Showing posts with label 157. Show all posts
Showing posts with label 157. Show all posts

Saturday, August 1, 2009

త్రైమాసిక సమావేశ విశేషాలు



అనుకున్న ప్రకారం ది. 11, 12, 13 లలో మండలి త్రైమాసిక సమావేశాలు కేంద్ర కార్యాలయంలో జరిగాయి. షుమారు 15 నుండి 20 మంది వరకు కార్యకర్తలు హాజరయ్యారు.
సమావేశాన్ని ఉద్దేశించి ముందుగా నాలుగు మాటలంటూ సురేంద్రబాబుగారు మొదలెట్టారు. వారి మాటల్లోనే చూడండి.

సి.టి.ఎఫ్‌.వారు - బైబిల్‌ సృష్టివాదం



మిత్రులు ఫజులుర్‌ రహ్మాన్‌గారు బాధ్యత తీసుకుని సి.టి.ఎఫ్‌.వారితో సంప్రదిం చడం, వారొక రీతిలో స్పందించడం, దానిపై నావైపునుండి కొంత విశ్లేషన రావడం గురించి జులై సంచిక ద్వారా మీ అందరకూ తెలుసు. అందులో మన ప్రస్తుత చర్చావేదిక సందర్భానికి సంబంధించిన ఒక అంశం, నాస్తికులముందు, నాస్తిక సంస్థల ముందు, మేము మా బైబిలు సృష్టివాదాన్ని ప్రతిపాదించడానికి సిద్ధము. అయితే అటువైపు పాల్గొంటున్నది ఎవరో మాకు ముందే తెలుపాల్సి వుంటుంది. అని సి.టి.ఎఫ్‌.వారు రహ్మాన్‌గారి ద్వారా కబురెట్టడం అన్నది.

నూతన వివాహవిధిపై మిత్రుల స్పందనలు-ఒక పరిశీలన



వివాహ విధిపై అంతో ఇంతో స్పందన రావడం ఒకింత సంతోషాన్ని కలిగించింది. అందునా ఏదోఒకటి రాద్దాంలే అనుకునే వారినుండి కాక, సరైన మార్పునాశించే వారినుండే అవి రావడంతో, ఆ వివరాలనూ నా దృష్టికోణాన్ని మీ అందరి ముందుంచుతాను. ఇక పరిశీలించ మొదలెట్టండి.
1) పి. సుబ్బరాజుగారు, జిన్నూరు నుండి :  మా నూతన వివాహ విధిని ఒకింత సాకల్యంగానే పట్టిచూసి, సవరణలు పూరణల సందర్భంగా పట్టించుకోవలసిన అంశాలంటూ ఇలా చూపెట్టారు.

స్వలింగ సంపర్కము - ఒక పరిశీలన-2



సామాజిక స్పృహకల యోచనాశీలురందరకూ,
మిత్రులారా! స్వలింగ సంపర్కులు, వారి తరఫున మద్దత్తుగా నిలబడ్డవారూ, స్వలింగ సంపర్కాన్ని మానవహక్కుల క్రిందికి తెచ్చి, స్వలింగ సంపర్కానికీ చట్టబద్ధత కల్పించాలంటూ కోర్టుకు వెళ్ళడం, ఇండియన్‌ పీనల్‌కోడ్‌ 377 ప్రకారం అమలులో వున్న, స్వలింగ సంపర్కం అన్నది శిక్షార్హమైన నేరం అన్నదానిని మార్పుచేసుకుని న్యాయాలయాన్ని కోరడం జరిగింది. ఆ యత్నాల పర్యవసానంగా జస్టిస్‌ ఎ.పి.షా, జస్టిస్‌ ఎస్‌. మురళీధర్‌లతో కూడిన ఢిల్లీ హైకోర్టు బెంచ్‌ 2009 జులై 25, పిటిషన్‌దారులకు అనుకూలంగా స్వలింగ సంపర్కాన్నికి చట్టబద్ధతను కలిగిస్తూ ఒక తీర్పునిచ్చింది. దానిపై జులై వివేకపథం-156లో ఈ అంశంపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం సరికాదనీ, పలుకోణాల నుండి లోతైన విశ్లేషణ, విచారణ చేశాకనే ఒక ప్రయోజనకరమైన నిర్ణయానికి రావడం ఉచితమనీ చెపుతూ ఒక చర్చనారంభించాను.

సంతాప ప్రకటన



ఈమధ్యనే సత్యాన్వేషణ మండలి హైద్రాబాద్‌శాఖ బాధ్యతలు స్వీకరించిన బి. కృష్ణంరాజుగారు జులై 22న హఠాత్తుగా మరణించారు. మృదుస్వభావిగా, మంచి మిత్రునిగా, మంచి భర్తగా, మంచి గృహస్తుగా, సహనశీలిగా, క్రియాశీలిగా, ఆయా సంబంధాలలోనున్న వారందరికీ ఆయన సుపరిచితులే.