Showing posts with label christianity. Show all posts
Showing posts with label christianity. Show all posts

Friday, December 15, 2017

క్రైస్తవ మత ప్రచారకుడు విజయకుమార్‌కు సూచన


  మొన్నటి జై భారత్‌ కార్యాలయంలో మనం కలసినప్పుడు తీసిన వీడియో రికార్డింగు ఆధారంగా, దానిలో మీరు మాట్లాడిన, నేను మాట్లాడిన అంశాలకు పరిమితమై విచారణకు కూచుందాము. అందులో ఎవరి పక్షంలో అపసవ్యతుంటే, దుందుడుకుతనం ఉంటే వారం లెంపలేసుకుని, క్షమాపణ చెపుతూ ఒక ప్రకటన విడుదల చేద్దాం. ఇలాటి వివాదాల విషయంలో ఎప్పుడు ఎవరు విచారణకు - చర్చకు - సిద్దపడ్డా అందులో అందరూ పాటించాల్సిన మొట్టమొదటి నియమం అనుకున్న విషయానికి పరిమితమైయ్యే మాట్లాడాలి. అన్యవిషయాలు మాట్లాడనే కూడదు అన్నదేకనక ఆ సమావేశంలో మన ఇరుపక్షాలలో ఎవరెవరు ఎక్కడెక్కడ హద్దులు దాటి మాట్లాడారో చూద్దాం. సమావేశం ఏర్పరచిందే, కరుణాకర్‌ రాసిన ''బైబిలు దేవుని నిజస్వరూప స్వభావాలు'' అన్న పుస్తకం పై చర్చకు నియమనిబంధనలు ఏర్పరచుకుని ఒప్పంద పత్రం రాసుకోడం కొరకు. ఇప్పుడు మనం ఆనాటి వీడియోను పరీక్షించేది 1. పై విషయంపై ఎవరేమి మాట్లాడిందీ తిరిగి చూసుకోడానికీ, అన్య విషయ ప్రస్తావన లెవరు చేసిందీ తేల్చుకోడానికీ, మాట్లాడినంతలో ఎవరు ప్రస్తావించిన అంశాలు సబబుగా ఉన్నాయో సరిచూసుకోడానికి. దీనిపై అనవసరపు మాటలు మాట్లాడకుండా వీడియో పరిశీలించడానికి సిద్దపడండి. నేను ఈ రోజు నుండి సిద్దంగా ఉంటాను. ఒక్కమాట! సమంజసమైన ఏ షరతుకైనా కరుణాకర్‌ని సిద్దం కమ్మని చెపుతాను. మీరుగానీ అతణ్ణికాదని, నాతోనే మాట్లాడతాననేట్లైతే, అందుకూ నాకభ్యంతరం లేదు. ఇకపోతే! ఆనాటి సమావేశానంతరం, హైద్రాబాదు కొత్తపేటలో ననుకుంటా, మీ బృందం ఏర్పరిచిన వేదికపై నుండి మీరు మాట్లాడిన దాన్నంతా విచారణకు తీసుకుందామన్నా నాకు అభ్యంతరం లేదు. ప్రగల్భాలు ఎవరు మాట్లాడినా అట్టి వారిని పిట్టలదొర అనో, ఉత్తరకుమారుడనో అనడం తెలుగు ప్రాంతంలో ఆనవాయితీ. మీరు మాట్లాడిన మాటలన్నింటిని బట్టి నేను ఇంకా కొంత మాట్లాడవలసిఉన్నా, నేనేదో అనడం, మీరేదో అనడం ఇదంతా మాటల మనుషులు చేసే కాలహరణ ప్రక్రియే. కనుక పై రెండు సందర్భాలకు చెందిన సంభాషణలపైనే విచారణకు కూర్చుందాం. దాన్నంతానూ రికార్డు చేద్దాం. చర్చలో మీరూ- నేను మాత్రమే మాట్లాడాలి. మీతోపాటు 4,5 గురు ఉండవచ్చు. నా వెంటా అంతే మంది ఉంటారు. వారెవరూ మాట్లాడకూడదు. వాస్తవాలను ఇష్టపడే స్వభావం నాకుంది. అది మీకూ ఉంటే ఈ సమావేశానికి సిద్ద కాకుండే అవకాశమేలేదు. సమావేశం విజయవాడలోనైనా, హైద్రాబాదులోనైనా అయితే బాగుంటుంది. మీ ప్రతిస్పందనగా వివేకపధానికి లేఖ రాసినా పరవాలేదు. నాకు వ్యక్తిగతంగా తెలియజేసినా సరే. మీ వీడియో రికార్డింగు రూపంలో ప్రకటించినా సరే. లుచ్చాల కంటెనూ హీనంగా ప్రవర్తిస్తున్న కొందరు బచ్చాగాండ్లు : ఇలాటి భాష మాట్లాడడానికి ప్రజ్ఞలేమీ అవసరంలేదు. బుద్దిహీనతుంటే చాలు. విజయకుమార్‌ మరియు విజయప్రసాద్‌రెడ్డి గార్లకు, అయ్యలారా! మన తెలుగులో ''పిల్లకాకి కేమి తెలుసు ఉండేలుదెబ్బ'' అనీ; సంస్కృతంలోనైతే ''మహాగజాః పలాయంతే మశకానాంతుకాగతిః'' అనీ రెండు నానుడులున్నాయి. మీకు అవి వర్తిస్తాయో లేదో గాని, మీ మందలోని కొందరికి మాత్రం అచ్చుగుద్దినట్లు సరిపోతాయి. మొన్నామధ్య ఒకరోజు కరుణాకర్‌ ఒక ఫోన్‌కాల్‌ వాయిస్‌ రికార్డు వినిపించాడు. అందులో ఒకడు ''బైబిలు దేవుని నిజస్వరూపస్వభావాలు'' అన్న మా పుస్తకాన్నీ, కరుణాకర్‌ చేస్తున్న ప్రసంగాలను ప్రస్తావించి, ఆపై తిట్ల పురాణం లంకించుకున్నాడు. పెంటనోట్లో పెట్టుకుని అతడు మాట్లాడిన అశుద్ధాన్నంతా ఇక్కడ రాయడం కుదరదు. నీ అమ్మ, నీ అక్క, నీ పెళ్ళాం అంటూ సాగిందా సంధి ప్రేలాపన. మీ చెవిదాకా అది వచ్చిందో లేదోగాని, మీ మందలోనే ఉన్న అలాటి మతిచెడిన వాళ్ళ విషయంలో మీ నిజాయితీ, నిస్పాక్షికతతో కూడిన నియంత్రణ ఎలా ఉంటుందో మీరే ప్రకటిస్తే మంచిది. బౌద్ద సాహిత్యంలో ఇలాటిదే ఒక సంఘటన గురించిన ప్రస్తావన ఉంది. పైన నేను చెప్పిన లాటి పిచ్చోడొకడు ఒకరోజు బుద్దుణ్ణి నానాదుర్భాషలూ ఆడాడు. అప్పుడు బుద్దుడు ఆ మాటలన్నవాడితోనే శాంతంగానే, మీరు పంపినవి చేరవలసిన వారికిగాక, వేరే వారికి చేరితే, ఆ నిజాన్ని బట్టి అవతలివారు వాటిని ఇవి నాకు సంబంధించినవి కావని తిరస్కరిస్తే అవి ఎవరికి చెందుతాయి అనడిగాడట. అవి పంపినవారికే గదా అన్నాడట. అలా అయితే ఇప్పుడు మీరు పంపినవి నాకు తగినవికావు. కనుక అవి పంపిన వారికి చెందడమే న్యాయం అన్నాడట. బుద్దిలేని వారికిలాటి సుద్దులు అంతుబట్టవుగాని, అర్ధం చేసుకునే సామర్ధ్యం ఉన్నవాళ్ళకి మాత్రం అన్నవాడికి మాడుపగిలింది అన్న విషయం తేలిగ్గానే అర్ధమవుతుంది. అలాగే, మరో పోస్టింగూ చూశాను కరుణాకర్‌ని ఉద్దేశించిందే. ఏదో ఇతర దేశంలో ఉన్న యువకుని వీడియో ప్రసంగం అది. అతడూ మతిచెడినవాడే. మొదటతానో హిందువునన్నట్లు మాట్లాడి, క్రమంగా ఆ ముసుగు తొలగించి అసలు రూపాన్ని చూపిస్తూ వచ్చాడతడు. ఒక దశలో హద్దులు మీరిన ఆవేశంతో, ఇండియా రాబోతున్నాను. అరే దుర్గుణగా! నిన్ను వదిలిపెట్టను. ఫిజికల్‌గా డామేజ్‌ చేస్తాను. అంటూ తెగ మాట్లాడేశాడు. అతడు మీ వాడో కాదో నాకైతే తెలీదు. అలాగే అక్కడున్నాను ఇక్కడున్నానంటున్న ఆ ఉత్తరకుమారుడు, ఇక్కడే ఎక్కడో సందులు గొందుల్లో ఉంటూ అంత బిల్డప్పు ఇచ్చాడేమో కూడా అన్న సందేహమూ ఉంది నాకైతే. అలాటి ''ఆల్‌బిత్తర్‌' గాండ్ల గురించినేను చెప్పేది ఒక్కటే, దొంగ దెబ్బలు, చాటుమాటు దాడుల బాపతుకాకుంటే, ఒక్కసారి మా ఎదుటబడి, అతడు చేస్తానన్నదీ, చేయగలిగింది చేసేస్తే ఒక పనైపోతుందికదా! ఆ గుంటడు ఈడనే ఉన్నాడనీ కరుణాకర్‌ మిత్రులలో ఎవరో అన్నారని కరుణాకర్‌ నాతో అన్నాడు. ఏడున్నావురా బిడ్డా! ఓసారి ఎదురుపడి చూడరాభడవా! మరో దుండగుడు విషయమూ కొద్దిరోజుల క్రిందటే నాకు తెలిసింది. మిత్రులు జాన్‌రాజ్‌ గారు, తన అవగాహనననుసరించి 1. రంజిత్‌ ఓఫీరుగారి హైందవక్రైస్తవం పోకడ దిక్కుమాలింది క్రైస్తవాన్ని బలహీనపరచేది, నిజమైన క్రైస్తవులూ, బైబిలును పరిశుద్ద గ్రంధంగా నమ్మేవాళ్ళూ ఏమాత్రం అంగీకరించనే అంగీకరించకూడనిది అని విస్పష్టంగా ప్రకటించారు. 2. మరో వంక బైబిలు దేవుని నిజస్వరూపస్వభావాలు అన్న పుస్తకంలో బైబిలు దేవునికి మనిషికుండే లక్షణాలన్నీ.. అరిషడ్వర్గాలన్నీ - ఉన్నాయన్న కరుణాకర్‌ మాటలు తనకెంతో అభ్యంతరకరమైనవి కనుక ఆ విషయంలో కరుణాకర్‌తో చర్చకు సిద్దమంటూ తెలియజేశారు. దీన్నంతటినీ గమనిస్తున్న క్రైస్తవపక్షంలోని మతి చెడిన మందలో ఎవరో ఒకరు, కరుణాకర్‌ వాళ్ళతో చర్చకు సిద్దపడవద్దు. మా మాటకాదని పోయావా నిన్ను మర్డర్‌ చేసేస్తాం అని ఆయన్నే బెదిరించారట. ఈ రకం మంద ముందుగా ఏసుని అనుకరిస్తూ ప్రియమైన సోదరుడా! దేవునికి స్తొత్రం ప్రేమతో నేను చెప్పిదేమంటే, నీ పద్దతి మార్చుకోకుంటే అత్యంత కౄరంగా నిన్ను చంపేయబోతున్నాను. లాటి రెండు రకాల మాటలూ మాట్లాడేస్తుంటారు. మొదట మాట పడికట్టుపదం - తరవాతది తన సొంతం అన్నమాట. 
ఈ రకానికంతా నేను చెప్పిదేమంటే! 
బైబిలునో, మరో గ్రంధాన్నో ఆ మూలాగ్రం పరిశీలించుదాం రమ్మంటేనో, మాట్లాడుకుందాం రమ్మంటేనో, అందుకు సిద్దపడక, జ్ఞానం విషయంలో చేయాల్సిన పనినీ, పద్దతినీ విడిచి, భౌతిక దాడులంటూ బెదిరిస్తారేమిటి బుడతలూ! బుద్దున్నవాళ్ళైతే తలతో ఆలోచించేపనీ విచారించే పనీ మాత్రమే చేస్తారు. ఆ సామర్ధ్యం లేనివాళ్ళే, గొర్రెపొటేళ్ళ మాదిరో, దున్నపోతుల మాదిరో తలను ఢీ కొట్టేందుకు మాత్రమే వాడుతుంటారు. అలాటి వారి విషయంలో అవకాశముంటే మాడు పగిలేలా ఒక్కటిచ్చికోవడమో, అవకాశంలేకుంటే ప్రక్కకు తప్పుకోడమో చేస్తారు బుద్దిమంతులు. కనుక మీ మీ స్వభావాలు సామర్ధ్యాల ననుసరించి మీరు చేయదలచింది చేయండి. మేం చేయవలసింది చేస్తాం. ఈ రకమంతా ఎలాగూ గొర్రెల మందేగాని, ఆ మందలకు కాపరులమంటున్న వారికైనా తల ఉండొద్దా? తలగలిగినవాళ్ళు ప్రవర్తించాల్సిన తీరున ప్రవర్తించవద్దా? సిద్దాంత విచారణెక్కడ? సిగ్గెగ్గులు గానీ, సభ్యతా సంస్కారాలుగానిలేని కారుకూతలెక్కడ? రెంటికీ ఏమైనా పొంతన ఉందా? ఓ సభ్యతా సంస్కారాలు లేని, ఏ పెద్దల వద్దా బుద్ది గరవని మంద, స్ధాయిల గురించి తెగవదరుతోన్న పిదప కాలంలో ఉన్నాం మనం. ఓ చర్చావేదిక నియమనిబంధనల గురించి కనీస అవగాహన కూడా లేనివారే ఎక్కువగా చర్చల పేరిట నానా రభసా చేస్తున్న పిదపకాలంలో ఉన్నాం. ఓ విమర్శకు, విచారణకు, సమీకక్షూ, రుజువుకూ, ఖండనకు, నిందకు తేడా తెలియని మంద ఉన్న పిదపకాలంలో ఉన్నాం మనం - ఏం చేద్దాం? సమయం, సందర్భం కొరకు వేచి చూద్దాం 
సత్యాన్వేషణలో - 
మీ సురేంద్ర 

అద్దంకి రంజిత్‌ గారికో బహిరంగ లేఖ

 హైందవ క్రైస్తవం పుస్తక రచయితలైన అద్దంకి రంజిత్‌ ఓఫీరుగారికి.. మనస్పూర్తిగా మిత్రమా అని పిలుచుకోగలిగిన వాస్తవ పరిస్థితి మన మధ్య నెలకొనిలేనప్పటికీ, మీరు మీ పుస్తకంపై పండితులతో సత్యాసత్య విచారణకు సిద్దమని ప్రకటించడం ద్వారా, సత్యావిష్కరణకు సిద్దపడిన వాళ్ళందరూ, వారు ఏఏ పక్షాలకు చెందినవారైనా, సత్యాన్ని ఇష్టపడేవాళ్ళుగా భావసారూప్యత కలిగిన వారవుతారు. కనుక ఈ రకంగా ప్రస్తుతం తాత్కాలికంగాను అయినా మిత్రదృష్టితో ఇక ముందు జరగాల్సినపనులగురించి ఆలోచించుకునే యత్నాలను ఆరంభించుకునే వెసులుబాటు కలిగింది. అలాటి మంచి నిర్ణయం తీసుకున్నందుకు మీకు నా అభినందనలు.
 ముందుగా ఒక్కమాట 
 ''మిత్రస్యాహం చక్షుషా సర్వాణిభూతాని సమీక్ష్యే'' అన్న ఆర్యోక్తి నాకు ఆదర్శప్రాయమైనది. అంతటి హృదయవిశాలత, మానసిక సామర్ధ్యం ఇప్పటికి నాకులేకున్నా, అవసరమైనప్పుడూ, అవకాశం ఉన్నప్పుడూ, శక్తిసరిపోయినంతలో అలా ఉండడానికే ప్రయత్నిస్తూ వస్తున్న వాణ్ణి నేను. కనుక మరో రకమైన అవాంఛనీయ పరిస్థితులు చోటు చేసుకోకుండా ఉన్నంతకాలం, అవకాశం ఉన్నంతలో పరస్పరం మిత్ర దృష్టితో మెలగడానికే యత్నిద్దాం. నావైపు నుండి అలా ఉండడానికి నిజాయితీగా ప్రయత్నం చేస్తాను. ఈ నాలుగు మాటలైనా ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులలో విషయపరంగా ప్రత్యర్ధులంగా ఉన్న మన మధ్య వ్యక్తిగతంగా అనవసరపు వత్తిడీ, ప్రతికూల దృష్టి ఏర్పడకుండా, విషయాన్ని విషయంగా చూడడానికి ఎంతో కొంత అనుకూల వాతావరణాన్ని నెలకొల్పుతాయనే ఉద్దేశంతోనే చెప్పాను. ఏ విధానాన్ననుసరించైనా, మిత్రులంగా ఉండిగానీ, వాది ప్రతివాదులుగా ఉండిగాని, కడకు వైరదృష్టి కలిగైనా సరే ''ఏనకేనాప్యుపాయేన సత్యమేవస్థాపనీయ మితి బుధజనోక్తిః'' అన్న దానిని త్రికరణ శుద్దిగా అంగీకరిస్తున్నవాణ్ణినేను. ఈ తాత్విక భావన ఆధారంగా చేసుకునే, ధర్మసాధనకు గానీ, సత్యస్థాపనముగానీ సామదానభేదదండములన్న చతుర్విధోపాయాలు పుట్టాయి లేదా ధర్మవేత్తల చేత అంగీకరింపబడ్డాయి. ఇదెంతో కీలకమైన విషయం. ఈ విషయాలేవీ మీకు తెలియనివని ఇక్కడ రాయడంలేదు. ఎవరో ఒకరిని అడ్డుపెట్టుకుని, ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకుని ఎంతోవిలువైన, ఇలాటి భావాలను మాటిమాటికీ గుర్తు చేసుకోవడం, గుర్తు చేస్తుండడం, సాధారణ ప్రజలకు తెలియజేస్తుండడం అన్న మూడూ కూడా మేధో భాగంలో అంటే భావజాల క్షేత్రంలో, పనిచేస్తుండే వారి బాధ్యత. సరైన పద్దతీ, పరికరాలు లేని ఏ పనీ సజావుగా నెరవేరదు. కనుకనే విజ్ఞులు యోగ్యమైన ప్రతి పనికీ అది సఫలం కావాలంటే సరైన పరికరాలు- సరైన, సమగ్రమైన విధానము అన్నవి ఉండి తీరాలనంటారు. దీనికే సంబంధించిన ఒక సర్వసాధారణ నియమం (విశ్వనియమం) ఉంది. సూ :- కర్త - ఉద్దేశము - పరికరాలు - విధానము - పని = ఉద్దిష్ట ఫలితము. వీటిని మన ప్రస్తుత సందర్భానికి అన్వయించుకుంటే ఎలాగుంటుంది? 

