ళీ భారత రాజ్యాంగం 1949 నవంబరు 26న రాజ్యాంగ నిర్మాణ సభచే అంగీకరింపబడింది. 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. కనుకనే ఈనాడు మనం జనవరి 26నే రిపబ్లిక్ దినోత్సవాన్నిజరుపుకుంటున్నాం.
ళీ ఆదిలో ఇది 22 విభాగాలతో, 395 అధికరణలతో, 9 షెడ్యూళ్ళతో ఏర్పడినా, అనంతరం రాజ్యాంగ సవరణల పేరున జరిగిన చేర్పులు, మార్పులతో (95 రాజ్యాంగ సవరణలు) 26 భాగాలు, 12 షెడ్యూళ్ళు, 444 అధికరణలతో పరిణమించింది.
ళీ ముందుమాట, ప్రస్తావన, అవతారిక అన్న పేరున ఉన్న భాగం భారత రాజ్యాంగం మొత్తానికే ప్రాతిపదిక వంటిది. రాజ్యాంగ సూత్రీకరణలను వ్యాఖ్యానించడం గానీ, అన్వయించడం గానీ ఈ అవతారిక స్వరూప, స్వభావాల పరిధికి లోబడే చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని అందరం గుర్తించాలి. అంగీకరించాలి కూడా.
ళీ రాజ్యాంగం 3,4 భాగాలలో హక్కులకు, విధులకు సంబంధించిన సూత్రీకరణలు ఉన్నాయి. భారత రాజ్యాంగం మొత్తానికీ ఈ రెండు విభాగాలు గుండెకాయ వంటివి.
క ఆర్టికల్ 13 నుండి 35 వరకు హక్కులకు సంబంధించిన వివరాలున్నాయి. అందులో 19(1) క్రింద ఆరు ప్రాథమిక స్వేచ్ఛకు సంబంధించిన హక్కులను కల్పిస్తూ, 19(2) ద్వారా వాటికున్న పరిమితులను పేర్కొనటం జరిగింది.
ళీ ప్రాథమిక హక్కులు పొందడానికి, ఆటంకాలు ఏర్పడితే రక్షణ పొందడానికీ, ఆర్టికల్ 32 ద్వారా హామీ ఇవ్వబడింది. డా. అంబేద్కర్ లెక్క ప్రకారం ఆర్టికల్ 32 రాజ్యాంగం మొత్తానికీ ఆత్మవంటిది. ఎందుకంటే వ్యక్తి ప్రాథమిక హక్కులు కాపాడటం మొత్తం సామాజిక బాధ్యత కనుక.
ళీ రాజ్యాంగం '4'వ భాగంలో ఆదేశిక సూత్రాలున్నాయి. అందులోనూ పౌరుని ప్రాథమిక విధుల గురించి ఆర్టికల్ 51(ఎ)లో 10 సూత్రీకరణలు ఉన్నాయి. ఈ అధికరణం 1976లో చేయబడ్డ 46వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోకి చేర్చబడింది.
గమనిక : ప్రతి భారతీయుడు, ముఖ్యంగా సామాజిక పునర్నిర్మాణం కొరకు పాటుపడదామనుకుంటున్న ఉద్యమ క్షేత్రాలలోని వ్యక్తులు ఈ 3,4 విభాగాలను కక్షుణ్ణంగా అర్ధంచేసుకుని, వంటబట్టించుకోవలసి ఉంది.
భారత రాజ్యాంగం అందించిన వ్యవస్థ మూలాకృతి
1. మనది సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థ.
2. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అన్నరీతిని ఎంచుకున్నాం మనం.
3. ఇది సక్రమంగా అమలవ్వాలంటే ప్రతినిధుల ఎంపిక అంటే ఎన్నికలు దోషరహితంగా, లోప రహితంగా జరగడం.
4. ఎన్నికైన ప్రతినిధులు నిరంతరం ప్రజలకు జవాబుదారీగా ఉండడం ఆచరణలో సాగుతుండాలి.
5. మరోవంక పౌర మహాసభలు చైతన్యవంతంగా, క్రియాశీలంగా జరుగుతూ, ఎప్పటికప్పుడు అప్పటికి జరిగిన దానిని సమీక్షించుకుంటూ, ముందు జరగాల్సినదాన్ని నిర్ణయిస్తూ, జరుగుతున్న దానిని పర్యవేక్షిస్తూ ఉండాలి. ఈ అంశం మాత్రమే ప్రజాస్వామ్యానికి ఆరోగ్యాన్ని, బలాన్ని ఇవ్వగలుగుతుంది. కేవలం 5 ఏండ్లకోసారి ఎన్నికలు నిర్వహించడం మాత్రంచేత ప్రజాస్వామ్యం అమలవుతున్నట్లు కాదు.
6. ప్రజాస్వామ్యానికి ఊపిరి నిర్ణయాధికారం ప్రజల చేతిలో ఉండడమే. అది అమలవ్వాలంటే అధికార వికేంద్రీకరణ జరగాలి. ఆర్థిక వనరులలో ఏ ప్రాంతానికా ప్రాంతానికి న్యాయబద్దమైన వాటా కేటాయింపు జరగాలి.
7. అందుకు స్థానిక ప్రభుత్వాలకు పూర్ణరూపంలో అధికారాల బదలాయింపు జరగాలి. స్థానిక ప్రభుత్వాలంటే గ్రామ పంచాయితీ, మండల పంచాయితీ, జిల్లా పంచాయితీ మరియు మున్సిపాలిటీలని అర్ధం.
క దీనినే 73,74 రాజ్యాంగ సవరణలను అమలు చేయడం అంటున్నాము. ఆర్టికల్40
8. ఎంతవరకు గ్రామ సభలు, వార్డు సభలు పూర్తిస్థాయిలో క్రియాశీలం కావో అంతవరకు ప్రజాస్వామ్యం ఆచరణలోనికి రానట్లే. కళ్ళముందు పాలన, పాలనలో పర్యవేక్షణ, ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యం అన్నవి అమలుకావాలంటే అధికార వికేంద్రీకరణ జరిగి తీరాలి.
9. 1.ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రతినిధులతో ఏర్పడే శాసనవిభాగము, 2.ప్రతినిధులు ఎన్నుకున్న ప్రభుత్వము (దీనిలోపాలన నిర్వహణ భాగాలుంటాయి, నిర్వహణ భాగంలో యోగ్యులైన అధికారులుంటారు) 3.వ్యవస్ధలోనివారు ప్రజలు అలా రాజ్యాంగా బద్దంగా సాగుతున్నారో లేదో చూస్తుండే న్యాయవిభాగము అన్న మూటినీ మన రాజ్యాంగం ప్రధాన చట్రంగా పేర్కొంది.
10. రాజ్యాంగంలోని పలు అధికరణాలు, ఈ మూటి నిర్మాణానికి, వ్యవహారానికీ సంబంధించిన విధులు, అధికారాలు, బాధ్యతలను తెలిపేవిగా వున్నాయి. రాజ్యాంగం 5వ భాగంలో కేంద్రానికి సంబంధించిన వివరాలు, 6వ భాగంలో రాష్ట్రానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. (5వ భాగం 52 నుండి 151 వరకు - 6వ భాగం 152 నుండి 237 వరకు).
11. 9వ భాగం అత్యంత ప్రధానమైనది. ఇది 243 ఆర్టికల్ ద్వారా పంచాయితీల గురించి వివరిస్తోంది. మనం అంటే ప్రజాస్వామ్య వాదులం ఆశిస్తున్న అధికార వికేంద్రీకరణ, కళ్ళముందు పాలన, ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీగా వుండక తప్పని పరిస్థితిలాటి వన్నీ అమలయ్యేందుకు రాజ్యాంగం కల్పించిన ప్రక్రియ ఇందులో వుంది.
12. మనది మూడంచెల పాలనా విధానం గల వ్యవస్థ. కనుకనే దేశంలో మూడు థలుగా ఎన్నికలు జరుగుతాయి.
ఎ) కేంద్ర ప్రభుత్వం ఏర్పడడానికి జాతీయ స్థాయిలో లోక్ సభకు జరిగే ఎన్నికలు.
బి) రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడానికి రాష్ట్ర స్థాయిలో శాసన సభకు జరిగే ఎన్నికలు.
సి) పంచాయితీ ప్రభుత్వాలు ఏర్పడడానికి, జిల్లా, మండల, గ్రామ, పట్టణాలకు జరిగే ఎన్నికలు.
క ప్రజాస్వామ్యం అమలవ్వడమంటే కేంద్ర ప్రభుత్వం, దాని నిర్వహణాధికార యంత్రాంగం పార్లమెంటుకు జవాబుదారులగను, రాష్ట్ర ప్రభుత్వము, దానిక్రింద పనిచేసే నిర్వహణాధికార యంత్రాంగము శాసన సభకు జవాబుదారీగను, జిల్లా, మండల, గ్రామ, మున్సిపాలిటీ ప్రభుత్వాలు వార్డు ప్రతినిధులకూ, నేరుగా ప్రజా సభకు జవాబుదారీగా వుండడమనే అర్థం. ఇది అమలు కానంతకాలం ప్రజాస్వామ్యం అమలవ్వడం లేదనే చెప్పాలి.
''సహజ న్యాయ సూత్రాలకనుగుణ్యంగా మానవులందరి పురోభివృద్ధికి తగిన విధినిషేధాలతో కూడిన మార్గదర్శకాలనందించే వ్యవస్థ, దాని అడుగు జాడలలో బాధ్యతాయుతంగా ప్రవర్తించే పౌరులు''.
ఇదే సమాజ పునర్నిర్మాణం కొరకుగా ఆలోచించే, యత్నించే వారందరూ కోరదగింది. అట్టి సమాజం ఆవిర్భవించాలంటే మనుషుల మధ్య మనమంతా ఒక్కటేనన్న భావన హృదయాంతరాళం నుండి పెల్లుబకాలి. కనీసం అట్టి భావన ఎట్టి కార్యాచరణకు పురికొల్పుతుందో అట్టి సామాజిక గతి చట్రాన్ని ఏర్పరచుకొని తెలిసిన వారు ఆత్మనియంత్రణ లోను, తెలియని వారాచట్రానికి లోబడి జీవితము సాగిస్తుండాలి.
మంచి సమాజాన్ని కోరుకునే వారెవరైనా ద్విముఖాత్మకంగా పనిచేయాల్సి ఉంటుంది. మెరుగైన వ్యవస్థ, మెరుగైన పౌరులు అన్న రెండూ కలివిడిగా ఆకృతి దాల్చినపుడే మానవ జాతి మనుగడ సుఖశాంతులతో కూడి ఉంటుంది. తల్లీ తండ్రి, భార్యా బిడ్డలు ఒక చిన్న కుటుంబం. ఒక వొప్పందం క్రింద నున్న వారంతా పెద్ద కుటుంబం, మానవ జాతంతా కలిపి విశ్వ కుటుంబం లేదా వసుదైక కుటుంబం. ఇదే మనిషిని గురించి లోతుగా పరికించి చూసిన వారంతా మనిషి యోగ క్షేమాలకు అనుసరించాల్సిన మార్గమని ఉపదేశించారు.
తాత్విక క్షేత్రపు పరమ గమ్యం మానవజాతినీదిశగా కదిలించాలన్నదే. భారత సమాజమంతా ఒక కుటుంబం, ఒకే కుటుంబం. దేశ సంపద ఉమ్మడిది. భారతీయు లందరూ సహోదరులే. సంపదకు వారసులే. భాగస్వాములే. వర్తమాన సమాజం ఉన్న సంపదను పొదుపుగా వాడుకొని రాబోయే తరానికి ఉంచగలిగినంత మిగిల్చి వెళ్ళడం మానవ కుటుంబ సంక్షేమం దృష్ట్యా వున్న ఒకేఒక మార్గం.
భారత రాజ్యాంగ మౌలిక స్వరూపమంతటిని మన రాజ్యాంగ నిర్మాతలు ఒక్క మాటలో సూత్రీకరించారు. మనది ''సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర వ్వవస్థ''.
ఈ వాక్యానికి విష్పష్టంగా అర్థం తెలిస్తేగాని రాజ్యాంగంలోని సూత్రీకరణలను సరైన రీతిలో అన్వయించుకోవడం కుదరదు. ఎందుకంటే మొత్తం మొత్తం రాజ్యాంగ వివరణంతా గానీ, ఆయా సందర్భాలలో చేసే, చేయాల్సిన వివరణలు, వ్యాఖ్యానాలు గానీ, పై వాక్యార్థ స్వరూప స్వభావాలకు వ్యతిరేకం కాని మరియు అనుకూలమైన వైఖరినే కలిగి ఉండాలి. సమాజాన్ని ఎలా వుంచుకోగోరుతున్నామో అందులో సూచించబడింది. కనుక రాజ్యాంగ సూత్రీకరణలన్నీ పై వాక్యార్థానికి సరితూగే సమాజాన్ని స్థాపించు కోవడానికి ఉద్ధేశించినదేనన్న మాట. కనుక పై వాక్యానికి, వాక్యములోని పదాలకు నిర్ధిష్టమైన అర్థాలు చెప్పుకోవడం ద్వారా అర్థాన్ని నిర్ణయించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే రాజ్యాంగ శాసనాలను వాటి ఆధారంతో రూపొందించుకొనే చట్టాలను, సాధికారిక ప్రకటన (గెజెట్ ఆర్డర్(జీ.వో.))లను, అప వ్యాఖ్యానం చేయకుండా, దుర్వినియోగ పర్చకుండా చూసుకోవడానికి వీలవుతుంది. కనుక ఆ రాజ్యాంగం హృదయమనదగ్గ వాక్యానికి శాస్త్రీయమైన వివరణలిచ్చుకోవడం మొట్టమొదట చేయాల్సిన పనవుతుంది.
అత్యంత మౌలికమైన ఈ విషయాన్ని గుర్తించండి ముందు. సమాజాన్ని రాజ్యాంగ బద్దంగా నిలిపి ఉంచాలనుకునే వారికి ఈ విషయం తెలిసి ఉండటం తప్పనిసరి. అలాగే వ్యవస్థను సక్రమంగా నడపటానికై ప్రధాన నియంత్రణ విభాగాలుగా ఏర్పరచుకున్న శాసన సభ, పాలన, నిర్వహణ విభాగము, న్యాయ విభాగము, ఈ మూటికీ శరీరంగా పనిచేసే రక్షక భట వ్యవస్థ అన్న నాల్గింటిలోని బాధ్యతలకు, ఈ ప్రాథమిక విషయానికి సంబంధించినంతవరకైనా ఒకేరకమైన అవగాహన ఉండితీరాలి. కనుక వాటిని గురించి సంక్షిప్తంగానైనా వివరించుకోవాలి.
క సూత్రంలో : 1. సామ్యవాద, 2. లౌకిక, 3. ప్రజాస్వామ్య, 4. గణతంత్ర, 5. వ్యవస్థ అన్న పదాలున్నాయి.
1. సామ్యవాదం : ''సోషలిజం'' అన్న ఆంగ్ల పదానికి అనువాదమిది. ఎవరు ఎప్పుడు, ఎందుకా పదాన్ని అనువాదంగా వాడారో గాని, దానికంటే ''సమాజవాద'' అన్న పదం బాగుంటుందనిపిస్తోంది. పదం సంగతలా వుంచితే ''సామ్యవాదం'' అన్న పదానికి నిర్వచన రూపంగా ఎక్కడా అర్థం చెప్పబడిలేదు గాని, వ్యవహారంలో మాత్రం ఒక రకమైన ఆర్థిక దృక్ఫధాన్ని తెలిపే పదంగా రూఢిపడిపోయింది. ప్రకృతి సంపద, దానిననుసరించి సమాజం సృష్టించుకున్న సంపద మొత్తం సమాజం మొత్తానికి చెందుతుంది. దానిపై ఏ ఒక్కరికో, కొద్దిమందికో గుత్తాధిపత్యం ఉండరాదు - అన్న ప్రధాన దృష్టి కలిగి, సంపద, శ్రమ, ఉత్పత్తి, పంపిణీ, మిగులు అన్న అంశాలను వివరించే వాదమిది. వ్యక్తిగత ఆస్థికి పరిమితుల్ని విధిస్తూ, సమస్థ సంపదపైనా నియంత్రణాధికారం సమిష్టిదే అన్న నిర్ణయం చేసి, వ్యక్తుల విషయములలో, పనినిబట్టి ఫలితం, పనిచేసిన వారికే ఫలితం, చేయనివారికి గాని, చేయని దానికి గాని ఫలితం అందరాదు అన్న దృష్టిని కలిగి వుంటుంది ఈ వాదం.
