సంపుటి 3. సంచిక-7 జూలై 1993
శబ్ధప్రమాణాన్ని అర్థం చేసికునేందుకు యత్నిస్తున్నాంకదూ! గత సంచిక లోని
విషయాన్ని ఒకసారి గుర్తుచేసుకుని ముందుకు సాగండిక. శబ్ధప్రమాణ క్షేత్రాన్ని, దాని
పరిమితుల్ని మనస్సుకు పట్టించుకోవాలంటే ముందుగా భాష స్వరూప స్వభావాల్ని
తెలిసికోవలసి ఉంటుంది. .
ఇంద్రియార్ధ సన్నికర్షననుసరించి పుట్టింది అనుభవం.
అర్ధాన్నిమనుకొంటే ప్రతిబింబం అనుభవం. ఇంద్రియం ద్వారా మేధస్సులోనికి చేరినది అని అర్థం చెప్పుకోవచ్చు. లోపలికి చేరిన
విషయాన్నే బుద్ధిగుర్తిస్తుంది, దానినియథాతథంగా
గుర్తుంచుకుంటుంది. అది స్మృతిలో ఉంటుందన్నమాట. స్మృతి సంస్కారాల (సంకేతాల, ముద్రల) రూపంలో వుంటుంది. అదే
భాష ప్రధమ రూపం. భాషా పరిణామ క్రమంలో భాష ప్రధమరూపమైన యధాతధ ముద్రలకు ఆయా ప్రాంతాల, దేశాల
మనుష్యులు ఏర్పరచుకొన్న వివిధ రీతులు. అవే భిన్న భాషలంటే అర్థమవుతుందనుకుంటా
నేచెపుతున్నది. ఎందుకంటే ఇది అవగాహన (జీర్ణం) కాకుండే శబ్ద ప్రమాణాన్ని అర్ధం
చేసుకోవడమే కష్టమవుతుంది. ఏర్పడ్డ లేక ఏర్పరచుకున్న సంకేతాల ద్వారా సూచింపబడే
విషయాన్ని అర్థం అంటాము. సౌలభ్యం కోసం సంకేతం ద్వారా తెలియడేదాన్ని
సంకేతి (సంకేతము కలది) అని వ్యవహరించుకుందాం. శబ్దం
స్మృతిలో ఉన్న ఆర్ధాన్ని (సంకేతిని) స్మరింప చేస్తుందేగాని ఇంకే విధంగాను
ప్రయోజనకారి కాదు. శబ్ధం (భాష) ప్రమాణం కావాలంటే వక్తకూ శ్రోతకూ సమాన సంకేతాలు, సంకేతులు
ఉండడం తప్పనిసరి. పదాలూ, పదార్థాలు కూడా ఇరవురికి సమంగా తెలిసినప్పడే
భాష జ్ఞానసాధకం ( ప్రమాణం) కాగలుగుతుంది. అట్టి సందర్భం
కుదరనపుడు జరిగేదంతా తెలియకనే తెలిసిందనుకోవడమే.
పదము, పదార్థము, పద్ధపదార్థ
సంబంధములను గురించిన జ్ఞానం శ్రోతకు
కూడా
రచయితకూ లేక వక్తకూ వున్నంత ఉండాలన్నమాట. ఆర్థాలను అనుభవంద్వారా ఇరువుడు ఓకే
విధంగా గుర్తించి వున్నా శబ్దాలు (సంకేతాలు)
వేరైతే వారిరువురు వేరు వేరు భాషల వాళ్ళని అర్ధం. పదాలు(శబ్దాలు) ఒకటిగా
వుండి అర్ధాలు మారినా వేరు భాషల వాళ్ళనే అంటాను
నేను. మరి మీరేమంటారు?
"పదపదార్థ సంబంధ జ్ఞానం లేనివారికి
వాక్యార్థ జ్ఞానం కలుగదు" అన్నది వెనకటి వాళ్ళ
గమనించిన అంశము. వారు సరిగా గమనించారా లేదా ! ఆలోచించి చూడండి.
