Saturday, August 1, 2015

చేదునిజాలు / నిష్ఠుర సత్యాలు - (మతస్వేచ్చ)


యోచనాశీలురైన పాఠక మిత్రులారా! చాలా జాగ్రత్తగానూ, నిశితంగానూ, నిస్పాక్షికంగానూ, ఆవేశకావేషాలకు లోనుకాకుండగనూ విచారించాల్సిన 1) సున్నితమైన (2) అత్యంత కీలకమైన అంశాన్ని ప్రస్తావించుకోబోతున్నాం.
మనం ఇక్కడ ఎంచుకున్న అంశంపై మనందరిలోనూ (1) మన మన ఇష్టాఇష్టాలననుసరించీ, (2) మన మన వివేకస్టాయి, అవగాహనా సామర్ధ్యాలననుసరించీ ఇప్పికే ఏదో ఒక అభిప్రాయం ఏర్పడి ఉండే అవకాశాలే ఎక్కువ. మనలోని కొందరిలోనైతే ఆ అభిప్రాయాలు చాలా గ్టిగా, మార్చుకోలేనక్కరలేనివిగా దృఢ నిర్ణయ రూపాన్ని సంతరించుకునీ ఉండవచ్చు. అలాి కచ్చితమైన నిర్ణయాలకు చేరిన వారికి, ఈ విషయంపై విచారణే అనవసరమైందిగానూ, పునర్విచారణ రూపాలు, విషయాన్ని- నిజాలను - గందరగోళపరిచేవిగానూ తయారవుతాయన్న దృష్టే ఉంటుంది. ఇలాిం సందర్భాలకు చెంది, అనుభవజ్ఞులు చెప్పిన ఒకి రెండు హితవాక్కులను స్మరించుకుందాం.

సత్యం బ్రూయాత్‌, ప్రియం బ్రూయాత్‌, నబ్రూయాత్సత్సమప్రియం!
ప్రయంచ నా- నృతం బ్రూయాత్‌! ఏషద్దర్మ స్సనాతనః !!


ఎంత సంయమనం (ఆత్మనిగ్రహంతో) కూడిన మార్గ దర్శకమిది!? సత్యమే చెప్పాలి. నచ్చే విధంగా చెప్పాలి.
గ్రహీత వినలేని రూపంలో - అతడికనిష్టం కలిగే రూపంలో - చెప్పుకు సత్యాన్నైనా; అలాగని, నచ్చే రూపంలోనే చెప్పాలి గనుక అని అసత్యాలు చెప్పేవుసుమా! నచ్చుతుందికదా అనితనృం చెప్పకు ఇది - ఇదే - సనాతన (ప్రాచీన, నిత్య నూతన, ఎల్లకాలాలకూ వర్తించే) ధర్మము (చేయదగింది, చేయవలసింది, సమష్టి హితకారకమైనది) అవుతుంది. అన్నదే ఆ హితవాక్యం యొక్క హృదయం. మనని అటూ ఇటూ జారిపోకుండా ఊతాన్నిస్తున్న భావన అది. ఇదే సందర్భానికి చెందిన మరో విజ్ఞుని భావాన్ని చూడండి.

సంతి సతతం ప్రియవాదినః!
అప్రయస్యతు పధ్యస్య వక్తు శ్రోతాచ దుర్లభః!!

ఇచ్చికోరి మాటలు, ముఖమెదుట, ముఖ స్తుతి రూపమైన మాటలు చెపుతుండేవాళ్ళు మిక్కిలిగానే ఉంటుాంరు. కానీ, నీకు నచ్చినా నచ్చకున్నా, (ఇష్టంలేకున్నా) నీకు మేలుకలిగించే, (రోగాన్ని తొలగించి, ఆరోగ్యాన్ని కలిగించేందుకు తగిన ఆహారాన్ని 'పధ్యం' అనాంరు) మాటలను చెప్పేవారు అరుదు (దుర్గభం = లభించడం చాలా చాలా కష్టం) వినేవారూ అరుదే. అన్నదా సూక్తి భావం.

సురేంద్ర :- ఈ రిెంకీ మధ్య పరస్పరం ప్రతికూలత ఉందనిపిస్తుంది స్థూలదృష్టికి (మామూలుగాచూస్తే) కానీ వత్తిడి స్థాయిలో తేడాలతో కూడి ఒకి తర్వాత ఒకి ఒక క్రమంలో అనుసరించవలసినవి, అనుసరించడానికి వీలైనవే ఆ సూత్రాలు

1. ఏదేమైనా సత్యమే చెప్పాం. ఆ చెప్పడం వెనుక మన దృష్టంతా ఈ నిజాన్ని అతనికి ఎరుకపరచాలన్న హితకాంక్షే ఉండాలి. అతడు గ్రహించాలన్నదే మన అసలు లక్ష్యం అయితే, అతడు వినడానికి, గ్రహించడానికి తగిన వాతావరణం ఉండేలా చూసుకోవడం అన్నది మన అవసరమే అవుతుంది. అది అప్పికీ అతడంగీకరించే అంశమే - నిజమే- అయ్యుంటే ఈ రెండు సూత్రాల అవసరం ఉండదు. మనమా విషయం చెప్పగనే, అతడు దాన్ని అంగీకరించడమే కాక, మనమిరువురం ఒక్కటే నన్న దగ్గరకు వస్తాడు. ఇతడూ మన వాడే ననుకుాండన్నమాట ! అలా అప్పికే ఎరిగున్న, ఏకాభిప్రాయం కలిగివున్న సందర్బాలను మినహాయించి, అవలి వ్యక్తులు ఆలోచించుకోవలసిన, సరి చూసుకోవలసిన, మరియు అప్పికి అతని అవగాహనలోకి రాని, విషయాలకు సంబంధించిన సందర్భాలకు వర్తించే, వర్తింప జేసుకోవలసిన వివేక చోదిత, దిశనిర్ధేశకాలవి. ఇలాి ఉదాత్త భావనలను అందించిన అి్ట సమష్టి హితైషులైన పెద్దలను కృతజ్ఞతా పూర్వకంగా స్మరించుకోవడం సందర్భోచితం కనీస విజ్ఞత. ప్రాతఃస్మరణీయులువారు. ఆ ఉద్దండులకు పెడదాం దండిగా దండాలు నిండుగుండెతో.

ఏదో చెబుతానని మొదల్టెి యింత ఉపోద్ఘాతం ఎందుకు? విషయంలోకి వచ్చేయ్‌! అని మీలో కొందరికైనా అనిపిస్తుండవచ్చు. మనం చెప్పుకోబోయే విషయం, కొంతకాలం విచారణకు లోనుచేయాల్సివచ్చే విషయం.1. సున్నితమైనదీ 2. భిన్నాభిప్రాయాలకు చేరివున్నవారం పాల్గొనవలసిందీ కావడంతో, అందుకు తగిన మానసిక సన్నద్దతను ఏర్పరుచుకోవడం తప్పనిసరి అవుతుంది కనకనే అక్కడ మొదల్టెాను. విచారణకు పూనుకునేముందే విచారణకు తగిన వాతావరణాన్ని (బాహ్యపరిస్థితులను, వ్యక్తులలో అవసరమైన మానసిక పరిస్థితిని) ఏర్పరుచుకోవడం తప్పనిసరి. ఈ సందర్భంలో మరికొన్ని అంశాలను ప్రస్తావించుకోవలసి ఉందని నాకు అనిపిస్తున్నా, ప్రస్తుతానికి దాన్ని అలా ఉంచి, విషయ విచారణకు అవసరమైన సమాచారాన్ని మీ ముందుకు తెస్తాను.

