నెలలో ఒక కొలిక్కి వచ్చిన ''అవిశ్వాసులపట్ల ఖురాన్ వైఖరి'' తన వైపు నుండి అన్నమాటకు కట్టుబడి ఉచితంగా స్పందించి ఇస్లాంను విడిచి బైటికి రావలసి ఉన్న ఫజులూర్ రహ్మన్‌గారు ఆ పని చేయకపోగా, ఆనాడు ఆయనను మిత్ర దృష్టితో చూస్తుండడం వల్లా, మండలికున్న; ఒక విషయంపై శాస్త్రీయ పరిశీలన పూర్తయ్యాకనూ దానిని మరొకసారి పరిశీలించుదామని ఎవరడిగినా అక్కడరలేదనకుండా పరిశీలనకు సిద్దపడడమన్నది శాస్త్రీయ దృక్పధం కలవాళ్ళు, శాస్త్రీయ పద్దతిని నెరిగినవాళ్ళు అనుసరించిన విధానం అన్న నియమం వలన, మీరు కావాలంటే మరో సారి పరిశీలించుకోడానికి నేను సిద్దం. కానీ ఈ సమావేశంలో నేను చూపవలసినవి చూపాను. నేను చూపిన మూడు సందర్భాలూ మూడు రకాల అవిశ్వాసాలకు చెంది, అవిశ్వాస కారణంగానే వధించడం జరిగినవే. అవిశ్వాసులలో రకాలు వాళ్ళుంటారని ఆనాడూ నేను చెప్పాను. ఆ సమావేశంలో ఉన్న రహ్మన్‌గారూ, ఇతరులు కూడా దానినంగీకరించారు. వారంతా మరోసారి సరిచూసుకోడానికీ, పాఠకులూ ఆలోచించడానికి వీలుగా వాటినిక్కడ వ్రాస్తున్నాను.
1. పుట్టుకనుండీ విగ్రహారాధకుల, అన్యదేవతారాధకులుగ ఉన్న, అల్లా పై విశ్వాసంలేని అవిశ్వాసులు, బహు దైవారాధకులు, విగ్రహారాధకులేకాక దీని క్రిందికి ఖురానును అంగీకరించని యూదులూ, క్రైస్తవులూ కూడా వస్తారు.
2. ముస్లింలుగానే పుట్టి అప్పటి వరకు ముస్లింలుగా ఉండి, ఖురాను దేవుణ్ణి కాదని, ఇతర దైవారాధనల - విశ్వాసాల వైపు మళ్ళినవారు.
మూసా దైవాజ్ఞలకోసం కొండ మీదకు వెళ్ళినప్పుడు, అతని జాతి ప్రజలలోనే కొందరు ఆవు దూడ విగ్రహాన్ని చేయించుకుని అల్లాను విడచి దానిని ఆరాధించడం మొదలెట్టినవారు అంటే ఇస్లాంను విడచి అన్య విశ్వాసంలోకి మరలిన ఖురాన్ అవిశ్వాసులు.
3. అప్పటి వరకు ఇతర విశ్వాసాలననుసరిస్తున్న వారిలో నుండి ఏకారణాల వల్ల గానీ ఇస్లాంను స్వీకరించి, ఆ తర్వాత తిరిగి అల్లాను విడచి ఇతర మార్గాల పట్టిన అవిశ్వాసులు.
నేనానాడు బుఖారి ద్వారా చూపించినవారూ ఈనాటి వసంతరావు (ఉరఫ్ వహీద్) గారిలాటి వాళ్ళూ ఈ రకానికి చెందిన - ఇస్లాంలోకి వెళ్ళి తిరిగి వెనక్కువచ్చిన, మరో విశ్వాసంలోకి మరలిన అవిశ్వాసులు.
4. ఇక విశ్వాసుల ఇంటనే పుట్టినా భవిష్యత్తులో అవిశ్వాసిగా మారి విశ్వాసులను వేధిస్తాడేమోనని అనుమానం, భయం కలగడం వల్ల విశ్వాసి గానే తలంచి ప్రవర్తించాలని 'ఖిజర్' బాలకుని కథ ద్వారా ప్రకటించిన రకం అవిశ్వాసతుల్యులు.