 చర్చలు - చర్చల పేరున జరుగుతున్న రచ్చలు

 ఈ తరంలో అంటే గత రెండు మూడు దశాబ్దాలుగా అప్పుడప్పుడూ 'డిబేట్‌' ల పేరున జరిగిన, జరుగుతున్న వేదికలను జాగ్రత్తగా పరిశీలిస్తే, అవెంత డొల్లతనంతో కూడుకుని ఉందీ ఇట్టే తెలిసిపోతుంది. ఇలాటి వేదికలకు ఈ తరంలో ఆద్యుడని చెప్పదగింది ఇస్లాం మత ప్రచారకుడైన అహ్మద్‌దీదాత్‌ గారినే. అదేవరవడిని అంది పుచ్చుకుని డా.జాకీర్‌ నాయక్‌ అన్నాయనా, 'డిబేట్‌'ల పేరునే చాలా కార్యక్రమాలు నిర్వహించారు. ఆతరవాత్తరవాత పలు ఇస్లాం, క్రైస్తవ సంస్ధలవారూ ఇదే వరవడిన తామూ కొన్ని కార్యక్రమాలు చేస్తూవస్తున్నారు. అలాటి వాటిలో కొన్నింటిని ఉట్టంకిస్తాను. 
 1. పి.డి సుందర్రావు - దీదాత్‌గార్లు తలపెట్టింది (ఇది సజావుగా పూర్తికాలేదు) వివరాలకు పి.డి. సుందర్రావుగారి పుస్తకాలు, సి.డి.లు చూడండి. 
 2. జాకీర్‌ నాయక్‌ - రవిశంకర్‌ గార్ల మధ్య జరిగింది. 
 3. అద్దంకి రంజిత్‌ ఓఫీర్‌ - ఇమ్రాన్‌ల మధ్య జరిగింది. 
 4. విజయకుమార్‌కు - ఫజులు ర్రహ్మన్‌ గారికీ జరిగింది. 
 5. సత్యప్రకాశానంద - ముస్తాక్‌ అహ్మద్‌ గార్ల మధ్య జరిగింది. 
 6. కరుణాకర్‌ సుగ్గున - విజయకుమార్‌ల మధ్య జరిగింది. 
 7. కరుణాకర్‌ సుగ్గున - విజయ ప్రసాద్‌రెడ్డిల మధ్య జరిగింది. 
 గమనిక :- మొత్తం నెట్‌ను పరిశీలిస్తే ఇలాటివి ఎన్నో డిబేట్‌ల విషయం కనపడుతుంది. ఎన్ని అలా జరిగాయన్నది మనకంత ముఖ్యంకాదు. అవి ఎలా జరిగాయన్నదే అస్సలు విషయం- ఇవిగో అవి ఇలా ఉంటాయి. 
 1. ఏదో ఒక సంస్థవారు ప్రధాన బాధ్యత స్వీకరించి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. 
 2. సమావేశంలో వేదికపై నుండే వారు - వేదిక క్రింద ఉండేవారు అన్న విభజన ఉంటుంది.
 3. శోత్రలు (నిజంగా వేదిక క్రింద కూర్చున్నవారిలో శ్రోతలెందరు? ప్రేక్షకులెందరు? రెండు పాత్రలు పోషిస్తున్న వారెందరు అన్నది పరిశీలిస్తే గాని తేలదు) 
 4. సమావేశాన్ని ఏర్పాటు చేసిన వారికి చెందిన మందే ఎక్కువమంది 60% నుండి 80% ఉంటారు. మిగిలిన 40% జనంలో రకరకాల ధోరణులవారుంటారు. 
 5. సభానిర్వహణ, పర్యవేక్షణ, నియంత్రణ వగైరాలన్నీ ఏర్పాటు చేసిన వారి చేతిలోనే ఉంటాయి. 

 ఆవేదిక స్వరూపస్వభావాలు 

 1. ఒక నిర్ధిష్ట ప్రతిపాదనపై సత్యాసత్య విచారణ అన్నది ఉండనే ఉండదు. చర్చనీయాంశంగా ఒక విస్తారమైన భావాలున్న దానినిపెట్టుకుంటారు. దాంతో ఏ భావాన్నీ విడిగా విచారించడం సాధ్యంకాకుండా పోతుంది. 
 2. ఎ) ముందుగా ఒక పక్షం వ్యక్తి ఎంపిక చేసుకున్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణీత సమయం వరకు ప్రసంగిస్తారు. అది సాధారణంగా 40, 45 నిముషాలుంటోంది (కొందరు 30 నిముషాలు పెట్టుకోవచ్చు) ఎ1) ఆ తరవాత రెండో పక్షం వ్యక్తి తానూ అంతే సమయం తన ప్రసంగం వినిపిస్తాడు. బి) మరల రెండో సెషన్‌లో 1వ పక్షం వ్యక్తి 15, 20 నిముషాలు ప్రసంగిస్తాడు బి1) అటు తరవాత రెండో పక్షం వ్యక్తి తానూ అంతే సమయం మలి ప్రసంగం చేస్తాడు. సి) చివరకు 1వ పక్షం 5, 10 నిముషాలు మాట్లాడతాడు. సి1) అటు పై 2వ పక్షం తానూ 5, 10 నిముషాలు మాట్లాడతాడు. ఓ గొప్ప హాస్యాస్పదమూ, విచిత్రమూ ఏమిటంటే, వేదిక సత్యాసత్య నిర్ణయం చేయదు సరికదా, కొన్ని వేదికలలోనైతే ముందస్ధుగా రాసుకునే నియమనిబంధనల ఒప్పంద పత్రంలోనే జడ్జిమెంటు చేయకూడదు. నిర్ణయాలు వేదిక నుండి ఉండవు. సత్యాసత్య నిర్ణయాన్ని సభకు వదిలేద్దాం. వింటానికి వచ్చిన వారే నిర్ణితలు, వారే నిర్ణయించుకుంటారు. అన్న నిబంధన కూడా చేర్చుతారు. ఓ ఇక సభాధ్యక్ష స్ధానంలోనైతే ఎక్కువసార్లు సభ ఏర్పాటు చేసిన పక్షంవారి మనిషే కూర్చుంటాడు. ఓ సభ ఏర్పరచిన పక్షం వారి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మాత్రమే పదే పదే చప్పట్లు, హర్షద్వానాలూ, అనుకూల స్పందనలు వినపడుతూ, కనపడుతూ ఉంటై, రెండో పక్షం వ్యక్తి మాట్లాడేటప్పుడు వాటి జోరు అంతగా ఉండదు. ఈయనగారి మందా కొందరున్న సందర్భాలలో నామమాత్రంగా ఉంటుంది. సభ జరుగుతుంది. ముగుస్తుంది. ఇంతటితో అగితే పెద్ద విశేషమేమీ ఉండదు. అస్సలు కథ ఇప్పటి నుండే మొదలవుతుంది. 1. ఆధునిక సాంకేతిక విజ్ఞానపు ఆసరా 2. తమతమ సొంతమందలో తాము రగిల్చిన ఆవేశము 3. ఇందుకోసమే ముందస్ధు పన్నాగంతోనే సమావేశం ఏర్పరచారు గనుక వారూ మీడియాలో, సోషల్‌ మీడియాలో వాట్సప్‌, పేస్‌బుక్‌, యుట్యూబ్‌, వెబ్‌ల ద్వారా, ప్రత్యేక సి.డిల ద్వారా తెగచెలరేగిపోతుంటారు. ముందుగా ఇరు పక్షాలూ ఎవరికివారు విజయోత్సవ సమావేశాలు ఏర్పరచుకుంటారు. తామే గెలిచామని ప్రకటించుకుంటారు. అంతటితోనైనా ఆవేశాన్ని తగ్గించుకుని, తృప్తిపడి ఊరుకోరు. ఎదుటి పక్షంపైన దుమ్మెత్తిపోస్తారు. అతడెందుకూ పనికిరాడనీ, తమకు సాటి రాడనీ తెగ ప్రగల్భిస్తుంటారు. అక్కడితోనూ ఆగరు. వాట్సప్‌, పేస్‌బుక్‌, యూట్యూబులలో తామరతంపరగా అడ్డగోలు ప్రకటనలు చేస్తుంటారు. శృతిమించితే ఒకరినొకరు బండబూతులూ తిట్టుకుంటుంటారు. ఒక చిన్న వీడియో కెమారా సంపాదించుకుని, చిన్న చిన్న అంశాలుగా, ఖండాలుగా ఎదుటివాణ్ణి తొక్కేశాం, నలిపేశాం, విశిరేశాం, ఊదేశాం, బాదేశామంటూ ఒక వంకా, నేనంతోణ్ణి, ఇంతోణ్ణి, నా ముందు వాడెంత... ఇలా అంతూపొంతూ లేకుండా, అసభ్యంగా సంస్కారహీనంగా, బజారు మనుషుల పోకడకంటెనూ దిగజారుడు రూపంలో అస్సలు విషయాన్ని ప్రక్కన పెట్టి వ్యక్తిగత నిందాస్ధుతులతో మంది కాలాన్ని మింగేస్తుంటారు. అబ్బో, ఇదంతా, దానికదే ఒక పెద్ద తలనొప్పి. ఇలాటి సమావేశాలు చేసేవారిలో మరో రకం ప్రయోజనాలను ఆశించే గుంపూ ఉంది. వారిది విషయం తేల్చాలన్న దృష్టి కాదు. వారి దృష్టిలో ఒక పార్శ్వం సంపాదన - అత్యధిక సంపాదన, ప్రసిద్ది అన్నది కాగా మరో పార్శ్వం సామాన్య జనానికి వలవేసి పట్టుకోవడం. ఇది నిజం చెప్పవలసి వస్తే అత్యంత హేయమైన, దగుల్బాజీతనంతో కూడిన నికృష్టవైఖరి. ఇంతలేసి మాటలు ఎందుకనాల్సి వచ్చిందంటే, ఈ రకం గుంపు దేవుణ్ణి, విశ్వాసాలను, బలహీనతలనూ కూడా వ్యాపార వస్తువులుగా చూస్తూ వాడుకుంటూ ఉంటారు. నిష్టూరంగా ఉన్న ఈ విషయంలో నిజమేమిటంటే, ఆయా మత గ్రంధాల ప్రకారమే ఈ రకమంతా ముందస్తుగా నరకానికి పోతారు. అందులోనూ ప్రథమ శ్రేణిలో ఉంటారు. మరి ఆ భయం వీరికుండదా అంటే, వీళ్ళస్సలు స్వభావం బలమైన అవిశ్వాసంతో కూడుకునే ఉంటుంది. ఈ రకాన్నే ఏసు, వేషధారులు, అబద్దపు బోధకులు, అబద్దపు క్రీస్తులు అంటూ పదే పదే ప్రకటించాడు. ఖురాను దృష్టి నుండి కూడా ముస్లింలుగా గుర్తింపబడుతున్న వారిలోనే ప్రతి 1000 మందిలో 999 మంది నరకానికే పోతారు. ఎంత ప్రధానమైన పెద్దదైన అంశమిది? ఈ నా మాటలు అవాస్తవాలుగానీ, అతిశయోక్తులు గానీ కావనేందుకు మీ మాటలూ, మీకు సూటిగా ప్రత్యర్ధిగా ఉన్న ఇతర క్రైస్తవుల మాటలనే ఉదహరించవచ్చు. విపుల పరిశీలన అవసరమైన రోజు అవన్నీ విచారణకు పెట్టుకుందాం. ఇక.... ''నిజం నిలకడ మీద తెలుస్తుంది''; ''ఏసే తీర్పు తీర్చుతాడు'' లాటి మాటలన్నీ వల్లించుకోడానికీ ఉదహరించడానికీ పనికొచ్చేవేగాని, మన మన జీవితాలలో అలాటివేమీ సాధారణంగా జరగనే జరగవు. నిజంగానే అలాటివి ఈ లోకంలోనే జరుగుతున్నట్లు మన అనుభవంలో ఉండుంటే ఈ రకం వారి పోకడ కనీసం సగానికి సగమైనా తగ్గిపోయేది. అదుపులోనూ ఉండేది. అలాటివేవీ కనీసంగానైనా మన అనుభవంలోకి రావడం లేదు గనకనే ఈ మాటల ప్రభావం మనలో ఎవరిపైనా అంతగా ఉండడంలేదు. ముఖ్యంగా ఈ పన్నాగ రాయుళ్ళకు ఆ నమ్మకాలేమీ లేవు. ఉండవు. ఈ మధ్యనే నేను పైన చెప్పుకున్నలాటి, చర్చలనడానికి తగని 'డిబేట్‌'లకు చెందిన కొన్ని క్లిప్పింగులు చూశాను. అందులో ఒక దానికి మధ్యవర్తిగా అంటే సభానిర్వాహకునిగా లేదా అధ్యక్షునిగా - ఫజులుర్రహ్మాన్‌గారు వ్యవహరించారు. దానిని ఏర్పాటు చేసింది విజయప్రసాద్‌ రెడ్డిగారు. ఆవేదిక నిబంధనల ననుసరించి సభాధ్యక్షుడు / మధ్యవర్తి, ఎట్టి నిర్ణయాన్ని ప్రకటించకూడదు. కానీ మన రహ్మన్‌గారు ఆ తరువాత వి. ప్రసాద్‌ రెడ్డిగారికి సంబంధించిన ఒక వ్యక్తితో విజయప్రసాద్‌ రెడ్డి దుమ్ముదులిపేశాడంటూ తెగ సంతోషాన్ని ముఖంలో కనబరుస్తూ ఒక వీడియో రికార్డింగులో దర్శనమిచ్చారు. ఇక విజయకుమార్‌ - కరుణాకర్‌ ల డిబేట్‌ ముగిశాక రెండు పక్షాలకు చెందిన అభిమానులూ విజయోత్సవ సభలు నిర్వహించుకున్నారు. అందులో విజయకుమార్‌ గారి విజయోత్సవసభలోనైతే ఒకరిద్దరు పసిపిల్లల చేత కరుణాకర్‌ని నిందిస్తూ, హేళన చేస్తూ ప్రసంగాలు చేయించారు కూడా. ఇకపోతే, షఫీ, ఇమ్రాన్‌, జాకీర్‌నాయక్‌ వగైరా ఇస్లాం పక్షీయుల వేదిక గురించి చెప్పనే అక్కరలేదు. అసలు సభా నిర్వహణే ఒక పెద్ద సినిమా షూటింగా అన్నంత సీన్‌ క్రియేట్‌ చేస్తారు. అందులో అధ్యక్షునిగా ఒక ముస్లిమే ఉంటాడు. సభలో పైన నేనన్నట్లు 60%, 80% పాత ముస్లింలూ కొత్తగా ముస్లింలైన వారూ ముస్లింలు కావడానికి సిద్దం చేయబడిన వారూ కలసి ఉంటారు. మిగిలిన 40%, 20% రకరకాల వాళ్ళుంటారు. ఓఫీరుగారూ! ఈ వివరాలన్నీ జరిగిన వాస్తవాలను చూపేటివో కాదో మీకూ బాగానే తెలుసు. మరిచాను. ఆ డిబేట్‌లేని 'డిబేట్‌' వేదికల్లో జరిగే ఆఖరి అంకాన్ని గురించి చెప్పడం మరిచాను. ఆఖరి అంకం ప్రశ్నలు సమాధానాలు అన్నదిగా ఉంటుంది. అధ్యక్షుడు ప్రకటిస్తాడు. ఒక్కో పక్షంవారిని శ్రోతలు 3 లేక 4 ప్రశ్నలు అడగవచ్చు. ప్రశ్న సూటిగా, క్లుప్తంగా ఉండాలి. సమాధానం 1 నిముషంలోనో 2 నిముషాల్లోనో చెప్పాలి అన్న నిబంధన పెడతాడు. సభాసదుల్లోనుండి ఎవరో ఏదో అడుగుతాడు, దానికి సమాధానంగా ప్రశ్నించబడ్డాయన తనకుతోచిందేదో చెప్పబోతాడు. సమాధానం చెప్పడం పూర్తయినా, కాకున్నా సమయం అయిపోతే ఊరుకుండాల్సిందే. అలా ముగుస్తుందా డిబేట్‌ కార్యక్రమం. ఈ రికార్డింగులనన్నంటినీ సిద్దం చేసుకుని ఇలాటి కార్యక్రమాలు జరిపినవాళ్ళకు దండిగా ధనసాయం చేసే ఆయా మతాలకు చెందిన బడాబడా విదేశీ సంస్ధలకు చూపించి వాళ్ళతో ఒక అవగాహనకు వచ్చి ఈ కార్యక్రమాలను నిర్వహించినందుకుగాను పెద్ద మొత్తాలలోనే డబ్బు రాబట్టుకునే బ్రతుకుదెరవు + విపరీతమైన సంపాదనకు గడంగే వారు మరికొందరున్నారీ సంస్ధలలో. రంజిత్‌ ఓఫీర్‌గారూ! మీరూ ఆలోచించగలవారే. ఈ తరహా వేదికలనూ ప్రపంచాన్నీ చూస్తున్నవారే. ఇలాటి వేదికలేవీ సత్యాసత్య విచారణ లక్ష్యంతో చేస్తున్నవి కావు. ఎవరో ఒకరికి ఎక్కడో చోట సత్యం తేలాలన్న ఉద్దేశం నిజంగానే ఉందనుకున్నా, అట్టి సామర్ధ్యం వాటికి లేదు గనుకీ తరహా వేదికలు అందుకు ఏ మాత్రం సరిపోవు. కనుక అలాటి ప్రయత్నాలు నిజంగా సఫలం కావాలంటే ఉండాల్సిన కొన్ని సాధారణ సూత్రీకరణలు గురించి ప్రస్తావిస్తాను. అవి సబబైనవో కావో మీరూ పరిశీలించండి. 