స్వేచ్ఛ అన్నమాట - స్వ + యిచ్చ = అన్న పదాల కూర్పు నుండి నిష్పన్నమైనది (ప్టుింది, ఏర్పడింది) స్వకీయమైన, తనదైన యిష్టము అని దానర్ధము.
గమనిక :- 'స్వేచ్చ' ను 'స్వతంత్రం' అన్న పదానికి సమానార్ధకంగా వాడడమూ కనిపిస్తుంటుంది లోకంలో. నిజానికి ఆ పదాలు వేరు వేరు అర్ధాలు  కలిగినవి. 'స్వేచ్చా స్వాతంత్య్రాలు' అన్న పదబందాన్ని వాడడం మనలో చాలా మంది దృష్టికి వచ్చే ఉంటుంది. కనుక ఆ ప్రయోగం పేపర్‌ కాగితం, కప్పు గిన్నె, సైందవాశ్వం, కపివానరం లాిది కాదు. ఆ రిెంకీ వేి అర్ధం వాికే ఉంది. స్వతంత్రుడు అనంటే తన వశములో తానున్నవాడు అని అర్ధం. స్వతంత్రత రావడం అంటే ఇతరుల వశములోనుండి - పరతంత్రత నుండి - బయటపడి, తన వశములోనికి తాను రావడం అని అర్ధం. ఈ తేడాను గమనించుకుని ఉండండి

స్వభావం కోరుకునే స్వేచ్చ

సహజంగా మనిషి స్వభావం తన ఇష్టానికి అడ్డంకులు ఏర్పడకూడదనే అనుకుంటుంది. ఎవరిని గానీ ఎంత స్వేచ్చ కావాలని అడిగామనుకోండి వివేకాన్ని బ్టి కాక, నీ ఇష్టం వచ్చినంత అని చెప్పి మరీ అడిగామనుకోండి. ఏమాండు మనిషి.  1. ఇంతేనేమి? ఎంతైనా, పరిమితుల్లేకుండా ఉండే స్వేచ్చే కావాలని చెబుతాడు. బయటకి చెప్పకున్నా లోలోపలైనా అనుకుాండు. అంటే స్వభావం అపరిమిత (హద్దులు లేని) స్వేచ్చనే కోరుకుంటుందన్నమాట. దీనినీ గుర్తుంచుకోండి .

మతాలు రేకిత్తించే ఇచ్చ

మనిషిలో ఉండే, ఆశా భయాలకు లొంగే -ప్రభావితుడయ్యే- లక్షణాన్ని ఆధారం చేసుకుని పుట్టుకొచ్చినవే మతాలన్నీ. అవి మనిషిని విశ్వాసమనే కట్టుకొయ్యకు కట్టేయడంతో మొదలెడతాయి, తమ కార్యాచరణను. అందులో ఉండేది, ఏ మాటలతో చెప్పినా అత్యంత భయాన్ని కలిపించే నరక శిక్షలూ, అత్యంత ఆశను, భోగాలను చూపించే స్వర్గం నుండి వివిధ భోగ లోకాల ప్రాప్తి అన్న రెండిం గురించే.

మా మార్గాన నడిస్తే శాశ్వతంగా సర్వసుఖాలు అందుతాయి. లేకుంటే భయంకర నరక బాధలు అనుభవిస్తావు. అదీ శాశ్వతంగా - సదాకాలం. ఒక ముఖ్య విషయం ఏమంటే, ఈ మాట చెప్పి లేదా చెబుతూ, అక్కడితో ఊరుకుంటే కొంతవరకైనా బాగుండేది. ఇష్టమున్నవారు ఇష్టమున్న రీతిని జీవించేవారు. మనలో చాలా మంది, నిజ జీవితంలో, మత విశ్వాసాలకు అనుకూలం కాని వాస్తవ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ విశ్వాసాలనావలబ్టెి, ఈ లోక పోకడలననుసరించి, ఈ లోకానికి సంబంధించిన ఇంగిత జ్ఞానం ప్రకారమే వాిని ఎదుర్కోవడమో సర్ధుకోవడమో చేస్తుాంరు. ''గాలిలో దీపం ప్టిె దేవుడా అంటే ఏమవుతుంది. నీవు చేయాల్సింది నీవు చేసి, ఆపై దేవుని చిత్తం అనుకోవాలిగాని'' అన్న నానుడి దీనిని తెలిపేదే.

దేవుడు న్యాయకారి, దయాళువు అయితే, లోకంలో ఈ అరాచకం ఎందుకుంది అనడిగితే, ఇస్లాం, క్రైస్తవులు, దేవుడు మనిషికి స్వేచ్చనిచ్చాడు, మనిషి స్వేచ్చను దుర్వినియోగం చేస్తున్నాడని ఒక మా, సాతాను మనిషిని ప్రలోభప్టిె తప్పు చేయించాడు, చేయిస్తున్నాడు. మనిషికిచ్చిన స్వేచ్చప్రకారం దేవుడు ఆ లెక్కరాస్తున్నాడు అని ఒక మా చెపుతాయి. మరైతే, ఇచ్చని స్వేచ్చను వినియోగించుకోనీకుండా, కొందరిని తప్పులు చేస్తూనే ఉండేలా వారి మనస్సును కఠిన పరిచే పనీ మరికొందరి వెంటపడి, నమ్మండిరా! నన్ను నమ్మండిరా! అని తెగ బ్రతిమలాడుకుంటూ, అప్పుడప్పుడూ బెదిరిస్తూ, వరాలిస్తూ, ఇవేవీ పని చేయనప్పుడు వారిని మొత్తుతూ, తానే కఠినపరచిన వారిని సమూలంగా హతం చేసేస్తూ అంత కౄరంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు దేవుడు?! అక్కడితోనైనా ఊరుకుంటున్నాడా అనంటే, ఈ లోకంలో తననంగీకరించిన గుంపు చేత, తన నంగీకరించని సమూహాలను ఎందుకు చంపిస్తున్నాడు?

సర్వశక్తిమంతుడు మా దేవుడనే ఈ జ్ఞానశూన్యులకు, ఆ దేవుడు, ఇలా వేల సం||లుగా ఈ లోకంలో ఒకరికొకరు కొట్టుకు చావండిరా అని ప్రేరణెందుకు కలిగిస్తున్నట్లు? అనేక సందర్భాలలో తన గుంపు బలహీనంగా ఉండి, అవిశ్వాసులు వీరిని నానాహింసలు పెడుతుంటే, సహించుకోండని ఒకసారి మీ మీద కొస్తే తిరగబడండని మరొకసారి, బలంచాలితే నా రాజ్యం స్థాపించండని వేరొకసారీ, గ్టి పోీ ఉన్న సందర్భాలలో సంధి చేసుకోండని ఇంకొకసారీ, కుదిరితే అమీతుమీ తేల్చుకుని అందరినీ నా లెక్కన పాలించండని కడసారి ఎందుకు ప్రబోధించినట్టు?
ఇస్లాం విశ్వాసుల్లారా! బైబిలు విశ్వాసుల్లారా! పైనా వ్యక్తీకరణలను తెలిపే వాక్యాలు మీ గ్రంథాలలో ఉన్నాయా? లేవా? నిజాయితీగా ప్రకించండి. కాదని తెగబడి, అదరగండంగా, అి్టవి లేవు! మా దేవుడు పరమశాంతమూర్తి లాి అబద్దపు ప్రకటనలుగానీ చేయగలరేమో చూడండి.

పైన నేనన్నవన్నీ మీ ఖురాను, బైబిలు గ్రంధాలు చెపుతూ ఉన్నవేనని ఆ రెండు గ్రంథాలనుండీ తగినన్ని (ఒకీ అరాకాదు సుమండీ) వాక్యాలు. అి్టవి లేనేలేవు అని మీ రెండు పక్షాలలో ఎవరన్నా, ఇరువురూ అన్నా - యదాతథంగా పై నెలలో ప్రచురిస్తాను.

నాకు తెలీకడుగుతాను! ఎవడి మానాన వాణ్ణి బ్రతకనీకుండా, మా వైపుకురా, మా దేవుని విశ్వసించు, ఇతర మార్గాల వెంబడి పోకు. పోతివా అయిపోతివే లాి బెదిరింపు మాటలు నీకెందుకు? అలా చెప్పండిరా! నా పక్షాన పోరాడండిరా! అనే రెచ్చగొట్టుడు ఆ మీ దేవుళ్ళకెందుకు?

