రక్షకునిగా, ఏకమైయున్న దైవతత్వంలో భాగంగా అంగీకరించనివారంతా అవిశ్వాసులూ, నరకానికి పోయేవారేనంటూ ప్రకటిస్తోంది. ఈ కొలతల క్రిందికి యూదుల, ముస్లింటూ చేరిపోతారు.
ఇక ఈ మూడు గ్రంథాలవాళ్ళూ ఏకోన్ముఖులన్నట్లు వ్యతిరేకిస్తున్నది విగ్రహారాధకుల్ని, బహుదేవతారాధకుల్ని, ఆ దృష్టినుండి చూస్తే భారతీయమైన వైదిక దేవతలుగానీ పౌరాణిక దేవదేవతలుగానీ, అనంతరకాలంలో వచ్చిన రకరకాల అవతారాలుగానీ, పై మూడు మతాలవారికీ అంగీకరించదగనివాళ్ళు, ఈ మూడు మతాలలోని ప్రతి మతానికీ ఇతరుల సంబంధంగా ఒకే ఒక్క వెసులుబాటు వుంది. అదేమంటే నీవు బ్రతికుండాలంటే మా మతంలోకి చేరడమొక్కటే మార్గం. మా మతంలోకి చేరడం ద్వారా నీకు ఇక్కడ రెండు లాభాలు, అక్కడ రెండు లాభాలు.
ఇక్కడ (1) నిన్ను చంపకుండా వదిలేస్తాం, (2) మాలో చేరడం ద్వారా మాతో సమానమైన హక్కులు వస్తాయి.
ఉదా : ముస్లింలంతా సమానులు, సహోదరులు.
అక్కడ : (1) ఇప్పటివరకు నీవు చేసిన పాపాల లెక్కంతా కొట్టివేయబడుతుంది. కనుక నరక శిక్షనుండి బైటపడతావు. (2) శాశ్వత స్వర్గ సుఖాలను పొందుతావు. (చూడండి. ఇస్లాం స్వీకరించే విధానాన్ని, దానిలోని భావాల్ని) ఈ మధ్యకాలంలో మత సామరస్యాన్ని బోధించిన వారినిగా, నేటి సామరస్యవాదులు (1) వివేకానందుని, (2) గాంధీని తరచుగా పేర్కొంటుంటారు. ఈ అంశానికి ముడిపెట్టి వారిరువురినీ కొంచెం నిశితంగా విమర్శించేముందు, పాఠకులలోని సామరస్యవాదులుగానీ, ఆ ప్రసిద్ధులిరువురి అభిమానులుగాని ఒక తప్పు అభిప్రాయానికి రాకుండా వుండేందుకు వారి విషయంలో నా దృష్టి గురించి రెండు మాటలు చెప్పడం మంచిదనిపిస్తోంది.
(1) హిందూమతానికి, వివేకానందుడు చాలా కష్టం కలిగించాడన్న శంకరాచార్య సంబంధీకులు నాకు తెలుసు.
(2) హిందువులకు గాంధీకూడా తీరని అపచారం చేశాడని తలంచే హిందూపక్షంవాళ్ళూ వున్నారు.
వీరిరువురూ అలా చేయడం అన్నది భ్రమప్రమాదాలవల్లకాక, తెలిసే అలాచేశారనే ఆవేశపరులూ వున్నారు. నావరకు నాకు, వారిరువురినీ సహృదయులు కాదనడం సరికాదనిపిస్తోంది. వారివారి నేపథ్యము, లక్ష్యములన్న వాటిననుసరించే వారలా ప్రవర్తించారనిపిస్తోంది.
