Saturday, August 1, 1992

ప్రమాణ వివేచన - 10

సంపుటి-2                                 సంచిక- 9                                               1.8.92

గత సంచికలో ఇందియానికీ, అర్థానికీ ఏ మేరకు, ఏ రీతిగా సంబంథ మేర్పడిందో ఆ మేరకే ఆ రీతిగనే తెలియడాన్ని ప్రత్యక్షజ్ఞానమంటారని చెప్పు కున్నాం. ఇంద్రియాల కాయా విషయాలతో సంబంధమేర్పడడము. ఇంద్రియాలు తమ కందిన విషయాన్ని మెదడుకు చేర వేయడమూ, మేడస్సులో ఒక చోట అవి ప్రతిఫలించడమూ (దీనినే అనుభవం అనాలి. గుర్తంచుకోండి ) ఆలా ప్రతి ఫలించినవాటిని మనం గ్రహించడమూ జరుగుతోంది. ఈ క్రమ విధానాన్ని ప్రత్యక్ష పద్ధతి అనీ, ఈ పద్ధతి ద్వారా మనకు కలుగ జ్ఞానాన్ని ప్రత్యక్ష ప్రమ అనీ అంటాము. పరిశీలిస్తే ఈ విధానంలో పనిచేసే ఉపకరణాల సంఖ్యను బట్టి ప్రత్యక్ష జ్ఞానం ఆరు రకాలు. ఆ పరికరాలు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, మనస్సు ఆన్నవే. ఆ యింద్రియాలనాయా ప్రత్యేక విషయాలకు ప్రమాణములనీ, ఆ యింద్రియాలన్నీ పనిచేస్తున్న ఫైఖరిని బట్టి పైన పేర్కొన్న క్రమాన్ని బట్టి ప్రత్యక్ష పద్ధతి అనీ- ఈ మొత్తాన్నీ ప్రత్యక్ష ప్రమాణమనీ కూడా అనుకున్నాం. దీని విపులీకరణ రూపం యిలా ఉంటుంది చూస్తే.
(1) నేత ప్రత్యక్షం :- రూపాలు, రంగులు ప్రధానంగా తెలియబడ తాయి. దీని ద్వారా క్రియలు:-(కదలికలు) సంఖ్య; సామాన్యము (జాతి], విశేషము, సంబంధాలు, సంయోగ విభాగాలు, పరిమాణము, వ్యక్తి, ఘనత్వ, ద్రవత్వాలు, కొన్ని వాయురూపాలు మొదలగునవన్నీ కంటి ద్వారా తెలుసుకుంటున్నాము.
(2) ష్రూణ ప్రత్యక్షం :- సుగంధ, దుర్గంధాలు, వాటిలోని సామాన్య విశేషాలు దీనిద్వారా తెలుస్తున్నాయి. రకరకాల ద్రవ్య సమ్మేళనాల నుండి ఏర్పడే
నానా విధ గ్రంథ రూపాలూ ఇందులో ఉన్నాయి.
(3) నాలుక-రస ప్రత్యక్షం :- రసమంటే ఇక్కడ రుచి అని అర్ధం.రుచులు ముఖ్యంగా ఆరు. అవి కల ద్రవ్యాల రకరకాల కలయికల వలన ఏర్పడే రుచులనేకం. వీటిలోనూ సామాన్య, విశేషాలుంటాయి
(4)  చెని, శ్రోత్ర ప్రత్యక్షం - అర్ధయుక్త, అర్థ రహిత శబ్దాలు. ఇవీ షాటి స్థాయిల్ని బట్టి రకరకాలు.
(5) చర్మ, త్వక్ప్రత్యక్షం - స్పర్శలు తెలుస్తాయి.అవి చల్లన, వెచ్చ,గట్టి, మెత్తన, గరుకు, మృదుత్వము, కొన్ని చలనాలు, మంట, నొప్పి మొదలగునవి.
2