ఏమి చెపుతున్నానో అర్ధమవుతోందా? మతం, మనిషికి స్వేచ్చనివ్వదు. మాటవరసకు మాత్రం ఇచ్చానంటుంది. నన్ను తప్ప మరో వైపుకు కన్నెత్తి చూడకు. చూశావా చచ్చినోడివే నంటుండేది. స్వేచ్ఛ నిచ్చిందనడం ఆలోచన, అవి లేని తనాన్న (బుద్దిలేనితనాన్ని) చూపించదా? ఆలోచించండి.

ఏ మతమూ, మతేతరుల్ని సహించదు. ఇక సమానంగా చూడడమెక్కడ? మతాచారాలన్నీ కట్టుబాట్లే. ఇక స్వేచ్చ ఎక్కడ. సమస్యేమిటంటే, ప్టుినప్పి నుండీ వ్యక్తిని ఆయా మతాలు, వాి వాి ఆచారాలను మనసుకు ఎక్కించి, ఆ మత్తులో వాినే అంిపెట్టుకునే రీతిగా తీర్చిదిద్దుతూ వస్తుాంయి. వాిపట్ల అవి గొప్పవి. వాిననుసరించేవాడు గొప్పవాడు అన్న దృష్టినీ మనస్సుకు వంటబ్టిస్తాయి. దానితో పాటు ఆ మతానికితరమైన వాి పట్ల అల్పదృష్టినీ (హీన దృష్టినీ) శతృదృష్టినీ కూడా నెలకొల్పుతాయి. ఇహనేముంది, అదంతా వంట బ్టి అలాి గుంపులో జీవిస్తున్నవారు, అవన్నీ తన స్వేచ్ఛకు సంబంధించినవిగానే తలంచుతుాంరు.

స్వభావం అంగీకరించే స్వేచ్చ అన్నదే ఉండదు. మతం పేరున ఉండే ఇష్టంలో అదంతా విశ్వాసపు మత్తుతో కట్టుబాటునే ఆ మతం శాసిస్తున్నా నియమ నిబంధనలనే అలవాటవడంతో ఇష్టమనుకుంటుండే సోయలేని తనమే దానిని మతేచ్చ అనాలి స్వేచ్చ అనకూడదు. కనుకనే మానవత్వం మంటగలిసి పరస్పరం ఒకరికొకరు ఎి్ట అపకారం చేసికుని ఉండనివారు కూడా మతావేశం వల్ల పరస్పరం హింసించుకోడానికీ, చంపుకోడానికీ కూడా సిద్దపడిపోతున్నారు. మా మతం స్వేచ్చనిచ్చింది అని అనేవారు, నిజాయితీగా స్వేచ్చంటే ఏమిో, స్వేచ్చనివ్వడమంటే ఏమిో, స్వేచ్చ అమలవడమంటే ఏమిో చెప్పి, వారి మత చరిత్రలో ఆ ఆనవాళ్ళు చూపడానికి సిద్దపడండి. ఉత్తుత్తినే అమాయకపు మాటలో, కల్లబొల్లి మాటలో మ్లాడడం మానండికనైనా.

గమనిక :- మత దర్మమంటేనే నీ యిష్టమొచ్చినట్లు నడవకు, నేను చెప్పినట్లు మాత్రమేనడువు. స్వేచ్చను అదుపులో పెట్టుకోలేకుంటే శిక్ష తప్పదు.

ముఖ్యంగా బైబిలు, ఖురానులు (ఆ రిెంలోని దేవుడు) విశ్వాసులు అవిశ్వాసుల పట్ల ఎలా ఆలోచిస్తుండాలి? ఎలాి వైఖరిని కలిగి ఉండాలి? ఎదుి వారి బలాబలాలు, తమ బలాబలాలు బెరీజు వేసుకుంటూ, ఎటువిం స్థితిలో ఎలా ప్రవర్తించాలి? అని ఆదేశించాయో యధాతథంగా వెలికితీయాలి. అవిశ్వాసుల్ని విశ్వాసులుగా మార్చేందుకు అనుసరించాల్సిన పద్దతులేమి? ఎక్కడగాని, ఎప్పుడుగాని, ఎవరైనా విశ్వాసిగ ఉన్నవాడు, అవిశ్వాసిగ మారితే అతని పట్ల విశ్వాసి (ముస్లిం) దృష్టి, ప్రవర్తన ఎలా ఉండాలి? అన్న విషయాలను గనుక పరిశీలిస్తే, స్వేచ్చ అన్న మాటకు ఎక్కడా అన్వయంకుదరదు.

అవిశ్వాసం ఉండవచ్చు, అవిశ్వాసుల్ని వారి మానాన వారిని ఉండనీయవచ్చు. వారిని విశ్వాసులుగా మార్చేయత్నాలు చేయవద్దు. వారితో శతృత్వం వద్దు - ఎవరిష్టం వారిది. వేరు వేరు విశ్వాశాలతో ఉన్న మీరంతా అన్నదమ్ముల్లా కలిసే జీవించండి! అని స్పష్టంగా, మనస్ఫూర్తిగా, ఆదేశించిన వాక్యాలు అరుదుగా కూడా కనిపించవు. తనకు బలం చాలనప్పుడు, ఇశ్రాయేలీయులు, యూదులు తనకంటే బలవంతులుగా ఉండి మహమ్మదును తమ మతాన్ని స్వీకరించమని వత్తిడి చేసి, ప్రలోభ ప్టిెనప్పుడు నా విశ్వాసంనాది, మీ విశ్వాసంమ్మీది, నేను మీదారికిరాను, మీరు నా దారికి రారు, అని అన్నమాటల్ని ఎవరి విశ్వాసం ''నన్ను మీ విశ్వాసంలోకి రమ్మని పిలవకండి, నేను మిమ్మలను మా విశ్వాసంలోకి రండని పిలవను''. అన్న అర్దంకాదా మాటలకు. ఆ అర్ధమే ఖురాన్‌ అంతరంగం అని గనక అనేట్లయితే ఈనాి వరకు ఇస్లాం పేరున జరిగిన చరిత్రంతా ఖురాన్‌ అభిమతానికి వ్యతిరేకమైందే అవుతుంది. మరో మాట! ఇంతకూ మహమ్మదును తమవైపుకు రమ్మన్నది నాస్తికులు కాదు. మరో దైవ విశ్వాసం కలవాళ్ళే. కనక ప్రతిమతమూ, తన మతంలో లేనివాళ్ళను తమ వైపుకు త్రిప్పుకునే, తెచ్చుకునే యత్నాలు అప్పికున్న వీలును బ్టి రకరకాలుగ చేస్తూనే ఉంటుంది. కాకుంటే హిందూమతం పేరిట చెప్పబడుతున్న బహుదేవతారాధకులలో, ఖురాన్‌, బైబిలు అనుసారకులలో కంటే సర్దుబాటు, సహనశీలత మెండు. ఎందుకంటే బహు దేవతారాధన స్వభావంలోనే వెసులుబాటు ఉంది కనుక. ఒక ప్రతిపాదన చేస్తాను, దాని సబబు బేసబబుల్ని ప్టి చూసి నిగ్గు తేల్చండి మూడు మతాల, మతేతరులలోని విజ్ఞులంతా.
రాజ్యాంగం ద్వారా ప్రస్తుతం మన మెంచుకున్నది లౌకిక స్వభావం కల వ్యవస్థను, అందునా తప్పనిసరి (అదీ విధి లేని) పరిస్థితుల్లో మత స్వేచ్చను అన్ని రకాల మత విశ్వాసాలననుసరించే వారికి సమానంగా ప్రాథమిక హక్కుగా అంగీకరించుకున్న రూపంలో. ఇక్కడికిది నిజమో కాదో తేల్చుకొండి. తేల్చుకో లేకుంటే అది నిజమననడానికి ఆధారం ఇదిగో.

