Wednesday, July 1, 1992

ప్రమాణ వివేచన – 8


సంపుటి  2                        సంచిక . 7                                          1.7-92

గత సంచికలో మఖ్యమైన కొన్ని విషయాలను ప్రస్తావించాను. వాటినొక సారి గుర్తుచేసుకొని ముందుకు సాగుదాం (1) తార్కికతకూ - తర్కజ్ఞతకూ ఉన్న తేడాను గమనించండి. తార్కికతను (యుక్తాలోచనను) అలవరచుకోవడం. అందుకు తర్కజ్ఞత-తర్కశాస్త్రావగాహన-దోహద పడుతుందసీ తెలియడంఅలానే శాస్త్రీయ దృష్టిని పెంచుకోవడం. (2) ఎన్నివిధానాల ద్వారా విషయ జ్ఞానం కలుగు తుందో, ఆయా విధానాల ద్వారా కలిగే జ్ఞానరీతులెన్నో, వాటి స్వరూపాల లోని తేడాపాడాలేమో తెలుసుకోవడం. దీనినే ప్రమాణ వివేకమంటారు. అలానే జ్ఞానార్థ నలో తీసికోవలసిన జాగ్రత్తలేమో గమనించి ఉపయోగించుకోవడం.
(3) మేధావులలోని రకాలు : (A) ఆనేక విషయాలు తెలుసుకొన్నవారు. (B) తెలుసుకునే వాటిని గూర్చి తెలుసుకునేవారు (4) ఆ వ్యాసం మొత్తం సారాం శంగా నేను చెప్పదలుచుకున్నది, విషయాన్ని గ్రహించాలనుకున్నవారూ, పరీక్షించాలనుకున్నవారూ విషయానికి సంబంధించినంత వరకే పరిగణనలోకి తీసికోవాలనీ, విషయేతరమైన వాటినీ వేటినీ ఆసందర్భలో ముడిపెట్టిచూడరాదనీ, అంటే ఎవరు చెప్పారన్నది విడచి ఏమి చెప్పారన్నది మాత్రమే గ్రహించండనే.
(5) ఒక వ్యక్తినీ, అతడు చెప్పిన విషయాన్నీ, అతడు ఆస్తికుడా నాస్తికుడా - నా వాడా- పరాయివాడా! చిన్నవాడా-పెద్దవాడా? సన్యాసా-గృహస్తుడా నాయకుడా-సామాన్యుడాలాంటి వాటితో ముడిపెట్టకుండా చూడగలినప్పడే నిజమైన సత్యాన్వేషణ సాధ్యపడుతుంది. ఈ విషయం వినడానికి చిన్నదిగా అనిపించవచ్చగానీ, జిజ్ఞాసువునూ, పరిశీలకునీ కూడా తరచుగా పెడత్రోవ పట్టించగలుగుతోంది. మేలుకొలుపు సంచికలు ఓపిగ్గా మరోసారి తిరగవేయగలిగితే ఈ నియమాన్ని గూర్చి నేను అచ్చటచ్చటాప్రస్తావించినట్లు గమనించగలరు.
ప్రమాణముల పేర్లను గురించి అనుకుంటూ మధ్యలో ఏర్పడిన పరిస్థితుల వలన ప్రమాణ తర్కవిద్యలను గురించి మరింత విశదంగా వలన చేస్తున్నాము. ఎందుకు మరల ఈ విపులీకరణ?  ఎందుకంటే జీవితంలో ఈ విద్యయొక్క స్థానాన్ని-ప్రాధాన్యతను-పాఠకులు చక్కగా గుర్తించక పూర్వమే, నా అభిలాషకొద్దో, చెప్పవలసింది చెప్పేస్తే మన పని అయిపోతుందనుకునో త్వరత్వరగా వ్రాసుకుంటూపోతే పాఠకుల కొరిగేదేమీ ఉండదు. మేలుకొలుపు ఉద్దేశమూ నెరవేరదు. ప్రతికోద్దేశం నెరవేరడం కొరకే తర్కశాస్త్రంలో విశేష పవేశమున్న డా.వం.
2
రామానుజాచార్యల వారినీ సంప్రదించి ఒక నూతన శీర్షికను ప్రారంభించాలను కోవడమూ జరిగింది. గత సంచికలో ఆ విషయం ప్రకటించానుకూడా. కానీ దానీకీ పాఠకులనుండి తగినంత స్పందన రాలేదు. ఎందుకని?