 అనుకున్న ఏ పనైనా సఫలం కావాలంటే, 
 1. అన్నిటికంటే ముందుగా, అందుకుతగిన వాతావరణం ఉండాలి లేదా ఏర్పరచుకోవాలి. 
 2. అందులో - ఆ ఉద్దేశం నెరవేర్పు యత్నంలో పాల్గొనేవాళ్ళందరికీ ఎందుకా పని చేస్తున్నదీ, ఎలా చేయాలనుకుంటున్నదీ తెలిసి ఉండాలి. 
 3. తెలిసి ఉంటే చాలదు. ఆ పని నెరవేరాలన్న అభిలాష ఉండాలి. అందుకు తాను చేయగలిగినంత సహకారం చేయడానికి సిద్దపడాలి. అలా వీలుకాని పక్షంలో కనీసం పనికి అడ్డుతగలకుండానైనా ఉండాలి. 
 4. ఆ పని, ఎవరైనా వ్యక్తి లేదా ఏదైనా గ్రంధం వెలిబుచ్చిన అభిప్రాయాల సత్యాసత్యాలను నిగ్గు తేల్చడం కొరకు ఏర్పడిందైతే, అందుకు తగిన వ్యక్తులతో కూడి ఉండాలి. 
 5. అలాటి వేదికలలో కనీసం ఇరుపక్షాలుండాలి. 
ఇరుపక్షాలలో ఒకటి పరీక్షకు తీసుకున్న ప్రతిపాదనలకు ప్రాతినిధ్యం వహించిందై ఉంటుంది. రెండోది, రెండు రకాల స్వభావాలతో ఉండవచ్చు. 
 1. మొదటి పక్షపు ప్రతిపాదనలను పరీక్షించేందుకు సిద్దమైన వారితో కూడి ఉన్నది కాగా 
 2. రెండోది మొదటి పక్షపు ప్రతిపాదనలకు విరుద్దమైన అభిప్రాయాలు కల వారితో కూడినదై ఉంటుంది.
 గమనిక :- ఒకటవ విధానంలో ప్రతిపాదకులుంటారు. వారిని ప్రశ్నించే పృశ్చకులుంటారు. ఈ రెండో పక్షం ప్రతిపక్షం కాదు. ప్రశ్నించే పక్షం మాత్రమే. ఏదైనా ఒక సిద్దాంతాన్ని పరీక్షకు స్వీకరిస్తే సాగే విచారణ ఈ రకంగానే ఉంటుంది. ఇందులో పృశ్చకులకు తన పక్షమంటూ ఉండఖ్ఖరలేదు. ఇంకా సరిగా చెప్పాలంటే ఉండదు. ప్రతిపాదనల బలాబలాలను, సత్యాసత్యాలను పట్టిచూడడమే ఇక్కడ జరిగే పని. ఇక రెండవ విధానంలోనైతే, 1వ పక్షంవారి ప్రతిపాదనతో విభేదిస్తూనో, విరోధిస్తూనో తనకూ ఒక ప్రతిపాదన ఉంటుంది. దానినే ప్రతి పక్షం అనంటున్నాం. వాదము ప్రతివాదము అన్న రెండూ ఉండే సందర్భానికి సరిపోయే విధానమిది.
 అతిముఖ్య గమనిక :- ఈ రెండు విధానాలలోనూ, ఒక సమయంలో ఎవరిదో ఒకరి ప్రతిపాదననే విచారణకు స్వీకరించి విచారించాల్సి ఉంటుంది. అది 1వ వారి ప్రతిపాదనగానీ, 2వ వారి ప్రతిపాదనగానీండి, దానిని విచారించే సందర్భంలో ఆ ప్రతిపాదనపై మొదలైన విచారణ ఒక ముగింపుకు వచ్చే లోపు మరో ప్రతిపాదనను లేవనెత్తకూడదు. తీసుకోనే కూడదు. యోగ్యమైన చర్చావేదిక నియమాలలో ఇది అత్యంత కీలకమూ, మౌలికమూ అయిన ప్రాథమిక నియమం. విచారణకు స్వీకరించిన ప్రతిపాదనకు సంబంధించిన విచారణ పూర్తై, దానిపై ఒక నిర్ణయం ప్రకటించాకనే, మరో అంశాన్ని-ప్రతిపాదనను - విచారణకు తీసుకోవాలన్నమాట. దీనికి ఎక్కడ ఆటంకం ఏర్పడ్డా, దీనిని ఎక్కడ అతిక్రమించినా ఇక ఆ వేదిక సత్యాసత్య నిర్ధారణ సామర్ధ్యాన్ని కోల్పోయినట్లే, ఇప్పుడీనియమాన్ని పైన పేర్కొన్న రెండు రకాల విచారణకూ అన్వయించవచ్చో లేదో చూద్దాం. 1వ విధానంలో వాద ప్రతివాదులుండరు. ఎవరో ఒకరు చేసిన ప్రతిపాదన దాని పరీక్ష ఉంటుంది. ఆ ధోరణిలో ప్రతిపాదనలు అనేకం ఉండవచ్చుగాక, ప్రతి ప్రత్యేక సమయంలోనూ అంటే ఎప్పటికప్పుడు, అప్పటికి ఏదో ఒక ప్రతిపాదనే పరీక్షకు స్వీకరించడం జరుగుతుంటుంది. దాని సత్యాసత్యాలను పరీక్షించి నిర్ధారించడానికి మరొక ప్రతిపాదనగానీ, మరొకరి ప్రతిపాదనగాని అవసరంలేదు. 
 ఉదా :  5 x 5 = 27 అన్నాడొకడు. అది తప్పో వప్పో తేల్చడానికి, అతనిదే మరో ప్రతిపాదనతో గానీ, అదే విషయంలో మరొకరి ప్రతిపాదనతోగాని పనిలేదు కదా! ఇది నిజమా కాదా? ఆలోచించండి. 2వ విధానంలో ఒకే విషయంపై ఒకటికంటే ఎక్కువ (అనేక) ప్రతిపాదనలుంటాయి. అయినా ఇక్కడ కూడా ఎప్పటికప్పుడు వాటిలో ఏదో ఒకటే పరీక్షకులోను చేయబడుతూ ఉంటుంది. ఏకకాలంలో రెండు ప్రతిపాదనలనూ పరీక్షించడం సాధ్యపడదు. అనవసరం కూడా. చేయకూడదు. కనుకనే ఇలా. ఉదా :- 1వ పక్షం 5x5 = 27 అన్నాడు, 2వ పక్షం 5x5 = 29 అన్నాడు, 3వ పక్షం 5x5 = 25 అన్నాడు అనుకుందాం. ఇందులో ఏది వాస్తవాన్ని చూపుతుంది? (ఏది సత్యం లేదా ఏది సరైంది?) అన్నది పరిశీలించడానికి మరో దానిని జత చేయాల్సిన, ప్రకటించాల్సిన అవసరం లేదుగాక లేదు. లేదన్నదే కాదు. జత చేయకూడదు కూడా. ఒక్క సందర్భంలోనే రెంటినీ కలిపి చూసే అవసరం రావచ్చు. పరిశీలనే తులనాత్మక అధ్యయన రూపం అయిందైయ్యుంటే, అప్పుడైనా దేనికి దానిని పరిశీలించాకనే, పోల్చిచూడడం జరుగుతుంటుంది. 