Clause -13 :- Rights relating to religion :- All persons are equally entitiled to freedom of conscience, and the right freely to prof ess, practise and propagate religion, subject to public order, Morality or health and to the other proviseous of this part.   రాజ్యాంగ సభలో చర్చలు. 1947 మే (మరిన్ని వివరాలు ఈ వ్యాసంలోనే మరో చోట ఉన్నాయి శ్రద్దగా పరిశీలించండి)

మత విశ్వాసాలను, పరలోక విషయాలను మీ మీ వ్యక్తిగత జీవిత క్షేత్రం వరకు పరిమితం చేసుకుని, వివిధ విశ్వాసులు, విశ్వాసేతరుల ఉమ్మడి కార్యక్రమాల విషయంలో, మీ మీ విశ్వాసాల, విశ్వాసరాహిత్యాల ప్రస్తావనలు లేవనుకోండి అన్న సూత్రాన్ని అంగీకరించగల వెసులుబాటు బహు దైవారాధకుల వైఖరిలో ఉంటుందేగాని, ఇస్లాం క్రైస్తవ విశ్వాసుల వైఖరిలో ఉండడం సాధ్యపడదు. అంటే లౌకిక వాదాన్ని సహించగల, ఆ మేరకు ఎవరి విశ్వాసాలు వారివి అనగల వెసులుబాటు బహుదేవతారాధన నంగీకరించే పక్షంలో మాత్రమే ఉండగలదు. ఈ జఠిలత ఉందికనుకనే, నా ఈ వ్యాసంలో లౌకిక రాజ్యాంగాన్ని విధిగా అంగీకరించండి. అంగీకరించగలరో, లేదో చూసుకోండి, తేల్చుకోండి అని ఒకింత ఎక్కువగా బైబిలు, ఖురాను విశ్వాసులను వత్తిడి చేస్తున్నాను. ఆ పక్షాన్నే ఎత్తి చూపుతున్నాను. కానీ రాజ్యాంగం ప్రకారం అన్ని రకాల విశ్వాసాలకు, విశ్వాసులకూ సమాన దూరంలో ఉండాలన్నదే (సమాన దగ్గరలోకాదు సుమండీ!) లౌకికతకు మనం చెప్పుకోదగిన చెప్పుకుని తీరాల్సిన అసలర్ధం. మేము అంటే సత్యాన్వేషణ మండలి వారం మీ మీ విశ్వాసాల ననుసరించే హక్కు కలిగి ఉన్న వారినిగా మిమ్ములనంగీకరిస్తూనే నిఖార్సయిన లౌకిక వాదులం. మా గురించి మేము చెప్పుకున్న దీనికిమించి దీనిని విడచి మా గురించి ఎవరుగాని, ఇంకేమి పలికినా అది మేము కానిది మా కింంచే కుిల వైఖరేననక తప్పదు.
భారత రాజ్యాంగం ప్రకారం, మత స్వేచ్చంటే :

ఒక ముస్లిం, ఇస్లాం ధర్మం (ఇస్లాంను అనుసరించడం) పేరిట ఏమేమి చేయాలో, చేయకూడదోన్నది ఖురాన్‌ బోధించే మతం అవుతుంది. అలాగే ఇతర మతాలున్నూ. అయితే అన్ని మతాల వారికీ వారి వారి విశ్వాసాలను కొనసాగించుకునే ప్రచారం చేసుకునే హక్కు సమానంగా ఉన్నదన్న రాజ్యాంగం క్రింద ఉండాల్సిన ఏమతస్థునికీ, వారి వారి గ్రంధాలు చెపుతున్నదాన్నంతినీ యథాతథంగా అమలు పరిచే, ఆచరించే స్వేచ్చ ఉండదన్నదే లౌకికవాద రాజ్యాంగం క్రింద మతాలకుండే స్వేచ్ఛ. ఇది అర్థం కాకున్నా, అంగీకరించకున్నా రాజ్యాంగం ప్రకారమే మాకు మత స్వేచ్చ ఉందంటూ, వారి వారి మత గ్రంధాలలోని పోకడనంతనూ సమాజ జీవనంలో ఇమడ్చాలనుకోవడం రాజ్యాంగాతిక్రమణే. రాజ్యాంగం ప్రకారం నిషిద్దకర్మనే, నేరమే అవుతుంది. అదెలాగో సూిగా చెపుతాను పరికించండి.

ఖురాన్‌ అనుసరణలో, అల్లాను విశ్వసించడం, అల్లాను మాత్రమే విశ్వసించడం ఒక ముస్లింకు ఎలా విధిఅవుతుందో అలానే ఇతర విశ్వాసాలను అంగీకరించకపోవడం, అి్టవన్నీ దైవ వ్యతిరేకాలనడం, తిరస్కరించడం అవకాశమున్నంతలో వాిని తొలిగించడం, ఆ విశ్వాసాలలో ఉన్న అల్లా విషయంలో అవిశ్వాసులనబడే వారిని విశ్వాసం వైపుకు మరల్చేలా అవిశ్వాసపు ఖండననూ జోడించి సందేశం వినిపించడం, అన్నవీ ముస్లింకు విధులే అవుతాయి.

అదే మరి భారత రాజ్యాంగం అంగీకరించే మత స్వేచ్చలో, ఆయా మతాలలోని అన్య మతస్ధుల, మతారాధనల నిరసన, ఖండన భాగం ఉండదు. అవి తప్పులని అనే స్వేచ్చ ఉండదీ హక్కు స్వభావంలో పరమతాలను నిందించడం, ఖండించడం, వారి వారి ఆరాధనా స్థానాలను నిర్మూలించాలనడం నిర్మూలించడం వగైరా ఆయా మతాలు చెప్పేవన్నీ నిషిద్దాలే రాజ్యాంగం కల్పిస్తున్న మత స్వేచ్చ ప్రకారం. అర్ధమవుతోందా మిత్రులారా! ఖురాన్‌ ప్రకారం అల్లాను స్వీకరించడం - ఇతరులను తృణీకరించడం, ఆక్రమాన్ని స్థాపించడం కలిపే ఇస్లాం అవుతుంది. అదే మరి భారత రాజ్యాంగం అంగీకరించిన మత స్వేచ్చలో అల్లాను విశ్వసించడం, ఆరాధించడం, అల్లా దేవుడని ప్రచారం చేసుకోవడం వరకే ఉంటుంది. బహు దేవతారాదకులకు ఆ విశ్వాసాలను ఏర్పరచుకోడానికీ, వాిని ఆరాధించడానికీ, ప్రచారం చేసుకొడానికీ తమతో పాటు సమాన హక్కు ఉందని అంగీకరించడం కూడా తప్పనిసరి అవుతుంది. భారత రాజ్యాంగానికి లోబడి లేని ముస్లిం ఆచరణకు, భారత రాజ్యాంగానికి లోబడిన ముస్లిం ఆచరణకు ఇంత తేడా ఉంది. పరమత విశ్వాసాలను ఖండించే మత స్వేచ్చలేదు. ఉండదు. ఏ మతస్థునికున్నీ.

కనుకనే మనం అంటే భారత రాజ్యాంగాన్నంగీకరించిన, భారత రాజ్యాంగం క్రింద మనుగడ సాగిస్తున్న వారందరం, ఎవరి మతాలను వారనుసరించడం అన్నదిు. ఇతర మత విశ్వాసాలను ఉండనివ్వడం, ఆచరించుకోనిస్తుండడం, వారందరికీ రాజ్యాంగం ప్రకారం వారి వారి మతాలననుసరించే స్వేచ్ఛకు సంబంధించిన హక్కు సమానంగా ఉందని అంగీకరించడం, ఒక భారత పౌరునిగా ఇతరుల హక్కులను కాపాడే బాధ్యతను తానూ స్వీకరించడం అన్న వైఖరిని వైఖరినే అనుసరించి తీరాల్సి ఉంటుంది. ఈ విషయాన్నే లౌకికవాద స్వరూప స్వభావాలనెరిగిన మనం ''భారతీయ ముస్లిం, భారతీయక్రైస్తవుడు, భారతీయ హైందవుడు, భారతీయ నాస్తికుడు అన్నవారికే ఈ దేశంలో ఉండే హక్కు ఉంటుంది. అనంటున్నాం. అలా ఉండలేకపోయినా, ఉండడం ఇష్టం లేకపోయినా ఈ దేశం వదిలి వెళ్ళిపోవచ్చు. వేరుగా - అంటే రాజ్యాంగ విరుద్దంగా ప్రవర్తిస్తే అది శిక్షార్హమైన నేరం అవుతుంది కూడా. ప్రభుత్వమూ, నియంత్రణ వ్యవస్థా సరిగా ప్టించుకోవడం లేదు గానీ, పరమత స్వేచ్చను అంగీకరించకపోవడం, నిరసించడం, ఖండించడం, దూషించడం, కచ్చితంగా రాజ్యాంగ విరుద్దమే అవుతుంది.

