యోచనాశీలురైన పాఠక మిత్రులారా! సమాజ హితైషులారా!
మంచి సమాజం అంతిమ లక్ష్యంగా (ఆదర్శంగా) మెరుగైన సమాజం ... లక్ష్యంగా రాబోయే పదేండ్లు పాటు కాలం విధిగా కలసి గట్టి కృషి చేయాలన్న ఆలోచన ఉద్యమ క్షేత్రాలలో రెండు మూడు థాబ్ధాలుగా పని చేస్తున్న కొంత మందిలో చోటు చేసుకుంది. అందులోని కొందరిలో అది మరింతగా దృఢపడి ఆ దిశగా ఆరంభయత్నాలూ మొదలెట్టించింది. ఆ లక్ష్యాల కొరకు మనం....
1. ఎందుకు పని చేయాలి అన్న దగ్గర మాలో ఎటువంటి సందిగ్దం లేదు సరికదా స్పష్టమైన రీతిలో ఏకాభిప్రాయం ఉంది.
2. ఇక ఏమి చేయాలి? ఎలా చేయాలి? అన్న దగ్గర ఇప్పటికి ఎవరి ఆలోచనలు వారికున్నాయి. అయితే, కలసి పని చేయాలంటే, ఇక్కడ ఏకాభిప్రాయం అవసరం (తప్పనిసరి) కనుక, ఏకాభిప్రాయ సాధన కొరకుగా కొంత కృసి చేద్దామనుకున్నాము. అందుకై, ముందుగా ఎవరి ఆలోచనలను వారి ప్రతిపాదన రూపంగా వ్రాసుకొచ్చి, ఒక్కోదానిని ఉమ్మడి పరిశీలనకకు పెట్టి, ఆ పరిశీలన నుండి అందరి అంగీకరించగల ఒక భావజాలాన్ని (సిద్దాంతము. ఆచరణ అన్న రెండు భాగాలుగల భావజాలాన్ని) ఆవిష్కరించుకుందాం అనుకున్నాము. అదిగో, ఆ పనిలో నా వంతు భాగంగా నా పక్షాన్న మీ ముందు ఉంచుతున్నాను.
వివేక చతురులైన మీరు దీనిని రాగద్వేష రహితంగా విచారించి దీని బాగోగులను సమీక్షించండి. వీలైన మార్పులూ, చేర్పులు (దోషాలు, లోపాలు) ఉన్నాయనిపిస్తే నాకు అందజేయండి. బాగుందనిపిస్తే, ఈ ఉద్యమ కార్యంలో భాగస్వాములు కండి.
1. ఇప్పటికి మాకున్న సమానభావాలు :
1. ఉత్తమ సమాజమనగా, అందరికీ విద్య, ఉపాది, భద్రతలతో పాటు, అధికారంలోనూ, సంపదలోనూ యోగ్యమైన భాగస్వామ్యం ఉన్న సమాజమని.
2. ఉత్తమ సమాజ మనగా సమస్యలులేని సమాజం. అందులో తెచ్చిపెట్టుకున్న సమస్యలు ఉండవు. అలా ఉన్నవాటిని పరిష్కరించుకుంటూ ఉంటుంది. వచ్చిపడే వాటిని ఎదుర్కొడానికి సంసిద్ధంగా ఉంటుంది.
3. ఇట్టి ఉత్తమ సమాజ సాధనలో, తెచ్చిపెట్టుకున్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత నివ్వడం జరుగుతుంటుంది.
గమనిక :- పై నిర్వచనాన్ని మేమందరం అంగీకరించి, ఆ లక్ష్యాన్ని సాధించుకునే దిశగా, రాజ్యాంగ పరిధికి లోబడి, కనీసం రాబోయే పది సంవత్సరాల కాలం పాటు చేయగల, చేయదగిన కార్యక్రమాన్ని నిర్ణయించుకోడానికి సిద్దమయ్యాము. అందుకే ఎవరికి వారంగా ఆలోచించుకుని రావలసిన అంశాలన్ని యిలా వ్రాసుకున్నాం.
2. 1. సమాజంలోని ఉండకూడని తనానికంతటికీ మూల సమస్య ఉన్న దగ్గదేమిటి?
2. దానివల్ల సమాజానికి జరుగుతున్న కష్ట, నష్టాలేమిటి?
3. ఆ సమస్యనుత్పన్నం చేస్తున్న కారణం (కారణాలు) ఏమిటి?
4. ఆ సమస్యా పరిస్కారానికి మీరు బాపిస్తున్న నివారణోనాయం ఏమిటి?
5. ఆ సమస్య పరిష్కారమైతే ఒకనాడే ప్రయోజనాలు ఏర్పడేపరిస్థితులు ఏమిటి?
అన్న వాటికి సంబంధించి ఎవరి పక్షాన్న వారం వ్రాసుకొచ్చి పరిశీలించుదాం అనుకున్నాం. అందులో నా పక్షాన్న మా మిత్ర బృందానికేగాక, యోచనా పరులైన మీ విచారణకు పెడదాం అనిపించడంలో ఈ వ్యాసం ఈ విధంగా మీ ముందుకొచ్చింది. మెరుగైన పైరసమాజ నిర్మాణానికి అవసరమైన అవగాహన భాగము - కార్యాచరణ భాగము కూడా కలిసి ఉన్న ఈ వ్యాసం నా దృష్టిలో చాలా విలువైనది, కీలకమైనది కూడా. కనుక దీనిని మామూలు వ్యాసంగా కాక, ఒక సిద్దాంత వ్యాసంగా పరిగణించి, కూలంకుషంగా పరిశీలించి మీ మీ విమర్శలను పంపండి.
ఉపోద్ఘాతం :-
1. సామాజిక సమస్యలన్నింటికీ కారణం అటు వ్యవస్ధలోగాని ఇటు వ్యక్తులలో గానీ దోషాల, లోపాలు ఉండడమే.
2. వ్యవస్ధలో ఉండకూడని తనానికి కారణం, ప్రధాన ఒప్పందం (మనకు సంబంధించి నంతలో భారత రాజ్యాంగమే ఒప్పందం) లోనే దోషాలో, లోపాలో ఉండడం.
3. వ్యవస్ధ నిర్వహణ భాగాలలో పని చేస్తుంటే వారిలోని అవగాహనా లోపం వల్లగాని, వ్యక్తిత్వాలలోని బలహీనతల వల్లగాని, వారి వారి విధి నిర్వహణలో దోషాలు, లోపాలు ఉండడం.
3. 1. పౌరబాధ్యత :- వీటన్నింటికితోడు, ఈ వ్యవహారమంతా ఎవరి యోగక్షేమాల కొరకు రూపొందించుకున్నామో ఆ ప్రజల (పౌరులు) అవగాహనా రహితులు, చైతన్య రహితులునై, స్వార్ధప్రయోజనాలకు పరిమితులై, వివిధ ధోరణుల నేతలకు ఉపకరణాలుగా మారి ఉండడం జరుగుతోంది.
అయితే ఇదంతా ఎందుకు జరుగుతున్నట్లు?
గమనిక :- నాకు తెలిసినంతలో ఈ ప్రశ్నే అన్నింటికంటే పెద్ద ప్రశ్న. దీనికి సమాధానం రాబట్టడమే ఈ వ్యాసపు ముఖ్య లక్ష్యాలలో ఒకటిగా ఉంది. అయినా సూత్రప్రాయంగా నా సమాధానం ఇదిగో,
వ్యక్తులలో దోషాలు, లోపాలు ఉండడానికి కారణాలు.
1. వివేకానికంటే ఇష్టాఇష్టాలకే పెద్దపీట వేసే మానవస్వభావం.
2. అట్టి స్వభావాన్ని నియంత్రించడానికి తగిన విద్యగాని, శిక్షణగానీ, అనుకూల పరిస్థితులు గానీ తగినంతగా లేకుండడం.
3. ఇష్టా ఇష్టాలకు అనుగుణ్యంగా ఉండే బలాన్నిచ్చే విద్య, శిక్షణ, పరిస్థితులే ఎక్కువగా ఉండడం.
4. మరోవంక పట్టుబట్టి సమాజంలోని వివిధ ధోరణుల నేతలు, ప్రచారకులు, ప్రజలలో రకరకాల విశ్వాసాలను ఒప్పించి వారిని వేరు వేరు సమూహాలుగా విడదీయడం.
సూత్రీకరణ :- పై వివరాలన్నీ (1) అటు జ్ఞానభాగంలోనో (2) ఇటు ఆచరణ భాగంలోనో దోషాలు, లోపాలు ఉంటేనే ఇదంతా జరుగుతుంటుంది. అని నిర్ధారిస్తున్నాయి. ఇందులో (1) ఆశయధర్మాలు (ఎయిము) & ఆబ్జెక్ట్సు; (2) నియమనిబంధనలు (నియమాలు - వినిమయాలు) (రూల్సు) & రెగ్యులేషన్స్) అన్నవి సిద్ధాంత (జ్ఞాన) భాగం క్రిందికి వస్తాయి.
(1) వ్యవస్ధ నిర్వహణ భాగంలోని ఉద్యోగులు, (2) పౌరులు, ఆచరణ భాగంలోకి వస్తారు.
3. మెరుగైన పైర సమాజం ఆకృతి దాల్చాలంటే;
1. ఒప్పందపు ఉద్దేశభాగంలో; ప్రజలంతా ఒక్కటే, అందరికీ సమానావకాశాలుండాలి. అందరూ అభివృద్ధి చెందాలి, కృత్రిమ అసమానతలుండరాదు, అసమానాభివృద్ధికి దారితీసే పరిస్థితులుండరాదు. సమానాభివృద్ధి, సమాన భాగస్వామ్యము అన్న వాటికి అనుకూలమైన వాతావరణం ఉండాలి. అనివార్యంగా చోటు చేసుకుంటుంటే అసమానతలను తగ్గిస్తుండడానికే, వీలైతే తొలగించుకోడానికీ అవసరమైన విధి విధానాలూ వ్యవస్థలో ఉండాలి అని చెపుతూ, అందుకుతగిన మార్గ దర్శకాలు కూడా చోటు చేసుకుని ఉండాలి.
2. వ్యవస్ధకు సంబంధించినంతలో (ఎ) ఆయా పాత్రలు పోషించేవారికి ఉండవలసిన అర్హతలు (బి) వారి విధులు (సి) విధులు నిర్వర్తించడానికి తగిన అధికారాలు ఉంటాయి.
3. వ్యక్తులకు (పౌరునిగా) వారికి హక్కులు - విధులూ ఉంటాయి.
గమనిక :- రెండు విభాగాలలోని వారూ హక్కులను - విధులను అతిక్రమించకుడదు.
మెలగవలసిదంటూ బాధ్యతను గురించీ చెప్పబడుతుంది. మెరుగైన పౌర సమాజంలోని పౌరులు అఒప్పందాన్నతిక్రమించకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తుంటారు. మిత్రులారా! ఈ రెండు విభాగాలలోని దోషాలు, లోపాలే సమాజంలోని దోషాలు లోపాలకు (సమస్యలకు, ఉండగూడనివి ఉండడానికి) కారణాలుతుంటాయి. ఇంత వరకు చెప్పుకున్నదంతా వాస్తవమో కాదో (యద్ధార్ధమో కాదో) నిర్ణయించండి. ఇక్కడి వరకు మన మంతా ఏకాభిప్రాయానికి రాగలిగితే గాని, ఆపై చేయాల్సిన విచారణ .... సాగదు. ఈ విషయానికి సంబంధించినంతలో, పూర్వ నిశ్చితాభిప్రాయాలతో కూడిన రాగద్వేషాలను ప్రక్కన బెట్టకుంటే విచారణ నిస్పాక్షకంగా చేయలేము.