Note:- ఇప్పుడు శాస్త్రం ప్రమాణం అనేవాళ్ళూ-వారికి ఏ
శాస్త్ర ప్రమాణమో అందులోని పదాల ద్వారా వారికి తెలియని పదార్ధం ఏది తెలియబడిందో, అదెలా
నిజమనినిర్ణయానికొచ్బారో? ఇది తెలిసి (ఇంత తెలిసి) పలానిది
ప్రమాణమంటే మాకభ్యంతరం ఏమీ లేదు. ఎవ్వరికీ ఉండఖ్ఖరలేదు కూడా. శబ్దం
ప్రమాణమనేవారిపైనున్న పెద్దబాధ్యత,
పెనుభారం కూడా ఇది. అయినా
నిజం నిజమేకదా! అదీ గాక శాస్త్రం ప్రమాణమనే వాళ్ళు వారికొరకుగాని, వారిని
వ్యతిరేకించేవారిని అదుపు చేయడానికిగాని ఒకవిషయం రూఢి చేసుకోవలసి వుంటుంది. ఒక రచన
లేక మాట [అది ఏ రకమైన రచ నైనా గానీండి,
ఏ కోవకు
చెందిన వారి రచనైనాగానీండి) ఎప్పడు శాస్త్రంగా
స్వీకరించదగినదౌతుంది? ప్రామాణికతను సంతరించుకుంటుంది? శాస్త్రం ప్రమాణమేననుకున్నా ఏది శాస్త్రమో, ఏది
కాదో ముందు తెలియాలి కదా! నీకిష్టమైంది నీకు శాస్త్రం నాకు నచ్చింది. నాకు
శాస్త్రం అంటారూ! ఆప్పడేం జరుగుతుందో తెలుసా? అసలుకే మోసం వస్తుంది. ప్రతి ఒక్క రచననూ
తదిరములైన రచనలు ఆశాస్త్రీయం లేక అసచ్చాశాస్త్రం అంటున్నాయన్నమాట. ఇది ఆత్మహత్యా
సదృశం కదా! ఆవేశపడక నిదానంగా యోచించండి,
ఏ రచననైనా ఇది శాస్త్రంగా ఎపుడంగీకరించగలం, ఎందుకంగీకరించాలి
అన్నప్రశ్నకు సరియైన సమాధానం మనదగ్గరుండి తీరాలి. లేకుంటే కేవలం విలువలేని మాటే
అవుతుందది.
ఇంతకీ ప్రమాణాల ద్వారా మనిషి పొందేదేమిటి? అందువల్ల ప్రయోజనమేమిటి? జ్ఞానసాధకం
ప్రమాణమనుకున్నాము కదా! ప్రమాణం ద్వారా
జ్ఞానము కలుగుతుందన్నమాట. దేనిజ్ఞానం కలుగుతుందో దానిని ప్రమేయం (పదార్థం)ఆంటారు.
ప్రమాణాల ద్వారా మనకు కగేది పధార్ధ జ్ఞానమే. అందుకే సర్వ సిద్ధాంతాలూ, ప్రమాణాలకూ
- వాటి ద్వారా తెయబడే పదార్థాలకూసంబంధించే
[లోబడే)
ఉంటాయి. ప్రమాణ రహితమైన సిద్ధాంతంగానీ,
పదార్థ రహితమైన జ్ఞానం కాని ఉండవు. ఇప్పటికి సంక్షేపంగానైనా
ప్రమాణాలను గురించి పరిశీలన సాగించాము. తరువాతిదైన పదార్థాలను గురించి
పరిశీలించనున్నాము. అందుకు ముందుగా పదార్థ వివేచనకు ప్రాతిపదికలుగా నుండగల 8 పదాలను, వాటి
అర్థాలను నిర్దిష్టంగా గమనించాల్సిఉంటుంది. ఆపదాలు గతసంచికలో
సూచించాను. గుర్తు చేసుకోండి.
1.పదం:- అనుభవ సంకేతం. అర్ధయుక్త శబ్దం.
2.పదార్ధం:- దేనిని గ్రహించి లేక తెలిసికుని గుర్తు నేర్పరచుకున్నామో అది
అనుభవం. కనుక ఆ సంకేతంచే చూపబడుతున్న అనుభవం ఆ పదానికి(సంకేతానికి) అర్ధమన్న మాట.
