మత సామరస్య మన్నది చాలా చాలా పెద్ద మాట. వద్దికతో మనస్సుకు ఎంత బుద్ది చెప్పుకున్నా ఆచరణ సాధ్యం కాని మాట. ఎందరో దేశభక్తులైన మేధావులు మత వైషమ్యమనే వాస్తవ సమస్యను గుర్తించి దానికి పరిష్కారంగా మత సామరస్యం అన్న భావనను ప్రవేశపెట్టారు. ప్రజల హృదయాలలో ఆ భావన దృఢంగా నాటుకునేలా చేయాలని శక్తికిమించిన ప్రయత్నాలెన్నో చేస్తూ వచ్చారు. గట్టిగా కృషి చేస్తే అది సాధ్యమేనన్న భ్రమను మాత్రం కొందరు ఆలోచనా పరుల్లో కలిగించగలిగారు. వారలా భ్రమకు లోనవడానికి కొన్ని వాస్తవ పరిస్థితులూ దోహదపడ్డాయి. కారణాలయ్యాయి. అందులో అతిబలమైంది భారతీయ బహుదైవారాధన సంస్కృతి. భారతీయ ఆస్తిక చింతనలోనే అనేక దేవీదేవతలున్నారు. వారికి ఎవరిస్థాయిలో వారికి తరతమ భేదాలతో శక్తులుంటాయి. పైగా ఒక్క దేవత ఒక్కొరకమైన ఇష్టాఇష్టాలతో కూడి కొన్ని రకాల పనులకు అభిమాన దేవతగా ఉంటారు. వారంతా మిత్రులుగానే ఉంటూ పరస్పరం సహకరించుకుంటూ ఎవరి పనుల్లో వారుంటుంటారు. వారిలో వారు ఒకరికొకరు ఉత్తరోత్తరా అధిక సామర్ధ్యము ఈశ్వరీయ విశ్వవ్యవస్థలో అధిక హోదా కలిగి ఉంటారు. లాటి భావాలు (విశ్వాసాలు) పోతపోసిన ఉక్కులా గట్టిబడిఉన్నాయి. నూటొక్క దేవుళ్ళకు నూటక్క దండాలు అన్న దృష్టి బలంగా నాటుకుపోయి ఉంది. దైవం వివిధ అవసరాల రీత్యా వివిధ రూపాలలో అవతారాలనుధరిస్తుంది. అంశావతారాల పేరున చిన్న చిన్న చిల్లర దేవతలూ పుట్టుకొస్తుంటారు లాటి భావాలన్నీ ఈ దేశ ఆస్తిక జన సమూహపు నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉన్నాయి. కనుకనే, ప్రకృతినీ దేవతగా ఆరాధించారు, రకరకాల జీవజాతుల్ని దేవతలుగ ఆరాధించారు, అసాధారణ లక్షణాలను, సామర్ధ్యాలను కనబరచిన మానవులనూ అవతారులుగ భావించి పూజించారు. ఒక వంక దేవుడొక్కడే అంటూనే, ఈ వివిధత్వాన్ని జీర్ణించుకుని, మనమంతా ఒక్కటే, విశ్వాసాలు ఎవరిష్టంవారిది అన్న పోకడకు అలవాటు పడిపోయారు. అదిగో ఆ అలవాటే, వారిలో మతసామరస్యం ఆచరణ సాధ్యమేనన్న భ్రమకుకారణమైంది జరిగిన పొరపాటెక్కడంటే, బహుదైవారాధన సరైందేనన్న భావాన్ని అంతస్సూత్రంగా అంగీకరించిన వారి మధ్య మత వైషమ్యానికి తావుండదు. మత సహనానికే గాక, పరమతాలను గౌరవించడానికీ అడ్డు ఉండదు. బహుదేవతలువాస్తవం అనుకుంటూ ఒక్కొక్కరూ, ఒక్కో కుటుంబము కూడా అనేక దేవతలను పూజించడానికి అలవాటుపడ్డ భారతీయుని హృదయం రక్త సంబంధీకులలో, కుటుంబ సంబంధీకులలో, ఇరుగుపొరుగు సంబంధీకులలో నెలకొని ఉన్న వివిధ దైవారాదనలను గమనిస్తూనే జీవిత సంబంధాలలో, సామాజిక సంబంధాలలో సామరస్య ధోరణి అలవరచుకోడమేగాక, అదొక సాంప్రదాయంగా, సంస్కృతిగానూ వంటబట్టించుకుని ఉన్నారు ఇక్కడి సామాన్యజనం కూడా. ఈ సామరస్య ధోరణే మత సామరస్యం సాధ్యమేనన్న భ్రమకులోను చేసింది వారిని. నిజానికిక్కడ జరిగింది మత సామరస్యం కానే కాదు. మన ప్రస్తుతాంశం, బహుదైవారాధన సరైందేనని అంగీకరించి, ఆ అనేక దేవతలమధ్యనూ స్నేహ సంబంధాలున్నట్లున్న గ్రంధ్రాలను చదివి, ప్రసంగాలను విని, ఒకే కుటుంబంలో ఈ కుటుంబంతనది ఇందులోని వాళ్ళు తన వాళ్ళు అనుకుంటూ, వారి సుఖం తన సుఖంగా, వారి దుఃఖం తన దుఃఖంగా తలంచుతూ బ్రతుకు సంబంధాలలో ఉన్నవారి మధ్య నెలకొన్న సామరస్యాన్ని గురించింది కాదు. తమ దేవుడే అసలు దేవుడు. మిగిలిన వాళ్ళు దేవుళ్ళంటున్నది దేవుళ్ళు కాదు. దయ్యాలు. పైగా తమ దేవుణ్ణో, తమ ప్రవక్తనో, తమ బోధకుణ్ణో అంగీకరించనివాళ్ళు తమకు శతృపక్షంలోని వారే. వారు తమ మార్గంలో కన్నా రావాలి, లేదా అణగిమణిగైనా ఉండాలి. లేదా చావుకు సిద్దపడాలి అని బండగా, మొండిగా నిలబడి ఉన్న మతం వాళ్ళతో సామరస్యం సాధ్యమా కాదా అని మాట్లాడుతున్న సందర్భం ఇది. ఖురాను ప్రకారం యూదులూ, క్రైస్తవులూ ముస్లింలకు శతృపక్షం. ఇక బహుదైవారాధకులు, విగ్రహారాదకులైతే ఖురానుకూ, బైబిలుకూ కూడా శతృపక్షమే. ఈపచ్చి నిజాన్ని గమనిస్తేనే పై శీర్షికాంశం అర్ధమవుతుంది. మత సామరస్యం సాధ్యమేననుకున్న వాళ్ళలో అప్జల్ గురు - అస్పుల్లాఖాన్ లాటి వారూ, కులదీప్ నాయర్, సరిహద్దు గాంధీగా పేరుగాంచిన వాళ్ళూ ఉన్నారు. ఇక గాంధీ అయితే, హిందూ ముస్లింల మధ్య సోదర బావాన్ని నెలకొల్పడానికి, సమన్యాయమన్న దానినీ ప్రక్కన బెట్టి, ముస్లింలను బుజ్జగించేపనినీ హిందువులను కట్టడి చేసే పనికీ కూడా సిద్దపడ్డాడు. గాంధీ అయితే తన అంతిమ దినాల్లో తాను విఫలమయ్యానన్న విషయాన్ని గమనించాడు కూడా. ఆ వాస్తవాన్ని జీర్ణం చేసుకోడానికే చాలా మనోవేదననుభవించాల్సి వచ్చిందాయనకు. అటు తరవాత ఈ యత్నంలో విఫలమైనానని గుర్తించిన వారు కులదీప్ నాయర్. అయినా, ఈ వాస్తవాల నేమీ పట్టించుకోకుండా పడికట్టుపదంలా మత సామరస్యాన్ని గురించి మాట్లాడే కుహనా మేధావులెంత మందో తయారయ్యారీనాడు. కొద్ది మందైతే నిజాయితీగానే ఇంకా మత సామరస్యం సాధ్యమేనన్న భ్రమలోనే సాగుతున్నారిప్పటికీ. మనుష్యుల మధ్య సామరస్య భావన చాలా బలమైన ఆత్మీయానురాగ బంధాలు నెలకొని ఉంటే గాని సాధ్యపడదు. 'మమ' అన్న భావన అంతరంగంలో - పైపై మాటలలో కాదు - ఘనీభవించి ఉంటేనే సామరస్యం - (సమరసత్వం) ఆచరణలో ప్రకటమవుతుంది. ఇక కరడుగట్టిన రీతిలో 'పర' అన్న భావాన్ని నూరిపోసిన మతాలను నెత్తికెత్తుకున్న వాళ్ళకు స్వమతస్థులకంటే వేరైన మతం వాళ్ళతో సామరస్యం ఎలా కుదురుతుంది? ఇవన్నీ లోతుగా, నిశితంగా పరిశీలించే, ఈ దేశస్థులు ఉమ్మడి విషయాలలో లౌకిక దృష్టి కలిగి ఉండడం, భారత రాజ్యాంగానికి విధేయులై అలా మసలుకోవడం వినా గత్యంతరంలేదన్న వాస్తవాన్ని గ్రహించే మత విశ్వాసాన్ని వ్యక్తిగత స్వేచ్ఛకు చెందిన ప్రాథమిక హక్కుగానూ, ఉమ్మడి తనంలో భారతీయత అన్న దానిని జాతిగా పరిగణించాలన్నది విధిగానూ రాజ్యాంగ సూత్రీకరణల్లో పొందుపరచారు. కనుక, ఎట్టి పరిస్థితుల్లోనూ, బైబిలు, ఖురాన్ ఆధారిత మత ధోరణికి చెందినవారు, తమ గ్రంథం చెపుతున్న దాని ప్రకారం అన్యులైన వారిలో మత సామరస్యం కలిగి ఉండడం సాధ్యంకాదు. కనీసం మత సహనం కలిగి ఉండాలన్నా 1) వారిపై ఖురానుకు వేరైన రాజ్యాంగపు వత్తిడి బలంగా ఉండాలి. 2. లేదా, ఈ విషయం వరకైనా వారు ఖురాను ఆదేశాన్ని ఈనాడు ఆచరణ సాధ్యంకాదని సడివించుకునైనా ఉండాలి. కనుక :- మొదట మత సామరస్యం సాధ్యమన్న భ్రమ నుండి బైటపడితేనే పరిష్కారాలకై వెదకనైనా వెదకవచ్చు ఆలోచించండి.
సంచిక నంబరు
150
151
152
153
154
156
157
158
159
160
161/162
163
167/168
169
170
171
172
173
174
175/176
177
178
179/180
181
182
183
184
185
186
187
188
189
190
191
198
199
200
201
202
203
204
205
206
210
215
218
219
222
225
226
227
228
229
230
231
232
240
Article
CTF
Editorial
Index
Letters
M1
M11
M12
M13
M2
M3
M4
M5
M6
M7
M8
M9
Meetings
Video
m10
మేలుకొలుపు
Showing posts with label religion. Show all posts
Showing posts with label religion. Show all posts
Friday, December 15, 2017
Thursday, March 23, 2017
కమ్ముకొస్తున్న యుద్ద మేఘాలు - కిం కర్తవ్యం
ఈ దేశంలో ఏనాడు ముస్లిం లీగ్ పురుడుపోసుకుందో, ఆనాడే ఈ దేశ భవిషత్తుకు
అభద్రతా పురుడుపోసుకుంది. భారతీయులుగ, ఆంగ్లేయుల్ని ఇటనుండి వెళ్ళగొట్టి
అన్నదమ్ములుగ కలిసి ఉండాల్సిన ఈ దేశస్తులు మత ప్రాతిపదికన రెండుగా
చీలిపోయారు. ముస్లింలు ఈ దేశంలోని వివిధ దైవ విశ్వాసాలలో, ఒక విశ్వాసానికి
చెందిన వారుగా మిగిలిన వారిలా ఇక్కడ కలసి ఉండలేకపోయారు. పైగా ఆనాటికి
ఇక్కడున్న ముస్లింలందరూ దాదాపుగా మతం మార్చుకుని ముస్లింలైనవారే. ఈ
దేశాన్ని సొంత దేశంగా తలచిన వాళ్ళే కదా! మరెందులా జరిగింది?. కారణమేమిటి? ఈ
దేశంలో ఏకేశ్వరారాధకులున్నారు. బహుదేవతారాధకులున్నారు. ఈశ్వరుని విషయంలో
ఒక నిర్ణయానికిరాని, రకరకాల విశ్వాసాల వాళ్ళూ ఉన్నారు. అవిశ్వాసులూ
ఉన్నారు. వారిలో ఎవ్వరికీ, తమ విశ్వాస మూలకంగా వేరు దేశంగా విడిపోదామన్న
ఆలోచన పుట్టనేలేదెన్నడూ. ఈ దేశం అఖండ భారతంగా లేని స్థితిలో, అంటే వివిధ
పెద్ద చిన్న రాజ్యాలుగా ఉంటున్న సందర్భంలోనూ విశ్వాస - మత - ప్రాతిపదికన
అట్టి రాజ్యాలు ఏర్పడడంగానీ, విశ్వాస ప్రాతిపదికన పాలన జరగడంగానీ
జరగనేలేదు. రాజులెవరైనా, రాజ్యాలేవైనా, వివిధ విశ్వాసాల వాళ్ళు వారారాధించే
దేవుళ్ళ మందిరాలూ అన్నీ, అంతటా విస్తరించే ఉంటుండేవి. అందరినీ ఆరాధించే
వాళ్ళు కొందరైతే, తామంగీకరించిన దేవతామూర్తిని మాత్రమే ఆరాధిస్తూ మిగిలిన
విశ్వాసాల పట్ల ఆరాధ్యుల పట్ల ఉదాసీనంగా ఉండేవారు ఇంకొందరు. తమ దైవాన్ని
అభిమానిస్తూ ఇతరాలను సరైనవి కావనిగానీ, తమ దైవం కంటే అల్పశక్తిమంతాలని
అనిగాని తలుస్తుండేవాళ్లు మరికొందరు. ఇలాటివన్నీ తెలీనివీ, తేలనివీ,
జీవితానికి అవసరంలేనివి అనే దృష్టికల రకరకాల ధోరణులవారూ ఈదేశంలో సామరస్య
పూర్వకంగా సహజీవనం చేస్తూనే వచ్చారు. అత్యంత ప్రధానమూ, ప్రాధమికమూ అయిన ఈ
నిజాన్ని మొదట గుర్తించాలి మనమంతా.
సైద్దాంతిక స్థాయిలో ఆ స్థాయి కలవాళ్ళమధ్య వాద వివాదాల రూపంలో పరస్పర విభేదాలుంటున్నా, సాధారణ ప్రజలంతా ఆ వివిధ సైద్దాంతికులందరినీ పెద్దలు - జ్ఞానులు - గానే విశ్వసించి గౌరవిస్తూనే ఎవరికి వారు, తమకు నచ్చిన ధోరణిని యధాశక్తి అనుసరిస్తూ, అందరూ సామాజికంగా సామరస్యంతో సహజీవనం సాగిస్తూ వచ్చారు.
ఈ సంస్కృతి - ఈ దేశ సంస్కృతిగా ఇక్కడి వారికి నరనరాన జీర్ణించుకుని అలవాటుగా మారి ఉంది కనుకనే చక్కగా కొనసాగుతూ వచ్చింది. ఏనాడైతే ఈ దేశంలో క్రైస్తవం అడుగుపెట్టిందో ఆనాటి నుండే 1) అటు క్రైస్తవంలోకి పోయినవారూ, వీరిని అటు లాక్కెళ్ళిన వారూ 2) తమ నుండి క్రైస్తవంలోకి వెళ్ళిన వారిని మతం మార్చుకున్న వారినిగానూ, విదేశీ మతాన్ని స్వీకరించిన వారినిగా, తలంచుతున్న ఇక్కడి నానా విశ్వాసాల వారూ కూడా పరస్పరం పరాయిభావనతో తమవారు, పరాయివారు అన్నదృష్టితో చూసుకోవడం ప్రారంభించారు. అందుకు బలమైన కారణం క్రైస్తవ్యానికి ఆధార గ్రంథంగా ఉన్న బైబిలు వాక్యాలలోనే, స్వజనులు - అన్యజనులు అన్న భావన బలంగా ప్రతిపాదింపబడి ఉండడమే. పైగా అందులో ఎహోవాను తప్ప అన్యులను ఆరాధించరాదన్న ఆదేశాలూ, బహుదైవారాధకులు, విగ్రహారాధకులు అవిశ్వాసులుగానూ, సాతాను పక్షం వారిగనూ, శతృవులుగానూ చూడాల్సిందే నన్న ఆదేశాలూ ఉండడం వల్లనూ, బైటికి ఇరుగుపొరుగుగా కొనసాగుతున్నా, లోలోపల మాత్రం బైబిలు విశ్వాసం ఎంత బలంగా ఉన్నదన్న దాన్ని బట్టి అంతగానూ క్రైస్తవేతరుల పట్ల వ్యతిరేకత పేరుకుంటూనే వచ్చింది. అయినా, అప్పట్లో, క్రైస్తవులు తమకంటూ ప్రత్యేక రాజ్యం ఉండాలన్న వైఖరిని కనబరచలేదు. ఈ నిజాన్ని చాలా స్పష్టంగా గమనించారు కనుకనే ఒక హిందువు మతం మార్చుకోవడమంటే హిందువు ఒకడు తగ్గడం కాదు. హిందూ వ్యతిరేక - శతృవు - ఒకడు పెరగడమని అర్ధం. అన్నాడు వివేకానంద.
ఇదంతా ఒక అంకం కాగా, భారత స్వతంత్ర పోరాటం ఒక ముగింపు దశకు చేరుకుంటున్న దశలో ముస్లింలంతా వేరుగా ఉండడానికే - ముస్లింలలోని బలమైన వర్గం సిద్దపడడం, అన్నది మరో స్వభావం కలిగిన ఇంకో అంకం. వారెందుకని అలాటి నిర్ణయం తీసుకున్నట్లు...?!
ద్విజాతి సిద్దాంతం అంటే రెండు మతాలననుసరించి, రెండు సమూహాలుగా దేశ ప్రజలను విడదీసే సిద్దాంతం - తెరపైకి బలంగా ముందుకొచ్చి, ఆ ప్రాతిపదికనే, ఒక్కటిగా ఉండాల్సిన దేశం రెండుగా విడివడింది అదీ ఎలా?
ముస్లింలు ఒక్కరూ ఒక జాతి, భారత దేశంలో మిగిలిన వారందరూ ఒక జాతి. హిందూ - ముస్లిం అన్న పేరున్నే, ద్విజాతి సిద్దాంతం ప్రబలంగా ముందుకొచ్చింది. ఇదెంతటి విడ్డూరం? విషాదకరం? అవివేక జనితం? ఆనాటి ఆ స్వార్ధపరులైన మేధావుల తప్పుడు నిర్ణయం యొక్క ఫలితాలను గత డెబ్బై ఏండ్లుగా అనుభవిస్తూనే వచ్చిందీ దేశం. ఈనాటి ఉద్రిక్త పరిస్థితీ, ఆ ద్విజాతిలోని ముస్లిలంతా ఒకేజాతి అన్న ప్రాతిపదికనుండే తన్నుకొచ్చింది. ఈనాడున్న జనాభాను బట్టి ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతంలో ''జనాభిప్రాయ సేకరణ (ప్లెబిసైట్) ప్రకారం నిర్ణయించుకుందాం'' అన్న కుట్రపూరిత వాదాన్ని ముందుకు తెస్తోంది పాకిస్తాన్. దానికి ఈ దేశంలోని మతిమాలిన అదోరకం మేధావి వర్గం (అమ్ముడుపోయిన అందామా?) వంతపాట పాడుతూ వస్తోంది.
నిజానికిది పాక్ భారత్ దేశాల సమస్య కానే కాదు. కాశ్మీర్ - భారతీయుల అంతర్గత సమస్య మాత్రమే. అయితే రష్యా, అమెరికా, చైనాలు వాటిమధ్య నెలకొనిఉన్న వాస్తవ పరిస్థితులు దృష్ట్యా, భారత్ - పాక్‌లతోనూ, అలాటి మరికొన్ని దేశాలతోనూ రాజకీయ ప్రయోజనాల రీత్యా, తమ ప్రాబల్యం నిలుపుకోవడానికి కొరకై శత్రుమిత్ర, అలీన వైఖరిని అవలంభిస్తూ వచ్చాయి. వస్తున్నాయి. భారత్ - పాక్ సరిహద్దు సమస్య ఒక కొలిక్కి రాకుండా, రావణ కాష్టంగా రగులుతుండడానికి అంతర్జాతీయ సంబంధాలు న్యాయ బద్దంగా లేకపోవడమూ ఒక కారణమేనన్నది చాలా ముఖ్యమైన అంశం. అంటే ఒక ప్రాంతంలో అధిక జనాభాగా ఉన్నవారు కోరితే (దేశాన్ని ముక్కలు చేయవచ్చన్నమాట! చేయాల్సిందేనన్నమాట! క్రైస్తవులంతాగానీ, సిక్కులంతాగాని అధికాధికంగా ఒక ప్రాంతానికి చేరి మైనారిటీ ప్రజాభిప్రాయం ప్రకారం తాము అఖండ భారత్ నుండి విడిపోతామంటే, అంగీకరించి వారినీ వారి ప్రాంతాన్ని విడగొట్టి ఉండండనాలన్న మాట. ఎంత వికృతమైన ఆలోచన ఇది? భారత్ రాజ్యాంగ స్ఫూర్తికి ఎంత విరుద్దమైన మాట ఇది?! ఎంత మంది కోరినా దేశాన్ని ముక్కలు మాత్రం చేయనేకూడదు.
ఈ దేశంలోని క్రైస్తవులకుగాని, ముస్లింలకుగానీ, తెగ ఎదిగిన వాళ్ళమంటుండే అనుకుంటుండే వామపక్ష, నాస్తిక, హేతువాద మేధావులకుగానీ ఇంత ప్రమాదకర సమస్య నెత్తిమీది కొచ్చికూర్చున్నా, అసలు సమస్యగానే కనపడదెందుకని? ఈ దేశ ముస్లింలు భారతీయులుగారా? వారికి ఈ దేశం పట్ల ప్రేమ, దేశ భద్రత పట్ల ఆందోళన ఉండక్కర లేదా? వారెందుకని ఏ కోన్ముఖంగా హమారా భారత్ మహాన్ అని ఎలుగెత్తి నినదించరు? జాతీయ పతాకానికి నమస్కరించడం తమ మత విశ్వాసానికి విరుద్దమంటూ ఏవేవో అడ్డగోలు వాదనలు చేయడమెందుకు?
దేశాన్ని ప్రేమించడానికీ, జాతి ప్రతీకలను గౌరవించడానికీ, ''అల్లా తప్ప ఆరాధ్యుడు లేడు'' అన్న సూక్తిని తెచ్చి అడ్డుపెట్టుకోవడమెందుకు? తండ్రికి నమస్కరించమా? తల్లికి నమస్కరించమా? పెద్దలకు నమస్కారమనమా? యజమానికీ, మిత్రులకు సలామనమా? ఇందరికి సలామనగాలేంది, దేశానికి, దేశ ప్రతీకలకు సలాం అనడం దగ్గరే 'అల్లా' ఎందుకు అడ్డొస్తున్నాడు? దేశాన్ని, పెద్దలను, దేశ ప్రతీకలను గౌరవించడాన్ని, అల్లాకంటే వేరైన వాటిని ఆరాధించడం అన్న తప్పుడు వివరణతో వ్యతిరేకించడమెందుకు? ప్రేమించడాన్ని - ఆరాధించడంగా తప్పుడు అర్ధాన్ని పులమడమెందుకు? ఒక ముస్లిం మక్కాను పవిత్ర స్థలంగా చూస్తాడా? లేదా? దానిని ప్రేమిస్తాడా, లేదా? అక్కడున్న నల్లబండను ఇతర బండలకంటె వేరుగా తలచుతాడా లేదా? అలాగే ప్రవక్తను ఇతర మనుషుల కంటె వేరుగా చూస్తాడా, లేదా? అతణ్ణి కుటుంబీకుల కంటె అధికంగా ఇష్టపడతాడా, లేదా? గౌరవిస్తాడా లేదా? విధేయత కనపరుస్తాడా, లేదా? నా కంటె ఈ లోకంలో నీకు అధిక ఇష్టుడుండరాదన్న ప్రవక్త మాటనేమి చేద్దాం? కనుక అల్లాను, ఖురానును చూపించి, రాజ్యాంగం పట్లా, ఈ దేశం (ఉంటూ, తింటూ) పట్లా; దేశ ప్రతీకల పట్లా విధేయతను కనపరచకపోవడం తప్పుడు పోకడే అవుతుందెవరికైనా.
ఈ దేశంలో పుట్టి, ఇక్కడే, పెరుగుతూ ఉన్న ఎవరికైనా ఈ దేశాన్ని ప్రేమించాల్సిన అవసరం ఉందా? లేదా? అది వారి విధి కాదా? కర్తవ్య కర్మ కాదా? ఈ దేశం కంటే మక్కానో, ఈ దేశంకంటే బెత్లహాంనో, రోంనో, మరో దాన్నో అధికంగా ప్రేమించే వారినేమనాలి? ఏమనుకోవాలి. వాటి యందలి వీరాభిమానం వల్ల, ఈ దేశానికి అపకారం చేయడానికీ వెనకాడని, సిద్దపడే వారిని, ఈ దేశస్ధులుగా ఎలా చూడాలి? అట్టి వారి పట్ల ఎలా ప్రవర్తించాలి? మిత్రులారా! నా ఈ మాటలు ఆవేశాన్ని రేకెత్తించేందుకు వాడుతున్నవికావు. ఆవేశంతో లోలోపల శివాలెత్తిపోతున్న వారి ఆవేశాలను అదుపులోకి తేవడానికి ఉద్దేశించినవి మాత్రమే.
