స్పం. (1) : సి.టి.ఎఫ్. పేరున, ఒక ఇ-మెయిల్ వచ్చిందినాకు. అందులో వివేకపథంలోని నా వైఖరిని అభినందిస్తున్నామని, ప్రస్తుతం పనుల వత్తిడిలో వుండడంవల్ల తమ సమాధానాన్ని పంపలేకపోతున్నామనీ, దీనిని తాము బాధ్యతల్ని ఎగవేయడంగా భావించవద్దని వ్రాశారు. ప్రకాష్‌గారి తల్లిదండ్రులకు అనారోగ్యంగా వుండడంతో ప్రకాష్‌గారు వారి పనులు చూడడంలో బిజీగా వుంటున్నారనీ వ్రాశారు. చెన్నైలో ఏవో సమావేశాలు పనులున్నట్లు వ్రాశారు.
సంచిక నంబరు
150
151
152
153
154
156
157
158
159
160
161/162
163
167/168
169
170
171
172
173
174
175/176
177
178
179/180
181
182
183
184
185
186
187
188
189
190
191
198
199
200
201
202
203
204
205
206
210
215
218
219
222
225
226
227
228
229
230
231
232
240
Article
CTF
Editorial
Index
Letters
M1
M11
M12
M13
M2
M3
M4
M5
M6
M7
M8
M9
Meetings
Video
m10
మేలుకొలుపు
Showing posts with label 153. Show all posts
Showing posts with label 153. Show all posts
Wednesday, April 1, 2009
స్పందన - ప్రతిస్పందన
స్పం. (1) : సి.టి.ఎఫ్. పేరున, ఒక ఇ-మెయిల్ వచ్చిందినాకు. అందులో వివేకపథంలోని నా వైఖరిని అభినందిస్తున్నామని, ప్రస్తుతం పనుల వత్తిడిలో వుండడంవల్ల తమ సమాధానాన్ని పంపలేకపోతున్నామనీ, దీనిని తాము బాధ్యతల్ని ఎగవేయడంగా భావించవద్దని వ్రాశారు. ప్రకాష్‌గారి తల్లిదండ్రులకు అనారోగ్యంగా వుండడంతో ప్రకాష్‌గారు వారి పనులు చూడడంలో బిజీగా వుంటున్నారనీ వ్రాశారు. చెన్నైలో ఏవో సమావేశాలు పనులున్నట్లు వ్రాశారు.
మానవ వినాశనానికి దారులుతీస్తున్న మతమార్పిడులు (ధారావాహిక)
గత సంచికలో వివేకానందుని అభిప్రాయాలను, గాంధీ భావాలను కొంతవరకు పరిశీలించాం. మత సమైక్యత నెలకొనకుండా స్వరాజ్యంరాదు అన్నది గాంధీ దృఢ విశ్వాసం. అతడు ప్రధానంగా ఈ దేశానికి సంబంధించినంతలో హిందువులు, ముస్లింలు ఈ దేశస్తులు. ఈ దేశ స్వాతంత్య్రానికై పోరాడుతున్న, పోరాడాల్సినవారు. కనుక వారిరువురూ సోదరులు అన్న దృష్టిని దృఢంగా ఏర్పరచుకుని వున్నాడు. ఆంగ్లేయులు (బ్రిటిష్‌వారు) ఈ దేశంలోని హిందువలలో అంతర్గత అనైక్యతను, వైషమ్యాన్ని నెలకొనజేయడానికీ, హిందూ, ముస్లింల మధ్య అనైక్యతను నెలకొనజేయడానికి రకరకాల పన్నాగాలు పనుతుంటారు. ఈ రెంటిలో ఏది జరిగినా స్వతంత్ర పోరాటం బలహీనపడుతుంది. అఖండ భారత్ స్వతంత్రం కాదు అన్న నిశ్చయంలో వున్నాడు అననిపిస్తుంది. అతననుసరించి వివిధ విధానాలను క్రోడీకరించిచూస్తే.
'వివేకపథం' పత్రిక జిల్లా పాఠకుల సమావేశ వివరాలు కృష్ణాజిల్లా :
'వివేకపథం' పత్రిక జిల్లా పాఠకుల సమావేశ వివరాలు
కృష్ణాజిల్లా :
ముందుగా ప్రకటించినట్లుగనే 15-2-09న ఆదివారం ఉదయం 10 గంటల నుండి సా|| 5 గంటల వరకు 'వివేకపథం' పత్రిక కృష్ణాజిల్లా పాఠకుల సమావేశం సాయిదత్తా టవర్స్‌లో జరిగింది. సుమారు 30 మంది హాజరయ్యారు. మిత్రసంఘాల సభ్యులు జంపా క్రిష్ణకిషోర్, టి.వి.రమణయ్య, ఆర్.ఎస్.నాయుడు, అహల్యాదేవి మొదలగువారు కూడా హాజరైనవారిలో వున్నారు.
