలో పట్టాభి గారి తండ్రి, పట్టాభిగారి జాతకం చూపించారు. దాన్ని చూసిన జోష్యుడు 26 ఏండ్లకే చనిపోతాడు ఈ జాతకుడు అని చెప్పాడు. దాంతో ఈయన తండ్రికి భయమేసి వెదికి వెదికి మరో గొప్పపేరున్న జోతిష్యుణ్ణి పట్టుకొచ్చి జాతకం చూపించారు. ఆయన మహాజ్ఞానల్లే పోజెట్టి, 26 ఏళ్ళకి చనిపోతాడని చెప్పిన శుంఠెవడండీ, ఈ జాతకుడు 24 ఏండ్లకే చనిపోవాల్సిందేనన్నాడట. రోజులు గడిస్తున్నై మళ్ళీ కట్టు విప్పారు. ఎక్సరే తీశారు. షరామామూలే. మళ్ళా ఎముక అతుక్కోలా. మళ్ళా కట్టువేసి రెండు నెల్లకిరమ్మన్నారు. (ఈసారికట్టు ఎక్కడిదాకా వేశారో చెప్పడం మరచిపోయారు పాపం పట్టాభిగారు. లెక్క ప్రకారం కళ్ళుముక్కు నోరును విడిచి మొత్తం శరీరాన్ని కప్పుతూ కట్టేసి ఉండుండాలి) తొడ ఎముకలో స్టీలురాడ్డు ధగధగా మెరుస్తూ కనపడిందట ఎక్కరేలో. ఆశ్చర్యమేమంటే అంత చదువు చదివీ ఇంత మాత్రమైనా అబద్ధాన్ని అతికినట్లు చెప్పలేని పట్టాభి ప్రజ్ఞకు జాలిపడాలి. కాలు విరగడంలాటివి అబద్దమని చెప్పలేంగానీ, ఆ తరవాతవన్నీ భూతద్దంలో - పెద్దది చేసి - చూపించినవే. ఇది జరిగాక, పట్టా అన్నగారు, తండ్రిని పుట్టపర్తి పట్టుకెళ్ళారు. కొడుకు కాలు విరిగిన విషయం, అది అతుక్కోని విషయం బాబాకు చెప్పారు. ఆయన భయపడకంటూ ఇంత విభూది ఇచ్చి, పట్టాభికివ్వమన్నారు. డ్రాఫ్టింగు చేస్తే అతుక్కుంటుంది. చాలా ఎడంగా పెట్టి కట్టువేశారు. అని చెప్పారట.

విశ్లేషణ : అబద్దాలాడడానికీ చాలా అనుభవం, అబ్యాసం కావాలి. అదీ ఒక కళే పట్టాభిగారికి దానిలో అంతపట్టులేదన్నది ఈ రచనవల్ల తేలిపోయింది. మూడు మార్లు కట్లువేసిన డాక్టర్లకు ఎముకలు కలపకుండానే కట్టువేశాం అన్నది కనపడలేదన్నమాట? పైగా అది ఎంత ఎడమంటే, వేసిన స్టీలు రాడ్డు ధగధగా మెరిసిపోతూ ఎక్కరేలోనే కనబడేటంత ఖాళీ వదిలి వేశారన్నమాట. ఆ విషయాన్ని గమనించీ, ఆడాక్టర్లుగానీ, ఈయనగానీ, మరెవరుగానీ ఆ విషయాన్ని ప్రస్తావించలేదన్నమాట! మహామహిమాన్వితుడైన బాబా, దానిని తానే సరిచేయకుండా, మరో ముక్క తీసి అతికించమని అన్నాడన్నమాట! ఆ మాటన్నవాడు అంతటితో గమ్మునుండక, మహిమాన్వితమైన విభూదినీ ఇచ్చి పంపాడన్నమాట.

తరవాతి అంకంలో, డాక్టర్లు మరోముక్క తీసి అతికించడం, పట్టాభిగారినీ బాబా దగ్గరకు తీసుకోవడం, బాబాను కలిసిన సందర్భంలో, పట్టాభినీ కుడికాలు వంగదుకదా అని అడగడం, ఈ పట్టాభి (పిహెచ్‌డి డిగ్రీ అప్పటికే వచ్చి తగలబడిందో లేదో మరి) కాలు వంగడంలేదన్న విషయం బాబాకు ఎలా తెలిసిందని తేగ ఆశ్చర్యపోవడం - అన్నవి రచనలో చూపించారు పట్టాభిగారు. ఇలా పుస్తకంలోని ప్రతి అసంబద్ద, అసమంజస, అహేతుకరాతల్ని విశ్లేషించి సమీక్షించాలంటే అసలు పుస్తకానికి నాలుగింతల రచన అవసరమవుతుంది. తినాకుడవా తగినంత ఉండీ మందిపై బడే కూడబెట్టుకునీ ఇలాంటి రచనలు చేసి మరింత అజ్ఞానాన్ని మందినెత్తిన పెట్టడానికి, అందులోనూ తన స్వార్థ ప్రయోజనాలను పొందేందుకు పూనుకోవడానికి మతి సెబ్బరితనం సామాజిక బాధ్యతలేనితనం, చిన్న నా బొజ్జకు శ్రీ రామరక్ష అనే వైఖరి చాలా ఉండితీరాలి. పట్టాభి వ్యక్తిత్వంలో అది దండిగానే ఉందనిపిస్తోంది.

