Wednesday, April 1, 2015

వెంకాద్రి - విశ్వతత్వం - ఒక పరిశీలన


ముందుమాట :
వివేకపథాన్ని నిశితంగా శ్రద్ధగా - అధ్యయనమన దగ్గ రీతిలో చదువుతున్న వారికీ, వెంకాద్రిగారినీ నన్ను జాగ్రత్తగా పరిశీలిస్తున్న మారెండు పక్షాల అనుకూల ప్రతికూల వైఖరులు కలవారికీ, తటస్థ దృష్టి కల పరిశీలకులకూ ఈ వ్యాసంతో పని ఉంది. సాధారణ పాఠకులకంటే, పై రకాల వారిని ప్రధానంగా దృష్టినిడుకునే ఈ వ్యాసాలను వ్రాయడం మొదల్టెాను. అి్ట వారంతా కొంతకాలంపాటు సాగనున్న నా ఈ వ్యాసాలను - దీనిపై వెంకాద్రి గారివైపు నుండి వెలువడే భావాలను తులనాత్మకంగా పరిశీలించడానికి సిద్దం కండని విజ్ఞప్తి చేస్తున్నాను. మన మందరం సిద్దపడుతున్న ఈ వ్యయ ప్రయాసలకు మరింత ప్రయోజనం చేకూరాలంటే, మాయిరువురినీ ప్టి చూడడంతో పాటు వైజ్ఞానిక విషయాలలో మా యిరువురికీ ఆధారంగా ఉన్న ఆయా విజ్ఞాన శాస్త్రాలను మీరూ, ఎవరికి వారుగా చూడవలసి ఉంటుంది. చదువరులందరికీ అది సాధ్యం కాకున్నా, వాస్తవాలను జాగ్రత్తగా, స్పష్టంగా సందేహరహితంగా గమనించాలనుకున్న వారెవరికైనా ఇందుకు పూనుకోవడం అవసరం.

మరో మాట :
వైజ్ఞానికాంశాల గురించి చెప్పబూనే చర్చించబూనే మనలాిం వాళ్ళం ఇక్కడ మనలాివాళ్ళం అంటే, నేరుగా వైజ్ఞానిక క్షేత్రాలలో పరిశోధనలు చేయని వాళ్ళంగానీ, ప్రత్యేకంగా ఆయా శాస్త్రాలను విద్యగా విశ్వ విద్యాలయాలలో ఉన్నత స్థాయి వరకు చదువుకోని వాళ్ళంగానీ ఆయ్యుండీ ఆయా వైజ్ఞానిక శాస్త్రాలలో నుండి అంతో ఇంతో సమాచారం సేకరించుకుని ఉన్నవాళ్ళు అనే నా భావన వాి గురించి ప్రస్తావించుకునేప్పుడు, 'సరైన మాటల్తో చెప్పుకోవాలంటే' జాగ్రత్తగా ఆచితూచి (వళ్ళు దగ్గరెట్టుకుని అనంటే మరింత సందర్భోచితంగా ఉంటుంది) మ్లాడుకుంటుండాలి. దుందుడుకుగా గాని, తెగతెలిసినోళ్ళమన్నట్లుగాగానీ, తాను మ్లాడుతున్నవన్నీ నిర్ధారితాంశాలేనన్నట్లు ధ్వనించేట్లుగాగానీ మ్లాడనేకూడదు. అి్ట దూకుడును విపర్యయ దురాగ్రహం (దురహంకారం) అనాంరు విజ్ఞులు. తెలియకనే తెలుసనుకోవడమనే భ్రాంతి వలన జనించిన ఆవేశం వల్ల తన్ను కొచ్చే అహంభావమది.