నిజంగా తర్కపద్దతీ, ప్రమాణ వివేకమూ మానవ జీవితాని కక్కరలేనివా? వాటిని గూర్చి సమగ్ర జ్ఞానంకల వారికవి విశేష (అదనపు) ప్రయోజనాన్ని కలిగించలేవా? యదార్థంగా ఆరెంటినీ విడచి ఏ వ్యకైనా వ్యవహారం సాగించగలడా? లేదే? మరెందుకని ఈ విద్యపట్ల సమాజంలో ఇంత ఉదాసీనత (కొందరిలోనైతే వ్యతిరేకతకూడా) చోటుచేసుకుని ఉంది? ఎప్పటినుండి ఈ ఆపసవ్య భావన సమాజాన్ని పీడించడం మొదలైంది?  నిజంగా తర్కాన్నీ, ప్రమాణాల్నీ వ్యతిరేకించే వారు ఆచరణలో (నిజజీవితంలో). వాటిని విడిచి ఉంటున్నారా, ఉండగలరా! అసలారెంటినీ విడవడమంటే ఏమిటో, విడిస్తే ఏమవుతుందో ఆలోచించారా ఎన్నడైనా? నిత్యజీవిత వ్యవహారంలోనూ, విద్యా విధానంలోనూ తర్క, ప్రమాణాలు ఏ పాత్రను నిర్వర్తిస్తున్నాయో చూడగలిగితే ఈ మాట అనగలరా? ఉదాసీనంగా ఉండగలరా? ఏ మాత్రం అనలేరనీ, ఉదాసీనులు కాలేరనీ ఘంటాపథంగా చెప్ప గలను. ఇంత శ్రమించీ, పాఠకులలో దీనిపై ఉత్సుకత [తెలిసికుందాపన్న కోర్కె]ను కలిగించలేకపోవడం నాకు బాధాకరమైన విషయమే. అయినా సత్యజ్ఞానార్జనలో వీటి పాత్రనెరిగిన వారు అందరి హితాన్నీ కోరి ఏదోవిధంగా సమాజాన్ని ప్రేరేపించడం ఉచితంకాగలదు.
తెలిసీ తెలియని వారీలోనూ, వారిద్వారా పేరేపిపంబడి ఏదో మార్గాన పోతున్న సామాన్యులలోనూ మాత్రమే ఈ విషయాల పట్ల వ్యతిరేకత ఉంది. మరి ఈ విషయంలో ప్రాచీన తాత్వికులూ, సిద్ధాంత స్థాపకులూ, ప్రవర్తకులూ ఎలాటి అభిప్రాయం కలిగిఉన్నారో, అలానే నవీన విజ్ఞాన శాఖలీ విషయాన్నెంత ప్రముఖంగా స్వీకరిస్తున్నాయో గమనించి తేనన్నా మన కంటిన ఈ మౌఢ్యం సడలదు. జాడ్యం వదలదు. పై రెండు కోవ ల దృక్పధాన్నీ మీ ముందుంచుతాను. సావధానంగా గ్రహించి ఒక నిర్ణయానికిరండి. ప్రాచీనుల భావన లిలా ఉన్నాయి.
 (1) వేదాలనర్థం చేసికోవడానికి షడంగాలు అవసరమైనవిగా నిర్ణయించారు పూర్వీకులుశిక్ష,చందస్ను, వ్యాకరణం, నిరుక్తం, కల్పం, జ్యోతిషం అన్నవే అవివాటిలో మొదటి నాలుగూ భాషా విషయానికి చెందినవి. ఈ ఆరు  శాస్తాలలో ప్రవేశమున్నవారే వేదార్థాన్ని గ్రహించగలరన్నది వారి భావన. ఎందుకంటే వేదం వాజ్ఞ్మయ (శబ్ద) రూపమే అగుటవల్ల భాషారూపంలో నిక్షిప్తం
3