మరో విషయమేమంటే, పట్టాభి కుటుంబం కావలసినన్ని మూఢనమ్మకాలతోనూ ఉండడమేగాక, సాంప్రదాయక ఆస్తిక పోకడకంటెనూ దిగజారి, బాబాలనూ, అమ్మలను, అవ్వలనూ నెత్తికెక్కించుకునేంతగా వాటిలో కూరుకుపోయి ఉంది. ఇతడూ ఎక్కడా నాస్తికుడిగాలేడు, కొన్ని రకాల మూఢనమ్మకాలను అంతగా నమ్మని వాడిగా ఉన్నాడంతే, పిల్లి శకునాలూ, బల్లి శకునాలు పట్టించుకోవడం లేదు. ఈ రచన ద్వారా అన్యాపదేశంగా బాబా మామూలోడు కాడు, నాలాటి పరిశోధకునికే అంతుపట్టని వెన్నో శక్తులు బాబాలో ఉన్నాయి అలాంటి గొప్ప శక్తులు అన్ని మతాలలోనూ ఉన్నాయి అనేంతవరకు తెగించాడు రచయిత. మద్యమద్యలో తాను నమ్మకాలు లేనివాణ్ణని, బాబాను సందేహిస్తూనే వచ్చాననీ, బాబాను నమ్ముతున్న తన కుటుంబపు అమాయకత్వాన్ని చూసి నవ్వుకున్నానని ముక్తాయింపులూ ఇస్తూ వచ్చాడు. అమాయక పాఠకజనాన్ని మభ్యపుచ్చే ఎత్తుగడే అది అన్నది పచ్చి నిజం. - ఈ వ్యాసంలో పాఠకులు పరీక్షించడానికి వీల్లేనివీ, అబద్దమనడానికి వీల్లేనివీ అయిన కొన్ని సంఘటనల్ని - అద్భుతాలంటూ అతి తెలివిగా పాఠకుల ముందుకు తెచ్చాడు రచయిత. పట్టాభి అంధభక్తుడై నా అయ్యుండాలి, అధికాధిక ప్రయోజనాలనుద్దెశించి అబద్దాలు రాసైనా ఉండాలి.

(3) విమర్శకుల పరిశ్రమ (పేజి 29 నుండి)

దీనర్థం విమర్శకులు విమర్శించడాన్ని ఒక వ్యాపారంగా చేసుకున్నారని కాబోలు, ఆశ్చర్యమేమంటే, ఈయన గారూ వారికి వ్యతిరేకమైన రీతిలో పొగడడాన్ని వ్యాపారంగా చేసుకుని ఉండడం. ఈ పుస్తకం వ్రాయడం ద్వారా ఈ మెజిషియన్‌ లక్షలాది, బాబా భక్తుల్నేకాక, వివిధ మూఢనమ్మకాలతో జీవితాల్ని చట్టుబండలు చేసుకుంటున్న అజ్ఞానుల్ని తన అభిమానుల్నిగా, వృత్తిపరంగా తన క్లైయింటుల్నిగా సమకూర్చుకున్నాడు. ఇంతకంటే దుర్మార్గమైన వ్యాపారపు ఎత్తుగడ ఇంకేముంటుంది?!

ఈ మూడో వ్యాసంలో హేతువాదులు, నాస్తికులు (1) ఆస్తికుల్ని, అదీహిందూ మతానికి చెందిన వారిని మాత్రమే, చెడామడా తిట్టడమే పనిగా పెట్టుకున్నారనీ, క్రైస్తవ, ముస్లిం మతాలకుచెందిన వారినిగానీ, గ్రంథాలనుగానీ తిట్టేదమ్ముల్లేవనీ,

(2) 1975 సం||లో కాకినాడలో డా|| కోవూర్‌, ఆర్కె మలాయత్‌, మరో మెజీషియన్‌ రామస్వామి అన్నవారిచేత ''బాబాల బండారం బట్టబయలు'' అన్న పేరుతో నాస్తికహేతువాదులు నిర్వహించిన సభకు తానూ హాజరైనాననీ, అనంతరం ఆర్కే మలాయత్‌, ఎ.టి.కోవూర్‌లతో కోవూర్‌ వసతిగృహంలో సంభాషణ జరిపాననీ, వారిదంతా వ్యాపారమేనని వారితోనే చెప్పాననీ వ్రాశారు పట్టాభిగారు, అదే వ్యాసంలో తానూ ఒక ప్రసిద్ది చెందిన మెజీషియన్‌నేననీ, కోవూరు, మలాయత్‌ లాంటి వారు చేసే ట్రిక్కులన్నీతనకు తెలుసుననీ, బాబా చూపే అద్భుతాలు అలాటి ట్రిక్కులు కాదనీ ఢంకాభజాయించారు. ఇక్కడ మూడు నాలుగంశాలున్నాయి.

(1) నాస్తిక హేతువాద సంఘాల వారు బాబాలనూ, అమ్మలనూ చెడమడా తిట్టడమే గాని, విషయం తెలిసి మాట్లాడేవారు కాదు.

(2) మల్కాయత్‌ ఆస్థికుడే, అయినా వృత్తిగా డబ్బులు తీసుకుని ప్రదర్శన ఇచ్చాడు. మెజీషియన్లలో చాలా మంది ఆస్థికులున్నారు.