రాజ్యాంగ ప్రస్తావనలో దేశం సమైక్యంగా, అఖండంగా, సమానత్వం లక్ష్యంగా ముందుకు సాగాలని లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నామో? అదంతా పుస్తకాలకు పరిమితమైందేనా? ప్రతి భారత పౌరుడూ, కుల, మత, ప్రాంత, లింగ, వర్గాలకతీతంగా పై లక్ష్యసాధనకు త్రికరణ శుద్దిగా తనవంతు విధిని నిర్వర్తించాలావద్దా? ఎట్టి గుంజులాటలూ లేకుండా తెల్చి చెప్పాల్సిన అంశమిది.
దేశం ఏమైపోయినా పరవాలేదు అనుకునే వారి పట్ల రాజ్యాంగ స్ఫూర్తిని అర్ధం చేసుకున్న వాళ్ళు ఎలా ప్రవర్తించాల్సి ఉంది? అలాటివారిని, ఉంటే దేశం పట్ల, రాజ్యాంగ నిర్ధేశాల పట్లా విధేయత కలిగి ఉండండి. లేకుంటే మీ ఇష్టమొచ్చిన చోటికి వెళ్ళిపోండి. అదిన్నీ ఇప్పటి వరకు దేశం నుండి మీరు పుచ్చుకున్న దాన్ని లెక్క చూసుకుని తిరిగి ఇచ్చేసి వెళ్ళండి. ఒక వేళ మీలో ఎవరు గానీ దేశానికే అదనం ఇచ్చి ఉంటే అదంతా తీసుకునే వెళ్ళవచ్చు అంతేకాని, దేశాన్ని ఇష్టపడకుండా, దేశం పట్ల మీ వంతు కర్తవ్యాన్ని స్వీకరించకుండా, మరో దేశాన్ని ఇష్టపడుతూనో, మరో దేశపు ఆదేశాలను పాటిస్తూనో ఇక్కడే ఉండడం తిన్న, తింటున్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం లాటిదే. ఆ వైఖరి దేశభక్తి లేకపోవడాన్ని మాత్రమేకాక, దేశద్రోహి లక్షణం కలిగుండడాన్నీ సూచిస్తుంది. దేశ ద్రోహులుండడాన్ని ఏ దేశమూ సహించదు. సహించకూడదు.
ఈ సందర్భంలో మరొక్కమాట చెప్పుకుంటేనే ఈ వ్యాసానికి నిస్పాక్షికత సిద్దిస్తుంది. తమ తమ మత విశ్వాసాలను వ్యక్తిగతమైనవిగా భావించి, దేశం విషయంలో, దేశానికిగాని రాజ్యాంగాశయానికి గానీ, దేశ ప్రజలకుగానీ, ఎటువంటి ఆపద వచ్చినా లేదా వస్తుందనుకున్నా ఆ సందర్భాలలో దేశ రక్షణకు, భద్రతకు ప్రధమ గణ్యతనిచ్చి దేశం కోసం, దేశం కోసమే స్ధిరంగా నిలబడే వాళ్ళు, దేశం పక్షాన మాట్లాడే, పనిచేసేవాళ్ళు అన్ని మతాల, ధోరణుల వారిలోనూ కొద్దిమంది ఉన్నారు. అలాటి వారు ప్రతి దేశంలోనూ, ప్రతి కాలంలోనూ ఉంటూనే ఉంటారు. మనం అట్టి వారిని చూపి సమస్య వాస్తవ పరిస్థితిని, తీవ్రతను చిన్నది చేసే పని చేయనే కూడదు. ఆయా సమూహాలలో సింహభాగం - మెజారిటీ - వైఖరి ఎలా ఉందన్నదే పరిగణనలోకి తీసుకుంటుండాలి. కనుక ఈ దేశం కోసం ప్రాణాలివ్వడానికి సిద్దంగా ఉండే, ముస్లిం, క్రైస్తవాది సకల ధోరణులలోని అతికొద్ది మందిని ఆధోరణికి ప్రతీకంగా చూడనేకూడదు. అట్టి వారి ప్రవర్తనను, ఆ ధోరణి వారి ప్రవర్తనకు రుజువుగా చూపనేకూడదు. నిజానికి ఆ రకం కొద్ది మంది ఆ మత ధోరణికి చెందిన మనస్సుకంటే, ఉన్నత మానసిక స్థితిలో ఉన్నవారే. కనుక వారిని హిందువు కనక దేశభక్తుడు, ముస్లిం కనక దేశభక్తుడు, క్రైస్తవుడు కనక దేశభక్తుడు అనో అననే కూడదు. అట్టి వారంతా మత విశ్వాసాలకతీతంగా 'దేశభక్తులు' అన్న నిజాన్ని మనం గమనించాలి. ఈ వ్యాసం ద్వారా నేను చెప్పాలనుకుంటున్నది 130 కోట్ల భారతీయులు తమ తమ మతాల, విశ్వాసాలకతీతంగా, దేశభక్తులుగా ఉండాలని, ఉండి తీరాలన్న ఒకే ఒక్క వాస్తవాన్నే. నిజానికి ''దేశానికన్నమిన్న లోకాన లేదురా'' అన్న ఓ కవి అద్భుత భావన ఈ దేశస్తులకు మాత్రమే వర్తించేది కాదు. కాకూడదు. నిజానికి, ఆ భావన సార్వత్రకమైన విలువ కలిగినది అంటే ఏ కాలంలో, ఏ దేశంలో ఉన్న ఎవరికైనా సమానంగా వర్తిస్తుంది. అంత విలువైన మాట అది. దాని అన్వయాన్నిలా చెప్పుకోవచ్చు.
అమెరికా పౌరసత్వాన్ని పొందిన ఏ మతస్థుడు గానీ, గతంలో అతడెక్కడున్నవాడైనా, ఎక్కడనుండి అమెరికా చేరి పౌరసత్వం పొందిన వాడైనా, పౌరుడైన నాటి నుండి ప్రపంచంలోని మిగిలిన ఏ దేశం కంటేనూ అమెరికానే అధికంగా ఇష్టపడాలి. అమెరికా అభివృద్దికీ కృషి చేయాలి. అమెరికా తరఫునే నిలబడాలి. అమెరికాను కాదని మరే దేశానికీ అనుకూలంగా ప్రవర్తించనేకూడదు. ముఖ్యంగా అమెరికా ప్రతికూల - శత్రు- సంబంధాలున్న దేశాలతో. ఇది నిజమా? కాదా?
ఇదే సూత్రం ఎవరికైనా వర్తిస్తుంది. పాకిస్తాన్‌లో ఉండే ఒక హిందువు అంటే హిందూమతంలోని ఏదో విశ్వాసాన్ననుసరిస్తున్న వాడు, పాకిస్తాన్‌కు - భారత్‌కు విభేదాలు పొడచూపితే పాకిస్థాన్ తరపునే నిలబడాలి. పాకీస్థానీగానే అతడు తన బాధ్యతలు నిర్వర్తించాలి. పాకీస్ధాన్‌ను ప్రేమించాలి. దానికి విరుద్దంగా ఆ దేశంలోని ఎవరు ప్రర్తించినా అది దేశ వ్యతిరేకమైనదీ దేశ ద్రోహ చర్యే అవుతుంది. అట్టి వైఖరిని మేధావులెవరు అంగీకరించరు. అంగీకరించకూడదు. ఏ దేశమూ తన దేశ పౌరసత్వం కలిగిన వ్యక్తులు, తనకు వ్యతిరేకంగా, మరో దేశానికి అనుకూలంగా ఉండే వైఖరిని అంగీకరించదు, సహించదు, అంగీకరించకూడదు. సహించకూడదు.
సర్వ సాధారణమైన ఈ సూత్రం అర్ధమైతేనే గాని అదే సరైనదని అంగీకరించితేనే గాని ఈ దేశంలోని, ఏ దేశంలోని- ఎవరు గాని ప్రవర్తిస్తున్న తీరు సరైందో కాదో నిర్ణయించడం సాధ్యపడదు.
ఈనాడు ఒక వ్యక్తి, అతడే దేశానికి చెందినవాడైతే, మునుముందుగా అతడా దేశపౌరుడు. అతనిపై ఆ పౌర బాధ్యతలుంటాయి. ఆ బాధ్యతల్లో, విధులను నిర్వర్తిస్తుండడం, హక్కులను పొందుతుండడం - కర్తవ్య కర్మలను నిర్వర్తిస్తుండడం అన్న మూడు చేరి ఉంటాయి. (హక్కులు - విధుల, బాధ్యతలు అన్న మూటినీ కర్తవ్య కర్మల క్రింద పేర్కొనీ వాస్తవాన్ని అర్ధం చేసికోవచ్చు. ఇక్కడ వివాద పడాల్సినంత అవసరం లేదు) ఆ తరవాతనే మిగిలిన ఏ విషయాలను గానీ పరిగణనలోకి తీసుకుంటుండాలి. అది - ఆ వైఖరిని - వ్యక్తులు స్వీయ నియంత్రణ కలవారై (స్వతంత్రులై) అనుసరించగలిగితే అట్టి సమాజాన్ని ఉత్తమ (వివేకవంతమైన) సమాజం అంటాము. అట్టి స్థాయిలేని వ్యక్తులున్న సమాజంలో వ్యక్తులు పరనియంత్రణ వల్లనైనా (వ్యవస్థ అదుపులో నుండైనా) అలాగే ప్రవర్తించాల్సి ఉంటుంది. అప్పుడే సమాజం ఒక క్రమంలో ప్రశాంతంగా, అలజడులు లేని వాతావరణంలో సాగగలుగుతుంటుంది.
అత్యంత ప్రాథమికమూ, ఏ దేశానికైనా వర్తించే సర్వ సాధారణమూ అయిన ఈ సూత్రాన్ని, మన ప్రస్తుత దేశ సమస్యకు వర్తింప జేస్తే దాని ఆచరణ రూపంఎలా ఉండాలి?
మును ముందుగా ఈ దేశంలోని 130 కోట్ల మందీ ఈ దేశ పౌరులు. అంటే భారతీయులు. అలాగే, ఈ దేశం ఏర్పరచుకున్న ప్రజాస్వామ్య విధానాన్ననుసరించి ఈ దేశ సంపద విషయంలోనూ, వ్యవహారాల విషయంలోనూ యజమానులు, యాజమాన్యపు భాగస్వాములు. సొంతదారులన్న మాట. యజమానితనానికి మూడు ప్రధాన లక్షణాలుంటాయి. సంపదపైనా, అది పుట్టించే ఫలితాల విషయంలోనూ -1) నిర్ణయాధికారము 2) పర్యవేక్షణాధికారము 3) లాభనష్టాలకు బాధ్యుడైయ్యుండడము.
గమనిక : ఈ సందర్భంలో భారత స్వాతంత్రోద్యమ చరిత్రను రచించిన, ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్యగారి మాటలు నిరంతరం స్మరించదగినవిగా, స్పురణలో ఉంచుకోదగినవిగ నా కనిపించాయి. ''40 సం|| కాలం స్వాతంత్య్ర యోధులు చేసిన త్యాగాల మూలంగా మనకు స్వతంత్రం వచ్చింది. వారు మనకు చిరస్మరణీయులు. వారు సాధించి పెట్టిన స్వాతంత్య్రాన్ని నిలబెట్టడం మన ప్రథమ కర్తవ్యం. గతంలో మనలో జాతీయ భావమూ, సమైక్యతా లేని కారణం చేత స్వాతంత్య్రాన్ని పోగొట్టుకుని అష్టకష్టాలను అనుభవించాము. భవిష్యత్తులో మనకు, మన దేశానికీ, అలాటి ప్రమాదం లభించకుండేట్లు మనమూ, భావితరములవారూ ప్రవర్తించడం అవసరం. నా గ్రంధం మూలంగా మనం నేర్చుకొనవలసిన గుణపాఠం ఇదే. ఇందుకుగానే, నేనీ గ్రంధాన్ని వ్రాశాను.
మిత్రులారా! ఇదే ఈవ్యాసం ద్వారా నేను చెప్పాలనుకున్నదీ. జాతీయ భావము, దేశ సమైక్యత అన్నదే దేశభద్రతకూ దేశాభివృద్దికీ ఆధార శ్రోతస్సులు. ఆ రెండూ ఉన్న వారే ఇక్కడ ఉండడానికి అర్హులు, ఈ దేశ సంపద విషయంలో న్యాయ బద్దమైన భాగస్వాములూ కాగలరు.
గతాన్ని తవ్వుకోవడం అనవసరం. అయితే, గతాన్ని యథాతధంగా గుర్తించకున్నా, గుర్తుంచుకోలేకున్నా, సరైన భవిష్యత్తుకు దారులు వేసుకోలేము. ఈ దేశంలో మతం ఆధారంగా ఏర్పడ్డ ద్విజాతి సిద్దాంతం, దాని వల్ల ఇక్కడ జరిగిన దారుణ మారణ కాండలను గమనికలోకి తీసుకోకుంటే, వర్తమాన పరిస్థితుల్లో అంటే మళ్ళీ మతం - రాజకీయంతో కలసి వికృత వేషాలు వేయడానికి ఎత్తుగడలు వేస్తున్న పరిస్థితుల్లో, ఏ నిర్ణయం, ఎలాటి నిర్ణయాలు భారత దేశ శ్రేయస్సుకు సరళమైన దారి చూపించగలుగుతాయో అలాటి నిర్ణయాలు తీసుకోలేము. నాకు తెలిసి ఆ పనిని సమర్ధవంతంగా చేయగలిగింది, జాతీయ భావనొక్కటే. మనమంతా ఎంతో ప్రమాదకరమైన మతపరమైన జాతి భావన నుండి బైటపడి, దేశపరమైన అంటే రాజ్యాంగ బద్దమైన జాతీయ భావన, సమైక్యభావన దగ్గర నిలబడి, ముక్త కంఠంతో, ఒకే గొంతుతో మేమంతా భారతీయులం, మా జాతి భారత జాతి, మా దేశం సమైక్య భారతదేశం అని కట్టకట్టుకుని నినదించాలి. కటిబద్దులమై ఒక్కటిగా నిలవాలి. అదొక్కటే మన మధ్యనున్న అంతర్గత వ్యత్యాసాల ప్రభావం నుండి మనల్ని నిలువరించి సమైక్యంగా ఉంచగలుగుతుంది.
అంబేద్కర్ - వాల్యూం - 8 (భారత దేశ విభజన)లో, జాతీయ నిస్పృహ అన్న వ్యాసంలో ''మీ దేశానికి ఎలాటి మహోన్నత భవితవ్యం ఉండాలని కోరుకుంటావు? అని ఏ భారతీయుణ్ణి అయినా అడిగారనుకోండి. జవాబు ఏమై ఉంటుంది?
ఈ ప్రశ్న ముఖ్యమైనది. జవాబు ఉద్బోధకంగా ఉండకతప్పదు.
ఇతర విషయాలన్నీ సమతూకంగా ఉండి, తన దేశమంటే గర్వపడే నికార్సయిన భారతీయుడు ''సమైక్య స్వతంత్ర భారత దేశమే నా ఆదర్శం, అదే భారత భవిష్యత్‌కి కావాలి'' అని అంటాడు. (ఇదెంతనిజమో) హిందువులూ, ముస్లింలూ ఉభయులూ కూడా ఇలాటి భవితవ్యమే ఉండాలని అనుకుంటే తప్ప ఈ ఆదర్శం ఒక పవిత్ర కామనగానే మిగిలిపోతుందన్న మాటా అంతే నిజం. అలా తప్ప దీనికి కార్యరూపం కార్యరూపం ఎన్నటికీరాదు. ఇది ఏదో కొందరి పవిత్రాశయం మాత్రమేనా లేక యావన్మందీ నడుం కట్టి సాదించాల్సిన లక్ష్యమా? 1993 ముద్రణ పే. 259 - సంపు(8)
నిజం చెప్పాలంటే బ్రిటీష్ వాళ్ళ నుండి స్వాతంత్య్రం సాధించడంతోనే (మనపని) అయిపోదు. ఆ స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకోవడమనేకర్తవ్యం ఇంకా ముఖ్యమైనది (మిగిలే ఉంటుంది.) అయితే ఈ ముఖ్యమైన కర్తవ్యం మ్మీదే ఏకాభిప్రాయం ఉన్నట్లులేదు. ఏమైనా, ఈ విషయానికి సంబంధించి ముస్లింల వైఖరి అంత నమ్మకం కలిగించేట్లులేదు. భారత దేశ స్వాతంత్య్రాన్ని నిలబెట్టాలన్న కర్తవ్యాన్ని తమనెత్తిన మోపుకోమని ముస్లిం నాయకులు శతదా చేస్తున్న ప్రకటనల ద్వారా విశదమవుతూనే ఉందీ విషయం.
సిల్హేట్‌లో 1939 జనవరి 27న మౌలానా అజాద్ శోభానీ చేసిన ఉపన్యాసంలోని భావాలు కూడా శ్రద్దగా గమనించదగినవి. ఒక మౌలానాగా రడిగిన ప్రశ్నకు జవాబుగా శోభాని ఇలా అన్నారు.
''ఈ దేశం నుంచి ఇంగ్లీషు వాళ్ళను తరిమెయ్యాలని చెప్పే ప్రముఖ నాయకుడెవరన్నా ఉన్నాడనంటే అది నేనే. అయినా ముస్లింలీగు నుండి ఇంగ్లీషు వాళ్ళతో పోరు ఉండకూడదని నా అభిప్రాయం. మనం చెయ్యాల్సిన పెద్దయుద్దం 22 కోట్ల హిందూ శత్రువులతోనే... వాళ్ళుగాని శక్తి సంపన్నులైతే ముస్లిం భారత్‌ని, క్రమేపీ ఈజిప్టుని, టర్కీని, కాబూల్ మక్కాల్ని, మదీనాని, యాజూజ్ మాజూజ్ లాటి ఇతర ముస్లిం మతాల్ని కబళించేస్తారు. (ఖురాన్‌లో ఉంది ప్రపంచ ప్రయళయం సంభవించడానికి ముందు వాళ్ళు భూమ్మీద ప్రత్యక్షమై దొరికిందాన్ని దొరికినట్లు మింగేస్తారట)
''ఇంగ్లీషు వాళ్ళు రాను రాను శుష్కించిపోతున్నారు. వాళ్ళురేపోమాపో భారతదేశం నుండి వెళ్ళిపోతారు. అందుచేత మనం ఇస్లాంకి బద్ద శత్రువులైన హిందువులతో పోరాడి వాళ్ళని బలహీన పరచకపోతే వాళ్ళు భారతదేశంలో రామరాజ్యం స్థాపించడమేకాదు, క్రమేపీ భూమండలమంతా వ్యాపిస్తారు. హిందువుల్ని బలోపేతుల్ని చేయడమో లేక నిర్వీర్యులను చేయడమో అనేది 9 కోట్ల మంది ముస్లింల మీద ఉంది. అంచేత హిందువులు ఇక్కడ స్థాపితం కాకుండా, ఇంగ్లీషువాళ్ళు నిష్క్రమించిన వెంటనే ముస్లిం పాలన స్థాపితమయ్యేందుకుగాను, ముస్లింలీగులో చేరి పోరాడడం ప్రతి పవిత్ర ముస్లింకీ తప్పనిసరి కర్తవ్యం.
''జాగ్రత్త! కాంగ్రేసులో ఉన్న మౌల్వీల వలలో పడకండి. ఏమంటే 22 కోట్ల హిందు శత్రువుల చేతిలో ముస్లిం ప్రపంచం ఎన్నటికీ భద్రంగా ఉండలేదు.'' ఇది మౌలానా అజాద్ శోభాని ఇచ్చిన ఉపన్యాసంలోని భావాలు.
శ్రీమతి అనిబిసెంట్ ముస్లిం సమస్యపై ఇలా అంటున్నారు.
''ఖిలాఫత్ ధర్మయుద్దాన్ని ప్రోత్సహించడం వల్ల భారతదేశానికి పెద్ద దెబ్చే తగిలింది'' విశ్వాస రహితులకు వ్యతిరేకంగా ముస్లింల మనోగత భావాలలో ద్వేషం ఉబికింది. గడచిన సంవత్సరాలలో మాదిరే లజ్జారహితంగా, నగ్నరూపంలో ఉందా ద్వేషం. ప్రత్యక్ష రాజకీయాలలో చోదకంగా పాత ముస్లిం కరవాలం మళ్ళీ ఊపిరి పోసుకోవడం చూశాం... జాజిరుత్ - అరబ్ అంటూ, అరేబియా ద్వీపాన్ని పవిత్ర భూమిగా చాటడం చూశాం... ఆఫ్ఘన్లు గనక భారత దేశం మీదికి దాడిచేస్తే, తమ మతస్తులు వాళ్ళతో చేతులు కలిపి, ఆఫ్ఘన్లకు వ్యతిరేకంగా దేశరక్షణకు పోరాడే హిందువుల్ని హతమారుస్తామని ముస్లిం నాయకులు చాటడం విన్నాం.
ముసల్మాన్లు మౌలికంగా తమ మాతృదేశానికి కాక, ఇస్లాం దేశాలకు విధేయంగా ఉంటారన్న దాన్ని చూడక తప్పలేదు. వాళ్ళకు ప్రాణప్రదమైంది దేవుని రాజ్యాన్ని స్ధాపించడం అని మనకు తెలియవచ్చింది. ఆ దేవుడు లోకపితగా సర్వప్రాణుల్ని ప్రేమించే దేవుడు కాదు. ప్రవక్తల ఆదేశాల ద్వారా ముసల్మాన్ కళ్ళద్దాల గుండా కనిపించే దేవుడు.
''తాము వశిస్తూ ఉన్న రాజ్యచట్టాన్ని మించి ఆఫలాన ప్రవక్త బోధనల్ని మన్నించాలని ముసల్మాను నాయకులు చేసే ప్రతిపాదన పౌరక్రమ శిక్షణకు, రాజ్య స్థిరత్వానికీ నాశనకరం (భంజకం) దాని వలన వారు దుష్ట పౌరులవుతారు. ఏమంటే వాళ్ళ భక్తి ప్రపత్తులు దేశం వెలుపట ఉన్నవాటి పట్ల ప్రదర్శితమవుతాయి.''
''భారతదేశంగనక స్వతంత్య్రమైతే, జనాభాలో ముస్లిం విభాగం భారతదేశ స్వాతంత్య్రానికి ప్రత్యక్షంగా ప్రమాదకరమవుతుంది. ఎందుకంటే, అజ్ఞానులైన ముస్లిం జనసమూహం ప్రవక్త పేరుతో తమకు విజ్ఞప్తి చేసేవాళ్ళ వెనకాలే పడిపోతుంది గనుక.... వారంతా భారతదేశాన్ని ఇస్లాం పాలన క్రిందికి తేవడానికే ఉద్యుక్తులవుతారు.
''యథార్ధానికి చాందస ముస్లింలు పాలించే దేశాల్లో ముస్లిం శాఖీయులకీ భద్రత లేదు. షియాలు, సున్నీలు, సూఫీలు, బాహేలు బ్రిటీషు రాజ్యంలోనే హాయిగా ఉండగలరు.''
2) లాలాలజపతిరాయ్ సి.ఆర్.దాస్‌కు రాసిన లేఖలోని అంశాలు.
''ఈ మధ్య హిందూ ముస్లిం జోక్యం అన్న అంశం నన్ను అతిగా కలవరపెడుతోంది. గత ఆరు నెలలుగా ముస్లిం చరిత్ర, ముస్లిం ధర్మశాస్త్రం అధ్యయనానికే ఎక్కువ వ్యవధిని ఖర్చుపెట్టాను... వాళ్ళ మతం ఐక్యానికి గట్టిగానే అడ్డంగా ఉంటుందని పిస్తోంది. హాకింసాబ్ కంటె మంచి మహమ్మదీయుడు హిందూస్తాన్‌లో ఎవరూలేరు. కానీ ఏ మహమ్మదీయుడైనా ఖురాన్‌ను ఎదిరించగలడా? ఇస్లాంమతన్యాయం నాకర్దమైన పద్దతి తప్ఫైతే బాగుండుననినేనాశిస్తున్నాను... హిందూస్థాన్‌ని ప్రజాస్వామ్య పద్దతిలో పాలించడానికి మనం ఐక్యంకాలేము. మరైతే దీనికి మందేమిటి?...
హిందూ ముస్లింల మధ్య ఐక్యత అవసరం లేదా వాంఛనీయం అని నేను మనస్ఫూర్తిగా, గుండె మీద చేయి వేసుకుని విశ్వసిస్తున్నాను.... కానీ ఖురాన్, హజీలు విధించే అనుశాసనాల మాటేమిటి? ముస్లిం నాయకులు వాటిని కాదనలేరు.
3) 1924లో రవీంద్రనాధ్ ఠాగూర్‌తో జరిపిన ఇంటర్వ్యూలో...
హిందూ ముస్లిం ఐక్యత అసంభవం అని కవిగారి అభిప్రాయం. మహమ్మదీయులు ఏ ఒక్క దేశానికీ తమ దేశభక్తిని పరిమితం చేయలేరు అన్నదే ఠాగూర్ బలమైన అభిప్రాయం.
ఏ మహమ్మదీయ రాజ్యమైనా భారతదేశంపై దండయాత్ర చేస్తే, ఆ సందర్భంలో తమ ఉమ్మిడి భూమిని రక్షించుకునేందుకు మహమ్మదీయులు హిందువులకు తోడుగా నిలుస్తారా? అని నిర్మొగమాటంగా అడిగాడు... ఓ మహమ్మదీయుడి దేశం ఏదైనా కానీ, అతడు మరో మహమ్మదీయునికి వ్యతిరేకంగా పోరాడడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని ముహమ్మద్ ఆలీ లాటివారే చాటారు.''
