Showing posts with label Meetings. Show all posts
Showing posts with label Meetings. Show all posts

Friday, July 15, 2016

త్రైమాసిక సమావేశాల విశేషాలు

త్రైమాసిక సమావేశాల విశేషాలు


ముందనుకున్న ప్రకారం ఏప్రిల్‌ 18,19,20 తేదీలలో మండలి కేంద్ర కార్యాలయమైన దోరకుంటలో సత్యాన్వేషణ మండలి త్రైమాసిక సమావేశాలు జరిగాయి. సుమారు 20 మంది వివిధ ప్రాంతాల నుండి హాజరైనారు. ముందుగా పుట్టా సురేంద్రబాబు గారు మాట్లాడుతూ పలువిషయాలపై వివరణిస్తూ చర్చను సాగించారు. ఆ చర్చల సారాంశం క్లుప్తంగా...

నీకు తెలిసిన విషయాలను ఇతరులకు తెలియజేయాలన్నా, ఇతరులకు తెలిసినవి నీవు తెలుసుకోవాలన్నా భాషద్వారా తప్ప వేరొకమార్గము లేదు. అవునా కాదా ? చర్చించండి. చర్చానంతరం తేలిందేమిటంటే విషయం గ్రహించాలన్నా, గ్రహింపజేయాలన్నా భాషద్వారా తప్ప వేరే మార్గము లేదని అర్ధమైందనుకున్నాము. అలానే బృందచర్చల స్వరూప స్వభావాలు - వాటి తీరుతెన్నులపై చర్చించి 1. బృంద చర్చలో పాల్గొంటున్న వారందరూ కూడా బృంద చర్చలో పాల్గొంటున్నామన్న అవగాహన కలిగి అందుకు సిద్ధంగా వుండాలి. 2. బృంద చర్చలో ప్రశ్న ఎవరిని ఉద్దేశించి వేయబడిందో వారే స్పందించాలి. అలానే ప్రశ్న అర్ధమైందని నిర్ణయించుకున్నాకనే సమాధానము చెప్పటానికి ప్రయత్నించాలి. 3. ప్రశ్న ఏ విషయానికి ఎంత సమాధానం ఆశిస్తుందో ఆ విషయానికి అంత చెప్పినప్పుడే సరైన సమాధానము చెప్పినట్లు (అతనినే మితభాషి అంటారు) ఆ సమాధానము వీలైనంత క్లుప్తంగా దీర్ఘ ప్రసంగం కాకుండా ఉంటే బాగుంటుంది. 4. బృంద చర్చ ఎక్కువలో ఎక్కువ సఫలం అయిందనాలంటే చర్చలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ చెబుతున్నది మిగిలిన అందరికీ తెలుస్తుండాలి. అలానే మిగతా అందరిదీ  అతనికి తెలుస్తుండాలి. అంటే ప్రతి ఒక్కరిదీ ప్రతి ఒక్కరికీ తెలుస్తుండాలి. ఇది జరగాలంటే చెప్పేవాడికి చెప్పడం చేతనైఉండాలి. వినేవాడికి వినడం చేతనైఉండాలి. అంటే బృంద చర్చలో పాల్గొనేవారికి చెప్పడము, వినడము చేతనై ఉండాలి. 5. బృంద చర్చలో ఆ విషయముపై అనేకానేక అభిప్రాయాలు వెల్లడి అయినప్పటికీ చర్చ ముగిసే సమయానికి చర్చనీయాంశము పట్ల సమానమైన అవగాహన కలిగించుకోగలగాలి. అప్పుడే ఆ బృంద చర్చ ప్రధానోద్దేశ్యము నెరవేరినట్లు.

ముఖ్యముగా జిజ్ఞాన, ఉత్సుకతల మధ్య తేడాపాడాలు తెలిసుండాలి. 'జ్ఞాతుం యిచ్చ జిజ్ఞాస' తెలుసుకోవాలనే గట్టి కోరిక. ఇట్టివారికి మాత్రమే తెలుసుకోదగిన విషయములో ఇప్పటికి ఎంత తెలిసింది, ఇంకెంత తెలియవలసి ఉందో తెలుస్తూ ఉంటుంది. ఉత్సుకత అంటే కుతూహలము అంటాము. అది ఏమిటో తెలుసుకోవాలన్న పైపై కోరికే గాని తెలియలేదన్న తపన ఉండదు. తగినంతగా కనుక విషయాన్ని తెలుసుకోగోరేవారికి ఆ విషయంపై జిజ్ఞాస ఉండిఉండాలి. కేవలం ఉత్సుకత వలన ప్రయత్నము ఉండదు, తెల్సుకోవడమూ జరగదు.

ఇలానే నిజాయితీ కలిగి ఉండడానికి, నిజము తెలిసి ఉండడానికి ఏమైనా తేడా ఉందా? సంబంధం ఉందా? రెండూ ఒకటేనా, అన్న విషయము చర్చకు రాగా చర్చించి 1. నిజము తెలిసిన వాడు, నిజాయితీ లేనివాడూ ఉంటాడు. 2. నిజాయితీ పరుడై నిజము తెలియని వాడూ ఉంటాడు అని తేల్చాము. నిజాయితీని వివరిస్తూ లోపలా బైటా ఒక్కటిగానే ఉండటం అంటే అనిపిస్తున్న దానికి అనుగుణంగానే మాటా, చేతా కలిగి ఉండడం అని అర్థం అనుకున్నాము. ''నిజం తెలిసి నిజాయితీ పరుడైన వాని మాట స్వీకరించవచ్చు'' అనుకున్నాం. ఉద్దేశ్యపూరకంగా తప్పుచేసేవాడు, ఉద్దేశ్యపూరకము కాకపోయినా తప్పుచేసేవాడు ఉంటారు. నిజం తెలిసి నిజాయితీ లేనివాడు ఉద్దేశ్యపూర్వకంగా తప్పుచేసేవాడని, తెలియని వాడుగా ఒప్పుకోవడం ఇష్టంలేక ఏదో ఒకటి చెప్పేవాడు తప్పుచేసేవాడే కాని అతనిది ఉద్దేశ్యపూర్వకం అనలేము అనీ అనుకున్నాము. అలానే విధానాల్లో కూడా వంద విషయాలలో నిజం చెప్పాడు కనుక నూట ఒకటవది కూడా నిజం అనుకోవటం తప్పువిధానమని, పది సార్లు అబద్దం చెప్పాడు కనుక పదకొండో సారీ అబద్దమే చెబుతాడనుకోవటం కూడా తప్పువిధానమేననీ అనుకున్నాం.

అసలు సత్యాన్ని ఆచరించాలి అంటే మొదట దాన్ని (సత్యాన్ని) వెతకాలి, గమనించాలి, అంగీకరించాలి, స్వీకరించాలి ఆ తరువాతే ఆచరించడము. పై ఐదు అంశాల మధ్య తేడాలున్నాయని ఒకింత సూక్షంగా పరిశీలిస్తేగాని తెలుసుకోలేము. సత్యాన్వేషిగా ఉండడమే అన్నిటికంటే కష్టము. వాస్తవిక దృష్టి కలిగి ఉన్నవారే సత్యాన్వేషిగా ఉండగలరు. స్వర్గము ఉందా? లేదా? అని ప్రశ్నిస్తే ఉందనే వాళ్ళో, లేదనే వాళ్ళో ఉంటారు గాని తెలియదు అనేవాళ్ళు చాలా తక్కువ. తెలియదు అనడమంటే ఉందనిగాని, లేదని కాని అంగీకరించటము లేదని అర్థము. ఉంది, లేదు అనుకునే వాళ్ళు తమకు తెలియకుండగనే తెలుసనుకుంటున్నామన్న సంగతి కూడా తెలియని వాళ్ళని అర్థము. అందుకనే వాస్తవిక దృష్టి కలిగి ఉండడము కష్టమని చెబుతున్నాము. పుస్తకము చదివి మాకు నిజం తెలిసిందనుకునేవాళ్ళు అలానే నిజం కాదని తెలిసింది అనేవాళ్ళంతా వాస్తవికులు కాదనే అర్థం. కారణము పుస్తకము చదివితే వారు ఏమంటున్నారో, వీరు ఏమంటున్నారో తెలుస్తుంది కాని అది నిజమో, కాదో తెలియదన్న విషయము కూడా వారికి తెలిసిలేదు కనుక. వాస్తవిక దృష్టి కలవారు సత్యం సార్వత్రికం అంటారు. సత్యం వ్యక్తిగతమని (వయక్తికం) అని ఎవరైనా అంటే సత్యాసత్యాలకు విచారణ స్థానం ఉండదని అర్థం. అనగా సత్యాసత్యాలు తేల్చలేమని అర్థం.