చేయబడ్డ బిజ్ఞానాన్ని ఆందుకోవడానికి భాషాస్వరూపస్వభావాల్నీ, నియమ నిబంధనలనూ అర్ధం చేసికొని ఉండడం ప్రాధమికావసరం అవుతోందీఅలానే ఉపాంగాలుగా షడ్డర్శనాలను ఎంచుకున్నారు వారు. న్యాయవైశేషికాలు, సాంఖ్యయోగాలు, పూర్వోత్తర మీ మాంసలూ అన్నవే ఆ ఆరు. వీటిలో ప్రావీణ్యులైన వారి కవి అద్దంలా వేదార్ధాన్ని ప్రకటపరుస్తాయన్నది వారి భావన. ఆ ఆరు దర్శనాల్లోనూ తర్క ప్రమాణాలు సామాన్య విషయాలు. ఆ దర్మనాలన్నీ తాము ప్రతిపాదించి నిర్ధారించదలచుకున్న వాటికి సాధనాలుగా తర్క ప్రమాణాల్నే స్వీకరించాయి. తరువాతి కాలంలోని వారైన సాంప్రదాయ ప్రవర్తకులలోనూ వాటివిలువలు తగినంతగానే ఉంటూ వచ్చాయి. ఈ తరం వారిచే ఒక సూక్తి స్మరింపబడింది. కాణాడం, పాణినీయంచ సర్వశాస్తోపకారకం అన్నదే ఆసూక్తి. సర్వశాస్తాలకు ఉపకారాన్ని కలిగించగలవి తర్కమూ, వ్యాకరణమూనని ఆసూక్తి భావం. విజ్ఞా నార్థనలో పలానివారికవి ఆవసరమనీ, పలానివారీ కక్కరలేదనీ చెప్పడం కుదరదు. కాణాదం అనుటవల్ల న్యాయవైశేషిక దర్శన విషయాలైన తర్క ప్రమాణాలనూ, పదార్థ విజ్ఞానాన్నీ, పాణీనీయం అనుటచే భాషా సంవిధానమూ,. భాషాప్రయోగాల స్వరూప స్వభావాల నెరిగి ఉండవలసిన అవసరాన్నీ, సర్వ శాస్త్రోపకారకం అను టచే ఆన్నిరకాల శాస్తాలకూ వాటిలోనున్న విడదీయరాని సంబంధాన్నీ స్పష్టంగా గ్రహించి భావితరాలకూ సూచించారన్నది తెలుస్తోంది. పరంపరాగతంగా అందున్నట్టి, జ్ఞానార్థనలో ఆద్యంతమూ అవసరమైయున్నట్టి, వీటిని, తరువాత తరానికి చెందిన సిద్ధాంతకారులూ, ప్రవర్తకులూ (నాస్తిక, ఆస్తికాది విభిన్న మార్గీయులైన బుద్ద,  జైన, చార్వాక, శంకర, రామానుజ, మధ్వ , మీమాంసకాదు లెల్లరూ] చక్కగానే స్వీకరించారు.  తర్క, ప్రమాణ విద్యలందు బహుముఖ ప్రజ్ఞను సాధించే ప్రవర్తించారు. ఈ నాటికీ ఆయా పీఠాధిపతులకు తర్క వ్యాకరణ విద్యలు నేర్పే, వారి వారి సిద్ధాంత స్వరూపాల్ని ఆభ్యసింపజేయడం నియమంగా సాగుతోంది. వారందరకూ అవి అవసరమైనవిగా ఎందుకనిపించాయి? మరి నవీన గుప రూపధారులకూ, జిజ్ఞాసువులకూ, ఇతరులకూ ఎందు కక్కరలేని వై నాయి? ఒకింత లోతుగా పరిశీలిస్తేతప్ప వీటికి కారణాలు అంతుబట్టవు.
(1) సాంప్రదాయకాస్తికులందరకూ ప్రమాణములైన శృతులచ్చటచ్చటా తర్కాన్ని నిరాకరించడమో, నిరాదరించడమో చేసాయి. గురపరంపరద్వారానూ తర్కానికి అప్రతిష్టాదోషం ఆపాదింప బడినది. -
తర్క శాస్త్రంలోనే తర్కమన్న మాటకు మరో సందర్భంలో వేరు ఆర్థం
4
కల్పింపబడినది. వ్యాప్యారో పేణ వ్యాపకారోపస్తర్క: . ఇది తర్కానికి నిండితార్ధము.ఒక వేళ వెనుకటివాళ్ళు ఈ అర్థంతో తర్కాన్ని తీసుకుని [ఆపసవ్యపు తర్కాన్ని) నిరాక్షి రించి ఉండవచ్చు.
