Showing posts with label Hetuvadam. Show all posts
Showing posts with label Hetuvadam. Show all posts

Friday, July 15, 2016

హేతువాద పునరుజ్జీవన యత్నాలు - 7

హేతువాద పునరుజ్జీవన యత్నాలు - 7

యోచనాశీలురైన మిత్రులారా! వివేకపథం 198లో 'హేతువాద ఉద్యమావశ్యకత - ఒక పరిశీలన' అన్న శీర్షికతో నేను ఒక వ్యాసం వ్రాశాను. అందులో, హేతువాదికి ఏ గ్రంథమూ, ఏ సైద్దాంతికుడూ ప్రమాణంకారాదు అన్న విషయంలో వెంకటాద్రి గారితో నాకు భావసారూప్యత ఉంది అన్నాను. అంతేగాక, ప్రశ్నించడానికీ, ప్రశ్నింపబడడానికీ కూడా హేతువాది సిద్దంగా ఉండాలి, అనీ వ్రాశాను.

నిజానికి హేతుబద్దాలోచన అన్నది ప్రతి వ్యక్తికీ నిత్యజీవితావసరం. అలాగే హేతువాద ఉద్యమం అన్ని ఉద్యమాలకు ఊతాన్నీ, బలాన్నీ ఇవ్వగల పునాది ఉద్యమం. యోచనాశీలురైన ఆయా సైద్దాంతికులకు 'హేతుబద్దాలోచన' అన్నది గాని లేకుండుంటే, ఏ సిద్దాంతాలూ పుట్టుండేవి కావు. వైజ్ఞానిక క్షేత్రాలు, హేతుబద్దాలోచనా సామర్థ్యంతోనే పరికల్పనలను రూపొందించుకుంటాయి. ఆ పైన ప్రయోగరీత్యా వాటిని పరీక్షించి సరిచూసుకుంటుంటాయి. కనుక ప్రతి వైజ్ఞానిక ప్రయోగం వెనుకా హేతుబద్దాలోచన అన్నది అనివార్యంగా చోటు చేసుకుని, ఆద్యంతమూ - ప్రయోగపు ఆరంభం నుండి ముగింపు పర్యంతమూ పని చేస్తూనే ఉంటుంది. హేతుబద్దాలోచనలేని జీవితాన్ని ఊహించడమే సాధ్యపడదు. వర్తమానంలో నుండి భవిష్యత్తులోకి కదలాలన్నా, గతంలోకి తొంగి చూడాలన్నా మనిషికి హేతుబద్దాలోచన తప్ప గత్యంతరం లేదు. కనుక మనిషి బ్రతికున్నంతవరకూ; నిజానికి జంగమాలైన - కదిలే - ప్రాణులన్నింటికీ, హేతుబద్దాలోచనతో పని ఉంటుంది.

సమాజపునర్నిర్మాణ కార్యక్రమం తలలను సంస్కరించుకోవడం, సంస్కరించడంతోనే.. మొదలవ్వాలి. ఆ పనికై హేతువాద ఉద్యమం తనవంతుగా మార్గదర్శక పాత్ర పోషించాల్సి ఉంది. అనీ వ్రాశాను. 1984 ప్రాంతాల నుండి ఈ నాటివరకు హేతువాద ఉద్యమాన్ని పరిశీలిస్తుండడం, కొంతకాలం హేతువాద ఉద్యమ ప్రముఖులతో అతి సన్నిహితంగా కలసి ఉంటూ అనేక కార్యక్రమాలనూ చేసి ఉండడం, గుత్తా రాధాకృష్ణగారు, వారి బృందంలోని ముఖ్యులతోనూ, ఎన్‌.వి. బ్రహ్మంగారు వారి మిత్రులతోనూ, వెంకటాద్రిగారి బృందంలోని అనేకులతోనూ అనేక విషయాలపై చర్చలు, సంభాషణలు చేసి ఉండడం, గుత్తా రాధాకృష్ణ గారూ హేతువాద ఉద్యమం క్రమంగా బలహీనపడిపోతోందని పలుమార్లు నాతో అని ఉండడం. ఆయన మరణానంతరం ఒక హేతువాద సంస్థ సంస్థగాస్థబ్దతకులోనై పోవడం, ఆ విషయాన్ని ఆపక్షంలోని ప్రముఖులే నాతో అని ఉండడం, ఇటు వెంకటాద్రి గారి మిత్రులతో సహచరులతో కూడిన హేతువాద సంఘంలోని అంతర్గత విభేధాలను నేను ప్రత్యక్షంగా గమనించడం, నేరుగా ఆయా వ్యక్తులే నాకు చెప్పడం, ఇలాటివే మరికొన్ని వాస్తవాలనూ క్రోడీకరించుకుని నేనో అభిప్రాయానికి వచ్చాను. దానినే 198 సంచికలో ''హేతువాద ఉద్యమం తిరిగి కోలుకోలేనంతగా పడకనపడిందన్న నిర్ణయానికి వచ్చాను నేను'' అని రాశాను.
''మరల మరో గెలుకులాటా'' అన్న శీర్షికతో మేడూరి సత్యన్నారాయణగారు హేతువాది(337)లో ఒక వ్యాసం వ్రాశారు. అందులో వారు ఒకింత దూకుడుగా, వ్యక్తిగత విమర్శకూ దిగడంతో వివేకపథం -201లో

గమనిక :- హేతువాద పునరుజ్జీవన యత్నాలపై కామెంట్‌ చేసిన హేతువాద మిత్రులకు ఒక సూచన అంటూ వ్యక్తిగత విమర్శలకు దిగక, విషయపరంగా ఎంత చర్చిస్తే అంత విషయావగాహన పెంపొందించుకునే వీలుంటుంది. కనుక విషయ పరంగా విమర్శ చేయండని ప్రకటించాను.

దీని విషయంలోనే, హేతువాది, వివేకపథం అన్న రెండు పత్రికలనూ శ్రద్ద పెట్టి చదువుతుంటే వారూ, తనను హేతువాదిగనే భావించుకుంటుండేవారూ అయిన రాజేంద్రప్రసాద్‌గారున్నూ, ఇలాటి విమర్శలు ఉద్యమానికి మేలు చేయవనీ, ఆయనలా రాయడం తన్ను కలవరపరచిందనీ వ్రాశారు. వివేకపధం -202 సంచికలో ఆ వివరాలున్నై.

ఆ సంచికలోనే హే.పు యత్నాలు -4 అన్న వ్యాసంలో, హేతువాదోద్యమ సాఫల్యతంతా వ్యక్తుల్ని స్వతంత్రాలోచనా శీలత కలిగిన వారినిగా రూపొందించడం దగ్గరే ఉంది... అది నెరవేరాలంటే వ్యక్తి (హేతువాది); వ్యక్తి - సమాజము - ప్రకృతి అన్నవాటికి సంబంధించి శాస్త్రీయమైన - సరైన - సమాచారాన్ని ఆర్జించుకుని ఉండాలి. ఆ పని సవ్యంగా జరగాలంటే అధ్యయనం తప్పని సరి.

ముందు మన తలలోని బూజు దులుపుకోకుండా, సరైన సరుకులు నింపుకోకుండా, సమాజానికి దీని నందించాలన్న తపనలేకుండా మనలో ఏ వ్యక్తీ యోగ్యమైన హేతువాదిగా మనలేడు. కనుక మిత్రులారా! అధ్యయనపరులుకండి అంటూ వ్రాశాను. అదే సంచికలో హేతువాద ఉద్యమ గీతం రూపంలో హేతుబద్దాలోచన అవసరమేమిటో... జీవితంలో (సమాజంలో) అది నిర్వహిస్తున్న పాత్రేమిటోనూ, నా పక్షాన్ని స్పష్టంగా వెలిబుచ్చాను. 198 సంచికలో ప్రస్తావించిన ముఖ్యమైన పదాలకు అర్ధాలు నిర్వచనాత్మకంగానూ, కొన్నింటికి వివరణాత్మకంగానూ వ్రాశాను.

దానిపై హేతువాది - నవంబరు సంచిక - 340లో రావిపూడి వారి మూడు వ్యాసాలు వచ్చాయి. 1) జ్ఞానము, సత్యము - సాపేక్షకత, 2. హేతుత్వం - సంకల్పం 3) హేతువాదం - కార్యకారణత - జ్యానం - సత్యం - స్వేచ్చ వాటిని చదివాక వివేకపథం - 203లో, హేతువాది 340 ఎడిటోరియల్‌ పై ఒక అభిప్రాయాన్ని ప్రకటించాను. ఆ హేతువాదిలో, నాకంగీకారమైన భావాలూ, అంగీకారం కాని భావాలూ, కొన్ని భాషాదోషాలు, నన్ను దృష్టిలో పెట్టుకుని అనవసరపు దూకుడును కనబరుస్తూ వ్రాసిన వ్యంగ్యోక్తులూ ఉన్నాయి. అన్నదే ఆ వాక్యం. ఆ నా మాటలకు ఆధారాలు చూపడం నా బాధ్యతే కనుక, రావిపూడి వారి వ్యాసస్థ విషయాల్ని అక్కడే కొంత మేర విశ్లేషించాను.

ఒక్కమాట! ఆ నా వ్యాసంలో విషయపరంగా వెంకటాద్రిగారి రచనను విశ్లేషించే పని చేశానేగాని, వ్యక్తిపరంగా ఒక దుందుడుకు మాటా అనలేదు నేను. ఇక్కడికిది నిజమో కాదో వాటినిచూసి గమనించండి. ఆ సంచికలోనే;

''హేతువాద సంపాదకవర్గానికి మరోసారి విజ్ఞప్తి'' అన్న ఉపశీర్షికన వారికి మరోసారి విజ్ఞప్తి చేశాను. 'మరల మరోగెలుకులాటా అంటూ శీర్షిక పెట్టి మీరు ప్రచురించిన వ్యాసం చూసిన వెంటనే వ్యంగ్యొక్తులూ, వ్యక్తిగత విమర్శల జోలికి పోకుండా విషయ పరమైన విమర్శకు సిద్దపడడం సరైందవుతుంది, అలాటి విమర్శకు పూనుకోండి, అని మీకు తెలియజేశాను. ఈ సంచిక చూశాక, మీరు ఆ విజ్ఞప్తిని పట్టించుకోలేదని అర్ధమైంది. అయినా దీనినీ పట్టించుకోకుండా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సంచికలో వెంకటాద్రిగారి పేరున వచ్చిన రెండు రచనల్లోనూ వ్యంగ్యంతో కూడిన విసుర్లు చాలాఉన్నాయి. సంపాదకీయంలో; సత్యానికి అర్థమేమిటి? శంకరాచార్యుని సత్యానికి అర్ధమేమిటి? పెళ్ళాం బిడ్డల్ని అమ్ముకుని అప్పుతీర్చాడన్న పొర్జరీ హరిశ్చంద్రనాటకంలోని సత్యానికి అర్థమేమిటి. సత్యాన్వేషణ పేరుతో నానాతంటాలు పడుతున్న వారి సత్యానికి అర్థమేమిటి? సత్యంగోపన్న గొంగళికాదు. నాటకాలతో బూటకాలతో దానికి తెరలేవదు. అన్నమాటలున్నాయి.

సత్యమంటే ఏమిటన్న విషయంలో మీరుగాని, నేనుగానీ, మరెవరు గాని చర్చించకుకోడానికి ఇలాంటి భాష అవసరమా? విమర్శ, విమర్శకుడూ రచయితకు మిత్రుడేనన్న గతంలోని మీ మాటలకు, ఈ రాతలకు అనుగుణ్యత ఉందా ఏమైనా?!

విజ్ఞప్తి : వ్యంగ్యం మనకొద్దు. వ్యక్తిగత విమర్శలూ అనవసరం. విషయ విమర్శ ఎంత ఘాటుగా, సూటిగా ఉన్నామేలే అన్న అభిప్రాయాన్ని ప్రకటించాను అక్కడే.

ఆ తరువాత హేతువాది సంచిక 342లో రాయ్‌ని దృష్టిలో పెట్టుకుని రావిపూడి మూడు వ్యాసాలు వ్రాశారు. అందులోనూ నాకు అంగీకారమైన భావాలు కొన్ని ఉన్నాయి. అంగీకారం కానివి కొన్ని, విచారించాల్సినవి మరి కొన్ని ఉన్నాయి. అందులో విచారించాల్సిన భాగంలో, మండలి కార్యక్షేత్రంలో ప్రధానంగా చూడబడుతున్న జ్ఞాన సిద్దాంతం పేరున ఆయన వెలిబుచ్చిన అంశాలూ ఉన్నాయి. జ్ఞాన సిద్దాంతాన్ని రాయ్‌ శాస్త్రీయ స్థాయిలో వివరించాడన్నారు. ఆ వివరాలెక్కడున్నాయో చూడాల్సి ఉంది.

అదే సంచికలో భావవిప్లవం అన్న వ్యాసంలో, కొందరు అతితెలివి కలవాళ్ళు, లేని దేవుణ్ణి లేడని రుజువు చేయమని సవాళ్ళు విసురుతారు. అన్నారు. ఈ మాట సాధారణీకరించి అన్నదా? ఖచ్చితంగా ఆ మాటలు ఆయనతోనే ఎవరో అని ఉండి, వాళ్ళనుద్దేశించి అన్నదా? రావిపూడి వారే చెప్పాలి. ఈ మాట ఆయన ఎవరినుద్దేశించి అన్నా వ్యంగ్యంగా అన్నది మాత్రమే. ఆ పేరాలోనే నిజానికి దేవుడున్నాడంటున్నవాళ్ళే అతడెక్కడున్నాడో, ఎలా ఉన్నాడో రుజువు చేయాలి. అనీ అన్నారు. ఈ మాట నాకు 100% ఆమోదయోగ్యమైనదే. ఎందుకంటే నిర్ధారణ నియమాలకు సంబంధించిన నియమం అది. ప్రతిపాదకుడే తన ప్రతిపాదన సరైందేనని నిరూపించే బాధ్యత వహించాలి అన్నదే ఆ నియమం. ఆ నియమం ఉన్నాడన్న వాళ్ళకే గాక, లేడంటున్నవాళ్ళకూ వర్తిస్తుంది. ఇంకా సరిగా చెప్పాలంటే ఏ సిద్దాంతాలకైనా వర్తించే సాధారణ నియమం అది.

లేదనేవాళ్ళను లేదని రుజువు చేయమనే అజ్ఞులను దగాకోర్లని అర్థం చేసుకోవాలా? లేదా? అన్న మరో వాక్యమూ ఉంది అక్కడే. ఇది నాలెఖ్ఖన ఆయనతో మాట్లాడాక నిర్ణయించాలి. విచారణకు వారు సిద్ధపడితే భాషా దోషమో, భావ దోషమో ఏదో ఒకటి చోటు చేసుకుని ఉందిక్కడ అని తేల్చగలను.

ఇక వివేకపథం - 204 సంచికలో అటు శాస్త్రీయ దృక్పథం అన్న దానిపైనా, ఇటు హేతువాదం సిద్దాంతమే అన్నదానిపైనా, నా దృష్టి కోణం నుండి అనేక వివరాలు పాఠకుల ముందుంచాను. ఆఖరున ఆ సంచిక 16వ పేజీలో మళ్ళీ మరో మారంటూ ఇలా వ్రాశాను.

ఎన్నిసార్లు ఎంతగా చెప్పినా అసలు విషయాన్ని పట్టించుకోకుండా, ఏదో ఒకటి మాట్లాడేయడం ఎక్కువలో ఎక్కువ మందికి అలవాటుగా మారిపోయింది. ఇప్పటికైనా మించిపోయిందిలేదు.. హేతువాదమన్నది తాత్విక స్థాయికలిగిన సామాజిక దృక్పధాన్ని తెలిపే సిద్దాంతమంటూ నేనిచ్చిన వివరాలలోని దోషమేమిటో నిర్ధారించనైనా నిర్ధారించండి. లేదా మీ పక్షంగా సిద్దాంతమంటే ఏమిటో, హేతువాద మంటే ఏమిటో చెప్పి, హేతువాదం ఎందుకు సిద్దాంతం కాదోనన్నదైనా నిర్ధారించండి. భావ విప్లవం రావాలంటుండే మనం - ఎవరైనా - దోషసహితమైన, లోప సహితమైన భావాలను వదులుకోవడానికీ, సరిచేసుకోవడానికీ, సరైన భావాలను చేర్చుకోవడానికీ నిరంతరం సంసిద్దంగా ఉండాలి. ఎలాటి భేషజాలూ, పొరపొచ్చాలు లేకుండా మంచి భావాలను స్వీకరిస్తుండాలి. అన్నదే ఆ ప్రకటన.

ఆ సంచికలోనే డా|| బి.వి. పట్టాభిరాం గారిపైనా, జ్ఞానానంద అన్నాయనపైనా ఒకింత కటువుగా మాట్లాడాను. వారి అభిప్రాయాలను ఖండించాను. ఆ విషయమై, ఇలా రచయిత పోకడను వేలెత్తిచూపి గమ్మునుండడం బాధ్యతా రాహిత్యమే అవుతుంది నాకైనా, ఎవరికైనా కనుక నా ఈ అభిప్రాయాలు సరైనవేనని నిరూపించే బాధ్యతను నేను స్వీకరిస్తున్నాను అనీ ప్రకటించాను. (204 పి 21-22 చూడండి)

ఇదంతా అయ్యేటప్పటికి హేతువాది ఫిబ్రవరి 2014 సంచిక 343 అందింది. దాన్లో సూటిగా నాతో ముడిపడి ఉన్న అంశాలనూ, నన్ను కూడా పేర్కొంటూ, ప్రతిసారీ నేనేది వద్దంటూ వస్తున్నానో, ఆ పోకడనే మళ్ళీ మరింత ఉధృతంగా మొదలెట్టారు రావిపూడి వారు. అనవసరపు రగడలు రగులుకోకుండ సహనం వహించడానికీ ఒక హద్దుంటుంది. కనుక ఈ వ్యక్తిగత విమర్శలు, వ్యంగ్యోక్తులు, నిందలు, అవహేళనలను  ఇంతటితోనైనా ఆపుజేసి, విషయ విమర్శకు పూనుకోవలసిందిగా మరోమారు రావిపూడి వారికీ ఆ పక్షంలోని ఇతరులకూ కూడా కడసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ సంచికలోని రావిపూడి వారి మాటలివిగో,

1)     'ఇదేమి చాపల్యం' అంటూ మొదలెట్టారా వ్యాసాన్ని రావిపూడివారు.

2)     సత్యాన్వేషణ ముసుగేసుకున్న సురేంద్రగారూ, ఇదంతా మిమ్మల్ని ఉద్దేశించి వ్రాస్తున్నదే.

3)     ఒక రచయిత ఒక పదాన్ని ఒక చోట ఏ అర్థంతో వాడాడో ఆ పదాన్ని అలా అర్థం చేసుకోకుండా పెడర్థాన్ని లాగడం చాపల్య మవుతుందే గాని విమర్శకాదు.

4)     పారలాక్సు దోషం లాంటి దోషం మన అవగాహనలో దొర్లితే దాన్ని అవగాహనా చాపల్యమనీ, అన్వయంతో దొర్లితే అన్వయ చాపల్యమనీ అంటాం.

5)     నా రచనల్లోని భావాలను విమర్శించమన్నానంటే, ప్రతి పదాన్ని విరుచుకొనేదీ, విరవమనేది, రచయిత భావాన్ని వంకర తిప్పేదీ విమర్శకాదు.

6)     బొక్కలు లేనిచోట బొక్కలు తవ్వుకుంటూ కూర్చుంటే అది ఛలప్రాయమవుతుంది కాని విమర్శకాదు.

7)     అసలు విషయాన్ని విడచి, పద నిర్వచనాల వాగులో పడి కొట్టుకుపోతూ, పక్కదారులు తొక్కే డుబు డుక్కుల మేళం విమర్శ కాబోదు. అదోక తరహా ఛలచాపల్యం.

8)     విమర్శకులు పదాల అర్థాన్ని అడుక్కునే చాపల్యం నుండి, అర్థం చేసుకోగల వివేకదశకు ఎదగాలి.

9)     కొంటె మాటలతో, కుయుక్తులతో కాసేపు నన్ను పొగొడుతూ, మరికాసేపు తెగడుతూ పేజీలు నింపడం గిల్లిజొలపాడి నట్లుంటుందిగాని, విమర్శకాబోదు.

10)     మీరు సత్యాన్వేషణ పేరుతో నానాతంటాలు పడుతుంటారని నేననడంలో వ్యంగ్యమేముంది? అది నిజమే కదా!

11) 203 వివేక పథంలోని పాయింట్ల వారీ దోకుడంతా అన్వేషణలో భాగమేకదా?

12) నా రచనలో వ్యంగ్యంతో కూడిన విసుర్లు కొన్ని చోటు చేసుకున్నాయని బాధనటించడమెందుకు? నాలి ముచ్చుభాష నాకు అలవాటు లేదు.

13) మీరు మీ దుకాణానికి సత్యాన్వేషణ మండలి అని పేరైతే పెట్టుకున్నారుగాని అందులోని పదాలకు నిర్వచనాలు చెప్పినట్లు గానీ, అర్థాన్వేషణలో పాటుపడినట్లుగానిలేదు.

14) మీరు వాడిన పదాలకు అర్థాలు చెప్పరుగానీ, ఇతరులను మాత్రం అర్థాలు చెప్పమని డిమాండు చేస్తారు.

15) ఒకవేళ మీరింకా అలాంటి పదాలు అర్థం చేసుకోలేని అజ్ఞాన దశలోనే కుమిలిపోతున్నారా?

16) జ్ఞానమెలా కలుగుతుందో నాకు అవగతం కాలేదని... మీరు అనర్థ విసుర్లు గుప్పించారు.

17) ఆ రెండు పేజీల ఎడిటోరియల్‌ శీర్షికనే అర్థం చేసుకోలేని మీరు అర్థాలడుక్కోవడం తప్ప మరేమి చేయగలరు?

18) ఎంతగా అర్థాలు వివరించి చెప్పినా, మరల ఆ 'పదార్థాల' మీద మీ ప్రశ్నల ఈగలు వాలకుండా ఉంటాయా?

19) మీ ప్రశ్నించే వైఖరి సినీహాస్యనటుల నోట వినిపిస్తుంది.

20) సందర్భాన్ని బట్టి అందరకూ అర్థం కాగల పదాలకు కొత్త అర్థాలు కూరుస్తూ కూచుంటే భావవ్యక్తీకరణ రొచ్చులో పొర్లించినట్లవుతుంది. ఔగదా?

21) 'పరమం' అంటే ఏమిటో నేను చెప్పలేదని గొణుగుతున్నారు.

22) మీ కొంటె బుద్ధి, కుంటి బుద్ధి ఒక పదానికి సరిపడే అనువాద రూప ఆంగ్ల పదాన్ని వాడితే అది పదానికి అర్థం చెప్పినట్లు కాదుకదా అనే ప్రశ్న వేసింది. అలాంటివి జ్ఞానం లేని మీ వంటి వారి కొరకు వ్రాసినవికావు.

23) మీకు జ్ఞానమంటే, సిద్దాంతమంటే ఏమిటో తెలియవు.

24) మీ వరసంతా బుడుబుక్కుల మేళమే కదా!

25) మీరు నా మొదటి వాక్యాన్నే పట్టుకుని పీకులాడారు. ఆ పీకులాటనే విమర్శ అని భ్రమపడుతున్నారు.

26) నాకు రచనా నైపుణ్యాన్ని నేర్పాలని తంటాలు పడుతున్నారు.

27) 1978 నాటి నా హేతువాద గ్రంథం మీకర్థమైయ్యుంటే, నా ఎడిటోరియల్‌ మొదటి వాక్యం పై ఇంతగా తెగబడే వారుకాదు.

28) జ్ఞానం ప్రారంభమయ్యే రీతిని నాకు నేర్పడానికి సాహసించే గెలుకులాట రాయుళ్ళ కోసం అది ఉద్దేశింపబడలేదు. అది మీ అళీక పాండిత్యానికి అందేది కూడా కాదు.

29) జ్ఞానానికి ఇంత అంత అంటూ హద్దులేర్పరచి పిట్టం కట్టించడం

30) సరళంగానే అర్థమవుతుండే విషయాలను గుర్తించే విధం, రంధ్రాన్వేషుల పథంలో ఉండదు.

31) భావదారిద్య్రాన్ని దాచుకోడానికి భాషావైకృతినో, ప్రశ్నల దురదనో ఆశ్రయించడం సరైందికాదు.

32) ప్రశ్నలు వేయడానికైనా తత్సంబంధ జ్ఞానం ఉండాలని మీదురాలోచన పరిధిలోకి రాదు.

33) 'నవాబు - బంటు' కధలోలాగా 'ఫిర్‌ - తుర్‌' ఉదంతం లాగా మీ తీరు రూపుదిద్దుకుంది.

34) మీ అంగడిలో మీతోడ్పాటు వారితో కలసి హేతువాద - సిద్ద - అంతం తయారు చేసే కృషిలో ఉన్నారు కదా!

35) హేతువాద ఉద్యమం పడకనపడిందనే సిద్ద అంతాన్ని తయారు చేస్తున్నారు కదా?

36) రాద్దాంతాలు మానుకుని మీ వంటకాలను పూర్తిచేసి కావలసిన వారికి వడ్డించండి.

37) అస్తిత్వానికి బదులు అస్థిత్వమని పదే పదే గెలికే మీకు పదాల విలువ ఎలా తెలుస్తుంది?

38) 'ఇంద్రియార్థ సన్నకర్షణ' అనే న్యాయ సూత్రాన్ని మీరు కాపీ కొట్టినంత మాత్రాన జ్ఞానమెలా కలుగుతుందో మీకు తెలిసినట్లు కాదు.

39) అలాటి అల్పత్వాన్ని నాకు నేర్పడానికి యత్నించడం మరింత అల్పత్వం అవుతుంది.

40) పంచేంద్రియ జ్ఞానం పశువుల సొంతం. భావాలతో ఉద్దీపనకాని జీవితాలు పశుప్రాయాలు.

41) మీ నమో బ్రహ్మాదిభ్యోలను హేతువాది పత్రిక ఏకిపారేసిన తరువాత, మీమేలుకొలుపు పత్రిక పేరు వివేకపథంగా మార్చారు.

42) మీరు మారాలి కాని కుమారిలుడిలా వేషం మారిస్తే చాలదు.

43) మీ వింత పోకడలనే విమర్శలుగా భ్రమించకండి.

యోచనశీలురైన పాఠక మిత్రులారా! రావిపూడి వారు ''ఇదేమి చాపల్యం'' పేరుతో వ్రాసిన 8 పేజీల వ్యాసంలో నాగురించి చేసిన వ్యాఖ్యలివి. ఇంతకూ 203 సంచికలో నేనేమి రాశానో, దానిపై వారి ఈ స్పందన ఎలా సమంజసమవుతోందో మీరూ విచారించండి. ఆ ఒక్క సంచిక చాలదనుకుంటే హేతువాదోద్యమ పునరుజ్జీవన యత్నాల పేరిట 198 నెం వివేకపథం నుండి 203వరకు జాగ్రత్తగా పరిశీలించండి. పట్టు బట్టి పరిశీలిస్తాను అనే వాళ్ళకు, విచారణకు సిద్ధపడేవాళ్ళకు, ఆ సంచికల సంపుటిని పంపిస్తాను.

ముఖ్యగమనిక :- హేతువాదాన్ని సిద్దాంతమనే అనాలి అనంటున్నది నేనొక్కణ్ణే కాదు. అనేక మంది ఆలోచనా పరులు ఆ మాటన్నారు. అలా, హేతువాదం (రేషనలిజమ్‌) సిద్దాంతమేనంటున్న వాక్యాలు కొన్ని వ్రాస్తాను పరిశీలించండి.

