Showing posts with label Editorial. Show all posts
Showing posts with label Editorial. Show all posts

Tuesday, September 1, 2015

దేశభక్తి - ఒక పరిశీలన


యోచనాశీలురైన పాఠక మిత్రులారా!
ముందుగా ఒక్కమాట! మనస్ఫూర్తిగా, మాట, చేతను కలుపుకొని, భారత దేశము నా మాతృభూమి, నేను భారతీయుణ్ణి, భారతీయులందరూ నా సహోదరులే అన్న రీతిని కనపరచగలవా? నిజంగా నీవిక్కడికి చేరిఉంటే, ఆ స్థాయికి చేరిన నీకుగాని, ఎవరికి గానీ దేశభక్తిని గురించి పెద్దగా చెప్పవలసిందేమీ ఉండదు. భావన చెప్పిన చొప్పిన, ఎంతెంతగా నడవగలమో చూసుకుంటూ, మరింతగా నడవడానికై ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ సాగుతుండడమే చేయవలసిందిగా ఉంటుంది.
మన ప్రస్తుత ప్రధాన విచారణీయాంశమైన 'మత ప్రచారాలు - మత మార్పిడులు - ముంచుకొస్తున్న మహోపద్రవం' అన్నదానికి సంబంధించిన ధారావాహిక వ్యాసపరంపరలో భాగంగానే, అద్దంకి రంజిత్‌ ఓఫిర్‌గారి, హైందవ క్రైస్తవాన్నీ, అలాి మరికొన్ని రచనలను శాస్త్రీయ విశ్లేషణకు లోనుచేయను మొదలెట్టుకున్నాం.
'హైందవ క్రైస్తవం' అన్న పుస్తకాన్ని ప్రచురించి, ప్రచారంలోకి తెచ్చిన ఓఫిర్‌గారు, అంతితో ఆగకుండా, ఈ పుస్తకములో తప్పులున్నాయని భారతదేశంలోని ఎవరు నిరూపించినా, హిందూధర్మ సంస్థలు తేల్చినా తాను హిందువునవుతానని ఛాలెంజ్‌ రూపంలో య్యూట్యూబ్‌ ద్వారా ఒక బహిరంగ ప్రకటన విడుదలచేశారు. ఆ పుస్తకంలో ఉన్నది సరైందేనని తాను నిరూపిస్తే, ఇతరులు తనవెంట క్రైస్తవంలో ప్రయాణించాల్సి ఉంటుందనీ అందులోనే ప్రకించారు. దానిపై నేను ఆ సవాలును స్వీకరిస్తున్నట్లు, ఎప్పుడు, ఎక్కడ విచారణకు కూర్చుందామో చెప్పమని రిజిష్టరు లేఖలు రెండు వ్రాశాను. ఆ క్రమంలో భాగంగా మరికొందరు ఆయన పుస్తకంతో విభేధిస్తున్నవారు, ఆయనకు ప్రతి సవాలుచేస్తూ చర్చకు ఆహ్వానించినట్లు మాకు తెలియపర్చారు.
నిజానికాయన, నిరంతర సత్యాన్వేషినని ఆ పుస్తకంలో ప్రకించినదాన్ని బ్టిగాని, అంత ధీమాగా, ఒకింత సాహసమేననక తప్పని రూపంలో చేసిన ఛాలెంజి ప్రకటన రీతినిబ్టిగానీ, మా ప్రతి సవాలు లేఖ అందిన వెంటనే ఆధునిక సాంకేతిక విజ్ఞానం అందుబాటులో ఉందికనుక, ఆ నిమిషంలో ఫోన్‌చేసి గాని, ఎస్‌ఎమ్‌ఎస్‌ చేసిగాని, ఎప్పుడోఎందుకు ఇప్పుడే ఇదిగో సిద్ధంగా ఉన్నాను. మీరెక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు నేను చర్చకు సిద్ధం అని స్పందించి ఉండాల్సింది. కానీ ఏ కారణాల వల్లనో రెండునెలలు దాినా ఆయననుండి సమాధానం (కబురు) రాలేదింతవరకు. ఇది రాస్తున్నది 30-9-2015వ తేదీన. ఆయనగారి హైందవ క్రైస్తవం పుస్తకాన్ని మరోసారి చదువుతూ ముగింపుకొచ్చిన సందర్భంలో అట్టచివర పేజీలోని నాలుగు మాటలు మళ్ళా కంటబడ్డాయి. రంజిత్‌ ఓఫిర్‌గారి గురించి వ్రాయబడ్డ సమాచారం ఉంది అందులో. ఆ చిన్న రచనాభాగంలో..
1. దేశభక్తి, దైవభక్తి సమపాళ్ళలో మేళవించిన కుటుంబంలో ప్టుారని
2. భారతీయ వేదాంత సారాన్ని నరనరాన జీర్ణించుకొని ఉన్నారని
3. 6 సం||ల పసిప్రాయంలోనే రామాయణాన్ని చదివి జీర్ణించుకున్నారని
4. 12 సం||లు వచ్చేనాికి మహాభారతం, భాగవతం, మొదలైన సనాతన గ్రంథాలెన్నో చదివి జీర్ణించుకున్నారని
5. ఆయనగారితో ప్రస్తుత ధర్మోపదేశకులెవ్వరినీ పోల్చలేమని
6. గుండెలనిండా సాిమనిషిపట్ల ప్రేమ, దేశంపట్ల భక్తి నింపుకుని ఉన్నారని
7. 30 సం||ల తపస్సుకు ఫలితంగా దేవుడాయనకు సత్యాన్ని (అద్భుత సత్యాన్ని) ప్రకటపరిచాడని
8. ఆ సత్యాన్ని ఈ గ్రంథం ద్వారా మొదట భారత ప్రజలకు ఆపై ప్రపంచంలోని సత్యాన్వేషకులందరకు అందిస్తున్నారని
9. ఈ పుస్తకంలోని సమాచారం నేరుగా పైనుండి, సత్యలోకం నుండి వచ్చిందని
10. ఇందులో ఉన్న సమాచారం, ఈ భూమిమీదున్న ఏ పుస్తకంలోనూ లేదనీ
11. దీనిని వినమ్రులై చదివితే, పరాత్పరుడు చదివినవారితో మ్లాడి తన సత్యాన్ని  మనకు తెలియజేస్తాడని ప్రకింపజేశారు.
ఓ నిజానికీ 11 అంశాలను, అవి సరైనవేనని ఆయన రుజువుపర్చాల్సి ఉంది.
దేశభక్తి
ఈమాట దేశముపైన భక్తి, అనిగాని, దేశమును గురించి భక్తి అనిగాని విగ్రహం చేయాలి. దేశము +భక్తి అన్న రెండు పదాల సమాసమిది. ఆ రెండు మాటలగురించి వివరించుకుంటేగాని అవగాహనలో స్పష్టతరాదు.
భక్తి :- సాత్వస్మిన్‌ పరమప్రేమరూపా భక్తిః! అని భక్తికి నిర్వచనం. అంటే దీనియందు పరమప్రేమ - మిక్కిలి ఇష్టము లేదా శ్రేష్టమైన, మరిదేనినీ పోల్చడానికి వీల్లేనంత ఇష్టము (రాగము)- కలిగి ఉండడము అని.
ప్రపంచంలో ఉన్న విలువైన వాిని, ఇష్టమైన వాిని లేదా ఇష్టపడదగ్గ వాిని అన్నింనీ ఎదుటప్టిె ఏదోఒక్కదానిని మాత్రమే ఎంచుకోమని చెప్పినప్పుడు అన్నింనీ విడచి ఏ ఒక్కదానిని మాత్రమే స్వీకరిస్తామో అది మనకు మిక్కిలి ఇష్టము అని అర్థం. ఆస్తిక సాహిత్యం నుండి ప్టుిన పదం కనుక, దీనిని ప్రధానంగా దేవునికి వర్తింపజేస్తూ వాడడం వాడుకలో ఉంది. 'ఫలాని దేవుని భక్తుడు' అని సాధారణ ప్రయోగం ఉంది. గురుభక్తి, ఫలాని నాయకునియందు భక్తి, ఆరాధనాభావం, అన్నమాటలూ వాడుకలో ఉన్నయ్‌. ఇవన్నీ, వాివాి విషయంలో అమితమైన ఇష్టము అన్న అర్థంలో వాడుతున్న మాటలే.
అమితమైన ఇష్టమన్నదీనిని, దేశానికి వర్తింపజేస్తే  ఏర్పడే అన్వయరూపం ఏమి? ఎలాగుంటుంది?
దేశమంటే ఏమి? ఒక నిర్దేశిత ప్రాదేశికపు ఎల్లల మధ్యనున్న ప్రకృతి సంపద, దానికి హక్కుదారులుగా నున్న జనులు, వారందరినీ క్టిఉంచగల నడిపించగల కట్టడి అంటే ఒప్పందము, అన్న మూినీ కలిపితే దేశమవుతుంది. సాధారణ జనం - మామూలుగా - దేశమంటే ఈ నేల అనో, ఒకింత అవగాహన పెరిగితే, దేశమంటే మ్టికాదు, మనుషులనో అనడం (కద్దు) జరుగుతుంటుంది. నిజానికి దేశమంటే (మ్టి) ప్రకృతి సంపదేననికాని, అదికాదు మనుషులేనని గాని, అనుకునే రెండు భావనలు అవాస్తవాలు కావుగాని, పాక్షికమైనవి. దేశానికి మనం చెప్పుకోవలసిన పూర్ణరూపాలు కావవి. ఈ మరోరకంగా చెప్పుకుంటే ఈ విషయం మరింత స్పష్టంగా అర్థమవుతుంది.

సమాజమంటే ఏమి?

నిర్థిష్ట ప్రాదేశికపు ఎల్లల మధ్య ఉంటూ ఒక ఒప్పందానికి లోనయి జీవిస్తున్న జనసమూహాన్ని సమాజమాంము. ఈనాడు భూమిపైనున్న సమాజాలన్నీ ఆయా దేశాల పేర్లతోనే గుర్తింపబడుతున్నయ్‌. అందులోని ప్రతివ్యక్తీ ఆ దేశీయునిగనే గుర్తింపబడడం, నమోదుచేయబడడం జరుగుతోంది. ఆ దేశ పౌరులు అంారు వారిని. పౌరసత్వం కలిగి ఉండడం అంటే, ఆదేశంలోని జనాలమధ్య, వారేర్పరచుకున్న ఒప్పందానికి లోనై, హక్కులు, విధులు, బాధ్యతలు - కర్తవ్యాలుగా స్వీకరించి జీవించడానికి సమష్టి ఆమోదం పొందిఉండడం అని అర్థం.
ఆ దేశ పౌరుడన్నా, ఆదేశస్తుడన్నా, ఆ జాతీయుడన్నా, ఆ సామాజికుడన్నా ఈ సందర్భంలో ఒకటే అర్థం. (సమాజం అన్నదానికి అందరికీ వర్తించే ఒక కట్టుబాటు+ మొత్తం దేశంలోని జనం అన్నదే కాకుండా, ఒక కట్టుబాటుకు లోనై జీవిస్తున్న చిన్న సమూహాలు అనికూడా అర్థం వస్తుంది. కాని దాని విస్తృతార్థంలో సమాజమన్నదానికి దేశం అన్న అర్థమే సరైంది. మిగిలిన రూపాలన్నీ ఉప సమాజాలే అవుతాయి. కుల సంఘాలు, మత సంఘాలు, ప్రాంతీయ సంఘాలు లాివన్నీ ఈ ఉపసమాజాల క్రిందికి వస్తాయి. ఇలాివన్నీ మనం పైనచెప్పుకున్న దేశంలో భాగాలవుతాయి. ఈ ఉప సమాజాలలో వాిలో వాికి అంతర్గతంగా ఉన్న కట్టుబాట్లన్నీ, దేశం అనడానికి పెట్టుకున్న కట్టుబాటుకు లోబడి ఉంాయి. దేశపు కట్టుబాటును - ఒప్పందాన్ని - అతిక్రమించి గాని, కాదంటూ గాని ఈ ఉపసమాజాలేవీ ఉండడానికి వీలులేదు. ఆ ప్రధాన ఒప్పందాన్ని 'రాజ్యాంగం' అనాంరు. కనుక భారత రాజ్యాంగానికి లోబడి, భారత రాజ్యాంగం నిర్దేశిస్తున్న సరిహద్దుల మధ్య నివశిస్తున్న  వారినే భారతదేశస్తులాంరు. అంటే భారత దేశంగా గుర్తిస్తున్న ప్రదేశము, భారత రాజ్యాంగము - దానికి లోబడి జీవిస్తున్న జనము- కలసి భారతదేశమవుతుంది. దేశాన్ని గురించి ఈరకంగా అర్థం చేసుకుంటేనే అది శాస్త్రీయ - సరైన - అవగాహన అవుతుంది. ఇంతకు ఏమాత్రం తగ్గినా, అది 'దేశభక్తి' అనే పదబంధంలోని దేశమన్న మాటకు సరైన అర్థం కాకుండా పోతుంది. కనుక దేశమంటే ఏమని చెప్పుకోవడం సరైందవుతుందని తేలినట్లు?
సూత్రము : భూమిపై ఒక నిర్థిష్ట ప్రదేశము, అందలి సంపద, అందుండే జనులు, వారినొక కట్టగా నిలిపి, నడిపిస్తుండే ఒప్పందము. ఇదే దేశమంటే. ముప్పిరిగొన్న ఈ మూితో కూడిన ఒక్కినే దేశమనుకుంటే, మరి దేశభక్తంటే ఏమవుతుంది?
ఈ మూిపట్ల, మిగతావేికంటెనూ అధికతమైన ప్రేమకలిగి ఉండడాన్నే దేశభక్తి అనాంరు. 'మిగతా వాికంటే' అన్నమాట ఈ వ్యాసానికంతికీ కేంద్రబిందువు అయిఉంది. ఆ 'మిగతావి' అంటే ఏమిో, వాి వివిధ రూపాలు ఈ దేశంలో ఎలా ఉనికిలో ఉంటున్నాయో స్పష్టంగా తెలిసి ఉండకపోతే, దేశభక్తికి సరైన అర్థం చెప్పుకోలేము. సరైన అన్వయాన్నీ చేయలేము. ఒక వ్యక్తి దేశభక్తుడో కాదో నిర్ణయించడమూ కష్టమవుతుంది.
మనపెద్దవాళ్ళు సమాజాన్ని 3 ప్రధాన విభాగాలుగా విడదీసి వివరించే పనిచేశారు. సాంఘికం, ఆర్థికం, రాజకీయం అన్నవే ఆ మూడు క్షేత్రాలు.
సాంఘికం : క్రింద వివాహం, కుటుంబం, కులం, మతం, ప్రాంతం అన్నవి ఉప భాగాలు కాగా మొత్తం దేశం పెద్దదైన ఒకి అవుతుంది. అందులో ఏదైనా దానిలో భాగమే. ఎన్నికలిసైనా అందులో భాగాలే అవుతాయి. (సహజసిద్దాలు, మానవకృతాలు ఉంాయి ఇందులో)
ఆర్థికం : ఆయా అవసరాలు తీర్చేవి, వాటన్నిం విషయంలో వ్యక్తుల మధ్య ఇచ్చిపుచ్చుకొనే రూపమైన నియమనిబంధనలు అన్నీ కలిపి ఈ భాగం క్రిందకు వస్తాయి.
రాజకీయం : ఆ ఒప్పందం ద్వారా ఏర్పరచుకున్న లక్ష్యాలను సాధించుకోడానికి ఏర్పరచుకున్న పాలనా వ్యవస్థనంతినీ కలిపి రాజకీయం అనంటున్నాం. అంటే మొత్తం దేశాన్ని రాజ్యం అనాంము. దానిని నిలిపి ఉంచుకోడానికీ, నడిపించుకోడానికీ ఏర్పరచుకున్న ఒప్పందాన్ని రాజ్యాంగం అనాంము. ఆ ఒప్పందాన్ననుసరించి ఆ రాజ్యాన్ని కొనసాగించుకోడానికి ఏర్పరచుకున్న పాలనా విభాగాన్ని రూపొందించుకోడానికీ, కొనసాగించుకోడానికీ, అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోడానికీ ఏర్పరచుకున్న విభాగాన్ని రాజకీయం అనాంము.
ప్రస్తుత మన రాజ్యాంగ లక్ష్యం 'పౌరుల మధ్య సమానత్వ సాధన' అన్నదే. భారత రాజ్యాంగంలోని ప్రస్తావన - ప్రియాంబుల్‌ - అన్న భాగం మనమేర్పరచుకున్న లక్ష్యాలను, దానిని సాధించుకోడానికి ఎంచుకున్న వ్యవస్థ సాధారణ రూపాన్ని గురించి నిర్థిష్టంగా ప్రకిస్తోంది.
మనది,  సర్వసత్తాకమైన సమాజం - దేశం. అంటే మన దేశంపై, బయటవారి పెత్తనం ఏ రూపంలోనూ లేదు. అలాగే లోపలున్న ఎవరో కొందరి పెత్తనమూ దీనిపై ఉండదు. ఉండరాదు. అందుకోసమే మనం ప్రజాస్వామ్యాన్ని మన లక్ష్యాలకు తగిన వ్యవస్థగా ఎంచుకున్నాం. దీని సాధారణ రూపం ప్రజలందరూ ఈ మొత్తానికి సమానంగా యాజమాన్యపు భాగస్వాములు అన్నదే. మన రాజ్యాంగ నిర్మాతలు, మొత్తం సమాజాన్ని 3గా విభజించి, ఆ మూడు కోణాలలోనూ సమానత్వం సాధించుకొమ్మని ఉపదేవించారు. పైన చెప్పుకున్న సాంఘిక, ఆర్థిక, రాజకీయాలన్నవే ఆ మూడూ. అంటే, సాంఘిక సమానత్వం, ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం అన్నవి సాధించుకోవాలనుకుంటున్నామన్న మాట. దీనినే పారిభాషికంగా సాంఘిక, ఆర్థిక, రాజకీయ ప్రజాస్వామ్య సాధన అనాంరు.
మానవుని స్వభావాన్ననుసరించి స్వేచ్చ = స్వీయ ఇచ్చ = తనకున్న ఇష్టం, నెరవేరాలన్నది, నెరవేరుతూ ఉండాలన్నది  మిగిలిన అన్నింకంటే ముఖ్యమైన ఆకాంక్ష్యగా ఉంటుంది. సుఖశాంతులుండాలి. దుఃఖము, అశాంతి ఉండకూడదు అన్నదీ స్వేచ్ఛయొక్క వినియోగ రూపం. స్వఇచ్చ నెరవేర్పు అన్నది ఒంటరి జీవితంలో పూర్ణరూపంలో సాధ్యపడదు అన్న అవగాహన కలిగాక, స్వేచ్చా పరిపూర్తి అన్నది ప్రకృతితోనూ, సాి ప్రాణులతోనూ సహజీవనం చేయడం ద్వారా మాత్రమే ఏర్పడుతుంది అన్న అవగాహన కలిగాకనే మనిషి సహజీవనానికీ, అందుకు అవసరమైన సర్దుబాటుకు సిద్ధమైనాడు. పుచ్చుకోవడమొక్కదానిపైనే దృష్టిపెడితే కథ నడవదన్నది అనుభవం నుండి గ్రహించాక ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా మాత్రమే పూర్తిగా కాకున్నా, క్రమానుగతంగా ఎక్కువలో ఎక్కువ సుఖశాంతులనందుకోవచ్చని, తక్కువలో తక్కువ స్థాయికి దుఃఖాన్ని, అశాంతిని నియంత్రించవచ్చని తేల్చుకుని అందుకు అవసరమైన ఒక ఒడంబడికకు సిద్ధమైనాడు. దాంతో ప్రకృతిని, సాివారిని కాపాడుకుంటుంటేనే అవి తనకు ఉపయోగపడుతూ సుఖశాంతులకు కారకాలు కాగలుతాయని తెలిసి ఆ రకంగా ప్రవర్తించడానికి సిద్ధమైనాడు. ఇక్కడికిదంతా సంఘజీవితం ఏర్పడడానికి, సంఘజీవులుగా కొనసాగడానికి పూర్వరంగంగా ఉన్నదే. ఈ థవరకు మానవుని దృష్టంతా స్వార్థప్రయోజనాల నెరవేర్పు నుద్దేశించిందే. ఇక్కడివరకు ఆయా వస్తువులు, విషయాలు, వ్యక్తులపట్ల అవసరాలు తీర్చేవి, తీర్చనివి అన్న దృష్టినుండి ఏర్పడిన ఇష్టాఇష్టాలేగాని, ప్రేమ - ప్రతిఫలాకాంక్షలేని ఇష్టం అన్నది ప్రవేశించనే లేదు. ప్రేమకు తొలిరూపు, సహజరూపు, తల్లీబిడ్డా విషయంలో కనబరిచే వైఖరేననవచ్చు. అక్కడ బిడ్డ తనకేదో ఇస్తుందనిగానీ, తన అవసరం తీర్చుతుందని గానీ అనుకొని బిడ్డను ఇష్టపడదు తల్లి. కనుకనే మాతృప్రేమనే సహజ ప్రేమ - సహజాత ప్రేమగా చెబుతారు విజ్ఞులు.

ప్రేమంటే?!....

