ఎ.ఎన్.పి.సిన్హా, ఐ.ఎ.ఎస్ భారత ప్రభుత్వం
కార్యదర్శి, ఫోను : 011-23074309 పంచాయతిరాజ్ మంత్రిత్వ శాఖ
భారతప్రభుత్వ కార్యదర్శి కృషిభవన్, కొత్తఢిల్లీ- 110 001.
రి.నెం. 11011/3/2009 పి.&సి (ఎ.ఆర్)
విషయం : స్థానికసంస్థల బలోపేతానికి, రాజ్యాంగంలోని 243వ అధికరణకు సవరణలు.
1. 73వ రాజ్యాంగ సవరణ స్థానిక సంస్థలకు ఒక స్థిరత్వాన్ని, రాజ్యాంగ హోదాను కల్పించినప్పటికీ, దానిలోని కొన్ని లోపాలు వాటి సమర్ధతను తగ్గించాయి. 1989 మేలో రాజ్యాంగసవరణ బిల్లును ప్రతిపాదించడం వెనుక తన లక్ష్యాలేమిటో అప్పటి ప్రధానమంత్రి తన ప్రసంగం ఆఖరున చక్కగా వ్యక్తం చేశారు. ''భారతదేశ ప్రజలకు, గరిష్ట స్థాయిలో ప్రజాస్వామ్యపు అమలుకు హామీనిస్తూ అధిక మొత్తంలో అధికారాల బదిలీ జరిగేటట్లు చూద్దాం. రాజకీయదళారీలకు పాలనలో స్థానం లేకుండా చేద్దాం. ప్రజలకే అధికారం ఇద్దాం''.
2. 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా మూడంచెల పంచాయతిరాజ్ సంస్థల స్వర్ణోత్స”వాలను 2009 అక్టోబర్ 2న జరుపుకొన్నాం. దేశంలో అక్టోబర్ 2, 2009-2010ని గ్రామసభ సంవత్సరంగా పాటించారు. అయితే స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు అధికారాన్ని కల్పించడమనేది ఇప్పటికీ ఒక సుదూర స్వప్నంగానే మిగిలిపోయింది. కనుక రాజ్యాంగాన్ని పునఃపరిశీలించి, మహాత్మాగాంధీ యొక్క 'గ్రామస్వరాజ్యం' కలను సాకారం చేసేందుకు అవసరమైన సవరణలు చేయవలసి ఉంది.
3. అందుకొరకే చాలా వరకు స్థానిక స్వపరిపాలన అన్నదానిపై రెండవ ఎఆర్‌సి ఇచ్చిన నివేదిక ఆధారంగానే రాజ్యాంగంలోని 243వ అధికరణను సవరించాలని ప్రతిపాదించడమైనది. ప్రతిపాదిత సవరణలు ఇలా ఉన్నాయి.
ఎ) అధికరణం 243జి, 243 డబ్ల్యుకు సవరణ : రాష్ట్రాలు పంచాయతీలకు, మున్సిపాలిటీలకు అధికారాలను బదిలీ చేయడాన్ని తప్పనిసరిచేయడం. (''బదిలీచేయవచ్చు'' అనే పదం స్థానంలో 'బదిలీ చేయాలి' అని మార్చాలి).
బి) అధికరణం 243బి, 243 జడ్‌డి మరియు ఇతర సంబంధిత అధికరణాల సవరణ:
(రి) 11, 12 షెడ్యూళ్ళలో పేర్కొన్న అంశాలపై బాధ్యత వహించేందుకు జిల్లా పంచాయతీల స్థానంలో జిల్లా మండళ్ళను (కౌన్సిళ్ళు) ఏర్పాటు చేయాలి. జిల్లాలోని గ్రామీణ పట్టణ ప్రాంతాలు రెండూ వీటి పరిధిలోకి వస్తాయి.
(రిరి) డిపిసిని జిల్లా మండలి క్రింద ఒక వృత్తిగత సంస్థగా మార్చడం.
(సి) అధికరణ 324/3ఎ, మరియు దానితో సంబంధమున్న అధికరణాల సవరణ : గ్రామపంచాయతిని గ్రామసభకు జవాబుదారీ చేయడం. షెడ్యూలు ప్రాంతాలకు పంచాయతీ (విస్తరణ) చట్టం (పెసా) తరహాలో, గ్రామసభలకు మరిన్ని అధికారాలు కల్పించడం.
(డి) అధికరణం 243 సి(3) (సి) (డి)ల రద్దు: ఎంపిలను, ఎమ్మేల్యేలను, ఎమ్మెల్సీలను పంచాయతీల సభ్యులుగా ఏర్పాటు చేసే విచక్షణాధికారాన్ని రాష్ట్రాలకిస్తున్న ఈ అధికరణాలను రద్దు చేయడం.
(ఇ) అధికరణం 243 డి సవరణ: కనీసం రెండు పదవీకాలాలపాటు, సీట్లను అధ్యక్ష పదవులను, సంబంధిత ప్రాంతంలో 5%, అంతకంటే ఎక్కువ జనాభా కలిగిన వర్గాలకు కేటాయించడం, అటువంటి కేటాయింపులను(రిజర్వేషన్లు) పొడిగించడం.
(ఎఫ్) అధికరణం 243 (1) సవరణ: ఎస్‌ఎఫ్‌సిల గడువును సిఎఫ్‌సి గడువుతో సమన్వయపరచడం.
(జి) అధికరణం 171(2) క్రింద చట్టాన్ని తీసుకురావడం : శాసనమండళ్ళలో పంచాయతీలకు, మున్సిపాలిటీలకు తగు ప్రాతినిధ్యం కల్పించేందుకు గాను చట్టం చేయడం.
ఆ పైన పేర్కొన్న ప్రతిదానికి గల సహేతుకమైన కారణాలను దీనికి జతపరిచిన నోట్‌లో వివరించడం జరిగింది.
4. ఏడవ షెడ్యూలుకు 'స్థానిక సంస్థల జాబితా'ను జతపరచడంలో ఈ క్రింద పేర్కొన్న రెండు ప్రధాన ఇబ్బందులు ఉన్నాయి. కనుక అధికరణం 243జి, డబ్ల్యులను సవరించటమే ఆ ఇబ్బందులు తొలగించటానికి మెరుగైన పరిష్కారం.
(ఎ) దీనివల్ల స్థానిక సంస్థలకు శాసనాధికారాలు ఇవ్వాల్సి వస్తుంది. దీని లక్ష్యం అది కాదు. ముందు నిర్వాహణపరమైన, ఆర్థికపరమైన విధులను సక్రమంగా నిర్వర్తించేందుకు అవసరమైన అధికారాలను వీటికి కల్పించాలి.
(బి) అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధంగా ఉండే స్థానిక సంస్థల విధుల పరిధిని గుర్తించడం చాలా కష్టం.
5. ప్రతిపాదిత సవరణల కోసం జాతీయస్థాయిలో ఏకాభిప్రాయాన్ని సాధించే ప్రక్రియ సున్నితమూ, సంక్లిష్టమూ అయినదని తెలుసు. అందుకని రాష్ట్రాలు తమ అభిప్రాయాలను, మద్దతును తెలియజేయవలసిందిగా అభ్యర్దిస్తున్నాం. మీ ప్రభుత్వ అభిప్రాయాలను దయచేసి మూడువారాల్లో తెలియజేయగలరు.
దీని ప్రతిని అన్ని రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యకార్యదర్శులకు. అన్ని రాష్ట్రాల/కేంద్రపాలిత రాష్ట్రాల పంచాయతీరాజ్‌శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శులకు పంపడమైనది.
మీ విశ్వసనీయుడు
ఎ.ఎన్.పి.సిన్హా
భారతప్రభుత్వం
పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ
తేది: 17 మార్చి, 2010
విషయం : స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి రాజ్యాంగంలోని 243వ అధికరణకు సవరణలు.
1. 243 అధికరణానికి, ప్రతిపాదించిన సవరణల ఆవశ్యకత
1.1. ఎన్నికైన స్థానిక స్వపరిపాలనా సంస్థలు, అంటే పంచాయతీలు(పంచాయతీరాజ్ సంస్థలు -పిఆర్‌ఐలు), మున్సిపాలిటీ (పట్టణ స్థానిక సంస్థలు యుఎల్‌బిల) రూపంలో, రాజ్యాంగం ప్రజాస్వామ్య బద్దంగా ఉండేలా వికేంద్రీకరణకు ఒక స్పష్టమైన వ్యవస్థాగత నిర్మాణాన్ని ఏర్పాటు చేసింది. ప్రజలు, ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు, ప్రత్యక్షంగా పరిపాలనలో పాల్గొనేందుకు స్థానిక సంస్థలు చాలా కీలకమైనవవుతాయి. గనుక సార్వజనిక పాలనకు ఇవి కీలకం. సామాజిక తనిఖీ(సోషల్ ఆడిట్) వంటి వాటి ద్వారా రాష్ట్రప్రభుత్వ సంస్థల, అధికారుల పనితీరులో పారదర్శకతకు, జవాబుదారీతనానికి ఇవి దోహదం చేస్తాయి. పేదరిక, స్థానిక మౌలిక వసతులు, సామాజిక, ఆర్ధిక అవసరాలకు తగిన నిర్దిష్ట ప్రణాళికలను స్థానిక సంస్థలు రూపొందించగలవు. ''సంపూర్ణవృద్ధికి అతి కీలకమైన నిత్యావసర సేవలు అందించేందుకు పి.ఆర్.ఐ లను ప్రాథమిక సాధనాలు''గా 11వ పంచవర్ష ప్రణాళిక పత్రం గుర్తించింది. అందువల్ల దేశవ్యాప్తంగా పరిపాలనను బలోపేతం చేయడానికి, కేంద్ర/రాష్ట్రపథకాల ద్వారా భారీగా ఖర్చుపెట్టే నిధుల ఫలాలు పూర్తిస్థాయిలో ప్రజలకు చేరేలా చూడటానికి, స్థానిక సంస్థలను బలోపేతం చేయడం చాలా కీలకం.