నోట్‌ : సత్యాలు మారతాయి అనేవారు సత్యాసత్యాలు తేల్చుకోగలమంటారో లేదో అడిగి చూడాలి. అసలు విజ్ఞాన శాస్త్రముయొక్క దృష్టి ఉన్నది ఉన్నట్లు గమనించడమే. సత్యాలు మారుతుంటే విజ్ఞాన శాస్త్రము ఎలా గమనిస్తుందో కూడా వారే చెప్పాలి (కోట ప్రసాదు).

రెండవ రోజు సమావేశం 19వ తేదీ ఉదయం 9 గం.లకు మొదలైంది. శాస్త్రీయ దృక్ఫధం అంటే ఏమిటి? దాని ఆవశ్యకత ఏమిటి? గురించి మాట్లాడుకోవటం జరిగింది. ముందుగా దృక్ఫథాలు ఎలా ఏర్పడతాయో పరిశీలించటం జరిగింది. మనకు అనేక విషయాలు ఆయా ఇంద్రియాల ద్వారా తెలుస్తూ ఉంటాయి. అలా తెలిసిన దానినే అనుభూతి అంటాము. ఇలాంటి కొన్ని అనుభూతులు ఒకే రకంగా ఏర్పడడాన్ని బట్టి ఒక సాధారణ సూత్రాన్ని రాబడతాము. దాన్ని అభిప్రాయము అంటాము. అలా ఏర్పడ్డ అభిప్రాయాన్ని అనుసరించి దానిపై మరొక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుంటాము. దాన్నే దృక్ఫథం అంటాము. మొదటి అభిప్రాయం ఏర్పడుట వలన ఆ అభిప్రాయం ఏర్పరచి వారిపట్ల మన వైఖరి ఏమిటి? మనము వారిఎడ ఎలా ప్రవర్తించాలి అన్న రెండు రూపాలలో దృక్ఫథము ఉంటుంది. అన్ని దృక్ఫథాలు అభిప్రాయాలే కాని, అన్ని అభిప్రాయాలు దృక్ఫథాలు కావని గమనించాలి.

శాస్త్రీయ ధృక్ఫథము అంటే సరైన దృక్ఫథము అని అర్థము. శాస్త్రీయ దృక్ఫథము అలవడాలంటే ముందేర్పరచుకున్న అభిప్రాయాలలో నుండి చూడకూడదు. రాగద్వేషరహితుడవై చూడాలి. అంటే సూత్రప్రాయంగా నువ్వు నువ్వుగా ఉండి దాన్ని దాన్నిగా చూడాలి అంటాము.శాస్త్రీయ దృక్ఫథము విషయము గమనించేవారు ఎలా ఉండాలో చెబుతుంది. అంటే ఆయా విషయాలు పరిశీలించే వ్యక్తి ఎలాంటి చూపు కలిగి ఉండాలో తెలిపేదే శాస్త్రీయ దృక్ఫథం.

ముందేర్పరచుకున్న అభిప్రాయాలను ప్రక్కనబెట్టి చూడగలగాలి. దీనినే పూర్వనిశ్చితాభిప్రాయాలు విడిచిపెట్టి చూడడం అంటాము. ఈ పూర్వ నిశ్చితాభిప్రాయాలు అన్నమాట క్రింద అప్పటికి ఏర్పడియున్న అభిప్రాయాల జాబితా అంతా వస్తుంది. శాస్త్రీయ దృక్ఫథము ఆ జాబితాను కొన్ని రాసులుగా విభజించింది. వాటిని అనుకూల దృష్టి, ప్రతికూల దృష్టి అనవచ్చు. శాస్త్రీయ ధృక్ఫథము ఇప్పుడున్నదానిని పరిశీలించే సందర్భములో ఈ రెండు దృష్ఠులను విడిచిపెట్టమంటుంది. ఎందుకంటే ఈ రెండు దృష్టులు పరిశీలనాంశాన్ని లోగడ పరిశీలించడం ద్వారా ఏర్పడినవి గనుక. మన ఉద్దేశ్యము పరిశీలనాంశము ఇప్పుడు ఎలా ఉన్నది తెలుసుకోవడమే. ఇప్పటికి ఏర్పడియున్న దృష్టులు గతంలో అవి ఎలా ఉన్నాయో దానిని అనుసరించి పుట్టినాయి గనుక. ఇప్పుడు అవి ఎలా ఉన్నాయో గమనించడానికి అవి 1. అనవసరము, 2. ఆటంకము (కొన్ని సందర్భాలలో). కనుకనే శాస్త్రీయ దృక్ఫథము ఆయా విషయాలను పరిశీలించే సందర్భంలో ఈ రెండు దృష్టులను విడిచిపెట్టమంటుంది. ఇవి విడిచిపెట్ట వలసిన దృష్టులైతే కలిగి ఉండవలసిన దృష్టి అన్నదాన్ని గురించి కూడా శాస్త్రీయ దృక్ఫథము చెబుతుంది. దానినే ''తటస్థ దృష్టి'' అంటున్నాము. విషయాన్ని యథాతథంగా గమనించడంలో తటస్థ దృష్టి కలిగి ఉండాలి. ఉదాశీన దృష్టి అంటే పట్టించుకోనితనము. అది అన్నింటికంటే ప్రమాదకరమైనది కూడా. శాస్త్రీయ దృక్ఫథము, విషయము ఎవరు చెప్పారో అనిగాక, ఏమి చెప్పారో చూడమంటుంది. ఇలానే శాస్త్రీయ పద్ధతి కూడా వివరించుకోవడం జరిగింది. రాజ్యాంగము 51ఎ(హెచ్‌) లో, శాస్త్రీయ దృక్ఫథము ప్రజలకు అలవరచుకోవాలన్న నిర్దేశం ఉంది. అంటే దాని ఉద్దేశము మూఢనమ్మకాలనుండి ప్రజలను దూరం చేయాలన్నదే. చెప్పాము గనుక చేయడం కంటే ఎందుకు చేయాలో తెలిసి చేయడం సరైన పద్ధతి.

అధ్యయనం ఎలాచేయాలన్న విషయంపై ఒక ప్రయోగము చేయుట జరిగినది. ఎంపిక చేసుకున్న రెండు పుస్తకాల నుండి రెండు పేరాలు ఇచ్చి, ఈ పేరాలలో ఎన్ని వాక్యాలు ఉన్నాయి? ఎన్ని అభిప్రాయ ప్రకటనలు ఉన్నాయి? అందులో మీకు ఎన్ని అర్థమైనాయి? మీరు ఒప్పనుకొంటున్నవి ఎన్ని? తప్పు అంటున్నవి ఎన్ని? తేల్చుకోలేకపోతున్నవి ఎన్ని అనిపిస్తున్నాయి? అలానే అర్థం తెలియని పదాలు ఎన్ని? అవి ఏవి? సభికుల సమాధానాలు విన్నాక ఒక విషయం తెలిసింది. రచయితలందరము గమనించవలసిన ముఖ్య విషయము ఒకటుంది. ఒక రచన చేసో, ఒక ఉపన్యాసము ఇచ్చో మనకు తెలిసింది ఎదుటి వారికి చెప్పామని తృప్తిపడుతుంటాము చాలామందిమి. కానీ మన రచన ఎప్పుడైనా కొద్దిమందికి ఇచ్చి మీకు ఏమి అర్థమైందో చెప్పమని చూశామా? ఇలాంటి ప్రయోగము ఎప్పుడైనా చేశామా? చాలామందిమి చేసిఉండము. కారణము మనము చెప్పడము, వ్రాయడము ఏమిటి, ఇతరులకు అర్థము కాకపోవడం ఏమిటి? అర్థం చేసుకోలేక పోతే వారి స్థాయికి విచారించడం తప్ప ఏమీచేయలేము అని మనలను మనం సమర్థించకుంటాం. మనం ఎందుకు ఈ రచన చేశామో? అది నెరవేరిందో లేదో? అన్న యోచనే కానరాదు. నిజంగా మనం రాసింది ఎదుటి వారికి అర్థము కావాలి, వారు దానినుండి ఉపయోగం పొందాలి అన్న ఎరుకగానీ ఉండి ఉంటే, వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం ఉందన్న ఆలోచన వచ్చేది. ఇది గమనించాకైనా అలాంటి ప్రయోగము చేయకపోవడం (తెలియకో, అనుకోకో) జరిగిందంటే, మన  రచనలు, మన ఉపన్యాసాలు ప్రజలకు ఉపయోగపడాలన్నదానికంటే మనకెంత పేరుప్రతిష్టలు తెచ్చాయో అన్నదానికో, ఆత్మసంతృప్తికో పనికివస్తాయి అంతే. అసలు విషయమేమిటంటే, అలా ఆత్మ సంతృప్తి పొందడానికో, పేరుప్రతిష్టల కొరకో అలాటి రచనలు చేసేవారు కూడా ఈ ప్రస్తావన వచ్చినప్పుడు, తమకలాటి ఆలోచన లేదనీ, జనం కోసమే ఈ రచన చేశానని అంటుంటారు. ఆ భ్రమనుండి  బైటపడతారని ఆశిస్తాను. (కోటప్రసాదు).