రాజ్యాంగంలోని పలు అధికరణాలలో ఈ వివరాలు పొందుపరచబడ్డాయి. అందులో కొన్ని :
1. ఆదేశిక సూత్రాలు అన్న విభాగంలో ఆర్టికల్స్ 38, 39లలో (44వ రాజ్యాంగ సవరణ1978 ననుసరించి) 38(2) ప్రభుత్వం - ముఖ్యంగా రాబడిలో అసమానతలు తగ్గించడానికి, వేరువేరు ప్రాంతాలలో, వృత్తులలో వున్న వ్యక్తుల మధ్యనేగాక, వేరు వేరు ప్రజా సముదాయాల మధ్యను, స్థాయిలో సదుపాయాలలో అసమానతలు తొలగించడానికి యత్నించాలి.
39 - ప్రభుత్వం ప్రజలకు ఈ క్రింది వానిని అందుబాటులోనికి తేవడానికై ఒక విధానమును రూపొందించుకోవలెను.
ఎ) పౌరులందరకు స్త్రీ, పురుష బేధం లేకుండా సమాన జీవనోపాధులను కల్పించాలి.
బి) దేశ వనరులు, వాటి పంపిణీ, మరియు యాజమాన్యము, ప్రజలందరి హితానికి, మొత్తము సంఘాభివృద్ధికి దోహదపడేలా ఉండాలి.
సి) ఆర్థిక వనరులు ఏ ఒక్కరి లేదా కొద్దిమంది వద్ద కేంద్రీకృతం కాకుండేటట్లు, వికేంద్రీకృతం అయ్యేటట్లు, జనసామాన్యమునకు హాని కలుగకుండునట్లు ఆర్థిక వ్యవస్థను నిర్మించాలి.
డి) స్త్రీ, పురుషులందరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.
ఇ) వ్యక్తుల్ని శక్తికి మించిన పనులలో నియమించరాదు. అనారోగ్యమును కలిగించు పనులలోనూ నియమించరాదు.
ఎఫ్) బాలలు ఆరోగ్యంగా, స్వేచ్ఛగా బాల్యాన్ని గడపటానికి, క్రమాభివృద్ధిని నందడానికి అవసరమైన చర్యలు చేపట్టాలి.
39/ఎ- ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ సమాన న్యాయ అందేలా న్యాయసహాయాన్ని అందించాలి.
41- పని కలిగి ఉండే హక్కు, చదువుకునే హక్కు, నిస్సహాయులకు చేయూత నివ్వడం అమలయ్యేలా చూడాలి.
42, 43, 43(ఎ) లలోను ఆర్థికపరమైన కనీస హామీనివ్వాల్సి ఉంటుందన్న అంశాలు వివరింపబడ్డాయి.
గమనిక : ఇవన్నీ సామ్యవాద - సమాజవాద - ఆర్థిక విధానపు స్వభావాన్ని కలిగివున్న అధికరణలే. రాజ్యాంగాన్ని కూలంకషంగా వెదికితే ఇలాంటి స్వభావం గల సూత్రీకరణలు మరికొన్ని దొరుకుతాయి. అందుకై ఎవరికి వారు పూనుకోండి.
ప్రస్థావన ఉద్ధేశిస్తున్న సమానాభివృద్ధి, సమగ్రాభివృద్ధి జరగాలంటే సమాజవాద, సామ్యవాద, ఆర్థిక విధానాన్ననుసరించడమే సరైనదవుతుంది. అలాకాక భూస్వామ్య విధానాన్ని గానీ, పెట్టుబడిదారీ విధానాన్ని గానీ ఆర్థికాంశాలకు ముడిపెడితే 1. జనుల మధ్య ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోతాయి. 2. ఆర్థికంగా బలంగా వున్నవారు మరింత బలవంతులుగా, బలహీనులు మరింత బలహీనులుగా ఏర్పడే వీలు.
ఉత్పత్తి : ప్రజావసరాలు అన్న దృష్టిని విడచి, చేయగలిగినంత అధికంగా చేయడం, దానంతటినీ ఎలాగోలా అమ్ముకోవడం అన్న దృష్టిని సంతరించు కుంటుంది.
గమనిక : ఈ పోకడవల్ల రకరకాల అవాంఛనీయతలు చోటుచేసుకుంటాయి. 1. విపరీతమైన దుబారా జరుగుతుంది. 2. వాడిపారవేయి అన్న సంస్కృతి ఏర్పడుతుంది (యూజ్ అండ్ త్రో కల్చర్). 3. కృత్రిమ అవసరాలు సృష్టించబడతాయి. ఎందుకంటే..
పెట్టుబడిదారుని ప్రధాన లక్ష్యం అత్యధికంగా లాభాన్ని ఆర్జించడమే. మిగిలినవన్నీ అతనికి అప్రధానమైనవే. వీరి ఆలోచన, పరిశోధనంతా ప్రజావసరాలేమిటన్న దృష్టితో కాకుండా, ఎక్కువలో ఎక్కువ లాభాలార్జించటం ఎలా అన్న వైపుకే మొగ్గుతూ ఉంటుంది. 1. అధికోత్పత్తిని ఎలా సాధించాలి. అదిన్నీ తక్కువ మానవ వనరులతో ఎక్కువ ఉత్పత్తిని ఎలా సాధించాలి ? మానవ శ్రమకు వీలయినంత తక్కువ వెల కట్టడంతో సరిపెట్టడం ఎలా ? చేసిన ఉత్పత్తుల్ని, అధికోత్పత్తుల్ని ఎలా వదిలించుకోవాలి. ? - మార్కెట్ చేయాలి అన్న వైఖరినే కలిగి ఉంటుంది.
ఇందుకు వారికున్న ఒకేఒక మార్గం ప్రజల్ని తమ ఉత్పత్తుల వైపు ఆకర్షించడమే. తమ ఉత్పత్తులు ప్రజల అవసరాలను తీర్చేటివేనని ప్రజలు అనుకునేలా నమ్మించడం, ప్రేరేపించడం కొరకుగా ఈ వ్యాపార వర్గాలు చేసే వ్యయం అసలు ఉత్పత్తి వ్యయం కంటే అధికంగా ఉంటుంది. జనాన్ని తమ ఉత్పత్తుల వైపు ఆకర్షించడానికి వారు పన్నని పన్నాగం లేదు. వేయని ఎత్తుగడ ఉండదు. వాటిలో భాగంగా విపరీతమైన ప్రచారపు హోరుతో బాటు, ఉత్పత్తులలోని సరుకును, దాని నాణ్యతకు ఏ మాత్రం సంబంధం లేని పైపై మెరుగులు దిద్దడం, ప్రచారానికి పిచ్చిజనం మరింత పిచ్చిగా అభిమానించే సినిమా నటీనటుల్నో, క్రికెట్ క్రీడాకారుల్నో ప్రచార సాధనంగా వాడుకోవడం లాంటి ప్రలోభ పెట్టే పనులన్నీ చేస్తుంటారు. అంతటితో ఆగక అంతంత ఖరీదెట్టి వాళ్ళ ఉత్పత్తులను కొనడం ఒక సాంఘిక హోదా అన్న భ్రమను కల్గిస్తారు. ఇన్ని చేస్తున్నా వ్యాపారపు పోటీ వల్ల, పెరిగిన సాంకేతిక సామర్ధ్యం వల్ల గుట్టలు పడిపోతున్న ఉత్పత్తులను అమ్మడం కుదరక, ఒక క్రొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. అత్యంత వినాశకరమైన ఆ ఎత్తుగడేమిటో తెలుసా? వాడిపారవేయ్ (యూజ్ అండ్ త్రో) సంస్కృతిని తీసుకురాగలిగారు. ఉత్పత్తులలో ఎక్కువ భాగం వాడి పారేసేటివిగనే ఉంటున్నాయి. పైకి చూడడానికి ఇదేమంత పెద్ద దోషంగా అనిపించదు గాని, క్రమంగా ఇది వ్యక్తి సాంఘిక జీవితాన్నే దెబ్బతీస్తుంది. స్వార్ధపరత్వాన్ని పెంచుతుంది. కృత్రిమ అవసరాలు ఇబ్బడి ముబ్బడిగా ఎదుట పడుతుంటాయి. వ్యాపార సంస్థలు రకరకాల ప్రచారపు ఎత్తుగడలద్వారా అవన్నీ నిజమైన అవసరాలేనన్న భ్రాంతిని కలిగిస్తూ కృత్రిమ అవసరాలన్న నిజాన్ని గమనించనీయకుండా తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకుంటుంటాయి.
వీటికి తోడు, అవసరాలు తీర్చుకోవాలనిపించడం, పాతకొరోత, క్రొత్తొక వింత అన్న దృష్టి ఉండడం, అవసరాలు తీర్చుకోకుంటే ఎలా ? అనిపించడం లాటి మానవ స్వభావజన్య లక్షణాలూ జతకూడి వ్యక్తిని నడు, నడు అంటూ వత్తిడి పెట్టేస్తాయి. వచ్చిపడుతున్న ఇన్ని అవసరాలు తీర్చుకోడానికి తగినంత డబ్బు అవసరం కదా! దాంతో మరింత సంపాదన చేయక తప్పని స్థితి. మిత్రులారా ! దాని పర్యవసానమేమిటో ఊహించగలరా...!
పర్యవసానమేమిటో ఊహించడానికి పెద్దగా తలలు పట్టుకోనక్కరలేదు. అది మరింత సంపాదించు, మరింతగా అనుభవించు అన్నదే. ''ఎర్న్ మోర్ & ఎంజాయ్ మోర్' ఇదే దాని పర్యవసానం. ఈనాడు సామాన్యుడి నుండి బాగా వున్న వారి వరకు అందరిలో వెనుకబడుతున్న సాధారణ ఒరవడి ఇదే. ఎక్కువ సంపాదిస్తే గాని ఎక్కువగా అనుభవించలేం కనుక ఎక్కువగా సంపాదించే మార్గాలను వెదుకుతాడు. అధికంగా శ్రమించడం, అడ్డదారులు తొక్కడం అన్నవే ఉన్న మార్గాలు. ఆ రెండు విధానాలే ఇప్పడు ఆచరణలో వున్నవి. విశ్రాంతి లేని, ఉరుకులు పరుగులతో కూడిన ఉద్యోగ జీవితాలొక వంక, తప్పుడు మార్గాల ద్వారా సంపాదించగలిగినంత సంపాదించడ మింకొకవంకా జరుగుతున్నది. అవినీతి, లంచగొండితనం అన్నవాటి యొక్క విస్తృత రూపమంతా ఈ రెండో విధానాన్నెంచుకున్న వారినుండే జరుగుతోంది.
కనుక పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థయొక్క వికృత మరియు క్రూర లక్షణంగా మితిలేని లాభార్జన దృష్టితో విపరీతమైన ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకుని, వాటిని అమ్ముకోడానికి కొనుగోలు దారుని కొనకుండా ఉండలేని బలహీనతకు - వ్యసనానికి - లోను చేయడం అన్న దగ్గరే వుంది. అది నిరంతరాయంగా సాగుతుండాలంటే వాడి పారేసే సంస్కృతిని సృష్టించాలి. బడాబడా పారిశ్రామిక క్షేత్రాలన్నీ ఈ విషయంలో పూర్తిగా సఫలీకృతమయ్యాయి. కొన్ని వినిమయాలు చాలాకాలం పనిచేసేవిగా వుంటాయి. మరి అట్టివాటి విషయంలో ప్రతి సంవత్సరం క్రొత్తగా ఉత్పత్తి అవుతున్న వాటిని అమ్మటం ఎలా ? చాలా కాలం కంపెనీలు తలలు బద్దలు కొట్టుకున్నాయి. ఇలాంటి సమస్యలు పరిష్కరించడానికే పుట్టిన మేధో సహాయ సంస్థలను ఆశ్రయించాయి. త్వరలోనే వారు దానికో పరిష్కారం చూపించారు. సెకండ్ సేల్స్ మార్కెటింగ్‌ను కూడా చేపట్టే పని మొదలుపెట్టేయమన్నారు. దాంతో ఎక్సేంజి ఆఫర్ల యుగం వచ్చేసింది. ''పాతదిచ్చి క్రొత్తది పట్టుకెళ్ళు'' సూత్రాన్ని తిన్నదరగని మందపైకి సంధించారు. బ్రహ్మాస్త్రంలాగా పనిచేసిందది. ఈనాడు ఎక్సేంజి మేళాలను పరిశీలించగలిగితే అదెంత విస్ఫోటనాన్ని సృష్టించిందో ఇట్టే అర్థమవుతోంది. దీనంతటి ప్రభావం భావి సమాజంపై ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతోంది. 1. మానవులకున్న మూలవనరుల్ని (పరిమితమైన ప్రకృతి సంపదను) హరించివేస్తుంది. మరొక వంక అనవసరపు వినియోగ మనస్తత్వాన్ని పెంచేస్తుంది. ఇంకోవంక కాలుష్య కారకాలైన వాడిపారేసిన చెత్తను కొండలంతేసి గుట్టలు పోసేస్తోంది. ఈ ప్రవాహపు వరవడిలో పడిన వ్యక్తి భోగ జీవితానికి బానిసై ఇతరేతర విషయాలేవీ పట్టించుకోలేకపోతాడు. క్రమంగా అతని మానసిక స్థితి సంఘజీవి నడవడిక నుండి విడివడి, స్వార్థక జీవినడవడికకు చేరేస్థితి ఏర్పడుతుంది.
గొప్ప విషాద మేమంటే, కోర్కెలను జయించు, ఇంద్రియాలను జయించు, భోగ జీవితం కంటె త్యాగజీవితం గొప్పది. యోగివిగా, భోగివికాకు లాంటి తాత్విక భావాలు విస్తృతంగా ప్రచారం చెయ్యబడ్డ ఈ దేశంలో, వ్యక్తి ప్రవర్తనలో, దాదాపు ముప్పాతిక భాగం (75%) ఈ విషకోరల్లో చిక్కుకుపోయి ఉంది. క్రమంగా సంఘాన్ని గురించి ఆలోచించడమే ఒక తెలివి తక్కువ పని అన్న దృష్టిపడిపోయింది.అట్టి మాటలు బ్రతకడం చేతగాని, జీవితాన్ని అనుభవించలేని అసమర్ధులు అనేటివిగా తలచబడుతున్నాయి. మోసం చేయడం, అడ్డదారులంట పనులు చక్కబెట్టుకోవడం, చేయించుకోగలగడం సామర్ధ్య సూచికలుగా అయ్యాయి.
నేరుగా కనబడకున్నా ఈ విపరీత పోకడలకంతటికీ మూలం పెట్టుబడిదారీ ఆర్థిక విధానపు స్వభావంలో వుంది. కనుక ప్రజా శ్రేయస్సుకోరే, మానవులంతా బాగుండాలనుకొనే వారంతా పట్టుబట్టి పెట్టుబడిదారీ ఆర్థిక విధానపు కబంధహస్తాల నుండి బయటపడి, రాజ్యాంగం సూచిస్తున్న సమాజవాద- సామ్యవాద - ఆర్థిక విధానం వైపు అడుగులు వేయకుంటే అతి త్వరలోనే భావితరానికి, భవిష్యన్మానవసమాజానికి మరుభూమే మిగులుతుంది. వర్తమాన సమాజంలోని 50, 60 శాతం బడుగుల జీవితాలు చట్టుబండలైపోతాయి. 20, 30 శాతం మధ్యతరగతి ఇంతో అంతో పెరిగిన ఆదాయాలు విపరీతంగా వచ్చిపడుతున్న కృత్రిమావసరాలు కలగలసి, నైతిక విలువలుగాని, సామాజిక స్పహగాని ఇసుమంతైనా లేని కరడుగట్టిన స్వార్థజీవితానికి అలవాటుపడిపోతారు.
