Showing posts with label CTF. Show all posts
Showing posts with label CTF. Show all posts

Sunday, November 1, 2009

సి.టి.ఎఫ్‌. బండారం



పరిణామవాద పక్షీయులన్నంతా అయ్యింది. సురేంద్రగారూ! మీ పిచ్చిగాని బైబిలుపక్షంవాళ్ళు వాళ్ళ సృష్టివాదాన్ని ప్రతిపాదించి, నిరూపించడానికి ఎందుకొస్తారండీ. బైబిలు సృష్టివాదం తప్పులతడకేకాదు. విశ్వాన్ని గురించి ప్రకృతిని గురించి ముతకరూపంలోనైనా తెలియని థలో, తెలియనివారు ప్రకటించిన పిట్ట-పిచ్చి-కథే అది అన్నది గింత ఆధునిక విజ్ఞానమూ, ఇంగిత జ్ఞానమూ కలిగున్న వాళ్ళెవరైనా ఇట్టే తేల్చేయగలిట్టి ఉట్టి గాలిపోగేసినమూట అది.
ఇక డా|| ఆనంద్‌, ప్రకాష్‌, సుధాకర్‌లాంటి, అంతో ఇంతో ఆధునిక విజ్ఞానం తెలిసిన వారికా విషయం తెలియదనుకోవడం మీ అవివేకం.

Thursday, October 1, 2009

ఒక ముఖ్య ప్రకటన సృష్టివాదుల బండారం



మిత్రులు ఫజులుర్‌ రహ్మాన్‌గారికి మరియు సి.టి.ఎఫ్‌. సంస్థకు, నేను రహ్మాన్‌గారు కలసి నిర్వహించిన పరిణామ వాదము సృష్టివాదమా? అన్న చర్చలో పాల్గొన్న మిత్రులకు, సంస్థలకు.
క్రమంగా జరగాల్సిన వేదిక, అటు క్రైస్తవపక్షం, ఇటు ఇస్లాం పక్షం తరఫున పాల్గొంటూ వచ్చిన సి.టి.ఎఫ్‌. సంస్థ వాళ్ళమన్న ప్రకాష్‌, సుధాకర్‌, ఆనంద్‌కుమార్‌గార్లు, కడపకు చెందిన గౌస్‌, తారిఖ్‌, కాకినాడకు చెందిన రహ్మాన్‌, హైద్రాబాద్‌లోని అసీవుద్దీన్‌గార్లూ తగినరీతిలో తమవంతు కర్తవ్యాన్ని నిర్వహించకపోవడంవల్ల అర్ధాంతరంగా నిలిచిపోయింది. అయితే ఈ రెండు పక్షాలు సమయోచితంగా స్పందించకపోవడం ఇంకా ఖచ్చితంగా (నిష్ఠూరంగా వున్నా) నిజం చెప్పాలంటే మెల్లగా జారుకోవడం చేస్తూ వచ్చాయి. ఇస్లాం పక్షంలోని పైన పేర్కొన్నవాళ్ళు తెలివిగా, ఎటువంటి వాద వివాదాలూ, ప్రగల్భాలూ లేకుండా వేదికనుండి విరమించుకున్నారు.

Saturday, August 1, 2009

సి.టి.ఎఫ్‌.వారు - బైబిల్‌ సృష్టివాదం



మిత్రులు ఫజులుర్‌ రహ్మాన్‌గారు బాధ్యత తీసుకుని సి.టి.ఎఫ్‌.వారితో సంప్రదిం చడం, వారొక రీతిలో స్పందించడం, దానిపై నావైపునుండి కొంత విశ్లేషన రావడం గురించి జులై సంచిక ద్వారా మీ అందరకూ తెలుసు. అందులో మన ప్రస్తుత చర్చావేదిక సందర్భానికి సంబంధించిన ఒక అంశం, నాస్తికులముందు, నాస్తిక సంస్థల ముందు, మేము మా బైబిలు సృష్టివాదాన్ని ప్రతిపాదించడానికి సిద్ధము. అయితే అటువైపు పాల్గొంటున్నది ఎవరో మాకు ముందే తెలుపాల్సి వుంటుంది. అని సి.టి.ఎఫ్‌.వారు రహ్మాన్‌గారి ద్వారా కబురెట్టడం అన్నది.