నిజానికింకా 1. విశ్వావిర్భావం ఎలా జరిగిందన్న దాని గురించిగానీ
2. మనం పదార్ధం , శక్తి, క్షేత్రం లాి మాటలతో చెప్పుకుంటున్న దాని అస్సలు రూపం లేదా మూలరూపం (దీనినే ఈనాడు భౌతిక పదార్ధ విజ్ఞానులు తీతిదీఖిబిళీలిదీశిబిజి చీబిజీశిరిబీబిజిరీ  ప్రాథమిక కణాలు లేదా ఆదిమ పదార్ధం అనంటున్నారు) ఏమిటన్నదాని గురించి గాని, 
3. దీని కొనసాగింపు : భవిష్యత్తు ముగింపు ఎలా ఉండబోతోందన్నది గాని 
విశ్వ విజ్ఞాన క్షేత్రం పరిశోధకులకు ఇప్పికింకాతేలలేదు. కొన్ని రకాల ఊహలు మాత్రం ఉన్నాయి. గణిత పద్దతిన రాబ్టిన నిర్ణయాలు మాత్రం ఉంటున్నాయి.
వాళ్ళకే పూర్తిగా తెలీని, ప్రయోగాత్మకంగా నిర్ధారణ కాని ఆయా విషయాలను గురించి ఆ క్షేత్రాలకు చెందని మనం తెలిసిన విషయాలుగా, తేలిన విషయాలుగా, ఇంకాస్త దూకుడును జతచేసి, ఆ తేల్సింది తానేననేంత అడ్డగోలుగా మ్లాడాన్నేమనుకోగలం?
ఇలాిం సందర్భాలలో, వెంకాద్రి పోకడ రకరకాలుగా - కొన్ని సందర్భాలలోనైతే పరస్పర విరుద్దంగానూ ఉంటుంది. మచ్చుకు రెండు మూడు అంశాలు చెపుతాను.
1. సత్యాలు మారతాయాంరు - మారకుంటే అది సత్యమేకాదనేంత వరకు దానిని సాగదీస్తారు. 
1. సరైన నిర్ణయాలకు రాగలిగితే వాిని మార్చుకోనక్కరలేదు. అవి మారవు అనీ అంారు.
ఎ) మూలేమూలాభావాదమూలంమూలం అని 2500 సం||నాడు సాంఖ్యులన్నది ఈనాికీ సరైందే.
బి) 1940 ప్రాంతాలలోనే నేను కొన్నితాత్విక నిర్ణయాలకు వచ్చాను. అవి ఈ నాికీ మార్చుకొనక్కరలేనివిగానే ఉన్నాయి. ఇక ముందూ మార్చుకోనక్కరలేదనే అనుకుంటున్నాను. మారవు కూడా.
2. సి) మనిషి, గతంలో ఎన్నడూ చేరనంత దగ్గరగా, ఆధునిక విజ్ఞానం సత్యానికి దగ్గర మదింపు వేస్తోంది. 
డి) ఇక తెలుసుకోనక్కరలేదు. అనేంత దగ్గరకు సత్యానికి ఎన్నికీ చేరలేమేమో
ఇ) ఆధునిక విజ్ఞానం ఇప్పికే ఎన్నో సత్యాలను కనుగొంది.
ఎఫ్‌) జ్ఞానం విస్తరిస్తున్న కొద్దీ సత్యమూ విస్తరిస్తుంది. జ్ఞానంలో వచ్చే మార్పులననుసరించి సత్యంలోనూ మార్పులు వస్తాయి.
జి) ఒకనాి సత్యం మరోనాికి అసత్యమని తేలవచ్చు.
3. హెచ్‌) విశ్వం అనాద్యనంతమైనది. విశ్వం పరిమితమైనదీ, సరిహద్దులేనిది.
ఐ) ఆధునిక విజ్ఞాన శాస్త్రజ్ఞ్ఞులు 12-15 వందలకోట్ల సం|| నాడు విశ్వం ఆవిర్భవించిందంటున్నారు. 
1. ప్రతిమతమూ, అన్ని విషయాలలోనూ ప్రాథమిక అసత్యాలనే చెప్పింది. వేదాలు చూసుకోండి, ఉపనిషత్తులు చూసుకోండి. పురాణాలు చూసుకోండి. ప్రాథమిక సత్యాలే వాళ్ళకు తెలియవు.