మండలి భవిష్యత్‌ కార్యాచరణను నిర్దేశిస్తూ మరిన్ని సభ్యత్వాలు చేర్పించాలని, మరిన్ని మండలి శాఖలు విస్తరింపచేయాలని నిర్ణయించుకోవటం జరిగింది. కొంతమంది నూతన సభ్యులను చేర్పించుకోవటం కూడా జరిగింది.   - రిపోర్టర్‌, కోట ప్రసాద శివరావు.

Tuesday, September 1, 2015

సత్యాన్వేషణ మండలి త్రైమాసిక సమావేశాలు

గమనిక : సత్యాన్వేషణ మండలి త్రైమాసిక సమావేశాలు అక్టోబర్‌ 30,31, నవంబరు 1 తేదీలలో కేంద్ర కార్యాలయమైన దోరకుంటలో జరుగుతాయి. కావున సభ్యులందరూ విధిగా పాల్గొనవలసి ఉంటుంది.
గమనిక : హేతువాదిలో పి.జె.సునీల్‌ గారి వ్యాసాలననుసరించి ఆయన అవగాహన, విశ్లేషణలు ఆహ్వానించదగినవిగా ఉన్నాయి. కనుక పాఠకులు శ్రద్ధతో వాిని ఒంటబ్టించుకో గలరని మనవి.

Wednesday, May 1, 2013

స.హ.ప్రచార ఐక్యవేదిక రాష్ట్ర మహాసభల విశేషాలు

మే 4,5 తేదీలలో సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక రాష్ట్ర కార్యవర్గ సమావేశం మరియు రాష్ట్ర మహాసభ ఒంగోలులో జరిగాయి. 4వ తేదీన రాష్ట్ర కార్యవర్గ సమా వేశం స.హ.ప్ర.ఐక్యవేదిక ప్రకాశం జిల్లా కోశాధికారి తులసీ జిగీష గారి ఇంటివద్ద ఉదయం 10 గం.ల నుండి సా|| 6 గం.ల వరక జరిగింది. రాష్ట్ర అధ్యకక్షులు శ్రీ పుట్టా సురేంద్రబాబు అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి ఆదిలాబాద్‌ (తూర్పు), ఆదిలాబాద్‌ (పశ్చిమ), కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, నల్గొండ, ఖమ్మం, అనంతపురం, విశాఖ జిల్లాల నుండి కార్యవర్గ సభ్యులు 30 మంది వరకు హాజరయ్యారు. 

5వ తేదీన రాష్ట్ర మహాసభ సంతపేట లోని ఆచార్య ఎన్‌.జి. రంగా భవన్‌లో జరిగింది. మహాసభ ప్రారంభానికి ముందు రాష్ట్ర ఉపాధ్యకక్షులు చెర్కూరి వెంకట్రామయ్య వేదిక జెండాను ఆవిష్కరించారు. సభకు రాష్ట్ర అధ్యకక్షులు శ్రీ పుట్టా సురేంద్రబాబు అధ్యక్షత వహించారు. సభలో రాష్ట్ర ఉపాధ్యకక్షులు డా|| వి.బ్రహ్మారెడ్డి, చెర్కూరి వెంకట్రామయ్య, పి. వేణుగోపాల్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జంపా క్రిష్ణ కిషోర్‌ గారలు  వేదికనలంకరించారు. ఈ సభలోనే జిల్లా జడ్జి రామ్‌గోపాల్‌ గారు కృష్ణాజిల్లాకు బదిలీ అయిన సందర్భముగా వారి సేవలను కొనియాడుతూ స.హ.ప్ర. ఐక్యవేదిక మరియు సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సంయుక్త నిర్వహణలో జరిగిన అభినందన సభలో వారికి జ్ఞాపికను బహూకరించటం జరిగింది. తనకు జరిగిన అభినందనలకు కృతజ్ఞతలు తెలుపుతూ జస్టీస్‌ రామ్‌గోపాల్‌ సమాజ పురోభివృద్ధిలో సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక చేస్తున్న కృషి బహు ప్రశంసనీయమని, రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది సమక్షంలో తనకు అభినందనలు తెలిపినందులకు సంతోషాన్ని తెలియజేశారు.

మహాసభలో ప్రధాన వక్తగా డా|| వి.బ్రహ్మారెడ్డిగారు తన ప్రసంగంలో గత మూడున్నర సంవత్సరాల నుండి ఏం చేయాలనుకున్నాము, ఏమి చేశాము? ఏమి చేస్తే బాగుంటుందన్న దానిపై విశ్లేషణ చేశారు. తన 40 సంవత్సరాల ప్రజా ఉద్యమ జీవితంలో ప్రజల్లో కలసి పనిచేసిన అనుభవాలను ప్రతినిధులతో పంచుకున్నారు. అందులో భాగంగానే తన జీవితానుభవాలను, మీ జీవితాలకు వర్తింపజేసుకుంటూ, సమాజ అభ్యున్నతికి ఎలా ఉపయోగపడతాయో? ఎలా ఉపయోగించుకోవాలో చూడమన్నారు. ఉమ్మడి సమస్యలైన ఆరోగ్యం, అక్షరాస్యత, ఉపాధి, రక్షణ, వ్యవసాయం లాంటి సమస్యలు చాలా వున్నాయని, సమస్యలు లేకుంటే బాగుండునని ప్రతివారు కోరుకొంటుంటారు. కాని ఏం చేస్తే సమస్యలు పరిష్కారమవుతాయనుకునే వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉందని అన్నారు. అంతేగాక సమస్యలను పరిష్కరించే దగ్గరకు వచ్చేసరికి ఎవరికి వారుగా తమదైన శైలిలో ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవటం, అవి సక్రమంగా అమలు జరగకపోవటం, అందుకు పరిస్థితులు అనుకూలించక పోవటమే గాక, వారి ఇష్టాఇష్టాలకు ప్రాధాన్యతనియ్యటం అనేవి కూడా కారణాలుగా ఉన్నాయన్నారు.
మనం చేసే పనుల్లో చాలా జయాలు, అపజయాలు ఉంటాయి. అపజయాలను పరిశీలించిన యెడల భవిష్యత్తులో అపజయాలకు కారణమైన పనులు తిరిగి చేయకుండా ఉండే అవకాశాలుంటాయని, మన అపజయాలను అతిగమించి మరింత ఎత్తుకు ఎదుగుటకు ఆస్కారం ఉంటుందని అన్నారు. తాను గతంలో ఎక్కువ మందికి తరగతులు నిర్వహించుట నిర్వాహకులకు, తనకు కూడా గొప్పేనని అనుకున్నామని. కాని అనుభవములో  వీలైనంత తక్కువ మందితో మమేకమై వారిమీద శ్రద్ధపెడితే ఫలితాలు వస్తాయనేది గమనించానని అన్నారు. మేము చేసిన ఆ తప్పును మీరు చేయవద్దని హెచ్చరించారు. అలాగే వక్త తాను చెప్పదలచిన విషయం మీద తగిన ప్రణాళికతో ముందుగా నోట్స్‌ తయారుచేసుకొని దానిని అర్థమయ్యే విధంగా కార్యకర్తలకు వివరించాలని అన్నారు. అంతేగాక తమకు అర్థంకాని విషయాలను శ్రోతలు వెంటనే వక్తను అడిగి తెల్సుకోవాలని అన్నారు. ఆ వక్త కూడా అడిగిన దానికి అప్పుడే వివరించాలన్నారు. లేనియెడల అడుగుదామనుకున్న విషయాన్ని శ్రోత, చెప్పవలసిన వక్త కూడా మర్చిపోయే అవకాశం ఉందన్నారు. వక్త ప్రసంగంలో ఒక్క పదము అర్థం కాకపోయినా మిగతా విషయం అర్థం కాదన్నారు.

