Tuesday, June 1, 1993

ప్రమాణవివేచన-15

సంపుటి:                                 3 జూన్ 1993                                సంచిక-6

జిజ్ఞాసువులైన మిత్రులారా !
ఏప్రియల్ సంచికలోని ప్రమాణ వివేచనను మరొక్కసారి చదివిన పిదప ఈ  సంచిక పరిశీలించడం మొదలెట్టండి. ఎందుకంటే శబ్ద పమాణానికీ సంబంధించిన అనేక అమూల్యనియమాలు తెలిపానక్కడ. అవి అవగాహన చేసికొంటే తప్ప ఈ ప్రమాణాన్ని గూర్చి తెలుసుకునేటప్పడు ఎదురుపడి ప్రమాదాల్నిఆధిగమించడం సాధ్యపడదు. ఇప్పటికే దానిని క్షుణంగా చదివివుంటే ఒక సౌరి గుర్తు చేసుకోండి.
ఆప్తోపదేశం శబ్దమని సాంప్రదాయకుల అభిప్రాయం. ఈ ఆప్తశబ్దం చక్కగానూ, జాగ్ర తగానూ విచారించవలసి వుంది. ఆప్తస్తు యధార్ధ వక్తాః యదార్ధాన్ని చెప్పేవాడు ఆప్తుడు, నిర్భ్రాంతుడు, స్వార్ధరహితుడు ఆప్తుడని మరో మౌట. ఆప్త పదార్థ నిర్వచనాన్ని స్వరూపాన్ని తెలిపేటంతవరకు నిక్కచ్చిగానే دవ్యవహరించారు ప్రాచీనులు. ఈ ఆప్తపదార్థ లక్షణాన్ని ప్రతిపాదించినవారు ఆనాడు  దీనిని ఎలా అన్వయించుకున్నారోగాని ఈనాడది రక రకాల వ్యక్తుల పాలబడి చింకి చాప వలె  అయిపోయింది. ప్రతివేషధారి ఆప్తుడై సమాజంలో పదిమందికో , మరికొంత మందికో గురువై కూర్చున్నాడు. యదార్ధంగా, వైజ్ఞానికాంశాలపట్ల శాస్త్రం ఆప్త వాక్యం. శాస్త్రజ్ఞుడు (శాస్త్రీయ పంధా నుండి ప్రతిపాదన చేయువాడు) ఆయా వ్యక్తులను దృష్టినిడుకొనిగాక విషయాల దృష్టి  నుండి ఆయా విషయాలను గమనించి ప్రకటించు వాడు. అట్టి వాడు ఆప్తుడనటానికి యోగ్యుడు. ఎందుకనగా  విజ్ఞాన శాస్త్రాల లక్ష్యం ఉన్నదేమిటో, తెలుస్తున్నదేమిటో గమనించి చెప్పడమే గనుక. అపైన దానికి రాగద్వేషాలంటూ వుండవు. అదలావుంచి, ఈ శబ్ద ప్రమాణాన్ని గురించి మరొక నిప్పులాంటి నిజాన్ని చెపుతాను. నిదానంగా అవగాహన చేసికొని జీర్ణించుకోండి. దాన్ని శాస్త్ర ప్రతిపాదితాంశాలకు ఆధారం ఏమైవుంటుంది? ప్రత్యక్ష ప్రయోగ ఫలితాలో, హేతుబద్ధ యోచనో అవాలి గదా? ఈ రెండూ కాక (ఈ ఆధారాలు లేక) శాస్త్రం ఎలా ఏర్పడుతుందసలు? (నా అభిప్రాయం మరో మార్గం లేదని. వుందనే పక్షీయులెవరైనా వుంటే స్పందించండి. మేలుకొలుపులో