మనం మతభావాలను తప్పుబడుతున్నామంటే వాళ్ళు చెప్పినవన్నీ తప్పంటున్నామని కాదు.
2. శూన్యం నుండి సృష్టి అనే మతాలు చెపుతున్నాయి. 
దేవుడు లేకముందే పదార్ధం ఉందని రుగ్వేదం చెపుతోంది. బైబిలూ ఆమాటే చెపుతోంది. ఆధునిక విజ్ఞానులు చెపుతున్న దానిని ఆ నిజాన్ని - వారూ ఒప్పుకున్నట్లే 
3. పుస్తకానికి ఆది శంకారాచార్య వ్యక్తిత్వం-తత్వంఅని పేరుప్టిెన ఆయనగారే ఆయన తత్వాన్ని వ్యక్తిత్వాన్ని సాకల్యంగా పరిశీలించడానికా రచన ఉద్దేశింపబడి లేదనీ అనేస్తాడు. ఆయన్ను అంతగా అధ్యయనమూ చేయలేదనాండు.
గమనిక : ఈ పుస్తకం ముందుమాటలోని ఒక్కమాట, ఈ పుస్తకాన్ని అవతలపారేయకుండా ఒకింత విమర్శ చేద్దాంలే అనిపించేదిగా ఉంది. ''నా ఈ పరిశీలనలో ఏమైన పొరపాట్లు దొర్లి ఉంటే నా దృష్టికి తీసుకురావలసిందిగా మనవి చేస్తున్నాను''. అన్నదే ఆ మాట.
నా లెక్క ప్రకారం, పొరపాట్లు అని ఊరుకోగూడనంత బండ తప్పులున్నా ఇందులో. లోగడనే వివేకపథం ద్వారా కొన్నింని ఎత్తిచూపాను కూడా. అవి చూసే, ప్టించుకోని ఆయన పోకడ, పైమాట ఉత్తనోి మాటగా వచ్చిందేగాని, నిజాయితీతో అన్నది కాదని నా వరకు తేలిపోయింది. మొత్తం రచననంతా పనికి మాలిందిగా తేల్చగల ఒక్కమాట ఆయన రాత నుండే ఇందులోకి వచ్చి చేరింది, చూడండి.
1. శంకరాచార్యుడి తల్లిదండ్రులెవరు?, 2. అతనెప్పుడు ప్టుాడు?, 3. ఎక్కడ ప్టుాడు?, 4. ఏమేమి చేశాడు ?, 5. ఏమి వ్రాశాడు?, 6. ఎప్పుడు మరణించాడు?, 7. ఎక్కడమరణించాడు?, 8. ఎలా మరణించాడు., 9. అతని శవాన్నేమి చేశారు?, 10. పూడ్చారా?, 11. దహనం చేశారా?, 12. ఎక్కడ?, 13. అంత్యక్రియలు ఎక్కడ జరిపారు 14. సమక్షంలో ఎవరున్నారు?, 15. శ్రాద్దం ఎవరు ప్టోరు?, 16. ఎలా ప్టోరు?, 17. ఎక్కడ ప్టోరు?, 18. శ్రాద్దం జరగనేలేదా? అన్న ప్రశ్నల్ని లేవనెత్తి, వీటన్నింకీ, చరిత్ర అనడానికి తగిన సమాధానాలులేవనీ, అతడి చరిత్రనంతా అభూతకల్పనలతో నింపివేశారనీ తేల్చేశాడు.
అర్దమవుతోందా మిత్రులారా! ఈ ఒక్కమా, వెంకాద్రి శంకరుడి గురించి రాసిన నానా కచ్చాట అంతా గాలిపోగేసి, వస్తువుల్ని చేసిన చందమే అయింది. అభూత కల్పనలే అంతా అన్నాయనే, అవన్నీ వాస్తవాలేనంటూ విపరీత పోకడ పోయారు.