యోగ్యమైన చర్చావేదిక గురించి మాట్లాడుకుంటున్నాం. 
 ఓ ఏ పనికైనా అనుకూల వాతావరణం ఉండాలన్నది మొట్టమొదటి నియమం. ఓ విధం తెలిసిన, విజ్ఞత కలిగిన రెండు పక్షాలుండాలన్నది రెండో నియమం. ఓ పరిశీలనాంశం ఏమిటన్నది నిర్ధిష్టరూపంలో ప్రకటింపబడాలన్నది మూడో నియమం. ఓ ఇరు పక్షాల వాదనలు సరైన రీతిలో జరుగుతున్నాయోలేదో పరిశీలించే విశేషజ్ఞులుండాన్నది నాలుగో నియమం. ఓ ఇరుపక్షాలకు అభ్యంతరం లేకుంటే పరిశీలక బృందాన్నే నిర్ణీతలుగ ఏర్పరచుకోవచ్చు. లేదా వారిని - నిర్ణేతల బృందాన్ని పరిశీలకుల బృందంకంటే వేరుగానూ ఏర్పరచుకోవచ్చు. ఈ రెండు పేర్ల క్రింద ఉన్నవారు వివాదాంశపు విషయంలో విశేషజ్ఞులై (పండితులై) ఉండడం, వేదిక ఏర్పరచుకున్న నియమ నిబంధనల్ని పూర్తిగా అర్ధం చేసుకుని ఉండడం, వీలైనంతలో నిస్పక్షపాతంగా వ్యవహరించగలిగి ఉండడం అన్న సామర్ధ్యం కలవారై ఉండాలి. వీరిని రెండుగా ఏర్పరచుకుందామంటే అందులో పరిశీలక పక్షం విషయజ్ఞులూ, విధానం తెలిసినవారు, నిజాయితీ పరులైతే చాలు. విధిగా నిస్పాకిక్షులవ్వాలన్న నియమం ఉండక్కర్లా. ఇక నిర్ణేతలకైతే విషయజ్ఞతా, విధానం తెలిసుండడం, నిజాయితీ పరులై (పెద్ద మనిషి తరహాగా) ఉండడంతో పాటు నిస్పాకిక్షులై యుండడం నియమం. నిర్ణేతలకు విచారణీయాంశంలో లోతైన అవగాహన ఉండి తీరాలన్న నియమం లేదు. నిస్పాకిక్షులై యుండాలన్నదే నియమం. అవసరమైతే వారు విశేషజ్ఞుల నుండి విచారణీయాంశానికి చెందిన సమాచారాన్ని వివిధ రీతులలో సేకరించుకుంటారు. న్యాయమూర్తులు వివాదాంశాలకు సంబంధించిన ప్రత్యేకాంశాలలో నిపుణులతో సంప్రదించి వారి నుండి ధృవీకరించిన నివేదికలను సేకరించుకుంటున్నట్లన్నమాట. 
 కనుక యోగ్యమైన చర్చావేదికలో
 1. అనుకూలవాతావరణం 2. విధి విధానాలెరిగి సత్యావిష్కరణ లక్ష్యంగా కల ఇరు పక్షాలు, 3. విషయజ్ఞులైన పరిశీలక పక్షం, 4. నిస్పాకిక్షులైన నిర్ణేతల పక్షం ఉండాలన్నమాట. దీనితో పాటు అట్టి వేదిక ఏర్పడాలంటే ఉండకూడనివేమిటో తెలిసి అవి లేకుండానూ చూసుకోవాలి. 1. సాధారణ ప్రజలుండరాదు. 2. వందమాగధులు, అనుకూల ప్రతికూల దృష్టులుకల అనుచరగణము ఉండరాదు. 3. శబ్దకాలుష్యం ఉండరాదు. 4. ఆరంభం నుండి కార్యక్రమం పూర్తయ్యేంత వరకైనా పై నాలిగింటి ప్రభావం పడకుండా చూసుకోవాలి. ఓ నిజమేమిటన్నది నిర్ధారించుకోడానికి అవసరమైన వారే ప్రతికూల దృస్టిలేని వారే ఆవేదిక క్షేత్రంలో ఉండాలి. విచారణలో పాలు పంచుకోవలసిన వారు తప్ప ఇతరులెవరూ ఉండరాదు. విచారణ పర్యవసానం అంటే ముగింపు స్థితిలో ఏర్పడే నిర్ణయం - మూడు రకాలుగా ఉంటుంది. 1. ప్రతిపాదన సరైందికాదని తేలింది 2. సరైందేనని తేలింది. 3. ముగించే సమయానికి తేలలేదని తేలింది. గమనిక : ఏవైన ప్రతిపాదనలు ఈ వేదికలో తేల్చరానివనీగానీ, ఏ వేదికలోనైనా తేల్చరానివేనని గానీ తేలవచ్చా? ఆలోచించండి. అలాటివి మీ దృస్టి కొస్తే చెప్పండి. 
  వీటి తరవాత చెప్పుకోవలసిన నియమాలు మరొకొన్ని ఉన్నాయి.
 1. వివాదాంశంపై విచారణ ముగిసేంత వరకు ఏ పక్షమూ అర్ధాంతరంగా వేదిక నుండి విరమించుకోరాదు. మన ప్రస్తుత వివాదాంశం హైందవ క్రైస్తవం పుస్తకం ద్వారా వివిధాంశాలపై మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలు సరైనవా? కావా? అన్నది మాత్రమే. దీనికి పరిమితమయ్యే పైన చెప్పుకున్న రెండు విధానాలలో ఏదవసరమైతే దానిని తీసుకుని ఆయా ప్రతిపాదనలను విచారించాల్సి ఉంటుంది. 2. అన్య విషయ ప్రస్తావనలు ఎవరు చేసినా, ఆ సందర్భంలో తన పాత్ర విషయంలో మౌనం వహించినా ఆ విచారణాంశం వరకు ఆ పక్షం ఓడిపోయినట్లే నిర్ణయించాలి. 3. విషయాన్ని విచారించే సందర్భంలో ఆత్మస్తుతి - పరనింద అన్న రెండూ అనవసరమైనవే గనుక, వాటిని లేవనెత్తరాదు. దీనికి సంబంధించిన సూత్రం : ఎవరు చెప్పారన్నది విచారణకు అనవసరం. ఏమి చెప్పారన్నదే విచారణీయాంశం. చిన్నవాడు చెప్పినా, పెద్దవాడు చెప్పినా చెప్పింది దేనిని గురించో దాని విషయంలో అది సరిపోతుందా? లేదా పరీక్షించడమే వేదిక దృష్టై ఉండాలి. 4. ఒకే విషయంపై ఇరుపక్షాలలో ఎవరు గానీ, విరుద్ద ప్రకటనలు చేసినా స్వవచన వ్యాఘాతాలంటారు వీటినే. ఆ విషయం వరకు ఆ పక్షం ఓడినట్లే లేదా సరైంది కాదని తేలినట్లే. అదే మరి దైవ గ్రంధంగా చెప్పబడినదాంట్లో ఒక వైరుధ్యం ఉందని తేలిన అది దైవగ్రంధం కానట్లే. 5. ఒక ప్రతిపాదన తప్పని రుజువు చేయాలన్నా, ఒప్పేనని రుజువు చేయాలన్నా చేయాల్సింది ఒక్కటే, ప్రతిపాదన దేనికి సంబంధించిందో అది అలాగే ఉందో లేదో చూడడమే. అంటే ఇద్దరు చూపేది ఒక్కదానినే. ఉన్నదానితో సరిపోతే సరైందంటాము. సరిపోకుంటే సరైంది కాదంటాము. అదొక్కటే తప్పొప్పులు చూసే విధానము. ఓ వేదికలో తప్పనిసరిగా చోటు చేసుకునే అంశాలు - వాటికి చెందిన నియమాలు. 1. ప్రతిపాదనతో మొదలై నిర్ణయం ప్రకటించేవరకు మనం వాడుకునేది భాషనే - కనుక చర్చావేదికకు సంబంధించినంతలో అవసరపడే భాషానియమాలను చర్చా వేదికలోని వారంతా తెలుసుకుని ఉండాలి. 2. అభిప్రాయాన్ని ప్రకటించిన వ్యక్తి, తానాఅభిప్రాయానికి రావడానికి గల కారణాలను గానీ, తన అభిప్రాయం సరైందేననడానికి తగిన ఆధారాలను గానీ తెలుపడానికి మాట్లాడతాడు. దానినే వాదన (ఆర్గ్యుమెంట్‌) అనంటారు. ప్రతిపాదనను 'వాదము' అంటారు. దానిని నిరూపించడానికి చేసేది వాదన. కనుక దీనికి సంబంధించిన నియమాలూ ఉండాలి. వేదికంతటికీ అవి తెలిసుండాలి. వీటిని వాద నియమాలనంటారు. 3. ఇక చివరి అంకం నిర్ధారించడానికి చెందింది. నిర్ణీతలు చేయాల్సింది. వారున్ను ఎవరికి తోచినట్లువారు కాకుండా కొన్ని నియమాలనుసరించే నిర్ణయాలను ప్రకటించాల్సి ఉంటుంది. వీటినే నిర్ధారణ నియమాలు అనంటారు. వీటినిగురించి కూడా వేదికలోని అన్ని పక్షాలకు తెలిసుండడం అవసరం. సరైన నిజనిర్ధారణ వేదిక ఏర్పాటులో 1. భాషా నియమాలు 2. వాద నియమాలు 3. నిర్ధారణ నియమాలు అన్నవి ప్రత్యేకమైనవి. అత్యంత కీలకమైనవి. ఇవి లేకుండా జరిగే వాటిని చర్చలనరు, రచ్చలో, రగడలో అనంటారు అని పౖౖెన నేనన్నాను. ఆనా మాట సబబో కాదో చెప్పండి. చర్చనీయాంశాలుగా సాధారణంగా రెండు విషయాలుంటాయి. వాద బలపరీక్ష, వాది బలపరీక్ష అంటారు వాటిని. వాటిని విడివిడిగా చూడడమే సరళమైన సరైన విధానం. రెంటి విషయాలలోనూ వ్యక్తిగత నిందలు అనవసరం. 1. వాద పరీక్ష చేసే సందర్భంలోనైతే ప్రతిపాదకునికి ఎంత తెలుసు అన్నది అప్రధానంగా ఉంటుంది. ఆ విషయం తెలిసిన ఎవరుగాని, ఎందరుగానీ ఇరుపక్షాల ప్రతినిధులకు సహాయకులుగా ఉండవచ్చు. అట్టి సందర్భాలలో ఒక సమావేశంలో ఆ పక్షాన్ని స్వీకరించినవారు తమ అవగాహనలోపాన్ని గురించి మరింత అధ్యయనానికి సమయం కోరితే ఆ విచారణ వేదికను వాయిదా వేసి, మళ్ళా కూర్చునే వీలుంటుంది. ఎందుకంటే ఇక్కడ వ్యక్తికెంత తెలుసన్నది విచారణీయాంశం కాదు. ఆ విషయం అలా ఉందాలేదా అన్నదే విచారణీయాంశం కనుక. 2. ఇక వాది బలపరీక్షైతే పై విధానానికి పూర్తి వేరైనది. ఇందులో ఎవరి బలాన్ని పరీక్షకు తీసుకున్నామో అతడొక్కడే విచారణకులోను కావాలి. ఇతరుల సాయం తీసుకోకూడదు. పరీక్షకుల పక్షంలో ఎవరైనా ఉండవచ్చు. ఎంతమందైనా ఉండొచ్చు. ఎందుకంటే పరీక్షకునిగా ఉన్నవాడు పరీక్షించలేకపోవడాన్ని బట్టి పరీక్షితుడు బలవంతుడేనని తేల్చకూడదు. కనుక మరెవరైనా ఎంపిక చేసుకున్న అంశం వరకు వాదిని పరీక్షించవచ్చు. పై రెండు సందర్భాలకు అంతటి వ్యత్యాసం ఉంది. చర్చా వేదికలో చర్చనీయాంశం ఏమిటన్నది సుస్పష్టంగా తేల్చుకుని ఉండాల్సిన కీలకాంశమిది. ఇక్కడ గాని స్పష్టత లేకుంటే, ఇక ఆ వేదిక పనికిరాని వేదికన్నట్లే. ఓఫీరుగారూ! చర్చావేదిక నియమ నిబంధనల గూర్చి ముందుగా వేదికలో పాల్గొనే మూడు లేదా నాలుగు సమూహాలలో ఎవరెవరుంటారన్నది నిర్ణయించుకుని, ఆ తరువాత అందరూ కలసే వేదిక నియమ నిబంధనలనూ ఏర్పరచుకోవడం అన్నది ఒక పద్ధతి అలా కాక మన ఇరుపక్షాలే ముందుగా సమావేశమై వేదిక నియమ నిబంధనలను రూపొందించుకుని వేదికలో ఎవరెవరు పాల్గునాలోనూ ఆలోచన చేసి ఒక అవగాహనకు రావడం మరోపద్దతి. రెంటిలో ఏదైనా పరవాలేదు. అస్సలు విషయం ఇరుపక్షాలకు సత్యస్ధాపన జరగాలని ఉందా? లేదా అన్నదే. 1. విచారణీయాంశం మీ రచన హైందవ క్రైస్తవమేగనక ప్రతిపాదన పక్షంలో మీరే ఉంటారు. 2. రెండవ పక్షం - ఇది ఎ) పరీక్షించే వారుగానీ బి) మీ అభిప్రాయాలకు మారుగా భిన్నాభిప్రాయాన్ని ప్రకటించేందుకు సిద్దమైన ప్రతిపక్షం వారుగానీ అన్న రెండు రకాల వ్యక్తులతో ఉంటుంది. అయితే అందులో పాల్గొనే వారికి మీ పుస్తకంలో వారికి తెలిసిన భాగం వరకు మిమ్ము పరీక్షించే లేదా మీకు ప్రతిపక్షంగా ఉండే వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే. సైద్దాంతిక విచారణలో ప్రతిపాదకుణ్ణి ప్రశ్నించే వారిలో ఎవరైనా ఉండవచ్చు. ఎందరైనా ఉండవచ్చు అన్నది విచారణ నియమాలలో కీలకమైనది. అక్కడ మీ ప్రతిపాదన సరైందా కాదా పరీక్షించడమే ప్రధానమై ఉంటుంది గనక, ఒకరు దానిని పరీక్షించలేకపోయినంత మాత్రాన మీ సిద్దాంతం సరైందని తేలనట్లు కాదన్నదే ఆ నియమ సారాంశం. కనుక మరోకరెవరు పరీక్షస్తానన్నా పరీక్షించుకోవచ్చు. అయితే ఇది అనంతంగా సాగిపోకుండా మన వేదిక వరకు పరిమితికి సంబంధించీ ఒక నియమాన్ని ఏర్పరచుకోవచ్చు. నా ఈ అభిప్రాయం సరైందో కాదో కూడా రేపటి నియమ నిబంధనల కొరకై కలిసే సమావేశంలో విచారించుకోవచ్చు. 3. ఇకపోతే మీకు ప్రతిపక్షంగా ఉండి, మీ ప్రతిపాదనను తప్పని నిరూపిస్తానని గానీ, ఒప్పిది అంటూ తానే మరో ప్రతిపాదన చేసినా గానీ, ఆ విషయం వరకు ఆ వ్యక్తి ప్రతిపాదకునిగా పరిగణింపబడతాడు అంటే 1వ పక్షం వాడుగానన్నమాట. అలాంటి సందర్భాలలో మీరు, మిగిలినవారేవరైనా అతనిని 1వ పద్దతి ప్రకారం పరీక్షించనూ వచ్చు. 2వ పద్దతి ప్రకారం ప్రతి పక్షంగాను నిలబడవచ్చు. అయితే ఈ ప్రక్రియ ఇలా అనంతంగా సాగిపోకుండా ఒక పరిమితి విధించుకోవాలి. 

ఇప్పటికి ముగింపు


 నిజానికి చర్చకు సిద్దమన్న మీ లేఖ మీడియాకు చేరి వారి ద్వారా దీనితో సంబంధమున్న వారిందరికీ తెలియపరిచాక, అతిసూటైన ప్రతిస్పందన - బాగుందండీ ఓఫీరుగారు. చర్చకు ముందుగా చర్చావేదిక నియమనిబంధనలు రూపొందించుకోడానికి ఒకసారి కలవాల్సి ఉంది. ఎప్పుడు ఎక్కడ కలుద్దామో చెప్పండి. మాకైతే ఈ యీ తేదీలలో అవకాశం ఉంది. స్థలం భారత్‌ టుడే అయితేనే మంచిది. అన్న ఒక్కముక్క రాసి మాకు చేరిస్తే సరిపోతుంది. కానీ, నేను గమనించినంతలో 99%, 100% అన్న తప్పుకాదేమో డిబేట్‌ల పేరున జరిగినవన్నీ చర్చావేదిక స్వభావం కలిగినవిగానీ, తగిన నియమనిబంధనలతో కూడినవిగానీ కాదు. కనకనే నిరంతర సత్యాన్వేషిననీ, సత్య సంస్ధానాభిలాషిననీ ప్రకటించుకున్న మీరూ, సత్యాన్వేషినని ప్రకటించుకున్న నేనూ, సత్యాన్ని స్వీకరించడానికీ, అసత్యాన్ని విడిచి పెట్టడానికి సదాసంసిద్దులం అంటున్న ఆర్య సామాజికులు, సత్యాన్నాస్తిపరోధర్మః అంటున్న హిందూ ధర్మాచార్యులు, సత్యజ్ఞానం ఆర్జించాలి, పంచాలి అంటున్న జె.వి.వి వ్యవస్ధాపక అధ్యక్షులు డా. బ్రహ్మారెడ్డిగారు లాటివారం వేలుపెట్టి, పట్టుబట్టి పూనుకున్నాంగనక మనమైనా సత్యాసత్యవిచారణ వేదికకు సరైన రూపాన్నివ్యగలిగితే భవిష్యత్తులో జరిగే నిజనిర్ధారణ యత్నాలకు మార్గదర్శిగా, ఆధారంగా ఉండగలుగుతుందన్న ఆలోచనతోనే, ముందస్తుగా నా దృష్టి కొచ్చిన వాటిలో కొన్నింటిని మీ దృష్టికీ, అలానే మా ఈ ప్రతిక ద్వారా ఎంతో మంది దృష్టికీ తేవాలనే వ్యాసాన్నిలా తయారు చేశాను. సత్యాసత్య విచారణకు యోగ్యమైన వేదిక నిర్మాణమే అన్నింటికంటే ప్రాథమికమైనది. కీలకమైనదీ. ప్రధానమైనదున్నూ. కనుక వీలయినంత త్వరలో హిం.ధ. ప్రతిష్టాన్‌వారూ, వారిద్వారా మీ రచనపై స్పందించినవారూ మీరూ నేనూ కలసి కూర్చుని చర్చావేదిక నియమ నిబంధనలు సిద్దం చేసుకోడానికై తేదీని నిర్ణయించి, భారత్‌ టుడే ఛానల్‌ వారి ద్వారా మిగిలినవారినీ ఆహ్వానించండి. నేనూ పాల్గొంటాను. నా వరకు నేను మీ కబురు కొరకై ఎదురుచూస్తాను. దయచేసి అన్యవిషయప్రస్తావనలు చేయకండి. ఎందుకంటే అలాటివి ఎటువైపు నుండి జొరబడ్డా సరైన వేదిక ఏర్పరచడం కష్టమైపోతుంది. 
 సత్యాన్వేషణలో - మీ సురేంద్ర 

Thursday, March 23, 2017

కమ్ముకొస్తున్న యుద్ద మేఘాలు - కిం కర్తవ్యం

ఈ దేశంలో ఏనాడు ముస్లిం లీగ్‌ పురుడుపోసుకుందో, ఆనాడే ఈ దేశ భవిషత్తుకు అభద్రతా పురుడుపోసుకుంది. భారతీయులుగ, ఆంగ్లేయుల్ని ఇటనుండి వెళ్ళగొట్టి అన్నదమ్ములుగ కలిసి ఉండాల్సిన ఈ దేశస్తులు మత ప్రాతిపదికన రెండుగా చీలిపోయారు. ముస్లింలు ఈ దేశంలోని వివిధ దైవ విశ్వాసాలలో, ఒక విశ్వాసానికి చెందిన వారుగా మిగిలిన వారిలా ఇక్కడ కలసి ఉండలేకపోయారు. పైగా ఆనాటికి ఇక్కడున్న ముస్లింలందరూ దాదాపుగా మతం మార్చుకుని ముస్లింలైనవారే. ఈ దేశాన్ని సొంత దేశంగా తలచిన వాళ్ళే కదా! మరెందులా జరిగింది?. కారణమేమిటి? ఈ దేశంలో ఏకేశ్వరారాధకులున్నారు. బహుదేవతారాధకులున్నారు. ఈశ్వరుని విషయంలో ఒక నిర్ణయానికిరాని, రకరకాల విశ్వాసాల వాళ్ళూ ఉన్నారు. అవిశ్వాసులూ ఉన్నారు. వారిలో ఎవ్వరికీ, తమ విశ్వాస మూలకంగా వేరు దేశంగా విడిపోదామన్న ఆలోచన పుట్టనేలేదెన్నడూ. ఈ దేశం అఖండ భారతంగా లేని స్థితిలో, అంటే వివిధ పెద్ద చిన్న రాజ్యాలుగా ఉంటున్న సందర్భంలోనూ విశ్వాస - మత - ప్రాతిపదికన అట్టి రాజ్యాలు ఏర్పడడంగానీ, విశ్వాస ప్రాతిపదికన పాలన జరగడంగానీ జరగనేలేదు. రాజులెవరైనా, రాజ్యాలేవైనా, వివిధ విశ్వాసాల వాళ్ళు వారారాధించే దేవుళ్ళ మందిరాలూ అన్నీ, అంతటా విస్తరించే ఉంటుండేవి. అందరినీ ఆరాధించే వాళ్ళు కొందరైతే, తామంగీకరించిన దేవతామూర్తిని మాత్రమే ఆరాధిస్తూ మిగిలిన విశ్వాసాల పట్ల ఆరాధ్యుల పట్ల ఉదాసీనంగా ఉండేవారు ఇంకొందరు. తమ దైవాన్ని అభిమానిస్తూ ఇతరాలను సరైనవి కావనిగానీ, తమ దైవం కంటే అల్పశక్తిమంతాలని అనిగాని తలుస్తుండేవాళ్లు మరికొందరు. ఇలాటివన్నీ తెలీనివీ, తేలనివీ, జీవితానికి అవసరంలేనివి అనే దృష్టికల రకరకాల ధోరణులవారూ ఈదేశంలో సామరస్య పూర్వకంగా సహజీవనం చేస్తూనే వచ్చారు. అత్యంత ప్రధానమూ, ప్రాధమికమూ అయిన ఈ నిజాన్ని మొదట గుర్తించాలి మనమంతా.

సైద్దాంతిక స్థాయిలో ఆ స్థాయి కలవాళ్ళమధ్య వాద వివాదాల రూపంలో పరస్పర విభేదాలుంటున్నా, సాధారణ ప్రజలంతా ఆ వివిధ సైద్దాంతికులందరినీ పెద్దలు - జ్ఞానులు - గానే విశ్వసించి గౌరవిస్తూనే ఎవరికి వారు, తమకు నచ్చిన ధోరణిని యధాశక్తి అనుసరిస్తూ, అందరూ సామాజికంగా సామరస్యంతో సహజీవనం సాగిస్తూ వచ్చారు.