 (3) ఈ తర్క- ప్రక్రియ నాధారం చేసికవి పండితులు పాండితీ ప్రకర్షను ఆతిగా ప్రకటపరచుకోవడం ఒక కాలంలో జరిగి ఉండాలి. అలానే ఆయ్యుంటుందనేందుకాధారంగా గొప్పతార్కికుడై న రఘునాథ శిరోమణి రచించిన ఈ క్రింది ఆర్ధాన్నిచ్చే శ్లోకాన్ని చెప్పకోవచ్చు. "పండితులందరూ ఒప్పన్న దానిని తప్పని నిరూపిసాను. మరి అందరూ తప్పన్న దానిని ఒప్పుగా నిర్ధారిస్తాను." ఇలాంటి పట్లు పట్టుకోవడానికై తర్క లక్ష్యాన్నే [సత్యావిష్కరణే తర్కపరమావధి) డెబ్బతీసే విధంగా బుద్ధిబలం యొక్క బలా బలాలను తేల్చుకోవడానికి ఉపకరణంగా తర్కాన్నతిగా వాడుకుంటున్న రోజులలో [దీనినే నేను గతంలో అతి తర్కం అన్న పేరుతో మీ ముందుంచాను. అయందానికీ, కాని దానికీ కూడా తర్కిస్తుండడం దీనిలక్షణం) నిజమైన తాత్వికులు, ఆ సమయానికి తగినట్లు తర్కాన్ని నిరాదరించి ఉండవచ్చు. రఘునాధ శిరోమణి గొప్ప తార్కికుడే కావచ్చుగానీ ఒక పెద్ద తప్పుమాట ఆన్నానని తాను గానీ, దాన్నో గొప్ప విషయంగా సమ్మానించే తార్కికులు గానీ గమనించలేదు. వాస్తవంగా వాస్తవికులందరూ నిందించదగ్గ ఆంశమిది. ఏ మంటే సత్యాన్ని మరుగుపరచగల బుద్ధిబలం ఏ సత్పలితాన్నిసాధించగలదు? ఎవరినుద్దరించుట కొరకు? ఆలాటి ఘఠితఘటనా సమర్థులైన దుస్తార్కికుల తర్క క్రీడల వల్లనేకదా తర్కంపనికిరానిదన్న వ్యతిరేక భావం సమాజంలో నిలువగలిగింది. నాడది వ్యక్తిగతంగా వారి కెంత ఆనందాన్నీ తృప్తినీ కలిగించిందో గానీ, క్రమంగా తర్క విద్యే పనికిరానిదన్న తప్పు అభిప్రాయం వీర్పడేందుకు మాత్రం బాగా ఉపయోగపడింది. ఇది మనందరమూ విచారించవలసిన విషయం, ఎందుకంటే,
యదార్థంగా ఏ క్షణాన తర్కాన్నీ (యుక్తాలోచనను) జ్ఞానసాధనాలనూ తగినంతగా ఉపయోగించుకోవడం మానుకున్నాడో ఆ క్షణాన్నుండే మనిషి అందుకు తగ్గట్టే నష్టపోతున్నాడు. ఇదో నిప్పులాంటి నిజం. చైతన్యానికి (తెలివికి] ఆధారమైన ఇంద్రియాలూ, మెదడూ, వాటి కార్యక్రమమూ అన్న వాటిలోనే అన్ని ప్రమాణాలూ, ‘తర్కమూ, ఇమిడి ఉన్నాయి. మరి ప్రమాణాలు కాదనట మేమిటి ? కలిగిన అనుభవ సారాంశంగా ఏర్పడిన జ్ఞానరాశి నుండి జనించిన ఆలోచనను, ఆందునా సహేతుకమైన ఆలోచనను. అక్కరలేని దనడ మేమిటి?
5
మాటవరసకన్నా ఆచరణలో ఆలోచననూ, జ్ఞాన ప్రక్రియా విశేషాలను,విడుస్తాడా ఏమనిషైనా? అసలు విడువగలడా అని? విడుద్దామనుకునే వారూ, విడవమనేపాూ వాటిని విడిస్తే ఏమవుతుందో ఆలోచించారా ఎన్నడైనా?
4.కఠోరమూ, సునిశితమూనైన మానసిక పరిశ్రమతో కూడుకున్నవిద్య యిది. సమర్ధుడైన తార్కికుడు తనలోనీ, ఎదుటివానిలోనీ దోషాదోషాలను అత్యంత సూక్ష్మగానూ నిశితంగానూ, చూడగలడు. కనుకనే స్వార్థపరులూ,సోమరులూ ,అజ్ఞానులైన వారు తమ గురు స్థానాలనధిష్టించిన్ పిదప కాలంలో తమ ఆస్తిత్వాన్నీ, ఆధికారాల్నీ నిలుపుకోడానికై ఎదుటివారిని [సమాజాన్నీఅందులోని వారే అయిన అనుయాయులను) సూక్ష్మవిచారం తయారుచేయడానికి పన్నిన ఎత్తుగడ అయ్యుండ వచ్చు.  నేడు మాత్రం ఈ అంశమే ప్రబలమై సామాన్యుని నుండి విద్యావంతుల వరకు ఆందరిలోనూ, అంధ విశ్వాసాలను  పెంచి పోషిస్తోంది.
అయితే ఏ విజ్ఞాన శాఖలైనా తర్కాన్నీ,ప్రమాణాలను విడచి మనగలుగుతాయా ! మనలేవు. ఆయా శాస్త్ర రంగాల్లో తర్కం పాత్ర అన్న దాన్ని కళాశాల విధ్యార్ధులకు పాఠ్య గ్రందాలుగానున్న తర్క శాస్త్ర పరిచయ గ్రంధాల్లో చక్కగా వివరించడం జరిగింది. విజ్ఞానశాఖలన్నీ స్వీకర్షించి ఉపయోగించుకుంటున్నతర్కాన్నొక చేదు మాత్రగా భావించే వారికి, చేదు మాత్రే అయినా అజ్ఞాన రోగానికది దివ్యౌషధం అన్న కనువిప్పు కలిగించగలవు. ఆవివరలు. మేలుకొలుపు ఆశయంలో భాగంగా వాటినీ కొన్నింటిని మీముందుంచభోతున్నాను. పరిశీలించండి.