1. పుట్టుక నుండీ ముస్లిమేతరులు 2. పుట్టాక ముస్లింలై అనంతరం ఇస్లాంను విడిచిన వారు 3. పుటక అన్యవిశ్వాసులై ఇస్లాం స్వీకరించి విడిచిపెట్టినవారు 4. అవిశ్వాసి కావచ్చునని అనుమానించబడ్డ వారు. అన్న నాలుగు రకాల వారిని ఖురాన్ అవిశ్వాసుల జాబితా క్రిందకి చేర్చింది. మన ఇంగితం (హేతుబుద్ది) కూడా, పై వాటిలో నాలుగో రకం వారిని మాత్రం ఇంకా తేలని వారి జాబితాలో పెట్టడం సరైంది మిగిలిన మూడు విభజనలూ సరైనవేనంటోంది. నా ఈ వ్యాసాన్ని పట్టి చూస్తున్న పాఠకులేకాక వివిధ మాధ్యమాల ద్వారాను గమనిస్తున్న యోచనా పరులందరికీ, ఇక్కడికిది సరిగనే ఉందో లేదో ఎవరికి వారుగా ఒక నిర్ణయానికి రండి.
ముఖ్యగమనిక :- ఆనాటి చర్చల సందర్భంలో పై అంశాలపై రహ్మన్‌గారు వెళ్ళడించిన అభిప్రాయాలివిగో
1. బుఖారీ హదీసుల్లో నుండి నేను ఎత్తిచూపిన ''ఇస్లాంలోకి వచ్చి తిరిగి విడిచిపెట్టిన వాని విషయంపై'' అది 100% వాస్తవం. ఒకడు ఇస్లాం స్వీకరించి, తిరిగి దానిని విడిస్తే చేయవలసింది వధించడమే మరో ప్రత్యామ్నాయం గాని, మినహాయింపు గానీ లేదన్నదినే నంగీకరిస్తున్నాను అనన్నారు రహ్మన్‌గారు. ఆనాటి సదస్సులోని ముస్లింలేగాక, ఇతరులూ అవును ఆ వాక్యాలలానే ఉన్నాయని అంగీకరించి నిర్ధారించారు.
2. 'ఖిజర్ - బాలుని చంపడం' విషయంపై రహ్మన్‌గారు స్పందిస్తూ, ఈ ఒక్క సంఘటన మాత్రం నాకు బలమైందిగానే కనిపిస్తోంది. దీనిపై నేను ఆలోచించాల్సి ఉంది. ఎందుకలా జరిగిందో సమాధానం చెప్పాల్సి ఉంది అనన్నారు. దీనిపై ఆలోచించాల్సిందీ, ఎందుకలా జరిగిందో చూడాల్సిందీ ఏముందండీ! (అవిశ్వాసి అన్న కారణంగానే కాక) అవిశ్వాసి అవుతాడేమోనన్న అనుమానం కారణంగానూ వధించడం సరైందేననే కదా ఆ ఘటన కు చెందిన మాటలు చెపుతోంది? అని ఆనాడే ఆయన్ని ప్రశ్నించాను. ఆ సందర్భంలోనూ సమావేశంలో పాల్గొన్న వారందరూ ఆ మాటలకు అదే అర్ధం. మరే అర్ధమూ రావడంలేదు అనన్నారు కూడా.
3. అల్లాను విడిచి, ఆవుదూడను పూజించారు అన్న ఒకే ఒక్క కారణంగా మూసా స్వజనాన్నే, అందులోని వారే అయ్యుండి ఆవు దూడ పూజలో పాల్గొనని వారి చేత, చంపించాడు అల్లా. నాలెక్క ప్రకారం ఈ ఒక్క వాక్యం. అల్లాను తిరస్కరించిన వారు, వారెవరకైనా కడకు తన జాతివారే అయినా తల్లైనా, తండ్రైనా కొడుకైనా, భార్య అయినా, అన్నైనా, తమ్ముడైనా, ఎంతటి దగ్గరి సంబంధీకులైనా సరే వధించవచ్చు. వధించాల్సిందేనని సందేహరహితంగా, సూటిగా, ప్రకటిస్తోంది.