అవిశ్రాంతంగా పనిచేయడం ద్వారా గాని, అడ్డదారులు తొక్కడం ద్వారాగాని వీలయినంత సంపాదించడం, అనుభవించగలిగినంత అనుభవించడం, సంతానం కొరకు మరింత పోగుచేసి వారిని భోగజీవులుగా తయారుచేయడం అన్న ప్రస్తుత నడవడి అంతా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు కాసిన విషపు కాయలే. కనుక ఇప్పటికైనా మేలుకొని ఎంతో దూరదృష్టితో భారత జాతి అంతటి ఉన్నతికవసరమని రాజ్యాంగ నిర్మాతలు పొందుపరచిన సామ్యవాద ఆర్థిక విధానాన్ని పునర్జీవింపజేసుకుని దేశ ప్రగతికి బాటలు వేసుకోవలసి ఉంది.
భారత దేశం ఒక పెద్ద కుటుంబం. దేశ సంపదంతా కుటుంబ ఉమ్మడి ఆస్థి. కుటుంబ సభ్యులంతా వారసులుగా సమాన భాగస్వాములు. అవసరాలకు పోను మిగిలిందంతా కుటుంబ భావితరానికి చెందాలి. ఇదే సామ్యవాదమన్న మాట వెనుక ఉన్న, ఉండాల్సిన సరైన భావన.
ఈ విషయంలో రాజ్యాంగ నిర్మాతలలో ప్రధమగణ్యుడైన అంబేద్కర్ మాటలను గుర్తుచేసుకోవలసి ఉంది. ''మనం మనకొరకు ఎలా రాజకీయ ప్రజా స్వామ్యాన్ని ఎంచుకున్నామో అలాగే ఆర్థికాంశాలలోనూ ప్రజాస్వామ్యాన్నే ఎంచుకున్నాం. ఆర్థిక ప్రజాస్వామ్యమే మన ఆర్థిక విధానం. కనుక ప్రతి ప్రభుత్వము ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని తేవడానికి కృషిచేయాలి. అప్పుడే రాజ్యాంగ ఆదేశిక సూత్రాల విషయంలో మన సభ్యులకున్న అపోహలు, అపార్థాలు సమసిపోతాయి '' అనన్నారాయన. ఎంతటి దూరదృష్టి ! ఎంతటి విస్పష్టమైన అవగాహన ! నిజమైన ప్రశంసార్హుడాయన.
గమనిక : ఈ వివరాలు మరింత వివరంగా చూడదలుచుకున్న వారు రాజ్యాంగం 38 నుండి 49 అధికరణాల వరకు పరికించండి. అధికరణం 21 లాటివి మరికొన్ని సామ్యవాదానికి బలాన్నిచ్చేటివి ఉన్నాయి.
లౌకిక రాజ్యాంగం
రాజ్యాంగములోనే సమాజవాద ఆర్థిక విధానపు వ్రేళ్ళున్న ప్రస్తావనలోనూ ఆ పదాన్ని చేర్చడం వల్ల దానికో స్పష్టత, సూటితనము వచ్చి, దేశ ఆర్థిక విధానమంతా, సంపద, ఉమ్మడి సొత్తు అన్న భావనకు అనుగుణ్యంగానే ఉండాలన్నదే రాజ్యాంగ హృదయమని నిర్ణయించినట్లయింది. కనుక ఈనాడు నడుస్తున్న పెట్టుబడిదారీ ఆర్థిక విధానపు పెడపోకడలన్నీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమైనవనే చెప్పితీరాలి.
ఆర్థిక అసమానతలను కనీస మట్టానికి కుదించకుండా, కుదించేందుకు తగిన ఉత్పత్తి - పంపిణీ వ్యవస్థను నిర్మించుకోకుండా రాజ్యాంగం సూచించిన సామ్యవాదం అన్న మాటకు ఆచరణ రూపం రాదు. సామాజిక గతి నిర్ధేశకులు గాని, ప్రజలు గాని, ఈ అంశాలను పట్టించుకోకుండగనే గాకుండా, విడిచిపెట్టేందుకూ సిద్దపడడం నూటికి నూరు శాతం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. కనుక భారత రాజ్యాంగం ఆశిస్తున్న రీతిలో కనుక సమాజాన్ని నిర్మించుకోవాలన్న చిత్తశుద్ధి ఉంటే, తప్పనిసరిగా ఈ సూత్రీకరణను వంటబట్టించుకొని, తదనుగుణ్యాచరణకు పూనుకోవడం ఒక్కటే మార్గం. సమాజ పునర్నిర్మాణమంటూ బయలుదేరిన ఉద్యమాలు దీనినంతగా పట్టించుకోకపోవడం కడు విచిత్రమేగాక, విషాదం కూడా. అందరం ఒక్కటై చిల్లర సమస్యలపై పోరాడడాలను ఆపి, సామ్యవాద ఆర్థిక విధానానికై తలపడడం సర్వదా శ్రేయస్కరం.
ఎలా సమాజవాద ఆర్థిక విధానమన్నది మాత్రమే ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించి పెట్టగలుగుతుందో అలానే పౌర సంబంధాలలో ఈ లోకానికి సంబంధించి, పరలోకాలతో పనిలేని నియమ నిబంధనలు మాత్రమే సాంఘిక ప్రజాస్వామ్యానికి ఆకృతినివ్వగలవు. ఈ విషయాన్ని సక్రమంగానే గాక తగినంతగాను అర్థంచేసుకోవాలంటే దీనికి సంబంధించిన పలు అంశాలను ముచ్చటించుకోవలసి ఉంది.
లౌకిక రాజ్యాంగం అనంటే - ఈలోక విషయాలకు మాత్రమే పరిమితమైన రాజ్యాంగం (ఒప్పందం) అని అర్థం. రాజ్యాంగమన్న దానిని, సరళమైన భాషలో వ్యాఖ్యానించుకుంటే, ఇక్కడి ప్రజల కొరకు, ప్రజలెంచుకున్న వారిచే రూపొందించబడి ప్రజలకు ఇవ్వబడ్డ సామాజిక కట్టుబాటు రూపమైన ఒప్పందము అని అర్థము. రాజ్యాంగ నిర్మాతలూ ఈ విషయాన్ని 'ప్రస్తావన'లో విస్పష్టంగా ప్రకటించారు.
''భారత దేశ ప్రజలమైన మేము, మా కొరకు రూపొందించుకొని మాకు మేము ఇచ్చుకున్న అధిశాసన ఒప్పంద పత్రము'' అన్న ఆరంభ వాక్యము ఉందక్కడ. కనుక ప్రతి పౌరుడు మొట్టమొదట తాను రాజ్యాంగ బద్దుడనై ఉంటాను అని ప్రతిజ్ఞచేయాలి. ''లౌకికం'' అన్న పదం ఈలోక సంబంధమైన అన్న అర్థాన్నిస్తుందికదా ! అసలు ఈ పదాన్ని రాజ్యాంగంలో చొప్పించాల్సిన అవసరమేమొచ్చింది? మన దేశంలో ప్రాచీన కాలం నుండి పారలౌకిక - పరలోకముందన్న దృష్టితోనుండిన - భావజాలం ప్రజలలో బలంగా వేరూనికొని ఉంది. దానికి వ్యతిరేకంగా ''అలాటి దేవిూ లేదు'' అన్న దృష్టిగల భావజాలము ఉనికిలోనికి వచ్చి కొనసాగుతున్నది. వాటినే పారిభాషికంగా ''ఆస్థిక - నాస్తిక'' ధోరణులు అని అంటున్నాము. వాటిననుసరించే ప్రజా సమూహాలను ఆస్తికులని, నాస్తికులని అని అంటున్నాము. అంటే లోకంలో ఈ రెండు రకాల సమూహాలే గాక, వీరికి వేరైన, వీటిని పట్టించుకోని ప్రజలూ ఉన్నారు. వీరికి తోడు ప్రకృతి విజ్ఞాన క్షేత్రము, ఈ క్షేత్ర పరిశోధకులూ స్వభావ రీత్యా ఈ రెంటినీ పట్టించుకోని వారుగనే ఉన్నారు. ఇన్ని రకాల భావాలు కల ప్రజలున్న సమాజాన్ని కలిపి ఉంచే, నిలిపిఉంచే, సక్రమంగా నడిపించే స్వభావము, సత్తా ఉండాలంటే అది ఎట్టి దృష్టికల ఒప్పందమై ఉండాలి ? అని గనక ప్రశ్నించుకుంటే, అది, మూడు సమూహాలకూ అభ్యంతరం ఉండక్కరలేనిది, మూడు సమూహాల ప్రజలూ అంగీకరింపక తప్పనిదీ, ఆచరణలో అందరినీ సమానంగా చూడగలిగే స్వభావం కల ఒప్పందమై ఉండాలి అన్న సమాధానమే వస్తుంది. మరలాంటప్పుడు అలాంటిదేదై ఉంటుంది? అన్నది విచారించాల్సిన విషయం అవుతోంది.
ఎ) ముందుగా ఆస్తికత్వాన్నంగీకరించిన రాజ్యాంగాన్ని తీసుకుందాం.
వెంటనే మనకు కనిపించేది మొత్తం సమాజం దానిని అంగీకరించదు అన్న వాస్తవం. ఎందుకని? 1. నాస్తికులు అంగీకరించరు. 2. వైజ్ఞానిక క్షేత్రాలు మరియు పరలోకం, దేవుడు ఉన్నవా, లేనివా అన్నది తేలని విషయం అనేవాళ్ళు, తెలియని విషయం అనేవాళ్ళు దీనిని అంగీకరించరు. 3. అంతేకాదు ఆస్తికులలోని వివిధ ధోరణుల వారు ఏ దేవుడు, ఏ పరలోకమూ, ఏ ధోరణీ చెబుతున్న జీవన విధానమునంగీకరించాలి అన్న మీమాంస వచ్చినప్పుడు ప్రతి ఆస్తిక ధోరణి వారు తాము విశ్వసిస్తున్న వాటిని మినహాయించి మిగిలిన ఆస్తిక ధోరణులు చెబుతున్న వాటిని అంగీకరించదు. ప్రతి మత సిద్ధాంతం ఇతర మతాలు చెబుతున్న పరలోకాల గురించి అవిలేనివే ననే చెబుతోంది. కనుకనే ప్రతి మతం ఇతర మతస్తుల్ని నాస్తికులనే అంటుంది.
కనుక ఏదో ఒక ఆస్తికత్వాన్నంగీకరించిన రాజ్యాంగం మొత్తం పౌరులకు న్యాయం చేయగలిగిందిగా గానీ, పౌరులంతా అంగీకరించగలిగిందిగా గాని ఉండలేదు. ఎందుకంటే ఏదోఒక ప్రామాణిక గ్రంధాన్నంగీకరించని ఆస్తికతంటూ ఉండదుకనుక. ఆస్తికతనంగీకరించిన రాజ్యాంగం అనగానే ఫలానా ఆస్తికత నంగీకరించిన రాజ్యాంగం అనక తప్పదు. అప్పుడు అన్నిటికంటే పెద్ద ఆటంకం వచ్చిపడుతుందా రాజ్యాంగానికి. అదేమంటే ఆ రాజ్యాంగానికి, ఆ మత గ్రంథం చెబుతున్న ధర్మాధర్మాలు, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలతో కూడిన శిక్షాస్మృతినే అనుసరించి తీరాలని చెబుతుంది. ఇట్టివాటిని ఎందుకంగీకరించరాదో చెప్పవలసి వస్తే ముందుగా చెప్ప వలసింది, అది అశాస్త్రీయమైన ఒప్పందం అనే. కాలానుగుణ్యంగా అవసరమైన మార్పులనంగీకరించని తనం ఉంటుందందులో. అంటే దేశకాల పరిస్థితుల ననుసరించి వదలుకోవలసిన వాటిని వదలుకోనీయని, చేర్చుకోవలసిన వాటిని చేర్చుకోనీయని (మార్పునంగీకరించని) స్వభావం ఉంటుందందులో. కనుకనే అట్టి ఒప్పందానికి మొత్తం సమాజాన్ని నిలిపి, నడిపించే శక్తి ఉండదు అంటున్నాం.
ఆరోగ్యవంతమైన ఒప్పందం అనడానికి వీలైన దేనిలోగాని, అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకునే వెసులుబాటు ఉండాలి. ఉండి తీరుతుంది. ఈ సందర్భంగా, మానవ మేథ గుర్తించిన ఒక తాత్విక సూత్రాన్ని స్మరించుకుందాం. ''ఎప్పటికప్పుడు అప్పటికి ఏర్పరచుకున్న పాత క్రొత్తల మేలు కలయికే ఉత్తమ విధానమవుతుంది'' అన్నదే ఆ సూత్రం. నాకు తెలిసి ఈ సూత్రం సార్వకాలీన విలువ కలది.
2. ఇక నాస్తిక భావజాలాన్నంగీకరించిన ఒప్పందాన్ని గురించి విచారిద్దాం.
ముందుగానే ఇది పరలోకము, దేవుడు అనేవి లేవు అన్న భావనతో ఆరంభం కావలసి ఉంటుంది. అంతటితో ఆగక అలాంటి ఆస్తిక భావనలు పునాదిగా ఏర్పడ్డ జీవన రీతుల్ని, ఆచార కాండను అంగీకరించకూడని, పాటించకూడని అంశాలుగా ప్రకటించాల్సి వస్తుంది. ప్రకటించి తీరుతుంది. కనుక అట్టి ఒప్పందం ఒక్క నాస్తిక ధోరణికి చెందిన జనం తప్ప మిగిలిన ఆస్తికులూ (వివిదాస్తికులు) ఆస్తికేతరులలోని వివిధ సమూహాలు కూడా అంగీకరించని స్వభావాన్ని కలిగి ఉంటుంది. కనుక అది ఏ కాలంలోనూ ప్రజలందరి ఆమోదం పొందలేదు. ప్రజలందరనూ ఒకే బాటన నడపగలిగింది గాను ఉండదు.
గమనిక : కనుకనే ప్రపంచంలో ఏ రాజ్యాంగమూ నాస్తిక రాజ్యాంగంగా మనుగడ సాధించలేదు. కమ్యూనిజపు పునాది తాత్వికంగా భౌతిక వాదమే అయినా, దానికి నాస్తిక రాజ్యాంగాన్ని అమలు చేయడం సాధ్యపడలేదు. ఆ విషయంను వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన భాగంలోకి నెట్టివేయడం మినహా చేయగలిగింది ఏమీ లేదనేదే అనుభవం చెబుతున్న సమాధానం. సైన్సు పరిశోధనల ఆధారంగా అందుతున్న సమాచారం ప్రకారమే పోతుండటం మేలు అని నాస్తిక హేతువాద ధోరణుల విజ్ఞులు చెబుతున్నా, సైన్స్ ఇప్పటికీ దేవుడు ఉన్నాడనిగాని, లేడని గాని నిర్ధారించలేదు గనుక, ఏ రాజ్యాంగాన్ని గాని, నాస్తిక పునాదిగల రాజ్యాంగంగా ఏర్పరచి ప్రలందరూ దానిలో ఐచ్ఛికంగా చేరేలా చేయడం అసాధ్యం. కాబట్టి నాస్తిక రాజ్యాంగం సర్వామోదం పొందగలిగిందిగా ఉండలేదు.
ఎంతో వైవిధ్యము, కొన్ని విషయాలలో వైరుధ్యములతో కూడి ఉన్న వివిధ ధోరణుల వారందరినీ కలిపి ఉంచగల, నిలిపి ఉంచగల, నడిపించగల రాజ్యాంగపు ప్రాథమిక భావనలు ఎలా ఉండాలంటారు? ఎలాగుంటే అందరి లేదా ఎక్కువ మంది ఆమోదాన్ని - ప్రజాస్వామ్య స్వభావాన్ని- పొందగలుగుతుందంటారు ? నాకు తెలిసిన మాటల్లో చెప్పాలంటే మరోమాటకు తావులేకుండా లౌకిక రాజ్యాంగానికే, దానికి మాత్రమే అట్టి శక్తి, వెసులుబాటు ఉంటుందంటాను.