(1) వివేకానందుని నేపథ్యం రామకృష్ణుని తాత్విక దృష్టిచే ప్రభావితమైంది. అది అన్ని రూపాలలో, మతాలలో వున్న దైవతత్వమొక్కటే అన్న మూల భావనపై ఆధారపడింది. అలాగే వివేకానందుని వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను ప్రభావితం చేసిన మరో కోనం, ఉపనిషత్సాహిత్యము, అద్వైత భావజాలమూనన్నది. ఈ రెండూ, ఆచరణలో ఈ దేశంలోనున్న మతపరమైన, ఆర్థికపరమైన అసమానతలను తొలగించాలన్న లక్ష్యంతో కలగలసిన ప్రవర్తన అతనిలో కనబడుతుంది. హిందూమతం సర్వోత్కృష్టమైనదంటాడు. పరమ నికృష్ట సాంఘికాచరణ ఉందిక్కడ, దానిని మార్చుకోవాలనీ అంటాడు. అన్ని మతాలు మంచివేనంటాడు. మతం మారడం, మార్చడం పెద్ద తప్పుడు పనులంటాడు. మతకల్లోలాలు లేని సౌహార్ద్రతకల సమాజం అవసరమంటాడు. హిందూమతమే అతివిశాలమంటాడు. ఇస్లాం, క్రైస్తవాలు మతంపేరిట చేసిన, చేస్తున్నదంతా భయంకరమైనదీ, ప్రమాదకరమైనదీ అనీ అంటాడు.
మొత్తమ్మీద అతడు, భారతదేశం, భావజాలము మరియు సంస్కృతిరీత్యా సర్వోత్కృష్టమంటూనే, మానవులంతా శాంతి సామరస్యాలతో జీవించాలి అన్న ఆకాంక్షను కలిగి వున్నారనడం అతడు పడ్డ శ్రమకు న్యాయం చేయడం. అలాగని అతడన్న ప్రతిదీ సరైందేననుకోవడం, అనుకోవడం అహేతుకం, అశాస్త్రీయం. ఆ వైఖరి మళ్ళా మరో కలగాపులగపు విశ్వాస దృష్ణుని చూపెడుతుందంతమాత్రమే.
నా వరకు నాకు వివేకానందునిలో కొన్ని విషయాలలో చాలా తాత్విక గంద్రగోళం వుండడంతోపాటు, తాను ఆయా విషయాల్ని చాలా సక్రమంగా అర్థంచేసుకున్న వాడినన్న అహమూ కొట్టొచ్చినట్లుగా కనపడుతుంది. వివేకానందుని తాత్విక గంద్రగోళం అన్న శీర్షిక ఒకటి మొదలెట్టాడు. అక్కడా విషయాలు విపులంగా విశ్లేషించే పనిచేస్తాను. ప్రస్తుతానికి సంబంధించిన ఒకటి రెండు భావాలను విశ్లేషిస్తాను.
1) మతమే ఈ జాతి జీవనం, మతమే ఈ జాతి భాష, మతమే ఈ జాతి భావం.
2) మీ రాజకీయం, సమాజం, పౌరపాలన.... వగైరాలన్నీ మతం ద్వారా మాత్రమే నిర్వహింపబడాలి.
3) మన జాతికి, మతానికి బదులుగా ఒక వినూత్న శీలాన్ని రూపొందించడానికి తలపెడితే ఆ పనికి అనివార్య ఫలితం జాతి వినాశనమే. (భారతజాతికి నా హితవు గ్రంథంలో భారతదేశం-మన మాతృభూమి వ్యాసం)
4) ఈ లోకం మన మాతృదేశానికి ఎంతో రుణపడివుంది. ప్రతి దేశచరిత్రనూ పరిశీలిస్తే-లోకం సహనపరుడూ, సాధుమూర్తి అయిన హిందువుకు రుణపడి వున్నంతగా మరే జాతికీ రుణపడి లేదని వెల్లడవుతుంది (అదేవ్యాసం).
అదే గ్రంథం - మతం నైతికత అన్న వ్యాసంలో....
1) మృగాన్ని మానవుడుగా, మానవుణ్ణి దైవంగా ఉన్నతస్థితికి తీసుకువెళ్ళే భావమే మతం.
2) మానవునిలోని స్వాభావిక బల ప్రకటనమే మతం.
2) కేంద్రం ఒకచోట నిర్దేశింపబడి పరిధి ఎక్కడాలేని ఒక అనంతమైన వృత్తమే మానవుడు. పరిధి ఎక్కడాలేకుండా సర్వత్రా కేంద్రాన్ని కలిగి వున్న ఒక అనంత వృత్తమే భగవంతుడు. మనిషికీ, దేవునికీ నిర్వచనాలివే.
3) నువ్వే దైవం కాని పక్షంలో దేవుడింతకు ముందు లేనివాడే అవుతాడు. ఇక ముందుకూడా వుండకుండా పోతాడు.... మనలోని ప్రతి ఒక్కడూ ఒక ప్రవక్త కావాలి. నిజానికి నీవెప్పుడూ ప్రవక్తవే.