1.2. అయితే రాజ్యాంగం ఆదేశించినా, ఆదేశించిన రీతిలో అధికారాలు, విధులు స్థానిక సంస్థలకు బదిలీ కాలేదు. పైగా రాజ్యాంగ నిబంధనలు సక్రమంగా అమలు కావాలంటే, రాష్ట్ర చట్టాల రూపకల్పనలో స్థానిక సంస్థల అంటే పంచాయితీల, మున్సిపాలిటీల ప్రమేయం ఉండాలి. వీటన్నిటి కోసం రాజ్యాంగ సవరణలు, ఇతర చట్టపరమైన చర్యలు, చేపట్టడం అవసరమవుతోంది.
1.3. మహాత్మాగాంధి 'గ్రామస్వరాజ్యం' గురించి కలలుగన్న సంగతి అందరికీ తెలిసిందే. ''రాజ్యం, గ్రామపంచాయతీలను సుసంఘటిత పరచి అవి స్వపరిపాలనా సంస్థలుగా పనిచేయడానికి అవసరమైన అధికారాలను వాటికి విధిగాకల్పించాలి'' అని రాజ్యాంగ ఆదేశిక సూత్రాలలోని అధికరణం 40 (సంబంధిత రాజ్యాంగ నిబంధనలు అనుబంధం -1 లో ఉన్నాయి) పేర్కొంటోంది.
1.4. అంతేగాక 1989 మేలో అప్పటి ప్రధానమంత్రి, 64వ రాజ్యాంగసవరణ బిల్లును ప్రవేశపెడుతూ (అనుబంధం-2)'' భారతదేశ ప్రజలకు గరిష్ట స్థాయిలో ప్రజాస్వామ్యాన్నందించేందుకు, పెద్ద మొత్తంలో వారికే అధికారాల బదిలీ జరిగేటట్లు చూద్దాం. రాజకీయదళారీలకు స్థానం లేకుండా చేద్దాం. ప్రజలకే అధికారం ఇద్దాం'' అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
1.5. 1992లో వచ్చిన 73వ రాజ్యాంగ సవరణ చట్టపు లక్ష్యాలు, అందుకు కారణాలగురించి ఇలా పేర్కొంటుంది. ''గత 40 ఏళ్ళ అనుభవాల వెలుగులో, ఇప్పటి వరకు గుర్తించిన లోపాల దృష్ట్యా, పంచాయతీరాజ్ సంస్థలకు ఒక నిశ్చితత్వాన్ని, నిరంతరాయతను కల్పించి వాటిని బలోపేతం చేయడానికి అవసరమైన మౌలిక, ముఖ్యలక్ష్యాలను కొన్నిటిని రాజ్యాంగంలో పొందుపరచడం తక్షణావసరమని భావించడం జరిగింది''.
1.6. దేశం, అక్టోబర్ 2, 2009న మూడంచెల పంచాయతీ వ్యవస్థ 50వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న నేపథ్యంలో, రాజ్యాంగంలోని సంబంధిత నిబంధనలను పునస్సమీక్షించి నిజమైన గ్రామస్వరాజ్య సాధనకు అవసరమైన సవరణలు చేపట్టడం సమంజసం.
2. అవసరమైన రాజ్యాంగ సవరణలు
2.1.1. రాజ్యాంగంలోని 243జి, 243 డబ్ల్యు అధికరణల సవరణ
73వ రాజ్యాంగ సవరణ, 1992 తర్వాత రాజ్యాంగంలోని 243 జి అధికరణం, ఆర్ధికాభివృద్ధి, సామాజిక న్యాయం కోసం అవసరమైన ప్రణాళికలను రూపొందించి, అమలు చేయడానికిగాను పంచాయితీలకు అవి స్వపరిపాలనా సంస్థలుగా పని చేసేందుకు అవసరమైన అధికారాలను రాష్ట్రశాసనసభ ''ఇవ్వవచ్చు'' అని పేర్కొంది. దీనిననుసరించి పంచాయతీలు రాజ్యాంగం 11వ షెడ్యూలులో పేర్కొన్న అంశాలపై కూడా ప్రణాళికలు రూపొందించవచ్చు. అధికరణం 243 డబ్ల్యు మున్సిపాలిటీలకు వర్తిస్తుంది. ఇది కూడా 243జి వంటి నిబంధనలనే కలిగి ఉంది. దీని ప్రకారం మున్సిపాలిటీలు వాటికందిన అధికారాలననుసరించి 12వ షెడ్యూలులో పేర్కొన్న అంశాలపై కూడా ఇలాంటి ప్రణాళికలు రూపొందించి అమలు చేయవచ్చు.
2.1.2. (40వ అధికరణలోని 'విధిగా ఇవ్వాలి' అన్న) పదాన్ని ''ఇవ్వవచ్చు'' (అధికరణం 243 జి)గా మార్చడం వల్ల, స్థానిక సంస్థలకు అధికారాలను బదిలీ చేసే విషయాన్ని రాష్ట్రాల ఇష్టాయిష్టాలకు (విచక్షణాధికారానికి) విడిచిపెట్టినట్లయింది. దీనివల్ల స్థానిక సంస్థలకు అధికారాల బదిలీ అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా లేకుండా పోవటమే కాక, చాలా రాష్ట్రాల్లో ఇది తృప్తిపడటానికి వీల్లేనిదిగా ఉంది. ఆవిధంగా 73వ రాజ్యాంగ సవరణ లక్ష్యం చాలా వరకు నెరవేరనేలేదు. స్థానిక సంస్థలకు సంబంధించి, రాజ్యాంగంలో నిబంధనలు, వాటి స్వభావరీత్యా తప్పనిసరిగా అమలు చేయాల్సినవి అన్న విషయం ఈ సందర్భంగా గుర్తించాలి. అందువల్లే నిర్దేశిత రిజర్వేషన్లతో గడువు ప్రకారం ఎన్నికలు నిర్వహించడం, రాష్ట్ర ఆర్ధిక సంఘాల ఏర్పాటు మొదలైనవి చేయక తప్పనివిగా మారాయి. ఆ ప్రకారమే స్థానికంగా స్థానిక సంస్థలు నిర్వహించే విధులు, వాటి అధికారాలు వాటికి విధిగా బదిలీ చేయాలన్నది కూడా శాసనం కావాలి.
2.1.3. రాజ్యాంగం 11, 12వ షెడ్యూళ్ళలో పేర్కొన్న అంశాలు రాష్ట్రాలవే కనుక, ప్రస్తుత రాజ్యాంగ చట్రంలో నిజమైన అధికార బదిలీకి పంచాయతీ రాజ్‌శాఖ, రాష్ట్రాలు 'కార్యకలాపాల విభజన' చేపట్టాలని సూచించింది. అంటే వివిధ స్థాయిల్లో (రాష్ట్రప్రభుత్వం, మూడంచెల పంచాయతీలు, మున్సిపాలిటీలు వగైరా) నిర్వర్తించవలసిన బాధ్యతలను నిర్దిష్టంగా గుర్తించాలి. ఇది 'అనుబంధ సూత్రం' (ప్రిన్సిపల్ ఆఫ్ సబ్సిడియారిటి) ఆధారంగా జరగాలి. అంటే అట్టడుగు స్థాయి సంస్థకు అది నిర్వర్తించగలిగినంతటి గరిష్ట బాధ్యతను అప్పగించి, ఆ బాధ్యతలను నిర్వర్తించడానికి అవసరమైన అధికారాలను, నిధులను వాటికి కల్పించాలి. అయితే ఈ విషయంలో ఇప్పటికీ ఆశించిన పురోగతి జరగలేదు. ఆ విధంగా కార్యకలాపాల విభజన జరగకపోవడమో, ఒకవేళ జరిగినా ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా అవి అమలు జరగకపోవడమో, లేదా 'అనుబంధ సూత్రాన్ని' అనుసరించకపోవడమో, లేదా అవసరమైన నిథులు, అధికారాలు, సిబ్బంది బదిలీ జరగకపోవడమో కారణంగానే జరగాల్సిన పురోగతి జరగకుండా పోయింది.
2.1.4. అందువల్లనే స్థానిక సంస్థలకు తగిన సూత్రీకరణల రూపంలో అధికారాల బదిలీని తప్పనిసరి చేయడానికే ఇది ప్రతిపాదించబడింది.
2.2. జిల్లా మండళ్ళ ఏర్పాటు
2.2.1. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు రాజకీయంగా సామాజికంగా, ఆర్ధికంగా, భౌగోళికంగా అవిభాజ్యమైనవి. అయినప్పటికీ ప్రస్తుతం అమలవుతున్న విధానం వల్ల గ్రామీణ, పట్టణ ప్రభుత్వాల మధ్య ఒక కృత్రిమమైన విభజన ఏర్పడి ఉంది. ఈ విధానంలో లోపాలు ఉన్నాయి. మొదటిది సామాజిక-ఆర్ధికాభివృద్ధి ప్రణాళికల తయారీ, వాటి అమలు-మౌలిక వసతుల కల్పనలన్నవన్నీ - కృత్రిమంగా విభజించబడ్డాయి. రెండవది పట్టణీకరణ శరవేగంగా జరుగుతున్న సమాజంలో, గ్రామానికి, పట్టణానికి మధ్య సరిహద్దులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. పెద్ద నగరాల సమీపంలో ఉండే ప్రాంతాలైతే గ్రామాల, పట్టణాల లక్షణాలు రెండింటినీ కలిగి ఉంటాయి. చివరిగా, మొత్తం జిల్లాకు ప్రాతినిథ్యం వహించే ప్రజాస్వామిక వ్యవస్థంటూ ఏదీ ఉండదు. కనుక జిల్లా కలెక్టరే జిల్లాలో అధికారానికి ప్రతీకగా కొనసాగుతూ ఉంటాడు. దాంతో ఇక్కడ ప్రజాస్వామిక వికేంద్రీకరణ భావనే మరుగున పడిపోతుంది. క్లుప్తంగా చెప్పాలంటే, స్థానిక ప్రభుత్వాలను గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలుగా కృత్రిమంగా విడదీయడం వల్ల మరియు ప్రణాళికల తయారీ, వాటి అమలులో సమగ్రత కొరవడి, మానవ, ఆర్ధిక వనరుల వినియోగం శక్తివంతంగా జరగకుండా పోతుంది.