ఈ సూత్రం, ప్రతి మతస్థునికీ సమానంగా వర్తిస్తుంది. మతేతరులకూ ముఖ్యంగా నాస్తికులకూ వర్తిస్తుంది. అదేలాగంటే,

ఎలా, ఒక మతానికి చెందిన ఆస్తికునికి, ఆ మతంలోని పరమత నిరసన, ప్రతికూల భావాలను మినహాయించిన, మత స్వేచ్చ ఉంటుందంటున్నామో అలాగే నాస్తికునికీ, దేవుడు లేడు అన్న తన విశ్వాసాన్ని ప్రకించుకునే, ఆచరించుకునే, ప్రచారం చేసుకునే హక్కు ఉందే గాని, ఫలాన మత విశ్వాసం తప్పుడుది. ఫలాని దేవుడు తప్పుోడు అంటూ పరమత విశ్వాసుల స్వేచ్చ హక్కు క్షేత్రాలను కదిలించడం, విదిలించడం చేసే హక్కు ఉండదు. ఇక్కడ రాజ్యాంగాన్ని మరికొంత ప్టిచూడాలి.

మత విశ్వాస స్వేచ్చను ప్రాథమిక హక్కుగా అంగీకరించామంటేనే, దాని తప్పొప్పుల విషయంలోనూ, దాని శాస్త్రీయత, హేతుబద్దతల విషయంలోనూ రాజ్యం - రాజ్యాంగం - వేలెట్టదు. ఇతరులూ తలదూర్చకూడదు. తలదూర్చితే రాజ్యం ''ఊరుకోదు'', ఊరుకోకూడదు అని కూడా అర్థం.

నిజానికీ హక్కు కల్పించడం ఎలాి అనివార్య పరిస్థితుల్లో జరిగిందోకాని, జ్ఞానక్షేత్రానికి సంబంధించి కానీ, సత్యా సత్య విచారణకు సంబంధించి కానీ, శాస్త్రీయ విచారణ పద్దతికి సంబంధించిగానీ, వివేకవంతమైన సమాజం ఎలానడవాలో అలా నడవడానికి వీల్లేని స్వభావాన్ని కలిగి ఉందిది. ఒక వంక, ప్రాథమిక విధుల క్రింద, 51 ఎ/హెచ్‌ అధికరణం ద్వారా, శాస్త్రీయ పోకడకు సంబంధించిన బిగితనం (సౖిెంఫిక్‌ టెంపర్‌) నూ, శోధనాతత్వాన్ని (స్పిర్‌ి ఆఫ్‌   ఎంక్వైరీ) మానవ వాదాన్ని (హ్యూమనిజం) సంస్కరణాభిలాషను, (రిఫార్మేషన్‌ యాిట్యూడ్‌) అన్న నాల్గింనీ అలవరచుకోవడం, అభివృద్ధి పరచుకోవడం ప్రతిపౌరుని ప్రాథమిక విధి అంటూ చెప్పుకుని, ఎన్నెన్నో అశాస్త్రీయాంశాలతోనూ, కొన్నింట మూఢనమ్మకాలనడానికి తగినవిగానూ, పరస్పరం శతృత్వాలనూ రేకెత్తించే భావాలతోనూ కూడుకుని ఉన్న వివిధ మత విశ్వాసాలను ఈ 51 ఎ/హెచ్‌ పరిధికి ఆవలిగ ఉండేలా చూడడాన్ని ఏమనుకోగలం? ఎంత శోచనీయమైన దురవస్ద ఇది? ఏమతం చెప్పిన పరలోకాంశాలుగానీ, మరణానంతర జీవితం గానీ, సృష్టి క్రమం విషయాలు గానీ సృష్టికి కర్తుృత్వం వహించే నిమిత్త కారణుని విషయంగానీ ఏ పక్షం వాడికీ తెలిసున్న విషయాలు కావనీ, తేల్చుకోదగినవీ, తేల్చుకోగలిగినవీ కూడా కాదనీ, కేవలం ఎవరి విశ్వాసాలు వారివేననీ తెలుస్తూనే ఉన్నా, ఏమనలేని పరిస్థితికితోడు, వాటన్నింనీ సత్యాలేనంటూ ప్రచారం చేసుకునే స్వేచ్చను ప్రాథమిక హక్కుగా కల్పిండాన్నేమనుకోవాలి? ఆ హక్కు ద్వారా, భావితరంగా పుట్టుకొస్తున్న పసివాళ్ళందరికీ, చిన్ననాి నుండి ఆయా విశ్వాసాలను వంటబ్టించే అవకాశాన్నివ్వడాన్ని ఏమనుకోవాలి? అదలాఉంచి, ఈ లోకంలో పరీక్షించి నిర్ధారించుకోగలిగిన అంశాలవరకైనా, ఉదాహరణకు, ప్రకృతిని గురించి, ప్రాణుల గురించి, ప్రాణుల శరీరాలగురించి సమాజ స్థితి గతుల గురించీ తెలుసుకోగలిగిన అంశాలవరకైనా నిగ్గు తేలిన అంశాలనే స్వీకరించాలి, ప్రకించాలి. వీికి వేరుగా ఉన్న మత గ్రంథాలలోని భావాలను ప్రకించకూడదు అన్నంతవరకైనా శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజల్లో ప్రవేశపెట్టకుంటే, ఇక ఆ ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందు పరచుకోవడం వల్ల ప్రయోజనమేముంది. గోడ మీది పులిబొమ్మలాింవే కదా అి్టవన్నీ

ఈ విషయంలో ఒకనాి పరిస్థితి ఎలా ఉందనుకున్నా, ఈ నాికైనా సరైన దిశా నిర్ధేశం చేయగల సూత్రీకరణలను విద్యా విధానంలో వరకైనా పొందుపరచుకోవడం ద్వారా భావితరం అంధ ప్రాయపు విశ్వాసాలనుండి జ్ఞాన ప్రకాశంలోకి పయనించేలా జాగ్రత్తలు తీసుకోడం అవసరం. తక్షణావసరం. ఇది గాని జరక్కుంటే జరిగేది చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం విందే అవుతుంది.

మత విశ్వాసాల పునాదిపై రాజ్యాలు ఏర్పడడమన్న ఊహే భయాన్ని కలిగిస్తోంది. ఇక అి్టది గాని, ఆకృతి దాల్చితే (ఏర్పడితే) అక్కడ జరిగేది ఒక భయానక ఘటనల ప్రవాహమే. అి్ట రాజ్యంలో (1) ఆవిశ్వాశాన్నంగీకరించని వాణ్ణి, జాలిదలిస్తే బానిసగా ఉండనిస్తారు. లేదా ముస్లింగా మార్చివేస్తారు. అదీ కాకుంటే హతమారుస్తారు. అదీ కొద్ది కాలమే, చివరకు క్రమంగా ముస్లింలు మాత్రమే మిగిలే దిశగా ఆ నడక సాగుతుంటుంది. ఇటు హైందవాన్ని గానీ, అటు క్రైస్తవాన్ని గాని ప్రస్పుటంగా ప్రస్తావించకుండా, ఇస్లాం పై గురి పోరెందుకు? అని అనిపించడం లేదా?