ప్రతిఫలం కోరని ఇష్టం - అంతేకాదు, దానికై తనను, తన అవసరాలను ప్టించుకోనంత ఇష్టం. దాని యోగక్షేమాలకై తనను తగ్గించుకొనేందుకు, తాను ఖర్చయ్యేందుకు సిద్ధపడేంత ఇష్టం, అందుకై శక్తి ఉన్నంతలో కష్టాలను, దుఃఖాన్ని, అశాంతినీ ఇచ్చేవాిని, భరించేందుకు సిద్ధపడేలా చేసే ఇష్టం. అర్థమవుతోందా మిత్రులారా! అదిగో ఆ క్షేత్రంలో వాడాల్సిన పదం 'ప్రేమ' అన్నది. అంతకు తగ్గిన ఏ ఇష్టాల విషయంలోనూ 'ప్రేమ' అన్న పదం వాడకూడదు.
ఇక భక్తంటే అటువిం ప్రేమకు పరాకాష్టస్థితన్నమాట. అంటే హద్దుల్లేని ప్రేమ. మరి దేనితోనూ పోల్చడానికి వీల్లేనంత ప్రేమ. ఇష్టమైన వాిలో దేనిని గానీ, అన్నింనైనా వదులుకోడానికి సిద్ధపడగలంత ప్రేమ. అదిగో దానినాంరు 'భక్తి' అని. అవసరాల కోసం దేవుడి వెంటపడేదాన్ని దైవభక్తి అనకూడదు. ఎటువిం స్వార్థ ప్రయోజనాల దృష్టి ఏర్పడి ఉన్నా వాికొరకు దేవుణ్ణి ఎంతగా ప్రార్థించినా, దేవుడి వెంటపడినా దానిని 'భక్తి' అనకూడదు. ఒక భయం కారణంగానో, ఒక ఆశ కారణంగానో దేవుణ్ని ఆశ్రయించడాన్ని 'భక్తి' అనకూడదు. 'లేనా - దేనా' ప్రక్రియ నడుస్తుంన్నంత కాలం 'నీకిదిస్తాను, నాకదివ్వు' అంటూ ఎన్ని మొత్తుకోళ్ళు, ఎంత పెద్దఎత్తున, ఎంతకాలం చేసినా దానిని 'భక్తి' అనకూడదు. ఇచ్చిపుచ్చుకున్నా, పుచ్చుకొని ఇచ్చినా, ఇచ్చిపుచ్చుకొనే సంబంధం ఉన్నంతవరకు ఉండాలని కోరుకుంటున్నంత వరకు దానిని వ్యాపారమనే అనితీరాలి. వ్యాపార స్వభావం ఉన్నంతవరకు అి్టదానిని దేనినీ భక్తి అననే కూడదు. అర్థమవుతోందా మిత్రులారా.
దైవభక్తి
భక్తిలో వ్యాపారం ఉండదు. స్వప్రయోజనాకాంక్ష ఉండదు. అి్టది ఉన్నంతకాలం దానిని 'భక్తి' అనకూడదు. ఇదర్థమైతేగాని, 'దైవభక్తి'కి అన్వయం చెప్పుకోవడం గానీ, దైవభక్తి ఉందా లేదా అతనిలోనన్నది పరీక్షించడం గాని కుదరదు.
ఉదా : ఒకవ్యక్తి స్వర్గం రావాలనో, నరకం రాకూడదనో దైవాన్ని ప్రార్థించడం (స్తుతించడం - వేడుకోవడం) చేస్తున్నాడనుకోండి. దానిని దైవభక్తి అనకూడదు. దేవుడు ఉన్నాడని నమ్మడం వేరు, దేవుణ్ని అమితంగా ఇష్టపడడం వేరు. ఉన్నాడనుకున్న వాళ్ళతోనే వ్యాపారమైనా చేసేది. కనుక దేవుడున్నాడని ఎంత గ్టిగా నమ్మినా దానిని దైవభక్తి అనకూడదు. ఒక్కమాట చెప్పనా? బైబిలు, ఖురానుల ప్రాతిపదికల్లోనే 'భక్తి' అనేది లేదు. ఆ రెండు ధోరణులు దేవుణ్ణి బండగా నమ్మడం తప్పనిసరి అంాయి. నమ్మకుంటే ఈ లోకంలోనూ, పైలోకంలోనూ శిక్షలు (నరకం) తప్పదాంయి. ఎన్ని మంచి పనులు చేసినా, నమ్మడం అన్నది లేకుంటే అవన్నీ నీకు నరకాన్ని తప్పించలేవు. స్వర్గాన్ని ఇప్పించలేవు అని అంాయి. కనుకనే ఆ రెండు థోరణులననుసరించేవారి దృష్టంతా నరకాన్నెలా తప్పించుకోవాలి? స్వర్గాన్నెలా ప్రాప్తించుకోవాలన్న దగ్గరే ఉంటుంది. ఆయా గ్రంథాలు చెప్పే మాటలలో స్వర్గం రాదని గానీ, నరకం పోదని గానీ అనుమానం వచ్చినా, అడిగిందిస్తాడో లేదోనన్న అనుమానం  వచ్చినా, ఆ థోరణిలోని దేవుణ్ని కాదని మరోథోరణిలోకి జారిపోవడం - చేరిపోవడం - చేస్తుాంరు ఆ రకమంతా. ఆయా గ్రంథాలు ఎలా నడవమంటే అలా నడవడానికి సిద్ధపడేదీ. ఆ క్రమంలో ఎవరినైనా చంపడానికి సిద్ధపడేదీ, స్వర్గ నరక సంబంధమైన ప్రతిఫలాల కొరకు మాత్రమే. ఆ ధోరణుల దేవుళ్ళున్నూ వారికి స్వర్గం ఇవ్వడం కొరకే, తనకోసం వారి ప్రాణాలనూ కొన్నామని విస్పష్టంగా ప్రకించారు. ఆయన ప్రయోజనం ఆయనది. వీరి ప్రయోజనం వీరిది. కనుక బైబిల్‌, ఖురాన్‌ సంప్రదాయాల ప్రాతిపదికల్లోనే 'భక్తి'కి తావులేదు. అంతా వ్యాపారపు గొడవే.
'నన్ను ప్రార్థించండి, నేను చెప్పిన పనులు చేయండి. ఇతరులను ప్రార్థించకండి. వారు చెప్పిన పనులు చేయకండి. మీకిష్టమున్నా, లేకున్నా ఈ మార్గంలోనే నడవండి. ఇతర మార్గాల నడవకండి. ఈ రిెంకీ మీకు తగిన ప్రతిఫలం ఉంటుంది'. అన్నదే ఆ ఇద్దరి దేవుళ్ళ ప్రతిపాదన. నాయీ మాటలు సత్యాలు కాదనిపిస్తే ఆ రెండు గ్రంథాలను దగ్గరెట్టుకొని చూద్దాం రండి.
ఒక్క భారతీయ ఆస్తిక సంప్రదాయంలోనే ఈ స్వర్గ నరకాల గొడవతో పాటు ఈలోక బోగాలు వద్దు, స్వర్గలోక భోగాలు వద్దు. 'ఇహాముత్ర ఫలభోగ విరాగం'; అన్న మూడో పంథాను గురించిన ప్రస్తావన ఉంది. ప్రతిఫలాకాంక్షలేని త్యాగభావన ఉంది.
ఆవేశంలో చేసే త్యాగాలు, అవగాహనతో చేసే త్యాగాలు అని త్యాగరూపాలు రెండు. అందులోనూ అవగాహనతో చేసే త్యాగరూపం దగ్గరే 'భక్తి' నిర్వచనానికి తగిన లక్షణం ఉంటుంది. ప్రపంచంలోని - విశ్వంలోని - సమస్తాన్ని ఒకప్రక్కనుంచి, దేవుణ్ని ఒకప్రక్కనుంచి రిెంలో ఏదోఒకదాన్నే కోరుకోమన్నప్పుడు దేవుడు చాలు అని సుస్థిరంగా, నిస్సందేహంగా ఎటువిం ఊగిసలాట లేకుండా, క్షణం కూడా ఆలోచించకుండా నిర్ణయించుకోగలిగినవాణ్ణే దేవునియందు అమితమైన ఇష్టం - భక్తి - కలిగినవాడనాలి. ఇంతకు ఏమాత్రం తగ్గినా దానిని భక్తి అనిమాత్రం అనకూడదు. అతణ్ణి భక్తుడనీ అనకూడదు.
భక్తి పేరున జరుగుతున్న వ్యాపారం
ఇప్పుడు ఆస్తిక లోకంలో జరుగుతున్నదంతా వ్యాపారమే. ఇందులో 'భక్తి' అనడానికి తగిన అంశాలు దాదాపు లేవనే అనవచ్చు. అందులోనూ మంచి వ్యాపారం అనదగ్గ భాగమూ కొద్దిగానే ఉంోంది. దేవుని పేరున చేసినదెంతో అంతకు తగిన ఫలితం వస్తే చాలని స్థిరంగా నిర్ణయించుకొని, దేవుడా! చేసినదానికి సరిపడా ఇవ్వు చాలు అనగలిగి, అంతకంటే అధికం పుచ్చుకోడానికి అంగీకరించని వారి వ్యాపారమే మంచి వ్యాపారం అవుతుంది. వీలైనంత తక్కువిచ్చి, వీలైనంత ఎక్కువ రావాలనుకొనే, పుచ్చుకొనే వ్యాపారం, అది వ్యాపారంగానూ తప్పుడు వ్యాపారమే. ఇది వ్యాపారపు సాధారణ సూత్రం. మారకం సమాన విలువల మధ్య జరిగితేనే, మారకం ధర్మబద్దంగా - న్యాయసమ్మతంగా - నీతిమంతంగా జరిగిందనగలం అన్నది అర్థశాస్త్ర ప్రాతిపదికలో ఒకి.
బైబిలు పాత నిబంధన, ఖురాను అన్నవి రెండూ దైవమార్గంలో ధన, మన, ప్రాణాలనిచ్చి స్వర్గ ప్రవేశానికి అనుమతి పొందండనే చెబుతున్నాయి. ఒకీ అరా మాటలు నాకంటే అధికంగా ప్రేమించదగినవాడు నీకుండకూడదు. అలా ఉంటే నీకిక స్వర్గానికి చెల్లుచీనే ఇవ్వబడుతుందని, రెండు గ్రంథాలలోని దేవుళ్ళు స్పష్టంగా ప్రకించారు. ఇక్కడుండగా ఆయన్ను ఇష్టపడడం నిజంగా ఆయనంటే ప్రేమ ఉండడం కాదు. ఇష్టపడకుంటే స్వర్గం రాదు, సరికదా, నరకం వస్తుంది కూడా అన్నదే. ఇంతకూ వీళ్ళంతగా స్వర్గాన్నెందుకు కోరుకుంటున్నారు? ఆ దేవుళ్ళిద్దరూ స్వర్గాన్నంతగా ఆశచూపించి తమకు లొంగి ఉండేట్లు ఎందుకు చూచుకుంటున్నారు?
మీలో యోచనాశీలత ఉంటే గింటే, బైబులు, ఖురానుల స్వర్గాల సమాచారాన్ని ఆ గ్రంథాల నుండే స్వీకరించుదాం రండి. మీలో ఆ పనికి సిద్ధపడేవారుంటే మండలి అందుకు సిద్ధంగా ఉంది. ఆ పనికి మరో సమయాన్ని కేయించుకుందాం. ఒక్కమాట! ఇప్పికీ నా దృష్టికందినంతలో బ్రతుకుల్లో ఆత్మనియంత్రణ అవసరాన్ని గుర్తించిన వివేకులు అంగీకరించరానివే ఆ రెండు స్వర్గాలూ. ఇది సందర్భం కాదుగాని, నిజానికి హిందూ ఆస్తిక సాహిత్యం - ఖురాను సాహిత్యం - లోని స్వర్గమూ బుద్ధిమంతులంగీకరించకూడనిదే. ఇదీ గుర్తుంచుకోండి.
ఓ ఏదో కావాలనుకొని దానికోసమై ఏ దేవుణ్ణిగాని, దేవతలను గాని, దయ్యాలను ప్రార్థించడం గాని, వారికి నచ్చే తృప్తికలిగే పనులు చెయ్యడం గానీ 'భక్తి' క్రిందికి రానేరావు. అవన్నీ వ్యాపార సంబంధమైన పనులే.
దేశభక్తి
దేశభక్తంటే తెగతెలిసినోరిమల్లే, చాలా మ్లాడేశారు రంజిత్‌ ఓఫిర్‌ గారు. దాందేముంది! అది ఇట్టే పాించేయగలంత చిన్న విషయమన్నట్లుందాయన ప్రలాపం. ఆయనగారి కుటుంబమే దైవభక్తి, దేశభక్తి సమపాళ్ళలో మేళవించిన్టిదని మొదల్టెాడా పరిచయకర్త ఎవరోగాని, ఓఫిర్‌ గారిని గురించిన హైందవ క్రైస్తవం అట్ట చివరి పేజీలోని - పరిచయ వాక్యాలను. ఆ కొద్దిపాి పరిచయ వాక్యాలలోనే ఓఫిర్‌ గారిలో పలు అసాధారణ గుణ, క్రియా సామర్ధ్యాలున్నట్లు రాసేశారు. ఆయనే రాశారో, ఈయనే రాపించుకున్నారో గాని ఓఫిర్‌గారు వాిని ప్రచురించడాన్ని బ్టి ఆ మాటలాయనగారికి అంగీకారమైనవే ననుకోవలసి వస్తోంది. అదలాఉంచి దేశభక్తి గురించి ఏమంటున్నారో చూడండి.
1. పేజీ 34 - మనలో దేశభక్తి ఉంటే విధిగా వేదభక్తి ఉండాలి. ఉంటుంది.
2. పేజీ 49 - బైబిలు మ్లేచ్చుల మతం, ఆ గ్రంథములో ఏముంటే మాకెందుకు? మనకు వేదంలోనే అన్నీ వ్రాయబడి ఉన్నాయి, అలాటప్పుడు ఆ అంటరాని వాళ్ళ మతగ్రంథం మనకెందుకు?.... బైబిలు సంగతి మాకు చెప్పకండి! అంటూ హడావిడిగా కళ్ళూ చెవులూ మూసుకోవడం ఈ మధ్య దేశములో దేశభక్తిగా చలామణి అవుతోంది.
గమనిక : ఇంత విరుద్ధమైన మాటలు, అందులోనూ కొన్ని ఎకసెక్కపు మాటలు మ్లాడడాన్ని బ్టి చూస్తే ఆయనలో దేశభక్తి లేకపోగా విదేశీయానురక్తి బాగానే ఉందనిపిస్తోంది. మ్లేచ్చుల్నీ, అటునుండి దిగుమతైన బైబులును అంగీకరింపక పోవడమే దేశభక్తి లేనట్లన్నంతగా పేట్రేగిపోయారాయన. బైబిలును వినం అనడమే కుసంస్కారమనేంతకు తెగబడ్డారు కూడానూ. ఇంతకూ 'బైబిలు మేము వినం, అది మాకక్కరలేదు' అనడమే దేశభక్తి అని ఎవరన్నారో, ఎవరనుకుంటున్నారో చెప్పకపోగా, అది అస్పృశ్యుల మతగ్రంథమని ఎవరో అంటున్నట్లు రెచ్చగొట్టే మాటలూ మ్లాడి, ఇక్కడి వాళ్ళ మధ్య చిచ్చుపెట్టే దుర్మార్గపు పనికీ ఒడిగ్టారాయన. ఇన్ననీ దేశభక్తి, దైవభక్తి కూడా గుండెలనిండా తెగనిండి పొంగిపొర్లిపోతున్నదని చెప్పుకోడానికి వెనుకాడకపోడాన్నేమనుకోవాలి?
ఈ నాలుగు ముక్కల్ని బ్టీ...
1. ఆయనకు భక్తంటే ఏమిో అర్థం కాలేదని
2. దైవభక్తంటే ఏమిో తెలియనే తెలియదని, ఆయనలో అది లేనేలేదని
3. వేదభక్తి లేదని, ఆ మాటలు అమాయకపు మంద ముంద్టెి, వారిలో కొందరినైనా బైబిలు భక్తుల్ని చేయాలన్న దుగ్ద మాత్రం చాలాఉందనీ తేటతెల్లమయ్యింది.
అయ్యా ఓఫిర్‌జీ! రిెం మీద భక్తి ఉండడం అసాధ్యం. ఏ ఒక్కదానిపైనైనా భక్తి - అపరిమిత ప్రేమ - ఉందంటే ఇక దేనిమీదా దానితో సమానమైన ప్రేమలేదనే అర్థం. ఎలా ఏ రెండూ ప్రథమ స్థానాన్నాక్రమించలేవో. దేనిని గానీ 'ఒకవది' అన్నామంటే మరేదీఒకటవది కాజాలదనీ ఎలా నిర్ణయించవచ్చో, అలాగే దేనిపైగానీ 'భక్తి' అంటే అన్నింకంటే మిక్కిలి ఎక్కువ ప్రేమ ఉన్నదన్నామంటేనే, మరిక దేనిపైనా అంతి ప్రేమ లేదని అంటున్నామనే.
ఉదా : దేవుణ్ణి - దేశాన్ని ఒక దగ్గర్టిె దేనిపైన ఎక్కువ ప్రేమ నీకని అడిగితే రిెంపైనానూ, అని అననే కూడదు. ఏదో ఒకదానినెంచుకొంటే మిగిలింది రెండవ స్థానంలోకి పడిపోయినట్లే మన ప్రస్తుత సందర్భానికీ ఈ సూత్రాన్ని అన్వయిస్తే 1. మీకు వేదాల మీద కంటే బైబిలు మీదే ఎక్కువ ఇష్టం. ఈ దేశస్తుల పైన కంటే మ్లేచ్చులపైనే అనురాగమధికం. ఈ దేశంలోని ఆసేతు సీతానగంలోని ఆయా స్థలాలకంటే యిజ్రాయేలు, బెత్లెహాం లంటేనే మక్కువ. ఈ వాస్తవాలు మీరెంతగా వేదాభిమానిననే ముసుగు చాటున కప్పెడదామనుకున్నా సందుల్లోనుంచి తొంగిచూస్తేనే వున్నయ్‌.
మనమిప్పుడు చదువుకుంటున్న, నేర్చుకుంటున్న, వాడుకుంటున్నవన్నీ వేదాలలోనుండి తెచ్చుకున్నవేనా? మ్లేచ్చుల నుండి తెచ్చుకున్నవా? న్యాయంగా ఆలోచించండి! న్యాయంగా మ్లాడండి అనడంలోనే మీ దేశభక్తి, మీ వేదభక్తి ఏపాిదో కళ్ళకు క్టినట్లు అర్ధమైంది. ఇంతలేసి మాటలు వెనకాముందూ చూసుకోకుండా రాసి ప్రచురించేసిన మీకు అి్ట ఆధునిక విద్యలేమైనా బైబిలు నుండి పుట్టుకొచ్చాయా? అని వెనుదిరిగి చూచుకోవాలని అనిపించలేదన్నమాట! చీికి మాికి మిమ్ము పలకరిస్తూ ఆయా సత్యాలను ప్రత్యక్షపరిచే ఆ యేసుకైనా ఇది కనపడలేదా?
అదలా వుంచి దేశభక్తికీ, వేదభక్తికీ, వీి అవసరం ఏమొచ్చిందో, బైబిలును వినడానికీ, వినకపోవడానికీ, దేశభక్తి ఉండడానికీ, లేకపోవడానికీ సంబంధమేమిో విశదపరిస్తే తెలుసుకొనేందుకు యత్నిస్తాను.
అత్యంత ప్రాచీన సాహిత్యమైన వేదంలో చెప్పబడ్డ విషయాలు అన్నీగాని, కొన్నిగాని అనంతర కాలంలో వచ్చిన గ్రంథాలలో కనపడితే, అవన్నీ వేదము నుండే వాిని సంగ్రహించినట్లుగానీ, వేదంలో వున్నవాినే ఆ తరువాతి వారు గమనించినట్లు గానీ అర్థం చేసుకోవాలి. ఏమాత్రం ఇంగితం పనిచేస్తున్నా వేదం దగ్గరకొచ్చేయాలి. వేదంలో లేనివేవైనా తరువాత వచ్చిన వాిలో ఉన్నప్పుడే వాినాశ్రయించాలి. వివేకవంతులలోనేగాక, సామాన్య ఇంగితం వున్నవారిలోనూ ఇది నిర్వివాదాంశం. అలా కనీస ఇంగితాన్ని కనబరచకుండా వేదంలోనివే బైబిలు లోనూ వున్నాయి. అదీ 100 శాతం సమానంగా వున్నాయి అనంటూనే వేదాన్ని విడచి బైబిలు దగ్గరకు రమ్మనడాన్నేమనుకోవాలి? ఇదంతా కూడా దేశభక్తేనంటే ఒప్పేసుకోవాలన్న మాట. మ్లేచ్ఛుభక్తి, బైబిలు భక్తి, యేసుభక్తే ఇక్కడ దేశభక్తన్నమాట మీ ఉద్దేశ్యంలో!?! ఇదంతా చూస్తుంటే భర్తుృహరి సుభాషితాల్లోని ఒక పద్యసారం గుర్తొస్తోంది.
తెలివి యెకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి చరించితిన్‌ తొల్లి, ఇపుడుజ్వలమతుల సన్నిధి నించుక బోధశాలినై తెలియనివాడనైతి హతమయ్యె నితాంత గర్వముల్‌.
ఆ పద్యములోని వ్యక్తి, అనంతరమైనా తన స్థితి నెరిగి గర్వాంధత్వాన్ని వదిలించుకున్నాడు. మరి మీ పరిస్థితేమిో...?
గమనిక : దేశభక్తి గురించి రాయడం మొదల్టెాక ఇక్కడికొచ్చేటప్పికి మీ మాటలు గుర్తుకు రావడంతో కలం ఇలా సాగింది. మీ విషయమై ఇంకా మ్లాడాల్సే ఉన్నా శీర్షికాంశం ప్రధానం కావడంతో దీన్నిక్కడికాపి, ప్రధాన విషయంలోకి వస్తున్నాను. మీరు కావాలనుకుంటే, సిద్ధపడితే మీ విషయాలు మళ్ళా మ్లాడుకోవడానికి నేను సిద్ధమే.
దేశభక్తి
1. భక్తంటే ఏదో ఒకదానియందు అమితమైన - శ్రేష్టమైన - అంటే మరోదానితో పోల్చడానికి వీల్లేనంత ప్రేమ అని ఆ పదం నిర్వచనం చెప్పుకున్నాం గుర్తుంది కదూ!
2. దేశమంటే ఎ) నిశ్చిత సరిహద్దులలోపు వున్న ప్రకృతి సంపదంతానూ, బి) అందులో నివశిస్తున్న ప్రజలందరున్నూ, సి) వారినందరినీ నిలిపి, కలిపి, నడిపించే ఒప్పందమున్నూ కలసిన రూపం అని నిర్వచించుకున్నాం. ఇప్పుడు దేశభక్తంటే ఈమూిపైనా, ఈమూడూ కూడిఉన్న మొత్తంపైనా అమితప్రేమ కలిగిఉండడమని అర్థం. కొన్ని ఉదాహరణల ద్వారా దేశభక్తిని వివరించుకుందాం.
ఉదా : 1. మనిషి తనను తాను బాగా - అతిగా - ప్రేమించుకుంటుండాడు. అనుకోకుండా దేశభద్రతకు ప్రమాదం వచ్చిందనుకుందాం. తనను కాపాడుకోడానికి దేశాన్ని ప్టించుకోకపోవడం, దేశాన్ని కాపాడడానికి తాను మరణించడానికీ, కనీసం కష్టాలు పడడానికీ సిద్ధం కావడం. ఇందులో ఏది దేశభక్తి క్రిందకు వస్తుంది.
2. తన కుటుంబ శ్రేయస్సు - దేశ శ్రేయస్సులన్న వాిలో ఒకి వదులుకోవాల్సిన పరిస్థితి దాపురిస్తే ఏ వైఖరిని అవలంభించిన వానిని దేశభక్తిగలవాడనగలం.
3. తన కులానికి ప్రాధాన్యతనివ్వాలా? దేశానికి ప్రాధాన్యత నివ్వాలా? ఏదో ఒకి ఎంచుకోవలసి వస్తే ఎి్ట నిర్ణయం తీసుకున్నవాణ్ణి దేశభక్తుడనగలం.
4. తన మతానికి - మత గ్రంథానికి; దేశ సమగ్రతకు - రాజ్యాంగానికి, దేనికి ప్రధమగణ్యతనిస్తే దేశభక్తి క్రిందకు వస్తుంది. మత గ్రంథం చెబుతున్న దానికి - రాజ్యాంగం చెబుతున్న దానికీ తేడావచ్చి, ఏదో ఒక్కదానినే అనుసరించవలసిన విపత్కర పరిస్థితి వస్తే దేశభక్తుడు దేనిని అనుసరించడానికి సిద్ధపడతాడు? (పడాలి?)
5. మత గ్రంథాలు చూపుతున్న ఆరాధనా స్థానాలు - దేశము, అన్నవాిలో దేనిపై మీ ప్రేమ అధికంగా ఉంటే నీకు దేశభక్తి ఉందనడం కుదురుతుంది? ఏదోఒకదాన్ని విడవవలసి వస్తే, దేశం కోసం నీ ఆరాధనా స్థానాన్ని విడుస్తావా? దానికోసం దేశాన్ని విడుస్తావా? దేశభక్తుడేమిచేస్తాడా సందర్భంలో.
6. నీ దేవుడు చెప్పిందానికి - రాజ్యాంగం చెబుతున్న దానికి తేడావస్తే నీవు దేనివెంట నడుస్తావు.
గమనిక : యోచనాశీలురైన మిత్రులారా ! మన రాజ్యాంగం కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, లింగాన్ని బ్టి వ్యక్తుల మధ్య వివక్ష చూపరాదోంంది. ఈ నేలపైకి పరాయివాళ్ళెవరు దండెత్తివచ్చినా, దీనికోసమై పోరాడడానికి, దీనిని రక్షించుకోడానికి ప్రతి వ్యక్తీ సర్వదా సన్నద్దుడై ఉండాలోంంది రాజ్యాంగం. సమానాభివృద్ధి, సమగ్రాభివృద్ధి సాధనకై, సోదర భావంతో సమైక్యంగా, అఖండంగా కొనసాగమనోంంది రాజ్యాంగం.
1. ఈనేల కోసం, 2. ఈ దేశ ప్రజల కోసం, 3. ఈ రాజ్యాంగపు అమలు కోసం, వీికి అడ్డుపడే వేినైనా వదులుకోవడానికి, ఈ మూినీ అమితంగా ఇష్టపడడానికి సిద్ధమై ఉండడమే దేశభక్తి కలిగి ఉండడమంటే.
నీకంటే, నీ కుటుంబం కంటే, నీ కులం కంటే, నీ మతం కంటే, అది చూపించే స్వర్గం కంటే, నీ ప్రాంతం కంటే, నీ పార్టీకంటే దేశమంటే నీకు అధికతమ ప్రేమ ఉండడాన్నే దేశభక్తి అని అంారు. ఈ దేశంలో ఉన్న ఏ మత గ్రంథంపైన ప్రేమ లేకున్నా దేశభక్తి ఉండడానికేమీ అభ్యంతరం ఉండదు. మొత్తం మొత్తం మత గ్రంథాల్ని ప్రక్కకు ప్టిెనా, దేశభక్తికేమీ ఆటంకం ఉండదు.
అదేమరి! ఈ రాజ్యాంగాన్ని ప్రేమించకున్నా
ఈ దేశాన్ని ప్రేమించకున్నా
ఈ ప్రజలందర్నీ సమానంగా ఇష్టపడకున్నా
నీ దేశభక్తి ఇంకా అరకొరగానే ఉందన్నట్లు అదింకా చక్కజేసుకోవలసిందిగానే ఉన్నట్లు
ముఖ్య గమనిక : ఇక్కడి వరకు వ్రాసేటప్పికి ఒక మిత్రుడు నన్ను కలవాలని ఇంికొచ్చాడు. ఏమి రాస్తున్నావని అడిగాడు. ఈ వ్యాసాన్నిచ్చి చదవమన్నాను. చదివి ఒకమాటడగనా  అన్నాడు. అడగమన్నాను. ఇంతకూ నీవు దేశభక్తుడవేనా? అనడిగాడు.
అడగవలసిన ప్రశ్నే అడిగాడనుకొని, కొద్దిసేపు నన్నునేను పరిశీలించుకునే పనిచేశాను. సమాధానంగా ఏమిచెబితే నిజం చెప్పినట్లవుతుందో స్పష్టంగా గోచరించింది.
మిత్రమా! నాకు దేశభక్తంటే ఏమిో స్పష్టంగా తెలుసు. దేశభక్తుడనడానికి తగినవానిగా నన్ను నేను రూపొందించుకొనే ప్రయత్నంలో ఉన్నాను. సాధన సరైన దిశలోనే సాగుతూ వస్తోంది. చాలావరకు పరిమిత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలకే ప్రధమస్థానం మానసికంగా ఇవ్వగలుగుతున్నాననిపిస్తోంది. ఆచరణలో మాత్రం కొన్ని లోటుపాట్లు కనిపిస్తున్నాయి.,ముఖ్యంగా కులం, మతం, ప్రాంతం, వర్గం అన్న వాికి ప్రాధాన్యతనివ్వకుండా దేశం అన్న దృష్టితో ఉండగలుగుతున్నాను. కానీ నిక్కచ్చిగా సందర్భం ఎదురుపడితే అన్ని విషయాలలో దేశానికి, సమష్టికి, రాజ్యాంగానికి పెద్దపీట వేయగలనా? లేదా? అన్నది పరీక్షించి చూసుకోని విషయంగానే ఉందిప్పికీ. దేశభక్తి సాధనలో ఉన్నానన్నది మాత్రం నిజం.
మానవ హననానికి దారులుతీయగల మతమార్పిడులు - 4
యోచనాశీలురైన మిత్రులారా !
ఈ శీర్షికాంశాలను శ్రద్ధగా ప్టిచూస్తున్న వారికీ, ఈ చర్చలో నేరుగా పాల్గొంటున్న వారికీ కూడా రాత రూపంలో, జరిగిన, జరగనున్న విషయాలు అందుబాటులో ఉంచాలన్నదే నా ఉద్దేశము. గత సంచికలో అంటే వివేకపథం 218 - 20వ పేజీలో, ఈ వేదికకు - 'వాస్తవాల వెలికితీత' అన్న పేరెట్టుకుందాం అనన్నాను. ప్రధాన శీర్షికగా మొదట ఆరంభించిన దానినే ఉంచితే బాగుంటుందనిపించటంతో ఈ సంచికలో ఈ వ్యాసానికి ఆపేరే ప్టోను. ధారావాహికగా - ఆక్రమంలో - ఇది నాల్గవది. మనయత్నమంతా 'వాస్తవాల వెలికితీత' కు సంబంధించినదేనన్నదీ వాస్తవమే. ఆ దృష్టినుండే ఈ వ్యాస పరంపరను పరిశీలిస్తుండండి. ఈ విషయాలపై క్రమంగా జరుగుతుండే చర్చలలోనూ అభిలాష, తపన, శ్రద్ధ ఉన్నవాళ్ళు పాల్గొనండి. అయితే వినడానికో, చూడడానికో గాక, ఎంపిక చేసుకున్న విషయాలపై తగినంత అధ్యయనం చేసుకొని రాగలిగిన వాళ్ళకే ప్రవేశం ఉండుందిందులోనన్నది గమనించండి.
ముందనుకున్న ప్రకారం 18, 19 తేదీలలో చర్చలో పాల్గొనడానికి రావలసిన వాళ్ళంతా చేరారు. రెండు రోజులు జరిగిన చర్చ వివరాలను సంగ్రహంగా మాత్రమే ఇక్కడ పొందుపరుస్తున్నాను. చర్చనంతా వీడియో రికార్డు చేశాము కనుక మొత్తాన్ని యథాతధంగా పరిశీలించగోరిన వారా'సిడి'లను తీసుకొని చూడండి.
18వ తేదీ - బైబిలు ఆది కాండంలోని విషయాల శాస్త్రీయతేపాిది? అన్నది చర్చనీయాంశం
ఓ మనష్షే గారు ప్రధాన వక్తగా, ప్రతిపాదకునిగా ఉన్నారు. వేథాస్త్రాలెరిగిన వారే ఎరుగరు సృష్టిరహస్యం అంటూ మొదల్టెారాయన. ఆయనగారి జీవనయానంలో అనేకులు తారసపడటం, అనేక ప్రశ్నలు ఎదురవడం - రకరకాల ఆలోచనాథోరణుల గుండా ప్రయాణిస్తూ కడకు క్రైస్తవునిగా మారి స్థిరపడటం జరిగిందన్నారు. క్రైస్తవునిగా సాగుతున్న థలోనే, బైబిలు మొది 12 అధ్యాయాలు కల్పితాలని ఒకరనగా, వాి నిజానిజాలు తెలుసుకోవాలని పరిశోధన మొదల్టెాను. ఆ పరిశోధనాంశాలనే 'ఆదియందు' అన్న పుస్తకంలో వ్రాశాను.