ఈ అంశాన్నిక్కడెందుకు జతచేశానంటే, మన ప్రస్తుత విచారణీయాంశమైన విశ్వతత్వం రచన సందర్భంలోనూ ఆయన ఇదే పోకడ పోయారు. అపసవ్యరాత పొరపాటున రాసిందికాదనీ, అతని పోకడ రీతిలోనే ఆ దోషముందని చెప్పడానికే, పరస్పరం పొసగని అభిప్రాయ ప్రకటనలు చాలా చేశాడాయన అన్న నిజాన్ని మీ దృష్టికి తేవడానికే, ఇదీ మిగిలిన పై ఉట్టంకిపులున్నూ.
నిశితంగా చూడాలన్న అభిలాష, చూసి వడిసిపట్టే నేర్పు ఉండాలే గాని వెంకాద్రి రచనల నిండా ఇలాి విరుద్ద భావాలు దొరుకుతాయి.
ప్రతి జనవరి సంచికకూ, నేను సంక్రాంతి - విప్లవ - సందేశం అనే శీర్షికతో ప్రజల్ని ఆలోచింపచేయగలవనిపించిన, ఉత్తేజ పరుస్తాయనిపించిన కొన్ని అంశాల నెంచుకుని వ్యాసం రాస్తుండేవాణ్ణి. దానిని ఆ శీర్షికను, నన్నూ గేలిచేయాలనే తమకంతో, ఇంతైనా నేను సందేశాలిచ్చేస్థాయికి రాలేదు. అప్పుడే సురేంద్ర సందేశాలిచ్చేస్తున్నాడు. అనంటూనే నిజానికి నా రచనే నిజమైన సందేశం అనేశారు. బాగుంది. కదూ!
విశ్వతత్వంలోనూ ఇలాిం విరుద్ద పోకడలున్నాయి. మచ్చుకు, నేను విజ్ఞానినీ కాదు. వైజ్ఞానిక పరిశోధనలు చేసినవాణ్ణీకాదు. వైజ్ఞానికాంశాల రచన చేయగల సమర్ధుణ్ణికాదు, అనంటూనే 
ఎ) ఆధునిక విజ్ఞాన శాస్థ్రాలు - వైజ్ఞానికులు ఈ నాికీ సందేహాస్పదాలుగానే తలంచుతున్న అంశాలను కొన్నింని ఎప్పుడో తేలిపోయినవనిపించేట్లు వాక్య ప్రయోగాలు చేశారాయన.
బి) ఆధునిక విజ్ఞానం సుస్పష్టంగా గమనించి, నిర్ధారిత సూత్రాలుగా ప్రకించిన ఉష్ణ గతికశాస్త్ర నియమాలను తప్పుబట్టే సాహసానికి పూనుకున్నారు. ఆ శాస్త్రం అరకొరగానైనా తెలిసిన వాడు కాదని మనకు అర్ధమయ్యేలా సంవృతవ్యవస్థ, వివృత వ్యవస్థల గురించి మ్లాడారు. వాికి ఆయనిచ్చిన వివరణ, విశ్వం, ఏ వ్యవస్థ కిందికి వస్తుందని ఆయన చెప్పిన విషయాలు అన్నీ బండతప్పులే. సుదూర భవిష్యత్తులో ఉష్ణ సమతాస్థితి ఏర్పడవచ్చు నన్న ఒక పరికల్పనను, అది ఆయనకు నచ్చలేదు కనుక. దానిని క్టొివేయడానికని, ఉష్ణగతిశాస్త్రంలోని నియమాలకు పూర్తి విరుద్దమైన నియమాలూ ప్రకృతిలో ఉండేందుకు వీలుంది, ఉన్నాయి కూడా, అవి ఉష్ణ సమతాస్థితి ఏర్పడకుండా నిరోధించితీరతాయి. అనంటూ ఉదాహరణకు బ్యాటరీలలోని విద్యుత్తును చూడండి. అది మామూలు నియమానికి విరుద్దంగా - నుండి + వైపుకు ప్రవహిస్తుంటుంది. అంటే రుణం నుండి ధనం వైపుకు ప్రవహిస్తుంటుంది అని తెగబడి రాసేశారు.