1)         ఎం.వి. రామూర్తి గారు, రావిపూడి వారి 'హేతువాదాన్ని' ష్ట్రబిశిరిళిదీబిజిరిరీళీ అన్న పేరున అనువదిస్తూ అనువాదకుని మాటంటూ వ్రాశారు. అందులో రామూర్తి గారు హేతువాదం ఒక సిద్దాంతమేనన్నారు. ఇవిగో ఆ మాటలు

       The role and Ramifications of Reason are to be delineated. The essence and nature of reason have to be under stood.
2)         Definition of rationalism by the free on line dictionary thesaurus and encyclopedia.
    a)     Philosophy : the theory that the exercise of Reason, rather than experience anthority or spiritual revelation, provides the primary basis of knowledge
3)         collins english dictionary :- Rationalism :- Philosophy
    a)     The doctrine that knowledge about reality can be obtained by reason alone without recourse to experience.
    b)     The doctrine that human knowledge can all be encompassed within a single, usually deductive system.
4)          Random house kemerman webster's college dictionary
    a)     a philosophic doctrine that reason alone is a source of knowledge and is independent of experience.
    b)     a doctrine that all knowledge is expressble in self evident propositions or their consequences.
    c)     a doctrine that human reason, unaided by divine revelation...
5)     1)     The doctrine that knowledge is gained only through the reason, a faculty independent of experiance.
    2)     The doctrine that all knowledge is expressble inself evident...
6)     1)     The rational investigation of questions about existence and knowledge and ethics.
    2)     philosophical doctrine, philosophical theory - a doctrine accepted by adherents to a philosophy.
7)         Rationalism :
    a)     the theological doctrine that human reason rather than
    b)     theological doctrine.
8)     a)     the doctrine that reason is the right basis for regulating conduct.
    b)     doctrine; ism; philosophical system, philosophy, school of thought
9)         Oxford dictionary of philosophy Rationalism : Any philosophy magnifying the role played by unaided reason, in the acquisition and Justification of  knowledge.
10)         A teaching in the theory of knowledge according to which universality and necessity. The logical attributes of true knowledge. cannot be deduced  from experience and its generalisation.  They may be deduced only from the mind itself; either from concepts innovate in the mind (Theory of innovate ideas).
11) a) Rationalism is the philosophical view that regards reason as the chief source and test of knowledge. Rational thinking is the soul factor in rationalism. Rational thinking means thinking with the support of valid suitable  evidence or knowledge or reason with out any projudices.
    b)     Rationalism advocates acceptance of true knowledge and elimenation of beliefs based on the nature of beliefs.
    c)     Rationalism advocates the following principles.
        1.......... 2...... 3........ 4..... 5..... etc
12)         The acceptance of the theory that, all behavior, attitude

యోచనాశీలురైన మిత్రులారా! లోకంలో హేతువాదాన్ని సిద్దాంత మనాల్సిందేనంటున్నది నేన్కొణ్ణే కాదనీ, అనేక నిఘంటువులూ, పెక్కురు తాత్వికులూ ఆ మాటే అన్నారని మీ దృష్టికి తేవడానికే ఈ కొద్దిపాటి వివరాలిక్కడ ఉట్టంకించాను. వాటితో బాటు వెంకటాద్రిగారి 'హేతువాదం అన్న రచననే అనువాదం చేసిన ఎం.వి రామూర్తిగారన్న మాటనూ మీ ముందుంచాను. మీలో ఈ విషయంపై మరింత లోతైన, స్పష్టమైన అవగాహన కలిగించుకోవాలనుకుంటున్నవాళ్ళు, ఇంటర్‌నెట్‌ (అంతర్జాలం)లోకి వెళ్ళి చూడవచ్చు. ఒక్కమాట ! పై ఆధారాలను పట్టిచూస్తే వెనుకటి వాళ్ళలోనూ ఈ విషయమై ఒకింత విచారణ, విశ్లేషణ జరిగిందనే అనిపిస్తోంది. ఇంకో విషయాన్నీ మీరు గమనించడం అవసరం. దీనిని మెథడాలజి (విధానం) అంటున్నవాళ్ళూ ఉన్నారు. ఈ విషయం మీదలాగే, మార్క్సిజం పైనా, 'మార్క్సిజం సిద్దాంతమా? విధానమా?' అన్న చర్చ జరిగింది. గతంలో కొందరు అది సిద్దాంతంకాదు. విధానమేనన్న భావాన్ని వెలిబుచ్చారు. మరి కొందరు సిద్దాంతమన్నారు దానినే. అలా రెండభిప్రాయాలూ ఉన్నాయి గనుకనే వీటి విషయంలో మరింత విచారణ అవసరమైంది

ఇక రాజేంద్రప్రసాద్‌ గారిలాటి వాళ్ళు, ఈ అంశాన్ని మరో కోణం నుండి ఆలోచిస్తున్నారు. వారు దాన్ని సిద్దాంత మంటేనేమి? విధానమంటేనేమి? పేరు సంగతలాఉంచి, విషయాల (అందులోని భావాల) బాగోగుల్ని విచారించుకోవచ్చు కదా! అంటున్నారు. ఈ పోకడ ప్రమాదకరమా? కాదా? అన్నదలా ఉంచితే, సైద్దాంతిక విచారణల సందర్భంలో తప్పని సరిగా నెలకొని ఉండాల్సిన నిక్కచ్చితనం లోపించిందీ వైఖరిలో అనాల్సిందే. సిద్దాంతం కానిదాన్ని సిద్దాంతమేననో, సిద్దాంతాన్ని సిద్దాంతం కాదనో అంటే ఏమిలే! అనుకోవడం ఏ రకంగానూ సరికాదు గదా. అదిన్నీ కాక మనం (హేతువాద పునరుజ్జీవన యత్నాలు చేద్దామనుకుంటున్నవాళ్ళం) ఇప్పుడు హేతువాదం క్రింద ఏమేమి చెప్పాల్సి ఉంటుందో వాటన్నంటినీ గుదిగుచ్చే పని చేద్దామని గదా పూనుకున్నాం? అంటే హేతువాదం క్రిందికి చేరే భావ సంపుటిని (రీలిశి ళితీ రిఖిలిబిరీ ను) తయారు చేద్దామనే కదా! సిద్దాంతమంటే లోకం అంగీకరిస్తున్న, వివిధ వైజ్ఞానిక క్షేత్రాలలో వినియోగంలో ఉన్న అర్థాన్ని బట్టే కదా మనం దీనిని సిద్దాంత మనాలో, అనకూడదో నిర్ధారించాల్సింది? కనుక ముందుగా సిద్దాంత మన్న మాటకున్న అర్థమేమిటో నిర్ధారించుకోవాలి. ఏకాభిప్రాయానికి రాగలగాలి. అప్పుడుమాత్రమే మన మధ్య భావ ప్రసారం, అంటే ఒకరన్నది మరొకరికి అర్థం కావడం సాధ్యపడుతుంది. కనుకనే ముఖ్యమైన పదాలవరకైనా అర్థాలు చెప్పుకోవడం తప్పనిసరి అంటున్నాను. ఈ విషయంలో వెంకటాద్రిగారు, తొలి నుండి అందరికీ అర్థమయ్యే పదాలకు అర్థాలు చెప్పమనడం అనవసరపు పని అన్న ధోరణిలోనే ఉంటున్నారు. కనుకనే ఈ విషయంలో ఏది సరైన విధానమో తెల్సుకునే దిశగా ఒక ప్రయత్నం చేయాల్సి ఉంది. అందుకు పూనుకునేవారికి ముందుగ నేను సూచిస్తున్నదేమిటంటే, నేను అందరికీ అర్ధమయ్యే పదాలన్నింటికీ నిర్వచనాలు, అర్థాలు చెప్పాల్సిందేనని ఎక్కడైనా, ఎప్పుడైనా అన్నానా? సైద్దాంతిక విషయాలకు చెందిన కీలకమైన పదాల వరకు స్పష్టమైన, నిర్థిష్టమైన రీతిలో అర్థాలు చెప్పుకోవాలన్నానా? ఇక్కడ గాని మీరు యథార్థాన్ని పట్టించుకోకుంటే మా యిరువురి పోకడల్లో లోపమో, దోషమో, ఎవరి పక్షంలో ఎక్కడ చోటు చేసుకుని ఉందో గమనించడం కుదరదు. ఇలాటి తాత్విక విచారణల్లో నిస్పాక్షిక దృష్టితో పాటు, నిశిత పరిశీలనాశక్తి, ఆసక్తి అన్నవి కూడా జతపడినప్పుడే, విచారణ జరగాల్సినంత స్థాయిలో జరుగుతుంటుంది.

కానీ విషాదమేమంటే, సూటిగా, నిర్మొగమాటంగా, నిశితంగా, పట్టుదలతో విచారణకు పూనుకునే వాళ్ళ సంఖ్య అతి తక్కువగా ఉంటోందీనాడు. నచ్చినా, నచ్చకున్నా, తప్పనిపిస్తున్నా, ఒప్పనిపిస్తున్నా అందునుగుణ్యంగా స్పందించడంలేదు పాఠకులు. ఎక్కువలో ఎక్కువ మంది ఏదో చదివాంలే అనిపించేట్లు చదవడం, ఆలా పారేయడం జరుగుతోంది ఎక్కువసార్లు. మొదలేపట్టించుకోము. ఒకవేళ పట్టించుకున్నా, పట్టుదలగా ఆవిషయంలో ఒక ముగింపుకు వచ్చేదాకా పరిశీలన కొనసాగించము. వివేక పథం పాఠకుల నుండి అవసరమైనంత లేదా తగినంత స్పందన ఉండడం లేదన్న విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు అనుకోవడం జరిగింది. సుమారు 1000 మందికి వెళుతోంది పత్రిక. దాని విలువ తెలిసి చదివేదెంత మంది? అన్నది ప్రశ్నార్థకంగానే ఉంటోంది. మరొక్కసారి పత్రికను పంపడం ఆపి, పత్రిక కావాలన్నవారికే పంపుతాం అన్న ప్రకటన చేయడం, దానిని అమలు చేయడం అవసరమనిపిస్తోంది.

భావ విప్లవ క్షేత్రాలలో లేదా తాత్విక స్థాయిలో, వస్తున్న రచనలుగానీ, వాటిని చదువుతున్న పాఠకులుగానీ, నిర్థిష్టత, నిర్థుష్టతలేని భావాలను రాకుండా చూచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. కలగాపులగం రచనల్ని ఆహ్వానించి, రచయితల భావాలతో, అభిప్రాయాలతో ప్రచురణకర్తలకు సంబంధం లేదనో, వాటితో మాకు ఏకాభిప్రాయం ఉండాల్సిన అవసరంలేదనో ఒక చిన్న ప్రకటన చేసి ఊరుకోవడం ఒక వరవడిగా వస్తోంది. ప్రత్యేక లక్ష్యంతో ఆరంభించని పత్రికల విషయంలో ఈ విధానం అవసరమైందీ, సరైందీ కూడా అయినా, సైద్దాంతిక స్థాయి కలిగి, సరైన భావాలనే సమాజానికందించాలన్న లక్ష్యంతో మొదలైకొనసాగే పత్రికలకు మాత్రం ఈ విధానం అనుసరించదగింది కానే కాదు. తాము వెళ్ళడించిన భావాలు సరైనవేనని నిర్థారించే బాధ్యతను స్వీకరించే వారి రచనలనే ప్రచురించడం, అలాటి బాధ్యతను స్వీకరించడానికి సిద్దపడేవారే రచనలు పంపండని ప్రకటించడం, ప్రచురణకర్తలు తామంగీకరించని భావాలు చోటు చేసుకున్న రచనలపై నిస్పాక్షక దృష్టితో విమర్శనూ ప్రచురించడం, విమర్శలను ఆహ్వానించడం చేయగలగాలి. పత్రికల వైఖరులోని ఈ వ్యత్యాసంగాని తెలియకుంటే కాలక్షేపానికి పుట్టుకొచ్చిన పత్రికలకూ, భావజాల సంస్కరణ లక్ష్యంతో మొదలెట్టిన పత్రికలకూ తేడా లేకుండా పోతుంది.

ఉదాహరణకు; ఇటు వివేక పథంగానీ, అటు హేతువాదిగాని చదివే పాఠకుల సంఖ్య రెండు వేలకు పైగా మూడు వేల వరకు ఉండవచ్చు. గత ఆరేడు నెలలుగా రెండు మూడంశాలపై రెండు పత్రికల్లోనూ, భిన్నాభిప్రాయాలు వెళ్ళడవుతూ వస్తున్నేౖ. పరస్పరం ఒకింత ప్రతికూల వైఖరీ కనబరుస్తూ వస్తున్నాయవి. కానీ ఆ పత్రిక పాఠకులనుండి గానీ, ఈ పత్రిక పాఠకుల నుండి గానీ కనీస స్పందనలు కూడా రావడం లేదు. ఇతరేతర ధోరణుల వారి మాటెలా ఉన్నా, హేతువాద తాత్విక ధోరణికి చెందిన వాళ్ళమనుకుంటుండే వారివరకైనా, ప్రశ్నించడాన్ని సమాజానికి నేర్పాలి, విమర్శను ఆహ్వానించాలి. అనంటూ, విమర్శకుడు మిత్రుడవుతాడేగాని, శతృవుకాడు అని చెప్పుకుంటుండే వాళ్ళవరకైనా, ఈ రకమైన తేడాలను పట్టించుకోవడం, పాటించడం చేయగలగాలి. హేతువాది అనడానికి తగినవాడు, వ్యక్తుల్ని (గ్రంథాన్ని) ప్రామాణికంగా తీసుకోరాదు.  విమర్శించడానికిగాని, విమర్శింపబడడానికి గానీ వెనుకాడకూడదు. సిద్దంగా ఉండాలి, పూనుకోవాలి, అన్నది చాలా కీలకమైన భావన. దీనిని మనలో ప్రతివక్కరం ఖచ్చితంగా, తప్పనిసరిగా అలవరచుకోవాలి. వీలయినంత మందికి అలవరచాలి. ఎందుకంటే దానిసరైన అర్థంలో విమర్శ చేయాలంటే, విషయం పట్లలోతైన అవగాహనతో పాటు, రాగద్వేషరహితంగా ఉండగలగడమూ అవసరపడతాయి. ఆ అవసరపు ఒత్తిడే అతణ్ణి అధ్యయన పరుణ్ణి ఆత్మ నియంత్రణ పరుణ్ణిగా తీర్చిదిద్దుతుంది.

విమర్శ - ఖండన -  నింద

మిత్రులారా! పై మూటి అర్థాలు వేరు. అవి వాడవలసిన సందర్భాలూ వేరు వేరే. ఈ విషయంలో మనందరికీ స్పష్టత ఉండడం అవసరం.

విమర్శ : విమర్శించడమంటే లోపాలు, దోషాలు ఎత్తిచూపడం, తప్పులెన్నడం, ఖండించడం, తిట్టడం తిరస్కరించడం అన్న అర్థాలే ప్రధానంగా వాడుకలో ఉంటున్నాయి. నిఘంటువుల్లో (పర్యాయ పదకోశాలలో) ఆ అర్థాలూ ఉన్నప్పటికీ, సైద్దాంతిక స్థాయి కల విషయాలనుగాని, శాస్త్రీయాంశాలనుగాని విమర్శిచడమంటే; భావజాల క్షేత్రాలలో విమర్శచోటు చేసుకోవడమంటే, ప్రస్తావితాంశాలలోని సబబు బేసబబుల్ని వేరు చేసి చూడడం - చూపడం - అన్నమాట. దోషాదోషాలను, లోపాలోపాలను ఎత్తిచూపడమన్నమాట, ''ప్రకరణస్థ గుణదోష పరామర్మో విమర్శః. విమర్శా గుణ దోషవిచారణమ్‌ ! గుణ దోష విచారణ అన్నదేే విమర్శనమన్న మాటకు సరైన అర్థం. లేదా మనలాటి విచారణ క్షేత్రాలు స్వీకరించాల్సిన అర్ధం. అలాటి విమర్శలో ఉన్నది ఉన్నట్లు చూడడం, చూపించడం అన్నదే ప్రధానాశయంగా ఉండాలి. ఉంటుంది కూడా. సరైన విమర్శలో ఎక్కువ చేయడం, తక్కువ చేయడం ఉండకూడదు. 'స్తుతి - నింద' 'పొగడ్త - తెగడ్త' అన్నవి విమర్శలో తప్పని సరైనవి కానేకాదు. కొన్ని అసాధారణ పరిస్థితుల్ని మినహాయించితే అలాటివి అనవసరమైనవి కూడా. ఈ విషయాల్ని చాలాకాలం క్రితమే నేను స్పష్టంగా గమనించి, ఇష్టపడ్డానుగనకనే, సత్యాన్వేషణ మండలి తనకు తాను చెప్పుకునే నియమాలలో, పొగడొద్దు పొగిడించుకోవద్దు - తెగడొద్దు, తెగిడించుకోవద్దు అన్న దానినీ చేర్చుకున్నాము.

విమర్శ :-Criticism  ఆన్న దానికి పలు నిఘంటువులు ఏమి అర్థం - నిర్వచనం - చెప్పాయో చూద్దాం.

I)     Criticism :- The analysis and Judgment of the merits and faults of a literary or artistic work.
    Synonyms : evaluation, essessment, examination, appreciation appraisal, analysis, Judgement.
2)     The expression of a disapproval of some one or something based on perceived faults and mistakes.
3)     The scholary investigation of literary and historical tests to determine their origin or intended form.
4)     Criticism is the practice of judging the merits and faults of some thing or some one in an intelligible way.
5)     In the 20th century all these meanings continued but criticism aquired the more general connotation of voicing an objection, or of appraising the pros and cons of some thing.

సారాంశం :- మిత్రులారా! ఇంటర్‌నెట్‌లోకి వెళ్ళిచూస్తే ఇలాటి నిర్వచనాలు అనేక నిఘంటువుల నుండి ఎత్తి రాసుకోవచ్చు. దాదాపు అవన్నీ, విమర్శ అంటే బాగోగుల 'విశ్లేషణ, నిర్ధారణ' చేసే పద్దతేనని చెపుతున్నాయి. మరోమాట! ఆ నిఘంటువుల్లోని ఒకటి సరైన విమర్శ ఎలా గుండాలంటే అంటూ ఇదిగో ఈ మాటలు చెప్పింది

A good criticism should be.
1) Timely : not too early not too late.
2) brief and succinct : (but sufficiently detailed) with a clear start and finish, not endless.
3) relevent and to the point : not misplaced
4) clear, specific, and precise :- not vague
5) well researched :- not based on hear - say or speculative thought
6) Sincere and possitively intended :- not malicious
II Techniques of constructive criticism
1) It aims improve the behavior or the behavioral results of a person, while consciously avoiding personal attacks and blaming.  This kind of criticism is carefully formed in language aceeptable to the target person, often acknowledging that the critics themselves could be wrong, insulting language and hostile language are avoided, and phrases are used, "I feel", and it is my understanding that and soon. Constructive critics try to stand in the shoes of the person criticized and consider what things would took like from their perspective.

సారాంశం :

1)    1)     అవసరంరానప్పుడుగానీ, అవసరం తీరాకగానీ విమర్శ నిష్ప్రయోజనం.

    2)     క్లుప్తంగా ఉండాలి అయినా తగినంతా ఉండాలి. ఆరంభము, ముగింపు స్పష్టంగా ఉండాలి. ముగింపు లేకుండా ఉండకూడదు.

    3)     సందర్భోచితంగా ఉండాలి. అపసవ్యత ఉండకూడదు.

    4)     స్పష్టత, నిర్థిష్టతతో కూడిన ఖచ్చితత్వం ఉండాలి. అస్పష్టత ఉండకూడదు.

    5)     చక్కగా శోధించబడినదై ఉండాలి. గుంజులాట 'ద్వైదీభావన' ఉండకూడదు.

    6)     నిజాయితీతో కూడి అనుకూల దృష్టి కలిగి ఉండాలి. పగ, ద్వేషంలాటి వ్యతిరేకత ఉండకూడదు.

2)     1)     విమర్శ మేలు కలిగించగలిగిందిగా, ప్రవర్తనను మెరుగుపరచగలిగిందిగా ఉండాలి వ్యక్తిగత దాడిని, అవమానించడాన్ని చొరబడకుండా జాగ్రత్త తీసుకోవాలి ఎవరిని ఉద్ధేశించి ఈ విమర్శ చేస్తున్నామో అతని విషయంలో మాటలు జాగ్రత్తగా వాడాలి. అవమానకరమైన, హేళన పూర్వకమైన పదజాలాన్ని (భాషను) విడిచిపెట్టాలి. వీలయినంతలో అతన్ని నొప్పించకుండా ఉండే భాషనే వాడాలి.

పాఠక మిత్రులారా! మంచి విమర్శ ఎలా ఉండాలో, నిర్మాణాత్మకమైన మేలు కలిగించగల - విమర్శ కొరకు ఎటువంటి మెలకువల్ని పాటించాలో ఎంత చక్కగా చెప్పారు?!

ఖండన :- ఒక విషయాన్ని గురించిగానీ, వ్యక్తిని గురించిగాని చక్కగా శోధించినప్పుడు - పరిశీలించినప్పుడు - అందులోని మంచి చెడులు (గుణాలు - దోషాలు) తెలియబడతాయి. అలా తెలిసిన వానిలోని దోషాలను ఎత్తిచూపుతూ వాటిని నిరసించడాన్ని, అతణ్ణి నిరసించడాన్ని ఖండన అంటారు. విమర్శలోని గుణదోషాల్ని ఎత్తిచూపే సందర్భంలో మంచిని చూపించడాన్ని పొగడ్త అని గానీ, చెడ్డను చూపించడాన్ని తెగడ్త - ఖండన - అనిగాని అనరు. విమర్శలో, అవి ఉన్నాయని తెలపడం మాత్రమే ఉంటుంది. అందులోని ఉండకూడని వాటిని వ్యతిరేకించడాన్ని తొలగించడాన్ని తొలగించుకోమని చెప్పడాన్ని ఖండన అంటారు. ఉన్న మంచిని చూపి అతిగా ప్రశంసించడాన్ని పొగడడం అంటారు. విమర్శలో మంచి చెడుల ప్రస్తావనే ఉంటుంది. దాని తరవాతవి పొగడడమో - తెగడడమో అన్నవి.

ఖ నింద :-

ఇక నింద అన్నది ఈరెండు క్షేత్రాలకూ అవతలిది. అది తిట్ల రూపంలో ఉంటుంది. అవమానించడం, హేళనజేయడం, సందర్భానికి తగని పరుష భాషణం చేయడం, సంస్కారహీనంగా మాట్లాడడం వగైరాలన్నీ నింద క్రిందికి వస్తాయి. విమర్శలతో ముడిపెట్టి కొంతవరకు ఖండన అవసరమవుతుంది. ప్రశంసాఅవసరపడుతుంది. పొగడ్త అనవసరం. గుణాన్ని గురించి తగినంత చెప్పడాన్ని ప్రశంస అనవచ్చు. అతిగా చెప్పడాన్నే పొగడ్త అంటారు. పొగడ్తలో అతి ఉంటుంది. నింద (తిట్ల పురాణం) ఈ రెండూ కానిది, విమర్శతో ముడిపెట్టాల్సిన అవసరం లేనిదీ, నష్టదాయకమైనదీ కూడా. కనుక భావజాల క్షేత్రంలో నిందకు చోటీయరాదు.

1) నిజానికి, హేతువాద పునరుజ్జీవన యత్నాల పేరున నేను రాసిన వ్యాసాలలో ఎక్కడా వెంకటాద్రిగారిని నిందించలేదు. ఇది నిజమో కాదో తేల్చుకోండి.

2) ఆయన్ను పొగడనూ లేదు, తెగడనూ లేదు. కొన్ని విషయాలలో కొంత ప్రశంసాత్మకంగా మాట్లాడాను.

3) విమర్శ అంటానికి తగిన రీతిలో విచారణా చేయలేదు. విచారణకు ముందు చేయాల్సిన, ఆయన భావాలను విడగొట్టి ఉట్టంకించాను. అందులో కొన్ని నాకంగీకారమైనవి ఉన్నాయన్నాను, కొన్నింటితో నేను విభేదిస్తున్నానన్నాను. మరి కొన్నింటి విషయంలో ఏ నిర్ణయమూ తీసుకోలేదని వ్రాశాను.

అంగీకరించిన వాటిని ఎందుకంగీకరిస్తున్నానో, అంగీకరించని వానిని ఎందుకంగీకరించడం లేదో కొన్నింటి విషయంలో నిర్ణయానికి ఎందుకు రాలేదో వివరించి అందుకు ఆధారాలూ చూపితే విమర్శించినట్లు అవుతుంది. కనుక నేను ఆయన్ను నిందించలా, పొగడలా - తెగడలా, ఇంకా సరిగా విమర్శించనూలేదు. ఇది నిజం.

మరి రావిపూడి వారు, కొన్నిచోట్ల పొగిడాననీ, కొన్నిచోట్ల తెగిడానని, అది గిల్లిజోల పాడినట్లుందని, అలాటి నాలిముచ్చు పనులు తనవల్ల కావనీ అనేశారు. అంతటితో ఆగక, గతాన్నీ త్రవ్వి రకరకాల నిందాత్మక పదాలు వాడేశారు. వాటిని నేనుగానీ, పాఠకులుగానీ అంతగా పట్టించుకోరేమోననుకుని కాబోలు, సురేంద్రగారూ! ఇవన్నీ మీ గురించేనండీ! అని ఒక ముక్తాయింపూ ఇచ్చారు. హేతువాది 343 సంచికలోని ఆ వ్యాసంలో సుమారు 40, 45 తిట్లు తిట్టారు. అప్పటికిగాని ఆయన గారి ఆకారణావేశం చల్లారినట్లు లేదు. ఈ సందర్భంగా నేను హేతువాదుల్ని, హేతువాది పాఠకుల్ని, ఈ అంశాల్ని గుర్తించిన వివేకపథం పాఠకుల్నీ అడుగుతున్నదేమంటే, తప్పును తప్పన గల ధైర్యము, స్వభావము మీకున్నట్లైతే నేనేమి తప్పు మాట్లాడానో నాకు చెప్పండి. వివేకపథం - స్పందనకూ ఆ వివరాలు పంపండి. పత్రికలో వేస్తాను. అలాగే ఆయనేమి తప్పు మాట్లాడారో ఆ వివరాలు వారి పత్రికకూ, మా పత్రికకూ పంపండి.

ఖ    వెంకటాద్రి గారికి :-

మన మధ్య వ్యక్తిగత విమర్శలుగానీ, హేళనాత్మక పదాల ప్రయోగాలు గాని ఇప్పటికీ అనవసరమనేనా అభిప్రాయం. ఆ పోకడను ఇంతటితోనైనా ఆపేయండి. విషయపరంగా నేను నావిగా ప్రకటించిన అభిప్రాయాలను నిర్థాక్షణ్యంగా విమర్శించండి. గుణాలు - దోషాలు ఎత్తిచూపండి. కేవలం దోషాలవరకు ప్రస్తావించినా నాకభ్యంతరం లేదు. రోషావేశాన్ని రగిల్చే పదాల ప్రయోగాలు పాఠకులకు అనవసరం, మనకూ అనవసరమే.

ఇక క్రమంగా హేతువాదం క్రిందికి వచ్చేవిగా మీరు వెలిబుచ్చిన భావాలను, అభిప్రాయాలను పరిశీలించే, విశ్లేషించి విమర్శించే పని కొంతకాలం సాగిస్తాను. ఏమి జరుగుతుందో చూద్దాం.

ఇక సిద్దాంతం గురించి :-

సిద్దాంతాలు తయారు చేయడానికి అవసరమైన విధానమే హేతువాదమంటే. కనుకనే దానిని మెథడాలజీ అన్నాను, అనన్నారు మీరు. ఒక్కమాట! హేతువాదం విధానమా? సిద్దాంతమా? అన్నదలా ఉంచుదాం. విధానాలగురించిన సిద్దాంతాలూ ఉంటాయన్నది నా పక్షం. నెట్‌లోకి వెళ్ళి, theories on methodology  అనే భాగాన్ని తెరిచాను. మెథడాలజీ మీదా, వివిధ సిద్దాంతాలున్నాయి. వివిధ మెథడాలజీలకు చెందిన సిద్దాంతాలూ ఉన్నాయందులో. theories on scientific method అన్న శీర్షికతోనూ సమాచారం ఉంది. ధీయరీ ఆఫ్‌ సైంటిఫిక్‌మెథడ్‌ అన్న సమాచారమూ ఉందందులో. కనుక ఒకవేళ మీరనుకుంటున్నట్లు ఏదో ఒక విధానానికే హేతువాదమన్న పేరు పెట్టుకున్నాము మేము' అనన్నారనుకున్నా, ఆ విధానాన్ని గురించిన మీ సిద్దాంతమేమిటోనైనా వివరించాల్సి ఉంటుంది మీరు.

ఎలాగంటే, జ్ఞానమేర్పడుతున్న క్రమమేమిటి? అన్న ప్రశ్నను అనేక చింతకులముందుంచామనుకోండి! అందులో, ఆ క్రమాన్ని ఆస్థికులు ఒకరకంగా, వైజ్ఞానికులు మరో రకంగా వివరించారనుకుంటే, జ్ఞానమేర్పడుతున్న విధానం ఏమిటన్నదానిపై రెండు సిద్దాంతాలున్నట్లు అవుతుంది. వాస్తవంలోనూ ఇప్పటికి ఆ రెండు సిద్దాంతాలూ ప్రకటింపబడ్డాయి. ఆస్తికుల సిద్దాంతం ప్రకారం ఆత్మ మనస్సుతోనూ, మనస్సు ఇంద్రియాలతోనూ సంయుక్తమై, వస్తువును చేరి వస్త్వాకారాన్ని పొందడం ద్వారా ఆ వస్తువు తెలియబడుతుంది. అదే మరి ఈ నాటి వైజ్ఞానికుల ప్రకారం, విషయాలకు చెందిన సమాచారం ఆయా ఇంద్రియాలకు అందడం వల్ల, ఇంద్రియాలు వాటి వాటి సామర్థ్యాలననుసరించి ఆ విషయాలను పట్టుకుని, ఆ సమాచారాన్ని మెదడుకు చేరవేయడం ద్వారా జ్ఞానం కలుగుతుంటుంది. ఇది ఆ రెండు క్షేత్రాల వారి సిద్దాంతాలను చూసినవారెవరికైనా తెలిసున్న విషయమే.

అంతేకాదు, ప్రతిమతమూ, తననంగీకరించాల్సిన వారు అనుసరించాల్సిన జీవన విధానం గురించి నిర్థిష్టంగా ప్రకటిస్తుంటుంది. అవన్నీ ఆయా జీవన విధానాలకు సంబంధించిన సిద్దాంతాలే. కనుక సిద్దాంతమన్నమాట ఏ అర్థంలో లేదా ఏయే అర్థాలలో వివిధ క్షేత్రాలలో వాడుకలో ఉందో తెలుసుకోవడమో, తేల్చుకోవడమోనన్నదే ఈ విషయంలో మనముందున్న ప్రశ్న.

నా అభిప్రాయం ప్రకారం, ఏదేని ఒక విషయానికి సంబంధించి నిశ్చితరూపంలో ప్రకటింపబడ్డ అభిప్రాయాన్ని సిద్దాంతమంటారు. అలా ఒక్కో విషయంపైనా ఏర్పడ్డ అభిప్రాయాలన్నింటినీ కలిపే అంటే భావజాల సంపుటినే సిద్దాంతమంటున్నారు. నిర్థారింపబడ్డ అభిప్రాయాలు. ఇంకా నిర్థారింపబడకుండా ఉన్న అభిప్రాయాలూ, తప్పులుగా నిర్థారింపబడ్డ అభిప్రాయాలూ, పరికల్పనల రూపంలో ఉన్న ప్రతిపాదనలూ, కూడా సిద్దాంతాల పేరుతోనే చెప్పబడుతున్నాయి.

Theory :- 1) A formal set of ideas that intended to explain why some thing happens or exists.
2) A branch of science, consisting of its explanatary statements, accpted principles and methods of analisis
Theory : Theory is a system of ideas entended to explain something, such as a single or collection of fact(s), event (s), or phenomen ....... a theory often based on genaral principles that are indipendent of the thing being explained


సిద్దాంతము : తంత్రాధికరణాభ్యుపగమ సంస్థితిః సిద్దాంతం ః!

ఏదైనా ఓ విషయానికి సంబంధించి నిశ్చయరూపంగా ప్రకటింపబడ్డ అభిప్రాయము - ప్రతిపాదన - సిద్దాంత మనబడుతుంది.

అభ్యుపగమ సిద్దాంతం :- ఒక విషయంపై ప్రకటించిన అభిప్రాయమును పరిశీలనకు స్వీకరించిన స్థితిలో, ఆయభిప్రాయమునూ సిద్దాంతమనే అంటారు. అయితే అట్టి దానిని పరిశీలన కొరకు స్వీకరించిన సిద్దాంతమని - అభ్యుపగమ సిద్దాంతమని- అంటారు.

పాఠమిత్రులారా! ఇప్పటి కాగుతాను. దీనిలో 1) వెంకటాద్రిగారు నా గురించి మాట్లాడిన మాటలూ; 2) హేతువాదం ష్ట్రబిశిరిళిదీబిజిరిరీళీ అన్నదానికి పలు నిఘంటువులలోని వివరణలు 3) విమర్శ, ఖండన నింద, పొగడ్త - తెగడ్తలన్న వాటి అర్థాలు 4) సిద్దాంతం (ఊనీలిళిజీగి) అన్నదాన్ని గురించి నావి, ఇతరులవీ అయిన అభిప్రాయాలు వ్రాశాను. జాగ్రత్తగా పరిశీలించండి. మీరేమిటో తేల్చుకోండి.

తప్పొప్పులు చూడగలిగేవాళ్ళు, తప్పును తప్పనీ, ఒప్పును ఒప్పనీ అనగలిగేవాళ్ళు అరుదైపోతున్నారు. భావజాల క్షేత్రంలో కృషి చేస్తున్నవారు ఎంత శ్రద్దగా వాటిని పరిశీలించాలో, వాటి బాగోగులను విచక్షించాలో, వాటి వాటికి ఎంతెంత విలువనివ్వాలో నన్నదీ అంతగా పట్టించుకునేవారూ తగ్గిపోతున్నారు.

రాబోయే సంచిక నుండి, వెంకటాద్రి గారూ, వారిననుసరిస్తున్నవారు హేతువాదం పేరున వెళ్ళడించిన అభిప్రాయాలను క్రమంగా విశ్లేషించి సమీక్షించే పని మొదలెడతాను. ఈ విచారణలో పాలు పంచుకోదలచిన వాళ్ళు నాకు తెలియజేస్తే బాగుంటుంది.

ఖ  వెంకటాద్రిగారికీ, హేతువాదం ఒక మెథడాలజీనే అంటున్నవారికీ :

ఏ విధానానికైనా, కొన్ని పరికరాలతో కూడి ఒక దగ్గర ప్రారంభమై, ఒక దగ్గర ముగిసే క్రమబద్దమైన పని ఉంటుంది. ఇది ఎవరూ కాదనకూడని అభిప్రాయం (సిద్దాంతం). కనుక, మీరంటున్న హేతువాదమనే పద్దతిలో పని చేసే పరికరాలు - దాని ప్రారంభము - ముగింపులతో కూడిన క్రమ విధానము అన్నవాటిని నిర్థిష్ట రూపంలో ప్రకటించండి. ఆలోచించి చూస్తాను. అలా నిర్థిష్టరూపంలో హేతువాదమన్నది ఇదిగో ఈ విధానాన్నే అని మీరు ప్రకటించగలిగితే అప్పుడది హేతువాదమనే విధానాన్ని (పద్థతిని)  గురించి మీరంగీకరించే అభిప్రాయం - సిద్దాంతం - అవుతుంది.