ఓ పాత నిబంధన మొది '5' పుస్తకాలు మోషే రాసినవన్నది సాంప్రదాయం. దీనినే తౌరాతు లేదా ధర్మశాస్త్రం అనాంరు. సృష్టిజరిగాక కొన్ని వందల సంవత్సరముల తరువాతి వాడయిన మోషేకి సృష్టి ఎలా జరిగిందన్న విషయాలు ఎలా తెలిసుాంయన్నది ఒక ముఖ్యమైన ప్రశ్నగా ఉంది. దానిపై మనష్షేగారు : మోషే దేవుణ్ణి అడిగి ఉండాలి. దేవుడు అతనికి తెలియపరచి ఉండాలి. అంటూ తనదైన శైలిలో ఒక సమాధానం చెప్పారు. ఆ మాటంటూనే వారు ఆదికాండంలోని సృష్టిక్రమంలో ఉన్న 6 రోజుల విషయంలో ఒక క్రొత్తతరహా ప్రతిపాదన చేశారు.
ఓ నిజానికి సృష్టి ఎప్పుడు జరిగిందో, ఎంతకాలం జరిగిందో మనకు తెలియదు. ఆది కాండం 1,వ అధ్యాయంలోని ఆరు దినాలు దేవుడు సృష్టించిన కాలాన్ని తెలిపేవి కావు. అవి మోషే వివరాలు తెలుసుకొని రాసిన కాలానికి చెందినవి. అన్నదే ఆ ప్రకటన. ఆ రకమైన వివరణ ఆయన గారెందుకు చేశారో, దానిని శాస్త్రీయమైన ప్రతిపాదనగా ఆయనగారెలా నిర్ధారిస్తారో చూడాల్సి ఉంది.
ఓ మాటల సందర్భంలో మనష్షేగారు ఆధునిక, భౌతిక, విజ్ఞానశాస్త్ర ప్రస్తావన చేశారు. విశ్వావిర్భవాన్ని గురించి రెండు థియరీలు వున్నాయి. 1. స్టడీ స్ట్‌ే థియరీ (యధాస్థితి వాదం), 2. వ్యాకోచ సిద్ధాంతం అంటూనే జీవపరిణామ సిద్ధాంతం స్టడీస్ట్‌ే థియరీ క్రిందకి వస్తుందన్నారు.
ఓ 'థియరీ' అంటే వాస్తవం కాదని, అదింకా ప్రయోగాత్మకంగా  నిర్ధారించవలసిందిగానే ఉంటుందనీ, ప్రయోగాలు పూర్తయ్యాక దానిని 'లా' అంారని థియరీ అనరని అన్నారు.
ఓ ఐన్‌స్టీన్‌ రిలేివిీ థియరీ ద్వారా పదార్థం నశిస్తుందని రుజువైందనీ రాశారాయన పుస్తకంలో.
ఓ యురేనియం అర్థాయుష్షు 10 లక్షల సంవత్సరాలనీ, అంతకాలానికైనా అందులో 1/637వ వంతు మాత్రమే సీసంగా మారుతుందని అన్నారు.
ఓ మనకు దగ్గరి నక్షత్రం 3 1/2 కాంతి సంవత్సరాల దూరంలో ఉందన్నారు.
ఓ సృష్టి జరిగి 2,000 కోట్ల సంవత్సరాలయ్యిందోంంది సైన్స్‌ అనీ అన్నారు.
ఓ బైబిలు ప్రకారం సృష్టి జరిగి క్రీ.పూ. 4004 సంవత్సరములని చాలామంది అనుకుంటుాంరు. అది సరికాదు. నిజానికి బైబిలు సృష్టి ఎప్పుడు జరిగిందో చెప్పదు. అది సైన్స్‌ గ్రంథమూ కాదు. చరిత్రా కాదు. సృష్టి విషయం మనకు అర్థం కాలేదనాల్సిందే కాని తప్పనకూడదన్నది నా అభిప్రాయం.
ఓ మోషే ఆదామునుండి 14, 15 శతాబ్దాలకు చెందిన వాడు. అంటే క్రీ.పూ.2500 సంవత్సరముల నాివాడు.
సురేంద్ర : - నిజానికీ విషయాలన్నీ ఒక్కోదాన్ని తీసుకొని విచారించాల్సి ఉంది. నా అవగాహన ప్రకారం ఆయన వెల్లడించిన అభిప్రాయాలలో కొన్నిదోషాలున్నాయి.
ఉదాహరణకు : 1. పరిణామ సిద్థాంతం స్టడీస్ట్‌ే థియరీ క్రిందికి రావడమేమి?
2. సాపేక్ష సిద్ధాంతం పదార్థం నశిస్తుందని నిరూపించడమేమి?
3. సృష్టి జరిగి 2000 కోట్ల సంవత్సరములని సైన్స్‌లో ఎక్కడుంది?
4. బైబిలు సృష్టిక్రమంలోని 6 రోజులు మోషే రచనా కాలాన్ని తెలుపుతాయనడమేమి?
5. దేవునికి బహుళ వ్యక్తిత్వాలుండడం, దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదన్న యోహాను సువార్తను చెపుతూనే దేవుడు యెహోవా వ్యక్తిగా ప్రత్యక్షమైనాడు అబ్రహాముకు అనడమేమి?
ఓ బైబిలు మూల భాషలోని కొన్ని పదాలకు అనువాదంలో లోపం జరిగింది. అలాిం సందర్భాలలో మూలంలో ఏమని ఉందో చూడాల్సి ఉంటుంది అంటూ మధ్యాహ్నం ప్రసంగం ప్రారంభించారు మనష్షేగారు. వారికి వత్తాసుగా జగదీష్‌, శ్రీధర్‌, తిమోతి........ వగైరాలు మ్లాడుతూ వచ్చారు. వారంతా క్రైస్తవ ప్రచారకులుగా జీవితాన్ని కొనసాగిస్తున్న వారే.
సృజించెను అన్న మాటకు, చేసెను, నిర్మించెను, ఆయను అన్నమాటలకూ చాలా తేడా ఉంది. సృజించెను అన్న మాటకు మాత్రమే శూన్యమునుండి ప్టుించెను అన్న అర్థము వస్తుంది. మిగిలిన వాికి, ఉన్నదానినే అలా మార్చాడన్న అర్థం వస్తుంది. ఆదికాండంలోని మొది వచనాలలోని  భూమి శూన్యముగను, నిరాకారముగను ఉండెను అన్నప్పుడు మూలభాషలో 'ఆయను' అన్న అర్థాన్నిచ్చే పదముంది. యెషయా గ్రంథంలోని 45 : 18 వచనంలో, నిరాకారముగ నుండునట్లు ఆయన దానిని సృజింపలేదు. నివాసస్థలమగునట్లుగా దానిని సృజించెను. అని ఉందిగనుక దేవుడు ఆకారంతోనే దాన్ని సృష్టించాడు గాని, అది అనంతరం నిరాకారంగా అయ్యింది.
సురేంద్ర :- ఒక గ్రంథంలో విరుద్ధాభిప్రాయాలున్నాయని గానీ, లేవని గానీ నిర్ణయించాలంటే ఆ గ్రంథం ఏదేని ఒక విషయంపై ఏ విధంగా -  రకరకాలుగా - చెప్పిందో లేదో చూడడమన్నదొక్కటే పద్ధతి. నాకు తెలిసి బైబిలులో అలాిం వాక్యాలు అనేకం ఉన్నాయి. అలాి వాిని భిన్నాభిప్రాయాలుగా స్వీకరించాలే గాని, దానికిది అర్థం, దీనికది అర్థం అంటూ విపరీత అన్వయాలు చేయనే కూడదు. ఉన్నదోషాల్ని చూడనొల్లనివారూ, కప్పిపుచ్చాలనుకునే వారూ మాత్రమే సాగదీసే పనో, మడచి దోపే పనో చేస్తూ వైరుద్ధ్యాలు లేవని చూపడానికి నానాయాతన పడుతుాంరు. పైగా అలాి సందర్భాలలో, ఎదుటవాళ్ళకాగ్రంథం అర్థం కాలేదనేందుకూ, తనకు మాత్రమే అర్థమైందనేందుకూ అడ్డగోలుగా మ్లాడటం మొదలెడతారు.
ఒక గ్రంథంలో దోషాలున్నాయా? లేదా? అన్నది నిర్ణయించుకోడానికి అనుసరించాల్సిన భాషాపరమైన సాధారణ నియమాలను ప్టించుకోకపోవడమే ఆ రకం వారంతా చేస్తుండే తప్పు. అదే పొరపాటు ఈ సమావేశంలో పాల్గొన్న బైబిలు పక్షంవాళ్ళు చేశారనిపించింది నావరకు నాకు.
గమనిక : ఇదొకింత సాహసంతో కూడిన ప్రకటనే అయినా, దీనిపై విచారణకు, నా మాటసరైందేననడానికి తగిన ఆధారాలు చూపే బాధ్యతవహించడానికీ నేను సిద్ధంగా వున్నాను. అందుకు మీరెవరైనా సిద్ధంకావచ్చు. బైబిలు, సృష్టి విషయంలో రెండు రకాలుగా మ్లాడుతోంది అన్నది భాష ప్రకారంగా చూస్తే నిర్వివాదాంశం. అది బైబిలును నెత్తికెత్తుకున్న వాళ్ళకూ అర్థమవుతూనే ఉందికనుకనే, దానర్థం అదికాదు, ఇది అంటూ వివరణలివ్వడం మొదల్టెారు. అసలు సమస్యను సజావుగా పరిష్కరించకుండగనే, ఎవరిష్టమొచ్చిన సమాధానాలు వాళ్ళు చెప్పుకుంటూ తమదే సరైన వివరణలంటూ చెప్పుకుపోతున్నారు.
వాళ్ళెంత ప్రమాదకర -డోలాయమాన - పరిస్థితిని జనింపజేశారో - సృష్టించారో - చెప్పినా!? వాళ్ళందరి ఈ వివరాల పర్యవసానం, ఇంతకూ బైబులు ఏమిచెబుతోందన్నది ఇంకా తేల్చుకోవలసిందిగానే ఉందన్న దగ్గరకు చేర్చింది పరిస్థితిని. వాళ్ళందరి పోకడలను క్రోడీకరిస్తే, బైబిలు ప్రవచకులూ! ముందు మీరంతా ఒకదగ్గరకు చేరి, ఇంతకూ బైబిలు ఏమిచెబుతోందో తేల్యుకోండి. ఆ తేలినదాన్నే అందరూ ఒక్కటై లోకానికందించండి.
ఈ సందర్భంలో మరొక్క మా చెప్పుకోవాలి. బైబిలును - ఏ ముందస్తు అభిప్రాయాలు పెట్టుకోకుండా తగినంత భాషాపరిజ్ఞానం ఉండి, శ్రద్ధగా చదివేవాళ్ళకు ఏమర్థమవుతుందో, అది మాత్రం చెప్పడంలేదు మీరందరిలో ఎవరున్నూ. ఇదొక్కటే చాలు మీలో ఎవరూ ఉన్నదున్నట్లు చూడడానికీ, చెప్పడానికీ సిద్ధంగాలేరని, ఎవరి రంగు బక్కెట్టు వాళ్ళు పుచ్చుకొని, ఆ ఉన్నదానిపై ఎవరి రంగు వాళ్ళు పులుముతున్నారనడానికి. కనుక ఇప్పికైనా ఆ రంగులు, కుంచెలు, పులుముళ్ళూ వదిలి, ఉన్నదున్నట్లుగా గమనించడానికీ, మ్లాడడానికీ సత్యాన్వేషణ తత్పరతతో సిద్ధంకండి. ఇంతచెప్పినా దీనిని తలకింంచుకోగూడదనుకుంటే. పైన నేనన్నట్లు, అందరూ కలసి కూర్చొని బైబిలు ఇదిగో ఇదే చెబుతోంది అని ఒకేఒక్క అభిప్రాయాన్నైనా ప్రకించండి. ఈ రిెంలో ఏదో ఒకదానికి సిద్ధపడకుంటే, అది మీలో నిజాయితీలేనితనాన్నే ప్టిస్తుంది.
బైబిలులో ఆధునిక, భౌతిక విజ్ఞానాన్ని వెదకబూనడం దానికదే ఒక తెలివితక్కువ పని. నిజానికి ఇది బైబిలు పక్షీయులకొక్కరికి మాత్రమే వర్తించే విషయం కాదు. ఖురాను, వేదములే కాక, ప్రాచీనమైన ఏ తాత్విక సాహిత్యంలోనూ ఆధునిక భౌతిక విజ్ఞానాన్ని వెతకబూనడం సరైంది కాదు. సాంఖ్యంలో గానీ, వైశేషికంలో గానీ అణువిజ్ఞానమో, ప్రకృతి విజ్ఞానమో ఈనాి వైజ్ఞానులకు తెలిసినంతా ఉందనడం అవివేకమూ, అదరగండం గూడా. పంచభూతాలు, వాి సూక్ష్మరూపాలు (తన్మాత్రలు లేదా పరమాణువులు అనన్నారు వాిని) గురించిన ప్రస్తావనలే ఆ రచనల్లో ఉన్నాయి. అయితే ఒక్క విషయాన్నంగీకరించాలి మనం. ఆనాి మేథావుల్లో కొందరు ప్రకృతి పరిశోధకులు, పదార్థ పరిశోధకులూ ఉన్నారు. వారు అప్పికున్న అవకాశాలను బ్టి వాిని గురించి పరిశోధనలు చేశారు. వారారంభించిన మార్గంలోనే ప్రయాణించి క్రమక్రమంగా ఆధునిక విజ్ఞాన శాస్త్రం మరింత మరింతగా సమాచారాన్ని సేకరించుకుంటూ ఇప్పికీథకు చేరింది.
విజ్ఞానశాస్త్ర పరిణామక్రమాన్ని చారిత్రక దృష్టితో చూస్తే, ఎందరో మేథావులు గవేషణా ప్రవృత్తిలో ఈ స్థూల విశ్వాన్ని, సూక్ష్మప్రపంచాన్ని గురించి కూడా వెదుకులాడుతూ, అనేక విషయాలను గమనిస్తూ ఆ క్రమంలో చోటుచేసుకున్న మానవ తప్పిదాలను సరిచేసుకుంటూ వచ్చినట్లు తేలుతుంది. ఆ క్రమాలన్నీ ఆరంభించిన ఆద్యులుగా వారిని గమనించుకుంటూ, గౌరవించుకుంటూనే ఆనాి వారి అవగాహనల్లో దొర్లిన దోషాలను వదిలించుకుంటూ ముందుకు సాగడమే వైజ్ఞానిక విధానానికి సంబంధించిన సాంప్రదాయం. ఈ సాంప్రదాయాలన్నీ అందిపుచ్చుకోలేని మతావేశపరులే, ఆనాి రచనల్లోని దోషాలను వదులుకోలేకపోవడమే గాక, ఈనాి పరిశోధనాంశాలను ఏదోఒక నెపాన ఆనాి వాికి అంటగట్టేందుకూ తెగబడుతుాంరు. ఈరకం వారిలో రెండు రకాల దోషాలున్నాయి. ఒకి వైజ్ఞానిక పంథాలోని విధివిధానాలు తెలియనితనం కాగా, రెండోది మానసిక నిజాయితీ లేనితనం. ఈ రిెంలోనూ రెండోదే మరింత ప్రమాదకరం.
బైబిలు సృష్టిక్రమానికి చెందిన వివరాలివిగో ఇలావున్నాయి
1. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి శూన్యముగాను, నిరాకారముగాను ఉండెను.
గమనిక : ఈ 'ఉండెను' అన్నమాట మూలానికి సరైన అనువాదం కాదనీ 'ఆయెను' అన్న అర్థాన్నిచ్చే పదం ఉంది మూలంలోనేనని మనష్షేగారన్నారు. ఈ మాట మరికొందరు బైబిలు వివరణకర్తలూ అంటున్నదే.
2. ఈ ఆదికాండములోని సృష్టి నిజానికి మొది సృష్టికాదని రెండో సృష్టి అని కొందరంటున్నారీనాడు. అందుకు ఆధారంగా ఆదికాండములో నుండి 1:26 :- దేవుడు - మన స్వరూపమందు మన పోలికచొప్పున నరులను చేయుదము అన్న వాక్యములోని మన స్వరూపమందు... చేయుదుము. అన్న మాటలు అక్కడ దేవునితోపాటు ఇంకెవరో ఉన్నట్లు అర్థాన్నిస్తున్నయ్‌ కదా అని, అధ్యాయం 3:22 :- ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకనివిం వాడాయెను, అన్న మా ఈ సృష్టికి పూర్వమే దేవునితోపాింకెవరో ఉన్నట్లు తెలుపుతున్నయ్‌ కదా అనంటున్నారు. వీికి బలాన్నిచ్చేవిగా యషయా 14:13 నుండి 18 వరకున్న వచనాలను ఉట్టంకిస్తున్నారు. తేజో నక్షత్రమా! వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి?... వగైరా మాటలన్నీ పరలోకములోని, ప్రథమ సృష్టిలోని లూసీఫర్‌ - సాతాను - కలదను వివరాలేనని అంటున్నారు. ఈ సందర్భంలో ఆ రకమైన వివరణలిచ్చేవారందరికీ నా ప్రశ్నలివే.
1. 'ఆదియందు' ఇన్‌ద బిగినింగ్‌ అన్న దానికి, రెండవ సృష్టి ఆరంభించునప్పుడు మొదిగా అన్న అర్థం ఎందుకు చెబుతున్నారు?
2. 'ఉండెను' అన్నా 'ఆయెను' అన్నా మా ప్రశ్న 'శూన్యముగా, నిరాకారముగా' అంటే ఏమిటన్నదే గాని, ఆయన అలా వాిని శూన్యంగా, నిరాకారంగా సృష్టించాడా? అవే అలా అయ్యాయా? అన్నది కాదు. ఆయన సృష్టించినప్పుడు కానీ, అటు తరువాత అవెందువల్ల గాని, అయినప్పుడు గాని, భూమి శూన్యంగా, నిరాకారంగా ఉండడమంటే ఏమిటన్నదే.
గమనిక : ఈ సందర్భాన్ని వివరిస్తూ మనష్షేగారు చాలా మ్లాడేశారు. పరలోకంలో లూసీఫర్‌కు - దేవునికీ గొప్ప యుద్ధం జరిగిందనీ, అందులో బాంబుల ప్రయోగాలూ జరిగాయనీ, కడకు దేవుడు లూసీఫర్‌ను, అతని సైన్యాన్ని భూమిపైకి పడేశాడనీ, ఆ సందర్భంలో భూమిపై అగ్నిపడి భూమి తగలబడిపోయి నిరాకారంగా, శూన్యంగా అయ్యిందనీ అనేశారాయన. ఆయన ఈ మాటలు, తట్టే మోయలేనివాడు బండినెత్తికెత్తుకున్న చందానికి నెట్టేశాయి ఆయన్ను. పరిశోధనలూ చేశానంటున్న మనష్షేగారు, తాను ప్రకించిన అభిప్రాయాలన్నింకీ సరైన ఆధారాలు చూపాల్సే ఉంటుందన్న శాస్త్రీయ పద్ధతిని కాదనరనే అనుకుాంను.
1. భూమిపై నిప్పులు పడడమేమిో, దానివల్ల భూమి తగలబడి నిరాకారంగా మారడమేమిో ఆయనే తేల్చాలి.
2. పదార్థం నశిస్తుందని ఆధునిక విజ్ఞాన శాస్త్రం - సాపేక్ష సిద్ధాంతం - రుజువుచేసిందన్నారు. దానినీ ఆయనే తేల్చాలి. ఇకపోతే బైబిలు ఆదికాండం 1వ అధ్యాయం - మరియు రెండవ అధ్యాయాలలో రెండు రకాల సృష్టి క్రమాల వివరాలున్నాయి. వాిలో ఏదో ఒకి సత్యమయ్యేందుకు గానీ, రెండూ తప్పులై, అసలు నిజం మరోటయ్యేందుకు గానీ ఆస్కారముందేగాని, రెండూ సత్యాలేననడానికి అవకాశమే లేదు. అయినా, ఆయన, ఆయన వెంటవచ్చినవారూ, ఆ పక్షాన్ని స్వీకరించిన వారూ కూడా వాిలో తప్పుప్టాల్సిందేమీ లేదన్నట్లు మ్లాడబోయారు. అక్కడితో ఆగక ఆధునిక భౌతిక విజ్ఞానశాస్త్రంలో కన్ఫూజన్‌ ఎంతో ఉందంటూ నిర్ణయించేశారు. ఆ సందర్భంలో అలానా! ఏదీ, అలాిది ఒక్కి చూపండి అని నేను ప్రశ్నించగా శ్రీధర్‌గారొక ఉదాహరణ చెప్పారు. అందులో కన్‌ఫూజన్‌ ఏముంది? మీరు అర్థం చేసుకోవడంలో కన్ఫూజనే గానీ అనన్నాను. దీనిని మరింత పరిశీలించాలి. ఇలా రాసుకుంటూ పోవాలంటే, ఈ పత్రిక పరిమాణాన్ని బాగా పెంచాల్సి ఉంటుంది. కనుక మీ మెదడుకు మేతగా ఉండే రెండు మూడు ప్రశ్నలు వేసి ఇప్పికాగుతాను.
1. యోహాను సువార్తలోని, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియెద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను - అన్న మాటలలో వాక్కంటే శబ్దమనీ, శబ్దమంటే సౌండ్‌ ఎనర్జీ అని వివరణిచ్చారు మనష్షేగారు. ఈ విషయాన్నీ వారు రుజువుచేయాల్సి ఉంది.
2. అగాధ జలములపైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను అన్న అనువాదంలోని 'అల్లాడుట' దగ్గర 'పొదుగుట' అని అనాలి. కోడిగ్రుడ్లను పొదిగినట్లు, దేవుని ఆత్మ జలములపై పొదుగుచున్నది అని వివరించారు. అదేమిోనూ ఆ పక్షంవారే వివరించి నిరూపించాలి.
3. దేవుడు అని మీరంటున్నది, ఎలోహిమ్‌ గురించా, యావే గురించా, యెహోవా గురించా, జహోవా గురించా? దేవుడు, దేవతలు, ఒక్కడైన ముగ్గురు, ముగ్గురైన ఒక్కడు, ఒకటవ సృష్టి, సృష్టికర్త, రెండవ సృష్టి, సృష్టికర్త, ఇలా గడబిడగా ఉన్న దాన్నంతినీ చక్కబరచి అదంతా సరిగనే ఉందని తేల్చాలి.
4. ఏ మత సిద్ధాంతం ఇప్పి వరకు శాస్త్రీయ విచారణకు లోనుచేయబడలేదని నేననగా, బైబిలుపై అలాి విచారణ జరిగిందన్నారు ఆ పక్షం వాళ్ళు. ఆ ఆధారాలు చూపాల్సి ఉంది వాళ్ళు.
ఖురాన్‌
ముందనుకున్న ప్రకారం ది.19-9-2015న పరిశీలనాంశాలు మూడు.
1. పూర్వ గ్రంథాల విషయంలో ఖురాన్‌ - ఇస్లాం - వైఖరి.
2. అవిస్వాసుల పట్ల ఇస్లాం వైఖరి ఎన్నిరకాలుగా ఉంది? అవిస్వాసుల్ని వధించమని ఉందా లేదా ?
3. ఒకసారి ఇస్లాం స్వీకరించి, అటుతర్వాత ఇస్లాంను విడచిన వారిపట్ల ఇస్లాం వైఖరిేం?
ఆరంభంలో ముస్తాక్‌ అహ్మద్‌ గారు, ఒక గంటసేపు పూర్వ గ్రంథాలను ఖురాన్‌ దృవీకరిస్తున్నదనీ, ఖురాన్‌తో సమంగా ప్రమాణమని అంటుందనీ, ఇంకా చెప్పాలంటే, తనకంటే వాికే అధిక విలువని ఇస్తున్నదనీ చెప్పారు. అలా పూర్వ గ్రంథాలను విశ్వసించని వారు అవిస్వాసుల క్రిందికే వస్తారని చెప్పారు. ఖురాన్‌లో పేర్కొన్న 3 గ్రంథాలే కాక, ప్రతి జాతి దగ్గరకు పంపబడ్డ గ్రంథాలనూ అంగీకరించాలని అంటుందనీ చెప్పారు. ఈ ప్రసంగాంశాలనన్నింనీ ఆయన ఒక ప్రసంగ పాఠంగా చిన్న పుస్తక రూపంలో తయారుచేసి సభికులందరకూ ఇచ్చారు. ఈ పద్ధతి బాగుందనీ, మలి సమావేశాలలో ప్రతిపాదించదలచుకున్న వారందరూ వారివారి భావాలను ఇలానే రాతమూలకంగా సభకు - సదస్సులకు - అందజేయాలని అనుకున్నాం.
సురేంద్ర :- ఆ ప్రసంగాంశాలపై సరిపడినంత చర్చ జరగలేదు. బైబిలు పక్షంనుండి వచ్చినవారు మాత్రం సూిగా ఒకి రెండు ప్రశ్నలు వేశారు. ఒకి, ముందు వచ్చిన గ్రంథాలను, చివర వచ్చిన గ్రంథం దృవీకరించటమేమిటండీ, అది సరికాదు కదా! మొదట వచ్చింది దైవ గ్రంథమే అయితే తరువాతవి దానికి సరిపోతున్నాయో లేదో చూసుకోవడమే సరైందవుతుంది కదా!.
2. ఆయా మత గ్రంథాలలో ఉన్నదాన్నంతినీ మీరు - ముస్లింలు - అంగీకరిస్తారా? ఖురాన్‌లో ఉన్నంతవరకా? మొత్తాన్నంగీకరిస్తానంటే ఖురానెందుకు? అంగీకరించనంటే ఖురాన్నెందుకు అంగీకరించాలి? ఈ ప్రశ్నలపై సరిపడినంతగా చర్చ జరగలేదు. సంతృప్తికరంగా సమాధానమూ రాలేదు. ఒక థలోనైతే, భారత దేశానికి పంపబడ్డ ప్రవక్తలెవరన్నదీ, వారు తెచ్చిన గ్రంథాలేమిటన్నదీ మీరు గమనించారా? అని సూిగా అడిగిన ప్రశ్నలకు ముస్తాక్‌ గారు కొద్దిగా ఆలోచించుకొనే, గమనించాము, రాముడు, కృష్ణుడు, అర్జునుడు అని, వేదము, భగవద్గీత, కొన్ని ఉపనిషత్తులు అని సమాధానం చెప్పారు. వీటన్నింపైనా విచారణ సాగాల్సి ఉంది.
ఇక రెండో విషయానికొస్తే, బైబిలు పక్షాన్నుండి, పీటర్‌, శామ్యూల్‌ అన్న సోదరులిరువురూ కలసి ఖురాన్‌ పక్షం వారిని ప్రశ్నించడం ఆరంభించారు. ఇస్లాం అవిస్వాసుల పట్ల మూడు రకాల పరిస్థితులననుసరించి ఎలా ప్రవర్తించాలో చెబుతోందనీ, వాడుకలో వాిని దారుల్‌ హరబ్‌, దారుల్‌ హమన్‌, దారుల్‌ ఇస్లామ్‌ అంారనీ వారనగా, ముస్తాక్‌ గారు, ఫజులూర్‌ రహమాన్‌ గారు అి్ట మాటలు గ్రంథాల్లో ఎక్కడున్నాయో చూపమన్నారు.
సూిగా అి్ట మాటలు గ్రంధాలలో లేకున్నా ఆయుతులు, హదీసుల్ని పరిశీలిస్తుంటే ప్రవక్త మూడు రకాల పరిస్థితుల్లో ముస్లిం ఎలా ఎలా నడుచుకోవాలో చెప్పినట్లు ఆధారాలు దొరుకుతాయి అనన్నారు వారు.
ఓ  అటు తరువాత అవిస్వాసుల పట్ల, అవిస్వాసుల్ని చంపేయమన్న ఒక్క వాక్యం కూడా నాకు దొరకలేదని ఫజులూర్‌ రహమాన్‌ గారు అన్నారు.
దానిపై ఒక్కికాదు, చాలా ఉన్నయ్‌, అవిస్వాసుల్ని చంపండన్న వాక్యాలంటూ, పీటర్‌ ముందుగా 9:5 ఆయుతులను ఉట్టంకించారు. ఇదిగో ఆ ఖురాన్‌ ఆదేశం.
''నిషిద్ధ మాసాలు గడచిపోగానే, ముష్రిక్కులను (ముష్రిక్‌ అంటే దేవుడికి సాి కల్పించేవాడు, బహుదేవతారాధకుడు అన్న అర్థాలున్నాయి. ఇది క్రైస్తవులకు - అనేక దైవారాధకులకు వర్తిస్తుంది). ఎక్కడ కనపడితే అక్కడ చంపండి. వారిని నిర్భంధించండి. వారిని ముట్టడించండి. ప్రతి మాటువద్ద వారికొరకు పొంచి ఉండండి''....
దీని విషయమై ముస్తాక్‌ అహ్మద్‌ మరియు ఫజులూర్‌ రహమాన్‌ గారు, వీి విషయమై మరింత పరిశీలించుకొని రావడానికి కొంత సమయమివ్వండి. పై మాసానికి సిద్ధపడి మా పక్షాన్ని వ్రాతరూపంలోనూ సిద్ధంచేసుకొని వస్తాం అన్నారు. సంధానకర్తగా ఉన్ననేను అలాగే చేయండి. ఈ వేదిక నియమాలలో పరిశీలించుకు రావడానికి, మరింతమంది తెలిసిన వాళ్ళూ కలసి చర్చలో పాల్గొనడానికీ అవకాశం ఉంది. కనుక వచ్చే సమావేశానికి మరింతగా అధ్యయనం చేసుకొని రండి అననన్నాను.
బైబిలు పక్షం వాళ్ళకు నాయీ మాటలు ఒకింత అసహనం కలిగించినా, ఎంతో సంయమనంతో ప్రవర్తించి అలాగే కానీండనన్నారు వాళ్ళునూ. ఇంకేమైనా ఆయుతులు, హదీసులూ ఉంటే వాి వివరాలూ మీరడగదలుచుకున్న ప్రశ్నలూ ఇవ్వగలిగితే ఇవ్వండిప్పుడే అనన్నారు ఖురాన్‌ పక్షం వారు.
పీటర్‌ సోదరులు ఇవిగో మరికొన్ని ఆయుతుల వివరాలంటూ 9:11, 12, 14, 15, 17 :111, 8:39, 2:191, 17:16, 25:52, 9:29 అంటూ మరికొన్ని వివరాలిచ్చారు.
మలి సమావేశం వివరాలు :
నవంబర్‌ 6,7 తేదీలలో దోరకుంటలోనే కలవాలి. 6వ తేదీ బైబిలు పైనా, 7వ తేదీ ఖురాన్‌పైనా చర్చ జరగాలి. చర్చనీయాంశం - అవిస్వాసులు, అన్యజనుల పట్ల, ఆ రెండు గ్రంథాలు (యోహోవా, అల్లా) ఎలా ప్రవర్తిమంటున్నాయి?
సమావేశానికి ఉదయం 9 గం.ల లోపు చేరాల్సి ఉంటుంది. ఊరికే వినడానికి గాక, చదువుకొని పాల్గొనడానికి సిద్ధమైన వారే రావాలి. చర్చనీయాంశం ఒకింత ఒత్తిడిని, ఆవేశాన్ని కలిగించగలిగిందవడంతో 'వాస్తవాల వెలికితీత' అన్న వేదిక లక్ష్యానికి అనుగుణంగా, సంయమనంతో ఉండండి.
మ్లాడే స్వేచ్ఛ అందరికీ సమానంగా ఉంటుంది. అయితే తాను మ్లాడిన దానికి ఆధారాలు చూపడం తప్పనిసరి నియమంగా ఉంటుంది.
గమనిక : బైబిలు, ఖురానులు మాకు బాగా తెలుసును అనుకుంటున్నవాళ్ళెవరైనా పై చర్చనీయాంశానికి పరిమితమై ఈ వేదికలో పాల్గొనవచ్చు. వేదికలో పాల్గొనదలచిన వారు ముందుగా వారి వివరాలు మాకందించాల్సి ఉంటుంది.
సత్యాన్వేషణలో... మీ  సురేంద్ర.