ప్రధాన ప్రతిపాదన
పైన ఉపోద్ఘాతంలో చెప్పుకున్న దాన్ననుసరించి ఇప్పుడున్న సామాజిక అస్తవ్యస్ధతలకు రాజ్యాంగం కారణమా? అని చూస్తే కాదని అనిపిస్తుంది.
అలాగే రాజ్యాంగాన్ని తు.చ తప్పకుండ అమలు చేయగలిగితే ఇంతకంటే మెరుగైన సమాజం రూపొందుతుందా? లేదా? అనంటే, ఖచ్ఛితంగా రూపొందుతుంది. అనిపిస్తోంది. అనిపిస్తోంది అనేకంటే, అనకతప్పదు అనడం మరింత సబబు. ఎలాగంటే
మన భారత - రాజ్యాంగంలో
1. ఉద్ధేశస్ధానంలో; అంటే 'అవతా..క' లేదా 'ప్రస్తావన' లేదా 'పీఠిక' అన్న భాగంలో
భారతదేశ ప్రజలమగు మేము, ఈ దేశమును, సార్వభౌమ్య, సామ్యవాద లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగ ఏర్పరచుకొనుటకు తీర్మానించుకుని ఇందలి పౌరులందరకూ,
సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయమును,
భావప్రకటన, విశ్వాసము, మత విశ్వాసము ఆరాధనల పరమైన స్వేచ్ఛను
అంతస్తులోనూ, అవకాశములలోనూ సమానత్వమును
ప్రతి వ్యక్తికీ గౌరవమును, జాతి ఐక్యత, అఖండతలను చేకూర్చు సోదర భావమును పెంపొందిచునట్లు (నెలకొనునట్లు) ప్రతి ఒక్కరమూ చేయుదమని సత్య నిష్ఠా పూర్వకంగా తీర్మానించుకుని 1949 సంవత్సరము నవంబరు 26వ దినమున రాజ్యాంగ సభయందు అది శాసనముగా అంగీకరించి, మాకు మేము ఇచ్చుకున్నాము అని వ్రాసుకున్నాం. భారత రాజ్యాంగం పేరున పిలువబడుతున్న మనందరిదైన ఈ ఒప్పందాన్ని అతిక్రమించమని, అనుసరిస్తూ, అనుసరింపజేస్తామని ప్రతిజ్ఞ చేయడం ప్రతి పౌరుని ప్రప్రథమ కర్తవ్యం.
మిత్రులారా! ఒక సమూహపు అవసరాలు మరియు దాని అభివృద్ధికి సంబంధించి వారి మధ్య నున్న ఒప్పందపు లక్ష్యంగా, ఇంతకంటే మెరగైన ఆకాంక్షను పెట్టగలమేమో ఆలోచించి చూడండి. అలాంటిది మీ ఆలోచనకు అయితే మాకు తెలియజేయండి. ఈ సందర్భంలో గుర్తుంచుకోవలసిన ఒక తాత్విక సూత్రీకరణను చూడండి.
సూత్రం :- ఆచరణ సాధ్యం కాని ఉత్తమ భావనకంటే, ఆచరణ సాధ్యమైన మధ్యమస్ధాయి భావన, వినియోగానికి తెచ్చుకునే సందర్భంలో ఉత్తమమైనదవుతుంది. లేదా ప్రధమగణ్యం అవుతుంది.
రాజ్యాంగాన్ని గురించి సరైన అవగాహన కలిగించుకోడానికి వీలుగా ఉండే ఒకటిరెండు విజ్ఞులు అభిప్రాయాలను ఉట్టంవేస్తాను, వాటినీచేకొని రాజ్యాంగాన్ని చూడండి.
1. మనం రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అంటే, రాజకీయ, ఆర్ధిక, సాంఘిక పరమైన ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచుకున్నాం. అని అంబేద్కర్ అన్నారు.
2. సమానత్వ, సౌబ్రాతృత్వములతో సమన్వయమైన రాజకీయ, ఆర్థిక, సాంఘిక ప్రజాస్వామ్య ఉద్దేశాలను కలగలపడం తన స్వప్పంగా గాంధీజీ భావించారు.
3. రాజ్యాంగంలో అవతారిక చాలా విలువైన భాగం. అది మన రాజ్యాంగపు ఆత్మ అనవచ్చు. రాజ్యాంగ విలువలను మదింపు వేయడంలో అవతారికే గీటురాయి. అది రాజ్యాంగానికి తాళం వంటిది. రాజ్యాంగంలోని అధికరణాలన్ని అవతారిక అనే గీటు రాయితో నిర్ధారింపబడి ఉంటాయి. అందుచేత రాజ్యాంగంలోని నిబంధనలన్నింటిని అవతారిక అనే గీటురాయిని ఉపయోగించే పరీక్షించాల్సి ఉంటుంది. ఆ విధంగనే రాజ్యాంగంలోని నిబంధనలు మంచివా? కావా? అను విషయాన్ని నిర్ధారించాలి. అలా డాకూర్ దానే బార్గవ నవంబర్ 18 1949న రాజ్యాంగ నిర్మాణ శాసనసభలో పేర్కొన్నారు.
4. అవతారిక ప్రకారం రాజ్యాంగాధికారం ప్రజల నుండి సంక్రమించిందే (అంటే వ్యవస్ధలోని ఎవరికి గాని ప్రతికారం ప్రజలంగీకారంతో సంక్రమించిందేనన్న మాట) నని సుప్రీంకోర్టు ప్రకటించింది.
గమనిక :- ఇలా మన రాజ్యాంగాన్ని గురించి ఎందరో విజ్ఞులు వెలిబుచ్చిన అభిప్రాయాలు లెక్కకుమించినివిగా ఉన్నాయి. వారన్నారనిగాని, అంత మంది ఉన్నారని గాని గాక, వాటి స్వరూప, స్వభావాలలోనే ఆ విశాల, విజ్ఞత చోటు చేసుకుని ఉందనే, నేను దానిని, మెరుగైన పౌరుసమాజస్ధాపనకు సరిపోతుందని చెపుతున్నాను. మీరూ అవతారికను ఒక్కసారి సావధానంగా పట్టిచూడండి.
ఆజీరిగిబిళీలీజిలి
ఇలి, ఊనీలి చీలిళిచీజిలి ళితీ |దీఖిరిబి నీబిఖీరిదీవీ రీళిజిలిళీదీజిగి జీలిరీళిజిలి.. శిళి బీళిదీరీశిరిశితిశిలి |దీఖిరిబి రిదీశిళిచీ బి రీళిఖీలిజీలిరివీదీ, రీళిబీరిబిజిరిరీశి, రీలిబీతిజిబిజీ, ఖిలిదీళిజీజీబిశిరిబీ, జీలిచీతిలీజిరిబీ బిదీఖి శిళి రీలిబీతిజీలి శిళి బిజిజి తిరీ బీరిశిరిచిలిదీరీ.
శీతిరీశిరిబీలి, జిరిలీలిజీశిగి, లివితిబిజిరిశిగి, తీజీబిశిలిజీదీరిశిగి
సమాజానికి రాజ్యాంగ బద్దంగనే ఎంతో చేయగలమని నేనంటున్నానంటే, మన రాజ్యాంగం సర్వ సమగ్రమైనది, సర్వ సంపూర్ణమైనది అని నేనంటున్నట్లు కాదు. నా దృష్టిలో మన రాజ్యాంగం చాల వరకు మెరగైనదే, అంతేకాక దాని బలమంతా, దేశ కాలానుగుణ్యంగా అవసరమైన మార్పులు, చేర్పూలు చేసుకోవచ్చుననీ, అయితే ఆ మార్పులేవీ రాజ్యాంగ హృదయమైన అవతారిక స్వభావానికి ప్రతికూలంగా కాక, అనుకూలంగా మాత్రమే ఉండేలా చూసుకోవాలనీ ఆదేశించడంలో ఉంది. ఆ సూత్రీకరణను పొందుపరచడంలో రాజ్యాంగ నిర్మాణ సభ ఎంతో శాస్త్రీయ దృక్పధాన్ని, పరిణితి చెందిన విజ్ఞతను చూపింది. అంతటి విజ్ఞతను ప్రదర్శించిన వారందరికీ కృతజ్ఞతా సూచకంగా అభినందనలు తెలుపుకోవడం మనందరిపై నున్న కనీస బాధ్యత.
కనుక మన రాజ్యాంగం మెరుగైన పౌర సమాజ స్థాపనకు తగిందిగానూ, క్రమాభివృద్ధిగా ఉత్తమ సమాజామన్న ఆ ధర్మానికి చేరువైయ్యేందుకు చాల వరకు దిశా నిర్ధేశం చేయగలిగిందిగానూ ఉందంటున్నాను. దీన్నంతటినీ దృష్టిలో పెట్టుకునే ప్రస్తుత సామాజక అస్తవ్యస్థతలకు ఒప్పందంలోని అంశాలు కారణం కాదని, ఒక రకమైన వ్యక్తులలోని ప్రవర్తనే కారణమని చెపుతున్నాను.
సూత్రం :- సామాజిక సమస్యలన్నింటికీ ఒకరకమైన మనిషే వ్యక్తి కారణం అవుతున్నాడు. కనుక మరోరకమైన వ్యక్తే మనిషే పరిష్కారానికి కారణం కాగలుగుతాడు.
ప్రస్తుత సమాజం - ఒక పరిశీలన
1.ఈనాటి సమాజంలో ఉండకూడని పరిస్థితులు :- సాంఘిక, ఆర్ధిక, రాజకీయ క్షేత్రాలలో వ్యక్తులమధ్య విపరీతమైన అసమానతలున్నాయి.
2. ఎందువల్ల ఉన్నాయి? అంటే సమస్య ఏమిటి?
జ. రాజ్యాంగం నిర్ధేశిస్తున్న రీతిలో, స్థాయిలో వ్యవస్ధలోని ఆయా స్ధానాలలో ఉన్న వ్యక్తులుగానీ, ప్రజలుగానీ ప్రవర్తించకపోవడమేగాక, తద్విరుద్దంగా ప్రవర్తిస్తూండడమే
3. సమస్యకు కారణం ఏమిటి?
జ. వ్యక్తికి, రాజ్యాంగానికి సంబంధించిన, మరియు సహజన్యాయ సూత్రాలకు సంబంధించిన అవగాహన లేకపోవడం, ఆ అవగాహన ప్రాతిపదికగా వ్యక్తిత్వాలను రూపొందించే విద్యగాని, శిక్షణగాని, అనుకూల పరిస్థితులుగాని లేకపోవడంమే తద్వతిరేకంగా ఉండడమే అస్సలు కారణం.
గమనిక :- అంటే, భారత రాజ్యాంగం ఆశించిన రీతిలో మసలుకోగల అవగాహన, వ్యక్తిత్వము, అనుకూల వాతావరణం లేకపోవడం, తద్వతిరేకంగా మసలుకోడానికి తగిన అవగాహన, మూర్తి....., అనుకూలపరిస్థితులు ఉండడం వల్లనే వ్యక్తులు రాజ్యాంగ విరుద్దంగా ప్రవర్తిస్తున్నారు.