3. లౌకిక రాజ్యాంగానికున్న విస్తృతి వెసులుబాటు :
ఎ) పైన చెప్పుకున్న మూడు, నాలుగు రకాల తాత్విక ధోరణులవారందరూ ఈ లోకాన్ని వ్యతిరేకించరు.
బి) అంగీకరించడంతోపాటు, ఈ లోక సంబంధాంశాలన్నింటిని అమలు చేస్తూనే జీవించాల్సిన పరిస్థితి ఉంటుంది.
సి) ఎవరికైనా - అందరికీ - ఈ లోకము వాస్తవము. ఈ లోకంలోని పరస్పర సంబంధాలు వాస్తవము. ప్రకృతి తోటి సంబంధం వాస్తవం. జీవితావసరాలు వాస్తవం. అవి సులభంగా, సరళంగా తీర్చుకోవడానికి దారులు వెతుక్కోక తప్పదన్నది వాస్తవం. దీనంతటికి సహజీవనం అనివార్యమన్నది తిరుగులేని వాస్తవం. ఈ వాస్తవాల నేపధ్యంనుండే పరస్పర సహకారము, కొంతమేర సర్దుబాటు అన్న విధానం తప్పనిసరై ఆచరణలోకి వచ్చింది.
ఇచ్చిపుచ్చుకోక తప్పని స్థితీ, ఆ ఇచ్చిపుచ్చుకోవడంలోనూ ఒక స్థిరమైన విధానాన్ని రూపొందించుకోవలసిన అవసరము అన్న వాటిని బ్రతుకే ఎదుట పెట్టింది. అదిగో అలాంటి అవసరాల వత్తిడి పునాదిగా పుట్టుకొచ్చి వివిధ మార్పులు, చేర్పులకు లోనవుతూ వచ్చినవే రకరకాల కట్టుబాట్లు, ఆచారాలు, సాంప్రదాయాల రూపాలన్నీ.
బ్రతుకులో మనుషులు పరస్పరం ఒకరిపట్ల ఒకరు ఎలా ఉండాలి. ఎలా ఉండకూడదు? అలాగే అలాటి విధినిషేధాలు సక్రమంగా అమలవుతుండాలంటే వ్యవస్థ నిర్వహణ సూత్రాలు ఎలా ఉండాలి ? అన్న దాని విస్తృత రూపమే రాజ్యాంగం అంటే. కనుక ఏ ఒప్పందంలోగాని, దాని ప్రధాన రూపం వ్యక్తుల పరంగా, వ్యవస్థ పరంగా రూపొందించుకున్న విధినిషేధాలతో కూడిందిగనే ఉంటుంది. ఈ మొత్తము నిర్మాణం కూడా ఒప్పందపు ప్రధానాకాంక్షయైన ''అందరి యోగక్షేమాలు'' అన్న దానిని నెరవేర్చగలిగేదిగా ఉండాలి.
ఒప్పందపు ప్రధానాకాంక్ష :
అది వివేకం అంగీకరించగల ఒప్పందం అయితే మాత్రం ఒప్పందం క్రిందికి వచ్చేవారందరి అవసరాలు తీరడానికి, సహజాకాంక్షలు నెరవేరడానికి, క్రమాభివృద్ధి నొందడానికి వీలుగా సమానావకాశాలు కల్పించడానికి తగిన విధినిషేధాలతో కూడి ఉంటుంది. దాంతోపాటు దేశ కాల వ్యక్తుల ననుసరించి తప్పనిసరైన మార్పులు, చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉన్నదై ఉంటుంది. ఈ మొత్తాన్నే సూత్రప్రాయంగా ''జాతి సమైక్యత, సమానాభివృద్ధి, సమగ్రాభివృద్ధి అన్న లక్ష్యాలు సాధించడానికి వీలయినదిగా ఉండాలి'' అనంటాం. మన రాజ్యాంగంలోని అధికరణం 51/ఎ లోని (జె) అన్న ఉపరిభాగంలో ఈ అంశాన్ని గురించిన స్పష్టమైన ప్రకటన ఉంది.
వ్యక్తులు వ్యక్తిత్వ సామర్ధ్యాలను సర్వాంగీణా పెంపొందించుకొనుట ద్వారా మరియు సమిష్టి కృషిద్వారా దేశము స్థిరంగా క్రమాభివృద్ధి నొందుతూ ఉన్నత శిఖరాలకు చేరేందుకు అనువుగా ప్రవర్తించడం ప్రతి పౌరుని ప్రాథమిక విధి.
కనుక ఒప్పందం ఇంతటి విశాలతను, లోతును సంతరించుకోవాలంటే పైననుకున్న ఆర్థిక ప్రజాస్వామ్యంతోపాటు, సామాజిక ప్రజాస్వామ్యమూ ఆచరణలోకి తేగలిగేదిగా ఉండాలి. ఆ పనిని నిర్వహించగలిగింది తాత్వికంగా చెప్పుకుంటే ''లౌకిక రాజ్యాంగం'' మాత్రమే. అదండీ లౌకికమన్న మాట వెనుకనున్న కథాకమామిషు.
గమనిక : భారత రాజ్యాంగ నిర్మాణం నాటికి, అవతారికలో సామ్యవాద, లౌకిక అన్న పదాలు లేవు. 1976లో చేసుకున్న 46వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ రెండు పదాలను ప్రస్తావన (అవతారిక)లో చేర్చుకోవడం జరిగింది. నిజానికాపదాలు చేర్చక మునుపే రాజ్యాంగ చట్రంలో సామ్యవాద ఆర్థిక విధానానికి సంబంధించిన సూత్రీకరణలు, లౌకిక వాదానికి సంబంధించిన సూత్రీకరణలు ఇమిడే ఉన్నాయి. అయినా వాటన్నింటికి ఒక నిర్ధిష్ట, నిశ్చిత రూపం ఇవ్వడం కొరకుగా రాజ్యాంగ హృదయం అనదగ్గ ప్రస్తావనలో ఆ పదాలను చేర్చుకున్నాము. అందువల్ల ఈ రెండు వైఖరులకు భిన్నంగా ప్రవర్తించడం గానీ, సూత్రాలకు వివరాలు, వ్యాఖ్యానాలు చేయడం కానీ చేయకూడదని విస్పష్టంగా నిశ్చయించుకున్నట్లయింది.
ప్రాథమిక హక్కుల గురించి రాజ్యాంగములోని విభాగం (3) లోని అధికరణం 14 నుండి 32 వరకు చెప్ప బడింది.
అధికరణాలు
14 :- చట్టము ముందు అందరూ సమానులే
15 :- మత, జాతి, కుల, లింగ, జన్మ స్థానములను బట్టి వివక్షత చూపటం నిషిద్దం
16 :- ప్రభుత్వ ఉద్యోగ, వసతుల విషయములో సమానావకాశాలు
17 :- అస్పృశ్యతా నిషేధం.
వివరణ : పై వన్నియూ లౌకిక, సామ్యవాద, ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మించుకోవడానికి ఉద్దేశించినవే. ఎలాగంటే ఏ మత గ్రంథాన్ని తీసుకున్నా మనుషులందరినీ సమానంగా చూసిన దాఖలా కనపడదు. కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం.
1) ఇస్లాంలో చట్టం ముందు స్త్రీ, పురుషులు కొన్ని విషయాలలో అసమానులు, (ఎ) ఆస్థి హక్కుల విషయంలో (బి) వివాహబంధం కొనసాగించడం లేక తెంచుకోవడం విషయములో (సి) సాక్షిగా పరిగణింపబడే విషయములో (డి) బానిసల విషయములో
2) బైబిలు ప్రకారమూ సాంఘికంగా వివిధ అసమానతలు ఉన్నాయి. బానిస వ్యవస్థ అంగీకరింపబడింది.
3) హిందూ మతం అంటున్న దానిలో మరింత వ్యత్యాసాలు, గందర గోళమూ ఉంది. స్త్రీ, పురుషుల మధ్య అసమానత ఉంది. జన్మను బట్టి నిమ్నాధిక్యతలు ఉన్నాయి. మరింత అమానుషమన్న రీతిలో అస్పృశ్యత ఉంది. బానిస వ్యవస్థ అంగీకరింపబడింది.
కనుకనే వాటిని వదిలించుకోవడానికీ, అందరికీ సమాన ప్రాతిపదిక నివ్వడానికీ స్పష్టంగా ప్రాథమిక హక్కుల రూపంలో పై నాలుగు సూత్రీకరణలు (శాసనరూపంలో) పొందు పరచుకోవలసి వచ్చింది. లౌకిక, సామ్యవాదమన్న వాటి క్రిందైతేనే ఇవి సాధ్యపడుతాయి.
19/1, 19/2 : ఈ అధికరణాలు సూటిగా స్వేచ్ఛకు సంబంధించిన ఆరు ప్రాధమిక హక్కుల గురించి వాటి పరిమితుల గురించి తెలుపుతున్నాయి.
19/1: (ఎ) వాక్స్వాతంత్య్రము, భావ ప్రకటనా స్వేచ్ఛా హక్కు
(బి) ఆయుధాలను ధరించకుండా, శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు
(సి) సంస్థలను, సంఘాలను ఏర్పరచుకొనే హక్కు
(డి) భారతదేశంలోని ఏ ప్రాంతానికైనా వెళ్ళడానికి హక్కు
(ఇ) దేశంలోని ఏ ప్రాంతములోగాని నివసించడానికీ, స్థిర నివాసం ఏర్పరచుకోవడానికీ హక్కు
(ఎఫ్) ఉపసంహరింపబడింది.
(జి) దేశంలో ఎక్కడగాని, ఏ వృత్తిని గాని, పనిని గాని, వర్తక వ్యాపారములను గాని చేసుకొనే హక్కు
19/(2-6) ఈ అధికరణము ద్వారా పై ఆరు హక్కులకు గల హేతుబద్దమైన పరిమితులు చెప్పబడ్డాయి. దానర్ధం స్వేచ్ఛ అన్న పదానికి రాజ్యాంగం 'పరిమిత స్వేచ్ఛ' అన్న అర్ధాన్ని మాత్రమే అంగీకరిస్తున్నదనీ, సంపూర్ణ స్వేచ్ఛ లేదా విశృంఖలత్వంగా దానిని వ్యాఖ్యానించుకోరాదనీ, తేలుతోంది. వివరాలివిగో:
19 : (2) దేశ సార్వభౌమత్వాన్ని, అఖండతను, దేశ భద్రతను, విదేశాలతోడి సంబంధాలను ప్రజాశాంతి భద్రతలను సభ్యతా మరియు నైతికతలను చెడగొట్టే మరియు కోర్టు ధిక్కారణను, పరువు నష్టాన్ని, నేరాలను ప్రోత్సహించడాన్ని కలిగించే వాక్స్వాతంత్రము లేదు. ఉండకూడదు.
(3) దేశ సమగ్రత, సార్వభౌమతల పరిరక్షణకు గాని, ప్రజాశాంతి భద్రతల సంబంధంగా గాని ఆయుధాలతో సమావేశమవడానికి అంగీకరిస్తున్న చట్టాలు 19/1 (బి) లోని స్వేచ్ఛకు ప్రతికూలం కావు, దాని పరిమితిని తెలిపేటివే.
(4) అలాగే సంఘాలు, సంస్థలు స్థాపించుకునే విషయంలోనూ దేశ సార్వభౌమత, సమగ్రత, శాంతి భద్రతలకు సంబంధించిన ఆంక్షలకు లోబడిన స్వేచ్ఛే ఉంటుంది.
(5) అలాగే దేశ సంక్షేమంకొరకు గాని, షెడ్యూల్డు, తెగల రక్షణ నిమిత్తం గానీ, 19-1(డి) క్లాజులోని హక్కుపై ఆంక్షలు విధించే చట్టాలు పై హక్కుకు పరిమితుల్ని విధించేవే గాని వ్యతిరేకం కాదు.
(6) 19/1 (జి) క్లాజులోని వృత్తివ్యాపార సంబంధమైన హక్కుపై ప్రత్యేక సందర్భాలలో విధించిన ఆంక్షలు హక్కుకు ప్రతికూలం కావు. ఆ ప్రత్యేక సందర్భాలకు మాత్రం వర్తిస్తాయి.
వివరణ : ప్రజా ప్రయోజనాల దృష్ట్యా 19/1 లోని స్వేచ్ఛా హక్కులపై ఆయా సందర్భాలలో విధింపబడే ఆంక్షలు ఆ హక్కులకున్న పరిమితుల్ని తెలుపుతాయి.
ళీ సమ్మెచేసే హక్కులేదు. సమ్మె 19/1 (బి) క్రింద సమావేశమయ్యేదాని క్రిందికి చేరుతుందనడం తప్పుగా వ్యాఖ్యానించడమే
ళీ విధింపబడ్డ ఆంక్షలు సరైనవా కాదా అన్నది నిర్ణయించాల్సింది న్యాయస్థానాలే. (ఎఐఆర్ 1951. సెక్షన్ 118) 2
ళీ ఒక వ్యక్తి లేదా ఒక వర్గపు ప్రాథమిక హక్కు కన్నా ప్రజలందరి సామూహిక, ప్రాథమిక హక్కులు ఎక్కువైనవి. బంద్‌కు పిలుపివ్వడం ద్వారా ఇతరుల ప్రాధమిక హక్కులకు భంగం కలుగుతుంది. కనుక బంద్‌కు పిలుపివ్వడానికీ, బంద్‌లు చేయించడానికీ ఎవరికీ హక్కులేదు. (సి.పి.యమ్.ఖీరీ భరత్‌కుమార్ ఎఐఆర్ 1998 సెక్షన్ 184)
21 వ్యక్తి స్వాతంత్య్రము మరియు జీవించే హక్కు
21 (ఎ) విద్యాహక్కు
23 మనుషుల్ని అమ్మకూడదు, కొనకూడదు. మనిషి సరుకు కాదు నిర్భంధ కూలి కూడ నిషిద్ధం.
25 మన స్వేచ్ఛా హక్కు
26 మత సంబంధమైన కార్య కలాపాలను చేసుకొనే హక్కు.
వివరణ : మత స్వేచ్ఛ రెండు రూపాలలో ఉండవచ్చు. (1) వ్యక్తి తన ఇష్టాన్ని బట్టి ఏ మతంలోగానీ చేరవచ్చు, దానినుండి బయటకి రావచ్చు, ఏ మతములోనూ చేరకుండాను ఉండవచ్చు. నాస్తికుని గాను ఉండవచ్చు. అంటే మతం విషయములో ఒక వ్యక్తి ఇలానే ఉండాలన్న నిర్ణయం చేయదు రాజ్యాంగం. అతడు ఎలా ఉండాలన్న దాని విషయములో జోక్యం చేసుకోదు. దానర్ధం రాజ్యాంగానికి మత ప్రమేయం లేదనే గదా! దానినే రాజ్యాంగ స్వభావం అంటున్నాం.
ప్రస్తావనలో 'లౌకిక' అన్న పదాన్ని చేర్చక ముందే భారత రాజ్యాంగంలో మతా తీతంగా ప్రవర్తించడానికి అవసరమైన సూత్రీకరణలు ఉన్నాయి. కనుక 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 'లౌకిక' అన్న పదం చేర్చడం వల్ల అదనంగా కలిగిన ప్రయోజనం ఏమీలేదు. అన్న దృష్టి కొంత మంది యోచనా పరులలో ఉంది. కనుక ఇక్కడ కొంత విచారణ చేయాల్సి ఉంది.
1) నిజంగానే ఆ పదాన్ని చేర్చడం వల్ల అదనంగా చేకూరే ప్రయోజనం ఏమీ లేదు ఇది వాస్తవమైతే, అంతగా పూనుకుని రాజ్యాంగ సవరణ ఎందుకు చేసినట్లు? సవరణకు అవసరమైన ప్రక్రియనంతా ఎందుకు చేపట్టినట్లు?