గమనిక :- ఆనాడు వధింపబడ్డ వారు 1. జాతిరీత్యా అన్యులుకారు 2. ఎదురు తిరిగి కొట్లాటకు సిద్దమైనవారూ కారు. 3. యుద్ద సందర్భమూ కాదు. కేవలం అల్లాను విడిచి విగ్రహాన్ని ఎంచుకుని పూజించారు అన్న ఒకే ఒక్క కారణంగా, స్వజనులు, రక్త సంబంధీకులూ, అన్నది కూడా ప్రక్కన పెట్టి చంపబడ్డవారే.
ఈ సందర్భంలో నేనేదో రుద్దాను, పులిమాను అంటూ అనుచితంగా, నాపై పెద్ద అభాండం వేసిన ఫజులూర్ రహ్మన్‌గారిని సూటిగా ఒక్కటడుగుతున్నాను. అయ్యా రహ్మన్‌జీ! ఆనాటి సంభాషణ రికార్డై ఉంది. ఆ సంభాషణ సారాంశం వివేకపథం పత్రికలలోనూ రాత రూపంలో నమోదైఉంది. ఆనాటి సదస్సులో 20, 30 మంది వివిధ ధోరణులకు చెందిన పరిశీలకులూ ఉన్నారు నేనేమి రుద్దానో, పులిమానో తేల్చాల్సిన నైతిక బాధ్యత మీమీద ఉంది. ఎదుటివాడిని రుజువు చేయమనంటూ తెగ నిగ్గ తీసే మీకు, మీరు ఖురాను ప్రతినిధిగా రుజువు చేయాల్సినవిగానీ, సమావేశంలో మాట్లాడిన వాటికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యతగానీ, ఉండవన్నమాట!? కట్టు బాట్లు నియమాలు, నిగ్గతీతలన్నీ ఇతరుల కొరకేనన్నమాట!
ఇంతకూ ఆ మూడు సందర్భాలకు చెందిన మాటలకు నేనేమి లేని అర్ధాలు రుద్దానో రుజువు చేయండి మొదట. పిదప ఇంతకూ ఆ వాక్యాలకు మీరంగీకరించే అర్ధాలేమిటోనూ స్పష్టంగా ప్రకటించి, మీరు చెప్పే అర్ధాలు భాష తెలిసిన వారందరికీ తెలిసేవేననీ, మీరే మీ రుద్దడాలు, పులమడాలూ చేయనేలేదని కూడా విజ్ఞులముందు చెప్పి వారినివప్పించండి.
విషయాన్ని విడచి అనవసరపు కామెంట్లు చేస్తూ, అదేమన్న వారిని వ్యంగ్యంగా దెప్పిపొడుస్తూ, పరుషంగా, అవమానకరంగా మాట్లాడుతూ వస్తున్న మీకు, మీ పోకడ ఆడలేక మద్దెలవోడన్న చందాన ఉన్నట్లు తెలియడం లేదన్నమాట! మీ భాష బాగలేదు. విషయ దృష్టితో సంభాషణలు సాగించండని సూచన చేస్తే, నీ భాష చూసుకో అనంటారా? నేను ఎవరెవరితో ఏయే సందర్భాలలో కటుభాషనుపయోగించానో మీకభ్యంతరం లేకుంటే కూలంకషంగా పునర్విచారణ జరుపుకోడానికి నేను సిద్దం ఆ పని మీకు సమయం చిక్కినప్పుడు నిదానంగా చేద్దాం గానీ, నా సూచనలో అత్యంత కీలకమైంది, ఏమిటో గమనించారా?! ఈ సందర్భంలో, ఆయావ్యక్తుల విషయంలో ఆ భాష అనుచితం అనన్నానేగాని, కటుభాషణం అసలు అవసరమే లేదన్నానా నేను? ఉదాహరణకు, ఇప్పుడు మీతో ముడివడి ఉన్న ఎన్నో అంశాలలో కటు భాషణ తప్పని సరైన పరిస్థితులు ఏర్పడుతూ వస్తున్నై, అందుకు కారణం మీ వైఖరేనన్నది నిజం. ఎందుకనంటే, ఎదుటి వాడు ఏమంటే నేనామాటన్నాను అన్నది పట్టి చూడాలి అని మీరు అన్నారు. కనుక, మన ప్రస్తుత సందర్భంలో అనవసరపు మాటలు, ఎవరి నుండి మొదలయ్యాయో చూద్దామంటే చూద్దాం. నా లెక్క ప్రకారం.