1. "తర్కం-శాస్త్రీయ" విధానం అన్న పేరుతో తెలుగు అకాడమీ వారు ముద్రించిన గ్రంధంలో తర్కమంటే ఏమిటి? అని ప్రశ్నించి సమాధానం ఛెప్పారు. 1) ఆలోచనా నియమాల అధ్యయనాన్ని తర్కమనవచ్చు. 2)ఒక  తెలిసిన విషయాన్నాధారం చేసుకుని మరేదాన్ని తెలుసుకునేందుకు చేసే క్రమబద్దమెన యోచననే తర్కమంటారు. 3) తర్క శాస్త్ర మూలద్రవ్యం-  సారాంశం- క్రమబద్దమైన చింతనా వ్యవస్తే.
4 ) ప్రతి విజ్ఞాన శాస్త్రంలోనూ తర్కం అంతర్భూతంగా ఉండి తీరుతుంది. అతి నిర్దిష్టమైన గణితశాస్త్రం కూడా తర్కంపైనే పూర్తిగా ఆధార పడుతుంది. శుద్ధగణితం తర్కానికి భిన్నం కాదంటారు  బెర్ల్ట్ర డ్రండ్ రస్సెల్, 5) అధునాతన శాస్త్రీయ సృష్టి కంప్యూటర్. అది పనిచేయు విధానం పూర్తిగా తర్కం(బూలేతర్కం) పైనే ఆధారపడిఉంది.
6
6)సంకుచితార్ధంలో తర్కం  ప్రామాణిక వాదాల సిద్ధాంతం. విస్తృతార్ధంలో చెప్పుకోవాలంటే క్రమబద్ధమైన చింతనా వ్యవస్థద్వారా సాధారణీకరణాలకు చివరకు అమూర్తీకరణాలను (నిర్దిష్ట రూపాలను) సాధించి పెట్టే శాస్త్రం తర్కమని ఎవరైనా అంటారు.
7)  ఉపసంహారం పేరుతో ఆ గ్రంధంలోనే  “ యదార్ధాన్వేషణలో మన మందరం ఆంధకారంలోనే కొట్టుమిట్టాడుతున్నాం. తర్కం లేకపోతే మనం మొదట్లోనే తప్పిపోతాంఅని వ్రాశారు.
2) B.A.తత్వశాస్త్రం, తర్కం - శాస్త్రీయ విధానం (వెంకటేశ్వర విశ్వ విద్యాలయ ప్రాంతం) అన్న పేరుతో నున్న గ్రంథంలో (దీ తెలుగు అకాడెమీ ప్రచురణే) తర్కాన్ని గురించి విపలమైన వివరణ చేయబడింది. ఇష్టమన్న వారు దానిని సాకల్యంగా అధ్యయనం చేయండిస్థలాభావంవల్ల దాని సారాంశాన్ని మాత్రం వ్రాస్తాను. గ్రంథ ప్రథమాధ్యాయంలో తర్కశాస్త్ర స్వభావము,  తర్క శాస్త్ర నిర్వచనము; తర్కము శాస్త్రమా-కళా ?  తర్కశాస్త్రము-ఇతరశాస్త్రాలు,తర్కశాస్త్రము-వ్యాకరణశాస్త్రము, తర్కమూ- మనస్తత్వశాస్త్రము, తర్కము- నీతి శాస్త్రము, తర్కము-అన్వయము, తర్కశాస్త్ర ఉపయోగాలు,  అన్న ఉపశీర్షికలతో విషయాన్ని వివరించారు. అందులోనేవారు "సత్యాన్వేషణకు ఆలోచనే మూలము. ఈ ఆలోచన ద్వారా మనం ఒక విషయాన్ని గురించిగానీ. వస్తువును గురించిగానీ,కూలంకషంగా తెలుసుకోగ లుగుతున్నాము.ఈ ఆలోచన మనం అన్య విషయాలను గురించి యోచించడమేగాక,  ఆలోచనల తీరుతెన్నులను గురించీ ఆలోచిస్తాము. ఆలోచనా స్వరూపాన్ని అర్థం చేసుకోవాలంటే దానిని గురించి ఆన్వేషించాలి. ఆలోచ నలోని మూలసూత్రాలనూ, నియమాలనూ, తెలియజేసేదే తర్కశాస్త్రమము. యుక్తాలోచన (right thinking) అన్నది తర్కం మీద ఆధారపడి ఉంటుంది. తార్కికాలోచన అన్ని విషయాల్నీ నిర్దుష్టీకరిస్తుంది. కనుకే దానిని యుక్తాలోచన(right– thinking) అన్నది ప్రమాణానికి అనుగుణమయి సత్యాన్ని తెలుపుతుంది. కాబట్టి దానిని ప్రాణికాలోచన అని గూడ అంటారు. ఈ చర్చను బట్టి ఆలోచన  1) యుక్తాలోచన లేక ప్రామాణికాలోచన రూపంలోనూ.2) అయుక్తాలోచనగానూ ఉండవచ్చని తెలుస్తోంది. తర్కం వద్దనేవారు అయుక్తాలోచనపరులనే దీనర్థం. తర్కం యుక్తాలోచనాధార సూత్రాలను మాత్రమే నిర్ణయిస్తుంది. వస్తువు నిర్ధరించే ఆలోచన ప్రమాణాను గణితగా ఉండవలె. ఈ వివరణలు చూపిన –
7
పిదపనైనా జీవితానికి తర్క ప్రమాణాల వివేకం యొక్క అవశ్యకత ఎంతుందో పాఠకులు గ్రహించగలరనుకుంటాను. తర్కాన్ని నిందించే తిమిరాంధులకిది జ్ఞానాంజనమై కనువిప్పు కలిగించగలదని  ఆశిస్తాను.  ఆయా గ్రంథాలను అధ్యయనం చేయండి. సరే.