సమీక్షా సమావేశం అనగా మనం ఏమనుకున్నాం, ఏం చేశాము, ఇంకా ఏం చేయాలనే విషయాల మీద విశ్లేషణే అని అన్నారు. కార్యకర్త ముందుగా మనం చేద్దామనుకున్న పనిమీద ఇష్టం కలిగి ఉంటే ఫలితాలు బాగుంటాయని, కార్యకర్తలను తయారు చేసుకోవటంలో క్లాసులో ఎక్కువమందిని కాక, వీలయినంత తక్కువ మందితో మాత్రమే నిర్వహిస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. సమాజంలో సమస్యలు పరిష్కారం కాకపోవుటకు ముఖ్య కారణం సమస్యలున్న వారు కదలకుండా, ఆ సమస్యలు లేనివాళ్ళు సమస్యలు వున్నవారికి బదులు ఆ సమస్య పరిష్కారం కొరకు కదలటమే నన్నారు. కార్యకర్తలు నూతనంగా వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు సాధించుతూ తమ సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు. ఉద్యమ నిర్మాణం చేయాలంటే తాము ముందు నిబద్దత కలిగి ఉండాలని అన్నారు. ఆ నిబద్దత మూడు విషయాల్లో ఉంటుందంటూ 1. సమయపాలనను పాటించుట, 2. అన్నమాటకు కట్టుబడి ఉండుట, 3. చేస్తానన్న పనిని మనసుపెట్టిచేయటమేనని అన్నారు. సమాజాభివృద్ధికి ఎవరికి వారు తమవంతు సమయం, ఆర్థికం ఇచ్చుటకు సిద్ధపడాలని, తెలియక చేసిన తప్పులకు, తప్పులు చేసిన వారికి మరలా మరలా తెలియజెప్పటమొక్కటే మార్గం అని అన్నారు. కావాలని తప్పులు చేసే వారిని మాత్రం వదిలించుకోవటమే మంచిదని అన్నారు.
ఆయన ప్రసంగం అక్షరసత్యాలన్నంతగా వున్నాయి. ఆ ప్రేరణతోనే వివిధ జిల్లాల బాధ్యులు తమ ప్రసంగంలో తమ జయ, అపజయాల అనుభవాలను చెప్పుతూ, ఆ అనుభవాలు క్రొత్తవారు ఎలా వుపయోగించుకోవాలో తెలియజేస్తూ మాట్లాడుట నిజంగా సంస్థ ఆరోగ్యంగా, బలంగా ముందుకు సాగుతుందన్న దానికి నాందిగా నిలచాయి.
ప్రధాన కార్యదర్శి గడచిన మూడున్నర సంవత్సరాలలో చేసిన కార్యక్రమాలను, నిర్మాణం తదితర అంశాలను వివరించారు. 300 మంది ప్రతినిధులు హాజరైన మహాసభలో స్వార్థ, వ్యాపార రాజకీయాలను, సేవా రాజకీయాలుగా మార్చడానికి, తద్వారా అవినీతి తక్కువగా వున్న సమాజం ఏర్పడటానికి అవసరమైన 73, 74 సవరణ చట్టం సక్రమంగా అమలుచేసుకునేలా ప్రజలను చైతన్యవంతులు చేయాలన్నారు,  నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకు వున్న సభ్యులు, మండల, జిల్లా కమిటీలు, ఏ విధంగా వున్నాయో వివరిస్తూ రాబోయే నాలుగు నెలల కాలానికి ప్రణాళికను సూచించటం జరిగింది.

నేటివరకు సభ్యులుగా 1476 మంది వున్నారని. రాబోవు 4 నెలల్లో 1384 మందిని నూతనంగా చేర్పించి 2860 మందిని ఉద్యమంలో భాగస్వాములుగా చేద్దామని అన్నారు. అలాగే ఇప్పటి వరకు 33 మండలాల్లో పూర్తిస్థాయి మండల కమిటీలు ఏర్పడ్డాయని, రాబోవు నాలుగు నెలల్లో మరో వంద మండల కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పరచాలని అన్నారు. రాబోయే నాలుగు నెలల కాలంలో 30 కళాశాలల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలని, 79 గ్రామ సభలు నిర్వహించాలని తెలిపారు. ఇప్పటివరకు 500 మందికి పైగా శిక్షణనిచ్చామని, రాబోవు నాలుగు నెలల్లో మరో 200 మందికి శిక్షణనివ్వాలని తెలిపారు. ఉద్యమాభివృద్ధికి కార్యకర్తలను మరియు ప్రజలను చైతన్యపర్చటానికి ఇప్పటివరకు 5 రకాల పుస్తకాలను, 48750 కాపీలను ముద్రించటం జరిగిందన్నారు. 
రాబోవు నాలుగు నెలల్లో జిల్లాల్లో పూర్తిచేయగలమని ప్రకటించిన వివిధ లక్ష్యాల వివరాలు

   జిల్లా సభ్యత్వం  కమిటీలు వేసే  కళాశాలల్లో  శిక్షణకు  గ్రామ సభల
కోటా మండలాలు సమావేశాలు పంపేవారు నిర్వహణ

1. అనంతపురం 250 7 2 8 4
2. కర్నూలు 400 12 2 10 4
3. కృష్ణా 400 12 2 47 4
4. ప్రకాశం 350 13 2 20 -
5. గుంటూరు 100 22 2 15 -
6. పశ్చిమ గోదావరి 400 21 4 30 15
7. ఆదిలాబాద్‌ తూర్పు 400 8 5 15 2
8. ఆదిలాబాద్‌ పశ్చిమ 300 15 4 30 20
9. నల్గొండ 200 15 2 15 5
10. విశాఖ 60 8 5 10 25

రాష్ట్ర ఉపాధ్యకక్షులు పి.వేణుగోపాల్‌రెడ్డి గారు మాట్లాడుతూ కమిటీ నిర్మాణాల గురించి సవిస్తరంగా వివరించారు. ఆ వివరాలు ఇలా వున్నాయి.

నిర్మాణం : మండల కమిటీలో కనీసం 3 గ్రామాల ప్రాతినిధ్యం, ఒక మహిళతో సహా 15 మంది తగ్గకుండా సభ్యులుండాలని, అందులో ఒక అధ్యకక్షులు, ఇద్దరు వరకు ఉపాధ్యకక్షులు, ఒక ప్రధాన కార్యదర్శి, ఇద్దరు వరకు కార్యదర్శులు, ఒక కోశాధికారి మరియు ప్రతి గ్రామం నుండి ఒకరు కార్యవర్గంలో వుండేలా చూడాలని. ప్రతి మండల కార్యదర్శి వర్గం (ఆఫీసు బేరర్లు) నెలకు ఒకసారి సమావేశం జరపాలి. కార్యవర్గ సమావేశం 2 నెలలకు ఒకసారి జరపాలి. జిల్లా వార్షిక సమావేశం (ప్లీనం) ప్రతి సంవత్సరం జరపాలి. మహాసభ 2 సంవత్సరాల కొకసారి జరపాలి.
జిల్లా కమిటీలో కనీసం 5 పూర్తి స్థాయి మండల కమిటీలు, రెండు రెవిన్యూ డివిజన్ల నుండి మరియు కనీసం ఇద్దరు మహిళలు ఉండాలని, వారిలో ఒక అధ్యకక్షులు, నలుగురు వరకు ఉపాధ్యకక్షులు, ఒక ప్రధాన కార్యదర్శి, నలుగురు వరకు కార్యదర్శులు, ఒక కోశాధికారి మరియు ప్రతి పూర్తి స్థాయి మండల కమిటీ నుండి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికార్లు మరియు అడ్‌హాక్‌ కమిటీల కన్వీనర్‌, కో కన్వీనర్లు జిల్లా కార్యవర్గంలో సభ్యులుగా వుంటారు. ప్రతి జిల్లా కార్యదర్శి వర్గం (ఆఫీసు బేరర్లు) 2 నెలలకు ఒకసారి సమావేశం జరపాలి. కార్యవర్గ సమావేశం 4 నెలలకు ఒకసారి జరపాలి. రాష్ట్ర వార్షిక సమావేశం (ప్లీనం) ప్రతి సంవత్సరం జరపాలి. మహాసభ 2 సంవత్సరాల కొకసారి జరపాలి.

రాష్ట్ర కమిటీలో కనీసం ముగ్గురు మహిళలు ఉండాలని, ఒక అధ్యకక్షులు, ఐదుగురు వరకు ఉపాధ్యకక్షులు, ఒక ప్రధాన కార్యదర్శి, (అవసరమనుకొంటే ఉద్యమ అవసరాన్ని బట్టి మరొక ప్రధాన కార్యదర్శిని కూడా ఎన్నుకొనవచ్చు) ఐదుగురు వరకు కార్యదర్శులు, ఒక కోశాధికారి మరియు ప్రతి పూర్తిస్థాయి జిల్లాకమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికార్లు మరియు అడ్‌హాక్‌ కమిటీల కన్వీనర్‌, కో కన్వీనర్లు రాష్ట్ర కార్యవర్గంలో సభ్యులుగా వుంటారు. రాష్ట్ర కార్యదర్శి వర్గం (ఆఫీసు బేరర్లు) 2 నెలలకు ఒకసారి సమావేశం జరపాలి. కార్యవర్గ సమావేశం 4 నెలలకు ఒకసారి జరపాలి.

