శాస్త్రీయ దృక్పథంపై చర్చాపత్రం
భారత రాజ్యాంగలోని అధికరణం 51(ఎ)హెచ్ ప్రకారం ''శాస్త్రీయ స్పృహను, కలిగి ఉండడంలో స్థిరత్వాన్ని (గ్టితనాన్ని) కలిగి ఉండడం. మానవవాదాన్ని, పరిశీలనా తత్వాన్ని, సంస్కరణాభిలాషను పెంపొందించడం ప్రతి భారత పౌరుని విధి'' అని వ్రాయబడి ఉంది. శాస్త్రీయ స్పృహను, పరిశీలనా తత్వాన్ని కలిగి ఉండడమంటేనే శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండడం అని అర్థం. 'దృక్పథం' అంటే చూసే తీరు. 'శాస్త్రీయ' అంటే సరైన అని అర్థం. అంటే 'శాస్త్రీయ దృక్పథం' అన్నదానికి సరిగా చూసేతీరు అని అర్థము అన్నమాట. 'సరిగా' అంటే 'ఉన్నది ఉన్నట్లుగా' అనే అర్థమే కాని మంచిని చూడడం, మంచిగా చూడడం అని కాదు. సరిగా చూడడం అంటే వాస్తవాలనాధారంగా చేసుకొని చూడడం. అలా చూడడానికి, నిర్ణయాలు తీసుకోడానికి సిద్ధపడే వైఖరినే శాస్త్రీయ దృక్పథం అనాలి. శాస్త్రీయ దృక్పథం, పరిశీలనా తత్వము లోపించినందువలననే ప్రజలు మూఢనమ్మకాల ప్రభావానికి గురఅవుతున్నారని చాలామంది అభ్యుదయవాదుల అభిప్రాయం. నా అభిప్రాయంలో కేవలం మూఢనమ్మకాల వ్యాప్తియే కాక, సమాజంలో మనిషి తనకు తానే కొనితెచ్చి పెట్టుకుంటున్న మరియు సాి మనుషులకు కూడా కలిగిస్తున్న సమస్యలన్నింకీ కూడా సమాజంలో ఈ శాస్త్రీయ దృక్పథము లోపించడమే కారణం. అందువలన దీనియొక్క అవసరము ఆస్తికులు, నాస్తికులు, హేతువాదులు, మానవవాదులు, సామ్యవాదులు అనే కొంతమందికే పరిమితముగా కాక మానవులందరికీ అవసరమైనదిగా చెప్పవచ్చు. ఏమతమును అనుసరిస్తున్న వాడు? అసలు ఏ మతాన్నైనా అనుసరిస్తున్న వాడా లేదా అన్న దానితో నిమిత్తమే లేకుండా ఈ శాస్త్రీయ దృక్పథము యొక్క ఆవశ్యకత విస్తృతమై ఉంది. కాని మతస్తులలోను, ఆస్తికులలోను ఈ దృక్పథము లేనందువల్లనే సమస్యలన్నింకీ మూలకారణమని అభ్యుదయ వాదుల అభిప్రాయము. కాని ఈ విషయములో సమాజ అభ్యున్నతి సాధించాలంటే అందరం కలసి పనిచేయాలని, సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని ఐకమత్యంతో పెంపొందించాలనే నిర్ణయానికి రాలేకపోవడానికి ప్రధాన కారణం ఈ అభ్యుదయవాదుల్లోనూ శాస్త్రీయ దృష్టి లోపించడమే కాదా?