Showing posts with label 154. Show all posts
Showing posts with label 154. Show all posts

Monday, June 1, 2009

మండలి త్రైమాసిక సమావేశ విశేషాలు-వివరాలు


మండలి త్రైమాసిక సమావేశ విశేషాలు-వివరాలు
ముందుగా ప్రకటించినట్లుగానే సమావేశాలు 26-4-2009 ఉదయం 9 గంటల నుండి ప్రారంభమయ్యాయి. ఎన్నికల ప్రభావం, వేసవి వాతావరణ ప్రభావం సభ్యుల హాజరుపై ప్రభావం చూపింది. వృత్తిరీత్యా ఉపాధ్యాయులుగా వున్న సభ్యులు కొందరు ఎన్నికల కార్యక్షేత్రంలో క్రియాశీలంగా ఉన్న మరికొందరు, వేసవి ఎండలకు ఆరోగ్యం సరిలేక మరికొందరు సమావేశాలకు హాజరు కాలేకపోయారు. ఆ కారణంగా 20 మంది మాత్రమే హాజరయ్యారు.
26-4-09 ఉదయం 9 గంటల నుండి 10-30 గంటల వరకు ఎన్నికల సమీక్ష జరిగింది.

'నూతన వివాహవిధి' స్వరూపం


ముఖ్య గమనికలు
మండలి రూపొందించిన 'నూతన వివాహవిధి' స్వరూపం మీముందుంది. నా అవగాహనకందినంతలో 'వివాహవిధి' అన్నది ఆచరణలోకి వచ్చాక 'ఇదిగో ఇది సమగ్రమైనది' అనదగ్గది ఇప్పటివరకు ఎక్కడా ఏర్పడలా. అలాగే సర్వులూ ఆమోదించేలా ఏ ఒక్కటీ స్థిరపడలా- మారుతున్న దేశకాల పరిస్థితులు, జీవితావసరాలు, సామాజికావసరాలు, విలువలపట్ల అవగాహనలో వస్తున్న మార్పులు, వగైరా, వగైరాలన్నింటి ప్రభావంవల్ల ఏ విధివిధానం ఉనికిలోకి వచ్చినా క్రమంగా ఎక్కడోచోట ఏదోరూపంలో, ఎంతోకొంతమేర మార్పులూ, చేర్పులకు లోనవుతూనే వచ్చింది. ఇప్పుడూ, ఇకముందూ కూడా ఆ క్రమం అలానే కొనసాగుతుంది.

Friday, May 1, 2009

ఉద్యమకారులు పనీపాటా లేనివారా? సమష్టి మేలుకోరేవారా?



ఉద్యమకారులు పనీపాటా లేనివారని, కాలక్షేపం కొరకు వారు ఉద్యమాలు చేపడతారనే అభిప్రాయాన్ని అనేకమంది వ్యక్తంచేస్తుంటారు. వీరిది శాస్త్రీయ దృక్పథమా అంటే నిస్సందేహంగా కాదనే చెప్పాలి. ఉద్యమం అంటే సమష్టికి సంబంధించిన ఒక ఆశయ సాధనకు చేసే సమష్టి, గట్టి ప్రయత్నం. ఆ ఉద్యమంలోని భాగస్వాములు ఫలానా రకానికి చెందినవారని ఊహించి వారి ప్రయత్నాన్ని విమర్శించినందువల్ల రెండు నష్టాలున్నాయి. ఒకటి : విమర్శకు గురైన ఉద్యమకారులు సున్నితత్వం ప్రాబల్యంగా వుంటే వారు ప్రతివిమర్శ తీవ్రస్థాయిలో దిగవచ్చు. లేదా ఉద్యమాల గొడవ మనకెందుకు అనుకుని నిష్క్రియాపరుడిగా మారవచ్చు.