అదే పదార్ధమంటే. అయితే ఈ పధార్థాలు ముఖ్యంగా రెండు రకాలు - భౌతిక పదార్థాలు, భావప దార్దాలు అని. అందుకనే
భౌతికపదార్ధాల విషయంలో ఆనుభవానికి, అనుభవాన్నిచ్చేదానికీ కూడ ఆదే పదం సరిపోతుంది. ఆట్టి వాటి విషయంలో అనుభవమూ పడ్డార్ధమే, అనుభవానికాధారమైన
ఇంద్రియానికందే విషయమూ పదార్ధమే. ఈ తరహా పదార్థాలను ఈ, క్రమంల్లో
చెప్పుకోవచ్చు. పద ముంటుంది-పదానికి చెం దిన అనుభవముంటుంది.ఇక భావ పదార్ధాల తీరు
ఇట్లా ఉంటుంది. పధముంటుంది-పదానికి సంబందించిన అనుభవమంటుంది-ఆ అనుభవానికి పెట్టిన
పదంతోనే తెలియదగిన (అనుభవానికాధారమైన) పదార్థం ఉండదు. అర్ధమౌతుందనుకుంటాను. అయినా
మరొక్కసారి జాగ్రత్తగా పరిశీలించి వంటబట్టించుకోండీ అంశాన్ని. పదార్థాన్నర్ధం
చేసికొనేందుకు అది ఆధారనీయం. ఇంతవరకూ
తెలుస్తుందనుకుంటే పదం తెలియడానికి పదార్థం
తెలియడానికి ఉన్న తేడా ఏమిటో స్పష్టమై వుండాలి. స్పష్టమైతే భాష పదసముదాయమేగాని
పదార్ధ సముదాయం కాదని తెలుస్తుంది. మరి గ్రంధాల్లో పదాలు దొరుకుతాయేగాని, పదార్థాలెలా తెలుస్తాయి? శబ్దం ప్రమాణమనేవాళ్ళు ఇక్కడో ప్రశ్నను
ఎదుర్కొని సమాధానం చెప్పవలసి ఉంటుంది. మీరూ ఆలోచించండి. అర్ధం అమభవంలో
(స్మృతిలో)లేకనే ఫదం వింటే పదార్ధం తెలుస్తుడనుకోవడం (పదవినీ, చదివీ
అర్ధం తెలిసిందనుకోవటం) అవివేకం.
3.పర్యాయ పదం:- ఒకే అర్ధాన్నిచ్చే
అనేక పదములు పర్యాయ పదములనబడతాయి. పర్యాయ పదం పదార్ధం కాదు.ఎందుకనగా పదం పదార్ధం
కాదు కదా! అది ఆ పదార్ధానికి మరొక గుర్తు (సంకేతం) మాత్రమే. పదానికి అర్థము
తేలియడమంటే పర్యాయపదం తెలియడం కాదు. పదానికి, పర్యాయపదానికి, పదానికి
వున్న తేడా గమనించండి.
4.నిర్వచనం:- పదార్థాలను ప్రమాణాల ద్వారా కుంటామన్నది నిర్వావాదం. తెలిసింది
తెలపాలంటే రెండు మార్గాలున్నాయి, 1.అనుభవాన్నిచ్చి2.భాష
ద్వారాచెప్పడం ద్వారా) అవునా కాదా? అనుభవాన్నిచ్చి అంటే ప్రత్యక్షం ద్వారానని.
ఇచ్చట ఎవరికి విరోధం వుండ నక్కరలేదు. మరో మార్గం చెప్పడం ద్వారా తెలుపడం, లేదా
విని తెలుసుకోవడం. ఒక పదార్ధాన్ని తెలుపడానికి ఏర్పరచుకున్నపదము యొక్క అర్ధాన్ని
మొత్తంగా చూపగల కొన్ని తగిన మాటలను ప్రయోగించడం. ఈ
మాటల్లు ఆ పదార్థ లక్షణాన్ని (ఆసాధారణ ధర్మాన్ని)
ప్రకటించగలగాలి. దీనినే లక్షణ
నిర్దేశం అంటారు. నిర్వచనమన్న అదే. అయితే సూత్రప్రాయంగా
చెప్పుకోవాలంటే-సంపూర్ణార్ధన్నిచ్చే సంక్షిప్త పద సముదాయం నిర్వచనం (నిశ్శేషేణ
ఉక్తవచనం నిర్వచనం(నిశ్శేషణ ఉక్త వచనం నిర్వచనం).