పి.డి. సుందర్రావు చీరాల బండారమా? బంగారమా?
ఒక ముఖ్య ప్రకటన :-
వివేక పథం 140 సంచిక మార్చి 2008లో అప్పికి జరిగినదాన్ననుసరించి (1) ఎస్‌. ఎబినేజర్‌ గారినీ (2) పి.డి.సుందర్రావుగారినీ ఉద్దేశిస్తూ; రండి నిరూపణకై కూర్చుని మ్లాడుకుందాం. అన్న ప్రకటన చేశాను. అనంతరం 2012లో మొదల్టెి దాదాపు సం||పైగా పి.డి.సుందర్రావు గారి వెంటబడ్డాను. ఆయనింకీ వెళ్ళాను. మనిషినీ పంపాను ఇంతకూ విషయమేమి? కూర్చుని మ్లాడుకుందాం లేదా నీవంటున్నది తప్పోవప్పో తేల్చుకుందాం రమ్మనికిమన్నాస్తిగా ఊరుకున్నారప్పుడు. ఆ క్రమంలో ఎన్‌.వి. బ్రహ్మంగారిని ఏదో పొడి చేశానంటూ అబద్దపు రాతలు మాటలు (కూతలనాలేమో) వెలువరించగా, ఎస్‌.వి. బ్రహ్మంగారి నుండి లేఖనొకి వ్రాయించి దానినీ సుందర్రావుగారికి పంపాను. ఆ లేఖలో నా తరఫున సురేంద్ర మ్లాడతాడు. అతడు ఓడితే నేను ఓడినట్లేనన్న ప్రకటనుంది. ఆ వివరాలూ వివేక పథంలో ప్రచురించాను. వాటన్నింనీ ప్రక్కన్టెి ఈ మధ్య చీరాలలో 'బండారమా? బంగారమా?' అన్న పేరున ఒక సంత సభ, సొంతమందసభ ప్టిె, తెగ బొబ్బల్టెినట్లు విన్నాను.
మొది నుండీ పి.డి.సుందర్రావుగారు, ఆయన కూటమి అనుసరిస్తున్న పనికిమాలిన విధానమిదే. ఆ విషయాన్ని తెలుపుతూ, గతంలో ఆయన పై నేను రాసిన వ్యాసాల్లో ఇంతకూ నీయీ ప్రగల్బాల, చాలెంజల పర్వంలో, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ ఒక్కరితోనైనా సంభాషణలు, చర్చలు, సూిగా పోీలు జరిగిన దాఖలాలుంటే చూపమని అడగాను. అలాింది ఒక్కటంటే ఒక్కీలేని ఈయన జయశాలిని, జగత్తును ఓడించును అని ప్రకించుకుంటే, అి్ట మాటలు పిట్టల దొరలనే వ్టి మాటలకంటే ఎక్కువేముంటుంది విలువ?!
సిద్దాంత చర్చలుగానీ, ఏదైనా విషయంపై సత్యాసత్య విచారణ సాగించడంగానీ, ఎటువిం వాతావరణంలో, ఎటువిం వారి మధ్య, ఏ పద్దతిననుసరించి జరగాల్సి ఉంటుందోనన్న వివేకంగానీ, మార్కెట్లలో, సంతల్లో, ఎవడీకీ అంతగా పట్టని సమూహాలలో మ్లాడనేకూడదన్న ఇంగితంగానీ ఆయన గారికేగాక, ఆయన గుంపులో ఎవరికిగానీ లేదన్నది 100% నిజం. ఏది సత్యమో? ఏది అసత్యమో తేల్చుకోడానికి, చౌరస్తాలలో సంతలాిం బహిరంగ సభల రూపంలో జరుపుకునే రచ్చలు అస్సలు పనికిరావనీ, ఎటువిం ఆవేశకావేషాలు, ఒంటెత్తుపోకడలు, నినాదాల హోరులు, వందిమాగధుల వంతపాటలూ లేని, వీలైనంత నిశబ్దంగా ఉండే, అర్హులు, అంటే సమర్థులూ, నిస్పాక్షీకులు - విశేషజ్ఞులు అనదగ్గ కొద్దిమందితో కూడిన విచారణ వేదికలు మాత్రమే అందుకు తగి ఉంాయన్న జ్ఞానం లేని వారే అలాి కేకలు పెడబొబ్బల ప్రహసనాలను నిర్వహించుకుంటుాంరని విషయ ప్రాధాన్యతను గుర్తించగల విజ్ఞుల కెవరికైనా ఇట్టే తేలిపోతుంది. ఆ ఆర్భాల, అనవసరపు ప్రాగల్భ్యాల గొడవలనలా ఉంచుదాం.
ఈ మధ్య అద్దంకి రంజిత్‌ ఓఫిర్‌ అన్నాయనా! భారతీయులందరకూ, అందలి మత సంస్ధలందరకూ సవాలంటూ 'హైందవ క్రైస్తవం' పుస్తకంలో దోషాలుంటే చూపండంటూ ప్రకించారు. నిజాయితీనిబ్టీ, చేసుకున్న ఛాలెంజీలను బ్టి, పి.డి. సుందర్రావుగారూ, రంజిత్‌ ఓఫెర్‌గారూ పరస్పరం నీవు సాతాను ప్రతినిధివంటే నీవు సాతాను ప్రతినిధివంటూనూ, నీకు బైబిల్‌ అర్దం కాలేదంటే నీకు అర్ధంకాలేదంటూనూ బహిరంగ ప్రకటనలు అటు ప్రసంగాల రూపంలో, ఇటు రాత పూర్వకమైన, ఆడియో, వీడియో రికార్డుల పూర్వకమైన రీతిలో చేసుకున్నారు. కానీ అదేం విడ్డూరమో ఏండ్ల కేండ్లు గడుస్తున్నా, అప్పుడప్పుడూ ఇరువురూ ఒకే ప్రాంతంలో ప్రచారాలు చేసుకునే నిమిత్తం వచ్చి ఉన్నా, ఒక్క సారంటే ఒక్కసారి, ఆయనో, ఈయనో రెండో ఆయనింకి వెళ్ళి, వెంట మీడియానూ పట్టుకెళ్ళి రా తేల్చుకుందాం, నీవు సాతాను మనిషివో, నేనోనని అన్న పాపానపోలా
మాటల యుద్దంలో ఇద్దరూ ఉద్దండులే, కత్తులే ఒకడు రంపపు కత్తి, చప్పుడెక్కువ. మరొకరు మెత్తనికత్తి చప్పుడుతక్కువ. అంతేగాని మాటల యుద్దంలో ఇద్దరూ వారికి వారే సాి. పి.డి సుందర్రావుగారు తనను తాను జయశాలినని చెప్పుకుంటుండగా, ఓఫెర్‌ గారాయనను ఏడ జయశాలివి. నీవు జయశాలివికావు. నిజానికి భయశాలివి. అనేస్తారు. దానికి ప్రతిగా నాకేనా అనడం చేతకానిది? అన్నట్లు, ఓఫిర్‌ కాదాయన, 'ఓఫియర్‌' వి అంాడీయన. గొప్ప హస్యోక్తులేకదా అవి! వారి ప్రవర్తనను బ్టి చూస్తే మాత్రం వారిరువురూ ఒకర్ని గురించి ఒకరు సరిగనే అర్ధం చేసుకున్నారనీ, ఆ రెండు అభిప్రాయాలు సత్యాలేనని, అనుకోవాలనిపిస్తుంది నాలాి (మనలాి) వాళ్ళకూ. ఇద్దరూ నిండుకున్న ధైర్యస్ధులేనన్నది నిజమేనేమోననిపిస్తుంటుంది నావరకు నాకు వారిరువురికీ ఈ ముఖంగా నా పిలుపేమిటంటే,
పి.డి. సుందర్రావుగారికి (1) 'బైబిలేపలుకుతోంది' అన్న రచనాధారంగా ఎన్‌.వి. బ్రహ్మంగారి ప్రతినిధిగా నేను పాల్గొాంను. బైబిలు బండారమా బంగారమా? అన్న మీరు మీరు మాత్రమే నాతో వాదానికి కూర్చొవాలి. చర్చకు అవసరమైన ప్రాతిపదికల నేర్పరచుకుని చర్చించుదాం. అనవసరపు ఆర్భాలనాపండి మీరూ నేను - పరిశీలకులుగా కొద్దిమంది అంతే.
2) రంజిత్‌ ఓఫిర్‌ గారితో చర్చకు కూర్చుాంనంటే, రాగద్వేషాలను విడచి, నిర్వాహక బాధ్యత తీసుకునివేదికను ఏర్పాటు చేస్తాం, ఆయనా అంగీకరిస్తే.