3) కోవూరూ దానిని వ్యాపారంగా వాడుకున్నాడే తప్ప అన్ని మతాలనూ సమానంగా ఖండించలేదు.

4) హిందువులు తిడుతున్న పట్టించుకోరు, సహనశీలురు. అదేమరి ముస్లిం మతాన్ని అలా విమర్శించమనండి చూస్తాం?

5) బాబా చేసేవి మేజిక్కులని ఒకప్పుడనుకునే వాణ్ణి, వాటిని దగ్గరగా చేశాక అవిమ్యాజిక్కులు కాదని తేల్చుకున్నాను.

6) సృష్టంతా సైన్సుకులోబడి ఉంటుందనుకోవడం అజ్ఞానం. సైన్సుకు అందనివి ఎన్నో ఉన్నాయి.

సారాంశం : మహిమలున్నాయి. మహిమలు కలవాళ్ళున్నారు. బాబా అవతార పురుషుడు, నాస్తికత తప్పు ఆస్తికతే ఒప్పు.

విశ్లేషణ : పట్టాభిరాంగారికి ఒకింత రచనా చతురత ఉంది. అది చిన్నదాన్ని పెద్దది చేసి చూపడం, ముఖ్యమైన వాస్తవాలను ప్రక్కకు నెట్టేయడం, అంతగా హేతుబుద్దీ, ఇంగితజ్ఞానమూ పనిచేయని వారిని తనకనుకూలంగా ప్రభావితం చెయడం అన్న వాటితో కూడి ఉందా చతురత. కామన్‌సెన్సు (ఇంగితజ్ఞానం) ఒకింత బలంగా ఉన్నవారికీ, శాస్త్రీయ దృక్పథమూ, వైజ్ఞానిక పరిశీలనా పద్దతి, హేతుబద్దత ఉన్న వాళ్ళకు ఆయన రచనలోని డొల్లతనము, నిజాయితీ లేనితనమూ, తెలియని విషయాలలోనూ తెలిసినవాడిగా కనపడాలనే దుగ్ద ప్రస్పుటంగా కనబడుతన్నై. అయినా ఆయన వెళ్ళడించిన వాటిలో నాస్తిక హేతువాదులు ఆత్మపరిశీలన (స్వీయవిమర్శ) చేసుకోవలసిన అంశాలూ ఒకటి రెండు ఉన్నాయి. అవి నా అవగాహన ప్రకారం ఇవే.

1) బండగా, మొండిగా, తగినంత ఆధారాలు, అవగాహన లేకుండగనే తెగబడి మాట్లాడడం, అసభ్యమైన భాషవాడడం.

ఉదా:- ఆ గుంపులో ఒకరు 'బాబానపుంసకుడు' అంటారు. మరొకరు బాబా వ్యభిచారం అనంటారు. వేరొకరు అతడు 'స్వలింగసంపర్కి' అనంటారు. ఇందులో ఏ ఒక్కదానికీ ఆధారాలుండవు. ఆధారాలు చూపడం కష్టమని కామన్‌సెన్సూ చెపుతూనే ఉంది. అయినా బాధ్యత రహితంగా గేలి భాషతో మాట్లాడడం అలవాటుగా మారిపోయింది.

(2) హిందూ పక్షాన్ని విమర్శినంత ఘాటుగా, అసభ్యంగా ముస్లింమతాన్ని తెగనాడే తెగువ - దమ్ము - ఎవరికీ లేదన్నది మరో నిజం. అంతకంటే మరింత నిజమేమంటే, రాజ్యాంగంలోని 25, 26, 27, 28 అధికరణాలలో ఆ వివరాలున్నై. కనుకనే ఈ మధ్య క్రాంతికార్‌ (హేతువాద సంఘాద్యకక్షుడు) ప్రచురించిన ఇస్లాంపై విమర్శనాత్మక సంకలనం పైనే కోర్టుకు వెళ్ళారు ముస్లింలు. క్రాంతికార్‌పై భౌతికదాడికీ సిద్దమైనారు. అప్పటికి కానీ బుద్దిరాలేదు మన నాస్తికహేతువాద మిత్రులకు.

ఇక్కడ నేను చెప్పదలచింది మత గ్రంథాలు విమర్శకు అతీతం, వాటిని విమర్శించకండి అని కాదు. మత గ్రంథాలూ విమర్శకు అతీతం కాదన్న ఉన్నత న్యాయస్థానం తీర్పూ ఉంది. అయితే విమర్శకు, తిట్ల పురాణానికీ ఉన్న తేడాను గమనించాల్సిఉంది. విమర్శలో గుణదోషవిచారణ ఉండాలి. ఉన్నదాన్ని పెద్దది చెయడంగానీ, చిన్నది చేయడంగానీ చేయకూడదు. అసభ్య, అశ్లీల, వ్యంగ్య పదాల అవసరం విమర్శకు అవసరంలేదు. అదైనా వెంకటాద్రి గారు అన్నట్లు, చదవకుండా (చూడకుండా) విమర్శించడం సరికాదు. ముఖ్యంగా హేతువాదులకది తగదు అంది సర్వధాశిరోధార్యం.