2.2.2. అధికరణం 243 జడ్‌డి, పంచాయతీలు, మున్సిపాలిటీలు తయారు చేసిన ప్రణాళికలను సమన్వయం చేయడానికి జిల్లా ప్రణాళికా కమిటీల (డిపిసిలు)కు వీలు కల్పిస్తున్నా, ఆచరణలో వాటి ప్రభావం చాలా పరిమితం. ఎందుకంటే వివిధ రంగాలపై తగినంత నియంత్రణ, అందుకవసరమైన అధికారం వాటికి ఉండవు. ప్రజాస్వామ్య పాలనను పెంపొందించేందుకు, ప్రజల అవసరాలను తీర్చగల సమగ్ర ప్రణాళికను రూపొందించి అమలు పరిచేందుకు తగిన అధికారాలు కలిగిన ఎన్నికైన ఒక జిల్లామండలి జిల్లా అంతటి కొరకు (జిల్లా పంచాయతి స్థానంలో) ఏర్పాటు చేయడం అవసరం. దీనిలో అన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు ప్రాతినిద్యం ఉండాలి.
2.2.3. 11వ, 12వ షెడ్యూళ్ళలోని అంశాలతో సహా వివిధ అంశాలపై అన్ని స్థానిక సంస్థలతోపాటు జిల్లా అంతటికీ ప్రణాళికలు రూపొందించే బాధ్యత ఈ జిల్లా మండలిది. ఈ మండలులు అనేక అంశాలపై నిర్ణయాలు తీసుకుంటాయి. గనుక వీటికి తగు నియంత్రణాత్మక విధులను కూడా అప్పగించాలి. అధికారులు, నిపుణులతో కూడిన జిల్లా ప్రణాళికా కమిటీ, జిల్లా మండలికి సహాయం చేసే ఒక వృత్తి నైపుణ్యం గల సాంకేతిక విభాగంగా మారుతుంది. ప్రణాళికా ప్రక్రియకు సమగ్రమైన మద్దత్తు అందించడం, సంబంధిత పక్షాల ఏకాభిప్రాయం ఆధారంగా, జిల్లా స్థాయి ప్రాధాన్యాల నిర్ణయం, స్థానిక సంస్థల ప్రణాళికలను సమీక్షించడం, భాగస్వామ్య ప్రణాళికను పర్యవేక్షించడం, జిల్లా ప్రణాళికల పర్యవేక్షణ మరియు వాటి అమలు వంటి బాధ్యతలను జిల్లా ప్రణాళికా సంఘం నిర్వహిస్తుంది.
2.2.4. జిల్లా మండలికి జిల్లాలోని అన్ని అభివృద్ధి విభాగాల మధ్య సమన్వయాన్ని సాధించేందుకు తగిన అధికారం కలిగిన ముఖ్యకార్యనిర్వహణాధికారి (సిఇఒ) ఒకరు ఉంటారు. జిల్లామండలికి సి.ఇ.వోగా జిల్లా కలెక్టర్ వ్యవహరించవచ్చు. దీనివల్ల కలెక్టర్ పదవికి గల అధికార యంత్రాంగం జిల్లా మండలిని బలోపేతం చేస్తుంది. కలెక్టర్ స్థానికమైన అన్ని అంశాలలో జిల్లామండలికి, జిల్లా మండళ్ళకు దఖలు చేయని అంశాల్లో, రాష్ట్రప్రభుత్వానికి జవాబుదారీ అవుతాడు.
2.2.5. ఇటువంటి వ్యవస్థ ఇప్పటికే ఈశాన్య ప్రాంతంలో ఉంది. అక్కడ స్వయం ప్రతిపత్తిగల జిల్లామండళ్ళు, గ్రామీణ, పట్టణ భేదం లేకుండా శాసన, న్యాయ, కార్యనిర్వాహక అధికారాలను అనుభవిస్తున్నాయి. స్థానిక ప్రజలు తమ ఆకాంక్షలను నెరవేర్చుకోడానికి, తమ ప్రయోజనాలను పెంపొందించుకోడానికి ఇటువంటి మండళ్ళు దోహదం చేస్తాయి. ఈ విధానం దేశంలోని ప్రజలందరికీ వర్తించేదిగా ఉంటుంది. ఐదవ షెడ్యూలు ప్రాంతాలకు వర్తించే పంచాయతీల (షెడ్యూలు ప్రాంతాలకు వర్తింపు) చట్టం, 1996 (పెసా) లోని సెక్షన్4(ఒ) కూడా జిల్లా స్థాయిలో ఇటువంటి వ్యవస్థలను సిఫార్సు చేస్తోంది.
2.2.6. అందుకనే జిల్లా పంచాయతీల స్థానంలో, జిల్లా మండళ్ళ ఏర్పాటుకు రాజ్యాంగ సవరణ చేయాలని ప్రతిపాదించడమైంది. ఈ మండళ్ళలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలు (మెట్రోపాలిటన్ ప్రాంతాలు మినహా) రెండింటికీ వాటి జనాభాకు అనుగుణంగా ప్రాతినిధ్యం ఉంటుంది.
2.3. పంచాయతీలను గ్రామసభకు జవాబుదారీగా చేయడం
2.3.1. పరిపాలన మెరుగుపడాలంటే ప్రజల భాగస్వామ్యం, స్థానిక ప్రభుత్వ సంస్థలు ప్రజలకు జవాబుదారీ వహించడం అన్నరెండూ చాలా కీలకమవుతాయి. మొత్తంగా స్థానిక సంస్థలను, ప్రత్యేకంగా గ్రామసభను పటిష్టం చేయడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది.
2.3.2. మూడంచెల పంచాయతీ వ్యవస్థ అర్దశతాబ్ది ఉత్సవాలను అక్టోబర్ 2, 2009లో జరుపుకొని, అక్టోబర్ 2, 2009 నుంచి అక్టోబర్ 2, 2010 వరకు 'గ్రామసభ సంవత్సరం'గా పాటించడం ద్వారా, స్వపరిపాలనలోనూ, గ్రామపంచాయతీ పని తీరులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచడంలోనూ, గ్రామసభయొక్క కీలక పాత్రను నొక్కి చెప్పడం జరిగింది. అలాగే గ్రామసభను పటిష్ఠం చేయాలన్న ఉద్ధేశ్యం కూడా ఈ ఏర్పాటు వెనుక ఉంది. ఈ అంశానికి సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాలను అనుబంధం-5లో చూడవచ్చు.
2.3.3. ''రాష్ట్రశాసనసభ చట్టం ద్వారా నిర్దేశించిన అధికారాలు, విధులను, గ్రామసభ నిర్వర్తించవచ్చు'', అని రాజ్యాంగంలోని 243 ఎ అధికరణం చెబుతోంది. అయితే ఈ నిబంధననను చిత్తశుద్ధితో అమలు చేయకపోవడం వల్ల, ప్రజలకు జవాబుదారీ వహించే, పారదర్శకంగా వ్యవహరించే సంస్థలుగా పంచాయతీ సంస్థలు వ్యవహరించలేకపోతున్నాయి. పైగా అనేక రాష్ట్రాల్లో గ్రామపంచాయతీలు చాలా పెద్దవిగా ఉండి ప్రజలు వాటి నిర్వహణలో సమర్ధంగా పాల్గొనలేకపోతున్నారు. అలాంటప్పుడు పెద్ద గ్రామపంచాయతీలలో 'వార్డుసభ'ల ఏర్పాటు వల్ల పౌరులు సమర్ధవంతంగా పాలనలో భాగస్వాములు కాగలుగుతారు.
2.3.4. ఐదవ షెడ్యూలు ప్రాంతాల్లో గ్రామసభలకు పెసా (ఆరవ అనుబంధం చూడండి) చాలా కీలకమైన పాత్ర కల్పిస్తుంది. పెసా ప్రకారం గ్రామసభలు శాసనాధికారాలు కలిగి ఉంటాయి. (ఎ) పంచాయతీల ప్రణాళికలకు వాటి అనుమతి తప్పనిసరి. సామాజిక, ఆర్ధిక అభివృద్ధి పథకాల లబ్ధిదారులను అవే గుర్తిస్తాయి. పంచాయతీల నిదుల వినియోగ సర్టిఫికెట్లను జారీ చేస్తాయి; (బి) భూసేకరణ విషయంలో ప్రభుత్వం గాని, కంపెనీలు గాని తప్పనిసరిగా గ్రామసభను సంప్రదించాలి. సహాయపునరావాస కార్యక్రమాల అమలు, చిన్న తరహా ఖనిజాల మైనింగ్ లీజులు గ్రామసభల అనుమతితోనే జరగాలి; (సి) భూమి అన్యాక్రాంతం కాకుండా నిరోధించే అధికారాలు, అన్యాక్రాంతమైన భూమిని తిరిగి సొంతదారునికి ఇప్పించే అధికారాలు గ్రామసభకు ఉంటాయి; (డి) మద్యం అమ్మకాలు/వినియోగంపై ఆంక్షలు విధించే అధికారం; (ఇ) గ్రామ మార్కెట్లను (సంతలను) నిర్వహించే అధికారాలు; (ఎఫ్) వడ్డీ వ్యాపారాన్ని కట్టడి చేయడం; (జి) అన్ని సామాజిక రంగాల్లోని సంస్థలను, అధికారులను నియంత్రించే అధికారం మొదలైన అధికారాలు గ్రామసభలకు ఉంటాయి.
2.3.5. అందుచేత రాజ్యాంగంలో వార్డుసభ ఏర్పాటు నిబంధన చేర్చాలని, పెసా చట్టం తరహాలో గ్రామసభలకు అధికారాలు కల్పించాలని ప్రతిపాదించడమైనది.
2.4. పంచాయతిరాజ్ సంస్థల్లో ఎంపిలు, రాష్ట్ర శాసనసభ్యులు, అంటే ఎమ్మేల్యేలు, ఎమ్మేల్సీలకు ప్రాతినిధ్యం
2.4.1. రాష్ట్రశాసనసభ చట్టం ద్వారా మధ్యశ్రేణి, జిల్లా స్థాయి పంచాయతీలలో ఎంపిలకు, ఎమ్మేల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం ''కల్పించవచ్చు'' అని అధికరణం 243 సి(3) (సి)లు పేర్కొంటున్నాయి. అయితే రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో ప్రకటించిన అట్టడుగుస్థాయిలో వరకు ప్రజాస్వామ్యాన్ని పెంపొందించాలనే లక్ష్యానికి ఈ నిబంధన అనుగుణంగా లేదు. ఎంపిలు, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీల సమక్షంలో పంచాయతి ప్రతినిధులు నిర్భయంగా, సమర్ధవంతంగా పాలనలో పాల్గొనలేరు. దీనివల్ల నిర్ణయ ప్రక్రియ ప్రభావితమవుతుంది. అంతేగాక అట్టడుగు స్థాయి నుంచి నాయకులు తయారు కావటమూ జరగదు.