చర్చనీయాంషంగా కొనసాగిద్దాం దాన్ని. ముగింపు ఇరుపక్షాలు స్వీకరించగలగాలి). మనకు, లోకానికెవరు ఆప్తుడెవడు కాగలడు? వైజ్ఞానికుడు ఆప్తుడు కాగలడా? కాగలడంటే ఎందుకో, ఏలాగో ఆలోచించాలి. ఒకవేళ అప్తుడవుతాడన్నా అతడు  చెప్పినదానిని అంగీకరించడo వల్ల మనకు దాని జ్ఞానం కలిసేట్గా అలా కలుగ తుందా?  ఇదీ పశీలించవలసిన అంశమేకదా ! ఆప్త వాక్యం వల్ల వస్తు జ్ఞానం కలుగుతుందంటే ఆపై దానిని గూర్చి తెలుసుకోవలసిన పని లేదని ఆర్ధం. వస్తు జ్ఞానం కలుగలేదంటే మరి తెలిసిందేమిటనేదన్నా రూఢిగా చెప్పగలగాలి. శబ్ద ప్రమాణ స్వరూప స్వభావాల్ని తెలుసుకునేదుకు చేసే విశ్లేషణలో ఇదొక పక్షం మాత్రమే. మరో పక్షముందీ విషయంలో, ఆప్తుడంటే యదార్థవక్త ఆనుకున్నాం గదా! ఈ యదార్థ వక్తృత్వం అతని నిజాయితీకి సంబందించి వుంటుందా! నా ప్రశ్న అర్ధమైందనుకుంటాను. దీనినే మరొకరకంగా చెబుతాను. సులభంగా వుందేమో ఆలోచించండి. తనకు తెలిసింది తెలిసినట్లు చెప్పేవాడొకడు. ఉన్నదే తెలుసుకుని చెప్పేవాడు మరౌకడు.  ఇందులో  ఆప్తుడెవరు? ఎందుకిలా  విశ్లేచవలసి వచ్చింది? అని కొదరికైనా సందేహం రావచ్చు.
మానవ స్వభావాన్ని ఆర్ధం చేసికోగలిగితే నిజం తెలిసే అబద్ధం చెప్పేవాడు (నిజాయతీ లేనివాడు), నిజాయితీ వుండి నిజం తెలియని వాడూ వుండవచ్చని తెలుస్తూంది. అలానే ప్రతి మోసగాడు ప్రతిసౌరీ, అబద్ధమే చెపుతాడు,నిజం ఎప్పడూ చెప్పడు అనడం సబబుకాదు కదా! మరీ నిజాయితీ కలవాడైనా ఎప్పడూ అబద్దమాడడనిగాని, పొరపడడని (భ్రమపడడని)గానీ ఎలా చెప్పగలం? ఇంత అనిర్చతస్థితి వుంది. ఆప్తుణ్ణి నిర్ణయించడానికి దారిన పోయే వాణ్ణి అడిగామనుకోండి ఏదైనా సమాచారాన్ని గురించి. తెలిస్తే చెపుతాడు. లేదంటే తెలియదంటాడు. మరి ఆ విషయంలో అతడు ఆప్తుడైనట్లా?  కాదా?  ఏమీ చెపుతున్నానో తెలుస్తోంది కదా? ఈ క్రింది ఆంశాలను గమనించండి. ।