3) కోవూరు లాటివారిని వ్యాపారస్తులనడం, పట్టాభిరాం గారిలోని తెగబడిన తనానికి నిదర్శనం. బ్రతక నేర్చినతనం. ఈ రచనలో 1) స్వార్థప్రయోజనాలు 2) అరకొర (మిడిమిడి) జ్ఞానము 3) సత్యశాయి సంస్థతో అనుకూల సంబంధాలు, అన్నవి ఆయన వెనక పని చేస్తున్నట్లు తెరవెనుకన దోబూచులాడుతున్నట్లు నిశితంగా చూడగలవారికి కనిపిస్తున్నాయి.

ముగింపు : ఇలా రచయిత పోకడను వేలెత్తిచూపి, గమ్మునుండడం బాధ్యతారాహిత్యమే అవుతుంది నాకైనా, ఎవరికైనా. కనుక ఈనా అభిప్రాయాలు సరైనవేనని నిర్థారించే బాధ్యతను నేను స్వీకరిస్తూ క్రింది ప్రకటనను చేస్తున్నాను.

డాక్టర్‌ బి.వి. పట్టాభిరాంగారు సిద్దపడితే, ఈ రచన ద్వారా ఆయన అమాయకజనాన్ని నమ్మకాలవైపుకు కదిలేలా ప్రభావితం చేయడం జరిగిందనీ, ఇందులోని చాలా అంశాలు, శాస్త్రీయ దృష్టికీ, శాస్త్రీయ పరిశీలనకు పనికి రానివిగా నిర్థారించగలననీ, ఆయనకు అటు ఆస్థికతను గురించిగానీ, ఇటు నాస్థికతను గురించిగానీ, విజ్ఞాన శాస్త్రాల గురించి గానీ సరైన, సరిపడినంత అవగాహన లేదనీ నిర్ణయించడానికి అనువుగా ఉన్నాయని నిర్థారించగలను. ఆయన గాని సిద్దపడితే, (ఆయనతరఫున మరెవరు సిద్దపడ్డా) ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు, నిర్ణీత వ్యక్తుల - నిపుణుల - సమక్షంలో నిజనిర్థారణ వేదికను ఏర్పాటు చేయగలను. ఇదినా వాగ్థానం ప్రకటన స.మం తరపునుండి .........

ఈ సంచిక పట్టాభిరాం గారికి రిజిష్టర్డ్‌ పోస్టు ద్వారా పంపుతున్నాను.

ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికామాటలాడి అన్యుల మనమున్‌

నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడె ధన్యుడు సుమతి... అన్న వైఖరి బ్రతకనేర్చినతనాన్ని చూపుతుందేగాని, సత్యధర్మాల పక్షాన ఉండే వైఖరిని చూపించదు. పట్టాభిగారు ఈ విధానాన్ని ఉద్దేశ్యపూర్వకంగానే చేశారని నేను నిర్ణయించలేను గాని, ఆయన ఈ రచన సమాజానికి సత్యజ్ఞాన క్షేత్రానికి నష్టం కలిగించేదేనని ఖచ్చితంగా చెప్పగలను.

సత్యాన్వేషణలో..... మీ సురేంద్ర.

విజ్ఞాన క్షేత్రాలలో అజ్ఞానులు -2

విషయం : బి.వి. రాధాకృష్ణ మూర్తిగారు పంపిన రెండో పుస్తకం ''హేతువాదము - ప్రతివాదము'' అన్నది. దాని రచయిత పేరు ఆ పేరుకు ముందనేక విశేషణాలు ప్రకటించారా పుస్తక ప్రచురణ కర్తలు, అవి ఇవిగో.

(1) ఇందూ ధర్మ ప్రదాత; 2. సంచలనాత్మక రచయిత 3. త్రైతసిద్దాంత ఆదికర్త 4. శ్రీ శ్రీ శ్రీ 5. ఆచార్య, 6. యోగేశ్వర

విశ్లేషణ : ఈ అయ్య పుట్టినప్పుడు పెట్టిన పేరేమిటోగాని, ఈయన పెట్టుకున్న, తగిలించుకున్నవి మాత్రం చాలా ఉన్నై.

1. ఇందూ ధర్మ ప్రదాత :- ఏమిటీ సమాసానికి అర్థం? ఇందూ అంటే ఏమిటి? ఎక్కడిదీ అర్ధం? ఇంతకూ ధర్మమంటే ఏమిటి? ఇందూ ధర్మమంటే ఏమిటి? ప్రదాతంటే ఏమిటి? దాతంటే ఏమిటి?

2. సంచలనాత్మక రచయిత :- సంచలనం అంటే ఏమిటి? సంచలనాత్మకతంటే ఏమిటి? రచయిత అన్నమాటకూ సంకలన కర్త అన్నమాటకు అర్థమేమిటి?

3. త్రైత సిద్దాంత ఆదికర్త :- ఏమిటీ త్రైత సిద్దాంతము, సిద్దాంతమంటే ఏమిటి? కర్తంటే ఏమిటి? ఆది కర్త అన్నమాటకు అర్థమేమిటి? ఏదైనా సిద్దాంతానికి కర్త - ప్రవర్తకుడు - ప్రచారకుడు, అనుచరుడు అన్నవాళ్ళుంటారు గాని ఆదికర్తేమిటి?