స్పందన-ప్రతిస్పందన



þ వాళ్ళ నుండి ఉలుకూపలుకూ లేదు. ఆ సంస్థకు అధికార ప్రతినిధినన్న ప్రకాష్‌గారుగానీ, ఎవరు పిలిచినా ఒచ్చి క్రైస్తవ సృష్టివాదాన్ని ప్రతిపాదించి నిరూపిస్తానని 'సత్యోదయం' సమావేశంలోనూ, బైబిల్‌లో ఒక తప్పుచూపినా దానిని తగలెట్టేస్తానని విజయవాడలో మండలి తత్వచర్చావేదికలోనూ మాటల్లో అతి సాహసాన్ని కనబరచిన సుధాకర్‌గారుగానీ, మాతోనూ చాలాకాలం సన్నిహితంగా వుండి క్రైస్తవాన్ని భుజానికెత్తుకున్నదేకాక, నేనూ, రహమాన్‌గారూ కలసి గత సం||కాలంగా జరుపుతున్న వేదికలో పాల్గొంటూనే, పరిణామవాదంపై చర్చ ఒక ముగింపుకు వచ్చిన సందర్భంలో, తరువాతి సమావేశం 'క్రైస్తవ సృష్టివాద ప్రతిపాదన-పరీక్ష' కొరకే అనుకునే సమయంలో చర్చావేదిక నియమ నిబంధనలు నిర్ణయమయ్యాక సిద్ధాంత చర్చ చేయడం సరైందికదా అంటూ, క్రైస్తవాన్ని ప్రతిపాదించే పనిని పక్కనబెట్టే పని తెలివిగా చేపట్టిన ఆనంద్‌గానీ, þ పారిపోడంలేదు, భయపడడంలేదు, పనుల వత్తిడిలో వున్నాం, అదవగనే ఖచ్చితంగా మా పక్షాన్ని ప్రతిపాదించుతాం అని ఇ-మెయిల్‌ ద్వారా ప్రకటించిన పేరు, వివరాలు వెల్లడించని మరో అజ్ఞాత þ ప్రతినిధిగారుగానీ, కిమ్మిన్నాస్థిగా ఊరుకున్నారెందుకో అర్థంకాదు. అర్థంకాదంటే ఊహకందటంలేదనిగాదు. ఊరుకోడం వెనక ఒకటికంటే ఎక్కువ కారణాలుండవచ్చన్న ఒక నిజం వుందిగనుక, ఖచ్చితంగా ఏమయ్యుంటుందో తేలలేదనే. నా ఊహకందినంతలో, వారిలో నిజాయితీగానీ, సత్యానికి పెద్దపీట వేయాలన్న అభిలాషగానీ బలంగా లేవు.

మండలి త్రైమాసిక సమావేశ విశేషాలు-వివరాలు


మండలి త్రైమాసిక సమావేశ విశేషాలు-వివరాలు
ముందుగా ప్రకటించినట్లుగానే సమావేశాలు 26-4-2009 ఉదయం 9 గంటల నుండి ప్రారంభమయ్యాయి. ఎన్నికల ప్రభావం, వేసవి వాతావరణ ప్రభావం సభ్యుల హాజరుపై ప్రభావం చూపింది. వృత్తిరీత్యా ఉపాధ్యాయులుగా వున్న సభ్యులు కొందరు ఎన్నికల కార్యక్షేత్రంలో క్రియాశీలంగా ఉన్న మరికొందరు, వేసవి ఎండలకు ఆరోగ్యం సరిలేక మరికొందరు సమావేశాలకు హాజరు కాలేకపోయారు. ఆ కారణంగా 20 మంది మాత్రమే హాజరయ్యారు.

గుంటూరుజిల్లా వివేకపథం పత్రిక పాఠకుల సమావేశం


గుంటూరుజిల్లా
గుంటూరుజిల్లా వివేకపథం పత్రిక పాఠకుల సమావేశం 29-3-2009 ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటలవరకు బాపట్లలో రామానుజ కూటములో జరిగింది. పాఠకులు గుంటూరు, నర్సరావుపేట, పొన్నూరు, బాపట్ల, ఏటిగట్టుపాలెం, కర్లపాలెం, గవినివారిపాలెం మొదలగు ప్రాంతాల నుండి వచ్చారు. ఈ సమావేశమునకు ఉన్న ప్రత్యేకత ఏమంటే, కృష్ణాజిల్లా, ఖమ్మంజిల్లాలలో జరిగిన పాఠక సమావేశాల్లో అక్కడి స్థానికులే ఎక్కువమంది రాగా, ఈ సమావేశాలకు జిల్లాలోని అన్ని ప్రాంతాలనుండి వచ్చారు. అంతేకాక వచ్చిన సభ్యులు విషయం వినటంతోపాటు వారి వారి అభిప్రాయాలు నిక్కచ్చిగా వెలిబుచ్చటంలో ఆసక్తి కనబరిచారు. ఇక వివరాల్లోకి వెళ్తే -

వివేకపథం పాఠకుల సమావేశం-ఖమ్మంజిల్లా నివేదిక - ఎం. నిర్మల్‌కుమార్‌, వై.జగన్మోహనరావు