అవతారిక-ప్రస్తావన-నిజానికి రాజ్యాంగ సార రూపాన్ని తెలిపేటటువంటిది. కనుకనే ప్రస్తావనను రాజ్యాంగ సూత్రీకరణలను సవరించినంత సుళువుగ సవరించ కూడదన్న (నిబంధన రాజ్యాంగంలోనే ఉంది) భావాన్ని తెలియబుచ్చారు మేధావులెందరో. అయినప్పటికీ ఏమీ ప్రయోజనం లేని దానికై అంతయత్నం ఎందుకు చేసినట్లు?
2) మరోకోణం నుండి దీనిని విశ్లేషించి చూద్దాం. సమాచారం పొందే హక్కు భారత పౌరునిగా మనకు రాజ్యాంగంలోని 19-1(ఎ) ద్వారానే సంక్రమించింది. ఆ విషయాన్ని రాజ్యాంగ వేత్త అనడమే గాక, సర్వోన్నత న్యాయస్థానమూ ధృవీకరించడం జరిగింది. మరలాంటపుడు ఏ ప్రయోజనం కోరి సమాచార హక్కు కొరకు, చట్టాన్ని చేసుకోవలసి వచ్చింది?
రాజ్యాంగం ద్వారా సంక్రమించిన సమాచార హక్కును వినియోగించుకోగలగడానికీ, ఆ విషయంలోనే, సమాచార హక్కు చట్టం ద్వారా సంక్రమించిన హక్కును వినియోగించుకోగలగడానికీ ఆచరణలో తేడా ఉందంటారా? లేదంటారా? ప్రత్యక్షాచరణ ద్వారా ఆ విషయాన్ని గమనించిన వారికి ఆరెంటి మధ్య ఖచ్ఛితమైన తేడా ఉందని ఇట్టే తెలిసిపోతుంది. శాసనమున్నా వినియోగంలోనికి రానిది, చట్టం ఏర్పరచుకున్నాక ఆచరణలోకి తెచ్చుకోవడానికి కావలసినంత బలం చేకూరిందన్నది ప్రయోగరీత్యా నిర్ధారణైన వాస్తవం.
అలాగే రాజ్యాంగ సూత్రీకరణలలో అంతర్లీనంగా ఉన్న లౌకిక స్వభావాన్ని గుర్తించడం, పాటించడం అంత సుళువుకాదు. కనుకనే రాజ్యాంగ సారాంశంగా చెప్పుకోబడ్డ ప్రస్తావనలో నిర్ధిష్టంగా దానికోస్థానం కల్పిస్తే, రాజ్యాంగ సూత్రీకరణలను వేటినైనా ఈ భావాల పరిధిలోనే వివరించుకోడానికీ, వ్యాఖ్యానించుకోడానికి, అపవ్యాఖ్యానాలు చొరబడకుండా చూసుకోడానికి కూడా వీలు ఏర్పడుతుంది. పట్టు చిక్కుతుంది. అదిగో ఆ ప్రయోజనాన్నందించే ప్రస్తావనను సవరించేందుకు సిద్దపడి మరీ, లౌకిక, సౌమ్యవాద పదాల్ని జోడించారు. ఇక ఇప్పుడు గానీ, ఇక ముందు గానీ భారత పౌరు లెవ్వరూ లౌకికేతరాంశాలకు అనుకూలంగాగానీ ప్రతి కూలంగా గానీ రాజ్యాంగం పేరున ప్రకటించనే కూడదు. లౌకికం కాని అంశాలేవైనా రాజ్యాంగేతరాలేనని నిర్ధిష్టంగా తేల్చి చెప్పినట్లైందన్నమాట. ఈ సందర్భంలో, రాజ్యాంగాన్ని వివరించుకోవడంలో అవతారిక ప్రయోజనమేమిటన్న దానిపై ఒకటి రెండు ప్రామాణిక స్థాయి గల అభిప్రాయలను కుందాం.
1. రాజ్యాంగంలోని అవతారిక చాలా విలువైనది. ఇది మన రాజ్యాంగానికి ఆత్మవంటిది. రాజ్యాంగ పెట్టెకు తాళం వంటిది. రాజ్యాంగ విలువలను మదింపు వేయడం విషయంలో గీటురాయి వంటిది. రాజ్యాంగంలోని సూత్రాలన్ని ఈ అవతారిక అనే గీటురాయితో నిర్ధారింపబడి, దాని పరీక్షకు నిలచినవిగా ఉంటాయి. అందుచేత రాజ్యాంగంలోని నిబంధనలనన్నింటినీ అవతారిక అనే గీటురాయిని ఉపయోగించి పరీక్షించాల్సి ఉంటుంది. (జూనిబిళీరిదీ శినీలి చీజీళిఖీరిరీరిళిదీరీ ళితీ శినీలి బీళిదీరీశిరిశితిశిరిళిదీ లీగి శినీలి ఊళితిబీనీ ఐశిళిదీలి ళితీ శినీలి చీజీలిబిళీలీజిలి) (కూర్‌దాన్ భార్గవ నవంబర్ 18-1949న రాజ్యాంగ నిర్మాణ శాసన సభలో చేసిన ప్రసంగాలనుండి)
2. (ఎ) అవతారిక రాజ్యాంగ అధికారం ఎక్కడనుండి పుట్టిందో ఆ మూల వనరు - భారత ప్రజలేనని చెపుతోంది.
(బి) రాజ్యాంగాన్ని అమలులోకి తేవడం జరిగిందన్న అధికారిక ప్రకటన చేస్తోంది.
(సి) ఇది భారత ప్రజలందరి భద్రతకు అవసరమైన ప్రాధమిక ప్రభుత్వాన్ని రాజకీయ వ్యవస్థను ఏర్పరచుటకు కావలసిన హక్కును, స్వేచ్ఛను ప్రకటించింది. (సుప్రీంకోర్టు ఎఐఆర్ 1973 సెక్షన్ 1461) గా కనుకనే అవతారిక మిగిలిన రాజ్యాంగ మంతటికి ఆధారపీఠం వంటిదవుతోంది. దీనిని జీర్ణం చేసుకోండి.
ముఖ్య గమనిక :- మతానుకూల, ప్రతికూల వైఖరుల వల్ల చరిత్రలో ఏమి జరిగిందో, ఇప్పుడూ ఇక ముందు కూడా ఏమి జరగడానికవకాశముందో నిష్పాక్షికంగా చూడగలిగితే గాని మత ప్రమేయంలేని - లౌకిక - అన్న పదానికున్న విలువేమిటో బోధపడదు - మానవ సమాజానికి లౌకికానికి పరిమితమైన ఒప్పందం. ఒప్పందం మాత్రమేఎందుకు యోగ్యమైనదవుతుందో అప్పుడు మాత్రమే అర్ధమవుతుంది. మానవ జాతి సుఖశాంతులతో నాలుగు కాలాల పాటు మనుగడ సాగించడానికి ఇవ్వగలఈ పదాన్ని ప్రవేశపెట్టిన వారికి మానవులంతా ఒక్కటే, అందరూ బాగుండాలి అని అనుకోగలిగిన వారంతా కృతజ్ఞతలు చెల్లించడం కనీస విజ్ఞత.
3. ప్రజాస్వామ్యం :
మన రాజ్యాంగం ఉద్దేశించిన ప్రకారం ఇక్కడ ప్రజలే సొంత దారులు (స్వాములు) అంటే యాజమాన్యపు హక్కు దారులు. వ్యవస్థ అంతా కలిపిగానీ, వ్యవస్థలోని ఏదేని విభాగం గానీ ప్రజల కంటే ఎక్కువ కానేకాదు. అదంతా ప్రజలకొరకు ప్రజలేర్పాటు చేసుకుని, తమంతతాము అంగీకరించిన ఒప్పందపు ఆచరణ భాగం మాత్రమే. కనుక సామాజిక, ప్రాకృతిక సంపద కంతటికీ ప్రజలే సమిష్టిగా యజమానులు. కనుక వ్యవస్థలోని పాలన నిర్వహణ భాగాలలోనేకాక, సామాజిక జీవనగతి సక్రమంగా ఉండడానికి అవసరమైన అన్నిసంస్థలు, వాటి కార్య కలాపాలు ప్రజలందరి అభివృద్దికి అనుకూలంగా ఉండాలన్నదే ప్రజాస్వామ్య భావన యొక్క పరమోద్దేశం. కనుకనే రాజ్యాంగ ప్రస్తావనలో ''ప్రజలచేత, ప్రజలకొరకు ప్రజలేర్పరచుకున్న'' అన్న క్లాజు వాడడం జరిగింది. ఈ మొత్తం వ్యవహార మంతా ప్రజలకొరకే. ఇదర్ధమైతే గానీ ప్రజలు పాలితులు కారు. ప్రజలపై ప్రభుపులెవరూ లేరన్న యదార్థం అర్ధంకాదు. నిజానికి ప్రజాస్వామ్యాన్ని వివరించుకోవడమన్నది చాలా విస్తారమైన వ్యవహారం ఎందుకంటే, ఆచరణలో అది చోరరాని భాగం, అది స్పృశించని అంశం ఉండదు కనుక. అయినా మనం పెట్టుకున్న శీర్షికకు తగినట్లు దాని సంక్షిప్త-కుదించిన-రూపాన్ని చెప్పుకుందాం.
1. స్వేచ్ఛ :- ఈపదం స్వ+ఇచ్ఛ= తనదైన ఇష్టము. అన్నఅర్ధాన్నిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఏవ్యక్తీ సంపూర్ణ స్వేచ్ఛావంతుడు కాడు. అలాగే సంపూర్ణ స్వేచ్చారహితుడూ కాదు. స్వేచ్ఛ అన్న పదం వ్యక్తి అభిలాషను తెలిపేదే అయినా వ్యవహారంలో ఎట్టిబంధనాలు లేకపోవడం అన్న అర్ధంలో వాడుకలో ఉంది. అయితే మన ప్రస్తుత సందర్భం ఖచ్చితమైన అద్దాలు చెప్పుకుని, నిర్ధుష్టమైన (దోషాలు లేని) వివరణలు చేసుకోవడానికి ఉద్దేశించింది గనుక ఎలా బడితే అలా మాట్లాడకూడదు. వీలయినంత వరకు స్పష్టార్ధబోధకాలైన పదాలనే వాడుకోవాలి.
'స్వేచ్ఛ స్వాతంత్య్రాలు' అన్న సమాసాన్ని మీరు వినే వుంటారు. అదే మీ పేపరు కాగితం లాంటి మాట కాదు గదా! మరింతకు స్వేచ్ఛకు, స్వాతంత్య్రానికి ఉన్న సంబంధం ఏమిటి? తేడా ఏమిటి?
స్వకీయమైన అభిలాష ఉండడం. ఇతరుల ప్రభావానికి లోనై అభిప్రాయాల నేర్పరచు కోకుండా ఉండడం లాంటి భావజాల క్షేత్రంలో ఇతరుల అధీనత లేకుండడం 'స్వేచ్ఛ' అనబడుతుంది.
ఇక స్వతంత్రము=స్వ+తంత్రము= తనవశము అని అర్ధం. స్వతంత్రుడు అంటే తన ఆధీనంలో తానున్నవాడు అని అర్దం. పరతంత్రుడు అంటే ఇతరుల ఆధీనంలో ఉన్నవాడు అని అర్ధం. స్వవశుడు, పరవశుడు అన్న పదాలు వినే వుంటారు. స్వవశుడు - స్వతంత్రుడు పర్యాయ పదాలు, పరతంత్రుడు- పరవశుడు పర్యాయ పదాలు. స్వేచ్ఛ ఉండి స్వతంత్రత లేకపోవడం సాధ్యమే. భౌతికంగా బంధింపబడకపోయినా భావబందితుడై ఉండడమూ సంభవమే. భావబంధనలో ఉన్నవాడిని స్వేచ్ఛలేని వాడనే అనాలి. భౌతికంగా బంధింపబడిన విజ్ఞులు, స్థితప్రజ్ఞులు ఆ బంధన సమయంలోనూ స్వేచ్ఛ కలవారే. విషయం అర్ధమవుతుందనుకుంటాను. మానసిక బంధంలేకపోవడాన్ని స్వేచ్ఛ ఉండడమని, మానసిక, శారీరకంగా తనవశంలో తానుండడాన్ని స్వతంత్రత ఉండడమనీ అంటారు.
సంఘజీవి స్వేచ్ఛగానీ, స్వాతంత్య్రంగానీ ఒప్పందపు పరిమితులకు లోబడినవిగానే ఉంటాయి అన్నది అందరం ముందుగా అర్ధంచేసుకుని, అంగీకరించాల్సిన ప్రాతిపదికల్లో ఒకటి. ఈ అవగాహన నేపధ్యం గానే పైన ''ప్రజాస్వామ్యంలో ఏవ్యక్తీ సంపూర్ణ స్వేచ్ఛావంతుడు గానీ, సంపూర్ణ స్వేచ్ఛారహితుడు గాని కాడు'' అన్న ప్రకటన-నిర్ణయం-చేయగలిగాము. (నిజానికి ప్రజాస్వామ్య వ్యవస్థగల సమాజములోనే గాక, ఏ కట్టడికి లోనైన జన సమూహంలోనైనా కొంత స్వేచ్ఛ, కొంత స్వేచ్ఛ లేని తనమూ అమలవుతూనే ఉంటుంది. అవునా, కాదా ?
ప్రజాస్వామ్యమంటే, కేవలం ఒక వ్యక్తి యజమానిత్వం గానీ, కొద్దిమంది యజమానిత్వంగానీ ఉండని, సమిష్టి యజమానిత్వం ఉండాలనే విధానాన్ని సూచించేది అని అర్ధం చెప్పుకోవాలి. అది చరిత్రలో జరిగిన రాచరిక లేదా నియంతృత్వ పోకడలకు ప్రత్యామ్నాయంగా ఉనికిలోకి వచ్చిన భావన. ఒక ఒప్పందం క్రిందికి వచ్చి కలసి జీవిస్తున్న వారందరికీ సమాన ప్రతి పత్తి ఉండాలని, అంటే అన్ని విషయాలలోనూ సమానమైన హోదా, స్థానము, అవకాశాలు ఉండాలని, ఉంటాయని అంగీకరించే భావన అది. దీనినంగీకరిస్తే ప్రజాస్వామ్యంలో వ్యక్తి సామాజికమైన అన్ని విషయాలలోనూ భాగస్వామి పరిమితమైన యజమానితనం కలవాడు అయ్యున్నాడని తేలుతుంది. ఆ రకంగా ప్రతి వ్యక్తికీ తానున్న స్థానాన్ని బట్టి ప్రత్యక్షంగానూ, మిగిలిన అన్నింటి విషయములోనూ పరోక్షంగానూ సంబంధమున్నట్లు.
ప్రజా స్వామ్యంలో ఉమ్మడి భాగస్వామ్యం అన్నదే అత్యంత సారభూత విషయం. అంటే, ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికీ, సామాజిక ప్రాకృతిక సంబంధమైన వ్యవహారాలన్నింటిలోనూ ప్రత్యక్ష, పరోక్ష రూపాలలో హక్కులు, విధులు, భాద్యతలు ఉండితీరుతాయి. అలాగే సూత్రప్రాయంగా దాని మూల రూపంలో ఒక వ్యక్తిగా ఏ వ్యక్తీ మరోవ్యక్తి కంటే ఎక్కువ కాదు, తక్కువా కాదు అన్నది అంగీకరింపబడుతుంది. దానినే మన రాజ్యాంగం మరింత సార రూపములో ప్రకటించింది. ప్రజా స్వామ్యం సాంఘిక, ఆర్ధిక, రాజకీయ సమానత్వాన్ని అంగీకరిస్తుంది. కనుక దానిని ఆచరణలోకి తేవాలని నిరంతరం కొనసాగుతుండేలా చూడాలని చెపుతుంది. మన రాజ్యాంగం.