4. శ్రీ శ్రీ శ్రీ :- ఏమిటీ మూడు శ్రీలముచ్చట ఆస్థిక సంప్రదాయంలో అహంకార ప్రదర్శనకుగాను అర్థం పర్ధం లేనన్ని శ్రీలు తగిలించుకునే పడికట్టుపోకడ (ఆచారం) ఒకటుంది శ్రీ శ్రీ శ్రీ 108; శ్రీ శ్రీ శ్రీ 1008 అని వ్రాసుకుని తరవాత తగిలించుకున్న పేరూ జత చేస్తారు. అలాగే ఈ అయ్యగారికీ, సొంతపేరు రాసుకుంటానికి ఒక శ్రీనే అనవసరమైయ్యుండగా, మూడుశ్రీలు కావలసివచ్చాయి. ఇలా సుత్తి కొట్టుకోడానికి ఇంగితం పని చేయకపోయైనా ఉండాలి, లేని గొప్పలు చెప్పుకునే దురదైనా ఉండుండాలి. అతనికంటే నాలుగాకులు తక్కువ చదివినవాళ్ళు తగిలించైనా ఉండాలి.

5. అచార్య :- ఏమిటీ మాటకు అర్థం, విద్యాలయాలలో ఖచ్చితంగా ఒక విద్యార్హతను తెలుపుతూ ఇచ్చే పట్టా (డిగ్రీ) ఇది. ఇతరత్రా ఆచార్యుడంటే (ఎ) గురువు, (బి) బోధకుడు (సి) ఉపనయనం చేయువాడు (డి) వేదవేత్త, మూడువేదములనెరిగినవాడు లాటి అర్థాలున్నాయి. పేరులోనే గురువు, ఉపాధ్యాయుడు అని పెట్టుకోడు బుద్దున్నవాడెవడూ. ఇకపోతే మూడు వేదములు చదివినవాడనిగాని, విద్యాలయాల ద్వారా పట్టాపొందిన వాడుగాని ఈ పేరుతగిలించుకోవచ్చు. అలా పెట్టుకున్నదేనా ఇది. ఎం.ఎ.బి.ఎఫ్‌ లా తగనిదితగిలించుకున్నట్లా? ఏ విషయంలో ఆచార్యుడు? ఎవరికి ఆచార్యుడు?

6) యేగీశ్వర్లు :- భారతీయ ఆస్థిక సాంప్రదాయంలో కృష్నుణ్ణి యోగీశ్వరుడు అని సంబోధించడం కనపడుతుంది. యోగమంటే ఏమిటి? యోగంటే ఏమిటి? యోగీశ్వరుడంటే ఏమిటి? యోగీశ్వర్లు!? ఏమిటి? ఎంతటి కీర్తికండూతి? ఎంతటి ఆత్మాధిక్యతా భావము? ఎంతటి దురహం కారము. నిజానికి ఏ వ్యక్తికైనా, అతణ్ణి గుర్తించడానికి ఇన్ని కొమ్ములూ, తోకలూ అవసరమా? ఒక్కమాట! మన రాజ్యాంగం బిరుదులు తగిలించుకోరాదు, తగిలించరాదు అని చెపుతోంది. అవేవీ పట్టించుకోకుండా, ఒకని అర్హతానర్హతల్ని పరీక్షించి చూడకుండా, బిరుదులు తగిలించడం, తగుదునమ్మా అని తగిలించుకోవడం, ఎదురిచ్చి బిరుదులిప్పించుకోవడం, వృత్తిగా ఇంత పుచ్చుకుని బిరుదులిచ్చే వ్యాపారస్తులుండడం ఇలా రకరకాల విధానాల ద్వారా అవసరమైన పేరుకు ముందూవెనకా ఏవేవో తగిలించుకుని తగిలింపించుకుని తృప్తి చెందే, విర్రవీగే మంద ఎక్కువైపోతున్నారీనాడు. ఒక వ్యక్తి వాడికిష్టమై వాడెన్నెన్ని తోకలు తగిలించుకున్నా మన కొచ్చే ఇబ్బందేమీ లేదుగాని, ఆవన్నీ తగిలించుకుని ఇదిగో ఇలా పుస్తకాలు రాసి, ఆ చెత్తనంతా ఆపేరు గొప్ప ఆధారంగా అమ్ముకునేవారి విషయంలోనే అభ్యంతర పడాల్సివస్తోంది.

గమనిక : మీలో కొందరికి ఆ రచనలోని విషయాలు చెప్పి విషయపరంగా విమర్శించక, ఆయన పేరు మీదే ఇంత విమర్శ ఎందుకండీ! అనిపించవచ్చు. నేనిది కేవలం పాఠకులనుద్దేశించి మాత్రమే వ్రాయడంలేదు. ఆయన పాలబడి, ఆయన పల్లకీనిమోస్తున్న వారినీ, ఆయన అనర్హతలను ఒకింత గమనించి గట్టిగా నిలువరించడానికి బలం చాలని వారిని ఉద్దేశించికూడా వ్రాస్తున్నాను. కూపస్థమండూకాల్లాటి బ్రతుకులు వారివి. అట్టి వారి గురించిన వివరాలు ఇలా గ్రంథస్తం కావించడం వల్ల వర్తమాన, భవిష్యత్తరాల ఆలోచనలకు ఒకింత ఆసరానూ అవుతుందనీ అనుకుంటూ రాశానివి. అజ్ఞానమూ, తప్పుజ్ఞానమే అధికంగా ఉండి, సరైన జ్ఞానం అరకొరగా కూడాలేని వాడే 'ప్రబోధానంద'. ఆశ్చర్యం!? ఇంతకూ ఈ 'ప్రబోధానంద' అన్నమాటకున్న అర్థమేమిటి? ఇందులోని ఏ ఒక్కమాటకుగానీ తాత్విక పరిభాష అంగీకరించే అర్థానికి తగుతాడా అతడు? అన్నది అతడూ, అతడిని అనుసరిస్తున్నవారూ ప్రశ్నించుకోవాలని అనుకునీ ఇది వ్రాశాను. మరోమాట! ఈ పుస్తకంలోనే 126 పేజీలో నా గురించిన ప్రస్తావనాచేశాడీయన.