గమనిక :- హేతువాదం పైసాగనున్న విచారణలో పరిశీలకులకు అవసరమైన కొన్ని కీలకాంశాలను ఈ సంచికలో ప్రస్తావించాను. వాటిని పట్టించుకోగలిగితేనే అనంతర విచారణలో సక్రమంగ పాల్గొనగలుగుతారు. నా ఈ సూచనను గమనించండి.

Thursday, October 1, 2015

హేతువాద సంఘం vs సత్యాన్వేషణ మండలి

హేతువాద సంఘం v/sసత్యాన్వేషణ మండలి
(రావిపూడి వెంకాటాద్రి v/s పుట్టా సురేంద్ర బాబు)
- యర్రంశ్టెి జగన్‌మోహన్‌రావు
(గత సంచిక తరువాయి)

 మరి మారనిది సత్యము కాదు. అని కూడా ప్రకించారు. హేతువాద సంఘం వారు అది ఆవేశంగా వ్రాశారో లేక అవగాహనతో వ్రాశారో గాని ఆ విషయంలో నాకు కలిగిన కొన్ని సందేహాలు ప్రకించుతున్నాను. నివృత్తి చేస్తారని ఆశిస్తున్నాను.
ఎ. భూమి బల్ల పరుపుగా ఉంది - అది ఒకప్పి సత్యం అనుకుంటే, భూమి గోళాకారంగా ఉంది - అది ఇప్పి సత్యం అనుకుంటే సత్యం మారుతుంది అని తేలిపోయినట్లేనని అనిపిస్తుంది. మరి మారనిది సత్యమే గాదు అని ఈ విషయంలో ఋజువు కావాలంటే ఏం జరగాలి? భూమి బల్ల పరుపుగానూ గాక, గోళాకారంగానూ కాక మరోలా ఉంది అనిపించాలి. అంటే ఒకప్పి సత్యం, ఇప్పి సత్యంగా మారినట్టే, ఇప్పి సత్యం భవిష్యత్‌లో మరో సత్యంగా ప్రకించబడుతుంది. లేకపోతే ఇప్పి సత్యం కూడా సత్యం కాకుండా పోతుంది. దీన్ని బ్టి భూమి వాస్తవంగా ఏ ఆకారంగా ఉన్నప్పికీ, నిజానికి దాని ఆకారంలో ఏ మార్పూ రానప్పికీ, దానితో నిమిత్తం లేకుండా మన అవగాహన మారినప్పుడల్లా సత్యం మారింది అనాలన్నమాట.

స్పందన - ప్రతిస్పందన

వివేకపథం 208 సంచిక నుండి ''హేతువాద సంఘంకు సత్యాన్వేషణ మండలికి మధ్య'' శీర్షిక క్రింద శ్రీ యర్రంశ్టెి జగన్‌మోహన్‌రావు రాస్తున్న శీర్షికపై స్పందనలను ఆహ్వానిస్తున్నాము. స్పందనలు సూిగా, సంక్షిప్తంగా, విషయపరంగా రాస్తే మంచిది. ఆ విషయంపైనే కాక హేతువాదంపైన పత్రికలో వస్తున్న విషయాలపై మీ స్పందనలను వివేకపథంలో ఆహ్వానిస్తున్నాం.

మిత్రులు కె.బాబూరాజేంద్ర ప్రసాద్‌ గారు తమ స్పందనగా సుదీర్ఘ  లేఖ వ్రాశారు. స్థలాభావం వలన పూర్తి లేఖను గాక వారి అనుమతితో దానిలోని ముఖ్యాంశాల వరకు ప్రచురిస్తూ దానిపైన జగన్‌ ప్రతిస్పందనను ప్రచురిస్తున్నాము  - ఎడిటర్‌

కె.బి.ఆర్‌.ప్రసాద్‌ గారి లేఖ సారాంశము :
1.  వెంకాద్రి గారి భావాలను విమర్శించటంలో సురేంద్రగారికి మిత్రభావనే తప్ప అన్యభావన లేదు. కేవలం సమాజంలోకి తప్పుభావాలు ప్రచారం కాకూడదనే అభిప్రాయం తప్ప.
2.  హేతువాద సంఘం కోరకుండానే మళ్ళీ మళ్ళీ వారిసిద్ధాంతాన్ని విమర్శించడం వారి కోపానికి కారణం. 
3.  సురేంద్రబాబు గారితో సంబంధంలోకి రావడానికి హేతువాద సంఘం వారికి ఇష్టంలేదు. రావిపూడి వారి రచనల్లో చిన్న లోపాలున్నా వాివల్ల నష్టంజరిగే అవకాశం లేదు అనేభావన వారికి ఉందని నేననుకుంటున్నాను.
4.  రచనలు, అవి ఎవరిని ఉద్దేశించి, ఎవరికోసం రాయబడినవో వారి స్థాయికి తగ్గట్లు ఉండాలి.
5.  రావిపూడి  వారి రచనల్లో దోషాలు చూపించగలిగే సామర్ధ్యం ఒక్క సురేంద్రబాబుకే తప్ప ఇతరుల్లో కనపడ్డంలేదు. అలా విమర్శించే స్థాయి అందరికీ సాధ్యం కాదు. అందరికీ అవసరమూ లేదు. రావిపూడివారి రచనలు సామాన్య పాఠకులకు సులభంగా అర్థమయ్యే స్థాయిలో ఉంటున్నాయి.
6.  మండలి సభ్యులలో ఎవరూ కూడా సురేంద్రగారి ప్రమేయం లేకుండా ఏ ఒక్క విషయంపైనైనా 20 మందికి క్లాస్‌ చెప్పలేరు. సురేంద్రబాబుగారికి ఉన్నంత స్థాయి అందరికీ రాదు. అవగాహనల్లో తేడాలుాంయి మరి.
7.  తమతో హేతువాద సంఘానికున్న భేదాలను సురేంద్రగారు ఎత్తిచూపినా వాిని పరిశీలించడానికి కూడా ముందుకు రావడానికి హేతువాద సంఘం ఇష్టపడటం లేదు. అందువలన అలా ఎత్తిచూపడం వ్యర్థప్రయాస.
8.  హేతువాద ఉద్యమం బలహీనంగా ఉందంటున్న వారు స్వయంగా హేతువాద ఉద్యమంలో ఎందుకు పాలుపంచుకోవటం లేదు? నాస్తికులుగా జీవిస్తున్నప్పుడు ఆ జీవితంయొక్క ఆవశ్యకతను సామాన్య ప్రజలకు చెప్పవచ్చుకదా.
9.  ఎంత ఎదిగినవారైనా ప్రాథమిక మానవీయలక్షణాలు - ఇష్టాఇష్టాలు, ఉద్వేగాలు తొంగిచూస్తూఉంాయి. వాినుండి పూర్తిగా విముక్తిపొందడం సాధ్యం కాదు. ఈ లేఖలోని విషయాలు పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయములు మాత్రమే. హేతువాద సంఘానికి దీనితో ఎటువిం సంబంధం లేదు.
జగన్‌ ప్రతిస్పందన :
మిత్రులు రాజేంద్ర ప్రసాద్‌ గారికి లేఖారూపంలో మీ స్పందన పంపినందులకు ధన్యవాదములు. నా ప్రతిస్పందనను అంశాల వారీగా క్లుప్తంగా తెలియజేస్తున్నాను.

1.  మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. సురేంద్ర గారికే కాదు, ఉద్యమకారులందరికీ సాి ఉద్యమకారుల పట్ల మిత్ర భావనే ఉండాలి. భావజాలాల్లో సారూప్యతను మితృత్వం ద్వారానే సాధించుకోగలుగుతాం.
2.  తమ భావాలపట్ల పాఠకుల సలహాలను, అభిప్రాయాలను, విమర్శలను, భావవిప్లవోద్యమంలో ఉన్నవారు కోరుతున్నట్లు, ప్రత్యేకించి ప్రకించుకోనఖ్ఖరలేదు. భావసంఘర్సణ జరిగితేనే భావాల్లో తప్పొప్పులు బయటపడతాయి. 9వ అంశంలో మీరు సూచించినట్లు భావవిప్లవ ఉద్యమకారులు ఉద్వేగాలనుండి బైటపడాలి. అంతేగాక సద్విమర్శలను సహృదయంతో స్వీకరించి  పునరాలోచన చేసుకోవాలి. నా అవగాహనలో వారికోపం వారి భావాలను విమర్శించినందులకు కాదు. వారు దానిని వ్యక్తిగతంగా అన్వయించుకున్నందువలననే సమస్య వస్తుంది.
3.  సురేంద్ర బాబుగారితో సంబంధంలోకి రావటం హేతువాద సంఘానికి ఇష్టంలేదని, వారి పత్రిక పాఠకులకు అర్థమవుతూనే ఉంది. కాని భావజాల విమర్శలు చేసేటప్పుడు వారి వారి ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేదు. అలా అనుమతి తీసుకోవాలంటే వెంకాద్రిగారు వ్రాసిన ఎన్నో విమర్శనాత్మక గ్రంథాలు వెలుగుచూసేవే కావు. లోపాలు చిన్నవా పెద్దవా అన్న విషయాన్నట్లుంచితే  మీరు ఇరు సంస్థల భావజాలాల్ని కనుక ప్టిచూస్తే మౌలికాంశాల అవగాహనల్లోనే విభేదాలున్నట్లు తెలుస్తుంది. వాిని సరిపెట్టుకోవడం భావవిప్లవ లక్ష్యం దిశగా మిమ్మల్ని సాగనివ్వదు.
4.  మీరు చెప్పిన దానికి పూర్తిగా అంగీకరిస్తున్నాను. కాని నా అవగాహనలో నాకు వారిరువురితో వ్యక్తిగతంగాను, ఉద్యమ క్షేత్రంలోను ఉన్న పరిచయంతో వారు వారి వారి రచనలు మేథావుల స్థాయికి చెందినవనే అంటుాంరు. కాని భాష విషయంలో మాత్రం సురేంద్రబాబు గారి రచనల కంటే వెంకాద్రి గారి రచనలు సరళంగా ఉన్నట్లు అనిపిస్తాయి.
5.  ఎవరి రచనల్ని అయినా ఎలా అధ్యయనం చెయ్యాలో, ఎవరి ప్రసంగాలనైనా ఎలా అర్థం చేసుకోవాలో ''పదపదార్థ విచారణ'' విద్య అభ్యసించిన వారికి తెలిసినంతగా ఇతరులకు తెలియదు. ప్రస్తుతం మీరన్నట్లు మనకు సురేంద్రగారు ఒక్కరే ఆ విద్య తెలిసిన వారుగా కనిపిస్తున్నారు. అలా ఒక్కొక్కరే కాకుండా తనలాగ  మరింత మంది తయారు కావాలనే ఉద్దేశ్యంతోనే తాను మొదలుప్టిెన ''హేతువాద పునరుజ్జీవన యత్నాలు'' అధ్యయనం శిక్షణ తరగతులను కూడా పదపదార్థ విచారణతో ప్రారంభించారు. ఈ విచారణే సత్యాన్వేషణ మండలి ఆవిర్భావం  నుండి ఒక కార్యక్రమంగా చేస్తూ వస్తుంది.
6.  సురేంద్రబాబుగారైనా, వెంకాద్రి గారైనా, ఎం.ఎన్‌.రాయ్‌ అయినా ఎవరి స్థాయి వారిదే. వారిలాగా వారి సహచరులు లేరు అనుకోవటం కంటే వారిని స్పూర్తిగా  తీసుకొని వారు చేసినంత కృషిచేస్తే వారితో సమానులే కాదు వారిని మించిన వారుకూడా ఉద్యమ క్షేత్రంలో తయారవానికి అవకాశం ఉంది.
7.  సురేంద్ర గారు తమ భావజాలంపై చేస్తున్న విమర్శలను హేతువాద సంఘం ప్టించుకోవటం లేదని నేను అనుకోను. కాని వారు ఆ విమర్శలను స్వీకరించవలసిన రీతిలో కాక ఉద్యమకారులు తీసుకోకూడని వ్యక్తిగత రీతిలో స్వీకరించి స్పందిస్తున్నారు. ''హేతువాది''లో వస్తున్న వ్యాసాలను ప్టిచూడండి. విమర్శకు గురైన విషయాన్ని మళ్ళీపునరుద్ఘాించడం లేదా విషయం విమర్శకులకు అర్థం కావటం లేదనడం జరుగుతుంది. విమర్శకులు అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానం వారినుండి రావడం లేదు. సురేంద్రబాబుగారి విమర్శల్లో కేవలం తప్పు ఎత్తిచూపడం కాక అది ఎలా  తప్పు అవుతుందో, ఏది ఒప్పవుతుందో కూడా స్పష్టంగా  మొదటనే రాస్తే సరిపోతుంది. అందువల్లనే పత్రికల్లో విషయాల్ని సాగదీసుకోవటం కంటె ముఖాముఖి చర్చలలోనే విషయాలు ఒక కొలిక్కి వస్తాయని నేనాంను.
8. హేతువాద ఉద్యమం బలహీనంగా ఉందన్న సురేంద్రగారి అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారో లేదో ముందు తెలియజేయండి. సత్యాన్వేషణ మండలి ఆవిర్భావం నుండి వారు హేతువాద ఉద్యమంలోనే ఉన్నవారని ప్రమాణ క్షేత్రాలు తెలిసిన వారికి సులభంగానే అర్ధమవుతుంది. అనుమాన ప్రమాణం, హేతువాద క్షేత్రం సారూప్యాలే. కాని సంచిక 205లో వివరించినట్లు కేవలం హేతుబద్దాలోచన ద్వారా పొందిన జ్ఞానం సత్యాన్ని నిర్ధారించలేదు. ఆపై ప్రయోగము అంటే అనుభవము ఒక్కటే సత్యాన్ని నిర్ధారించగలుగుతుందని మండలి అభిప్రాయం.
ఆస్తికత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు కనుక ఆస్తికేతర జీవన విధానాన్ని పాించేస్తున్నారు. ఒక రకంగా అది నాస్తిక జీవన విధానమేనని నా అభిప్రాయం. కాని నాస్తికత్వాన్ని రుజువు చేయమని ఎవరైనా తనని అడిగినా, తాము ఎవరినైనా అడిగినా ప్రస్తుతము ఉన్న శాస్త్రీయ విజ్ఞాన పరిమితుల దృష్ట్యా అది వీలుకాదని చెబుతున్నారు. కాని తమ భావజాల ప్రాతిపదికల్లోని ముఖ్యాంశంగా ''పుట్టుకకు ముందుగాని, మరణించిన తరువాత గాని సంబంధించిన విషయాల గురించి ఆలోచించడం అనవసరం'' అని ప్రచారం చెయ్యటం నాస్తికత్వం ప్రచారంలో భాగంగా అర్థం చేసుకోవాలి.
9.  సత్యాసత్యాల విషయంలో ఎలాిం ఇష్టాఇష్టాలకు, ఉద్వేగాలకు తావివ్వకూడదు. ధర్మాధర్మాల విషయంలో వీలైనంతవరకు వాిని తమ అదుపులో ఉంచుకోవాలి. పూర్తిగా విముక్తిపొందటం అంటే కేవలం ఆదర్శంగా చెప్పుకోవడం వరకే.


హేతువాద పునరుజ్జీవనయత్నాలు - 9

1. జ్ఞానేంద్రియాల వివరాలు :
యోచనాశీలురైన మిత్రులారా ! క్రమాన్ననుసరించి జ్ఞానేంద్రియ వ్యవస్థ, అది పనిచేస్తున్న తీరు - పరికరాల వివరాలు, శరీరనిర్మాణ శాస్త్రం నుండి తీసుకుని చూద్దామనుకున్నాం. నిపుణులతో సమావేశం కాలేదు గాని కొన్ని వివరాలు సేకరించాం.
సాంప్రదాయకంగా (స్థూలంగా) అందరం అంగీకరించిన ''5'' జ్ఞానేంద్రియాలను ఆ శాస్త్రం అంగీకరిస్తోంది. ఆ ఐదిం ద్వారా తెలియబడని మరో 4, 5 విషయాల గురించి ప్రస్తావిస్తోందది.

Wednesday, April 1, 2015

వెంకాద్రి - విశ్వతత్వం - ఒక పరిశీలన


ముందుమాట :
వివేకపథాన్ని నిశితంగా శ్రద్ధగా - అధ్యయనమన దగ్గ రీతిలో చదువుతున్న వారికీ, వెంకాద్రిగారినీ నన్ను జాగ్రత్తగా పరిశీలిస్తున్న మారెండు పక్షాల అనుకూల ప్రతికూల వైఖరులు కలవారికీ, తటస్థ దృష్టి కల పరిశీలకులకూ ఈ వ్యాసంతో పని ఉంది. సాధారణ పాఠకులకంటే, పై రకాల వారిని ప్రధానంగా దృష్టినిడుకునే ఈ వ్యాసాలను వ్రాయడం మొదల్టెాను. అి్ట వారంతా కొంతకాలంపాటు సాగనున్న నా ఈ వ్యాసాలను - దీనిపై వెంకాద్రి గారివైపు నుండి వెలువడే భావాలను తులనాత్మకంగా పరిశీలించడానికి సిద్దం కండని విజ్ఞప్తి చేస్తున్నాను. మన మందరం సిద్దపడుతున్న ఈ వ్యయ ప్రయాసలకు మరింత ప్రయోజనం చేకూరాలంటే, మాయిరువురినీ ప్టి చూడడంతో పాటు వైజ్ఞానిక విషయాలలో మా యిరువురికీ ఆధారంగా ఉన్న ఆయా విజ్ఞాన శాస్త్రాలను మీరూ, ఎవరికి వారుగా చూడవలసి ఉంటుంది. చదువరులందరికీ అది సాధ్యం కాకున్నా, వాస్తవాలను జాగ్రత్తగా, స్పష్టంగా సందేహరహితంగా గమనించాలనుకున్న వారెవరికైనా ఇందుకు పూనుకోవడం అవసరం.

ఆస్తికత, నాస్తికత, విజ్ఞాన శాస్త్రము - నైతిక విలువలు - యర్రంశ్టెి జగన్‌మోహన్‌రావు


గత సంచిక (214)లో ఆస్తికత, నాస్తికత, విజ్ఞాన శాస్త్రము - నైతిక విలువలు అన్న నా వ్యాసం ముగింపులో శాస్త్రీయ దృక్పథము, దాని ప్రస్తుతస్థితి గురించి ఈ సంచికలో చర్చిద్దామనుకున్నాము. ఈ శాస్త్రీయ దృక్పథము అనే పదం ప్రస్తావనకు రాగానే అది కేవలం మతస్థులకు, మతవాదులకు అవగాహన కలిగించవలసిన అవసరమైన విషయంగా మతేతరులు భావిస్తుాంరు. కాని అవగాహన ప్రకారం మతస్థులు, మతవాదుల్లోనే కాక మతేతరులుగా తమను తాము భావించుకునే వారిలో కూడా ఈ విషయంలో చాలామందిలో అవగాహనలోపం కనిపిస్తుంటుంది. కారణం ఏమంటే శాస్త్రీయ దృక్పథం అనగానే కేవలం దైవభావనను, మతాల్ని, మూఢనమ్మకాల్ని వ్యతిరేకించే అంశంగానే వారు భావించటమే. ఈ శాస్త్రీయ దృక్పధం గురించిన నా అవగాహన తగినంత ఉన్నందునే వాిని వ్యతిరేకించగలుగుతున్నామని వారి అభిప్రాయం. మతాల్ని, వాికాధారమైన దైవభావనను వాి పిలకలైన మూఢనమ్మకాల్ని వ్యతిరేకించడానికి శాస్త్రీయ దృక్పథము కలిగి ఉండడం అవసరమే అయినా, అలా వ్యతిరేకించే వారందరూ శాస్త్రీయ దృక్పధాన్ని కలిగి ఉన్నారని చెప్పలేము. ఇది అంగీకరించడానికి ఇబ్బందిగా ఉన్నా వాస్తవం వాస్తవమేగదా. అంగీకరించాలి మరి. శాస్త్రీయ దృక్పథము పరిశీలనకు సంబంధించిన విషయము. సరియైన పరిశీలన ద్వారా వ్యక్తులపైన, విషయాలపైన మనం అభిప్రాయాలను ఏర్పరచుకునే తీరునే ఇది సూచిస్తుంది. పరిశీలనలోనే దోషాలుండి, దాని ఆధారంగా మనం నిర్ణయాలు తీసుకోవటం జరిగితే దానిని తొందర పాటు నిర్ణయం అనవచ్చు. తొందరపాటు నిర్ణయాలకు కారణం శాస్త్రీయ దృక్పధం లేకపోవడమూ ఒకి. కొన్ని సందర్భాలలో తొందరపాటు నిర్ణయం కూడా మంచి ఫలితాల్నివ్వచ్చు. అంతమాత్రాన శాస్త్రీయ దృక్పధం ఆ నిర్ణయం వెనుక పని చేసిందని అనకూడదు.

హేతువాద సంఘం V/s సత్యాన్వేషణ మండలి

వివేకపథం (213) సంచికలో హేతువాద సంఘం ఖీరీ సత్యాన్వేషణ మండలి వ్యాసంలో, ప్రయోగశాలలో జీవం సృష్టించబడిందంటూ 'హేతువాది'లో గుమ్మావీరన్న గారు వ్రాయడాన్ని ప్రస్తావిస్తూ వివరాలతో రిఫరెన్సు ఇమ్మని అడిగాను. అంతేకాక గుమ్మా వీరన్నగారు, ఫుట్టా సురేంద్రబాబు తదితరులు, సిసిఎంబి డైరెక్టర్‌ గారైన శ్రీ పి.ఎమ్‌ భార్గవగారిని, శ్రీ సిహెచ్‌. మోహనరావుగార్లను కలిసి ఈ విషయంపై వివరణ అడగ్గా, ఇప్పికి జీవం ప్రయోగశాలలో సృష్టించబడలేదని, దగ్గర భవిష్యత్తులో కూడా అలాిం అవకాశం లేదని వారు సమాధానమిచ్చినట్లు వివేక పథం సంచిక (143) ఆధారంగా నేను ప్రస్తావించాను. 2015 ఫిబ్రవరి 14, 15 వ తేదీల్లో ఇంకొల్లులో రాడికల్‌ హ్యూమనిస్టు సెంటర్‌ అధ్యయన శిబిరాలకు నేను హాజరవడం జరిగింది. అక్కడ నాతో గుమ్మావీరన్నగారు తన సమక్షంలో భార్గవగారి వద్ద అలాిం ప్రశ్నరాలేదంటూ వివేకపథంలో నేను తన పేరు ప్రస్తావించినందుకు నొచ్చుకున్నారు. నా అభిప్రాయంలో దానిపై ఇప్పుడు నేను చెప్పేదేమంటే, ఆనాడు అలా జరిగిందా? లేదా? అనే విషయాన్ని ఇప్పుడు పరిశోధించడం కంటే, విషయపరంగా అంటే జీవం ప్రయోగశాలలో ఇప్పికి స్పష్టించబడిందా? లేదా? అన్నది మరొకసారి శాస్త్రజ్ఞుల్ని కలిసి తెలుసుకొంటే సరిపోతుంది. దీనికి సురేంద్రబాబుగారు, గుమ్మా వీరన్నగారు ఇతర మిత్రులు ఎలా స్పందిస్తారో మరి? మనందరికీ సత్యనిర్ధారణే ముఖ్యం కదా.

ఈ సందర్భంగా నేను గుమ్మా వీరన్న గారికి ఒక విషయం గుర్తు చేస్తున్నాను. 2013లో నెలకొకసారి చొప్పున, వరుసగా 4,5 నెలలు హైదారాబాద్‌లో నేను గుమ్మా వీరన్న గారు, సురేంద్రబాబుగారు, డా|| బ్రహ్మారెడ్డిగారు, బాబూ రాజేంద్రప్రసాద్‌గారూ వెంకామయ్యగారు ఇంకా ఒకరిద్దరు మిత్రులు (పేర్లు గుర్తుకు రావడం లేదు) హేతువాదం పైనా, సత్యం అంటే ఏమి? ఏది సత్యం అనే విషయంపైనా చర్చించడం జరిగింది. ఆ సమావేశాల్లో ''సత్యం మారదు'' అనే విషయాన్ని గుమ్మావీరన్న గారు కూడా అంగీకరించడం, ఆ విధంగా అంగీకరించినట్లు ఆయన న్‌ో చేసుకొంటున్నట్లు మాకు చెప్పడం జరిగింది. తరువాత సమావేశాలు జరక్కపోవానికి కారణం వీరన్నగారు తన పి.హెచ్‌.డి విషయంలో బిజీగా వున్నాననడం ఇది జరిగాకనూ ఆయన వ్రాసిన వ్రాస్తున్న తరువాతి వ్యాసాల్లో, చేస్తున్న ప్రసంగాల్లోనూ సత్యం మారుతుందన్న తన పాత అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజంగా శోచనీయం. మరో రకంగా చూస్తే నిజాయితీకి సంబంధించిన అంశం కూడా.

అది అలా వుంచితే హేతువాద, మానవవాద అధ్యయన తరగతులకు హాజరయిన వారి పరిచయ కార్యక్రమాలలో నేను హేతువాదిననీ, నా కుటుంబ నేపద్యాన్ని, హేతువాద సంఘంతో నాకున్న పూర్వ పరిచయాన్ని ప్రస్తావించి, ప్రస్తుతం నేను సత్యాన్వేషణ మండలిలో క్రియాశీలంగా ఉంటూ,ఉన్నట్లు చెప్పాను. ఆ తరువాత మిత్రుడు కరి హరిబాబుగారు మ్లాడుతూ మండలి చేస్తున్న సత్యాన్వేషణ విధానం ద్వారా సత్యం ఎప్పికీ తెలిసేదికాదని, మండలి బాధ్యులైన కోట ప్రసాద్‌గారితో ఎప్పుడో 15 సం|| క్రితమే చెప్పానని, ఇప్పికీ తాను అదే అభిప్రాయంతో ఉన్నానని అన్నారు. అయినా అప్పుడే అదేసభలో నేను చర్చను లేవదీయలేదు. అందుకు రెండు కారణాలున్నాయి. ఒకి సభా కార్యక్రమాలకు అంతరాయం కలుగుతుందని, రెండు, ఆ సందర్భంలో చర్చను లేవనెత్తడం వల్ల ఆశించిన ఫలితాలు రాకపోగా, మరికొంత ప్రతికూల వాతావరణం ఏర్పడవచ్చునని అనిపించడం. సభలో నేను దాన్ని చర్చించడం వల్ల ఫలితం ఉండదనే అభిప్రాయంతో, మండలి చెపుతున్న సత్యం గురించి తనకున్న అవగాహనను, దానికీ ఆధారాలను, దానిపట్ల తన నిర్ణయానికి గల ఆధారాలను తెలపమంటూ సుదీర్ఘ లేఖ వ్రాసి ఆ రోజే హరిబాబు గారికి ఇవ్వడం, ఆయన కూడా దానికి జవాబు వ్రాస్తాననడం జరిగింది. దాన్ని గుర్తు చేస్తూ నేను ఏప్రియల్‌ 1వ తేదీన నేను హరిబాబు గారికి పోను చేయగా ప్రతిస్పందనగా లేఖ రూపంలో కంటే కలిసి చర్చించుకుంటే మంచిదని, ఆదివారాలయితే బాగుంటుందని ఆయన నాకు సూచించడం, నేను అంగీకరించడం జరిగింది. మా రెండు సంస్థల మధ్య ఏర్పడిన అపోహలు, అపార్థాలు తొలగానికి ఇది ఒక అవకాశంగా ఉపయోగపడవచ్చులే అని అందుకు అంగీకరించాను. హరిబాబు గారు కూడా, మనలో ఒకరు తెలిసిన వారని, మరొకరు తెలియని వారు అనీ అనుకోకుండా, ఒకరి భావాలు, జ్ఞానము మరొకరు పంచుకొంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మండలి విధానాన్ననుసరించి ఈ వైఖరి ఆలోచనాపరులెవరి మద్యనైనా అనుసరించవలసిందే కనుక మంచిదనుకున్నాను. అనుకున్నట్లుగా చర్చలు జరిగితే తరువాత వివేక పథంలో ప్రకిస్తాను. గత సంచికల్లో ప్రస్తావించినట్లుగా హేతువాద సంఘానికీ, సత్యాన్వేషణ మండలికీ మధ్య గల మరొక విభేదాన్ని పాఠకుల ముందు పెడ్తాను.