మండలి తాత్విక సూత్రీకరణ
జీవితాన్ని సక్రమంగా అర్ధం చేసుకుని, ఆ అవగాహన చూపిన బాటలో నడవటానికి సాధన చేస్తూ, ఇతరులకూ ఆ అవగాహన కలిగించేందుకు, తదనుగుణ్యంగా జీవించేలా సాధన చేయమని వత్తిడి చేస్తూ, అందుకవసరమైన వాతావరణాన్ని ఏర్పరచుకుంటూ సాగుతుండాలి. ఇంతకంటే వ్యక్తి జీవించగల సవ్యమైన జీవితం మరోటి లేదు.
1. జీవితాన్ని సక్రమంగా అర్ధం చేసుకోవడమంటే ఏమిటి?
వ్యక్తి :- సమాజము-ప్రకృతి, వాటి మధ్య ఉన్న సంబంధాలు, అందులో ఉండకూడనివి ఏమిటో, అవెందుకున్నాయో, వాటిని తొలగించుకోవడం ఎలానో, అలాగే ఉండవలసిన వేమిటో అందులో లేనివేమిటో అవి ఎందుకు లేవో తెలుసుకుని, వాటిని తెచ్చుకోవడమెలాగోనూ, తెలుసుకుని ఆ వెలుగులో తదనుగుణంగా ఉండగూడని వాటిని పోగొట్టుకోడానికి, మరల రాకుండా చూసుకోడానికి, అలాగే ఉండవలసిన వటిని తెచ్చుకోడానికి, మరల పోకుండా చూసుకోడానికి, తగిన యత్నం తాను చేస్తూ, ఇతరుల చేత చేయించడానికి యత్నిస్తూండడము సరైనదన్నది తెలుసుకుని ఉండడం.
వ్యక్తికి సమాజము ప్రకృతి అన్న రెంటి సంబంధంలో ఇచ్చి పుచ్చుకోడమే జరుగుతుంటుంది. కనుక ఇంటికి ఇవ్వవలసింది ఇవ్వవలసినంతాఇస్తుండడం, ఇవ్వకూడనిది ఇవ్వకుండడంతోపాటు వాటి నుండి తాను పుచ్చుకోవలసింది పుచ్చుకోవలసినంతే పుచ్చుకుంటుండడం, పుచ్చుకోకూడదనిది పుచ్చుకోకుండడం అన్న విధానం ప్రతి ఒక్కరు ఆచరణలో పెడుతుంటూ సమాజంలో మానవకృత సమస్యలంటూ ఏమి పుట్టవు.
ఇదంతా ఒప్పుజ్ఞానము (సత్యం) పునాదిగా, విహితకర్మ - ధర్మాచరణ - చేయడం ద్వారానే సాధ్యపడుతుంది. కనుక సంఘ జీవితాన్ని గురించి వ్యక్తులకు తగినంత అవగాహన కలిగించడం, దానికనుగుణ్యంగా ప్రవర్తించే వ్యక్తిత్వాలను శిక్షణ ద్వారా నిర్మాణం చేయడం, అలాగే అనుసరించేందుకు తగిన అనుకూల వాతావరణాన్ని సృష్టించుకోవడం. ఇదే ఇదే ముమ్మాటికీ ఇదే సామాజిక సమస్యలన్నింటికీ సరైన శాశ్వతమైన పరిష్కారం.
వ్యక్తి బ్రతుకవసరాలు సహజాకాంక్షలన్న దగ్గర '5' ఉన్నాయి.
(1) ఉండాలని ఉంది. (2) హాయిగా ఉండాలనుంది (3) ఎదగాలనుంది(4) గుర్తింపు పొందాలని ఉంది (5) ఈ నాలుగూ జరుగుతున్నట్లు తెలుస్తూ ఉండాలనుంది.
ఇదిగో వీటికోసమే మనిషి బ్రతుకకుతున్నాడు. ఇవి రావలసిన రీతిలో, రావలసినంతా సరళంగా వస్తుంటే సుఖశాంతులను పొందుతూ తృప్తిగా జీవిస్తున్నాడు. లేకుంటే అసంతృప్తితో, అశాంతితో బ్రతుకుతున్నాడు. ఇంకా ప్రతికూలత ఉంటే దుఃఖంతో అశాంతితో బ్రతుకుతూ వీటిని తొలగించుకోడానికీ, పై వాటిని సాధించుకోడానికీ శ్రమిస్తుంటాడు. ఇదే జీవితం.
ఏ మనిషైనా చేస్తుండే పని, ఇది మానవ జీవితంలో అనివార్యంగా జరిగే సహజ ప్రక్రియ దీనిని కక్షుణ్ణంగా పరిశీలించి అర్ధం చేసుకున్నవారు, పరిశీలించని వారూ ఇరువురూ వీటి కోసమే శ్రమిస్తుంటారు. అయితే వీటి గురించి తగినంత అవగాహన (వివేకబలం) ఉన్న వారికీ అది లేని వారికీ ఇచ్చుపుచ్చుకునే సంబంధాల నెరవేర్చుటలో చాలా వ్యత్యాసం ఉంటుంది. వివేక బలం ఉన్న వారు ఇచ్చిపుచ్చుకునే ప్రక్రియలో సమతూకం పాటించేందుకు సిద్ధపడి యత్నిస్తుండగా, అది లేని వారు ఇచ్చుపుచ్చుకుని విషయంలో తగినంత ఇవ్వడానికి ఇష్టపడక, అందినంత పుచ్చుకోడానికి ఇష్టపడుతూ పరిస్ధితిలో అసమతూకం ఏర్పరడానికి, సమతూకం దెబ్బతినడానికి కారణమవుతుంటాడు.
సూత్రం :- నిజానికి వ్యక్తిలోని ఈ వైఖరి అతని స్వభావంలో ఉన్నది. ఎదగాలనుంది ఉన్న అకాంక్ష నెరవేరాలంటే ఉన్న దానిలో తరిగేది తక్కువగానూ, చేరేది ఎక్కువగానూ ఉంటుండాలి. అప్పుడే ఎదుగుదల అన్నది సాధ్యపడుతుంది. అయితే వివేకరహితుడు (అవగాహన లేనివాడు) వైయక్తిక ఎదుగుదల వరకే దృష్టి పెట్టుకుని ఉంటారు. వివేక సమిష్టి ఎదుగుదలలో భాగంగా తన ఎదుగుదలను అంగీకరించి, ఆ మేరకు వైయక్తిక ఎదుగుదలకు పరిమితిని విధించుకోడానికి సిద్ధపడగలుగుతారు.
కనుక వ్యక్తులలో సమిష్టి భావన లేకపోవడం, కొరవడి ఉండడం అన్నదే అన్ని సమస్యలకూ మూలకారణం అవుతోంది. ఆ భావన దానంతటన అది రాదు. వ్యక్తిని సంఘజీవిగా రూపొందించడానికి తగిన విద్య, శిక్షణ జరిపి, అలాగే మసలుకోడానికి తగిన వాతావరణాన్ని ఏర్పరచుకోవాల్సి ఉంది. పరిష్కారం ఇదొక్కటే, దీనిని సాధించుకోడానికి, సామాజకంగా అమలు అయ్యేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందిచుకుని దాని ప్రకారం నడకసాగించడమే మనం చేయవలసింది.
అయితే చేయవలసిన కార్యం చేయవలసి ఉన్నంత పెద్దఎత్తున, అంటే సమాజం మొత్తానికీ వర్తించేలా చేయాలంటే పాలన నిర్వహణ భాగాలతో కూడిన వ్యవస్ధలోనికే దానిని ప్రవేశపెట్టగలగాలి. మరి ఆ పని జరగాలంటే పాలన నిర్వహణ భాగాలలోనికి సమర్ధులైన యోగ్యులు ప్రవేశించాలి. ఒక వంక ప్రతి ఒక్కరూ ఇచ్చిపుచ్చుకునే విషయంలో సమతూకాన్న పాటించేలా పర్యవేక్షిస్తూ, మరో వంక సంఘజీవిగా తయారయ్యేందుకవసరమైన విద్య గ..... సాగుతుండి మెరుగైన సమాజం ఏర్పడడానికి ఇంతకంటే వేరైనదారిగాని, మెరుగైన దారి కాని లేనేలేదు. కథంతా మనిషిని సంఘజీవిగా మలచడమెలా? అన్న దగ్గరే ఉంది.
మండలి తాత్విక సూత్రీకరణ :-
సూత్రం :- నేను సక్రమంగా మనగలగాలంటే నాదిని సక్రమంగా మన గలిగేలా చూసుకోవాలి.
నాది ఎప్పుడైతే ఆరోగ్యంగా, బలంగా కొనసాగగలుగుతుంటుందో అప్పుడు మాత్రమే నేను ఉండగలంత కాలం ఆరోగ్యంగా బలంగా కొనసాగగలుగుతాను. వ్యక్తికి సమాజమూ ప్రకృతి యీవే సహజ సంబంధంతో నాది అన దగ్గరే కనుకనే వ్యక్తి సమాజాన్ని, ప్రకృతిని కాపాడుకోవాలని వివేకం నిర్భందంగా చెపుతోంది.
సంపద ఒక దగ్గర పోగుపడడానికీ, మరొక దగ్గర చేరకుండడానికీ అవకాశం ఉన్నంత కాలం వ్యవస్ధలో అస్థవ్యస్ధతలు అనివార్యంగా ఏర్పడుతుంటాయి. కనుక వ్యవస్ధ నిర్మాణంలోనే అలా పోగుపరకుండడానికి అవసరమైన విధి విధానాలుండాలి. మరోవంక ఏ కారణం వల్ల గాని అలా జరిగితే వాటిని సక్రమపరచేందుకవసరమైన నిర్మాణము ఉండాలి. అనివార్యంగా ఏర్పడే అసమతుల్యతను సరిచేసుకునేందుకు నిర్ణీత అవధుల ప్రకారం సమం చేసుకునే నిరంతరాయప్రక్రియ అమలవుతే ఉండాలి. పరిష్కార రూపంలో బలంగా చోటు చేసుకుని ఉండాల్సిన ప్రధానాంశం ఇదే. దీనిని తెలిపే సూత్రం ఒకటుంది.
సూత్రం :- చేయని వానికి ఫలితం అందకూడదు. రాకూడదు, చేసిన వానికి చేసినంతా, చేసినంతే ఫలితం వస్తుండాలి. ప్రతి వారూ పని చేయాలి. ఎవరూ అతిగా చేయకూడదు.
ఈ సూత్రాన్ని ఈ వక్క సూత్రాన్ని ఆచరణలోకి తెగలిగితే అసమానతలన్న క్రమంగా కనుమరుగౌతాయి. మెరుగైన పౌరసమాజ స్థాపనకకు ఇంతకంటే సరళమైన దారిలేదు.
1. వారసత్వపు ఆస్థిహక్కు రద్దు చేయాలి. అన్ని అరిష్టాలకూ మూలం అదే.
గమనిక :- వ్యక్తిగత ఆస్థిహక్కున రద్దు చేయరాదు. అది మరణ పర్యాంతం వ్యక్తికి ఉండాలి.
2. సోమరులను సంఘ బహిష్కుృతులను చేయాలి. లేదా తన్నపని చేయించాలి.
3. అతిశ్రమ, అవసరపు శ్రమ చేయకుండా కట్టడి చేయగలగాలి.
పనిచేయకపోవడం, అతిగా పనిచేయడం అన్న రెండు శిక్షార్హమైన నేరాలుగా పరిగణింపబడాలి.
4. వ్యవస్ధలోని ఇచ్చుపుచ్చుకునే సంబంధాలన్న ఈలోకానికి పరిమితమైనవిగనే ఉండాలి.