నేను ఖురాను నుండి, అవిశ్వాసులను అవిశ్వాస కారణంగానే వధించవచ్చన్న - నిజానికి వధించవచ్చన మాట కాక వధించిన సంఘటనలనే ఎత్తిచూపి, రహ్మన్‌గారూ! మీరు ఇస్లాంను విడిచి బైటికి రండి, అని నా పక్షాన్ని ముగించాను. సభా దానిని అంగీకరించింది. ఇహ, అప్పుడు మీ ముందు రెండే రెండు దారులున్నాయి. వాస్తవిక దృష్టితో సత్యాన్నంగీకరించి, అన్నమాటకు కట్టుబడి ఇస్లాంను విడచి బైటికి రావడం లేదా, నేను చూపిన ఖురాను వాక్యాల అర్ధం అది కాదనీ, ఖురానులో, అవిశ్వాసులను అవిశ్వాస కారణంగా వధించమన్నమాట గానీ, వధించిన సంఘటన గానీ లేదని చెప్పి రుజువు చేయడం.
''ఉందనాలంటే ఒక్కటి దొరికినా చాలు. లేదనాలంటే ఒక్కటీ వదలకుండా అంతా శోధించి చూడాల్సిందే''. అన్నదో విచారణ నియమం. అది మీకూ తెలుసు. కనుక నా పక్షాన్ని విన్నాక దానిని అంగీకరించి నావెంట రావడమో, నాది సరికాదని చెప్పి, ఎలా సరికాదోనూ వివరించి, మీదేమిటో చెప్పి అదెలా సరైందో నిరూపించడం చేయాలి మీరు. కానీ మీరా విధానాన్ని పాతిపెట్టి, రకరకాల ప్రస్తావనలు చేస్తూ వచ్చారు. దానిపై సభలో పాల్గొన్న వారిలో కొందరు అదేమిటని మిమ్మల్ని ప్రశ్నించారు. మరి కొందరు ఇస్లాంను విడవమని చెప్పారు. ఒకరిద్దరు రహ్మన్‌గారు మాట తప్పారు అనో, జారుకున్నారు అనో అన్నారు. ఇక మీరు చెలరేగిపోయారు. అనవసరపు దూకుడును ప్రదర్శించారు. అదీ విషయాన్ని విడచి వ్యక్తుల స్థాయిని గురించి దుందుడుకు మాటలనేశారు. ఈ సందర్భంలో చెప్పాను భాషను సరిచేసుకోండని.
ఎంత రచ్చ చేశారు? అసలు విషయాన్ని విడచి ఎంత సమయాన్ని రకరకాల అనవసరపు అంశాల మీద ఖర్చు చేశారు. చేయించారు? ఖురానులో అవిశ్వాసులను అవిశ్వాసం కారణంగా వధించవచ్చన్న అర్ధాన్నిచే ఒక్కవాక్యమైనా ఉందా లేదా? అన్నదే కదా మనం పరిశీలించి తేల్చుకోవల్సింది? దీనికింత రగడ, వ్యంగ్య భాషణమూ అవసరమా? ఇదంతా అడ్డగోలు పోకడ అని చూసే వారికి, చదువరికీ తేలిగ్గానే అర్ధమవుతోంది కదా! ఇంత జరిగాకనూ, ఎందరో విచారణ పూర్తయింది ఇస్లాంను విడచి బైటకి రండంటుంటేనూ, ఆ మాటలు వినీ, విననట్లుండడంతో మొదలైంది, పాఠకుల నుండి మరో రకమైన విమర్శ. ఆయనెందుకొస్తాడండీ! మీరా వాక్యాలు ఎత్తి చూపిన నిమిషంలోనే ఆయన గుండె బేజారైంది. ఎలా పలాయనం చేయాలోనన్నదే ఆయన ఆలోచన, ఎత్తుగడంతా లాటి మాటలన్నారు వారు. ఆశ్చర్యమూ, ఒకింత హాస్యాస్పదమూ అనిపించేలా వారి ఆ మాటల్నే మీరు తప్పించుకోడానికి, విషయాన్ని ప్రక్కదారి పట్టించడానికి సాధనంగా వాడుకుందామనుకున్నారు. విషయం అందరకూ సుస్పష్టంగా బోధపడుతూనే ఉంది. ఎటొచ్చీ మాకు, మిమ్మల్ని మీ బాధ్యతను (విధిని) నెరవేర్చేలా చేయడమే కుదరడంలేదు. అంతలా మొండికేసేశారు మీరు.