4) సజీవమైన దైవం నీలోనే వున్నాడు. దానిని గ్రహించలేక దైవం కోసం చర్చిలను, దేవాలయాలను నిర్మిస్తూ వెర్రిమొర్రి అభూతకల్పనలన్నింటినీ విశ్వసిస్తున్నారు. మనిషిలోని మానవాత్మే మనం అర్పించాల్సిన ఏకైక దైవం.
5) మతంలోని అస్సలు కీలకమంతా ఆచరణలో వుందేగాని, సిద్ధాంతాలలో లేదు.
6) ప్రభూ, ప్రభూ అంటూ ఆక్రందించేవాడు కాదు స్వర్గాన్ని చేరేది. ఆ తండ్రి సంకల్పాన్ని నిర్వర్తించినవాడే అక్కడికి చేరతాడు.
సురేంద్ర : క్రీస్తన్నాడంటున్న ఆ మాటల ప్రకారం తండ్రి సంకల్పం ఏమిటో తేల్చి, దానిని అమలు చేయమనండి వివేకానందుని.
7) రాబోయే జన్మలో ఆనందం చేకూరుతుందని, ఈ జన్మలో కష్టాలననుభవించడం వివేకవంతమైన పనికాదు.
8) ఎప్పుడైనాసరే, సమాజానికి ఆర్థిక పరిపుష్ఠిని కలిగించేదే మతం.
9) ఐరోపాను నాశనం కాకుండా కాపాడగలిగేది ఒక్క ఉపనిషన్మతమే.
10) బైబిలు, ఖురాను యివేవీ లేని తావునకు వేదం మానవాళిని నడిపించాలని మనం కోరుకుంటున్నాం. ఐతే వేదాలను, బైబిలును, ఖురాన్‌ను ఈ మూటినీ సమన్వయించి ఈ కార్యాన్ని సాధించాలి. ఇవన్నీ ఏకత్వ రూపమైన మతానికి వేర్వేరు వ్యక్తీకరణలే, అవి మానవజాతికి తెలియజెప్పాలి. ఈ వాస్తవం తెలుసుకుంటే, ఎవరికి ఏ మార్గం అనుకూలమో దాన్నే అతడు ఎంచుకోవచ్చు.
గమనిక : అని ఆంగ్లంలో వుంది. తెలుగు అనువాదం దానికి అద్దం పట్టేలా లేదు.
11) మానవుణ్ణి పాపి అనడమే అన్ని పాపాలకు మించిన ఘోర పాపం. అది మహాదూషణ వాక్యం.
12) ఓ క్రైస్తవ మిషనరీల్లారా! గుర్తుంచుకోండి! మొత్తం భారతీయులందరూ కలసి హిందూ మహాసముద్రపు అట్టడుగు మట్టిని తీసి పాశ్చాత్య దేశాలపై చల్లి మీరు చేసిన పాపంలో ఇసుమంతకూడా కాదు.
13) మిషనరీలు నా దేశానికి వచ్చి, నా పూర్వజుల్ని, నా మతాన్ని, సర్వస్వాన్ని విమర్శిస్తారు. ఒక దేవాలయం ముందు నిలబడి, ఓ విగ్రహారాధకుల్లారా! మీరు నరకానికి పోవడం ఖాయం అని ఎలుగెత్తి అరుస్తారు. ఇదే పని వారు ముస్లింల విషయంలో చేస్తే వారు కత్తిదూయడం ఖాయం. హిందువులు మాత్రం మెతకగా వ్యవహరిస్తున్నారు.
14) విశ్లేషణ : వివిధాంశాలలో వివేకానంద వైఖరేమిటన్నది అలా వుంచితే, మతం అంటే ఏమిటన్నదానికి రకరకాల అభిప్రాయాలను వెల్లడించుకుంటూ పోయాడు వివేకానంద. అలాగే మతసామరస్యం అవసరమంటూనే మేము, ఖురాన్, బైబిల్ బుక్‌ని చోటుకు రావాలి జనం అంటాడు. అంతలోనే అలారావడం వేదానికీ, ఖురాన్‌కు, బైబిల్‌కు సమన్వయం సాధించడం ద్వారా జరగాలంటాడు. అంటే ఏమిటో, ఎలా ఆచరణసాధ్యమో చెప్పడు. దేనికదిగా చూస్తే పైకి గంభీరంగా కనపడతాయి. అదంతా అలా వుంచుదాం. మన ప్రస్తుతాంశానికి సంబంధించినంతలో అదేమిటన్నది తస్తే మొత్తంమ్మీద వివేకానందుడు మతమార్పిడులకు నూటికి నూరుశాతం వ్యతిరేకి అనడంవరకు నిస్సందిగ్ధం.