2.4.2. దీని దృష్ట్యా, ఎంపిలను, ఎమ్మేల్యేలను, ఎమ్మెల్సీలను పంచాయతీల సభ్యులుగా చేయడానికి రాష్ట్రప్రభుత్వాలకు గల విచక్షణాధికారాన్ని రద్దు చేయాలని ప్రతిపాదించడమైనది.
2.5. రిజర్వేషన్ సీట్ల రొటేషన్ (మార్పిడి)
2.5.1. కేవలం ఒక ఎన్నికల అవధి పూర్తవగానే రిజర్వేషన్ సీట్లను మార్చాలని రాజ్యాంగం ఆదేశించకపోయినా రాష్ట్రాల్లో తరచుగా జరిగుతున్నది అదే. ఇది రిజర్వేషన్ల స్ఫూర్తికే విరుద్ధం. రిజర్వుడు సీట్ల నుంచి మొదటిసారిగా ఎన్నికైన అభ్యర్ధులు, మళ్ళీ ఎన్నికకావడానికి అవసరమైన అనుభవాన్ని, పలుకుబడిని పెంచుకోలేరు. అంతేగాక తరచుగా, బలమైన స్వార్ధపరశక్తులు తమ మనుషులనే ఆ స్థానాలకు అభ్యర్ధులుగా నిలబెడతాయి. వారు ఒక పదవీకాలం పూర్తి చేసుకున్న తరువాత ఆ సీటు రిజర్వుడు హోదా కోల్పోయి, మళ్ళీ అక్కడ బలంగా పాతుకుపోయిన స్వార్ధపరులైన, వ్యక్తులకే దక్కుతుంది. పైగా ఒక ఎన్నిక తరువాత సీట్ల రిజర్వేషన్‌ను మారిస్తే పదవిలో ఉన్న వ్యక్తికి మళ్ళీ ఎన్నికయ్యే ఆశ ఎటూ ఉండదు కనుక ఈ విధానంలో ఒక రకమైన అనారోగ్యకరమైన దృక్పథం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది.
2.5.2. ఎన్నికైన ప్రతినిధులు నిజమైన నాయకులుగా ఎదిగేందుకు కనీసం రెండు ఎన్నికల వరకైనా రిజర్వేషన్లు ఉండాలని రెండవ ఎఆర్‌సి సిఫార్సు చేసింది. ఈ నిబంధన ఇప్పటికే తమిళనాడులో అమల్లో ఉంది. దీనివల్ల ఒక వర్గానికి (ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి, మహిళలు) సీటు దక్కడానికి 40 ఏళ్ళు పడుతుందని, కనుక ఒక ఎన్నిక తరువాత రిజర్వేషన్ మార్చే పద్ధతిలో లోపాలకు విరుగుడుగా ఎన్నికైన వ్యక్తిని పదవి నుంచి దింపేసే (రైట్ టు రికాల్) హక్కును ఓటర్లకు కల్పించాలనే వాదన ఒకటి ఉంది. అయితే అన్ని ప్రతిపాదనలనూ బేరీజు వేసి చూస్తే, రెండు పదవీకాలాల తరువాతే సీట్లను మార్చడమే చాలా విధాలా ఉపయోగకరమని అర్ధమవుతుంది.
2.5.3. అంతేగాక పంచాయతీలు(వార్డుల సీట్లు) అధ్యక్ష పదవులను ఎస్‌సిలు, ఎస్‌టిలు, ఒబిసిలకు కేటాయించడంలో ఆయా (పంచాయతీ) వార్డులో వారి వారి జనాభాతో నిమిత్తం లేకుండా రొటేషన్ పద్ధతి అనుసరించాలని అధికరణం 243 డి చెబుతోంది. వీరి జనాభా అన్ని పంచాయతీలలో ఒకేలా ఉండదు గనుక, ఆయా వర్గాల జనాభా ఎక్కువగా ఉన్న పంచాయతీలు/వార్డులలో ఒక్కొక్కసారి వారికి తక్కువ సీట్లు కేటాయంచబడవచ్చు. అందుకు భిన్నంగా వారు తక్కువగా ఉన్నచోట లేదా అసలు లేని చోట కూడా ఎక్కువ సీట్లు కేటాయించబడవచ్చు. ఇది రిజర్వేషన్ల స్ఫూర్తినే దెబ్బ తీయడంతో పాటు సక్రమమనిపించని ఈ తరహా రిజర్వేషన్ల పట్ల ఆగ్రహానికీ దారి తీస్తుంది.
2.5.4. కనుక ఒక నిర్దిష్ట వర్గానికి సీట్లు, అధ్యక్ష పదవులకు రిజర్వేషన్లను వరుసగా రెండు పదవీ కాలాల పాటు అమలు చేయాలని, ఆయా ప్రాంతాలు, పంచాయతీలు, జిల్లా మండళ్ళ పరిధిలో 5% అంతకంటే ఎక్కువ జనాభా కలిగి ఉన్న వర్గానికే రిజర్వేషన్ సదుపాయం కల్పించాలని ప్రతిపాదించడమైనది.
2.6. రాష్ట్ర ఆర్ధిక సంఘపు గడువును కేంద్ర ఆర్ధిక సంఘపు గడువుతో సమన్వయం చేయడం.
2.6.1. పంచాయతీల ఆర్ధిక పరిస్థితిని సమీక్షించి రాష్ట్రానికి, పంచాయతీలకు మధ్య పన్నులు, సుంకాలు వగైరాల పంపిణీ కేటాయింపులు, రాష్ట్ర సంచిత నిథి నుంచి పంచాయతీలకు గ్రాంటులకు సంబంధించిన విధివిధానాలపై సిఫార్సులు చేయడానికి రాష్ట్రగవర్నర్ ''ప్రతి ఐదవ సంవత్సరం ముగిసిన తరువాత ''ఒక రాష్ట్ర ఆర్ధిక సంఘాన్ని (ఎస్‌ఎఫ్‌సి) ఏర్పాటు చేయాలని అధికరణం 243(ఐ) పేర్కొంటున్నది. అధికరణం 280(3) (బిబి) ప్రకారం రాష్ట్రఆర్ధిక సంఘం సిఫార్సుల ఆధారంగా రాష్ట్రంలో పంచాయతీల ఆర్ధిక పరిస్థితుల్ని బలోపేతం చేసేందుకు, రాష్ట్రసంచిత నిధిని పెంచడానికి అవసరమైన సిఫార్సులను కేంద్ర ఆర్ధిక సంఘం చేయాలి.
2..6.2. రాష్ట్ర ఆర్ధిక సంఘాల గడువుకు, కేంద్ర ఆర్ధిక సంఘం గడువుకు పొంతన కుదరకపోవడం వల్ల, రాష్ట్ర ఆర్ధిక సంఘాల నివేదికల ఆధారంగా కేంద్ర ఆర్ధికసంఘం సిఫార్సులు చేయడం కష్టమవుతోందని వరుసగా అనేక ఆర్ధిక సంఘాలు అభిప్రాయపడ్డాయి. కేంద్ర ఆర్ధిక సంఘం తన సిఫార్సులను ఖరారు చేసే ముందే రాష్ట్ర ఆర్ధిక సంఘాలు తమ నివేదికలు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకునే అధికారాన్ని రాష్ట్రాలకు కల్పించాలని అవి సూచించాయి.
2.6.3. రాజ్యాంగంలో ఇప్పటికే వున్న 'ప్రతి ఐదేండ్లకు' అన్న మాటలు రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పరిచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు సరైన సమయంలో నివేదికలివ్వడానికి పరిమితిని విధిస్తున్నది. కనుకనే 243/1(1) అధికరణానికి సవరణ చేయాలని ప్రతిపాదించడమైనది.
2.7. ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణలు:
పైన పేర్కొన్న సహేతుకమైన కారణాల దృష్ట్యా రాజ్యాంగానికి ప్రతిపాదించిన సవరణలను అనుబంధం-4, అనుబంధం 4ఎ లలోని ముసాయిదా బిల్లులో పేర్కొనడం జరిగింది.
3. శాసనమండలుల పునర్నిర్మాణానికి చట్టం చేయాలి.
3.1. రాష్ట్రచట్టాల రూపకల్పనలో, తమ సంస్థాగత ప్రయోజనాల పరిరక్షణలో, స్థానిక సంస్థలకు శాసనమండలులు ఎంతగానో కీలకమైనవవుతాయి. శాసన మండలుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక సంస్థలకు మధ్య ఒక సజీవమైన అనుబంధం ఏర్పడుతుంది. అంతేగాక స్థానిక సంస్థలకు సరిపడా అధికారాలు, విధులు లేని అంశాన్నీ శాసనమండలిలో చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు.
3.2. రాజ్యాంగ అధికరణం 171(2) క్లాజ్ 3 ప్రకారం, శాసనమండలిలో మూడో వంతు సభ్యులను మాత్రమే స్థానిక సంస్థల ద్వారా ఎన్నుకోవాలి. మిగిలిన మూడింట రెండు వంతుల మంది యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులు, ఎమ్మేల్యేలు మొదలైన వారి ద్వారా ఎన్నుకోబడతారు. నిరక్షరాస్యత బాగా ఎక్కువగా ఉన్న కాలంలో 'గ్రాడ్యుయేట్లు' 'ఉపాధ్యాయుల' నియోజక వర్గాల భావన మొదలై ఉండవచ్చు. కానీ ఇప్పుడు అక్షరాస్యత గణనీయంగా పెరిగినందున గ్రాడ్యుయేట్లకు, ఉపాధ్యాయులకు విడిగా ప్రాతినిధ్యం కల్పించడంలో అర్ధం లేదు.దీనికి బదులు శాసనమండలులను పునర్‌వ్యవస్థీకరించి స్ధానిక సంస్థలకు విస్తృత ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియను మరింత బలోపేతం చేయడం సమంజసం.