నిజానికి నూటికి నూరు శాతం యదార్థమైన ఈ విషయాలు అర్ధమైన వ్యక్తికి సమాజం కోసం తానెందుకు పనిచేయాలన్న ప్రశ్నే పుట్టదు. కనుక ప్రజలకు ప్రజాస్వామ్యం అంటే ఏమిటో, ప్రజాస్వామ్యంలో తన పాత్ర ఏమిటో పూర్తిగా అవగాహన కలిగించాల్సి ఉంది. ఆ భాద్యత వ్యవస్థ నిర్వహణను చేపట్టిన ప్రభుత్వానిదే అయినా, సంఘంలోని స్పృహ కలిగిన ప్రతి పౌరుని పైనా ఆ బాధ్యత ఉంటుంది. అందుకనే రాజ్యాంగములోని 51/ఎ అధికరణము పౌరుని ప్రాధమిక విధులలో భాగంగా రాజ్యాంగ శాసనభద్ధుడై ఉండడం, ప్రజా జీవితంలో అన్యోన్యతను, సోదర భావాన్ని పెంపొందించడం, అన్ని రంగాలలోనూ దేశం అత్యున్నత స్థాయి నందుకోవడానికి తన వంతు కృషి సల్పడం లాంటి అంశాలను పొందుపరచింది. ఇవన్నీ వ్యక్తి సమాజం పట్ల ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలో తెలిపేటివే.
ఒక్క మాట చెప్పనా! 'సామాజిక సంబంధాలలో వ్యక్తి నిర్వహిస్తున్న పాత్ర' అన్న దగ్గరే మొత్తం సమాజపు పురోగమన, తిరోగమన స్థితిగతులుంటాయి. ప్రతి వ్యక్తి సంఘజీవిగా తన వంతు పాత్రను సక్రమంగా నిర్వహిస్తున్నంత కాలం సమాజంలో తెచ్చిపెట్టుకున్న సమస్యలు ఉండనే ఉండవు.
ఒప్పందం అంటేనే ఒక రకమైన కట్టడి అని అర్ధం. అవునా, కాదా? ఏ రకమైన ఒప్పందంలోనైనా వ్యక్తులు ఎంతో కొంత మేర స్వేచ్ఛకు, స్వతంత్రానికి పరిమితులు విధించుకోక తప్పదు. అయితే ప్రజాస్వామ్యానికంటే వేరైన ఏ ఒప్పందంలో గానీ, ప్రజాస్వామ్యంలో కంటే ఎంతో ఎక్కువ స్థాయిలో అసమాన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉంటాయి. కనుకనే సమాజం ప్రపంచ వ్యాపితంగా ప్రజాస్వామ్యం దిశగా కదులుతూ వస్తోంది. మనిషిని మనిషిగా చూడగలవారెవరైనా ఉమ్మడి యోగక్షేమాలకు తప్ప దేనికీ ప్రాధాన్యత నివ్వలేరు.
మనిషి ఒక ఒప్పందంలోనికి రావడమంటే, దీర్ఘకాలిక ప్రయోజనాలనాశించి, ఒడుదుడుకులు లేని పరిమిత స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు ఆ మేరకు తన స్వభావం కోరే స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు పరిమితులు విధించుకోవడానికి ఇష్టపడి సిద్ద పడటమనే అర్దం. ఈ విషయం లేదా ఈ నిజం తెలిస్తే గాని, తానితరుల కొరకు ఎందుకు పనిచేయాలో అర్ధం కాదు. అందులోనూ ప్రజాస్వామ్య విధానమే అన్నిటికంటే మెరుగయింది ఎందుకయ్యిందో అర్ధంకాదు. సామ్యవాద ఆర్థిక విధానపు అవసరమేమిటోనూ అర్థం కాదు.
మనిషిని మనిషిగా చూడడం, తనతో సమునిగా చూడడం అన్నదే మంచి సామాజిక సంబంధాలన్నింటికినీ ఆధార స్థానం అవుతుంది. మనుషులలో ఈ దృష్టి ఏర్పడనంత కాలం ప్రజాస్వామ్యం అంటే ఉమ్మడి యజమాని తనం ఆచరణకు రాదు. సమాజాన్ని మార్చాలనుకునే వారు, మంచి సమాజం రావాలనుకునేవారు మార్పు ఎక్కడ రావలసి ఉందో చూడగలగాలి. అక్కడ మార్పు రావడానికి తగిన పనిని, తగినంత స్థాయిలో చేయగలగాలీ. మరో రకంగా జరిగేవన్నీ అరకొర పనులే.
ప్రజాస్వామ్యాన్ని గురించి మరో కోణం నుండి వివరించుకుందాం.
ప్రజాస్వామ్యం అంటే ప్రజలే స్వాములు లేదా యజమానులు అంటే సొంతదారులు అని అర్ధం చెప్పుకున్నాం కదా! సమాజానికి దానిని అన్వయింపజేస్తే ఎలా ఉంటుంది?
(ఎ) వస్తుతః ప్రజలందరూ ఉన్న సంపదకంతకూ సమాన భాగస్వాములు లేదా హక్కు దారులు. కనుక సంపదను వినియోగించుకోవడములోనూ, రక్షించుకోవడము లోనూ, పెంచి పోషించుకోవడము లోనూ, పొదుపుగా వాడుకుంటూ మిగిలింది తమ వారసులకు అంటే భావితరానికి అందించడం విషయంలోనూ సమానంగా కర్తుృత్వాన్ని వహించాల్సిన వాళ్ళు బాధ్యులు అన్న దానిని మూల ప్రాతి పదికగా అంగీకరించాలి. దానితో పాటే, ఆ ప్రాకృతిక సంపద ఏ మనిషి తానుగా ఆర్జించినదో, సృష్టించినదో కాదు గనుక స్వార్జితం అన్న దానికి వర్తించే గుత్తాధి పత్యం అన్నది దానికి వర్తించదు, కనుక సమాజానికి ప్రకృతి సంపదగానీ, సమాజములోని వ్యక్తులకు సామాజిక సంపదగాని, స్వార్జితం అన్నదగిందిగా కాక, సాంక్రమికం అన దగిందిగా ఉంటుంది. కనుక ఈ మూల భావనను అంగీకరిస్తేనే ప్రజాస్వామ్యానికి ఆచరణరూపం ఎలా ఉంటుందన్నది వివరించుకోగలం.
పైమూల భావనలు ఏకస్వామ్యాన్ని, బృందస్వామ్యాన్ని తృణీకరిస్తూ సమిష్టి స్వామ్యాన్ని అంగీకరిస్తున్నాయి. కనుకనే ఆర్ధిక ప్రజాస్వామ్యం అన్నమాట అంబేద్కర్‌లాంటి మెధావుల నోట పుట్టింది. సంపదలో భాగ స్వామ్యం గురించి విచారించుకునేటప్పుడు, మనిషి చేసే శ్రమకు సంబందించిన సహజ న్యాయాన్ని గురించీ ప్రస్తావించుకోవాలి. అదేమంటే చేసినవానికే ఫలితం దక్కాలి. చేసిన దానికి తగినంత ఫలితమూదక్కాలి. చేయనివారికి ఫలితాలు అందకూడదు. చేయనిదానికీ ఫలితాలు అందరాదు, అన్నదే శ్రమ, ఫలితము అన్న వానికి సంబంధించిన సహజన్యాయసూత్రం. ఆర్థిక ప్రజాస్వామ్యం ఆచరణలోకి రావాలంటే పై సూత్రీకరణలు అమలవుతూ ఉండాలి.
అయితే, ఈ సూత్రాన్ని అంగీకరించి పని మొదలెట్టి కొంతచేసేటప్పటికీ రకరకాల కారణాల మీద చేసిన శ్రమ పరిమాణాల్లో వ్యత్యాసాలు ఏర్పడతాయి. దానిని బట్టీ వారివారి కందాల్సిన ఫలితాల పరిమాణంలోనూ తేడా వస్తుంది. సహజన్యాయాన్నతిక్రమించకుండా పని చేసినా, ఇక్కడికే వ్యక్తుల ఆర్దిక స్థితిలో అసమానతలు ఏర్పడి పోతాయి. మరోవంక అందిన ఫలితాన్ని ఖర్చు చేసుకోవడం విషయంలోనూ హెచ్చుతగ్గులు ఏర్పడుతుంటాయి. కనుక ఆర్థిక సమానత్వం అన్న ఆరంభస్థితిని అంగీకరించి, ఎక్కడా సహజన్యాయ సూత్రాలను అతిక్రమించకపోయినా, అనవసరపు వ్యయం చేయకపోయినా, వ్యక్తుల ఆర్ధికస్థితిలో అసమానతలు అనివార్యం అని తేలిపోతుంది. మరిలాంటప్పడు, ఆర్ధిక అసమానతల్ని హద్దులు లేకుండా పెంచగలిగే వారసత్వపు ఆస్థిహక్కు, పెట్టుబడి దారీ ఆర్ధిక విధానము అన్నవి అమలవుతూ, దానికి తోడు అవినీతి జతకూడితే అక్కడ పేరుకు మాత్రమే ప్రజాస్వామ్యం ఉంటుంది గాని, ప్రజలంతా సొంతదారులే అన్న అర్థానికి సరిపడే రీతిలో ప్రజాస్వామ్యం ఉండలేదు. అలాంటి థలో పాలకులు- పాలితులు, యజమానులు -సేవకులు, చేయనిదానికే పొందేవారు, చేసినదానికీ పొందనివారు వగైరా అపసవ్యతలన్నీ సమాజంలో చోటు చేసుకుంటాయి.
మరోవంక, పాలనలో చోటు సంపాదించుకోవడానికి అధికారంలో భాగస్వామ్యానికి అందరికీ సమానావకాశాలున్నై అన్నదీ మాటకు మాత్రం చెప్పబడుతుందే గాని, ఆర్ధికంగా ధనవంతులైనవారు, సాంఘికంగా బలవంతులు, చెలాయించగల వారే ఎన్నికల బరిలోకి రాగలుగుతారు. ఎవరైనా పోటీలో నిలబడవచ్చు, పోరాడి గెలవవచ్చు అందుకు వ్యవస్థపరంగా ఎలాంటి అడ్డంకులు లేవు లాంటి మాటలన్నీ తేరతిండి, తయారుతిండి తిని తెగబలిసిన వాడికే, తిండిలేక డొక్కలెండిన వాడికీ పోటీపెట్టి ఎవరైనా గెల్వవచ్చు, గెలుపు ఫలితాల్ని పొందవచ్చు అనడంలాంటిదే. కనుక సామాజిక న్యాయమనేదానికి సరైన అర్ధం చేప్పుకుంటే, ఒక వ్యక్తి మరీ తేగబలిసి పోయేలా, మరొకడు కనీసబలానికీ నోచుకోక చిక్కిశల్వమయ్యేలా తయారయ్యేందుకు వీలు కల్పించేలా వ్యవస్థ ఉండకూడదు. వ్యవస్థ విధానంలోనే, ఒకడు-ఏవ్యక్తీ- ఎక్కువలో ఎక్కువ ఇంతకంటే బలవంతుడు కాకూడదు, అలాగే ఇంతకంటే బలహీనుడు కాకూడదు కనీసబలం ప్రతివాడికీ ఉండాలి, అన్నది సంపద విషయంలో ఉండాలి ఆర్ధికంగా పట్టి చూడాల్సిన మరో అంశముంది.
ప్రతి శ్రమ శక్తి వినియోగంలోనూ, అది సరైన రీతిలో జరిగితే, మాత్రం అదనపు విలువ పుట్టి తీరుతుంది. ఆ అదనపు విలువ మొత్తాన్ని సమాజపరంచేసి, దానిని సమాజంలో వ్యక్తుల మధ్య అనివార్యంగా ఏర్పడే అసమానతల్ని తొలగించడానికి, సమానాభివృద్ధి దిశగా కదిలేందుకు వినియోగించగలగితే, ప్రజలందరూ, కొద్ది స్ధాయిలో వారిమద్య అని వార్యమైన అసమానతలున్నా యజమానలుగ కొనసాగేందుకు వీలవుతుంది. ఇది అధికస్థాయిలో ఆచరణలోకి రావాలంటే అవసరాలకు మించిపని చేయకుండడం, తప్పని సరిగా ఇంతకు తగ్గకుండా పనిచేస్తుండడం వ్యవస్థ నియమాలలోకి రావాలి. ఆపైన అదికట్టుదిట్టంగా అమలు పరచబడాలి. అతిచాకిరీ చేయడం, మితంగానైనా చాకిరి చేయకుండడం అన్నరెండూ సామాజిక నేరాలుగా పరిగణింపబడాలి.
ఇలా ఆర్ధిక సమానత్వం - ప్రజాస్వామ్యం-సాధించడానికి చేయగల అన్ని యత్నాలు చేసినప్పుడే ఆర్ధికంగా అతిబలవంతులు, అతి బలహీనులు అన్న సామాజిక వర్గాలు పుట్టకుండా ఉంటాయి. అలాటప్పుడు మాత్రమే ఆర్ధిక ప్రజాస్వామ్యం దానిసరైన అర్థంలో ఆవిర్భవిస్తుంది. సైద్దాంతికస్థాయిలో ఇందులో కీలకమైన, మౌలికమైన అంశం. దానిని ఆచరణాత్మకం చేయడానికి యత్నించకుండా, చెప్పుకునేమాటలన్నీ ప్రజాస్వామ్య ముసుగేసుకోడానికి పనికి వచ్చేటివి మాత్రమే.
ఏక స్వామ్యం, వర్గ-బృంద-నాయక స్వామ్యం అన్న రెండూ నియంతృత్వ కుదురునుండి పుట్టిన మొక్కలే. ఎక్కడెక్కడ ఎంతెంతవరకు నాయకస్వామ్యం అమలవుతుంటుందో అక్కడక్కడంతా జనస్వామ్యం సమిష్టి యాజమాన్యమనలేం. అమలు అవ్వజాలదు. కనుక ఎన్నికల పేరుచెప్పి '5' ఏండ్లకోసారి; బలహీనులు అవగాహనా రహితులు, చిన్నపాటి ఆశాభయాలకు ఇట్టే లొంగిపోయేవారు అయిన ప్రజల-ఓటర్ల-ఓట్లు దండుకుని ప్రజాస్వామ్య బద్దంగా గెలచామనడం మందిని వంచించడమే. రాజ్యాంగం ప్రకారం చూసినా కేవలం ఎన్నికలు మాత్రమే ప్రజాస్వామ్యాన్ని ఆచరణలోకి తేలేవు. ప్రజాస్వామ్య స్థాపన పనిలో అవి ఒక ఉపకరణం మాత్రమే దానితోబాటు ప్రజాస్వామ్య స్థాపనకు అవసరమైన అంశాలు మరెన్నో ఉన్నాయి.
1. ఎన్నికల సంస్కరణలు జరగాలి. ప్రతి ఓటుకూ సమాన విలువ అందేలా దామాషాపద్దతని రూపొందించుకోవాలి.
2. అధికార వికేంద్రీకరణ జరగాలి. అందుకై స్థానిక ప్రభుత్వాలకు పూర్తిగా అధికారాల బదలాయింపు జరగాలి.
3. అధికార వికేంద్రీకరణతోబాటు, సంపద వికేంద్రీకరణ కూడా ప్రజాస్వామ్య స్పూర్తికి తగిన రీతిలోజరగాలి.
4. గ్రామసభ, వార్టుసభలన్నవి సమర్థవంతంగా వాటిపాత్ర పోషణ చేయగలగాలి.
5. ఎన్నికైన ప్రజాప్రతినిధులు అపసవ్యంగాగానీ, ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దంగా గాని, రాజ్యాంగ విరుద్దంగా గానీ ప్రవర్తించినట్లు ఆధారాలు లభిస్తే రాజకీయాలలో పాల్గొనడానికి అనర్హులుగా ప్రకటింపబడాలి. అప్పటికి వారికున్న ప్రాతినిధ్యాన్ని రద్దు చేయాలి.