అంటే పుట్టుకకు పూర్వంలోగాని, చనిపోయిన పిదపతోగాని వ్యవస్ధ విధి విధానాలకు సంబంధం ఉండకూడదు.
5. 'ఉత్పత్తి- పంపిణీ, నిల్వ' అన్నవి సమాజ గతి సక్రమంగా ఉండేందుకు, క్రమాభివృద్ధినందేందుకు అనువుగా మాత్రమే జరుగుతుండాలి.
గమనిక :- ఏ నిర్ణీత కాలంలోనూ ప్రజలంతా ఇలాగే ప్రవర్తిస్తుండే అవకాశం లేదు. కారణం సమాజం ఎప్పుడూ మూడు తరాలతో కూడి ఉండడం, ఒక తరం పని విరమణ థలో, మరో తరం ఇంకా పని ఆరంభం పని (పనికి సిద్దం చేయబడుతున్న 3 థలో ఉండడమే అందుకు కారణం కనుక వ్యక్తుల లానే ప్రవర్తిస్తుండేలా నిరంతర కార్యచరణ, పర్యవేక్షణలన్న రెండిపట్లా ఏమరపాటు లేక జాగరూకతలో వ్యవహరిస్తుండడం నిరంతరం జరుగుతుండాలి. ఎవరికొరకు రాజ్యాంగమో, దేనికొరకు రాజ్యాంగమో ఆ పౌరుల నిరంతర క్రమాభివృద్ధి విషయంలో ఆ పౌరులుగాని సరైన అవగాహన సంసిద్ధుల క్రియాశీలత లేనివారైతే ఇక అ సమాజపు స్థితి, గతి కూడా సవ్యంగా ఉండదు. అవగాహనా పరులు, చైతన్యవంతులు ఐన పౌరులే సామాజిక సమస్యలను పరిష్కరించుకోడానికి, మరల మరల తలెత్తకుండా జాగ్రత్త పడడానికీ శక్తి వంతులు. కనుక అట్టి బాధ్యతాయుతమైన పౌరుల్ని రూపొందించుకోడం దగ్గరే సామాజిక సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం ఉంది.
అయితే ఆ స్ధితి చాలా దీర్ఘకాలం పాటు నిరంతరాయంగా చేసుకుంటు పోతేగాని సిద్దించదు. ఈ లోపు ఆ పనికి ఉపబలకంగా (దోహదకారిగా) ఉండే మరికొన్ని పనులు చేయవలసి ఉంది. అట్టి వాటిని గురించి కొంత వివరించుకుందాం.
మన రాజ్యాంగం బాగనే ఉందనుకున్నాం కదా! మంది ఎందుకమలవ్వడం లేదు? అమలయ్యేదెలా? సమాన వ్యవస్ధలోని, సమాజగతి నిర్ధేశిక, నియంత్రణ స్థానాలలో యోగ్యులు, సమర్ధులూ లేకపోవడం వల్లనే, రాజ్యాంగం ఎంతగా బాగున్నా అవి అములుకు నోచుకోవడం లేదా. కనుక అట్టి నియంత్రణ స్ధానాలలోనికి సరైన వ్యక్తులు ప్రవేశం జరగాలి.
ఇంతకూ మీరనే ఆ నియంత్రణ స్థానాలేమిటి?
సమా :- (1) శాసన విభాగం (ప్రజాప్రతినిధులు) (2) పాలన నిర్వహణ విభాగం (ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగము) (3) న్యాయం భాగం (4) ఈ మూడికీ భౌతిక (క్రియా) శక్తిగా ఉండే రక్షకబలు విభాగం (లా & ఆర్డర్ విభాగం) అన్న నాలుగూ ప్రధాన నియంత్రణ స్థానాలవుతాయి. రాజ్యాంగమూ ఈ విషయాన్ని స్పష్టంగా చెపుతోంది.
వివరణ : - పై మూటిలోనూ ప్రజాప్రతినిధుల విభాగం మరింతలేదా అత్యంత ప్రభావవంతమైన నియంత్రణస్ధానంగా ఉంది. ఎందుకంటే ఆ ప్రజాప్రతినిధులే ఇటు శాసన నిర్మాణ భాగంలోనూ, అటు ప్రభుత్వంగాను ఏర్పడుతూ, నిర్వహణభాగాన్ని న్యాయభాగంలోనూ, అటు ప్రభుత్వంగానూ ఏర్పడుతూ, నిర్వహణ భాగాన్ని నాయ్యవిభాగాన్ని, పోలీసు వ్యవసనూ ఏర్పరచుకోవడంలో కీలక పాత్రను, అటుపై వాటి నియంత్రణ విషయంలో కీలక పాత్రను, పోషించగలుగుతున్నారు. ఈ ప్రధాన విభాగాన్ని మనం రాజకీయ క్షేత్రం అంటున్నాం.
కనుక రాజకీయ క్షేత్రంలోనికి, రాజ్యాంగం అభిలషిసస్తున్న రకం వ్యక్తులు ప్రవేశించగలిగితే, సామాజిక సమస్యల పరిష్కారం దిశగా సరైన (ఆరోగ్యవంతమైన, బలమైన) నడక ఆరంభమైనట్లే. ఈ ప్రజాప్రతినిధుల సముదాయం మన రాజ్యాంగం ప్రకారం (1) పార్లమెంటు (2) శాసనసభ, (3) పంచాయితీలు (మున్సిపాలిటీ) అన్న విభాగాలుగా విభజితమై ఉంది. కనుకనే ప్రజాప్రతినిధులను ఎంచుకునే ఎన్నికల ప్రక్రియ మన దేశంలో మూడంచలుగ ఉంటోంది. రాజకీయాలతో ముడిపడి ఉన్న ఈ మూడు విభాగాలలోనికి రాజ్యాంగ బద్దులై దానిని స్కయాంత్మకం చేయగల వ్యక్తులు ప్రవేశించడం వారున్న పౌరులకు జవాబుదారుగా ఉండడం ఆచరణలోనే రావాలి. ఈ పని సక్రమంగా అమలవుతుండాలంటే ప్రజల వద్దకు పాలన, ప్రజలు ముందుకు పాలన రావాలి. అందుకొరకకే రాజ్యాంగం ఎన్నికలతో సరిపెట్టుకోక, అధికార వికేంద్రీకరణకకు పెద్దపీట వేచింది. స్థానిక ప్రభుత్వాలు ఏర్పడి, అవి ప్రజలకు జవాబు దారిగా ఉంటు ఇప్పుడే రాజ్యాంగం ఆశించిన సమాజం ఏర్పడే వీలుంటుంది. మన రాజ్యాంగం ప్రకారం.
నిర్ణయాధికారం, పర్యవేక్షణధికారం ప్రజలదే. మిగిలిన యంత్రాంగమంతా నిర్వహణాధికారానికి పరిమితమయ్యేదే. మంది సక్రమంగా అమలవ్వాలంటే గ్రామసభలు, వార్డుసభలు పూర్తి స్థాయిలో జరుగుతుండాలి. అందువలన పాల్గొనే పౌరులు అవగాహనాపరులు, రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించనివారు అయ్యిండాలి. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రజాప్రతినిధులనెవ్వరినైనా వారు సక్రమంగా ప్రవర్తించనపుడు వారిని వెనక్కి పిలిచే హక్కు ప్రజలకుండాలి.
ముఖ్య గమనిక :- ఇప్పటికి నాకు తెలిసి మన రాజ్యాంగంలో రింగులోపాలున్నాయి.
(1) ఆర్థిక సమానత్వానికి అడ్డుగనిలుస్తున్న వారసత్వపు ఆస్థి హక్కు ఉండడం.
(2) ఎన్నికైన ప్రజాప్రతినిధుల్ని తప్పజేసినప్పుడు దింపేసే హక్కు లేకపోడం
ఈ రెంటినీ సవరించకోగలిగితే ఇప్పుడున్న అస్తవ్యస్ధతాలలో ఎక్కువలో ఎక్కువ భాగం ఇట్టే సనైపోతుంది. ఈ రెండు సూత్రాలు అటు ఆర్థిక ప్రజాస్వామ్యానికి ఇటు రాజకీయ ప్రజాస్వామ్యానికీ అవరోధకాలుగ .......
వాటిని రాజ్యాంగ సవరణల ద్వారా సరి చేసుకోవాలంటే, అంతటి విశాలత, సమదృష్టి ఉన్న వ్యక్తులు రాజకీయ క్షేత్రాలలోఓ 3 పెద్ద ఎత్తున ప్రవేహించాలి. శాసన విభాగంలోనికి ఇట్టి వారిని ప్రవేశపెట్టడమెలాగనేదే ఈ థలో మనముందున్న అస్సలు ప్రశ్న.థల వారీ కార్యాచరణ ప్రణాళిక
కార్యక్రమం మూడు విభాగాలుగా ఉండాలి
(1) ప్రజల్ని అవగాహన పరులను, చైతన్య వంతులనుగా తయారు చేయడం
(2) వ్యవస్ధలోని నియంత్రణ స్థానాలలోనికి సంశికక్షుతులైన సామాజిక స్పృహకల వ్యక్తిని పంపడం.
(3) ప్రజలకు - నియంత్రణ స్థానాలకు, ఉద్యమ వేదికకు మధ్య బలమైన మిత్ర సంబంధాలను నెలకొల్పడం.
అందుకుగాను అధ్యయన శిక్షణ తరగతుల్ని పెద్ద ఎత్తున దీర్ఘకాలం కొనసాగించాల్సి ఉంది. ఉద్యమ కారుల శిక్షణ, పౌరశిక్షణ; నియంత్రణ స్థానాలలోనికి వెళ్ళే వారికి శిక్షణ ఇదే ఇప్పుడు చేయాల్సిన ముందుపని రాష్ట్రాన్ని కార్యక్షేత్రంగా తీసుకుని ఈ పనిని పెద్ద ఎత్తున నిర్వహించాలి.
ఎందుకంటే సాధారణ పౌరులు వారంతట వారుగా అందుకు సిద్ధం కారు. ఎందుకంటే వారంతా వివిధ ధోరణులకు చెందిన నేతల వశంలో ఉండి పరతంత్రులుగా ఉన్నారు. వారి మెంటాల్టీ, ఇటువైపు దృష్టి సారించేలా చేయడానికి పెద్ద యత్నమే చేయవలసి ఉంటుంది. నిజానికి పౌరులను అవగాహనాపరులుగా, జాతీయవాదులుగా, సమిష్టి ప్రయోజనాలకు లోబడి ప్రవర్తించగలిగే వారిలా తీర్చిదిద్దవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. అయితే అక్కడాపని జరగనప్పుడల్లా, సమాజంలోని విజ్ఞులు పూనుకొని ప్రజల్ని, ప్రభుత్వాలని కూడా చక్కదిద్దే పనిచేయవలసి ఉంటుంది. పట్టిచూస్తే చరిత్రలో అలా జరిగిన దాఖలాలు కనిపిస్తాయి. ప్రస్తుతం సమాజం కోసం ఏదోఒకటి చేద్దామనుకుంటున్న మనలాంటి వారి ముందుందా బాధ్యత.
ఉద్యమ సారధ్యం వహించాలనుకొంటుండే వాళ్ళు మరికొన్ని విషయాలను తెలుసుకొనితీరాలి.
వ్యక్తుల ఆలోచనా స్థాయిలు మూడురకాలుగా ఉంటాయి.
1. స్వతంత్ర ఆలోచనాశీలురు
2. అనులోచనాశీలురు
3. అనుసరణశీలురు.