జూన్ సంచికలో నేను వ్రాసిన కొన్ని మాటలపై ఒకటి రెండు అధిక్షేపణలూ,సూచనలూ అందాయి. పాఠకులలో మరికొందరకున్నూ అట్టి అభిప్రాయాలేర్పడి ఉండవచ్చు. ఆ ప్రయోగాల వెనుక నా భావాలేమో ఆ సందర్భమేమో, వివరించడంవల్ల అపోహలు తొలగగలవేమో ననిపించుటచే వాటిని మీముందుంచుతున్నాను. అవి 1)అవి నాలో నవ్వుకుంటూనో (6పే 2పే) అన్నది. వీటిని ఉదహరిస్తూ ఆధిక్షేపణగా లేఖ వ్రాసినవారు మండలికి అత్యంత సన్నిహితులూ, ఒక రకంగా మండలి చేయబోయే కార్యరంగంలో ప్రముఖ పాత్రధారులు కావలసియున్నవారే.  పైగా వారొక రచయితకూడా. నేనుపయోగించిన పై మాటలు వ్యంగ్యార్ధాన్నిచ్చే మాట నిజమేగాని, ప్రతి సందర్భంలోనూ, అవి హేళననే తెలుపుతాయనుట సరికాదు.  పైసూచన చేసిన మిత్రులు,  మనం ఎవరినీ హేళన చేయుట మంచిది కాదు అన్న సదుద్దేశంతోనే ఆ సూచన చేసినా వాస్తవానికా సందర్భం అట్టిది కాదు. నిజంగా ఆ సంఘటన కాలంలోగానీ, వ్రాసేటప్పుడుగానీ, ఎవ్వరినీ కించపరచే ఆలోచన నాకు లేదు. పై ఆరోపణ చేసినవారినీ,  పాఠకులనూ నేను కోరేదేమంటే మరల మీరొకసారి ఆసన్నివేశాన్ని మొత్తంగాను, నిష్పాక్షికంగానూ(అభిప్రాయాలు పెట్టుకోకుండా)పరిశీలించడనే. అసలా సంచికలో ప్రధానంగా చెప్పదలచుకున్న విషయమూ, విషయాన్ని  పరిశీలించే వారు(జిజ్ఞాసువులూ,పరీక్షకులూ) ముందుగా ఏ అభిప్రాయం పెట్టుకోకుండా విషయాన్ని విషయంగా చూడాలన్నదే. ఈఅంశం చూడడానికి చిన్నదిగా కనుపించినా తరచుగా అన్నివర్గాల మేధావులనూ, ప్రమాదపడేట్లు చేస్తున్నదని సోదాహరణగా చెప్పేయత్నం చేశానందులో. ఇందులో ఉదాహరణకు నేను వాడిన పేర్లు అంత ప్రధానమైనవి కాదు. జరిగిన విషయాలే మీ ముందుంచడం నా ఉద్దేశం  కాదు. ఒకవేళ ఆంతమాత్రమే నా ఉద్దేశమైతే వారికొచ్చిన నష్టమేమీ లేదుగానీ, రచయిత సంకుచిత స్వభావాన్నే చూపిస్తుందది. నన్ను నేనంత చిన్నవాణ్ణిగానూ
8
అనుకోవడం లేదు. అలా ఎవరినో రచన ద్వారా గేలిచేస్తూ ఆనందించడానికింత కార్యభారాన్ని తవ్వి తలకెత్తుకోవలసిన అవసరమూ లేదు.