వివేకపథం పాఠకుల సమావేశం-ఖమ్మంజిల్లా నివేదిక
రిపోర్టర్స్‌ : ఎం. నిర్మల్‌కుమార్‌, వై.జగన్మోహనరావు
ది. 22-3-2009న ఖమ్మం జిల్లాస్థాయి వివేకపథం మాసపత్రిక పాఠకుల సమావేశం సత్తుపల్లిలోని ఎస్‌.ఎస్‌.ఆర్‌. జూనియర్‌ కళాశాలలో ఉదయం గం|| 9-45 నుండి సాయంత్రం 6-15 వరకు జరిగింది. సత్యాన్వేషణ మండలి రాష్ట్ర బాధ్యులు కె. ప్రసాద్‌, సిహెచ్‌.నాగార్జునలు వక్తలుగా పాల్గొనగా, జగన్‌గారు ఈ సమావేశానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. చెరుకూరి వెంకట్రామయ్యగారు సమావేశానికి అధ్యక్షత వహించారు. దాదాపు ముప్పైమంది పాఠకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సభికులందరూ తమకు సత్యాన్వేషణ మండలి మరియు వివేకపథం పత్రికలు ఏ విధంగా పరిచయమయ్యాయో తెలియచెపుతూ తమ సొంత పరిచయం కూడా చేసుకున్నారు. హేతువాద ఉద్యమాలద్వారా, కమ్యూనిస్టు ఉద్యమాలద్వారా శాస్త్రీయ ఆలోచనామార్గంలో పయనించడం ప్రారంభించిన తాము ఆ మార్గంలో ఈ సంస్థకు దగ్గరయ్యామని ఎక్కువమంది తెలిపారు. మరికొందరు మితృల సలహాలతో మండలి సమావేశాలకు హాజరై క్రమంగా ఈ సంస్థ భావజాలానికి ఆకర్షితులమయ్యామని కొందరు తెలిపారు. ఏ భావాలు మంచివో, ఏ భావాలు వాస్తవాలను ప్రతిబింబిస్తాయో, సత్యం తెలుసుకోవడం ఎలాగో, తెలుసుకొనేముందు సరైన మార్గాన ప్రయాణించేందుకు వివేకపథం పత్రిక ఉపయోగపడుతుందని సభికులు తెలిపారు. సీనియర్‌ హేతువాడివెంకటేశ్వరరావుగారు (వెల్‌కమ్‌ హోటల్‌) పత్రిక, మండలిపట్ల సానుకూల దృక్పథం కలిగివున్నట్లు చెప్పారు.

ఉద్యమకారులు పనీపాటా లేనివారా? సమష్టి మేలుకోరేవారా?



ఉద్యమకారులు పనీపాటా లేనివారని, కాలక్షేపం కొరకు వారు ఉద్యమాలు చేపడతారనే అభిప్రాయాన్ని అనేకమంది వ్యక్తంచేస్తుంటారు. వీరిది శాస్త్రీయ దృక్పథమా అంటే నిస్సందేహంగా కాదనే చెప్పాలి. ఉద్యమం అంటే సమష్టికి సంబంధించిన ఒక ఆశయ సాధనకు చేసే సమష్టి, గట్టి ప్రయత్నం. ఆ ఉద్యమంలోని భాగస్వాములు ఫలానా రకానికి చెందినవారని ఊహించి వారి ప్రయత్నాన్ని విమర్శించినందువల్ల రెండు నష్టాలున్నాయి. ఒకటి : విమర్శకు గురైన ఉద్యమకారులు సున్నితత్వం ప్రాబల్యంగా వుంటే వారు ప్రతివిమర్శ తీవ్రస్థాయిలో దిగవచ్చు. లేదా ఉద్యమాల గొడవ మనకెందుకు అనుకుని నిష్క్రియాపరుడిగా మారవచ్చు. తద్వారా ఉద్యమమూ కుంటుబడుతుంది.

ప్రజాస్వామ్యం - అసలు, నకిలీ ఎన్నికలు - నాయకులు - పార్టీలు : సంపాదకీయం



ప్రజాస్వామ్యాన్ని ఎలాగోలా బలపడకుండా చూస్తూ వుందాం, చూసుకుంటూ వుందాం అన్నంతవరకు ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా సంఘటితంగా కృషిచేస్తున్న అన్ని పార్టీలూ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది అంటూ ప్రకటించడం దానికదే ఒక పెద్ద విడ్డూరం. ప్రజాస్వామ్యమంటే ఏమిటన్నది అంటున్నవాడికీ, వింటున్నవాడికీ కూడా తెలియనంతకాలం జనానికి ఇలాంటి విడ్డూరాలు పట్టిచూపించినా విడ్డూరాలుగానే కనిపించవు. చెవినిల్లుకట్టుకుని వినిపించినా వినిపించవు. ఇదో విషాదం.