ప్రతి వ్యక్తిలోనూ ఈ మూడు వైఖరులు ఉండేలీలుంటుంది. కానీొక్కొక్కరిలో ఒక్కవైఖరి ప్రమలంగా ఉండి వారు ఆ వైఖరికి చెందిన వారుగా చెప్పుకొంటూ ఉంటారు.
1వ రకం వారికి, విషయాన్ని చెప్పి మీకేమనిపిస్తుంది ? అనడిగితే విషయాన్ని విపులీకరించగలుగుతారు. నిర్ణయాన్ని ప్రకటించగలుగుతారు. అవసరమైన మేర వెనుదిరిగి చూసుకొని సరిచేసుకోగలుగుతారు.
2వ రకం వారికి విషయాన్ని చూపిస్తూ, అవసరమైనపుడల్లా కదిలిస్తూ కొంతవరకు వివరాలందిస్తూంటే గ్రహించగలుగుతారు. గ్రహించినంతమేర భావాన్ని స్వంతంచేసుకుంటూ సాగుతుంటారు.
3వ రకం వారు విడమరచి చెప్పి చూపిస్తుంటే అంతవరకు గ్రహిస్తూ, చెప్పింది చేస్తూ, చెపుతూ ఉన్నంతవరకు చేసుకుంటూ సాగుతుంటారు. వారికి నడిపేవారి అవసరం ఎప్పుడూ ఉంటుంది.
గమనిక : 1వ రకం వారిని స్వతంత్ర ఆలోచనాశీలురనీ, 2వ రకం వారిని అనులోచనాశీలురని, 3వ రకం వారిని అనుసరణశీలురని అంటాం. మన ఉద్యమయత్నాలలో ఈ మూడు రకాల వారికి తగిన శిక్షణ, కార్యాచరణ ప్రణాళిక ఉండాలి.
దీనిలో శిక్షకులకు శిక్షణ నిర్వహించేవారు, శిక్షకులు, శిక్షితులు అనంన సముదాయాలు ఏర్పడుతుంటాయి. ఈ మూడు రకాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనులు చేస్తూనే ప్రజలకు అవగాహన కలిగించే పని చేస్తుంటారు.
ఇందులో శిక్షకులకు శిక్షణనిచ్చేవారు ప్రధాన శిక్షణాలయంలో ఉంటారు. శిక్షకులు మొదట జిల్లా శిక్షణాలయాలలో, అనంతరం మండల శిక్షణాలయాలలో శిక్షకులుగా ఉంటారు. అక్కడ శిక్షితులు రాష్ట్రమంతటా ఉద్యమ భావజాల వ్యాప్తిలో పనిచేస్తుంటారు. వీరందరూ సాధారణార్ధంలో ఉద్యమకారులే అనబడతారు. అభ్యుదయ శక్తులు సంఘటితం కానంతవరకు అసాంఘిక శక్తులు ఛలాయించుతూనే ఉంటాయన్నది చరిత్రలో చర్వితచరణంగా జరుగుతూ వచ్చిన వాస్తవం. దానినే ధర్మాధర్మ శక్తుల పేరన తాత్విక సాహిత్యంలో ప్రస్తావించారు. కనుక ఇప్పుడు మనం ఆరంభించి నిరంతరాయంగా కొనసాగిస్తూరావల్సిన పని అభ్యుదయ శక్తుల్ని సంఘటితపరచి, అసాంఘిక శక్తులపై పోరాటానికి వారిని సన్నద్ధం చేయటమే. ఆ పని విషయంలో చెయ్యాల్సిన కర్తవ్యాల్ని తెలిపే ఒక సూత్రం ఉంది.
సూత్రం : వెదుకు, గమనించు, సవిూకరించు, సంఘటితపరుచు, పోరాడు.
మనం ఉద్యమకార్యంలో ఎవరెవరం ఏయే పనుల్లో ఉంటున్నా అందరూ చేస్తుండాల్సిన సాధారణ కార్యం, మనకు పనికివచ్చే వ్యక్తుల్ని వెదుకుతుండటమే.
ఈ వెదికే పని వివిధ థలుగా ఉంటుంది. ముందుగా ఈ పనిని వయోజనులనుండి మొదలుపెట్టాలి. వయోజనులన్న దాని క్రిందకు యువకులు, మధ్యవయస్కులు, పెద్దతరం వారు వస్తారు.
గమనిక : వయోజనులన్న పదం వయసొచ్చిన వాళ్ళు అన్న అర్ధాన్నిస్తూ, పిల్లలు కాని వారిని సూచించేందుకు వాడబడింది. యోజనాపరులు జీవితాన్ని
1. బాల్యం, కౌమారం, యవ్వనం, వార్థక్యం అన్నవిభాగాలుగాను
2. బాలురు, యువకులు, మధ్యవయస్కులు, వృద్ధులు అన్న రూపంలోనూ విభజించారు.
మన ప్రస్తుతాంశానికి సంబంధించినంతలో మన వెదుకులాట ప్రధానంగా యువకులు, మధ్యవయస్కులకు చెందివుంది. అనుభవజ్ఞులై ఆరోగ్యంగా వున్న పెద్దలూ ఉద్యమాలకు అవసరపడే ఉంటారు.
మలి థలో మాత్రం భావితరాన్ని నిర్మించుకునేందుకు వీలుగా కౌమారథలోని వారిపై ప్రధానంగా దృష్టిపెట్టి పనిచేయాల్సి ఉంటుంది.
అవగాహనా సౌలభ్యం కొరకు ఆ నాలుగు రకాల వారిని వయస్సులను బట్టి ఇలా నిర్ణయించుకుందాం. కుమారులు : 12 నుండి 18 లోపు, యువకులు : 18 నుండి 30 వరకు, మధ్యవయస్కులు : 30 నుండి 50 వరకు. ఆపై వారిని పెద్దతరం అనందాం.
మతం - మన వైఖరి
మత సాహిత్యంలో మానవతా విలువలు, మానవ విలువలు అన్న వాటిని గురించి తగినంతగనే చెప్పబడి వున్నా, మానవత్వానికి, మానవీయ విలువలకు పెద్దపీట వేసిన ఎదిగిన మనుషులెందరో మతాన్నంటిపెట్టుకొని అన్ని మతాలలోనూ కనబడుతూనే ఉన్నా, చరిత్రలో మతం నిర్వహించిన పాత్ర మాత్రం, మానవులంతా ఒక్కటే, మానవులందరూ యోగక్షేమాలను సమానంగా పొందవలసిందే అనదగిన వారు అంగీకరించదగిందిగా గాని, అనుసరించదగిందిగా గానీ లేదు. మానవేతిహాసంలో మతాల పేరన జరిగినంత మారణకాండ మరేకారణంగానూ జరగలేదు.
ప్రజాస్వామ్యానికి పట్టం కడుతూ సాగుతున్న ఈనాటి ప్రపంచ మానవ సమాజంలో కూడా మతాలు, మానవీయ విలువలు, ఈ లోకంలో పరస్పరం ప్రవర్తించాల్సిన రీతి రివాజుల కంటే దైవ సంబంధమైన, పరలోక సంబంధమైన విశ్వాసాల కేంద్రికతకు ప్రాధాన్యతనిస్తూ మానవుల్ని వివిధ సమూహాలుగా విడదీస్తున్నాయి. వ్యక్తులలో మమ - పర అన్న దృష్టిని గట్టిగా పాదుకొల్పుతున్నాయి.
ఎవరికివారు, తమ గ్రంధం చెబుతున్న దైవం, పరలోకం, మరణానంతర జీవితం అన్నవే సరైనవంటూ - సత్యాలంటూ, తదితరులవన్నీ అసత్యాలు, అవాస్తవాలంటూ నిర్ద్వందంగా ప్రకటిస్తూ, ప్రచారం చేస్తున్నారు. ఇది నిజమో కాదో వారినడిగి చూడండి. లేదా ఆ మత గ్రంధాన్ని తరచి చూడండి.
గమనిక : ఆయా కాలాలలో మనసున్న, మానవత్వమున్న మనుషులెందరో వ్యక్తులలో మత భావాలను పోగొట్టలేక, మత సామరస్యమన్నా ఏర్పడితే మేలనుకుని, అందుకై నిబద్ధతతో ఎంతో కృషిచేశారు. అట్టి వారి కృషి మొత్తం మొత్తంగా వృధాఅయ్యిందనలేము గాని, జరిగిన, జరుగుతున్న దాన్నంతటినీ సమీక్షిస్తే ఆ యత్నాలన్నీ విఫలమయ్యాయని గాని చెప్పక తప్పదు. కానీ ఈ నాడున్న మతసామరస్య వాదులు చరిత్రను యధాతధంగా పరిగణలోనికి తీసుకోకుండా, వర్తమానంలో అన్ని మతాల వారు కలసి జీవిస్తుండడాన్ని చూపెడుతూ, మత సామరస్యం సాధ్యమేననడానికి ఈ ప్రత్యక్ష సాక్ష్యం సరిపోవడం లేదా అని వాదిస్తుంటారు. ఈ విషయంలో సత్యా సత్యాలేమిటన్నది నిర్ధారించుకోవాలంటే అందుకు లోతైన విచారణ చేయాల్సి ఉంది. ఆ పని మరొకసారి ప్రత్యేకించి చేద్దాం. మన విచారణకు సిద్ధపడి, సత్యాలని తేలిన వాటిని స్వీకరిద్దాం. అసత్యాలని తేలిన వాటిని విడిచిపెడదాం. అలాగే ధర్మాలని తేలిన వాటిని స్వీకరిద్దాం. అధర్మాలని తేలిన వాటిని విడిచిపెడదాం. సత్యాసత్యాలుగనో, ధర్మాధర్మాలుగనో తేలని వాటిని తేలనివిగా అంగీకరిద్దాం. కాలం చెల్లిన వాటిని అట్టివిగనే అంగీకరిద్దాం 'అన్న షరతులకు అంగీకరించిన వాళ్ళలో సత్యాసత్య విచారణ చేయడానికి సత్యాన్వేషణ మండలి సిద్దంగా ఉంది. మండలికి సంబంధించినంతవరకు ఈ నియమం, ఆస్తిక ధోరణిగల వారికుగాక, ఆస్తిరేతర ధోరణి గలవారికి కూడా వర్తిస్తుంది.
ప్రస్తుతాంశానికి సంబంధించినంతలో మెరుగైన పౌర సమాజ స్థాపనకై రాజ్యాంగం అంగీకరించిన పరిధిలో ఉద్యమించడమే సరైందని నేను భావిస్తున్నాను. అంటే దేశ పౌరులందరి మధ్యనున్న సామాజిక సండంధాలు, వ్యవస్థ నియమ నిబంధనలు అన్న ఈ లోకానికి పరిమితమైనవిగనే ఉండాలన్న సూత్రాన్నే ఆచరించడం సరైందని నేను భావిస్తున్నాను.
ఒకే మతాన్ని ఆచరణలో స్థాపించడం గాని, వివిధ మతస్తుల మధ్య మతాల ప్రామాణికతనంగీకరిస్తూ సామరస్యాన్ని నెలకొల్పటంగాని అసాధ్యమని తలుస్తున్నాను. లౌకిక రాజ్యాంగపు విధి నిషేధాలను బలంగా అమలు చేయడం ద్వారా మాత్రమే వివిధ మతస్తుల మధ్యన సహనాన్ని, సర్దుబాటు వైఖరిని నెలకొనేలా చేయవచ్చునని భావిస్తున్నాను. క్రమంగా మత విశ్వాసాల కంటే, 1. మానవీయ విలువలు, 2. శాస్త్రీయ విజ్ఞానము అన్న వాటికి ప్రాధాన్యతనిచ్చే విద్యాబోధన చేస్తూ రావడం ద్వారా మానవుల మధ్య సహజీవనాన్ని, సహకార ధోరణిని పాదుకొల్పవచ్చని భావిస్తున్నాను. మత గ్రంధాల పట్టు సడలకుండా ఆ సమూహాల మధ్య సామరస్యం కుదరనే కుదరదు.
