Saturday, August 1, 2015

ముఖ్య ప్రకటన

1.    జూలై 31, ఆగస్టు 1 తేదీలలో జరిగిన చర్చల కొనసాగింపుగా సెప్టెంబరు 18,19 తేదీలలో రెండో సమావేశం జరుపుకుందామని నిర్ణయించుకున్నాము. ఆ వివరాలివిగో...
సెప్టెంబరు 18 : బైబిలు ఆది కాండము మొత్తం చదువుకు రావాలి. అందులో 1వ అధ్యాయంతో మొదలుప్టిె ఎంపిక చేసుకున్న అంశాల వరకు, అవి శాస్త్రీయ పరీక్షకు నిలబడతాయో లేదో విచారించుదాం అనుకున్నాం. ఈ విషయంపై విశేష పరిశోధన చేసిన మనిష్షే అన్నవారిని పిలుద్దాం అని జగదీష్‌ గారనగా అలాగేనని వారిని సంప్రదించాం, వారూ వస్తానని అంగీకరించారు.1. బైబిలు ఆదికాండములో చెప్పబడ్డ అంశాలు సత్యాలనదగ్గవేనా? శాస్త్రీయ పరిశీలనకు నిలుస్తాయా అన్నది విచారణీయాంశం.
2.    సెప్టెంబరు 19న ఖురాన్‌ ఆధారంగా
 1. ఖురాన్‌ పూర్వ గ్రంథాల విషయంలో ఏ వైఖరి కలిగి ఉంది.
 2. ఖురాన్‌, అవిశ్వాసుల పట్ల ఎలాి వైఖరినవలంభించమని ఆయా సందర్భాలలో చెప్పింది.
 3. అందులో అవిశ్వాసిని వధించు అనే సందేశమూ ఉందా? లేదా?
ఓ   ఖురాన్‌ ప్రకారం విశ్వాసి, అవిశ్వాసి అన్న మాటలకు అర్థమేమి?
యోచనాశీలురైన వివిధ థోరణులకు చెందిన మిత్రులారా! 'వాస్తవాల వెలికితీత' అనిపెట్టుకుందాం ఈ విచారణ వేదికను. అందరం ఆ వేదికకు న్యాయం చేకూర్చేందుకు అవసరమైన రీతిలో మన మన పాత్రలను శక్తివంచన లేకుండా పోషిద్దాం. అందరూ కక్షుణ్ణంగా ఎంపిక చేసుకున్న విషయాల వరకు తయారై రండి. మీరు ఏ పక్షాన్నైనా స్వీకరించే స్వేచ్ఛ ఉంటుంది వేదికలో.

No comments:

Post a Comment