అది దేశభక్తి, జాతీయత చ్టాల ఆవశ్యకతల విషయంలో అని చెప్పవచ్చు. వెంకాద్రి గారి ప్రకారం దేశభక్తిని, జాతీయతాభావాన్ని, స్వదేశం పట్ల అభిమానం, కలిగివున్నవారు విదేశీయుల పట్ల వ్యతిరేకతా భావాన్ని కలిగివుాంరు. తమది cosmopolitan Humanism గా విశ్వమానవ వాదంగా చెప్పారు. దేశభక్తి అంటే ఒక సంకుచిత భావం అనీ, జాతీయత భావం తమ జాతి ఇతర జాతుల కంటే ఉన్నతమైనది అని భావించడం క్రమంగా అది ఫాసిజానికి దారి తీసే ప్రమాదం ఉంటుందనీ చెప్తారు. ఉదాహరణగా హిట్లర్‌, ముస్సోలినీల ఫాసిజాన్ని చూపించారు. హేతువాదుల ఆయన ప్రకారం, మనిషి ఒక ప్రాంతానికో, ఒక దేశానికో పరిమితం కాకుండా, విశ్వమానవుడిగా ఆలోచించాలి, ఎదగాలి. జాగ్రత్తగా పరిశీలిస్తే ఈభావంతో సత్యాన్వేషణమండలి ఏకీభవిస్తుంది. ఎలాగంటే తన సంస్థ చిహ్నంలో వసుధైక కుటుంబ భావన అనే పదమును ఆ అర్థంతోనే పొందుపరిచింది. అయినా దానిని తాను కోరుకునే ఆదర్శంగా మాత్రమే చెప్తుంది. వాస్తవానికి అది ఎన్నికీ చేరుకోలేని గమ్యంగా ప్రకిస్తుంది. ప్రతి మనిషి భూమిపైనున్న ఏ ఇతర మనిషినైనా తన కుటుంబములోని సభ్యునిగానే భావించ ప్రయత్నించమని చెప్తుంది. కాని ఆచరణకు వీలుగా, వాస్తవానికి  అనుగుణ్యంగా ఉండేటట్లుగా దేశభక్తినీ, జాతీయతనూ మొదట అలవర్చుకోవాలంటుంది. దేశభక్తి అంటే దైవభక్తి లాిం  మూఢభక్తి కాదనీ, జాతీయత అంటే కులం, మతం, లేదా ఒక ప్రత్యేక జాతికి సంబంధించినదికాదనీ, భారతీయులంతా ఒకిగా భావించటం అనీ చెప్తుంది. అందువలనే తన కార్యక్రమాల్లో గురజాడ వారి దేశమును ప్రేమించుమన్నా గీతానికి ప్రథమస్థానం కల్పిస్తుంది. తన సంస్థ పబ్లిష్‌ చేసే పుస్తకాల్లోనూ ఆ గీతానికి స్థానం కల్పించుతూ వస్త్తోంది.  ఆ గీతం చదివిన ఎవ్వరికైనా దేశభక్తి అంటే - విదేశీయుల పట్ల వ్యతిరేక భావం కలిగి ఉండడం అనే సందేశము ఏ మాత్రం కనిపించదు. సమతా భావానికి, ఆ గీతం అద్దం పడుతుంది. గీతంలోని ప్రతి పలుకూ ఈ దేశ పౌరుడు తన దేశం పట్ల ఎలాిం బాధ్యత కలిగి ఉండాలోనూ సూచిస్తుంది.
అలాగే 'జాతీయత' అనే పదానికి భారతదేశ ప్రజలంతా తమకు తాము ఒకరికొకరు 'మనం' అనుకోవాలనే అర్థం కాని, మత ఛాందసులు చెప్తున్నట్లు, హిందువులంతా ఒక జాతి, ముస్లింలంతా ఒక జాతి, కైస్తవులంతా ఒక జాతి, యూదులంతా ఒక జాతి అనే అర్ధంతో జాతీయత అనే పదానికి అర్థం తీసుకోకూడదు. ఈ దేశంలోని హేతువాదులు జాతీయత, దేశభక్తిలను అంగీకరించినా, అంగీకరించక పోయినా, ఈ దేశ పౌరులుగా ఉన్నంత వరకు ఈ దేశం పట్ల ఈ దేశ రాజ్యాంగం పట్ల విధేయత కలిగి ఉండాల్సిందే. ఈ దేశ రాజకీయంతో పాలు పంచుకోవాల్సిందే. అదిసరే, ఈ దేశానికి కాకుండా, ఇక్కడి ప్రజల్ని కాదని అంతర్జాతీయ మానవుని సంక్షేమం కొరకు అంటూ చేసే కార్యక్రమాలు ఏమిఉంాయి? దేశభక్తి, జాతీయతలు ఈ దేశ అభివృద్ధికి చేసే కార్యక్రమాలూ ఏం ఉంాయి?. వెరసి ఏ కార్యక్రమమూ వారికి లేకుండాపోతుంది. అంటే హేతువాదం ఈ విషయంలో మాటల వరకే పరిమితమవానికే ఎక్కువలో ఎక్కువ అవకాశముంది. కాకుంటే ఏ దేశ పౌరుడైనా ఎలా ఆలోచించాలో, ఎలా ప్రవర్తించాలో వరకు మాత్రం చెప్పవచ్చు. అయినా ఆచరణ మాత్రం ఈ దేశ వ్యవహారాలకు పరిమితమవ్వాల్సిందే. మండలికీ, పై విధంగా వాదన చేసే హేతువాదులకీ ఉన్న బేధాల్లో ఇది కూడా ఒకటని నేను అర్థం చేసుకున్నాను.
ఈమధ్య హేతువాద సంఘాలలోని కొందరు ఒంగోలులో ఒక సమావేశాన్ని జరిపి మహారాష్ట్రలో లాగా ఆంధ్రప్రదేశ్‌లోనూ మూఢ నమ్మకాల నిరోధక చ్టాన్ని తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయాలని తీర్మానించడం జరిగింది. ఆ సమావేశాన్ని వ్యతిరేకించిన కొంతమంది హేతువాదులు అసలు చ్టాలులేని, సమాజం కోసం ప్రయత్నం చేయాలని, ప్రజల్ని చైతన్యవంతం చేయాలిగాని, చ్టాల కోసం ప్రభుత్వాన్ని దేబిరించడమేమిటని విమర్శించారు. ఈ మధ్య ఇంకొల్లులో జరిగిన అధ్యయన తరగతుల్లో ఈ విషయంలో మరికొంత ముందడుగు వేసి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసి చ్టాలు చేయుంచుకొని, ఆ చ్టాలకు మనిషి లోబడి వుండాల్నా? అలా లోబడితే మనిషి స్వేచ్ఛకు భంగం కలిగినట్లు అవుతుంది కదా అని ప్రసంగించారు. దాదాపుగా అవే భావాల్ని ఈ 'మార్చి-ఏప్రిల్‌ హేతువాది సంచికలో' కూడా వ్రాస్తూ ''మతాలు మాసిపోవాలి. రాజ్యాలు ఇగిరిపోవాలి''. అనే శీర్షిక క్రింద మరోమారు నొక్కి చెపుతూ మార్క్సు చెప్పిన, లెనినామోదించిన ''రాజ్యం ఉన్నంత కాలం స్వేచ్ఛ వుండదు, స్వేచ్చ వున్నప్పుడు రాజ్యం ఉండదు'' అన్న సూత్రాన్ని క్‌ో చేశారు. కాని ఆ విషయంలో మండలి భావజాలం నాకర్థమయిన ప్రకారం మనిషి సంపూర్ణ స్వేచ్ఛావంతుడు కాలేడు. ముఖ్యంగా సామాజిక మానవుడి విషయంలో అది మరింత రూఢిగా చెప్పవచ్చు సమాజం అంటేనే కట్టుబాటులతో కూడినదని అర్థం, కనుక సామాజిక మానవుడు ఎవరైనా పరిమిత స్వేచ్ఛనే పొందగలడు. ఆ పరిమిత స్వేచ్ఛనే రాజ్యయంత్రంలో చిరుభాగంగానైనా అనుభవిస్తూ ఉంాడు. ఆ రాజ్యాన్ని నడిపే మానవుల్లోని భాగంగా ఆ పరిమిత స్వేచ్ఛను అనుభవిస్తూనే, సంకల్పానికీ స్థానం ఇస్తూ, రాజ్యంలో భాగం కావలసిందే. అలా కాక మానవుడు ఏ రాజ్యం క్రింద ఉండకూడదు, సమాజంలోనూ భాగం కాకూడదు. ఎలాిం నియంత్రణలు ఉండకూడదు అని ఎవరన్నా, వారు ఊహల్లో గాలిలో తెలుతూ వాస్తవానికి దూరంగా జరుగుతున్నట్లే అని చెప్పక తప్పుదు.
గత సంచికల్లో ఆస్తికత - నాస్తికతలు, రెండూ తేలనివి అంటూ, దానిలో మొదిది అసలు ఒప్పని తేలానికే మాత్రం అవకాశం లేనిదనీ, లభ్యమవుతున్న ఆధారాలను బ్టి నాస్తికత ఇకముందు భవిష్యత్తులో తేలానికి కొంతలో కొంతైనా అవకాశముంటుందనీ మండలి అభిప్రాయంగా ప్రకించటం జరిగింది. హేతువాదులు నాస్తికత్వమును ఋజువైన విషయంగా భావిస్తారనీ వ్రాశాను. బాబూ రాజేంద్రప్రసాద్‌ గారి లేఖకు సమాధానంగా మండలి తమను ఆస్తికేతరులుగా చెప్పకుంటుందిగాని, నాస్తికులుగా అంగీకరించదనీ వ్రాసాను. కాని ఆస్తికత్వాన్ని వ్యతిరేకిస్తూనే నాస్తికత్వము అనే భావన వాడుకలోకి వచ్చింది. అయినా మండలి చేసే వాదనలో ఆస్తికత్వం అసలు ఋజువయ్యే అవకాశం లేదని చెప్పానికి ఒక రకమైన ప్రాతిపదికను, నాస్తికత్వము ఇప్పికి ఋజువుకాని అంశమని చెప్పానికి మరొక రకమైన ప్రాతిపదికను తీసుకోవటం నేను గమనించాను. అలా భిన్నమైన ప్రాతిపదికలు తీసుకోవానికి కల కారణాలను సురేంద్ర గారే వివరించి, పాఠకులకు అవగాహన కల్గిస్తారని ఆశిస్తున్నాను. వివరాల్లోకి వెళితే....
వివేకపథం జనవరి 97 సంచిక 19 పేజీలో ... సృష్టికర్తయైన ఈశ్వరుని ఉనికిగానీ, శరీర భిన్నమైన జీవుని ఉనికిగానీ, మరణానంతరము పొందవలసి ఉంటుందని ఆస్తికులు చెప్పే పరలోకంగానీ తేలని, తెలీని విషయములుగాన తాను ఆస్తికుడనుగానని సురేంద్రగారు వ్రాశారు. అంటే ఆస్తికత్వమునకు ఆయన తీసుకున్న ప్రాతిపదికలు :
1. సృష్టికర్తయగు ఈశ్వరుడుకలడు,  2. శరీరమునకు వేరుగ జీవుడు కలడు, 3. పరలోకము కలదు, 4. జీవుడు మరణానంతరము పరలోకమునకు పోవును
శరీర భిన్నముగ జీవుడు కలడని ఆస్తికత్వము చెప్పినందున, ఎన్ని శరీరములు గలవో, అన్ని శరీరములకు అంత మంది జీవులు కలరని అనుకొనవలసియున్నది. ఆ లెక్కన తెలిసి ఆస్తికుడనని అనాలంటే
1. ఈశ్వరుడు తెలియాలి, 2. ఈ సృష్టిని చేసినది అతడే అని తెలియాలి, 3.శరీరములకు భిన్నములుగా అనేక జీవులు గలవని తెలియాలి, 4. పరలోకము తెలియాలి, 5. మరణానంతరము జీవులు పరలోకమునకు పోయెదరని తెలియాలి.
ఆస్తికత్వాన్ని అంగీకరించపోవానికి కారణాలుగా మండలి ఏం చెప్తుందంటే 
ఆస్తికతత్త్వ స్వరూపము నెరిగిన సాంప్రదాయ పండితులెవరూ ఈశ్వరుడు ప్రత్యక్ష విషయం కాగలడని చెప్పలా. పైగా దేవుడు ప్రత్యక్ష అనుమానాల విషయం కాడని ఒక నిర్ణయానికి వచ్చేశారు కూడా. ఎలాగంటే అతీంద్రియుడు కనుక ప్రత్యక్ష విషయం కాదు. హేతు దృష్టాంత వర్జితుడు కనుక అనుమాన విషయం కాడు. కనుకనే దాదాపు అన్ని మతస్థులూ గ్రంథ ప్రామాణ్యాన్ని ప్రధానంగా స్వీకరించారు. గ్రంథము (శబ్దప్రమాణం) ద్వారా పూర్వము తెలియనివి తెలియవు.. అలా తెలిసేది శబ్దములే కాని వాి అర్ధములు కాదు.  కనుకనే దైవ విషయాలు, పారలౌకిక అంశాలు ఆ పక్షం వాళ్ళ చేతనూ, విశ్వాసాలు గానే అంగీకరించబడుతున్నాయి.
ఈశ్వరాస్తిత్వం మొత్తం మీద ఇప్పికి తెలిసింది లేదు. కనుక తెలిసి ఆస్తికుణ్ణనడం ఎవరికీ సాధ్యం కాదని స్పష్టంగా చెప్తున్నాము. ఇలా చెప్పినప్పికీ ఆస్తికత్వాన్ని తిరస్కరించటమే నాస్తికత్త్వమును అంగీకరించటం అవుతుందనే విషయాన్ని పరిగణించకుండా, నాస్తికత్వమూ నిరూపింపబడలేదంటూ, దానికి మరోకరకమైన ప్రాతిపదికలు ప్రకించటం జరిగింది. అదేమంటే - పదార్థ జన్యమే చైతన్యము అని నిర్ధారణ అయితేనే నాస్తికత్వము ఋజువు అయినట్లుగా అంగీకరిస్తామని మండలి చెప్తుంది. ఇలా భిన్న ప్రాతిపదికలు తీసుకోవలసిన అవసరమేముందంటూ ప్రశ్నించకుండా హేతువాదులూ, నాస్తికులూ ఆ ప్రాతిపదికలు అంగీకరించినట్లుగా దానికి వారు అనుకున్న ఋజువులు ప్రస్తావిస్తున్నారు. అవి -
1. విజ్ఞాన శాస్త్రావిష్కరణలను బ్టి చైతన్యం పదార్ధ సమ్మేళన జనితమని అంటున్నాము. దానిని జీవ పరిణామ వాదము ఋజువుపరుస్తోంది.
2. ముల్లర్‌ ప్రయోగాల ద్వారా జీవం ప్రయోగశాలలో సృష్టించబడింది.
కాని ఇలా వారు చెప్పిన రెండు అంశాలూ నిర్ధారణకు నిలిచేవి కావు. వాిని ప్రాతిపదికలుగా అంగీకరిస్తే నాస్తికత్వం ఇంకా ఋజువు కావలసిన విషయమేనన్న మండలి వాదనను వారూ అంగీకరించవలసి వస్తుంది. అయినప్పికీ ఎవరి అభిప్రాయాలు వారివిగా కొనసాగుతూ వస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది. ఇరువురికీ గానీ, ఇరువురిలో ఎవరో ఒకరికైనా ఋజువుకు సిద్ధపడే లక్షణం లేనప్పుడే ఇలా జరగడానికి అవకాశంగా ఉంటుంది.

Wednesday, January 1, 2014

హేతువాద పునరుజ్జీవన యత్నాలు - 6

ఈ శీర్షికాంశాన్ని శ్రద్దగా పరిశీలిస్తున్న యోచనాశీలురైన మిత్రులారా! హేతువాద పునరుజ్జీవన యత్నాల పేరిట కృషి (విచారణ) ఆరంభమైన నాటి నుండి కొంతమందిమి ప్రతినెలా ఈ విషయంపైనే సమావేశాలు జరుపుకుంటూ వస్తున్నాము. అటు ఆ సమావేశాలలోనూ పాల్గొంటున్నవారిలో ఆ వివరాలను వివేకపథం ద్వారా గమనిస్తున్న పాఠకులలోనూ హేతువాదం సిద్దాంతకాదు, అదోక మెధడాలజీ (ఆలోచనావిధానము) అన్న దృష్టి కలిగిన వారే అధికంగా ఉన్నారు. నేనూ, నాతోబాటు అతికొద్ది మంది మాత్రం హేతువాద మన్నదీ ఒక సామాజిక స్పృహగలిగిన సిద్దాంతమేనంటూ వస్తున్నాము. ఈ మొత్తాన్ని పరిశీలిస్తున్న వారిలో ఒకరిద్దరు అది సిద్దాంతమైతేనేమి, కాకుంటే నేమి? అదేమటో తెలుసుకుని ఆచరణలో పెట్టుకుంటే చాలాదా? అన్న అభిప్రాయాన్నీ వెళ్ళడించారు.

ఇక్కడ మన మందరం గమనించాల్సిన అంశమొకటుంది. హేతువాదం సిద్దాంతమని గానీ, సిద్దాంతం కాదని గానీ ఎవరూ ప్రస్తావించకుండా ఉండుంటే, ఎవరిమటుకు వారు వారి వారి జీవితాలలో హేతుబద్దంగానో, అహేతుకంగానో ఆలోచించుకుంటూ సాగిపోతుంటే, భావజాల క్షేత్రంలో ఇది ఉండకూడదు, ఇది ఉండాలిలాటి మాటలూ, రాతలూ, తదనుగుణ్యయత్నాలూ, వాదోపవాదాలూ పొడచూపకుండా ఉండుంటే, ఈమూడో పక్షం వాళ్ళన్నట్లు సాగిపోతుంటే సరిపోతుంది. కానీ పరిస్థితులలా లేవు. సహస్రాబ్దాల కాలంగా కలిగిన అనుభవాలు, లభించిన ఆధారాలననురించి ఆలోచించి చేసుకున్న ఊహలు కలిసి ఏర్పడ్డ వాదాలు, వాదనలు వెరసి రకరకాల సిద్దాంత, రాద్దాంతాలు కొనసాగుతూ వస్తున్నై. మానవ జీవితం కూడా, ఏర్పడ్డ అనుబవాలలోనూ, చేసుకున్న ఊహలలోనూ, వినడం, చదవడం ద్వారా అందిన సమాచారంలోనూ సరిచూసుకుని, సరిచేసుకోవలసిన అంశాలుండడాన్ని చవిచూడడంతో, ఆయా విషయాల (భావాల) సబబు, బేససబుల్ని జాగ్రత్తగా పరిశీలించి నిర్థారించుకోవడం అని వార్యమైంది. అదిగో ఆ అనివార్యతనుండి పుట్టుకొచ్చినవే సత్యాన్వేషణ, అందుకవసరమైన శాస్త్రీయ విచారణ పద్దతి శాస్త్రీయ దృక్పథం అన్నవికూడా.

ఉనికిలో ఉన్న భావాలనన్నింటినీ - సిద్దాంతాలనన్నింటినీ - నిర్థాక్షిణ్యంగా విమర్శించు; విమర్శకు ఏదీ అతీతం కాదు. విమర్శించడానికి సిద్దపడనివాడు, విమర్శను ఆహ్వానించనివాడు హేతువాది అనడానికి తగడు, లాంటి మాటలన్నీ విషయ విచారణ యొక్క అవసరాన్ని, ప్రయోజనాన్ని సూచించేటివే. అయితే అలా విచారణను ఆరంభించాలంటే ముందుగా విచారణకులోను చేయాల్సిన అభిప్రాయాన్ని నిర్థిష్టరూపంలో ఎంపిక చేయాల్సి ఉంటుంది. తార్కిక భాషలో దానినే ప్రతిపాదన, ప్రతిజ్ఞ లేదా విచారణీయాంశము అనంటారు. ఆపై దానిని సంశయించాల్సి ఉంటుంది. ఎందుకంటే సంశయించక విచారించడం కుదరదు కనుక. అట్టి వాటినన్నింటిని అభ్యుపగమ సిద్దాంతాలంటారు సిద్దాంతం తెలిసినవారు.

ఏ ప్రతిపాదనైనా ఏదో ఒక విషయానికి సంబంధించిందై ఉంటుంది. ఎవరో ఒకరిగానీ, ఒక సమూహం అంగీకరించేదిగానీ అయ్యుంటుంది. అలాంటి ప్రతిపాదనలనే వాదాలు అనంటారు. ఒక నిర్థిష్ట రూపాన్ని సంతరించుకుని ఉన్న ప్రతి ప్రతిపాదనా సిద్దాంత మనడానికి తగిందే అవుతుంది. తంత్రాధికరణాభ్యుపగమ సంస్థితిః సిద్దాంతః ఒక ధోరణికి చెందిన నిశ్చితాభిప్రాయం సిద్దాంతమని సూత్రార్థం.

ఉదా :- దేవుడున్నాడు 2. దేవుడులేడు 3. విశ్వము నియమబద్దము 4. పదార్థము సృష్టింపబడదు, నాశనం కాదు. 5 ప్రతి కార్యానికీ కారణముంటుంది 6. హేతుమంతుడు అవశ్యం నీతివంతుడవుతాడు ఇది రాడికల్‌ హ్యూమనిజం సిద్దాంతం 7.పెట్టుబడిదారీ ఆర్థిక విధానంలో దోపిడీ అనివార్యము 8. వారసత్వపు ఆస్థిహక్కు ఆర్థిక సమానత్వ సాధనకు అవరోధకము 9. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నది. 10. భూమి చుట్టూ సూర్యచంద్రాది గ్రహ నక్షత్రాలు తిరుగుతున్నాయి. 11. పరమాణు గర్భంలోని ఎలక్ట్రాను వేగాన్ని అది ఉన్న స్థానాన్ని ఏకకాలంలో ఖచ్చితంగా నిర్ణయించడం సాధ్యం కావడం లేదు.

మిత్రులారా! ఇలా ఎన్ని ప్రతిపాదనలైనా చెప్పుకుంటూ పోవచ్చు. నా వరకు నేను హేతువాదం పై విచారణ నారంభించినప్పటి నుండి హేతువాదమన్నది, సామాజిక స్పృహకలిగిన, తాత్విక స్థాయి కలిగిన, సక్రమాలోచన అవసరాన్నీ అది ఉన్నప్పుడు, లేనప్పుడు, వ్యక్తి జీవితంలో సమాజ స్థితి గతులలో వచ్చే తేడాపాడాలను, వివరించే భావజాల సంపుటేనంటూ వస్తున్నాను. ముందిది సరైనదోకాదో నిర్థారించుకోండి. వచ్చిన ఇబ్బందేమిటంటే ఈనాడు ఒక రచననుకానీ, ఒక అభిప్రాయాన్ని గానీ ఎలా విచారించాలో (పరిశీలించాలో లేదా పరీక్షించాలో) నన్న అంశాన్ని ముఖ్యమైనదిగాగానీ, కీలకమైనదిగాగాని తలంచకపోవడం జరుగుతోంది ఎక్కువలో ఎక్కువ మందిలో, ఎక్కువలో ఎక్కువసార్లు. హేతువాదం క్రిందకు అనేక విషయాలపై తనదైన రీతిలో ప్రకటింపబడ్డ అనేక అభిప్రాయాలు చేరి ఉంటాయా? లేదా? చేరి ఉన్నాయా? లేదా?

1) హేతువాదం హేతువంటే ఏమిటో వివరిస్తుందా? లేదా? వివరించాలాలేదా? అన్నది అన్ని ప్రశ్నలకూ వర్తిస్తుంది.

2) హేతువాదం హేతుత్వమంటే ఏమిటో చెపుతుందాలేదా?

3) హేతువాదం సహేతుకాలోచన, అహేతుకాలోచన అంటే ఏమిటో వివరిస్తుందాలేదా?

4) అహేతుకాలోచన వల్ల జరిగే అనర్థాలు, సహేతుకాలోచన వల్ల జరిగే ప్రయోజనాలు వివరిస్తుందా? లేదా?

5) జ్ఞానమంటే ఏమిటో, విజ్ఞానమంటే ఏమిటో, ఊహాత్మక నిర్ణయాలకు, ప్రయోగాత్మక నిర్ణయాలకు ఉన్న తేడా ఏమిటో వివరిస్తుందా లేదా?

6. నమ్మకాలు, మూఢనమ్మకాల గురించి వివరించి మూఢనమ్మకాల్ని వదులుకోమంటుందాలేదా?

7. మనుషుల మధ్య సామరస్య పూర్వక సంబంధాలు కొనసాగుతూ ఉండాలని అంటుందాలేదా?

8. హేతువాద తాత్విక ధోరణి వ్యక్తుల, గ్రంధాల ప్రామాణికతను తృణీకరిస్తుందా లేదా?

9. విజ్ఞాన శాస్త్ర సమాచారం ఆధారంగనే ఊహాత్మక నిర్ణయాలు చేస్తుండాలని చెపుతుందాలేదా?

10. హేతువాదానికి సామాజిక స్పృహ ఉంటుందా? ఉండదా?

11. వ్యక్తులందరూ సుఖశాంతులతో ఉండాలని, మంచి సమాజం ఏర్పడాలని లక్షిస్తుందా లేదా?

12. మనిషి ఎటువంటి ఆలోచనా విధానాన్ని కలిగి ఉండాలో ప్రస్తావిస్తుందా లేదా?

13. తప్పు జ్ఞానాన్ని వదిలించుకోవలసిన అవసరాన్ని, ఒప్పుజ్ఞానాన్నార్జించాల్సిన అవసరాన్ని నొక్కి చెపుతుందా లేదా?

14. సమాజాన్ని ప్రభావితం చేస్తున్న వివిధ తాత్విక ధోరణుల్ని తనదైన రీతిలో విచారించి, విమర్శిస్తుందాలేదా!

15. హేతువాద ఉద్యమం యొక్క లక్ష్యమేమిటో చెప్పగలరా? ఆ లక్ష్యాన్ని చేరుకోడానికి అది రూపొందించుకున్న కార్యాచరణ ప్రణాళికేమిటో చెప్పగలరా? ఈ వివరాలు చెప్పాల్సిన అవసరముందాలేదా?

మిత్రులారా! ఇలాంటివే మరికొన్ని అంశాలకు చెందిన ప్రశ్నలనూ లేవనెత్తవచ్చు. వీటన్నింటికీ హేతువాదం తనదైన రీతిలో అవునంటూ సమాధానాలు చెపుతుంది. హేతువాదం మ్మీద అంతో ఇంతో అవగాహనున్నవారు ఎవరు గానీ వీటిని గాని వీటిలో కొన్నింటినిగానీ, మరికొన్నింటిని కలుపుకునిగానీ ప్రస్తావించకుండా ఉండలేరు. కనుకనే హేతువాదమనేది వ్యక్తినీ, సమాజాన్ని సక్రమంగా నిలిపి ఉంచాలన్న ఉద్దేశం కలిగిన మంచి సమాజం రావాలనుకునే సామాజిక తాత్విక ధోరణి అని చెప్పాను.

ఒక ముఖ్య విషయం చెప్పనా? హేతువాదం సిద్దాంతం కాదంటున్న వాళ్ళు గాని, సిద్దాంత మేనంటున్న వాళ్ళు గానీ, మొట్టమొదట ఆ రెండు పదాలకు నిర్వచనాలు (తమవైన అర్దాలు) చెప్పి, అదెలా సరైనవో నిర్ధారించాలి. ఆ పనిని చేయకుండా ఎంతెంత మాట్లాడినా అదంతా, ఆదిలోనే దారితప్పిన ప్రయాణం వంటిదే అవుతుంది. చెప్పుకోడానికి ఒకింత విచారకరమే అయినా, నేనుతప్ప ఆ పని చేసినవారు, ఆంధ్రప్రాంతంలో లేరు. రంగనాయకమ్మ గారు మాత్రం హేతువాద సిద్దాంతం అన్న ప్రయోగం చేశారు. అయితే ఆమె దానిని నాస్తికత్వమేనని అన్నారు. 1899లో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన బ్రిటీష్‌ రేషనలిస్టు ప్రెస్‌ అసోసియేషన్‌ వారు హేతువాదం అన్న మాటను ఇలా నిర్వచించారు.

ష్ట్రబిశిరిళిదీబిజిరిరీళీ ళీబిగిలీలి ఖిరితీరిదీలిఖి బిరీ శినీలి ళీలిదీశిబిజి బిశిశిరిశితిఖిలి గీనీరిబీనీ తిదీజీలిరీలిజీఖీలిఖి లీగి బిబీబీలిచీశిరీ శినీలి రీతిచీజీలిళీబిబీగి ళితీ జీలిబిరీళిదీ బిదీఖి బిరిళీరీ బిశి బిరీశిబిలీజిరిరీనీరిదీవీ బి రీగిరీశిలిళీ ళితీ చీనీరిజిళిరీళిచీనీగి బిదీఖి లిశినీరిబీరీ ఖీలిజీలితీరిబిలీజిలి లీగి లినిచీలిజీరిబిదీబీలి బిదీఖి రిదీఖిలిచీలిదీఖిలిదీశి ళితీ బిజిజి బిజీలీరిశిజీబిజీగి బిరీరీతిళీచీశిరిళిదీరీ ళిజీ బితిశినీళిజీరిశిగి.

హేతువాదాన్ని ఇలా నిర్వచించుకోవచ్చు. అన్ని రకాల శబ్ద ప్రమాణాల (అంటే గ్రంధాల వ్యక్తుల) ప్రామాణికతను తృణీకరిస్తూ, స్వతంత్రంగా, అనుభవం ద్వారా సరిచూసుకోదగిన, నైతికతతో ముడిపడిన తాత్వక విధానాన్ని (వ్యవస్థను) స్థిరపరచుకునే క్రమంలో హేతువు యొక్క సర్వాధిక్యతను అంగీకరించే మానసిక వైఖరినే హేతువాద మంటాము.

వివరణ : పై నిర్వచనంలో కొన్ని కీలకమైన పదాలున్నాయి. తిదీజీలిరీలిబిజీఖీలిఖిజిగ్ష్మి రీతిచీజీలిళీబిబీగి ళితీ జీలిరీళిద్ష్మీ బిరిళీరీ బిశి బిరీశిబిలీజిరిరీనీరిదీవీ బి రీగిరీశిలిళీ ళితీ చీనీరిజిళిరీళిచీనీగి ఞ లిశినీరిబీరీ, రిదీఖిలిచీలిదీఖిలిదీశి ళితీ బిజిజి బిజీలిలీరిశిజీబిజీగి బిరీరీతిళీచీశిరిళిదీరీ, బితిశినీళిజీరిశిగి.

1) జుజీలీరిశిజీబిజీగి బిరీరీతిళీచీశిరిళిదీరీ అంటే అర్థమేమిటి? ఒక వ్యక్తి వెళ్ళడించిన అభిప్రాయాలు లేదా అహేతుక నిర్ణయాలు

2) బితిశినీళిజీరిశిగి అంటే గ్రంధాన్ని వ్యక్తిని ప్రామాణికంగా ఎత్తుకోవడం, స్వీకరించడం, ఇక ఇండిపెండెంట్‌ ఆఫ్‌ ఆల్‌ ఆర్బిట్రరీ ఎజంషన్సు అన్న వాక్యాన్ని ఇలా అన్వయించుకోవాలి. ఈ మానసిక వైఖరి అహేతుకవూహల నుండీ, వ్యక్తుల గ్రంధాలపై ప్రామాణిక దృష్టి కలిగి ఉండడం అన్నదాని నుండి ఇండిపెండెంటుగా అంటే విడివిడి లేదా స్వతంత్ర పొంది లేదా వాటిని విడిచి పెట్టి ఉంటుంది.

వెంకటాద్రిగారి, గుమ్మా వీరన్న గారి రచనలలో 'హేతువాదం ఒక వాదం కాదు' అన్నమాటలున్నాయి. భాషాపరంగా ఇది సరైన ప్రయోగం కాదనిపించడంలేదా. ఆవాదం వాదం కాదు అనకూడదు కదా! నాకు తెలిసినంతలో యాదాలాపంగా వాడేసిన పదం, మరల మరల వాడుతూరావడం వల్ల స్ధిరపడిన మాట అది. అలా ఏమీకాదు, సుస్పష్టంగా కావాలనే ఆ పదాన్ని వాడాము అనే ఇప్పటికీ వారనేట్లయితే సిద్దాంతమంటే ఏమిటో నిర్వచించి, హేతువాదమంటే ఏమిటోనూ నిర్వచించి, ఇది సిద్దాంత నిర్వచనం క్రిందికి ఎందుకురాదోనూ తేల్చాలి. వారి విషయమలాఉంచి, ఈ విచారణలో పాల్గొనేవారిలో హేతువాదం సిద్దాంతంకాదు అనదలచుకున్నరోవారు విధిగా హేతువాదమంటే ఏమిటో, సిద్దాంతమంటే ఏమిటో నిర్ణయించి, ఆపై అది దీని క్రిందికి చేరదు అని నిర్ధారించాలి. వెంకటాద్రి గారు హేతువాద మన్నదొక మెధడాలజీ అనీ అన్నారు అంటే ఏమని?

ఈ విచారణ ఒక కొలిక్కి రావాలంటే; కీలకమైన కొన్న పదాలకు ఖచ్చితమైన అర్థాలు - నిర్వచనాలు - చెప్పుకుని తీరాలి. ఎన్నిసార్లు నేనీ విషయాన్ని నొక్కి చెపుతున్నా, ఎవరూ దానిని పట్టించుకోడమేలేదు. వచ్చిన ఇబ్బందంతా ఇక్కడే ఉంది. హేతువన్న పదంతో కలిపి చెప్పే మాటలన్నంటికీ - పదాలకన్నింటికీ - వాటి వాటి అర్థాలను స్పష్టంగా చెప్పుకోకుండా, చర్చలో పాల్గొనే వారంతా వాటికి ఒకే అర్థాలను అంగీకరించుకోకుండా విచారణ సజావుగ సాగనే సాగదు. కనుక అట్టి పదాలను ఎంచుకుని, వాటికి నిర్వచనాలను స్థిరపరచుకోవాల్సిందే. నిజానికి హేతువాద మన్నది ఒక ఆలోచనా విధానము అన్నప్పుడు కూడా దాని అర్థం చెప్పినట్లు కాలేదు. ఏ రకమైన ఆలోచనా విధానమో కూడా చెపితేనే ఆ మేరకైనా అర్థం చెప్పినట్లు వారు ఆ పదానికి ఆ రకంగా అర్థం చెప్పలేదుగానీ, హేతువాదమూ ఒక వాదమేననడానికి అవసరమైన భావజాలాన్నెంతటినో హేతువాదం పేరున ప్రకటిస్తూనే వచ్చారు. మరొక్కమాట! ఎలా వివిధ విషయాలకు సంబంధించిన వివిధ సిద్దాంతాలుంటాయో, ఉండవచ్చునో, అలాగే ఆయా విధానాలన్నిటి పైనా సిద్దాంతాలుండవచ్చు. ఉంటాయి. కొన్ని ఉదాహరణలిస్తాను పరిశీలించండి.