పాఠక మిత్రులారా! ఈ ఉట్టంకింపుల సందర్భంలో ఈ అభిప్రాయాలు వెళ్ళడించింది ఆషామాషీ వ్యక్తులు కారు అంటూ అంబేద్కర్ ఇలా రాశారు.
''ఈ భయాలు వెళ్ళడి చేసిన వాళ్ళు ఉచితానుచితాలు తెలియని వాళ్ళనుకునేరు. కాదు సరి కదా వాళ్ళు ముస్లిం నాయకులతో బాగా సంబంధాలుండి, తమ అభిప్రాయాల్ని వెళ్ళడించగల ఉచితజ్ఞత కలవాళ్ళు.
కనుక అంబేద్కర్ కాలంనాటికే అంబేద్కరే కాకుండా, ఆస్థాయి మేధావులని అంబేద్కర్ ప్రస్తావించిన వాళ్ళూ ఖురాన్ మార్గదర్శకత్వం ఎలా ఉంటుంది? దాని ఆదేశాల విషయంలో ఒక ముస్లిం వైఖరెలా ఉంటుంది అన్న విషయంలో వారు తమని ప్రత్యేకించుకుని తీరతారని, హిందువులను, ఇస్లామేతరుల్ని అన్యులుగానే భావిస్తారని స్పష్టంగా ప్రకటించారు. సంస్కరణవాదులైన ముస్లింలెవరైనా ఖురానుకు వ్యతిరేకంగా మాట్లాడితే చాందస ముస్లింలు వారిని చంపేయవచ్చనీ అన్నారు.
ఇస్లాంలోని అంతర్గత బలహీనతల్ని గురించీ డా|| అంబేద్కర్ 8 వాల్యూం - సామాజిక స్తబ్దత అన్న శీర్షిక క్రింద చాలా విలువైన, ప్రామాణిక సమాచారాన్ని రాశిపోశారు. వివరంగా తెలుసుకోదలచిన వాళ్ళు 8వ సంపుటిని ఆ సాంతం శ్రద్దగా అధ్యయనం చేయండి. ఒక్కమాట చెప్పి దీనిని ముగిస్తాను.
సత్యాన్వేషణ మండలి ద్వారానూ, ఐక్యవేదిక ద్వారానూ నేను పౌరులకు సంబంధించిన ఒక అభిప్రాయాన్ని సూత్రరూపంలో బలంగా చెపుతూ వస్తున్నాను.
భారతదేశంలో ఉన్న భారత పౌరసత్వం కలిగి ఉన్న వ్యక్తి ఎవరైనా, ముందుగా తాను భారతీయునిగా త్రికరణ శుద్దిగా తలంచాలి. ఆ రకంగానే ప్రవర్తిస్తుండాలి. ఆ తరవాతనే తానేదో ఒక మతానికి, కులానికి, ప్రాంతానికి, పార్టీకి చెందిన వాణ్ణని తలంచాలి, ఆ రకంగానే ప్రవర్తించాలి. భారతదేశము, భారత రాజ్యాంగము, భారతీయులు అన్న భావన అన్నిటికంటే ముందుది, ముఖ్యమైందిగా అనుకుంటూ ప్రవర్తిస్తూ ఉండాలన్నమాట.
విషయం అర్ధమవుతుందనుకుంటాను. నీవు మొదట భారతీయుడివి. పిదపే హిందువులి మొదట భారతీయుడివి, పిదపనే క్రైస్తవుడివి, మొదట భారతీయుడివి, పిదపనే ముస్లింవి... ఇలాగన్న మాట. ఆశ్చర్యకరమైన విషయమేమంటే, 70 ఏండ్లకు పూర్వమే, అంబేద్కరూ ఈ విషయాన్ని ముఖ్యమైనదిగ తలంచడమేగాక, ఈ విషయంలో వివేకవంతుడైన పౌరుడేలా ఉండాలో ఉంటాడో సుస్పష్టంగా ప్రకటించాడు. ఆ మాటలు ఇవిగో,
దేశంలో కొందరు సంఘహితైషులైన మేధావులు, మొదట భారతీయుడివి తరవాతే హిందువైనా, ముస్లిమైనా క్రైస్తవుడైనా అన్న దృష్టి కలిగి ఉండాలనంటుంటారు. నా దృష్టిలో అది సరికాదు. సరిపడినంత వివేకం ఉన్నవారైతే, నేను మొదటా భారతీయుణ్ణేతరవాతే భారతీయుణ్ణే, చివరకూ భారతీయుణ్ణే అంటారు అనాలి, అనన్నారు.
ఎంతటి ఉదాత్తభావన ?! రాజ్యంగ పీఠికలోని ఆశయాలు నెరవేరాలంటే పౌరుల మానసిక స్థితి ఎలా ఉండితీరాలని ఆయన విచక్షణ నిర్వింద్వంగా ప్రకటిస్తొందో గమనించారా? ఆ వైఖరే ఉత్తమోత్తమమైనది. నిజమైన జాతీయ భావనను నెలకొల్పగలిగింది.
నా వరకు నేను అక్కడే ఉన్నాను. నాకు ఏ మతమూలేదు. ప్రాంతల పట్టింపూలేదు కేవలం భారతీయుణ్ణి మాత్రమే. ఇంకే సంకుచిత భావనకు తలొగ్గడానికి నేను సిద్దంగా లేను ఈ ఉన్నత భావాన్ని అంగీకరిస్తూనే నేను, కనీసం మొదట భారతీయుణ్ణి తరవాతే ఫలాన మతస్ధుణ్ణి, ప్రాంతం వాణ్ణి వగైరాలన్నీ అనుకొమ్మని చెప్పాను. ఈ నాప్రతిపాదన అంబేద్కర్ ప్రతిపాదనతో పోలిస్తే మధ్యమ స్థాయి కలిగింది మాత్రమే.
వివిధ మత, ప్రాంతాలకు చెందిన వారిగా తలంచుతుండే పౌరులారా! మీరేక్కడున్నారో ఎక్కడికి రావాలనుకుంటున్నారో తేల్చుకుని, ఆ రకంగా నిజాయితీగా ప్రవర్తించండి. 1) నేనన్నదానికంటే అంబేద్కర్ చెప్పింది ఉన్నతమైనది. నేను మనిషిని, మానవ సమాజం మంతా ఒక్కటే అన్నది మరింత ఉన్నతమైనది, ఆదర్శప్రాయమైనది ఆలోచించండి.
ఇస్లాం మత స్వేచ్చను అంగీకరించదనడానికింత కంటే రుజువేం కావాలి? విధిలేక మాత్రమే వారు మరొకరితో కలిసి ఉంటారు.
1) ఇస్లాం పద్దతి అమలయ్యే పరిస్థితి ఉంటే, అక్కడ ఇస్లామేతరులు స్వేచ్ఛగా ఉండడం అసంభవం. షరతులతోకూడిన, అదిన్నీ అవిశ్వాసిగా ఉన్నందుకు గాను విధించిన షరతులతో, ఉండనిచ్చినందుకు గాను విధించిన పన్ను చెల్లించే ఉండాలి.

Tuesday, November 1, 2016
రహ్మాన్ గారినుద్దేశించి సురేంద్ర గారికి పంపిన లేఖ సారాంశము
సురేంద్ర గారికి మిత్రులు ఎం.ఎస్. అక్బర్ బాద్షా వ్రాయునది. ఉభయకుశలోపరి.
నేను కూడా ఖురాను తెలుగులో 30 అధ్యాయాలు పూర్తిగా క్షుణ్ణంగా చదివిన వాడినే, అందులో మీరు లేవనెత్తిన సందేహాలు మెదడున్న మనిషికి అనుకోకుండానే ఈ కాలంలోని వారికి తప్పక కలిగేటటువంటివే. అందులో ఏ మాత్రమూ సందేహమే లేదు.
వివేకపథం మొదలైనప్పటినుంచి మనసుపెట్టి చదివేవారిలో నేనొకడిని. దాని ముఖ్యోద్దేశము సత్యపక్షాన నిలవడం - ధర్మ బద్దంగా జీవించడము. కనుక చదివేవారు నిక్కచ్చితనము కలిగి మాట విడువలేని మానధనులై ఉండాలి. కానీ రహ్మాన్ గారు, ఆర్భాటం కోడి, ఇల్లెక్కి కూసి, చివరికి తోలుగుడ్డు పెట్టిన చందాన వ్యవహరిస్తున్నారు.
నేను హైదరాబాద్‌కు పోయి రహ్మాన్ గారితో 4,5 సార్లు ఫోన్‌లో మాట్లాడినాను. నేను ఆయన ఇంటికి కూడా వస్తానన్నాను. ఆయన వద్దని చెప్పి, ఆయనే ఈ విషయం మాట్టాడటానికి మా ఇంటికి వస్తానని చెప్పి మాట తప్పి రాకపోయినది కాక వివేకపథం సభ్యులను తూలనాడటము నాకు చాలా బాధ కలిగించినది. వియ్యానికైనా, కయ్యానికైనా సరి ఉజ్జీ ఉండాలి. పిచ్చుకపైన బ్రహ్మాస్త్రాలెందుకండీ సురేంద్ర గారూ.
సమాజానికి ఇతను ఏపాటి వాడో మీ వివేకపథం ద్వారా అందరికీ తెల్సిపోయినది. ఇంకా ఇలాంటి వారు ఎందరున్నారో? ఇది మీ ఒక్కరితో అయ్యేపని కాదు. సత్యం ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చేలోపల, అబద్దము ఊరు తిరిగి వచ్చే ఈ కాలంలో మాట నిలకడ గలవారెంత మంది? కనీసము సమాజానికి భయపడి చెప్పలేక పోతున్నాను అనన్నా చెప్పగలిగితే ఎంతోమేలు. కానీ అతనికి ఆ భావన కూడా లేదు. ఇందులో ఏ మంచి ఇమిడి ఉన్నదో ఆ ప్రకృతికే అర్థమవ్వాలి. బలవంతాలతో పని ముందుకు సాగదు. ఇలాటి వారి గురించి మాట్లాడునది, ఒక విధంగా గౌరవాన్ని ఆపాదించడమే అవుతుంది. మీకు ఎక్కువ చెప్పగల స్తోమత లేనివాడను. కాన క్షంతవ్యుడను. ఇది రాయవలసి వచ్చినందుకు బాధతప్త హృదయంతో
మీ శ్రేయోభిలాషి.
అదనంగా:
228,
Fazlur Rahman,
islam,
religion,
ఇస్లాం,
ఫజులుర్ రహ్మాన్,
మతము
రహ్మన్ గారి అహేతుక పోకడ
నెలలో ఒక కొలిక్కి వచ్చిన ''అవిశ్వాసులపట్ల ఖురాన్ వైఖరి'' తన వైపు నుండి అన్నమాటకు కట్టుబడి ఉచితంగా స్పందించి ఇస్లాంను విడిచి బైటికి రావలసి ఉన్న ఫజులూర్ రహ్మన్‌గారు ఆ పని చేయకపోగా, ఆనాడు ఆయనను మిత్ర దృష్టితో చూస్తుండడం వల్లా, మండలికున్న; ఒక విషయంపై శాస్త్రీయ పరిశీలన పూర్తయ్యాకనూ దానిని మరొకసారి పరిశీలించుదామని ఎవరడిగినా అక్కడరలేదనకుండా పరిశీలనకు సిద్దపడడమన్నది శాస్త్రీయ దృక్పధం కలవాళ్ళు, శాస్త్రీయ పద్దతిని నెరిగినవాళ్ళు అనుసరించిన విధానం అన్న నియమం వలన, మీరు కావాలంటే మరో సారి పరిశీలించుకోడానికి నేను సిద్దం. కానీ ఈ సమావేశంలో నేను చూపవలసినవి చూపాను. నేను చూపిన మూడు సందర్భాలూ మూడు రకాల అవిశ్వాసాలకు చెంది, అవిశ్వాస కారణంగానే వధించడం జరిగినవే. అవిశ్వాసులలో రకాలు వాళ్ళుంటారని ఆనాడూ నేను చెప్పాను. ఆ సమావేశంలో ఉన్న రహ్మన్‌గారూ, ఇతరులు కూడా దానినంగీకరించారు. వారంతా మరోసారి సరిచూసుకోడానికీ, పాఠకులూ ఆలోచించడానికి వీలుగా వాటినిక్కడ వ్రాస్తున్నాను.
1. పుట్టుకనుండీ విగ్రహారాధకుల, అన్యదేవతారాధకులుగ ఉన్న, అల్లా పై విశ్వాసంలేని అవిశ్వాసులు, బహు దైవారాధకులు, విగ్రహారాధకులేకాక దీని క్రిందికి ఖురానును అంగీకరించని యూదులూ, క్రైస్తవులూ కూడా వస్తారు.
2. ముస్లింలుగానే పుట్టి అప్పటి వరకు ముస్లింలుగా ఉండి, ఖురాను దేవుణ్ణి కాదని, ఇతర దైవారాధనల - విశ్వాసాల వైపు మళ్ళినవారు.
మూసా దైవాజ్ఞలకోసం కొండ మీదకు వెళ్ళినప్పుడు, అతని జాతి ప్రజలలోనే కొందరు ఆవు దూడ విగ్రహాన్ని చేయించుకుని అల్లాను విడచి దానిని ఆరాధించడం మొదలెట్టినవారు అంటే ఇస్లాంను విడచి అన్య విశ్వాసంలోకి మరలిన ఖురాన్ అవిశ్వాసులు.
3. అప్పటి వరకు ఇతర విశ్వాసాలననుసరిస్తున్న వారిలో నుండి ఏకారణాల వల్ల గానీ ఇస్లాంను స్వీకరించి, ఆ తర్వాత తిరిగి అల్లాను విడచి ఇతర మార్గాల పట్టిన అవిశ్వాసులు.
నేనానాడు బుఖారి ద్వారా చూపించినవారూ ఈనాటి వసంతరావు (ఉరఫ్ వహీద్) గారిలాటి వాళ్ళూ ఈ రకానికి చెందిన - ఇస్లాంలోకి వెళ్ళి తిరిగి వెనక్కువచ్చిన, మరో విశ్వాసంలోకి మరలిన అవిశ్వాసులు.
4. ఇక విశ్వాసుల ఇంటనే పుట్టినా భవిష్యత్తులో అవిశ్వాసిగా మారి విశ్వాసులను వేధిస్తాడేమోనని అనుమానం, భయం కలగడం వల్ల విశ్వాసి గానే తలంచి ప్రవర్తించాలని 'ఖిజర్' బాలకుని కథ ద్వారా ప్రకటించిన రకం అవిశ్వాసతుల్యులు.
1. పుట్టుక నుండీ ముస్లిమేతరులు 2. పుట్టాక ముస్లింలై అనంతరం ఇస్లాంను విడిచిన వారు 3. పుటక అన్యవిశ్వాసులై ఇస్లాం స్వీకరించి విడిచిపెట్టినవారు 4. అవిశ్వాసి కావచ్చునని అనుమానించబడ్డ వారు. అన్న నాలుగు రకాల వారిని ఖురాన్ అవిశ్వాసుల జాబితా క్రిందకి చేర్చింది. మన ఇంగితం (హేతుబుద్ది) కూడా, పై వాటిలో నాలుగో రకం వారిని మాత్రం ఇంకా తేలని వారి జాబితాలో పెట్టడం సరైంది మిగిలిన మూడు విభజనలూ సరైనవేనంటోంది. నా ఈ వ్యాసాన్ని పట్టి చూస్తున్న పాఠకులేకాక వివిధ మాధ్యమాల ద్వారాను గమనిస్తున్న యోచనా పరులందరికీ, ఇక్కడికిది సరిగనే ఉందో లేదో ఎవరికి వారుగా ఒక నిర్ణయానికి రండి.
ముఖ్యగమనిక :- ఆనాటి చర్చల సందర్భంలో పై అంశాలపై రహ్మన్‌గారు వెళ్ళడించిన అభిప్రాయాలివిగో
1. బుఖారీ హదీసుల్లో నుండి నేను ఎత్తిచూపిన ''ఇస్లాంలోకి వచ్చి తిరిగి విడిచిపెట్టిన వాని విషయంపై'' అది 100% వాస్తవం. ఒకడు ఇస్లాం స్వీకరించి, తిరిగి దానిని విడిస్తే చేయవలసింది వధించడమే మరో ప్రత్యామ్నాయం గాని, మినహాయింపు గానీ లేదన్నదినే నంగీకరిస్తున్నాను అనన్నారు రహ్మన్‌గారు. ఆనాటి సదస్సులోని ముస్లింలేగాక, ఇతరులూ అవును ఆ వాక్యాలలానే ఉన్నాయని అంగీకరించి నిర్ధారించారు.
2. 'ఖిజర్ - బాలుని చంపడం' విషయంపై రహ్మన్‌గారు స్పందిస్తూ, ఈ ఒక్క సంఘటన మాత్రం నాకు బలమైందిగానే కనిపిస్తోంది. దీనిపై నేను ఆలోచించాల్సి ఉంది. ఎందుకలా జరిగిందో సమాధానం చెప్పాల్సి ఉంది అనన్నారు. దీనిపై ఆలోచించాల్సిందీ, ఎందుకలా జరిగిందో చూడాల్సిందీ ఏముందండీ! (అవిశ్వాసి అన్న కారణంగానే కాక) అవిశ్వాసి అవుతాడేమోనన్న అనుమానం కారణంగానూ వధించడం సరైందేననే కదా ఆ ఘటన కు చెందిన మాటలు చెపుతోంది? అని ఆనాడే ఆయన్ని ప్రశ్నించాను. ఆ సందర్భంలోనూ సమావేశంలో పాల్గొన్న వారందరూ ఆ మాటలకు అదే అర్ధం. మరే అర్ధమూ రావడంలేదు అనన్నారు కూడా.
3. అల్లాను విడిచి, ఆవుదూడను పూజించారు అన్న ఒకే ఒక్క కారణంగా మూసా స్వజనాన్నే, అందులోని వారే అయ్యుండి ఆవు దూడ పూజలో పాల్గొనని వారి చేత, చంపించాడు అల్లా. నాలెక్క ప్రకారం ఈ ఒక్క వాక్యం. అల్లాను తిరస్కరించిన వారు, వారెవరకైనా కడకు తన జాతివారే అయినా తల్లైనా, తండ్రైనా కొడుకైనా, భార్య అయినా, అన్నైనా, తమ్ముడైనా, ఎంతటి దగ్గరి సంబంధీకులైనా సరే వధించవచ్చు. వధించాల్సిందేనని సందేహరహితంగా, సూటిగా, ప్రకటిస్తోంది.
గమనిక :- ఆనాడు వధింపబడ్డ వారు 1. జాతిరీత్యా అన్యులుకారు 2. ఎదురు తిరిగి కొట్లాటకు సిద్దమైనవారూ కారు. 3. యుద్ద సందర్భమూ కాదు. కేవలం అల్లాను విడిచి విగ్రహాన్ని ఎంచుకుని పూజించారు అన్న ఒకే ఒక్క కారణంగా, స్వజనులు, రక్త సంబంధీకులూ, అన్నది కూడా ప్రక్కన పెట్టి చంపబడ్డవారే.
ఈ సందర్భంలో నేనేదో రుద్దాను, పులిమాను అంటూ అనుచితంగా, నాపై పెద్ద అభాండం వేసిన ఫజులూర్ రహ్మన్‌గారిని సూటిగా ఒక్కటడుగుతున్నాను. అయ్యా రహ్మన్‌జీ! ఆనాటి సంభాషణ రికార్డై ఉంది. ఆ సంభాషణ సారాంశం వివేకపథం పత్రికలలోనూ రాత రూపంలో నమోదైఉంది. ఆనాటి సదస్సులో 20, 30 మంది వివిధ ధోరణులకు చెందిన పరిశీలకులూ ఉన్నారు నేనేమి రుద్దానో, పులిమానో తేల్చాల్సిన నైతిక బాధ్యత మీమీద ఉంది. ఎదుటివాడిని రుజువు చేయమనంటూ తెగ నిగ్గ తీసే మీకు, మీరు ఖురాను ప్రతినిధిగా రుజువు చేయాల్సినవిగానీ, సమావేశంలో మాట్లాడిన వాటికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యతగానీ, ఉండవన్నమాట!? కట్టు బాట్లు నియమాలు, నిగ్గతీతలన్నీ ఇతరుల కొరకేనన్నమాట!
ఇంతకూ ఆ మూడు సందర్భాలకు చెందిన మాటలకు నేనేమి లేని అర్ధాలు రుద్దానో రుజువు చేయండి మొదట. పిదప ఇంతకూ ఆ వాక్యాలకు మీరంగీకరించే అర్ధాలేమిటోనూ స్పష్టంగా ప్రకటించి, మీరు చెప్పే అర్ధాలు భాష తెలిసిన వారందరికీ తెలిసేవేననీ, మీరే మీ రుద్దడాలు, పులమడాలూ చేయనేలేదని కూడా విజ్ఞులముందు చెప్పి వారినివప్పించండి.
విషయాన్ని విడచి అనవసరపు కామెంట్లు చేస్తూ, అదేమన్న వారిని వ్యంగ్యంగా దెప్పిపొడుస్తూ, పరుషంగా, అవమానకరంగా మాట్లాడుతూ వస్తున్న మీకు, మీ పోకడ ఆడలేక మద్దెలవోడన్న చందాన ఉన్నట్లు తెలియడం లేదన్నమాట! మీ భాష బాగలేదు. విషయ దృష్టితో సంభాషణలు సాగించండని సూచన చేస్తే, నీ భాష చూసుకో అనంటారా? నేను ఎవరెవరితో ఏయే సందర్భాలలో కటుభాషనుపయోగించానో మీకభ్యంతరం లేకుంటే కూలంకషంగా పునర్విచారణ జరుపుకోడానికి నేను సిద్దం ఆ పని మీకు సమయం చిక్కినప్పుడు నిదానంగా చేద్దాం గానీ, నా సూచనలో అత్యంత కీలకమైంది, ఏమిటో గమనించారా?! ఈ సందర్భంలో, ఆయావ్యక్తుల విషయంలో ఆ భాష అనుచితం అనన్నానేగాని, కటుభాషణం అసలు అవసరమే లేదన్నానా నేను? ఉదాహరణకు, ఇప్పుడు మీతో ముడివడి ఉన్న ఎన్నో అంశాలలో కటు భాషణ తప్పని సరైన పరిస్థితులు ఏర్పడుతూ వస్తున్నై, అందుకు కారణం మీ వైఖరేనన్నది నిజం. ఎందుకనంటే, ఎదుటి వాడు ఏమంటే నేనామాటన్నాను అన్నది పట్టి చూడాలి అని మీరు అన్నారు. కనుక, మన ప్రస్తుత సందర్భంలో అనవసరపు మాటలు, ఎవరి నుండి మొదలయ్యాయో చూద్దామంటే చూద్దాం. నా లెక్క ప్రకారం.
నేను ఖురాను నుండి, అవిశ్వాసులను అవిశ్వాస కారణంగానే వధించవచ్చన్న - నిజానికి వధించవచ్చన మాట కాక వధించిన సంఘటనలనే ఎత్తిచూపి, రహ్మన్‌గారూ! మీరు ఇస్లాంను విడిచి బైటికి రండి, అని నా పక్షాన్ని ముగించాను. సభా దానిని అంగీకరించింది. ఇహ, అప్పుడు మీ ముందు రెండే రెండు దారులున్నాయి. వాస్తవిక దృష్టితో సత్యాన్నంగీకరించి, అన్నమాటకు కట్టుబడి ఇస్లాంను విడచి బైటికి రావడం లేదా, నేను చూపిన ఖురాను వాక్యాల అర్ధం అది కాదనీ, ఖురానులో, అవిశ్వాసులను అవిశ్వాస కారణంగా వధించమన్నమాట గానీ, వధించిన సంఘటన గానీ లేదని చెప్పి రుజువు చేయడం.
''ఉందనాలంటే ఒక్కటి దొరికినా చాలు. లేదనాలంటే ఒక్కటీ వదలకుండా అంతా శోధించి చూడాల్సిందే''. అన్నదో విచారణ నియమం. అది మీకూ తెలుసు. కనుక నా పక్షాన్ని విన్నాక దానిని అంగీకరించి నావెంట రావడమో, నాది సరికాదని చెప్పి, ఎలా సరికాదోనూ వివరించి, మీదేమిటో చెప్పి అదెలా సరైందో నిరూపించడం చేయాలి మీరు. కానీ మీరా విధానాన్ని పాతిపెట్టి, రకరకాల ప్రస్తావనలు చేస్తూ వచ్చారు. దానిపై సభలో పాల్గొన్న వారిలో కొందరు అదేమిటని మిమ్మల్ని ప్రశ్నించారు. మరి కొందరు ఇస్లాంను విడవమని చెప్పారు. ఒకరిద్దరు రహ్మన్‌గారు మాట తప్పారు అనో, జారుకున్నారు అనో అన్నారు. ఇక మీరు చెలరేగిపోయారు. అనవసరపు దూకుడును ప్రదర్శించారు. అదీ విషయాన్ని విడచి వ్యక్తుల స్థాయిని గురించి దుందుడుకు మాటలనేశారు. ఈ సందర్భంలో చెప్పాను భాషను సరిచేసుకోండని.