తెలీనివానికి తెలుపవచ్చు, తెలిసినవానికి చెప్పి అవుననిపించవచ్చు, తెలిసీ తెలియని వానికి, తెలియకనే తెలుసనుకుంటున్నవానికి తెలపడంగానీ, ఒప్పించడంగానీ అయ్యే పనికానే కాదను నానుడికి వెంకాద్రినే గ్టి రుజువుగా చూపవచ్చు.
నేనూ - నా రచనా వ్యాసంగం అన్న పుస్తకాన్ని జ్ఞానం అనంతర అన్న మాటతో మొదల్టెారు. వెంకాద్రిగారు. జ్ఞానం ఎప్పుడూ అనంతం కాదు. కాబోదు కూడా. మనిషికి మానవజాతికి కలిగిన, కలగనున్న జ్ఞానరాశినంతినీ ఊహాత్మకంగా రాశిపోద్దామనుమన్నా అదంతా ఎంతో కొంత పరిమాణంలో మాత్రమే ఉండగలుగుతుంది. కనుక జ్ఞానం అనంతం అని అననే కూడదు.అయినా, ఎంత మందికీ నిజం తెలుసు? ఎందరీ మాటలోని దోషాన్ని పట్టుకోగలిగారు? ఈ విషయంలో నిజం - మన జ్ఞానం పరిమితం అన్నది మాత్రమే.
''జ్ఞానం ఆవిష్కృతమయ్యే కొలది సత్యం ఆవిష్కృతమౌతుంది''. ఇదీ తప్పుడు అవగాహనే, తప్పు ప్రయోగమే. జ్ఞానం ఆవిష్కృతం కావడమేమి?
జ్ఞానం ఆవిష్కృతమయ్యే కొలది సత్యం ఆవిష్కృతం అవడమేమి? అది ఆవిష్కృతమయ్యే కొలది స్వేచ్చ సాధ్యపడడమేమి? అంతా గందరగోళపు భాష.
మన జ్ఞానంలో చాలా భాగం పూర్వుల నుండివారసత్వంగా పొందిందేగాని స్వార్జితం కాదు అన్న వెంకాద్రి, పూర్వపు జ్ఞానం అజ్ఞానంగా తేలుతూరాగా, కొత్త జ్ఞానం, కొత్త సత్యాల నార్జిస్తూ సాగుతుంది మానవ సమాజం అనీ అనేశారు.
అదే పుస్తకం - ఒక్కమాట లో
ఆర్గనైజేషన్‌ ఎధిక్సుకులోపడని స్వతంత్ర జిజ్ఞాసతో బ్రతకడం నేర్చుకున్నవాణ్ణి అన్నాయనే, నాకు నేనే ఒక ఆర్గనైజేషన్‌ అనేశారు.
మిత్రుల బలవంతంమ్మీద 1979లో సంఘ (ఆర్గనైజేషన్‌) అధ్యక్ష పదవికి నేను ఆమోదించడం యాదృచ్చికంగా జరిగింది. అన్న ఆయనే, - తలదూర్చాను గనుక ఉద్యమ శ్రేయస్సు కోసం గ్టిగా నిలబడక తప్పలేదనీ అన్నారు. అంటే ఆర్గనైజేషన్‌ ఎధిక్సుకులోబడినట్లే కదా?
అది సరే! ఒకసారా పదవికి చేప్టాక, ఇప్పిదాకా పదవిని, అదీ పెద్ద పదవిని ప్రధమ స్ధానాన్ని వదిలిపెట్టనే లేదాయన. ఇది ఆయనకుగానీ, ఆ పక్షంలో ఎవరికిగానీ, విచిత్ర మనిపించదు. విడిచి పెట్టమని చెప్పాలనీ అనిపించదు. 