1) సామ్యవాదం (సోషలిజం) అన్నది సమాజంలో ఆర్ధికాంశాలకు సంబంధించి అనుసరించాల్సిన విధానమే. 'సామ్యవాద ఆర్థిక విధానం' అన్నమాట మనకందరికీ తెలిసున్నదే. అయినా దానిని సిద్దాంతమనే అంటున్నాముకదా! ఇంకా సరిగా చెప్పాలంటే 'సోషలిజం' అన్న అంశంపైనే అనేకులు ప్రతిపాదించిన అనేక సిద్దాంతాలూ ఉండవచ్చు.

2) ప్రజాస్వామ్యం అన్నదీ ఒక పాలనా విధానమే. అయినా అదీ సిద్దాంతంగానే చెప్పబడుతోంది. ఇంకా సరిగా చెప్పాలంటే 'ప్రజాస్వామ్యం' అన్న అంశంపై అనేకులు ప్రకటించిన సిద్దాంతాలూ ఉంటాయి.

3) నీతి అన్న అంశాన్ని తీసుకుంటే నైతికత అన్నదొక మానసిక వైఖరి అని తేలుతుంది. అయితే నీతంటే ఏమిటి అన్న దానిపై అనేక సిద్దాంతాలు (నీతంటే ఇదీ అన్న ప్రతిపాదనలు) ఉన్నాయి.

4. సమాజ శాస్త్రంలో, సమాజమంటే ఏమిటన్న దానిపై, పలువురు పలురకాలుగా నిర్వచించారు. వాటన్నింటినీ సోషల్‌ సైన్స్‌స్‌లో వివిధ సిద్దాంతాలుగనే పేర్కొంటున్నారు.

5) వివిధ మతస్తులూ ఎవరికి వారు తమదొక జీవన విధానమనే పేర్కొంటున్నారు. నిజానికి వారి, వారిది జీవన విధానమే కదా! అయినా వాటన్నింటినీ సిద్దాంతాలనే అంటున్నాము.

6) సైన్సులో ఒక్కో విషయంపైనా ఒక్కో శాస్త్రజ్ఞుడు చేసిన ప్రతిపాదనలనూ సిద్దాంతాలనే అంటారు.

హైపోధిసిస్‌ అంటే ఊహాత్మక సిద్దాంతం అనే కదా.

మిత్రులారా! ఇలా జ్ఞాన భాగానికి చెందిన ఏ శాఖా గ్రంథాలను చూసినా, వివిధ సిద్దాంతాలు ఎదురుపడతాయి. అందులో మెధడాలజీకి చెందిన సిద్దాంతాలూ ఉంటాయి. అలాగే మనోవిజ్ఞాన శాస్త్ర క్షేత్రంలోకి వెళ్ళి చూస్తే మానవస్వభావం అన్న అంశంపైనా అనేకులు ప్రతిపాదించిన అనేక సిద్దాంతాలు కనపడతాయి.

ఏ వాదమైనా ఏదో ఒక అంశంపై ఏదో ఒక అభిప్రాయ ప్రకటన (ప్రతిపాదన) రూపంలోనే ఉంటుంది. అట్టివాటి నన్నింటినీ సిద్దాంతాలనే అంటారు. ఇంతగా ఆధారాలతో సహా వివరిస్తున్నా వీటనింటినీ పట్టించుకోకుండానే, తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళన్నట్లు యధాపూర్వం, అంటే ఈ వివరాలు చూడక ముందున్నట్లే పాతభావాన్నే పట్టుకు కూచుంటానంటే ఎవరం చేయగలిగిందీ ఏమీ ఉండదు.

'నికార్సయిన హేతువాదికి ఏ వ్యక్తీ, గ్రంథమూ ప్రామాణికం కాదు, కారాదు అన్న సూత్రాన్ని అంగీకరించుకునే ఉన్నాంగనుక, మీరు ఎవరికి వారుగా సిద్దాంతమంటే ఏమిటి అన్న విషయంలో తమ పక్షాన్ని (సిద్దాంతాన్ని) ప్రకటించి, అది సరైందేనని నిరూపించే బాధ్యత వహించండి. అది అన్ని రకాలుగా మేలవుతుంది.

ఈ విషయంలో స్పష్టతరావాలంటే ఇదిగో ఈ పదాలకు అర్థాలు - నిర్వచనాలు - నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. హేతువు, హేతుత్వము, హేతుమంతుడు, అహేతుకము, సహేతుకము, కారణము, ఆలోచన, హేతుబద్దాలోచన, ఆధారసహితాలోచన, తర్కము, హేతువాదము, హేతువాది, వాదము, వాదన, దృక్పథము, మానసిక వైఖరి, నమ్మకాలు, మూఢనమ్మకాలు, సిద్దాంతము, వివిధ సిద్దాంతాలు, ఆలోచనా విధానము, జీవన విధానము సత్యము, వాస్తవము అసత్యము, అబద్దము, జ్ఞానము, విజ్ఞానము, అజ్ఞానము, వ్యవస్థ, వ్యవస్థీకృతము, వ్యవస్థీకృతజ్ఞానము

మళ్ళీ మరోమారు! ఎన్నిసార్లు ఎంతగా చెప్పినా అస్సలు విషయాన్ని పట్టించుకోకుండా, ఏదో ఒకటి మాట్లాడేస్తుంటారు ఎక్కువలో ఎక్కువమందికది అలవాటుగానూ మారిపోయింది. ఇప్పటికైనా మించిపోయిందిలేదు.

హేతువాదమన్నది తాత్విక స్థాయి కలిగిన సామాజిక దృక్పథాన్ని తెలిపే సిద్దాంతమంటూ నేనిచ్చిన వివరాలలోని దోషమేమిటో నిర్థారించనైనా నిర్థారించండి. లేదా మీ పక్షంగా, సిద్దాంతమంటే ఏమిటో, హేతువాదమంటే ఏమిటో చెప్పి హేతువాదం ఎందుకు సిద్దాంతం కాదో అన్నదైనా నిర్ధారించండి. భావ విప్లవం రావాలంటూ నినదించే మనం - ఎవరైనా- లోపసహితమైన భావాలను వదులుకోడానికీ, సరిచేసుకోడానికీ, సరైన భావాలను చేర్చుకోడానికీ నిరంతరం సంసిద్దంగా ఉండాలి. ఎలాటి భేషజాలూ పొరపొచ్చాలు లేకుండా మంచి భావాలను స్వీకరిస్తుండాలి. నూతన సంవత్సరం, సంక్రాంతి (సరైన మార్పు) దిశగా అడుగులు వేద్దాంరండంటూ ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

విజ్ఞాన క్షేత్రాలలో అజ్ఞానులు - 1

యోచనాశీలురైన పాఠకమిత్రులారా! అనంతపురం నుండి బి.వి.రాధాకృష్ణమూర్తిగారు, రెండు పుస్తకాలు పంపి, వాటిని సమీక్షించవలసిందిగానూ, సమాజానికి మేలు కలిగేలా స్పందించవలసిందిగానూ ఒక సూచన చేశారు. ఆ పుస్తకాలు 1) డా|| బి.వి. పట్టాభిరామ్‌ ఎం.ఎ.పి.హెచ్‌.డి వ్రాసిన, ''మహిమాన్వితమూర్తి శ్రీ సత్యసాయిబాబా'' అన్నదికాగా (2) ఇందూ ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్దాంత ఆదికర్త, శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోదానందయోగీశ్వర్లు, అన్న పేరుతో చలామణి అవుతున్నాయన వ్రాసిన 'హేతువాదము - ప్రతివాదము' అన్నదై ఉంది.

ఆ రెండు రచనలూ ప్రజలను ఆలోచింపజేసేవిగాగానీ, స్వతంత్రాలోచనాశీలతను, విచారణ పద్దతిని బలపరచేవిగాగానీ లేకపోవడమే గాక, అంధానుసరణను రేకెత్తించేవిగనూ ఉండడంతో కొద్దిమంది ముందుకైనా వాటి గురించి తెలియజేయడం వివేకవంతమవుతుందనిపించడంతో నూతన సం||ర ఆరంభ సంచికలో ఆ రెంటిపై వ్యాసాలు ఇలా వచ్చిచేరాయి. ముందుగా మెజీషియన్‌ పట్టాభిరాం గారి రచనను ఒకింత పట్టిచూద్దాం.

(1) బి.వి. పట్టాభిరాం గారు మెజీషియన్‌గానూ, మహిమలు, మంత్రాలు అబద్దం అంటూ ప్రచారం చేసిన వ్యక్తిగానూ, వ్యక్త్త్తిత్వ నిర్మాణం, వికాసం తరగతులనూ, మనో విశ్లేషకునిగానూ వృత్తిని చేసుకుంటూ ప్రసిద్దులయ్యారు. తత్వశాస్త్రంలో ఎమ్‌.ఎ, మనస్తత్వ శాస్త్రంలో మరో ఎమ్‌.ఎ. పట్టాను పొంది, దేనిపైనో పి.హెచ్‌.డి కూడా పూర్తి చేసినట్లు తెలుపుతున్నాయి వారి మాటలు. ఆశ్చర్యమేమంటే మ్యాజిక్కు, మనోవైజ్ఞానిక శాస్త్రము, తత్వశాస్త్రము అన్నమూడూ అభౌతిక శక్తుల, మహిమల ఊసులేని ఒక రకంగా ప్రజలలో నెలకొని ఉన్న అలాటి భావనలు అపోహలనో, మానసిక వైకల్యం నుండి పట్టుకొచ్చేవనో చెప్పేటివే. వాటిని చదివాక చాలాకాలం అలానే ఉన్నట్లూ, సాయిబాబాలాంటి వారినీ విమర్శించేవాణ్ణి లాంటి మాటల ద్వారా ఆయనే చెప్పుకున్నారు.

(2) వారి తండ్రిగారు - ఆయన ఆధ్యాత్మిక జిజ్ఞాసవు పరోపకారి, వెంకటేశ్వరుని భక్తుడు. ప్రముఖ ఇంజనీరు, సంశయాత్మడుగా పుట్టపర్తి వెళ్ళి, అమాంతంగా బాబా భక్తుడై అక్కడే స్థిరపడిపోయారు అంటూ వ్రాశారు.

3) అలా వాళ్ళ తండ్రి బాబాభక్తుడై పోవడం వల్ల తన అభిప్రాయాల్ని సహేతుకంగా పునఃపరిశీలన చేయాలనిపించిందట.

4) అక్కడి నుండి వీరిలో జిజ్ఞాస ప్రారంభమైందట. ఎందరో భక్తుల్నేగాక, నాస్తికుల్ని, రేషనలిస్టుల్ని కలిశారట.

వారిని మీరు బాబాను కలిశారా? అనడిగారట! వారెవ్వరూ బాబాను కలవలేదు. అక్కడా, ఇక్కడా విన్నవాటిని బట్టే అలా విమర్శించడానికి, దుర్భాషలాడడానికి సిద్దపడ్డారు. ఆ రకంగా వారి విమర్శ నన్ను బాబాను చూడడానికి ప్రేరేపించింది. బాబాను చూశాక నా అజ్ఞానం బైటపడింది. బాబా మహిమాన్వితుడని అర్ధమైంది.

విశ్లేషణ : ''మనస్సులోని మాట'' అన్న పేరుతో ఆ పుస్తకంలోని ముందుమాటలివి. ఈ మాటలన్నింటిలో 'చూడకుండగనే దుర్భాషలాడారు.' అన్న ఒక ముక్క తప్ప మిగిలిన దంతా, ఆలోచనా రహితంగా సత్ససాయిబాబాను సాధారణ ప్రజలనెత్తికెత్తడానికి, వారిని తానెరిగిన మనోవిజ్ఞాన శాస్త్రపు సూత్రాలననుసరించి ప్రభావితం చేయడానికి ఒక ఎత్తుగడగా పనికి వచ్చేదిగనే ఉంది. ఒక్కముక్కలో చెప్పాలంటే ఈ రచనంతా పట్టాభిరామ్‌లో శాస్త్రీయ దృక్పథంలేదనీ శాస్త్రీయ పద్దతి అమలుపరచలేదని నిర్ణయించడానికి రుజువుగా ఉంది. అంత మాత్రమైతే పరవాలేదు. తాను చదివిన, నేర్చిన విద్యల్ని బ్రతుకుదెరవుకే గాక, అధిక సంపాదనకూ మార్గంగా చేసుకుని, ప్రసిద్ధి పొంది ఇప్పుడు పేరును ఇలాంటి అశాస్త్రీయ భావాలను మందినెత్తికెక్కించడానికి పూనుకోవడమే విచారకరమూ, విచారణీయము కూడా. ఈ రచనను ఈ విధంగా తీసుకురావడానికి సత్యసాయి కంపెనీ నుండి ఎంత ముట్టిందో ఈయనకూ - వారికీ మాత్రమే తెలిసుండే విషయం. తనకే తెలియని విషయాలలో, ఇంతటి అవైజ్ఞానికాంశాలను, సరైనవేనంటూ ప్రజలనెత్తికెక్కించబూనినందుకు ఏమి చేయాలతణ్ణి?

ఏ మాత్రం సామాజిక స్పృహగానీ, నిజాయితీగానీ, తానన్న మాటలు సరైనవేనని నిరూపించే బాధ్యత తనపైనే ఉంటుందన్న సామాజిక కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు సిద్దపడేతనంగానీ ఉంటే ఈ పుస్తకంపైనే ఒక చర్చా వేదికను ఏర్పాటు చేస్తాము. సిద్దపడగలరేమో చూడాలి. నా హేతుబుద్దికి ఈ రకం వ్యాపారులు స్పందించరనే అనిపిస్తోంది. దేవుని విషయమై ఆయనకున్న అజ్ఞానాన్ని, ఆయన రచనల్లో ఉన్న అసమంజసతను తెలిపే నాలుగైదు అంశాల్ని ప్రస్తావిస్తాను. మొత్తం పుస్తకాన్ని కూడ విశ్లేషించడం సాధ్యపడదు కనుక. విషయ సూచిలో 1వ అంశం 'బాబా భగవంతుడా?' అన్నదిగా ఉంది. దాని క్రింద ఆరు పేజీలు వ్రాశారాయన అందులో

(1) దేవుడంటే ఏమిటో చెప్పలేదు. ఆయన రాతల్ని బట్టి చూస్తే ఏమతధోరణికి చెందిన దేవుణ్ణి గురించీ తగినంతగా ఆయనకు తెలీదని తెలుతోంది.

2) బాబా భగవంతుడనో, కాదనో ఏదీ తేల్చలేదు. అలాగని తేలని, తెల్పలేని విషయమన్న నిర్ణయాన్ని ప్రకటించారా అంటే ఆ పని చేయలేదు. ఎ) బాబావి మ్యాజిక్కులు కావన్నారు. బి) బాబా దగ్గరకు అజ్ఞానం, అహంకారంతో వెళ్ళిన తనకు, అక్కడకు వెళ్ళాక కళ్ళు తెరుచుకున్నాయని అన్నారు. అంటే అన్యాపదేశంగా, డొంకతిరుగుడుగా సత్యశాయికి మహిమలున్నాయని మనకు అనిపించేలా ఎత్తుగడ ఉందందులో మ్యాజిక్కు, సూత్రాలు, మనోవిజ్ఞాన శాస్త్ర సూత్రాలు వంటబట్టి వృత్తిగా చేసుకున్నాయనగదా! నిజాన్ని కప్పిపెట్టి లేనిది ఉన్నట్లు, కానిది అవునన్నట్లు చూపే విద్యకలవాడుకదా. అక్కడికది చాలదన్నట్లు; ఒకవేళ ఆయన చేస్తున్నది మ్యాజిక్కేననుకున్నా, లోకంలో ఎందరు మెజీషియన్లు బాబా చేసిన సేవాకార్యక్రమాలు చేస్తున్నారు? అంటూ ఒక కుంటిప్రశ్న లేవనెత్తి సామాన్యులు ఆ రకంగా బాబా గొప్ప వాడని అనుకునేలా పన్నాగం పన్నారు.

ఇక్కడ మన ముందున్న ప్రశ్న 1) బాబా భగవంతుడా? అతను చూపుతున్నది అభౌతికశక్తికి రుజువులా అన్నది మాత్రమే. మన పట్టాభిరామ్‌ గారు, ఆ విషయాన్ని అతిచాకచక్యంగా మరుగున పెట్టేసి, బాబా మామూలు మనిషికాదని భ్రమపడేలా సీను క్రియేట్‌చేశారు. అది అతనిలోని మతిసెబ్బరితనం, నిజాయితీ లేనితనం, అలా బాబా మామూలోడు కాదు అని అనిపించేలా తన పరపతిని చూసి ప్రచారం చేయడానికి ఎంత ప్రతిఫలం, ఏ రూపంలో పట్టాభిగారికి ముట్టిందనేది ఆయన బయటపెడితే తప్ప మనకు పట్టుబడని విషయం.

(2) పుట్టపర్తి సందర్శన

ఇది 1970 ప్రాంతాల జరిగిన విషయం. పట్టాభిగారికి కాలు విరిగింది. డాక్టర్లు నడుందాకాకట్లు వేశారు. రెండు నెలలాగి చూస్తే కట్టుకట్టుకోలా. మళ్ళా కట్టుకట్టాల్సిందేనని, ఈ సారి గుండెలదాకా కట్టువేశారు. ఈ సమయంలో పట్టాభి గారి తండ్రి, పట్టాభిగారి జాతకం చూపించారు. దాన్ని చూసిన జోష్యుడు 26 ఏండ్లకే చనిపోతాడు ఈ జాతకుడు అని చెప్పాడు. దాంతో ఈయన తండ్రికి భయమేసి వెదికి వెదికి మరో గొప్పపేరున్న జోతిష్యుణ్ణి పట్టుకొచ్చి జాతకం చూపించారు. ఆయన మహాజ్ఞానల్లే పోజెట్టి, 26 ఏళ్ళకి చనిపోతాడని చెప్పిన శుంఠెవడండీ, ఈ జాతకుడు 24 ఏండ్లకే చనిపోవాల్సిందేనన్నాడట. రోజులు గడిస్తున్నై మళ్ళీ కట్టు విప్పారు. ఎక్సరే తీశారు. షరామామూలే. మళ్ళా ఎముక అతుక్కోలా. మళ్ళా కట్టువేసి రెండు నెల్లకిరమ్మన్నారు. (ఈసారికట్టు ఎక్కడిదాకా వేశారో చెప్పడం మరచిపోయారు పాపం పట్టాభిగారు. లెక్క ప్రకారం కళ్ళుముక్కు నోరును విడిచి మొత్తం శరీరాన్ని కప్పుతూ కట్టేసి ఉండుండాలి) తొడ ఎముకలో స్టీలురాడ్డు ధగధగా మెరుస్తూ కనపడిందట ఎక్కరేలో. ఆశ్చర్యమేమంటే అంత చదువు చదివీ ఇంత మాత్రమైనా అబద్ధాన్ని అతికినట్లు చెప్పలేని పట్టాభి ప్రజ్ఞకు జాలిపడాలి. కాలు విరగడంలాటివి అబద్దమని చెప్పలేంగానీ, ఆ తరవాతవన్నీ భూతద్దంలో - పెద్దది చేసి - చూపించినవే. ఇది జరిగాక, పట్టా అన్నగారు, తండ్రిని పుట్టపర్తి పట్టుకెళ్ళారు. కొడుకు కాలు విరిగిన విషయం, అది అతుక్కోని విషయం బాబాకు చెప్పారు. ఆయన భయపడకంటూ ఇంత విభూది ఇచ్చి, పట్టాభికివ్వమన్నారు. డ్రాఫ్టింగు చేస్తే అతుక్కుంటుంది. చాలా ఎడంగా పెట్టి కట్టువేశారు. అని చెప్పారట.

విశ్లేషణ : అబద్దాలాడడానికీ చాలా అనుభవం, అబ్యాసం కావాలి. అదీ ఒక కళే పట్టాభిగారికి దానిలో అంతపట్టులేదన్నది ఈ రచనవల్ల తేలిపోయింది. మూడు మార్లు కట్లువేసిన డాక్టర్లకు ఎముకలు కలపకుండానే కట్టువేశాం అన్నది కనపడలేదన్నమాట? పైగా అది ఎంత ఎడమంటే, వేసిన స్టీలు రాడ్డు ధగధగా మెరిసిపోతూ ఎక్కరేలోనే కనబడేటంత ఖాళీ వదిలి వేశారన్నమాట. ఆ విషయాన్ని గమనించీ, ఆడాక్టర్లుగానీ, ఈయనగానీ, మరెవరుగానీ ఆ విషయాన్ని ప్రస్తావించలేదన్నమాట! మహామహిమాన్వితుడైన బాబా, దానిని తానే సరిచేయకుండా, మరో ముక్క తీసి అతికించమని అన్నాడన్నమాట! ఆ మాటన్నవాడు అంతటితో గమ్మునుండక, మహిమాన్వితమైన విభూదినీ ఇచ్చి పంపాడన్నమాట.

తరవాతి అంకంలో, డాక్టర్లు మరోముక్క తీసి అతికించడం, పట్టాభిగారినీ బాబా దగ్గరకు తీసుకోవడం, బాబాను కలిసిన సందర్భంలో, పట్టాభినీ కుడికాలు వంగదుకదా అని అడగడం, ఈ పట్టాభి (పిహెచ్‌డి డిగ్రీ అప్పటికే వచ్చి తగలబడిందో లేదో మరి) కాలు వంగడంలేదన్న విషయం బాబాకు ఎలా తెలిసిందని తేగ ఆశ్చర్యపోవడం - అన్నవి రచనలో చూపించారు పట్టాభిగారు. ఇలా పుస్తకంలోని ప్రతి అసంబద్ద, అసమంజస, అహేతుకరాతల్ని విశ్లేషించి సమీక్షించాలంటే అసలు పుస్తకానికి నాలుగింతల రచన అవసరమవుతుంది. తినాకుడవా తగినంత ఉండీ మందిపై బడే కూడబెట్టుకునీ ఇలాంటి రచనలు చేసి మరింత అజ్ఞానాన్ని మందినెత్తిన పెట్టడానికి, అందులోనూ తన స్వార్థ ప్రయోజనాలను పొందేందుకు పూనుకోవడానికి మతి సెబ్బరితనం సామాజిక బాధ్యతలేనితనం, చిన్న నా బొజ్జకు శ్రీ రామరక్ష అనే వైఖరి చాలా ఉండితీరాలి. పట్టాభి వ్యక్తిత్వంలో అది దండిగానే ఉందనిపిస్తోంది.

మరో విషయమేమంటే, పట్టాభి కుటుంబం కావలసినన్ని మూఢనమ్మకాలతోనూ ఉండడమేగాక, సాంప్రదాయక ఆస్తిక పోకడకంటెనూ దిగజారి, బాబాలనూ, అమ్మలను, అవ్వలనూ నెత్తికెక్కించుకునేంతగా వాటిలో కూరుకుపోయి ఉంది. ఇతడూ ఎక్కడా నాస్తికుడిగాలేడు, కొన్ని రకాల మూఢనమ్మకాలను అంతగా నమ్మని వాడిగా ఉన్నాడంతే, పిల్లి శకునాలూ, బల్లి శకునాలు పట్టించుకోవడం లేదు. ఈ రచన ద్వారా అన్యాపదేశంగా బాబా మామూలోడు కాడు, నాలాటి పరిశోధకునికే అంతుపట్టని వెన్నో శక్తులు బాబాలో ఉన్నాయి అలాంటి గొప్ప శక్తులు అన్ని మతాలలోనూ ఉన్నాయి అనేంతవరకు తెగించాడు రచయిత. మద్యమద్యలో తాను నమ్మకాలు లేనివాణ్ణని, బాబాను సందేహిస్తూనే వచ్చాననీ, బాబాను నమ్ముతున్న తన కుటుంబపు అమాయకత్వాన్ని చూసి నవ్వుకున్నానని ముక్తాయింపులూ ఇస్తూ వచ్చాడు. అమాయక పాఠకజనాన్ని మభ్యపుచ్చే ఎత్తుగడే అది అన్నది పచ్చి నిజం. - ఈ వ్యాసంలో పాఠకులు పరీక్షించడానికి వీల్లేనివీ, అబద్దమనడానికి వీల్లేనివీ అయిన కొన్ని సంఘటనల్ని - అద్భుతాలంటూ అతి తెలివిగా పాఠకుల ముందుకు తెచ్చాడు రచయిత. పట్టాభి అంధభక్తుడై నా అయ్యుండాలి, అధికాధిక ప్రయోజనాలనుద్దెశించి అబద్దాలు రాసైనా ఉండాలి.

(3) విమర్శకుల పరిశ్రమ (పేజి 29 నుండి)

దీనర్థం విమర్శకులు విమర్శించడాన్ని ఒక వ్యాపారంగా చేసుకున్నారని కాబోలు, ఆశ్చర్యమేమంటే, ఈయన గారూ వారికి వ్యతిరేకమైన రీతిలో పొగడడాన్ని వ్యాపారంగా చేసుకుని ఉండడం. ఈ పుస్తకం వ్రాయడం ద్వారా ఈ మెజిషియన్‌ లక్షలాది, బాబా భక్తుల్నేకాక, వివిధ మూఢనమ్మకాలతో జీవితాల్ని చట్టుబండలు చేసుకుంటున్న అజ్ఞానుల్ని తన అభిమానుల్నిగా, వృత్తిపరంగా తన క్లైయింటుల్నిగా సమకూర్చుకున్నాడు. ఇంతకంటే దుర్మార్గమైన వ్యాపారపు ఎత్తుగడ ఇంకేముంటుంది?!

ఈ మూడో వ్యాసంలో హేతువాదులు, నాస్తికులు (1) ఆస్తికుల్ని, అదీహిందూ మతానికి చెందిన వారిని మాత్రమే, చెడామడా తిట్టడమే పనిగా పెట్టుకున్నారనీ, క్రైస్తవ, ముస్లిం మతాలకుచెందిన వారినిగానీ, గ్రంథాలనుగానీ తిట్టేదమ్ముల్లేవనీ,

(2) 1975 సం||లో కాకినాడలో డా|| కోవూర్‌, ఆర్కె మలాయత్‌, మరో మెజీషియన్‌ రామస్వామి అన్నవారిచేత ''బాబాల బండారం బట్టబయలు'' అన్న పేరుతో నాస్తికహేతువాదులు నిర్వహించిన సభకు తానూ హాజరైనాననీ, అనంతరం ఆర్కే మలాయత్‌, ఎ.టి.కోవూర్‌లతో కోవూర్‌ వసతిగృహంలో సంభాషణ జరిపాననీ, వారిదంతా వ్యాపారమేనని వారితోనే చెప్పాననీ వ్రాశారు పట్టాభిగారు, అదే వ్యాసంలో తానూ ఒక ప్రసిద్ది చెందిన మెజీషియన్‌నేననీ, కోవూరు, మలాయత్‌ లాంటి వారు చేసే ట్రిక్కులన్నీతనకు తెలుసుననీ, బాబా చూపే అద్భుతాలు అలాటి ట్రిక్కులు కాదనీ ఢంకాభజాయించారు. ఇక్కడ మూడు నాలుగంశాలున్నాయి.

(1) నాస్తిక హేతువాద సంఘాల వారు బాబాలనూ, అమ్మలనూ చెడమడా తిట్టడమే గాని, విషయం తెలిసి మాట్లాడేవారు కాదు.

(2) మల్కాయత్‌ ఆస్థికుడే, అయినా వృత్తిగా డబ్బులు తీసుకుని ప్రదర్శన ఇచ్చాడు. మెజీషియన్లలో చాలా మంది ఆస్థికులున్నారు.

3) కోవూరూ దానిని వ్యాపారంగా వాడుకున్నాడే తప్ప అన్ని మతాలనూ సమానంగా ఖండించలేదు.

4) హిందువులు తిడుతున్న పట్టించుకోరు, సహనశీలురు. అదేమరి ముస్లిం మతాన్ని అలా విమర్శించమనండి చూస్తాం?

5) బాబా చేసేవి మేజిక్కులని ఒకప్పుడనుకునే వాణ్ణి, వాటిని దగ్గరగా చేశాక అవిమ్యాజిక్కులు కాదని తేల్చుకున్నాను.

6) సృష్టంతా సైన్సుకులోబడి ఉంటుందనుకోవడం అజ్ఞానం. సైన్సుకు అందనివి ఎన్నో ఉన్నాయి.

సారాంశం : మహిమలున్నాయి. మహిమలు కలవాళ్ళున్నారు. బాబా అవతార పురుషుడు, నాస్తికత తప్పు ఆస్తికతే ఒప్పు.

విశ్లేషణ : పట్టాభిరాంగారికి ఒకింత రచనా చతురత ఉంది. అది చిన్నదాన్ని పెద్దది చేసి చూపడం, ముఖ్యమైన వాస్తవాలను ప్రక్కకు నెట్టేయడం, అంతగా హేతుబుద్దీ, ఇంగితజ్ఞానమూ పనిచేయని వారిని తనకనుకూలంగా ప్రభావితం చెయడం అన్న వాటితో కూడి ఉందా చతురత. కామన్‌సెన్సు (ఇంగితజ్ఞానం) ఒకింత బలంగా ఉన్నవారికీ, శాస్త్రీయ దృక్పథమూ, వైజ్ఞానిక పరిశీలనా పద్దతి, హేతుబద్దత ఉన్న వాళ్ళకు ఆయన రచనలోని డొల్లతనము, నిజాయితీ లేనితనమూ, తెలియని విషయాలలోనూ తెలిసినవాడిగా కనపడాలనే దుగ్ద ప్రస్పుటంగా కనబడుతన్నై. అయినా ఆయన వెళ్ళడించిన వాటిలో నాస్తిక హేతువాదులు ఆత్మపరిశీలన (స్వీయవిమర్శ) చేసుకోవలసిన అంశాలూ ఒకటి రెండు ఉన్నాయి. అవి నా అవగాహన ప్రకారం ఇవే.

1) బండగా, మొండిగా, తగినంత ఆధారాలు, అవగాహన లేకుండగనే తెగబడి మాట్లాడడం, అసభ్యమైన భాషవాడడం.

ఉదా:- ఆ గుంపులో ఒకరు 'బాబానపుంసకుడు' అంటారు. మరొకరు బాబా వ్యభిచారం అనంటారు. వేరొకరు అతడు 'స్వలింగసంపర్కి' అనంటారు. ఇందులో ఏ ఒక్కదానికీ ఆధారాలుండవు. ఆధారాలు చూపడం కష్టమని కామన్‌సెన్సూ చెపుతూనే ఉంది. అయినా బాధ్యత రహితంగా గేలి భాషతో మాట్లాడడం అలవాటుగా మారిపోయింది.

(2) హిందూ పక్షాన్ని విమర్శినంత ఘాటుగా, అసభ్యంగా ముస్లింమతాన్ని తెగనాడే తెగువ - దమ్ము - ఎవరికీ లేదన్నది మరో నిజం. అంతకంటే మరింత నిజమేమంటే, రాజ్యాంగంలోని 25, 26, 27, 28 అధికరణాలలో ఆ వివరాలున్నై. కనుకనే ఈ మధ్య క్రాంతికార్‌ (హేతువాద సంఘాద్యకక్షుడు) ప్రచురించిన ఇస్లాంపై విమర్శనాత్మక సంకలనం పైనే కోర్టుకు వెళ్ళారు ముస్లింలు. క్రాంతికార్‌పై భౌతికదాడికీ సిద్దమైనారు. అప్పటికి కానీ బుద్దిరాలేదు మన నాస్తికహేతువాద మిత్రులకు.