''సత్యాన్వేషణ సంఘము అని పేరెట్టుకుని, దానికి అధ్యకక్షుడనని చెప్పుకొను వ్యక్తి ఒక మారు నాకు తెలిసిన సత్యమును ఒప్పుకోక దానిని అసత్యమన్నాడు. తాము అసత్యవాదులైయ్యుండి, సత్యాన్వేషకులమని పేరు పెట్టుకుని తమను తాము ప్రచారము చేసుకొను ఇటువంటి వారు ఇంకా ఎంతో మంది ఉన్నారని అప్పుడు నాకు అర్థమైంది, అటువంటి వారు తమకు పూర్తి సైన్సు తెలియకున్నా యధార్థసంఘటనలను ఖండించుచుందురు. ఇవండీ ఆ పేజీలోని ఆయన నా గురించి చెప్పిన మాటలు.

విశ్లేషణ : - ఈ వివరాలైనా ఇక్కడెందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఈయనను గురించి ఈ పుస్తకంలోని మాటలనుబట్టే కాక, నేరుగానూ నాకు కొంత తెలుసు అనడానికే, తేదీ, సం||ము సరిగా గుర్తులేదుగానీ సుమారు 30 సం|| అయ్యుండవచ్చు నంద్యాల ప్రక్కనున్న కొత్తపల్లి గ్రామంలోని ప్రమోదచైతన్యగారి చైతన్య క్షేత్రంలో నేనూ, పెంచలయ్యగారూ కలసి ఆస్థిక మేధావీ చర్చావేదిక నిర్వహించిన తరవాత జరిగిన ఘటన ఇది. తాడిపత్రి నానుకుని ఉన్న ఒక గ్రామంలో చిన్న ఆశ్రమంలో ఈయనుండేవాడు. అప్పుటికింకా ఇన్ని తోకలు, కొమ్ములు చేరలా. ప్రబోధానందయోగీశ్వర్లు పేరున చెలామణి అవుతున్న రోజులు. మాకు చైతన్య క్షేత్రంలో పరిచయమైన తాడిపత్రి నివాసులు, ఈయనతో మాట్లాడడానికి మమ్మల్ని పిలుచుకెళ్ళారు.

విషయం యధాతథంగా గుర్తులేదుగానీ, జన్మగురించిన చర్చ అది. ''తల్లి గర్భంలో పిండం ఏర్పడ్డాక, ఆ శరీరంలోకి జీవుడు ఎప్పుడు ప్రవేశిస్తాడు'' అనో, అతనికి ప్రాణం ఎప్పుడు వస్తుంది అనో ప్రశ్నించాడీయన. చర్చలో తల్లి ప్రసవించాకనే అన్నది ఆయన సమాధానం. అది ప్రసూతి విజ్ఞాన శాస్త్రం ప్రకారం తప్పు సమాధానం, నేనూ ఆ వైద్యశాస్త్రం తెలిసిన వాణ్ణేనంటూ ఈ విషయంలో నీవు అజ్ఞానివేకాదు, తప్పు జ్ఞానం ఉన్నవాడివి అనీ చెప్పాను. అదిగో ఆ మాటనే ఇక్కడ ''నాకు తెలిసిన సత్యమును ఒప్పుకోక అసత్యమన్నాడు'' అని వ్రాశాడు.

చాలెంజ్‌ : ఈ విషయంలో ఈనాటికీ నేను ఆయనతో నిజనిర్థారణకు కూర్చోడానికి సిద్దంగా ఉన్నాను. ఈ గ్రంథంలోనే జన్మ గురించి, జన్మ కారణాలను గురించి తట్టెడు అశుద్ధాన్ని పోగేసి మందినెత్తిన పెట్టాడు, సత్యాన్వేషణ మండలి అధ్యకక్షునికి సైన్సు తెలుసా? అని ఎద్దేవాచేశాడు. నాకు సైన్సంతా తెలియని మాట నిజమే గాని గర్భోత్పత్తి, జన్మ, ప్రాణం, వీటికి సంబంధించి పిండోత్పత్తి శాస్త్రం ఏమి చెపుతుందో వరకు సాధారణ జ్ఞానముంది మరింత అవసరమనుకుంటే ఆ విజ్ఞాన శాస్త్రం అందుబాటులోనూ ఉంది ప్రయోగశాలా అందుబాటులోనే ఉంది. ఏమాత్రం నిజాయితీ, నిబద్దత ఉన్నా ఈయన ఈ విషయమై సత్యాసత్యవిచారణకు తాను సిద్దంగా ఉన్నానని సత్యాన్వేషణ మండలి నుద్దేశిస్తూ ఒక బహిరంగ ప్రకటన చేసి, ఆ ప్రకటన ప్రతిని నాకు రిజిష్టర్‌ పోస్టు ద్వారా పంపాలి. ఈ సంచికను ఆయనకు రిజిష్టర్‌ పోస్టుద్వారా పంపుతాను. ఈ ముఖంగానే ఆ పుస్తకంలో ఈయన వ్రాసిన మరికొన్ని అంశాలపైనా నిజనిర్థారణకు నేను సిద్దమని బహిరంగంగా ప్రకటిస్తున్నాను.