గమనిక :- ఏస్థాయి ప్రభుత్వాలుగాని, ఎన్నికైన ప్రజాప్రతినిధులుగానీ, ప్రభుత్వయంత్రాగముగానీ ప్రజలకు జవాబుదారీగా ఉంటూ, ప్రజల పర్యవేక్షణ ప్రక్రియ అమలవుతున్నపుడే ప్రజాస్వామ్యం ఆచరణలో ఉన్నట్లు.
మిత్రుడా! ప్రజాస్వామ్యపు ఊపిరి, ప్రజాస్వామ్యపు ఆత్మ ఎక్కడుందో తెలుసా? నాకు తెలిసి, అది నిర్ణయాధికారం ప్రజలలో, నిర్వహణాధికారమే వ్యవస్థలోని ఆయాస్థానాల్లో ఆయా బాధ్యతలు నిర్వహిస్తున్న వారిది, అన్న సూత్రం అమలవ్వడం దగ్గర ఉంది. అది నెరవేరాలంటే ప్రజలు అవగాహనాపరులై చైతన్య వంతంగా నిర్ణయాలు తీసుకునే పాత్రపోషించాల్సిఉంది. మరి అది జరగాలంటే రాజ్యం ప్రజలవద్దకు ప్రజలముందుకు రావాల్సి ఉంటుంది. దానినే స్థానిక ప్రభుత్వాలు అనంటున్నాం.
అందుకనే ప్రజా స్వామ్య వేత్తలెందరో గ్రామసభలు శక్తివంతం కానంతవరకు ప్రజాస్వామ్యం అమలవదు అని తేల్చేశారు. గ్రామసభ, వార్డుసభలు సక్రమంగా జరిగిన రోజున నిర్ణయాధికారము, పర్యవేక్షణ ప్రజల చేతికివస్తుంది. రాజకీయ ప్రజాస్వామ్యం ఆచరణలోనికి రావడానికింతకంటే మరోదారిలేదు.
ఈ పనంతా సక్రమంగా జరగాలంటే : 1. ప్రజలు అవగాహనావంతులు కావాలి. 2. విచక్షణతో నిర్ణయాలు తీసుకోగలిగి, అందుకు సంసిద్దులవ్వాలి. 3. సామాజిక న్యాయానికి, సమన్యాయానికి ఆమోదం తెలిపే వ్యక్తిత్వాలు నిర్మాణంకావాలి. దీన్నంతటిని క్రోడీకరించి ఒకముక్కలో చెప్పుకుంటే, మెరుగైన మార్పులు ఏర్పడినప్పుడే వ్యవస్తంతా మెరుగుపడుతుంది. అవగాహనతో, ఇష్టంతో తన వంతు పాత్రపోషణ అంటే హక్కులు, విధులు అవి రెంటిని సమపాళ్ళలో ఉండేలా బాద్యతగా ప్రవర్తించగల వ్యక్తినే మెరుగైన పౌరుడు అనంటాం.
మనది ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థ. దానికే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం లేదా ప్రాతినిద్య ప్రజాస్వామ్యం అనంటారు. అంటే ప్రజలెన్నుకున్న బృందం యొక్క నియంత్రణలో నడపబడే వ్యవస్థ అని అర్ధం. కనుక ప్రజలు తమ ప్రతినిధుల్ని ఎన్నుకోవడం అత్యంత కీలకమైనదవుతుంది. అందుకనే ప్రజాస్వామ్య వేత్తలంతా ఎన్నికలు ప్రజాస్వామ్య నిర్మాణానికంతటికి ఆధార పీఠం వంటివేనన్నారు. ఆ ఎన్నిక ప్రక్రియలో ఎక్కడ అపసవ్వత చోటు చేసుకున్నా, ఇక అక్కడ ప్రజాస్వామ్యం ఆరోగ్యంగా బలంగా ఆవిర్భవించే అవకాశం ఉండదు. కనుక ఎన్నికలు సక్రమంగా జరగడమంటే ఏమిటో తెలిసుండాలి.
ఎన్నికలు-ఒక పరిశీలన:
మనం '5' ఏండ్లకొకసారి పునరావృతమయ్యే ఎన్నికల విధానాన్ని ఎంచుకున్నాం. ఈ అవధి విషయంలోనే భిన్నాభిప్రాయాలు -వివిధ వాదాలు- ఉన్నా మనం వాటికంత ప్రాధాన్యత నివ్వనవసరం లేదు. ఎందుకంటే మిగిలిన ఎన్నో అంశాలలో ముడిపడే వాటి మంచీ చెడులు, లాభనష్టాలు ఉంటాయి కనుక. ఎన్నికలలో ప్రధానాంశం ఎన్నుకునేవారి రాశి, వాసికి చెందిన వాస్తవ పరిస్థితి ఏమిటన్నది అవుతుంది.
1. ఓటర్లు ఎంతమంది? ఓటర్ల జాబితా యొక్క సవ్యాపసవ్యతల మాటేమిటి? ఓటర్ల జాబితా తాజాగా సరిచూడబడిందేనా?
2. ఓటర్లకు ఎన్నికల గురించిన అవగాహన ఏస్థాయిలో ఉంది? ప్రతినిధిగా ఉండగోరుతున్న అభ్యర్ధికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఉందా? సామాజిక రంగంలో అతడి గతమెటువంటుదో తెలుసా?
3. అభ్యర్ధికి తానుప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంత పరిస్థితుల గురించిన అవగాహనేపాటిది?
4. తానెందుకు పోటీలో నిలుచుంటున్నది? ఎందుకు తనను ఎంపిక చేయమంటున్నది? ఎన్నుకుంటే తానేమి చేయాలనుకుంటున్నది? చేయగలననుకుంటున్నది వగైరా అతడందించిన వివరాలు ఓటరు గ్రహించాలి.
5. ఎన్నికైన వ్యక్తి కుటుంబపోషణ, వగైరాల విషయంలో ఏమిచేయనున్నట్లు?
6. తానుప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతానికి తన సమయాన్ని ఎంత కేటాయించగలడు.
ప్రజాస్వామ్యానికి ఊపిరి, ప్రజాస్వామ్యపు ఆత్మ ఎక్కడ ఉందో తెలుసా ?
నాకు తెలిసి అది నిర్ణయాధికారం ప్రజలది, నిర్వహణాధికారమే వ్యవస్తలోని ఆయా స్థానాలలో ఆయా బాధ్యతలు నిర్వహిస్తున్న వారిది, అన్న సూత్రం అమలవ్వడం దగ్గర ఉంది. దానికి అవగాహనాపరులైన ప్రజలు, చైతన్యవంతంగా నిర్ణయాలు తీసుకునే పాత్ర పోషించగలగాలి. జరిగిన, జరుగుతున్న దానిని పర్యవేక్షిస్తుండాలి. ఇంతకంటే మరో సమాధానం లేనేలేదు.
దానిని సాధించడానికే మనం ఉద్యమిస్తున్నాం. 1. వారిని మేల్కొలపడం, అవగాహనాపరుల్నిచేయడం, 2. విచక్షణాపరుల్నిగా నిర్ణయాలు తీసుకోగలిగిన వారిగా రూపొందించుకోవడం. 3. పాలన నిర్వహించడంలో జరిగే దాన్నంతటిని పర్యవేక్షిస్తుండడం. 4. బాధ్యతాయుతులైన పౌరులుగా ప్రవర్తించేలా, సమిష్టి అభివృద్ధి దిశగా కదిలేలా ప్రోత్సహించడం. 5. సామాజిక న్యాయానికి, సమ న్యాయానికి ఆమోదం తెలిపే వ్యక్తిత్వాలను నిర్మించడం - ఇవండీ, ఇవి ఆకృతిదాల్చనంతకాలం మెరుగైన పౌరసమాజం ఆవిర్భవించదు. మెరుగైన పౌర సమాజం ఏర్పడక, ప్రజాస్వామ్యం అమలవడమన్న ప్రశ్నే పుట్టదు. ప్రజాస్వామ్యం అమలవ్వడానికి కీలకాంశాలుగా చెప్పుకున్న వాటిని మరికొంచెం విశ్లేషించుకుందాం.
మనది ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థ అనుకున్నాం కదూ ! దానినే పార్లమెంటరీ (ప్రాతినిధ్య) ప్రజాస్వామ్యం అనంటారు. అంటే ప్రజలచే ఎంపిక చేయబడ్డ గణం యొక్క బృందపు నియంత్రణలో నడపబడుతందీ వ్యవస్థ అని అర్థం. కనుక అందులో ప్రతినిధులను ఎన్నుకోవడం అన్నది చాలా చాలా కీలకాంశం అవుతుంది. ఎంపిక ప్రక్రియ మొత్తంలో ఎక్కడ అపసవ్యత చోటుచేసుకున్నా ఇక అక్కడ ప్రజాస్వామ్యం ఆరోగ్యంగా, బలంగా ఉనికిలోకి వస్తుందని చెప్పలేము. 1. ప్రజల ముందుకు పాలన, ప్రజల అజమాయిషీలో పాలన అన్నది అమలవ్వాలంటే, ఎక్కడికక్కడ అధికార వికేంద్రీకరణ జరగాలి. అక్కడ పాలన, నిర్వహణ భాగాలలో ఉన్న వారంతా అక్కడి ప్రజలకు జవాబుదారీగా ఉండాలి.
ఎన్నుకోవడం అన్న మాటలోనే, తన ఇష్టాన్ని, అభిమతాన్ని ప్రకటించడం అన్న అర్థం ఉంది. దీనికి రెండు లక్షణాలుండాలి. ఒకటి ఎన్నుకునేవాడు అవగాహనా పరుడై ఉండడం, రెండు ఎన్నుకునే వాడు ఆశా, భయాల ప్రభావానికి గాని, స్వపర బేధాల ప్రభావానికి గాని లోను కాకుండా ఉండడం. నిజానికి ప్రజాస్వామ్యంలో ఎన్నికలన్నవి వ్యక్తిగత ప్రయోజనాల దృష్టినుండి కాక, సమిష్టి ప్రయోజనాల దృష్టి నుండి జరగాలి. కనుకనే ఎక్కువ మంది లేదా అందరూ ఎన్నుకునే వ్యక్తే ఆ ప్రాంత ప్రజలకు ప్రతినిధి కాగలుగుతాడు అని చెప్పబడింది. ఓటరు, ఎన్నికల బరిలో ఉన్న వారిలో నుండి ఎట్టివారిని ఎన్నుకోవాలి? అన్నది ఎన్నికల ప్రక్రియ అంతటిలోనూ కీలకమైనది.
1. అతడు మొత్తం ప్రజలకు బాధ్యత వహించగలిగి ఉండాలి. వహించబడతానని వాగ్దానం చెయ్యాలి.
2. ఆ ఎన్నికలు ఏ పరిధిలో జరుగుతున్నాయో ఆ మొత్తానికి వివక్షారహిత ప్రతినిధిగా వ్యవహరించాలి.
వివరణ : పార్లమెంటుకు ఎన్నికవుతున్న వ్యక్తి మొదట దేశ ప్రయోజనాలకు, పిదప రాష్ట్ర ప్రయోజనాలకు, అనంతరమే తన నియోజకవర్గ ప్రయోజనాలకు స్థానమివ్వాలి. నియోజకవర్గంలోనూ తనకు ఓటు వేసినవారు, ఓటు వేయని వారు అన్న వివక్ష చూపకుండా మొత్తం నియోజకవర్గ అవసరాలకు, అభివృద్ధికి బాధ్యత వహించాలి. దాని నిజమైన అర్థంలో ప్రజా ప్రతినిధి అనంటే ఇదే - ఆ ప్రాంతం మొత్తంలో ఏ భాగానికి గాని, ఏ వ్యక్తికి గాని సామాజిక న్యాయసూత్రాలను విడిచి, అతి ప్రాధాన్యత గాని, అల్ప ప్రాధాన్యత గాని ఇవ్వనేకూడదు. కనుకనే రాజ్యాంగం పౌరుని ప్రాథమిక విధుల్లో జాతి సమైక్యత, సమగ్రతలకు అనుకూలంగా ప్రవర్తించడమే గాక జాతి, మత, కుల, ప్రాంత, వర్గాల ననుసరించిన వివక్ష కూడదన్న దానిని చేర్చింది. ఈ కొలతల నుండి చూస్తే ఈ నాటి రాజకీయుల్లో ఒక్కడంటే ఒక్కడు ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తేలదు. అందరూ ఏదోరకమైన వివక్షతతోనే, స్వపరబేధాలతోనే ప్రవర్తిస్తున్నట్లు అనేకానేక రుజువులు దొరుకుతాయి. మరింత శోచనీయమైన విషయమేమంటే ఇప్పుడున్న రాజకీయులందరూ అలా వివక్ష ఉండటంలో తప్పేవిూ లేదనడమే గాక, మమ్ముల్ని తిరస్కరించిన వారిని, అంగీకరించిన వారిని ఒకరకంగా ఎలా చూస్తాము ? అలా చూడటం అన్యాయం కాదా ! అని అడిగేస్తున్నారు కూడా.
నిజానికి ఒక శాసన సభకు ఎన్నిక కాగోరిన వ్యక్తికి ఏమి తెలిసి ఉండాలి ?
1. రాజ్యాంగం గురించిన అవగాహన ఉండాలి.
2. రాష్ట్రంలోని ప్రధాన సమస్యలు - దాని విషయంలో జరిగిన యత్నాలు, ఇక ముందు జరగాల్సినవి, అందులో తానేపాత్ర వహించగలిగిందీతెలిసి ఉండాలి.
3. తను నిలుచున్న ప్రాంతపు - నియోజక వర్గపు - సమస్యలు - వాస్తవ పరిస్థితులు, దాని విషయమై తాను చేయగల, చేయాలనుకుంటున్న పనులు, వగైరాల గురించి తెలిసి ఉండడం.
శాసన సభ్యుని ఎంచుకోగోరుచున్న ఓటరుకు ఏమేమి తెలిసుండాలి ?
1. తన నియోజక వర్గ సాధారణ పరిస్థితి ఏమిటో తెలిసి ఉండాలి. నియోజక వర్గం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తారా, తరతమ బేధాలను పాటిస్తారా ? తెలుసుకోవాలి.
2. నియోజక వర్గంలో తానున్న ప్రాంతపు ప్రధాన సమస్యలు, అవసరాలు, అభివృద్ధి పనులు ఏమిటన్నది తెలిసిఉండాలి. ఆ వివరాలు తాము ఎంపిక చేస్తున్న అభ్యర్ధికి తెలుసో లేదో తెలుసుకోవాలి.
3. అభ్యర్థి ఓటర్లను ప్రలోభపెడుతున్నారా? అన్నది నిశితంగా పట్టిచూడాలి. ఎవరు ఏ రకమైన ప్రలోభాలు పెట్టినా అట్టివారి అభ్యర్ధిత్వాన్ని తిరస్కరించాలి. అట్టివారికి ఎవరూ ఓటెయ్యకూడదు.
4. అందరికీ మేలొనగూర్చే పనులకు మొదటి స్థానం, ఎక్కువ మందికి చెందిన వాటికి రెండవ స్థానం, ఆ తరువాత కొద్దిమందికి చెందిన వారికి మూడవ స్థానం అన్నదే సరైన విధానమన్న అవగాహన, అభిమతం ఉండాలి.
గమనిక : ఈ అంశాలను అలాంటివింకేమైనా ఉంటే వాటిని ఎరిగి అమలు చేస్తున్నప్పుడే ఆ అభ్యర్ధిగాని, ఆ ఓటరుగాని ప్రజాస్వామ్యానికి అనుగుణంగా ప్రవర్తిస్తున్నట్లు. కడమ విధానమంతా అప్రజాస్వామికమే అవుతుంది.