                ఏదైనా ఒక్ ఔదాహరణను అర్ధం చేస్కొనేందుకు దానివెనుకనున్న ప్రతిపదితంశాన్ని, సందరర్భాన్ని ప్రధానంగా తిసికోవడం పరిశీలనకు సరైన పద్ధతి. అభిపాయం పెట్టుకోకుండా చూడగలగడం అన్న విషయం నిజంగా నెననుకుంటున్న దానికన్న ప్రమాదకరమైనదిగానే కనుపిస్తోంది అనుభవంలో. కనుకనే అంత విపులంగా విషయాన్ని చెప్పడానికి యత్నించినా, పై అధిక్షేపన చేసిన వారికి నాపై వ్యతిరేక దృష్టేమీ లేకపోయినా , మరల అదే ప్రమాదం జరిగిందిచ్చట. ఈ సందర్భంలో అట్టిదేమీ జరగలేదే అనిపించవచ్చు మీకు. ఆ సందర్భాన్నొకసారి చూడండి. నాలో నేను నవ్వు కుంటూనో, విచారిస్తూనో అన్న మాట చదవగానే ఆయన మనస్సుకు కలుక్కుమనిపించి ఉండాలి. ఎందుకని, అటువంటి ప్రయోగం కించపరచాలనుకున్న సందర్భంలోనే చేయాలి,చేస్తారు అన్న అభిప్రాయం అప్పటికే ఏర్పడి ఉంది వారిలో. ఇక్నేం దాని పని అది చేసింది. దాంతో అ పద్ ప్రయోగం చేసిన నేను ఎదుటి వారిని కించపరచే ఉద్దేశంతో ఉన్నట్లు అనిపించింది వారికి. అట్టి సమయంలో ఇక సందర్భం-దానికున్న స్థానం రెండవస్థాయికి జారిపోతాయి ఎవరికైనా! (సందర్భం కాకున్నా ఇక్కడో విషయాన్ని చెప్పాలనిపిస్తోంది. నాపిఅ ఆరోపణ చేసిన వారికి నాపై వ్యతిరేకత నిజంగా లేకున్నా ఈ మాటనగలిగారంటే ఆయన స్వభావంలో సూటిగా – నిష్కర్షగా – ప్రవర్తించే లక్షనముంది అనుకోవచ్చు.) సరే. గత సంచికలోని ఆ సందర్భాన్ని నేను వివరించను. నిజాయితీగా పరిశీలించి నిష్కర్షగా మీఅభిప్రాయాలు తెలుపండి. వ్యక్తిని కించపరచేందుకుగా ఉద్దేశించబడినట్లనిపిస్తే స్పందనకు వ్రాయండి, ప్రచురిస్తాను దానిని.అయితే పూర్వాపరాలనూ కలిపి, విషయాన్ని సాకల్యంగ పరిశీలించండి.
            ఆ సంచికలోనే ఒక మేధావిని గురించి ప్రస్తావించాను.(8పే-2పే)దాన్లో, నా గురి&చి ఒక అభిప్రాయానికి రాగలిగితే బాగుంటుందని వారి మనస్సు వారికి చెపుతోదని వ్రాశాను. మా మధ్య చాలా లాలంగా ఒక సమస్య అపరిష్కృతంగా ఉంటోంది. అదేమంటే ఏదైనా విషయాన్ని, చెప్పి తెలుపలేమని-చెపితే తెలియదని-వారి వాదన. బొత్తిగా తెలీని పదార్ధాలను పదం చెప్పి తెలుపలేమనేంత వరకు నాకూ అంగీకారమేననీ అయితే ఆయన నేను చెప్పను, నేను చెప్పను అని అంటున్న అనేక సందర్బాలలో అవి చెప్పదగినవేవనీ, చెపితే తెలిసేవేననీ నేనడం జరుగు
9
తోది. జూన్ సంచికలో కొలతలు లేకుండా కొలుస్తాననడం    . సరే కొలవండనటం (5పే 2 పేరా)రెండూ తెలివి తక్కువ పనులేననీ, అలాంటి సందర్భంలో చెప్పనని, నేనన్నట్లు వ్రాసిన  విషయం చదవగానే వారు, “సురేంద్ర ఇన్నాళ్ళకు గమనించాడన్న మాట కొలతల గురించి” అన్నారు. ఇక్కడా అభిప్రాయం పెట్టుకు చూడడమన్న ప్రమాదమే జరిగిందని నేనంటే మీలో చాలామందికీ, వారికీ నాదో ఊతపదంలా మారిందనిపించవచ్చు. కాని వాస్తవంగా జగిందదే. ఎలాగంటే,చెబితే తెలియదు అన్న, వార్రి భావాన్నిచ్చట నేను సమర్ధించాననుకుని ఇప్పటికి నా మార్గానికి వచ్చాడు సురేంద్ర అన్న భావాన్ని వైలిబుచ్చారాయన. కానీ నిజంగా అక్కడ జరిగింది ఆదికాదు.  