ఎంత రచ్చ చేశారు? అసలు విషయాన్ని విడచి ఎంత సమయాన్ని రకరకాల అనవసరపు అంశాల మీద ఖర్చు చేశారు. చేయించారు? ఖురానులో అవిశ్వాసులను అవిశ్వాసం కారణంగా వధించవచ్చన్న అర్ధాన్నిచే ఒక్కవాక్యమైనా ఉందా లేదా? అన్నదే కదా మనం పరిశీలించి తేల్చుకోవల్సింది? దీనికింత రగడ, వ్యంగ్య భాషణమూ అవసరమా? ఇదంతా అడ్డగోలు పోకడ అని చూసే వారికి, చదువరికీ తేలిగ్గానే అర్ధమవుతోంది కదా! ఇంత జరిగాకనూ, ఎందరో విచారణ పూర్తయింది ఇస్లాంను విడచి బైటకి రండంటుంటేనూ, ఆ మాటలు వినీ, విననట్లుండడంతో మొదలైంది, పాఠకుల నుండి మరో రకమైన విమర్శ. ఆయనెందుకొస్తాడండీ! మీరా వాక్యాలు ఎత్తి చూపిన నిమిషంలోనే ఆయన గుండె బేజారైంది. ఎలా పలాయనం చేయాలోనన్నదే ఆయన ఆలోచన, ఎత్తుగడంతా లాటి మాటలన్నారు వారు. ఆశ్చర్యమూ, ఒకింత హాస్యాస్పదమూ అనిపించేలా వారి ఆ మాటల్నే మీరు తప్పించుకోడానికి, విషయాన్ని ప్రక్కదారి పట్టించడానికి సాధనంగా వాడుకుందామనుకున్నారు. విషయం అందరకూ సుస్పష్టంగా బోధపడుతూనే ఉంది. ఎటొచ్చీ మాకు, మిమ్మల్ని మీ బాధ్యతను (విధిని) నెరవేర్చేలా చేయడమే కుదరడంలేదు. అంతలా మొండికేసేశారు మీరు.
ఇప్పటికైనా మీలో ఏ మాత్రం నిజాయితీ ఉన్నా, నిజాన్నంగీకరించే స్వభావం ఉన్నా, మీరన్నమాటకు కట్టుబడి, ఉన్న వాస్తవాన్నంగీకరించి ఇస్లాంను విడిచిపెట్టేయాలి.
లేదా! ఈ విచారణ వేదిక నిర్వాహకుణ్ణైన నన్నుగానీ, సభను గానీ; ఒక్క అవకాశం ఇవ్వండి నా పక్షాన్ని వినిపించుకోడానికి అని అభ్యర్థించాలి. మేము సరేనంటే ఆ పని చేయాలి. చేయాల్సిన ఈ రెంటిలో ఏదీ చేయక, రకరకాల ప్రక్కదారులంటా, అడ్డదారులంటా పరుగు పెడుతూనూ, అదీ కుదరనప్పుడు కొంత తడవు మవునంగా ఉంటూనూ కాలం గడిపేస్తూ వస్తున్నారు.
ఇంత జరిగినా, జరుగుతూ వస్తున్నా, నావరకు నేను మీలో ఎలాగైనా పునరాలోచన కలిగించాలన్న ఉద్దేశంతోనే, ఖురానులో, బుద్దున్న వారు విడిచిపెట్టవలసినవీ, భౌతిక విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలరీత్యా తప్పులని రుజువు చేయగలిగినవీ ఎన్నో ఉన్నాయని చెప్పి, ఒకటి రెండంశాలను మీ దృష్టికీ తెచ్చాను. మీలో 'సత్యతిరస్కారం చేయకూడదెవరూ' అన్నంతవరకైనా ఇంగితం పని చేసి ఉన్నా, రండి సురేంద్రగారూ! ఖురానును ఈ కోణంలో పరీక్షించి చూద్దాం. మీరన్నట్లే ఖురానులో గాని అలాటి తప్పు జ్ఞానం అంటే పరీక్షలో కొట్టుకుపోయే లాటి అభిప్రాయ ప్రకటనలు ఏవైనా ఉంటే - ఒక్కటున్నా మొట్టమొదట అది దైవ గ్రంథం కాదని అంగీకరించి, మిగిలిన గ్రంథాన్నంతా మామూలు గ్రంథాలను చూసినట్లు పరిశీలనా దృష్టితో మళ్ళీ కూలంషంగా అధ్యయనం చేస్తాను. తప్పులను నెత్తినెట్టుకోవాలని గానీ, మందినెత్తిన పెట్టాలనిగానీ నాకేమీ లేదు. 100% పూర్తిగాకాకున్నా, కొంత వరకైనా నేనూ సత్యాలను గమనించి స్వీకరించాలన్న, మంచి చెడులను విచారించుకుని చెడును విడిచి, మంచిని అనుసరించాలన్న ఇంగితం ఉన్నవాణ్ణే, రండి మీరన్నలాటి దోషాలు ఖురానులో ఏమైనా ఉన్నాయేమో పరీక్షించి చూద్దాం అని ఉండేవారు. తప్పులున్నాయేమో చూడ్డానికీ అట్టివి ఉన్నట్లు తేలితే వాటిని విడిచి పెట్టడానికి, వెనుకాడడం ఉందే, ఒక మనిషిగా దానంత బలహీనత మరోటుండదు. నాలుగైదు ముఖ్యమైన ప్రకటనలు చేస్తాను. అవి వాస్తవాలను చూపెడుతున్నాయో లేదో మీరూ! పాఠకులూ గమనించండి.
1. మీరూ అంతో ఇంతో ఇంగిత జ్ఞానం కలిగి ఉన్నవారే అయితే అది పని చేయకుండా మరేవో ప్రాధాన్యతలు దానిని అణచిపెడుతున్నాయి. నిజాయితీతో వెనుదిరిగి చూసుకోగలిగితే మా అందరికంటే మీకే అవేమిటో ఇట్టే తెలిసిపోతాయి.
2. మండలి ఆలోచనా విధానాన్ని ఎంతో కొంత తెలిసున్న మీరు, ఎన్నో తెలియని విషయాలను అవి తెలియనివేనని తెలుస్తూనే ఉన్నా, తెలుసన్నట్లు నలుగురితో చెప్పి చూపడాన్నేమనాలి? ముక్కు సూటిగా చెప్పవలసి వస్తే 1. అది ఆత్మవంచనే. మిమ్ము మీరే వంచించుకుంటున్నారు. 2. పరవంచన కూడా. లోకాన్నీ వంచింప జూస్తున్నారు.
3. పరిశీలించాల్సిన రీతిలో, పరిశీలించగల వాటివరకైనా విధి విధానాలు తెలిసిన వారితో కలసి పరిశీలించడానికి సిద్దపడని మీ మరియు మీలాటి వైఖరి కలవాళ్ళంతా పెడపోకడ పోతున్న వాళ్ళూ, నీతిమార్గాన్నుండి జారిపోయిన లేదా వైదొలగిన వాళ్ళే.
మనం పరిశీలనాంశంగా ఎంచుకున్నది, మీ నోటి నుండే వచ్చిందీ ఇదిగో ఇదే.
''తనని ఒప్పుకోనందుకే తీసేయ్ అనే మాటగానీ, అలాటి అర్ధాన్నిచ్చేమాటగానీ, ఖురానులో ఒక్కటున్నా, ఇస్లాంను విడిచి వచ్చేస్తాను. ఇదినా పబ్లిక్ స్టేట్‌మెంటు''దీనిపై నేను ఖురాను నుండి 1. మూసా - ఆవు దూడ, 2. ఖిజర్ - మూసా - బాలుడు 3. హదీసులనుండి ఇస్లాంలోకి వచ్చి మళ్ళా దానిని విడిచిన యూదుని వధించే సంఘటనను ఎత్తి చూపించాను. ఆ సందర్భంలోనూ మరికొన్ని సమావేశాలలో ఈ సందర్భం వచ్చినప్పుడునూ అది 100% నిజం. ఒక ముస్లింగాని, ఇస్లాంను విడిచి అల్లా పై విశ్వాసాన్ని వదిలేస్తే అతణ్ణి వధించమనే ఇస్లాం చెపుతోంది అని మీరే స్పష్టంగా అన్నారు. ఆ మీ మాటలు రికార్డై ఉన్నాయి కూడా. ఒక వేళ ఆ మాటలు రికార్డు చేయకున్నా, అలాటి ఆదేశం ఉన్నట్లుగానీ, అలానే అమలయినట్లుగానీ, ఎప్పుడు ఎవరు (ఇప్పుడు మనం) పరిశీలించినా అవి దొరుకుతాయి ఎందుకంటే రాత రూపంలో ఉన్న వాటిని మీరు గానీ, నేనుగానీ, మరొకరుగానీ కప్పెట్టలేం కదా!?!.
మరొక్కమాట చెప్పి ఇప్పటికి ఆగుతాను
మనం సాగించిన ఆ సమావేశాలలో క్రమం తప్పకుండా పాల్గొన్న వాళ్ళలో నాకు గుర్తున్నంతలో ఈ జాబితాలోని వాళ్ళంతా, నేను చూపాల్సింది చూపాను, అది సరిగనే ఉంది. ఇక రహ్మన్‌గారేమి చేస్తారో చూడాల్సి ఉంది అన్నవాళ్ళే. కొందరైతే రహ్మన్‌గారూ! ఇస్లాంను విడచి బైటికి రండి! అని మీకూ, మరి కొందరైతే అతనెందుకొస్తాడండీ మీ పిచ్చిగాకుంటే అని నాకూ చెప్పారు. ఇదంతా మీకూ తెలుసు.1. మోషే 2. ప్రసాద్ 3. కోటి 4. రాజేంద్రప్రసాద్ 5. సిద్దాంతి 6. ప్రొ. రాధాకృష్ణ 7. రా.కృ. రెడ్డి 8. మురళీ 9. జయరాం 10. భీష్మాచార్య 11. మణికుమార్ 12. శ్రీనివాస్ (రాజానగరం) 13. ఖుద్దూస్.
14. క్రైస్తవం తరుఫున పాల్గొన్న బృందంలో కొందరు (శ్యామ్యూల్, పీటర్, జగదీష్, మనష్షే. విజయవాడ శామ్యూల్).15. మీ వైపు నుండి వచ్చిన వారిలోనూ ఒకరిద్దరు ఖరాఖండిగా చెప్పకున్నా, అలాటి అర్ధాలిచ్చే మాటలు ఖురాను హదీసుల్లో ఉన్న మాట నిజమేనన్నారు. నే చూపినవి అలాంటి అర్ధాన్నిచ్చేవిగానే ఉన్నాయి. మరింత పరిశీలించాల్సి ఉంది అనీ అన్నారు. 16. కన్నెబోయిన అంజయ్యగారు 17. క్రాంతికార్ 18. ప్రభు 19. డా. భాస్కరరాజు 20. వసంతరావు 21. నాగిరెడ్డి వెంకటేశ్వరరావు 22. ఐలయ్య 23. శ్రీకాంతరెడ్డి (కర్నూలు) 24. అన్ని సమావేశాలకూ హాజరుకాని వారూ మరి కొందరున్నారు. 1. జగన్ 2. లింగన్నగారు 3. వీళ్ళు వాళ్ళెందుకు మారతారండీ మీ పిచ్చిగానీ అన్నవాళ్ళే.
రహ్మన్‌గారూ! మరింత జాగ్రత్తగా గుర్తు చేసుకుంటే, మరి కొందరున్నారన్నదీ బైటపడుతుంది. ఆ సమావేశాలలో పాల్గొన్నవారి సంఖ్య 30, 35కు మించి ఉండదు. క్రైస్తవంలోని వారిపేర్లూ విడివిడిగా రాస్తే తమ అభిప్రాయాల్ని ప్రకటించిన వారి సంఖ్య 28 వరకు చేరుతోంది. ఇకపోతే ఏ అభిప్రాయాల్ని ప్రకటించనివారు; దేనినీ అంతగా పట్టించుకొని ఒకరిద్దరూ; మీ పక్షాన వచ్చిన ముస్లింలూ మాత్రమే. మీ వైపు నుండి 1. మీరు, 2. ముస్తాక్‌గారు, 3. హుస్సేన్ గారు, 4. పేర్లు గుర్తులేవుగాని, ముస్తాక్ గారి వెంటే కారులో వచ్చిన మరో ముగ్గురు, నలుగురు బహుశా అఖిల్ ఆలీ, నూరుద్దీన్, గౌతంలూ ఉన్నారు. ఇంత జరుగుతున్నా ఆ బృందంలోని వారు, నా అభిప్రాయం ఇదిగో ఇదే అని ఎందుకు ప్రకటించలేదో మీకూ తెలుసు, నాకూ తెలుసు.
1. నిజంగా నేను చూపిన వాక్యాలకు నేను చెప్పిన అర్ధం రాదని చెప్పడానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా; మొదట మీరే ఆ విషయాన్ని కుండబద్దలు కొట్టినంతగట్టిగా చెప్పి, అంతటితో ఊరుకోకుండా నన్ను తెలిసీ తెలియని మాటలు మాట్లాడేవాణ్ణిగానో, మనస్సులో ఇస్లాం వ్యతిరేకతనూ, హిందూ అభిమానాన్ని పెట్టుకుని ఉన్న అబద్దాల కోరుగాను నిరూపించేందుకు గట్టి కృషి చేసి ఉండేవారు.
2. మీ మాటలా ఉంచి; నేనూ సత్యాన్వేషినే అని మొదట నుండీ అంటున్న ముస్తాక్ గారీవిషయంలో ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నారెందుకని? నిజంగా ఆ మాటలకు నేను చెప్పిన అర్ధం రాదని చెప్పడానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా, ఆయన మీ అందరికంటే ముందుగా, ఉత్సాహాన్ని చూపి, నా పక్షాన్ని ఎదుర్కొనేందుకు సిద్దపడి ఉండేవారు. వాస్తవాన్ని కాదనేవీలులేదు కనుకనే, దిక్కుతోచకనే మరీ అడ్డగోలుగా మాట్లాడలేకనే ఆయన ఏమీ మాట్లాడకుండా 'కిమ్మినాస్తి'గా గమ్మునున్నారు. మరోలా చెప్పే సందుండుంటే వాళ్ళందరూ ఎంత రాద్దాంతం చేయాలో అంతరాద్దాంతమూ చేసి ఉండే వాళ్ళు.
నా కందిన వార్త ఎంత వరకు నిజమో నాకు తెలీదుగాని, మీ పక్షంలో దీనిని గమనిస్తున్న వారెందరో, నీ వలాటి ప్రకటనెందుకు చేశావు? అని మిమ్మల్ని ఎద్దెవా చేసినట్లూ, ఏదో అలా వచ్చేసింది, ఏమి చేద్దాం? అని మీరన్నట్లూ సమాచారం అందింది నాకు. కనుక ఈ విషయంలో వాస్తవమేమిటన్నది మీకూ తెలుసు, భాషతెలిసి ఖురానును అంతో ఇంతో చదివిన ఇస్లాం పక్షం వారికీ తెలుసు. మీ అందరిదృష్టీ; దీనికో ముగింపుకు రాకుండా చూసి, ఎలా బైటపడాలన్నదే నన్నది దీనిని పరిశీలిస్తున్న వారందరికీ తెలుస్తున్న నగ్న సత్యమే.
ఇప్పటికి ముగింపు
1. ఇస్లాంను విడిచి పెట్టి బైటకు రండి. ఇది నీతికీ, నిజాయితీకి సంబంధించిన సరైన ముగింపు. లేదా!2. మరోసారి ఖురాన్ పరిశీలనకు మీరే బాధ్యత వహించి సిద్దంకండి.
నా ప్రతిపాదన :- వ్యక్తి - సమాజము - ప్రకృతి, అన్నవాటి గురించి ఖురాను ఏమి చెప్పిందో ముందు వెలికి తీద్దాం. ఆపైన వాటి సత్యాసత్యాలేమిలో ప్రయోగరీత్యా పరిశీలిద్దాం.
3. ఈ లోక సంబంధం కాని అంశాలన్నీ బండ విశ్వాసాలే. అట్టివన్నీ మీకూ తెలీని భావాలే.
- సురేంద్ర
గమనిక : మత మార్పిడులు మారణ హోమానికి దారితీస్తాయనడానికి ఇస్లాం ఆదేశాలే గట్టి రుజువులు.
1. పుట్టుకతో ముస్లింగా ఉండి ఇస్లాం నుండి బైటికి వెళ్ళినవాణ్ణి ఖురాను, (హదీసులు) చంపవచ్చు అంటుంది. చంపమంది చంపడమూ జరిగింది.
2. చరిత్రలో జరిగిన మత యుద్ధాలన్నీ, ఖురాన్‌లో యుద్ధాలన్నీ మత యుద్దాలే. అంటే ఆ మతాన్ని అంగీకరించిన - అంగీకరించని వారి మధ్య అకారణంగా జరిగిన యుద్ధాలే.
అదనంగా:
228,
Fazlur Rahman,
islam,
religion,
ఇస్లాం,
ఖురాన్,
ఫజులుర్ రహ్మాన్
రంజిత్ ఓఫీర్
యోచనాశీలురైన పాఠకమిత్రులారా! హైందవ క్రైస్తవం రచయిత ఎక్కడ మొదలెట్టి ఎక్కడకు దిగజారారో క్రమంగా పరిశీలించాక, నాకైతే! అతని దిక్కుతోచని, దయనీయ పరిస్థితి, ఒక వంక జాలి గొలుపుతూ ఉంది. మరోవంక అతనికలాంటి శాస్తి జరగాల్సిందేననీ అనిపిస్తోంది. అమాయకులైన హిందువుల్ని క్రైస్తవంలోకి తోలుకెళ్ళడానికి ఎంత కుట్ర పూరితంగా వ్యవహరించాడాయన?! 'హిందువులెవరూ పట్టించుకోరులే అన్న ఒకే ఒక్క ధీమా' అతని చేత అంతసాహసం చేయించింది.
ఒక ముఖ్య గమనిక :- 1. పనీపాటా లేని రకం, 2. అమాయకుల్ని తమ వైపు ఆకర్షించి స్వార్థ ప్రయోజనాలను పొందాలనుకునే రకం 3. యువత బలహీనతల్ని సొమ్ము చేసుకుందా మనుకునేరకం, అన్న మూడు రకాల వాళ్ళూ; ఎలెక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాల పేరున హోరెత్తిపోతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంతగా దుర్వినియోగం చేయాలో అంతగానూ దుర్వినియోగం చేస్తూ వస్తున్నారు.
మన ప్రస్తుత విచారణీయాంశంలోని ముఖ్య పాత్రధారి అయిన ఓఫీరుగారు, పై మూడు రకాలలోని రెండవ రకానికి చెందిన వారు. అందులోనూ ఉద్దండులు. సి.డిలు చేసి, టి.వి లలో ప్రసంగించి, పుస్తకాలురాసి, సభలూ సమావేశాలు పెట్టి, అవన్నీ తప్పులేనని తనకే తెలిసిన అబద్దాలను, తనకే తెలీని అనేక విషయాలనూ కలిపేసి తెగతెలిసిన వానివలే; సాధికారిక ప్రతినిధి మాట్లాడినట్లు మాట్లాడేస్తూ, వాటినన్నంటినీ మందినెత్తిన, అమాయకపు మందనెత్తిన గుమ్మరిస్తూ వచ్చారు. డబ్బుకు కక్కుర్తిపడో, బ్రతుకుతెరవుకొరకో దీన్నంతటినీ భుజానికెత్తుకుని అమాయకజనానికి చేర వేసే సొంత మందా కొందరున్నారాయనకు. ఈ రకమైన పన్నాగంలో భాగంగానే ఉనికిలోకి వచ్చిన హైందవ క్రైస్తవం అన్న పుస్తకం ఆధారంగా ఏమి జరుగుతూ వచ్చిందో సంగ్రహంగా ప్రకటించడానికి ఉద్దేశించిందే ఈ వ్యాసం.
1. హైందవ క్రైస్తవం అన్న పుస్తకం ప్రచురించి కొద్ది సంఖ్యలో సమాజం పైకి వదిలాడు.
ఎ) దానిని చూచి సొంత మంద అబ్బో తెగబాగుందన్నారు. క్రైస్తవుల్లోనే కొందరు తప్పన్నవారూ ఉన్నారు. బి) ఇతర మతస్థులు - క్రైస్తవేతరులు- ముఖ్యంగా హిందువులు ఒకడూ అరా అదేమిటన్నారో లేదోగాని, ఈయన గారు పునరాలోచించుకునేలా ప్రతిఘటనేమీ రాలేదు. సి) తూ. గోదావరి జిల్లా నుండి ఈ పుస్తకంలోని అభ్యంతరకర అంశాల ఆధారంగా ఒక కేసువేశారు. అంతో ఇంతో పలుకుబడీ సరిపడినంత డబ్బు ఉన్న వాడవడంతో, ఈయనగారు యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేయించుకుని, ఆ కేసువిచారణకు రాకుండా జాగ్రత్తపడుతూ వస్తున్నారు.
2. పెద్దగా ప్రతి ఘటనేమీ రాకపోవడంతో మరో అడుగు ముందుకేసి, భారతదేశం మొత్తానికీ సవాలంటూ ఎవరైనాసరే తన హైందవ క్రైస్తవంలో దోషాలు, తప్పులు ఉన్నట్లు రుజువు చేస్తే తానుక్రైస్తవాన్ని విడచి హిందువునవుతాననీ, సవాలు చేసినవారు అలారుజువు చేయకుంటే తన ద్వారా బాప్తిస్మం తీసుకుని క్రైస్తవంలోకి రావలసి ఉంటుందని, ఒక సి.డి ప్రకటనచేశారు. ఆ ప్రకటనలో హై.క్రైస్తవం అన్న తన పుస్తకాన్ని 600 మంది స్వాములకు పంపినట్లు, టి.వీ ద్వారా బహిరంగ చర్చకు పిలుపిచ్చినట్లు చెప్పారు. అయితే ఆ పుస్తకాన్నందుకున్నవారందరూ దానిలో దోషాలున్నాయనేంత శక్తి తమకు లేదని చెప్పినట్లూ, కొందరైతే చాలెంజికి భయపడి పలాయనం చిత్తగించినట్లూ కూడా ప్రకటించేశారు.
సి.డి.రికార్డు రూపంలో ఉన్న ఈ ఆధారంతో, సత్యాన్వేషణ మండలి అన్న సంస్థకు చెంది, వివిధ తాత్విక, మత సిద్దాంత గ్రంథాలను గత 30 ఏండ్లుగా అధ్యయనమూ, తులనాత్మక పరిశీలనా చేస్తూ వస్తున్న పుట్టా సురేంద్ర బాబు అనునేను, ఓఫీర్ గారి సవాలును స్వీకరిస్తున్నాననీ, ఎప్పుడు ఎక్కడ వీటిని తేల్చుకోడానికి ఎదురుపడదామో తేల్చి చెప్పమనీ ఒక రిజిష్టరు ఉత్తరం వ్రాసి, ఆ మొత్తాన్ని మా మాసపత్రిక వివేకపథంలో ప్రకటించి, ఆ సంచికను ఆయనకూ, మరికొన్ని మత సంస్థలకు చెందినవారికీ పంపాను. ఆ నా లేఖలోనే సి.డిలో ఓఫీరుగారు ప్రకటించిందెంత వరకు వాస్తవమో; తెలుసుకుందామనుకుని; ఆయనన్న 600 మంది సాధుసన్యాసులు మొ|| వారి పేర్లు, చిరునామాల జాబితా పంపండనీ రాశాను. (మొదటిలేఖ 14.7.2015లోనూ, రెండోలేఖ 12-8-2015న రాశాను)
ఆశ్చర్యం :- దేశం మొత్తానికీ సవాలన్నాయన, సవాలుకు నేను రెడీ అంటున్నా నాకు సమాధానం పంపనూ లేదు. జాబితానూ పంపలేదు. ఈ వివరాలు (వివేకపథం - 218 చేదు నిజాలు - నిష్ఠుర సత్యాలు) లో ఉన్నాయి.
వివేకపథాన్ని చదువుతున్న వారిలో మరి కొందరు రంజిత్ ఓఫీరు గారికి వారి సవాలును తామూ స్వీకరిస్తున్నట్లు చర్చకు సిద్దం కమ్మన్నట్లూ రాశామని నాకు తెలిపారు. ఆ మాటలూ వి.పథం - 219 లో ఉట్టంకించాను. అలా రాసిన వారిలో ఏ మతానికి చెందని, డా.బ్రహ్మరెడ్డిగారూ, వైదిక సాంప్రదాయానికి చెందిన మాతాజీ, నిర్మలయోగ భారతిగారు, ధర్మజాగరణ సంస్థకు చెందిన సిద్దాంతిగారు మరికొందరూ ఉన్నారు. వారిలో కొందరైతే సురేంద్ర బాబుతో మాట్లాడితే మాతో మాట్లాడినట్లే, అతని గెలుపోటములు మావిగా అంగీకరిస్తాము అనీ రాశారాయన గారికి. అయినా మన ఛాలెంజర్! నిరంతర సత్యాన్వేషి! సత్య సంస్థాపనాభిలాషి! ఈ యుగపు యేసునోరు! అని తనకుతానే కితాబులిచ్చుకున్న రంజిత్ ఓఫీరుగారు కిమ్మన్నాస్తిగా గమ్మునున్నారంతే.