ప్రజా స్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలంటే అనవసరపు ప్రచార హోరంతా తొలగించివేయాలి. ఎన్నికల సంఘమే అందరికీ సమానంగా వర్తించే ప్రచార కార్యక్రమాన్ని ప్రకటించి అందరూ దానిని వినియోగించుకోమని చెప్పాలి. ప్రచారంలో ఎక్కడా రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమైన ప్రకటనలుండకుండా నిఘాపెట్టాలి. ఏ అభ్యర్ధి అయినా తన ప్రాంతానికి చెందిన తన అవగాహన ఏమిటో, తనను ఎంచుకొంటే ఏమి చేయాలనుకొంటున్నాడో అంతవరకు చెబితే చాలు. తన వ్యక్తిగత వివరాలు (గతం, సామర్ధ్యం వగైరాలు) కొంత వరకు చెప్పుకోవచ్చు. పార్టీ గురించి చెప్పుకోవలసి వస్తే పార్టీ ప్రణాళికను గురించి చెప్పుకోవడం వరకు వీలు కల్పించవచ్చు.
గమనిక : ఇతర అభ్యర్ధుల గురించి చెప్పడం, విమర్శించడం చాలా చాలా అప్రధాన విషయంగా చూడాలి. కొద్దిపాటి విమర్శలుంటే తానన్న ప్రతి మాటకు రుజువులు చూపే బాధ్యత ఆ మాటన్నవానిపైనే ఉంటుందన్న నియమం గట్టిగా అమలు చేయాలి. ఎన్నికల ప్రచారంలో భాగంగా, ప్రస్తుతం మన కంటబడుతున్న కుల, మత, ప్రాంత, పార్టీ, వర్గపరమైన వివక్షతలనన్నింటిని ప్రచారం చేయకూడదన్న నిషేధం పెట్టాలి. అలానే ఆశలుగాని, భయాన్ని గాని కలిగిస్తున్నట్లు ఎట్టి ఆధారం లభించినా, డబ్బులివ్వటం, సారా పోయించడం లాంటివి చేసినా, ఎట్టి తాత్సారం లేకుండా ఎన్నికల బరిలో నిలబడే అర్హతను తీసేయాలి.
ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలలో నిలబడడమంటే ఏమిటో, ప్రజా ప్రతినిధిగా అతని విధులు, బాధ్యతలు ఏమిటో, వగైరాల గురించిన రాజకీయ శిక్షణాలయాలు దేశమంతటా నెలకొని నిరంతరాయంగా శిక్షణగరుపుతుండాలి.
రాజకీయాలలోకి వచ్చి ప్రజా ప్రతినిధులుగా, పాలనాధికారులుగా, నిర్వహణాధి కారులుగా ఉండగోరువారి ఆర్థిక లావాదేవీలన్నీ అత్యంత పారదర్శకంగా ఉండేట్లు చూడాలి. నిర్ణీత ఆదాయానికి మించి ఎట్టి సంపద కూడబెట్టగూడదన్న నియమం ఉండాలి. అదనం ఉందన్న ఆధారం లభిస్తే అప్పటికతనికున్న స్థానం కోల్పోతాడు. మరోసారి పోటీచేయడానికి అనర్హుడవుతాడు అన్న శాసనం ఉండాలి. రాజకీయ పదవిగాని, అధికారంగాని, సంపద కూడబెట్టడానికి వనరు కానేకాదు. సంపద వద్దనుకున్న వారికే రాజకీయం అన్నది అమలు చేయగలిగితే ప్రజాస్వామ్యానికి నేడంటుకొని ఉన్న చీడ చాలావరకు నయమైపోతుంది. జీతానికి మించి ఏ రకమైన వృత్తి వ్యాపారాలలో పాలుపంచుకోరాదన్న నియమం తప్పనిపరి.
100 కోట్ల జనాభాలో అతి కొద్దిమంది మాత్రమే ఉండగల ప్రజాప్రతినిధులు, ప్రభుత్వంలోని మంత్రులు సంపద లేనివారుగా, నిరాడంబర జీవులుగా ఉండితీరాలన్న నియమం తప్పనిసరి. అట్టి శాసనం ఉండడం వల్ల మాత్రమే ఆదర్శప్రాయమైన, స్వలాభాపేక్షలేని, అందుకవకాశం ఉండకూడని, ఉండని రాజకీయాలు ఆచరణలోకి వస్తాయి. ప్రజాస్వామ్యపు అమలులో ఇది ఎంతో కీలకమైన అంశం.
అలాగే ఎన్నికలలో రెండుసార్లకు మించి పాల్గొనకూడదన్న నియమము మేలుకలిగించగలదే. నిజానికి ఒక్కసారే పాల్గొనవచ్చునన్నా వచ్చేనష్టమేమీ లేదు. కాకుంటే అనుభవజ్నుల్ని సలహామండలిలో భాగస్వాములుగానో, వివిధ ప్రాంతాలలో అభివృద్ధి కమిటీలలో లేదా పర్యవేక్షక మండళ్ళలో భాగస్వాములుగానో స్థానం కల్పించి వారి అనుభవాలను వినియోగించుకోవచ్చు. లేదా పాలనా విధి ముగిశాక అట్టివారంతా వారివారి శక్తి సామర్ధ్యాలకు, అభిరుచులకు తగిన వృత్తి వ్యాపారాలలో ప్రవేశించవచ్చు.
ముఖ్య గమనిక : నేనంటున్న ఇవేవీ ఆచరణ సాధ్యం కానివి కాదు. కష్టసాధ్యమైనవీ కాదు. వీటి అమలుకు కావలసిందల్లా నిజాయితీతో కూడిన మనస్సుండడమే. నిరాడంబరంగా బ్రతుకుతాను, అందరికి చెందిన వానిగా బ్రతుకుతాను, అధర్మానికి వత్తాసివ్వను. ధర్మానికి వత్తాసివ్వకుండా ఉండను. దేశ ప్రగతికి నావంతు కృషిచేస్తాను అని నిర్ణయించుకోగలిగితే మిగిలిన పనులన్నీ చాలా సరళంగా ఆచరణలోకి వచ్చేస్తాయి.
తాను, తనవాళ్ళ ప్రయోజనాలు తప్ప ఏవీ అంత ముఖ్యం కాదు అన్న ఒకేఒక్క వైఖరివల్లే ఇప్పుడున్న అంకఛండాలమంతా పుట్టుకొచ్చింది. దీనిని పోగొట్టుకునే పని ఎక్కడోచోట మొదలు కావలసి ఉంది. మన ఈ ఉమ్మడి వేదిక ఆ దిశగానే అడుగులు వేయనారంభించింది.
పౌరులు - సామాజిక స్పృహ :
రాజ్యాంగం ఓటుహక్కు కంటే ముందుగా భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రాధమిక హక్కుల జాబితాలో చేర్చింది. నిజానికి ఓటు వేయడమంటే ఆ సందర్భంలో తన భావాన్ని నిర్ద్వందంగా ప్రకటించడమనే. కనుకనే భావ ప్రకటనా స్వేచ్ఛ సక్రమంగా ఆచరణకు నోచుకోవాలంటే పౌరునికి తాను తనదైన భావాన్ని ప్రకటించాల్సి ఉన్న విషయానికి చెందిన తగినంత అవగాహన ఉండితీరాలి. అట్టి అవగాహన కలగడానికి అవసరమైన సమాచారమంతా అతనికి అందుబాటులో ఉండాలి. అవగాహన లేని వ్యక్తులు స్వంత అభిప్రాయాల్ని వెల్లడించడమన్నది సాధ్యంకాదు. అట్టి థలో వాళ్ళు చేయగలిగింది మరొకరి అభిప్రాయానికి తలూపడం మాత్రమే. కనుక ఎన్నికలు ప్రజాస్వామ్య స్పూర్తికి అనుగుణంగా జరగాలంటే ఓటరు (ప్రతి ఓటరు) ఎన్నిక చేయాల్సిన వ్యక్తి గురించి, ఏ ప్రాంతానికి ప్రతినిధి కాగోరుతున్నాడో ఆ ప్రాంతాన్ని గురించి తగినంత అవగాహన కలిగి, ఆపైన సొంత అభిప్రాయము కలిగిఉన్నవాడై ఉండాలి.
దానితోపాటు ప్రజాస్వామ్యం కొరకు జరిగే ఎన్నికలలో ఓటింగ్ 100% జరగాలి. ఓటు వేయకపోవడమన్నది జరుగకూడదు. కనుక ఓటు వేయడం విధి కావాలి. అది వారి స్వేచ్ఛకు భంగం కదా అనే తప్పుడు వాదం ఒకటి వినపడుతుందీమధ్య. ఓటు వేయకుండే స్వేచ్ఛ ఓటరుకు ఉండకూడదు. ఎవరికో ఒకరికి వేసి తీరాల్సిందే నన్నప్పుడే స్వేచ్ఛకు భంగం కలుగుతోందిగాని, అందరూ పనికిమాలిన వాళ్ళేననడానికి వీలైన తిరస్కారం ఓటుకు చోటిస్తే అభిప్రాయం వెల్లడించే స్వేచ్ఛ ఉన్నట్లే. ఓటు వేయడమన్నది ఒక రకంగా యజమానితనంలో తన వాటాను, నిర్ణయాధికారంలో తన భాగస్వామ్యాన్ని కాపాడుకోవడమే. కనుక ఓటు వేయడం హక్కు, విధి, బాధ్యత అన్న మూటితోనూ ముడిపడి ఉన్న అంశం.
ప్రస్తుతం మన దేశపు ఎన్నికలలో నడుస్తున్న పెద్ద అప్రజాస్వామిక తప్పుడు పోకడ ఏమిటంటే 35-40 శాతం ఓటర్లు ఓటు వేయరు. ఒక 10-15 శాతం దొంగ ఓట్లుంటాయి. అక్కడికదే 50% లెక్క తేలుతుంది. ఇక్కడికే ప్రజాస్వామ్యపునాది కదిలిపోయింది. ఇక ఆ పోలయ్యే 50% లో కులం, మతం, ప్రాంతం, పార్టీ, స్థానిక ముఠా నాయకత్వం, డబ్బు, మద్యం, ఎన్నికలనంతరం చేయగల, చేయించుకోగల పనుల విషయంలో ఏర్పరచుకొనే వాగ్దానాల జాబితా మరో అభ్యర్థిపట్ల ఉన్న వ్యతిరేకత వగైరాల ప్రభావానికి లోనైన ఓట్లశాతం ఎంతని చెప్పగలం?
ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికలలోనే నియోజకవర్గానికి బలమైన పార్టీలు, స్తోమతగల అభ్యర్ధులూ, ఒక కోటి నుండి 5 కోట్ల వరకు ఖర్చుచేస్తున్నాయి. అందాజుగా మొత్తం అసెంబ్లీ ఎన్నికలలో 3 లేక 4 వేలకోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయని చెబుతున్నారు. ఇంత గందరగోళంతో కూడి గెలిచినవాడు ప్రజలు నన్నెంచుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నారు అంటున్నాడు. ఓడినవాడు నా డబ్బుతిని మోసం చేశారని ప్రజల్ని ఆడిపోసుకుంటున్నాడు. ఇద్దరికీ సిగ్గులేదన్నది ఒక నగ్న సత్యం కాగా, ఇద్దరిలో ఎవరికీ ప్రజాస్వామ్యం అన్నా, ప్రజలన్నా గౌరవం లేదన్నది మరొక నిప్పులాంటి నిజం.
కనుక రాజ్యాంగ నిర్మాతలు స్వాతంత్య్రాన్ని సంపాదించి పెట్టిన పెద్దలు ఆశించిన రీతిలో స్వపరిపాలన, అదిన్నీ ప్రజాస్వామ్యబద్దమైన స్వపరిపాలన అమలులోకి రావాలంటే...
1.ఎ) ఎన్నికలు సజావుగా జరగాలి. బి) అభ్యర్దులు తనగురించి తాను చేయగల పనుల గురించి మాత్రమే ప్రచారం చేయాలి. సి) ఇతరేతరమైన ఏ ప్రచార హోరూ వినపడకూడదు. డి) స్వచ్ఛంద సంస్థలు, ఎన్నికల కమీషన్ కలసి ప్రజా చైతన్య వేదికలు పెద్దఎత్తున నిర్వహించాలి. ఇ) ఎన్నికలకు వారం, 10 రోజుల ముందునుండి మద్యం అమ్మకాలు నిలిపివేయాలి. ఎఫ్) చివరి మూడు, నాలుగు రోజులు అమ్మకాలు, తాగడాలు నిషేధించాలి. తాగిన వారిని నిర్భంధించాలి. అమ్మిన వారి అమ్మకపు అధికారాన్ని రద్దుపరచాలి. ఈ అంశాలను కఠినాతికఠినంగా అమలుచేయాలి. జి) ఎన్నికలలో పాల్గొనదలచిన వారికి కనీస అర్హతలంటూ కొన్ని మార్గదర్శకాలను రూపొందించాలి. హెచ్) రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ప్రసంగాలు చేసేవారిని ఎన్నికలలో పాల్గొనకుండా నిషేధించే చట్టం తేవాలి. ఐ) ప్రతి రాజకీయ ప్రసంగాన్ని రికార్డు చేసి ఎన్నికల కవిూషన్‌కు విధిగా అందజేయాలన్న నిబంధన ఉండాలి. జె) రాజకీయాలు ప్రజల బాగుకొరకేగాని ఆయా నాయకుల ప్రయోజనాల కొరకు కాదన్నది సర్వత్రా ప్రచారం చేయాలి.
2. ఎ) దామాషా పద్ధతి ననుసరించి ప్రతి ఓటుకు సమాన విలువ ఉండేలా అభ్యర్ధుల ఎంపిక జరిగేటట్లు మేధావులంతా కూర్చొని ఒక శాస్త్రీయ విధానాన్ని రూపొందించాలి. (ఇప్పటికీ దీనిపై రకరకాల ప్రతిపాదనలు ఉనికిలోకి వచ్చాయి) బి) ఉన్న ఓట్లలో 50 శాతానికి పైగా ఓట్లు వచ్చిన వానినే మెజారిటీ ప్రజలెన్నుకున్న ప్రతినిధిగా ప్రకటించాలి. సి) ఎన్నికైన అభ్యర్ధి తన గురించి అందించిన వివరాలలో గాని లేక తాను చేస్తానని చెప్పిన పనుల విషయాలలో గాని ఉద్దేశ్యపూర్వకంగా తప్పుచేస్తున్నట్లయితే అతన్ని వెనక్కి పిలిచే అధికారం ప్రజలకుండాలి. అది లేకుంటే ప్రజల చేతిలో విచక్షణాధికారం, నిర్ణయాధికారం లేనట్లే. ఈ ఒక్క లోపం వల్లే మన దేశంలో ఎన్నికలు ప్రజా ప్రతినిధులు కాకుండా, పార్టీ ప్రాతినిధ్యాలు, నాయకస్వాములు పుట్టుకొస్తున్నారు. ఏ పక్షాన్నయినా తిరిగి తమ ప్రతినిధిగా అతడు తగడని నిర్ణయం తీసుకొనే అవకాశం లేకుంటే తప్పును, పొరపాటును సరిదిద్దుకొనే అవకాశం లేకుంటే, ఐదేండ్లపాటు మార్పులేక అనుభవించాల్సిందేనన్నట్లయితే ఇక దానిని ప్రజాస్వామ్యం అని ఎట్లా అనగలం.
నిర్వహణ విభాగం రాజకీయుల గుప్పెట్లో ఉండడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిది. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ రాజకీయ పక్షానికి ఆర్థికంగా, సాంఘికంగా పలుకుబడిగల ముఠా నాయకులకు లోబడి వ్యవహరించాల్సిన పరిస్థితి ఉండడం ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా వ్యవహరించలేకపోవడానికి చాలా కీలకమైన దవుతుంది. పోలీసు- రాజకీయ సంబంధాల విషయంలో ఎన్నో సంస్కరణలు రావలసి ఉంది. ముఖ్యంగా దానిని వీలైనంత ఎక్కువగా స్వతంత్ర వ్యవస్థగా ఉండేట్లు చూడగలిగితే మంచిది. అదే సమయంలో స.హ. చట్టం నిర్ధేశించినట్లు, పారదర్శకత ఉండేటట్లు అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు శ్రద్ధ పెడితే బాగుంటుంది.
గమనిక : విషయ ప్రాధాన్యత రీత్యా కొన్నిచోట్ల పునరుక్తి జరిగిందని పాఠకులు గ్రహించగలరు.
ఆ
No comments:
Post a Comment