ఇప్పటికైనా మీలో ఏ మాత్రం నిజాయితీ ఉన్నా, నిజాన్నంగీకరించే స్వభావం ఉన్నా, మీరన్నమాటకు కట్టుబడి, ఉన్న వాస్తవాన్నంగీకరించి ఇస్లాంను విడిచిపెట్టేయాలి.
లేదా! ఈ విచారణ వేదిక నిర్వాహకుణ్ణైన నన్నుగానీ, సభను గానీ; ఒక్క అవకాశం ఇవ్వండి నా పక్షాన్ని వినిపించుకోడానికి అని అభ్యర్థించాలి. మేము సరేనంటే ఆ పని చేయాలి. చేయాల్సిన ఈ రెంటిలో ఏదీ చేయక, రకరకాల ప్రక్కదారులంటా, అడ్డదారులంటా పరుగు పెడుతూనూ, అదీ కుదరనప్పుడు కొంత తడవు మవునంగా ఉంటూనూ కాలం గడిపేస్తూ వస్తున్నారు.
ఇంత జరిగినా, జరుగుతూ వస్తున్నా, నావరకు నేను మీలో ఎలాగైనా పునరాలోచన కలిగించాలన్న ఉద్దేశంతోనే, ఖురానులో, బుద్దున్న వారు విడిచిపెట్టవలసినవీ, భౌతిక విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలరీత్యా తప్పులని రుజువు చేయగలిగినవీ ఎన్నో ఉన్నాయని చెప్పి, ఒకటి రెండంశాలను మీ దృష్టికీ తెచ్చాను. మీలో 'సత్యతిరస్కారం చేయకూడదెవరూ' అన్నంతవరకైనా ఇంగితం పని చేసి ఉన్నా, రండి సురేంద్రగారూ! ఖురానును ఈ కోణంలో పరీక్షించి చూద్దాం. మీరన్నట్లే ఖురానులో గాని అలాటి తప్పు జ్ఞానం అంటే పరీక్షలో కొట్టుకుపోయే లాటి అభిప్రాయ ప్రకటనలు ఏవైనా ఉంటే - ఒక్కటున్నా మొట్టమొదట అది దైవ గ్రంథం కాదని అంగీకరించి, మిగిలిన గ్రంథాన్నంతా మామూలు గ్రంథాలను చూసినట్లు పరిశీలనా దృష్టితో మళ్ళీ కూలంషంగా అధ్యయనం చేస్తాను. తప్పులను నెత్తినెట్టుకోవాలని గానీ, మందినెత్తిన పెట్టాలనిగానీ నాకేమీ లేదు. 100% పూర్తిగాకాకున్నా, కొంత వరకైనా నేనూ సత్యాలను గమనించి స్వీకరించాలన్న, మంచి చెడులను విచారించుకుని చెడును విడిచి, మంచిని అనుసరించాలన్న ఇంగితం ఉన్నవాణ్ణే, రండి మీరన్నలాటి దోషాలు ఖురానులో ఏమైనా ఉన్నాయేమో పరీక్షించి చూద్దాం అని ఉండేవారు. తప్పులున్నాయేమో చూడ్డానికీ అట్టివి ఉన్నట్లు తేలితే వాటిని విడిచి పెట్టడానికి, వెనుకాడడం ఉందే, ఒక మనిషిగా దానంత బలహీనత మరోటుండదు. నాలుగైదు ముఖ్యమైన ప్రకటనలు చేస్తాను. అవి వాస్తవాలను చూపెడుతున్నాయో లేదో మీరూ! పాఠకులూ గమనించండి.