5. వివరణ:- పదార్ధ నిర్దేశం చేసిన పిదప
జిజ్ఞాసువుల అవగాహనా సౌలభ్యం కొరకు మరిన్ని మాటలద్వారా లక్షణ రూపాన్ని -
వ్యక్తీకరించడాన్నే వివరించడమంటారు. ఇంతవరకు చెప్పిన విషయాన్ని, మననం
తేయదగినంత ప్రముఖమైనదిగా గుర్తించారా?
గుర్తించినట్లైతే క్రింది.
విషయాలు మనస్సుకు తట్టివుండాలి,
సరిపోల్చుకుని సరిచూచుకోండి.
1. పదంతెలియడమటే పదార్ధ తెలియడం కాదనీ,పదార్ధాన్ని
తెలుపడమంటే పర్యాయ పదం చెప్పడం కాదనీ. 2.
చెప్పడానికి, తెలియజెప్పడానికి ఎంతో తేడా వుందనీ, చెప్పడం
తెలియజెప్పడం కాదని. అలానే పదం వినడం అన్ని గ్రహించడకాదనీ 3.నిర్వచన రూపంలో
చెప్పడమూ, వివరణాత్మకంగా చెప్పడమూ తెలియ జెప్పటమవుతుందనీ, అప్పడైనా నిర్వచనాది రూపంగా పలికిన వాక్యార్ధం ఆ వాక్యంలోని పదార్థ సంబంధ జ్ఞానం ముందే కలిగియున్నవారీకి
మాత్రమే-అదీ పరోక్ష రూపంగానే-తెలియబడుతోందనీ,
4. శబ్ద
ప్రమాణం పద ప్రత్యక్షమూ (సంకేత ప్రత్యక్షమూ) అర్ధ స్మరణ రూపము(సంకేత స్మృతి జన్యమూ)
అయినదనీ, ఇంతవరకు మనస్సుకు తట్టినవా? ఇప్పటికైనా అనిపిస్తున్నదా
లేదా?
మిగిలిన ఉపమానోదాహరణ, నిర్ధారణలు, పై సంచికలో ప్రస్తావిస్తాను. ఈ లోపు మీరు
వాటినిగురించి ఆలోచించండి. ఉపమాన ఉదాహరణలకున్న వ్యత్యాసమేమిటి? ఉదాహరణ చెప్పడం వల్ల కలిగే
ప్రయోజనమేమిటి? ఉదాహరణ ద్వారా తెలియబడేది గతంలో తెలిసిందా?
క్రొత్తగా తెలియవలసి ఉందా?
తెలుపాలకున్నదాన్ని ఉదాహరణ
ద్వారా తేలుపగలమనుకోవడానికి,
తెలుపవలసినదానికీ ఉదాహరణకూ
ఉన్న సంబంధ మేమిటి? ఉదాహరణ స్వరూపమేమిటి? అలానే ఉదాహరణ చెప్పవలసినచోట ఉపమానం చెప్పడంవల్ల కలిగే దేమిటి
ఉపమానం వల్ల కలుగుతుందనే జ్ఞానానికి ఉదాహరణ ద్వారా కలగతుందను కుంటున్న జ్ఞానానికీ
మధ్యనున్న తేడాపాడా లేమిటి ?
ఉదాహరణ కాకున్నా ఉదాహరణగా
చూపబడుతున్నవాటి (విషమ దృష్టాంతం) మాటేమిటి ?
ఇంత పరీక్ష అవసరం ఉపమానం, ఉదాహరణం
అన్న పదార్థాల్ని అర్థం చేసుకోవడానికి, అదలా ఉంచి, నిర్వచన
పదార్ధాన్ని నిర్వచించుకున్నాం కదా పైన.
లక్షణం సలక్షణం ఎప్పడవుతుందో,
కులక్షణం(అసమగ్రమూ
అసంభవాదియుతం) ఎప్పడవుతుండో, లక్షణ పరీక్ష చేయడమెలానో
తెలుసుకోవలసిఉంది.