ఉన్నది పరిణమిస్తున్నది తప్ప సృష్టిజరగలేదు. అన్నది తన పక్షమని వెంకాద్రి ఇదే పుస్తకంలో 29పేజీలో రాశారు. ఆయనే మరో చోట సృష్టి అన్నదానికి శూన్యం నుండి ఏదో ఒకి రావడం అన్న అర్ధం చెప్పకూడదు ఉన్నది పరిణమించడం అన్న అర్ధమే చెప్పుకోవాలి. అనంటూ వేదము, బైబిలు వగైరాలుకూడా దేవునికంటే ముందే ప్రకృతి ఉనికిని అంగీకరించాయి అనన్నారు. మరలాటప్పుడు శూన్యం నుండి సృష్టి అన్న దానికి అర్ధం లేదు కదా! భారతీయ ఆస్తికులలో ఎక్కువమంది పదార్ధం - ప్రకృతి కాలాన్ని బ్టి అనాది నిత్యం - అనంతం అనే అన్నారు.  ప్రకృతి ఉపాదానం, ఈశ్వరుడు నిమిత్త కారణం మాత్రమేనని స్పష్టంగా ప్రకించారు. అంటే దేవుడు పదార్ధాన్ని సృష్టించడం లేదు. పరిణామానికి బాహ్య కారణమవుతున్నారు. దానినే సృష్టి చేయడమంటున్నాము అని నిర్ద్వంద్వంగా ప్రకించారు. కార్యకారణ వాదాన్ని తప్పనే మరో ధోరణీ భారతీయ తాత్విక క్షేత్రంలో ఉంది. వివర్తవాద మాంరు దానిని. ముఖ్యంగా శంకరునిది వివర్తవాదమే. ఆవాదం ప్రకారం, అసలున్నది ఎి్ట మార్పు పొందకుండా, అది అదిగానే ఉంటూనే రకరకాలుగా అభివ్యక్తం కాగలుగుతోంది. ఈ విషయాలు మరోసారి వివరంగా పరిశీలనకు తీసుకుందాం. ప్రస్తుతానికి వెంకాద్రి మాటలను విచారించే దానికి పరిమితమవుదాం.
ప్రకృతినీ, దాని ప్రవృత్తినీ అర్ధం చేసుకోకుండా వాస్తవికతకు మదింపు వేయడం ఎలా అన్న మరో వాక్యముంది ఆ పేజీలోనే.
అసలాయన వాక్యమే అర్ధం చేసుకోవడం కష్టంగా ఉంది, ప్రకృతిని అర్ధం చేసుకోవడమంటేఏమి? దాని ప్రవృత్తిని అర్ధం చేసుకోవడమంటే ఏమి? ఆ రిెంకీ ఉన్న తేడా ఏమి? వాస్తవికతంటే ఏమి? వాస్తవికతకు మదింపు వేయడమంటే ఏమి? వెంకాద్రి గారే మరో చోట ఆధునిక విజ్ఞానం సత్యానికి మునుపెన్నడూ లేనంత దగ్గర మదింపు వేసింది, అనన్నారు. ఇంతకూ ఆయనగారి వాస్తవికత కూ, సత్యానికీ ఆయనంగీకరించే అర్ధాలేమి? ఆయన ప్రకారం ఆ రెండూ పర్యాయ పదాలా? దేనిని సూచించే పదాలివి? ఆయన అంగీకరిస్తున్న అర్ధాలను భాష ఆమోదిస్తుందా. లేదా? గమనిక : నా అవగాహన ప్రకారం వాస్తవికత = రియాలిీ, సత్యం = ట్రూత్‌ అన్నవి సరైన అనువాదాలు మీరూ అవుననేట్లయితే రియాలిీ - ట్రూత్‌ అన్నవి సమానార్ధకాలు (పర్యాయపదాలు) కావు.