3.3. చట్టం ద్వారా శాసనమండలులలో ప్రాతినిధ్య పరిమాణాన్ని మార్చే అధికారాన్ని రాజ్యాంగం అధికరణం 171(2) ద్వారా పార్లమెంటుకు ఇస్తున్నది. కనుక శాసనమండళ్ళలో మూడింట రెండు వంతుల మంది సభ్యులను ఎన్నికైన స్థానిక సంస్థల నుంచి ఎన్నుకునేటట్లు అధికరణం 171(2) క్రింద ఒక చట్టాన్ని తయారు చేయాలని ప్రతిపాదించడమైనది. ప్రస్తుత నిబంధనలను, ప్రతిపాదిత నిబంధనలను సరిపోల్చే పట్టికనొకదాన్ని అనుబంధం-7లో ఇవ్వడం జరిగింది.
4. ప్రతిపాదనలు
4.1. రాజ్యాంగానికి 73, 74వ సవరణలు జరిగి 17 ఏళ్ళకుపైగా గడిచిపోయింది. ఈ కాలంలో ఈ చట్టాల ప్రకారం స్థానిక సంస్థల ఏర్పాటయితే జరిగింది గాని, వాటికి సరిపడా అధికారాలు ఇచ్చి వాటిని బలోపేతం చేయడం మాత్రం సంతృప్తికరంగా జరగలేదు. దేశం పంచాయతీరాజ్ 50వ వార్షికోత్సవాన్ని 2009 అక్టోబర్ 2న జరుపుకొంది. అక్టోబర్ 2, 2009 నుండి అక్టోబర్ 2, 2010 వరకు ''గ్రామసభ సంవత్సరం''గా ప్రకటించుకున్నాం. అందువల్ల పంచాయతిరాజ్ సంస్థల బలోపేతానికి ప్రస్తుత రాజ్యాంగ నిబంధనలను పునఃపరిశీలించడం సముచితం. అది ఈ తరుణంలో తప్పనిసరి కూడా. స్థానిక స్వపరిపాలన అన్న లక్ష్యం నిజంగా నెరవేరాలంటే స్థానిక సంస్థలకు అధికారాల బదిలీని తప్పనిసరి చేయడం, జిల్లా మండళ్ల ఏర్పాటు, స్థానిక సంస్థలను గ్రామ/వార్డు సభలకు జవాబుదారీగా చేయడం. రిజర్వేషన్ల మార్పిడి(రొటేషన్) వ్యవధిని పెంచడం, శాసనమండలులను పునర్‌వ్యవస్థీకరించడం అవసరం. ఎఆర్‌సి సిఫార్సులపై రాష్ట్రాలతో నిర్వహించిన సమావేశం వివరాలు అనుబంధం-8లో ఉన్నాయి.
4.2. ఈ ప్రకారం ఈ ప్రతిపాదనలు చేయడమైనది:
(రి) పేరాలు 2.1.4, 2.2.6, 2.3.5, 2.4.2, 2.5.4, 2.6.3 ల ప్రకారం రాజ్యాంగ సవరణ.
ఈ సవరణ బిల్లును అనుబంధం-4 (అనుబంధం-4ఎతో సహా) లో చూడవచ్చు.
(రిరి) పేరా 3.3 లో ప్రతిపాదించిన విధంగా 171వ అధికరణం క్రింద ఒక చట్టాన్ని తీసుకురావడం. (ఎ.ఎన్.పి.సిన్హా )
కార్యదర్శి (పంచాయతిరాజ్)
అనుబంధం -4
బిల్లు నెం. xxxxxx 2009
రాజ్యాంగ(సవరణ) బిల్లు, 2009
భారత రాజ్యాంగ సవరణకు మరో బిల్లు
ఈ బిల్లుకు క్రింద పేర్కొన్న రీతిగా భారత రిపబ్లిక్ తన 60వ సంవత్సరంలో శాసనరూపం ఇస్తుంది :
1. (1) ఈ చట్టాన్ని రాజ్యాంగ (... వ సవరణ) చట్టం, 2009గా పిలవవచ్చు.
(2) కేంద్రప్రభుత్వం అధికార రాజపత్రం (గజెట్) లో ప్రకటించిన తేదీనుండి ఇది అమలులోకి వస్తుంది.
2. రాజ్యాంగాధికరణం 243లో, క్లాజులు(జి), (హెచ్) (ఐ), (జె)లను చేర్చాలి :-
(జి) ''గ్రామం'' అంటే ఈ భాగం కోసం గవర్నర్ బహిరంగ ఉత్తర్వు ద్వారా గ్రామంగా ప్రకటించిన ప్రదేశము. ఇందులో ఆ విధంగా ప్రకటించిన గ్రామాల సముదాయం కూడా ఉంటుంది.
స్వభావరీత్యా గ్రామంగా పరిగణించబడే ప్రస్తుత ఆవాసాలను ఒకే యూనిట్‌గా అలాగే కొనసాగించేందుకు తగినంత శ్రద్ధ తీసుకోవాలి.
(హెచ్) 'జిల్లామండలి' అంటే ఇప్పటికది ఏ పేరుతో పిలువబడుతున్నా జిల్లా స్థాయిలో గ్రామ, పట్టణ ప్రాంతాలు రెండిటికీ కలిపి అధికరణం 243 బి క్రింద ఏర్పాటు చేసిన 'స్వపరిపాలనా సంస్థ' అని అర్థం.
(ఐ) 'వార్డు' అంటే గ్రామపంచాయతీలో దాని సహజమైన అర్ధంలో గ్రామంలోని ఒక ప్రత్యేక భాగమని అర్థం.
(జె) 'వార్డుసభ' అంటే వార్డుకు సంబంధించిన వోటర్ల జాబితాలో పేర్లు నమోదై ఉన్న వ్యక్తుల సమూహం అని అర్థం.
3. అధికరణం 243 ఎ లో ఈ క్రింది క్లాజును విధిగా చేర్చాలి :
ఒక గ్రామసభ, గ్రామస్థాయిలో షెడ్యూలు 13లో నిర్దేశించిన అధికారాలను అమలు చేయగలిగి ఉండాలి. ఆ మేరకు విధులను నిర్వర్తించాలి. (13వ షెడ్యూలు వివరాలకై అనుబంధం 6లో ఉన్నాయి.)
అయితే గ్రామసభ తన అధికారాల్లో దేన్నయినా వార్డుసభకు బదిలీ చేయవచ్చు.
ఏ రాష్ట్రం కూడా షెడ్యూలు 13లోని అంశాలకు భిన్నమైన ఏ చట్టమూ చేయరాదు.
4. రాజ్యాంగంలో అధికరణం 243 బిలో :-
(1) 243 బి అధికరణ క్లాజ్(1) స్థానంలో ఈ క్రింది క్లాజును చేర్చాలి: అదేమంటే
ఈ భాగంలోని నిబంధనలకు అనుగుణంగా, ప్రతి రాష్ట్రంలోనూ తప్పనిసరిగా గ్రామ మరియు మండల, పంచాయతీ స్థాయిలోని, జిల్లా స్థాయిలోని, అన్ని గ్రామ, పట్టణప్రాంతాల (మెట్రోపాలిటన్ ప్రాంతాలు మినహా) ప్రాతినిధ్యంతో కూడిన జిల్లామండలి ఏర్పాటు చేయాలి.
5. రాజ్యాంగంలోని అధికరణం 243 సి నుంచి అధికరణం 243 కె వరకు ఉన్న 'పంచాయతీలు' అనే పదం స్థానంలో 'పంచాయతీలు, జిల్లా మండళ్ళు' అనీ, 'జిల్లా పంచాయతి' అన్న పదం స్థానంలో 'జిల్లా మండలి' అనీ మార్పు చేయాలి.
6. అధికరణం 243 సి (1)కి ఈ క్రింది నిబంధన చేర్చాలి :
జిల్లామండలిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు కేటాయించాల్సిన సీట్ల సంఖ్య వాటి జనాబా ప్రాతిపదికగా ఉండాలి.
7. అధికరణం 243 సి (3) (సి), (డి)లను రద్దు చేయాలి.
8. అధికరణం 243 డి(1) ను ఈ క్రింది విధంగా సవరించాలి:
243డి సీట్ల రిజర్వేషన్ - సీట్లను
(ఎ) షెడ్యూల్డు కులాలకు,
(బి) షెడ్యూల్డు తెగలకు
ప్రతి పంచాయతి, జిల్లా మండలిలో సీట్లు రిజర్వుచేయాలి. ఇలా కేటాయించే సీట్ల సంఖ్య సాధ్యమైనంతవరకు ఆయా పంచాయతీ, జిల్లా మండలి పరిధిలో ఆ వర్గ జనాభా శాతానికి తగిన విధంగా ఉండాలి. ఈ రిజర్వుడు సీట్లను వివిధ ప్రదేశాల మధ్య మార్పిడిచేయవచ్చు. అయితే సీటును రిజర్వు చేసేటప్పుడు ఆ అభ్యర్ధి వర్గం వారు ఆ ప్రాంత జనాభాలో కనీసం 5% గాని, అంతకంటే ఎక్కువగాని, ఉండాలి.
అధికరణం 243 డి(4) రెండవ నిబంధనను ఈ క్రింది విధంగ మార్చాలి :
ఈ క్లాజు క్రింద రిజర్వు చేసిన పదవుల సంఖ్యను, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు - ఏది వర్తిస్తే దాని జనాభా, మొత్తం జనాభాలో 5 శాతం అంతకంటే ఎక్కువ ఉన్న చోట్ల గ్రామ, మండల పంచాయితీలకూ, జిల్లా మండళ్ళకు రొటేషన్ పద్ధతిలో కేటాయించాలి.
అధికరణం 243 డిలో ఈ క్రింది నిబంధన చేర్చాలి :
సీట్లను, అధ్యక్ష పదవులను కనీసం రెండు పదవీ కాలాలకు రిజర్వు చేయాలి.
9. అధికరణం 243 జి స్థానంలో ఈ క్రింది వాటిని చేర్చాలి :
ఈ రాజ్యాంగ నిబంధనలకు లోబడి, పంచాయతీలు, జిల్లామండళ్ళు స్వపరిపాలన సంస్థలుగా (స్వీయ ప్రభుత్వాలుగా)ఉంటూ తగిన అధికారాలను కలిగి, అధికారాన్ని చెలాయించగలిగి, పంచాయతీలైతే 11వ షెడ్యూలు లోనూ, జిల్లా మండళ్ళు అయితే 11, 12వ షెడ్యూళ్ళలోను పేర్కొన్న అంశాలతో సహా తగు రీతిలో విధులను నిర్వర్తించాలి.