ఇక్కడ నేను చెప్పదలచింది మత గ్రంథాలు విమర్శకు అతీతం, వాటిని విమర్శించకండి అని కాదు. మత గ్రంథాలూ విమర్శకు అతీతం కాదన్న ఉన్నత న్యాయస్థానం తీర్పూ ఉంది. అయితే విమర్శకు, తిట్ల పురాణానికీ ఉన్న తేడాను గమనించాల్సిఉంది. విమర్శలో గుణదోషవిచారణ ఉండాలి. ఉన్నదాన్ని పెద్దది చెయడంగానీ, చిన్నది చేయడంగానీ చేయకూడదు. అసభ్య, అశ్లీల, వ్యంగ్య పదాల అవసరం విమర్శకు అవసరంలేదు. అదైనా వెంకటాద్రి గారు అన్నట్లు, చదవకుండా (చూడకుండా) విమర్శించడం సరికాదు. ముఖ్యంగా హేతువాదులకది తగదు అంది సర్వధాశిరోధార్యం.

3) కోవూరు లాటివారిని వ్యాపారస్తులనడం, పట్టాభిరాం గారిలోని తెగబడిన తనానికి నిదర్శనం. బ్రతక నేర్చినతనం. ఈ రచనలో 1) స్వార్థప్రయోజనాలు 2) అరకొర (మిడిమిడి) జ్ఞానము 3) సత్యశాయి సంస్థతో అనుకూల సంబంధాలు, అన్నవి ఆయన వెనక పని చేస్తున్నట్లు తెరవెనుకన దోబూచులాడుతున్నట్లు నిశితంగా చూడగలవారికి కనిపిస్తున్నాయి.

ముగింపు : ఇలా రచయిత పోకడను వేలెత్తిచూపి, గమ్మునుండడం బాధ్యతారాహిత్యమే అవుతుంది నాకైనా, ఎవరికైనా. కనుక ఈనా అభిప్రాయాలు సరైనవేనని నిర్థారించే బాధ్యతను నేను స్వీకరిస్తూ క్రింది ప్రకటనను చేస్తున్నాను.

డాక్టర్‌ బి.వి. పట్టాభిరాంగారు సిద్దపడితే, ఈ రచన ద్వారా ఆయన అమాయకజనాన్ని నమ్మకాలవైపుకు కదిలేలా ప్రభావితం చేయడం జరిగిందనీ, ఇందులోని చాలా అంశాలు, శాస్త్రీయ దృష్టికీ, శాస్త్రీయ పరిశీలనకు పనికి రానివిగా నిర్థారించగలననీ, ఆయనకు అటు ఆస్థికతను గురించిగానీ, ఇటు నాస్థికతను గురించిగానీ, విజ్ఞాన శాస్త్రాల గురించి గానీ సరైన, సరిపడినంత అవగాహన లేదనీ నిర్ణయించడానికి అనువుగా ఉన్నాయని నిర్థారించగలను. ఆయన గాని సిద్దపడితే, (ఆయనతరఫున మరెవరు సిద్దపడ్డా) ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు, నిర్ణీత వ్యక్తుల - నిపుణుల - సమక్షంలో నిజనిర్థారణ వేదికను ఏర్పాటు చేయగలను. ఇదినా వాగ్థానం ప్రకటన స.మం తరపునుండి .........

ఈ సంచిక పట్టాభిరాం గారికి రిజిష్టర్డ్‌ పోస్టు ద్వారా పంపుతున్నాను.

ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికామాటలాడి అన్యుల మనమున్‌

నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడె ధన్యుడు సుమతి... అన్న వైఖరి బ్రతకనేర్చినతనాన్ని చూపుతుందేగాని, సత్యధర్మాల పక్షాన ఉండే వైఖరిని చూపించదు. పట్టాభిగారు ఈ విధానాన్ని ఉద్దేశ్యపూర్వకంగానే చేశారని నేను నిర్ణయించలేను గాని, ఆయన ఈ రచన సమాజానికి సత్యజ్ఞాన క్షేత్రానికి నష్టం కలిగించేదేనని ఖచ్చితంగా చెప్పగలను.

సత్యాన్వేషణలో..... మీ సురేంద్ర.

విజ్ఞాన క్షేత్రాలలో అజ్ఞానులు -2

విషయం : బి.వి. రాధాకృష్ణ మూర్తిగారు పంపిన రెండో పుస్తకం ''హేతువాదము - ప్రతివాదము'' అన్నది. దాని రచయిత పేరు ఆ పేరుకు ముందనేక విశేషణాలు ప్రకటించారా పుస్తక ప్రచురణ కర్తలు, అవి ఇవిగో.

(1) ఇందూ ధర్మ ప్రదాత; 2. సంచలనాత్మక రచయిత 3. త్రైతసిద్దాంత ఆదికర్త 4. శ్రీ శ్రీ శ్రీ 5. ఆచార్య, 6. యోగేశ్వర

విశ్లేషణ : ఈ అయ్య పుట్టినప్పుడు పెట్టిన పేరేమిటోగాని, ఈయన పెట్టుకున్న, తగిలించుకున్నవి మాత్రం చాలా ఉన్నై.

1. ఇందూ ధర్మ ప్రదాత :- ఏమిటీ సమాసానికి అర్థం? ఇందూ అంటే ఏమిటి? ఎక్కడిదీ అర్ధం? ఇంతకూ ధర్మమంటే ఏమిటి? ఇందూ ధర్మమంటే ఏమిటి? ప్రదాతంటే ఏమిటి? దాతంటే ఏమిటి?

2. సంచలనాత్మక రచయిత :- సంచలనం అంటే ఏమిటి? సంచలనాత్మకతంటే ఏమిటి? రచయిత అన్నమాటకూ సంకలన కర్త అన్నమాటకు అర్థమేమిటి?

3. త్రైత సిద్దాంత ఆదికర్త :- ఏమిటీ త్రైత సిద్దాంతము, సిద్దాంతమంటే ఏమిటి? కర్తంటే ఏమిటి? ఆది కర్త అన్నమాటకు అర్థమేమిటి? ఏదైనా సిద్దాంతానికి కర్త - ప్రవర్తకుడు - ప్రచారకుడు, అనుచరుడు అన్నవాళ్ళుంటారు గాని ఆదికర్తేమిటి?

4. శ్రీ శ్రీ శ్రీ :- ఏమిటీ మూడు శ్రీలముచ్చట ఆస్థిక సంప్రదాయంలో అహంకార ప్రదర్శనకుగాను అర్థం పర్ధం లేనన్ని శ్రీలు తగిలించుకునే పడికట్టుపోకడ (ఆచారం) ఒకటుంది శ్రీ శ్రీ శ్రీ 108; శ్రీ శ్రీ శ్రీ 1008 అని వ్రాసుకుని తరవాత తగిలించుకున్న పేరూ జత చేస్తారు. అలాగే ఈ అయ్యగారికీ, సొంతపేరు రాసుకుంటానికి ఒక శ్రీనే అనవసరమైయ్యుండగా, మూడుశ్రీలు కావలసివచ్చాయి. ఇలా సుత్తి కొట్టుకోడానికి ఇంగితం పని చేయకపోయైనా ఉండాలి, లేని గొప్పలు చెప్పుకునే దురదైనా ఉండుండాలి. అతనికంటే నాలుగాకులు తక్కువ చదివినవాళ్ళు తగిలించైనా ఉండాలి.

5. అచార్య :- ఏమిటీ మాటకు అర్థం, విద్యాలయాలలో ఖచ్చితంగా ఒక విద్యార్హతను తెలుపుతూ ఇచ్చే పట్టా (డిగ్రీ) ఇది. ఇతరత్రా ఆచార్యుడంటే (ఎ) గురువు, (బి) బోధకుడు (సి) ఉపనయనం చేయువాడు (డి) వేదవేత్త, మూడువేదములనెరిగినవాడు లాటి అర్థాలున్నాయి. పేరులోనే గురువు, ఉపాధ్యాయుడు అని పెట్టుకోడు బుద్దున్నవాడెవడూ. ఇకపోతే మూడు వేదములు చదివినవాడనిగాని, విద్యాలయాల ద్వారా పట్టాపొందిన వాడుగాని ఈ పేరుతగిలించుకోవచ్చు. అలా పెట్టుకున్నదేనా ఇది. ఎం.ఎ.బి.ఎఫ్‌ లా తగనిదితగిలించుకున్నట్లా? ఏ విషయంలో ఆచార్యుడు? ఎవరికి ఆచార్యుడు?

6) యేగీశ్వర్లు :- భారతీయ ఆస్థిక సాంప్రదాయంలో కృష్నుణ్ణి యోగీశ్వరుడు అని సంబోధించడం కనపడుతుంది. యోగమంటే ఏమిటి? యోగంటే ఏమిటి? యోగీశ్వరుడంటే ఏమిటి? యోగీశ్వర్లు!? ఏమిటి? ఎంతటి కీర్తికండూతి? ఎంతటి ఆత్మాధిక్యతా భావము? ఎంతటి దురహం కారము. నిజానికి ఏ వ్యక్తికైనా, అతణ్ణి గుర్తించడానికి ఇన్ని కొమ్ములూ, తోకలూ అవసరమా? ఒక్కమాట! మన రాజ్యాంగం బిరుదులు తగిలించుకోరాదు, తగిలించరాదు అని చెపుతోంది. అవేవీ పట్టించుకోకుండా, ఒకని అర్హతానర్హతల్ని పరీక్షించి చూడకుండా, బిరుదులు తగిలించడం, తగుదునమ్మా అని తగిలించుకోవడం, ఎదురిచ్చి బిరుదులిప్పించుకోవడం, వృత్తిగా ఇంత పుచ్చుకుని బిరుదులిచ్చే వ్యాపారస్తులుండడం ఇలా రకరకాల విధానాల ద్వారా అవసరమైన పేరుకు ముందూవెనకా ఏవేవో తగిలించుకుని తగిలింపించుకుని తృప్తి చెందే, విర్రవీగే మంద ఎక్కువైపోతున్నారీనాడు. ఒక వ్యక్తి వాడికిష్టమై వాడెన్నెన్ని తోకలు తగిలించుకున్నా మన కొచ్చే ఇబ్బందేమీ లేదుగాని, ఆవన్నీ తగిలించుకుని ఇదిగో ఇలా పుస్తకాలు రాసి, ఆ చెత్తనంతా ఆపేరు గొప్ప ఆధారంగా అమ్ముకునేవారి విషయంలోనే అభ్యంతర పడాల్సివస్తోంది.

గమనిక : మీలో కొందరికి ఆ రచనలోని విషయాలు చెప్పి విషయపరంగా విమర్శించక, ఆయన పేరు మీదే ఇంత విమర్శ ఎందుకండీ! అనిపించవచ్చు. నేనిది కేవలం పాఠకులనుద్దేశించి మాత్రమే వ్రాయడంలేదు. ఆయన పాలబడి, ఆయన పల్లకీనిమోస్తున్న వారినీ, ఆయన అనర్హతలను ఒకింత గమనించి గట్టిగా నిలువరించడానికి బలం చాలని వారిని ఉద్దేశించికూడా వ్రాస్తున్నాను. కూపస్థమండూకాల్లాటి బ్రతుకులు వారివి. అట్టి వారి గురించిన వివరాలు ఇలా గ్రంథస్తం కావించడం వల్ల వర్తమాన, భవిష్యత్తరాల ఆలోచనలకు ఒకింత ఆసరానూ అవుతుందనీ అనుకుంటూ రాశానివి. అజ్ఞానమూ, తప్పుజ్ఞానమే అధికంగా ఉండి, సరైన జ్ఞానం అరకొరగా కూడాలేని వాడే 'ప్రబోధానంద'. ఆశ్చర్యం!? ఇంతకూ ఈ 'ప్రబోధానంద' అన్నమాటకున్న అర్థమేమిటి? ఇందులోని ఏ ఒక్కమాటకుగానీ తాత్విక పరిభాష అంగీకరించే అర్థానికి తగుతాడా అతడు? అన్నది అతడూ, అతడిని అనుసరిస్తున్నవారూ ప్రశ్నించుకోవాలని అనుకునీ ఇది వ్రాశాను. మరోమాట! ఈ పుస్తకంలోనే 126 పేజీలో నా గురించిన ప్రస్తావనాచేశాడీయన.

''సత్యాన్వేషణ సంఘము అని పేరెట్టుకుని, దానికి అధ్యకక్షుడనని చెప్పుకొను వ్యక్తి ఒక మారు నాకు తెలిసిన సత్యమును ఒప్పుకోక దానిని అసత్యమన్నాడు. తాము అసత్యవాదులైయ్యుండి, సత్యాన్వేషకులమని పేరు పెట్టుకుని తమను తాము ప్రచారము చేసుకొను ఇటువంటి వారు ఇంకా ఎంతో మంది ఉన్నారని అప్పుడు నాకు అర్థమైంది, అటువంటి వారు తమకు పూర్తి సైన్సు తెలియకున్నా యధార్థసంఘటనలను ఖండించుచుందురు. ఇవండీ ఆ పేజీలోని ఆయన నా గురించి చెప్పిన మాటలు.

విశ్లేషణ : - ఈ వివరాలైనా ఇక్కడెందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఈయనను గురించి ఈ పుస్తకంలోని మాటలనుబట్టే కాక, నేరుగానూ నాకు కొంత తెలుసు అనడానికే, తేదీ, సం||ము సరిగా గుర్తులేదుగానీ సుమారు 30 సం|| అయ్యుండవచ్చు నంద్యాల ప్రక్కనున్న కొత్తపల్లి గ్రామంలోని ప్రమోదచైతన్యగారి చైతన్య క్షేత్రంలో నేనూ, పెంచలయ్యగారూ కలసి ఆస్థిక మేధావీ చర్చావేదిక నిర్వహించిన తరవాత జరిగిన ఘటన ఇది. తాడిపత్రి నానుకుని ఉన్న ఒక గ్రామంలో చిన్న ఆశ్రమంలో ఈయనుండేవాడు. అప్పుటికింకా ఇన్ని తోకలు, కొమ్ములు చేరలా. ప్రబోధానందయోగీశ్వర్లు పేరున చెలామణి అవుతున్న రోజులు. మాకు చైతన్య క్షేత్రంలో పరిచయమైన తాడిపత్రి నివాసులు, ఈయనతో మాట్లాడడానికి మమ్మల్ని పిలుచుకెళ్ళారు.

విషయం యధాతథంగా గుర్తులేదుగానీ, జన్మగురించిన చర్చ అది. ''తల్లి గర్భంలో పిండం ఏర్పడ్డాక, ఆ శరీరంలోకి జీవుడు ఎప్పుడు ప్రవేశిస్తాడు'' అనో, అతనికి ప్రాణం ఎప్పుడు వస్తుంది అనో ప్రశ్నించాడీయన. చర్చలో తల్లి ప్రసవించాకనే అన్నది ఆయన సమాధానం. అది ప్రసూతి విజ్ఞాన శాస్త్రం ప్రకారం తప్పు సమాధానం, నేనూ ఆ వైద్యశాస్త్రం తెలిసిన వాణ్ణేనంటూ ఈ విషయంలో నీవు అజ్ఞానివేకాదు, తప్పు జ్ఞానం ఉన్నవాడివి అనీ చెప్పాను. అదిగో ఆ మాటనే ఇక్కడ ''నాకు తెలిసిన సత్యమును ఒప్పుకోక అసత్యమన్నాడు'' అని వ్రాశాడు.

చాలెంజ్‌ : ఈ విషయంలో ఈనాటికీ నేను ఆయనతో నిజనిర్థారణకు కూర్చోడానికి సిద్దంగా ఉన్నాను. ఈ గ్రంథంలోనే జన్మ గురించి, జన్మ కారణాలను గురించి తట్టెడు అశుద్ధాన్ని పోగేసి మందినెత్తిన పెట్టాడు, సత్యాన్వేషణ మండలి అధ్యకక్షునికి సైన్సు తెలుసా? అని ఎద్దేవాచేశాడు. నాకు సైన్సంతా తెలియని మాట నిజమే గాని గర్భోత్పత్తి, జన్మ, ప్రాణం, వీటికి సంబంధించి పిండోత్పత్తి శాస్త్రం ఏమి చెపుతుందో వరకు సాధారణ జ్ఞానముంది మరింత అవసరమనుకుంటే ఆ విజ్ఞాన శాస్త్రం అందుబాటులోనూ ఉంది ప్రయోగశాలా అందుబాటులోనే ఉంది. ఏమాత్రం నిజాయితీ, నిబద్దత ఉన్నా ఈయన ఈ విషయమై సత్యాసత్యవిచారణకు తాను సిద్దంగా ఉన్నానని సత్యాన్వేషణ మండలి నుద్దేశిస్తూ ఒక బహిరంగ ప్రకటన చేసి, ఆ ప్రకటన ప్రతిని నాకు రిజిష్టర్‌ పోస్టు ద్వారా పంపాలి. ఈ సంచికను ఆయనకు రిజిష్టర్‌ పోస్టుద్వారా పంపుతాను. ఈ ముఖంగానే ఆ పుస్తకంలో ఈయన వ్రాసిన మరికొన్ని అంశాలపైనా నిజనిర్థారణకు నేను సిద్దమని బహిరంగంగా ప్రకటిస్తున్నాను.

ముప్ఫై ఏండ్లనాటి ఆ ఘటన తరవాత, ఈ మధ్య జ్ఞాన విజ్ఞానవేదిక (జనవిజ్ఞానవేదికకాదు) పేరున ఈయన ఈయన అనుచరగణము, కొన్ని కరపత్రాలు, సమావేశాల, పుస్తకాల ద్వారా, లోకమంతా తప్పుజ్ఞానంలో ఉంది. తాము మాత్రమే సుజ్ఞానులం అంటూ ప్రచారం మొదలెట్టారు. ఆ క్రమంలో భాగంగా అభౌతిక శక్తులున్నాయని రుజువు చేస్తామంటూ రోడ్డున పడ్డారు. ఈ విషయాన్నీ అనంతపురంలోని జె.వి.వి. మిత్రులు నా దృష్టికి తేగా, వీరితో సంప్రదించాము. వారి ప్రాంతంలో ఒక తీగ మొక్క ఉందనీ, అది నేలతో సంబంధం లేకుండానే బ్రతికి, పెరుగుతుంటుందనీ, వృక్ష శాస్త్రం చెప్పే పరాన్న జీవి (పారాసైటు) జాతికి చెందిన మొక్క కాదనీ, ఆ మొక్కకు ఆ మొక్క ఉన్న చెట్టుకు ఎక్కడా సంబంధం ఉండదనీ, ఈ తీగ మొక్కకు చెందిన దుంప ఒకటి నేలలో ఉంటుందనీ దుంపకూ తీగకూ సంబంధముండదనీ, అంటూ ఇది అభౌతిక శక్తికి రుజువు కాదా? అని ఆ గుంపు మమ్మల్ని ప్రశ్నించారు. మీరన్నట్లే ఉంటే అదిప్పటికి సైన్సుకు తెలీని విషయమేననీ, భౌతిక సూత్రాలకూ విరుద్దమేనని, పరీక్షించడానికి సిద్దపడదామని అనుకుని, ఈ అంశాలన్నీంటినీ క్లుప్తంగా రాసుకుని సంతకాలు పెట్టుకుని అటుపైన పరిశీలనకు కూర్చుందామనీ అనుకోడం జరిగింది. హైద్రాబాద్‌ చింతల బస్తీలోని జనవిజ్ఞాన వేదిక కార్యాలయంలో సమావేశమయ్యాం. వివరాలన్నీ కాగితం మ్మీద వ్రాసి, పరీక్షలో అభౌతిక పదార్థంఉందని తేలినా, ఆ తీగ మొక్క ఎటువంటి ఆధారంలేకుండానే జీవిస్తొందని తేలినా మేము అది ప్రకటించి, వారి మార్గాన ప్రచారం కావించాలి. వారిపక్షం సరికాదని తేలినా, అంటే అభౌతిక శక్తులు ఉన్నాయని వారు రుజువు చేయలేకపోయినా, ఆ తీగమొక్క వృక్ష శాస్త్రానికి తెలిసిన పరాన్నజీవి జాతికి చెందిందేనని వృక్ష శాస్త్రజ్ఞులు నిరూపించినా, ఆ తీగ నిరాధారంగానే అంటే నేలనుండి, దాని దుంప నుండి సంబంధం లేకుండానూ, అది ఆధారపడి ఉన్న చెట్టు నుండి ఆహారం స్వీకరించకుండానూ జీవిస్తున్నదని, వారు రుజువు చేయలేకపోయినా వారు అభౌతిక శక్తులు లేవని ప్రకటించి మామార్గాన ప్రయాణించాలి. అని వ్రాసి రెండు పక్షాల నుండి దానిపై సంతకాలు చేశాం. నిర్ణీత దినాన మేమంతా రెండు మూడు కార్లు వేసుకుని ఒక 15, 20 మంది వరకు వారురమ్మన్న చోటికి వెళ్ళాం. వారు చూపిన తీగ మొక్కను పరీక్షించి, అది పరాన్న జీవేననీ, దానికి దుంపంటూ అక్కడేమీలేదనీ, చెట్టు కాండం నుండే ఆహారం తీసుకుంటూ బ్రతికేస్తున్నదనీ తెల్చాము. ఆ పక్షంవారికి కళ్ళు తిరిగినై, గుండెలుగుబేలన్నాయి. అడ్డగోలు వాదనకుదిగి, లేబరేటరీలో తేలాలికదా అని కొత్తపాటందుకున్నారు. అరకొర పరిశీలన ఎందుకులే అని నిర్ణయించుకుని రెండు వృక్షశాస్త్ర విభాగాలకు వాటినిపంపి, అది పరాన్న జీవజాతికి చెందిన మొక్కేనని దృవీకరణ పత్రాన్ని తీసుకుని జ్ఞాన విజ్ఞాన వేదిక ప్రతినిధులకు పంపాము.

సిగ్గుపడే లక్షణంగానీ, నిజాలను స్వీకరించే లక్షణం గానీ లేని ఆ మంద రాత మూలకంగా అంగీకరించిన దానిని విడిచి పెట్టి గమ్మునున్నారు. నా ఈ ప్రకటనను చూసి, ఎవరైనా వారినిదేమిటని అడిగినా, ఏదోకవంకో, అబద్దమో చెప్పుచూడవచ్చు. కనుక అలాంటి పరిస్థితి ఏర్పడితే, వారు అడ్డగోలుగా మాట్లాడకుండా ఉండడానికి వీలుగా ఈ ప్రకటన చేస్తున్నాను. దీనిని పాఠకుల్లో వారితో బేటీపడ్డ, పడదలచుకున్న వారేవరైనా ఉపయోగించుకోవచ్చు.

ఆనాడు మా రెండు పక్షాలమధ్య జరిగిందంతా రికార్డు రూపంలో రాత మూలకంగా భద్రపరచబడి ఉంది. దానినైనా చూసుకుందాం. లేదా ఈ పిచ్చి పుస్తకంలో ఉన్న అంశాలలో మేము తప్పనుకుంటున్న వాటిని పరీక్షకుపెట్టుకునైనా చూసుకుందాం. తేలిన వాటిని తేలినట్లు ఇరువురం ప్రకటించి, వాటిని ప్రచారం చేస్తూ జీవించాలి. అన్నది షరతు. ఎప్పుడు, ఎక్కడ పరీక్షకు కూర్చుందామన్నా నేను - మేము - సిద్దము. ఏ మాత్రం దమ్ము, దగాలేనితనము ఉన్నా దీనికి సిద్దపడకపోవడమన్నదే కుదరదు.

ఈ పుస్తకం 5వ పేజీ నుండి 'హేతువాదము- ప్రతివాదము' అన్న శీర్షికన విషయం మొదలైంది. అందులో మొదటి వాక్యం ఇలా ఉంది. తరువాత వాక్యాలూ కొన్ని ఇలా ఉన్నాయి.

1. వాదము అనుపదము వాక్యము అన్న శబ్దం నుండి పుట్టింది.

ప్రశ్న : ఇది భాషనెరిగిన వారి ప్రకారం తప్పంటాను. అదలా ఉంచుదాం. ఈ మాటసరైందేనని భాషాశ్రాస్తాన్ని చూపించి వారేరుజువు పరచాలి.

2. భాష నుండి భావంపుట్టినట్లు, వాక్యం నుండి వాదన పుట్టింది.

ప్రశ్న : నిజమా? ముందు భాష పుట్టిన తరవాత భావం పుట్టిందా? ఎలా గెలాగు!? రుజువు చేయి తండ్రీ!

3. ఒక విషయమును తెలిసికొను నిమిత్తము ప్రశ్నించి అడగడమును హేతువాదము అంటాము.

ప్రశ్న : ఔరా! హేతువాదులెవరికీతెలియని వారెవరూ చెప్పని అర్థాన్ని చెప్పావు గద తండ్రీ! హేతువాదమంటే ప్రశ్న అనా?

4. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడాన్ని ప్రతివాదము అంటాము.

ప్రశ్న : గొప్పజ్ఞానివే, యోగీశ్వరుడివే. పిచ్చికుదిరింది రోకలికితలచుట్టమన్నట్టు వెనకటికొకడు, అలా ఉందిదిన్నూ, ఇలాటి అపభ్రంశపు మాటలు రాసి, ప్రచురించి మందినెత్తినింత బండపెట్టేరకాన్ని దండించే వ్యవస్థ లేకపోవడం ఈ దేశ ప్రజల దౌర్భాగ్యం.

వివిధ వాదాల గురించి సంచలనాత్మక రచయిత ఏమంటున్నాడో చూడండి.

ప్రశ్నించడము హేతువాదముకాగా, దానికి జవాబు చెప్పడము ప్రతివాదమట, జవాబు సరైనదైనా దానికి ఒప్పుకోక, కాదని మొండిగా వాదించడము అతివాదము అంటాము, అట,

ఇక ప్రశ్నకు చెప్పబడిన జవాబు సరైనదైనా, కాకున్నా దానిని ఎదురుమాట్లాడక ఒప్పుకోవడాన్ని వింత వాదమంటారట, అలాకాక, చెప్పబడిన జవాబు సరైందా కాదా అని ఏ మాత్రం ఆలోచించక, విచక్షణా జ్ఞానము లేకుండా తనకు తెలిసిందే సరైందనీ, ఇతరులు చెప్పింది సరైంది కాదని, తన భావమునకు వేరుగానున్న వారందరినీ హింసతో అణచివేయాలని చూచువాడు తీవ్రవాది అనబడుతున్నాడు.

విశ్లేషణ : ఈనాలుగు ముక్కల రచనలోనే రచయితకు భాషమీద పట్టుగానీ, భావంలో దిట్టతనంగాని లేవని ఇట్టే తేలిపోతోంది. ఈ రకం రచనల్ని, రచయితలను చూస్తుంటే ఒక సుభాషితం గుర్తుకొస్తొంది.

''తెలివి యొకింత లేని యడ దృప్తుడనై సర్వము తెలిసితినంచు గర్వితమతినై చరించితిన్‌'' అన్న దానికి సరిపోతారీ రకం. ఈ పుస్తకంలోని భాష పై గాని, భావాలపై గాని చర్చకు మేము సిద్దము.

Friday, November 1, 2013

హేతువాదోద్యమ పునరుజ్జీవన యత్నాలు

యోచనాశీలురైన మిత్రులారా! హేతువాదం పై సిద్దాంత గ్రంథం లేకపోవడం హేతువాదోద్యమ కార్యాచరణాపరంగా దానికదే ఒక పెద్ద బలహీనత. కనుక ముందాబలహీనతనుండి హేతువాద ఉద్యమ పదాధికారులు (దిశా నిర్ధేశం చేస్తున్నవారు లేదా రథ సారధులు) బైటపడి, సిద్దాంత బలాన్ని పుంజుకుని, హేతువాదోద్యమానికీ నూతన జవసత్వాలను అందించాలి. త్రికరణ శుద్ధిగా ఈ దృష్టితోనే నేనీ ప్రయత్నాలనారంభించాను. సత్యాన్వేషణ మండలి ప్రాథమికాకాంక్షల్లో 'చూడనేర్పడం' అన్నది అత్యంత ప్రాధాన్యతకల అంశం. కనుకనే సత్యాన్వేషణ మండలి ప్రధాన కార్యక్షేత్రం లక్షణ ప్రమాణ విద్యను నేర్పడం (తెలపడం కాదు) ద్వారా వ్యక్తుల్ని స్వతంత్రాలోచనాశీలతకల మేధావులుగా తయారు చేయడం అయ్యింది. కనుకనే మేము, తర్కవిద్య చదివి, వినీ సంపాదించగలిగింది కాదు, అది తర్కిస్తూ నేర్చుకోవలసిన విద్య (అట్టి వాటిని అభ్యాసక విద్యలంటారు) అనీ చెపుతూ, ఆ రకంగానే ఆ విద్యను మేథోశ్రమకు సిద్దపడినవారికి అందిస్తూ వస్తున్నాము. ఈ పని గత 40 ఏండ్లుగా చేస్తున్నప్పటికీ, సభ్యులను చేర్చుకోవాలనిగాని, సభ్యులకే నేర్పుతామనిగానీ, సంస్థగా దీనికో మూస (చట్రం) ఏర్పాటుచేయాలని గాని నియమాలు పెట్టుకోకుండా, అభిలాష ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసినంత, ఓపికున్నంత ఈ విద్యను నేర్పుతూ వచ్చాము. తాత్వికంగా మాతో విభేదిస్తున్న సంస్థలకు చెందినవారికీ, ఎట్టి అభ్యంతరాలూ పెట్టకుండా, వ్యత్యాసం చూపెట్టకుండా మా యోపినంత (మా దగ్గరున్నంత) విద్యను నేర్పాము. నేర్పుతూ ఉన్నాము. భావాలు, అవగాహనలలో తారతమ్యాలున్నా మిత్రులంగా కొనసాగగలుగుతున్నాము. ఒక్క వంచనా వృత్తి కలవారు తప్ప మిగిలిన వారెవరూ మాకు శతృపక్షం కాదని విస్పష్టంగా ప్రకటించి, నిజాయితీగా అలానే ప్రవర్తిస్తూ వస్తున్నాము. అడపాదడపా ఎప్పుడైనా, మానవికమైన ఆవేశకావేశాలకు లోనైనా ఒకింత గాడితప్పి ప్రవర్తించినా, వీలయినంత త్వరలో (వెంటనే) మరల సరైన దారిలోకి మరలి వివేక పథికులంగానే సాగుతూ వస్తున్నాము. వీలయినంతవరకు వ్యక్తిగత విమర్శలకు పోకుండా, విషయపరమైన విచారణకే ఎక్కువలో ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ భావజాల క్షేత్రంలో పనిచేస్తూ ఉన్నాము.

వెంకటాద్రి గారన్నట్లు; ఏదినాస్తికత? ఏది నాస్తికతకాదు? ఏది ఆస్థికత? అన్న విషయాలలో నాస్థికులం, హేతువాదులం, భౌతిక వాదులం అనుకునే వారిమధ్యనే అవగాహనల్లో వ్యత్యాసాలున్నట్లు , లోపాలున్నట్లు దాన్నే హేతువాదులం అనుకునేవారిలోనూ ఏది హేతువాదం; ఏది హేతువాదం కాదు. అన్న విషయంలోనూ భిన్నాభిప్రాయాలున్నై. ఇంకా సరిగా చెప్పాలంటే హేతువాదమంటే ఇదీ, దీనిలో ఈయీ భావాలుంటాయి. ఫలాని, ఫలాని అంశాలపై ఫలాని ఫలాని నిశ్చితరూపమైన అభిప్రాయాలుంటాయి. అన్న విషయంలో స్పష్టతగాని, ఏకాభిప్రాయంగాని నెలకొనిలేవు.

ఏకాభిప్రాయం లేకపోవడంతో ఆగలేదు. ఆ క్షేత్రాల వారు భిన్నాభిప్రాయాలు ఏర్పరచుకుని కొన్నింట విరుద్ధాభిప్రాయాలు కలవారిగనూ కొనసాగుతున్నారు.  ఇది మాట వరుసకు అనుకుంటున్న లేదా అంటున్నమాట కాదు. గతంలో జరిగిన, ఇప్పటికీ జరుగుతూవస్తున్న వాస్తవం.