భాషద్వారా పదార్ధాన్ని సిద్ధింపజేయడ్డానికి లక్షణం చెప్పడమొక్కటే మార్గం. ఆ
లక్షణం దోష రహితంగా ఉండాలి. "దూషణ త్రయ రహిత ధర్మో లక్షణం" ఆని సూత్రం. అంటే మూడు
దోషాలు లేనిదిగా వుండాలి లక్షణమని.అతివ్యాప్తి ,అవ్యాప్తి, అసంభవమని దోషాలు మూడు రకాలు.
1.
అతివ్యాప్తి : దేనిని తెలియజేయడానికని ప్రత్యేక ధర్మాన్ని లక్షణంగా చెప్పదలచామో
అధర్మం మరొక దానియందు వుండరాదు.
ఉందనుకోండి ఆప్పడేమవుతుంది. మీరు చెప్పిన ధర్మాన్ని బట్టి ధర్మిని (విషయాన్నీ)
తెలుసు కోవాలనుకున్నవానికి ఒకటికంటే ఎక్కువ విషయాలు (వస్తువులు) మనస్సుకు
స్పురిస్తాయి. అందువల్ల చెప్పదలచుకున్నవాడు తెలిసినవాడు కాదా అనిగానీ, చెప్పదలచుకున్నది
అదా, ఇదా అని గాసీ సందేహం ఏర్పడుతుందే గానీ ఇథ మిద్ధంగా విషయబోధ
జరుగదు. లక్షణం లక్ష్యాన్ని అతిచరించడం (వేరే వస్తువును కూడా చూపించడం) వల్ల
ఆనుకున్న వస్తుసిద్ధి జరగదు. కనుకనే చెప్పిన మాటలలో దోషమున్నట్లవుతుంది. ఈ తరహా
దోషాన్నే అతివ్యాప్తి అంటారు.
2.అవ్యాప్తి:- చెప్ళిన మాట ద్వారా తెలియజెప్పదలచుకున్న
వస్తువులు అన్నిచోట్ల సిద్ధింపక పోవడం అంటే ఆ జాతి వస్తువులన్నిటా అధర్మం గోచరింపక
పోవడమన్నమాట. కొన్నిటిలో కనబడతూనే ఉందన్నమాట. ఎక్కడైనా ఎప్పడైనా ఆ రకం వస్తువుల్లో
ఆథర్యం కనబడాలి. అలా అన్నిటా కనబడకుంటే అవ్యాప్తి. ప్రతిసారి వస్తువును పట్టివ్వలేనిది.
ఆ వస్తుపకు అసాధారణ ధర్మ ఎలా కాగలదు? అసాధారణ ధర్మం కాని దానిని లక్షణపనడమే ఇక్కడ
జరిగిన పొరబాటు. Note: పైన ఆతివ్యాప్తి అవ్యాప్తులలో ఒక సామాన్యాంశముంది. చెప్పిన ధర్మానికి అసాధారణత
లేకపోవడమే అది. అసాధారణ ధర్మాన్నే లక్షణ మనాలికదా మరి. ఇదే వాటిలోని లక్షణ దోషము. ఒకటి
ఒకటికంటే ఎక్కువ వాటిని చూపడమూ, మరొకటి ఒక్కదాన్నైనా
పూర్తిగా చూపించలేకపోవడమూ జరుగుతోంది.
3.అసంభవము: ఇదేమిటో నేను చెప్పేకంటే
విచారణ మార్గంలో యోచించడానికి సిద్ధంగా పన్నమీరే. అసంభవమంటే ఏమిటో
నిర్వచనరూపంగా
చెప్పండి
చూద్దాం.
అతివ్యాప్తి నిర్వచనం: - అక్ష్యా లక్ష్యములందునా ధర్మంగోచరించడం
అవ్యాప్తి నిర్వచనం: - లక్ష్యములందైనా కొన్నిటియందు మాత్రమే అథర్మముండడం,
అసంభవం నిర్వచనం:- మీరు పూర్తి చేయండి
పై
సంచికలో మరి కొన్ని పదార్ధాలు.
chala chala bagunnai o hard copy tayaru cheyyadi. andaru anne chuda leru kada
ReplyDeleteexcellent
ReplyDelete