1. మీరూ అంతో ఇంతో ఇంగిత జ్ఞానం కలిగి ఉన్నవారే అయితే అది పని చేయకుండా మరేవో ప్రాధాన్యతలు దానిని అణచిపెడుతున్నాయి. నిజాయితీతో వెనుదిరిగి చూసుకోగలిగితే మా అందరికంటే మీకే అవేమిటో ఇట్టే తెలిసిపోతాయి.
2. మండలి ఆలోచనా విధానాన్ని ఎంతో కొంత తెలిసున్న మీరు, ఎన్నో తెలియని విషయాలను అవి తెలియనివేనని తెలుస్తూనే ఉన్నా, తెలుసన్నట్లు నలుగురితో చెప్పి చూపడాన్నేమనాలి? ముక్కు సూటిగా చెప్పవలసి వస్తే 1. అది ఆత్మవంచనే. మిమ్ము మీరే వంచించుకుంటున్నారు. 2. పరవంచన కూడా. లోకాన్నీ వంచింప జూస్తున్నారు.
3. పరిశీలించాల్సిన రీతిలో, పరిశీలించగల వాటివరకైనా విధి విధానాలు తెలిసిన వారితో కలసి పరిశీలించడానికి సిద్దపడని మీ మరియు మీలాటి వైఖరి కలవాళ్ళంతా పెడపోకడ పోతున్న వాళ్ళూ, నీతిమార్గాన్నుండి జారిపోయిన లేదా వైదొలగిన వాళ్ళే.
మనం పరిశీలనాంశంగా ఎంచుకున్నది, మీ నోటి నుండే వచ్చిందీ ఇదిగో ఇదే.
''తనని ఒప్పుకోనందుకే తీసేయ్ అనే మాటగానీ, అలాటి అర్ధాన్నిచ్చేమాటగానీ, ఖురానులో ఒక్కటున్నా, ఇస్లాంను విడిచి వచ్చేస్తాను. ఇదినా పబ్లిక్ స్టేట్‌మెంటు''దీనిపై నేను ఖురాను నుండి 1. మూసా - ఆవు దూడ, 2. ఖిజర్ - మూసా - బాలుడు 3. హదీసులనుండి ఇస్లాంలోకి వచ్చి మళ్ళా దానిని విడిచిన యూదుని వధించే సంఘటనను ఎత్తి చూపించాను. ఆ సందర్భంలోనూ మరికొన్ని సమావేశాలలో ఈ సందర్భం వచ్చినప్పుడునూ అది 100% నిజం. ఒక ముస్లింగాని, ఇస్లాంను విడిచి అల్లా పై విశ్వాసాన్ని వదిలేస్తే అతణ్ణి వధించమనే ఇస్లాం చెపుతోంది అని మీరే స్పష్టంగా అన్నారు. ఆ మీ మాటలు రికార్డై ఉన్నాయి కూడా. ఒక వేళ ఆ మాటలు రికార్డు చేయకున్నా, అలాటి ఆదేశం ఉన్నట్లుగానీ, అలానే అమలయినట్లుగానీ, ఎప్పుడు ఎవరు (ఇప్పుడు మనం) పరిశీలించినా అవి దొరుకుతాయి ఎందుకంటే రాత రూపంలో ఉన్న వాటిని మీరు గానీ, నేనుగానీ, మరొకరుగానీ కప్పెట్టలేం కదా!?!.