1.తన పర అని వ్యక్తులపై దృష్టిలేక విషయావగాహనే లక్ష్యంగా కలిగి వైజ్ఞానిక పద్ధతిలో ఆయా అంశాలను చెప్పినవాడు లేక రచన చేసిన వాడు ఆప్తుడౌతాడు. అతడు చెప్పింది వినదగిన మాట అవుతుంది. ఆయినా అతడి నిజాయితీని పరీక్షించుకోవలసిన పనిలేనప్పటికి అతడు చెప్పింది అసత్యమయ్యే అవకాశం లేకపోలేదు. పరీక్షించుకోవలసిన బాధ్యత గ్రహించే వానిపైనే వుందనేది ముఖ్య  విషయము. 2. వ్యక్తి నిజాయితీ మీద ఆధారపడి ఆకు చెప్పేది వాస్తవమనో,అవాస్తవమనో నిర్ణయించడం అన్ని వేళలా సరైనదే ననడం కుదరదు.అలానే మోసగాని ప్రతిమాట అసత్యమనడము కుదరదు. 3.ఇంతా చేసి ఆతడు ఆప్తుడైనా అతడు చెప్పింది వాస్తవమే అయినా వినడం ద్వారానే పదార్థం బోధ జరుగుతుందడం వీలుకాదు. ఏది గ్రహించాలనుకున్నామో అది వినడం ద్వారా(విన్నపిదపకూడ) పరోక్ష రూపంలోనే వుంటుంది. 4.యదార్ధ వకృత్వాన్ని బట్టి ఆప్తుడనాలా? ఆప్తుడు ఛెప్పింది గ్రనుక నిజమనాలా ! ఆ విచారిస్తే రెండో పక్షం ప్రమాద భూయిష్టమైనది. మరి మొదటి పక్షమో? అతని మాట నిజమని తెలిసిన తరువాతగాని అతణ్ణి ఆప్తుడనడం సాధ్యపడదు-- మరి ఆప్తుణ్ణి, ఆప్తవ్యాకాన్ని నిర్ణయించడమెలా? 5. శాస్త్రం ప్రత్యక్షానుమాన ప్రమాణాల మీద ఆధారపడి వుంటుంది కనుక, ప్రత్యక్షానుమానాలకు శాస్త్రం ఆధారం కాకూడదు (నిదానించి దీని నర్ధం  చేసికోండి)
ఇంతా చేసి భాష స్వరూప స్వభావాలనుబట్టి పదజ్ఞానమూ, పదార్థ జ్ఞానమూ, పదపదార్ధ సంభంధ జ్ఞానము లేనివారికి శాస్త్రోక్త వచనాలేమి అర్ధంకావు, కనుక శబ్ధ ప్రమాణాన్ని అవగాహన చేసికొనగోరువారు పై అంశాలనూ ముందు ముందు చెప్పబోవు వాటిల్లోని తేడాలనూ తెలుసుకొని పడడం తప్పనిసరి. ఆవి 1.ఫదం 2.పధార్థం.3.పర్యాయపదం 4.నిర్వచనం(లక్షణం), 5.వివరణ 6.ఉపమానం, 7.ఉదాహరణ, 8.నిర్ధారణ ఆన్న ఎనిమిది పదార్ధాల స్వరూప స్వభావాలను తెలుసుకున్న పిదప పదం. వినడం లేక చదవడంతో ప్రారంభించి నిర్ధారణ వద్ద ముగించాలి ఆధ్వయనం. ఈ పధార్థాన్ని తెలుపడం రెండు రకాలు—1)అనుభవాన్నివ్వడం,2)లక్షణాన్నిచెప్పడం.  మొదటిది అందరకూ తెలిసినదే. అనుభవాన్నీ తెలుపమంటే ఎలాగండీ, ఆనుభవాన్నే కలిగించందే చెబితే తెలుస్తుంచా అని అందరూ అంటూనే వుంటారు. ఉదా: తీపి అంటే చెప్పండి అని ఎవరైనా అడిగితే, "ఎలా చెపుతామయ్యా, రుచి చూపించాల్సిందే గాని" అని ఆంటాము గదా ! మరైతే ఈ అనుభవాన్నివ్వడమంటే శబ్ద ప్రమాణం లోనికి రాదు కదా? అది  ప్రత్యక్ష విషయమైపోతుంది.