10. అధికరణం 243ఎం(1), (2)ల స్థానంలో ఈ క్రింది నిబంధన చేర్చాలి :
(1) ఈ భాగంలో ఏదీ కూడా, 'అధికరణం 243ఎ' లో గ్రామసభకు సంబంధించిన నిబంధనలు మినహా 124వ అధికరణంలో క్లాజు (1)లో పేర్కొన్న షెడ్యూల్డు ప్రాంతాలకు, క్లాజు (2)లో పేర్కొన్న గిరిజన ప్రాంతాలకు వర్తించదు.
11. అధికరణం 243 డబ్ల్యు స్థానంలో, ఈ క్రింది అధికరణం చేర్చాలి :
రాజ్యాంగ నిబంధనలకు లోబడి మున్సిపాలిటీలు, తగిన స్థాయి కలిగిన స్వపరిపాలనా సంస్థలుగా ఉంటూ తగినన్ని అధికారాలను, సాధికారతను కలిగి ఉండి, 12వ షెడ్యూలులో పేర్కొనబడిన అంశాలతో సహా మిగిలిన అంశాలకు సంబంధించిన విధులను నిర్వర్తించాలి. అధికరణం 243 ఐలో ఉన్న ''ప్రతి ఐదవ సంవత్సరం'' అనే పదాలకు ''లేదా అంతకు ముందు'' అనే పదాలు చేర్చాలి.
12. అధికరణం 243 జెడ్‌డిని ఈ క్రింది విధంగా సవరించాలి:
1. జిల్లాలోని పంచాయతీలు, మున్సిపాలిటీలు తయారు చేసిన ప్రణాళికలను జిల్లామండలి క్రోడీకరించి జిల్లా మొత్తపు అభివృద్ధికి అనువుగా ఒక సమీకృత అభివృద్ధి ప్రణాళికను తయారు చేస్తుంది.
2. ప్రతి రాష్ట్రంలోనూ జిల్లా స్థాయిలో ఒక జిల్లా ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయాలి. ఇది జిల్లా, మండలికి, వృత్తి పరమైన మరియు సాంకేతిక పరమైన సలహా విభాగంగా వ్యవహరిస్తుంది.
3. జిల్లా ప్రణాళికా సంఘంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించే అధికారులు, నిపుణులు ఉంటారు.
4. జిల్లా ప్రణాళికా సంఘం స్థానిక సంస్థల ప్రణాళికా ప్రక్రియకు, సాంకేతిక మరియు వృత్తిపరమైన మద్దతును అందిస్తుంది. జిల్లా స్థాయి ప్రాధాన్యతా క్రమాన్ని నిర్ణయించడంలోను, స్థానిక ప్రభుత్వాల ప్రణాళికలను సమీక్షించడంలోను, జిల్లా ప్రణాళిక రూపకల్పనలో వివిధ వర్గాల భాగస్వామ్యం ఉండేలా చూడటంలోను జిల్లా మండలికి దాని పర్యవేక్షణ, నిర్వహణల విషయంలో సహాయసహాకారాలు అందిస్తుంది.
13. రాజ్యాంగానికి ఈ క్రింది విధంగా 13వ షెడ్యూలును చేర్చాలి:
10. Article 243 M (1) and (2) be substituted as:
1. Nothing in this Part, ‘except the provisions of Article 243A concerning Gram Sabha’, shall apply to the Scheduled Areas referred to in clause (1) and the tribal areas, referred to in clause (2) of article 244.
11. For Article 243 W the following Article shall be substituted:
Subject to the provisions of this Constitution, the Municipalities at the appropriate level shall be institutions of self government and exercise appropriate powers and authority and perform appropriate functions including in respect of the matters listed in the Twelfth Schedule. In Article 243 I, the words “or earlier” be added after the words “every fifth year”.
12. Article 243 ZD shall be amended as:-
1. The District Council will consolidate the plans prepared by Panchayats and Municipalities in the district and prepare an integrated development plan for the district as a whole.
2. There shall be constituted in every State at the district level a District Planning Committee which shall work as a professional / technical advisory arm of the District Council.
3. The District Planning Committee will comprise of officials and experts as decided by the State Government.
4. The District Planning Committee will provide technical and professional support for the planning process in local bodies, setting of district priorities, review of plans of local governments, participative planning and monitoring and implementation of district plan etc to the District Council.
13. Schedule 13 shall be added to the constitution as:
Schedule 13
[Article 243A]
Powers and functions of Gram and Ward Sabha
1. Competence to resolve disputes in respect of all matters that are included in this Schedule and other matters that may be specified under Nyaya Panchayat Act.
2. Competence to safeguard and preserve the community resources including land, water, forest and minerals
3. Ownership over minor forest produce
4. Planning and management of minor water bodies.
5. Control over Village Panchayat
6. Developmental Programmes : The powers to
(i) Control over local plans and resources for such plans;
(ii) Approve the plans, programmes and projects for social and economic development before such plans, programmes and projects are taken up for implementation by the Gram Panchayat;
(iii) Identify and select persons as beneficiaries under the poverty alleviation and other programmes:
(iv) Conduct regular social audit at least once in two months to assess the progress of any work or other activities taken up in the village by any agency what so ever, expenditure incurred, quality, quantity and rates of materials purchased, wages disbursed and such like as.
(v) Certify utilisation of funds by Gram Panchayat on the basis of social audit.
7. Other Matters
(i) Regulation or restriction on the sale and consumption of any intoxicant;
(ii) Managing village markets by whatever name called;
(iii) Control over money lending;
(iv) Control over institutions and functionaries in all social sectors;
8. Consultation with Gram Sabha
Consultation with concerned Gram Sabhas before :
(i) Making acquisition of land for development projects and before re-settling or rehabilitating persons affected by such projects;
(ii) Granting prospecting license or mining lease for minor minerals;
(iii) Granting concessions for the exploitation of minor minerals by auction.
Explanation: The term ‘concerned’ shall include all Gram Sabhas in the zone of influence of proposed project- industrial, mining, township and such like.
షెడ్యూలు 13
(అధికరణం 243 ఎ)
గ్రామ మరియు వార్డు సభల అధికారాలు, వాటి కార్యకలాపాలు (విధులు)
1. ఈ షెడ్యూలులో చేర్చిన అన్ని అంశాలకు మరియు న్యాయపంచాయతి చట్టంలో పేర్కొనే అవకాశం ఉన్న ఇతర అంశాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించే అధికారం.
2. భూమి, నీరు, అడవులు, ఖనిజాలతో సహా అందరికీ చెందాల్సిన సమష్టి వనరులను పరిరక్షించే అధికారం.
3. చిన్న తరహా అటవీ ఉత్పత్తుల యాజమాన్యం.
4. చిన్న తరహా నీటి వనరుల ప్రణాళికలు తయారుచేయడం, నిర్వహించడం.
5. గ్రామ పంచాయతీపై నియంత్రణ కలిగి ఉండడం.
6. అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణాధికారం :
(రి) స్థానిక ప్రణాళికలపైనా, వాటికి అవసరమైన వనరులపైన నియంత్రణ;
(రిరి) సామాజిక, ఆర్ధిక అభివృద్ధికై గ్రామపంచాయతీలు ఆయా ప్రణాళికలు, కార్యక్రమాలు, పథకాలు చేపట్టే ముందు వాటన్నిటిని గ్రామసభ ఆమోదం విధిగా పొందాలి.
(రిరిరి) దారిద్య్ర నిర్మూలన కొరకు మరియు ఇతర పథకాలకు తగిన లబ్ధిదారులను గుర్తించడం, ఎంపిక చేయడం;
(రిఖీ) గ్రామాల్లో చేపట్టిన ఇటువంటి కార్యకలాపాలు, పనుల విషయంలో, అది ఏ సంస్థలు చేపట్టినా, వాటి పురోగతిని, అయిన ఖర్చును, నాణ్యతను, పరిమాణాన్ని, కొన్న సామగ్రి ధరలు, పంపిణీ చేసిన వేతనాలు మొదలైన వాటిని, మదింపు చేయడానికి కనీసం రెండు నెలలకు ఒకసారి అయినా క్రమం తప్పకుండా సామాజిక తనిఖీని నిర్వహించడం.
(ఖీ) గ్రామపంచాయతీ ఖర్చు పెట్టిన నిధులను సామాజిక తనిఖీ వివరాలాధారంగా ధ్రువీకరించడం.
7. ఇతర అంశాలు
(రి) మత్తుపదార్ధాల, విషపదార్థాల అమ్మకాలను లేదా వినియోగాన్నయినా నియంత్రించడం లేదా వాటిపై ఆంక్షలు విధించడం.
(రిరి) గ్రామీణ విపణిని - అవి ఏ పేర్లతో పిలువబడుతున్నా వాటిని నియంత్రించడం.
(రిరిరి) వడ్డీ వ్యాపారంపై నియంత్రణ;
(రిఖీ) అన్ని సామాజిక రంగాలలోని సంస్థల మరియు అధికారులపై నియంత్రణ;
8. గ్రామ సభతో సంప్రదింపులు
ఈ క్రింది చర్యలు చేపట్టేటప్పుడు సంబంధిత గ్రామసభలతో సంప్రదించాలి.
(రి) అభివృద్ధి ప్రాజెక్టుల కొరకు భూముల్ని సేకరించేటప్పుడు లేదా అటువంటి ప్రాజెక్టు వల్ల నిర్వాసితులయ్యే వారికి పునరావాసం కల్పించేటప్పుడు;
(రిరి) చిన్న తరహా ఖనిజాల అన్వేషణకు అనుమతులను లేదా తవ్వకం లీజులను మంజూరు చేసేటప్పుడు;
(రిరిరి) చిన్న తరహా ఖనిజాల తవ్వకానికి వేలంపాటలు నిర్వహించే సందర్భంలో ఏవైనారాయితీలు మంజూరు చేసేటప్పుడు.
వివరణ: ఇక్కడ ''సంబంధిత'' గ్రామసభ అంటే ప్రతిపాదిత ప్రాజెక్టు - పరిశ్రమలు, మైనింగ్, టౌన్‌షిప్ వగైరా - ప్రభావం పడే ప్రదేశంలోని అన్ని గ్రామసభలూ అని అర్ధం.