ముప్ఫై ఏండ్లనాటి ఆ ఘటన తరవాత, ఈ మధ్య జ్ఞాన విజ్ఞానవేదిక (జనవిజ్ఞానవేదికకాదు) పేరున ఈయన ఈయన అనుచరగణము, కొన్ని కరపత్రాలు, సమావేశాల, పుస్తకాల ద్వారా, లోకమంతా తప్పుజ్ఞానంలో ఉంది. తాము మాత్రమే సుజ్ఞానులం అంటూ ప్రచారం మొదలెట్టారు. ఆ క్రమంలో భాగంగా అభౌతిక శక్తులున్నాయని రుజువు చేస్తామంటూ రోడ్డున పడ్డారు. ఈ విషయాన్నీ అనంతపురంలోని జె.వి.వి. మిత్రులు నా దృష్టికి తేగా, వీరితో సంప్రదించాము. వారి ప్రాంతంలో ఒక తీగ మొక్క ఉందనీ, అది నేలతో సంబంధం లేకుండానే బ్రతికి, పెరుగుతుంటుందనీ, వృక్ష శాస్త్రం చెప్పే పరాన్న జీవి (పారాసైటు) జాతికి చెందిన మొక్క కాదనీ, ఆ మొక్కకు ఆ మొక్క ఉన్న చెట్టుకు ఎక్కడా సంబంధం ఉండదనీ, ఈ తీగ మొక్కకు చెందిన దుంప ఒకటి నేలలో ఉంటుందనీ దుంపకూ తీగకూ సంబంధముండదనీ, అంటూ ఇది అభౌతిక శక్తికి రుజువు కాదా? అని ఆ గుంపు మమ్మల్ని ప్రశ్నించారు. మీరన్నట్లే ఉంటే అదిప్పటికి సైన్సుకు తెలీని విషయమేననీ, భౌతిక సూత్రాలకూ విరుద్దమేనని, పరీక్షించడానికి సిద్దపడదామని అనుకుని, ఈ అంశాలన్నీంటినీ క్లుప్తంగా రాసుకుని సంతకాలు పెట్టుకుని అటుపైన పరిశీలనకు కూర్చుందామనీ అనుకోడం జరిగింది. హైద్రాబాద్‌ చింతల బస్తీలోని జనవిజ్ఞాన వేదిక కార్యాలయంలో సమావేశమయ్యాం. వివరాలన్నీ కాగితం మ్మీద వ్రాసి, పరీక్షలో అభౌతిక పదార్థంఉందని తేలినా, ఆ తీగ మొక్క ఎటువంటి ఆధారంలేకుండానే జీవిస్తొందని తేలినా మేము అది ప్రకటించి, వారి మార్గాన ప్రచారం కావించాలి. వారిపక్షం సరికాదని తేలినా, అంటే అభౌతిక శక్తులు ఉన్నాయని వారు రుజువు చేయలేకపోయినా, ఆ తీగమొక్క వృక్ష శాస్త్రానికి తెలిసిన పరాన్నజీవి జాతికి చెందిందేనని వృక్ష శాస్త్రజ్ఞులు నిరూపించినా, ఆ తీగ నిరాధారంగానే అంటే నేలనుండి, దాని దుంప నుండి సంబంధం లేకుండానూ, అది ఆధారపడి ఉన్న చెట్టు నుండి ఆహారం స్వీకరించకుండానూ జీవిస్తున్నదని, వారు రుజువు చేయలేకపోయినా వారు అభౌతిక శక్తులు లేవని ప్రకటించి మామార్గాన ప్రయాణించాలి. అని వ్రాసి రెండు పక్షాల నుండి దానిపై సంతకాలు చేశాం. నిర్ణీత దినాన మేమంతా రెండు మూడు కార్లు వేసుకుని ఒక 15, 20 మంది వరకు వారురమ్మన్న చోటికి వెళ్ళాం. వారు చూపిన తీగ మొక్కను పరీక్షించి, అది పరాన్న జీవేననీ, దానికి దుంపంటూ అక్కడేమీలేదనీ, చెట్టు కాండం నుండే ఆహారం తీసుకుంటూ బ్రతికేస్తున్నదనీ తెల్చాము. ఆ పక్షంవారికి కళ్ళు తిరిగినై, గుండెలుగుబేలన్నాయి. అడ్డగోలు వాదనకుదిగి, లేబరేటరీలో తేలాలికదా అని కొత్తపాటందుకున్నారు. అరకొర పరిశీలన ఎందుకులే అని నిర్ణయించుకుని రెండు వృక్షశాస్త్ర విభాగాలకు వాటినిపంపి, అది పరాన్న జీవజాతికి చెందిన మొక్కేనని దృవీకరణ పత్రాన్ని తీసుకుని జ్ఞాన విజ్ఞాన వేదిక ప్రతినిధులకు పంపాము.