ఈ సంస్కృతి - ఈ దేశ సంస్కృతిగా ఇక్కడి వారికి నరనరాన జీర్ణించుకుని అలవాటుగా మారి ఉంది కనుకనే చక్కగా కొనసాగుతూ వచ్చింది. ఏనాడైతే ఈ దేశంలో క్రైస్తవం అడుగుపెట్టిందో ఆనాటి నుండే 1) అటు క్రైస్తవంలోకి పోయినవారూ, వీరిని అటు లాక్కెళ్ళిన వారూ 2) తమ నుండి క్రైస్తవంలోకి వెళ్ళిన వారిని మతం మార్చుకున్న వారినిగానూ, విదేశీ మతాన్ని స్వీకరించిన వారినిగా, తలంచుతున్న ఇక్కడి నానా విశ్వాసాల వారూ కూడా పరస్పరం పరాయిభావనతో తమవారు, పరాయివారు అన్నదృష్టితో చూసుకోవడం ప్రారంభించారు. అందుకు బలమైన కారణం క్రైస్తవ్యానికి ఆధార గ్రంథంగా ఉన్న బైబిలు వాక్యాలలోనే, స్వజనులు - అన్యజనులు అన్న భావన బలంగా ప్రతిపాదింపబడి ఉండడమే. పైగా అందులో ఎహోవాను తప్ప అన్యులను ఆరాధించరాదన్న ఆదేశాలూ, బహుదైవారాధకులు, విగ్రహారాధకులు అవిశ్వాసులుగానూ, సాతాను పక్షం వారిగనూ, శతృవులుగానూ చూడాల్సిందే నన్న ఆదేశాలూ ఉండడం వల్లనూ, బైటికి ఇరుగుపొరుగుగా కొనసాగుతున్నా, లోలోపల మాత్రం బైబిలు విశ్వాసం ఎంత బలంగా ఉన్నదన్న దాన్ని బట్టి అంతగానూ క్రైస్తవేతరుల పట్ల వ్యతిరేకత పేరుకుంటూనే వచ్చింది. అయినా, అప్పట్లో, క్రైస్తవులు తమకంటూ ప్రత్యేక రాజ్యం ఉండాలన్న వైఖరిని కనబరచలేదు. ఈ నిజాన్ని చాలా స్పష్టంగా గమనించారు కనుకనే ఒక హిందువు మతం మార్చుకోవడమంటే హిందువు ఒకడు తగ్గడం కాదు. హిందూ వ్యతిరేక - శతృవు - ఒకడు పెరగడమని అర్ధం. అన్నాడు వివేకానంద.

ఇదంతా ఒక అంకం కాగా, భారత స్వతంత్ర పోరాటం ఒక ముగింపు దశకు చేరుకుంటున్న దశలో ముస్లింలంతా వేరుగా ఉండడానికే - ముస్లింలలోని బలమైన వర్గం సిద్దపడడం, అన్నది మరో స్వభావం కలిగిన ఇంకో అంకం. వారెందుకని అలాటి నిర్ణయం తీసుకున్నట్లు...?!

ద్విజాతి సిద్దాంతం అంటే రెండు మతాలననుసరించి, రెండు సమూహాలుగా దేశ ప్రజలను విడదీసే సిద్దాంతం - తెరపైకి బలంగా ముందుకొచ్చి, ఆ ప్రాతిపదికనే, ఒక్కటిగా ఉండాల్సిన దేశం రెండుగా విడివడింది అదీ ఎలా?

ముస్లింలు ఒక్కరూ ఒక జాతి, భారత దేశంలో మిగిలిన వారందరూ ఒక జాతి. హిందూ - ముస్లిం అన్న పేరున్నే, ద్విజాతి సిద్దాంతం ప్రబలంగా ముందుకొచ్చింది. ఇదెంతటి విడ్డూరం? విషాదకరం? అవివేక జనితం? ఆనాటి ఆ స్వార్ధపరులైన మేధావుల తప్పుడు నిర్ణయం యొక్క ఫలితాలను గత డెబ్బై ఏండ్లుగా అనుభవిస్తూనే వచ్చిందీ దేశం. ఈనాటి ఉద్రిక్త పరిస్థితీ, ఆ ద్విజాతిలోని ముస్లిలంతా ఒకేజాతి అన్న ప్రాతిపదికనుండే తన్నుకొచ్చింది. ఈనాడున్న జనాభాను బట్టి ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతంలో ''జనాభిప్రాయ సేకరణ (ప్లెబిసైట్‌) ప్రకారం నిర్ణయించుకుందాం'' అన్న కుట్రపూరిత వాదాన్ని ముందుకు తెస్తోంది పాకిస్తాన్‌. దానికి ఈ దేశంలోని మతిమాలిన అదోరకం మేధావి వర్గం (అమ్ముడుపోయిన అందామా?) వంతపాట పాడుతూ వస్తోంది.

నిజానికిది పాక్‌ భారత్‌ దేశాల సమస్య కానే కాదు. కాశ్మీర్‌ - భారతీయుల అంతర్గత సమస్య మాత్రమే. అయితే రష్యా, అమెరికా, చైనాలు వాటిమధ్య నెలకొనిఉన్న వాస్తవ పరిస్థితులు దృష్ట్యా, భారత్‌ - పాక్‌లతోనూ, అలాటి మరికొన్ని దేశాలతోనూ రాజకీయ ప్రయోజనాల రీత్యా, తమ ప్రాబల్యం నిలుపుకోవడానికి కొరకై శత్రుమిత్ర, అలీన వైఖరిని అవలంభిస్తూ వచ్చాయి. వస్తున్నాయి. భారత్‌ - పాక్‌ సరిహద్దు సమస్య ఒక కొలిక్కి రాకుండా, రావణ కాష్టంగా రగులుతుండడానికి అంతర్జాతీయ సంబంధాలు న్యాయ బద్దంగా లేకపోవడమూ ఒక కారణమేనన్నది చాలా ముఖ్యమైన అంశం. అంటే ఒక ప్రాంతంలో అధిక జనాభాగా ఉన్నవారు కోరితే (దేశాన్ని ముక్కలు చేయవచ్చన్నమాట! చేయాల్సిందేనన్నమాట! క్రైస్తవులంతాగానీ, సిక్కులంతాగాని అధికాధికంగా ఒక ప్రాంతానికి చేరి మైనారిటీ ప్రజాభిప్రాయం ప్రకారం తాము అఖండ భారత్‌ నుండి విడిపోతామంటే, అంగీకరించి వారినీ వారి ప్రాంతాన్ని విడగొట్టి ఉండండనాలన్న మాట. ఎంత వికృతమైన ఆలోచన ఇది? భారత్‌ రాజ్యాంగ స్ఫూర్తికి ఎంత విరుద్దమైన మాట ఇది?! ఎంత మంది కోరినా దేశాన్ని ముక్కలు మాత్రం చేయనేకూడదు.

ఈ దేశంలోని క్రైస్తవులకుగాని, ముస్లింలకుగానీ, తెగ ఎదిగిన వాళ్ళమంటుండే అనుకుంటుండే వామపక్ష, నాస్తిక, హేతువాద మేధావులకుగానీ ఇంత ప్రమాదకర సమస్య నెత్తిమీది కొచ్చికూర్చున్నా, అసలు సమస్యగానే కనపడదెందుకని? ఈ దేశ ముస్లింలు భారతీయులుగారా? వారికి ఈ దేశం పట్ల ప్రేమ, దేశ భద్రత పట్ల ఆందోళన ఉండక్కర లేదా? వారెందుకని ఏ కోన్ముఖంగా హమారా భారత్‌ మహాన్‌ అని ఎలుగెత్తి నినదించరు? జాతీయ పతాకానికి నమస్కరించడం తమ మత విశ్వాసానికి విరుద్దమంటూ ఏవేవో అడ్డగోలు వాదనలు చేయడమెందుకు?

దేశాన్ని ప్రేమించడానికీ, జాతి ప్రతీకలను గౌరవించడానికీ, ''అల్లా తప్ప ఆరాధ్యుడు లేడు'' అన్న సూక్తిని తెచ్చి అడ్డుపెట్టుకోవడమెందుకు? తండ్రికి నమస్కరించమా? తల్లికి నమస్కరించమా? పెద్దలకు నమస్కారమనమా? యజమానికీ, మిత్రులకు సలామనమా? ఇందరికి సలామనగాలేంది, దేశానికి, దేశ ప్రతీకలకు సలాం అనడం దగ్గరే 'అల్లా' ఎందుకు అడ్డొస్తున్నాడు? దేశాన్ని, పెద్దలను, దేశ ప్రతీకలను గౌరవించడాన్ని, అల్లాకంటే వేరైన వాటిని ఆరాధించడం అన్న తప్పుడు వివరణతో వ్యతిరేకించడమెందుకు? ప్రేమించడాన్ని - ఆరాధించడంగా తప్పుడు అర్ధాన్ని పులమడమెందుకు? ఒక ముస్లిం మక్కాను పవిత్ర స్థలంగా చూస్తాడా? లేదా? దానిని ప్రేమిస్తాడా, లేదా? అక్కడున్న నల్లబండను ఇతర బండలకంటె వేరుగా తలచుతాడా లేదా? అలాగే ప్రవక్తను ఇతర మనుషుల కంటె వేరుగా చూస్తాడా, లేదా? అతణ్ణి కుటుంబీకుల కంటె అధికంగా ఇష్టపడతాడా, లేదా? గౌరవిస్తాడా లేదా? విధేయత కనపరుస్తాడా, లేదా? నా కంటె ఈ లోకంలో నీకు అధిక ఇష్టుడుండరాదన్న ప్రవక్త మాటనేమి చేద్దాం? కనుక అల్లాను, ఖురానును చూపించి, రాజ్యాంగం పట్లా, ఈ దేశం (ఉంటూ, తింటూ) పట్లా; దేశ ప్రతీకల పట్లా విధేయతను కనపరచకపోవడం తప్పుడు పోకడే అవుతుందెవరికైనా.

ఈ దేశంలో పుట్టి, ఇక్కడే, పెరుగుతూ ఉన్న ఎవరికైనా ఈ దేశాన్ని ప్రేమించాల్సిన అవసరం ఉందా? లేదా? అది వారి విధి కాదా? కర్తవ్య కర్మ కాదా? ఈ దేశం కంటే మక్కానో, ఈ దేశంకంటే బెత్లహాంనో, రోంనో, మరో దాన్నో అధికంగా ప్రేమించే వారినేమనాలి? ఏమనుకోవాలి. వాటి యందలి వీరాభిమానం వల్ల, ఈ దేశానికి అపకారం చేయడానికీ వెనకాడని, సిద్దపడే వారిని, ఈ దేశస్ధులుగా ఎలా చూడాలి? అట్టి వారి పట్ల ఎలా ప్రవర్తించాలి? మిత్రులారా! నా ఈ మాటలు ఆవేశాన్ని రేకెత్తించేందుకు వాడుతున్నవికావు. ఆవేశంతో లోలోపల శివాలెత్తిపోతున్న వారి ఆవేశాలను అదుపులోకి తేవడానికి ఉద్దేశించినవి మాత్రమే.

రాజ్యాంగ ప్రస్తావనలో దేశం సమైక్యంగా, అఖండంగా, సమానత్వం లక్ష్యంగా ముందుకు సాగాలని లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నామో? అదంతా పుస్తకాలకు పరిమితమైందేనా? ప్రతి భారత పౌరుడూ, కుల, మత, ప్రాంత, లింగ, వర్గాలకతీతంగా పై లక్ష్యసాధనకు త్రికరణ శుద్దిగా తనవంతు విధిని నిర్వర్తించాలావద్దా? ఎట్టి గుంజులాటలూ లేకుండా తెల్చి చెప్పాల్సిన అంశమిది.

దేశం ఏమైపోయినా పరవాలేదు అనుకునే వారి పట్ల రాజ్యాంగ స్ఫూర్తిని అర్ధం చేసుకున్న వాళ్ళు ఎలా ప్రవర్తించాల్సి ఉంది? అలాటివారిని, ఉంటే దేశం పట్ల, రాజ్యాంగ నిర్ధేశాల పట్లా విధేయత కలిగి ఉండండి. లేకుంటే మీ ఇష్టమొచ్చిన చోటికి వెళ్ళిపోండి. అదిన్నీ ఇప్పటి వరకు దేశం నుండి మీరు పుచ్చుకున్న దాన్ని లెక్క చూసుకుని తిరిగి ఇచ్చేసి వెళ్ళండి. ఒక వేళ మీలో ఎవరు గానీ దేశానికే అదనం ఇచ్చి ఉంటే అదంతా తీసుకునే వెళ్ళవచ్చు అంతేకాని, దేశాన్ని ఇష్టపడకుండా, దేశం పట్ల మీ వంతు కర్తవ్యాన్ని స్వీకరించకుండా, మరో దేశాన్ని ఇష్టపడుతూనో, మరో దేశపు ఆదేశాలను పాటిస్తూనో ఇక్కడే ఉండడం తిన్న, తింటున్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం లాటిదే. ఆ వైఖరి దేశభక్తి లేకపోవడాన్ని మాత్రమేకాక, దేశద్రోహి లక్షణం కలిగుండడాన్నీ సూచిస్తుంది. దేశ ద్రోహులుండడాన్ని ఏ దేశమూ సహించదు. సహించకూడదు.

ఈ సందర్భంలో మరొక్కమాట చెప్పుకుంటేనే ఈ వ్యాసానికి నిస్పాక్షికత సిద్దిస్తుంది. తమ తమ మత విశ్వాసాలను వ్యక్తిగతమైనవిగా భావించి, దేశం విషయంలో, దేశానికిగాని రాజ్యాంగాశయానికి గానీ, దేశ ప్రజలకుగానీ, ఎటువంటి ఆపద వచ్చినా లేదా వస్తుందనుకున్నా ఆ సందర్భాలలో దేశ రక్షణకు, భద్రతకు ప్రధమ గణ్యతనిచ్చి దేశం కోసం, దేశం కోసమే స్ధిరంగా నిలబడే వాళ్ళు, దేశం పక్షాన మాట్లాడే, పనిచేసేవాళ్ళు అన్ని మతాల, ధోరణుల వారిలోనూ కొద్దిమంది ఉన్నారు. అలాటి వారు ప్రతి దేశంలోనూ, ప్రతి కాలంలోనూ ఉంటూనే ఉంటారు. మనం అట్టి వారిని చూపి సమస్య వాస్తవ పరిస్థితిని, తీవ్రతను చిన్నది చేసే పని చేయనే కూడదు. ఆయా సమూహాలలో సింహభాగం - మెజారిటీ - వైఖరి ఎలా ఉందన్నదే పరిగణనలోకి తీసుకుంటుండాలి. కనుక ఈ దేశం కోసం ప్రాణాలివ్వడానికి సిద్దంగా ఉండే, ముస్లిం, క్రైస్తవాది సకల ధోరణులలోని అతికొద్ది మందిని ఆధోరణికి ప్రతీకంగా చూడనేకూడదు. అట్టి వారి ప్రవర్తనను, ఆ ధోరణి వారి ప్రవర్తనకు రుజువుగా చూపనేకూడదు. నిజానికి ఆ రకం కొద్ది మంది ఆ మత ధోరణికి చెందిన మనస్సుకంటే, ఉన్నత మానసిక స్థితిలో ఉన్నవారే. కనుక వారిని హిందువు కనక దేశభక్తుడు, ముస్లిం కనక దేశభక్తుడు, క్రైస్తవుడు కనక దేశభక్తుడు అనో అననే కూడదు. అట్టి వారంతా మత విశ్వాసాలకతీతంగా 'దేశభక్తులు' అన్న నిజాన్ని మనం గమనించాలి. ఈ వ్యాసం ద్వారా నేను చెప్పాలనుకుంటున్నది 130 కోట్ల భారతీయులు తమ తమ మతాల, విశ్వాసాలకతీతంగా, దేశభక్తులుగా ఉండాలని, ఉండి తీరాలన్న ఒకే ఒక్క వాస్తవాన్నే. నిజానికి ''దేశానికన్నమిన్న లోకాన లేదురా'' అన్న ఓ కవి అద్భుత భావన ఈ దేశస్తులకు మాత్రమే వర్తించేది కాదు. కాకూడదు. నిజానికి, ఆ భావన సార్వత్రకమైన విలువ కలిగినది అంటే ఏ కాలంలో, ఏ దేశంలో ఉన్న ఎవరికైనా సమానంగా వర్తిస్తుంది. అంత విలువైన మాట అది. దాని అన్వయాన్నిలా చెప్పుకోవచ్చు.

అమెరికా పౌరసత్వాన్ని పొందిన ఏ మతస్థుడు గానీ, గతంలో అతడెక్కడున్నవాడైనా, ఎక్కడనుండి అమెరికా చేరి పౌరసత్వం పొందిన వాడైనా, పౌరుడైన నాటి నుండి ప్రపంచంలోని మిగిలిన ఏ దేశం కంటేనూ అమెరికానే అధికంగా ఇష్టపడాలి. అమెరికా అభివృద్దికీ కృషి చేయాలి. అమెరికా తరఫునే నిలబడాలి. అమెరికాను కాదని మరే దేశానికీ అనుకూలంగా ప్రవర్తించనేకూడదు. ముఖ్యంగా అమెరికా ప్రతికూల - శత్రు- సంబంధాలున్న దేశాలతో. ఇది నిజమా? కాదా?