Tuesday, October 1, 2013

సంపాదకీయం

రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయ సంక్షోభాన్ని చూస్తుంటే, దేశం ఎటుపోతోంది? ఏమైపోవనుంది అన్న ఆందోళన కలుగుతోంది. ఒక్కడంటే ఒక్కడూ, సభ్యతా సంస్కారాలతోగానీ, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణ్యంగా గానీ, మాట్లాడుతున్న దాఖలా లేదు. జనంలో ఆవేశాలను రగిలించే పనినీ దాటి రాను రాను బూతులు తిట్టుకోవడంలోనూ పోటీ పడుతున్నారు. ఏ ఛానల్‌ను చూద్దామన్నా కనపడే దృశ్యాలూ, వినపడే మాటలూ ఒక్క తీరునే ఉంటున్నాయి. పెద్ద తరహా మనుషులకైతే అసహ్యాన్నీ కలిగిస్తున్నాయి. డబ్బులున్నాయి, పదవులున్నాయి వెంటమందా ఉంది కనక డాబూ దర్పం ప్రదర్శించడానికే అడ్డూ ఆపు ఉండడం లేదు గాని, నోరు తెరిస్తే చాలు వీళ్ళంతా ఎంత దిగజారిన (హీన) స్థాయి మనుషులో ఇట్టే తెలిసిపోతూ ఉంది.
పాలన పరమైన ఏ విషయాన్ని తీసుకున్నా అవినీతి, ఆశ్రిత పక్షపాతం, వివక్ష పర్వతాకారంలో దర్శనమిస్తున్నాయి. దిక్కుమాలిన మంద, మందినెత్తిన పెత్తందారులై కూర్చుని, దేశానికే ప్రాణ స్థానీయమైన వ్యవసాయానికి ఆధారమైయున్న నీటి వనరుల్ని సంరక్షించుకునే, సద్వినియోగం చేసుకునే పనిలోనూ తప్పుడు పోకడలేపోతున్నారు. 40 ఏండ్ల క్రితం మొదలెట్టిన ఆనకట్టల నిర్మాణాలూ పూర్తికాలేదిప్పటికీ, ఆనాడు 4, 5 వందల కోట్లతో 2, 3 ఏండ్లలో నిర్మించగలమనుకున్నవి కాలం మారింది, ధరలు పెరిగాయి అన్న ఒకే ఒక ఒంకతో, వాస్తవంగా పెరిగిన ధరలకనుగుణ్యంగాకాక, అందుకు అనేకరెట్లు పెంచి తలాయింత దండుకుంటున్నారు. కట్టవలసి ఉన్న ప్రాజెక్టులన్నింటిపైనా 'లక్షా ఎనభై వేల కోట్లకు టెండర్లు పిలిచినట్లు, సుమారు 80, 90 వేల కోట్లు విడుదలైనట్లు లెక్కలు తెలుపుతున్నాయి. ఆ దామాషా ప్రకారం జరగాల్సిన పనులు థాబ్దాలు గడిచినా జరగనేలేదు. విడుదలచేసిన ఆ డబ్బులో ఎవరెవరికెంత ముట్టిందో, అసలు నిర్మాణం పనికి ఎంత చేరిందో తెలుసుకోగలిగితే సామాన్యుల గుండెలైతే ఆగిపోతాయి కూడా. పరాన్న భుక్కులు, రక్తం పీల్చే జలగలు అన్న పదాలు 100% వీరికి సరిపోతాయి.
ఒక్క ఉదాహరణ చెపుతాను 1988 నాడు ఎన్‌.టి. రామారావుగారు పులిచింతలకు శంకుస్థాపన చేసే నాటికి ప్రాజెక్టు నిర్మాణ వ్యయపు అంచనా 270 కోట్లు. 95 నాటికి దానిని 500 కోట్లన్నారు.
2011 నాటికి అది 1300 కోట్లయ్యింది. వాస్తవంగా నిర్మాణవేగం పెంచిందీ సమయం నుండే. గట్టిగా పూనుకుంటే 2 1/2 సం||లలో పూర్తి చేయగల నిర్మాణమది. సంకల్పించి 26 ఏండ్లు దాటింది. ప్రస్తుతం దాని నిర్మాణ వ్యయాన్ని 2,600 కోట్లంటున్నారు. మూడు వేల కోట్లని తలాకాస్త పంచుకున్నా ఆశ్చర్యపడనక్కరలేదు. ఇదీ పరిస్థితి.
రాజ్యాంగ నిర్మాతల దృష్టిలో మనమంతా 'ఒకేజాతి, ఒకే ప్రజ, దేశమంతా ఏకఖండమే' సమానాభివృద్ధి, పాలనా సౌలభ్యం, అన్న రెంటి కొరకుగా గీసుకున్నవే (ఏర్పరచుకున్నవే) రాష్ట్రాల, జిల్లాల సరిహద్దులన్నీ. ఈ విషయాన్నంగీకరించకుండా చేసే వాదనలుగానీ, కోరే కోర్కెలు గానీ, మరేవైనా గానీ, రాజ్యాంగానుకూలమైనవి మాత్రం కాజాలవు.
కేంద్రం తెలంగాణా విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని 3.10.2013 రాత్రి ప్రకటన వెలువడ్డ వెంటనే టిడిపి నేత చంద్రబాబు గారు, వైకాపా నేత జగన్‌గారూ (చంద్రన్న, జగనన్న గార్ల) రెండు ప్రకటనలు విడుదల చేశారు. ఆంధ్రజ్యోతి 4.10.2013 నాటి దినపత్రికలో వచ్చాయా వివరాలు.
చంద్రబాబు గారి ప్రకారం :- సోనియా గాంధీ (కాంగ్రెసు)కి, టి.ఆర్‌.ఎస్‌, వైకాపాలతో అవగాహనుంది.
జగన్‌గారి ప్రకారం :- ఈ రాష్ట్రంలో కాంగ్రెసు, చంద్రబాబు కలసి పొయ్యారు.
ఏమిటీ ప్రకటనలు? సిగ్గుపడే లక్షణం లేకపోవడం వల్లే, ఇంత విడ్డూరమైన వార్తలు వస్తున్నాయి. జనం ఇదేమిటని అడగరు సరికదా ఎవరి దొరని వాళ్ళు భుజాలకెత్తుకుని మోస్తుంటారు. ఈ దేశానికిది ఎంత విషాదకర పరిస్థితి?!
ఇవి చాలదన్నట్లూ, మేమూ ఆ బళ్ళో చదువుకున్నవాళ్ళమేనని చెప్పాలనో, మిగిలిన నాయకులూ ఇదే బాటన నడుస్తున్నారు. ప్రతివాడు మిగిలిన వారిని కాంగ్రెసుతో కుమ్మక్కైయారని బల్లగుద్ది మరీ ప్రకటనలు చేసేస్తున్నారు. ఈ మొత్తానికి అసలు కారణం -మూలవేరు -ఎక్కడుందో తెలుసా? గింత విత్తానికీ, కూసింత మత్తునీళ్ళకీ లొంగి, ఈ రకాన్నంతా ఎంపిక చేసి నెత్తికెత్తుకున్నారు చూడండి, ఆ బుద్దిహీనులైన ఓటర్ల మెదళ్ళలో ఉంది. తరవాతి కారణం, తిన్నదరగనంత సంపాదించుకుంటూనే, గింత చదువు సంధ్యా ఉండీ ఓటు వేయకుండా ఇండ్లలో పండడమో, క్లబ్బుల్లో వుండడమో చేస్తుండే రకం ఓటర్లు. మొత్తంమ్మీద ఈ పాపం అనర్హుల్ని ఎన్నుకున్న ఓటర్లదే. కనుక అనుభవించాల్సింది వాళ్ళే.
మేధావుల కర్తవ్యం
ధర్మ పక్షానికీ, అధర్మపక్షానికీ నేతృత్వం వహించేది మేధావులే. సామాన్యులు ఆ తలగలవాళ్ళకు శరీరంగా (భౌతిక శక్తిగా) పని చేస్తుంటారంతే. కనుకనే సామాజిక స్థితికీ, గతికీ కూడా మేధావులు నిమిత్త కారణం అవుతుంటారు.
ఎప్పటికప్పుడు అప్పటికున్న థ నుండి సమాజాన్ని నడిపించడానికి దిశా నిర్ధేశం చేస్తూ, చోదక శక్తిగా ఉంది, ఉంటున్నది ఉండగలిగిందీ కూడా మేధావులే.
చెడ్డవాళ్ళ దుర్మార్గం కంటే, మంచివాళ్ళ మౌనం మరింత ప్రమాదకరమైంది.
అసాంఘిక శక్తులింతగా పెచ్చరిల్లుతున్నాయంటే అందుకు కారణం అభ్యుదయ శక్తులు అసంఘటితంగా ఉండడమే.
సమర్థత ఉండీ అధర్మాన్ని నిలువరించక ఎవడు ఉపేక్ష వహిస్తాడో వాడు సమూలంగా నశిస్తాడు.
ఇలాటి సూక్తులు - కాచివడపోసిన సూత్రీకరణలు - అన్నీ మేధావుల నుద్దేశించి, వాళ్ళ కర్తవ్యాన్ని గురించి హెచ్చరిస్తున్నవే. మేధావులు మూడు సమూహాలుగ (రకాలుగా) ఉంటున్నారు. (1) దుష్ట మేధావులు (2) శిష్టమేధావులు (3) నిర్లిప్తమేధావులు ఈనాటి అపసవ్యతలలో ఎక్కువలో ఎక్కువ ఆ ముగ్గురిలోనూ ఒకటవరకం సాగిస్తున్న దురాగతాలే. ఇక శిష్టమేధావులు కొద్దిమంది ఉన్నా వారంతా ఎవరెవరి ప్రాధాన్యతలననుసరించి వారు, వారెంచుకున్న క్షేత్రాలలో క్రియాశీలంగా పని చేస్తూ పోతుంటారు. ఈ రకం క్రిందికి వచ్చేవారిలో ఎక్కువ మంది ప్రక్కవారితో కలవరు, కలుపుకుపోరు. వీరిలో నున్న స్వతంత్రాలోచనాశీలతే, తన అవగాహనపైనా నిర్ణయాలపైనా తనకున్న తనదే సరైందన్న దృష్టే; ఇతరులు చెపుతున్న దానిని సరిగా విననీయదు, పునరాలోచన చేయనీయదు. ఇలాటి మంచివారైన మేధావుల్ని బహుగా అనుభవంలో చూడడం ద్వారానే ఒక నానుడి పుట్టింది. ''సామాన్యుల్ని వెయ్యి మందినైనా ఒక బాటంట నడిపించవచ్చుగానీ, ఆలోచనా పరుల్ని నలుగుర్ని కొద్దికాలం కూడా ఏకబాటన నడపలేము'' అన్నదే అది. నలుగురు ఆలోచనాపరులూ ఏకాభిప్రాయానికి రాకపోగా, రాలేకపోగా, ఏకాభిప్రాయానికి వస్తే వాళ్ళు మేధావులెందుకవుతారయ్యా, అనే వాదననూ ముందుకు తెస్తున్నారు కొందరు. భిన్నాభిప్రాయాలున్న అంశాల్ని తాత్కాలికంగానైనా ప్రక్కనబెట్టి, వచ్చిపై బడ్డ అత్యవసర విషయాలలో, సమానాభిప్రాయం ఉన్న వరకైనా (తక్షణావసరము, మౌలికమునైన వాటివరకైనా) కలసి కదలగలిగితే ఎంత బావుణ్ణు
వీరిరువురూ కాక మిగిలిన మూడోరకం మేధావులు నిర్లిప్తమేధావులు. వీరికి విషయాలు అవగతమవుతూనే ఉన్నా, కొంత మేర పరిష్కారాలనూ సూచించగల మేధోసామర్ధ్యమున్నా, దేనినీ పట్టించుకోరు. ఎక్కడన్నా మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు మాత్రం అప్పటి కనిపించింది మాట్లాడేసి, ఇవన్నీ మాకూ తెలుసులేవో, ఊరకే వ్యర్ధ ప్రయత్నాలెందుకు చేస్తారు! ఊరుకుండండంటూ మరికాస్త నీరసాన్ని ఇంజెక్టు చేస్తారు పనిచేస్తున్న వాళ్ళకి. ఈ వర్గమే క్రియాశీల మేధావులకంటే అధికంగా ఉంటోంది.
దుష్ట మేధావులేమో స్వార్థ ప్రయోజనాలుంటాయి కనుక కలవగలిగిన ప్రతిచోటా కలిసిపోతూ, వచ్చిదాంట్లో వాటాలు పంచుకుంటూ సాగుతున్నారు. శిష్ఠమేధావులు తామనుకున్న దానికి పరిమితమై, కలసిపని చేయడానికంత సుముఖంగా లేరు, ఇక మూడోరకం మాటలకు పరిమితమై, పనికి సిద్దం కారు, పని చేసే వారిని వెనక్కులాగుతుంటారు.
స్వతంత్ర యోచనాశీలురైన మేధావులారా! ఇదే మనందరి ముందున్న, సమాజం ముందున్న అసలు సమస్య. దీని నుండి సమాజమనే శరీరంలో తలభాగానికి ప్రతీక అనదగ్గ శిష్ట మేధావులు ఉన్న నలుగురూ కలసి, నిర్లిప్త మేధావులలో కదలిక తేగలిగినంత వరకైనా వారినీ చైతన్యపరచి, అందరం కట్టగట్టుకుని దుష్టమేధావుల కుటిలయత్నాలను భగ్నం చేయడమూ, ప్రజా సంక్షేమానికి తగిన దిశా నిర్ధేశం చేస్తూ జన సమూహాన్ని ఆ దిశగా కార్యోన్ముఖులను చేయడము అన్న పనికై ఉద్యమించాల్సి ఉంది. ఈరకం పూనుకోకుండా ఈ దేశ ప్రజలకు కోరదగ్గ భవిష్యత్తే లేదు. అభ్యుదయ శక్తులు సంఘటితం కావడమన్నదగ్గరే అస్సలు సిసలు పరిష్కారం ఉంది. సామరస్య పూర్వక సహకార సంబంధాలే వర్తమాన సామాజికావశ్యకత అన్నది గమనించండి.
స్పందన - ప్రతిస్పందన
స్పం :- (1) :-  హేతువాదం తత్వం, సిద్దాంతం, సూత్రం, విధానంపై మీరు ఇంత కూలంకషంగా, వివరంగా వ్రాయడం సంతోషాన్ని కలిగించింది. ఇది మంచి సామాజిక పరిణామం. ఆశాజనకం. ఈ విషయంలో మిమ్ము మరోసారి అభినందిస్తున్నాను. 24-7-2013 నాటి లేఖ.
భువనగిరి నుండి మూర్తిగారి జనార్ధన్‌ గారిలా వ్రాస్తున్నారు మీరు చేస్తున్న హేతువాద పునర్వికాస యత్నానికి అభినందనలు. హేతువాదము, మరియు హేతువాద ఉద్యమ వికాసానికి చేపట్టవలసిన కార్యక్రమాలను మిత్రులతో చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా హేతువాద ఉద్యమాన్ని సామాన్య ప్రజలవద్దకు తీసుకురావాలి. కేవలం వేదిక వరకే పరిమితమైతే విస్తరించదు. హేతువాదం అందరికీ కావాలి. హేతువాద ఉద్యమం అందరిదీ. దాని ఫలాలు అందరికీ అందాలి. అది మనందరి సామాజిక బాధ్యతగా భావించాలి. విమర్శలు వస్తూనే ఉంటాయి. అది సహజం కనుక, మన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉండాలని నా అభిప్రాయం. 6-8-2013 నాటి లేఖ.
ప్రతి స్పందన :- మూర్తి గారి జనార్ధన్‌గారికి; ఒక విషయంలో స్పష్టత రానంత వరకు, ఎవరెన్నెన్ని మాటలు, ఎంతగా మాట్లాడినా, అసలు విషయం ఆచరణలోకి రాదు. అదేమంటే; ఇంతకూ హేతువాదమంటే ఏమిటి? హేతువాదం పేరున ప్రజలలోకి తీసుకెళ్ళాల్సిన విషయాలేమేమిటి? అన్నది స్పష్టంగా తేలకుండా ఏమి ఉద్యమం చేస్తాము? హేతువాద ఉద్యమాన్ని సామాన్యుల దగ్గరకు తీసుకెళ్ళాలన్నారు. ఎవరు తీసుకెళ్ళాలి? ఇంతకాలం ఆ పని ఎందుకు జరగలేదు?
నాకు తెలిసి ఈ ప్రశ్నకు రెండు సమాధానాలు చెప్పుకోవాలి. భావజాలాన్ని సమాజంలో విస్తరింపజేసే కార్యకర్తల నిర్మాణం జరగాలి. అదింత వరకూ సరైన రీతిలో, సరిపడినంతగా జరగలేదు. ఉద్యమ వ్యాప్తి సామాజికావసరమన్న విషయంగానీ, అది మన సామాజిక బాధ్యత అన్న విషయంగానీ, చేతల దాకా సాగేంత తపన లేదు ఉన్న నలుగురికైనా. కనుకనే అప్పుడప్పుడూ సందర్భం వచ్చినపుడు మాట్లాడుకోడానికో, సూచనలు, హెచ్చరికలు చేసుకోవడానికో పరిమితంగానే ఉంటోందది. ఈ విషయాన్నే సూత్రప్రాయంగా, ఉద్దేశ స్పష్టతతోబాటు తీవ్రతా ఉంటేనే పని జరుగుతుంటుందని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు హేతువాదులమనుకుంటున్న వారిలో ఎక్కువ మందిలో ఉద్దేశ స్పష్టతలేదు. ఉన్న కొద్ది మందిలో ఉండాల్సినంత తీవ్రత లేదు. ఇదే ప్రధాన కారణం.
ఇక రెండో సమాధానం, హేతువాదాన్ని సామాన్యుల దగ్గరకు తీసుకువెళ్ళడం ఒక పట్టాన అయ్యే పనికాదు. ముందుగా ఒకింత యోచనాపరుల దగ్గరకైనా తీసుకెళ్ళే పని చేయగలిగితే తొలిథలో అక్కడికదే గొప్ప. దీనంతటికీ ముందు సిద్దాంతం గుది గుచ్చబడాలి. లేకుంటే ఒక్కో ముఖం నుండి ఒక్కో హేతువాదం పుట్టుకొస్తుంటుంది. అందుకనే ఆ దిశగా ప్రయత్నం మొదలెట్టాను. అవగాహన, మనస్సు ఉన్న వాళ్ళు కలసిరావాలి మరి, నా వైపు నుండి మాత్రం అందరికీ ఆహ్వానమే. ఇక విమర్శలంటారా! విషయ నిష్ఠకల విమర్శల్ని ఆహ్వానించాల్సీ ఉంటుంది. నిందల్ని విమర్శలనుకునే అపోహ నుండి ఉద్యమాలు బైటపడాల్సి ఉంది. ఉద్యమ యత్నంలో పాలు పంచుకోగల మిత్రులందరికీ కబురు చేయండి.
స్పందన -2 : హైద్రాబాద్‌ నుండి ఫజులుర్‌ రహ్మాన్‌ గారిలా వ్రాశారు. 'భౌతికవాది' 2013 జులై, ఆగస్టు సంచిక 13వ పేజీలో 'విశ్వం - మనిషి' అనే అంశంపై వ్రాసిన వ్యాసంలో,
''మన మత గ్రంథాలన్నీ భూమి చుట్టూ సూర్యుడు, చంద్రుడు, చుక్కలు అన్నీ తిరుగుతున్నవి - అనే అన్నాయి'' అని వ్రాశారు. దాని పై నేను స్పందిస్తూ, ఒక ముస్లింగా నేను, ఖురాన్‌లో అలాంటి అర్ధాన్నిచ్చే వాక్యం ఒక్కటి కూడా లేదు కదా! మీరు తెలియక వ్రాశారా? తెలిసి వ్రాశారా? అని అడుగుదామని 10-9-13 ఉదయం లయశ్రీ గారికి ఫోను చేశాను. ఈ విషయాన్ని వివరించే యత్నం చేస్తుండగనే, ఆయన నా మాటలు వినకుండా మాట్లాడడం మొదలెట్టి, (1) ఇది సైన్సుకు సంబంధించిన విషయమని, (2) తన దగ్గరా బైబిలు, ఖురాను గ్రంథాలున్నాయని, (3) నా పుస్తకంలో నీకు నచ్చింది తీసుకో, నచ్చనిది వదిలేయ్‌ అనీ, (4) మీరు సాంప్రదాయ ముస్లింలలాగున్నారు నేను వాదనలు చేయను అనీ (5) తనకు సమయంలేదనీ అంటూ ఫోన్‌ కట్‌ చేశారు.
ఇది నాకు ఇబ్బంది కలిగించింది. మళ్ళీ ఫోన్‌ చేసి ఒక్క నిముషం సమయమడిగి, నా ప్రశ్నేమిటో తెలిపాను. నా ప్రశ్న అర్థమైందో లేదో కాని, తన దగ్గర సమయం లేదంటూ మళ్ళా ఫోన్‌ కట్‌ చేశారు. సురేంద్ర గారూ! ఇదంతా మీ కెందుకు తెలుపుతున్నానంటే; లేనిది ఉన్నట్లు చెప్పడమేనా భౌతిక వాదమంటే ? ఉంటే ఆధారం అడిగితే ఎందుకు చెప్పడంలేదు?
(2) తమ దగ్గర అంతగా సమయం లేనివారు రకరకాల పేర్లతో ఉద్యమాలు అంటూ ఎందుకు ప్రారంభిస్తున్నారు?
(3) లేని విషయాల్ని ప్రజలలోనికి ప్రచార సాధనాల ద్వారా పంపిస్తూ; ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే వదిలేయండి, అనడమేమి పద్దతి?
(5) భౌతిక వాదమంటే వారు చెప్పింది ప్రశ్నించకుండా నమ్మడమని అర్ధమా?
మీ వివేకపథం పత్రిక ద్వారానైనా వివరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ప్రతిస్పందన :- (2) మిత్రులు ఫజులుర్‌ రహ్మాన్‌ గారికి; నిజానికీ లేఖాంశాలకు మలయ శ్రీ గారు సమాధానాలు చెపితేనే సమంజసంగా ఉంటుంది. అయినా మనకున్న పరిచయాన్ని బట్టీ, మీరు లేవనెత్తిన ప్రశ్నలు సాధారణ స్వభావం కలిగినవిగా ఉండడాన్ని బట్టీ సమాధానాలు వ్రాస్తున్నాను.
(1) ఎవరైనా సరే, తను ప్రకటించిన అభిప్రాయాలు సరైనవేనని నిర్థారించే బాధ్యత వహించితీరాలి. ఇందులో ఎవరికీ మినహాయింపు లుండకూడదు. ఇది భావజాల క్షేత్రానికి సంబంధించినంతలో నైతిక బాధ్యత అవుతుంది.
(2) నాహేతు బుద్ధికి; మలయ శ్రీ గారు (లేదా ఆవ్యాసరచయిత) ''గతంలో అన్ని మత గ్రంథాలూ, భూ కేంద్ర సిద్దాంతాన్నే సరైందనుకుంటుండేటివి'' అన్న అభిప్రాయంతో ఆ మాటలు వ్రాసి ఉంటారనిపిస్తోంది. ఖచ్చితమైన అర్థం పెట్టుకుని ఆ మాటలు వ్రాసి ఉండకపోవచ్చు. కానీ; పత్రికలో లేదా రచన రూపంలో ప్రకటించే అలాటి అభిప్రాయ ప్రకటనలకు ఆధారాలు పెట్టుకుని ఉండడం, అడిగినప్పుడు చూపించడం అన్నది సైద్దాంతిక స్థాయి కల పత్రికలకు తప్పని సరి.
