Showing posts with label Training Class. Show all posts
Showing posts with label Training Class. Show all posts

Wednesday, April 1, 2015

గమనిక


1. మండలి త్రైమాసిక సమావేశాలు కేంద్ర కార్యాలయమైన దోరకుంటలో ఏప్రిల్‌ 24,25,26 తేదీలలో జరుగును. వివరాలు : 24 శుక్రవారం - ఆధునిక విజ్ఞాన శాస్త్రము : పదార్థము - విశ్వము. 25, శనివారం - శాస్త్రీయ దృక్ఫథము - శాస్త్రీయ పద్ధతి. 26, ఆదివారం - హేతుబద్దాలోచన - ఒక పరిశీలన మరియు భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళిక.
కావున మండలి బాధ్యులందరూ తప్పక హాజరు కావలసినదిగా కోరుతున్నాము.
2. ఏప్రిల్‌ 28,29,30 తేదీలలో సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక ప్రాథమిక శిక్షణా తరగతులు దోరకుంటలో జరుగుతాయి. కావున తమ జిల్లాల నుండి హాజరయ్యే వారి పేర్లను ముందుగా తెలియపర్చగలరు.
3. మే 8,9,10 తేదీలలో మహిళలకు స.హ.ప్రచార ఐక్యవేదిక ప్రాథమిక శిక్షణా తరగతులు దోరకుంటలో జరుగుతాయి. కావున మీమీ జిల్లా నుండి పంపగోరు మహిళల లిస్టు కేంద్రానికి పంపగలరు. ఎక్కువ మంది మహిళలు హాజరయ్యేందుకు కృషిచేయగలరు.

Friday, January 1, 2010

అధ్యయన, శిక్షణ తరగతులు


యోచనాశీలురైన ఉద్యమ మిత్రులారా!
దాదాపుగా ఏ సంస్థ తలపెట్టిన కార్యక్రమాలైనా అనుకున్నపని అనుకున్నరీతిలో అనుకున్నంతగా పూర్తికావడం లేదన్నదో వాస్తవం. ఈ అసంతృప్తి ఆయా సంస్థలతో నిండా మునిగి పనిచేస్తున్న వారందరి అనుభవంలో వున్నదే. అందుకు కారణం ఉద్యమ క్షేత్రాలలో వుంటున్న, కనపడుతున్న వాళ్ళలో ఎక్కువమంది అవగాహన, తపన లేనివాళ్ళే. ఆయా సంస్థల నిర్వాహకులున్నూ, కార్యకర్తలకు అధ్యయన శిక్షణ తరగతులు నిర్వహించుకోవడంలో తగినంత శ్రద్ధపెట్టడంలేదు. నిజానికిదెంతో విచారకరమైన విషయం. ఇది చాలాదన్నట్లు, దీర్ఘకాలం, పెద్దయెత్తున సాగించాల్సిన ఉద్యమాలకు వనరుల కొరతా ఎంతో వుంటోంది. ఆయా సంస్థల సభ్యుడు దొరికితే చాలన్నట్లు భావిస్తుండడం, ఆ చేరినవారున్నూ, మొహమాటానికో, గొప్పకోసమో సభ్యులుగ చేరుతుండడంతో దాదాపు ప్రతి సంస్థలోనూ అది చేపట్టిన సామాజిక కార్యక్రమాలలోనూ క్రియాశీలంగా, తనకున్న శక్తియుక్తులనన్నింటిని వినియోగిస్తూ పనిచేస్తుండేవారు అతికొద్దిమందే అవుతున్నారు.