గొప్ప విడ్డూరమేమంటే ఈనాడు ప్రధాన మతస్తులందరూ తమది మతం కాదని, ధర్మమని, అంటే సర్వ మానవాళికి, ఎల్ల కాలాలకు వర్తించే ఒక సమగ్ర జీవన విధానమనే మాట్లాడుతున్నారు. వారి మాటలనంగీకరిస్తే ఇక మతమన్నదే లేదనవలసివస్తుంది. ఇక అప్పుడు మనం మాట్లాడుకోవలసింది ధర్మయంటే ఏమిటి ? ఏ గ్రూపు చెబుతున్నది ధర్మమనడానికి తగి ఉంది అన్న అంవంపైనే. వాదన కొరకు అలాగేననుకున్నా మరిలాంటప్పుడు మన రాజ్యాంగాన్నేమిచేద్దామన్న మరింత పెద్ద ప్రశ్న వచ్చి కూర్చుంటుంది. కనుక నేననేదేమంటే మతాల గొడవలా వుంచి, రాజ్యాంగానికి లోబడి జీవిస్తారో లేదో నిక్కచ్చిగా కనుక్కోవడమొక్కటే సరైన విధానం అవుతుంది. అలాగే విజ్ఞాన శాస్త్ర రీత్యా తేలిన వాటిని తేలినవిగా స్వీకరిస్తారో లేదోనూ అడిగి తేల్యుకోవాలి.
మెరుగైన పౌర సమాజపు ఏర్పాటు విషయంలో ఇప్పుడు అనుసరించదగిన ఉత్తమ మార్గం ఇప్పటికి ఇంతకంటే మరోటి లేదు.
ఇది చదివి మీరేమిటో నిర్ణయించుకోండి. ఉచితంగా సంపందించండి.
సత్యాన్వేషణలో,
విూ, సురేంద్ర.
స.హ. ప్రచార ఐక్య వేదిక మరియు అపార్టు సంయుక్త నిర్వహణలో
జరిగిన శిక్షణా తరగతుల విశేషాలు
సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక, ఆంధ్రప్రదేశ్ రూరల్ డెవలప్‌మెంట్ (అపార్డు) వారి సంయుక్త నిర్వహణలో రాజేంద్రనగర్, హైదరాబాద్‌లోని అపార్డు సంస్ధలో నవంబర్ 18 నుండి 22 వరకు, 12 జిల్లాల నుండి వచ్చిన 30 మందికి శిక్షణా తరగతులు నిర్వహించబడినాయి. శిక్షణ గరపటానికి స.హ. ప్రచార ఐక్య వేదిక నుండి బాలగంగాధర్, పుట్టా సురేంద్రబాబు, రాకేస్‌రెడ్డి గార్లు, అపార్డు నుండి కుమార్ రాజా, మున్‌వార్, సుమమాలిని గార్లు పాల్గొన్నారు. ఆ వివరాన్ని సంక్షిప్తంగా అందిస్తున్నాము.
మొదటి రోజు శిక్షకులకు ప్రేరణ కలిగించే విషయాలు తెలియజేయబడుతూ మంచి ఉపన్యాసకుడు కావాలంటే వ్యక్తిపరమైన విషయాలలో తీసుకోవలసిన జాగ్రత్తలు అలానే విషయ పరంగా తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు ఆరంబ సంబోధన గురించి శిక్షణ ఇవ్వబడింది. వివరాలలోకి వెళితే
వ్యక్తి పరమైన (ఆత్మాశ్రయ) విషయాలు
ఎ) సుస్వరం :- మంచి కంఠం కలిగి ఉండడం. పూర్వం నుండి సుస్వరం కొరకు సాధనలు ఉన్నాయి.
బి) స్వరస్ధాయి :- శ్రోతలు చెవులు రిక్కించి వినడమో, అప్పుడప్పుడు చెవులు మూసుకోనడమో చేస్తున్నారంటే ఆ వక్తి స్వరస్ధాయి సరిగా లేదని అర్ధము. శ్రోతలు హాయిగా వినగలగడమే స్వరస్ధాయి సరిగా వుందనడానికి ఒక గుర్తు.
సి) సుృటత్వం :- శబ్దాన్ని సరిగా ఉచ్చరించగలగడమే సుృటత్వం అంటే దీర్ఘాలు దగ్గర దీర్ఘాలు, పొల్లులు దగ్గర పొల్లులు, వత్తులు దగ్గర వత్తులు ఇవ్వగలగటమని అర్ధం. దీని వలన విషయం సులభంగా అర్థమౌతూ వుంటుంది. అలానే వక్త బాగా మాట్లాడినాడని శ్రోతలకు అనిపిస్తుంటుంది.
డి) స్పష్టత :- వక్త ప్రసంగంలో వాక్యానికి, వాక్యానికి మరియు పదానికి పదానికి మధ్య కూర్పుకు ఇచ్చే సమయాన్ని బట్టి స్పతష్ట వుంటుంది. కొందరు అతి వేగులుంటారు వీరు మాట్లాడుతుంటే వాక్యాలు మీద వాక్యాలు మరియు పదము మీద పదాలు పడిపోతుంటాయి. ఇందులో కొంతమంది అక్షరాలు కూడా మింగుతుంటారు. వేరొక వర్గము అతి నిదానులు. కూర్పుకు ఇచ్చే సమయము అతి ఎక్కువ వీరి ప్రసంగాన్ని అర్దము చేసుకోవడమూ కష్టమే. కనుక అతి వేగము, అతి నెమ్మదిగాక ప్రతి అక్షరాన్ని స్పష్టంగా తగినంత స్వరస్ధాయిలో ఉచ్చరించడాన్నే స్పష్టత అంటాము.
విషయ పరంగా తీసుకోవలసిన జాగ్రత్తలు :-
ఎ) ప్రకరణ భంగం చేయరాదు :- ప్రసంగించాల్సిన విషయం కాక అన్య విషయాలలోకి వెళ్ళి ప్రస్తావించటమే ప్రకరణ భంగం కలిగించడమంటే. దీనికి ఒక ప్రధాన కారణము ప్రస్తావించే విషయంలో స్పష్టమైన, లోతైన అవగాహన లేకపోవడం. మరొక కారణం ప్రస్తావించే విషయం కంటే వేరొక విషయం పై ఇష్టముండడము. ఉదాహరణకు గమనించితే రాజకీయ నాయకులలో కొందరు ఏ సందర్బము ఏ విషయముమాట్లాడమన్నా వాటితో పాటు తమ పార్టీ గురించి గొప్పలు చెప్పుకొంటూ గెలిపించమంటుంటారు. సందర్భం కాకపోయినా ఇది ప్రకరణ భంగమని తెలిసినా వారి ఇష్టము అలా నడిపిస్తుంటుంది. ఇంకొక కారణం తాను ప్రసంగీకునిగా పేరు పొందాలన్న ఆకాంక్ష, మరొక కారణం చెప్పాల్సిన విషయానికి వివరణ ఇస్తూ తనకు తెలియకుండగనే తను ప్రకరణభంగం చేస్తూ వుండడం. పై విషయాలన్నీ గమనించుకొని వక్తలు ప్రకరణ భంగం కలగకుండా జాగ్రత్త వహించాలి.
బి) సమయస్పూర్తి :- శ్రోతలను బట్టి తన ప్రసంగ సమయాన్ని ఎలా మార్చుకోవాలో అలా మార్చుకోగలిగిన వక్తకు సమయస్పూర్తి వున్నట్లు. ఇలా చేయగలగాలంటే వక్తకు భాష పై పట్టుండడమే కాకుండా ప్రసంగాంశంను క్లుప్తీకరణ చేసే సామర్ధ్యాము, వివరణాత్మకంగా చెప్పగలిగే శక్తి కలిగుండాలి. దీనితో పాటు విస్త్రృత సమాచారం ఉన్నవారై వుంటే అతిభాషణం, అల్పభాసణం చేయకుండా మితభాషణం చేయగలవారై ఉంటారు. మితభాసణం అంటే చెప్పవలసిన విషయం, కంటే ఒక పదము ఎక్కువగాని ఒక పదము తక్కువగాని లేకుండా చెప్పగలగడం. పై విషయాలన్నీ అభ్యసించి సాధించుకోవలసి వుంది.
తరువాత భారత రాజ్యాంగము- కనీస అవగాహ నావశ్యకతను వివరించి, రాజ్యాంగాలులోని కొన్ని ముఖ్యమైన అంశాలు శిక్షణ నివ్వడం జరిగింది. వివరాలు క్లుప్తంగా
భారత రాజ్యాంగము రాజ్యాంగ నిర్మాణ సభచే 1949 నవంబర్ 26వ తేదిన అంగీకరింపబడింది. 1950 జనవరి 26వ తేది నుండి అమలులోకి వచ్చింది. కనుకనే ఆ రోజు రిపబ్లిక్ డే జరుపుకొంటున్నాము. తొలుత ఇది 22 విభాగాలతో 9 షెడ్యూళ్ళతో 395 అధికరణలతో ఏర్పడి అనంతరం రాజ్యాంగ సవరణల పేరున జరిగిన మార్పులు, చేర్పులతో 26 విభాగాలు 12 షెడ్యూళ్ళు 444 అధికరణలతో పరిణమించింది.
అవతారిక, ప్రస్తావన అన్న పేరున ఉన్న భాగం రాజ్యాంగం మొత్తానికి ఆత్మవంటిది. రాజ్యాంగ సూత్రీకరణలను వ్యాఖ్యానించడం గాని, అన్వయించడం గాని ఈ ప్రస్తావన స్వరూప స్వభావాలకు లోబడే చేయాల్సి వుంటుంది. అంటే ఈ ప్రస్తావనే గీటురాయి అని అర్ధము.
రాజ్యాంగము 3వ విభాగాలు అధికారణలు 13 నుండి 35 వరకు పౌరహక్కులకు సంబంధించిన సూత్రకరణలున్నాయి. ఆర్టికల్ 19(1) ప్రకారం ప్రాథమిక హక్కులు '6' వున్నాయి. అవి వాక్కు మరియు భావ ప్రకటనా స్వాతంత్య్రాలహక్కు, ఆయుధాలు ధరింపకుండా శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు, సంస్ధలను, సంఘాలను ఏర్పరుచుకొనే హక్కు, భారత దేశ మంతటా సంచరించచే హక్కు, దేశములో ఎక్కడైనా నివశించే, స్థిర నివాశమేర్పరుచుకొనే హక్కు, ఇష్టమైన వృత్తిని, పనిని, వ్యాపారాలు చేసికొనే హక్కు.
అలానే ఆర్టికల్ 19(2) ద్వారా ఆ హక్కులకు పరిమితులు చెప్పబడ్డాయి. దేశ సార్వభౌమత్వాన్ని అఖండతకు, దేశభద్రతను, విదేశాలతోడి సంబంధాలకు, ప్రజాశాంతి భద్రతలను సభ్యత మరియు నైతికతలను చెడగొట్టే మరియు కోర్టు ధిక్కారణను, పరువు నస్టాన్ని, నేరాలను ప్రోత్సహించే అంశాలపై ఆ హక్కులకు పరిమితులు విధింపబడ్డాయి.