(3) ఈ ముఖంగా నేను మీ ఇరుపక్షాలకూ ఒక మిత్రునిగా నిజాయితీతో చేయగల హిత సూచనేమంటే, భావ విప్లవ క్షేత్రాలలో పని చేసే వ్యక్తులూ, పత్రికలు, కథలూ, నవలల మాదిరి కాకుండా, శాస్త్రీయ వైఖరి, స్థాయి కలిగి ఉండే రీతిలో అభిప్రాయాలు ప్రకటించే విధానాన్ని స్వీకరించాలి అనుసరించాలి. ప్రశ్నించడం నేర్పుదాం అంటూ మొదలెట్టిన క్షేత్రాలూ, ప్రశ్నించకు అనడం బావుండదు కదా! అలాగే మక్కికి మక్కీ అర్థం చెప్పి మా గ్రంథం అలా ఎక్కడనింది లాంటి నిగ్గ దీసుడు కంటే, అన్నీ ఉన్నాయంటున్న ఆయా ప్రధాన మత గ్రంథాలలో దేనిననుసరిస్తున్న వారైనా, ఈ నాటి వైజ్ఞానికులు ప్రకృతిని గురించి ప్రయోగ పూర్వకంగా తెలుసుకున్న విషయాలతో పోలనీ, విభేదించే అంశాలు మత గ్రంథాలలో ఉన్నప్పుడు, ఎదుటి వారిని అడిగినంత నిక్కచ్ఛిగానూ, తమని తామూ ప్రశ్నించుకోవడం సరైందవుతుంది. భౌతిక, అభౌతిక వాద పక్షీయు లిరువురూ దీనిని గురించి ఆలోచించవలసి ఉంది. ఏమంటారు? ఈ సందర్భానికి సరిపడిందే ఒక ఘటన చెపుతాను, చాలా కాలంగా పలు దఫాలు మూర్తిగారి జనార్థన్‌ గారు వివేక పథంలో ఇతర రచయితల రచనలకూ చోటు కల్పించండి. పత్రికలో విభిన్న భావాలకు చోటు కల్పించండి. అంటూ సూచిస్తూ వచ్చారు. ప్రతిసారీ వారికి నేను, తమ భావాలు సరైనవేనని నిరూపించే బాధ్యత కల వారెవరి రచనలనైనా స్వీకరించడానికి నేను సిద్దము. అలా కాక తమ భావాలు సబబు బేసబబులకు బాధ్యత వహించని రచనలను భరించేంత సహనంగానీ, శక్తి గాని నాకు లేవు అంటూ వచ్చాను. ఒప్పుభావాలే సమాజంలోకి వెళ్ళాలి. తప్పుభావాలను సమాజం నుండి వెళ్ళగొట్టాలనుకునే వారికీ నిష్కర్ష తప్పని సరి.
స్పం (3) :- మిత్రులు సురేంద్ర గారి కంటూ పిఠాపురం నుండి గౌరవ్‌ ఇలా వ్రాస్తున్నారు. వివేక పథం పత్రికలన్నీ తీరిక చూసుకుని చదివాను, అనేక తాత్వికాంశాల పట్ల భిన్న సైద్దాంతిక ధోరణులకు చెందిన వాదనలనన్నిటినీ సమాజహితం కోసం చర్చకు (పరీక్షకు) పెట్టే బృహత్తర కార్యక్రమాన్ని నెత్తికెత్తుకుని, నిజాయితీగా కొనసాగిస్తున్నందుకు మీకు నా హృదయ పూర్వక అభినందనలు. మీ పట్ల కఠినంగా వ్యవహరించిన వార్ని సైతం సాదరంగా సామరస్య పూర్వక సమావేశాలకు ఆహ్వానించడం, అవాంఛనీయ శత్రుపూరిత వైఖరుల్ని విడవడానికి ముందుకు రావడం, సమాజ హితం కోరేవారందరూ కలసి పని చేయాల్సిన అవసరముందని ప్రతిపాదిస్తూ ఐక్యమిత్ర మండలి వేదికల్ని నిర్మించేందుకు కృషి చేయడం, ఇవన్నీ నాలాటి వారికి స్ఫూర్తి నిచ్చేవే. నిజానికి మన పరిచయానికి ముందే మీ మీద ఎన్నో ఆరోపణలు విన్నాను. వివేక పథాన్ని ఇప్పటి దాకా చదవడమే కుదర్లేదు. ఇప్పుడు చూస్తోంటే భావవికాసోద్యమానికి మీ వంతు చేస్తున్నారనిపిస్తోంది. మనం చర్చించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. సమయం చూసుకొస్తాను. ఈ రోజు 'మద్యం' ఒక బలమైన సమస్యని నా ఉద్దేశం. దీనిపైనా చర్చించాల్సి ఉంది.
ప్ర.స్పం : (3) యోచనాశీలత కల గౌరవ్‌కు; నా గురించి మీరు గమనించినంతలో మీరు వెళ్ళడించిన అభిప్రాయాలు నన్ను మీరు సరిగనే చూస్తున్నారనిపించేలా ఉన్నాయి. ముఖ్యంగా మండలి నిర్వహించిన తత్వ చర్చావేదిక అభూత పూర్వం. ఆ వేదిక నియమనిబంధనల తీరూ అపూర్వమైనదే. ఇక ఆరోపణలంటావా! అవి పుట్టకుండా ఆపడం చాలా కష్టం. వివిధ వ్యక్తులు వివిధ దృష్టికోణాల నుండి మనల్ని చూస్తుంటారు. కనుక అలాటి వాటిలో వారి వారి రంగుల్ని మనకు పులిమే వారూ, వాస్తవాలను వెళ్ళడించేవారూ ఉంటారు. వాస్తవాలన దగ్గ వాటిని తక్షణం, నిజాయితీగా స్వీకరించి అవసరమైన మార్పులు చేర్పులూ చేసుకుంటుండాలి సత్యానికి పెద్దపీట వేయగలిగిన వారంతా. ఇక పులుముడు రూపాలను వీలైనంత వరకు సహించడం, పాఠకులకూ అవగాహన కలిగిస్తుంది, అపోహలను తొలగిస్తుందనుకుంటే ప్రతి విమర్శకు సిద్దపడడం అన్నది వివేకవంతమవుతుంది. చాలా మాట్లాడాలన్నావు కనుక వీలు చూసుకుని వీలైనంత త్వరలో కలువు.
స్పం (4) :- తూ||గోదావరి జిల్లా, గొల్లపాలెం నుండి ఆ కేటి సూరన్న (హేతువాది) గారిలా వ్రాస్తున్నారు (1) మీ వివేకపథం - 198, 200 సంచికలు చదివాను. మీ సుదీర్ఘ సత్యాన్వేషణలో హేతువాద ఉద్యమావశ్యకతను గుర్తించినందులకు చాలా సంతోషము.
(2) హేతువాదుల లక్ష్యం భావవిప్లవం. అన్ని రకాల మౌడ్యాలకు, అజ్ఞానానికీ, దోపిడీలకు మూలమైన దైవభావన, మత భావజాలాలపై విమర్శతోనే హేతువాదం మొదలవుతుంది. ఆ తరవాత, అక్కడితో ఆగక మానవ వాదం వైపు పయనిస్తుంది.
(3) ఇప్పుడున్న హేతువాదులు అంటే హేతువాద వైఖరినంగీకరించిన వారెవరైనా, దేవునిపై నమ్మకంలేని హేతువాదిగనే తమను తాము చెప్పుకుంటారు. సమాజం కూడా ఆ అర్థంలోనే వారిని అంగీకరించుచున్నది. మిమ్మల్ని మీరు ముందుగా ఆ విధంగా హేతువాదిగా ప్రకటించుకుంటేనే, హేతువాదోద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ ప్రయత్నాలు సఫలమవుతాయని నా అభిప్రాయం.
(4) అలాకాక; నేనుమెరుగైన సమాజస్థాపన లక్ష్యంగా కల్గి, అందుకు సక్రమాలోచన, మరియు శాస్త్రీయ దృక్పథం కలిగి ఉన్నాను కాబట్టి నేను కూడ ఆ మేరకు హేతువాదినే అనిగాని; దేవుని పై నమ్మకం లేనివానిగా నేనింకా ఆ భావజాల స్థాయికి చేరలేదనిగాని, అసలా విషయం అంత ముఖ్యం కాదనిగానీ, దేవుని ఉనికి విషయంలో ఎలా ఆస్థికవాదం రుజువు కాలేదో అలానే హేతువాదమూ రుజువు కాలేదు. కనుక నేను మూడవ పక్షంవైపు ఉన్నానని పాత పాఠమే చెపుతుంటేగాని, హేతువాద సంఘాలు మీ భాగస్వామి పాత్రను అంగీకరించవు. మీ దగ్గరకు చేరవుకూడా.
(5) మీరు ప్రయత్నించే హేతువాద పునర్నిర్మాణ కార్యక్రమంలో, మీ నూతన హేతువాద నిర్వచనంలో; హేతుబద్దాలోచన ముందుగా దైవ భావనపై సంధించుట దాని ప్రధాన లక్ష్యం కాదన్నా, దాని అనుబంధ పదాల అర్థాలు ఎంత వివరించి చెప్పినా, దాని తాత్విక విధానాన్ని మార్చినా, ఆ విధమైన హేతువాదంతో ఎంత మందిని ఏకాభిప్రాయానికి తీసుకురాగలరో ఆలోచించగలరు. ఇందుకు భావసారూప్యత గల సంఘాలు అసలే అంగీకరించవు.
కాబట్టి నా సలహా ఏమంటే, గతంలో వివేకపథం 186, 188 సంచికలాధారంగా నేను వ్రాసిన విధానాన్ని సూచనలను ఆధారం చేసికుని, మీ మండలి స్థాయిని తగ్గించుకోకుండగనే, కృషి చేస్తే మంచిదని నా అభిప్రాయం - ఇందులో ఆ నాటి లేఖ కాఫీని కూడా జత చేస్తున్నాను.
ప్ర స్పం :- యోచనాశీలురూ మిత్రులూ సూరన్నగారికి; మీ లేఖా రీతి మీలోని సమాజం బాగుండాలన్న ఆకాంక్షను తెలుపుతోంది. దాంతో బాటు కొన్ని అభిప్రాయాల విషయంలో నాతో విభేధిస్తున్నట్లూ, అయినా నన్ను వ్యతిరేక (శతృ) వర్గం వాణ్ణిగా కాక, మిత్ర వర్గానికి చెందిన వాణ్నిగనే తలంచుతున్నట్లూ తోపింపజేస్తోంది. మీ రెండు లేఖాంశాలూ కేవలం మన ఇరువురికి సంబంధించినవిగా మాత్రమేగాక, సమాజావగాహనకూ పనికి  వచ్చేవిగానూ, ఆలోచించదగినవిగానూ ఉండడంవల్ల, ఆలోచనాపరుల ఆలోచనకకు దోహదపడతాయనిపించిన రీతిలో అంశాల వారీగా ఒకింత విశ్లేషణ చేయడం మంచిదనిపించింది. అందుకే ఈ లేఖ ఈ రీతిగా పాఠకుల ముందుకు తెస్తున్నాను. మీరూ ఆలోచించండి.
(1) నిజానికి మీరనుకున్నట్లు; హేతువాద ఉద్యమావశ్యకతను నేనీనాడు కాదు గుర్తించింది, ఆధ్యాత్మిక జీవితంవైపుకు మరలిన నాడే గుర్తించాను. ఆ మార్గంలో కొంతదూరం నడిచాక 1981 ప్రాంతాలలో పెంచలయ్యగారితో భేటీపడి నేనెత్తుకున్న ఆస్థికపక్షాన్ని స్థాపించలేని క్షణం నుండి అది మరింత బలం పుంజుకుంది. అనంతరం ప్రమాణక్షేత్రాల నెరిగి, దానిని వినియోగించుకోవడంలో ఒకింత పట్టుదొరికాక, హేతుబద్దాలోచనశక్తి, పరిమితులూ కూడా బోధ పడిస్థిరపడింది. అనంతరం జీవితం కొంత వరకు అర్థమైందనుకున్నాక, సమాజాన్ని అతిగా ప్రభావితం చేస్తున్న భావజాలంలోని లోటుపాట్లు కొంతమేర వరికయ్యాక, ఈ విషయాలు సమాజం ముందుంచాలని అనిపించి మొదలెట్టిన మేలుకొలుపు తొలి సంచికలలోనే ఈ విషయాలు క్లుప్తంగా చెప్పానుకూడా. మీ పరిశీలన కొరకుగా ఒకటిరెండు ఆధారాలిస్తాను చూడండి. 1.8.91 నాటి మేలుకొలుపులో స్వమంతవ్యం (నేనూ - నా పత్రిక) పేరున వ్రాసిన వ్యాసంలోనే (3వ పేజీ) (1)... ప్రస్తుత నా బుద్ధి స్థాయిననుసరించి నేనే మతస్థుడినీ కాను, ఏ కులస్థుణ్ణీకాను, ఏ వర్గానికీ చెందిలేను. ఇది నా మనస్సు నా గురించి నాకు చెపుతున్న విషయం.'' అని ప్రకటించాను.
(2) కపటులూ, స్వార్థపరులూ ఆస్థిక క్షేత్రాలలోనే ఎక్కువగా ఉంటున్నారు. నిజానికి, నాస్తిక, హేతువాద సంఘాలు ఆస్థిక సమాజం యొక్క వికృత రూపాలకీ, దాని ప్రవర్తనకు ప్రతి క్రియాత్మకంగా ఏర్పడినవేనన్నది ఒక చారిత్రక వాస్తవం (15.6.91)
(3) సబబైన మాట పసివాడు చెప్పినా స్వీకరించదగిందే, బేసబబు మాట ఎంతవాడు చెప్పినా విడువవలసిందే.
(4) హేతువాదులమనుకునే వారిలోని అహేతుకవైఖరినీ,... కమ్యూనిస్టుల మనుకునేవారిలోని కమ్యూనలిజాన్ని మేము తరచుగానే గమనించాము.
(5) సంశయించి పరీక్షించడం, నిగ్గుతేలిన వాటిని స్వీకరించడం అన్న విధానాన్ని అనుసరించాలన్నాను.
(6) మండలి ప్రధాన కార్యక్షేత్రమైన ప్రమాణ విద్యలోని అనుమాన ప్రమాణ (తర్క) క్షేత్రమంతా హేతుబద్దాలోచన అన్న దానికి సంబంధించిందే.
(7) ఇక గుత్తా రాధాకృష్ణగారు నాకు పరిచయమైన నాటి నుండీ హేతువాద ఉద్యమం సామాజికావసరమని చెపుతూనే వస్తున్నాను. అటు తరవాత 1995, 96 ప్రాంతాల నుండి 'హేతువాదులకు హేతువాద పాఠాలు' అంటూ తరగతులూ నిర్వహించాను.
(8) గుత్తా రాధాకృష్ణగారి సంస్మరణ సమావేశంలోనూ, హేతువాద ఉద్యమం సామాజికావసరమనీ, ఆ పనిలో స.మండలి 100% నిజాయితీతో నిండా మునిగి పనిచేస్తుందనీ చెప్పాను. సందర్భం వచ్చినప్పుడల్లా ఆ విషయాన్ని విస్పష్టంగా ప్రకటిస్తూనూ వస్తున్నాను. ఇది జరిగిన వాస్తవం.
(2) హేతువాదుల లక్ష్యం భావ విప్లవమన్నారు. నిజానికామాటకు ఆ మాటంటున్న వారంతా అంగీకరిస్తున్న అర్ధం ఏమిటి? విప్లవమంటే తక్కువ కాలంలో అతి త్వరితంగా వచ్చే మౌలికమైన లేదా గుణాత్మకమైన మార్పు అని అర్ధం చెప్పుకుంటున్నాం దానికి భావమన్న దానిని జతకూరిస్తే  భావాలలో అతిత్వరితంగా ఏర్పడే మౌలికమైన మార్పు అని అర్థం వస్తుంది. ఆ సాదారణార్థాన్ని మీరు ప్రత్యేకంగా ఏ విషయాలతో ముడిపెట్టి వాడుతున్నట్లు? ఏ భావాలు పోయి, ఏ భావాలు వస్తే, దానిని మీరు భావ విప్లవం వచ్చిందంటారు? (1) ఇది స్పష్టంగా చెప్పగలగాలి. మీరనుకునే భావసారూప్యత కలవాళ్ళంతా ఒకే మాట చెప్పగలగాలి. అదలా ఉంచితే అన్ని రకాల మౌఢ్యానికీ, అజ్ఞానానికీ, దోపిడీలకు మూలం దైవభావనేనన్నారు. అదేలా వాస్తవమో రుజువు చేయాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. దైవభావన, మత భావనలపై విమర్శకు నేను విముఖుణ్ణికాదు సరికదా పట్టుబట్టి, ఒక పద్దతి ప్రకారం, ఆ పక్షం వాళ్ళూ కాదనలేని రీతిలో వాటిని విమర్శిస్తూ వస్తున్నవాణ్ణి. ఏదైనా ఒక ధోరణికి చెందిన (మత) భావజాలాన్నిగానీ, అది అంగీకరిస్తున్న దైవ భావాన్నిగానీ విమర్శించాలంటే, విమర్శకునికి ఉండాల్సిన అర్హతలు, సామర్థ్యాలు ఏమిటో తెలిసుండాలి. అవేమిటో మీరుగానీ, మీరు ఇతడూ హేతువాదేనని అంగీకరించేవారిలో నేనెంచుకున్న వారుగాని ఒకేరకంగా చెప్పాలి. ఆస్థికులు బండగా దేవుడున్నాడంటున్నట్లే, హేతువాదులూ మొండిగా దేవుడు లేడనగూడదు. అన్న వెంకటాద్రిగారి మాటలు అంగీకరించితీరాలి. దేవుడులేడు అన్న నిర్ణయానికి ఎలా చేరారో నాస్థికులూ, నాస్థికత్వాన్నంగీకరిస్తున్న హేతువాదులూ, ఇతరులూ కూడా యోగ్యమైన ఆధారాలు చూపుతూ చెప్పగలగాలి.
ఇక్కడ నావైఖరి స్పష్టం ఆస్థిక్యతను నిరూపించమనిగానీ, అది నిరూపించ దగిందికాదనిగానీ, ఇప్పటికీ అభౌతిక పదార్థాపు ఉనికి అనిర్థారితమనిగానీ అంటున్నామంటే, అది ఆస్థికతను యోగ్యమైన రీతిలో విమర్శకులోను చేస్తున్నామనే కానీ ఆ పని చేయడానికి నాస్థికుడవ్వాల్సిన పనిలేదన్నది ఎంత మంది హేతువాదులకు తెలుసు?!
దైవవాదాన్ని విమర్శించడంతో ఆగక హేతువాదం మానవవాదం వైపు పయనిస్తుంది అనన్నారు. ఇంతకూ హేతువాదం క్రిందికి ఏయే భావాలువస్తాయో, మానవ వాదమంటే ఏమిటో, హేతువాదం మానవ వాదం వైపు పయనించడమంటే ఏమిటో మీరూ, మీరు భావసారూప్యతకలవాళ్ళం అంటున్నవాళ్ళు ఒకే రకంగా వివరించి, నిర్థారించాల్సి ఉంటుంది. హేతువాదం ఒక సిద్దాంతం కాదంటున్న పక్షం వాళ్ళైన మీరు, మానవ వాదాన్ని సిద్దాంతమంటున్నారా? లేదా? వివరాలు కావాలి.
(3) వచ్చిన ఇబ్బందిదేకదా! ఇప్పుడు హేతువాదులుగ చెప్పుకుంటున్న వాళ్ళంతా తాము నాస్థికులం అనే చెప్పుకుంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని హేతువాద సంఘాలు ప్రచారంలోకి తెచ్చిన భావనే. ఆ రెంటి వివరాలు తెలియాల్సినంత తెలియకుండగనే హేతువాద సంఘాలలో సభ్యులైనవారు దానిని నమ్మకంగా తలకెత్తుకున్నారు. హేతువాదులంటే దేవుళ్ళను తిట్టేరకంగానే జనంలో కనబడుతుండడంతో జనమూ అలానే అనుకుంటూ వచ్చారు. జరిగిన ఆ తప్పును (పొరపాటును) సరిజేసి, హేతువాదం యొక్క విస్తారమైన క్షేత్రాన్ని గురించి   తామర్థంచేసుకొని, జనానికీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత  హేతువాద పక్షం వారిపైనే ఉందన్నదే ఆది నుండే నేను చెపుతూ వస్తున్నాను. ఆ మేరకు మీరు సరిచేసుకోవలసింది పోయి, నన్ను ఆ అపసవ్యతలోకి రమ్మంటారేమిటి?
(4) సక్రమాలోచన ఒక్కటే హేతువాదం కాదు. హేతువాద భావజాలంలో అదీ ఉంది. అలాగే శాస్త్రీయదృక్పథం యొక్క అవసరాన్నీ నొక్కి చెపుతుంది హేతువాద సిద్దాంతం. ఆ రెండూ ఉన్నంత మాత్రాన్నే ఒకడు హేతువాదికాజాలడు దేవునిపై నమ్మకం లేని వాళ్ళంతానూ హేతువాదులు కాజాలరు(కారు) అలానే దేవుని పై నమ్మకం లేనివాళ్ళంతా నాస్తికులూ కాదు. నిజానికి నాస్థికులంటే దేవుడు లేడన్న దానిపై నమ్మకం ఉన్నవాళ్ళు. నేను ఈ రెండో రకం నమ్మకమూ లేనివాణ్ణంటున్నానేగాని, దేవుడున్నాడన్న నమ్మకం ఉన్న వాణ్ణంటంలా. దేవుడున్నాడన్న నమ్మకమూ లేని వాణ్ణే నేను. నిజానికి హేతువాద దృష్టి తగినంతగా కలిగి ఉంటే, ఇలాటి విషయాలలో నమ్మకాల దగ్గరకు పోకుండా రుజువుల దగ్గరకే పోతాడు వ్యక్తి. చాలా మంది హేతువాదుల మనుకునేవారికంటే, హేతువాదం అర్థమైన వాణ్ణనుకుంటూండబట్టే, నేను ఆస్థిక నమ్మకానికీ, నాస్థిక నమ్మకానికీ దూరంగా ఉండగలుగుతున్నాను. ఏ ధోరణికి చెందిన ఆస్థికుల్నైనా (నాస్తికుల్నైనా) మీదెలా నిర్ధారితాంశమో తెలియజెప్పండని అడుగుతూ వస్తున్నాను. ప్రశ్న నంగీకరించాలి, ఆహ్వానించాలి, ఆస్థికుల మాదిరి బండ సమాధానాలు చెప్పగూడదంటుండే నాస్థిక, హేతువాదులు నా ఈ ప్రశ్నను ఆహ్వానించి, స్వీకరించి, సహేతుకంగానూ, యోగ్యమైన ఆధారాలు చూపుతూనూ నాస్థికత్వాన్ని స్థాపించాలి. అలా జరిగిన మరు క్షణం నేను ఆ విషయాన్ని వివేకపథంలో ప్రకటించి, అప్పటి నుండి నాస్థికునిగా కొనసాగగలను. లేదంటే ఏమి చేయాలో మీరే ఆలోచించుకోవలసి ఉంది. హేతువాదిగా కొనసాగడానికి ఆస్థికుడుగాగాని, నాస్థికునిగా గానీ ఉండఖ్ఖరలేదన్నదే ఇప్పటికీ నా పక్షము. ఈ విషయంలో నేను వక్రంగా ఉన్నాననుకునేవాళ్ళు నన్ను చక్కజేస్తే చక్కనవడానికి నేను సిద్దంగా ఉండగలను. ఆస్థికత రుజువు కాలేదన్నమాట నేనెలా అంటున్నానో మీ పక్షం వాళ్ళందరూ అలానే అంటున్నారు. ఇది నిజమా కాదా? ఇక 'హేతువాదం రుజువు కాలేదు' అని ఎవరన్నారు? నాస్తికత్వం అనబోయి 'హేతువాదం' అని అనుంటారు! కాని వెంకటాద్రి గారు పలుమార్లు హేతువాదమంటే నాస్తికత్వం కాదని ప్రకటించారు. కనుక 'హేతువాదం' 'నాస్తికత్వం' పర్యాయపదాలుగా వాడనేకూడదు. నాస్తికత రుజువు కాలేదిప్పటికీ అన్నది నా పక్షం రుజువైందంటే, ఎప్పుడు, ఎక్కడ, ఎవరా పని చేశారో, ఇప్పుడు చేయగలరో ఆ వివరాలివ్వండి పరిశీలిస్తాను.
పరిశీలనలో, ప్రయోగంలో నిర్థారణైన విషయాలవైపు భావాలలో మార్పులు చేసుకోడానికి సిసలైన హేతువాది ఎప్పుడూ సిద్దంగా ఉంటాడు. అలా సిద్దంకాని వాణ్ణి హేతువాది అనడమే కుదరదు అన్న వెంకటాద్రి గారి మాటలు 100% నాకు అంగీకారమే. మరి మీ మాటేమిటి? ఇది గనక మీరు అంగీకరించి అనుసరిస్తానంటే, మిగిలిన హేతువాదులూ ఇందుకు సిద్ధపడితే, తేలిన వాస్తవం దగ్గర వక్కటవడానికి ఎవరికీ అభ్యంతరం ఉండఖ్ఖర్లేదు.
ఆమిత్రులు సూరన్న గారికి; నా ఈ విశ్లేషణ కేవలం మిమ్ముద్దేశించిందికాదు. మీరు లేవనెత్తిన అంశాలు మౌలికమైనవి అందరమూ అవగాహన చేసుకుని ఉండాల్సినవీ అవడంతో, మిమ్మడ్డుపెట్టుకుని నాదృష్టికోణాన్ని పాఠకులందరకూ చేరవేయాలనుకునే ఇలా స్పందించాను. ఒకింత కరకుగా ఉందనిపించిన వాటి విషయాన్ని గట్టిగా పట్టించుకోకండి. విషయపరంగా తేడా ఉందనిపిస్తే నిర్మొగమాటంగా విమర్శించండి. వ్యక్తిగత విమర్శవద్దు. మీరన్నట్లు 186, 188 సంచికలు చాలా భావగాంభీర్యం కలవే. వివేకపథం పాఠకులూ వాటిని మరొకసారి నిశితంగా పరికించగలిగితే బాగుంటుందని నా అభిప్రాయం.