ప్రకృతి మూలరూపం ఇప్పికీ విజ్ఞానులకే అర్ధం కాలేదు. రకరకాల ఊహలతో, వాస్తవమేమిటన్నదానికై అన్వేషణ చేస్తున్నారు వాళ్ళు, ఇక సాపేక్ష సిద్దాంతం ప్రత్యేక - సాధారణ రూపాలలో రెండుగా, ఉంది. వాికి సంబంధించి దేని క్షేత్రం దానిదే, దేని అవగాహన దానిదే. ఇంతకూ, అందులోని సాధారణ సాపేక్ష సిద్దాంతం ఊహారూపమే కదా, అదైనా దానిని అర్ధం చేసుకోవడం ఒక ప్టాన అయ్యే పనికాదన్నదే వైజ్ఞానికులందరి అభిప్రాయంకూడా. ఆ క్షేత్రాలలో థాబ్దాల తరబడి తలమునకలుగా పరిశీలనలు, పరిశోధనలు, పరికల్పనలు చేస్తున్న వారికే ఒక కొలిక్కిరాని దానిని గురించి తాత్విక క్షేత్రాలలోని వారంతా అర్ధం చేసుకుని తీరాలనడం, అది కనీస అవసరమనడం హేతువాద ఉద్యమ కారులెంతమంది సరైందేననీ అంగీకరించి, ఆచరణలో ప్టిె చూపగలుగుతారు?!
మరో నిజముందీ విషయంలోనే, ఇంత బలంగా చెప్పిన వెంకాద్రిగారికే, ఈ విషయాలలో తప్పవగాహన ఉంది. వీి విషయంలో సరైన అవగాహన లేకుంటే, సరైన తాత్విక నిర్ణయాలకురావడం కుదరదన్న ఆయన వైఖరి సరైందే అయితే, ఆయన చేస్తూ వస్తున్న తాత్విక నిర్ణయాలనేమి చేద్దాం? ఇవేవీ తెలియని థలోనే మానవేతిహాసంలోని ఆయా కాలాలలో ఉన్న మేధావులు చేస్తు వచ్చిన ఇప్పికీ సరైన వేననదగిన నిర్ణయాల నేమి చేద్దాం ? 1) విశ్వం గురించి ఆయన వెళ్ళడించిన భావాలను బ్టి ఆయన అవగాహన లోపభూయిష్టమైనదే 2. ఉష్ణగతి శాస్త్రంలోని నియమాలను, వ్యవస్థలను గురించిన ఆయన అవగాహన సరిగా లేదు. ఇక విద్యుచ్చక్తి ప్రవాహం (ఎలక్టానుల ప్రవాహం) గురించి ఆయన అవగాహనలోనూ లోపముంది.
పెద్ద విడ్డూరమూ, విచారకరమూ కూడా అయిన ఒక నిజమేమంటే, ఆయనరాతల్లోని లోపాలను, దోషాలను (అశాస్త్రీయాంశాలను) ఎన్నిసార్లు ఎంతగా ఎత్తిచూపి, ఒకసారి పరిశీలనకు కూర్చుందాం రమ్మని కబుర్టిెనా ప్టించుకోనే ప్టించుకోరాయన. పోనీ కిమ్మిన్నాస్తి అంటూ గమ్మునుాంరా అంటే అదీలేదు. విషయాన్ని ప్రక్కన్టెి వ్యక్తిగతాంశాలలో అసందర్భాంశాలనో లేవనెత్తి నిందలూ, ఆరోపణలు చేస్తూవస్తారు. ఆ పక్షంలోని ఈయన తరవాత ముఖ్యులు వారివరకైనా విజ్ఞానుల్ని కలసి విషయ స్పష్టతనో చేకూర్చుకునేయత్నం చేయరు. మారకపోతే సత్యాలు కాలేవంటూనే, మావిమారవు. మార్చుకోనక్కకరలేదు. అనంటుాంరు. 
''విశ్వం నిరంతరమైనది, ఉనికి పరిణితులు అవిభాజ్యాలు'' అని నిర్ధారించాననీ అదే పేజీలో రాశారు. 
ఈ వాక్యంలోని రెండు అభిప్రాయాలూ లోపభూయిష్టాలేనన్నది నాపక్షం. మీకేమనిపిస్తోంది? 

వివరాలు పై సంచికలో....

No comments:

Post a Comment