ఆర్టికల్ 14 ద్వారా చట్టము ముందు అందరూ సమానులేననే హక్కు, ఆర్టికల్ 15 ద్వారా మత, జాతి, కుల, లింగ, జన్మస్ధానములను బట్టి వివక్షత చూడడం నిషిద్దం ఆర్టికల్ 16 ద్వారా ప్రభుత్వ ఉద్యోగ, వసతుల విషయంలో సమానావకాశాలు పొందే హక్కు ఆర్టికల్ 17 ద్వారా అస్పృశ్యత నిషేదం.
ఆర్టికల్ 32 ద్వారా ప్రాథమిక హక్కులు పొందడానికి ఆటంకాలు ఏర్పడితే రక్షణ పొందటానికి హామీ ఇవ్వబడింది.
రాజ్యాంగము 4వ భాగంలో ఆదేశిక సూత్రాలున్నాయి. ఆర్టికల్ 5167లో ప్రాథమిక విధుల గురించి 10 సూత్రీకరణలున్నాయి. అవి రాజ్యాంగమునకు బద్దుడై ఉండుట, దాని ఆదర్శాలను, సంస్ధలను, జాతీయ పతాకలను, జాతీయగీతమును గౌరవించుట, స్వాతంత్య్ర పోరాటానికి స్పూర్తినిచ్చిన ఆదర్శాలనూతగొని వ్యవహరించుట, దేశ సార్వభౌమత్వాన్ని ఐక్యతను, అఖంతను సమర్ధించుట మరియు కాపాడుట, దేశ రక్షణకై సిద్ధపడి వుండుట, ప్రజల మధ్య మత, ప్రాంత, భాష, వర్గ విభేదాలు ఏర్పరచేలా ప్రవర్తించకుండుట, భారతీయ సంస్కృతిని మరియు సంప్రదాయాలను గౌరవించుట, రక్షించుట, పర్యావరణాన్ని, అడవులను, నదులను సరస్సులను అడవి జంతువులతో సహా ప్రకృతిని కాపాడి అభివృద్ధి పరచుట, అలానే సమస్ధకులాల యెడ జీవకారుణ్యాలు కలిగి వుండుట, శాస్త్రీయ దృక్పధాన్ని, హేతుదృష్టిని, మానవత దృష్టిని అలవరచుకొనుట, హింసను విడనాడుట, ప్రజల ఆస్తిని సంరక్షించుట, విద్వంసకార్యాలు నిరోధించుట, వ్యక్తిత్వ శక్తి సామర్ధ్యాలను పెంపొందించుకొనుట, సమిష్టి కృషి ద్వారా అన్ని రంగాల అభివృద్ధి కై కృషి చేయుట 14 సంవత్సరాల లోపు వయసు గల బాలబాలికలకు విద్యాభ్యాసం చేయు అవకాశం కలిగించుట.
మనది సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర వ్యవస్ధ. ఇంతకు ముందు వున్న ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్ధకు 1976లో చేసుకొన్న 42వ రాజ్యాంగ సవరణననుసరించి సామ్యవాద లౌకిక పద..... అవతతారికలో చేర్చడం జరిగింది.
సామ్యవాదం - సోషలిజం-సమాజవాదం అంటే ప్రకృతి సంపద దానినను సరించి సమాజం స్పష్టించుకొన్న సంపద మొత్తం సమాజం మొత్తానిది. దానిపై ఏ..............
కొద్ది మందికో గుత్తాధిపత్యం ఉండరాదు. వ్యక్తిగత ఆస్తికి పరిమితుల్ని, సమస్త సంపదపైనా నియంత్రాణాధికారం సమిష్టిదేనని, వ్యక్లు విషయంలో పనిని బట్టి, పనిచేసిన వారే ఫలితం చేయనివారికి చేయనిదానికి ఫలితం అందరాదు అన్న దృష్టిని కలిగి వుంటుంది.
లౌకికం అంటే పార లౌకికం కాదని అర్ధము. ఈ లోక విషయాలను మాత్రమే పరిమితమై వ్యవహరిస్తుండుట అని అర్ధము. పరలోకానికి సంబందించిన మత విషయాలలో తటస్ధలుగా వుండటం. తానుగ మనత మతవ్యతిరేక సంబంధ కార్యకలాపాలలో ప్రవేశించకుండాలనే, మతానుమాయులకు మత పరమైన కార్యకలాపాలు చేసుకొనే స్వేచ్చనిచ్చింది. లౌకిక రాజ్యం అంటే మత ప్రమేయంలేని రాజ్యమని అర్ధం.
ప్రజాస్వామ్యం అంటే ప్రజలేస్వాములు, యజమానులు, లేకసొంతదారులు అని అర్ధం. ప్రజల కొరకు ప్రజల ద్వారా ప్రజలే పరిపాలించుకొనే విధానం ప్రజాస్వామ్యం అమలవ్వడమంటే కేంద్ర ప్రభుత్వం దాని నిర్వహణాధికార యంత్రాంగం పార్లమెంట్‌కు జవాబుదారిగనూ, రాష్ట్ర ప్రభుత్వాలు, దాని నిర్వహణాధికార యంత్రాంగం శాసన సభకు జవాడుదారిగానూ, జిల్లా, మండల, గ్రామ, మున్సిపాలిటీ ప్రభుత్వాలు వార్డు ప్రతినిధులకు, నేరుగా ప్రజా సభకు జవాబుదారిగా వుండడమని అర్ధం. మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. ఇది సక్రమంగా అమలవ్యాలంటే ప్రతినిధుల ఎంపిక సరిగా జరగాలి. దానికి ఎన్నికలు దోషరహితంగా, లోపరహితంగా జరగాలి. ప్రజాస్వామ్యానికి ఊపరి నిర్ణయాధికారం ప్రజలది నిర్వహనాధికారం మాత్రమే ప్రభుత్వానిది అయి వుండాలి. ఇది అమలవ్వాలంటే అధికార వికేంద్రీకరణ జరిగితీరాలి. ఆర్ధిక వనరులు ఏ ప్రాంతానికాప్రాంతానికే న్యాయబద్దమైన వాటా కేటాయింపులు జరగాలి. దాని కొరకు స్ధానిక ప్రభుత్వాలకు పూర్తిస్ధాయిలో అధికారాల బదలాయింపు జరగాలి. దీనిని 73,74 రాజ్యాంగ సవరణుల చట్టం అమలు పరచడం అంటున్నాము. కళ్ళ ముందు పాలన, పాలనలో పర్యవేక్షణ, ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యం అన్నవి అమలు కావాలంటే గ్రామసభలు, వార్డు సభలు పూర్తి స్థాయిలో క్రీయావంతంగా పనిచేయగలగాలి.
ప్రజాస్వామ్యం సాంఘిక, ఆర్ధిక, రాజకీయ, సమానత్వాన్ని అంగీకరిస్తుంది. అని ఆ సెషన్ ముగించారు.
ఆ తరువాత సమాచార హక్కు చట్టము 2005 పూర్వాపరాలు, ఆచట్టలులోని ముఖ్యమైన సెక్షన్లు తెలియపరుస్తూ గ్రామ ప్రజల వరకు ఎలా తీసుకెళ్ళ గలమో వివరించడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళితే.
మనకు స్వాతంత్య్రము వచ్చి యింత కాలమైనా చాలా చట్టాలు బ్రిటిష్ కాలము నాటివే ఉపయోగించుకొంటున్నాము. ఉదాహరణకు 1860 సంవత్సరములోని ఇండియన్ పీనల్ కోడ్, 1861 సంవత్సరములోని పోలీసు వ్యవస్ధ 1894 సంవత్సరములోని జైయిల్ చట్టం 1900 సం||లోని ఖైదీల చట్టం అలానే 1986లోని వినియోగదారుల చట్టాలు.
మనకు 2005 లో వచ్చిన స.హ. చట్టం 1776 సం||లో స్వీటన్‌లో వచ్చింది. అడిగిన వెంటనే సమాచారము ఇవ్వాలన్న చట్టము వుంది. కనుకనే అవినీతి తక్కువ వున్న దేశాలలో స్వీటన్ మొదటిదైయున్నది. 1996లో అమెరికాలో ఈ చట్టాలుఏర్పడింది.
శ్రీమతి అరుణారాయ్, అన్నా హజారై లాంటి వారి కృషి వలన మనకు 2005లో ఈ చట్టాలు వచ్చింది. మిగిలిన చట్టాలకు ఈ చట్టానికి మౌలికమైన తేడా ఒకటి వుంది. మిగిలిన చట్టాలన్నీ ప్రభుత్వాధికారులు అమలు చేస్తే (ఇంప్లిమెంట్ చేస్తే) మనలు అమలు పరచాల్సి వుంటుంది. అలా అమలు పరచలేకపోతే జరిమానాలు మనకు పడుతుంటాయి. కాని ఇది ప్రజల చట్టాలు. ప్రజలు అమలుచేస్తే (ఇంప్లిమెంట్ చేస్తే) ప్రభుత్వ అధికారులు అమలు పరచాల్సి వుంటుంది. అలా అమలు పరచలేని అధికారులకు జరిమానాలు విధింపబడతాయి.
ప్రజలకు ఈ అధికారం ఎలా వచ్చింది అనుకొంటే ప్రజలే తమ ఓటు హక్కు ద్వారా అధికారులను, టాక్సులు, వ్యాట్లఉ మొ||లగు వాటి చెల్లింపుల ద్వారా ఆర్ధిక వనరులను ప్రభుత్వాలకు ఏర్పాటు చేస్తున్నారు గనుక ప్రజలకు అట్టి ప్రభుత్వాల సమాచారం.. హక్కు ఏర్పడిందనవొచ్చు. ఈ చట్టాలు యొక్క ప్రధానొద్ధేశాలు పరిపాలనలో పారదర్శకత, అధికారులకు జవాబుదారితనలు పెంచి తద్వారా అవినీతిని తగ్గించటానికి ఏర్పడింది. ఈ చట్టాలు ఎవరి గురించి చేయబడిందో ఆ ప్రజలకు ఆ చట్టాన్ని గురించి అవగాహన కలిగించే బాధ్యత మన స్వచ్చంద సంస్ధలపై వుంది. గనుక ముందుగా మన మంతా ఆ చట్టాన్ని పరిచయం చేసుకొందాం.
సమాచార హక్కు చట్టం 2005 అక్టోబరు 12వ తేదీ నుండి అములులోకి వచ్చింది. ఈ చట్టలులోని సెక్షన్లు 2,3,4,6,7,8,9,18,19,20 గురించి ఈ చట్టాన్ని ప్రజలలోకి తీసికొని వెళ్ళి బాద్యులు తప్పని సరిగా తెల్చుకొని వుండాల్సి వుంటుంది.
సమాచారము పొందగోరు వారు సమాచారము అంటే ఏమి చట్టములో వుందో అదే అడగాలిగాని, సలహాలు ఇవ్వడాలు, ప్రశ్నలు వేయడాలు చేయరాదు. కనుక సమాచారము అంటే సెక్షన్ 2 (ఎఫ్) ప్రకారం రికార్డులు, పత్రాలు, మెమోలు, ఇ-మెయిల్స్, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్క్యులర్లు, ఉత్తర్వులు, లాగ్‌బుక్స్, కాంట్రాక్టులు, నివేదికలు, పేపర్లు, శాంపిళ్ళు, మోడల్స్, డేటాసహ ఎలక్ట్రానిక్ రూపంతోపాటు ఏరూపంలోనైనా ఉన్న సమాచారం. అమలులో వున్న మరే చట్టం ప్రకారమైనా ప్రభుత్వ యంత్రాంగం సంపాదించదగిన ఏ ప్రయివేటు సంస్ధకకు సంబంధించిన సమాచారమయినా ఈ చట్టం ప్రకారం సమాచారమే.