ఏమిచేస్తాం! అప్పటి నుండి ఇప్పటి వరకు ఏదో రకంగా ఆయన్ను ముగ్గుమీదకు తేవడానికి రకరకాలుగా యత్నిస్తూనే ఉన్నాను. ఒక దశలో ఒకింత కఠిన భాషనుపయోగించగా, ఫజులుర్రహ్మన్‌గారు, మన వైపుకు తీసుకురావాలనుకున్న వారిని గానీ, ఆలోచింపజేయాలనుకున్న వారినిగానీ ఇలా కఠినంగా మాట్లాడితే మన లక్ష్యమే నెరవేరకుండా పోతుంది కదా! నాకు తెలిసినంతలో ఓఫీర్‌గారు చర్చకు వెనకాడే మనిషికాడు అనన్నారు. అప్పుడు నేను ఏమండీ రహ్మన్‌గారూ! జరుగుతున్నదంతా మీరూ శ్రద్దగా గమనిస్తూనే ఉన్నారు కదా! బైబిలు, ఖురానులనేగాక, హిందూ గ్రంథాలనూ ఎంతో కొంత చూసిన మీకూ బైబిలు - ఖురానుల ననుసరించే అతడు చెపుతున్నది అబద్దం అని తెలుసు, పైగా మీ కాయనతో మిత్ర సంబంధాలూ ఉన్నాయి. రండి కూర్చుని మాట్లాడదాం అనిగానీ, మీ అభిప్రాయాలు సరైనవి కావనిగానీ ఆయనతో మీరే ఎందుకు చెప్పరండీ! అని అడిగాను. ఆయనను వేదికపైకి తీసుకొచ్చే యత్నం - సత్యం కొరకైనా- మీరూ చేయవచ్చు కదా అని అడిగాను. పొరపాటైంది. ఇప్పటి వరకు నేను ఈ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఇప్పుడు ఆయనను కలిసి విషయం చెప్పి, ఒప్పించే యత్నం చేస్తాను అన్నారు. రహ్మన్ గారు అన్నట్లే పట్టుబట్టి ఆయన్ను కలసి, అక్కడి నుండీ నాతో ఫోనులో మాట్లాడించారు. ఫోనులో ఓఫీరుగారు అప్పుడు నాతో మాట్లాడిన నాలుగు మాటల్ని, మీ లెటర్‌హెడ్ పై వ్రాసి పంపండని ఓఫీరు గారికే చెప్పాను. రహ్మన్‌గారు ఆ లేఖను నాకు చేర్చారు.
దానిపై; ఆ లేఖలో ఓఫీరుగారు ప్రతిపాదించిన అంశాలు ఎందువల్ల సరైనవికావో అదంతా వివరిస్తూ, మరొక రిజిష్టర్ లేఖ ఓఫీరుగారికి రాస్తూ, దానిని వివేకపథంలో ప్రకటించాను. వివేకపథం ద్వారా ఈ వివరాలందుకున్న విశాఖపట్నానికి చెందిన ఒక చిన్నపత్రిక సంపాదకులు కనకరాజుగారనుకుంటా రంజిత్ ఓఫీరుగారిని విమర్శిస్తూ ఒక ప్రకటన చేశారు. దానిపై రంజిత్ ఓఫీరు గారు మరో ప్రసంగం చేసి, దానిని సోషల్ మీడియాలోనూ పెట్టారు. అందులో తాను మామూలు స్థాయి కలిగిన వాణ్ణికాననీ, దారిన పోయ్యేవాళ్ళేదో అంటే స్పందించి, అందుకు సిద్దపడడానికి తానేమీ పనీ పాటా లేని వాణ్ణి కాననీ, జెబ్బలెగరేసుకుంటూ ఏదేదో తెగ మాట్లాడేశారు. సురేంద్రను నా హైందవ క్రైస్తవం పై ఒక విమర్శనాత్మక గ్రంథం రాసి ప్రచురించమన్నాను. అదింకా ఆయన చేయనేలేదు. ఆయన ఆ పుస్తకం రాసి, దానిని నాకు పంపితే, అదంతా చూసి, సురేంద్ర నాతో కుస్తీకి సరిపోతారో లేదో నిర్ణయించి అప్పుడు చెపుతాను అంటూనూ తెగ రెచ్చిపోయి మాట్లాడారు.
ఓపెన్ ఛాలెంజ్ అన్న ఓఫీరు గారు; సరైతేరా చూసుకుందాం అని సవాలును స్వీకరించిన నాతో నీకేమేమి పట్లు తెలుసో, నన్నెక్కడెక్కడ కొడతావో, ఎలా కొడతావో వివరంగా చెపితే అవన్నీ పరిశీలించుకున్నాక, నీతో కుస్తీ పట్టాలో లేదో చెపుతాను అంటూ చేసిన బుద్ది తక్కువ ప్రతిపాదనను ఆయన పక్షంలోని ఒక్కడంటే ఒక్కడు ఇదేమి పద్దతని అడగలా. ఒకరిద్దరైతే, ఆయనడిగినట్లు అదేదో పుస్తకం రాసేస్తే పోనుగదండీ అని, అమాయకంగా, అంతే తెలివి తక్కువగా తిరిగి నాకే సలహా ఇచ్చారు. అసలా విధానం ఎవరూ అనుసరించగూడనిదే అయినా, నా పోకడలోని బలమూ, ఆయనన్న వాటిలోని డొల్లతనమూ మచ్చు చూపించడం కోసమని, హైందవ క్రైస్తవంలోని '4' అంశాలను ఎత్తుకుని అవి ఎలా తప్పులో వివరించి నిర్ధారించాను. 1. అట్టపైని ముఖచిత్రంలోని దోషమూ, అది తయారు చేయడం వెనుక నున్న కుటిల పన్నాగం 2. లోపలి పేజిలో ముందే ఉన్న 'సత్యమహంగంభీరః' అన్న కొటేషను, దానికి వివరణగా 'సత్య విజయం' శీర్షికన ఆ పుస్తకంలోనే లోపలి రాతలను 3. ఓంకారమే క్రీస్తు అయ్యెను. 4. అట్ట చివరి పేజిలో ఆయనే తన గురించి రాయించుకున్న అతిశయోక్తులు 5. 'భువనస్యనాభిః' అన్న దానిని గురించి ఆయన రాసిన రాతల్లోని తప్పుడు భావాలు. ఈ ఐదు అంశాల సమాచారం ఆయనకు అందజేశాను పత్రిక పంపడం ద్వారా ఇక్కడికే, ఆయన ససంతా పసలేనిదే ననడానికి అవసరమైన కనీసాధారాలు నేను రాత మూలకంగా ఆయనకు అందించ నట్లయింది, స్థాయిల గురించి తెగ వదరిన అయ్య గారికి, ఈ విషయాల వరకైనా నేనేమిటో నసాళానికంటినట్లే. నోరెత్తితే ఇరుక్కుపోతామని స్పష్టంగా తెలిసినట్లే. నేను ఈ వివరాలు చెపుతూ స్థలకాలాలు నిర్ణయించండి. క్రైస్తవాన్ని విడవడానికి సిద్దపడే వేదికకు రండి. ఇంకా మరికొన్ని అంశాలూ విచారించి మీ పుస్తకమెంత అసత్యాలతో, కల్పనలతో, కూడి ఉందో, దానిని సిద్దం చేసిన మీ మనస్సులో ఎంత కల్మషం ఉందోనూ రుజువు చేస్తాను అనీ ప్రకటించాను. ఆయనకు పరిస్థితేమిటో తెలిసిపోయిందనుకోండీ ఆయన అంతటోడింతటోడంటూ భుజాలకెత్తుకుని, వీరంగం వేసే వారైనా, రాన్నా! నీ ప్రతాపం చూపించు, లోకానికి నీవేమిటో, నీ పసేమిటో తెలియపరచు అని అతణ్ణి వత్తిడి చేయవచ్చుకదా!
ఈ మధ్య ఆయన గారిదే మరో ప్రసంగం, వాట్సాప్ ద్వారా నాకు చేరింది. కరుణాకర్ సుగుణ అన్నతను, దానిని నాకు పంపాడు. అది చూశాక నాకు 1. పెద్దగా నవ్వుకోవాలనిపించింది. 2. అతని అనుచరగణాన్ని పిలిచి ఈ బేల ప్రార్థన లేమిటి? అని అడగాలనిపించింది. మరో వంక అతని దిక్కుతోచని పరిస్థితీ, దీనాలాపములను బట్టి జాలీ కలిగింది. ఆ వివరాలివిగో? మామూలుగానైతే ఎంతో హుందాగా, డాబుదర్పంతో, అహంభావిగా ట్రిమ్ముగా కనపడే ఓఫీరుగారు దిగులుగా, జబ్బుపడ్డమనిషిలా, మ్లానవదనంతో, తెగ ఆవేదనపడుతున్న ముఖ భంగిమతో మాట్లాడినట్లుంది అందులో. ఓడిపోయినవాడూ, దెబ్బతిన్నవాడూ, తిరిగి ఏమీ చేయలేని స్థితిలో ఏమి మాట్లాడతాడో, ఎలా ఉంటాడో అన్న దానికి గట్టి రుజువుగా ఉందా రికార్డులోని ఆయన తీరు 1. ప్రేమగలిగిన మా మహా పరిశుద్ద తండ్రీ! అని మొదలైందాయన ప్రసంగం.
2. సువార్త విరోధులను ప్రభువైన ఏసుక్రీస్తు నామమున మేము శపిస్తున్నాము తండ్రీ! వారిని నష్టపరచండి, భయపెట్టండి తండ్రీ!
3. వారి కుటుంబములు, వ్యాపారములు నష్టపరచండి! ఏసుకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే ఇదంతా జరిగిందని తెలుసుకుని గడగడ వణికే వాతావరణం పుట్టించండి. (ప్రక్కనున్న మంద ఆ మేన్ అని అరుస్తున్నారు)
4. రెండవ కీర్తన 4, 5 వచనాలలో చెప్పినట్లు ప్రచండకోపంతో దిగివచ్చి ఏసునాథా వాళ్ళను తల్లడిల్లజేయమని ప్రార్థన చేస్తున్నాం.
5. రెండవ కీర్తన నెరవేర్చండి! ప్రచండకోపంతో దిగిరండి! తండ్రీ నీకు స్త్రోత్రాలు. ఈ దేశంలో, మా దేశంలో, ప్రపంచ దేశాలన్నంటిలోనూ సువార్త విరోధులను తల్లడిల్లజేయండి.
6. వడగండ్ల వాన కురియునుగాక! భూకంపములు వచ్చునుగాక! సువార్త విరోధుల శిబిరాలు కుప్పకూలిపోవునుగాక! (చప్పట్లు)
7. ప్రభువా! మనుషులేపాటి వారునాయనా! నీవు దేవదేవుడివి. దిగిరా తండ్రీ! మేం ఒప్పుకోం! నీవు రాకుంటే ఒప్పుకోం! మా ప్రాణాలడ్డు వేసి అడుగుతున్నాం. భారత దేశానికి దిగి రండి ఏసయ్యా! నీకు వందనాలు. మహర్షులతో మాట్లాడి మిమ్ము తెలియపరచుకోడానికి క్రీస్తు పూర్వం 2000 ఏండ్ల నాడు వచ్చావు. ఇప్పుడు క్రీస్తు శకం 2000 ఏండ్ల నాడు మళ్ళీ రాతండ్రీ! అప్పుడు వచ్చి వేదాలలో నిన్ను గూర్చి రాయించావు. దానిని కాదంటున్న వాళ్ళను తల్లడిల్లజేయడానికి మళ్ళా దిగిరాతండ్రీ!
పాఠక మిత్రులారా! ఇదండీ ఆ ప్రసంగంలోని విషయం -ఓఫీరుగారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారనడానికి దీనంతటినీ పరిశీలిస్తున్నవారికి ఎట్టి అభ్యంతరమూ ఉండదను కుంటాను.
సమీక్ష
ఎక్కడ, ఏ గొంతుతో, ఎంత ఆర్భాటంగా, అహంభావంతో మొదలైందాయనగారి ఛాలెంజి ప్రకటన?!1. 600 మందికి పుస్తకం పంపాం, టివిలలో బహిరంగ చర్చకు ఆహ్వానించాం, పెక్కురు స్వాములకు, అర్చకులకు పంపాం. దానిలో తప్పుందనడానికి ఒక్కడూ సాహసించలా, కొందరైతే తమకంతశక్తి లేదన్నారు. కొందరైతే పారిపోయారు. నేనైనా సత్యం చెపుతా, మీరైనా సత్యం చెప్పండి. నేనైనా హిందువునవుతా మీరు క్రైస్తవులైనా అవ్వండి. అదో యిదో, దేనికైనారెడీ! ఇదీ! ఆనాటి ఆయన గారి ధీమా, దూకుడుమాట.
2. సవాలు స్వీకరిస్తున్నామన్న నాలాటి వారి పిలుపుకు సమాధానంగా, నన్నడిగిన వారి లెవలెంత? నాలెవలేంటి? వారికి పనీపాటా లేకుంటే, నాకూ పనీ పాటా ఉండవా? నేనన్న ప్రతిదానికీ రుజువులతోటీ పుస్తకంరాశాను. అలాగే వారు వాటన్నంటినీ అంశాల వారీగా తప్పు బట్టి, రుజువులతో సహా ఒక పుస్తకం రాసి నాకు పంపాలి. దానిని చూశాక, వారికి మాట్లాడదగ్గ స్థాయి ఉంటేనే చర్చ. దారిన పొయ్యేప్రతి వానికి బదులిస్తామా?! ఇదండీ! ఆయన గారి మలి ప్రసంగపురీతి. ఇందులో వెనకటి డాంబికతతో బాటు ఒకింత మేకపోతు గాంభీర్యమూ జతైంది. ఎందుకంటే?
1. అప్పటికే ఆయనగారి అనుచరుడూ, నాకు పరిచయస్తుడూ అయిన జగదీష్ గారికి, బైబిలును పరిశీలిస్తున్న అనేకులున్న సభలోనే, హైందవ క్రైస్తవంలోని ''భువనస్య నాభిక'' అన్న అంశాన్ని చూపించి, వేదంలోని ఆ భాగాన్ని, దానికి ముందు వెనకలనున్న భాగాలనూ, ఆ సూక్తానికి దాశరధి గారు చెప్పిన అనువాదాన్ని, దయానందుడు చెప్పిన అర్ధాన్నీ, ఆ సందర్భాన్నీ వివరించి, రంజిత్ ఓఫీరు గారు ఎంత అడ్డగోలుగా, ఆ సూక్తానికి, ఆమంత్రానికి రాని అర్ధాన్ని దాన్నెత్తిన పెట్టారో విడ మరచి చూపించి, అయ్యా ఈ విషయం మీరు ఓఫీరుగారి దృష్టికి తేవడం కొరకే ఇంత సమయాన్ని, శ్రమను ఖర్చు పెట్టాను అని చెప్పాను. దాంతో పాటు పైన పేర్కొన్న నాలుగంశాలపైనా, ఓఫీరుగారిది ఎంత పెడపోకడోనూ వివరించి ప్రకటించాను. ఇదంతా గమనించిన ఆయన గారికి సురేంద్రతో ముడిపడిన ఈ కేసు మిగిలిన కేసుల్లాటిది కాదన్నంతవరకైనా తట్టే ఉంటుంది. ఈ వివాదాన్ని పరిశీలిస్తూ ఆయననూ, నన్నూ ఎరిగిన వారు కొందరు నా గురించీ, నా పోకడ గురించి కొద్ది మాత్రమైనా ఆయన గారికి సమాచారం అందించే ఉంటారు.
3. ఇక మూడో ప్రసంగం యథాతథంగా పైన వ్రాశాను. ఎవరొస్తారో రండి నా తడాకా చూపిస్తాను అన్న ఆరంభం నుండి, శాపం పెడుతున్నాననీ, శాపం అమలయ్యేలా నీవే చూడాలి తండ్రీ! అనీ, అదంతా అవుతుందో లేదోనని తనకే అనుమానం వచ్చి, నీవే దిగిరా తండ్రీ అనీ, మామూలుగా పిలిస్తే వస్తాడో లేడో నన్న అనుమానంతో, రాకుంటే ప్రాణాలు తీసుకుంటామనీ, దయనీయంగా దేబిరించుకొనే స్థితికి దిగజారిందాయన గుండె నిబ్బరం. పైగా వచ్చి ఏమి చేయాలట ఆ ఏసు!? పిడుగులు, భూకంపాలు, గాలివానలు, అగ్ని కీలలు, శిబిరాలు నాశనం చేయడాలు, అమ్మో అమ్మో ఏసు చేత ఎన్ని పనులు చేయించాలనో ఈ ఓఫీరుగారి ఆక్రోశం? ఎంత క్రోధం? ఎంత నిస్సహాయ స్థితి? ఎంత కౄరత్వం? ఎంత వినాశకర దృక్పథం? సువార్తను కాదంటే, అట్టి వారికి ఇంత జరగాలన్నమాట! బలే ఏసునోరే! ఈ యుగానికి ఏసు ఎంచుకున్న (నియమించిన) అపొస్తులుణ్ణి తానేనని ప్రకటించుకున్నాయన, ఏసు నామాన ఏదంటే అది జరుగుతుందన్న ఏసు వాక్యాన్ని నమ్మి, ఆయనే, ఏమి జరగాలో చెప్పక, నీవేరావాలి తండ్రి! వాళ్ళతో కొట్లాడు, వాళ్ళను తన్ను, వాళ్ళే తంతే తన్నించుకో అన్నట్లు ఈ నాటకీయ ప్రసంగాలెందుకు? నన్ను కొడితే కొట్టావు, నా ఏసును కొట్టు చూస్తాను అన్న పోకడన్నమాట ఇది. ఈ గ్రంథంలోనే మరోచోట, నా రచనపై వచ్చిన ప్రశంసలూ ఏసుకే, తిట్లూ ఏసుకేనని, తెగబడి మాట్లాడేశారీయనే.
హలో రంజిత్ ఓఫీరుగారూ! ఒక్కమాట! మీ వేళా కోళం కాకుంటే పిల్లి శాపాలకు నల్లరాళ్ళు పగులుతాయటండీ ఎక్కడైనా? ఉడత ఊపులకు ఊడలమర్రి ఊగుతుందటండీ! మరీ చోద్యం కాకుంటేనూ? ఇంతకూ యేసన్నాయన దగ్గర మీకున్న పరపతెంతట? మీ రాతల ప్రకారమే వేదాలను అనువదింపజేయమని అదేపనిగా రెండు దశాబ్దాలపాటు మొత్తుకోవలసి వచ్చింది. అప్పటికీ ఆయన పట్టించుకోలా! మరెందరినో అదే ప్రార్థన చేశారని మీరే సెలవిచ్చారు. అదన్నమాట, యేసు దగ్గర మీ మాటకున్న పవరు. ఎందుకండీ పసలేని ప్రగల్భాలు? ఆ పెట్టే శాపాలేవో వాటిని మీ వరకు పరిమితం చేసుకోక, ముగ్గులోకి యేసునెందుకు లాగారు? మీకు లాగానే ఆయనకూ అంత పసేమీ లేదని తేల్చడానికి తప్ప మరెందుకూ పనికిరావవి. మీరనే ఆ యేసుకు ఆయనకాయన చేసుకోడానికేదిక్కులేదు. తండ్రిని పదే పదే బతిమాలుకున్నాడు. కడకు తండ్రి వచ్చేదిలేదు, ఈయన్ను కాచేదీలేదన్న నిర్ణయానికి వచ్చి; నీ చిత్తమెలాగైతే అలాగే కానీమని ఒక నిర్వేదపు నిర్ణయానికి వచ్చాడు. వేదన తట్టుకోగలిగినంత తట్టుకున్నాడు. తట్టుకోలేనప్పుడు, ఓనా తండ్రి! నన్నేల చేయి విడిచితివని, తలవేలాడేశాడు. ఇదంతా వాస్తవమని బైబిలు చెప్పేదేకాని, ఈనాటి మేమేమి (ఎవరూ) కల్పించిందికాదు గదా. ఆయనకే దిక్కులేదు. దిక్కనుకున్నవాడు వచ్చిందీలేదు. అనంతరం ఈయన వారుగా చెప్పబడినవారు (శిష్యులు) హింసించి చంపబడుతున్నప్పుడూ ఆయన వచ్చిందీలేదు. రక్షించిందీ లేదు. ఇదంతా బైబిలు అందిస్తున్న సమాచారమే.
నా పేరున మీరేది చెపితే అది జరుగుతుందన్న యేసుమాట సత్యమో కాదో తేల్చుకుంటానికైనా, ఆనాటి ఈయన శిష్యుల్లో ఎవరో ఒక్కరైనా తమని బంధించినప్పుడో, శిక్షిస్తున్నప్పుడో చంపుతున్నప్పుడో అయినా, ఆ పనికి పూనుకున్నవారు చావాలనో, కనీసం కాళ్ళూ చేతులూ పడిపోవాలనో అనైనా ఎందుకు అనలేదు? హలో మన పిచ్చిగాని, అనకపోవడమేమిటండీ! వందలసార్లు మనస్సులోనైనా అనుకునే ఉంటారు. కానీ అవన్నీ ఏసు అన్న కాకమ్మకబుర్లేనని అలా అనుకున్న వారికల్లా అనుభవంలోకివచ్చి ఉంటుంది. కడకు ఏమి చేయలేక నిస్సహాయంగా ప్రాణాలు విడిచారు వాళ్ళంతా. దీన్నంతటిని ఏమీ పట్టించుకోకుండా, పిల్లి శాపాలు పెడుతున్నారు రంజిత్ ఓఫీరుగారు, వీరి శాపాలకు చిరిగిపోయిన కాగితపు ముక్కైనా కదలదు. ఏసు పేరుపెట్టి గాండ్రిద్దామని మరో ఓపికలేని ప్రయత్నం చేశారు. పాపం అదీ గాండ్రింపు శబ్దాన్ని పుట్టించక, మొరిగినట్లు చప్పుడైంది. (తొడగొట్టడమెక్కడ? చేతులెత్తేసి దేబిరించడమెక్కడ?).
ఏమండీ ఓఫీరుగారూ! ఈ మీ శాపం ఎన్నాళ్ళకి ఆచరణలోకి వస్తుందండీ! టైం చెప్పగలరా? ఆ మీ ఏసును నీవుగాని రాకపోతే చస్తాము అనీ అనేసి మరీ పిలిచారు గదా? ఎంతకాలానికి వస్తాడండీ ఆయన?! పైగా భారత దేశానికి రమ్మని ప్రత్యేకంగా ఆహ్వానించారు కూడా? అందులోనూ మీ అంతరంగంలో ఆంధ్ర, తెలంగాణాలే ఉండుండాలి. అందునా సురేంద్ర - హైందవ క్రైస్తవంతో ముడిపడి మాట్లాడిన వాళ్ళే ఉండుంటారు. వీళ్ళ మీద, పిడుగులు, భూకంపాలు, తుఫానులు, అగ్నివర్షాలు, వడగళ్ళ వర్షాలు, శిబిరాల కూల్చివేతలు, వ్యాపారాలలో నష్టాలు, అబ్బో, అబ్బో, ఎన్నో, ఎన్నెన్నో! ఎప్పటికి పూర్తి చేస్తాడండీ మీ ఏసు వీటన్నింటినీ? దానికైనా ఒక కాలాన్ని - ఆయన్నడిగైనా సరే - ప్రకటించు ఆ తరవాతైనా క్రైస్తవాన్ని విడవడానికి సిద్దపడు.
Tuesday, July 5, 2016
మతస్వేచ్చ - భారత రాజ్యాంగము : - ఒక పరిశీలన
మతస్వేచ్చ - భారత రాజ్యాంగము : - ఒక పరిశీలన
(గత సంచిక తరువాయి)
విన్నవాటి విషయంలో లేదా చదివిన వాటి విషయంలో, వాటిని గురించి మరొకరు నీకే విధమైన సలహాలు, సూచనలు ఇవ్వకుండా ఏరకమైన వత్తిళ్ళు పెట్టకుండా, నీకునీకుగానే, అప్పటికున్న నీ సొంత జ్ఞానం- అవగాహన - ఆధారంగానే వాటిపట్ల అనుకూలతో, ప్రతికూలతో (ఇష్టమో, అయిష్టమో) ఏర్పడితే అదిగో దానిని అనాలి స్వ-ఇచ్చ = సొంత యిష్టము = స్వేచ్చ అని.
అలాకాక ఆ విన్నవాటి విషయంలో అంటే వాటికి చెందిన సమాచారం వరకు తెలిసిన సందర్భంలో మరొకరుగానీ, ఆ సమాచారం అందించిన వ్యక్తేగాని, వాటి గురించి తన ఇష్టాఇష్టాలననుసరించి నిన్ను ప్రభావితం చేయడం ద్వారా అలాగా! అయితే అది నాకిష్టమేననిగాని, అయిష్టమేనని గాని నీవనుకుంటే దానిని స్వయిచ్చ అనరు. ఆదశలో నీవు ఎంతో కొంత మేర స్వేచ్చను కోల్పోయావు. మరొకరి ఇష్టాయిష్టాల ప్రభావానికిలోనై నావు అనాల్సిందే.
తాత్వికంగా దానినే పరాధీనమనస్కత అంటారు. మనం ఎత్తుకున్న విషయపు విచారణంతటికీ ఇదే ఆధారశిల లాంటి అంశమై ఉంది.
స్వేచ్చంటే ఏమిటి? స్వేచ్చ లేకపోవడమంటే ఏమిటి? అన్న విషయం స్పష్టంగా నిర్వచించుకోగలిగితేనే ఈ రాజ్యాంగ శాసనాన్ని దాని సరైన అర్దంలో వినియోగించుకోగలుగుతాం. స్వార్ధపరులు దుర్వినియోగం చేయకుండా అడ్డుకోగలుగుతాం.
బాధ్యత గల ప్రతిపౌరునికీ ఇలాటి విషయాలలో అంటే చట్టం విషయంలో రెండు రకాల బాధ్యతలుంటాయి. 1. చట్టాన్ని తాను సరిగావాడుకోవడం, దుర్వినియోగం చేయకుండడం 2. ఇతరులూ చట్టాన్ని వాడుకునేలా, దుర్వినియోగం చేయకుండేలా చేయగలంత చేస్తుండడం. ఇది అర్ధమైతేనే ఒక వ్యక్తి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేయవచ్చు. వేయాలి అని రాజ్యాంగం ఎందుకు చెపుతోందో అర్ధమవుతుంది. అలాగే న్యాయస్ధానాలు ప్రజల నుండి ఫిిర్యాదులు లేకున్నా కొన్ని విషయాలను సుమోటోగా తమంత తాముగా విచారణకు తీసుకోవచ్చని, తీసుకోవాలని చట్టం ఎందుకు చెపుతోందోనూ అర్ధమవుతుంది. కనుక రాజ్యాంగంలోని స్వేచ్చకు సంబంధించిన అధికరణాలను అర్ధం చేసుకునే సందర్భంలోగాని, వివరించుకునే, వ్యాఖ్యానించుకునే సందర్భంలోగానీ, వినియోగించుకునే సందర్భంలోగాని పై అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి. ఇక్కడగాని ఏమాత్రం పొరపాటు పడినా అంటే అవగాహనాలోపం ఏర్పడినా, తప్పవగాహన వున్నా ఇక ఆపై జరిగేదంతా స్వేచ్చనకు స్వేచ్చకాదనుకోవడమో, స్వేచ్చ కాని దానిని స్వేచ్చ అనుకోవడమోనో జరుగుతుంటుంది. వేరే మాటలతో మళ్ళా ఈ విషయాన్నే చెపుతాను చూడండి.