దేవుడనేది అనవసరపు భావనా? అవసరమైనదా? అని మొదటిలేఖలో అడిగారు. ఈనాడది అనవసరపు భావనేనని ఏనాడో నిర్ద్వంద్వంగా ప్రకటించానునేను. అంతేకాదు, సత్యాన్వేషణ మండలికి, పుట్టకముందు విషయాలతోగానీ, మరణానంతర విషయాలతో గాని పనిలేదనీ ప్రకటించాను. మా భావజాలమంతా పుట్టి, చచ్చేలోపల 'వ్యక్తీ - సమాజము - ప్రకృతి' అన్న మూటికి సంబంధించి ఈ లోకానికి పరిమితమైనది మాత్రమే.
తేలని, రుజువులు లేని నమ్మకాల విషయంలో దేవుడున్నాడని, లేడని వాద ప్రతివాదనలు చేసేవారిని కూర్చోబెట్టి చర్చలు సదస్సులు నిర్వర్తించితే, అవి సత్యాసత్య వివేచనకు ఎలా ఉపయోగపడతాయో ఆలోచించండన్నారు. నామాటేమిటంటే, నిజంగా మీరన్నట్లు అవి ఇప్పటికీతేలని, రుజువులులేని విషయాలేనన్న నిర్ణయానికి వచ్చారా మీరూ. నేనక్కడికి చేరాను చాలాకాలం క్రితమే. నా అన్వేషణలో అవి తేలనివీ, రుజువులు లేనివీ అని తేలుతుండగా, ఆ రెండూ తేలినవేనని పట్టుకు కూర్చున్న వారిని కూర్చొబెట్టుతున్నది, అవెక్కడ తేలాయో తేల్చండని అంటున్నది, వారికీ నేను చూస్తున్న దానిని చూపించాలనే. ఈ విషయంలో సత్యం తెలిసిందనుకుంటున్న నాకు, ఆ విషయాన్ని సమాజానికి ఎరుక పరచడమూ బాధ్యతై ఉంది.
స్పం (5) :-               ప్రత్యేక ప్రకటన
నా విజ్ఞప్తిని మన్నించి, నా మీద (నా సామర్థ్యం మ్మీద, నిజాయతీ మీద) నమ్మకముంచి చీరాల నుండి ఎన్‌.వి. బ్రహ్మంగారిలా వ్రాస్తున్నారు. ఇది ఆయన పి.డి సుందర్రావు గారికి పంపిననలేఖనకలు అని చెప్పారు.
మిష్టర్‌ పి.డి సుందరావ్‌! నీవు గతంలో చీరాలవచ్చి నన్ను ఛాలెంజ్‌ చేస్తే నేను ఓడిపోయానని ఒప్పుకున్నానని, ఎందుకు అబద్దపు ప్రచారంతో ప్రగల్భించావు? అప్పుటి బైబిలు బండారంలోని అవతారికను అలాగే ఉంచి, 'అసంబద్ధా'లకు తోడు మరో నాలుగు భాగాలనూ చేర్చి, పుస్తకం పేరును 'బైబిలే పలుకుతోంది'గా మార్చి పునఃప్రచురణ చేశాను. అవతారికంటే ఉపోద్ఘాతమే కనుక, అది మిగిలిన పుస్తకానికంతటికీ అవతారికగానే ఉంటుంది. లోగడ నీవు చేసింది అబద్దపు ప్రకటనే అని ఒప్పుకుంటూ మళ్ళీ ప్రకటిస్తూ ఆ ప్రకటన కాపీని నాకు పంపు. లోగడి నీ ప్రకటనల్లో వివాదాంశాలు మరికొన్నీ ఉన్నాయి. వాటిపై సత్యాన్వేషణ మండలి, దోరకుంట, అధ్యకక్షులు పుట్టా సురేంద్రబాబుగారు మీతో తలపడడానికి సిద్దంగా ఉన్నారుకదా! ఆ  సందర్భంగా వారు నా తరపున కూడా, నా ప్రతినిధిగా మీతో పోటీ పడడానికి నేను చిత్తశుద్ధితో ఆమోదిస్తున్నాను. అంతేకాదు, ఆయన గెలుపోటములు నావిగా స్వీకరించడానికీ సిద్దంగా ఉన్నాను. ఎన్‌.వి. బ్రహ్మం - (గారి సంతకం) 27.8.13
ప్ర.స్పం :- ధన్యవాదాలు బ్రహ్మంగారూ! భావజాల పరంగా మనమధ్యనున్న పరిచయానికీ, స్నేహానికీ కూడా వన్నెతెచ్చే విధంగా ఉంది మీ లేఖ. పి.డి. సుందర్రావు పోటీకి రావాలేగాని అతగాడు నాకవుటే. మీరు నిశ్చింతగా ఉండండి. ఇక ఈ లేఖాధారంగా ప్రగల్భాల పి.డి సుందర్రావుకు మరోసారి సవాలు రూపంలో ఆహ్వానం పలుకుతున్నాను. ఆయన 'కూతకు దొరకడని' ఇప్పటికి జరిగిందాన్ని బట్టి అనిపిస్తున్నది కనుక, అత్యంత పరుషంగానూ మాట్లాడి, మాటిమాటికీ గిచ్చీ, గిల్లీనన్ను రెచ్చగొట్టిన జగద్గురు గారుగానీ, ఈ సం|| కాలంగా నా రచనలను చూస్తున్న ఆ పక్షపు వందిమాగధులుగానీ, ఆయన దాక ఎందుకు, మేము చాలు దీనికి అంటూ తెగ ప్రగల్భించే, తొడలు చరుచుకునే ఆయన కొడుకు, అల్లుడూ, మరికొందరు చిన్న గురువులుకానీ పూనుకుని బైబిలు పైనా సైన్సుపైనా పి.డి. సుందర్రావు మాట్లాడిన అంశాలపై చర్చకు సిద్దపడవలసిందిగా వారిని ఒప్పించనైనా ఒప్పించండి, ఎన్‌.వి. బ్రహ్మంగారు తన తరపున నన్ను పోరాడమనీ, నాగెలుపోటములు తనవిగా స్వీకరించగలననీ ప్రకటించినట్లు, ఆయన తరపున నాతో చర్చించడానికి, ఆయన అంగీకరించిన ప్రతినిధిగా ఆధారం చూపి మీరైనా సిధ్దంకండి.
లోకంలో మామూలుగానైతే, బలమైన ప్రత్యర్థిని ఓడించడానికి కొన్ని సందర్భాలలో తల ప్రాణం తోకకొస్తుంది అన్నంతగా శ్రమ పడాల్సి ఉంటుంది. కాని అదేం విడ్డూరమో మన పి.డి. సుందర్రావు గారిని పోరాటానికి సిద్దం చేయడానికే తలప్రాణంతోక కొస్తోంది. అన్నంతగా శ్రమ పడాల్సి వస్తోంది. పి.డి.సుందర్రావుకు ఒక్కమాట! నిజానికి మొన్నీమధ్య నీ నోటితుత్తర అంశాన్ని జనం పట్టించుకోక పోబట్టి బ్రతికిపోయ్యావుగానీ, అంతలేసి మాటలన్నందుకు భారత ప్రజ నిన్నెంతగా వీధులెంట పరిగెత్తించినా నీకు చేయాల్సిన ప్రాయశ్చిత్తానికి సరిపోదు. అది సరేలే! ఎప్పుడు ఎక్కడ బైబిలుపైనా, సైన్సు పైనా చర్చకుకూచుందామో ఇప్పుటికైనా పలకవయ్యా బాబూ!
ఈ సందర్భానికే చెందిన ఒక విజ్ఞప్తి
యోచనాశీలురైన రావిపూడి వెంకటాద్రిగారికి; పి.డి. సుందర్రావు గారు నాకు వాడు చాలడు, వీడు చాలడు రావిపూడి వెంకటాద్రితోనైతే చర్చకు రెడీ! అంటూ గతంలో చాలా ప్రకటనలు చేశాడు. దానికి బదులుగా మీరు అనవలసినవి అని వాటినీ రచన రూపంలోనూ ప్రచురించారు. ఇతరేతరాంశాలలో కొన్నింట మన మధ్య బినాన్నభిప్రాయాలున్నా; ఏ మత గ్రంథమూ దైవ ప్రాప్తం అనడానికి సరిపోదు. గ్రంథాలన్నీ మానవకృతాలే అన్న విషయంలోగానీ, బైబిలు ఆదికాండంలోని సృష్టిక్రమం అవైజ్ఞానికం, అజ్ఞానమూలకం అన్న విషయంలో గానీ, ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని కించపరుస్తూ సుందర్రావుగారు మాట్లాడిన విషయాలు అతనిలోని అజ్ఞానాన్ని (అవగాహనారాహత్యాన్ని) తేలిపేటివేనన్న విషయంలోగాని ఏకాభిప్రాయంతోనే ఉన్నాము. కనుక ఆ విషయాలకు పరిమితమై అతనితో మాట్లాడడానికి, మీ ప్రతినిధిగా నన్నంగీకరిస్తున్నట్లు ప్రకటించగలరేమో ఆలోచించండి. ఈ విషయాలలో నా అవగాహనను, మీరు ఒకసారి పరిశీలించి చూసుకోవాలనుకుంటే ఈ విషయం వరకు మిమ్ము కలసి మాట్లాడడానికీ నేను సిద్దము. నా ఆకాంక్షల్లా గత పాతికేండ్లు పై బడి పి.డి. సుందర్రావు గారు ప్రవర్తిస్తున్న అనుచిత పోకడకు ఒక ముగింపు పలకాలన్నదే. ఈ విషయంలో అవకాశముంటే, అతడు ఛాలెంజ్‌ చేసిన లేదా అతణ్ణి ఛాలెంజ్‌ చేసిన ఈదేశంలోని (రాష్ట్రంలోని) మరికొందరి నుండీ ఇలాంటి అనుమతిని పొందే యత్నమూ చేస్తాను. మీ అందరి ప్రతినిధిగా అతణ్ణి చర్చకు ఆహ్వానిస్తాను. అప్పటికీ అతడు రాకుంటే టి.విలో ఒక ప్రత్యేక కార్యక్రమం పెట్టి, రాష్ట్రంలోని వివిధ ధోరణులకు చెందిన ప్రసిద్దులందరికీ కబురందించి బహిరంగంగా అతణ్ణి చర్చకు పిలుస్తాను. అందుకూ అతడు చలించకుంటే చివరి యత్నంగా న్యాయాలయం ద్వారా అతణ్ణి విచారణకు సిద్దం చేసే యత్నం చేస్తాను. ఆ తరవాత ఏమి చేయాలన్నదీ అంత వరకయ్యాక ఆలోచిస్తాను.
స్పం :- హైద్రాబాద్‌ నుండి రాజేంద్రప్రసాద్‌ గారిలా వ్రాస్తున్నారు. సురేంద్ర బాబుగారికి; వివేకపథం 201లోని స్పందన - ప్రతిస్పందననూ, హేతువాది ఆగస్టు 2013లోని ''మరల మరో గెలుకులాటా'' అనే విమర్శనాత్మక వ్యాసము చదివాను. హేతువాదిలోని వ్యాసము నన్ను కొంత కలవరపరిచినది. సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలనే తృష్ణ కలవారు చాలా తక్కువ మంది ఉన్నప్పుడు ఇలాటి విమర్శ లేక ప్రతి విమర్శలు అవసరమా అనిపించింది. సిద్దాంత పరంగా భేదాభిప్రాయాలుండడం సహజమే. ప్రతి ఒక్కరూ ఒకే స్థాయి కలిగిన అవగాహనాపరులు కాలేరుకదా! యిలాటి విమర్శలకు బీజం పడి చాలా కాలమైందనీ, దాని ప్రభావమే ఈ వ్యాసం అనీ అనుకుని ఊరుకున్నాను. ఈ విమర్శకు కారణం ఈ రెండు సంస్థలకూ అనగా మీకూ రావిపూడి మాష్టారుగారికీ సిద్దాంత పరంగా ఉన్న బేధాభిప్రాయాలేగాని, వ్యక్తుల పరంగా లేవని నాభావన. ఈ విభేదాలకు కారణాలు రెండు రకాలుగా ఉన్నాయి. (1) సిద్దాంత పరంగా అతి ముఖ్యమైనవి (2) అంత ముఖ్యం కానివి.
(1) అతి ముఖ్యమైన వాటిలో నాకు తెలిసినంతవరకు, ''సత్యంమారుతుందా? సత్యం శాశ్వతమా కాదా?'' అనే అంశంపైన విభేదించుకుంటున్నారనుకుంటున్నాను. కనుక, ఈ విషయం మ్మీద చర్చించుకుని ఏకాభిప్రాయానికి వస్తే, చాల వరకు ఇతర భేదాభిప్రాయాలు కూడాపోతాయి. 'సత్యం' అనే పదం యొక్క అర్థాన్ని వేర్వేరుగా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈ విషయం అందరికీ ఒకేలా అర్థం కావలసి ఉంది. నా అవగాహన ప్రకారం, సత్యమంటే వాస్తవానుగుణ్యత కల జ్ఞానం అనే.
(2) అతి ముఖ్యమైన వాటిలో ''సిద్దాంతమని దేనిని అనాలి? ఒక దానిని సిద్దాంతం అనాలన్నా, అనకూడదని అన్నా, దానికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి?'' అనేదీ ఒకటి. దీనిని గురించిన అవగాహనా అందరికీ కలిగితే మంచిదేగాని, ప్రత్యేకించి సిద్దాంతకారులకు మాత్రం తప్పనిసరి.  సామాన్యులకు ఆ అవగాహన అవసరం లేదంటాను. సిద్దాంతమన్నా, సూత్రమన్నా, మరో పేరేదైనా పెట్టినా పెద్ద తేడా ఏమీరాదు. విషయంపైన అవగాహన కలగడమే ముఖ్యంగాని, దానిని సిద్దాంతమనాల్నా వద్దా అన్నది మా బోటి వారికి అవసరంలేదు. కనుక అలాటి వాటిపై ఏర్పడ్డ భేదాభిప్రాయాల్ని వెంటనే తేల్చుకోవలసిన అవసరం లేదని నా భావన. సమయం సందర్భం వచ్చినప్పుడు తేల్చుకోవచ్చు.
(3) అతి ముఖ్యం కానివి చాలా ఉన్నేౖ. అలాటివి సామాన్యులకు అర్ధమైతే చాలు. లోతైన అవగాహన క్రమంగా వస్తుంది. అలాటి విషయాలకు మీరు ఇవ్వవలసిందానికంటే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారనీ, వెంకటాద్రి గారు అంత ప్రాముఖ్యతనివ్వక్కరలేదన్న దృష్టితో ఉన్నారనీ అనుకుంటున్నాను.
(4) మీ యిరువురి రచనా విధానంలో తేడా ఉంది. మీ రచనలు చదివి అవగాహన చేసికోవడానికి చాలా సమయం పడుతుంది. లోతైన అవగాహన కలుగుతుంది. వెంకటాద్రిగారివి చదవడానికి ఎక్కువ సమయం పట్టదు. అవి సామాన్యుల కోసం వ్రాసినవి అనిపిస్తుంది. నిజానికి రెండు రకాల రచనలూ ఉండాలి. (1) సామాన్యుల కోసం క్రింది స్థాయిలో (2) ఎక్కువ సామర్థ్యం కలవారికోసం ఇంకొంచం ఎక్కువస్థాయిలో. సామాన్యుల కోసం వ్రాసిన రచనలలో అంత ముఖ్యం కాని అంశాలను లోతుకు వెళ్ళకుండా, వారికి అర్థమయ్యేట్లు వ్రాస్తే చాలు. వాటిపై లోతైన అవగాహన పొందగోరేవారు, క్రమంగా ఆలోచించుకునిగానీ, శిక్షణ తరగతుల ద్వారా గాని, రెండవరకం రచనలు చదవడం ద్వారా గానీ వాటిని తెలుసుకోగలుగుతారు.
(5) హేతువాదులకు ఏ వ్యక్తిగానీ, రచనగానీ ప్రామాణికంకాదని అందరం అంగీకరించాం. అలాగే హేతువాదం కూడా. ఈ భావనాధారంగానే నే నీ లేఖ వ్రాయగల్గుతున్నాను. ఈ విషయంలో మీరిరువురూ నాకు ప్రామాణికులు కారు.
(6) ఎం.కె. గౌరవ్‌ గారు ఏమి వ్రాశారో నాకర్థం కాలేదు. చివరకు వ్రాసిన గమనిక మాత్రం అర్థమైంది. అదిన్నీ అన్యాపదేశంగా ఉంది. నేరుగా మీకే వ్రాయవచ్చుగదా? అందులో దాపరికమెందుకు.
(7) రావిపూడి గారి రచనలలో, సత్యాన్ని గురించి పరస్పర విరుద్దభావాలున్నాయి. వాటిని నేనూ గమనించాను. కానీ ఆ దోషం అనాలోచితంగా జరిగి ఉంటుందని భావిస్తాను. ఒకసారి ఒక భావన కలిగిన మనిషి దానికి విరుద్దమైన భావనను ఉద్దేశపూర్వకంగా ఇంకోచోట తెలియపరుస్తారని నేను భావించడంలేదు. వారి మనసులో ఏముందో, మనకేమి చేరిందో, అలా జరగడానికి వివిధ కారణాలుండవచ్చు. యిలాటి దోషాలు ఇతరుల రచనలలోనూ ఉన్నాయి. మీ రచనలలో కూడా.
(8) ఈ లేఖ నకలును వెంకటాద్రిగారికీ, సత్యన్నారాయణ గారి పేరు మీద పంపుతున్నాను. వారు కూడా స్పందిస్తారని తలుస్తాను. ఇట్లు ప్రసాద్‌
ప్ర.స్పం (6) :-  మిత్రులు రాజేంద్రప్రసాద్‌గారికి; మీ లేఖ ప్రారంభంలో, మీరన్నట్లు, వెంకటాద్రిగారికీ, నాకూ మధ్య వ్యక్తిగతవైషమ్యాలు ఉండనక్కరలేదు. నావైపు నుండి మాత్రం వ్యక్తిగత విమర్శలు వద్దంటూ ఆది నుండి చెపుతూనే వచ్చాను. ఏ భావజాలానికి చెందిన వ్యక్తులతోనైనా మండలి వైఖరి అదేనన్నది గత పాతికేండ్లుగా వస్తున్న మేలుకొలుపు, వివేకపథాలను జాగ్రత్తగా చదువుతున్నవారికి తెలిసున్నదే. నన్నెరిగిన వారికీ, నేను వ్యక్తిగత శతృత్వ వైఖరినవలంభించే వాణ్ణి కాదన్న విషయం తెలుసు. అవగాహనల్లోనూ, పోకడల్లోనూ ఉన్న వ్యత్యాసాలను ప్రక్కన పెడితే, సమాజహితం కొరకుగా నిబద్దతతో జీవితాన్ని వెచ్చించిన వ్యక్తిగా, మాముందుతరం ఉద్యమకారునిగా, వెంకటాద్రి గారిపట్ల నాకిప్పటికీ గౌరవభావనే ఉంది. ఆ మేరకు ఇక ముందూ ఉంటుంది. ఇక విషయపరంగానైనా, ఇరువురమూ, ఒప్పు భావాలు సమాజానికందాలి, ఉన్న తప్పు భావాలను పోనాడాలి, అన్నంతవరకు సమానశీలురమే గనక, భిన్నాభిప్రాయాలున్న సందర్భాలలోనూ శతృదృష్టి అనవసరమే అవుతోంది. ఏదో ఒక సందర్భంలో మానవికమైన ఆవేశాలకు లోనైనా, వీలయినంత త్వరగా వివేకం అదుపులో మరల స్వస్థచిత్తులం కావాలన్నదీ తెలిసున్నదే. అభ్యుదయాకాంకక్షుల మధ్య వ్యక్తిగత స్పర్థలుండరాదన్న ప్రగాఢ వాంచకలవాణ్ణి నేను. గత 20 ఏండ్లుగా మంచి వాళ్ళందరనూ కలవగలిగిన మేరనైనా కలపి ఉద్యమించాలన్న యత్నాలు చేస్తున్నట్లు మీకూ తెలుసు. సరే అంశాలవారీగా మీ లేఖ పై స్పందిస్తాను, పలికించండి.
(1) 'సత్యం' అన్నది వాస్తవాలను సూచించడానికి వాడే పదంకాదని, ఉన్న వాటికి సంబంధించి కలుగుతున్న ఒప్పు జ్ఞానాన్ని సూచించడానికి వాడినపదమది అనీ నా పక్షాన్ని మొదటినుండీ చెపుతూనే వస్తున్నాను. కొన్ని విషయాలలో వెంకటాద్రి గారున్నూ వేలసం||లు గడచినా ఆ అభిప్రాయాలను మార్చుకోనక్కరలేనివిగనే ఉంటున్నాయిప్పటికీ అనంటూ ఆచరణలో నిలబడినంతకాలం అవి ఒప్పులేనన్నట్లు చెపుతున్నారు. కనుక మీరన్నట్లు సత్యాలు మారతాయి, మారవు; కొన్ని మారతాయి కొన్ని మారవు; అన్న మూటిలో ఏదో ఒక పక్షాన్ని నిగ్గుతేల్చుకునైనా అందరం స్వీకరించడం మంచిది. వాస్తవానుగుణ్యత కల జ్ఞానమునే సత్యమంటామన్న మీ అభిప్రాయమే సరైంది. నా అభిప్రాయమూ అదే.
(2) సిద్దాంతమని దేన్నంటారన్నదీ, ఇటు తాత్విక ధోరణులనుగానీ, అటు వైజ్ఞానిక క్షేత్రాలను గాని పట్టిచూస్తే ఇట్టే తేలిపోతుంది. అనేకాభిప్రాయాల సమాహారాన్ని (భావజాలసంపుటిని) సిద్దాంతాలంటున్నాం. ఖచ్చితమైన ఒక్క అభిప్రాయాన్ని సిద్దాంతమంటున్నాం. ఉదా :- మార్క్సిస్టు సిద్దాంతం, ఆస్థిక సిద్దాంతం, నాస్థిక సిద్దాంతం, సాపేక్ష సిద్దాంతం, ఉష్ణగతి శాస్త్ర సిద్దాంతం, మహావిస్పోటన సిద్దాంతం, అద్వైత సిద్దాంతం, వైష్ణవ సిద్దాంతం, నియంతృత్వం పై అనేకుల సిద్దాంతాలు, ప్రజాస్వామ్యంపై అనేక సిద్దాంతాలు, జనాభా సమస్యపై భిన్న సిద్ధాంతాలు, ప్రమాణాలపై అనేక సిద్దాంతాలు అర్ధశాస్త్రంపై అనేక సిద్దాంతాలు, నీతి శాస్త్రంపై అనేక సిద్దాంతాలు... ఇలా 'సిద్దాంతం' అన్న పదం యొక్క వినియోగం ఎలా ఉందో గమనించగలిగితే అవగాహనలో స్పష్టత ఏర్పడుతుంది. వైజ్ఞానిక క్షేత్రాలలోనైతే, ఊహాత్మక సిద్దాంతాలు (పరికల్పనలు) నిర్ధారిత సిద్దాంతాలు (ఆజీళిఖీలిఖి ఊనీలిబిజీరిలిరీ)  వీగిపోయిన సిద్దాంతాలు (ఈరిరీచీజీళిఖీలిఖి ఊనీలిబిజీరిలిరీ) అన్నమాటలూ వినియోగంలో ఉన్నాయి. 'ఇజం' అన్న శబ్దంతో కలిపివాడే వన్నీ సిద్దాంతాలే. ప్రతి వాద రూపము సిద్దాంతమే. అందుకనే 'సిద్దాంత' మన్న మాటను వివరిస్తూ తార్కికులు సర్వతంత్ర ప్రతితంత్ర అధికరణ అభ్యుపగమాల రూపంలో సిద్ధాంతాలు నాలుగు రకాలుగా వుంటాయని చెప్పారు. దేవుడున్నాడు అన్నదీ ఒక సిద్దాంతమే. దేవుడు లేడు అన్నదీ ఒక సిద్ధాంతమే. ఉన్నాడో లేడో తెలియబడదు (అజ్ఞేయవాదంలో ఒక రూపం) అన్నదీ ఒక సిద్దాంతమే,  అనార్కిజం (అరాచకవాదం) అన్నదీ ఒక సిద్దాంతమే. నిర్థిష్ట రూపంలో ఆయా విషయాల గురించి ప్రకటింపబడిన అభిప్రాయాలన్నీ సిద్దాంతాలే. ఆలోచనా పద్దతికి చెంది పలు సిద్దాంతాలున్నాయి. వాటిని తార్కిక సిద్దాంతాలని అంటారు. విషయ మిట్లుండగా, 'హేతువాదం' సిద్దాంతం కాదు అనడమెలా కుదురుతుంది. ఇది సర్దుకుపోయే అంశంకాదు. నిగ్గుతేల్చుకుని ఏకాభిప్రాయానికి రావలసిన అంశం. కనుకనే విచారణకు పెట్టి చూసుకోవలసి వస్తోంది. ఇక సామాన్యులకీ విషయం అనవసరం అన్న మాట నాకూ అంగీకారమే. సిద్దాంత కారులకు, సైద్దాంతిక రచనలు చేసేవారికీ, భావ విప్లవ క్షేత్రంలో అధ్యయన శిక్షణ తరగతుల బోధనాంశాల స్థాయికి ఈ అంశం చాలా మౌలికమూ, కీలకమూ కూడా. అందుకే దీనిపై ఇంత విచారణ చేయవలసి వస్తోంది.