            శబ్దప్రమాణమైతేనో ఛెప్పడంద్వారా తెలుపడమాయె. ఎలా ఈ  చిక్కు విప్పడం? పదాలు చెప్పగలం పడసముదాయ రూపంగా వాక్యాలు చెప్పగలం. పదార్ధం తెలుపడమెలా?  పదం తెలిస్తే పదార్ధం తెలిసినట్లు కాదన్న కనీస ఇంగితం కూడా కోల్పోయి వుందీనాడు సమాజం.  , ఆసలు ఇరువరి మధ్య భాష ఎప్పడు సక్రమంగా పని చేస్తుంది? సమాన సంకేతాలకు సమానార్ధాలు(సమాన సంకేతులు) యిరవురూ కలిగివున్నప్పడు. లేనప్పడు ఆ ఇరవురి మధ్య భాష పనిచేయదు. కనుక వక్త భావము శ్రోతకు చేరదు. ఒక ప్రముఖ సిద్ధాంత ప్రవర్తకుడైన శంకరాచార్యుల వారి రచనగా చూపబడుతున్న,’వివేక చూడామణిఅన్న గ్రంధంలో, ఒక శ్లోకం వుంది, ఈ సంధర్భానికి సంబంధించి, .
అభిజ్ఞాతే పరేతత్వే శాస్త్ర ధీతిస్తు నిష్పలా? ; . .   
-- విజ్ఞాతేపి పరేతత్వే శాస్త్ర ధీతిస్తు నిష్పలా? //
పదార్ధం (విషయం) తెలియని వానికి శాస్త్ర బుద్దివల్ల ప్రయోజనం ఏమీ లేదు. విషయం తెలిసిన వానికి శాస్త్రంవల్ల ఒరిగేదేమీ లేదు అనీ శ్లోకార్ధం. ఈ శ్లోకాన్ని బట్టి రచయితకు భాషా స్వరూపం చక్కగా తెలిసినట్లు, శబ్ద ప్రమాణం ఎక్కడ పనిచేసేది, ఎక్కడ ఆడి ఆగిపోయేది క్షుణంగా గ్రహింపయినట్లు అనిపిస్తోంది. మనకు అయితే ఆ సాంప్రదాయానుయాయులు దీనినెలా గ్రహిస్తారో, ఆపై శాస్త్రం ప్రమాణమని ఎలా చెబుతారో చూడవలసివుంది.
భాష గురించి మరి కొంత చెబితేగాని జిజ్ఞాసువులకీ శబ్ద ప్రమాణాన్ని (దాని  పరిమితులను) గ్రహించే సౌలభ్యం ఏర్పడదు. భాషంటే పదముల సముదాయమే కదా?   వర్ణముల  సముదాయంగా మనమీరోజు చూస్తున్నప్పటికీ మొదట్లో వర్ణసముదాయం లేదు. ఇది వికసిత (సంస్కృత) రూపం. కాలక్రమంలో ఏర్పడ్డది  మాత్రమే. మనిషి తనకు కలిగిన అనుభవాలను గుర్తంచుకుంటున్నాడు. ఆయా అనుభవాలకు తానేర్పరచుకున్న గుర్తులే భాషంటే అంటున్నామన్నమాట. ఇంత వరకు నిలచి,ఒక సారి ఆలోచించండి. అర్ధమైందనుకుంటే సరిగా వుందో లేదో చూడండి. సందేహాలుంటే అడగండి.