ఆ సంచికల్లో కొలతల గురించి నేనడిగిన సందర్భం ఏమిటీ?  తెలిసిన విషయం సత్యమో కాదో నిర్ణయించేదెలా? అన్నది అక్కడ నా ప్రశ్న. ఎందుకంటే ఎవరి కొలతలు వారివైతే సత్యా సత్యాలు నిర్ధారించడం అసంభవం. కొలతలందలి తేడాలననుసరించి ఒకే విషయం కొందరికి సరైనదిగానూ, కొందరికి సరికానిదిగానూ అనిపిస్తుంది. కనుక సార్వత్రికమైన కొలత అవసరం. తెలిసుంటే దానిని ఛెప్పమన్నానేగాని, చెపితే తెలియదు కనుక  చెప్పను, అనలేదుకదా!  ఆయినా అంతటి మేధావి, అభిప్రాయాలు పెట్టుకుని (రంగుల్లోంచి)చూడకూడదన్న విషయం సుస్పష్టంగా తెలిసి ఉన్న వారూ ఐనప్పటికీ ఆక్షణంలో జరగకూడనిది జరిగే పోయింది. అంత ప్రమాదకరమూ, బలవత్తరమూ అయిన విషయం కనుకనే [ఇక్కడో నిజం చెప్పాలి. చాలా అరుదుగానే అయినప్పటికీ ఎప్పుడో ఒకసారైనా నేనూ ఆ అడుసు తొక్కుతూనే ఉన్నాను.అయితే ఏమాత్రం సంకోచించండా ఆక్షణంలోనే కడిగివేసుకుంటున్నాను.(ఏ రంగూ మిగలకుండా) ప్రతిసారీ మరల మరల-అది ఆలవాటుగా మారేంతరచుగా- ఈ సూచన చేస్తుండడం పరిపాటిగా మారింది నాకు; అని వ్రాశాను. ఇప్పడూ మరల మీకా విషయం గుర్తు చేయాలనే అనిపిస్తుంది. నావరకు నాకూ విసుగుగానేఉంది: ఆయినా తప్పదుమరి. అభిప్రాయాలు పెట్టుకోకుండా విషయాన్ని విషయంగా-దాన్ని ఆదిగా- చూడగలగడం సత్యజ్ఞానార్జనకు ప్రాణం వంటిది.దీని ప్రాముఖ్యతను జాగ్రత్తగా గమనించి మనస్సుకు పట్టించుకోండి. ఎవరెవరెంతెంతగా దీని నర్థం చేసికుని అమలులో పెట్టుకోగలరో సత్యజ్ఞాన విషయంలోo వారంతరతగా ప్రయోజనాన్ని పొందగలరు. ఈ విషయంలో మీరైనా, నేనై నా, మరెవరైనా బ్యాలేన్సు కోల్పోతే తప్పు నిర్ణయాలే ఏర్పడతాయి. ఈ విషయాన్ని”జ్ఞాన పీఠం”అన్న వ్యాసం ద్వారాను, మీకందించాను. చక్కగా వినడం,విన్న
10
మాటలకర్ధాలను అన్నవాడి నుండే స్వికరించడం అన్ప మాటకర్ధం యిదే,

వ్యాసాన్నీ మరోసారి మననం చేయండి. చెప్పీ, చెప్పీ నాకూ విసుగ్గానే ఉన్నా దాని స్థానాన్ని బట్టి జెప్పక తప్పుట లేదు. సమిష్టిహితం నిజంగా మన ఉద్దేశమైతే ఒకరి నొకరు కించపరచుకోవడమన్నదీ బాల చేష్టలాంటిదే. నేను చేసినా ఎవరు చేసినా వారి వారి చిన్న మనస్సును చూపిస్తుందది. ఒక్క మాట చెప్పి ఇప్పటికిది ముగిస్తాను. "అప్రియస్యతు పధ్యస్య వక్తాశ్రోతాచ సుదుర్లభః!ఇష్టంలేనిదైనా మేలు- హితం-కలిగించేమాట చెప్పేవాడు, వినేవాడూ కూడా అతి దుర్లభం అన్నది సూత్రార్ధం. అందరం ఆలోచించదగినదిది. ప్రమాణ వివేచనకనుబంధమే ఆయినా స్వతంత్ర శీర్షికగా మరో దానిని ప్రారంభిస్తున్నాము స్వీకరించి సఫలులు కండి.

No comments:

Post a Comment