పూర్తి స్వాధీన మనస్సుతో ఏదైనా విషయాన్ని గురించి తెలుసుకుని అది కావాలనో, వద్దనో కోరుకోడాన్నే - అనుకోడాన్నే - స్వేచ్చ అనాలి. ఏ రకమైన పరాధీనత ఏర్పడినా, అంటే దాని విషయమై అనుకూలంగానో, ప్రతికూలంగానో మరో వ్యక్తి మాటలో, మరొకరచనలోని మాటలో ఏ మేరకు నిన్ను ప్రభావితం చేసినా ఆ దశలో నీవు చేసుకునే నిర్ణయం అది కావాలనిగాని, వద్దనిగాని, అన్న రెంటిలో ఏ రూపంలో ఉన్నా దానిని స్వేచ్చ అనరు. అంటే అది నిజంగా నీ సొంత ఇష్టం కాదన్నమాట. మరొకరి ఇష్టం యొక్క ప్రభావం కలిసి ఉన్న నిర్ణయమన్న మాట అది.
ఈ అవగాహనలేకున్నా, దీనికి లోబడే మత స్వేచ్చా హక్కును మరే స్వేచ్చా హక్కునుగానీ వినియోగించుకోవాలన్న దృష్టి, నిబద్దత లేకున్నా రాజ్యాంగం కల్పించిన స్వేచ్చ దుర్వినియోగం అవుతూనే ఉంటుంది. మరో రూపంలోనూ దీనినే వివరించవచ్చు.
'స్వతంత్రుడే (నిజమైన) స్వేచ్చను అనుభవించగలడు'. అనంటాను. నామాట తప్పొ వప్పో చెప్పండి చూద్దాం.
దీనిని సక్రమంగా విచారించుకోవాలంటే స్వేచ్చ అన్నమాటతో పాటు స్వతంత్ర మన్నమాటనూ నిర్వచించుకోవలసి ఉంటుంది. తాత్విక క్షేత్రంలో స్వేచ్చ - స్వతంత్రత అన్నవి పర్యాయ పదాలు కావు. పైగా వేరు వేరు అర్ధాలు కలిగి ఉన్న చాలా ముఖ్యమైన పదాలు కూడా. స్వేచ్చ అన్నది ప్రధానంగా మానసిక క్షేత్రానికి వర్తించేపదం. కొన్ని కొన్ని చోట్ల బంధం నుండి విముక్తుడైన సందర్భాలలో - జైలులాటి నిర్భందాల నుండి విడుదలైన సందర్భాలలో స్వేచ్చావాయువులు పీల్చుకున్నాడు, స్వేచ్చ లభించింది లాటి మాటలు వాడుకలో ఉన్నా, దాని అసలైన అర్ధం మానసిక క్షేత్రానికి చెందింది మాత్రమే.
మనిషి శారీరకంగా బంధింపబడి ఉన్నా మానసికంగా అంటే భావాలు, ఆలోచనల విషయంలో సొంత ఇష్టాయిష్టాలనే కలిగి ఉండవచ్చు. దానికి అంటే స్వఇచ్చకు - ఎట్టి ఆటంకాలూ ఉండవు. అదే మరి అతడో శారీరకంగా ఎట్టి నిర్భంధాలు లేని స్థితిలోనూ పరాధీన మనస్కుడై ఉండవచ్చు. ఆ దశలో అతనిలో ఏర్పడిన ఇష్టాయిష్టాలు అతని సొంతానివి అనడానికి వీల్లేదు. అప్పడతడు స్వేచ్చను కోల్పోయినట్లే అదే మరి అతడు భౌతికంగా నిర్బంధాలూ ఉండీ ఎట్టి నిర్బంధాలూ లేని స్థితిలో, స్వీయజ్ఞానం పై ఆధారపడి ఏర్పరచుకున్న ఇష్టాఇష్టాలనే కలిగి ఉన్నట్లైతే, ఆ విషయాల వరకు అతడు స్వేచ్చను కలిగి ఉన్నట్లే. మానసిక పరాదీనత లేనట్లే.
ముఖ్య గమనిక :- అవధారణార్ధం ద్విరుక్తి సరైనదేనని విజ్ఞులంటారు. అంటే భావన గట్టిపడడం కోసం గానీ, అవగాహనలో మరింత స్పష్టత రావడం కోసం గానీ ఒకే విషయాన్ని పలుమార్లు చెప్పుకోడం తప్పుకాదు సరైనదేనని దానర్ధం. మన ప్రస్తుతాంశం అత్యంత కీలకమైనదీ, సూక్ష్మమైనదీ కూడా అవడం చేత ఒకే విషయాన్ని వివిధ రూపాలలో చెప్పుకుంటూ వస్తున్నాం. చదువరులలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన పదజాలం సుబోధకంగా (బాగా అర్ధమవుతూ) ఉంటుంది కనుకనే ఈ పని చేస్తున్నాం.
స్వతంత్రము = స్వ + తంత్రము = స్వ = తన (స్వీయ, స్వీకీయ) తంత్రము = వశము = తనవశము అని ఆ పదానికి అర్ధం. కనుక స్వతంత్రుడు అంటే తన వశంలో తానున్నవాడు, పరవశుడు కానివాడు పరుల అధీనంలో లేనివాడు అని దానర్ధం.
ఇది ప్రధానంగా భౌతిక క్షేత్రానికి వర్తించేదిగా ఉన్నా, మానసిక పరాధీనత, మానసిక స్వాధీనత అన్న సందర్భాలకూ వర్తించగలపదమే. ఒక వ్యక్తి భావదాస్యంతో ఉన్నాడనుకుందాం. అంటే మానసికంగా పరాధీనుడన్నమాట. ఆ దశలో నిర్ణయాలు అతడేతీసుకుంటున్నా, అతడా నిర్ణయాలకు రావడానికి అతని స్వీయ జ్ఞానానికి ఆవలి నుండి వస్తున్న ఇతరుల భావాలు పని చేస్తున్నట్లైతే అతడు మానసికంగా అస్వతంత్రుడుగా ఉన్నట్లే అవుతుంది. అంటే మానసిక స్వేచ్చ లేకపోవడాన్ని, మానసిక స్వతంత్ర లేకపోవడంగానూ చెప్పవచ్చు. అయితే శారీరక పరాధీన స్ధితిని, మానసిక స్వేచ్చ లేకపోవడం అనకూడదు. విషయం అర్ధమవుతుందనే అనుకుంటాను
ముగింపు :- ఒక వ్యక్తి శారీరకంగా బంధింపబడి అంటే స్వతంత్రత కోల్పోయిన దశలోనూ మానసికంగా పరాధీనుడు కాకుండా ఉండగలడు. అంటే శరీరం తన అధీనంలో లేకున్నా మనస్సు తన అధీనంలోనే ఉండడమన్నమాట. ఇది ఆచరణ సాద్యమో కాదో ఆలోచించండి.
అదే మరి అతడు భౌతికంగా ఎట్టి నిర్బంధాలూ లేని స్థితిలోనూ, మానసికంగా పరాధీనుడై ఉండవచ్చు. ఆ దశలో భౌతిక నిర్భందం లేకున్నా, మానసికంగా స్వయిచ్చ - స్వేచ్చ లేని వాడే.
ఒక సందర్భంలో కొందరు వ్యక్తులు ఒక వ్యక్తిని బంధించి ఉంచి, మేము చెప్పినట్లు నడచుకుంటానంటే నిన్ను విడిచిపెడతాము, మరి కొంత లాభాన్ని చేకూరుస్తాము. అలా కాక మేము చెప్పినట్లు వినకున్నా, నడచకున్నా నిన్ను విడిచిపెట్టము, మరిన్ని కష్టాల పాలు చేస్తాము. అన్నారనుకోండి. అప్పుడతను మీరేమి చేసినా నా నడవడిని మార్చుకోను, మీ ఇష్టమొచ్చింది మీరు చేసుకోండి అన్నాడనుకోండి. అతడు శారీరకంగా పరాధీనుడేగాని, మానసికంగా పరాధీనుడుకాలేదు. స్వాధీనమనుస్కుడే, స్వతంత్రుడే అనితీరాలి. అంటే స్వేచ్చ = స్వ + ఇచ్చ కలవాడేనని తీరాలి. మరి కొంత చెప్పవలసింది ఉన్నా, ఒకింత వివరంగానే చెప్పుకున్నాం స్వేచ్చ గురించి. ఈ మేరకు అర్ధమైనా మనం భారత రాజ్యంగం కల్పించిన మతస్వేచ్చను సక్రమంగా అర్ధం చేసుకోడానికి సరిపోతుంది. విజ్ఞులైన పాఠక మిత్రులకు స్వేచ్చకు సంబంధించిన నాఈ రచనలో ఏవైన లొసుగులున్నాయనిపించినా, దీనిని మరింత పరిపుష్టం చేయడానికి పనికి వచ్చే భావాలు మీ దగ్గరున్నా నాకు తెలియపరచండి. ఈ విషయాన్నంతటినీ ఒక చిన్న పుస్తక రూపంలోకి తెస్తున్నాము. మలిముద్రణ నాటికైనా మీ భావాలు మాకందితే ప్రజలకు మరింత సమగ్రమైన సమాచారాన్ని అందించే వీలు కలుగుతుంది.
మత స్వేచ్చ - భారత రాజ్యాంగం ప్రకారం
భారత రాజ్యాంగంలో మత స్వేచ్చకు సంబంధించిన అధికరణాలు ముఖ్యంగా నాలుగు. మరికొన్ని అధికరణాలూ వీటి పరంగానూ అర్ధం చేసుకోడానికీ, వాటికి బలాన్నివ్వడానికీ సంబంధ పెట్టుకోడానికి వీలుగా ఉండి ఉండవచ్చు. ముందుగా ఈ నాల్గింటిని గురించి చెప్పుకుందాం.
ఒక్కమాట ! పైన మనం 'స్వేచ్చ' అన్నమాటకు స్వతంత్రం అన్న మాటకు అర్ధాల్లో తేడా ఉందని చెప్పుకుని అదెలానో కూడా వివరించుకున్నాం. మరిప్పుడు ఈ ప్రకరణలోని 'మతస్వేచ్చ - మత స్వాతంత్య్రము అన్న మాటలను ఎలా అర్ధం చేసుకోవాలి?
స్వేచ్చ = ఫ్రీ విల్, స్వాతంత్రము = ఫ్రీడమ్ అన్న రెంటి స్వభావంలో కొంత పోలికా, కొంత వ్యత్యాసమూ ఉంది.
మత స్వేచ్చ అన్న పదం వాడితే దానర్ధం ఉన్న విశ్వాసాలలో ఏదో ఒక దానిని లేదా దేనినిగానీ ఇష్టపడడానికీ, ఇష్టపడకపోవడానికీ, ఎటువంటి బాహ్యవత్తిడులూ కారణం కాని రీతిలో తన సొంత అవగాహననుండే ఇష్టం ఏర్పడడం అన్న అర్ధమే చెప్పుకోవాలి. అలా ఇష్టాన్ని ఏర్పరచుకునే హక్కును రాజ్యాంగం ప్రాధమిక హక్కుగా అందిస్తోంది. అంటే నీవు ఎంచుకో, దానికి అడ్డంకులు ఏర్పడకుండానూ, అమలయ్యేలానూ బాధ్యత మేము తీసుకుంటాం అని ఒప్పందం చెప్పడమన్నమాట. ఈ మాటలను మరో రూపంలో చెప్పుకుంటే నీవెంచుకుంటే అది మత స్వేచ్చ అవుతుంది. అది అమలయ్యేట్లు చూడడమంటే నీకు స్వాతంత్య్రం ఏర్పడడం, (ఏర్పరచడం) అన్నమాట. మత స్వేచ్చను హక్కుగా చేయడమంటే మతం విషయంలో స్వతంత్రుణ్ణి చేయడమన్నమాట.
మరోరకంగా చెప్పుకుంటే వ్యక్తిమతపరంగా దేనిని ఇష్టపడతాడో దానిని అనుసరించుకునేందుకు ప్రతికూలతలు లేకుండా చూడడం, అనుకూలతలు కల్పించడం అని దానర్ధం. హక్కు అమలయ్యేట్లు చూడడమే రాజ్యాంగ శాసనాలన్నింటిలోకి తలమానికమైన శాసనం. ఆర్టికల్ 32 హక్కులకు రక్షణ అన్నదే. అందుకే ఆర్టికల్ 32 రాజ్యాంగానికి ఆత్మ వంటిదని అన్నాడు అంబేద్కర్ మహాశయుడు.
మరొక్క ముఖ్యమైన విషయాన్ని నిరంతరం గమనికలో ఉంచుకుంటేనే హక్కుల గురించి సరైన అవగాహనకు రాగలుగుతాం. ఒప్పందంలో పొందుపరచిన ఏ హక్కులైనా వాటి వాటికి సంబంధించిన పరిమితులకులోబడే ఉంటాయి. పరిమితుల్లేని స్వేచ్చగానీ, స్వతంత్రం గానీ హక్కుగా సరైన ఏ ఒప్పందంలోనూ ఉండదు. ఉండకూడదు. ఈ విషయం 100% సరైందే కనుకనే మన రాజ్యాంగంలోనూ స్వేచ్చ స్వాతంత్య్రాలకు సంబంధించిన అధికరణాలన్నింటా అక్కడే దాని పరిమితులు విధింపబడి ఉన్నాయి. స్వేచ్ఛ హక్కుల గురించి మాట్లాడుకునే ప్రతి సందర్భంలోనూ ఈ పరిమితులకు లోబడి అన్నమాట - పదం - వాడితీరాలి. ఒప్పందంలో సంపూర్ణ స్వేచ్చ, సంపూర్ణ స్వాతంత్య్రం అన్నమాటలుండవు.
ఇప్పుడిక మతస్వేచ్చకు సంబంధించిన అధికరణాలను చూద్దాం
అధికరణం : 25 : freedom of conscience and free proffession, practice and propagation of religion..
1.పడాల రామిరెడ్డి :- ఇది, అంతరాత్మ (freedom of conscience) ననుసరించిన స్వాతంత్య్రము, స్వేచ్చాయుత మతావలంబన, ఆచార ప్రచారములను practice and propagation of religion గురించి వ్యవహరిస్తోంది.
2. తెలుగు అకాడమీ :- అంతరాత్మ స్వాతంత్య్రాన్ని, స్వేచ్చగా మతాన్ని అవలంభించడానికి, ఆచరించడానికీ, ప్రచారం చేసుకోడానికీ ఈ ప్రకరణ అనుమతినిస్తున్నది.
3. సుంకర రమాదేవి :- అంతరాత్మ ప్రబోధానుసారం మత విశ్వాసాలను కలిగి ఉండే హక్కు, మత ప్రచారం చేసుకునే హక్కు బలవంతపు మతమార్పిడులపై నిషేధం.
గమనిక : అనువాదాలకెప్పుడూ కొన్ని పరిమితులుంటాయి. అనువాదకుని భాషాభిజ్ఞత, శైలి అన్న రెండూ అనువాదకులు ఒకే విషయాన్ని వేరు వేరు మాటలతో చెప్పడానికి కారణాలవుతుంటాయి. ఈ ఇబ్బంది ఉంది కనుకనే పదానువాదం, భావానువాదం, స్వేచ్చానువాదం అంటూ అనువాదంలో అనేక రకాలు పుట్టుకొచ్చాయి. వాటిలో దేని ప్రయోజనాలు దానికున్నాయి. దేని బలహీనతలు (ఇబ్బందులు) దానికున్నాయి. వాటిని ఇప్పుడు మనమేమీ చేయలేం, ఎప్పటికప్పుడు మరింత జాగ్రత్తగా దాని అసలు భావాన్ని గ్రహించే శ్రద్ద పెట్టడం తప్ప.
సురేంద్ర :- మత విశ్వాసాలను స్వయంగా ఎన్నుకునే (యిష్టపడడం, అయిష్టపడడం కూడా ఎంపికే) ప్రకటించుకునే ఆచరించుకునే, ప్రచారం చేసుకునే స్వయిచ్చకు ఆచరణరూపం అంటే స్వతంత్రమూ ఏర్పడేందుకు వీలుగా దానిని హక్కుగా ప్రకటిస్తోందీ
గమనిక :- పరిమితుల్లేని హక్కులుండవు ఏ ఒప్పందంలోనూ (రాజ్యాంగంలోనూ) అని చెప్పుకున్నాం గుర్తుంది కదూ! ఇదిగో దీనికీ రాజ్యాంగం కొన్ని పరిమితుల్ని విధిస్తొంది గమనించండి.
అధికరణం 25/(1) :- Subject to the public order, morality and health and to the other provisions of this part, all persons are equally entitled to freedom of conscience and the right freely to profess, practice and propagate religion.
సురేంద్ర :- పబ్లిక్ ఆర్డర్ అన్న మాటకు ప్రజాశాంతి అని కొందరు ప్రజా సంక్షేమం అని సుంకర రమాదేవి అనువాదం చేశారు. పరిమితులను తెలుపుతూ వాడిన పదాలకు నిక్కచ్చి అర్ధాన్ని లేదా ఆ సందర్భానికి బాగా నప్పుతుందనిపించే అర్ధాన్నిచ్చేలా చాలా జాగ్రత్తగా అనువదించాలి. పబ్లిక్ ఆర్డర్ అంటే సమాజంలోని జనుల నడవడిని రాజ్యాంగంలోని అనేక శాసనాలు క్రమ బద్దంగా ఉండేలా నియంత్రిస్తుంటాయి. ఎట్టి అపసవ్యతలు, అలజడులూ, అక్రమాలు, చోటు చేసుకోకుండా కట్టడి చేస్తుంటాయవి. ఈ మొత్తాన్ని కలిపి ఒప్పందం ద్వారా అమలవుతున్న సామాజిక కట్టడి అంటాము. దీనికి భంగం కలకుండా మాత్రమే పై చెప్పిన స్వేచ్చా స్వాతంత్రాలను వాడుకుంటుండడం అన్న అర్ధాన్నిస్తుంది. subject to the public order అన్న వాక్యం. క్రమం నడుస్తుంటే ప్రజాజీవనం శాంతియుతంగా సాగుతుంటుంది. గనుక ప్రజాశాంతికి భంగం కలగని రీతిలో అని అనువదించారు. ప్రజా సంక్షేమానికి ఆటంకం కలగని రీతిలో అన్నది ఒకింత స్వేచ్చానువాద రీతికి చెందిందైనా రాజ్యాంగ ప్రధానాకాంక్ష ప్రజా సంక్షేమమే. కనుక అన్ని శాసనాల పర్యవసానం ప్రజా సంక్షేమమే కనుక ఆ శాసన హృదయం ప్రజా సంక్షేమం అనడం తప్పుకాదు. కాని పబ్లిక్ ఆర్డర్ అన్న దానికి సామాజిక జీవన గతిలో క్రమం జరుగుతుండేలా క్రమరాహిత్యం చోటు చేసుకోకుండా ఉండే మేరనే ఈ మత స్వేచ్చ స్వాతంత్రపు హక్కు ఉంటుంది.
25/ 1 :- Morality అన్నది పరిమితులకు సంబంధించిన మరో మాట. నీ విశ్వాసం, ప్రకటన, అభ్యాసం, ప్రచారం అన్న నాల్గింటి విషయంలోనూ ఎలాంటి అనైతికతా చోటు చేసుకోకూడదు. నిజానికీ పదాన్ని చాలా లోతుగా విస్తారంగా వివరించుకోవాలి. ఉదా :- మతాదేశాలలోని నిజంగా నీకు తెలియని అంశాలనూ, రుజువుకు నిలబడవని తెలిసిన అంశాలనూ తెగ తెలిసిన వానిమల్లే సత్యాలని, అనేకసార్లు రుజువైనాయని ప్రకటించడంలో అనైతికత ఉందాలేదా?
ఉదా:- 'విశ్వాసి తాను చేసిన లాటివేకాక, అంతకంటే గొప్ప పనులూ చేయగలుగుతాడు' అన్న ఏసు వాక్యమొకటుంది బైబిలు కొత్త నిబంధనలో, ఈనాడు బైబిలు ప్రచారకుల్లో చాలామంది, ఎక్కువలో ఎక్కువ మంది, తాను ఏసుకు అత్యంత సన్నిహితుణ్ణి అనీ, ఏసే తనను నడిపిస్తున్నాడని బల్లగుద్ది మరీ ప్రకటిస్తుంటారు. ఇది నిజమా? అబద్దమా తెల్సుకోవాలంటే బైబిలు ప్రకారం మనకున్న ఒకే ఒక మార్గం. విశ్వాసి సుళువుగా చేయగలడని ఏసు చెప్పినవి చేసి చూపండని అడగడం, నిలదీయడమే వారిలో ఎవరందుకు సిద్దపడకపోయినా వారిలో అనైతిక చోటు చేసుకుందనే అర్ధం అనుకోవలసివస్తుంది.
గమనిక :- ఉదాహరణ ఏసుని- క్రైస్తవ ప్రచారకుణ్ణి ఎత్తుకున్నా గనక అది వారికి పరిమితమైంది మాత్రమే అనుకునేరు. నా మాటలు అన్ని ఆస్తిక ధోరణులవారికేగాక, ఆస్తికేతర ధోరణుల వారికీ వర్తిస్తుంది. లక్ష్మీయంత్రాలు, ఆరోగ్య యంత్రాలు, గెలుపు యంత్రాలు, విద్యాయంత్రాలువగైరాల గురించి మాట్లాడుతుంటే, దానినే వృత్తిగనూ చేసుకుని బ్రతుకుతుండే వారిలోనూ అనైతికతాంశం లేదనగలమా?
25/1/5 ఆరోగ్యం :- మనం విశ్వసించిన మతాచరణలో ఆరోగ్యాన్ని చెడగొట్టే అంశాలుంటే వాటిని ఈ స్వేచ్చ క్రింద అభాసంచేయరాదు. అలాగే వాటిని ప్రకటించడం, ప్రచారం చేయడమూ చేయరాదు. ఆ అభ్యాసం ఆచారకాండ, వ్యక్తిని మానసికంగా శారీరకంగా అనారోగ్యానికి దారి తీయరాదు. ఆరోగ్యాన్ని కలిగించేదిగా ఉండాలి.
ఉదా :- హిందూ సాంప్రదాయాలలోని ఉపవాసాలు, వాతావరణ కాలుష్య కారకాలైన కర్మకాండలు ఆచారం పేరున అనారోగ్యకారకాలైన, మురికి నీళ్ళు స్నానాలు అపరిశుభ్రమైన ఆహార పానీయాల స్వీకరణ, జాతరలు ఇలా ఎన్నో ఈ ఆరోగ్యం అన్న మాట క్రింద మతస్వేచ్చకు పరిమితుల్ని విధిస్తుంది. అన్ని మతాల ఆచార కాండలోనూ, ఎక్కడోచోట, ఎంతో కొంత మేర ఈ అపరిశుభ్రత, కాలుష్యాలూ ఉండడం చూడవచ్చు. ఇది చిన్న విషయం కాదు గనుకనే దీనిని స్వేచ్ఛా శాసనానికి పరిమితులభాగంలో ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. దానిదేముందిలే అని కొట్టేయడానికో. పక్కన పెట్టేయడానికో తగిందికాదిది.
గమనిక :- మన రాజ్యాంగ నిర్మాతలకు, పరిష్కర్తలకూ ఈ మూడు చెప్పి ఊరుకుంటే సరిపోదని అనిపించే మత స్వేచ్ఛాహక్కు పరిమితుల భాగం చాలా పెద్దదిగా ఉంది, ఉండాలి అనుకునే ఈ భాగంలో మరో మాటనూ పొందుపరిచారు.
And the other provisions of this part. ఇందులో of this part ఈ విభాగానికి చెందిన other provisions ఇతరాంశాల లోను ముడిపడి అన్నది. రాజ్యాంగంలోని ఈ భాగంలోని అంశాలకు అంటే ప్రాధమిక హక్కుల భాగంలోని అధికరణాలకు అనుకూలంగా ఉండే, ప్రతికూలం కాని రీతిలో మాత్రమే పై మత స్వేచ్ఛాస్వాతంత్య్రాలు హక్కుగా సంక్రమిస్తాయి అని చెప్పినట్లైంది. ఆ మూడవ భాగంలోని సాధారణాంశాలను గమనించండి.
రాజ్యాంగం 3వ అధ్యాయం ప్రాధమిక హక్కులకు సంబంధించిందై ఉంది.
ఎ. తెలుగు అకాడమీ :- 12 నుండి 35 వరకున్న అధికరణాలు ప్రాధమిక హక్కులను తెలుపుతాయి.
బి. వాటిని (6) రకాలుగా విభజించి అర్ధం చేసుకోవచ్చు. అవి.