ఈ అనుభవ-సంకేతాలన్నవి ప్రధమంలో ఎలా ఏర్పడివుంటాయో పూహించండి. అప్పటికి లిపి లేదు. దాని ముందటి రూపమెన క్రమబద్దమైన శబ్దాలు లేవు. మరేమో అనుభవాలు ఏర్పడుతున్నాయి. వాటి తాలూకు గుర్తులు (అనుభవ ముద్రలు) స్మృతిలో ఎలా నిలిచివుండడానికి వీలుందో అదే భాష ప్రథమ రూపం. ఆ రూపం మొదట్లో యథాతథ ముద్రలుగా మాత్రమే ఉడే వీలుంది.కనుకనే ఈనాటి మానవుడు తన భావాన్ని వ్యక్తపరచడానికి ఆ కృతుల్నే వ్యక్తీకరించేవాడు. సౌజ్ఞలు చేసేవాడు. కాలక్రమంలో అనేక పరిస్థితులు భాషారూపాలు అనేకం రావడానికి తోడ్పడ్డాయి. భాష శబ్ద రూపాన్ని సంతరించుకోవడానికి ప్రధాన కారణం దూరానవున్న ఒకడికి తనలో కలుగుతున్న భావాన్ని చెప్పవలసి రావడం అయ్యుండాలి.ఆవతలివాడు తనని గమనించడం లేదు. తానేమో వాడిని హెచ్చరించ వలసివుంది. అలాటి ಸ್ಥಿతిలో ఏర్పడిందే శబ్దరూప సంకేతం. కనుక భాష ప్రధమ రూపం యథాతధముద్రదానిని వ్యక్తించడం కూడా సౌజ్ఞల రూపంలోనే. పిదప రకరకాల శబ్దాలు, క్రమంగా ఆ శబ్దాలకు నిశ్చిత రూపాలు ఏర్పడ్డాయి. దానినే లిపి అంటున్నామీనాడు. ఆపసరాన్ని బట్టి ఆ లిపికూడ అనేక మార్పులకు లోనై, షార్ట్ హాండు, కప్యూటర్ కోడ్ వంటి వికసిత రూపాలేర్పడ్డాయి. ముందు ముందు ఇప్పటికి మనం ఊహించని మరి కొన్ని రూపాలు ఏర్పడవచ్చు అవసరాన్నిబట్టి. సంక్షిప్తంగా భాష – పుట్టుపూర్వోత్తరాలివే.; {విసుగనిపిస్తున్నా మళ్ళా ఒక్క సారి తిరిగి చూచుకోండి. పైనా మాటలలో అనౌచిత్యంగాని అస్పష్టతగానీ ఉంటే స్పందనకు వ్రాయండి. మీకు నాకు నలుగురికి ఉపయోగపడుతుంది.
భాషాపదాలు ఈశ్వర ప్రదానములని అంటారు సాంప్రదాయకులు. ఈశబ్దానికి అర్ధమిది అన్నది ఈశ్వరుడక్చంచాడనీ.  ‘ ఈశ్వర సంకేతః శక్తిహిః’,వారి విశ్వాసం. వైజ్ఞానిక పంథా మాత్రం పైన నేను చెప్పేందే. లోకంలో అనేక భాషలుండడమూ,ఆస్తిక మార్గీయులనబడే వాళ్ళలోనూ ఈశ్వర స్వరూప స్వభావాలు వారివారి ప్రామాణిక గ్రంథాల ననుసరించే వేరు వేరుగా వుండడమూ, వారి వారి ఈశ్వరుడు మాట్లాడిన భాషారూపమూ - వేరువేరుగా ఉండడమూ నే చెప్పివ మాటలను రుజువు పరుస్తున్నాయి. ఉదాహరణకు- వైదికులు సంస్కృతం దేవభాష అంటే క్రైస్తవులు, ముస్లింలు హీబ్రూ అంటారు. భాషా శాస్త్రం కూడ ప్రపంచ భాషలన్నీటికీ ఒకే మాత్రుకను అంగీకరించలేక పోతోంది. , పరిశోధన లాధారంగా తీసుంటే మాత్రం సరే.