సిగ్గుపడే లక్షణంగానీ, నిజాలను స్వీకరించే లక్షణం గానీ లేని ఆ మంద రాత మూలకంగా అంగీకరించిన దానిని విడిచి పెట్టి గమ్మునున్నారు. నా ఈ ప్రకటనను చూసి, ఎవరైనా వారినిదేమిటని అడిగినా, ఏదోకవంకో, అబద్దమో చెప్పుచూడవచ్చు. కనుక అలాంటి పరిస్థితి ఏర్పడితే, వారు అడ్డగోలుగా మాట్లాడకుండా ఉండడానికి వీలుగా ఈ ప్రకటన చేస్తున్నాను. దీనిని పాఠకుల్లో వారితో బేటీపడ్డ, పడదలచుకున్న వారేవరైనా ఉపయోగించుకోవచ్చు.

ఆనాడు మా రెండు పక్షాలమధ్య జరిగిందంతా రికార్డు రూపంలో రాత మూలకంగా భద్రపరచబడి ఉంది. దానినైనా చూసుకుందాం. లేదా ఈ పిచ్చి పుస్తకంలో ఉన్న అంశాలలో మేము తప్పనుకుంటున్న వాటిని పరీక్షకుపెట్టుకునైనా చూసుకుందాం. తేలిన వాటిని తేలినట్లు ఇరువురం ప్రకటించి, వాటిని ప్రచారం చేస్తూ జీవించాలి. అన్నది షరతు. ఎప్పుడు, ఎక్కడ పరీక్షకు కూర్చుందామన్నా నేను - మేము - సిద్దము. ఏ మాత్రం దమ్ము, దగాలేనితనము ఉన్నా దీనికి సిద్దపడకపోవడమన్నదే కుదరదు.

ఈ పుస్తకం 5వ పేజీ నుండి 'హేతువాదము- ప్రతివాదము' అన్న శీర్షికన విషయం మొదలైంది. అందులో మొదటి వాక్యం ఇలా ఉంది. తరువాత వాక్యాలూ కొన్ని ఇలా ఉన్నాయి.

1. వాదము అనుపదము వాక్యము అన్న శబ్దం నుండి పుట్టింది.

ప్రశ్న : ఇది భాషనెరిగిన వారి ప్రకారం తప్పంటాను. అదలా ఉంచుదాం. ఈ మాటసరైందేనని భాషాశ్రాస్తాన్ని చూపించి వారేరుజువు పరచాలి.

2. భాష నుండి భావంపుట్టినట్లు, వాక్యం నుండి వాదన పుట్టింది.

ప్రశ్న : నిజమా? ముందు భాష పుట్టిన తరవాత భావం పుట్టిందా? ఎలా గెలాగు!? రుజువు చేయి తండ్రీ!

3. ఒక విషయమును తెలిసికొను నిమిత్తము ప్రశ్నించి అడగడమును హేతువాదము అంటాము.

ప్రశ్న : ఔరా! హేతువాదులెవరికీతెలియని వారెవరూ చెప్పని అర్థాన్ని చెప్పావు గద తండ్రీ! హేతువాదమంటే ప్రశ్న అనా?

4. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడాన్ని ప్రతివాదము అంటాము.

ప్రశ్న : గొప్పజ్ఞానివే, యోగీశ్వరుడివే. పిచ్చికుదిరింది రోకలికితలచుట్టమన్నట్టు వెనకటికొకడు, అలా ఉందిదిన్నూ, ఇలాటి అపభ్రంశపు మాటలు రాసి, ప్రచురించి మందినెత్తినింత బండపెట్టేరకాన్ని దండించే వ్యవస్థ లేకపోవడం ఈ దేశ ప్రజల దౌర్భాగ్యం.

వివిధ వాదాల గురించి సంచలనాత్మక రచయిత ఏమంటున్నాడో చూడండి.

ప్రశ్నించడము హేతువాదముకాగా, దానికి జవాబు చెప్పడము ప్రతివాదమట, జవాబు సరైనదైనా దానికి ఒప్పుకోక, కాదని మొండిగా వాదించడము అతివాదము అంటాము, అట,

ఇక ప్రశ్నకు చెప్పబడిన జవాబు సరైనదైనా, కాకున్నా దానిని ఎదురుమాట్లాడక ఒప్పుకోవడాన్ని వింత వాదమంటారట, అలాకాక, చెప్పబడిన జవాబు సరైందా కాదా అని ఏ మాత్రం ఆలోచించక, విచక్షణా జ్ఞానము లేకుండా తనకు తెలిసిందే సరైందనీ, ఇతరులు చెప్పింది సరైంది కాదని, తన భావమునకు వేరుగానున్న వారందరినీ హింసతో అణచివేయాలని చూచువాడు తీవ్రవాది అనబడుతున్నాడు.

విశ్లేషణ : ఈనాలుగు ముక్కల రచనలోనే రచయితకు భాషమీద పట్టుగానీ, భావంలో దిట్టతనంగాని లేవని ఇట్టే తేలిపోతోంది. ఈ రకం రచనల్ని, రచయితలను చూస్తుంటే ఒక సుభాషితం గుర్తుకొస్తొంది.

''తెలివి యొకింత లేని యడ దృప్తుడనై సర్వము తెలిసితినంచు గర్వితమతినై చరించితిన్‌'' అన్న దానికి సరిపోతారీ రకం. ఈ పుస్తకంలోని భాష పై గాని, భావాలపై గాని చర్చకు మేము సిద్దము.