1. సమానత్వహక్కు సంబంధితాలు 14 నుండి 18 వరకు (5)
2. స్వేచ్ఛా హక్కుకు సంబంధించినవి 19 నుండి 22 వరకు (4)
3. పీడన నిరోధక హక్కుకు సంబంధించి 23 - 24 అధికరణాలు (2)
4. మత స్వేచ్చా హక్కుకు సంబంధించినవి 25 నుండి 28 వరకు (4)
5. విద్య మరియు సాంస్కృతిక హక్కు సంబంధంగా 29, 30 అధికరణలు (2)
6. రాజ్యాంగ పరిరక్షణ హక్కు సంబంధించిన 32వ అధికరణం (1) = 18 ప్రాధమిక హక్కులు
గమనిక :- 25/1 అధికరణంలోని బిదీఖి శినీలి ళిశినీలిజీ చీజీళిఖీరిరీరిళిదీరీ ళితీ శినీరిరీ చీబిజీశి అన్న మాట, పై 18 అధికరణాలతో ముడిపడి, వాటికి ఆటంకం కాని రీతిలో మాత్రమే మత స్వేచ్ఛా హక్కు ఉంటుందన్న అత్యంత కీలకాంశాన్ని తెలియజేస్తున్నది. ఆ మొత్తాన్ని ఒకటికి పది మార్లు చదివాకనే మత స్వేచ్చకున్న అవధుల్ని గమనించాకనే, మత స్వేచ్చ గురించి సరిగా మాట్లాడే అర్హత వస్తుంది ఎవరికైనా.
25/2 :-Nothing in this article shall affect the operation of any existing law or prevent the state from making any law
సురేంద్ర :- మత స్వేచ్చకున్న పరిమితుల్ని, అపరిమితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షించి రాజ్యాంగాన్నమలుచేయడానికి తగిన చట్టాలు రూపొందించేందుకు ప్రభుత్వానికున్న అధికారాన్ని నిర్ద్వంద్వంగా ప్రకటిస్తోందీ 25/2 వ భాగం.
ఉనికిలో ఉన్న ఏ చట్ట వినియోగాన్ని ప్రభావితం చేయడానికి నూతన చట్టాలను చేయడానికి ప్రభుత్వానికున్న అధికారాన్ని అడ్డుకోడానికిగానీ ఈ మత స్వేచ్చా హక్కు క్రింద ఉన్న అంశాలేవీ ఏ రకంగానూ కల్పించుకోలేవు.
25/ 2 (ఎ) :- :- regulating or restricting any economic financial, political or other secular activity which may be associated with religious practice
మతావలంబనకు మతాచారాలతో కలిసి ఉన్న ఆర్ధికాంశాలు, రాజకీయాంశాలు మరియు ఇతర లౌకిక స్వభావం కల పనులను క్రమబద్దీకరించే లేదా పరిమితులను విధించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
25 :- వివరణ (1) శిక్కులు కృపాణం ధరించవచ్చు. (2) సిక్కు, జైన, బౌద్దులూ హిందూ మతంలోని భాగాలే. మతమంటే ఏమిటి? అన్నదానికి సుప్రీంకోర్టు, అది తప్పనిసరిగా ఆస్థిక మతమై ఉండాల్సిన అవసరం లేదనీ అది వ్యక్తుల సమాజాల విశ్వాసానికి సంబంధించినదై ఉంటే చాలునని వివరణ చేసింది. ఆ దృష్టితోనే దేవుణ్ణి అంగీకరించని జైన బౌద్దాలనూ మతాలుగనే పరిగణించింది.
ముగింపు, సురేంద్ర :- ఈ అధికరణం యొక్క సారాంశం :- ఒక మతానికి సంబంధించిన వ్యక్తులకు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛా. స్వాతంత్రాల హక్కు ప్రజాశాంతికి, నైతిక విలువలకు, ఆరోగ్యానికీ భంగం కలిగించని మేరకే ఉంటుంది. అంతేగాక ఆ స్వాతంత్య్రము, మిగిలిన వ్యక్తులకు రాజ్యాంగం 3వ విభాగం ద్వారా కల్పించిన ప్రాధమిక హక్కులకు భంగం కలిగించనంతవరకే ఉంటుంది. ఆ మత స్వేచ్ఛ భారత రాజ్యాంగపు మూలభూత లక్షణమైన లౌకికత స్ధాపనకు ప్రతికూలం కానంత వరకే ఉంటుంది. ప్రజా సంక్షేమానికి అవసరమైన ప్రభుత్వ నియంత్రణాధికారానికీ లోబడే ఉంటుంది.
ముఖ్య గమనిక :- నాస్తికవాదమూ, లౌకికవాదమూ రెండూ ఒకటికాదు. వేరు వేరు. భారతరాజ్యాంగం లౌకికవాదాన్ని తన ఆచరణ క్షేత్రానికి పునాది - ఆధార -భావనగా స్వీకరించింది. అయినా అది నాస్తిక వాదాన్ని స్వీకరించలేదు. పైగా నాస్తిక వాదాన్ని స్వీకరించడం - స్వీకరించకపోవడం మత స్వేచ్చా హక్కు భాగానికి చెందింగా భావించింది.
1) నాస్తిక వాదం, అన్ని రకాల ఆస్తికవాదాలు చెప్పే దేవుడు, జీవులు, జన్మాంతరాలు, పరలోకాలు, స్వర్గనరకాలు, తీర్పుదినాలు వగైరాలన్నీ అబద్దాలనీ, మూఢనమ్మకాలనీ, అట్టివేవీ లేనే లేవనీ పేర్కొంటుంది. దానితోపాటు ఈ లోకమే వాస్తవమనీ అంటుంది.
2) అదే మరి లౌకికవాదం, వ్యక్తి - సమాజము - ప్రకృతిలకు సంబంధించి మానవుల మధ్య జరిగే వ్యవహారమంతా ఈ లోకానికి పరిమితమైంది మాత్రమేననీ ఆస్తికులు చెప్పే దేవుడు వగైరాలున్నాయన్న విషయంగానీ, నాస్తికులనే అట్టి వేవీ లేవు అనే విషయంగాని తన ప్రకారం వ్యవహారాలు నడుపుకోడానికి అవసరం లేదనీ అంటుంది.
కనుక, లౌకిక వాదమంటే నాస్తికమేనని అనుకోవడం అవగాహనాలోపం వల్లనేనని నేనంటున్నాను. అందుకనే ఆధునిక భౌతిక విజ్ఞాన శాస్త్రాలున్నూ దేవుడున్నాడా? లేడా అన్న విషయాన్ని ప్రస్తావించవు. విచారణాంశంగానూ స్వీకరించవు. వాటి పనల్లా ప్రకృతిని శోధించడం, ఎరుకలోకి వచ్చిన వాటి వివరాలను ఎప్పటికప్పుడు అప్పటికి అందినంత, అందిన రూపంలో ప్రజలకు అందించడం, వాడుకోడానికి పనికివచ్చేదైతే వినియోగ రూపానికి తెచ్చుకోవడం, ఇదే దాని క్షేత్రం కనుకనే అదిన్నూ ఆస్తికతను గురించి గానీ, నాస్తికతను గురించిగాని మాట్లాడదు. మన భారత రాజ్యాంగాన్ననుసరించి పాలన - నిర్వహణ వ్యవహారమంతటికీ ఆస్తికత ఎంత దూరమో, నాస్తికతా అంతదూరమైనదే. ఆ రెంటినీ సమాన దూరంలో ఉంచుతూనే లౌకిక వాద స్వభావంతో పనులను నిర్వహిస్తుంటుందది. ప్రజలూ అలానే ప్రవర్తించాల్సి ఉంటుందని శాసిస్తుంది.
ఇదంతా ఇప్పుడెందుకు చెపుతున్నానంటే, నాస్తికత్వమే తమ తాత్విక వైఖరి అనే లేదా అనుకుంటుండే భౌతికవాద దృక్పధం కలిగి ఉన్నవాళ్ళకూ కూడా 25వ అధికరణంలో చెప్పిన మత స్వేచ్చా హక్కుతో పాటు దానికున్న పరిమితులన్నీ వర్తిస్తాయి. అంటే సామాజిక అస్తవ్యస్తత ఏర్పడే లేదా ప్రజాశాంతికి భంగం కలిగే రీతిలో వారైనా వారికి ఉన్న దేవుడు లేడనే స్వేచ్చా హక్కును వాడకూడదు. ఎందుకనంటే ఇతరులకున్న మత స్వేచ్ఛ హక్కును అడ్డుకోడంగానీ, వ్యతిరేకించడంగానీ ఎవరూ చేయకూడదు. దానితోపాటు 25/2 లో చెపుతున్నట్లు, ఆయా మత విశ్వాసులకు ప్రాథమిక హక్కుల రూపంలో సంక్రమించిన వాటిపరిమితులను ఎవరూ అతిక్రమించకూడదు. మత స్వేచ్చను వినియోగించుకునే విషయంలో ఇదెంతో కీలకమైన అంశము. కానీ దీనిని ఎడాపెడా అనేవాళ్ళూ పట్టించుకోడంలేదు. అనిపించుకునే వాళ్ళూ పట్టించుకోడంలేదు. కనుకనూ,వాళ్ళెవరు పట్టించుకుందామనుకున్నా ప్రభుత్వం అసలే పట్టించుకోదు కనుకను ఆ అధికరణాలకు విరుద్దంగా ఎన్నో జరిగిపోతున్నా సమాజంలో ఎలాంటి అలజడులూ, ఆందోళనలు పుట్టుకరావడంలేదు. అధికరణం 26 :-freedom to manage religious affairs. subject to public order, morality and healths, ....
తెలుగు :- మత సంబంధమైన వ్యవహారాలను నిర్వహించుకునే స్వాతంత్య్రముంది.
1. మత సంబంధమైన సంస్థలన్నింటికీ, సంస్థలను మత పరమైన, ధార్మికపరమైన కార్యక్రమాలను స్ధాపించి, నిర్వహించుకునే - వాటికి సంబంధించిన సొంత వ్యవహారాలను నిర్వహించుకునే, స్ధిరచరాస్థులను సమకూర్చుకునే చట్టానికి న్యాయ పద్దతులకు లోబడి వాటిని పర్యవేక్షించుకునే స్వాతంత్య్రం ఉంది.
అధికరణం 27 :- ఆదాయ వ్యయాలు, పన్నులకు సంబంధించిన వివరాలున్నాయి.
అధికరణం 28 :- దిగువ సూచించిన పరిమితులకు లోబడి మత సంస్థలు ఏర్పరచుకునే విద్యాలయాలలో వారి వారి మత నియమావళిని, ఆరాధనలను గురించి బోధించవచ్చు.
ఈ నాలుగు అధికరణాల క్రింద 'రాజ్యాంగం' కల్పించిన మత స్వేచ్చా హక్కు, ప్రజాశాంతికి, నైతికతకు, ఆరోగ్యానికీ, మిగిలిన ప్రాథమిక హక్కుల అమలుకూ ఆటంకం కాని రీతిలో మాత్రమే ఉండాలన్నది ఈ మొత్తానికీ పరిమితుల్ని విధిస్తూ కట్టడి చేస్తుంటుంది.
అత్యంత సారరూపం
భారతదేశంలో ....
1) ఖురాను ఒక ముస్లింను అనుసరించమన్న విధులుగాని, నిషిద్దాలుగానీ, అది చెపుతున్న నేరాలు, శిక్షలు గానీ యధాతధంగా అమలుపరచే, ఆచరించే స్వేచ్చ ఉందా? లేదా? ఖురానుకు సంబంధించిన రాజ్యాంగం అంగీకరించే విశ్వాస స్వేచ్చ, ఆరాధనా స్వేచ్చ, ప్రచార స్వేచ్చ అన్నదాని అర్ధం, ఖురానును అన్ని విషయాలలో 100% అనుసరించే స్వేచ్చ అని అర్ధమా?
రాజ్యాంగపు సమాధానం :- కానే కాదు 1) ఇతర మత విశ్వాసుల స్వేచ్చకు అడ్డురాని, భారతరాజ్యాంగపు లెక్కన మాత్రమే నేరాలు, శిక్షలను మాత్రమే అమలుపరచుకునేందుకు లోబడి ఉన్నంత మేరనే వారికి మత స్వేచ్చ ఉంటుంది.
ఖురాన్ అంగీకరించిన విగ్రహాల విధ్వంసం చేసే స్వేచ్చ ఉందా ఈ మత స్వేచ్చలో? సమాధానం :- లేదు గాక లేదు. ఎందుకంటే అది మరో పౌరుని మత స్వేచ్చను కాదంటూంది కనక.
భారత రాజ్యాంగం ప్రకారం బైబిలులోని మోషే, ధర్మశాస్త్రాన్ని యధాతధంగా అమలు పరచుకునే స్వేచ్చ ఉందా? యూదులకుగానీ, క్రైస్తవులకు గానీ?
సమాధానం :- లేదుగాకలేదు. వారంతా ఈ లోకసంబంధమైన వ్యవహారాలు, నేరాలు, శిక్షలు భారత రాజ్యాంగ నిర్ధేశాల మేరకే అనుసరించడానికి లోబడి దానికి అడ్డురాని భాగం వరకే మత స్వేచ్చను కలిగి ఉంటారు.
భారత రాజ్యాంగం ప్రకారం ..
3) ఈ దేశ మతాలు లోగడ అనుసరించిన మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేసుకునే స్వేచ్చ కలిగి ఉంటారా?
సమాధానం :- అట్టి స్వేచ్చ కలిగి ఉండరు గాక, కలిగి ఉండరు. వారెవరైనా, ఏ సాంప్రదాయానికి చెందిన వారైనా భారత రాజ్యాంగానికి ప్రతికూలం కాని అంశాల వరకే వారి మత గ్రంధాలను విశ్వసించే, ఆరాధించే పాటించే స్వేచ్చను కలిగి ఉంటారు.
ముగింపు
మత విశ్వాస స్వేచ్చా హక్కు కలిగించడమంటే, తనకు నచ్చిన ఆరాధ్యాన్ని, ఆరాధనారీతిని విశ్వసించే, అనుసరించే స్వేచ్చ అని మాత్రమే అర్ధం. వారి వారి మత గ్రంధాలను తు.చ . తప్పకుండా అనుసరించే స్వేచ్చ అని అర్ధం కానే కాదు. నాస్తికులతో సహా ఎవరుగానీ, ఏ మత విశ్వాసాలను గాని నిందించే, కించపరచే, తప్పుని చెప్పేస్వేచ్చ ఉండనే ఉండదీ మత స్వేచ్చలో. అలాగే మత విశ్వాసాలను గానీ, ఆరాధనా రీతులనుగానీ, రాజ్యాంగంలోని మరే అధికరణాన్ననుసరించైనా నిందించే ఖండించే స్వేచ్చ ఉండదు. ఎందుకనంటే మత స్వేచ్చను గూర్చిన భాగమంతా దిగువ నిబంధనకు లోబడింది మాత్రమే.
Subject to public order morality and health and to the other provisions of this part all persons are equally entitled to the freedom of conscience.
ప్రశ్న :- మరైతే ముస్లిం వివాహ విధి, బహుభార్యాత్వం, విడాకుల విధానం పై సూత్రాన్ని అతి క్రమిస్తున్నేౖ కదా! అది వారి మతాచారం అనడం న్యాయంకాదు. సమన్యాయాన్ని తృణీకరించడం కూడా కదా?
నా సమాధానం :- నూటికినూరు శాతం బహుభార్యాత్వంగాని, విడాకుల విధానంగాని రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమైనదే, వివాహమన్నది 1) ఈ లోక సంబంధమైనది
2) స్త్రీ పురుషులుగా ఉన్న మనుషులకు సంబంధించినది
3) శారీరక - మానసిక అవసరాలు కొరకు ఏర్పరచింది.
4) సామాజికావసరాలతోనూ ముడిపడి ఉన్నది.
కనుక మత గ్రంథం చెపుతోంది కనుక అన్న నెపాన, స్త్రీ పురుషుల మధ్య అసమానతను, సామాజిక అన్యాయానికీ దారితీసే అలాంటివాటిని 1) నిషేదించాలి 2) ఉక్కుపాదంతో అణచి వేయాలి. భారత రాజ్యాంగపు పరమాశయం వివక్షారాహిత్యం, సమానత్వం స్ధాపనే.
1) మతాచారం అంటూ బాల్యవివాహాలు చేసుకోవచ్చా?
2) మతాచారాం అంటూ సతీసహగమనం చేయవచ్చా?
3) మతాచారం అంటూ వ్యభిచార నేరానికి రాళ్ళతో కొట్టిచంపవచ్చా?
చివరి మాట :- సమానత్వ సాధనకు ఉమ్మడి పౌరస్మృతి అనివార్యం, తప్పనిసరి.
నలుగురిని చేసుకుంటాను, నచ్చకుంటే తల్లాకంటాను అనే వ్యక్తుల మానసిక స్ధితిని చక్కజేయనైనా చేయాలి. పక్కలిరగదన్ననైనా తన్నాలి. అంతేగాని దీనిని వాద వివాదాలలోకి లాగనే కూడదు. మానవులంతా సమానులే. అన్న దిశగా ఒక్క మెట్టు ఎక్కుతూ అడ్డు వచ్చిన వాటినన్నింటినీ ప్రక్కకునెట్టేస్తూ సాగడమే అసలైన వివేకపథం.
Common civil code ఉమ్మడి పౌరస్మృతి కై పెద్ద ఎత్తున ఉద్యమించాలి. దానిని కాదనే వారిని ఎందుకు కాదంటున్నారని నిలదీయాలి. ఈ విషయమై అన్యాయానికి గురవుతున్న తీవ్ర మనోవేదననుభవిస్తున్న, మనస్సంగీకరించకున్నా సర్దుకుపోతున్న మహిళల ఆలోచనలో మార్పు రావాలి. సమానత్వ సాధనకై ఉద్యమించాలి. అవసరమైతే తిరగబడాలి. బుద్దున్న మగవారంతా ఆ ఉద్యమానికి అండగా నిలవాలి.
7వ శతాబ్ది నాటి సామాజిక పరిస్థితులు - అవసరాలు - ఆచారాల గొడవ మనకు అనవసరం. ఈనాడు మన వివేకానికి అందినంతలో, ఈనాటి, రేపటి తరాల మానవులందరికీ న్యాయాన్నందించగలవీ, సామాజికావసరాలకు ఉపయుక్తంగా ఉండగలిగేవీ అయిన నియమ, నిబంధనలను, ఉన్నవాటి నుండి పనికి వచ్చేవి తీసుకుని లేనివాటిని జత చేసుకునే విధానాన్ని అమలుపరచుకుంటూ సాగడమే బుద్ధిమంతులనుసరించదగిన విధానం.
దేవుని పేరున గానీ, మరేపేరున గానీ, మార్చుకోనక్కరలేని, మార్చకూడని వంటూ సంపూర్ణాలంటూ మన నెత్తిన పెట్టే వేటినీ యదాతధంగా స్వీకరించడం, స్వీకరించాలనడం బుద్దిమంతులు చేయగలిగిన, చేయవలసిన పని మాత్రం కాదు.
గమనిక :- వ్యక్తిగతాంశాలను ప్రస్తావించకుండా, విషయ నిష్ఠతో ఈ వ్యాసం పై సూటిగా, నిర్మొగమాటంగా స్పందించండి. మేలు కలిగించే వాటిని జతచేసుకోడానికి మండలి సర్వదా, సర్వదా సిద్దంగా ఉంది, ఉంటుంది.
పాత కొత్తల మేలుకలయికే ఎప్పటికప్పుడు అప్పటికి మెరుగైన విధానం అవుతుందన్నది, ధర్మాధర్మాల విషయంలో మండలి మూలభావనల్లో ఒకటి.
సత్యాన్వేషణలో - మీ సురేంద్ర
ఓంకారమే క్రీస్తు అయ్యెను - వివేకానందుడు
ఓంకారమే క్రీస్తు అయ్యెను - వివేకానందుడు
-హైం.క్రై.పు.168
''పరబ్రహ్మతత్వాన్ని మనకు ఎరిగించుటకు ఓంకారమే క్రీస్తు అయ్యెను'' అని వివేకానందుడు అన్నట్లు మన అడ్డగోలు అపొస్తలుడు రంజిత్ ఓఫీరుగారు తమ చాలెంజి పుస్తకం హైం.క్రైస్తవంలో ప్రకటించారు. కానీ ఆ వచనాలను ఎక్కడనుండి పట్టుకొచ్చిందీ అక్కడ పేర్కొనలేదు. రిఫరెన్సులు (ఆధారాలు) చూపించాలన్న తెలివిలేదనుకుందామా అంటే అలా అనుకోడానికి వీలులేదు. తానన్న ప్రతిమాటకూ ఆధారాలు చూపి రుజువు చేశానని ప్రకటించారు. గ్రంథం చివరలో మీరే వెతుక్కుచావండంటూ, 115 రిపరెన్సులు ఎక్కడున్నాయో ఆ సమాచారం ఇచ్చారు. నిజానికి ఇలాటి చాలెంజ్ గ్రంథాలలో వాటన్నంటినీ ఆ సందర్భం దగ్గరే చూపించి ఉండాలి. అది నియమం కాకున్నా నైతిక బాధ్యత. చదువరికి సులభంగా ఆధారాలను సరిపోల్చుకునే అవకాశం ఉండేది. అలాకాకపోవడం వల్ల, ఇప్పుడు హైందవ క్రైస్తవం పుస్తకాన్ని విమర్శనాత్మకంగా చూడాలనుకుంటే, అదెంత కష్ట సాధ్యమో గమనించారా? 1. దాశరథి నాలుగువేదాల అనువాదం కొనుక్కోవాలి (లేదా సంపాదించాలి), నాలుగు వేదాల మూలం సంపాదించాలి. దానికి రెండు మూడు భాష్యాలన్నా దగ్గర పెట్టుకోవాలి. అవన్నీ వెదకాలి. సరిచూడాలి.
ఈయన గారి పుస్తకంలో చెప్పింది సత్తో, చెత్తో తేల్చడానికై, ఇంత వ్యయ, ప్రయాసలకు ఎందరు పూనుకుంటారు? పూనుకోగలరు? అస్సలు ధీమా! మన రంజిత్ ఓఫీరుగారి అస్సలు ధీమా అదే. హిందువులు - అందులోనూ హిందూ మత గ్రంధాల పండితులూ ఇంకా సరిగా చెప్పాలంటే వేదాలను అర్ధ సహితంగా చదువుకున్న పండితులు ఇంత శ్రమకు పూనుకోరని ఓఫీర్‌గారికి గట్టి నమ్మకం. అలాటిది, పైన తానన్న మాటలు ఎక్కడినుండి పట్టుకొచ్చిందీ చెప్పకుంటే ఇక దానిని పట్టించుకుని నిలదీసే పరిస్థితేరాదు. ఇక తాను మాత్రం అమాయకపు మంద దగ్గరకు వెళ్ళి ఇలాటివి చూపి, తోలు కెళ్ళగలిగినంత మందిని తోలుకెళ్ళవచ్చు.
పుస్తకారణ్యంలో పడి దాని ఆచూకీ కనుగొనడానికి మాకు చాలా సమయం, శ్రమాఖర్చైంది. కడకు రామకృష్ణ మిషన్‌ను సంప్రదిస్తే, ఉత్తేజిత ప్రసంగాలన్న పుస్తకంలో ఆ వివరాలున్నాయన్నారు. ఆ పుస్తకం తెచ్చుకున్నాం. తరవాత, కొందరు మిత్రులు ఈ విషయమై ఓఫిర్ మినిస్ట్రీస్‌ను ఒత్తిడి చేయగా, ప్రబోధరత్నాకరంలో ఆమాట ఉంది చూసుకొండి అన్నారు. ఉత్తేజిత ప్రసంగాలలోని ఒకరోజు ప్రసంగమే ప్రబోధరత్నాకరంలోనూ ఉంది. క్లుప్తంగా ఆ వివరాలివిగో.
''1995 జూన్‌లో వివేకానంద, సహస్రద్వీపవనం (థౌజండ్ ఐలండ్‌పార్కు) లో తన శిష్య బృందానికి జూన్ 19 నుండి ఏడు వారాలపాటు ప్రతిరోజూ పాఠాలు చెప్పారు. 19వ నాడు మేమంతా హాజరుకాలేదు. అయినా సమయం మించిపోతుండడంతో, అప్పటికి ఉన్న మా ముగ్గురు, నలుగురికే పాఠం బోధించడం మొదలెట్టారు. ఉన్న నలుగురం క్రైస్తవులమవడంతో బైబిలు తెచ్చి దానిలోని యోహాను సువార్తను తెరిచి దానిలోని మొదటి వాక్యాలను చదివి వివరించడం మొదలెట్టారు''. ఇదండీ సందర్భం.
ఆదిలో 'శబ్దం', అది దేవుడి వద్ద ఉండినది, శబ్దమే దేవుడు ఇది (శబ్దం) బ్రహ్మశక్తి కాబట్టి హైందవులు దీనిని బ్రహ్మ స్వరూపమనీ, మాయ అనీ చెపుతారు. విశ్వం ద్వారా ప్రతిబింబించే బ్రహ్మాన్నే ప్రకృతి అంటున్నాం. సామాన్యంగా ప్రకృతి రూపంలోనూ, ప్రత్యేకంగా కృష్ణుడు, బుద్దుడు, క్రీస్తు, రామకృష్ణుడు మొదలైన అవతార మూర్తుల రూపంలోనూ, ఇలా 'శబ్దం' రెండు రీతుల వ్యక్తమవుతోంది.
యోచనాశీలులారా! ఇది చదివిన తలకాయ ఉన్నవాడెవడైనా ఓంకారమే క్రీస్తు ఆయను అని వివేకానంద అన్నాడని అనగలడా?! మన ఆధునిక అపొస్తలుడు, ఏసునోరు అయిన ఓఫీర్ అనగలిగారు.