మరొక్కమాట చెప్పి ఇప్పటికి ఆగుతాను
మనం సాగించిన ఆ సమావేశాలలో క్రమం తప్పకుండా పాల్గొన్న వాళ్ళలో నాకు గుర్తున్నంతలో ఈ జాబితాలోని వాళ్ళంతా, నేను చూపాల్సింది చూపాను, అది సరిగనే ఉంది. ఇక రహ్మన్‌గారేమి చేస్తారో చూడాల్సి ఉంది అన్నవాళ్ళే. కొందరైతే రహ్మన్‌గారూ! ఇస్లాంను విడచి బైటికి రండి! అని మీకూ, మరి కొందరైతే అతనెందుకొస్తాడండీ మీ పిచ్చిగాకుంటే అని నాకూ చెప్పారు. ఇదంతా మీకూ తెలుసు.1. మోషే 2. ప్రసాద్ 3. కోటి 4. రాజేంద్రప్రసాద్ 5. సిద్దాంతి 6. ప్రొ. రాధాకృష్ణ 7. రా.కృ. రెడ్డి 8. మురళీ 9. జయరాం 10. భీష్మాచార్య 11. మణికుమార్ 12. శ్రీనివాస్ (రాజానగరం) 13. ఖుద్దూస్.
14. క్రైస్తవం తరుఫున పాల్గొన్న బృందంలో కొందరు (శ్యామ్యూల్, పీటర్, జగదీష్, మనష్షే. విజయవాడ శామ్యూల్).15. మీ వైపు నుండి వచ్చిన వారిలోనూ ఒకరిద్దరు ఖరాఖండిగా చెప్పకున్నా, అలాటి అర్ధాలిచ్చే మాటలు ఖురాను హదీసుల్లో ఉన్న మాట నిజమేనన్నారు. నే చూపినవి అలాంటి అర్ధాన్నిచ్చేవిగానే ఉన్నాయి. మరింత పరిశీలించాల్సి ఉంది అనీ అన్నారు. 16. కన్నెబోయిన అంజయ్యగారు 17. క్రాంతికార్ 18. ప్రభు 19. డా. భాస్కరరాజు 20. వసంతరావు 21. నాగిరెడ్డి వెంకటేశ్వరరావు 22. ఐలయ్య 23. శ్రీకాంతరెడ్డి (కర్నూలు) 24. అన్ని సమావేశాలకూ హాజరుకాని వారూ మరి కొందరున్నారు. 1. జగన్ 2. లింగన్నగారు 3. వీళ్ళు వాళ్ళెందుకు మారతారండీ మీ పిచ్చిగానీ అన్నవాళ్ళే.
రహ్మన్‌గారూ! మరింత జాగ్రత్తగా గుర్తు చేసుకుంటే, మరి కొందరున్నారన్నదీ బైటపడుతుంది. ఆ సమావేశాలలో పాల్గొన్నవారి సంఖ్య 30, 35కు మించి ఉండదు. క్రైస్తవంలోని వారిపేర్లూ విడివిడిగా రాస్తే తమ అభిప్రాయాల్ని ప్రకటించిన వారి సంఖ్య 28 వరకు చేరుతోంది. ఇకపోతే ఏ అభిప్రాయాల్ని ప్రకటించనివారు; దేనినీ అంతగా పట్టించుకొని ఒకరిద్దరూ; మీ పక్షాన వచ్చిన ముస్లింలూ మాత్రమే. మీ వైపు నుండి 1. మీరు, 2. ముస్తాక్‌గారు, 3. హుస్సేన్ గారు, 4. పేర్లు గుర్తులేవుగాని, ముస్తాక్ గారి వెంటే కారులో వచ్చిన మరో ముగ్గురు, నలుగురు బహుశా అఖిల్ ఆలీ, నూరుద్దీన్, గౌతంలూ ఉన్నారు. ఇంత జరుగుతున్నా ఆ బృందంలోని వారు, నా అభిప్రాయం ఇదిగో ఇదే అని ఎందుకు ప్రకటించలేదో మీకూ తెలుసు, నాకూ తెలుసు.