,
(6) మనో ప్రత్యక్షం :- [ఈ యింద్రియం మేధస్సులోని భాగమే. రకరకాల నిర్వచనాలున్నాయి, ఆయా శాస్త్రాలలో దీనికి. కాని మనమిక్కడ ఆ యింద్రియాల ద్వారా తెలియబడని శరీరగత విషయాలను తెలుసుకోవడానికుపకరిస్తున్న పరికరం అన్న అర్థంలో వాడుకుంటున్నాము. గమనించగలరు.) దీని ద్వారా  రకరకాల ఉద్వేగాలూ (సుఖము, దుఃఖము, శాంతి,అశాంతి,ప్రేమ,ద్వేషం,తృప్తి,అసంతృప్తి వగైరా భావనలుfeelings: దప్పికమొదలగు శరీర స్థితిగతులూ మేధస్సుకు అందుతున్నాయి. ఆలానే బరువు, తేలిక అన్న విన్నీకాలమూ మనస్సుకు తెలిసేదే. స్థలమంటే ఏమో ఇంద్రియ విషయమో ఆలోచించండి.
Note :- ఆయా విషయాల సత్యాసత్యాలు నిర్ణయించేది బుದ್ದಿ మాత్రమే. ఆదీ మేధస్సులో ఒక భాగమే. ఈ ప్రత్యక విషయమై పై అభిప్రాయాలకు భిన్నమైన విషయం మీ దగ్గరుంటే స్పందనకు వ్రాయండి.
ప్రమాణ క్రమంలో రెండవది అనుమానం. అనుమానించడమంటే ఇక్కడ, వ్యవహారంలో ఉన్న సందేహం Doubt ఆన్న అర్థంకాదు. కొన్ని ఆధారాలతో ఒక నిర్ణయానికి రావడమనే ఆర్ధంలో ఆపదం ఉపయోగిస్తున్నాం, కనుక క్రొత్త ఈ పరిలనలోనికి  ప్రవేశిస్తున్న వారు దీనిని గుర్తులో ఉంచుకోవాలి.
వందల తాత్విక సిద్ధాంతాలు మానవ మేధస్సునుండి జనించాయి, విజ్ఞాన శాస్త్రమూ బహుగా విస్తరించింది. వీటన్నిటికీ ఆలంబవం జీవితానుభవాలూ, హేతుబద్దమైన యోచన అన్నవేఈ యోచనే ఆనుమాన ప్రమాణానికి ఆయువుపట్టు, అన్ని ప్రమాణాలకూ ఆధారమైనది ప్రత్యక్షమే అయినా  ప్రత్యక్షం ద్వారా మన జీవితంలో మనం తెలుసుకుంటున్న విషయాలు చాలా కొద్ది మాత్రమేఎక్కువ భాగం పరోక్ష పద్ధతిపైనాధారపడే ఆయా విషయ సమాచారాన్ని పొందుతున్నాం మనం. అందులోనూ శబ్దమాణం నేడు ,శాఖోప శాఖలుగా స్తరించి ఉందిఅయినా శబ్ద ప్రమాణం కంటే అనుమాన ప్రమాణం ప్రత్యక్షం కంటే(బలహీనమైనదైనా) పటిష్టమైనది. ప్రతి ప్రమాణంలోనూ ఏదో రకంగా ప్రత్యక్సంతో సంబంధముంటుంది. మొత్తంమ్మీద ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలిసే విషయాలకు అన్య ప్రమాణాల అవసరం లేదు. అదే యితర ప్రమాణాల ద్వారా తెలుస్తున్న విషయాలకు ప్రత్యక్ష జ్ఞానం కూడా ఆధారంగా ఉంటుందన్న మాట. ప్రమాణ వివేచన చేస్తున్న చేయాలనుకుంటున్న ఎవరైనాఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించవలసి ఉంటుంది. ప్రత్యక్ష ప్రమా
3
ణం ద్వారా  మనకు తెలుస్తున్పట్లు పూర్తిగా క్రొత్తవైన పదార్ధాలు(అనుభవాలు) మిగిలిన ప్రమాణాల ద్వారా తెలియబడవన్నవి కూడా ఒక ముఖ్య విషయం. మిగిలిన ప్రమాణాల అవధి-పరిమితి-ని గుర్తించడానికి ఈ అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరం. చాలా వరకు అనేక సిద్దాంతాలు  పరీక్షకు నిలువలేకపోడానికి, ఆయా సైద్ధాంతికులకూ వారి వారి సిద్ధాంతాలపట్ల, విశ్వాసమూ, అభిమానమూ ఉన్నంతగా, అవగాహన లేకపోవడానికీ కారణం ప్రమాన స్వరూపాలూ, క్షేత్రాలు తగినంతగా తెలీకపోవడమేనన్నది ఒక వాస్తవం. సరే ఇకమనం బహు  సిద్ధాంతాల నిర్మాణానికి ప్రధానమైన ఆధారంగా ఉన్న అనుమాన ప్రమాణాన్ని అవలోకించడానికి యత్నిద్దాం.
 అనుమాన ప్రమాణంలోని ముఖ్యమైన భాగం ఊహ. ఊహ అన్న మాటను మనం మరో అర్థంలో వాడుకుంటున్నాం గనుక ప్రమాణ వివేచనలో ఆ మాట ఏ అర్ధంలో వాడతుంటారో ముందు గమనించాలి. ఆ అర్ధంలోనే ఈ ప్రకరణలో దానిని గ్రహించుతూ పోవాలి. ఈ తేడా గమనించక పోయామా ఊహ మనని ప్రమాణాల నుండి ఊహల్లోకి లాక్కు పోతుంది.  మామూలు ఊహలకు అనుమాన ప్రమాణంలో భాగమైన ఊహకు ఉన్న తేడాని స్పష్టంగా గ్రహించడం అవసరం.
మనం మామూలుగా అప్పడప్పడూ ఊహల్లో విహరిస్తుంటాం. మానసికంగా రెక్కలు కల్పించుకోగలం. కొండపైకి ఎగిరి వెళ్ళుతున్నట్లు భావించుకోగలం. అలానే గాలిలో మేడల్ని నిర్మించుకోగలం. గుర్రపు మొండానికి మనిషి తల,సింహపు తోక  అంటించీ ఆ రూపాన్నీ మానసికంగా ఊహించుకోగలం. ఇలాఅసంభవాలనూ,అనుభవంలేని వాటినీ ఊహిస్తాం. ఈ తరహా వాటిని ఊహలనే అంటాంమరైతే అనుమాన ప్రమీయమైన ఊహ ఆలాంటిది కాదు. అచ్చటి ఊహ కాధారంగా గత ప్రత్యక్ష విషయమూ,  వర్తమానంలో ప్రస్తుతం మనం ఊహ చేస్తున్న దానికి సంబంధించిన కొంత ప్రత్యక్షమూ ఉంటాయి. అంటే ఇక్కడ అనుమాన ప్రమాణంలో ఏదో ఒక అంశం.(అది ద్రవ్యం కావచ్చు,గున,కర్మ,సంబంధాలలో ఏదైనా కావచ్చు.) ప్రత్యక్షంగా తెలుస్తుంది. దానితో  సాహచర్య నియమంతో ఉండే మరొక దానిని గురించిన ఊహ బుద్ధికి అందుతుంది. అలా , ఇది ఉన్నట్లు ప్రత్యక్షంలో తెలుస్తోంది. కనుక దీనితోబాటు అదీ ఉంటుంది అన్న నిర్ణయాత్మక రూపమే అనుమాన ప్రమాణంలోని ఊహా స్వరూపం. అయితే అనుమాన ప్రమాణంలోని ఊహ నిశ్చయాత్మకమే అయితే దానికీ,ప్రత్యక్షం 
4