అనుభవ సంకేతరూపం భాష అనుకున్నాం కదా. ఆ సంకేతాలనే పదాలు అంటాము. అంటే భాషలో వున్న ప్రతీ మాటా ఒక అనుభవాన్ని సూచిస్తుందన్న మాట. ఆ అనుభవాన్ని దానికాధారంగా వస్తువేదైనా ఉంటే దాన్ని అర్ధముఅంటారు. పదార్ధమంటే అర్ధమైందనుకుంటాను. ఒక పదం దేనికి గుర్తుగా (అనగా అనుభవానికి గానీ, అనుభవాన్నిచ్చే దానికిగానీ) ఏర్పడిందో దానిని ఆ పదార్ధం అంటాము. పదస్య అర్ధహః పదార్ధ. అంతేగాని పదార్ధమంటే ఘన, ద్రవ, వాయు స్థితులలో వుండే ద్రవ్యం (Material) అని అర్ధం కాదు. ఆ పదం-ఆ శబ్దం దేని తెలుపరందో అది ఆ పదార్థానికర్ధం (Meaning) పదార్ధం అని గ్రహించాలి. ఇంత వరకు తెలిస్తే ఇప్పుడొక సాధారణీకరణాన్ని సాధించ వచ్చు. అర్థయుక్త శబ్దం పదం. అర్ధం ఆనుభవంలో లేక పదం ద్వారా పదార్ధం తెలియడం అసాధ్యం.భాషా పరంగా ఇది అత్యంత కీలకమెనవిషయం. ఇక్కడ స్పష్టత లేకపోతే శబ్ద ప్రమాణ పరిధుల్ని వీక్షించడం కష్టం. ఈ నియమాన్ని గుర్తించక చేసే సిద్ధాంత రాద్ధాంతాలన్నీ దండగమారి పనులు మాత్రమే. పదార్ధ జ్ఞానంలేని ఇరువురు నిర్విరామంగా పదార్థ సత్యాసత్యాల గురించి వాదులాడకుంటున్నారన్నమాట. ఇదెంతటి అవివేకమో తెలిస్తే ఈ నాటి పాండితీ ప్రకర్ష రూపాలైన చర్చలన్నీ వాస్తవంగా ఏపాటి విలువ కలవో బోధపడుతుంది.విజ్ఞానపరంగా ఎంతో వికసించాలనుకుంటున్న ఈ నాటి మేధావి వర్గం కంటే ఈ విషయంలో వెనుకటి మేధావులు ఎంతో వివేకాన్ని ,సంయమనాన్ని ప్రదర్శించారీ విషయంలో. వారి ప్రకారం- "లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధిః నతు ప్రతిజ్ఞామాత్రేణ', ఆన్నసార్వత్రిక నియమాన్ని స్టిరపరచారు పరీక్షకుగాను.  లక్షణం {ఒకదాని స్వరూప స్వభావాలను నిర్ధారించగల అసాధారణ ధర్మం) నిర్ణయించకుండాను ప్రమాణాన్నీ చూపి దానిని నిర్దారింశించగల అసాధారణ ధర్మం)నిర్ణయించకుండాను, ప్రమాణాన్ని చూపి దానిని నిర్ధారించకుండాను, కేవలం మాట చెప్పటం ద్వారా వస్తువు సిద్దించదు అని పై సూత్రాభిప్రాయం. మరి ఈనాడో ఈ లక్షణ ప్రమాణముల గురిcచి తగినంత అవగాహన ఉన్నవారెందరు?  ఉందనుకున్నారాగద్వేషాలను విడచి వాటిని వాటి వాటి క్షేత్రాల్లో (ఏ ప్రమాణం ఎక్కడ పనిచేస్తుందో, దానివల్ల కలిగే జ్ఞానస్థాయి ఏమిటో తెలిసి) సరిగ ఉపయోగిస్తున్నవారెందరు?  యధార్ధంగా చెప్పాలంటే.
ఈ ఆంశంలో సమాజం విచారించ దగ్గ స్థితిలో వుందీనాడు.
Note:- మేము కలసి చర్చించిన సిద్ధాంత ప్రచారకులలోనూ, “ఎందుకొచ్చిన గొడవండి ఈ ప్రమాణాలు,పదార్ధాలు”అన్న మాటే తరచుగా వ్యక్తమయింది. ఆశ్చర్యకరమైన విషయమే కదా ఇది.