వివిధ కమిటీలలోని సభ్యులందరూ విధిగా శిక్షణ పొందియుండాలి. లేకుంటే మూడు నెలల కాలంలో శిక్షణ పొందాలి. మండల స్థాయిలో కనీసం 2 రోజులు సమయాన్ని, జిల్లా స్థాయిలో 4 రోజుల సమయాన్ని, రాష్ట్ర స్థాయిలో 10 రోజుల సమయాన్ని  కార్యదర్శివర్గ సభ్యులు తప్పని సరిగా ఉద్యమం కొరకు కేటాయించాలి.
ఈ నిర్మాణమును వివరించుటతో పాటు ప్రసంగించిన వివిధ జిల్లాల బాధ్యులకు సమన్వయ కర్తగా వ్యవహరించడంలో మంచి గతకాల అనుభవజ్ఞులన్న విషయాన్ని చెప్పకనే సభకు తెలియపర్చారు.
సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక రాష్ట్ర అధ్యకక్షులు పుట్టా సురేంద్రబాబు గారు మాట్లాడుతూ.. ఉద్యమకారుడుకి, సామాన్యుడికీ ఉన్న తేడాను, కార్యకర్త అంటే స్వతంత్రః కర్త అని, అంటే తనే నిర్ణయము తీసుకొని అమలుచేయగల వారినే కార్యకర్తలనాలని, అలానే స్వేచ్చా స్వాతంత్య్రములకు గల తేడాలను వివరించారు. స్వేచ్చ అంటే నిర్ణయము తనదైతే స్వేచ్చ గలవాడని, తన నిర్ణయాన్ని అమలుపరచుకొనే అవకాశం గలవాడే స్వతంత్రుడవుతాడని వివరించారు. జీవితమంటే ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తుల సమాహారమేనన్నారు. ఉద్యమ నిర్మాణానికి సంబంధించిన కొన్ని అంశాలను సభలోని ప్రతివారూ నోట్‌ చేసుకోవడం గమనిస్తే, ఆ సభ కూడా శిక్షణాలయముగా తలపిస్తుందని అనక తప్పదు. కొన్ని నినాదాలు చేస్తూ ''సత్యాన్ని గమనించు, అంగీకరించు, స్వీకరించు, ఆచరించు'' అంటూ ఉద్యమకారుల విషయంలో ''వెదుకు, గమనించు, సమీకరించు, సంఘటిత పరుచు, పోరాడు'' అంటూ కలసిపోదాం, కలుపుకు పోదాం, చేయందిద్దాం, చేయందుకున్నామన్నారు. సభ్యత్వము గల ప్రతి ఒక్కరూ తమలాంటి వారిని మూడునెలలకు ఒకరిని చేర్పించినా ఆ ఉద్యమము మహోద్యమము అవుతుందన్నారు. అలానే భవిష్యత్తు కార్యాచరణను గురించి వివరించారు. ఆ వివరాలివిగో...

భవిష్యత్‌ కర్తవ్యాలు :

మండల స్థాయిలో సభ్యత్వాన్ని, నూతన మండల కమిటీలను, కళాశాల సమావేశాలను, శిక్షణ పొందగోరు వారిని, గ్రామ సభలు నిర్వహించుట గురించి కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది.
రాష్ట్రంలో ప్రతి గ్రామం నుండి కనీసం ఒక దరఖాస్తును, ప్రతి రెండు నెలలకు పెట్టాలని, ప్రతి మండలంలో కనీసం 10 కార్యాలయాల్లో దరఖాస్తులు పెట్టాలని, జిల్లా స్థాయిలో 40 కార్యాలయాల్లో దరఖాస్తులు పెట్టాలని నిర్ణయించటం జరిగింది.

ముఖ్యంగా 4(1)బి ని అడిగి తెలుసుకొని లేని కార్యాలయాల్లో 4(1)బి ని పెట్టాలని కోరుతూ ధరఖాస్తును పెట్టాలి.
ఈ మహాసభలో కొంతమంది తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. చర్చల అనంతరం వాటిని మహాసభ ఆమోదించటం జరిగింది. తీర్మానాలను ప్రవేశపెట్టిన వారు...

1. జంపా క్రిష్ణకిషోర్‌, ప్రధాన కార్యదర్శి, 2. బి.శ్రీనివాసరావు, ఏలూరు,                3. ఎ.హొన్నూరప్ప, అనంతపురం, 4. కె.రామచంద్రరావు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యకక్షుడు, 5. పి.సత్యనారాయణ, కృష్ణాజిల్లా కోశాధికారి, 6. నటుకుల శ్రీనివాసరావు, ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి, 7. ఆట్ల బాలాజీరెడ్డి, గుంటూరు జిల్లా కో కన్వీనర్‌.

మహాసభలో ప్రవేశ పెట్టిన తీర్మానాలు :

కమీషనర్ల వికేంద్రీకరణ జరిపి ప్రతి 2,3 జిల్లాలకు ఒక కమీషనర్‌ అందుబాటులో ఉండే విధంగా చూడాలని,
అప్పిలేట్‌ అధికారుల వివరాలను తెలియజేసే బోర్డుల మీద విధిగా రెండవ అప్పీలేట్‌ అధికారియైన సమాచార కమీషనర్ల పేర్లను కూడా ప్రాంతీయ భాషలలో రాయించాలని అన్నారు. అలాగే చాలా కార్యాలయాల్లో అధికారులు బదిలీలలో వెళ్ళినప్పుడు క్రొత్తగా వచ్చిన అధికారుల పేర్లను వెంటనే మార్చాలని, అసలు ఈ బోర్డులు లేనిచోట్ల వెంటనే ఏర్పాటు చేయాలని.

పౌర సమాచార అధికారులకు విధిగా శిక్షణను ఇప్పించాలని.
సెక్షన్‌ 4(1)బి ని సక్రమంగా అమలు చేయాలని.
స.హ. చట్టం మీద పనిచేసే కార్యకర్తలపై జరుగుతున్న దాడులమీద ప్రభుత్వం స్పందించి అందుకు కారకులైనవారిపైన కఠినచర్యలు తీసుకోవాలని, మరణం సంభవించిన కార్యకర్తల కుటుంబాలకు నష్టపరిహారం మరియు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని.
అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ మరియు ఎయిడెడ్‌ విద్యా సంస్థలలో కూడా ఈ 4(1)బి ని అమలు చేయాలని.
స్థానిక సంస్థలకు రావలసిన అధికారాలు, నిధులు సక్రమంగా బదలాయింపు జరపాలని అందుకోసం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రజలచేత అందుకు వత్తిడి చేయించాలని.
ప్రజలు తమ యజమానితనాన్ని ప్రదర్శించేందుకు తీసుకురాబడిన స.హ.చట్టం-2005 ప్రజలకు సులభంగా అర్ధమయ్యేలా అవగాహనా కార్యక్రమాలు చేపట్టేందుకు, ఆ విషయమై పుస్తకాలు ముద్రించేందుకు, ఉచితంగా పంపిణీ చేసేందుకు, ప్రజలలో ప్రచారం చేసేందుకు ప్రభుత్వం కృషిచేయాలని.
రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించి రాజకీయ నాయకులను అధిపతులుగా నియమించి గ్రామ సభలను ఏర్పాటుచేస్తున్నది. వాటిలో సమాచార కమీషనర్లను మరియు స.హ.ప్రచార ఐక్యవేదిక నుండి కూడా నామినేటెడ్‌ సభ్యులుగా తీసుకోవాలి.

స్థానికంగా ప్రభుత్వాధికారులు నిర్వహించే సభలు, సమావేశాలకు ఐక్యవేదిక బాధ్యులను కూడా ఆహ్వానించాలని తీర్మానం చేశారు.

ఈ మహాసభలో నూతన కమిటీగా ఈ క్రిందివారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది.

గౌరవాధ్యకక్షులుగా : డా||వి.బ్రహ్మారెడ్డి,

అధ్యక్షులుగా : పుట్టా సురేంద్రబాబు,

ఉపాధ్యకక్షులుగా : తోటకూర కృష్ణమూర్తి రాజు, ఎ. లోకనాధ్‌,

ప్రధాన కార్యదర్శులుగా : జంపా క్రిష్ణకిషోర్‌, పి.వేణుగోపాల్‌రెడ్డి,

కార్యదర్శులుగా : కోట ప్రసాదశివరావు, ఎ. రాజన్న, షేక్‌ అబ్దుల్‌ రహీం,


కోశాధికారిగా : ఎం. మాధవి


మరియు 30 మందితో కార్యవర్గాన్ని ఎన్నుకోవటం జరిగింది.

సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక కొంతమంది వదాన్యులను, సహాయ సహకారములు అందించిన వారిని గుర్తించి వారికి జ్ఞాపికలు అందజేసింది. వారు..

1. పుట్టా రామకృష్ణ, హైదరాబాద్‌, 2. ఎం. విజయలక్ష్మి, సత్యాన్వేషణ మండలి, 3. డా|| వి.బ్రహ్మారెడ్డి, జన విజ్ఞాన వేదిక అధ్యకక్షులు, 4. డా|| నాగేశ్వరరావు, ఒంగోలు, 5. ఎ.లోక్‌నాథ్‌, ప్రధాన కార్యదర్శి, జైభారత్‌, 6. డి. సాంబశివరావు, ఫ్రండ్స్‌ షూ కంపెనీ అధినేత, 7. పి.మోషే, సత్యాన్వేషణ మండలి, అధ్యకక్షులు, 8. ఎం. శ్రీనివాసరావు, సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక ప్రకాశం జిల్లా అధ్యకక్షులు, 9. తులసీ జిగీష, స.హ.ప్ర.ఐక్యవేదిక ఒంగోలు జిల్లా కోశాధికారి తదితరులకు జ్ఞాపికలు అందజేయడంతో మహాసభ ముగిసింది.                      

 రిపోర్టు : కోట ప్రసాదశివరావు

Monday, April 1, 2013

హేతువాద పునరుజ్జీవనయత్నాల మలిసమావేశాలు దోరకుంటలో

ఆహ్వానము


హేతువాద ఉద్యమాన్ని ముందుకు నడిపించాలన్న ఆకాంక్ష కలిగిన హేతువాద మిత్రులందరికీ ఇదే మా ఆహ్వానం. 2013 ఏప్రియల్‌ 27, 28 తేదీలలో నల్గొండ జిల్లా కోదాడ మండలం, దోరకుంటలోని సత్యాన్వేషణ మండలి కేంద్ర కార్యాలయంలో జరుగు సమావేశానికి హాజరయ్యేవారు ముందుగా తెలియపర్చి హాజరుకాగలరు. ఉదయం 9.00 గంటలకు సమావేశం మొదలవుతుంది కాన సమయపాలన ఖచ్చితముగా పాటించగలరు. హేతువాదము అన్న శీర్షిక క్రింద చర్చ జరుగును గాన తమతమ అభిప్రాయాలను వ్రాతపూర్వకంగా తయారుచేసుకొని చర్చకు సంసిద్ధులై రాగలరు.

రూట్‌ : హైదరాబాద్‌ నుండి వచ్చువారు కోదాడ దిగి 5 కి.మీ. దూరంలోని దోరకుంటకు సర్వీస్‌ ఆటోలో రాగలరు. విజయవాడ నుండి రాగోరు వారు నల్గొండ లేక కోదాడ బస్‌ ఎక్కి కోదాడకు 5 కి.మీ. ముందు దోరకుంట చెరువు దగ్గర అని అడిగి దిగి రాగలరు.

Tuesday, May 1, 2012

ఐక్యవేదిక ఉద్యమ సమాచారం


ఉద్యమ మిత్రులారా !, స.హ.కార్యకర్తలారా !


ముందనుకున్న ప్రకారం మే 5,6 తేదీల సమావేశాలు హైదరాబాద్‌ చింతల్‌బస్తీలోని జనవిజ్ఞాన వేదిక కార్యాలయములో జరిగాయి. సంక్షిప్తంగా ఆ వివరాలిలా వున్నాయి.

5వ తేదీన కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి డా.బ్రహ్మారెడ్డి, రామకృష్ణరాజు, వేణుగోపాలరెడ్డి, వెంకట్రామయ్య, కృష్ణమూర్తిరాజు, రాజేంద్రప్రసాద్‌, లోకనాథ్‌, సత్యనారాయణ, నటుకుల శ్రీనివాస్‌, జంపా క్రిష్ణకిషోర్‌, సురేంద్ర, కోట ప్రసాదు గార్లు హాజరయినారు.

Thursday, March 1, 2012

ఉద్యమ సమాచారం


సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక ప్రాంతీయ సదస్సు 2012, ఫిబ్రవరి 1న దోరకుంటలో జరిగింది. ఈ సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవటం జరిగింది. అవి :
గ్రామాలను దత్తత తీసుకొన్న ఉద్యమ సంస్థలు ఆయా జిల్లా లోని గ్రామాలను సందర్శించి, గడించిన అనుభవంతో భవిష్యత్‌ ప్రణాళికను రూపొందించుకోవాలని నిర్ణయించటం జరిగింది. అదే విధంగా 2012, మార్చి 3న విజయవాడ, సాయిదత్తా టవర్స్‌ నందు ప్రాంతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు దత్తత తీసుకున్న సంస్థల నుండి మరియు వివిధ జిల్లాల నుండి 30 మంది హాజరయ్యారు. హాజరైన ప్రతినిధుల పేర్లు, అడ్రస్‌, ఫోన్‌ నెంబర్‌ వివరాలను అందరికీ తెలియపర్చాలని నిర్ణయించటం జరిగింది. ఆ ప్రకారంగా ఈ సదస్సుకు హాజరైన వారి వివరాలు క్రింద ఇస్తున్నాము.

Sunday, January 1, 2012

ఉద్యమ సమాచారం


సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక జిల్లా వారీ కార్యక్రమాల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు, కొవ్వూరు, తాళ్ళపూడి మండలాల్లో అవగాహన సదస్సులు డిసెంబర్‌ నెలలో వరుసగా 22, 23, 24 వ తేదీలలో మండల పరిషత్‌ కార్యాలయాల సమావేశపు హాలులో జరిగినవి. ఈ మూడు సమావేశాలు జిల్లా అధ్యకక్షులు శ్రీ తోటకూర కృష్ణమూర్తి రాజుగారు, మహిళా అధ్యకక్షురాలు శ్రీమతి కొండా నిర్మల గారి ఆధ్వర్యంలో జరిగాయి. ఉండ్రాజవరం వాస్తవ్యులు శ్రీ జి. వెంకటేశ్వరరావు గారు తమవంతు సహకారం అందించారు. ప్రధానవక్తగా గుంటూరుజిల్లా ఐక్యవేదిక శాఖ కోశాధికారియైన శ్రీ యర్రం శెట్టి జగన్‌మోహనరావుగారు ఐక్యవేదికను పరిచయం చేస్తూ రాజ్యాంగం మరియు స.హ.చట్టంలోని ముఖ్యమైన అంశాలు వివరించి, సమష్టిగా ఉద్యమించవలసిన ఆవశ్యకత గురించి వివరించారు. ప్రతిచోట సమావేశానికి 25 నుండి 30 మంది సభ్యులు హాజరవటం జరిగింది. ఈ సమావేశాలకు హాజరయిన సామాజిక సృహ కలిగిన పలువురు తమ వంతు సహకారాన్ని అందచేస్తామని, వారి వారి గ్రామాల్లో కూడా స.హ.చట్టం ఆవశ్యకతను,  73, 74 రాజ్యాంగ సవరణల ప్రాధాన్యతను వివరిస్తామని వాగ్ధానం చేశారు. ఆ విధంగా వాగ్ధానం చేసిన వారిలో 22 వ తారీకు జరిగిన నిడదవోలు మండల సమావేశంలో పిల్లా వెంకట సత్తారాజుగారు, వి.వి సత్యనారాయణగారు, బండారు వెంకటరామారావుగార్లు ఉన్నారు. ఈనాడు ముందడుగు తరపున ఆకారపు శ్రీనివాస్‌గారు హాజరై, స.హ.చట్టం సాధించిన విజయాలు చెప్పారు. వెంకట సత్తిరాజుగారు ఈ చట్టం పశ్చిమ బెంగాల్లో, కేరళలో సమర్ధవంతంగా అమలు అవుతున్నదని మనం దీన్ని ఎంతగా ఉపయోగించుకొంటే అంత ప్రయోజనం ఉంటుందని చెప్పారు.