అంతేకాదు, అతనిచ్చుకున్న వివరణలోనుండి చూస్తే భారతీయ తాత్విక హృదయం (హిందూమతం) సర్వోత్కృష్టమైనది. అలాగే ఈ దేశంలోని కులపరమైన నిమ్నాధిక్యతలు బహుకౄరమైనవి. ఇక మతసామరస్యానికివస్తే ఖురాన్, బైబిలు లేనిచోట సిద్ధించుతుంది మత సామరస్యం. మానవులంతా స్నేహ, సౌహార్ద్రతలతో పరస్పరం సహకరించుకుంటూ సుఖశాంతులతో జీవించాలన్న ఆకాంక్ష సర్వాంగీణ అంగీకరించదగిందేగానీ, ఆ నరక, మతాలున్నంతకాలం, జనసమూహాలు ఆయా మతాలను గట్టిగా పట్టుకుని ఉన్నంతకాలం ఆచరణసాధ్యంకాదు, కాలేదు. ఎందుకంటే ఆ మూల ప్రాతిపదికలోనే దోషముంది. పొసగనితనముంది.
మరి మతాతీతంగా వ్యవహరించిన దాఖలాలున్నాయికదా! అనంటే దానికి అస్సలు కారణం వెనక నేను చెప్పిందే. వాళ్ళు మతపట్టులో పూర్తిగా ఇరుక్కోకుండానైనా ఉన్నవారైయుండాలి. మతపట్టు సడలిన లేదా దాన్నుండి బైటపడినవారైనా అయ్యుండాలి. ఈ రెండు సముదాయాలలో కనిపించే ఎదుటివారి విషయంలో సహానుభూతి, సాయంలాంటివన్న మతసామరస్యం క్రిందికిరావు.
మతం వుండీ పరమతసహనం కలిగి వుండడానికి ఒకేఒక్క మార్గముంది. అదేమంటే మతమంటే ఇంతే అనడానికి వీల్లేని పరిస్థితుల్ని ఆ మతంపేరన ఉన్న సాహిత్యం అందించగలగాలి. అంటే నిర్దిష్టమైన-ఏకోన్ముఖమైన ఆరాధనగాని, ఆరాధ్యంగానీ, విధివిధానాలుగాని లేనిమతం వుంటే అట్టిది కొంతవరకు సాధ్యపడతది. మన ప్రస్తుతాంశానికి ముడిపెట్టిచూస్తే ఇస్లాంకు ఆ స్వభావంలేదు. క్రైస్తవానికీ ఆ స్వభావంలేదు. నిజానికి చరిత్రలో ఖురాన్ దేవుని పేరన, బైబిల్ దేవుని పేరున జిహాద్, కౄసేడులనేవి జరిగాయంటే అందుకు పూనుకున్న వ్యక్తుల్ని అందరకూ అమానుషులు అనలేం. వారిలో ఎక్కువమంది అలా ప్రవర్తించడానికి కారకం, ప్రేరకం రెండూ గ్రంథాలపై దేశాలే. కొద్దిమంది మాత్రం గ్రంథాన్ని సాకుగాచూపి తమతమ పైశాచికానందాల్ని పొందేందుకు యత్నించి వుండవచ్చు.
ఖురాన్ దేవుని త్రికరణశుద్ధిగా అంగీకరించి పరమత సహనాన్ని కలిగి వుండడం అయ్యేపనికాదు. అలానే బైబిల్ దేవుని అంగీకరించినా అంతే. సిద్ధాంతమూ అదే, దానిని గట్టిగా నమ్మినవారి ఆచరణా అంతే.