ద్వారా కలిగే  నిర్ణయానికి   తేదా ఏమిటి ? ప్రత్యక్ష గోచరమయ్యే అంశాలలో జ్ఞానం విశేషాత్మకంగా ఉంటుంది. అనుమానాదులనైతేనో అది సామాన్య స్వరూపం వరకే ప్రిమితమౌతుంది. అంటే లోగడ తెలిసిన లాంటిదే అక్కడ ఉంది, ఉండి ఉంటుంది అన్నంత వరకే అనుమానాదుల ద్వారా తెలియగలిగేది. పరోక్ష ప్రమాణాదులు వేటి ద్వారానైనా మనకు కలిగే జ్ఞాన రూపం ఈ పరిమితుల్లోనే ఉంటుందనేది గమనించనంత కాలం ఆయా విషయాలు తెలిసినట్లనిపిస్తున్నా, ఇక వాటిని గూర్చి తెలియవలసిందేమీ లేదు అన్నంతగాతెలియలేదనీ, వాటినింకా తెలియ వలసే వుందనీ గమనించలేం. కనుక తెలియకనే తెలిసిందనుకునే, అలా భ్రమపడే, అవకాశం ఉండదక్కడ.  కనుకనే తత్వాన్వేషకులు, జిజ్ఞాసువులు, జ్ఞాశార్జనకు ముందే ప్రమాణ  కేత్రాలను గురించి కూలంకుషంగా అధ్యయనం చేయవలసి వస్తోంది. నిదానంగా నిశితంగా ఈ విషయాన్నవగాహన చేసికోండిమీ ఆభిపాయలను స్పందనకు పంపండి.

No comments:

Post a Comment