Monday, August 1, 2011

సమాచారహక్కు ప్రచార ఐక్యవేదిక ఉద్యమ సమాచారం


జూలై 22, 23, 24 తేదీలలో ద్వారకుంటలో 6 జిల్లాలకు సంబంధించిన కీలక సమావేశం జరిగింది. ప్రధాన విచారణీయాంశంగా, రాబోయే 6 నెలల లోపు అంటే జనవరి 30, 31-2012 నాటికి సమాచారహక్కు ప్రచార ఐక్యవేదిక కార్యాచరణలో భాగంగా ఏమేమి పనులు పూర్తిచేయాలి? అందుకు కావలసిన సాధన సామగ్రి ఏమిటి?  మొదలగు వాటిని తీసుకున్నాం.

Friday, July 1, 2011

స.హా ప్రచార ఐక్య వేదిక రాష్ట్ర మహాసభ - సంగ్రహ సమీక్ష

యోచనాశీలురైన ఐక్యవేదిక ఉద్యమ మిత్రులారా ! కార్యకర్తలారా ;
ప్రణాళికాబద్దమైన నడవడి కలిగిన వ్యక్తులుగానీ, సంస్థలు గానీ, ఆయా ప్రత్యేక కార్యక్రమాలు జరుపుతున్నప్పుడు కార్యక్రమాలనంతరం ముఖ్యులంతా కూడి జరిగిన దానిపై సమీక్ష జరుపుకుంటుంటారు. ప్రస్తుతం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థలు, సమీక్షలు జరుపుకుంటున్నాయి గానీ, అవన్నీ దాదాపు నామమాత్రంగానే ఉంటున్నాయి. సమీక్షా సమావేశం ఒక మొక్కుబడిగా మారి, యాంత్రికంగా తయారైంది. నిజానికి సమీక్షయొక్క లక్ష్యం జరిగినదాన్నంతా నిశితంగా పరిశీలించడమే.

Friday, January 1, 2010

అధ్యయన, శిక్షణ తరగతులు


యోచనాశీలురైన ఉద్యమ మిత్రులారా!
దాదాపుగా ఏ సంస్థ తలపెట్టిన కార్యక్రమాలైనా అనుకున్నపని అనుకున్నరీతిలో అనుకున్నంతగా పూర్తికావడం లేదన్నదో వాస్తవం. ఈ అసంతృప్తి ఆయా సంస్థలతో నిండా మునిగి పనిచేస్తున్న వారందరి అనుభవంలో వున్నదే. అందుకు కారణం ఉద్యమ క్షేత్రాలలో వుంటున్న, కనపడుతున్న వాళ్ళలో ఎక్కువమంది అవగాహన, తపన లేనివాళ్ళే. ఆయా సంస్థల నిర్వాహకులున్నూ, కార్యకర్తలకు అధ్యయన శిక్షణ తరగతులు నిర్వహించుకోవడంలో తగినంత శ్రద్ధపెట్టడంలేదు. నిజానికిదెంతో విచారకరమైన విషయం. ఇది చాలాదన్నట్లు, దీర్ఘకాలం, పెద్దయెత్తున సాగించాల్సిన ఉద్యమాలకు వనరుల కొరతా ఎంతో వుంటోంది. ఆయా సంస్థల సభ్యుడు దొరికితే చాలన్నట్లు భావిస్తుండడం, ఆ చేరినవారున్నూ, మొహమాటానికో, గొప్పకోసమో సభ్యులుగ చేరుతుండడంతో దాదాపు ప్రతి సంస్థలోనూ అది చేపట్టిన సామాజిక కార్యక్రమాలలోనూ క్రియాశీలంగా, తనకున్న శక్తియుక్తులనన్నింటిని వినియోగిస్తూ పనిచేస్తుండేవారు అతికొద్దిమందే అవుతున్నారు.

అధ్యయన, శిక్షణ తరగతులు



యోచనాశీలురైన ఉద్యమ మిత్రులారా!
దాదాపుగా ఏ సంస్థ తలపెట్టిన కార్యక్రమాలైనా అనుకున్నపని అనుకున్నరీతిలో అనుకున్నంతగా పూర్తికావడం లేదన్నదో వాస్తవం. ఈ అసంతృప్తి ఆయా సంస్థలతో నిండా మునిగి పనిచేస్తున్న వారందరి అనుభవంలో వున్నదే. అందుకు కారణం ఉద్యమ క్షేత్రాలలో వుంటున్న, కనపడుతున్న వాళ్ళలో ఎక్కువమంది అవగాహన, తపన లేనివాళ్ళే. ఆయా సంస్థల నిర్వాహకులున్నూ, కార్యకర్తలకు అధ్యయన శిక్షణ తరగతులు నిర్వహించుకోవడంలో తగినంత శ్రద్ధపెట్టడంలేదు. నిజానికిదెంతో విచారకరమైన విషయం. ఇది చాలాదన్నట్లు, దీర్ఘకాలం, పెద్దయెత్తున సాగించాల్సిన ఉద్యమాలకు వనరుల కొరతా ఎంతో వుంటోంది. ఆయా సంస్థల సభ్యుడు దొరికితే చాలన్నట్లు భావిస్తుండడం, ఆ చేరినవారున్నూ, మొహమాటానికో, గొప్పకోసమో సభ్యులుగ చేరుతుండడంతో దాదాపు ప్రతి సంస్థలోనూ అది చేపట్టిన సామాజిక కార్యక్రమాలలోనూ క్రియాశీలంగా, తనకున్న శక్తియుక్తులనన్నింటిని వినియోగిస్తూ పనిచేస్తుండేవారు అతికొద్దిమందే అవుతున్నారు.

ఐక్యమిత్రమండలి


ఐక్యమిత్రమండలి
ఉద్యమ మిత్రులారా!
2, 3 సంవత్సరాలు ఎంతోమంది చేసిన సమష్టి కృషివల్ల ఏర్పడిందే మన ఐక్యమిత్రమండలి. ఈమధ్యకాలంలో ఏసంస్థకాసంస్థకు, తానెత్తుకున్న పనుల వత్తిడివల్ల, ఐక్యమిత్రమండలి పేరున జరుపుకోగల ఉమ్మడి కార్యక్రమాలు కొద్దిగా వెనకబడ్డాయి. ఐక్యమిత్రమండలి ఆవిర్భవించడానికి మనస్సుపెట్టి కృషిచేసినవారికీ, ఐక్య మిత్రమండలిలోని మిత్రసంస్థల సహాయ సహకారాలందుకున్న వారికీ ఆ వేదిక నిరంతరం చైతన్యవంతంగా వుండడం ఎంత మేలు కలిగించగలదో తెలుసున్న విషయమే. ఎంతో అవగాహన పునాదిగా ఏర్పరచుకున్న ఆ వేదిక, వివిధ సంస్థల మధ్య, ఆయా సంస్థలకు చెందిన సభ్యుల మధ్య బలమైన ఆత్మీయతాబంధాన్ని నెలకొల్పగలిగింది. అప్పటివరకు ఉద్యమ క్షేత్రాలలో నెలకొనివున్న ''ఎవరిపని వారిది, ఎవరికి వారం'' అనుకుంటుండే ధోరణి మారి, సామాజిక హితకరమైన ఏపనైనా మనందరిదీ, మనం ఎవరికి వారం కానేకాదు, అవసరమైన ప్రతిసారీ అవగాహన, ఆత్మీయతతో ఒక్కటవగల అందరం, అన్న ధోరణి ఏర్పడి బలపడుతూ వస్తోంది.

Sunday, November 1, 2009

మిత్రసంస్థల అధ్యయన శిక్షణ తరగతులు-1



యోచనాశీలురైన ఉద్యమ మరియు పాఠక మిత్రులారా!
ఒక సంతోషకరమైన వార్తచెప్పాలి ముందుగా. సమాజం బాగుండాలి. సమాజంలో కొనసాగుతున్న (ప్రచలిత మవుతున్న) భావజాలంలోని అశాస్త్రీయాంశాలను వెలికితీసి ప్రజలు వాటిబారిన పడకుండేలా వారిని చైతన్యపరచాలనీ, అలాగే వున్న భావజాలంలోని అశాస్త్రీయాంశాలను వెలికితీసి ప్రజలు వాటిబారిన పడకుండేలా వారిని చైతన్యపరచాలనీ, అలాగే వున్న భావజాలంలోని శాస్త్రీయాంశాలను వారిలో బలంగా నాటుకునేలా గట్టి పూనికతో పనిచేయాలనీ తలంచే సంస్థలలో కొన్ని ఒక్కటై స్థిరంగా కొంతకాలంపాటు ఎంపిక చేసుకున్న అంశాలపై ఎంపిక చేసుకున్న ఉద్యమ సహచరులతో కూడి అధ్యయన, శిక్షణ తరగతులు నిర్వహించుకోవాలన్న నిర్ణయానికి వచ్చాయి. ఉద్యమ నిర్మాణానికీ, బలానికీ కూడా ఆధారస్థానమైన సమర్థులైన కార్యకర్తల నిర్మాణం దిశగా పని మొదలెట్టాలనుకోవడం, మనందరికీ మిక్కిలి సంతోషకరమేకదా.