3) 'హైందవ క్రైస్తవం' మీరూ చూసి ఉంటే, నిజంగా దానిలో ఆయన చెప్పింది మీరూ సరికాదనుకుంటుంటే, ఆ విషయం పై సత్యం తెలిసినవానిగా, త్వరలో ఆయనతో మేం జరపబోయే వేదికలో మీరూ పాలు పంచుకోండి.
ఇతర మత గ్రంథాల్లో క్రీస్తున్నాడు, మహమ్మదున్నాడు లాి పోకడలన్నీ పెడపోకడలు, కుిల పన్నాగాలూనేనని మా పక్షం. ఖచ్చితంగా అది పులుముడు వ్యవహారం - అబద్దపు ప్రచారం మాత్రమే.
ఇదీ ఇక్కడెందుకు రాస్తున్నానంటే, మీ ప్రకటనల్లో, ప్రసంగాలలో మీ గ్రంధాలజోలికి మేమురాం, మా గ్రంధాలజోలికి మీరు రాకండి. అన్నంత వరకు మీ పక్షంలో నిజాయితీ ఉంది కనుక, ఆచరణలో దానిని చూపగలరేమో చూద్దాం అనే
సాధారణ ప్రకటన
మా దేవుణ్ణి గురించి చెప్పడానికీ, రుజువు చూపడానికీ, ఇతర మత గ్రంథాల సాయం మాకక్కరలేదు అనిగానీ, అసలలా ఇతర గ్రంధాలను అరువు తెచ్చుకోవడం సరికాదనిగానీ అనుకునే వైఖరి కల క్రైస్తవ, ఇస్లాంబోధకులకు, ప్రచార సంస్థలకు, నిజమైన విశ్వాసులకు మీ మతాల్లోనే ఉంటూ ఇతర గ్రంథాలను నెత్తికెత్తుకున్న ప్రచారకులను (1) తప్పు బట్టండి (2) తిరస్కరించండి (3) ఎదిరించండి ఇది విశ్వాసానికి సంబంధించిన నిజాయితీ.
(2) అద్దంకి రంజిత్‌ ఓఫిర్‌ గారికి :
అయ్యా మీరు నిరంతర సత్యాన్వేషిని అన్న విశేషణాన్ని చేర్చుకుని మీ పేరును రాస్తున్నారు. సంతకం చేస్తున్నారు. ఆ భరోసాతోనే ఇదిగో ఈ రెండో లేఖ (గత నెలలో వ్రాసింది 1వ లేఖ అనుకుందాం) వ్రాస్తున్నాను. ఉచితంగా స్పందించండి.
గత మాసం 14-7-2015 న 'హైందవ క్రైస్తవం' పై మీ సవాలు ప్రకటనను స్వీకరిస్తున్నాననీ, ఆ విషయంపై మ్లాడుకొడానికి, కావలసిన అంశాలు మ్లాడుకోవడానికి వీలుగా మీ నుంచి సమాధానాన్ని ఆశిస్తున్నానని తెలుపుతూ, ఒక రిజిష్టర్‌ లెటర్‌ పంపాను. ఆ నా లేఖ అందిందని మీ బృందంలోని (1) జగదీష్‌ - నల్గొండ జిల్లా (2) బాలయ్య - తూ.గో.జిల్లా మిత్రుల ద్వారా నాకు తెలిసింది. సమాధానం వ్రాయనున్నారనీ తెలిసింది. కానీ ఇంత వరకు అంటే ఈ వాక్యాలు రాస్తున్న నాికి 12.8.2015 మధ్యాహ్నాం సమయం వరకు మీ ప్రత్యుత్తరం నాకు అందలేదు. నిదానంగా రాద్దామనుకోడం వల్లనో పోస్టు వారి ద్వారా ఆలస్యమో నాకు తెలియదు.
ఈ నా రెండోలేఖ ద్వారా ఆ మీ చాలెంజి ప్రకటనలోని మరో అంశానికి సంబంధించిన వివరాలూ పంపవలసిందిగా కోరుతున్నాను.
(1) 'హైందవ క్రైస్తవం' పుస్తకాన్ని 600 మంది స్వాములకు (సాధు, సన్యాసులకు) పంపానన్నారు.
(2) పలు ి.విల ద్వారా బహిరంగ చర్చకు పిలుపిచ్చానన్నారు.
(3) పూజారులు, పోలీసులకూ దీనిని పంపానన్నారు.
ఈ మూడంశాలకు చెందిన పూర్తి సమాచారాన్ని వ్రాతరూపంలో నాకు పంపించమని కోరుతున్నాను. (600 మంది పేర్లు వీలుంటే చిరునామాలు ి.విల వారి వివరాలు, 3వ అంశంలోని వారి వివరాలు)
సత్యాన్వేషణలో - మీ సురేంద్ర                
యోచనాశీలురైన మిత్రులారా !
ఎంతో దూరదృష్టితోనూ అప్పికున్న, వాస్తవ మరియు అనివార్య పరిస్థితులాధారంగానూ రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్చ, ఆరాధనా స్వేచ్చ, మత ప్రచార స్వేచ్చ అన్నవాిని, రాజ్యాంగ హృదయం ప్రకారం వ్యక్తిగతమైనవిగా పరిగణించాలన్న వివేకాన్ని కోల్పోయింది సమాజం. అంతరాత్మ అభిమతాన్ననుసరించి అన్న స్పష్టమైన వివరణతో పాటు మరోకరిని మతం మార్చుకునేలా ఒప్పించడమూ, నచ్చజెప్పడమూ అన్నవాిని బుద్ది పూర్వకంగాగానీ, మరేదో ప్రయోజనాల నాశించిగాని చేయకూడదన్న దిశానిర్ధేశమూ సూచన మాత్రంగా చేసింది రాజ్యాంగం. అలాగే ఒక మతంలో ఉన్నవానిని, ఆవృతం విడిచేలాగానీ, మరో మతం స్వీకరించేలాగానీ, ఏ రకమైన ప్రలోభాలకులోను చేసినా, లోనయ్యేలా ప్రభావితం చేసినా, అది అంతరాత్మ అభిమతాన్ననుసరించి అన్నదానికి అనుగుణ్యమైనది కాదు కాలేదు అన్న నిజాన్ని తెలిపేందుకే, రాజ్యాంగంలో ఈ అధికరణాన్ని రూపొందిచే సందర్భంలో విశేష విచారణ (చర్చ) జరిపి, నిర్దిష్టరూపంలో తీర్మానాలు చేశారు. కొద్దిగా నిదానంగా, మరింత శ్రద్ధగా ఈ విషయలను ప్టించుకోండి. ఈ విషయంపై మరిన్ని వివరాలకు, ముసాయిదా రాజ్యాంగంపై చర్చలు వ్పుళిదీరీశిరిశితిలిదీశి జురీరీలిళీలీజిగి ఈలిలీబిశిలిరీవ అన్న దానిలో 1 మే 1947 నాడు రాజ్యాంగ నిర్మాణ సభలో జరిగిన పరిశీలనను చూడండి. అంతర్జాలంలోనూ ఉంది గ్రంథాలూ ఉన్నౖే.
Clause - 13 - Rights relating to Religion =°మత స్వేచ్చా హక్కులు
All persons are equally entitiled to freedom of conscience, and the right freely to profess, practise and propagate religion, subject to public order, morality or health and to the other proceisions of this part. వ్యక్తులందరూ వారి ఇష్టాన్ననుసరించి (అంతరాత్మ అభిమతాన్ననుసరించి) స్వేచ్ఛగా తన మతాన్ని గురించి ప్రకించడానికీ దానిననుసరించి నడచుకొనడానికీ, ప్రచారం చేసుకోడానికీ సామాజిక క్రమత, (శాంతి, భద్రతలు), నైతికత, స్వస్ధత మరియు ఈ భాగంలోని మిగిలిన పరిమితులకు లోబడి సమానంగా హక్కు కలిగింపబడ్డారు.