Friday, May 1, 2009

స్పందన-ప్రతిస్పందన



þ వాళ్ళ నుండి ఉలుకూపలుకూ లేదు. ఆ సంస్థకు అధికార ప్రతినిధినన్న ప్రకాష్‌గారుగానీ, ఎవరు పిలిచినా ఒచ్చి క్రైస్తవ సృష్టివాదాన్ని ప్రతిపాదించి నిరూపిస్తానని 'సత్యోదయం' సమావేశంలోనూ, బైబిల్‌లో ఒక తప్పుచూపినా దానిని తగలెట్టేస్తానని విజయవాడలో మండలి తత్వచర్చావేదికలోనూ మాటల్లో అతి సాహసాన్ని కనబరచిన సుధాకర్‌గారుగానీ, మాతోనూ చాలాకాలం సన్నిహితంగా వుండి క్రైస్తవాన్ని భుజానికెత్తుకున్నదేకాక, నేనూ, రహమాన్‌గారూ కలసి గత సం||కాలంగా జరుపుతున్న వేదికలో పాల్గొంటూనే, పరిణామవాదంపై చర్చ ఒక ముగింపుకు వచ్చిన సందర్భంలో, తరువాతి సమావేశం 'క్రైస్తవ సృష్టివాద ప్రతిపాదన-పరీక్ష' కొరకే అనుకునే సమయంలో చర్చావేదిక నియమ నిబంధనలు నిర్ణయమయ్యాక సిద్ధాంత చర్చ చేయడం సరైందికదా అంటూ, క్రైస్తవాన్ని ప్రతిపాదించే పనిని పక్కనబెట్టే పని తెలివిగా చేపట్టిన ఆనంద్‌గానీ, þ పారిపోడంలేదు, భయపడడంలేదు, పనుల వత్తిడిలో వున్నాం, అదవగనే ఖచ్చితంగా మా పక్షాన్ని ప్రతిపాదించుతాం అని ఇ-మెయిల్‌ ద్వారా ప్రకటించిన పేరు, వివరాలు వెల్లడించని మరో అజ్ఞాత þ ప్రతినిధిగారుగానీ, కిమ్మిన్నాస్థిగా ఊరుకున్నారెందుకో అర్థంకాదు. అర్థంకాదంటే ఊహకందటంలేదనిగాదు. ఊరుకోడం వెనక ఒకటికంటే ఎక్కువ కారణాలుండవచ్చన్న ఒక నిజం వుందిగనుక, ఖచ్చితంగా ఏమయ్యుంటుందో తేలలేదనే. నా ఊహకందినంతలో, వారిలో నిజాయితీగానీ, సత్యానికి పెద్దపీట వేయాలన్న అభిలాషగానీ బలంగా లేవు.

Wednesday, April 1, 2009

''పరిణామవాదమా? సృష్టివాదమా?'' వేదికదృష్ట్యా మిగిలివున్న పనులు



(1) సి.టి.ఎఫ్‌. క్రైస్తవ యోచనాపరుల వేదిక పేరున ప్రకాష్‌గారు బాధ్యత తీసుకుని, సుధాకర్‌గానిరీ కలుపుకుని మా వేదికలో పాల్గొన్న విషయం, క్రమంగా వారు వేదిక క్రమాన్ని విడచి మండలిని రెచ్చగొట్టే పనికి పూనుకోవడం జరిగింది. అందుకు, సత్యాన్వేషణ మండలి ఏమాత్రం తొణకకుండా, వారు పట్టించాలన్న పెడత్రోవ పట్టకుండా, శాస్త్రీయ విచారణా పద్ధతిని, వేదిక అనుసరించాల్సిన క్రమాన్ని అంటిపెట్టుకుని, 3 అంశాలను వారి ముందుపెట్టి, వాటిని నిరూపించండి అనడుగుతూ వచ్చింది. అవి : (1) సి.టి.ఎఫ్‌. నాపై సంధించిన 13 అంశాల లేఖకు బాధ్యత వహిస్తున్నవారి వివరాలు మాకందించాలి, (2) బైబిలు సృష్టివాదాన్ని ప్రతిపాదించి నిరూపించాలి, (3) స్వస్థత ప్రార్థనల మహత్తును నిరూపించాలి. ఈ మూడు విషయాలకు ఉచితరీతిన సమాధానాలు చెప్పి వాటిని నిరూపించాల్సిన బాధ్యత ప్రకాష్‌గారిపైనే వుంది. లేదా, 13 అంశాల లేకకు, ఇదిగో మేమూ బాధ్యులమేనంటూ ఎవరైనా ముందుకొస్తే, అప్పుడు వారంతా కలసిగానీ, వారిలో ఎవరుగానీ, అందుకు పూనుకోవచ్చు.

Thursday, January 1, 2009

సి.టి.ఎఫ్‌.కు మండలికి మధ్య నడుస్తున్న వివాదం



సి.టి.ఎఫ్‌. తరఫునంటూ రెండు ఇ-మెయిల్స్‌ నాకందాయి. ఒకటి రాజేంద్రప్రసాద్‌గారు ప్రకాష్‌గారికి పంపిన లేఖకు సమాధానంగా ప్రకాష్‌గారు పంపింది కాగా, రెండవది వివేక్‌ పేరన పంపిన మెయిల్‌. ఆ రెండు మెయిల్స్‌ పూర్తిగా చూడదలచుకున్నవారు వారినుండే వాటిని పొందండి. నేనుమాత్రం నడుస్తున్న సందర్భానికి అవసరమైనంతవరకే వాటిని ఉట్టంకిస్తాను.
గమనిక : సందర్భానికి చెందిందీ, తప్పనిసరైందీ అనదగింది ఏదైనా నేను చూపకుండా వదిలిపెట్టాననిపిస్తే మా ఈ వివాదాన్ని ఆద్యంతం నిశితంగా పరికిస్తున్న ఎవరైనా స్పందన ద్వారా నాకు తెలియజేయండి. వారన్నది యదార్థమైతే ఆ మేరకు పై సంచికలలో దానినీ ప్రకటిస్తాను.