అనుబంధం - 5 (|||)
ఆదర్శ పంచాయతి మరియు గ్రామస్వరాజ్య చట్ట ముసాయిదాలో, వార్డుసభ / గ్రామసభకు సంబంధించిన ప్రధాన అంశాలు
1. ప్రతి వార్డుకు ఒక వార్డుసభ ఉంటుంది. అందులో ఓటర్ల జాబితాలో పేర్లున్న వయోజనులందరూ సభ్యులే. గ్రామపంచాయతీ ఓటర్ల జాబితాలో పేర్లున్న వ్యక్తులందరూ గ్రామసభ సభ్యులవుతారు.
2. వార్డుసభ అధికారాలు, విధుల్లో ఈ క్రిందివి ఉంటాయి :
(ఎ) అభివృద్ధి : ప్రణాళికల తయారీకి అవసరమైన సమాచారాన్ని సేకరించడంలో, ప్రతిపాదనల రూపకల్పనలో, ప్రాధాన్యతా క్రమాన్ని నిర్ధారించే విషయంలో అభివృద్ధి పథకాల అమలులో, అర్హులైన లబ్ధిదారుల గుర్తింపులో గ్రామపంచాయతీకి సహాయపడటం ప్రజాప్రయోగకరమైన క్షేత్రాల (స్థానాల) ను సూచించడం.
(బి) సాంఘిక సంక్షేమం : వివిధ సంక్షేమ పథకాలకు ఎంపిక చేయాల్సిన వ్యక్తుల అర్హతల పరిశీలన; తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల సమష్టి సంఘాలకు సహాయపడటం, అక్షరాస్యత, విద్య, ఆరోగ్యం, శిశుసంరక్షణ, పోషకాహార పంపిణీలను ప్రోత్సహించడం, ప్రజారోగ్య కార్యకలాపాలకు చేయూతనివ్వడం.
(సి) పర్యవేక్షణ : అభివృద్ధి పనుల గురించిన సమాచారాన్ని పొందడం, సామాజిక తనిఖీ నిర్వహణను చేపట్టడం, నిధుల వినియోగ సర్టిఫికెట్లజారీ, వార్డుసభ తీసుకున్న నిర్ణయాలు అమలు జరిగేటట్లు చూడడం, నీటి సరఫరా, వీధి దీపాలు మొదలైన వాటిలో లోపాలను ఎత్తిచూపించి, పరిష్కార పద్ధతులను సూచించడం, అభివృద్ధి కార్యకలాపాల్లో భాగస్వాములైన లబ్ధిదారులపై పర్యవేక్షణ, తోడ్పాటు.
(డి) అవగాహన కల్పించడం : పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, సామరస్యాన్నీ, సమైక్యతను పెంపొందించుకోవటం, పారిశుధ్యం విషయంలో గ్రామపంచాయతీకి సహకరించడం మొదలైన ప్రజాహిత అంశాలపై అవగాహన పెంచడం.
3. గ్రామసభ అధికారాలు, విధుల్లో ఇవి చేరిఉంటాయి :
ఎ) అభివృద్ధి : సామాజిక, ఆర్ధిక అభివృద్ధి ప్రణాళికలను, కార్యక్రమాలను, పథకాలను గుర్తించడం, ప్రాధాన్యతలను నిర్ధారించడం, ఆమోదించడం, గిరిజనులకు చెందిన ఉపప్రణాళికతో సహా, స్థానిక ప్రణాళికలపై నియంత్రణ కలిగి ఉండడం, గ్రామ పంచాయతి వార్షిక ప్రణాళికకు సిఫార్సులు చేయడం, అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం, ఆబడి భూముల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడం, ఆమోదించడం, నీటివనరులు, రోడ్లు, వీధిదీపాలు వంటి ప్రజాపనులను చేయడం, ఆపై నిర్వహణ, మరమ్మతులు, వగైరాలను పర్యవేక్షించడం.
బి) పర్యవేక్షణ: గ్రామపంచాయతి నిధులను సవ్యంగా ఖర్చు చేసిందీ లేనిదీ నిర్ధారించుకుని ధ్రువీకరించడం, బలహీన వర్గాలకు మంజూరు చేసిన స్థలాల విషయముపై సామాజిక తనిఖీ, ఏదైనా కార్యకలాపం, పథకం, ఆదాయం, ఖర్చు విషయమై గ్రామపంచాయతి అధ్యకక్షుడు/అధ్యకక్షురాలు లేదా సభ్యుల నుంచి వివరణ కోరడం, గ్రామపంచాయతి ఆడిట్, నివేదిక, ఖాతాల పరిశీలన, సామాజిక రంగాల్లోని సంస్థలు వాటి అధికారులపై గ్రామపంచాయతీ ద్వారా నియంత్రణ కలిగి ఉండటం.
సి) గ్రామనిర్వహణ : సహజ వనరుల నిర్వహణ, ఉమ్మడి భూముల నిర్వహణ, చిన్న తరహా అటవీ ఉత్పత్తులపై యాజమాన్యము, నిర్వహణ, ఆటలు, ప్రదర్శనలు, దుకాణాలు, ఫలహారశాలలు మొదలైన వాటి క్రమబద్దీకరణ, నియంత్రణ, గ్రామసంతల నిర్వహణ; భూముల సేకరణకు ముందే పునరావాస కార్యక్రమాల అమలు పై సంప్రదింపులు జరుపుట, చిన్న తరహా ఖనిజాల అన్వేషణ, తవ్వకాల లీజు మంజూరుకు, వేలం ద్వారా చిన్న తరహా ఖనిజాల తవ్వకానికి రాయితీలు ఇచ్చే ముందు సిఫార్సులు చేసే అధికారం, అంటువ్యాధులు మరియు ప్రకృతి విపత్తులపై నివేదికలు రూపొందించేందుకు ఏర్పాట్లు చేయడం.
డి) ఇతర అధికారాలు, విధులు : గ్రామాభివృద్ధి కార్యక్రమాలలో, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, స్వచ్ఛంద శ్రమకు ప్రజలను సంసిద్ధుల్ని చేయడం, శాంతి, సామరస్యాలను ప్రోత్సహించడం, సామాజిక అవగాహన పెంపొందించడం, నిరుపేద వ్యక్తుల వైద్యము మరియు ఇతర అవసరాలకు అవసరమైన రుణాలు అందించడం.
4. రహస్య బ్యాలెట్ ద్వారా గ్రామసభ సభ్యుల్లో (గ్రామ ఓటర్లలో) సగం మందికి పైగా గ్రామపంచాయతి అధ్యకక్షుడిని పదవి నుంచి దింపేయాలని నిర్ణయిస్తే, అతడిని దింపి వేసే అధికారం గ్రామసభకు ఉంటుంది.
5. గ్రామ పంచాయతి సభ్యుని అధ్యక్షతన ఏడాదికి కనీసం నాలుగసార్లు వార్డుసభ సమావేశం కావాలి. వార్డుసభ సూచనలను ఆదేశాలన్నంతగా గ్రామపంచాయతీ పరిగణించాలి. అలాగే గడిచిన సంవత్సరం నిర్వహించిన అభివృద్ధి కార్యకలాపాలగురించిన నివేదికను, తదుపరి సంవత్సరం చేపట్టే కార్యక్రమాల ప్రతిపాదనలను వార్డుసభ ముందుంచాలి.
6. గ్రామసభ ఏడాదిలో కనీసం నాలుగుసార్లు సమావేశం కావాలి. గ్రామపంచాయతి అధ్యకక్షుడు గ్రామసభ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. గడిచిన సంవత్సరంలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాలపై రూపొందించిన నివేదికను, ప్రస్తుత సంవత్సరంలో చేపట్టనున్న కార్యక్రమాల ప్రతిపాదనలను, అలాగే ఖర్చుల వివరాలతో కూడిన ఖాతాలను గ్రామపంచాయతీ, గ్రామసభ ముందు ఉంచాలి. ఆడిట్‌కు చెందిన మరియు పనితీరుకు సంబంధించిన నివేదికలను గ్రామసభలో చర్చించాలి. గ్రామపంచాయతి అధికారులను ఎవరినైనా, గ్రామసభ సమావేశానికి హాజరుకమ్మని కోరే అధికారం అధ్యకక్షుడికి ఉంటుంది.
7. పంచాయతీల పనితీరును మదింపు చేసేందుకు వీలుగా పౌరుల అభిప్రాయాలను తెలుసుకోడానికి, రాష్ట్రప్రభుత్వాలు,'పౌరనివేదిక కార్డు' వంటి విధానాలను ప్రవేశపెట్టవచ్చు. ప్రజాప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఇతర అంశాలకు కూడా సమాచారహక్కు చట్టం క్రింద (ఎవరూ దరఖాస్తు చేయకపోయినా) ఐచ్ఛికంగా సమాచారాన్ని వెల్లడించే నిబంధనను వర్తింప చేయవచ్చు. ప్రభుత్వం కూడా సామాజిక తనిఖీ ప్రక్రియ సక్రమంగా జరుగుతుండేటట్లు శ్రద్ధచూపాలి.
అనుబంధం -6
పెసా 1996
పంచాయతీల నిబంధనలను షెడ్యూలు ప్రాంతాలకు వర్తింపజేసే చట్టం, 1996 నెం,40 1996 (24 డిసెంబర్, 1996)
రాజ్యాంగం 9వ భాగంలోని పంచాయతీలకు సంబంధించిన నిబంధనలనే షెడ్యూలు ప్రాంతాలకు విస్తరింపజేసే ఒక చట్టం.
భారత రిపబ్లిక్ ఎర్పడ్డ 47వ సంవత్సరంలో (1996లో) ఈ చట్టం చేయబడినది.
సంక్షిప్తంగా దీని పేరు (సంగ్రహ నామం) :
1. ఈ చట్టాన్ని పంచాయతీల నిబంధనలు షెడ్యూల్డు ప్రాంతాలకు విస్తరింపు చట్టం, 1996గా పిలవవచ్చు.
నిర్వచనం
2. వేరే విధంగా అర్థంచేసుకోవలసిన అవసరం రానంతవరకు, ఈ చట్టంలో ''షెడ్యూల్డు ప్రాంతాలు'' అంటే, రాజ్యాంగంలోని 244వ అధికరణం క్లాజు (1)లో పేర్కొన్న షెడ్యూల్డు ప్రాంతాలు అనే.