Explanation :- 3. The freedom of religious proctice guaranted in this clause shall not debar the state enacting laws for the purpose of social walfare and reform
వివరణ :- అయితే, ఈ స్వేచ్చా హక్కు, ప్రజా సంక్షేమము, సంస్కరణల నుద్దేశించి ప్రభుత్వం అవసరమైన చ్టాలు చేయడాన్ని తొలగించలేదు. బహిష్కరించలేదు.
ఒక వ్యక్తి ఒక మతంలో ఉండడం గానీ, మరో మతాన్ని స్వీకరించడం గాని సంపూర్ణంగా తన వ్యక్తిగత అభీష్టం మేరనే జరిగిందా? అతనిపై అన్య ప్రభావాలు పడ్డాయా అన్నది ప్రతిసారీ నిర్ణయించడం దాదాపు అసాధ్యమన్నంత కష్ట సాధ్యమైన పని- ఎందుకంటే ఏదో ఒక ప్రయోజనం చేకూరడం, అవసరం తీరడం అన్న అంశాన్ని బ్టి ప్రభావితుడయ్యే మతం స్వీకరించినప్పికీ, విచారణలో నా ఇష్ట ప్రకారమే ఈ పని చేశాను అన్నాడనుకోండి. న్యాయ నిర్ణయం చేసే స్ధానాలలో ఉన్నవాళ్ళు చేయగలిగిందేమీ ఉండదుకదా. ఒక వంక నిజ జీవితంలో రకరకాల ప్రలోభాలు కలిగిస్తూ ప్రయోజనాలు చేకూరుస్తూ, ఆశా, భయాలనూ రేకెత్తిస్తూ, అతని సామాజిక ఇష్టాయిష్టాలనూ తృప్తిపరుస్తూ, ఇలా రకరకాలుగా మత మార్పిడులు జరుగుతుండడం నిత్యం గనమిస్తూనే ఉన్నా, అి్ట వాిని చట్టం న్యాయ సమ్మతమైనవిగా స్వీకరించదు అన్న నిబంధన గురించి తెలిసి ఉన్నాం న్యాయాలయాలలో పిర్యాదు చేసి, అి్ట బలవంతపు మార్పిడి జరిగిందని నిర్ధారించడం సాధ్యపడదు. ఎందుకని మతం మార్చకున్న వాడు నా యిష్ట ప్రకారమే మారాను అనే చెప్పతాడు లేదా వాని చేత అలా చెప్పిస్తారు కనుక, అంతేగాక అందుకవసరమైన మరింత సాక్ష్యమూ సమకూర్చుకుాంరుగనుక అందుకనే ఈ విషయంలో మన రాజ్యాంగ నిర్మాతలు తెగతర్జన భర్జన పడి 17వ క్లాజును నిర్దిష్ట రూపంలో ఉన్న సందేహాలకు పరిష్కారమివ్వగల రూపంలో సూత్రీకరించడం అసాధ్యమని నిర్ణయానికి వచ్చారు. సామాజక దృక్పధం, రాజ్యాంగాంశాలకు అను గుణ్యత కలిగి ఉండడం, నైతిక విలువలు కలిగి ఉండడం, పారధర్మన్నెరిగి ఉండడం, ఎటువిం ఎత్తుగడలకు తావులేకుండా చూసుకోవడం లాి మార్గదర్శకాలనెన్నో మన దృష్టి ముందుంచారు. ముఖ్యంగా క్లాజు 13 లోని వివరణలు మూడూ చాలా కీలకమైనవి. 13వ సూత్రీకరణ, మత ప్రచారం వెనుక తీజీబితిఖి, రిళీళీళిజీబిజిరిశిగి, బీళిలిజీరిబీలిదీ అన్న మూడూ ఉండకూడదని స్పష్టంగా ప్రకించారు. ఎదుివాణ్ణి మతం మార్గాలన్న పన్నాగం (అది అతని మేలునుద్దేశించే చేసినా) తీజీబితిఖి క్రిందికేవస్తుంది. ప్రచారమంటే ఆ మత భావాలను వెళ్ళడించడమనే అర్ధమేగానీ, అతనిని రాబట్టుకోవాలనిగానీ, ఆకర్షించాలనిగానీ అనుకోవడం పన్నాగం అనైతికం, బలవంతం అన్నవాిలో ఏదో ఒక అంశాన్ని కలిగే ఉంటుందది.
అలాగే, ఆ మత గ్రంథం అన్యమతస్థుల పట్ల ఎలా ఉండాలని చెపుతుందో, అన్య మతాల గురించి ఏమని చెపుతుందో, దాన్నంతిని యథాతథంగా ప్రచారం చేయాలేగాని, ఈనాి సమాజం అంగీకరించని భాగాలందులో ఎన్నో ఉన్నా వాిని మరుగుపరచి, ఒకీ అరా మంచి మాటలను మాత్రం పెద్దవి చేసి విపరీతంగా ప్రచారం చేయడం వెనకా నైతికత లేదనే అనాల్సి ఉంటుంది.
ఆయా మత గ్రంథాల్లో స్పష్టంగా ప్రకింపబడ్డ, కౄరకర్మలను, అనైతిక పోకడలను, అజ్ఞాన విషయాలను, అమానుషాలను చెప్పకపోవడాన్నేమనాలి?
ఆ గ్రంథాలలో దేవుడు చేసిన పనులుగానూ, చేయించినవిగానూ ఉన్న వివరాలను దాచడం ఎందుకు?
మార్మికంగానూ, ఉపమాన రీతిగాను వ్రాయబడ్డ వాికి, ఈనాి ప్రచారకులు ఎవరికి తోచిన అర్ధాలు వారు చెప్పుకుంటూ అమాయక జనాన్ని గొర్రెలను తోలుకెళ్ళినట్లు తోలుకెళడాన్నేమనాలి.
ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కొత్త పన్నాగంగా వస్తున్న ప్రచారపు ఎత్తుగడల్లో, మీ గ్రంధాలలో మా క్రీస్తు, మా మహమ్మదు, అంటూ వస్తున్న రచనలు, చేస్తున్న ప్రసంగాలు దుర్మార్గపూరితమైనవి. పూర్తిగా అసత్యాలు మాత్రమే.
ఏ మాత్రం నీతీ, నిజాయితీ ఉన్నా ఒక రకంగా చెప్పాలంటే, వారంగీకరించి విశ్వాసం ప్రకారమే దైవభీతి ఉన్నా, సత్యాన్వేషణమండలి ఆరకంవారినందరినీ ఈ ముఖంగా విచారణకు సిద్దం కమ్మని ఆహ్వానిస్తోంది. మీరన్నవి ఉన్నవేనని నిరూపించడానికి సిద్దకండి. ఆ రకం వారివి ఇప్పికివిగో ఈ రచయితల పుస్తకాలు నాకందాయి.
1. అద్దంకి రంజిత్‌ ఓఫిర్‌గారు ఓఫిర్‌ మినిస్ట్రీస్‌ కె.పి.హెచ్‌.బి.కాలనీ కూక్‌పల్లి, హైదరాబాద్‌, 040 - 23058536
2) సత్య సందేశ కేంద్రం - బృందాలు, సుందర్‌ ప్లాజా 1వ ఫ్లోర్‌, మెయిన్‌ రోడ్డు , కాకినాడ తూ.గో.జిల్లా. సెల్‌ : 9848516362
3) గుండాబత్తిన దేవదానం, విశాఖపట్నం
4) కణిత అబ్రహం సి.ఒ.ఎం. చర్చి, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా సెల్‌ : 9440395318
5) పరవస్తు సూర్యనారాయణ, హైదరాబాద్‌
6. సి.హెచ్‌. ప్రాన్సిస్‌, వేటపాలెం (వీరు మరణించారు)
ఇప్పికి నా పక్షం - ఇవన్నీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమైన పోకడలే. ఈ రకమైన ధోరణుల వారందరినీ సత్యాన్వేషణ మండలి, నిజనిర్ధారణకు సిద్దంకండని ఆహ్వానిస్తోంది.
పై పేర్కొన్న వారందరకూ ఈ సంచిక 218 వివేక పథం పంపుతాము

సత్యాన్వేషణలో
మీ సురేంద్ర

No comments:

Post a Comment