''పరిణామవాదమా? సృష్టివాదమా?'' వేదికదృష్ట్యా మిగిలివున్న పనులు
(1) సి.టి.ఎఫ్. క్రైస్తవ యోచనాపరుల వేదిక పేరున ప్రకాష్‌గారు బాధ్యత తీసుకుని, సుధాకర్‌గానిరీ కలుపుకుని మా వేదికలో పాల్గొన్న విషయం, క్రమంగా వారు వేదిక క్రమాన్ని విడచి మండలిని రెచ్చగొట్టే పనికి పూనుకోవడం జరిగింది. అందుకు, సత్యాన్వేషణ మండలి ఏమాత్రం తొణకకుండా, వారు పట్టించాలన్న పెడత్రోవ పట్టకుండా, శాస్త్రీయ విచారణా పద్ధతిని, వేదిక అనుసరించాల్సిన క్రమాన్ని అంటిపెట్టుకుని, 3 అంశాలను వారి ముందుపెట్టి, వాటిని నిరూపించండి అనడుగుతూ వచ్చింది. అవి : (1) సి.టి.ఎఫ్. నాపై సంధించిన 13 అంశాల లేఖకు బాధ్యత వహిస్తున్నవారి వివరాలు మాకందించాలి, (2) బైబిలు సృష్టివాదాన్ని ప్రతిపాదించి నిరూపించాలి, (3) స్వస్థత ప్రార్థనల మహత్తును నిరూపించాలి. ఈ మూడు విషయాలకు ఉచితరీతిన సమాధానాలు చెప్పి వాటిని నిరూపించాల్సిన బాధ్యత ప్రకాష్‌గారిపైనే వుంది. లేదా, 13 అంశాల లేకకు, ఇదిగో మేమూ బాధ్యులమేనంటూ ఎవరైనా ముందుకొస్తే, అప్పుడు వారంతా కలసిగానీ, వారిలో ఎవరుగానీ, అందుకు పూనుకోవచ్చు.
స్పందన - ప్రతిస్పందన
స్పం-1 : రాజమండ్రి నుండి మధుర కృష్ణమూర్తి శాస్త్రిగారిలా వ్రాస్తున్నారు. వివేకపథం-151వ సంచిక చదివి ఈ లేఖ వ్రాస్తున్నాను. అందులోని 6 పేజీవరకు 'సంపాదకీయం' 1 లక్ష కరపత్రాలు వేసి అతి ప్రధాన పట్టణాలలో బడుగువర్గాల వారికి అందేలా చేస్తే బాగుండుననిపించింది. ఈనాటి రాజకీయ నాయకుల నిజస్థితిని ఓటరు మనస్సుకు హత్తుకునేలా వుందది.
ప్రజాస్వామ్యం - అస్సలు, నకిలీ (కొన్ని సూచనలు) - సంపాదకీయం
యోచనాశీలురైన మిత్రులారా! ప్రజాస్వామ్యం దాని పూర్తిరూపంలో ప్రపంచంలో ఎక్కడా ఆచరణలోకి రాలేదెప్పటికీ. అయినా అదంటే ఏమిటో, దాని స్వరూప స్వభావాలేమిటో మానవమేధ ఊహించగలిగింది. ప్రాచీనకాలంలోనూ, ఈ మధ్యకాలంలోనూ, ప్రజాస్వామ్యం దాని పూర్తిరూపంలో అమలైతే ఆ సమాజం ఎలా వుంటుందో ప్రస్తావించబడింది. అది ఒకటి వసుధైక కుటుంబ భావన కాగా మరొకటి కమ్యూనిజం ఆచరణలోకి వస్తే వుండేది. ఎక్కడ రాజులేడో, రాజ్యం లేదో; ఎక్కడ దండించేవాడు, దండింపబడేవాడు వుండడో (దండనతో పనిలేదో) అట్టి సమాజం ప్రజాస్వామ్యానికి ఆదర్శ రూపం అవుతుంది. ప్రజలుంటారు. ఎవరెవరి శక్తిసామర్థ్యాలనుబట్టి సమాజానికవసరమైన రంగాలలో పనిచేస్తుంటారు. వారి వారి వాస్తవావసరాల కనుగుణ్యంగాగానీ, ఉన్న మొత్తం-అవసరపడి వున్నమొత్తం అన్న దృష్టినుండి ఉన్నంతలో అందరికీ చెందేలా చూసుకుంటుగానీ ఉమ్మడి జీవితాన్ని సాగిస్తూ వుంటారు. దాచుకోవలసిన అవసరంగానీ, సోమరితనం అలవడకపోవడంతో పనిచేయలేమని వత్తిడి చేయాల్సిన అవసరంగానీ లేని వాతావరణము, స్వభావము కలిగిన వ్యక్తుల సమాజంగా అది వుంటుంది. దాంతో తనకు అవసరమైనది అందదేమోనన్న భయమూ ఉండఖ్కరలేని వాతావరణం ఏర్పడుతుంది.
Subscribe to:
Posts (Atom)