ఇదే సూత్రం ఎవరికైనా వర్తిస్తుంది. పాకిస్తాన్‌లో ఉండే ఒక హిందువు అంటే హిందూమతంలోని ఏదో విశ్వాసాన్ననుసరిస్తున్న వాడు, పాకిస్తాన్‌కు - భారత్‌కు విభేదాలు పొడచూపితే పాకిస్థాన్‌ తరపునే నిలబడాలి. పాకీస్థానీగానే అతడు తన బాధ్యతలు నిర్వర్తించాలి. పాకీస్ధాన్‌ను ప్రేమించాలి. దానికి విరుద్దంగా ఆ దేశంలోని ఎవరు ప్రర్తించినా అది దేశ వ్యతిరేకమైనదీ దేశ ద్రోహ చర్యే అవుతుంది. అట్టి వైఖరిని మేధావులెవరు అంగీకరించరు. అంగీకరించకూడదు. ఏ దేశమూ తన దేశ పౌరసత్వం కలిగిన వ్యక్తులు, తనకు వ్యతిరేకంగా, మరో దేశానికి అనుకూలంగా ఉండే వైఖరిని అంగీకరించదు, సహించదు, అంగీకరించకూడదు. సహించకూడదు.

సర్వ సాధారణమైన ఈ సూత్రం అర్ధమైతేనే గాని అదే సరైనదని అంగీకరించితేనే గాని ఈ దేశంలోని, ఏ దేశంలోని- ఎవరు గాని ప్రవర్తిస్తున్న తీరు సరైందో కాదో నిర్ణయించడం సాధ్యపడదు.

ఈనాడు ఒక వ్యక్తి, అతడే దేశానికి చెందినవాడైతే, మునుముందుగా అతడా దేశపౌరుడు. అతనిపై ఆ పౌర బాధ్యతలుంటాయి. ఆ బాధ్యతల్లో, విధులను నిర్వర్తిస్తుండడం, హక్కులను పొందుతుండడం - కర్తవ్య కర్మలను నిర్వర్తిస్తుండడం అన్న మూడు చేరి ఉంటాయి. (హక్కులు - విధుల, బాధ్యతలు అన్న మూటినీ కర్తవ్య కర్మల క్రింద పేర్కొనీ వాస్తవాన్ని అర్ధం చేసికోవచ్చు. ఇక్కడ వివాద పడాల్సినంత అవసరం లేదు) ఆ తరవాతనే మిగిలిన ఏ విషయాలను గానీ పరిగణనలోకి తీసుకుంటుండాలి. అది - ఆ వైఖరిని - వ్యక్తులు స్వీయ నియంత్రణ కలవారై (స్వతంత్రులై) అనుసరించగలిగితే అట్టి సమాజాన్ని ఉత్తమ (వివేకవంతమైన) సమాజం అంటాము. అట్టి స్థాయిలేని వ్యక్తులున్న సమాజంలో వ్యక్తులు పరనియంత్రణ వల్లనైనా (వ్యవస్థ అదుపులో నుండైనా) అలాగే ప్రవర్తించాల్సి ఉంటుంది. అప్పుడే సమాజం ఒక క్రమంలో ప్రశాంతంగా, అలజడులు లేని వాతావరణంలో సాగగలుగుతుంటుంది.

అత్యంత ప్రాథమికమూ, ఏ దేశానికైనా వర్తించే సర్వ సాధారణమూ అయిన ఈ సూత్రాన్ని, మన ప్రస్తుత దేశ సమస్యకు వర్తింప జేస్తే దాని ఆచరణ రూపంఎలా  ఉండాలి?

మును ముందుగా ఈ దేశంలోని 130 కోట్ల మందీ ఈ దేశ పౌరులు. అంటే భారతీయులు. అలాగే, ఈ దేశం ఏర్పరచుకున్న ప్రజాస్వామ్య విధానాన్ననుసరించి ఈ దేశ సంపద విషయంలోనూ, వ్యవహారాల విషయంలోనూ యజమానులు, యాజమాన్యపు భాగస్వాములు. సొంతదారులన్న మాట. యజమానితనానికి మూడు ప్రధాన లక్షణాలుంటాయి. సంపదపైనా, అది పుట్టించే ఫలితాల విషయంలోనూ -1) నిర్ణయాధికారము 2) పర్యవేక్షణాధికారము 3) లాభనష్టాలకు బాధ్యుడైయ్యుండడము.

గమనిక  : ఈ సందర్భంలో భారత స్వాతంత్రోద్యమ చరిత్రను రచించిన, ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్యగారి మాటలు నిరంతరం స్మరించదగినవిగా, స్పురణలో ఉంచుకోదగినవిగ నా కనిపించాయి. ''40 సం|| కాలం స్వాతంత్య్ర యోధులు చేసిన త్యాగాల మూలంగా మనకు స్వతంత్రం వచ్చింది. వారు మనకు చిరస్మరణీయులు. వారు సాధించి పెట్టిన స్వాతంత్య్రాన్ని నిలబెట్టడం మన ప్రథమ కర్తవ్యం. గతంలో మనలో జాతీయ భావమూ, సమైక్యతా లేని కారణం చేత స్వాతంత్య్రాన్ని పోగొట్టుకుని అష్టకష్టాలను అనుభవించాము. భవిష్యత్తులో మనకు, మన దేశానికీ, అలాటి ప్రమాదం లభించకుండేట్లు మనమూ, భావితరములవారూ ప్రవర్తించడం అవసరం. నా గ్రంధం మూలంగా మనం నేర్చుకొనవలసిన గుణపాఠం ఇదే. ఇందుకుగానే, నేనీ గ్రంధాన్ని వ్రాశాను.

మిత్రులారా! ఇదే ఈవ్యాసం ద్వారా నేను చెప్పాలనుకున్నదీ. జాతీయ భావము, దేశ సమైక్యత అన్నదే దేశభద్రతకూ దేశాభివృద్దికీ ఆధార శ్రోతస్సులు. ఆ రెండూ ఉన్న వారే ఇక్కడ ఉండడానికి అర్హులు, ఈ దేశ సంపద విషయంలో న్యాయ బద్దమైన భాగస్వాములూ కాగలరు.

గతాన్ని తవ్వుకోవడం అనవసరం. అయితే, గతాన్ని యథాతధంగా గుర్తించకున్నా, గుర్తుంచుకోలేకున్నా, సరైన భవిష్యత్తుకు దారులు వేసుకోలేము. ఈ దేశంలో మతం ఆధారంగా ఏర్పడ్డ ద్విజాతి సిద్దాంతం, దాని వల్ల ఇక్కడ జరిగిన దారుణ మారణ కాండలను గమనికలోకి తీసుకోకుంటే, వర్తమాన పరిస్థితుల్లో అంటే మళ్ళీ మతం - రాజకీయంతో కలసి వికృత వేషాలు వేయడానికి ఎత్తుగడలు వేస్తున్న పరిస్థితుల్లో, ఏ నిర్ణయం, ఎలాటి నిర్ణయాలు భారత దేశ శ్రేయస్సుకు సరళమైన దారి చూపించగలుగుతాయో అలాటి నిర్ణయాలు తీసుకోలేము. నాకు తెలిసి ఆ పనిని సమర్ధవంతంగా చేయగలిగింది, జాతీయ భావనొక్కటే. మనమంతా ఎంతో ప్రమాదకరమైన మతపరమైన జాతి భావన నుండి బైటపడి, దేశపరమైన అంటే రాజ్యాంగ బద్దమైన జాతీయ భావన, సమైక్యభావన దగ్గర నిలబడి, ముక్త కంఠంతో, ఒకే గొంతుతో మేమంతా భారతీయులం, మా జాతి భారత జాతి, మా దేశం సమైక్య భారతదేశం అని కట్టకట్టుకుని నినదించాలి. కటిబద్దులమై ఒక్కటిగా నిలవాలి. అదొక్కటే మన మధ్యనున్న అంతర్గత వ్యత్యాసాల ప్రభావం నుండి మనల్ని నిలువరించి సమైక్యంగా ఉంచగలుగుతుంది.

అంబేద్కర్‌ - వాల్యూం - 8 (భారత దేశ విభజన)లో, జాతీయ నిస్పృహ అన్న వ్యాసంలో ''మీ దేశానికి ఎలాటి మహోన్నత భవితవ్యం ఉండాలని కోరుకుంటావు? అని ఏ భారతీయుణ్ణి అయినా అడిగారనుకోండి. జవాబు ఏమై ఉంటుంది?

ఈ ప్రశ్న ముఖ్యమైనది. జవాబు ఉద్బోధకంగా ఉండకతప్పదు.

ఇతర విషయాలన్నీ సమతూకంగా ఉండి, తన దేశమంటే గర్వపడే నికార్సయిన భారతీయుడు ''సమైక్య స్వతంత్ర భారత దేశమే నా ఆదర్శం, అదే భారత భవిష్యత్‌కి కావాలి'' అని అంటాడు. (ఇదెంతనిజమో) హిందువులూ, ముస్లింలూ ఉభయులూ కూడా ఇలాటి భవితవ్యమే ఉండాలని అనుకుంటే తప్ప ఈ ఆదర్శం ఒక పవిత్ర కామనగానే మిగిలిపోతుందన్న మాటా అంతే నిజం. అలా తప్ప దీనికి కార్యరూపం కార్యరూపం ఎన్నటికీరాదు. ఇది ఏదో కొందరి పవిత్రాశయం మాత్రమేనా లేక యావన్మందీ నడుం కట్టి సాదించాల్సిన లక్ష్యమా? 1993 ముద్రణ పే. 259 - సంపు(8)

నిజం చెప్పాలంటే బ్రిటీష్‌ వాళ్ళ నుండి స్వాతంత్య్రం సాధించడంతోనే (మనపని) అయిపోదు. ఆ స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకోవడమనేకర్తవ్యం ఇంకా ముఖ్యమైనది (మిగిలే ఉంటుంది.) అయితే ఈ ముఖ్యమైన కర్తవ్యం మ్మీదే ఏకాభిప్రాయం ఉన్నట్లులేదు. ఏమైనా, ఈ విషయానికి సంబంధించి ముస్లింల వైఖరి అంత నమ్మకం కలిగించేట్లులేదు. భారత దేశ స్వాతంత్య్రాన్ని నిలబెట్టాలన్న కర్తవ్యాన్ని తమనెత్తిన మోపుకోమని ముస్లిం నాయకులు శతదా చేస్తున్న ప్రకటనల ద్వారా విశదమవుతూనే ఉందీ విషయం.

సిల్హేట్‌లో 1939 జనవరి 27న మౌలానా అజాద్‌ శోభానీ చేసిన ఉపన్యాసంలోని భావాలు కూడా శ్రద్దగా గమనించదగినవి. ఒక మౌలానాగా రడిగిన ప్రశ్నకు జవాబుగా శోభాని ఇలా అన్నారు.

''ఈ దేశం నుంచి ఇంగ్లీషు వాళ్ళను తరిమెయ్యాలని చెప్పే ప్రముఖ నాయకుడెవరన్నా ఉన్నాడనంటే అది నేనే. అయినా ముస్లింలీగు నుండి ఇంగ్లీషు వాళ్ళతో పోరు ఉండకూడదని నా అభిప్రాయం. మనం చెయ్యాల్సిన పెద్దయుద్దం 22 కోట్ల హిందూ శత్రువులతోనే... వాళ్ళుగాని శక్తి సంపన్నులైతే ముస్లిం భారత్‌ని, క్రమేపీ ఈజిప్టుని, టర్కీని, కాబూల్‌ మక్కాల్ని, మదీనాని, యాజూజ్‌ మాజూజ్‌ లాటి ఇతర ముస్లిం మతాల్ని కబళించేస్తారు. (ఖురాన్‌లో ఉంది ప్రపంచ ప్రయళయం సంభవించడానికి ముందు వాళ్ళు భూమ్మీద ప్రత్యక్షమై దొరికిందాన్ని దొరికినట్లు మింగేస్తారట)

''ఇంగ్లీషు వాళ్ళు రాను రాను శుష్కించిపోతున్నారు. వాళ్ళురేపోమాపో భారతదేశం నుండి వెళ్ళిపోతారు. అందుచేత మనం ఇస్లాంకి బద్ద శత్రువులైన హిందువులతో పోరాడి వాళ్ళని బలహీన పరచకపోతే వాళ్ళు భారతదేశంలో రామరాజ్యం స్థాపించడమేకాదు, క్రమేపీ భూమండలమంతా వ్యాపిస్తారు. హిందువుల్ని బలోపేతుల్ని చేయడమో లేక నిర్వీర్యులను చేయడమో అనేది 9 కోట్ల మంది ముస్లింల మీద ఉంది. అంచేత హిందువులు ఇక్కడ స్థాపితం కాకుండా, ఇంగ్లీషువాళ్ళు నిష్క్రమించిన వెంటనే ముస్లిం పాలన స్థాపితమయ్యేందుకుగాను, ముస్లింలీగులో చేరి పోరాడడం ప్రతి పవిత్ర ముస్లింకీ తప్పనిసరి కర్తవ్యం.

''జాగ్రత్త! కాంగ్రేసులో ఉన్న మౌల్వీల వలలో పడకండి. ఏమంటే 22 కోట్ల హిందు శత్రువుల చేతిలో ముస్లిం ప్రపంచం ఎన్నటికీ భద్రంగా ఉండలేదు.'' ఇది మౌలానా అజాద్‌ శోభాని ఇచ్చిన ఉపన్యాసంలోని భావాలు.

శ్రీమతి అనిబిసెంట్‌ ముస్లిం సమస్యపై ఇలా అంటున్నారు.

''ఖిలాఫత్‌ ధర్మయుద్దాన్ని ప్రోత్సహించడం వల్ల భారతదేశానికి పెద్ద దెబ్చే తగిలింది'' విశ్వాస రహితులకు వ్యతిరేకంగా ముస్లింల మనోగత భావాలలో ద్వేషం ఉబికింది. గడచిన సంవత్సరాలలో మాదిరే లజ్జారహితంగా, నగ్నరూపంలో ఉందా ద్వేషం. ప్రత్యక్ష రాజకీయాలలో చోదకంగా పాత ముస్లిం కరవాలం మళ్ళీ ఊపిరి పోసుకోవడం చూశాం... జాజిరుత్‌ - అరబ్‌ అంటూ, అరేబియా ద్వీపాన్ని పవిత్ర భూమిగా చాటడం చూశాం... ఆఫ్ఘన్లు గనక భారత దేశం మీదికి దాడిచేస్తే, తమ మతస్తులు వాళ్ళతో చేతులు కలిపి, ఆఫ్ఘన్లకు వ్యతిరేకంగా దేశరక్షణకు పోరాడే హిందువుల్ని హతమారుస్తామని ముస్లిం నాయకులు చాటడం విన్నాం.

ముసల్మాన్లు మౌలికంగా తమ మాతృదేశానికి కాక, ఇస్లాం దేశాలకు విధేయంగా ఉంటారన్న దాన్ని చూడక తప్పలేదు. వాళ్ళకు ప్రాణప్రదమైంది దేవుని రాజ్యాన్ని స్ధాపించడం అని మనకు తెలియవచ్చింది. ఆ దేవుడు లోకపితగా సర్వప్రాణుల్ని ప్రేమించే దేవుడు కాదు. ప్రవక్తల ఆదేశాల ద్వారా ముసల్మాన్‌ కళ్ళద్దాల గుండా కనిపించే దేవుడు.

''తాము వశిస్తూ ఉన్న రాజ్యచట్టాన్ని మించి ఆఫలాన ప్రవక్త బోధనల్ని మన్నించాలని ముసల్మాను నాయకులు చేసే ప్రతిపాదన పౌరక్రమ శిక్షణకు, రాజ్య స్థిరత్వానికీ నాశనకరం (భంజకం) దాని వలన వారు దుష్ట పౌరులవుతారు. ఏమంటే వాళ్ళ భక్తి ప్రపత్తులు దేశం వెలుపట ఉన్నవాటి పట్ల ప్రదర్శితమవుతాయి.''

''భారతదేశంగనక స్వతంత్య్రమైతే, జనాభాలో ముస్లిం విభాగం భారతదేశ స్వాతంత్య్రానికి ప్రత్యక్షంగా ప్రమాదకరమవుతుంది. ఎందుకంటే, అజ్ఞానులైన ముస్లిం జనసమూహం ప్రవక్త పేరుతో తమకు విజ్ఞప్తి చేసేవాళ్ళ వెనకాలే పడిపోతుంది గనుక.... వారంతా భారతదేశాన్ని ఇస్లాం పాలన క్రిందికి తేవడానికే ఉద్యుక్తులవుతారు.