సెక్షన్ 2 (3) ప్రకారాలు సమాచార హక్కు అనగా ఏ అధికార యంత్రాంగం నియంత్రణ క్రింద ఉన్న సమాచారాన్నయినా ఈ చట్టం క్రింద పొందగలిగే హక్కు (1) పనులనూ, పత్రాలనూ, రికార్డులనూ తనికీ చేసే హక్కు (2) రికార్డులతో ఉన్న సమాచారాన్నిఅంతా రాసుకోవడం. వాటినకలు, సర్టిఫైడ్ కాపీలు తీసుకోవడం (3) సమాచార సంపత్తి, సర్టిఫైడ్ శాంపిళ్ళు తీసుకోవడం (4) డిస్కెట్లు, ఫ్లాపీలు, టేపులు, వీడియో కాసెట్లు రూపంలో లేక మరే విధమైన ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న సమాచారాన్ని పొందడం.
సెక్షన్ 3 ప్రకారం ఈ చట్టంలోని నిబంధనలకు లోబడి పౌరులలోనికి సమాచారాన్ని పొందే హక్కు ఉంటుందని తెలియజేయగా సెక్షన్ 4 (1) (ఎ) మరియు (బి)లు ప్రకారం సమాచార హక్కు అమలయ్యేందుకు వీలుగా తమ రికార్డులను పట్టికలు, పద సూచికలతో సక్రమంగా దేశ వ్యాప్తిత నెట్‌వర్క్‌లో ఎక్కించేందుకు చర్యలు తీసుకోవాలని మరియు పౌరులు అడగకుండగనే 17 అంశాలకు చెందిన సమాచారాలు ప్రజలకు అర్ధమయ్యే రీతిలో ఆ అధికార యంత్రాంగానికి సంబంధించిన వివరాలు, విధుల, దాని అధికారుల, ఉద్యోగులకున్న అధికారాలు, విధులు, కార్యనిర్వహణలో పాటించే సూత్రాలు, ఉద్యోగులు పొందే నెలవారి వేతనాలు, సబ్సిడి పధకాల అమలు .. వాటికి కేటాయించిన నిధులు, లబ్ధిదారుల వివరాలు, అలానే అన్ని ప్రణాళికలు, ప్రతిపాదిత వ్యయాలు, జరిపిన చెల్లింపులు, వివిధ ఏజెన్సీలకు కేటాయించిన బడ్జెట్ వివరాలు, పౌనసమాచార అధికారుల పేర్లు, హోదాలు, ఇతర వివరాలు మొదలగు సమాచారాన్ని పౌరులకు అందుబాటులో వుంచాలి.
సెక్షన్ 6 ప్రకారాలు దరఖాస్తు చేసుకునే వివరాలు అందివ్వబడినాయి. దరఖాస్తును ఇంగ్లీషు, హిందీ లేక స్ధానిక అధికార భాసలో రాత పూర్వకంగా లేక ఎలక్ట్రానిక్ రూపంలో నిర్గతరుసులతో పాటు పౌర సమాచార అధికారికి గాని సహాయ పౌరసమాచార అధికారి ... సహాయాన్నంత అందించాలి. సమాచారం కొరుతున్న దరఖాస్తుదారు అందుకు గల కారణం ఏమిటో వివరించాల్సిన అవసరం లేదు. కబురు పంపటానికి అడ్రసు మాత్రమే ఇవ్వాలి.
సెక్షన్ 7లో పౌర సమాచార అధికారి విధులు చెప్పబడ్డాయి. దరఖాస్తు అందిన 30 రోజులలోపు వీలైనంత త్వరగా సమాచారాన్ని అందించాలి. లేకపోతే ఆ దరఖాస్తును తిరస్కరించినట్లు వచ్చి ఒక వ్యక్తి ప్రాణానికి గాని, స్వేచ్చను గాని సంబందించిన అభ్యధ్దన అయితే అది అందిన 48 గంటలలోనే అందచేయాలి. లేకుంటే సెక్షన్ 8 లేక 9 ప్రకారం తిరస్కరిస్తున్నట్లు తెలియజేయాలి. 30 రోజుల తరువాత పొందే సమాచారానికి ఆ సమాచారానికి అయ్యే రుసులు కట్ట కుండగనే ఉచితాలుగా పొందవచ్చు. అభ్యర్ధన తిరస్కరిస్తే దానికి కారణాలను, ఆ తిరస్కరణపై అప్పీలు చేసుకొనేందుకు ఉన్న కాలపరిమితి, అప్పీలు విచారించి అధికారి వివరాలు దరఖాస్తుదారునికి తెలియజెప్పాలి.
సెక్షన్ 8 ప్రకారాలు కొన్ని సమాచారులను పౌరులకు అందిచాల్సిన బాధ్యత లేదు. అవి భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతలపై ప్రతికూల ప్రచారం చూపించే సమాచారం, దేశభద్రత వ్యూహాత్మక, వైఖ్ఞానిక, ఆర్ధిక ప్రయోజనాలపై, విదేశాలతో సంబంధాలపై ప్రతికూల ప్రభావం కలిగించే సమాచారం, నేరాన్ని ప్రేరేపించే సమాచారం. న్యాయస్థానం ప్రకటించ కుడదన్న సమాచారం, పార్లమెంట్, శాసన సభ హక్కులను ఉల్లంఘించే సమాచారం. వాణిజ్యపరమైన గోప్యత, వ్యాపార రహస్యాలు, మేదా సంపత్తికి సంబంధించిన సమాచారం విశాల ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సమర్ధాధికారి భావించిన పక్షంలో మాత్రమే వెల్లడిచేయవచ్చు. విదేశీ ప్రభుత్వం నుంచి విశ్వాస బద్దంగా అందిన సమాచారం సమాచర వెల్లడి వల్ల ఏ వ్యక్తి ప్రాణానికైనా, భౌతిక భద్రతకైనా హాని కలిగే సమాచారం వాటిని ఇవ్వాల్సిన బాధ్యత లేదా అలానే సెక్షన్ 9 ప్రకారం ఒక వ్యక్తికి సంబంధించిన కాపిరైట్ ఉల్లంఘన జరిగే పక్షంలో అలాంటి సమాచారం ఇవ్వవల్సిన బాధ్యత లేదు.
సెక్షన్ 19, 20 ల ప్రకారం దరఖాస్తుదారు 30 రోజుల లోపు సమాచారం పొందకపోయినా, పొందిన సమాచారముతో అసంతృప్తి చెందినా అపికేట్ అధారిటీకి 30 రోజులలోపు అప్పీలు చేసుకోవచ్చును. అప్పీలేట్ అధారిటీ నుండి కూడా తగు స్పందన లేకుంటే 90 రోజులలోపు సమాచార కమీషనకు రెండవ, అప్పీలు చేసికోవచ్చును. ఆ సమాచర కమీషన్ నిర్ధేశించిన కాలపరిమితి లోపు సమాచారం అందించలేదని భావించినా, దురుద్ధేంతో తిరస్కరించినట్లు భావించినా, తెలిసికూడా తప్పుడు, అసంపూర్తి, తప్పుదావ పట్టించే సమాచారం అందించారని ఎంచినా కోరిన సమాచారాన్ని ద్వంసం చేసారని భావించినా మరే విధంగా సమాచారం అందకుండా అడ్డుపడ్డారని భావించినా, దరఖాస్తును స్వీకరించేంత వరకు లేక సమాచారం అందించేంత వరకు రోజుకు రు. 250/- చో||న జరిమానా ఆ పౌర సమాచార అధికారికి విధించవచ్చు. మొత్తం మీద ఆ జరిమానా రు. 25, 000/- మీర కూడదు.
చివరిగా అపార్టు కమీషనర్ గారైన శ్రీ చంద్రమౌళి గారు తమ అమూల్య సందేశాన్ని ఆహుతులకు అందించారు. క్లుప్తంగా వివరాలలోకి వెళితే చట్టాలు చేయడం ఎంత సులభమో అవి అమలు పరచడం అంత కష్టమన్నారు. చట్టాలు ఎవరు చేస్తున్నారో వాటిని అడ్డంకొనేది వారే కన్న నగ్నసత్యాన్ని బైట పెట్టారు. చట్టాలు ఎంతటి గొప్పవైనా అమలు పరిచే విధానంలో అడ్డంకుల వల్ల ఆ చట్టాలు పుస్తకాలకే పరిమితమైనాయన్నారు. కాని ఇప్పుడు వచ్చిన గొప్ప చట్టాలు ఆర్‌టిఐ మరియు ఆర్‌టిఎఫ్ అమలులోకి తీసుకురాగలిగితే సమాజం మంచి ఫలితాలు చవిచూస్తుందన్నారు. ఈ ఆర్‌టిఐ వచ్చినాక తప్పు చేయటానిక జంకుతున్నారన్నారు. తప్పు చేసినవారు ఎప్పటికో కప్పటికి ఆ తప్పును ఓప్పుకోక తప్పని పరిస్థితి ఈ చట్టం వలన ఏర్పడిందని, తప్పులు బయటపడతాయి గనుక తప్పులు చేయకూడదన్న న్యాయానికి అధికారులను ఈ చట్టం తెచ్చిందన్నారు. బీదరికం, అవినీతి అతి తక్కువైన నార్వే, స్వీడన్ దేశాలలోని పారదర్శకత మన భారతదేశాలలో రావాలి వస్తుందంటూ ముగించారు.
గమనిక :- స.హ. ప్రచార ఐక్యవేదిక, అపార్టు వారి సంయుక్త నిర్వహణనలో జరిగే ద్వితీయ శిక్షణా తరగతులు 2011 డిసెంబరు 19నుండి 23 వరకు రాజేంద్రనగర్‌లో జరుగుతాయి. ముందుగా తెలియపరచిన జిల్లా బాద్యులు తమ తమ జిల్లాల నుండి ఇద్దరు చో||న హాజరు అయ్యేలా చూడడంతో పాటు ఆ శిక్షణకు వచ్చే ముందు మీదగ్గరున్న (శిక్షణాలయంలో ఇవ్వబడిన సమాచారం (నోట్సు))ను వారికి అందజేసి తగినంత అద్యయనంతో హాజరు అయ్యేటట్లు చూడగలరు.
గమనిక :- సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక తూర్పుగోదావరి జిల్లా కమిటి సన్నాహక సమావేశాలు కాకినాడలో ది. 13-11-10న, విశాఖ జిల్లా కమిటి సన్నాహక సమావేశాలు ది. 14-11-10న, విజయనగరం జిల్లా కమిటి సన్నాహక సమావేశాలు ది. 27-11-10న మరియు శ్రీకాకుళం జిల్లా కమిటి సన్నాహక సమావేశాలు ది. 28-11-10న జరిగాయి.
గమనిక :- జనవరి 30, 31న జరుపుకోబోవు సమాచార హక్కు ప్రచార ఐక్య వేదిక ప్రధమ వార్షికోత్సవ సమావేశాలకకు మిత్రులు, మిత్రసంస్ధలు తమ పరిచయంలోని క్రొత్త వ్యక్తులను, సంస్ధలను కలుపుకొని రావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.

No comments:
Post a Comment