1. నిజంగా నేను చూపిన వాక్యాలకు నేను చెప్పిన అర్ధం రాదని చెప్పడానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా; మొదట మీరే ఆ విషయాన్ని కుండబద్దలు కొట్టినంతగట్టిగా చెప్పి, అంతటితో ఊరుకోకుండా నన్ను తెలిసీ తెలియని మాటలు మాట్లాడేవాణ్ణిగానో, మనస్సులో ఇస్లాం వ్యతిరేకతనూ, హిందూ అభిమానాన్ని పెట్టుకుని ఉన్న అబద్దాల కోరుగాను నిరూపించేందుకు గట్టి కృషి చేసి ఉండేవారు.
2. మీ మాటలా ఉంచి; నేనూ సత్యాన్వేషినే అని మొదట నుండీ అంటున్న ముస్తాక్ గారీవిషయంలో ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నారెందుకని? నిజంగా ఆ మాటలకు నేను చెప్పిన అర్ధం రాదని చెప్పడానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా, ఆయన మీ అందరికంటే ముందుగా, ఉత్సాహాన్ని చూపి, నా పక్షాన్ని ఎదుర్కొనేందుకు సిద్దపడి ఉండేవారు. వాస్తవాన్ని కాదనేవీలులేదు కనుకనే, దిక్కుతోచకనే మరీ అడ్డగోలుగా మాట్లాడలేకనే ఆయన ఏమీ మాట్లాడకుండా 'కిమ్మినాస్తి'గా గమ్మునున్నారు. మరోలా చెప్పే సందుండుంటే వాళ్ళందరూ ఎంత రాద్దాంతం చేయాలో అంతరాద్దాంతమూ చేసి ఉండే వాళ్ళు.
నా కందిన వార్త ఎంత వరకు నిజమో నాకు తెలీదుగాని, మీ పక్షంలో దీనిని గమనిస్తున్న వారెందరో, నీ వలాటి ప్రకటనెందుకు చేశావు? అని మిమ్మల్ని ఎద్దెవా చేసినట్లూ, ఏదో అలా వచ్చేసింది, ఏమి చేద్దాం? అని మీరన్నట్లూ సమాచారం అందింది నాకు. కనుక ఈ విషయంలో వాస్తవమేమిటన్నది మీకూ తెలుసు, భాషతెలిసి ఖురానును అంతో ఇంతో చదివిన ఇస్లాం పక్షం వారికీ తెలుసు. మీ అందరిదృష్టీ; దీనికో ముగింపుకు రాకుండా చూసి, ఎలా బైటపడాలన్నదే నన్నది దీనిని పరిశీలిస్తున్న వారందరికీ తెలుస్తున్న నగ్న సత్యమే.
ఇప్పటికి ముగింపు
1. ఇస్లాంను విడిచి పెట్టి బైటకు రండి. ఇది నీతికీ, నిజాయితీకి సంబంధించిన సరైన ముగింపు. లేదా!2. మరోసారి ఖురాన్ పరిశీలనకు మీరే బాధ్యత వహించి సిద్దంకండి.
నా ప్రతిపాదన :- వ్యక్తి - సమాజము - ప్రకృతి, అన్నవాటి గురించి ఖురాను ఏమి చెప్పిందో ముందు వెలికి తీద్దాం. ఆపైన వాటి సత్యాసత్యాలేమిలో ప్రయోగరీత్యా పరిశీలిద్దాం.
3. ఈ లోక సంబంధం కాని అంశాలన్నీ బండ విశ్వాసాలే. అట్టివన్నీ మీకూ తెలీని భావాలే.
- సురేంద్ర
గమనిక : మత మార్పిడులు మారణ హోమానికి దారితీస్తాయనడానికి ఇస్లాం ఆదేశాలే గట్టి రుజువులు.
1. పుట్టుకతో ముస్లింగా ఉండి ఇస్లాం నుండి బైటికి వెళ్ళినవాణ్ణి ఖురాను, (హదీసులు) చంపవచ్చు అంటుంది. చంపమంది చంపడమూ జరిగింది.
2. చరిత్రలో జరిగిన మత యుద్ధాలన్నీ, ఖురాన్‌లో యుద్ధాలన్నీ మత యుద్దాలే. అంటే ఆ మతాన్ని అంగీకరించిన - అంగీకరించని వారి మధ్య అకారణంగా జరిగిన యుద్ధాలే.
No comments:
Post a Comment