''యథార్ధానికి చాందస ముస్లింలు పాలించే దేశాల్లో ముస్లిం శాఖీయులకీ భద్రత లేదు. షియాలు, సున్నీలు, సూఫీలు, బాహేలు బ్రిటీషు రాజ్యంలోనే హాయిగా ఉండగలరు.''

2) లాలాలజపతిరాయ్‌ సి.ఆర్‌.దాస్‌కు రాసిన లేఖలోని అంశాలు.

''ఈ మధ్య హిందూ ముస్లిం జోక్యం అన్న అంశం నన్ను అతిగా కలవరపెడుతోంది. గత ఆరు నెలలుగా ముస్లిం చరిత్ర, ముస్లిం ధర్మశాస్త్రం అధ్యయనానికే ఎక్కువ వ్యవధిని ఖర్చుపెట్టాను... వాళ్ళ మతం ఐక్యానికి గట్టిగానే అడ్డంగా ఉంటుందని పిస్తోంది. హాకింసాబ్‌ కంటె మంచి మహమ్మదీయుడు హిందూస్తాన్‌లో ఎవరూలేరు. కానీ ఏ మహమ్మదీయుడైనా ఖురాన్‌ను ఎదిరించగలడా? ఇస్లాంమతన్యాయం నాకర్దమైన పద్దతి తప్ఫైతే బాగుండుననినేనాశిస్తున్నాను... హిందూస్థాన్‌ని ప్రజాస్వామ్య పద్దతిలో పాలించడానికి మనం ఐక్యంకాలేము. మరైతే దీనికి మందేమిటి?...

హిందూ ముస్లింల మధ్య ఐక్యత అవసరం లేదా వాంఛనీయం అని నేను మనస్ఫూర్తిగా, గుండె మీద చేయి వేసుకుని విశ్వసిస్తున్నాను.... కానీ ఖురాన్‌, హజీలు విధించే అనుశాసనాల మాటేమిటి? ముస్లిం నాయకులు వాటిని కాదనలేరు.

3) 1924లో రవీంద్రనాధ్‌ ఠాగూర్‌తో జరిపిన ఇంటర్వ్యూలో...

హిందూ ముస్లిం ఐక్యత అసంభవం అని కవిగారి అభిప్రాయం. మహమ్మదీయులు ఏ ఒక్క దేశానికీ తమ దేశభక్తిని పరిమితం చేయలేరు అన్నదే ఠాగూర్‌ బలమైన అభిప్రాయం.

ఏ మహమ్మదీయ రాజ్యమైనా భారతదేశంపై దండయాత్ర చేస్తే, ఆ సందర్భంలో తమ ఉమ్మిడి భూమిని రక్షించుకునేందుకు మహమ్మదీయులు హిందువులకు తోడుగా నిలుస్తారా? అని నిర్మొగమాటంగా అడిగాడు... ఓ మహమ్మదీయుడి దేశం ఏదైనా కానీ, అతడు మరో మహమ్మదీయునికి వ్యతిరేకంగా పోరాడడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని ముహమ్మద్‌ ఆలీ లాటివారే చాటారు.''

పాఠక మిత్రులారా! ఈ ఉట్టంకింపుల సందర్భంలో ఈ అభిప్రాయాలు వెళ్ళడించింది ఆషామాషీ వ్యక్తులు కారు అంటూ అంబేద్కర్‌ ఇలా రాశారు.

''ఈ భయాలు వెళ్ళడి చేసిన వాళ్ళు ఉచితానుచితాలు తెలియని వాళ్ళనుకునేరు. కాదు సరి కదా వాళ్ళు ముస్లిం నాయకులతో బాగా సంబంధాలుండి, తమ అభిప్రాయాల్ని వెళ్ళడించగల ఉచితజ్ఞత కలవాళ్ళు.

కనుక అంబేద్కర్‌ కాలంనాటికే అంబేద్కరే కాకుండా, ఆస్థాయి మేధావులని అంబేద్కర్‌ ప్రస్తావించిన వాళ్ళూ ఖురాన్‌ మార్గదర్శకత్వం ఎలా ఉంటుంది? దాని ఆదేశాల విషయంలో ఒక ముస్లిం వైఖరెలా ఉంటుంది అన్న విషయంలో వారు తమని ప్రత్యేకించుకుని తీరతారని, హిందువులను, ఇస్లామేతరుల్ని అన్యులుగానే భావిస్తారని స్పష్టంగా ప్రకటించారు. సంస్కరణవాదులైన ముస్లింలెవరైనా ఖురానుకు వ్యతిరేకంగా మాట్లాడితే చాందస ముస్లింలు వారిని చంపేయవచ్చనీ అన్నారు.

ఇస్లాంలోని అంతర్గత బలహీనతల్ని గురించీ డా|| అంబేద్కర్‌ 8 వాల్యూం - సామాజిక స్తబ్దత అన్న శీర్షిక క్రింద చాలా విలువైన, ప్రామాణిక సమాచారాన్ని రాశిపోశారు. వివరంగా తెలుసుకోదలచిన వాళ్ళు 8వ సంపుటిని ఆ సాంతం శ్రద్దగా అధ్యయనం చేయండి. ఒక్కమాట చెప్పి దీనిని ముగిస్తాను.

సత్యాన్వేషణ మండలి ద్వారానూ, ఐక్యవేదిక ద్వారానూ నేను పౌరులకు సంబంధించిన ఒక అభిప్రాయాన్ని సూత్రరూపంలో బలంగా చెపుతూ వస్తున్నాను.

భారతదేశంలో ఉన్న భారత పౌరసత్వం కలిగి ఉన్న వ్యక్తి ఎవరైనా, ముందుగా తాను భారతీయునిగా త్రికరణ శుద్దిగా తలంచాలి. ఆ రకంగానే ప్రవర్తిస్తుండాలి. ఆ తరవాతనే తానేదో ఒక మతానికి, కులానికి, ప్రాంతానికి, పార్టీకి చెందిన వాణ్ణని తలంచాలి, ఆ రకంగానే ప్రవర్తించాలి. భారతదేశము, భారత రాజ్యాంగము, భారతీయులు అన్న భావన అన్నిటికంటే ముందుది, ముఖ్యమైందిగా అనుకుంటూ ప్రవర్తిస్తూ ఉండాలన్నమాట.

విషయం అర్ధమవుతుందనుకుంటాను. నీవు మొదట భారతీయుడివి. పిదపే హిందువులి మొదట భారతీయుడివి, పిదపనే క్రైస్తవుడివి, మొదట భారతీయుడివి, పిదపనే ముస్లింవి... ఇలాగన్న మాట. ఆశ్చర్యకరమైన విషయమేమంటే, 70 ఏండ్లకు పూర్వమే, అంబేద్కరూ ఈ విషయాన్ని ముఖ్యమైనదిగ తలంచడమేగాక, ఈ విషయంలో వివేకవంతుడైన పౌరుడేలా ఉండాలో ఉంటాడో సుస్పష్టంగా ప్రకటించాడు. ఆ మాటలు ఇవిగో,

దేశంలో కొందరు సంఘహితైషులైన మేధావులు, మొదట భారతీయుడివి తరవాతే హిందువైనా, ముస్లిమైనా క్రైస్తవుడైనా అన్న దృష్టి కలిగి ఉండాలనంటుంటారు. నా దృష్టిలో అది సరికాదు. సరిపడినంత వివేకం ఉన్నవారైతే, నేను మొదటా భారతీయుణ్ణేతరవాతే భారతీయుణ్ణే, చివరకూ భారతీయుణ్ణే అంటారు అనాలి, అనన్నారు.

ఎంతటి ఉదాత్తభావన ?! రాజ్యంగ పీఠికలోని ఆశయాలు నెరవేరాలంటే పౌరుల మానసిక స్థితి ఎలా ఉండితీరాలని ఆయన విచక్షణ నిర్వింద్వంగా ప్రకటిస్తొందో గమనించారా? ఆ వైఖరే ఉత్తమోత్తమమైనది. నిజమైన జాతీయ భావనను నెలకొల్పగలిగింది.

నా వరకు నేను అక్కడే ఉన్నాను. నాకు ఏ మతమూలేదు. ప్రాంతల పట్టింపూలేదు కేవలం భారతీయుణ్ణి మాత్రమే. ఇంకే సంకుచిత భావనకు తలొగ్గడానికి నేను సిద్దంగా లేను ఈ ఉన్నత భావాన్ని అంగీకరిస్తూనే నేను, కనీసం మొదట భారతీయుణ్ణి తరవాతే ఫలాన మతస్ధుణ్ణి, ప్రాంతం వాణ్ణి వగైరాలన్నీ అనుకొమ్మని చెప్పాను. ఈ నాప్రతిపాదన అంబేద్కర్‌ ప్రతిపాదనతో పోలిస్తే మధ్యమ స్థాయి కలిగింది మాత్రమే.

వివిధ మత, ప్రాంతాలకు చెందిన వారిగా తలంచుతుండే పౌరులారా! మీరేక్కడున్నారో ఎక్కడికి రావాలనుకుంటున్నారో తేల్చుకుని, ఆ రకంగా నిజాయితీగా ప్రవర్తించండి. 1) నేనన్నదానికంటే అంబేద్కర్‌ చెప్పింది ఉన్నతమైనది. నేను మనిషిని, మానవ సమాజం మంతా ఒక్కటే అన్నది మరింత ఉన్నతమైనది, ఆదర్శప్రాయమైనది ఆలోచించండి.

ఇస్లాం మత స్వేచ్చను అంగీకరించదనడానికింత కంటే రుజువేం కావాలి? విధిలేక మాత్రమే వారు మరొకరితో కలిసి ఉంటారు.

1) ఇస్లాం పద్దతి అమలయ్యే పరిస్థితి ఉంటే, అక్కడ ఇస్లామేతరులు స్వేచ్ఛగా ఉండడం అసంభవం. షరతులతోకూడిన, అదిన్నీ అవిశ్వాసిగా ఉన్నందుకు గాను విధించిన షరతులతో, ఉండనిచ్చినందుకు గాను విధించిన పన్ను చెల్లించే ఉండాలి.

రంజిత్‌ ఓఫీర్‌ - నేను (సురేంద్ర)



ఓఫీర్‌గారిని, నన్నూ శ్రద్దగా పరిశీలిస్తున్న పాఠకమిత్రులారా!

ఈ మధ్య హైందవ క్రైస్తవంలోని వివిధ విషయాలపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నై.

1. భారత్‌ టుడే - ఛానల్‌లో 'ఓ హిందూ మేలుకో అన్న పేరుతో ప్రసంగాలు, గోష్టులు జరగడం మెదలైంది. మరోవంక 'హిందూ ధర్మాచార్య ప్రతిష్టానమ్‌' పేరుతో ఆరంభమైన త్రిమతాచార్య పీఠాల మరియు వివిధ హైందవ సంప్రదాయాలకు చెందిన సాధు సన్యాసుల ఐక్యవేదిక నుండీ హైందవ క్రైస్తవం పుస్తకం పై విశ్లేషణాత్మక విమర్శ ఆరంభమైంది. హిం.ధ.ప్ర (హెచ్‌.డి.పి) సంస్ధ ఆరంభవేదిక నుండీ, చినజీయ్యరు స్వామివారు, సుభుదేంద్ర తీర్ధస్వామి వారు, పరిపూర్ణానంద స్వామివారూ హిందూ గ్రంథాలలో ఏసున్నాడు, మహమ్మదున్నాడు లాంటి రచనలన్నీ ఎవరు చేసినా అట్టివన్నీ అసత్యాలే, వంచనతో కూడుకున్న ప్రచారాలేనని బహిరంగంగా ప్రకటించారు. అలాంటి రచనలు చేసిన క్రైస్తవ, ఇస్లాం మత ప్రచారకులు సత్యాసత్య విచారణకు సిద్దపడితే పండిత సభను ఏర్పాటు చేస్తామనీ ప్రకటించారు. అలాటి రచనలు కొన్ని క్రైస్తవ సంస్ధలనుండీ ముఖ్యంగా 1. గుండా బత్తిని, 2. రంజిత్‌ ఓఫీర్‌ గార్ల నుండి వచ్చాయి. ఇతర క్రైస్తవ ప్రచారకులలో చాల మంది వీరి రచనలను ఎత్తి రాస్తున్న వారే. ఇక ముస్లింలకు చెందిన వారిలో 1) జాకీర్‌ నాయక్‌ 2) సత్య సందేశ కేంద్రం వారూ, వారిని అనుసరిస్తున్నవారూ ఈ రకమైన ప్రచారాలకు గడంగుతున్నారు. ఈ రకానికంతటికీ వేద ప్రకాశ్‌ ఉపాధ్యాయ గారి రచనలు, శ్రీ వాత్సవ గారి రచనలూ ఆధారంగా ఉంటున్నాయి.

ప్రస్తుతాంశం ఏమంటే, ఈ రకమైన పెడపోకడ పోతున్న వాళ్ళలో ఒక్కరంటే ఒక్కరైనా ఆయా గ్రంధాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పండితులతో చర్చకుగానీ, పరిశీలనకుగాని సిద్దం కాకుండా, వాటి గురించి ఏమీ తెలియని అమాయక జనం ముందు విపరీతంగా వీటిని ప్రచారం చేస్తూ జనాన్ని తమతమ మతాలలోకి మరలించుకుపోయే పని చేస్తున్నారు. ఇక్కడికిదే ఒక అనైతిక చర్య. కుటిలపన్నాగం. గొప్ప ఆశ్చర్యకరమూ, హాస్యాస్పదమూ కూడా అయిన విషయ మేమంటే ఈ గుంపంతా సత్యం కోసం తెగ ఆరాటపడిపోతున్నట్లు మాట్లాడుతుంటారు. నటిస్తుంటారు. సామాన్య జనుల ముందరా, తాన అంటే తందాన అని వంతపాడే సొంతమంద ముందరా తెగపెట్రేగిపోతుంటారు. ఒకరు సత్యంలోకి రండంటారు. మరొకరు సత్య సందేశం అంటారు. ఇంకొకరు నిరంతర సత్య సంస్ధానాభి లాషి నంటారు. అంతా తామంతా సత్యం కోసమే పుట్టినట్లు తెగ ప్రదర్శించుకుంటుంటారు.

ఏ విశ్వాసికీ తాము విశ్వసిస్తున్న విషయాన్ని గురించి వాటికివేరైన వాటికి వేరైన గురించీ సత్యాసత్యాలంటూ మాట్లాడే అర్హతే ఉండదన్న ప్రాథమిక నియమమే అవగాహనలోలేని ఈ రకం వారి మాటలు మాత్రం మహా జ్ఞానుల మాటలనుమించి ఉంటుంటాయి. నిజంగా వైదిక సాహిత్యాన్ని చదవవలసిన రీతిలో, చదవవలసినంత చదవకుండానే తెలిసిన వాళ్ళమల్లే ప్రసంగాలలో తెగ రెచ్చిపోతుంటారు.

1. జాకీర్‌ నాయక్‌ - శాంతి సందేశం పేరిట ఎంత దుర్మార్గపు పాత్రపోషించిందీ నిఘా విభాగాలు ఈ మధ్య వెళ్ళడి చేశాయి. అయినా అతగాణ్ణి అల్లా రక్షించనూలేదు. తన తిప్పలేవో తానుపడుతూ తప్పించుకు తిరుగుతున్నాడతడు. అతగాని వెంట పడిపోయే మంద చాలా మంది ఇస్లాంలో ఉన్నారు. అలాగే అతణ్ణి అంగీకరించని సాంప్రదాయ ఇస్లాం. పండితులూ చాలా మంది ఉన్నారు. అతడూ పైన నేను చెప్పిన వేద ప్రకాష్‌ ఉపాధ్యాయ, శ్రీవాత్సవ పుస్తకాలను పట్టుకునే హిందూ గ్రంధాలలో ముహమ్మద్‌ ఉన్నాడంటూ ప్రసంగాలు చేశాడు. ఖురానును సాంప్రదాయంగా అధ్యయనం చేసిన వాళ్ళకు తెలుసు జాకీర్‌ నాయక్‌ చేస్తున్నపని, ఖురాన్‌ ప్రకారం చేయకూడనిదనీ, నరకానికి దారి తీస్తుందనీ అయినా వాళ్ళు వాస్తవాలు మాట్లాడరు. మౌనంగా ఉంటారు. ఎక్కడన్నా ఒకడు అదేమిటన్నా, వీరు దానిని పట్టించుకోరు. ఈనాడు ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాలలో మీ గ్రంథాలలో మా ముహమ్మద్‌ అన్న ప్రచారం చేస్తున్న వాళ్ళున్నారు. ఒకరు జాకీర్‌ నాయక్‌ను అనుసరించేవాళ్ళు, మరొకరు సత్య సందేశ కేంద్రం నుండి వెలువడ్డ రచనలను ఆధారం చేసుకుని ప్రసంగాలు చేస్తున్నవారు షిరాజుఅహ్మద్‌, షఫీ, ఇమ్రాన్‌, ఫజులూర్‌ రహ్మాన్‌, ముస్తాక్‌ అహ్మద్‌లూ, వారి అనుయాయులూ ఈ ప్రచారం చేస్తున్నవారుగా ఇప్పటికి నా ఎరుకలోకి వచ్చారు. ఒకరిద్దరు పబ్లిషర్సూ ఈ రకమైన సాహిత్యాన్ని ప్రబోదిస్తున్నారు. ఆ వివరాలన్నీ రుజువు అవసరమైన రోజు అందిస్తాను.