రాజ్యాంగం 9వ భాగాన్ని వర్తింపచేయటం
3. రాజ్యాంగం 9వ భాగంలో పంచాయతీలకు సంబంధించిన నిబంధనలను, సెక్షన్ 4లో పేర్కొన్న మినహాయింపులు, మార్పులకు లోబడి, షెడ్యూలు ప్రాంతాలకూ వర్తింప జేయడమైనది.
రాజ్యాంగం 9వ భాగానికి మినహాయంపులు, మార్పులు
4. రాజ్యాంగం 9వ భాగంలో ఉన్న నిబంధనలతో నిమిత్తం లేకుండా, రాష్ట్ర శాసనసభకు ఈ క్రింది అంశాలకు విరుద్ధమైన ఏ చట్టాన్నీ ఆ భాగం క్రింద చేయకూడదు:
(ఎ) పంచాయతీలపై ఒక రాష్ట్రం చేసే చట్టం, ప్రజల సంప్రదాయాలు, సామాజిక పరమైన మరియు మతపరమైన ఆచారాలు, సమష్టి వనరుల సంప్రదాయ నిర్వహణ పద్ధతులకు అనుగుణంగా ఉండాలి;
(బి) సాధారణంగా గ్రామం అంటే ఒక ఆవాసం లేదా కొన్ని ఆవాసాల సముదాయం. లేకుంటే ఒక గూడెం లేదా కొన్ని గూడేల సముదాయం. ఇక్కడి ప్రజలు తమ ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం తమతమ సొంత వ్యవహారాలను నిర్వహించుకుంటుంటారు.
(సి) ప్రతి గ్రామంలో ఒక గ్రామసభ ఉండాలి. గ్రామస్థాయిలో పంచాయతి ఎన్నికలకు సంబంధించిన వోటర్ల జాబితాలో పేర్లు గల వ్యక్తులు, ఈ గ్రామసభలో సభ్యులుగా ఉంటారు;
(డి) ప్రతి గ్రామసభ, ప్రజల ఆచారాలను, సంప్రదాయాలను, వారి సాంస్కృతిక అస్తిత్వాన్నీ, గ్రామానికి చెందిన ఉమ్మడి వనరులను, వివాదాల పరిష్కారానికి గల సాంప్రదాయ పద్ధతులను పరిరక్షించుకోగలగాలి;
(ఇ) ప్రతి గ్రామసభ ఈ క్రింది అధికారాలు కలిగి ఉంటుంది.
(రి) సామాజిక మరియు ఆర్ధికాభివృద్ధికి పంచాయతీలు గ్రామస్థాయిలో అమలు చేయబోయే ప్రణాళికలను, కార్యక్రమాలను, పథకాలను గ్రామసభ ఆమోదించాలి;
(రిరి) దారిద్య్ర నిర్మూలన, ఇతర పథకాల క్రింద లబ్ధిదారులను గుర్తించే లేదా ఎంపిక చేసే బాధ్యత గ్రామసభదే;
(ఎఫ్) గ్రామస్థాయిలో ప్రతి పంచాయతి క్లాజు(ఇ) లో పేర్కొన్న ప్రణాళికలు, కార్యక్రమాలు, పథకాలకు పంచాయతీ నిధుల వినియోగానికి సంబంధించి, గ్రామసభ నుంచి అనుమతి పొందాలి;
(జి) షెడ్యూలు ప్రాంతాలలో రాజ్యాంగం 9వ భాగం క్రింద సీట్లు కేటాయించేటప్పుడు, ప్రతి పంచాయతీలోను సీట్ల కేటాయింపు ఆ పంచాయతీ పరిధిలో ఆయా వర్గాల జనాభా నిష్పత్తి ప్రాతిపదికగా జరగాలి;
- మొత్తం సీట్లలో సగానికి తగ్గకుండా షెడ్యూల్డు తెగలకు రిజర్వేషన్ కేటాయింపు జరగాలి.
- పంచాయితీలు ఏ స్థాయికి చెందినవైనా వాటి అధ్యకక్షుల పదవులన్నీ షెడ్యూల్డు తెగలకే కేటాయించాలి;
(హెచ్) మధ్యశ్రేణి పంచాయితీలు లేదా జిల్లా స్థాయి పంచాయతీలలో ప్రాతినిథ్యం లేని షెడ్యూలు తెగలకు, ప్రాతినిధ్యం కల్పిస్తూ ఆ తెగలకు చెందిన వారిని రాష్ట్రప్రభుత్వం నామినేట్ చేయవచ్చు:
అయితే ఇలా నామినేట్ చేయబడ్డ సభ్యుల సంఖ్య, పంచాయితీలో ఎన్నికయ్యే సభ్యుల మొత్తం సంఖ్యలో పదోవంతుకు మించరాదు.
(ఐ) షెడ్యూలు ప్రాంతాలలో సమాజాభివృద్ధి కొరకై ప్రాజెక్టుల భూమిని సేకరించేటప్పుడు లేదా అటువంటి ప్రాజెక్టువల్ల నిర్వాసితులైన వారికి పునరావాసం కల్పించేటప్పుడు, గ్రామసభను లేదా సంబంధిత స్థాయి పంచాయతీలను సంప్రదించాలి; షెడ్యూల్డు ప్రాంతాల్లో నిర్మించాలనుకునే ప్రాజెక్టుల ప్రణాళిక, వాటి అమలు అన్నవాటి సమన్వయం రాష్ట్రస్థాయిలో జరగాలి.
(జె) షెడ్యూల్డు ప్రాంతాలలో, చిన్న తరహా నీటివనరుల ప్రణాళిక, నిర్వహణను సంబంధిత స్థాయి పంచాయతీలకు అప్పగించాలి;
(కె) షెడ్యూల్డు ప్రాంతాలలో చిన్నతరహా ఖనిజాల అన్వేషణకు, తవ్వకాల లీజులు మంజూరు చేయడానికి, గ్రామసభ లేదా సంబంధిత స్థాయి పంచాయతీల సిఫార్సులను తప్పనిసరి చేయాలి;
(ఎల్) వేలం ద్వారా అనుమతించబడే చిన్న తరహా ఖనిజాల తవ్వకానికి, ఏవైనా రాయితీలు ఇవ్వడానికి గ్రామసభ లేదా సంబంధిత స్థాయి పంచాయతీ నుండి ముందస్తు సిఫార్సు తప్పనిసరి.
(ఎం) షెడ్యూలు ప్రాంతాలలోని పంచాయతీలు, స్వపరిపాలనా సంస్థలుగా పని చేయడానికి అవసరమైన అధికారాలు కలిగి ఉండేటట్లు చూడటానికి సంబంధిత పంచాయతీలకు, గ్రామసభలకు, రాష్ట్రశాసనసభ ప్రత్యేకంగా ఈ క్రింది అధికారాలను కల్పించాలి.
రి) ఏ మత్తు పదార్థాల అమ్మకాన్ని లేదా వినియోగాన్ని నిషేధించే లేదా నియంత్రించే లేదా ఆంక్షలు విధించే అధికారం;
రిరి) చిన్న తరహా అటవీఉత్పత్తులపై యాజమాన్యం;
రిరిరి) షెడ్యూల్డు ప్రాంతాలలోని షెడ్యూల్డు తెగకు చెందిన భూమి అన్యాక్రాంతం కాకుండా నిరోధించే అధికారంతోపాటు, చట్టవిరుద్ధంగా అలా అన్యాక్రాంతమైన భూమిని సొంతదారునికి తిరిగి ఇప్పించే అధికారం;
రిఖీ) ఏ పేరుతో పిలిచేవైనా, గ్రామ మార్కెట్లను నిర్వహించే అధికారం;
ఖీ) షెడ్యూలు తెగలకు వడ్డీలకు అప్పులు ఇవ్వడాన్ని నియంత్రించే అధికారం;
ఖీరి) అన్ని సామాజిక రంగాల్లోని సంస్థలను, వాటి అధికారులను నియంత్రించే అధికారం;
ఖీరిరి) గిరిజన ప్రాంతాలకు చెందిన ఉపప్రణాళికలతో సహా, స్థానిక ప్రణాళికలను, వనరులను నియంత్రించే అధికారం;
(ఎన్) పంచాయతీలు స్థానిక స్వపరిపాలనా సంస్థలుగా పనిచేయడానికి అవసరమైన అధికారాలు కల్పించేందుకు ఉద్దేశించిన రాష్ట్ర చట్టాలు, పై స్థాయి పంచాయతీ సంస్థలు క్రింది స్థాయి పంచాయతీల లేదా గ్రామసభల అధికారాలను హరించకుండా పటిష్టమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
(ఒ) షెడ్యూలు ప్రాంతాల్లో జిల్లా స్థాయి పంచాయతీలకు సంబంధించి పరిపాలనా ఏర్పాట్లు రూపొందించేటప్పుడు రాష్ట్రశాసనసభ రాజ్యాంగం ఆరవ షెడ్యూలు నిర్దేశించిన విధి విధానాలను అనుసరించాలి.
పంచాయతీలకు సంబంధించి ప్రస్తుత చట్టం కొనసాగింపు
5. ఈ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందిన తేదీకి ముందు వరకు షెడ్యూల్డు ప్రాంతాల్లో పంచాయతీలకు సంబంధించి అమల్లో ఉన్న ఏ చట్ట నిబంధనలైనా, సంబంధిత శాసనసభ లేదా ఇతర సంస్థ సవరించేంత వరకు లేదా రద్దు చేసేంతవరకు లేదా ఈ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందిన ఏడాది వరకు అమల్లోనే ఉంటుంది.
ఈ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందిన తేదీకి ముందు అస్తిత్వంలో ఉన్న పంచాయతీలు, రాష్ట్రశాసనసభ, లేదా శాసనమండలి కూడా ఉన్న రాష్ట్రాల్లో శాసనసభ, శాసనమండలి విడివిడి తీర్మానాల ద్వారా రద్దు చేస్తే తప్ప, తమ గడువు ముగిసేవరకు కొనసాగుతాయి.
కె.ఎల్.మోహన్‌పూరియా
భారతప్రభుత్వ కార్యదర్శి
No comments:
Post a Comment