(3) అంత ముఖ్యం కానివి చాలా ఉన్నై అంటూ అట్టి వాటికీ నేను చాలా ప్రాధాన్యతనిస్తున్నట్లు వాశ్రారు. అవేమిటో, నా రచనల్లో అవి ఎక్కడ చోటు చేసుకుని ఉన్నాయో చెప్పండి. ఒకసారి తిరిగి చూసుకుంటాను. ఒక్క విషయం! ముఖ్యమా? కాదా? అన్నది నిర్ణయించేందుకు మీరెంచుకున్న విధానమూ, కొలత ఏమిటోనూ తెలియజేయండి.
(4) మీరన్నది చాల వరకు సరైందే. కానీ నా రచనలన్నీ ప్రధానంగా తాత్విక క్షేత్రానికి చెందినవో, దానితో ముడిపడి ఉన్నవో అయ్యుంటాయి. నా రచనల ప్రధాన లక్ష్యం కూడా మేధావుల నుద్దేశించిందేనన్నది ఒక నిజం.
(5) హేతువాదులకు ఒక వ్యక్తిగానీ గ్రంథంగానీ ప్రమాణం కాదంటున్నామంటే దానర్థం అతడు చెప్పాడు గనుక అనో ఆ గ్రంథం చెప్పింది గనుక అనో ఆయా అభిప్రాయాలను నెత్తికెత్తుకోవడమనేగాని, ఒప్పు చెప్పినా వ్యక్తి ప్రామాణికుడు కాడు గనుక ఒప్పుకోను అన్న అర్థం తీసుకోకూడదు. తప్పో ఒప్పో నిర్ణయించుకునే సందర్భంలో సరైన ప్రయోగ పద్దతిన సరిచూసుకోవడమన్నదే విధానం కావాలిగాని, ఫలాని వ్యక్తో, గ్రంథమో చెప్పింది గనుక సరిచూసుకోనక్కరలేదు అనకూడదన్నదే పై మాటల అర్థం. మీకిది అంగీకారమైతే ఆ వాక్యాన్ని ఇద్దరం ఒకే రకంగా అర్ధం చేసుకున్నా మన వచ్చు కానీ మీరిరువురూ నాకు ప్రమాణం కాదంటూనే, హేతువాదం కూడా నాకు ప్రమాణం కాదన్నారు. అదేమిటో నాకర్థం కాలా. ఇంతకూ హేతువాదమంటే మీ అర్థమేమిటి? అదీ నాకు ప్రమాణం కాదన్న మాటకు మీ అర్థమేమిటి? మీరే చెపితే మేలు.
(6) ఎం.కే. గౌరవ్‌ లేఖ నుండి గ్రహించగలిగిన అభిప్రాయాలంటూ నేను కొన్ని పాఠకులముందుంచాను. వాటినీ పరికించండి లేదా ఆ లేఖపై మీ కేమనిపిస్తుంటే అది గౌరవ్‌కు వ్రాస్తూ, నాకొక నకలు ప్రతిని పంపండి. లేఖపై గౌరవే వివరణ చేయాల్సి ఉంది. కనుక దానికొరకై వేచి చూద్దాం.
(7) ప్రతి రచనలోనూ కొన్ని విరుద్ద భావాలుండే వీలుంది అంటూ, అట్టివి మీ రచనలోనూ ఉన్నాయ్‌, అనన్నారు. ఈ ప్రకటన ఒకింత తీవ్రంగా (సీరియస్‌గా) తీసుకోవలసిందిగా ఉంది. ఒక వ్యక్తి ఏదైనా విషయం పై ఒకసారి తానన్న మాటకు వేరుగా మరోమాట చెపితే, సూత్రప్రాయంగా దానిని 'స్వవచన వ్యా ఘాతం' (ఐలిజితీ ్పుళిదీశిజీబిఖిరిబీశిరిళిదీ) అని అంటారు. అట్టిది ఎప్పుడు జరుగుతుంది?
(1) ఆ విషయంలో ముందేర్పడ్డ అభిప్రాయం తప్పని తెలిసి, దానికి మారుగా సరైందనుకుంటున్న మరో అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నప్పుడు. అయితే అలాగే జరిగినట్లైతే, ఏ ఒక్కసారి మాట్లాడినప్పుడూ ఆ రెంటినీ తన భావాలుగా ప్రకటించడతడు. ఒకనాడు తానలా అనుకున్నాననీ, అనంతరం దానిని మార్పుకుని, ఇప్పుడిలా అనుకుంటున్నాననీ చెపుతాడు. అలాటి వాటిని స్వవచన వ్యాఘాతాలనరు. ఇక అనుభవంలో సరిచూసుకోకుండా గ్రంధాలనుండో, ఇతరుల మాటలనుండో ఆ అభిప్రాయాలను స్వీకరించినప్పుడే అలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అనుభవ జ్ఞానంలోగానీ, సరి చూసుకున్నాక ఏర్పడ్డ నిర్ణయాలలో గాని అట్టి పరస్పర విరుద్ధమైన అభిప్రాయలుండనే ఉండవు. అవునో కాదో ఆలోచించి చూడండి. 'నా రచనల్లోనూ అట్టివి ఉన్నాయనన్నారు' అవునా? ఏవి? ఎక్కడలాటివి ఉన్నాయో చూపించండి. అ పొరపాటు జరిగి ఉంటే, ఆ విషయంలో ఆ మేరకు నేను జ్ఞానం (అవగాహన) లేని వాణ్ణన్నట్లే. ఇప్పటికైనా ఆ విషయంలో నాకేమైన అవగాహన కలిగి ఉంటే, దీన్నంతటినీ కలిపి ఒక ప్రకటన చేసి ఆ తప్పు దిద్దుకుంటాను. కానీ రాజేంద్ర ప్రసాద్‌గారూ! మీరొక సాహసవంతమైన ప్రకటన చేశారు. అట్టివి వెంకటాద్రి గారి రచనల్లోనే కాదు. ప్రతి వక్కరి రచనల్లోనూ ఉంటాయి. మీ రచనల్లోనూ ఉన్నాయని నిజానికిది చిన్న ఆరోపణకాదు. అది సరే మీ లేఖలోనూ అలాటిది చోటు చేసుకునుందేమో జాగ్రత్తగా పరిశీలించి చూడండి.
(8) మీ లేఖ పై హేతువాది ఎలా స్పందిస్తుందో వేచి చూద్దాం. ఉంటాను సెలవ్‌.
హేతువాదోద్యమ పునరుజ్జీవన యత్నాలు - 4
ఉద్యమ మిత్రులారా! రాజకీయ సంక్షోభం తెర మీదికి రావడంతో, మనం తలపెట్టిన నెలవారీ సమావేశాలకు ఆటంకం ఏర్పడింది. జరుగుతున్న అవాంచనీయతలన్నింటికీ, అవగాహనా పరులూ, స్వతంత్రాలోచనా శీలురు లేకపోవడమన్నదీ బలమైన కారణమే. ఆ లోటును సరిచేయగలిగింది హేతువాద ఉద్యమమే. కనుక ప్రస్తుత సంక్షోభాలు సమసిపోవాలన్నా, భవిష్యత్తులో మరల మరల పుట్టుక రాకుండా ఉండాలన్నా హేతువాద ఉద్యమం (1) బాగా విస్తరించడం, (2) బలంగా వేరూనుకోవడం, స్వతంత్రాలోచనా పరుల రాశిని పెంచడం అన్నవి జరిగితేనే సాధ్యపడుతుంది. హేతువాద ఉద్యమం ప్రధానంగా భావజాల క్షేత్రానికీ, ఆలోచనా ప్రక్రియ రీతిరివాజులకూ చెందిందే అయినా, దానిని ఉద్యమ రూపంలో కొనసాగించడానికి ఒక కార్యాచరణ ప్రణాళికా అవసరం. ఎలా ఒక ఉపాధ్యాయునికి బోధించడమన్నపనే సిద్దాంతానికి తగిన ఆచరణ కూడా అవుతుందో, అలానే భావజాల క్షేత్రంలో పనిచేసే వారికీ ప్రజలకు బోధించడమన్నదే ఆచరణ రూపం కూడా అవుతుంది. పుస్తకాలు ముద్రించడం, విద్యాలయాలలో పాఠ్యపుస్తకాలు ముద్రించడంలాటిదే. దాంతో విద్యనందించడం అన్న ప్రక్రియ ఎలా పూర్తి కాదో, విద్యాలయాలు పెట్టి నిపుణుల చేత ఆ పుస్తకాంశాలను విద్యార్థుల తలలకెక్కించడం చేయాల్సి ఉంటుందో, అలానే భావజాల క్షేత్రంలోను పుస్తక ప్రచురణలతో ఆ ప్రక్రియ పూర్తికాదు. దానిని ప్రజలకందించే బోధకులను అంటే శిక్షణ పొంది మాట్లాడగలిగిన కార్యకర్తలను తయారు చేసికుని, భావ విప్లవోద్యమ కార్యాచరణలో భాగంగా సమాజంలో శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నప్పుడే, ఉద్యమం ఆచరణ రూపంలోనూ కొనసాగుతున్నట్లు.
హేతువాద సిద్దాంత భావజాలం చాలా విస్తృత క్షేత్రంతో సంబంధాలు కలిగి ఉంటుంది. వ్యక్తి జీవితంలో హేతుబద్దాలోచన అవసరం ఏమిటో, హేతుబద్దాలోచనలో హేతువు స్థానంలో ఎటువంటి సమాచారాన్ని ఆధారంగా ఎంచుకోవల్నో, అక్కడ పొరపాటు జరిగితే జరిగే అనర్థమేమిటోనూ వివరించి అవి జరక్కుండా ఎలాటి జాగ్రత్తలు తీసుకోవాలోనూ తెలయజేస్తుంది. హేతువాద సిద్దాంతం యొక్క గొప్ప తనమేమిటంటే, హేతుబద్దాలోచనాజనిత నిర్ణయాలు అంతిమం- పరమం- కావనీ, అవి మరల ప్రయోగరీత్యా - ఆచరణలో - సరిచూసుకోవలసి ఉంటుందనీ కూడా తెలియజేస్తుంది. ఉహాత్మక నిర్ణయాల విషయంలోనేగాక, ప్రత్యక్ష విషయాలలోనూ అవసరమైతే ఫలుదపాలు పునఃప్రయోగాలు చేసుకుని చూసుకోవలసిందేనని ఉద్బోధిస్తుంది. ఇక శబ్ద ప్రమాణం విషయమైతే, ఎవరు చెప్పిందిగాని వారు చెప్పారు గనక ఒప్పనో, తప్పనో నిర్ణయానికి రావడం సరైన విధానం కాదని విడమరచి చెపుతుంది. ఈ విషయాన్నే 'హేతువాదికి ఏ వ్యక్తీ, గ్రంథమూ ప్రమాణం కాదు' అంటూ వెంకటాద్రిగారు చెప్పారు. మనమంతానూ ఆ విషయాన్ని ఆయన చెప్పారు గనుక ఒప్పనకుండా, అనుభవంలో చూసుకుని, బాగా ఆలోచించుకునే అది సబబేనన్న నిర్ణయానికి వచ్చాము.
హేతువాదోద్యమ సాఫల్యత అంతా వ్యక్తుల్ని స్వతంత్రాలోచనా శీలత కలవారినిగా రూపొందించడం దగ్గరే ఉంది. స్వతంత్రాలోచనాపరులు కావాలంటే ఏ విషయం గురించి ఆలోచించాలనుకున్నామో దానికి సంబంధించిన సరైన (యోగ్యమైన) సమాచారాన్ని సంపాదించుకుని ఉండాలి. కనుకనే స్థాయి కలిగిన హేతువాదిగా (నామమాత్రపు హేతువాదికాకుండా) ఉండాలన్నా, హేతువాదోద్యమ కార్యకర్తగా సమర్థవంతంగా కొనసాగాలన్నా, వ్యక్తి, సమాజము, ప్రకృతి అన్నవాటికి సంబంధించి, శాస్త్రీయ సమాచారాన్ని ఆర్జించుకుని ఉండాలి. అది జరగాలంటే తప్పని సరిగా మనకు అధ్యయనం ఉండి తీరాలి. తరచుగా అధ్యయన తరగతులూ జరుగుతుండాలి.
ఒక్కమాట! ముందు మన మన తలల బూజుదులుపుకోకుండా, తలలను సరైన సరుకుతో నింపుకోకుండా, సమాజానికి దీనినందించాలి, సమాజం నాదే అని నిండు గుండెతో తలంచకుండా, మనలో ఏ వ్యక్తీ యోగ్యమైన హేతువాదిగా ఉండలేడు. హేతువాదోద్యమ సారధిగ నూతన పాత్రకు న్యాయం చేయలేడు. కనుక మిత్రులారా! అధ్యయన పరులుకండి, అధ్యయన తరగతులను ఎక్కడికక్కడ ఆరంభించండి. ఆలోచించి స్పందించండి ఉంటాను. ఉద్యమాభినందనలతో
మీ
సురేంద్ర
రాష్ట్ర సంక్షోభం - పరిష్కార యత్నాలు
ప్రజాసంక్షేమం, సమానాభివృద్ధి, పాలనా సౌలభ్యం అన్న మూడంశాల ప్రాతిపదికనే రాష్ట్రాల పునర్విభజన పనులు జరగాలన్నదే రాజ్యాంగ హృదయం.
దీనిని దృష్టిలో పెట్టుకోకుండా అడిగేవన్నీ, చేసేవన్నీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమైనవే అవుతాయి. అలాటివన్ని సమన్యాయాన్ని పట్టించుకోనివీ, ఎవరికివారు తమ వంతుకు అధిక లాభం కోరుకునేవిగానే ఉంటాయి. ప్రస్తుతం వినవస్తున్న మూడు ప్రాంతాలవారి వాదనలుగానీ, విభజన జరగాలి, విభజన జరగవద్దు అన్న రెండు ప్రధాన వాదనలుగానీ ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్నవిగాకాక 'తన-పర' అన్న దృష్టితో స్వీయప్రయోజనాలనుద్దేశించినవిగ మాత్రమే ఉంటున్నాయి. పార్టీల స్వప్రయోజనాలు, ప్రాంతాల స్వప్రయోజనాలు అన్న దానికి, ఉద్యమానికి తమబలం చాలదనుకున్న రాజకీయులు ఉద్యోగుల్నీ, రేపటి ఉద్యోగార్దులు మీరేనని చెప్పి విద్యార్ధుల్ని రెచ్చగొట్టి ఉద్యమంలోకి ఈడ్చుకొచ్చారు. ఈ కుట్ర ఎక్కడ బైటపడుతుందోనని అనిపించి ఈ ఆందోళన రాజకీయులు చేస్తున్నది కాదనీ, ఉద్యోగులూ విద్యార్థులూ పూనుకుని, ప్రజలనూ కలుపుకుని రాజకీయుల, రాజకీయాలకతీతంగా న్యాయంకొరకు చేస్తున్న పోరాటంగా చిత్రించేందుకు పడరాని పాట్లన్నీ పడి కొంత వరకు సఫలీకృతులు కూడా అయ్యారు.
ప్రజలెప్పుడూ వివిధ శ్రేణుల నాయకుల ఎత్తుగడలలో పావులుగనో, కొన్ని సార్లౖేతే బలిపశువులుగనో అయ్యేటివాళ్ళేనన్నది అంబేద్కర్‌ 1948 ప్రాంతాలనాడే చెప్పాడు. అతడన్నాడనికాక, అది ఎప్పుటికప్పుడు ఎప్పుడు పరిశీలించి చూడగలిగినా, జరుగుతున్న వాస్తవమేనని రుజువవుతూ వస్తోంది. ఈ సారి అదే జరిగింది. అయితే అది సాదాసీదాగా, అంతగా ఆందోళనపడనక్కరలేని స్థాయిలోకాక, ప్రమాదకరస్థాయికి పరిణమించింది.
రాష్ట్ర ప్రభుత్వం పాలనా పరమైన నియంత్రణను దాదాపుగా కోల్పోయింది. కేంద్ర ప్రభుత్వం ఒక వంక వచ్చిపడుతున్న అవినీతి ఆరోపణల నుండి బైటపడడానికీ, రాజకీయ భవిష్యత్తు కొరకు వ్యూహాలు, ప్రతివ్యూహాలు పన్ను కోవడంతో తలమునకలై ఉంది. ఎక్కడా రాజ్యాంగానుకూల వైఖరిగానీ, నీతి న్యాయాలన్న దృష్టి గాని కనపడడం లేదు. తంతేనో, తంతాడనిపిస్తేనో తప్ప ఎవరిపనులను పట్టించుకునే పరిస్థితి లేదక్కడ. సమన్యాయమన్న మాట, పనిలేనివాళ్ళో, అసమర్థులో మాట్లాడేమాటగా వాడుకలో చూడడం మొదలైంది. ఇవెంతటి అడ్డగోలు పరిస్థితులైనా, సమష్ఠిహితైషులైన మేధావులు పూనుకుని సమాజానికి దిశా నిర్ధేశం చేయవలసే ఉందన్నది విజ్ఞులు కాదనలేని వాస్తవం. అదిగో ఆ బాధ్యతను గుర్తెరిగిన మేము ఆ దిశగా కొన్ని యత్నాలు చేయ మొదలిడినాం.
అందులో ప్రస్తుతం మూడు ప్రాంతాలుగ చూడబడుతున్న సీమ, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలలో మొత్తంగా చూస్తే ప్రతిప్రాంతంలోనూ కొన్ని జిల్లాలు వెనుకబడి ఉన్నా (ఉదాహరణకు సీమలో అనంతపూర్‌, తెలంగాణలో మెహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌; ఆంధ్రలో (శ్రీకాకుళం ప్రకాశంలో కొంత భాగం) ప్రాంతాలవారీగా రేపు విభజన జరిగాక స్వయంగా నిలదొక్కుకోలేని పరిస్థితి సీమకే ఉంది. మిగిలిన రెండు ప్రాంతాలకు అంటే ఆంధ్ర, తెలంగాణా (ఏది వెనక, ఏది ముందన్నదలా ఉంచినా) కొద్దికాలంలో పోటీపడి నిలదొక్కుకుని అభివృద్ధి చెందే అవకాశాలు తగినంతగానూ ఉన్నాయి. కనుక విభజన అనివార్యమే అయితే, మాట్లాడుకోవలసిన విధి విధానాలలో తొలిప్రాధాన్యత సీమనేమిచేద్దామన్నదిగా ఉండాలి. ఈ విషయంలో ఆంధ్ర, తెలంగాణాలు రెండూ సీమ భద్రత విషయంలో చిత్తశుద్ధితో బాధ్యత వహించాలి.
అలాగే గ్రామ సీమలు అంతో ఇంతో పుంజుకోవాలంటే కనీస పక్షంగానైనా వాటికి ఎంతో కొంత శాతం బడ్జెట్‌ నిధుల్ని నేరుగా అందేలా కేటాయింపులు జరగాలి. సంపాదనే పరమావిధిగా నడుస్తున్న అధికార రాజకీయాలు, వ్యాపార రాజకీయాలలో కాకలు తీరిన రాజకీయులు ఈ పనులు చేయడానికి వారంతట వారుగా పూనుకోనే పూనుకోరు. సమర్ధత, మనస్సు ఉన్నవాళ్ళు పై నుండే విధానం ద్వారా అవి జరిగేలా చూడడమో ప్రజలు మేల్కొని తమదితమ కిమ్మని నిలవేయడమో చేయడం ద్వారా మాత్రమే ఆ పని జరుగుతుంది. అందులోనూ ప్రజలందరిని అందుకు సన్నద్దుల్ని చేయడం అంత సులభమూకాదు, అంతత్వరగానూ కాదు. కనుక కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్ళలో సమాజహితాన్నికోరగల మంచివాళ్ళను కదిలించడం ద్వారా ఆ పని జరుగుతుందేమో ఒక ప్రయత్నం చేద్దాం అనుకుని మేము కొందరం అందుకు పూనుకున్నాం.
సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక, సాధికారిక సమాఖ్య అన్న రెండు వేదికల ఉమ్మడి నిర్వహణతో ఈ కృషి ఆరంభమైంది. డా.బ్రహ్మారెడ్డిగారి సారధ్యంలోని జె.వి.వి. సత్యాన్వేషణ మండలి, ఏకలవ్య, జై భారత్‌లు స.హ ఐక్యవేదికనుండీ, లోక్‌సత్తా, సోలిపేట రామచంద్రారెడ్డిగారూ మరి కొందరు మిత్రుల సాధికారిక సమాఖ్య వైపు నుండీ ఈ పనిని మొదలెట్టారు. సమాజహిత కాంక్ష ప్రజాస్వామికీకరణ జరగాలి అన్న ఆకాంక్ష బలంగా కలిగిన కె. నాగేశ్వర్‌ (యం.ఎల్‌.సి) పద్మనాభయ్యగారు, కె.ఆర్‌. వేణుగోపాల్‌గారు, రాజేశ్వరరావుగారు, సాయిరెడ్డిగారు, మరి ఎం. పద్మనాభరెడ్డిగారు కొందరు మేధావుల్ని వేదిక మొదలెట్టిన కార్యక్రమంలోకి కలసిరావలసిందిగా అభ్యర్థించాలనుకోవడం జరిగింది. అలాగే స్థానిక ప్రభుత్వాలకు అధికారాల విషయంలో క్రియాశీల పాత్ర వహించాల్సిన పంచాయితీ సర్పంచులనూ ఈ కృషిలో భాగస్వాముల్ని చేయాలనుకున్నాము. మూడు, నాలుగంశాలపై ఏకాభిప్రాయాన్ని సాధించి వాటిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి, రాష్ట్రంలోని అన్ని పార్టీల దృష్టికీ తేవాలన్నది తొలిథ కార్యక్రమంగా అనుకున్నాం.
దీనిపై ఈనెల 22వ తేదీన ఒక సమావేశాన్ని హైద్రాబాద్‌లో నిర్వహించాలనుకున్నాము.
అందులో స్వీకరించాల్సిన అంశాల ముసాయిదా రూపం ఇలా ఉంది.
(1) రాయలసీమను అభివృద్ధి పరచేందుకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ దానికి ప్రత్యేక ప్రతిపత్తినిచ్చి, పరిశ్రమలను ఆకర్షించాలి. పారిశ్రామికులకు వివిధ పన్ను మినహాయింపులూ, కేంద్ర నిధులనుండి ప్రత్యేక కేటాయింపులూ జరగాలి. (అలాగే మూడు ప్రాంతాలలోని వెనుకబడిన జిల్లాలకు, జిల్లా భౌగోళిక పరిస్థితులకనుగుణ్యమైన అభివృద్ధి పథకాలను రూపొందించి, అందుకుగాను ప్రత్యేక నిధులను సమకూర్చాలి)
(2) నీటి వనరుల విషయంలోనూ పంపిణీ విషయంలోనూ మూడు ప్రాంతాల ప్రతినిధులతో కూడి, నిపుణుల కమిటీని వేసి, నీటి పంపిణీ త్రిసభ్య కమిటీ నిర్ణయాలకు లోబడి ఉన్న నీటిని న్యాయబద్దంగా పంచుకోవాలి.
(3) అధికార వికేంద్రీకరణకు, పెద్ద మనుషుల ఒప్పందంగా విభజన జరిగాక ఏర్పడే రాష్ట్రాలలోని ప్రభుత్వాలు సిద్దం కావాలన్న నిబంధనను చేర్చాలి.
(4) కేంద్ర ఆర్థిక ప్రణాళికా సంఘం పంచాయితీలకు బడ్జెటు నుండి 25% నిధులను నేరుగా దఖలుపరిచేలా ప్రణాళికారచన చేయాలి.
(5) బాగా వేడెక్కి ఉన్న వాతావరణాన్ని, జాతీయతా స్ఫూర్తితో  మనమంతా 'ఏకప్రజే' నన్న భావనతోను క్రమంగానైనా చల్లబడేలా మూడు ప్రాంతాల వారి న్యాయబద్దమైన కోర్కెలు - అవసరాలు - తీరెలా నియమనిబంధనల్ని రూపొందించాలి. ఈ అంశాల సంక్షిప్త రూపంతో కేంద్రానికో మెమోరాండం ఇవ్వాలన్నది ఇప్పటి మా యోచన.