ఎలా ఆస్థిక క్షేత్రంలో వివిధ ఆస్థిక ధోరణుల మధ్య దేవుని విషయంపైనా, పరలోకాల విషయంపైనా, శరీర భిన్నమైన ఆత్మ ఉనికిపైనా, మరణానంతర జీవితంపైనా భిన్నాభిప్రాయాలేగాక, విరుద్ధాభిప్రాయాలూ ఏర్పడి ఉన్నాయో, అలానే వివిధ నాస్థికుల మధ్య, హేతువాదుల మధ్య, భౌతికవాదుల మధ్య భిన్నాభిప్రాయాలు  నెలకొని ఉన్నాయి. అట్టి వారిలో చాలా మంది, మనమంతా ఆస్థికేతరులం కనుక కోట్లాడుకోవద్దు, ఎవరిమానాన వారం పని చేసుకుంటూ పోదాం అన్న అంగీకారానికి (ఇలి బివీజీలిలి శిళి ఈరిరీబివీజీలిలి అనుకుంటూనే)వచ్చి శతృదృష్టికి రాకుండా వేరు వేరుగనే సాగుతూ ఉన్నారు. వెంకటాద్రిగారిలాంటి మరింత లోతైన అధ్యయనమూ, నిక్కచ్చితనము, నిష్కర్ష - మొగమాటమిలేనితనం - ఉన్న వాళ్ళు మాత్రం నాస్థిక సంస్థలలోని నాస్థికేతర వైఖరుల్ని, కొన్నింటి ఆస్తికవైఖరుల్ని, హేతువాద, భౌతికవాద సంస్థలలోని అహేతుక, అభౌతిక వాద రీతుల్ని కనుగొని సూటిగానూ, రచనల రూపంలోనూ కూడా విమర్శలు చేశారు.

నాకు తెలిసి, ఆంధ్రప్రదేశ్‌లో, వెంకటాద్రిగారిని; అధ్యయనం లేనివాడనిగానీ, అతని రచనలలో పసలేదనిగానీ, నాస్తిక, హేతువాద, భౌతికవాద పక్షాలకు చెందినవారెవరూ అనరు. అననడం కంటే అనడానికి సాహసించరనడం నిజానికి మరింత దగ్గరిమదింపుమాట. ఆయా ఇతర సంస్థలపైనా, వాటి సారధులపైనా వెంకటాద్రిగారు వెలయించినంత విమర్శ రూప సాహిత్యం, వెంకటాద్రిగారిపై ఆస్థికేతర పక్షాలకు చెందినవారైనా తయారు చేయలేదు. కానీ ఆస్థికేతర ధోరణులే అనదగ్గ నిడమర్రు చార్వాకాశ్రమ పోకడపైనా, గోరానాస్థిక్యంపైనా, మార్కిస్టులపైనా, మార్క్సిస్టు హేతువాదులపైనా, అంబేద్కరిస్టు హేతువాదులపైనా, ఇతరేతర నాస్తిక సమాజాలపైనా కూడా వెంకటాద్రిగారు విమర్శనాస్త్రాలు సంధించారు. దీన్నంతటినీ కాచి వడకడితే సారరూపంగా రెండు మూడు అభిప్రాయాలేర్పడతాయి.


  • 1. హేతువాద సంఘం పెట్టినంతమాత్రాన, దానిలో సభ్యుడైనంత మాత్రాన, హేతువాదినని చెప్పుకున్నంతమాత్రాన ఒకడు హేతువాది (దానిసరైన అర్థంలో) కాడు, కాలేడు.
  • 2. అలాగే నాస్తిక సంఘాలు పెట్టినంత మాత్రాన దానిలో సభ్యుడైనంత మాత్రాన, నాస్తికుణ్ణని చెప్పుకున్నంతమాత్రాన, దేవుని నమ్మనంత మాత్రాన, నాస్తికుడనడానికి సరిపోడు.
  • 3. అలాగే భౌతికవాదినన్నంత మాత్రాన, భౌతికవాదపునాదికల సంఘాలలో సభ్యుడైనంతమాత్రాన, అతడు భౌతికవాదేననడానికి సరిపోడు.
  • 4. కాబట్టి ఎవరికి ఆయా ధోరణులకు చెందిన భావజాలంపట్ల సరైన అవగాహన ఉంటుందో, తదనుగుణ్యమైన ఆచరణా ఉంటుందో, అట్టివారే ఆయా ధోరణులకు చెందిన వ్యక్తులనడానికి అర్హత కలిగిన వారవుతారు. ఆ స్థాయికలిగినవారు, ఆయా సంఘాలలో చేరకున్నా అలాగని గుర్తింపు పొందకున్నా, ఆ ధోరణికి చెందిన వ్యక్తులే అవుతారు.


మిత్రులారా! వెంకటాద్రిగారు ప్రధానంగా నొక్కుపెట్టిన, ఆయన రచనలలో అంతర్లీనంగా తొంగిచూచే అంశాలివి. ఎన్నో విషయాలపై అవగాహనపరంగా వెంకటాద్రిగారికీ నాకూ విబేధాలు, వ్యత్యాసాలు ఉన్నా ఈ వైఖరి వరకునేనాయనతో విభేదించడంలేదు. తటస్తంగానూలేను. వాటిని అంగీకరిస్తూ ఉన్నాను. పై నాలుగు భావాల విషయంలో మీ మీ అభిప్రాయమేమిటో ఎవరికి వారుగా ఆలోచించుకోండి. నిక్కచ్చిగా ఆ మాట బైటికి చెప్పండి.

వెంకటాద్రిగారు, చాలాసార్లు తన రచనలలో హేతువాదుల్లో హేతువాదులుకాని వారి గురించీ, నాస్తిక సముదాయాల్లో ఉన్న నాస్తికులు కాని వారిని గురించీ, భౌతికవాద పక్షీయులలో ఉన్న భౌతికవాదులు కానీ వారిని గురించి ప్రస్తావిస్తూ, విమర్శిస్తూ, హెచ్చరిస్తూవచ్చారు. ఇప్పటికీ ఆయన అలాంటివారిపట్ల అదే వైఖరి కలిగిఉన్నారనే అనుకుంటాను.

అలాగే ఈ మూడు కూటాల వాళ్ళకూ ఆయన ఒక హిత సూచన చేస్తూ వచ్చారు. ఆస్తికేతర పక్షీయులందరూ ఆధునిక విజ్ఞాన శాస్త్రావిష్కరణలాధారంగా తమతమ తాత్విక భావజాలాన్ని సరిచూసుకుంటూ, సరిచేసుకుంటూ కదులుతుండాలన్నదే ఆసూచన. ముఖ్యంగా ఈమాట ఆయన హేతువాదులంగా నుండదలచినవారి నుద్దేశించి అన్నదే. అలాగే మిగిలిన అన్ని ధోరణులూ, హేతువాదం చూపెడుతున్న మార్గాన పయనిస్తూ ఉండాలనే దృష్టినీ కనబరిచారు.

ఈ విషయాన్ని చెప్పేటప్పుడు 'హేతువాదవైఖరి' క్రింద ఏయే భావాలను ఆయన మనస్సులో పెట్టుకున్నారో నాకు పూర్తిగా తెలియకున్నా; ఒక్క అంశం వరకు నాకు ఆయనతో ఏకీభావం ఉంది. అదేమంటే హేతువాద ఉద్యమం పునాది ఉద్యమం. మిగిలిన అన్ని ఉద్యమాల వెనకనున్న తాత్విక క్షేత్రాల ఆవిర్భావానికిగానీ, వాటిని విచారించి సరిచూసుకోడానికి గానీ, సరిచేసుకోడానికిగాని అవసరమైన ప్రాతిపదికలను హేతువాద తాత్విక ధోరణి (సిద్దాంతం) అందిస్తుంది. ఈ విషయం ఆయనన్నారనో, నేనంగీకరించాననో విలువను సంతరించుకోలేదు. గతకాలపు తార్కికులూ, లేదు తాత్వికులలో కొందరూ ఈ విషయాన్ని గురించి చాలా విస్పష్టంగా ఒక సూత్రాన్నే ప్రకటించారు.
కాణిదం పాణానీయంచ సర్వశాస్త్రోపకారకమ్‌.

సాంప్రదాయంలో న్యాయవైశేషిక దర్శనాలను తర్కశాస్త్రం అంటారు. ఆపంథాననుసరించేవాళ్ళను నైయాయికులు - తార్కికులు - అనంటారు. అందులో 'కాణాదం' అంటే కణాదుని దర్శనం (వైశేషికం) అని అర్థం. అది ప్రధానంగా ప్రమాణ, పదార్థ వివేచన చేస్తుంది.

ఇక పాణినీయం అంటే వ్యాకరణ శాస్త్రం అని అర్థం. అంటే భాషా నియమాలను వివరించే శాస్త్రం అని అర్థం. ఈ రెండు మాటల అర్థాలను కలుపుకుని చెప్పుకుంటే, తర్క వ్యాకరణ శాస్త్రాలు, మిగిలిన అన్ని శాస్త్రాలకూ ఉపయోగపడేటివి అని అన్నట్లు అవుతుంది.

తర్కశాస్త్రమంటే 'సక్రమాలోచనా నియమాల శాస్త్రం' అని అర్థం. వ్యాకరణం భాషా నియమాల శాస్త్రం అని అర్థం. కనుక సక్రమాలోచనానియమాలు, భాషానియమాలు తెలియకుంటే ఏ ఇతర శాస్త్రాల రూపకల్పనకు ఆధారం ఉండదుకనుక, ఈ రెండు శాస్త్రాలూ అన్ని శాస్త్రాలకు ఉపకారకాలని చెప్పబడింది. నాటికేగాక ఈ నాటికీ, ఏనాటికీ కూడా మార్చుకోనక్కరలేని, కాలం చెల్లని సిద్దాంతమిది.

మన ప్రస్తుతాంశమైన హేతువాదం సిద్దాంతమా? కాదా?

రాష్ట్రంలోని వివిధ ధోరణులకు చెందిన హేతువాదులూ, హేతువాదం సిద్దాంతంకాదు. అదొక ఆలోచనా విధానం అని అనుకుంటున్నారు, అంటున్నారు. కానీ దానిపై వెంకటాద్రి గారు తప్ప తమదైన రీతిలో ప్రత్యేకించి 'సిద్దాంత స్థాయికల? రచన లేవీ చేయలేదు. ఆ విషయం వెంకటాద్రిగారూ ప్రస్తావించారు. తానే హేతువాదం పైనా, నాస్తికత్వంపైనా సైద్దాంతిక వ్యాసాలు వ్రాస్తూవచ్చాననీ అన్నారాయన. అయితే ఆయన కూడా, హేతువాదం సిద్దాంతం కాదు. అదొక ఆలోచనావిధానం అన్న భావాన్నే వెలిబుచ్చారు. తెలుగునేలలో హేతువాద ఉద్యమానికీ, హేతువాదులమనుకునేవారికీ ఆ విషయానికి సంబంధించి సాహిత్యరూపంలో అందుతున్న సమాచారమంతా లేదా దాదాపు 90% సమాచారం, వెంకటాద్రిగారి రచనలనుండే అందుతోంది. కనుకనే హేతువాదం ఒక సిద్దాంతం కాదు, అదొక ఆలోచనా విధానం మాత్రమేననడం పరిపాటిగా మారింది. దానిపై ఎంతో కొంత అధ్యయనం చేసినవారేగాక, కనీసవగాహనలేని వారుకూడా హేతువాదం సిద్దాంతం కాదు, అదొక ఆలోచనావిధానం మాత్రమే అంటూ బట్టీపట్టిన సూత్రాన్ని అప్పజెప్పినట్లు అప్పజెప్పడం జరుగుతోందీనాటికీ.

నాస్తికులు, మార్క్సిస్టులు, రాయిస్టులతో హేతువాదం విషయమై నాకున్న పరిచయాలాధారంగా, ఈ విషయంపై కొంత విచారణ అవసరమనిపించి, గతంలోనే ''సిద్దాంత'' పదార్థ విచారణ అన్న శీర్షికన ఒక వ్యాసం వ్రాసి వివేకపథంలో ప్రచురించాను. మొన్నటికి మొన్న సిద్దాంతమన్నమాట వివిధ వైజ్ఞానిక సామాజిక, తాత్విక క్షేత్రాలకు చెందిన రచనలలో ఏయే సందర్భాలలో ఏమి అర్థాలలో వాడబడిందో కొంత ఉదహరించాను. అయినా, హేతువాదోద్యమ పునరుజ్జీవన యత్నాలను గమనిస్తూ, ఒకింత అంటీముట్టనట్లే ఉంటూ పాల్గొన్న గౌరవ్‌ హేతువాదం సిద్దాంతం ఎందుక్కాదంటూ రెండు లేఖలు వ్రాశారు. వివేకపథంలో ప్రచురించమంటూ.
వెంకటాద్రి గారి ప్రకారం, హేతువాదమంటే నాస్తిక్యంకాదు, మార్స్కిజమూకాదు, రాయిజమూకాదు, నిజానికి మరేయిజమూకాదు. హేతువాదమంటే హేతువాదమే. హేతువాద ఆలోచనా విధానాన్ననుసరించి వారు వారు వారి వారి ఆలోచనా సామర్థ్యాననుసరించి, నాస్థికులుగ, మార్క్సిస్టులుగ, రాయిష్టులుగ రూపొందుతూ వచ్చారు. అందులో నాస్తిక్యం హేతువాద ఆలోచనా మార్గాన చేరిన, చేరాల్సిన మొదటి మజిలీ మాత్రమే కడమజలీ మానవ వాదం. కానీ హేతువాదమంటే నాస్తిక్యం కాదు. కాని కొంతమంది హేతువాద పద్దతిననుసరించే నాస్తిక్యం అన్న మజిలీని చేరి అక్కడితో ఆగిపోయారు. అటు తరవాత ఇంకా మలి మజిలీలకు నడిపించాల్సిన హేతువాద విధానం (వారు అనుసరించకపోవడం వల్ల) వారిని మరింత ముందుకు నడపలేకపోయింది. లేదా వారు నాస్తికత దగ్గరే ఆగిపోయారు. హేతువాద పద్దతిన ఎక్కడా ఆగకుండా సాగేవారు మొదట 'నాస్తికత' దగ్గరకూ, అనంతరం భౌతిక వాస్తవికత దగ్గరకు చేరి ఆ చివరకు మానవవాదం వరకు ప్రయాణిస్తారు అన్నది వెంకటాద్రిగారి అవగాహన. ఆయన లెక్కప్రకారం ఎం.ఎన్‌.రాయ్‌ అలా ప్రయాణించిన వారే. రాయిస్టులూ ఆ మార్గాన పోతున్నవారే. కనుకనే వారి సిద్దాంతం నవ్యమానవ వాదమైంది. కనుక సరైన రీతిలో హేతువాద విధానాన్ని అనుసరించిన వారెవరైనా అవస్యం మానవవాదిగా తేలాల్సిందే. ఈ అంశాల మేరకు ఈ క్రమాన్ని చేరుతూ, దాటుతూ సాగని వారెవరైనా హేతువాద విధానాన్ని పూర్తిస్థాయిలో అనుసరించనివారేనన్నదీ వెంకటాద్రి గారి అవగాహనే. వీటి వరకు వెంకటాద్రి గారిని నేను సరిగనే అర్థం చేసుకున్నానో లేదో, ఆయన గానీ, ఆయనను అర్థం చేసుకుని ఉన్నామనుకుంటున్నవారు గాని ముందు నిర్థారించండి. ఈ మేరకు ఆయనేమిటన్నది నేను సరిగ అర్థం చేసుకోలేననిపిస్తే, ఎక్కడ పొరబడ్డానో తెలియజేయండి.

ఎవరికివారు తామూ హేతువాదులమేననుకుంటున్న ఆస్థికేతరులైయ్యుండీ వివిధ ధోరణులకు చెందిన వీరంతా; 'నాస్థికత' అన్నది ఒక సిద్దాంతమేనని అంగీకరిస్తారా? అంగీకరించరా? భౌతికవాదమన్నది సిద్దాంతమేనా? కాదా? అలాగే మార్క్సిజము రాయిజములన్నవి సిద్దాంతాలా? కాదా? అలాగే వీరందరి ప్రకారం 'ఆస్థికత' సిద్దాంతమేగా?
ఈ విషయాలు విచారించాలన్నా, సరైన అవగాహన అనడానికి తగిన ముగింపుకు రావాలన్నా కొన్ని కీలకమైన, మౌలికమైన అంశాలపై లోతైన చర్చ (విచారణలేదాపరిశీలన) జరగాలి. అందుకు ఈ అంశాలపై తనదంటూ ఒక అభిప్రాయాన్ని కలిగిఉన్న, ప్రకటించిన వారంతా బాధ్యతతో సిద్దంకావాలి. అందరూ కాదన్న, ఆయా ధోరణుల రధసారధులుగ నున్నవారివరకైనా చిత్తశుద్ధితో పూనుకోవాలి.

ఎందుకంటే, ఇతరేతర ధోరణులననుసరించే వారి మాటెలా ఉన్న భావజాల క్షేత్రంలో పని చేస్తున్నామనేవారి వరకైనా తమభావాలను పరీక్షకిచ్చి, అవి సరైనవేనని నిర్థారించే బాధ్యత వహించడం, ఎదుటివారి (తమ భావాలతో విభేదిస్తూ అదే విషయాలపై వేరు వేరు భావాలను వ్యక్తీకరిస్తున్నవారి) భావాలను పరీక్షించి అవి దోషాలతోనో, లోపాలతోనో కూడి ఉన్నవేనని వారికి తెలియజెప్పడానికి సిద్దంకావడం అన్న రెంటినీ కాదనుకూడదు. ఈ విషయాన్ని సూత్రప్రాయంగా వెంకటాద్రిగారు స్పష్టంగా ప్రకటించిఉన్నారు.

క వివేకవంతుడి మిత్రుడు విమర్శకుడే. విమర్శకుణ్ణి శతృవుగా భావించేవాడు మత వాదికి తీసిపోని కన్ఫరమిస్టు అవుతాడు.
క చదవకుండానే విమర్శించే వారిని నేనెరుగుదును. మీరు ఆకోవకు చేరకండి.
క ఒక సత్యాన్ని మాత్రం మనం విస్మరించరాదు. సిద్దాంతాలు చెప్పే వారున్నపుడు వాటిని ఖండించేవారుండ కూడదు అని ఆశించడం సక్రమంకాదు. విమర్శను సహించలేనివాడు సిద్దాంతాలను వల్లించడం స్వాతిశయం.
క విమర్శకు లొంగే సిద్దాంతాలను సవరించుకోకపోవడం తప్పవుతుందికాని, విమర్శించడం తప్పుకాదు.
క సిద్దాంతాలలో ఏకీభావం లేకపోతే మీరు నేను కలసి 'మనం' కాము. ఒకరికి మనవారు అన్న ముద్రవేసి, వారు చెప్పిందానికీ, చేసిందానికీ తాళం వేయడం హేతువాద పద్దతికాదు. హేతువాది తందానతానకొట్టడు.
క ఒక సిద్దాంతం (నాస్తికత్వం) క్రింద ఏమి చెప్పాలి? ఏమి చెప్పకూడదు?... అనే అంశాలు స్పష్టంగా తెల్సుకోకుంటే సోషలిజంలాగే నాస్తికత్వమూ (ఏ సిద్దాంతమైనా) అర్థంలేని బిందెనాదమైపోతుంది... హేతువాద నాస్తికోద్యమాలు అలా మారకుండా ఉండాలంటే సిద్దాంతాలలో, లక్ష్యాలలో స్పష్టత ఉండాలి.
క ఒక సిద్దాంతాన్ని విమర్శించడంలో తన మన లేదు. అలా విమర్శించడమే హేతువాది ధర్మం... విమర్శను అర్థం చేసుకోలేనిది అజీర్ణహేతువాదం. సహించలేంది మతం.
క ప్రతిహేతువాదీ మార్కిస్టు కావాలనిలేదు. మార్క్సిజాన్ని విమర్శించకూడదనీలేదు.
క మార్క్సిజం యొక్కగానీ, మరో సిద్దాంతం యొక్కగాని ఉచితానుచితాలను పరిశీలించడానికి హేతువాదం, శాస్త్రజ్ఞానం కొలమానాలు కావాలిగాని, హేతువాదం యొక్క ఔచిత్యాన్ని పరిశీలించడానికి మార్క్సిజం కానీ (మరోటుకాని) ప్రమాణం కారాదు. మార్స్కు చెప్పాడు కాబట్టి, లెనిన్‌ చెప్పాడు కాబట్టి, మావో చెప్పాడు కాబట్టి అంటూ ఆ కాబట్టీల ప్రమాణంతో హేతువాదాన్ని పరిశీలించడం మతపద్దతి.
సురేంద్ర :- దీనిని మరికాస్త పొడిగిద్దాం. స్పష్టత కొరకు రావిపూడి చెప్పాడు కాబట్టి, గుత్తారాధాకృష్ణ చెప్పాడు కాబట్టి సురేంద్రో మరో సుబ్బయ్యో చెప్పాడు కాబట్టి అంటూ ఆ కాబట్టీల ప్రమాణంతో హేతువాదాన్ని పరిశీలించడమూ మత పద్దతే.

గమనిక :- రావిపూడి రచనలు - సం-3 'నాస్తికత్వం' గ్రంథాన్నీ, 1982లో రెండవముద్రణగా అచ్చేసిన 'హేతువాదం' పుస్తకాన్ని చదువుతూ పై వాక్యాలు ఎత్తిరాశాను. రచన ఇక్కడికి చేరేటప్పటికి (340నెం. నవంబరు 2013) హేతువాది అందింది. ప్రస్తుతం వివేక పథం ద్వారా నేను సాగిస్తున్న 'హేతువాద పునరుజ్జీవన యత్నాలు' అన్న శీర్షికకు సంబంధించిన విషయాలెన్నో దానిలో ప్రస్తావించబడడంతో, దానిని శ్రద్దగా చదవాను. గమనిక అంటూ ఇక్కడ నేను వ్రాస్తున్న ఈ మాటల కంటే ముందు, వెంకటాద్రిగారే విమర్శ గురించి వ్రాసిన వాక్యాలను ఉట్టంకించి ఉండడం, అవి చాలా విలువైనవిగా నేను తలుస్తుండడంతో ఆ భావాల ప్రాతిపదికనే ఈ నవంబర్‌ హేతువాదినీ ఒకింత విమర్శించుదాం అనిపించింది. ఇప్పటికే ఆ సంచికను అందుకున్న 'హేతువాది' పాఠకులు మరోసారి దానిని జాగ్రత్తగా పరిశీలించండి.

ఆ సంచికలో వెంకటాద్రి గారి పేరున ప్రకటింపబడ్డ వ్యాసాలు మూడు
1. ఎడిటోరియల్‌ క్రింద 'జ్ఞానమూ, సత్యమూ - సాపేక్షత'
2. హేతుత్వం - సంకల్పం (రాడికల్‌ హ్యూమనిస్టు ది. 24-12-1953 నాటి వ్యాసం)
3. హేతువాదం - కార్యకారణత - జ్ఞానం - సత్యం - స్వేచ్చ (బహుశా ఇది 1994 తరువాత నాతో వివాదం ఆరంభమైయ్యాక వచ్చి ఉంటుంది)

ఆ వ్యాసాలపై విమర్శ దృష్టి నుండి ఆలోచనకు, పునరాలోచనకు ఉపయోగపడతాయని నా కనిపించిన కొన్ని ప్రశ్నలను మీ ముందుంచుతాను. నేనిలా ఆరంభించడానికి ప్రేరణగా ఆ వ్యాసాలు విమర్శించవలసినవిగా ఉండడంతోబాటు వెంకటాద్రి గారు విమర్శకు సంబంధించి ప్రకటించిన అభిప్రాయాలూ తోడైనాయి.
హేతువాది నవంబర్‌ 2013 సంచిక ఎడిటోరియల్‌ గురించి

1. మొట్టమొదట, ఆ వ్యాసం మొత్తం పైన నాకనిపించిన ఒక అభిప్రాయాన్ని ప్రకటిస్తాను. అందులో నాకంగీకారమైన భావాలతో బాటు నాకంగీకారంకాని భావాలు భాషాదోషాలు, నన్నూ దృష్టిలో పెట్టుకుని అనవసరపు దూకుడును కనబరుస్తూ వ్రాసిన వ్యంగ్యోక్తులూ ఉన్నాయి.
2. శీర్షికగా 'జ్ఞానము, సత్యము - సాపేక్షత అన్న మూడు పదాలను వాడారు. కనీసం ఆ మూడు పదాలకు సూటిగా అర్థాన్ని చెప్పనేలేదు. అతి ముఖ్యమైన ఆ పదాలకు సరైన - ఖచ్చితమైన - అర్థాలను నిర్ధారించకుండా ఆయన చెప్పదలచుకున్నదేమిటో ఇదమిద్దంగా గ్రహించడం కుదరదు.
3. తెలుగులో నానార్థాలతో ఉన్న ఒక పదాన్ని వాడి, దాన్ని ఈ అర్ధంలో వాడానంటూ అనువాద రూపంలో ఒక ఆంగ్ల పదాన్ని వాడితే ఆ పదానికి అర్థం చెప్పినట్లు కాదు గదా! పైగా అనువాద రూపంగా వాడిన ఆంగ్ల పదమూ అనేకార్థాలను కలిగి  ఉన్నది కనుక పటిత ఏ అర్థాన్ని గ్రహించాలి? గ్రహించుతాడు? ఏ వస్తువును గురించిన జ్ఞానమైనా, అది ఉన్నదన్న స్పృహ మనలో జనించడంతోనే ప్రారంభమవుతుంది. ఎలా ఉందీ వాక్యం? ఆయన వాక్యాన్నే ఇలా రాస్తే ఎలా ఉంటుంది?
ఎ. 'దీన్ని గురించిన జ్ఞానమైనా అనిగాని ఏ విషయాన్ని గురించిన జ్ఞానమైనా అని గాని వ్రాస్తే ఏ వస్తువు గురించిన జ్ఞానమైనా అన్నదానికంటే విస్తృతార్థాన్నివ్వగలుగుతుంది. వివరించుకోడానికీ బాగుంటుంది. అవునాకాదా?
బి. అది ఉన్నదనే స్పృహ మనలో జనించడంతోనే ప్రారంభమవుతుంది. అన్న దానిలో 1. దాని ఉనికి మన ఎరుకలోకి రావడం అన్న భావము 2. జ్ఞానం ప్రారంభమవుతుంది అన్న భావము చోటు చేసుకుని ఉన్నాయి. నిజానికి దేని జ్ఞానమైనా ఏదో ఒక జ్ఞానేంద్రియంతో దానికి సన్నికర్ష ఏర్పడే కలుగుతుంది. అలాంటప్పుడు ఉత్త ఉనికి స్పృహ ఎన్నడూ కలగదు. ఆ ఇంద్రియం పట్టివ్వ గల గుణం ఉంది అని గాని ఆ గుణం కలది అక్కడ ఉంది అని గాని స్పృహ జనించడం, అనంతరం దానివెంబడే జ్ఞానం ప్రారంభకావడం అన్న క్రమం ఉండదు. పైగా జ్ఞానం పుడుతుందనో, కలుగుతుందనో అనాలిగాని, జ్ఞానం ప్రారంభమవుతుంది అన్న ప్రయోగం అంత సరైందికాదు. అలాంటి ప్రయోగాలు సరిపెట్టుకోడానికి పనికొస్తాయేగాని వాటికవిగా సరిగ్గాసరిపోవు. అలాంటి వాక్యాన్ని అర్థం చేసుకోడానికి మరికొన్ని పదాల్ని తెచ్చిపెట్టుకోవడమో, ఉన్న పదాల్ని పట్టించుకోకపోవడమో చేయాల్సి వస్తుంది.
దేన్ని గురించిన జ్ఞానమైనా దాన్ని తాకిన లేదా దాన్ని పట్టిచ్చిన ఇంద్రియాన్ననుసరించి ఫలానాది ఉందన్న స్పృహ రూపంలోనే కలుగుతుంది. నావైతే వెంకటాద్రిగారు చెప్పదలచింది ఇదేనని అనిపించింది. మరి మీకేమనిపిస్తోంది?
2. ''ఏ వస్తువూ మొత్తంగా ఒకేసారి మన జ్ఞాన పరిధిలోకి రాదు'' అన్నది అందులోని రెండో వాక్యం
విమర్శ :- వస్తువు అన్నపదం వల్ల ఏర్పడే సంక్లిష్టతే ఆ వాక్యపు అర్థాన్ని గ్రహించడం విషయంలో ఇక్కడా ఎదురవుతోంది.

ఉదా:- ఒక పండు యొక్క రుచేమిటో తెలుసుకోగోరామనుకోండి. ఆ పండును రుచిని కనిపెట్టే ఇంద్రియానికి తాకిస్తాం. వెంటనే దాని రుచేమిటో మన స్పృహలోకి వస్తుంది. స్పృహలోకి రావడం తెలియడం ఒక్కటే ననుకుంటేనే విషయస్పష్టత ఉంటుంది. (దాని రుచికి సంబంధించిన స్పృహజనించడంతోనే రుచి జ్ఞానం ఆరంభం అవుతుంది అనడం అంతసరైన భాష అనిపించడం లేదు కదూ!) పై వాక్యంలో వస్తువు అనగానే విషయమన్న సాధారణార్థం స్పురించకపోగా, ఒక ఆవరణ కలిగి (ప్రదేశరీత్యా మూడు కొలతలుండి) దృష్టికి అందులో కొంతే అందుతున్న పదార్ధం (ద్రవ్యం) అన్న అర్ధం వస్తోంది.

కానీ జ్ఞానార్జన ప్రక్రియ ద్వారా జ్ఞానం కలుగుతున్న తీరంతా ఆయా జ్ఞానేంద్రియాలు పట్టివ్వగల అంశానికి సంబంధించినదిగనే ఉంటుంది. ఉదా:- దాని రంగేమిటి? రుచేమిటి గట్టి మెత్తనలు, గరుకు, నునుపులు ఏమిటి? వాసనేమిటి? పరిమాణమెంత? ఆకృతేమిటి? ... ఇలా కలుగుతుంటుంది మనకు కలిగే ఐంద్రియక జ్ఞానమంతా. ఇక మనకు కలిగిన జ్ఞానం సరైందా? కాదా అన్నదీ ఆయా అంశాలను దృష్టిలో పెట్టుకునే పరీక్షిస్తాము. నిర్థారిస్తాము.
ఏ వస్తువు ఒకేసారి మొత్తంగా 'మన జ్ఞానపరిధిలోకి రాదు' అన్నదాంట్లోని, మన జ్ఞాన పరిధిలోకి అన్న మాటలు, అప్పటికే మనకోజ్ఞానము, దానికో పరిధి ఉన్నవన్న అర్థాన్నిస్తున్నాయి. అలాంటి పదాలను అప్పటికే తెలిసున్న అంశాలను గురించి ప్రకటించేటప్పుడు మాత్రమే వాడాలి. ఉదా :- నీవంటున్న విషయం నా జ్ఞాన పరిధిలోలేదు, అనడంలాగన్నమాట.

వెంకటాద్రిగారెత్తుకున్న సందర్భాన్ని సరళంగా వ్యక్తం చేయాలంటే, వస్తువంటే పరిమాణము ఆకృతి కల ద్రవ్యం అన్న అర్థంలోనైతే, ఏ వస్తువుకు సంబంధించిన అన్ని విషయాల జ్ఞానమూ సమగ్రంగా ఒకేసారి కలగదు అనాలి. అదే మరి 'వస్తువు' అన్న దగ్గర విషయము అని గాని పదం వాడితే, ఇక ఆ విషయం వరకు కలగవలసినంత జ్ఞానమూ (ఆ ఇంద్రియం సరిగలేకుంటే తప్ప) కలిగేస్తుంది. ఇక ఆ విషయంలో ఏ అసంపూర్ణతో, సందిగ్థతో ఏమీ ఉండదు.
3) ''అది మన జ్ఞాన ప్రక్రియ వికసించేకొలది దాన్ని గురించిన సమాచారం వృద్ధి చెందుతుంది'' అన్నది మూడో వాక్యం.

