Showing posts with label 189. Show all posts
Showing posts with label 189. Show all posts

Sunday, July 1, 2012

స.హ.చట్టానికి సంబంధించిన న్యాయస్థానాల, తీర్పులు, వ్యాఖ్యానాలు.


1. రాష్ట్ర ప్రభుత్వానికీ సీల్డ్‌ కవర్లలో ఐఎఎస్‌ అధికారులు సమర్పించిన ఆస్తుల వివరాలను స.హ.దరఖాస్తు దారు తనిఖీచేయవచ్చు. - తమిళనాడు హైకోర్టు తీర్పు.

2. జరిమానా విధించబడిన ప్రజా సమాచార అధికారి వ్యక్తిగత హోదాలో మాత్రమే హైకోర్టుకు రావాలి. ఆయన తరపున రాష్ట్ర ప్రభుత్వము అప్పీలు చేయరాదు. - పంజాబు, హర్యానా హైకోర్టు తీర్పు.

బైబిలు దైవ గ్రంథమా? ... 5

యోచనాశీలురైన పాఠకమిత్రులారా!

పి.డి. సుందరావు & కంపెనీ గురించి తెలిసిన వారందరూ అనుకున్నట్లే అయ్యింది.

నేను వివేకపథం 188 సంచిక ద్వారా స్పందన -2 శీర్షికన,

పి. డి సుందరావు గారి తరుఫున ఎన్‌. కనకమహాలక్ష్మిగారు పంపిన లేఖను, దానిపై ఎక్‌నాలెడ్జ్‌మెంటు కార్డు ద్వారానే నేను వారికి క్లుప్త సమాధానంగా వ్రాసిన ప్రత్యుత్తరాంశాలను, అటు పై వారికి నేను 18-6-2012 తేదీన విపులంగా వ్రాసి రిజిష్టర్‌ పోస్టు చేసిన లేఖను ప్రచురించాను. ఆ విషయాలు వివేకపథాన్ని శ్రద్ధగా చదువుతున్న మీ కందరికీ తెలుసున్నవే. ఆ నా రెండో రిజిష్టర్‌ లేఖ తిరస్కరింపబడి తిరిగి వచ్చింది. దానిని తీసుకుంటే సమాధానం చెప్పవలసి వస్తుందనీ, సమాధానం చెప్పలేమని తేల్చుకుని వారా పని చేసుండాలి.