ఇస్లాంకు చెందిన వీరందరికి స.మండలి పక్షం నుండి నేను చెపుతున్నదొక్కటే.

మీలో నీతి నిజాయితీగానీ మాటకు కట్టుబడి ఉండే నిబద్దతగానీ, సత్యస్ధాపనోద్దతిగానీ ఉంటే వేదాలలో పురాణాలలో ముహమ్మదు అనే విషయంపై వేద వేత్తలతో కూడిన సభను ఏర్పాటు చేస్తాను. అందులో పాల్గొని మీరంటున్నవన్నీ సరైనవేనని నిరూపించడానికి సిద్దంకండి.

1. వేదాలలో ముహమ్మదు 2. ఉపనిషత్తుల్లో ముహమ్మదు, 3. పురాణాలలో ముహమ్మదు ఇది పరిశీలనాంశం

క్రైస్తవ పక్షం


హిందూ గ్రంధాలలో ఏసు అన్న ప్రచారం ఈనాటిదికాదు. ఈనాడు దానికి ప్రసిద్ది కలిగించిన వారిలో పండిట్‌ సి.హెచ్‌. ఫ్రాన్సిస్‌, పరవస్తు సూర్యనారాయణ అన్నవార్లు పెద్ద తరం క్రిందికి వస్తారు. ఆ తరవాత గుండాబత్తిన, అటు పిమ్మట రంజిత్‌ ఓఫీర్‌గార్లు ఈ వాదాన్నెత్తుకుని, చాలా పుస్తకాలు రాసేశారు. అందులోనూ గుండా బత్తిన వారి పుస్తకాలను ఆధారం చేసుకుని చిన్న చితకా ప్రసంగీకులెందరో పుట్టగొడుగుల్లా పుట్టు కొచ్చేశారు. అట్టి వారిలో కణితి అబ్రహాం, సుధాకర్‌, జెపన్సాశాస్త్రి గారిలాటి కొందర్ని మా మిత్రబృందం కలిసి మాట్లాడగా ఆ విషయాలు తమకేమీ తెలియవనీ, గుండాబత్తిని వారి పుస్తకాలు చూసి రాసినవి మాట్లాడినవే అవన్నీ అని నోటిమాటేగాక, చేతివ్రాత ద్వారాను మా వాళ్ళకు తెలియజేశారు. అటు తరువాత మా మిత్ర బృందం గుండా బత్తిని వారిని నేరుగా కలసి, హిందూ గ్రంథాలు నుండి వారు ఉట్టంకించిన మంత్రాలు శ్లోకాల అర్ధం చెప్పమని నిలదీయగా ఆయన చెప్పలేకపోయారు. మరోసారి కూర్చుందామనీ అన్నారని మా మండపేట, రాజానగరం బృందం నాకు చెప్పారు. ఈ విషయంలో గుండా బత్తిని వారికి నేను చెప్పిదేమంటే, మీ రచనలలో మీరు చెప్పిన వాటిలో ఎక్కువ భాగం తప్పుడు వివరణలే అవి అ సత్య ప్రచారాలు మాత్రమే. నా ఈ మాట కాదలచుకున్నా, నిజం కొరకు నిలబడే నిజాయితీ ఉన్నా ఈ సమాచారం అందిన వెంటనే నాకు కబురు చేయండి. విజ్ఞులతో కూడిన సభను ఏర్పాటు చేస్తాను. అందులో మీ రాతలు సరైనవేనని నిరూపించండి. లేకుంటే తప్పైందని వప్పుకుని, క్షమాపణలూ చెప్పుకుని, ఆ పుస్తకాలనన్నంటినీ ఉపసంహరించుకోండి.

సూక్తి :- అసత్యాలు చెప్పమని, ప్రచారం చేయమని ఏమతమూ చెప్పదు. జనమే ఏదో ఒక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా మతాల పేరున  అవి చెప్పనివీ ప్రచారం చేస్తుంటారు.

రంజిత్‌ ఓఫీర్‌గారు


మిగిలిన క్రైస్తవ ప్రచారకులకూ, ఓఫీరుగారికీ ఇలాటి రచనలు చేయడం, ప్రసంగాలు చేయడం విషయంలో ఒక తేడా ఉంది. మీ గ్రంధాలలో మా ఏసు అన్న ఇతర రచయితలెవ్వరూ ఈయన గారిలా సవాళ్ళు తొడగొట్టడాలూ చేయలేదు. ఈయనంతలా, సొంత డబ్బా కొట్టుకునే వారూ అలాగే ముందేమన్నదీ పట్టించుకోకుండా పరస్పర విరుద్దమైన భావాలను ప్రకటించడంలోనూ ఈయనకీయనే సాటి. అలాంటి కొన్ని మాటలు చెప్పుకుంటేగాని, ఓఫీరుగారి వ్యక్తిత్వాన్ని అర్ధం చేసుకోడం కుదరదు.

1. 10 ఏండ్ల ప్రాయంనుండే ఏసుతో మాట్లాడడం మొదలెట్టానంటాడు. ఏసును వేదాలను తెనుగు చేయించమని 20 ఏండ్లుగా అదే ధ్యాసతో నిరంతరం ప్రార్థించానంటాడు.

2. ఏసు కృపవల్ల ఎన్నో భాషలు మాట్లాడుతున్నానంటాడు - సంస్కృతంలో ఉన్న వేదాన్ని అర్ధం చేసుకోలేక తెలుగు, తెలుగు అనిదేబిరించుకున్నానంటాడు.

3. ఎవరేమన్నా వేదాలు బ్రహ్మాముఖోద్దిష్టాలని నమ్మడమే నా కిష్టం అంటాడు - వేదాలను రుషులే రచించారంటాడు.

4. రంగాచార్యుల వారిని ఏసే పురమాయించి అనువాదం చేయించాడంటారు - రంగా చార్యులవారితో ఆ విషయంలో, ఈ విషయంలో తీవ్రంగా విభేదిస్తున్నానంటారు.

5. హైందవం - క్రైస్తవం నిజానికి రెండు కావంటారు - నీవైనా సత్యం చెప్పు నేను హిందువునవుతా, నేనైనా సత్యం చెపుతాను నీవు క్రైస్తవుడివికా అనీ అంటారు.

6. నేను సాత్వికుణ్ణి అని తన గురించి తానే చెప్పుకుంటారు - నేను చాలా చెడ్డవాణ్ణి నా జోలికి రాకండనీ అంటారు.

7. తనను చంపిన వాళ్ళనూ క్షమించాడు ఏసు అనంటారు - దిగిరాతండ్రీ! భూకంపాలు, ఇళ్ళు నేలమట్టాలు చేసేయ్‌ అనీ అంటారు.

8. ఒక ప్రక్క తెగ శక్తి ఉన్నవానిమల్లే శాపాలు పెడుతుంటారు - మరో ప్రక్క దిగిరాతండ్రీ! వచ్చి వీళ్ళను దుంప నాశనం చేసేయ్‌. నీవు రావాల్సిందే. రాకుంటే ప్రాణాలు తీసుకుంటాం అని దేబిరిస్తుంటారు.

9. దయానందుని మాటలను ఎత్తిచూపుతూ గుడ్డిగా దేనినీ నమ్మకూడదు. అనేక విధాల పరీక్షించుకున్నాక, నిగ్గుతేలినవాటినే స్వీకరించాలని ఒక చోట చెప్పి, మరో పుస్తకంలో నమ్మడం మినహా మరో దారిలేదు. నమ్మబుద్దికాకున్నా నమ్మాల్సిందే, అసంబద్దంగా అనిపిస్తున్నా నమ్మల్సిందేనంటూ పూర్తి విరుద్దమైన మరో పాటందుకుంటారు.

10. 1 గంట ప్రసంగం చేశారనుకుంటే 40 శాతం ఆత్మస్తుతి - సొంత డబ్బా- చేసుకుంటారు. మరో 40 శాతం అసందర్భము, అప్రస్తుతము, అప్రధానమూ అయిన విషయాలే మాట్లాడుతుంటారు. మిగిలిన 20 శాతంలో కూడా ఎక్కువభాగం చెత్తే ఉంటుంది.

11. సింహాన్ని నిద్రలేపుతున్నావ్‌, నిద్రలేపావ్‌, ఇక నేనూరుకోను, అది చేస్తాను ఇది చేస్తాను, సిద్దంగా ఉండండని అంటారు. నాకు టైంలేదు. అనొకసారి, మీరునాకు సరిపోరని ఒకసారి, మీ సంగతి పట్టించుకోనని ఇంకోసారి ఇలా రకరకాలుగా ప్రసంగిస్తుంటారు.

12. కుస్తీకి సవాల్‌ అనంటారు - సరేరమ్మంటే ముందు నన్ను కొడతానికి నీ దగ్గర ఏమేమిపట్లున్నాయో వివరంగా నాకు తెలియజేయి. వాటిని చూశాక నీతో పోట్లాడాలో లేదో తెల్చుకుంటానంటారు.

13. భారత దేశానికి సవాలంటూనే - నేను సవాళ్ళ మనిషినికాదు. సవాళ్ళెందుకండీ!! నిజాన్ని ప్రకటించండి నిజమైతే అంగీకరించి వాగ్దానానికి కట్టుబడి ఉంటానంటారు.

14. నేనేవరికీ భయపడను. నన్నెవరూ భయపెట్టలేరు అనంటూనే, నా జొలికి రావద్దు. నేను చెడ్డవాణ్ణి పులిని సింహాన్ని అది చేస్తాను, ఇది చేస్తాను, ఎవర్నీ వదల్ను అని భయపెడుతూ, బెదిరిస్తూ మాట్లాడేస్తారు.

15. వేదరుషులెరిగిన ఏసు అనంటారు - దేవుడెవరో తమకు తెలియదని రుషులే ప్రకటించారంటారు.

16. ముస్లింలతో గొడవ పడుతూ, బైబిలు, ఖురానులలో ఒకే దేవుణ్ణి గురించి చెప్పబడిందంటూ 99% వివరాలు సరిపోయినా అల్లా - ఎహోవా (ఎలోహిం) అన్నతేడా ఉన్న రెండు గ్రంధాలలోని దేవుడొక్కడేనని నేనంగీకరించను అంటాడు. వేదాల దగ్గర కొచ్చేటప్పటికి ఏసు, ఎహోవా పేర్లు ఎందుకుంటాయండీ? రెంటిలోని వివరాలు పోలుతున్నాయి కాని అని, వేదాల్లో చెప్పబడింది ఏసేనని రుజువు చేశానంటారు. అంగీకరించమంటారు.

17. తెలుగులో లేకుంటే అర్ధం చేసుకోలేనంటూనే, రంగాచార్యులకూ, వేదరుషులకు - భాష్య కారులకూ అర్ధం కాని - కనపడని - విషయాలూ తన కర్ధమైనయ్‌ అనంటారు.

పాఠకమిత్రులారా! ఈ రచన చదువుతున్న ఓఫీర్‌ భక్తులారా! ఇలాటివి ఇంకేన్నోఆయన రచనలు ప్రసంగాలనుండి ఎత్తి చూపవచ్చు.

18. ఏసు వేదాలలో ప్రతి పేజీలో దర్శనమిచ్చాడంటారు. అక్కడక్కడా ఉంది ఏరుకుని కూర్చుకోవాలని మరోమాటంటారు.

19. 30 సం|| తన తపస్సు ఫలితంగా ఈ సత్యాన్ని పరాత్పరుడు బయట పరచాడంటారు. వేదరుషులకు తన గురించిన సత్యాన్ని బయలుపరచకుండా ఎందుకుంటాడు అనీ అంటారు.

ఈ సంచిక వరకు ముగింపుగా రెండు మాటలు :

అయ్యా ఓఫీరుగారూ! అస్సలు మన మధ్య నున్న వివాదాంశం ఏమిటండీ? మీరు హైందవ క్రైస్తవంలో ఉట్టంకించిన 115 మంత్రాలకు వేదం తెలిసిన వారంగీకరించే అర్ధమేమిటి? అన్నదేకదా! లేదా! ఆ మంత్రాలకు మీరన్న అర్ధం వస్తుందా? రాదా? అనైనా చెప్పుకుని దానిని విచారణ చేయవచ్చు. ఇంత సరళమైన విషయాన్ని పరిశీలించడానికి, స్థాయిలు, సముజ్జీలు లాటి గొడవలెందుండీ! ఆ మంత్రాల అర్ధమేమిటన్నది ఎలా నిర్ణయించుకోవాలో, నిర్ణయించుకోగలమో మీరే తేల్చి చెప్పండి. ఇంత సులభంగా పరిష్కరించుకోగలిగిన దానిని పీటముడుల వ్యవహారంగా మార్చారెందుకు?

2. అలా కాదనుకుంటే, ఎందుకన్నారో ఏమోగాని భారతదేశంలోని ధర్మాచార్యు లందరకూ సవాలన్నారు కనుక, బహిరంగ సవాలు విధివిధానాలననుసరించి పోటీకైనా సిద్దంకండి. పోటీకి తగినవారా కాదా నిర్ణయించాల్సింది మీరు కానే కాదు. అంతేకాక, పోటీలో నీవు ఎలా పోరాడతావో ముందే నాకు చెప్పమని మీరే అడగడమంత తెలివి తక్కువ తనం మరోటుండదు. మీసవాలులో అర్హతానర్హతల ప్రస్తావన లేదు సరికదా వేదం విషయంలో మీ పక్షపు పట్లన్నీ అనువాదకుని ఆసరాతో నిలబడినవే. కనుక స్వయంగా మీకు వేదార్ధ నిర్ణయంచేసే అర్హతగానీ, శక్తి సామర్ధ్యాలుగాని లేవని మీరే చెప్పుకుని ఉన్నారు. కనుక ఎవరి అర్హత లేమిటన్నదిగానీ, ఎవరు చెప్పింది సబబుగా ఉందన్నది గాని తేల్చవలసింది పోటీలో పాల్గొనే ఇరువురిలో ఎవరూ కాదు. వీరిరువురికి వేరుగా నున్న న్యాయ నిర్ణేతలకే ఆ అర్హత అధికారం ఉంటాయి. పోటీలకు సంబంధించిగాని, వాద ప్రతివాదాలకు సంబంధించి గానీ, ఇది సార్వత్రిక నియమం. ఇది మీకు తెలుసో లేదో మీరే తేల్చండి. చివరిమాట!

మిమ్ములను (మీ గ్రంధాలను, ప్రసంగాలను) జాగ్రత్తగా నిశితంగా పరిశీలిస్తున్న నాకు,ఇప్పటికి నా గురించీ, మీ గురించీ అర్ధమైన దానిని బట్టి మీ ఆర్భాటాలు, అట్టహాసాలు, జబ్బలుచరచడాలు, శాపాలు పెట్టడాలు, మీ ఏసును రమ్మన్న మొత్తుకోలులు అన్నీ మనం తారసపడనంతవరకే బ్రతికుంటాయి.

1. యోగ్యులైన విద్వజ్జనుల మధ్యలో సత్యాన్వేషులంగా విషయ విచారణ చేద్దామన్నా;

2. కాదుకూడదంటూ పోరాటంలోనే తేల్చుకుందాం నువ్వోనేనో అని అనాలనుకున్నా నేను సిద్దం.

గమనిక : స్థాయి అర్హతలన్నవీ పరిగణించాలన్న నియమం పెట్టుకోవలసిందే అని మీరన్నా నా కభ్యంతరం లేదు. మనం ఎంచుకున్న నిర్ణేతల ముందు నా స్థాయి, సామర్ధ్యాలకు చెందిన సమాచారం నేను పెడతాను, మీ వివరాలు మీరూ ఇవ్వండి. న్యాయ నిర్ణేతలు తేలుస్తారు ఎవరి స్థాయి ఏమిటి మీ స్ధాయికి నేను తగను ఈ వివాదం వరకైనా అని వారు నిర్ణయిస్తే ఏమి చేయాలో అప్పుడాలోచిద్దాం. సరిపోతానంటే పోరాటం చేద్దాం. ఒకవేళ నా స్థాయికి మీరే సరిపోరని గాని వారు తేలిస్తే ఏమి చేయాలో, చేస్తారో మీరే చెప్పండి. నా వరకైతే స్థాయిల మాట ప్రక్కనపెట్టి మీతో అప్పుడూ విచారణకు కూర్చుంటాను.

ఎందుకంటే, మండలి విధానంలో, తనకంటే అధికులతోనూ, సములతోనూ, చిన్న వారితోనూ కూడా మాట్లాడుతుండాలన్న నియమం ఉంది కనుక. అనవసరపు ప్రస్తావనలనాపి, హైందవ క్రైస్తవం పై విచారణకు సిద్దం కండి.

సత్యాన్వేషణలో  - సురేంద్ర