Tuesday, September 1, 2009

ఉద్యమ సమాచారం



1) 18-8-2009 మంగళవారం సత్యాన్వేషణ మండలి సభ్యులు శీలం నాగార్జునరావు, శివారెడ్డి, జగన్‌మోహన్‌రావుగార్లు మంగళగిరిలోని బి.సి. బాలికల వసతి గృహములో 8, 9, 10 తరగతులు చదివే బాలికలకు, చదువు నేర్వడంలోని మెళకువలు నేర్పారు.

Saturday, August 1, 2009

త్రైమాసిక సమావేశ విశేషాలు



అనుకున్న ప్రకారం ది. 11, 12, 13 లలో మండలి త్రైమాసిక సమావేశాలు కేంద్ర కార్యాలయంలో జరిగాయి. షుమారు 15 నుండి 20 మంది వరకు కార్యకర్తలు హాజరయ్యారు.
సమావేశాన్ని ఉద్దేశించి ముందుగా నాలుగు మాటలంటూ సురేంద్రబాబుగారు మొదలెట్టారు. వారి మాటల్లోనే చూడండి.

Wednesday, July 1, 2009

వరంగల్‌జిల్లా పాఠకుల సమావేశం



వరంగల్‌జిల్లా వివేకపథం పాఠకుల సమావేశం ది.28-6-2009న బాపూజీ స్కూలు, కిషన్‌పుర, హన్మకొండనందు జరిగింది. షుమారు 20 నుండి 25 మంది వరకు వివేకపథం పాఠకులు, మిత్రసంఘాల కార్యకర్తలు జనవిజ్ఞానవేదిక నుండి, మానవ వికాసవేదిక నుండి అలానే అంబేద్కర్‌ సంఘ జిల్లా అధ్యకక్షులు ఫ్రాన్సిస్‌ పాల్గన్నారు. ఈ సమావేశం టి.రాములు, బుచ్చిరాములు, ఎం.రాజుల ఆధ్వర్యంలో జరిగాయి.
సమావేశం కూన సమ్మయ్య, కూన మొగిలి, బత్తిన స్వాముల స్వాగతం సుస్వాగతం, సభికులకు స్వాగతం అన్న పాట వినిపించడంతో ప్రారంభమైంది.

ఆస్తికక్షేత్ర విచారణ-పూర్వరంగం



యోచనాశీలురైన ఆస్థిక నాస్తిక పక్షీయులారా! తత్వాధ్యయనాభిలాషులారా!
ఏ తాత్విక సిద్ధాంతమైనా, తనదైన పారిభాషిక పదకోశాన్ని కలిగి వుంటుంది. ఆ పదాలకు తానంగీకరించే నిర్వచనాలను-నిర్దిష్టమైన అర్థాలను-చెప్పే, తన సిద్ధాంత ప్రతిపాదనలను, వాదనలను సమాజం ముందుకు తెస్తుంది.
గమనిక : ఆ నిర్వచరూపాలూ, భాషా పరిమితులకు లోబడే వుండాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి.
కనుక ఆయా ధోరణుల పరిభాష గురించి అవగాహన లేకుండా, వాటిని ప్రతిపాదించి వాదించబూడనడంగానీ, తిరస్కరించి ప్రతివాదన చేయబూనడంగానీ అనుచితమైన పనే అవుతుంది. సిద్ధాంత ఖండనకైనా, మండనకైనా పరిభాష తెలిసి వుండడం తప్పనిసరి. ఈ సందర్భంలో అవసరమైన కొన్ని పారిభాషికాలను ఉదహరిస్తాను చూడండి.

Friday, May 1, 2009

మండలి త్రైమాసిక సమావేశ విశేషాలు-వివరాలు


మండలి త్రైమాసిక సమావేశ విశేషాలు-వివరాలు
ముందుగా ప్రకటించినట్లుగానే సమావేశాలు 26-4-2009 ఉదయం 9 గంటల నుండి ప్రారంభమయ్యాయి. ఎన్నికల ప్రభావం, వేసవి వాతావరణ ప్రభావం సభ్యుల హాజరుపై ప్రభావం చూపింది. వృత్తిరీత్యా ఉపాధ్యాయులుగా వున్న సభ్యులు కొందరు ఎన్నికల కార్యక్షేత్రంలో క్రియాశీలంగా ఉన్న మరికొందరు, వేసవి ఎండలకు ఆరోగ్యం సరిలేక మరికొందరు సమావేశాలకు హాజరు కాలేకపోయారు. ఆ కారణంగా 20 మంది మాత్రమే హాజరయ్యారు.

గుంటూరుజిల్లా వివేకపథం పత్రిక పాఠకుల సమావేశం


గుంటూరుజిల్లా
గుంటూరుజిల్లా వివేకపథం పత్రిక పాఠకుల సమావేశం 29-3-2009 ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటలవరకు బాపట్లలో రామానుజ కూటములో జరిగింది. పాఠకులు గుంటూరు, నర్సరావుపేట, పొన్నూరు, బాపట్ల, ఏటిగట్టుపాలెం, కర్లపాలెం, గవినివారిపాలెం మొదలగు ప్రాంతాల నుండి వచ్చారు. ఈ సమావేశమునకు ఉన్న ప్రత్యేకత ఏమంటే, కృష్ణాజిల్లా, ఖమ్మంజిల్లాలలో జరిగిన పాఠక సమావేశాల్లో అక్కడి స్థానికులే ఎక్కువమంది రాగా, ఈ సమావేశాలకు జిల్లాలోని అన్ని ప్రాంతాలనుండి వచ్చారు. అంతేకాక వచ్చిన సభ్యులు విషయం వినటంతోపాటు వారి వారి అభిప్రాయాలు నిక్కచ్చిగా వెలిబుచ్చటంలో ఆసక్తి కనబరిచారు. ఇక వివరాల్లోకి వెళ్తే -

వివేకపథం పాఠకుల సమావేశం-ఖమ్మంజిల్లా నివేదిక - ఎం. నిర్మల్‌కుమార్‌, వై.జగన్మోహనరావు


వివేకపథం పాఠకుల సమావేశం-ఖమ్మంజిల్లా నివేదిక
రిపోర్టర్స్‌ : ఎం. నిర్మల్‌కుమార్‌, వై.జగన్మోహనరావు
ది. 22-3-2009న ఖమ్మం జిల్లాస్థాయి వివేకపథం మాసపత్రిక పాఠకుల సమావేశం సత్తుపల్లిలోని ఎస్‌.ఎస్‌.ఆర్‌. జూనియర్‌ కళాశాలలో ఉదయం గం|| 9-45 నుండి సాయంత్రం 6-15 వరకు జరిగింది. సత్యాన్వేషణ మండలి రాష్ట్ర బాధ్యులు కె. ప్రసాద్‌, సిహెచ్‌.నాగార్జునలు వక్తలుగా పాల్గొనగా, జగన్‌గారు ఈ సమావేశానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. చెరుకూరి వెంకట్రామయ్యగారు సమావేశానికి అధ్యక్షత వహించారు. దాదాపు ముప్పైమంది పాఠకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సభికులందరూ తమకు సత్యాన్వేషణ మండలి మరియు వివేకపథం పత్రికలు ఏ విధంగా పరిచయమయ్యాయో తెలియచెపుతూ తమ సొంత పరిచయం కూడా చేసుకున్నారు. హేతువాద ఉద్యమాలద్వారా, కమ్యూనిస్టు ఉద్యమాలద్వారా శాస్త్రీయ ఆలోచనామార్గంలో పయనించడం ప్రారంభించిన తాము ఆ మార్గంలో ఈ సంస్థకు దగ్గరయ్యామని ఎక్కువమంది తెలిపారు. మరికొందరు మితృల సలహాలతో మండలి సమావేశాలకు హాజరై క్రమంగా ఈ సంస్థ భావజాలానికి ఆకర్షితులమయ్యామని కొందరు తెలిపారు. ఏ భావాలు మంచివో, ఏ భావాలు వాస్తవాలను ప్రతిబింబిస్తాయో, సత్యం తెలుసుకోవడం ఎలాగో, తెలుసుకొనేముందు సరైన మార్గాన ప్రయాణించేందుకు వివేకపథం పత్రిక ఉపయోగపడుతుందని సభికులు తెలిపారు. సీనియర్‌ హేతువాడివెంకటేశ్వరరావుగారు (వెల్‌కమ్‌ హోటల్‌) పత్రిక, మండలిపట్ల సానుకూల దృక్పథం కలిగివున్నట్లు చెప్పారు.