విమర్శ :- ఈ వాక్యంలో మొదటి పదం 'అది' అన్నది అనవసరం. తరవాతి మాటలైన మన జ్ఞాన ప్రక్రియ వికసించేకొలది అన్నవాటికి, ఆయన చెప్పదలచుకున్న అర్థమేమిటన్నది స్పష్టం కావడంలేదు. ఎందుకంటే 'జ్ఞానప్రక్రియ' అంటే ఆయనర్థమేమిటి? లేదా లోకంలో వాడుకలో ఉన్న అర్థమేమిటి? అది వికసించడమంటే ఏమిటి?
ముఖ్య గమనిక :- కథలు, నవలలు లాటి సాహిత్యాన్ని చదివేటప్పుడు ప్రతి పదాన్ని అంతగా పట్టిచూడకున్న పరవాలేదు గాని, భావజాల క్షేత్రంలో, అదీతాత్వికాంశాలకు చెందిన కీలకమైన పదాలగురించి వివరించేటప్పుడూ, విచారించేటప్పుడూ మాత్రం ప్రతి పదాన్ని నిశితంగా పట్టిచూడాలి. లేకుంటే దానిని అధ్యయనం అనలేము. పైగా ఈ శీర్షికగా ఆయన ఎంచుకుంది మూడు ముఖ్యమైన పదాలనే.

ఇంతకూ వెంకటాద్రిగారు చెప్పదలచుకున్నది ఏమైయ్యుంటుంది?

మనం జ్ఞానాన్నార్జించడానికి వినియోగించే పరికరాల, విధానాల సామర్థ్యాలను పెంచుకోవడాన్ననుసరించి, అదే వస్తువుకు చెందిన మరింత సమాచారం మన ఎరుకలోకి వస్తుంటుంది, అనే కదా! అందుకు ఆ మాటలకంటే నా మాటలే స్పష్టత నిస్తున్నాయనిపిస్తున్నదా లేదా? ఆలోచించండి.

4. ''అందువల్ల మన జ్ఞానం అంచలంచలుగా పెరుగుతుంది. అంటే, మొన్నటి, నిన్నటి, నేటి, రేపటి, జ్ఞానపరిమితులకు తేడా ఉంటుంది. అన్నది అందులోని 4, 5 వాక్యాలుగా ఉన్నాయి.
ఇందులో 'జ్ఞానపరిమితి' అన్న పదబంధం ఉంది. పరిమితి అంటే హద్దు అని అర్థం. జ్ఞాన హద్దుల్లో తేడా ఉంటుందనేనా చెప్పదలచింది. నిన్నటికి దానికి సంబంధించిన ఇంతజ్ఞానమేఉంది. అది ఈ నాటికి ఇంతైయింది. రేపటికి మరింత అవుతుంది. అన్నదేనా రచయిత చెప్పాలనుకున్నది. జ్ఞానాన్ని 'స్థాయి' అన్న పదంచేత, పరిమాణం అన్న పదం చేత 'విస్తృతి, లోతు' అన్న అర్థంలో వాడడం ఎక్కువ వినియోగంలో ఉంది. జ్ఞానానికి 'పరిమితి' ఉందనడం తప్పు ప్రయోగం కాదు గాని, ఈ విషయంలో నా జ్ఞానమింతే అని చెప్పే సందర్భాలలో ఆ మాట అతికినట్లు సరిపోతుంది.

5. ''అయితే, 'సహజంగా' మొన్న, నిన్నటి జ్ఞానంకంటే నేటి, రేపటి జ్ఞానం పురోగతిలో ఉంటుంది.''
విమర్శ:- 'సహజంగా' అన్నమాటకు దాని అసలర్థంలేదు ముఖ్యార్థం 'కలసిపుట్టినట్లు' అని సహ=తోడ్తో లేదా జతగా జ(ఏ) = పుట్టిన అని సహజమన్నమాట అర్థం. కానీ ప్రస్తుత సందర్భాన్ని బట్టి వెంకటాద్రి గారు చెప్పదలచింది సాధారణంగా, మామూలుగా, ప్రతిసారీ లేదంటే ఎక్కువసార్లు (తరచుగా) అన్న భావాన్నే నేమో అనిపిస్తున్నది. తరవాతి మరోపదం ''జ్ఞానం పురోగతిలో ఉంటుంది'' అన్నది.

పురోగతి అన్నపదం 'ముందు వైపుకు కదలిక'' అన్న అర్థాన్నిస్తుంది. 'నిరంతరం ఎక్కువవుతూ' అన్న అర్థాన్ని చెప్పాలని కాబోలు నిజానికి జ్ఞానం పురోగతిలో ఉండదు. జ్ఞాని అదనపు జ్ఞానం సమకూర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు. జ్ఞానం విషయంగా చెపితే ఆ జ్ఞానం రాశిలోనూ, వాసిలోనూ పెంపొందుతూ ఉంటుంది. అదలా ఉంచి కాలాన్ననుసరంచి మొన్న నిన్న కలిగిన (గతంలోని) జ్ఞానం అనివార్యంగా మారుతుందనిగానీ, మారాలనిగానీ, అదిన్నీ మరింత ఉన్నతస్థాయి లేదా మెరుగైన రూపంలో జ్ఞానం ఏర్పడి తీరాల్సిందేనని గాని నియమం ఉందని నిర్ధారించలేము. అందుకు ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు. మచ్చుకు ఈ సంచికలోని ఒక అంశాన్నే ఉట్టంకించవచ్చు. వెంకటాద్రి గారి రచనే అయిన 'హేతుత్వం - సంకల్పం' అన్నవ్యాసం 60 ఏండ్ల నాటిది. అది ఈనాడు మళ్ళీ ఎట్టి మార్పులూ చేయకుండా (మార్చక్కరలేదనుకునే) యథాతథం ప్రచురించారు. ఏనాడో చెప్పిన ఆ భావాలు నిన్నటికీ, నేటికీ గాకుండా రేపటికీ - కనీసం సమీప భవిష్యత్తు వరకైనా - అంటే ఎల్లుండి, ఆ తరవాతకీ కాదనుకున్నా, మార్చనక్కరలేదు. అనుకునే గదా ప్రచురించారు? వెంకటాద్రి గారే, గతకాలం నాటి అంటే నిన్న, మొన్నటికంటే వెనకటి కాలం నాటి వనడానికి వీలున్న; దర్శనాలలోని ప్రతిపాదనలను, అవి 2500 సం|| కంటే వెనకటివైనా వాటిని మార్చుకోనక్కరలేనివిగనే ఉన్నాయనంటూ స్పష్టంగా ప్రకటించారు.

కనుక ప్రతి విషయానికి చెందిన జ్ఞానమూ, ప్రత్యంశానికి చెందిన జ్ఞానము మొన్నా, నిన్న, నేడు, రేపు అన్న కాలపు కొలతలనుండి మారి తీరుతుందనిగానీ, మారాల్సిందేననిగానీ, అదీ రాశి, వాసి పరంగా మెరుగైతీరుతుందనిగాని చెప్పనేకూడదు. ఎప్పుడో కలిగిన జ్ఞానం ఇప్పటికీ మార్పు నొందకుండా ఉండే వీలుందా లేదా? కొన్ని విషయాలవరకైనా? ఆలోచించి ఎవరికి వారుగా ఒక నిర్ణయానికి రండి. అలా చేసుకున్న నిర్ణయం సరైందేనని నిరూపించే బాధ్యత వహించండి. ఇది సబబబేననిపిస్తే, దీని కొనసాగింపిలా ఉంటుంది. ఒక వ్యక్తికి ఎన్నడో కలిగిన జ్ఞానం కంటే మరో వ్యక్తికి ఇప్పుడు కలిగిన జ్ఞానమే అల్పమైంది. దోషయుక్తమైందీ కూడా కావచ్చు.
6. మనకు లభించే వస్తుజ్ఞానం ఎప్పటికప్పుడు సాపేక్షం (ష్ట్రలిజిబిశిరిఖీలి) అవుతుందేకాని, పరమం (జులీరీళిజితిశిలి)  కాదు అన్నది ఆ పేరాలోని చివరి వాక్యం.

విమర్శ :- ఈ వాక్యంలో 'సాపేక్ష', 'పరమం' అన్న రెండు పారిభాషిక పదాలు వాడారు. ఇంతకూ ఆ రెండు పదాల అర్థం ఏమిటో చెప్పనేలేదు. నాకుతెలిసి సాపేక్ష మన్నమాట స+అపేక్ష అన్న రూపం కలది. అపేక్ష అన్న పదం కావాలన్న దృష్టి ఉండడాన్ని తెలుపుతుంది. ఏదైనా ఒకదానికి మరోదాని సంబంధం గానీ, మరో దాని అవసరంగాని ఉన్నప్పుడు దానిననాలి 'సాపేక్షికం' అని. ఇక్కడ వస్తుజ్ఞానం అన్న పద బంధం వస్తువుకు సంబంధించిన జ్ఞానం అనిగాని, వస్తువును గురించిన జ్ఞానం అనిగాని వస్తువు యొక్క జ్ఞానం అనిగాని అర్ధాన్నిస్తుంది. మరలాటపుడు వస్తుజ్ఞానం సాపేక్షం అన్నమాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి? వస్తువు యొక్క జ్ఞానం మరొకదాని సంబంధాన్ని అపేక్షిస్తోంది. (కోరుకుంటోంది) అని చెప్పాలనా? అలా అనుకుందాం మాటవరసకు అనుకున్నా, ఏ వస్తు జ్ఞానం లేదా వస్తువుకు సంబంధించిన ఏ జ్ఞానం, మరొక దేనిసంబంధాన్ని కాంక్షిస్తున్నట్లు

క ఇంతకూ జ్ఞానం పరమం కాకపోవడమంటే ఏమిటి? ఏదైనా వస్తువుని తీసుకుని దానికి సంబంధించిన ఏఏ రకాలైన ఎంత జ్ఞానం పొందవచ్చో వివరిస్తూ 'సాపేక్షం', పరమం అన్నవాటి అర్థాలను సరిపెట్టగలరేమో చూడండి.
గమనిక : వేటిగురించైనా తెలుసుకోవడానికి అవసరపడే నాకు తెలిసిన ఒక పరిశీలనా పద్దతిని మీ ముందుంచుతాను. సరిగా ఉందో లేదో చూడండి. దీనికంటే మెరుగైన పద్దతి మీకు తెలుసుంటే నాకు తెలపండి. ఇందులో దోషాలు, లోపాలు ఉన్నా ఎత్తిచూపండి.

1. అదంటే ఏమిటి? 2. ఎక్కడుంది 3. ఎప్పుడుంది 4. ఎలా ఉంది 5. ఎంతుంది 6. దాని గుణాలేమిటి 7. క్రియలేమిటి? 8. దానితో మనకున్న సంబంధమేమిటి? అన్న వీటిని విచారణ (పరిశీలనా) క్షేత్రానికి చెందిన ప్రశ్నష్టకం అనంటారు.
ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడానికై - అంటే ఆ వివరాలు తెలిసికోవడానికై, మనం 'జ్ఞానేంద్రియాలను బుద్ధిని ఉపయోగిస్తాము. ఆయా జ్ఞానేంద్రియాలు అందించిన సమాచారాన్ని బుద్దితో క్రోడీకరించుకుని దానిని గురించిన అవగాహనకు వస్తాము. సాధారణంగా జరిగిపోతుండే ప్రక్రియ ఇదే.
ఉదాహరణకు ఏదైనా ఒక ద్రవ్యంతో చేయబడ్డ నిర్థిష్టాకృతి గల వస్తువును తీసుకున్నామనుకుందాం. వరసగా ప్రశ్నలు వేసుకుంటూ దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
1. అదంటేఏమిటి? బంగారు ద్రవ్యంతో చేయబడ్డ ఉంగరం అనే పేరుతో పిలువబడుతున్న వస్తువు = బంగారు ఉంగరం.
2. ఎక్కడుంది 3 ఎప్పుడుంది ఈ రెండు ప్రశ్నలకు మనకు తెలిసి ఉన్నదాన్ని బట్టి ఇదిగో నా చేతివేలికుందనో, ఆ బల్లపై ఉందనో అది ఉన్న వాస్తవ ప్రదేశాన్ని, ఆ సమయాన్ని గమనిస్తాం లేదా చెపుతాం.
3. ఎలా ఉంది? బంగార మనడానికి తగిన లక్షణంతో కూడిన ద్రవ్యం ఉంగరం ఆకృతిలో ఉంది.
5. ఎంతుంది? ఈ ఎంతుంది అన్నది ద్రవ్య పరిమాణాన్ని (బరువును) అది ఎంత ప్రదేశాన్నాక్రమించి ఉందో ఆ వివరాన్ని చెపుతాం.
మిత్రులారా! మిగిలిన మూడు ప్రశ్నలకూ ఆ వస్తువును చూస్తూ సమాధానాలు రాబట్టగలరేమో చూడండి. ఇలా ఆయా వస్తువుల (విషయాల) గురించి జ్ఞానాన్ని ఆర్జించేటపుడు, 'వస్తుజ్ఞానం సాపేక్షం అన్నమాటను ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా అన్వయించాలో ఆలోచించండి. జ్ఞానం పరమం అంటే ఏమిటి, జ్ఞానం పరమం కాదు అంటే ఏమిటోనో కూడా మీకెలా అర్థమైందో గమనించండి. అభ్యంతరం లేకుంటే ఆ వివరాలు నాకు తెలియజేయండి.
ఇక ఆ వ్యాసంలోని రెండో పేరా ఇలా ఉంది చూడండి.

ఇంగ్లీషులో థింగ్‌కు, ఆబ్జెక్ట్‌ కు తెలుగులో వస్తువు అనే అనువాదాన్ని అనుసరిస్తున్నాం. నిజానికి వస్తువు ఉనికి మొత్తంగా మనకు అందనిది ధింగ్‌ (ంబీశీలిబీశిరిఖీలి ష్ట్రలిబిజిరిశిగి) అందులో పాక్షికంగా అందేది దృశ్యవిషయక వాస్తవికత ....

మిత్రులారా! మొదటి పేరా ద్వారా; అధ్యయనము - విచారణ ఎలా చేయాలో, నేనైతే ఎలా చేస్తానో వివరించాను.
రెండవపేరాను మీరూ అలానేకాని, మీదైన రీతిలోకాని అధ్యయనం చేసి విచారించండి. దానిలో భాషా దోషాలుగానీ, భావపరమైన దోషాలు, లోపాలుగానీ ఉన్నాయో, లేదో పరిశీలించి ప్రకటించండి. ఒక్క విషయం సైద్దాంతికస్థాయికి చెందిన ఏ రచనలనైనా ఇలాగే పరిశీలించాలన్నది నా నిశ్చితాభిప్రాయము. అధ్యయనానికి పనికి వచ్చే కొన్ని మార్గదర్శకాలను మీముందుంచుతాను. జాగ్రత్తగా అర్థం చేసుకుని, అమలు చేసి చూడండి. ఈ విషయన్నంతగా ఎందుకు చెపుతున్నానంటే, చూడవలసినంత జాగ్రత్తగానూ, నిశితంగాను చూడకుండా చదివేసుకుంటూ పోవడం ఉందే అది పాయసంలో తెడ్డులాటి దవుతుంది. పాయసానికి అతి దగ్గరగా ఉండేది, దాని గురించి ఏమి తెలిసికోనిది అనే అర్థంలో ఈ సామెతను వాడతారు. 'దర్వీ పాకరసం యథా' అన్నది నానుడి. అర్థాన్ని గ్రహించకుండ ఊరకే చదువుకుంటూ పోయే వారినీ, అర్థాన్ని పట్టించుకోకుండా బట్టీ పట్టే వాళ్ళనీ ఉద్దేశించి వ్యంగ్యంగా చెప్పుకునే సామెత ఇది.

1. నీవు అధ్యయనం చేయదలచుకున్న పాఠాన్ని గాని, పాఠభాగాన్ని గాని మొదట ఎంపిక చేసుకో.
2. అందులో ఎన్ని వాక్యాలున్నాయోగమనించు (లెక్కించు).
3. ఆ వాక్యాలలో ఎన్ని అర్థమైనాయో గమనించు. ఏమి పదాలు అర్థం కాలేదోనూ గమనించు. ఎందుకంటే పద పదార్థ జ్ఞానం లేనివానికి (ఈ పదానికిదీ అర్థం అని తెలియనివానికి) వాక్యార్థజ్ఞానం కలగదు, అన్నది సార్వత్రిక విలువ కలిగిన భాషానియమం. దాన్ని గాని పట్టించుకోకుంటే ఆపై చేసేదంతా నేలవిడిచిన సామే.
4. వాటి ద్వారా ఎన్ని అభిప్రాయాలు (వీటికి సంబంధించి) ప్రకటింపబడ్డాయో గమనించు.
5. అర్థమైందనుకున్న భావాలలో సత్యాసత్య వివేచనా పద్దతిననుసరించి
1. తప్పులెన్నో 2. ఒప్పులెన్నో 3. ఇంకా తేలనివెన్నో గమనించు
ఇది. ఇదే నాకు తెలిసినంతలో అధ్యయనం సార్థకరూపంలో (దానిసరైన అర్థంలో) కొనసాగించే క్రమవిధానం. ఆవేశకావేషాలకులోనుకాకుండా, రాగద్వేషాలు లేకుండా చేసే అధ్యయనమే సత్ఫలితాలనందిస్తుంది.
గమనిక :- హేతువాదినిగానీ, వివేకపదాన్నిగానీ, మరే రచనైనా ఇలా చదవాల్సిందే. కూలంకుష పరిశీలనకు ఇదొక్కటే మార్గము.

గమనిక  2:- సరైన విమర్శకుడు రచయితకు (వక్తకు) మితృనివంటివాడన్నమాట వాస్తవాన్ని తెలిపేటిదే ఆ విషయాన్నే మరింత గంభీరంగా చెప్పుకోవాలంటే విమర్శకుడు శతృవైనా, మితృడైనా, అతని విమర్శ సరైనదే అయితే, అది రచయితను ఆ రచనను విమర్శతో కలిపి చూస్తున్న పాఠకులకూ కూడా హితాన్నే కలిగిస్తుంది. కనుక స్నేహితుని పాత్రనే పోషిస్తుంది. అనడం బాగుంటుంది. ఇది నిజమా? కదా? ఆలోచించండి.
'హేతువాది' సంపాదక వర్గానికి మరోసారి విజ్ఞప్తి

మరల మరో గెలుకులాటా అంటూ శీర్షిక పెట్టి మీరు ప్రచురించిన వ్యాసం చూసిన వెంటనే వ్యంగ్యోక్తులూ, వ్యక్తిగత విమర్శల జోలికిపోకుండా విషయపరమైన విమర్శకు సిద్దపడడం సరైన దవుతుంది. అలాటి విమర్శకు పూనుకోండి అని వివేక పథం ద్వారా మీకు తెలియజేశాను. ఈ సంచిక చూశాక, మీరు ఆ నా విజ్ఞప్తిని అంతగా పట్టించుకోలేదని అర్థమైంది. అయినా దానికి తగిన రీతిలో ప్రతిస్పందిచకుండా, ఇదిగో మలి విజ్ఞప్తి చేస్తున్నాను మరోసారి. ఈ సంచికలో వెంకటాద్రి గారి పేరన వచ్చిన రెండు రచనల్లోనూ, వ్యంగ్యంతో కూడిన విసుర్లు కొన్ని చోటు చేసుకుని ఉన్నాయి. సంపాదకీయంలో -1. సత్యానికి అర్థమేమిటి? అని అడుగుతూనే శంకరాచార్యుడి సత్యానికి అర్థమేమిటి. పెళ్ళాం బిడ్డల్ని అమ్ముకుని అప్పుతీర్చాడన్న పోర్జరీ హరిశ్చంద్ర నాటకంలోని సత్యానికి అర్థమేమిటి? సత్యాన్వేషణ పేరుతో నానా తంటాలు పడుతున్న వారి సత్యానికి అర్థమేమిటి? సత్యం గోపన్న గొంగళికాదు. నాటకాలతో బూటకాలతో దానితెరలేవదు? అన్నమాటలున్నాయి.

సత్యమంటే ఏమిటన్న విషయంలో మీరూ నేనుగానీ, మరెవరెవరుగానీ చర్చించుకోడానికి, ఇలాటి భాష అవసరమా? విమర్శ, విమర్శకుడూ రచయితకు మిత్రుడే నన్న మీ మాటలకు చేతలకు అనుగుణ్యత ఉందా ఇక్కడ?!

విజ్ఞప్తి :- వ్యంగ్యం మనకొద్దు, వ్యక్తిగత విమర్శలూ అనవసరం. విషయ విమర్శ ఎంత ఘాటుగా, సూటిగా ఉన్నా మేలే.

ప్రత్యేక ప్రకటన :- శాస్త్రీయ దృక్పథము తెలుసుకోవాలన్న కుతూహలం మానవ స్వభావంలోనే ఉంది. అది ఒక ఉద్దేశపూర్వకమైనదిగా మారి నిర్ణీత విషయానికి సంబంధించిందిగా మారినపుడు దానినే మనం జిజ్ఞాస అంటున్నాయి. కుతూహలంలోనూ జిజ్ఞాసలోనూ తెలుసుకోవాలనే అభిలాష సామాన్యమే అయినా, జిజ్ఞాసస్థాయిలో అది ఒకింత ప్రత్యేకతను, తీవ్రతను, నిర్థిష్టతను సంతరించుకుని ఉంటుంది. ప్రకృతిని పరిశీలించడం తొలిదినాలలో ఆశ్చర్యంతో కూడిన కుతూహలం వల్ల ఆరంభమైనా, ప్రకృతి సంబంధంగా ఏర్పడుతూ ఉన్న సుఖ, దుఃఖాల అనుభవం కారణంగా ఆయా విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిశీలించడం మొదలైంది. అది క్రమంగా ఒక క్రమ పద్దతి పరిశీలనకు దారి తీస్తూ వచ్చింది. ఈ థకు చేరాక దానిని కేవలం కుతూహలం అనికాక, జిజ్ఞాస అనడమే సరైంది అవుతుంది.

అందుకే ఈ థకు చేరిన తరవాత చేసే తెలుసుకునే పనికి అన్వేషణ అనే పదం వాడుకలోకి వచ్చింది. ఆ అన్వేషణ కూడా క్రమక్రమంగా ఎప్పటికప్పుడు అప్పటికి అనుసరిస్తున్న పరిశీలనా పరిస్థితిలోని గమనికలోకి వచ్చిన లోటుపాట్లను సరిదిద్దుకుంటూ అదనపు సామర్థ్యాలను జతచేసుకుంటూ ఈనాటికి ఒక స్పష్టమైన, సమర్థవంతమైన విధానాన్ని రూపొందించుకోగలిగింది. దానినే మనమిప్పుడు శాస్త్రీయ (పరిశీలనా) పద్దతి అనంటున్నాం. దానికి అనుబంధంగా మానవికమైన తప్పిదాలు జరక్కుండా ఉండేందుకు తగిన దృక్పధాన్ని కూడా అలవరచుకోవడం అవసరమన్న గమనింపూ కలిగి, పరిశీలకుడు ఎట్టి వైఖరిని కలిగి ఉండాలోనూ స్పష్టంగా నిర్ధారించుకోవడం జరిగింది. దానినే ఈనాడు శాస్త్రీయ దృక్పథం అనంటున్నాము.

ఈ మొత్తాన్ని క్రోడీకరించుకుంటే అన్వేషణ సజావుగా జరగాలంటే అన్వేషకుని మానసిక వైఖరి ఎలా ఉండాలన్నదొకటి, అన్వేషణ ఏ విధానంలో సాగించాలన్నదొకటి కలగలిసి, వైజ్ఞానిక క్షేత్రాలు అనుసరిస్తున్న తీరుతెన్నుల క్రింద చెప్పుకోవడం జరుగుతోంది. ఆ రెంటినీ మనమీనాడు శాస్త్రీయదృక్పథం, శాస్త్రీయ పద్దతి అన్న పేర్లతో పిలుచుకుంటున్నాము.

అన్ని ఉద్యమ క్షేత్రాలలో ఉన్న కార్యకర్తలకూ ఈ రెంటి విషయమై తగినంత అవగాహన కలిగించడానికి అధ్యయన తరగతులను, వినియోగ సామర్థ్యాలు పెరగడానికి అవసరమైన అభ్యాస రూపమైన శిక్షణను కలిగించాల్సిఉంది. ఏయే కారణాల వల్లనైతేనేమి, ఏ ఉద్యమ క్షేత్రాలలోనూ, ఏ సంస్థా తన కార్యకర్తలకు ఈ రెంటినీ అందించడం విషయంలో తగినంత శ్రద్ధ పెట్టడమే లేదు. అసలుకైతే ప్రభుత్వమే పూనుకుని దేశపౌరులందరికీ ఈ దృష్టినలవరచడానికీ, శాస్త్రీయ పద్దతిని గురించిన అవగాహన కలిగించడానికీ తగిన ఏర్పాట్లు విస్తృతంగా చేయాల్సి ఉంది. రాజ్యాంగం ప్రకారం అది ప్రభుత్వ విధుల్లో ఒకటి కూడా ఎలాగంటే, రాజ్యాంగం పౌరుల ప్రాథమిక విధులంటూ అధికరణం 51/ఎ ద్వారా 11 అంశాలను పొందుపరచింది. వాటిలోని 'హెచ్‌' సూత్రీకరణం ప్రకారం, ప్రతిపౌరుడూ, 1 శాస్త్రీయ దృక్పధాన్ని  2. మానవ వాదాన్ని 3. శోధనాతత్వాన్ని (ఊనీలి ఐచీజీరిశి ళితీ లిదీవితిరిజీగి) 4. సంస్కరణ తత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.

మరి ప్రతిపౌరునికీ అత్యంత కీలకమైనవీ, విలువైనవీ అయిన ఇవ్వన్నీ ఎల తెలుస్తాయి? ఎలా అలవడతాయి? ఎలా అభివృద్ధి చెందుతాయి.

ఖచ్చితంగా ప్రభుత్వం పట్టుబట్టి అన్ని ప్రాయాలవారికీ పనికివచ్చేలా వివిధ రీతులలో ఈ విషయాలను తెలియజేయడానికీ, అలవరచడానికీ పెద్ద ఎత్తున పూనుకుంటే తప్ప ఈ లక్ష్యం నెరవేరదు. ఒక వంక ప్రాథమిక విద్యా స్థాయి నుండే క్రమానుగతంగా భావిపౌరులుగ రూపొందాల్సిన బిడ్డలకు ఈ రెంటినీ అందిస్తూ రావాలి. మరో వంక విద్యార్థిగా లేనివాళ్ళకూ, వయోజన విద్యాకేంద్రాల లాంటి వాటి ద్వారానూ, వివిధ స్వచ్చంద సంస్థలతో కలిసి అధ్యయన శిక్షణ కార్యక్రమాలు రూపొందించడం ద్వారానూ, ప్రభుత్వ పరమైన శిక్షణాలయాల ద్వారానూ, గ్రామ అవగాహనా సదస్సుల ద్వారానూ, వివిధ ప్రసార మాద్యమాలద్వారానూ ఇలా రకరకాల ప్రక్రియల ద్వారా ప్రతి పౌరునికీ వీటిని అందించాలి. వ్యవస్థ పూనుకుని అందించకుంటే పౌరులకీ విషయంలో అవగాహనెలా కలుగుతుంది? అభ్యాసమెలా జరుగుతుంది? నిపుణత్వమెలా ఏర్పడుతుంది? మంచి సమాజాన్నాకాంక్షించే ఏ ఉద్యమ సంస్థ అయినా, ఈ విషయంపై పట్టుబట్టి ప్రభుత్వంపై వత్తిడి తేవాల్సి ఉంది. వివిధ స్వచ్చంద సంస్థలు ఐక్యమై కూడా ఈ విషయం వరకైనా కలసి ఉద్యమించడం అవసరం. మంచి పౌరులు ఏర్పడకుండా మంచి సమాజం ఏర్పడడమన్నది ఏ నాటికీ జరగదు. కనుక మంచి పౌరులను రూపొందించుకునే కృషిలో ఎవరివంతు వారు పాలుపంచుకోవడం బుద్దున్న వారందరి కర్తవ్యము.

ఆ కర్తవ్యంలో భాగంగానే, నవంబర్‌ 24న రాజమండ్రిలో జరిగిన హేతువాద మిత్రుల అవగాహనా సదస్సులో వచ్చే సమాజానికి - డిశంబర 22 నాటికి - అందరమూ ఎవరికి వారుగా 'శాస్త్రీయదృక్పథం' అన్న దానిపై కనీసం '5' ఎ4 సైజు పేజీలకు తగ్గకుండా వ్యాసాలు రాసుకురావాలన్న నిర్ణయం చేసుకున్నాము. ఈ విషయాన్ని వివేకపథం పాఠకులకూ తెలియజేస్తే, వారున్నూ శాస్త్రీయ దృక్పథాన్ని గురించి ఇతరులనడిగిగానీ, తగిన సమాచారమున్న గ్రంధాలను చదువుకునిగానీ, సొంతంగా ఆలోచించుకునిగానీ ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాలు పంచుకుంటారని భావించి ఈ సమాచారాన్నీ ప్రచురిస్తున్నాము. జనవరి సంచిక నూతన సంవత్సర శుభాకాంక్షలతోనూ, సంక్రాంతి విప్లవాభినందనలతోనూ శాస్త్రీయ దృక్పథం అన్న అంశాన్నీ ఇముడ్చుకుని ప్రత్యేక సంచికగా మీ ముందుకు వస్తుంది. కనుక మీలో అవగాహన, అభిలాష, సమాజశ్రేయో కాంక్ష ఉన్నవారు, మీ యోపినంత శాస్త్రీయ దృక్పధాన్ని గురించిన వివరాలను డిశంబర్‌ 25 లోపు నాకు చేరేలా లేఖలు వ్రాయండి.
నా చిరునామా:- పుట్టా సురేంద్రబాబు, సత్యాన్వేషణ మండలి, దోరకుంట గ్రామం, కోదాడ మండలం, నల్గొండ జిల్లా.
శాస్త్రీయ దృక్పథం పై అవగాహనకు కొన్ని సూచనలు


  • 1. దృక్పథం అన్న మాటకు అర్థమేమిటి?
  • 2. అది ఆత్మాశ్రయమా? వస్త్వాశ్రయమా? అంటే వ్యక్తిపరమైనదా? విషయపరమైనదా?
  • 3. శాస్త్రీయ మన్న మాటకు అర్థమేమిటి?
  • 4. శాస్త్రీయ దృక్పథానికి పరిశీలనాత్మకత (ఊనీలి ఐచీజీరిశి ళితీ లిదీవితిరిజీగి) కు ఉన్న సంబంధమేమిటి?
  • 5. వైఖరి, మానసిక వైఖరి అన్న మాటలకు అర్థమేమిటి?
  • 6. సంస్కరణ - పునర్నిర్మాణము .... అన్న మాటల అర్థమేమిటి?
  • 7. శాస్త్రీయ దృక్పథంతో ముడిపడి ఉన్న అంశాలేమిటి? దాని క్షేత్ర విస్తృతిఎంత?
  • 8. సత్యాన్వేషణ ప్రక్రియలో శాస్త్రీయ దృక్పథం యొక్క పాత్రేమిటి?
  • 9. శాస్త్రీయ దృక్పథం - వైజ్ఞానిక దృక్పథం అన్న మాటలు ఒకే అర్ధాన్నిస్తాయా?
  • 10. నిష్పాక్షిక దృష్టి అంటే ఏమిటి? తులనాత్మక దృష్టి అన్నమాటకు అర్థమేమిటి?