22వ తేదీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలు తెలుసుకొనగోరు వారు క్రింది  నెంబర్లకు ఫోనుచేసి తెలుసుకొనవచ్చు. 9440474404, 9959828887, 9866074023, 040-27674649, 9490470064.
హేతువాద ఉద్యమ గీతం

పల్లవి : హేతువాదులం మేము హేతువాదులం
మానవాభ్యుదయం కోరు సుమతిశీలురం - మేము ప్రగతి గాములం
(1) ఆలోచన లేకుంటే అడుగు ముందు కేయలేవు
ఆధారం లేకుండా ఆలోచన చేయలేవు
దిక్కుమాలినాలోచన చిక్కు లెన్నొ చేరవేయు
చక్కనైన ఆలోచనె చిక్కులన్ని చక్కజేయు .... హేతు ||
(2) వెనుకకు చూడాలన్నా ముందుకు పోవాలన్నా
హేతుబద్ద యోచనే ఎవరికైన దిక్కన్నా
యోగ్యమైన ఆలోచనే బ్రతుకుబండి విరుసన్న
అది చక్కగ లేకుంటే బండినడక గుండు సున్న ... హేతు ||
(3) హేతువాద మంటేనే ఎగిరెగిరీ పడతావు
చక్కనైన ఆలోచన అక్కర లేదంటావు
తిక్కగాని రేగిందా పిచ్చికుక్క కరిచిందా
ఒక్కదినం బ్రతికి చూపు హేతుబుద్ది లేకుండా .... హేతు ||
(4) ఇంగిత జ్ఞాన మన్నదీ హేతువు ఫలితమేర
విచక్షణా జ్ఞానమున్ను హేతుబుద్ది జనితమేర
వైజ్ఞనిక ప్రగతికంత హేతుబుద్దె మూలమురా
హేతుబుద్ది లేకుంటే బ్రతుకు బుగ్గిపాలేరా .... హేతు ||
(5) శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచుకొమ్మని
అశాస్త్రీయా లన్నింటిని గెంటి వేయరమ్మని
ప్రయోగాల పద్దతిన ఆర్జించిన జ్ఞానాన్నే
అందుకునీ ప్రగతిబాట పయనింతము రండనే ... హేతు ||

Saturday, June 1, 2013

పి.డి.సుందర్రావును చట్టబద్దంగా శిక్షించాలి

సంపాదకీయం :

జాతీయ పతాకాన్ని, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాతలను, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను, వారి తీర్పులను హేళనచేస్తూ, నిందిస్తూ బహిరంగ సమావేశంలో మాట్లాడిందే గాకుండా ఈ విషయం దేశమంతటికీ తెలియాలి, జాగ్రత్తగా రికార్డు చేయండని తన అనుచరులకు సూచించాడు పి.డి.

1. డా|| బి.ఆర్‌.అంబేద్కర్‌ రాజ్యాంగం గురించి మాట్లాడుతూ : ''రాజ్యాంగం కంటే రాజ్యాంగ విధేయత ముఖ్యమైనది'' అన్నాడు.
2. రాజ్యాంగంలోని 51/ఎ అధికరణం ద్వారా మనం, పౌరుల ప్రాథమిక విధుల్ని నిర్దేశించుకున్నాం. అందులో మొదటిది, రాజ్యాంగమునకు బద్దుడై ఉండుట, దాని ఆదర్శాలను, సంస్థలను, జాతీయ పతాకమును, జాతీయ గీతమును గౌరవించుట అన్నదై ఉంది.
ఎ) పి.డి.సుందర్రావు రాజ్యాంగం పట్ల అవిధేయత కనపరిచాడు.
బి) జాతీయ పతాకాన్ని గురించి అత్యంత హేళనగా మాట్లాడాడు.
సి) రాజ్యాంగ నిర్మాతలను కాపీరాయుళ్ళు, సొంత తలలేనివాళ్ళంటూ నిందించాడు.
డి) జాతీయ జెండాలన్నీ తన సంస్థ వాకిటిముందు వంగాలన్నాడు.
ఇ) సుప్రీంకోర్టును, వాటి తీర్పులను, న్యాయమూర్తులను నిందిస్తూ మాట్లాడాడు.
వీటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పనికివచ్చే చట్టాలు ఇవిగో...

1. ఐపిసి (ఇండియన్‌ పీనల్‌ కోడ్‌)153/బి : జాతీయ సమైక్యతకు భంగము కలిగించు నిందారోపణలు
గమనిక : దీని క్రిందికి వచ్చు నేరము బెయిలు ఇచ్చుటకు వీలు లేనిది. మూడు సంవత్సరముల వరకు జైలు శిక్ష, మరియు జరిమానా కూడా విధింపతగినది. అదే మరి ఇలాంటి నేరము మత సంబంధ సమావేశ స్థలములలో గాని చేసినట్లయితే అప్పుడు శిక్షను 5 సం||ల వరకువిధించవచ్చు.

పి.డి.సుందర్రావు పై అనుచిత వ్యాఖ్యలు క్రైస్తవమత ప్రచార సమావేశంలోనే చేసిఉన్నాడు.
2. క్రిమినల్‌ ప్రొసీజర్‌, మైనర్‌ యాక్టులోని, ''ద ప్రెవెన్షన్‌ ఆఫ్‌ ఇన్‌సల్ట్‌ టు నేషనల్‌ హానర్‌ యాక్టు'' 1971/2 క్రింద శిక్షించవచ్చు.

3. మరో రకంగా చూస్తే దీనిని దేశద్రోహ నేరంగాను పరిగణించవచ్చు.
దీనిపై ఒక బాధ్యతాయుతమైన పౌరునిగా

ఎ) కోదాడ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఒక ఫిర్యాదు చేశాను. దానిపై ఎఫ్‌.ఐ.ఆర్‌ తయారు చేయడమూ జరిగింది.
బి) రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి దీనినో ప్రజాప్రయోజన వ్యాజ్యంగా - సుమోటోగా స్వీకరించి న్యాయవిచారణ జరిపించాల్సిందిగా విజ్ఞాపన పత్రం పంపాను. సుమోటోగా స్వీకరించడానికి అవసరమైన సమాచారాన్ని సి.డి.రూపంలోనూ అందజేశాను.

వివేకపథం పాఠక మిత్రులారా !

సమాజం చచ్చుబడిపోయి వుంది. జాతి మొత్తం గౌరవించాల్సిన విషయాలను గూర్చి ఒక వ్యక్తి అనుచితంగా, అవహేళనగా, బహిరంగంగా మాట్లాడినా, ఆ విషయం జెమిని న్యూస్‌ టి.వి. ద్వారా దేశ వ్యాపితంగా ప్రసారం చేయబడ్డా, ఎవరికీ చీమకుట్టినంతయినా బాధకలక్కపోవడాన్ని ఏమనుకోవాలి? నిజానికి జాతి గౌరవానికి ప్రతీకలైన వాటిపై ఈగవాలినా సహించనే కూడదు. ఇప్పటికైనా మేలుకొని మత్తు వదుల్చుకుని, పి.డి.సుందర్రావు లాటి చీడను, పీడను వదిలించుకొనేందుకు గట్టిగా యత్నించాలి. ఇకముందెవ్వరూ అలా నోరుజారకుండేలా ఇతగానిని శిక్షింపజేయాలి. కనుక వందలాదిగా విజ్ఞాపనలు, హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు పంపాలి. న్యాయస్థానాల ద్వారా పోరాడి అతణ్ణి కఠినంగా శిక్షింపచేయాలి. వెంటనే పూనుకొని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆన్‌లైన్‌ ద్వారా, లేఖల ద్వారా విజ్ఞాపనలు చేయండి. వాటి నకలును వివేకపథం అడ్రస్‌కు పంపండి. బాధ్యతగల భారత పౌరులుగా ప్రవర్తించండి.

- సత్యాన్వేషణలో
మీ సురేంద్ర.


Saturday, September 1, 2012

బైబిలు దైవగ్రంథమా ? - 7

ముందుగా : - షరా మామూలే. రిజిష్టరు పోస్టు ద్వారా పంపిన 190వ సంచిక గోడకు కొట్టిన బంతిలా తిరస్కరింపబడి తిరిగి వచ్చింది. ఆ కవరు పైన ఒక వాక్యం పి.డి గారిదే వ్రాయబడి ఉంది. నల్గొండ మీటింగ్సు పబ్లిక్‌లో ఛాలెంజ్‌ చేసినా రాని నీకు .... అన్నదే ఆ అసంపూర్తి వాక్యం. ఇక చదవండి. 

Sunday, July 1, 2012

బైబిలు దైవ గ్రంథమా? ... 5

యోచనాశీలురైన పాఠకమిత్రులారా!

పి.డి. సుందరావు & కంపెనీ గురించి తెలిసిన వారందరూ అనుకున్నట్లే అయ్యింది.

నేను వివేకపథం 188 సంచిక ద్వారా స్పందన -2 శీర్షికన,

పి. డి సుందరావు గారి తరుఫున ఎన్‌. కనకమహాలక్ష్మిగారు పంపిన లేఖను, దానిపై ఎక్‌నాలెడ్జ్‌మెంటు కార్డు ద్వారానే నేను వారికి క్లుప్త సమాధానంగా వ్రాసిన ప్రత్యుత్తరాంశాలను, అటు పై వారికి నేను 18-6-2012 తేదీన విపులంగా వ్రాసి రిజిష్టర్‌ పోస్టు చేసిన లేఖను ప్రచురించాను. ఆ విషయాలు వివేకపథాన్ని శ్రద్ధగా చదువుతున్న మీ కందరికీ తెలుసున్నవే. ఆ నా రెండో రిజిష్టర్‌ లేఖ తిరస్కరింపబడి తిరిగి వచ్చింది. దానిని తీసుకుంటే సమాధానం చెప్పవలసి వస్తుందనీ, సమాధానం చెప్పలేమని తేల్చుకుని వారా పని చేసుండాలి.

Sunday, April 1, 2012

బైబిలు దైవగ్రంథమా ? అందులో చెప్పబడ్డ దేవుడున్నాడా ? - 2


యోచనాశీలురైన పాఠక మిత్రులారా!

వివిధ మత మరియు తాత్విక సిద్ధాంతాలలో తగినంత అభినివేశం (పరిచయము, పట్టు) ఉండి, వాటిలో ప్రకటింపబడ్డ భావజాలపు సబబు బేసబబుల్ని, సబబైనరీతిలో విభజించిచూడాలన్న దృష్టి ఉన్నవాళ్ళకు కొద్దికాలం ధారావాహికగా వెలువడే ఈ శీర్షికాంశం, మెదడుకు మేతను, వివేచనకు పదునునూ, అవగాహనలో విస్తారాన్ని, గాఢతను కలిగించగలదనే అనుకుంటున్నాను. ఒక్క బైబిలు పక్షానికేగాక ఇతర ఆస్తిక పక్షాలతో సంబంధపడి ఉన్న అనుకూల, ప్రతికూలధోరణులవారికీ, అనుకూల ప్రతికూల వైఖరిని అనుసరించకనే తులనాత్మక అధ్యయనం చేయాలన్న అభిలాష కలవారికీ కూడా ఈ శీర్షిక క్రింద క్రమంగా ప్రకటింపబడే వివిధాభిప్రాయాలు ఎంతో కొంత ఉపయోగపడతాయనే అనుకుంటున్నాను. కనుక ఇప్పటికి మీరే పక్షం వైపు నిలబడిఉన్నా, 'సబబుబేసబబుల విచారణ' అన్న దృష్ఠితో దీనిని క్రమంతప్పకుండా పరిశీలించవలసిందిగనూ, వ్యక్తిగత విమర్శలకు దిగకుండా విషయపరమైనంత వరకు విమర్శలనుగానీ, విూమీ అనుకూల, ప్రతికూల పక్షాలనుగానీ, నలుగురకూ ఉపయోగపడగలవనిపించే సలహాలు, సూచనలను గానీ పంపేందుకు సిద్ధమై ఈ విచారణలో పాలుపంచుకోవలసిందిగా ఆహ్వానించుచున్నాను.