నిర్దిష్టంగా ఒక ప్రామాణిక గ్రంథమూ, ఒక ఆరాధ్యదైవమూ, ఒక ఆరాధనావిధానము, ఒక ఉపదేశికుడూ అన్నది లేకుండా నానారీతులు ఏ గొడుగు క్రింద ప్రభావితమైయున్నయో ఆ మత క్షేత్రంలో మాత్రమే పరమతసహనం అన్నదానికి అంతో ఇంతో అవకాశం వుంటుంది. అక్కడైనా మతమార్పిడుల యత్నాలు జరక్కుండా వున్నంతవరకే ఆ సహనశీలత పనిచేయగలగుతుంది. ఏవేవో అరకొర ఆధారాలనుపట్టుకుని, ఎంత తపనతో మత సామరస్యంకొరకై యత్నించినా అది గగనారవింద సదృశమే.
ఎందుకంటే రెండు పక్షాలుండి వారిమధ్య శాంతి నెలకొని వుండాలంటే, సహకార ధోరణి వర్థిల్లాలంటే...
1) ఇరువురూ వివేకవంతులై అహింసాత్మకులైయుండాలి.
2) ఇరువురూ సమబలులై దెబ్బకుదెబ్బ అన్నరీతిని అమలుపరచడానికి సిద్ధమైయుండాలి. అలాంటి స్థితిలో ఘర్షణలు జరిగి ఇరువురం నష్టపోతున్నాం అని తెలిసి సంధి ఒడంబడికలోకి రాగలిగితే తాత్కాలికంగానైనా శాంతి నెలకొనవచ్చు.
3) అలాకాక ఒకడు శాంతి మంత్రాలు పఠిస్తూ, అహింసను పట్టుకునీ, మరొకడు బలప్రదర్శనకూ సిద్ధమైతే అమలయ్యేది హింసే. పరిస్థితి, ఒక హింసావాది, మరో అహింసావాది అన్న స్థితికంటే, ఇద్దరూ హింసావాదులుగా వున్న స్థితే అంతో ఇంతో శాంతినివ్వగలుగుతుంది.
స్వాతంత్య్రం పోరాడి సాధించుకున్నదా? బ్రిటిష్‌వాడు మోయలేక వదిలించుకున్నదా? అన్నది చారిత్రక విశ్లేషకుల్లో ఇంకా తెగని అంశమే. ఆ లోతుల్లోకి మరో సందర్భంలో తొంగిచూద్దాం. మతసామరస్యం సాధించుకోకుంటే స్వాతంత్య్రం తెచ్చుకోడం కష్టసాధ్యమన్న దృష్టి కలిగి అందుకై ఆ జీవితం శ్రమించినవారిలో గాంధీనే ముందు చెప్పుకోవాలి. ఎవరెవరెన్నిరకాల వత్తిడిపెట్టినా, హిందూ-ముస్లిం ఆవేశాల వత్తిడి తనపై ఎంతగా వున్నా, హిందూ ముస్లిం ఐక్యతకే అన్నింటికంటే పెద్దపీటవేసి, దాని నెరవేర్పుకై పలు దఫాలు ఆమరణ నిరాహారదీక్షకు సిద్ధమైనవాడు గాంధీజీ. ఒకవంక హిందూమతం పేరున వేల ఏండ్లుగా జరుగుతూ వచ్చిన సామాజిక అసమానతల గొడవ అంతర్యుద్ధంగా మారుతున్నా, దానివల్ల జరిగే నష్టాల్ని సహించుకోడానికైనా సిద్ధమై, వాటిని అప్రధానాంశాలుగా చూస్తూ, హిందూ ముస్లిం ఐక్యతకే పెద్దపీట వేశాడాయన. హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు తలెత్తే సందర్భం వచ్చినప్పుడల్లా, వాటిలో కొన్ని స్పష్టంగా ముస్లింలవల్లే మొదలయ్యాయని తెలిసినా హిందువులను నిగ్రహంతో వుండమనేవాడు. ముస్లింలను బుజ్జగిస్తుండేవాడు. ఆయన్ని కపటి అని అనడం ఖచ్చితంగా తొందరపాటుతనమే అనవచ్చుగానీ, అతననుసరించిన విధానం మాత్రం వివేకవంతమైనదికాదు. ఈ సందర్భంలో ఒకటిరెండు ఉదాహరణలు చెప్పుకోవడం అవసరం.
No comments:
Post a Comment