వివేకానంద తాత్వికంగా అద్వైత ధోరణికి చెందినవాడు. అంతా బ్రహ్మమే ధోరణి అది. అందుకనే ఆ శబ్దం యొక్క సామాన్య రూపం ప్రకృతేనన్నాడు. విశేషరూపం అయితే, కృష్ణుడు, బుద్దుడు, క్రీస్తు, రామకృష్ణుడు లాంటి అవతారమూర్తుల రూపంలోనూ, ఇలా రెండు రూపాల్లో వ్యక్తమవుతుందన్నాడాయన . దానిని వివరించుకుంటే విశేషరూపాలలోని వ్యక్తులు ఆగణితంగా (అసంఖ్యాకంగా) ఉండవచ్చు, అన్నదే ఆయన ఉద్దేశం. కనుకనే కృష్ణుణ్ణీ, బుద్దుణ్ణీ, తన గురువు రామకృష్ణుణ్ణి కూడా ఆ శబ్దం యొక్క విశేష రూపాలేనంటూ, మొదలైన అన్నపదం వాడాడు, అదీగాక శబ్దమంటే బ్రహ్మశక్తి అనీ, అదే బ్రహ్మస్వరూపమని, మాయ అనీ హిందువులంటారనీ అన్నాడు. ఈ సందర్భాన్నీ వివేకానంద దృష్టికోణాన్ని, ఆ సందర్భంలో అతడన్న మొత్తం మాటలను కప్పిపెట్టి ఓంకారమే క్రీస్తు అయ్యాడని వివేకానందుడన్నాడనడాన్ని అమాయకత్వం అనగలమా? మాయకత్వం - వంచన లేదా కుటిల పన్నాగం అని అనకుండా ఉండగలమా?
ఆ రోజు ప్రసంగంలో వివేకానంద ఇంకా ఏమన్నాడో చూడండి.
''టేకెత్ అవే ది సిన్ ఆఫ్ ది వరల్డు''లో కులపాపాన్ని హరిస్తున్నాడు, అనే పాదానికి, పరిపూర్ణులమవడానికి మార్గాన్ని క్రీస్తు మనకు చూపుతాడు. అని అర్ధం అన్నాడు. వివేకానందుని ఈ మాటను ఓఫీర్ అంగీకరిస్తారా? మానవుడికి అతడి తత్వాన్ని ప్రకటించే నిమిత్తం, మనం బ్రహ్మమే అని తెలిపే నిమిత్తం, బ్రహ్మమే క్రీస్తు అయ్యాడు. మనం బ్రహ్మాన్ని ఆవరించి ఉన్న మానవాచ్చాదనలం. కాని పరమపురుష రూపంలో క్రీస్తూమనమూ ఏకమే ..... ఈ అవతార మూర్తులు సదాతమ దైవత్వాన్ని గురించిన ఎరుక కలిగే ఉంటారు. పుట్టుక నుండి వారికది తెలిసే ఉంటుంది. తమనటన సమాప్తమైనా, తిరిగి ఇతరులను సంతుష్టపరచడానికై నాటకరంగానికి వచ్చే నటులవంటివారు అవతారమూర్తులు. ఈ మహనీయులు ఐహిక స్పర్శేలేనివారు. మనకు బోధించడానికి తాత్కాలికంగా వారు ఉపాధులను ధరిస్తారు. వాస్తవానికి వారు ఉపాథిరహితులు, అపరిశ్చిన్నులు, నిత్యముక్తులు.
పాఠక మిత్రులారా! పరిశీలకులారా! ఇదీ ఓఫీరుగారు ఎత్తుకొచ్చానంటున్న ప్రబోధరత్నాకరంలో ఉన్న వివేకానందుని ప్రసంగానువాదంలోని సమాచారం.
అయ్యా దేశ చాలెంజర్ ఓఫీరు గారూ!
1. ఇందులో ''పరబ్రహ్మతత్వాన్ని మనకు ఎరిగించుటకు ఓంకారమే క్రీస్తు అయ్యను'' అన్న వాక్యం ఎక్కడుందండీ?! డొంక తిరుగుడు మాటలు మాట్లాడకుండా, ఆ మాటలు ఎక్కడున్నాయో చూపించండి. అసలానాటి ప్రసంగంలో ''ఓంకారపు ప్రస్తావనే లేదుకదా! ఇంత అడ్డగోలుగా మాట్లాడుతూ'', నాతో వాదించాలంటే ఇంగితముండాలి, చాలా జ్ఞానముండాలి, తర్కం తెలిసి ఉండాలి అని అనడం ఆ మూడూ ఉన్నవాళ్ళు చేయగలిగిన పని కాదు. సరైన రీతిలో వాదన చేయాలంటే ఆ మూడూ ఉండాలన్నంత వరకు నాకూ అంగీకారమే. ఇంగితమంటే సాధారణ విచక్షణాజ్ఞానమనీ, జ్ఞానమంటే, విచారణీయాంశాలలో సరిపడినంత తెలిసుండడమనీ, తర్కం తెలిసుండడమంటే, తార్కిక నియమాలు, వాద రీతులు, తెలిసుండడమనీ, అనుకునే ఈ మూడూ ఉండాలన్నది నాకు అంగీకారమేనంటున్నాను. హైందవ క్రైస్తవం ఆధారంగానే పై మూడూ మీకు లేవనిగానీ, తెలిసుండీ ఆచరించడం లేదని గానీ రుజువు చేస్తాను. అయితే ఈ విచారణంతా వీటి విషయం తెలిసున్నవారూ, ఏపక్షానికీ చెందని - నిస్పాకిక్షులూ అయిన పరిశీలకుల - నిర్ణేతల - సమక్షంలో జరగాలి. వాదనియమాలలో, వాద ప్రతివాదులే నిర్ణేతలుగ ఉండరాదు. నిస్పాకిక్షులు, విచారణీయాంశంలో విజ్ఞులూ అయిన మూడో పక్షమే నిర్ణేతలుగ ఉండాలి. అదీ చాలా కీలకమైన నియమం.
గమనిక :- శ్రోతల (ప్రేక్షకుల) స్ధానంలో ఉన్న ప్రజలే నిర్ణేతలు అనేతప్పుడు పోకడ ఒకటి ఈమధ్య కాలంలో చర్చావేదికల పేరన జరుగుతున్న వాటిలో వినపడుతోంది. ఇలాటి ఏర్పాట్లు చేసుకున్న వారికి తార్కికనియమాలుగానీ, వాద నియమాలుగానీ, నిర్దారణ నియమాలుగాని తెలియనే తెలియవన్నది నా అభిప్రాయం. అది ముమ్మాటికీ నిజం కూడా.
ఓఫీరుగారికి, పి.రాధాకృష్ణరావు (మండపేట) వారికీ మధ్య ఈ విషయంపైనే వాట్సాప్‌లో కొంత సంభాషణ జరిగింది. (31 మే 2016న జరిగినట్లుంది నా వాట్సాప్‌లో) అలాగే మే 30-2016 సత్య సంస్థాపన అన్న పేరున ఓఫీర్‌గారి వీడియో ప్రసంగం కూడా నాకు అందింది. క్రైస్తవనాడు, పుట్టా, మరియు షఫీగారు రంజిత్ ఓఫీర్ పై చేస్తున్న దుష్ప్రచారంపై ఖండన డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు. యూట్యూబ్. కామ్. పేరున ఉందది వాటిలో ప్రస్తుతానికి సంబంధించిన భాగం వరకు ప్రస్తావిస్తాను. ఓఫీర్‌గారు : 1. రాధాకృష్ణగారూ! ప్రబోధ రత్నాకరంలోని టాపిక్ ఇప్పుడు క్రొత్తగా ఎత్తిందికాదు. వివేకానందుని ఆ మాటలు నాకు స్ఫూర్తినిచ్చాయి...... కనుక నాహైందవ క్రైస్తవంలో ఆ మహాపురుషుల మాటలను మొదటి పేజీలోనే ప్రముఖంగా ఎత్తిచూపాను.
2. రాధాకృష్ణగారూ! మరొక ముఖ్య విషయం ప్రమాదకరమైన మీ పోకడలు మానుకొండి అని పుట్టావారన్నారు. రెండు మత గ్రంధాలసారం ఒక్కటే అని చెప్పడం వలన ఎవరికి ప్రమాదం వస్తుందో, ఏ రకమైన ప్రమాదమో, హైం.క్రైస్తవం పుస్తకాన్ని ఎక్కడ ఖండిస్తున్నారో స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత మీపైన ఉంది.
3. రాధాకృష్ణగారూ! వివేకానందుడు చెప్పినంత మాత్రాన అది సత్యంకాదు అన్నారు మీరు! మరి ఎవరు చెప్పింది సత్యమవుతుంది? సత్యాన్వేషణ మండలివారు చెప్పినంత మాత్రాన సత్యమవుతుందా?
రాధాకృష్ణగారు :- మీరు పంపిన ప్రబోధరత్నాకరం మొదటి పుటల్లో ఓంకారమే క్రీస్తు అయ్యెను అని వివేకానందుడు అన్నట్లు ఎక్కడ ఉందండీ!? ఇవిగో ఆ సందర్భంలోని మాటలు.
''మనం బ్రహ్మమే అని తెలిపే నిమిత్తం, బ్రహ్మమే క్రీస్తు అయ్యాడు.... పరమపురుష రూపంలో క్రీస్తూమనమూ ఒక్కటే''.
సురేంద్ర :- అయ్యా అద్దంకి రంజిత్ ఓఫీరుగారూ! వివేకానందుడు చెప్పింది సత్యమే అవుతుంది అన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కనీసం ఆమాటవరకైనా కడదాకా నిలబడగలరేమో చూడండి. నిజానికి అక్కడ అప్పుడు వివేకానందుడు బైబిలులోని ఏసును గురించి చెప్పాలనుకోలేదు. తన సిద్దాంతమైన అద్వైతాన్ని, బ్రహ్మాన్ని గురించి క్రైస్తవులకు చెప్పాలనుకున్న సందర్భం అది. విచారణకు ఇంగితం పని చేస్తుండాలన్న మీకు ఇక్కడ, అదెందుకు పనిచేయలేదు. ''ఆ ప్రసంగంలో ఓంకార ప్రస్తావన లేదు. శబ్దం బ్రహ్మశక్తి కాబట్టి హైందవులు దీనిని బ్రహ్మ స్వరూపమని, మాయ అని చెపుతారు. విశ్వంద్వారా ప్రతిబింబించే బ్రహ్మాన్నే ప్రకృతి అంటారు. ఆ శబ్దం (బ్రహ్మశక్తి సామాన్యంగా ప్రకృతి రూపంలోనూ, విశేషంగా కృష్ణుడు, బుద్దుడు, జీసెస్ క్రీస్తు, రామకృష్ణుడు మొదలైన అవతార మూర్తుల రూపంలోనూ ఇలా రెండు రీతుల వ్యక్తమవుతోంది.'' ఇవండీ ఆ ప్రసంగంలోని వివేకానందుని మాటలు. నా లెక్క ప్రకారం అవి తప్పా ఒప్పా అన్నది పరీక్షించాల్సీఉంది. అయినా అదలా ఉంచుదాం. మీ వరకు మీరు తెగరెచ్చిపోయారు కదా! వివేకానందునివి సత్యంకాకుంటే, పుట్టా వారివి సత్యమవుతాయా? అంటూ వ్యంగ్యాన్ని జోడించారుకదా! వివేకానందుని పై మాటలు సత్యాలని అంగీకరించి మీ క్రీస్తు దేవుడు కాదనిగానీ, హిందువుల బ్రహ్మం యొక్క అవతారాలలో ఒకటి మాత్రమే, ఎలా కృష్ణుడు, బుద్దుడు, రామకృష్ణుడుల్లాగా ననీ అంగీకరించండి. వివేకానందుని ప్రకారం బుద్దుడు, రామకృష్ణుడు కూడా ఏసులాటి అవతారులేననీ అంగీకరించండి. ఆ వివేకానందుడే మీ ఏసు గురించి మరికొన్ని విషయాలూ చెప్పాడు. గుండె చిక్కబట్టుకుని వినండి (చదవండి) మీలో ఏ మాత్రం నిజాయితీ ఉన్నా అవును అవన్నీ సత్యాలే వివేకానందుడు చెప్పాడు గనక అని ప్రకటించండి.
''రెండు గ్రంథాలలో ఒకే దేవుని గురించి చెప్పబడింది.'' అంటే ఏమి ప్రమాదమొచ్చిపడిందండీ! అంటూ నంగనాచిలా మాట్లాడారు. అబద్దాలు చెప్పగూడదన్నంత వరకైనా ఇంగితం పని చేయడంలేదా? పైగా బైబిలువైపుకు అమాయకపు జనాన్ని ఆకర్షించడానికి, ఇలాటి అబద్దాలు, స్వకపోలకల్పిత మాటలూ చెప్పడం మీ దృష్టిలో తప్పుకాదన్నమాట. 10 వేల మందికి బాప్తిజమ్ ఇచ్చానని ఒక ప్రసంగంలో చెప్పుకున్నారు. 4 లక్షల మంది నీ మాటలు వినేవారున్నారనీ చెప్పుకున్నారు. అంత పెద్ద సంఖ్యలో జనాన్ని అబద్దాల ప్రభావానికి లోను చేయడం ప్రమాదంకాదన్నమాట! అది వంచనాకాదన్నమాట.
ఒక్కమాట సూటిగా అడుగుతాను సూటిగానే సమాధానం చెప్పండి. డొంక తిరుగుడొద్దు.
1. వేదాలు సృష్టిలో మొదటి గ్రంథాలు అని మీరూ అన్నారు.
2. వేదాలు, బైబిలులోని వివరాలు నూటికి నూరుశాతం సరిపోతున్నాయన్నారు.
3. వేదాలలోని దేవుడు బైబిలులోని దేవుడు ఒక్కడేనన్నారు.
4. హిందూమతం - క్రైస్తవం నిజానికి రెండు కాదు ఒక్కటేనన్నారు.
నిజాయితీ అట! అంటూనన్ను ఎకసెక్కమాడారు. మీతో మాట్లాడాలంటే జ్ఞానం కావాలి, ఇంగితం పని చేస్తుండాలి, తర్కం వచ్చుండాలి అని తెగ బిగువుగా మాట్లాడారు.
షఫీలాటి ముస్లింలను ఉద్దేశించి, ఖురాను బైబిలును అంగీకరిస్తున్నట్లైతే, ముందొచ్చిన బైబిలులోని దేవుని పేరుతోనే దేవుణ్ణి పిలవండి. ఎందుకనంటే మీ అల్లానే, అబ్రహాము,ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణినేనేనంటున్నాడు కనక, ఆ దేవుడు తన పేరు ఎహోవాననే ప్రకటించుకున్నాడు గనుక అని నిగ్గదీశారు కదా!
మరి అదే నియమాన్ని మీ బైబిలుకూ, వేదానికీ అన్వయించవద్దా!
కాబట్టి, బైబిలును అవతల పారేసి వేదాన్ని పట్టుకోండి. వేదంలో చెప్పబడిన ప్రార్ధనలు, కర్మలే చేయండి. వేదంలోని పేర్లతోనే ఆ మీ దేవదేవుణ్ణి పిలవండి! నిజాయితీ గురించి ఎందుకు మాట్లాడానో, మాట్లాడుతున్నానో, మాట్లాడుతునే ఉంటానో ఇంగితానికి అందడం లేదా? మీది నయవంచన కపటస్వభావం లేదా విషయం తెలియకుండానే తెలుసుననుకునే భ్రాంతస్థితి.
మళ్ళా మనం వివేకానందుని దగ్గరకువద్దాం. మీరు గుండె నొప్పి రాకుండా జాగ్రత్తలు తీసుకుని వినాల్సిన వివేకానందుని మాటలు - మీ ఏసు గురించే సుమండీ! మరికొన్ని వున్నాయి. బేజారు కాకుండా వినండి.
1. క్రీస్తు ప్రవచనాలన్నీ తూర్పు దేశానికి చెందినవే.
సురేంద్ర :- అర్ధమవుతోందా ఓఫీర్‌జీ ! భారతదేశం నుండి ఏసు అరువు తెచ్చుకున్నవేననిదానర్ధం.
జగన్మాతలో ఒక అంశం కృష్ణుడు, మరొక అంశం బుద్దుడు, వేరొకటి క్రీస్తుగా భాసించారు.
సురేంద్ర : మీకిది సమ్మతమేనా? ఇది బైబిలు ఒప్పుకుంటుందా? (దివ్యవాణి జూలై 2 మంగళవారం)స్వీయధర్మాన్ని పూర్తిగా ఆచరించని కారణంగానూ, అన్నింటికంటే, స్త్రీకి పురుషునితో సమాన ప్రతిపత్తినివ్వని కారణంగానూ ఏసు అపరిపూర్ణుడు. స్త్రీలే అతనికి సర్వం ఒనర్చారు. అయినా ఒక్క స్త్రీనైనా అతడు శిష్యురాలిగా స్వీకరించలేదు. యూదుల ఆచారానికి అంతగా కట్టుబడ్డాడు. అతని కంటె బుద్దుడు కొంత మేలు. స్త్రీని బుద్దుడు పురుషునితో తుల్యాధికారిణిగా అంగీకరించాడు. అయినా అతడూ అపరిపూర్ణుడే (పే. 478)
సురేంద్ర :- ఓఫీర్‌జీ! వింటున్నారా! మీ మహనీయుడు వివేకానందుని సత్యవాక్కులు అవి సత్యాలేనని మీరంటే అనగలిగితే, మనస్ఫూర్తిగా స్వీకరించగలిగితే మావరకు మాకు అభ్యంతరం ఏమీ లేదండీ అద్దంకోరూ!
4. ఒక మానవుడు అతడెంత మహనీయుడైనా అవుగాక! మనం అతణ్ణే నమ్ముకుని ఉండకూడదు. మనం కూడా బుద్ధులం, క్రీస్తులం కావాలి. క్రీస్తు మానవుడే, బుద్దునికంటే కొంచెంతక్కువవాడు. అతణ్ణీ నమ్ముకోడం సరికాదు. (పే. 478)
5. జీసస్సే జన్మించకుంటే, మానవకోటికి తరుణోపాయం ఉండేదికాదని తలంచడం మహాపరాధం..... ఇంతకు ముందూ మనమే పరాత్పరులం. క్రీస్తులూ, బుద్దులూ ఆత్మసాగరంలోని వీచికలు. నీలోని పరమాత్మకు తప్ప దేనికీ ప్రణమిల్లకు. నువ్వే ఆ దేవదేవుడినని గ్రహించే వరకు నీకు ముక్తిలేదు. (పే. 478)
సురేంద్ర : చాలా! రంజిత్ ఓఫీర్‌గారూ! మొహం వాచేలా, కడుపు నిండేలా చాలా పెట్టాడనుకుంటా మీ మహనీయుడు వివేకానందుడు!? ఇది చాలా? ఇంకా కావాలా? హైందవం - క్రైస్తవం వకటికాదనే అంటున్నాడు వివేకానందుడన్నంతవరకైనా మీ ఇంగితానికి అందుతోందా? గుండె దిటవు చేసుకుని వింటానంటే, విని తట్టుకోగలనంటే, ఇంకొన్ని, వివేకానందుని మాటలనే మీ ఇంగితంముందు పెట్టగలను.
6. భగవంతుడే భగవంతుణ్ణి గ్రహించగలడు. సో-హం, సో-హం అనేదే గానంలోని పల్లవి. ప్రతి వస్తువూ సజీవదైవం, సజీవక్రీస్తు,.... సకల బైబిళ్ళనూ, క్రీస్తులనూ, బుద్దులను వెలుగొందజేసే జ్యోతి మనమే. అది లేనిదే ఇవన్నీ మృతప్రాయాలు.
సురేంద్ర :- మాడు పగిలిందా రంజితయ్యా! నేను అనే జ్యోతి - (అది మనమేనంటున్నాడు వివేకానంద) లేనిదే ఏసూ, బుద్దుడూ కూడా మృతప్రాయులేనట! బాగుందికదూ మహనీయుల మాట! మా మాటకేంగానీ, మీవరకు అదంతా సత్యమేనని ఒప్పేసుకోండి. నావెంట మంగలి తన కత్తితో సిద్దంగా ఉన్నాడు. లక్షసార్లుకైనా సవాలుకు కట్టుబడి ఉన్నానంటిరి కదా! త్వరగారండి నాకంత టైం లేదు.
7. సత్యాన్ని పరిశీలించకుండానే, ప్రాచీన సంప్రదాయాన్ని విశ్వసించడం జరిగింది. విశ్వాస ప్రభావం అలాంటిది. ... జీసెస్ క్రీస్తు, మహమ్మదు లాటి మహా పురుషులైనా సరే, అనేక మూఢభావాలను విశ్వసించారు. వాటిని త్యజించలేకపోయారు. కానీ మీ దృష్టిని సర్వదా సత్యం మీదే కేంద్రీకరించాలి. సకల మూఢనమ్మకాలను పూర్తిగా పరిత్యజించాలి.
ముగింపు :
అయ్యా ఓఫీిరుగారూ! వివేకానందుడు అన్నాడని మీరు అన్నట్లు, ఆ ప్రబోధరత్నాకరం మొదటి పుటల్లో, ''ఓంకారమే క్రీస్తు ఆయను'' అన్న మాటలులేవు. ఇక్కడికిది ఒక అబద్దం.
ఆ రోజు వెయ్యి ద్వీపాలవనంలో వివేకానందుడు చెప్పదలచింది ఓంకారాన్ని గురించీ కాదు, క్రీస్తును గురించీ కాదు. క్రైస్తవులుగా ఉండి తన శిష్యులుగ మారడానికి సిద్దపడి తన ప్రసంగాలు వినడానికి వచ్చిన ముగ్గురు నలుగురు క్రైస్తవులతో, బ్రహ్మతత్వాన్ని గురించి మాత్రమే. ఆయన ప్రసంగసారాంశం బ్రహ్మం. ప్రకృతి రూపంలోనూ, విశిష్ట వ్యక్తుల రూపంలోనూ రెండుగా వ్యక్తమవుతూ ఉంది. మనం బ్రహ్మమే. మనమే బ్రహ్మం అని చెప్పాలన్నదే వివేకానందుని ఉద్దేశం.
ఏసు మనిషే ఇకపోతే హైందవ అద్వైతసిద్దాంతం ప్రకారం ఏసూ బ్రహ్మమే, బుద్దుడూ బ్రహ్మమే, రామకృష్ణుడూ బ్రహ్మమే. మనమూ బ్రహ్మమేనన్నదే ఆ ప్రసంగ సారాంశం.
ఏసు అపరిపూర్ణుడు, అనేక మూఢవిశ్వాసాలూ కలిగి ఉన్నవాడు. అతడే రక్షకుడు అనడం మహాపరాధం.
బ్రహ్మనంద సాగరంలో ఏసులాంటివాళ్ళు వీచికలు (చిన్న తెప్ప) వంటి వాళ్ళు మాత్రమే మనమే అసలు బ్రహ్మస్వరూపులం మనం లేకుంటే వాళ్ళంతా మృతప్రాయులే.
గమనిక :- హైందవ క్రైస్తవంలోని ఈ భాగంలో మీరు చెప్పిన లేదా ప్రలోభపెట్టదలచి రాసిన ''ఓంకారమే క్రీస్తు ఆయను'' అన్న మాటలు వివేకానంద అనలేదనీ, క్రీస్తును ఒక మంచి వ్యక్తిగా అదిన్నీ అనేక లోపాలున్న మహనీయునిగా మాత్రమే వివేకానందుడు తలచాడనీ వివేకానందుని మాటలాధారంగానే చూపించాను. దాంతో మీవన్ని అబద్దాలేనని రుజువు చేసినట్లైంది. నిజాయితీ గురించి మాట్లాడడమే తప్పన్నట్లు భాషించారు. మీ నిజాయితీని శంకించకుండేట్లు గుండు గీయించుకుని పిలకపెట్టుకోడానికి సిద్దపడి రండి. ఇక్కడ అన్నీ - మంగలి - కత్తి - సిద్దంగా ఉన్నాయి. మీరు గాని మీ నిజాయితీని నిరూపించుకుంటే, నిజాయితీ గురించి మాట్లాడాల్సిన పని మాకేమీ లేదు.
బాంబులాటి మరోమాట (వివేకానందునిదే ఇది కూడా!) చెప్పనా? ఏసు చారిత్రక వ్యక్తికాడు. మరో భారతీయ తాత్వికుని భావాలను ఏసు పేర ప్రచారం చేశారు. ఆ తాత్వికుడే సముద్ర ప్రయాణ సమయంలో వివేకానందునికి కలలో కనపడి ఈ మాట చెప్పాడు. ఆ కలలోని కొన్ని అంశాలు అనంతరం చారిత్రక పరిశోధనలో తేలాయి.
అట్టపైన మొదట, చివరి పేజీలలో ఉన్న రెండూ మీ పెడపోకడను పట్టిచ్చేవే.
1. ముఖ చిత్రం జాతిని అవమానించుతోంది.
2. అట్ట చివరి పేజిలోనివి, సొంత డబ్బాకు చెందిన అబద్దాలు మాత్రమే.
పుస్తకం లోపలి ముందుపుట 3. సత్యమహంగంభీరః - పులుముడుగొడవే అక్కడా మీ రాతలు అబద్దాల పూతలు మాత్రమే. ఇక పుస్తకం చివరిపేజీలోని 4. ఓంకారమే క్రీస్తు ఆయను అబద్దాలపుట్టే. ఆ విషయమే ఈ వ్యాసంలో చూపించాను.
ఇలా మీ హైందవ క్రైస్తవం మొదటి చివరి పుటల్లోని నాలుగంశాలూ అబద్దాలేనని రుజువు చేశాను. నిరంతర సత్యాన్వేషిననీ, సత్యం నీవు చెప్పు హిందువునవుతానని ప్రకటించిన మీరు మాటకు కట్టుబడి ముందుకు రండి.
1. పరిపూర్ణానంద గారి అమ్మవడిలోకి చేరతారా? లేదా
2. చిన్న జియ్యరుల వారి తిరునామాలు ధరించి గుండుకొట్టుకొని పిలక పెట్టుకుంటారా? లేదా
3. సత్యాన్వేషిని అంటున్నారు గనుక సత్యాన్వేషణ మండలిలో చేరుతారా? మీ యిష్టం.
Subscribe to:
Posts (Atom)