జిజ్ఞాస మిత్రులారా ! మీరు మాత్రం ప్రమాణ, పదార్ధ విచారణ పట్ల అలసులు'కాకండి. నిర్లక్ష్యం చూపకండి. ఎవరెన్ని చెప్పినా ఈ రెంటి ద్వారానే జ్ఞేయం, జ్ఞాతమవుతుంది. మరో మార్గం లేదు. నిజమైన జిజ్ఞాసు వుంటే కష్ణమూ, కాలహరణమూ ఐనప్పటికీ దీనియందు ప్రయత్నపరులై జ్ఞానార్దనకు, ఆసలైన వేదికను కల్పిరచుకోండి.
సాంప్రదాయకులలో అనుభవము, జ్ఞానము పర్యాయపదాలుగా వాడబడ్డాయి, అయినా రెంటిని వేరుగా చూడడంవల్ల ఈ జ్ఞాన ప్రక్రియలను గురించి మరింత స్పష్టత ఏర్పడగలదు.
జిజ్ఞాస క్షేత్రం ఎక్కడైనా రెండు భాగాలు మాత్రమే కలిగివుంటుంది ప్రమాణాలు, ప్రమేయాలు అని. ఈ ప్రమేయాలనే పదార్థాలంటాము. తెలసుకొనగోరే, తెలుసుకుంటుండే మనకు కొన్ని పరికరాలు, పద్దతల ద్వారా కొన్ని పదార్ధాలను గురింఛిన జ్ఞానం కలుగుతుంది. పారిభాషికంగా చెప్పాలంటే, ప్రమతకు(జ్ఞాతకు) ప్రమాణాల ద్వారా (జ్ఞాన సాధకాల ద్వారా) ప్రమేయాలను గురించిన ప్రమ (జ్ఞానం) కలుగుతుంది. క్షుణంగా పరికించండి. మరోమారు మననం చేయండి, అర్థమైతే మాత్రం ఈ నిర్ణయానికి వచ్చి వుండాలి. మీరు ప్రమాణాలు లేకుండా పదార్థాలు తెలియబడవు. ఇది సార్వత్రిక నియమం అని జ్ఞానసాధకం.  (ప్రమాణం) లేకుండా కలిగిన దనుకునే జ్ఞానం కన్నులులేని వానికి కలుగు రూపజ్ఞానం వంటిదిముక్కులేని వానికి కలుగు గంధ జ్ఞానం వంటిది. అట్టిది తెలిసిందన్న భ్రాంతిని కలిగిస్తుందే గాని తెలియ వలసింది తెలిసి లేదింకా.
"తెలియకనే తెలిసిందనుకునే వానికంటే, తెలియవలసిందింకా తెలియలేదు” అని తెలుసుకున్నవాడు ఎక్కువ తెలిసినవాడు. వాడింకా తెలుసుకునే అవకాశం పోగొట్టుకోలేదు. మరి మొదటివాడు-చేజేతులా,తెలుసుకునే అవకాశాన్ని చేజార్చుకుంటున్నాడు.
శబ్ధప్రమాణాన్ని గురించి నేను చెప్పవలసిన దంతా చెప్పాను. మీరు యోచించ వలసిందే మిగిలిందిక. మీ యోచనలూ, స్పందనలూ, సందేహాలు ఒక సారి చూసుకున్న పిదప కొనసాగించ వలసిన పదార్ధ వివేచనప్రారంభిస్తాను. ప్రమాణాలపై మీ అవగాహనలను తెలుపండి. జూలై సమావేశాల పిదప పదార్ధ వివేచన మొదలెట్టుకుందాం. వీలుంటే తదుపరి సంచికలో పదార్ధ వివేచనకు భూమిక నేర్పాటు చేస్తాను.



No comments:

Post a Comment