Thursday, January 1, 2009

ఫజులుర్‌ రహ్మాన్‌ గారి లేఖ


సురేంద్రబాబుగార్కి ఫజులుర్‌ రహ్మాన్‌ వ్రాయునది వివేకపథం 148 సంచిక చదివిన తరువాత ఈ లెటర్‌ వ్రాస్తున్నాను.
వివేకపథానికి నేను వ్రాస్తున్న ప్రతి లెటర్‌ వెనుక వున్న ఉద్దేశ్యం మనమధ్య సంబంధాలు మరింత పటిష్టం కావడానికి వినా మరొక ఆలోచన నాలో లేదు. పరిస్థితులు దానికి భిన్నంగా వున్నట్లు మీ ప్రతిస్పందనల ద్వారా నాకు అనిపించింది. కారణం మొదటగా నా భావాలను సరియైన పదాలతోను, వాక్యాలతోను మీదాకా చేర్చలేకపోవడం ఒకటైతే, నేను ప్రయోగించిన వాక్యాల, పదాల వెనుక వున్న ఉద్దేశ్యం తీసుకోకుండా - అక్కడి ఆ పదాలు, వాక్యాలు, మీ స్టాండెడ్‌ ప్రకారం ఏ అర్థాన్నిస్తున్నాయో వాటినలా అర్థం చేసుకుని వాటిపై మీ విశ్లేషణ మరొక కారణం అనిపించింది. ఈ మొత్తం నా లెటర్‌లపై మీ ప్రతిస్పందనలతో ఆయా సందర్భాన్నిబట్టి గ్రహించిన విషయం ఇక వివేకపథం 148 సంచిక వివేకపథం 11వ పేజీ మధ్యనుండి మీరు అడిగిన కొన్ని విషయాలకు జవాబులు వ్రాస్తున్నాను.

వివేకపథంలో ప్రశ్న (1) మన పరిచయంవల్ల జ్ఞానపరంగా మీరు మానుండి ప్రయోజనం పొందారాల? లేదా? మీ నుండి మేమేమైనా లబ్దిపొందామా? ఏయే విషయాలలో, మొహమాటం లేకుండా చెప్పండి. దానికి నా సమాధానం -
జ్ఞానపరంగా మీనుండి ప్రయోజనం పొందిన మాట వాస్తవమే. ''మీనుండి మేమేమైనా లబ్దిపొందామా?'' అని నన్ను అడిగారు. ఇది మీరు జవాబు యివ్వవలసిన ప్రశ్న. నేను చెప్పినా అది ఊహమాత్రమే అవుతుంది. ఇతరులనుగూర్చి ఊహించి వ్రాయడం, చెప్పడం అనేవి నాకుగా ఇష్టంలేని పద్ధతి. ఎందుకంటే ఊహ సత్యం యొక్క అవసరాన్ని తీర్చదుగనుక. ఇంకా ఎవరు ఈ విధంగా ఇతరులనుగూర్చి ఊహించి వ్రాసినా అది తప్పు పద్ధతిగా నేను భావిస్తాను. (ఏఏ విషయాలలో... చెప్పండి'' అని వ్రాసారు)
భాష, నమ్మకానికి, జనానికి మధ్య తేడా, సిద్ధాంతచర్చ, ప్రతిపాదన పరీక్ష, నిర్ధారణ, చర్చకు వుండవలసిన నిబంధనలు, ఇలాంటివే మరికొన్ని విషయాలు.
వివేకపథంలో 2వ ప్రశ్న - మీరు వెలిబుచ్చుతున్న-ప్రచారం చేస్తున్న భావాలలో కొన్ని అనిర్ధారితాలు, మరికొన్ని దోషరూపాలు అన్న విషయాన్ని నేను ఆయా సందర్భాలలో మీ ఎరుకలోనికి తెచ్చానా? లేదా?
(2) నా జవాబు : అనిర్ధారితాలు మరియు దోషరూపాలు ఒక్కొక్కటిగా నాముందు పెట్టండి వాటి విషయమై నాలో వచ్చిన మార్పు ఏమిటో రాని మార్పురానిచో వాటికి కారణాలేమిటో మీముందుకు తెస్తాను.

No comments:

Post a Comment